విజయం ఏ ఒక్కరి సొత్తు కాదు. సమాజంలోని ప్రతి ఒక్కరూ దాన్ని అందుకోవాలి అనే అనుకుంటారు. కాకపోతే ఇక్కడ అనుకోవటం వేరు.. విజయాన్ని అందుకోవడం వేరు!. ఆటంకాలకు అవకాశాలుగా మార్చుకుని.. పట్టుదలతో శ్రమిస్తే విజయం సొంతం అవుతుందని నిరూపించిన గాథల్లో మోటపర్తి శివరామ వర ప్రసాద్(MSRV Prasad) సక్సెస్‌కు చోటు ఉంటుంది. ఆయన ఎదుగుదలా క్రమమే ‘అమీబా’గా ఇప్పుడు పాఠకుల ముందుకు వచ్చింది.
చీకటి ఖండంగా పేరున్న ఆఫ్రికాలో.. అదీ అననుకూల పరిస్థితుల నడుమ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న ఓ తెలుగోడి ఆత్మకథే అమీబా. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ (Yandamuri Veerendranath) దీనిని రచించడం ఇక్కడ ఒక విశేషం కాగా.. తెలుగులో ఇది తొలిక్రైసిస్ మేనేజ్‌మెంట్ బుక్ కావడం మరో ప్రత్యేకత. నవ సాహితి బుక్ హౌజ్ పబ్లికేషన్స్ అచ్చేసిన ఈ బయోగ్రఫీ బుక్.. ఈ మధ్యే జయప్రకాశ్ నారాయణ లాంటి మేధావులు పాల్గొన్న ఓ ఈవెంట్‌లో లాంఛ్ అయ్యింది.
పశ్చిమ గోదావరిలో కొవ్వలి అనే కుగ్రామంలో ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి మోరపాటి జన్మించారు. ఆటంకాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ సాగిన ఆయన ప్రయాణం.. ప్రస్తుతం సంపద విలువను రూ. 12 వేల కోట్లకు చేర్చింది. Warangal NIT లో మెటలర్జి చదివారు. గుజరాత్ లో పని చేసి, హైదరాబాద్‌లో ఫౌండ్రి పెట్టారు. తర్వాత ఆ వ్యాపారాన్ని ఘనాలో విస్తరించాడు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ స్టీల్, సిమెంట్, కెమికల్స్, ఆటోమొబైల్స్, రియల్ ఎస్టేట్, గార్మెంట్స్ పరిశ్రమలను స్థాపించారాయన. వాటి ద్వారా 20 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. శ్రమ, ముందు చూపు, జ్ఞానం.. తన విజయానికి కారణాలని చెప్తున్నారు. అన్నట్లు.. సారధి స్టూడియోకు ప్రస్తుతం చైర్మన్ ఈయనే.
మోటపర్తి శివరామ వర ప్రసాద్ విజయ ప్రయాణం.. దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం, చాతుర్యం వంటి వాటికి నిదర్శనం. ఉద్యోగి సంక్షేమం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది.
:::డాక్టర్ జయప్రకాష్ నారాయణ
AMOEBA.. అడ్డంకులను అవకాశాలుగా మార్చుకుని.. నిర్దేశించని ప్రాంతాలను జయించిన వ్యక్తికి సంబంధించిన స్ఫూర్తిదాయకమైన కథనం. గొప్ప విజయాల్ని అందుకోవాలనుకునేవాళ్లెందరికో ఆయన జీవితం ఓ ఆశాజ్యోతి.
:::రచయిత యండమూరి వీరేంద్రనాథ్
రూ.400 జీతగాడిగా(మెటాలర్జిస్ట్‌గా) మొదలైన ఓ తెలుగు ఎంట్రప్రెన్యూర్ ప్రయాణం.. ఇప్పుడు సాధన సంపత్తి, అపారమైన సంపద, ఓ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించడం ఎంతైనా స్ఫూర్తిదాయకం కాదంటారా?.
Comments
Please login to add a commentAdd a comment