చెన్నై : అమ్మకు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా పట్టలేరు. 'అమ్మ' అంటే ఈపాటికే ఎవరో అర్థమై ఉంటుంది. అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకు వెళ్లటాన్ని జీర్ణించుకోలేని ఆమె అభిమానులు 193మంది ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. దాంతో అభిమానులను ఆదుకునేందుకు జయ తమిళనాట సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి పార్టీ తరపున మూడు లక్షల చొప్పున సాయం ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు సోమవారం నుంచి చెక్కులను పంపిణీ చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అమ్మ జైలుకు వెళ్లడాన్ని తట్టుకోలేక 193 మంది ప్రాణాలు కోల్పోయారని వారిలో 139 మంది గుండెపోటుకు గురికాగా.., మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురికి 50 వేల చొప్పున జయలలిత సాయం ప్రకటించారు.
అమ్మ అభిమానులకు 3లక్షల సాయం
Published Mon, Oct 20 2014 2:17 PM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM
Advertisement