New India Assurance Company
-
అతని కుటుంబానికి రూ. 2.45 కోట్ల పరిహారం.. ఇన్సూరెన్స్ కంపెనీకి షాక్!
ఓ కార్ యాక్సిడెంట్లో మృతుడి కుటుంబానికి పరిహారం విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీకి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ. 2.45 కోట్ల పరిహారం చెల్లించాలని కార్ ఓనర్, డ్రైవర్‌తో సహా బీమా కంపెనీని ఆదేశించింది. పది సంవత్సరాల క్రితం కార్ యాక్సిడెంట్లో మరణించిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ఉద్యోగి కుటుంబానికి వడ్డీతో సహా రూ. 2.45 కోట్లు చెల్లించాలని కారు యజమాని, డ్రైవర్, బీమా సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఇటీవల ఆదేశించిన అత్యధిక పరిహారాల్లో ఇది ఒకటి. బార్క్‌లో పనిచేసే ప్రియనాథ్ పాఠక్ అనే వ్యక్తి పదేళ్ల క్రితం ముంబై అనుశక్తి నగర్ వద్ద బైక్ వెళ్తుండగా కార్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను మరణించాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ కేసులో కారు యజమాని నోబుల్ జాకబ్ నిందితుడు కాగా 2014 డిసెంబరు 19న జాకబ్, న్యూ ఇండియా అస్స్యూరెన్స్ కంపెనీకి వ్యతిరేకంగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. మృతుడు ప్రియనాథ్ పాఠక్ నెల జీతం రూ.1.26 లక్షలు కావడంతో కోర్టు భారీ పరిహారాన్ని నిర్ణయించింది. -
బీమా రంగంలో జాబ్ కావాలా.. ఇలా ట్రై చేయండి!
ఇన్సూరెన్స్.. బీమా.. ఒకప్పుడు బీమా అంటే జీవిత బీమానే! ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో ఆరోగ్య బీమా, వాహన బీమా, ప్రయాణ బీమా, గృహ బీమా.. ఇలా రకరకాల బీమా పాలసీలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇన్సూరెన్స్ కంపెనీలు.. విభిన్నమైన బీమా పాలసీలతో ముందుకు వస్తున్నాయి. కంపెనీల మధ్య పెరుగుతున్న పోటీ కారణంగా ఈ రంగంలో నిపుణులకు డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ఇటీవల 300 ఏఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. బీమా రంగంలో కెరీర్ అవకాశాలు, ఆయా ఉద్యోగాలకు అర్హతలు, ఎంపిక విధానంపై ప్రత్యేక కథనం... దేశంలో బీమా రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వ, ప్రయివేట్ రంగంలో అనేక సంస్థలు ఏర్పాటవుతున్నాయి. ఈ రంగంలో కార్యకలాపాల నిర్వహణ కొంత భిన్నంగా ఉంటుంది. దాంతో ఇన్సూరెన్స్ సంస్థలకు నిపుణుల కొరత ఎదురవుతోంది. తగిన అర్హతలు, నైపుణ్యాలుంటే.. బీమా రంగంలో ప్రారంభంలోనే రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు వార్షిక వేతనంగా పొందవచ్చు. (మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కోర్సులు–అర్హతలు ► ఇంటర్మీయెట్/10+2 విద్యార్హతతో డిప్లొమా, డిగ్రీ స్థాయి ఇన్సూరెన్స్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఆ తర్వాత వీరు పీజీ కోర్సులను కూడా అభ్యసించవచ్చు. ► ఇన్సూరెన్స్ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకోసం యాక్చూరియల్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ) అందించే యాక్చూరియల్ సైన్స్ కోర్సుల్లో చేరొచ్చు. యాక్చూరియల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(అసెట్)లో అర్హత ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ► అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో.. బీబీఏ, బీకామ్, బీఏ ఇన్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. ► పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో.. ఎంబీఏ, ఎంఏ, ఎంకామ్ ఇన్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ కోర్సులను అభ్యసించొచ్చు. ► వీటితోపాటు ఎమ్మెస్సీ ఇన్ యాక్చురియల్ సైన్స్, పీజీ డిప్లొమా ఇన్ సర్టిఫైడ్ రిస్క్ అండ్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి కోర్సులను పలు ఇన్స్టిట్యూట్లు అందిస్తున్నాయి. నైపుణ్యాలు బీమా రంగంలో రాణించాలనుకునే వారికి గణితం, గణాంకాలపై పట్టు ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, టీమ్ వర్క్, సమయస్పూర్తి, ఎదుటివారిని మెప్పించే ఒప్పించే నైపుణ్యాలు ఉండాలి. ఉపాధి అవకాశాలు బీమా రంగంలో నిపుణులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవలేదు. లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి సంస్థల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. వీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా, బీమా ఎగ్జిక్యూటివ్‌లుగా, ఇన్సూరెన్స్ సర్వేయర్లు, యాక్చువరీలు, మైక్రోఇన్సూరెన్స్ ఏజెంట్లు, అండర్ రైటర్లుగా ఉద్యోగాలు దక్కించుకునే వీలుంది. కొలువులిచ్చే సంస్థలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ), జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ ప్రుడ్‌న్షియల్, బిర్లా సన్ లైఫ్, టాటా, రిలయన్స్, బజాజ్, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్, మాక్స్లైఫ్ ఇన్సూరెన్స్.. ఇలా అనేక సంస్థలు నైపుణ్యాలు, అర్హతలు కలిగిన మానవ వనరులను నియమించుకుంటున్నాయి. 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు భారత ప్రభుత్వానికి చెందిన బీమా సంస్థ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. ఇటీవల 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఏఓ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీపడవచ్చు. ఆసక్తి గల వారు సెప్టెంబర్ 21తేదీలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం ఏఓ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష మొత్తం ఐబీపీఎస్ పీవో తరహాలో ఉంటుంది. బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష ► ఆన్లైన్ విధానంలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్–30 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ–35 మార్కులకు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 15రెట్ల మందిని మెయిన్‌కు అనుమతిస్తారు. మెయిన్ పరీక్ష ► ఈ పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్.. రెండు విధానాల్లో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ పరీక్ష 200 మార్కులకు, డిస్క్రిప్టివ్ పరీక్ష 30 మార్కులకు ఉంటుంది. ఈ రెండు టెస్టులు కూడా ఆన్లైన్ విధానంలోనే జరుగుతాయి. ► మెయిన్ ఆబ్జెక్టివ్ పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్–50 మార్కులకు, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్–50 మార్కులకు, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్–50 మార్కులకు, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్–50 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఆబ్జెక్టివ్ తరహ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల డిస్క్రిప్టివ్ పరీక్ష పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేస్తారు. ► డిస్క్రిప్టివ్ పద్ధతిలో 30 మార్కులకు జరిగే పరీక్షలో ఇంగ్లిష్ నైపుణ్యాన్ని పరీక్షించేలా లెటర్ రైటింగ్ పది మార్కులకు, ఎస్సె 20 మార్కులకు ఉంటాయి. మెయిన్‌లో ప్రతిభ చూపిన వారిని మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు. ముఖ్యమైన తేదీలు ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2021. ► ప్రిలిమినరీ పరీక్ష తేదీ: అక్టోబర్ 2021 ► మెయిన్ పరీక్ష తేదీ: నవంబర్ 2021 ► వెబ్సైట్: www.newindia.co.in/portal -
కోవిడ్-19తో మరణిస్తే నామినీకి రూ.10 లక్షలు
Covid-19: కోవిడ్-19 మహమ్మరి అంటువ్యాధి కారణంగా ప్రభుత్వ యాజమాన్యంలోని నాలుగు నాన్ లైఫ్ ఇన్స్యూరర్స్ సంస్థల సిబ్బంది మరణిస్తే ఆ ఉద్యోగుల నామినీలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా రూపంలో అందించనున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ది ఓరియంటల్ ఇన్స్యూరెన్స్, ది నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌కు చెందిన ఉద్యోగులకు కోవిడ్-19 ఎక్స్ గ్రేషియాను చెల్లించాలని నిర్ణయించినట్లు జనరల్ ఇన్స్యూరెన్స్ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా అసోసియేషన్(జీఐఈఏఐఏ) అధికారి ఒకరు తెలిపారు. ఈ నాలుగు బీమా సంస్థలలో ఒకటైన ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కోవిడ్-19తో మరణించిన ఉద్యోగుల నామినీకి రూ.10 లక్షలను ఏకమొత్తంగా ఎక్స్ గ్రేషియాను చెల్లించినట్లు ప్రకటిస్తూ జూలై 22న సర్క్యులర్ జారీ చేసింది. ఉద్యోగి/జీవిత భాగస్వామి/ఆధారిత పిల్లలు, తల్లిదండ్రుల చికిత్స కోసం స్టాఫ్ గ్రూప్ మెడిక్లెయిం పాలసీ కింద కవర్ కానీ వైద్య ఖర్చులను కూడా 100 శాతం తిరిగి చెల్లిస్తామని బీమా కంపెనీ తెలిపింది. "నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ది ఓరియంటల్ ఇన్స్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనే నాలుగు ప్రభుత్వ యాజమాన్యంలోని నాన్ లైఫ్ ఇన్స్యూరర్స్కు ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. మిగిలిన మూడు కంపెనీలు త్వరలో తమ సర్క్యులర్లతో బయటకు రావచ్చు" అని జీఐఏఐఏ ప్రధాన కార్యదర్శి కె. గోవిందన్ తెలిపారు. -
మెగా బీమా సంస్థ
న్యూఢిల్లీ: జీవిత బీమాకు సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తరహాలో... ప్రభుత్వ రంగంలోని సాధారణ బీమా సంస్థలన్నింటినీ కలిపి ఒకే దిగ్గజ సంస్థగా ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. న్యూ ఇండియా అష్యూరెన్స్ గొడుగు కిందికి మిగతా మూడింటినీ తెచ్చే దిశగా సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తోంది. ప్రభుత్వ రంగంలో ప్రస్తుతం న్యూ ఇండియా అష్యూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థలు నాలుగూ సాధారణ బీమా సేవలు అందిస్తున్నాయి. వీటిల్లో న్యూ ఇండియా అష్యూరెన్స్ దేశంలోనే అతి పెద్ద జనరల్ ఇన్సూరర్ కాగా, లిస్టెడ్ కంపెనీ కూడా. గతంలో దీన్ని ప్రత్యేకంగా కొనసాగనిస్తూ, మిగతా మూడింటిని కలిపేయడం ద్వారా ప్రభుత్వ రంగంలో రెండు భారీ సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. 2019 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఓరియంటల్, నేషనల్, యునైటెడ్ ఇన్సూరెన్స్‌లను కలిపి ఒకటిగా చేసి.. న్యూ ఇండియా అష్యూరెన్స్‌ను విడిగా ఉంచాలని యోచించింది. ఈ మూడు సంస్థలు అన్‌లిస్టెడ్ కంపెనీలు. అయితే, తాజాగా ఈ ప్రతిపాదన మారింది. కొత్త ప్రణాళిక ఇలా.. ఇప్పటికే ఈ రంగంలో అనేక ప్రైవేట్ కంపెనీలు మార్కెట్లో వాటా కోసం పోటీ పడుతూ ఉన్నాయి. మళ్లీ ప్రభుత్వ రంగంలో రెండు పెద్ద కంపెనీలు ఏర్పాటు చేస్తే.. ఈ రెండూ ఒకదాని వాటా మరొకటి కొల్లగొట్టే అవకాశం ఉంది. దీంతో గత ప్రతిపాదన పక్కన పెట్టి కొత్తది రూపొందించాలని కేంద్రం యోచిస్తోంది. దీని ప్రకారం.. ముందుగా అన్‌లిస్టెడ్ సంస్థలు మూడింటినీ విలీనం చేస్తారు. ఆ తర్వాత న్యూ ఇండియా అష్యూరెన్స్.. ఈ సంస్థను కొనుగోలు చేస్తుంది. ఈ ప్రక్రియలో వాటాల విక్రయ రూపంలో ప్రభుత్వానికి కూడా కొంత లబ్ధి చేకూరనుంది. అయితే, ఇదంతా న్యూ ఇండియా కొనుగోలు సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్థూల ప్రీమియం పరంగా బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) మే నెలాఖరు గణాంకాల ప్రకారం న్యూ ఇండియాకు 16.80% మార్కెట్ వాటా ఉంది. మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల మార్కెట్ వాటా 25%. నష్టాల్లో ఉన్న పోర్ట్‌ఫోలియోలను సవరించుకోవాలని, క్లెయిమ్ మేనేజ్మెంట్ను మెరుగుపర్చుకోవాలని కొన్నేళ్లుగా ఆర్థిక శాఖ ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలకు సూచిస్తూ వస్తోంది. మరోవైపు మూడు చిన్న సంస్థలను విలీనం చేసి, అవి కాస్త స్థిరపడే దాకా సమయం ఇవ్వడం శ్రేయస్కరమని ఓరియంటల్ ఇన్సూరెన్స్ సంస్థ మాజీ చైర్మన్ ఆర్కే కౌల్ అభిప్రాయపడ్డారు. న్యూ ఇండియా అష్యూరెన్స్ భేషుగ్గానే రాణిస్తోందని, అంతర్జాతీయ స్థాయిలో కూడా గణనీయంగా కార్యకలాపాలున్నాయని ఆయన తెలిపారు. ఇలాంటి సందర్భంలో కార్యకలాపాలకు ఆటంకం కలిగించే చర్యలు తీసుకోవడం సరికాకపోవచ్చన్నారు. మూలధన అవసరాలపైనా దృష్టి.. ప్రభుత్వ రంగ బీమా సంస్థల నష్టాలు 2017 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,012 కోట్లుగా ఉండగా, 2018 ఆర్థిక సంవత్సరంలో రూ.12,603 కోట్లకు తగ్గాయి. తాజా విలీన యోచన నేపథ్యంలో ఆయా సంస్థల మూలధన అవసరాల అంశంపైనా ప్రభుత్వం దృష్టి పెడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఐఆర్డీఏఐ ఇచ్చిన వెసులుబాటుతో ఓరియంటల్, యునైటెడ్, నేషనల్ సంస్థలు 2018 మార్చి ఆఖరు నాటికి తప్పనిసరైన 1.50 శాతం సాల్వెన్సీ రేషియో నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. బీమా పాలసీలకు జరపాల్సిన చెల్లింపులకు మించి అదనంగా ఉండే మూలధనం, అసెట్స్ విలువను సాల్వెన్సీ నిష్పత్తిగా వ్యవహరిస్తారు. అనూహ్య, అత్యవసర పరిస్థితులేమైనా తలెత్తినా కూడా క్లెయిమ్స్‌ను సెటిల్ చేయగలిగేందుకు బీమా సంస్థ దగ్గర ఉన్న నిధుల పరిస్థితులను ఇది సూచిస్తుంది. -
ఇక వాహన బీమా మూడేళ్ళకోసారి..
వాహన బీమా అంటే ఏడాదికోసారి తీసుకోవాల్సిందే. అదే పెద్ద తలనొప్పి. అయితే ద్విచక్ర వాహనదారులకు కొంతవరకూ ఈ తలనొప్పి తొలగుతోంది. ఎందుకంటే ఇక మూడేళ్లకోసారి వారు తమ వాహనానికి బీమా తీసుకుంటే సరిపోతుంది. ఈ సరికొత్త దీర్ఘకాలిక కాంప్రిహెన్సివ్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఇటీవలే ‘న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ’కి బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ అనుమతినిచ్చింది. దీన్లో బాగా సంతోషించదగ్గ అంశమేమిటంటే ఇటువంటి పాలసీలపై ఏకంగా 30 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. దీనిపై న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... ‘‘వినియోగదారుడికి నో క్లెయిమ్ బోనస్, అండర్ రైటింగ్ ప్రయోజనాలు ఎలాగూ ఉంటాయి. దానికి అదనంగా 30 శాతం వరకూ డిస్కౌంట్ కూడా లభిస్తుంది’’ అని చెప్పారు. ఇలాంటి పథకాల వల్ల బీమా కంపెనీలకు పాలన పరమైన ఖర్చులు చాలావరకూ తగ్గుతాయి. ఈ పాలసీని అతిత్వరలో ప్రారంభించే అవకాశముంది. ఇంకో ముఖ్యమైన ప్రయోజనమేంటంటే పాలసీ మధ్యలో ఉండగా బీమా కంపెనీ ప్రీమియం ధరలను సవ రించటం చేయజాలదు. క్లెయిమ్ చేసినా కూడా అదే ప్రీమియం కొనసాగుతుంది. అదీ విషయం. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు కదూ!! కాస్త వేచి చూడండి మరి.! -
జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్
న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ ది న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఖాళీల సంఖ్య: 1536 (వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు 38, తెలంగాణకు 55 కేటాయించారు) అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష (ఆన్లైన్ టెస్ట్), ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది:నవంబర్ 10 వెబ్సైట్: www.newindia.co.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ (ఎన్ఐఎన్) కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. * పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ కోర్స్ * ఇన్ న్యూట్రీషన్ కాలపరిమితి: జనవరి 6 నుంచి మార్చి 20 వరకు అర్హతలు: ఎంబీబీఎస్ లేదా బయోకెమిస్ట్రీ/ ఫుడ్ అండ్ న్యూట్రీషన్/ డయాబెటిక్స్/ ఫిజియాలజీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. వయసు: 50 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా. దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 21 వెబ్సైట్: http://ninindia.org ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఐఆర్ఎం) ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాములో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. విభాగాలు: లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, యాక్చురల్ సెన్సైస్. కాలపరిమితి: ఏడాది. అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పీజీ. యాక్చురల్ సెన్సైస్ విభాగానికి డిగ్రీలో మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి. ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: మే 31, 2015 వెబ్సైట్: www.iirmworld.org.in