compansation
-
అతని కుటుంబానికి రూ. 2.45 కోట్ల పరిహారం.. ఇన్సూరెన్స్ కంపెనీకి షాక్!
ఓ కార్ యాక్సిడెంట్లో మృతుడి కుటుంబానికి పరిహారం విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీకి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ. 2.45 కోట్ల పరిహారం చెల్లించాలని కార్ ఓనర్, డ్రైవర్‌తో సహా బీమా కంపెనీని ఆదేశించింది. పది సంవత్సరాల క్రితం కార్ యాక్సిడెంట్లో మరణించిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ఉద్యోగి కుటుంబానికి వడ్డీతో సహా రూ. 2.45 కోట్లు చెల్లించాలని కారు యజమాని, డ్రైవర్, బీమా సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఇటీవల ఆదేశించిన అత్యధిక పరిహారాల్లో ఇది ఒకటి. బార్క్‌లో పనిచేసే ప్రియనాథ్ పాఠక్ అనే వ్యక్తి పదేళ్ల క్రితం ముంబై అనుశక్తి నగర్ వద్ద బైక్ వెళ్తుండగా కార్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను మరణించాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ కేసులో కారు యజమాని నోబుల్ జాకబ్ నిందితుడు కాగా 2014 డిసెంబరు 19న జాకబ్, న్యూ ఇండియా అస్స్యూరెన్స్ కంపెనీకి వ్యతిరేకంగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. మృతుడు ప్రియనాథ్ పాఠక్ నెల జీతం రూ.1.26 లక్షలు కావడంతో కోర్టు భారీ పరిహారాన్ని నిర్ణయించింది. -
ప్యాసింజర్ దిగుతుండగా కదిలిన బస్.. ‘ఆర్టీసీ’కి రూ.1.30లక్షల ఫైన్
బెంగళూరు: ప్రయాణికురాలికి గాయాలయ్యేందుకు బస్సు కారణమైందంటూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ)కి రూ.1.30 లక్షల జరిమానా విధించింది కర్ణాటక హైకోర్టు. అధికారులు అశ్రద్ధతో డొక్కు బస్సులను తిప్పుతున్నారనే విషయాన్ని గ్రహించి ఈ మేరకు ఆర్టీసీకి షాక్ ఇచ్చింది కోర్టు. ప్రయాణికులు దిగుతుండగానే బస్‌ను ముందుకు కదిలించి గాయాలయ్యేందుకు కారణమైనట్లు తెల్చింది. 2021, ఆగస్టులో బస్ వల్ల మహిళకు గాయాలయ్యాయి. మైసూరుకు చెందిన 30 ఏళ్ల చంద్రప్రభ అనే ప్రభుత్వ పాఠశాల టీచర్ తన విధులు ముగించుకుని కేఎస్ఆర్టీసీలో ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలోనే ఇంజిన్‌లో మంటలు అంటుకున్నాయి. ప్రయాణికులు కిందకు దిగుతున్నప్పటికీ డ్రైవర్ బస్‌ను ముందుకుపోనిచ్చాడు. దీంతో చంద్రప్రభ కింద పడిపోయి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. 12 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ఆర్టీసీపై కేసు వేసింది ఉపాధ్యాయురాలు. కానీ, ఆమె ఫిర్యాదును 2018లో తిరస్కరించింది మోటారు వాహనాల ప్రమాదాల ట్రైబ్యునల్. ఆమె దిగెప్పుడు బస్సు ఆగి ఉందని ఆర్టీసీ అధికారులు సైతం వాధించారు. ట్రైబ్యునల్ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు టీచర్. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఆమెకు పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు వెలువరించింది. ‘బాధితురాలికి రూ.1,30,000 పరిహారం చెల్లించాల్సిందే. దాంతో పాటు ఏడాదికి 6 శాతం చొప్పున వడ్డీ ఇవ్వాలి. ’ అని స్పష్టం చేసింది హైకోర్టు. ఇదీ చదవండి: విద్యార్థిని బాల్కనీలోంచి తోసేసిన టీచర్.. ప్రశ్నించిన తల్లిపైనా దాడి -
ఉద్యోగం కోల్పోయి.. కరోనాతో భర్త మృతి.. కంపెనీపై కేసు వేసిన భార్య
చెన్నై: కరోనా మహమ్మారి వ్యాప్తితో జనాలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరీ ముఖ్యంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. చాలా కంపెనీలు ఉద్యోగులకు నోటీస్ పీరియడ్ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా జాబ్ నుంచి తొలగించారు. ఈ క్రమంలో చెన్నైలో ఆసక్తికర కేసు ఒకటి వెలుగు చూసింది. ఉద్యోగం నుంచి తొలగించిన అనంతరం ఓ వ్యక్తి కోవిడ్ బారిన పడి మరణించాడు. అయితే అతడికి నోటీస్ పీరియడ్ ఇచ్చే అవకాశం ఇవ్వనందున ఆ ఉద్యోగికి లభించే బీమా ప్రయోజనాలు అందకుండా పోయానని ఆరోపిస్తూ.. ఇందుకు గాను సదరు కంపెనీ తమకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తూ కోర్టులో కేసు వేసింది మృతుడి భార్య. ఆ వివరాలు.. ఎంబీఏ చేసిన రమేష్ సుబ్రమణియన్(48) చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తుండేవాడు. కరోనా కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. నోటీస్ పీరియడ్ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా రోజుల వ్యవధిలోనే అతడిని విధుల నుంచి రిలీవ్ చేశారు. ఉద్యోగం నుంచి తొలగించిన రెండు నెలల తర్వాత అనగా జూన్, 2021లో అతడు కరోనా బారిన పడి మరణించాడు. (చదవండి: కరోనా దెబ్బ.. ఆయుషు తగ్గింది!) సుబ్రమణియన్‌కు నోటీస్ పీరియడ్ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా విధుల నుంచి తొలగించడంతో అతడికి వచ్చే బీమా ప్రయోజనాలు రాకుండా పోయానని.. ఇందుకు కంపెనీనే బాధ్యత తీసుకోవాలని.. తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది అతడి భార్య. (చదవండి: షాకింగ్ సర్వే,దక్షిణాది కుటుంబాలలో అప్పులే అధికం) ఈ సందర్భంగా సుబ్రమణియన్ భార్య మాట్లాడుతూ.. ‘‘నా భర్త సంవత్సరానికి సుమారు 30 లక్షల రూపాయల జీతం పొందేవాడు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఉద్యోగం నుంచి తొలగించిన రెండు నెలలోనే వైరస్ బారిన పడటంతో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ఆయన చికిత్స కోసం 18 లక్షల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. జూన్ 11 న నా భర్త మరణించాడు. ఒకవేళ నోటీసు పీరియడ్ ఇవ్వడానికి అనుమతిస్తే.. అతనికి బీమా ప్రయోజనాలు లభించేవి. దాంతోపాటు మా కుటుంబానికి 1.5 కోట్ల రూపాయలకు పైగా వచ్చేవి’’ అని తెలిపారు. ఈ క్రమంలో న్యాయమైన పరిహారం కోసం ఆమె కంపెనీకి లీగల్ నోటీసు పంపింది. తన లాంటి పరిస్థితి మరోకరికి రాకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ పోరాటం చేస్తున్నాని వెల్లడించింది. సదరు కంపెనీ సుబ్రమణియన్ కుటుంబానికి కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించడానికి ముందుకు వచ్చింది. కానీ వారు అంగీకరించలేదు. (చదవండి: ‘రెస్టారెంట్ వల్లే అంత తాగాను’.. 40 కోట్ల నష్టపరిహారం రాబట్టాడు) అయితే సుబ్రమణియన్‌కు వేరే ఉద్యోగం రావడంతోనే రాజీనామా చేశాడని సదరు కంపెనీ తెలిపింది. అయితే సుబ్రమణియన్ కుటుంబం కంపెనీ వాదనను ఖండించింది. వారు ఈ సమస్యను కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ దృష్టికి కూడా తీసుకువెళ్లారు."నియమం ప్రకారం నిర్ణీత సమయంలో సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని" సూచిస్తూ కార్మిక శాఖ సదరు కంపెనీకి మెయిల్ చేసింది. చదవండి: కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా -
‘మేము మోసపోతే.. ప్రభుత్వం ఆదుకోవడం చరిత్ర’
సాక్షి, తాడేపల్లి: అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రెండో విడత డబ్బులు విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా నుంచి చంద్రశేఖర్ రావు అనే వాచ్మెకానిక్ మాట్లాడుతూ.. ‘‘ఐదు సంవత్సరాల పాటు అగ్రిగోల్డ్ కంపెనీలో రోజుకు 40 రూపాయల చొప్పున 18,500 కట్టాను. 2016లో సంస్థను ఎత్తేశారని తెలిసి ఎంతో బాధపడ్డాను. ఎక్కడ తిరిగినా మాకు న్యాయం జరగలేదు. మీరు పాదయాత్రలో మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. దానిలో భాగంగానే మొదటివిడతలో పదివేల రూపాయలలోపు బాధితులకు డబ్బులు ఇచ్చారు. రెండో విడతలో భాగంగా 20వేల రూపాయలోపు బాధితులమైన మాకు ఈ రోజు డబ్బులు ఇచ్చారు’’ అని తెలిపారు. ‘‘దీని గురించి వలంటీర్లు మా ఇంటికి వచ్చి.. వివరాలు తెలుసుకుని.. దగ్గరుండి అప్లికేషన్ నింపారు. ఆన్లైన్లో అప్లై చేశారు. ఈ నెల 24 న డబ్బులు వస్తాయని చెప్పారు. మమ్మల్ని ఆదుకున్నందుకు చాలా సంతోషం. ప్రైవేట్ కంపెనీలో డబ్బులు పెట్టి.. మోసపోతే.. ప్రభుత్వం ఆదుకోవడం నిజంగా చరిత్రే. పోయాయనుకున్న డబ్బులు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మీలాంటి సీఎం ఉన్నందుకు గర్వపడుతున్నాను’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. గుంటూరు నుంచి ఉషా రాణి మాట్లాడుతూ.. ‘‘నా భర్త డెలివరీ బాయ్‌గా పని చేసేవారు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు పొదుపు చేయాలని భావించి.. అగ్రిగోల్డ్‌లో నెలనెల పొదుపు చేశాం. కానీ 2016లో కంపెనీని ఎత్తేశారని తెలిసి మా కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యిందని బాధపడ్డాం. మా డబ్బులు తిరిగి ఇప్పించాల్సిందిగా గత ప్రభుత్వాలను అభ్యర్థించాం. మీకోసం కార్యక్రమంలో అప్లికేషన్ పెట్టినా లాభం లేదు. ఏడాదిన్నర పాటు నేను ఒక్కదానే ఆఫీసుల చుట్టూ తిరిగాను. ఆ బాధలు వర్ణించలేను. పాదయాత్రలో మీరు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. దాని ప్రకారమే మొదటి విడతలో పది వేల రూపాలయలోపు బాధితులకు డబ్బులు ఇచ్చారు. దాంతో నాకు నమ్మకం కలిగింది’’ అన్నారు. ‘‘ఈరోజు రెండో విడతలో భాగంగా 20 వేల రూపాలయ లోపు లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేశారు. నేను 15 వేల రూపాయలు కట్టాను. నా కష్టార్జితం తిరిగి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇద్దరుపిల్లలు. వారికి అమ్మ ఒడి, విద్యా కానుకు ఇలా అన్ని పథకాలు అందుతున్నాయి. నాడు-నేడులో భాగంగా స్కూళ్ల రూపురేఖలు మార్చారు. ఇప్పుడవి గవర్నమెంట్ బడుల్లా లేవు.. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో ఉన్నాయి. వలంటీర్లు ఇంటి దగ్గరకే వచ్చి అన్ని ఇస్తుండటంతో ఎంతో మేలు జరగుతుంది. మా ఆయనకు తెలియకుండా పెట్టిన డబ్బులు పొగొట్టుకుని.. ఎంత బాధపడ్డానే నాకే తెలుసు. ఓ అన్నలా మీరు నాకు తోడుండి.. నా డబ్బులు నాకు తిరిగి ఇస్తున్నారు. మీరు తండ్రిని మించిన తనయుడిగా నిలిచారు’’ అంటూ కృతజ్ఞతలు తెలిపింది. కర్నూలు నుంచి చిరువ్యాపారం చేసుకునే విశాలాక్షి మాట్లాడుతూ.. ‘‘వాళ్లు, వీళ్లు చెప్పిన మాటలు విని అగ్రిగోల్డ్ సంస్థలో నెలకు ఐదు వందల రూపాయల చొప్పున 11,500 రూపాయలు దాచుకున్నాను. 2016లో అగ్రిగోల్డ్ సంస్థ ఎత్తేశారని తెలిసి చాలా బాధపడ్డాను. డబ్బులు తిరిగి వస్తాయా రావా అని ఆందోళన పడ్డాను. చంద్రబాబు ప్రభుత్వంలో దీని గురించి ఎన్ని అభ్యర్థనలు చేసినా ఫలితం లేదు. ఇక డబ్బులు రావని ఆశలు వదిలేసుకున్నాను. ఆ సమయంలో మీరు పాదయాత్రలో మా సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అప్పుడు అగ్రిగోల్డ్ సమస్య గురించి మీకు విన్నవించుకున్నాం’’ అన్నారు. ‘‘అధికారంలోకి వచ్చాకా మీరు వలంటీర్లను పంపి మా వివరాలను తెలుసుకుని.. మా డబ్బులు మాకు తిరగి ఇప్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీన్ని ఈ రాఖీ పండుగకు మీరు నాకు ఇచ్చిన కానుకగా భావిస్తున్నాను. డబ్బులు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మన ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి పథకం నాకు అందుతుంది. ఏ ప్రభుత్వం ప్రజల సమస్యల గురించి ఇంతలా ఆలోచించలేదు. మీరే ఎప్పటికి సీఎంగా ఉండాలి అని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచారు: హోంమంత్రి సుచరిత
-
పేద ప్రజలు నష్టపోకుండా బాధ్యతగా తీసుకున్నాం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. దీనిలో భాగంగా 10లక్షల 45వేల కుటుంబాలకు రూ.905.57 కోట్లు చెల్లించినట్లు సీఎం జగన్ తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారుల బ్యాంకు ఖాతాల్లో రెండో విడత పరిహారాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రెండో దశ కింద రూ.20వేల లోపు 7 లక్షల మంది డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ చేశామని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, పేద ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసమే అగ్రిగోల్డ్ స్కామ్ జరిగిందని, గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కైందని సీఎం జగన్ అన్నారు. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవని, 2019 నవంబర్లోనే 3.40 లక్షల మందికి రూ.238.73 కోట్లు చెల్లించామని సీఎం జగన్ తెలిపారు. రూ.20వేల లోపు డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్లు, 10లక్షల 45వేల కుటుంబాలకు రూ.905.57 కోట్లు జమ చేశామని సీఎం తెలిపారు. అగ్రిగోల్డ్ వ్యవహారం కొలిక్కి రాగానే మిగిలిన డిపాజిటర్లకు చెల్లింపులు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం కష్టజీవుల సొమ్మును కాజేసింది అగ్రిగోల్డ్ సంస్థను నమ్మి చిన్న వ్యాపారులు నష్టపోయారని, ఆ సంస్థలో ఉన్న డబ్బంతా కష్టజీవులదేనని సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వం కష్టజీవుల సొమ్మును కాజేసిందని తెలిపారు. అగ్రిగోల్డ్ స్కామ్‌కు కర్త, కర్మ, క్రియ గత ప్రభుత్వమేనని సీఎం తెలిపారు. గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసమే అగ్రిగోల్డ్ స్కామ్మని, బాధితులకు ఒక్క రూపాయి చెల్లించలేదని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు మోసం చేస్తూ వచ్చిందని సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, గతంలో 300 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచారని తెలిపారు. రూ.20వేల లోపు డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ చేస్తున్నారని, ఇప్పటికే రూ.10వేలలోపు డిపాజిటర్లకు రూ.238.73 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో బాధితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి దశలో రూ.10 వేల లోపు డిపాజిట్‌దారులైన 3.40 లక్షల మందికి 2019లోనే రూ.238.73 కోట్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొదటి, రెండో దశలో కలిపి మొత్తం 10.40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం రూ.905.57 కోట్లు పంపిణీ చేసినట్లు అయింది. చదవండి: Andhra Pradesh: ఇళ్లకు సుముహూర్తం -
Polavaram: త్యాగధనులకు బహుమానం
సాక్షి, అమరావతి: విశాల ప్రయోజనాల కోసం ఉన్న ఊళ్లు, ఇళ్లు, జీవనాధారమైన భూములను కోల్పోతున్న పోలవరం నిర్వాసితుల త్యాగాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బహుమానం ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రూ.పది లక్షల చొప్పున పరిహారం అందించాలని జల వనరుల శాఖను ఆదేశించారు. దాంతో తొలి దశలో పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ (రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్) కింద కేంద్రం ఇస్తున్న మొత్తానికి అదనపు మొత్తాన్ని జమ చేసి.. ఒక్కో కుటుంబానికి రూ.పది లక్షల వంతున పరిహారం అందించేలా జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.550 కోట్ల మేర అదనపు భారం పడుతుంది. నిర్వాసిత కుటుంబాలు 1.06 లక్షలు పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట వద్ద 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏడు మండలాల్లో 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ గ్రామాల్లోని 1.06 లక్షల కుటుంబాలు నిర్వాసితులుగా మారతాయి. ముంపునకు గురయ్యే భూమిని భూసేకరణ చట్టం–2013 ప్రకారం సేకరించి పరిహారం అందించడంతోపాటు నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ కింద పరిహారం అందించాలి. పునరావాస కాలనీల్లో ఇంటిని నిర్మించి ఇవ్వాలి. పోలవరం నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ కింద ఎస్సీ, ఎస్టీ నిర్వాసిత కుటుంబాలకు రూ.6.86 లక్షలు, ఇతర కుటుంబాలకు రూ.6.36 లక్షల చొప్పున కేంద్రం పరిహారం అందిస్తోంది. రూ.పది లక్షల చొప్పున పరిహారం అందించాలని ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని పోలవరం నిర్వాసితులు కోరారు. ఇందుకు ఆయన అంగీకరించారు. ఆ హామీని అమలు చేస్తూ ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం ఇస్తున్న మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు మొత్తాన్ని కలిపి.. రూ.పది లక్షల చొప్పున నిర్వాసిత కుటుంబాలకు పరిహారం అందించనున్నారు. పోలవరంతో ఆహారభద్రత పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలు వెరసి 23.21 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అంటే.. కొత్తగా 15.20 లక్షల ఎకరాలకు సాగునీరు.. 23.21 లక్షల ఎకరాల ఆయకట్టును పోలవరం ప్రాజెక్టు ద్వారా స్థిరీకరించవచ్చు. మొత్తమ్మీద 38.41 లక్షల ఎకరాలకు పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్లందుతాయి. ఇంత భారీ ఎత్తున ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టు దేశంలో మరొకటి లేదు. ఆయకట్టులో పండించే పంటల వల్ల ప్రజలకు ఆహార భద్రత చేకూరుతుంది. పోలవరం జల విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా చౌక ధరలకే 960 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రావడం వల్ల ప్రజలపై విద్యుత్ భారం కూడా తగ్గుతుంది. ఇది రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుంది కాబట్టే పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి జీవనాడిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. చదవండి: సామరస్య పరిష్కారానికి సీఎం జగన్ యత్నం -
కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారికి కనీస ప్రామాణిక ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది. దీనిపై ఆరు వారాల్లోగా నూతన మార్గదర్శకాలు జారీ చేయాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీని(ఎన్డీఎంఏ) ఆదేశించింది. బాధితులకు ఉపశమనం కలిగించాల్సిన ఎన్డీఎంఏ తన విధుల్లో విఫలమైందని న్యాయస్థానం ఆక్షేపించింది. కరోనా వల్ల మృతి చెందితే మరణ ధ్రువీకరణ పత్రాల్లో ఈ విషయం స్పష్టంగా పేర్కొనాలని సూచించింది. కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. బుధవారం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పులోని ప్రధానాంశాలు ►బాధిత కుటుంబాలకు ఫలానా మొత్తమే చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు నిర్దేశించలేదు. నిధులు, వనరుల లభ్యతలను దృష్టిలో పెట్టుకొని కనీస ప్రామాణిక ఆర్థిక సాయాన్ని పరిహారంగా ఖరారు చేయాలి. ఇది సమంజసంగా ఉండాలి. ►కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ) మార్గదర్శకాలు రూపొందించాలి. విపత్తు నిర్వహణ అథారిటీ–2005 సెక్షన్ 12(3) ప్రకారం కనీస పరిహారం అందించాలి. పరిహారంగా ఎంతమొత్తం ఇవ్వాలనేది ఎన్డీఎంఏ నిర్ణయించుకోవచ్చు. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను ఆరు వారాల్లోగా జారీ చేయాలి. ►ఎవరు ఏ కారణంతో మరణించారో డెత్ సర్టిఫికెట్లలో స్పష్టంగా పేర్కొనాలి. కరోనాతో మృతి చెందితే కోవిడ్–19తో అని సంబంధిత అథారిటీ మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి. ఒకవేళ అథారిటీ జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం పట్ల కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా, మృతికి కారణం పట్ల సంతృప్తి చెందకపోయినా సంబంధిత మార్పులు చేయాలి. ►కోవిడ్–19 మరణాల విషయంలో డెత్ సర్టిఫికెట్ల జారీని మరింత సరళతరం చేయాలి. ఆ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలి. ►15వ ఆర్థిక సంఘం సూచించినట్లుగా కాటికాపరుల కోసం ఒక బీమా పథకాన్ని రూపొందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. చదవండి: ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు -
అతిసార బాధిత కుటుంబాలకు రూ. 3లక్షలు: ఆళ్ల నాని
సాక్షి, కర్నూలు: గత కొద్ది రోజులుగా జిల్లాలో అతిసార వ్యాధి బారిన పడి పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అతిసారంతో మృతి చెదిన వారి కుటుంబాలకు 3 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. గోరుకల్లు వాసులను ఆదుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘‘గోరుకల్లులో పైప్‌లైన్‌ను మార్చేందుకు 25 లక్షల రూపాయలు కేటాయించాం. తాగునీటిని హైదరాబాద్, విజయవాడ ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయిస్తాం. గోరకల్లులో 24 గంటలు పని చేసేలా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాం. డయేరియా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. అనారోగ్యం ఉన్నవారు ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలి. అక్కడ మంచి వైద్యం అదుతుంది’’ అని ఆళ్ల నాని తెలిపారు. చదవండి: కరోనాపై ప్రత్యేక దృష్టి సారించాలి -
రూ.10 కోట్లు నష్టపరిహారం ఇచ్చాకే ఆ కేసు క్లోజ్ చేస్తాం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఇటాలియన్ మెరైన్స్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన 10 కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లిస్తేనే తాము ఈ కేసును మూసివేస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం అనగా 2012, ఫిబ్రవరి 15న లో కేరళ తీరం వెంబడి చేపల వేటకు వెళ్ళిన జాలర్లను సముద్ర దొంగలుగా భావిస్తూ ఇటలీ ఓడ ‘ఎన్రికా లెక్సి’పై ఉన్న ఇటలీ మెరైన్లు సాల్వేటోర్ గిరోనే, మాసిమిలియానో లాటోరే కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు భారతీయ జాలర్లు చనిపోయారు. ఇందుకు కారకులైన మెరైన్స్ను ఇటలీ విచారించాలని అంతర్జాతీయ ట్రిబ్యూనల్ ఆదేశించింది. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాల్సిందిగా బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బాధిత కుటుంబాలకు ఇటలీ ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్లు కోర్టుకు తెలిపాడు. ఇరు దేశాల మధ్య సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఈ కేసును త్వరితగతిన ముగించాల్సిందిగా తుషార్ మెహతా ధర్మసనాన్ని కోరాడు. ఈ నేపథ్యంలో కోర్టు ఈ నెల 19న కేసును విచారిస్తామని తెలిపింది. ఈలోపు ఇటలీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారం మొత్తాన్ని భారత ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఆ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు పంచుతామని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం, కేంద్రం అకౌంట్ నంబర్ సెండ్ చేస్తే.. తాము బాధితుల కుంటుబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని ఆ ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. దాంతో కేంద్రం ఈ రోజు అకౌంట్ నంబర్ని ఇటలీ ప్రభుత్వానికి సెండ్ చేసింది. డబ్బులు వచ్చిన మూడు రోజుల్లో ఆ మొత్తాన్ని సుప్రీంకోర్టు వద్ద డిపాజిట్ చేస్తామని కేంద్రం తెలిపింది. ఈ కేసును త్వరితగతిన విచారించాలన్న వ్యాఖ్యలపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘‘మేం అన్ని కేసులను త్వరగానే పరిష్కరించాలనుకుంటాం. కానీ ప్రభుత్వమే గడువు కావాలని కోరి.. ఆలస్యం అయ్యేలా చేస్తుందంటూ’’ చురకలంటించింది. చదవండి: గతేడాది ఆత్మహత్య.. రూ.100 కోట్లు ఇప్పించండి -
వివాహితతో మరో మహిళ శృంగారం.. భర్తకు నష్ట పరిహారం
టోక్యో: వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాక శృంగారంలో పాల్గొన్నందుకు గాను ఆమె భర్తకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోర్టు ఓ మహిళను ఆదేశించింది. ఈ సంఘటన జపాన్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ఓ వ్యక్తి(39) సదరు మహిల తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాక శృంగారంలో పాల్గొన్నదని.. ఇందుకు గాను ఆమె వద్ద నుంచి నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా టోక్యో కోర్టును ఆశ్రయించాడు. తన భార్యకు, సదరు మహిళకు ఆన్లైన్ ద్వారా పరిచయం ఏర్పడిందని.. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం వీరద్దరు ఏకాంతంగా కలుసుకున్నారని.. ఆ సమయంలో శృంగారంలో పాల్గొన్నారని ఆరోపించాడు. అతడి వాదనలు విన్న కోర్టు ఆ వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు జరిమానా విధించింది. బాధితుడి భార్యతో శృంగారంలో పాల్గొన్నందుకు గాను అతడికి 1,10,000 యెన్ల(భారత కరెన్సీలో 70 వేల రూపాయలు) నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ.. కోర్టు తీర్పుపై స్పందిస్తూ.. ‘‘అతడి భార్యకు, నాకు మధ్య జరిగినది చట్టరీత్యా నేరం కాదు. దాని వల్ల వారి వైవాహిక జీవితానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు’’ అని తెలిపింది. వైవాహిక జీవితంలో శాంతిని దెబ్బతీసే చర్యలను తప్పుగానే భావించాలని, పెళ్లయిన యువతితో లైంగిక సంబంధం పెట్టుకుని అశాంతి కలిగించినందుకు జరిమానా చెల్లించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే, కోర్టు తీర్పు సోషల్ మీడియాలో చర్చనీయమైంది. స్వలింగ సంపర్కాన్ని కోర్టు వ్యతిరేకిస్తున్నట్లుగా తీర్పు ఉందని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. నచ్చిన వ్యక్తులు.. పరస్పర అంగీకారంతో లైంగికంగా కలిస్తే తప్పు ఏముందని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఓ కేసు సందర్భంగా కూడా టోక్యో హైకోర్టు ఇలాంటి తీర్పునే వెల్లడించింది. తన మహిళా భాగస్వామని మోసం చేసినందుకు గాను ఆమెకి పరిహారం చెల్లించాల్సిందిగా ఓ మహిళను ఆదేశించింది. ఈ జంట ఏడు సంవత్సరాలు కలిసి జీవించినట్లు సమాచారం. వారు యుఎస్ లో వివాహం చేసుకున్నారు మరియు పిల్లల్ని కనడం గురించి కూడా చర్చించారు. ఈ క్రమంలో భాగస్వామి తనను మోసిం చేసిందని మరొక యువతి కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు మహిళా భాగస్వామికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా సదరు మహిళను ఆదేశించింది. చదవండి: బాడీగార్డ్‌తో సంబంధం.. రూ. 9 కోట్లు చెల్లించిన ప్రిన్సెస్ -
కొత్త చట్టం.. విడాకులు మరింత ఖరీదు
బీజింగ్ : చైనా కోర్టు వెల్లడించిన ఓ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆన్లైన్ చర్చకు దారి తీసింది. విడాకులు ఇవ్వాలని భావించే వ్యక్తి.. గతంలో తన భార్య చేసిన ఇంటి పనికి కూడా డబ్బులు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ప్రస్తుతం ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. మహిళల పని పట్ల మీకు ఇంత చిన్న చూపా అంటు ఎక్కువ మంది విమర్శలు చేస్తుండగా.. కనీసం ఇప్పటికైనా గుర్తించారు అంటూ కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం అమల్లోకి వచ్చిన చైనా కొత్త సివిల్ కోడ్ ప్రకారం, విడాకులు తీసుకునే జంటల్లో.. వారు కలిసి ఉన్న రోజుల్లో భార్యలు ఇంట్లో ఎక్కువ బాధ్యతలు తీసుకుంటే అందుకు గాను వారు పరిహారం కోరవచ్చు. భరణం కాక ఇది అదనం. ఈ ఏడాదే చట్టం అమల్లోకి వచ్చింది. ఆ వివరాలు.. చెన్-వాంగ్ దంపతులకు ఐదు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో కోర్టు ఆమెకు భర్త నుంచి భరణం ఇప్పించింది. ఇదిలా ఉండగా ఈ నెల 4 నుంచి కొత్త సివిల్ లా అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో వాంగ్ కొత్త చట్టం ప్రకారం తామిద్దరు కలిసి ఉన్న ఐదేళ్లలో ఇంటి పనులు చేసినందుకు గాను తనకు ఎక్స్ట్రా డబ్బులు చెల్లించాల్సిందిగా కోరుతూ బీజింగ్ కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా వాంగ్ ‘‘గడిచిన ఐదేళ్లలో ఇంటి పని, పిల్లల బాగోగులు అన్ని నేను చూసుకున్నాను. చెన్ కొంచెం కూడా నాకు హెల్ప్ చేసేవాడు కాదు. ఆఫీస్ బాధ్యతలు మాత్రమే నిర్వహించేవాడు. రోజంతా పిల్లలు, ఇంటి పనితో సరిపోయేది. ఈ మేరకు నాకు మరి కాస్త ఎక్కువ పరిహారం ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను’’ అన్నది. వాంగ్ వాదనలు విన్న కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఐదు సంవత్సరాలు పాటు వాంగ్ చేసిన ఇంటి పనికి గాను 7,700 డాలర్లు(5,56,937.15 రూపాయలు) చెల్లించాల్సిందిగా ఆదేశిస్తూ.. తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుపై చైనీస్ ట్విట్టర్ వీబోలో వాడివేడి చర్చ నడుస్తోంది. ‘‘ఇంట్లోనే ఉండే భార్యలు తాము చేసే పనికి 50 వేల యువాన్ల పరిహారాన్ని పొందవచ్చు’’ అనే హాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ తీర్పు పట్ల చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మహిళలు ఎవరు ఇంటి పట్టున ఉండకూడదు. ఒకవేళ భవిష్యత్తులో మీరు విడాకులు పొందాలనుకుంటే.. మీకు ఎలాంటి పరిహారం లభించదు. ఇంటి పని చేస్తున్నందుకు గాను మీకు కేవలం 50 వేల పై చిలుకు యువాన్లు మాత్రమే లభిస్తుంది. ఏంటి ఈ ఖర్మ’’ అని కామెంట్ చేస్తుండగా.. ‘‘మరి కొందరు ఫుల్ టైం పిల్లలను చూసుకునే ఓ బామ్మ ఆరు నెలలకు గాను ఇంతకంటే ఎక్కువ ఫీజే తీసుకుంటుది. భార్యలు చేసే పని మీకు ఇంత చీప్‌గా కనిపిస్తుందా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తీర్పుపై ఓ న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘‘జంట ఎన్ని సంవత్సరాలు వైవాహిక జీవితం గడిపారు.. వాంగ్ ఇంటి పని, చెన్ ఆదాయం, స్థానిక జీవన వ్యయం ఆధారంగా ఈ మొత్తాన్ని నిర్ణయించినట్లు’’ స్థానిక మీడియాలో పేర్కొన్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనా ప్రకారం, చైనా మహిళలు రోజూ దాదాపు నాలుగు గంటలు వేతనం లేని ఇంటి పనులు చేయడంలో గడుపుతారు. పురుషుల కంటే 2.5 రెట్లు మరియు సగటు కంటే ఎక్కువ. చదవండి: తాగుబోతు భర్తకు ఝలక్ ఇచ్చిన భార్య, దాంతో కన్నీళ్లు తుడిచి.. కష్టాలు కడతేర్చి! -
‘ముందు నష్ట పరిహారం.. తర్వాతే కేసు విత్‌డ్రా’
న్యూఢిల్లీ: కేరళకు చెందిన మత్స్యకారులను కాల్చి చంపిన 2012 నాటి ‘ఇటాలియన్ మెరైన్’ కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. నాటి ఘటనకు సంబంధించిన బాధితులకు.. ఇటలీ నష్ట పరిహారం చెల్లిస్తేనే ఈ కేసు ముగుస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ‘ఇటలీ వారికి పరిహారం చెల్లించనివ్వండి. అప్పుడే ప్రాసిక్యూషన్‌ని ఉపసంహరించుకుంటాము’ అని ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ట్రిబ్యూనల్ నిర్ణయం మేరకు కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా కేంద్రం, సుప్రీం కోర్టును కోరింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యి వాదనలు వినిపించారు. (అసభ్యతను వ్యాప్తి చేస్తున్నారు: సుప్రీంకోర్టు) నాటి ఘటనకు బాధ్యులైన అధికారలను విచారిస్తామని.. బాధిత కుటుంబాలకు గరిష్ట నష్ట పరిహారం అందజేస్తామని ఇటలీ ఒక లేఖలో హామీ ఇచ్చినట్లు తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అయితే కేంద్రం వాదనలను కోర్టు తోసిపుచ్చింది. మత్స్యకారుల కుటుంబాలకు ముందుగా నష్టపరిహారం చెల్లించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. బాధితుల బందువులతో పాటు వారికి అందజేసే చెక్కులను తీసుకుని కోర్టుకు హాజరు కావాలని తెలిపింది. అంతేకాక వారం రోజుల్లో బాధితుల కుటుంబాలను ఈ కేసులో చేర్చుతూ దరఖాస్తు చేయాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేసును ఉపసంహరించుకునే ముందు బాధిత కుటుంబాల వాదనలను వినాల్సిన అవసరం ఉదని కోర్టు స్పష్టం చేసింది. (గతేడాది ఆత్మహత్య.. రూ.100 కోట్లు ఇప్పించండి) ఈ కేసును విచారించిన అంతర్జాతీయ ట్రిబ్యునల్ భారత్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటలీ మిలిటరీ చర్యలు భారత పౌరుల హక్కుకు భంగం కలిగించి, నిబంధనలు ఉల్లంఘించాయన్న ట్రిబ్యునల్.. ఈ కేసులో భారత్ వాదనను సమర్థించింది. ఈ నేపథ్యంలో ప్రాణ నష్టానికి బదులుగా పరిహారం పొందేందుకు భారత్ అర్హత సాధించిందని తెలిపింది. బాధిత కుటుంబాలకు ఇటలీ నష్ట పరిహారం చెల్లించాలని సూచించింది. -
భైంసా బాధితులకు పరిహారం చెల్లించాలి
సాక్షి, హైదరాబాద్: భైంసా ఘటనలో నిరాశ్రయులై, భయభ్రాంతులకు గురైన పిల్లలు, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించి నష్టపరిహారం చెల్లించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞా పరాండే డిమాండ్ చేశారు. నగరంలోని దిల్కుషా గెస్ట్‌హౌస్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. భైంసాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, బాధితులు ఇంకా భయంభయంగానే బతుకుతున్నారన్నారు. ఘటనకు కారకులైన వారిని వదిలేసి, అమాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. ఒక వర్గం వాళ్లు మరో వర్గం వారిపై కావాలనే దాడి చేసినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. పూరి గుడిసెలు, పెంకుటిళ్లలో పెట్రోబాంబులు వేయడం, రాళ్లు వేయడం వంటి చర్యలు చూస్తుంటే పథకం ప్రకారం చేసినట్లే కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. భైంసా ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తానని తెలిపారు. అక్కడి పరిస్థితులను దాచిపెట్టే ందుకు మీడియాపై ఆంక్షలు విధించినా, సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలుస్తుందన్నారు. -
దానం చేసి మోసపోయాడు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలోని సబ్‌స్టేషన్ నిర్మాణానికి 20 గుంటల భూమిని విరాళంగా ఇచ్చిన భూదాత మల్లెత్తుల కొమురయ్య తన కుమారుడు నాగరాజుకు ఉద్యోగావకాశం ఇస్తానని మోసం చేశారంటూ సబ్‌స్టేషన్‌కు తాళం వేశాడు. విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరగని కారణంగా రాగినేడుతో పాటు పరిసర గ్రామాల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ఏడాది కావస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టిం చుకోకపోవడంతో సమస్య జఠిలమైంది. ఇప్పుడిప్పుడే ఎండల తీవ్రత పెరిగి భూగర్భజలాలు అడుగంటుతుండడంతో పంటలకు సాగునీరు కరువైంది. ఉద్యోగం ఇవ్వాల్సిందే... రాగినేడు గ్రామానికి మంజూరైన సబ్‌స్టేషన్‌కు అవసరమైన స్థలాన్ని ఇచ్చానని, తన కొడుకు నాగరాజుకు ఉద్యోగావకాశం కల్పించాల్సిందేనని మల్లెత్తుల కొమురయ్య డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి సబ్‌స్టేషన్ మంజూరు కావడంతో అధికారులు చర్యలు చేపట్టినా అవసరమైన ప్రభుత్వం స్థలం అందుబాటులో లేకపోవడంతో నిర్మాణపు పనులు మొదలు కాలేదు. గ్రామానికి చెందిన మల్లెత్తుల కొమురయ్య సబ్‌స్టేషన్ నిర్మా ణం చేసుకునేందుకు వీలుగా తన 20 గుంటల భూమిని విరాళంగా అందించారు. ఆ సమయంలో ప్రజాప్రతినిధులతో పాటు విద్యుత్‌శాఖ అధికారులు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ఆశ చూపారు. సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయి విద్యుత్ సరఫరా సాగిస్తున్న అధికారులు ఉద్యోగం ఇవ్వకుండా జాప్యం చేస్తుండడాన్ని భూదాత కొముర్య పలుమార్లు ప్రశ్నించారు. అంతేకాకుండా దాదాపు ఏడాది క్రితమే సబ్‌స్టేషన్‌కు తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి అక్కడే ఆందోళనకు దిగారు. ఆయనకు మాజీ ఎమ్మెల్యేలు విజయరమణారావు, గుజ్జుల రామకృష్ణారెడ్డిలతో పాటు పలుసంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఉద్యోగమా...పరిహారమా..! సబ్‌స్టేషన్ నిర్మాణాలకు అవసరమైన భూమిని విరాళంగా ఇచ్చిన దాతల కుటుంబీకుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం గతంలో ఉండేదని, ఇప్పుడు ఆ నిబంధన అమల్లో లేదని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. ఆ సమయంలో హామీ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు చేయలేమని అధికారగణం చేతులెత్తేయడంతో తన భూ మిలో నిర్మించిన సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరగనివ్వమంటూ భూదాత కుటుంబీకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం ఇచ్చిన కుటుంబానికి ఉద్యోగం ఇచ్చే అవకాశం లేనపుడు కొంత పరి హారం అందించాలని గ్రామపెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రైతుల నుంచి తలా కొంత వసూల్ చేయాలని భావించారు. ఆ మొత్తం సరిపోదని భావించి నియోజకవర్గ, పార్లమెంట్ స్థాయి నాయకులను కూడా పరిహారమందించేందుకు వీలుగా సాయమందించాలని అభ్యర్థించి కొంత మొత్తాన్ని వసూళ్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా సబ్‌స్టేషన్‌కు తాళం వేసిన భూదాతకు న్యాయం చేసి, రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న లో –వోల్టోజీ విద్యుత్ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు. పరిహారం అందించేందుకు కృషి చేస్తాం భూదాత కొమురయ్య కుటుంబానికి నిబంధనల మేరకు ఉద్యోగం ఇవ్వలేమని విద్యుత్ శాఖ అధికారులు చేతులెత్తేశారు. దాంతో గ్రామంలో ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌కు విరాళంగా ఇచ్చిన భూమికి కొంత పరిహారం ఇవ్వాలని గ్రామపెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ప్రజా అవసరాల కోసం భూమినిచ్చేందుకు ముందుకొచ్చిన దాతకు విరాళాల ద్వారా సేకరించి వీలైనంత త్వరగా పరిహారం అందిస్తాం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. – మల్క కుమారస్వామి, ఎంపీటీసీ సభ్యుడు -
నష్టపరిహారం అందించడంలో అవకతవకలు
సాక్షి, శ్రీకాకుళం : తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టపరిహారం అందించడంలో అవకతవకలు జరుగుతున్నాయని బాధితులు గొల్లుమంటున్నారు. బాధితుల జాబితాను తయారు చేసేందుకు వచ్చిన పరిశీలన బృందం అర్హుల జాబితాలో తప్పులు ఉండటంతో గ్రామస్థులు అధికారులను నిలదీస్తున్నారు. సమగ్ర సర్వే లేకుండా హడావుడిగా జాబితాలు రూపొందించడం వల్ల బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. పదిహేను రోజులైనా 85 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్దరణ కాలేదని ప్రజలు వాపోతున్నారు. పరిశ్రమలకు విద్యుత్ సరఫరా ఇవ్వకపోవడంతో పలాసలో జీడిపరిశ్రమల కార్మికులు ఆందోళన చేపట్టారు. తుపానుకు నేలకూలిన చెట్లను కూడా తొలగించలేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. -
పరిహారంపై పరిహాసం
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు అనుమానమే నిజమైంది! ఓవైపు భారీస్థాయిలో భూసేకరణ చేస్తూ.. మరోవైపు చెల్లించాల్సిన పరిహారాన్ని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువగా చూపడంతో సందేహం వ్యక్తం చేసిన కోర్టు తమ రిజిస్ట్రార్ జనరల్ నుంచి అసలైన గణాంకాలు తెప్పించుకుంది. ఇందులో ప్రభుత్వాలు సమర్పించిన గణాంకాలకు, రిజిస్ట్రార్ జనరల్ సమర్పించిన గణాంకాలకు పొంతనే లేదని తేలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము చెల్లించాల్సిన పరిహారం కేవలం రూ.93.59 కోట్లు మాత్రమేనని చెప్పగా.. రిజిస్ట్రార్ జనరల్ లెక్కల ప్రకారం అది రూ.867 కోట్లుగా ఉంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం రూ.457 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పగా.. రిజిస్ట్రార్ జనరల్ వివరాల ప్రకారం ఆ మొత్తం రూ.906 కోట్లుగా తేలింది. ప్రభుత్వాలు చెప్పిన వివరాలకు, రిజిస్ట్రార్ జనరల్ సమర్పించిన వివరాలకు ఇంత భారీ స్థాయిలో వ్యత్యాసం ఉండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమానం వచ్చిందిలా.. భూ సేకరణ పరిహారం విషయంలో తాము ఇస్తున్న ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ అమలు చేయడం లేదని, దీంతో బాధితులు దాఖలు చేస్తున్న ఎగ్జిక్యూషన్ పిటిషన్లు (ఈపీ)లు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా పేరుకుపోతున్నాయంటూ అప్పటి మహబూబ్‌నగర్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.వెంకటకృష్ణయ్య ఉమ్మడి హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించింది. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ వ్యాజ్యం మొదట విచారణకు రాగా.. ఆయా ప్రభుత్వాలు ఎంతెంత పరిహారం చెల్లించాలో చెప్పాలంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఏపీ సర్కారు తాము రూ.93.59 కోట్లు మాత్రమే చెల్లించాలని చెప్పగా, తెలంగాణ ప్రభుత్వం రూ.457.78 కోట్లు చెల్లించాలని తెలిపింది. ఒకవైపు ఇరు ప్రభుత్వాలు భారీ ఎత్తున భూ సేకరణ జరుపుతుండటం, మరోవైపు చెల్లించాల్సిన పరిహారం తక్కువగా ఉండటంతో ధర్మాసనానికి అనుమానం కలిగింది. ఉభయ రాష్ట్రాల్లోని కింది కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న ఎగ్జిక్యూషన్ పిటిషన్లు, చెల్లించాల్సిన మొత్తాల వివరాలను తమ ముందుంచాలని రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్‌ను ఇటీవల ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు ఆయన ఓ నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఈ నివేదికలోని వివరాలను, ప్రభుత్వాలు సమర్పించిన వివరాలను పోల్చి చూసిన ధర్మాసనానికి భారీ వ్యత్యాసాలు కనిపించాయి. ఏపీ ప్రభుత్వం చెప్పిన దానికి, రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన వివరాలకు మధ్య ఏకంగా ఎనిమిది రెట్ల వ్యత్యాసం ఉండటాన్ని కోర్టు గుర్తించింది. -
ఫీమేల్ డామినేషన్
వియన్నాః ప్రపంచం వ్యాప్తంగా స్త్రీ వివక్ష గురించి విస్త్రుతంగా చర్చజరుగుతోన్న తరుణంలో ఆస్ట్రియాలో పురుష వివక్ష వార్తల్లోకెక్కింది. లింగ వివక్ష రుజువై ఆస్ట్రియా రవాణా మంత్రిత్వ శాఖలో పనిచేస్తోన్న పీటర్ ఫ్రాంజ్‌మేయర్ 300,000 పైగా యూరోలను నష్టపరిహారంగా పొందిన విషయాన్ని డై ప్రెస్ వార్తా పత్రిక ప్రకటించింది. ఆస్ట్రియా రవాణా మంత్రిత్వ శాఖలో పనిచేసే ఫ్రాంజ్‌మేయర్ అనే ఉద్యోగికి రావాల్సిన ప్రమోషన్ ని ఉర్సులా జెంచ్నర్ అనే మహిళకు కట్టబెట్టడంతో తాను పదోన్నతిని కోల్పోయానంటూ 2011లో కోర్టుకెక్కారు. తను పదోన్నతి పొందలేకపోవడానికి వివక్షే కారణమనీ, జెంచ్నర్ అనే మహిళకి పదోన్నతినివ్వడంలో పక్షపాత వైఖరి అనుసరించారన్న ఫ్రాంజ్‌మేయర్ వాదనతో ఏకీభవించిన ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు అతనికి నష్టపరిహారంగా 300,000 యూరోలను చెల్లించాలని ఫిబ్రవరిలో తీర్పునిచ్చినట్టు డై ప్రెస్ పత్రిక పేర్కొంది. అయితే జెంచ్నర్కి పదోన్నతినిచ్చే సమయంలో నియామకానికి సంబంధించిన అన్ని నిబంధనలనూ పాటించామని ఆ సమయంలో రవాణా శాఖా మంత్రిగా ఉన్న సోషల్ డెమొక్రాట్ పార్టీకి చెందిన డోరిస్ బర్స్ వివరణ ఇచ్చారు. మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేని కారణంగా, మహిళలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ పదోన్నతిని కల్పించినట్టు డోరిస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
'రకరకాల జీవోలతో ప్రభుత్వం మోసం చేస్తోంది'
హైదరాబాద్: మల్లన్న సాగర్‌తో పాటూ అన్ని ప్రాజెక్టుల నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. జీవో 123తో ఎక్కువ పరిహారం వస్తుందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రకరకాల జీవోలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఉత్తమ్ మండిపడ్డారు. -
21 ఏళ్ల తర్వాత పరిహారం!
రైల్వే శాఖ నుంచి అందిన డబ్బులు వికారాబాద్: ఓ రైతు న్యాయపోరాటం ఫలించింది. 21 ఏళ్ల తర్వాత రైల్వే శాఖ నుంచి పరిహారం అందింది. వివరాలు.. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం కాలనీకి చెందిన రైతు ప్రకాష్‌కు చెందిన 11 గుంటల భూమిని డబుల్ ట్రాక్ కోసం 1994లో రైల్వే శాఖ తీసుకుంది. అప్పట్లో రెవెన్యూ అధికారులు భూమికి తక్కువ పరిహారం నిర్ణయించారు. ఆశించిన ధర రాకపోవడంతో రైల్వే శాఖకు వ్యతిరేకంగా రైతు హైకోర్టును ఆశ్రయించాడు. రైతు ప్రకాష్‌కు కేవలం 11 గుంటల భూమి మాత్రమే ఉండి వేరే ఆధారం లేకపోవడంతో ఆయన స్థితిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం రూ. 8,09,377 పరిహారం చెల్లించేలా రైల్వేశాఖను ఆదేశించింది. సదరు చెక్కును వికారాబాద్ సీనియర్ సివిల్ జడ్జి, లోక్ అదాలత్ చైర్మన్ గోవిందారెడ్డి శనివారం రైతుకు అందచేశారు. చాలా ఏళ్ల తర్వాత తనకు సరైన న్యాయం జరగడంతో రైతు సంతోషం వ్యక్తం చేశాడు. -
మోడీ సర్కార్ సంచలన నిర్ణయం
-
మోడీ సర్కార్ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో మరణించిన సిక్కుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలను చెల్లించాలని మోడీ సర్కార్ ఆదేశాలు జారీ చేయనుంది. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం ద్వారా 3,325 మంది కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. గతంలో ఢిల్లీలో షీలాదీక్షిత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినా.. అమలు చేయడంలో విఫలమైంది. Follow @sakshinews -
అమ్మ అభిమానులకు 3లక్షల సాయం
చెన్నై : అమ్మకు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా పట్టలేరు. 'అమ్మ' అంటే ఈపాటికే ఎవరో అర్థమై ఉంటుంది. అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకు వెళ్లటాన్ని జీర్ణించుకోలేని ఆమె అభిమానులు 193మంది ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. దాంతో అభిమానులను ఆదుకునేందుకు జయ తమిళనాట సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి పార్టీ తరపున మూడు లక్షల చొప్పున సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సోమవారం నుంచి చెక్కులను పంపిణీ చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అమ్మ జైలుకు వెళ్లడాన్ని తట్టుకోలేక 193 మంది ప్రాణాలు కోల్పోయారని వారిలో 139 మంది గుండెపోటుకు గురికాగా.., మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురికి 50 వేల చొప్పున జయలలిత సాయం ప్రకటించారు.