![Car owner insurance company asked to pay rs 2 45 crore to victim kin - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/11/insurance-company.jpg.webp?itok=11YPdRyG)
ఓ కార్ యాక్సిడెంట్‌లో మృతుడి కుటుంబానికి పరిహారం విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీకి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ. 2.45 కోట్ల పరిహారం చెల్లించాలని కార్ ఓనర్, డ్రైవర్‌తో సహా బీమా కంపెనీని ఆదేశించింది.
పది సంవత్సరాల క్రితం కార్ యాక్సిడెంట్‌లో మరణించిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ఉద్యోగి కుటుంబానికి వడ్డీతో సహా రూ. 2.45 కోట్లు చెల్లించాలని కారు యజమాని, డ్రైవర్, బీమా సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఇటీవల ఆదేశించిన అత్యధిక పరిహారాల్లో ఇది ఒకటి.
బార్క్‌లో పనిచేసే ప్రియనాథ్ పాఠక్ అనే వ్యక్తి పదేళ్ల క్రితం ముంబై అనుశక్తి నగర్ వద్ద బైక్ వెళ్తుండగా కార్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను మరణించాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ కేసులో కారు యజమాని నోబుల్ జాకబ్ నిందితుడు కాగా 2014 డిసెంబరు 19న జాకబ్, న్యూ ఇండియా అస్స్యూరెన్స్ కంపెనీకి వ్యతిరేకంగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. మృతుడు ప్రియనాథ్ పాఠక్ నెల జీతం రూ.1.26 లక్షలు కావడంతో కోర్టు భారీ పరిహారాన్ని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment