Entrepreneur
-
మొదట్లో లోన్లే దొరకలే, కట్ చేస్తే : రూ. 2వేలతో మొదలై రూ. 125 కోట్లకు
ఏ పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఇంట్లో ముందుగా అందరికీ గుర్తొచ్చే అమ్మమ్మ నాన్నమ్మలే. వారి చేతి వంట మహిమ అలాటిది మరి. కరియర్ కోసం సప్త సముద్రాలు దాటి ఈ తరం పిల్లలు చాలామంది ఆ రుచిని మిస్ అవుతున్నామని ఫీల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో చెన్నైకు చెందిన దంపతులకు ఒక ఐడియా వచ్చింది. దీనికి బిజినెస్‌లో రాణించాలన్న అమ్మమ్మ కుతూహలం కూడా తోడైంది. ఇంకేముంది జానకి పాటి వంటలు ఖండాంతరాలు దాటి రుచులను పంచుతున్నాయి. రూ.2 వేలతో మొదలైన వ్యాపారం రూ.125 కోట్లకు చేరుకుంది. స్వీట్ కారం కాఫీ(ఎస్కేసీ) సక్సెస్ స్టోరీ గురించి తెలుసు కుందాం రండి! చెన్నైలో ఉండే ఆనంద్ భరద్వాజ్, నళిని పార్థిబన్ దంపతులు. చాలా సందర్బాల్లో అమ్మమ్మ జానకి వంటకాలను ఆస్వాదించ లేకపోతున్నామే అని బాధపడేవారు. చివరికి చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి మరీ అమ్మమ్మ వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. 82 ఏళ్ల అమ్మమ్మ చేత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ప్రయత్నం అంత సాఫీగా సాగలేదు. చాలా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి తొలుత సుముఖత చూప లేదు. దీంతో ఇంట్లోనే ఒక చిన్న గదిలో కొద్ది పెట్టుబడితో ప్రారంభించారు.అలా 2015లో ఆనంద్ భరద్వాజ్ , నళిని పార్థిబన్ కేవలం రూ.2000 పెట్టుబడితో చిన్న కిచెన్‌లో స్వీట్ కారం కాఫీని ప్రారంభించారు. ప్రచారం కోసం స్వయంగా కరపత్రాలను పంపిణీ చేసేవారు. దక్షిణాది ప్రాంతాలకు చెందిన స్నాక్స్ జంతికలు జాంగ్రి, మైసూర్ పాక్ వంటి పదార్థాలను పరిచయం చేశారు. ఇక అంతే వెనుదిరిగి చూసింది లేదు. అమ్మమ్మ చేతి వంట అందరికీ తెగ నచ్చేసింది. ఆర్డర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. అలా మొదలైన ప్రయాణం వారు కూడా ఊహించని విధంగా చాలా తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 దేశాలకు విస్తరించింది. కంపెనీ విలువ రూ.125 కోట్లకు చేరుకుంది. అలాగే స్వీట్ కారం కాఫీ తన ఉత్పత్తులను కొన్ని ప్రముఖ ఆన్లైన్ సంస్థల ద్వారా కూడా విక్రయాలను కొనసాగిస్తోంది. అలాగే సొంత వెబ్సైట్, యాప్ ద్వారా విక్రయాలను కొనసాగిస్తోంది. View this post on Instagram A post shared by Sweet Karam Coffee - Experience South India (@sweetkaramcoffee_india) “నేను ఎప్పటికప్పుడు వంటలన్ని దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తాను. ఎక్కడా రాజీ పడను. ప్రతిదీ ప్రేమగా శ్రద్ధగా, శుభ్రంగా, రుచిగా ఉండేలా జాగ్రత్త పడతాను. నా సొంతం కుటుంబంకోసం చేసినట్టే చేస్తాను’’ అంటారు జానకి పాటి. అంతేకాదు పాటీ ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో కూడా ఈమె చాలా పాపులర్. ఇది నాకు పునర్జన్మ లాంటిది అని చెబుతారు గర్వంగా. క్రికెటర్ ఎంఎస్ ధోని పట్ల తన ప్రేమను సోషల్‌మీడియా ద్వారా పంచుకొని ఆనందిస్తూ, ముదిమి వయసులో కూడా ఆనందంగా గడపడం ఎలాగో చెప్పకనే చెబుతోందీ అమ్మమ్మ. -
ఇంటి పట్టు నుంచి ఐటీపై పట్టు
మహిళలకు కుటుంబ బాధ్యతలు కెరీర్ గ్యాప్‌కు కారణమవుతుంటాయి. కొంతమందిని పూర్తికాలం గృహిణిగానే ఉంచేస్తాయి. కానీ బిందు వినోష్ పడిలేచిన కెరటంలాగ సొంత కంపెనీ స్థాపించారు. బిందు స్థాపించిన వెబ్‌సికిల్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే దిశగా సాగుతోంది.కేరళకు చెందిన బిందు వినోష్ ఎంసీఏ చేసి కొంతకాలం ఐటీ రంగంలో ఉద్యోగం చేశారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతల్లో భాగంగా ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. దశాబ్దానికి పైగా ఇల్లే ప్రపంచంగా ఉండిపోయారామె. నలభై ఏళ్లు దాటేటప్పటికి ఐటీ రంగం మీదున్న ఇష్టం ఆమెను తిరిగి కెరీర్ వైపు అడుగులు వేయమని ప్రోత్సహించింది. 44 ఏళ్ల వయసులో ఓ పెద్ద ఐటీ కంపెనీ నుంచి ఫ్రాంచైజీ తీసుకున్నారు. ఫ్రాంచైజీకి, ఆఫీస్ ఏర్పాటు చేయడానికి 16 లక్షలతో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు. అనతికాలంలోనే సొంతంగా వెబ్‌సికిల్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీని ప్రారంభించారు. 2023లో ఇద్దరు వ్యక్తులతో మొదలైన ఆమె వ్యాపార సంస్థ ఇప్పుడు ఏడుగురు నిపుణులతో ఏడాదికి పాతిక లక్షలతో నడుస్తోంది. వెబ్‌సికిల్ ఐటీ రంగంలో వెబ్సైట్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్తోపాటు కస్టమ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కూడా అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వెబ్‌సికిల్ సేవలందుకుంటున్న క్లయింట్లలో ప్రతిష్ఠాత్మకమైన కంపెనీలు పాతిక వరకు ఉన్నాయి. నేడామె ఐటీ సంస్థకు యజమానిగా కొత్తగా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. -
ఈ అరటి పండు రూ. 52 కోట్లు
వీధుల్లో దొరికే పెద్ద సైజు అరటి పండు ఒకటి మహా అంటే ఐదారు రూపాయలు ఉంటుందేమో. అందులోనూ ఇంట్లో పిల్లాడు ఆడుకుంటూ ఒక అరటి పండును గోడకు ఒక గట్టి టేప్‌తో అతికించాక దాని విలువ ఎంత అంటే.. అనవసరంగా పండును పాడుచేశావని పిల్లాడిని అంతెత్తున కోప్పడతాం. అయితే అచ్చం అలాంటి అరటి పండునే, అలాగే ఒక ఫ్రేమ్‌కు గట్టి టేప్‌తో అతికిస్తే ఒక ఔత్సాహిక కళా ప్రేమికుడు ఏకంగా రూ.52 కోట్లు పెట్టి కొన్నారంటే నమ్మగలరా?. కానీ ఇది వంద శాతం వాస్తవం. అచ్చంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బుధవారం జరిగిన వేలంపాటలో ఇది 6.2 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడుపోయింది. చిత్రమైన కళాఖండాలు సృష్టించే ఇటలీ కళాకారుడు మారిజో కాటెలాన్ మనోఫలకం నుంచి జాలువారి ఫ్రేమ్‌కు అతుక్కున్న కళాఖండమిది అని అక్కడి కళాపోషకులు ఆయనను పొగడ్తల్లో ముంచెత్తడం విశేషం. పాశ్చాత్య కళాకారుల్లో చిలిపివాడిగా మారిజోకు పేరుంది. బుధవారం ప్రఖ్యాత ‘సోత్వే’ వేలం సంస్థ నిర్వహించిన వేలంపాటలో మరో ఆరుగురు బిడ్డర్లను వెనక్కినెట్టి మరీ చైనాకు చెందిన క్రిప్టోకరెన్సీ యువ వ్యాపారవేత్త జస్టిన్ సన్ ఈ కళాఖండాన్ని ఇన్ని డబ్బులు పోసిమరీ సొంతంచేసుకున్నారు. ‘‘ ఇలాంటి అపూర్వ కళాఖండాలంటే నాకెంతో ఇష్టం. ఈ అరటి పండును చూస్తుంటే తినాలనిపిస్తుంది. త్వరలో దీనిని అమాంతం ఆరగిస్తా’ అని జస్టిన్ సన్ సరదాగా వ్యాఖ్యానించారు. అమెరికాలో అత్యున్నత శ్రేణి పండ్ల దుకాణంలో దాదాపు రూ.30 ఉండే ఈ ఒక్క అరటి పండు ఇంతటి ధర పలకడం ప్రపంచవ్యాప్తంగా కళాఖండాలను కొనే వ్యాపారులనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఊహించిన ధర కంటే నాలుగు రెట్లు అధిక ధరకు అమ్ముడుపోయిందని సోత్బే సంస్థ పేర్కొంది. వేలంపాటల చరిత్రలో ఒక ఫలం ఇంతటి ధర పలకడం ఇదే తొలిసారి అని వేలంపాట వర్గాలు వెల్లడించాయి. 2019లో మియామీ బీచ్‌లోని ఆర్ట్ బాసెల్ షోలో తొలిసారిగా ‘కమేడియన్’ పేరిట ఈ పండును ప్రదర్శించారు. దానిని చూసినవారంతా ‘అసలు ఇదేం ఆర్ట్?. దీనిని కూడా ఆర్డ్ అంటారా?’ అంటూ పలువురు విమర్శించారు. అయితే ఐదేళ్ల క్రితమే ఇది 1,20,000 డాలర్ల ధర పలికి ఔరా అనిపించింది. గతంలో వచ్చిన విమర్శలపై తాజాగా జస్టిన్ సన్ స్పందించారు. ‘‘ ఈ ఘటనను కేవలం కళగానే చూడకూడదు. ఇదొక సాంస్కృతిక ధోరణుల్లో మార్పుకు సంకేతం. కళలు, మీమ్స్, క్రిప్టో కరెన్సీ వర్గాల మధ్య వారధిగా దీనిని చూడొచ్చు. పండు ఇంతటి ధర పలకడం ఏంటబ్బా ? అని మనుషుల ఆలోచనలకు, చర్చలకు ఇది వేదికగా నిలుస్తుంది. చరిత్రలోనూ స్థానం సంపాదించుకుంటుంది’ అని జస్టిన్ వ్యాఖ్యానించారు. మారుతున్న పండు !వాస్తవానికి 2019లో ప్రదర్శించిన పండు ఇది కాదు. 2019లో దీనిని ప్రదర్శించినపుడు అది పాడయ్యేలోపే అక్కడి కళాకారుడు డేవిడ్ డట్యూనా తినేశాడు. ఆకలికి ఆగలేక గుటకాయ స్వాహా చేశానని చెప్పాడు. ‘‘ప్రపంచంలో క్షుద్బాధతో ఎంతో మంది అల్లాడుతుంటే పోషకాల పండును ఇలా గోడకు అతికిస్తారా?. అయినా 20 సెంట్లు విలువచేసే పండు నుంచి కోట్లు కొల్లకొ డుతున్న ఈ కళాకారుడు నిజంగా మేధావి’’ అని డేవిడ్ వ్యాఖ్యానించాడు. 1,20,000 డాలర్లకు అమ్ముడుపోయాక దీనిని ఆయన తిన్నారు. తర్వాత మరో పండును ప్రదర్శనకు పెట్టారు. దానిని గత ఏడాది దక్షిణకొరియాలోని సియోల్ సిటీలోని ‘లీయిమ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’లో ప్రదర్శనకు ఉంచినపుడు నోహ్ హుయాన్ సో అనే విద్యార్థి తినేశాడు. ఇప్పుడు వేలంపాటలో అమ్ముడుపోయింది కొత్త పండు. అత్యంత గట్టిగా అతుక్కునే ‘డక్ట్’ టేప్‌తో ఫ్రేమ్‌కు ఈ పండును అతికించారు. ఈ కళాఖండాన్ని సృష్టించిన మారి జో కాటెలాన్ గతంలో ఇలాంటి వింత కళారూ పాలను తయారుచేశారు. 18 క్యారెట్ల పుత్తడితో నిజమైన టాయిలెట్‌ను రూపొందించారు. దానికి ‘అమెరికా’ అని పేరు పెట్టారు. దీనిని ప్రదర్శనకు పెట్టుకుంటే అప్పుగా ఇస్తానని కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఈయన గతంలో ఒక ఆఫర్ కూడా ఇచ్చాడట. కొన్న వ్యక్తిపై గతంలో ఆరోపణలుపండును కొనుగోలుచేసిన జస్టిన్ సన్ ప్రస్తుతం చైనాలో ట్రోన్ పేరిట బ్లాక్‌చైన్ నెట్వర్క్ వ్యాపారం చేస్తున్నారు. కొన్ని క్రిప్టోకరెన్సీల లావాదేవీలను పర్యవేక్షిస్తు న్నారు. ట్రోన్ క్రిప్టో టోకెన్ అయిన టీఆర్ఎస్ విలువను కృత్రిమంగా అమాంతం పెంచేసి మోసానికి పాల్పడుతున్నాడని జస్టిన్‌పై అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ కమిషన్ కేసు కూడా వేసింది. అయితే ఆ ఆరోపణలను జస్టిన్ తోసిపు చ్చారు. 2021–23లో ఈయన ప్రపంచ వాణిజ్య సంస్థలో గ్రెనడే దేశ శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Ratan Tata: నేను బాగానే ఉన్నా
న్యూఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ సంస్థ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఆరోగ్యంపై వెల్లువెత్తిన వదంతులపై ఆయనే స్వయంగా సమాధానమిచ్చారు. రక్తపోటు తగ్గడంతో సోమవారం తెల్లవారుజామున ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి రతన్ టాటా వెళ్లారు. దీంతో 86 ఏళ్ల రతన్ ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఐసీయూలో చేరారని జాతీయ మీడియాలో వెంటనే కథనాలు వెలువడ్డాయి. వీటిపై ఆయన తన సామాజిక మాధ్యమం ఖాతా ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంతో తలెత్తిన అనారోగ్య సమస్యల కారణంగా చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లా. నేను బాగానే ఉన్నా. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని ఆయన స్పష్టంచేశారు. టాటా సన్స్‌కు 1991 మార్చి నుంచి 2012 డిసెంబర్ 28దాకా రతన్ చైర్మన్‌గా కొనసాగారు. 1991లో రూ.10వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థను మహా సామ్రాజ్యంగా విస్తరించారు. ఈయన సారథ్యంలో 2011–12 ఆర్థికసంవత్సరం నాటికే 100.09 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించే స్థాయికి సంస్థ ఎదిగింది. టెట్లీ, కోరస్, జాగ్వార్ ల్యాండ్‌రోవర్ ఇలా భిన్నరంగాల పలు దిగ్గజ అంతర్జాతీయ సంస్థలను టేకోవర్ చేశారు. వ్యాపారాలను విస్తరించడంతో ఇప్పుడు సంస్థ ఆదాయంలో సగభాగం విదేశాల నుంచే వస్తోంది. -
స్టార్టప్ ద్వారా రూ. 500 కోట్ల ఆదాయం, కట్ చేస్తే అద్దె ఇంట్లోనే నివాసం
ఆరోగ్యకరమైన ఆహారం, లేదా ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతుందా అన్వేషించి, అన్వేషించి చివరికి వారే తయారు చేసిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల సక్సెస్ స్టోరీ ఇది. సుహాసిని, ఆమె సోదరి అనిందితా సంపత్ న్యూయార్క్‌లో నివసించేవారు. వీరిద్దరూ కలిసి యోగా క్లాస్‌కు హాజరయ్యేవారు. ఒకరోజు అనిందిత ట్రేడర్ జో నుండి ప్రోటీన్ బార్‌ను తీసుకున్నప్పుడు, వాటికి ప్రత్యామ్నాయంగా ఏమైనా దొరుకుతుందా అని ఆలోచింది. ఆ వెదుకులాటే కొత్త స్టార్టప్ ఎనర్జీ బార్ బ్రాండ్ కంపెనీకి నాంది పలికింది. కట్ చేస్తే.. రూ. 500 కోట్ల ఆదాయం.ఎంత విజయం సాధించాం, ఎంత డబ్బు సంపాదించామన్నదికాదు ముఖ్యం, తద్వారా ప్రజల జీవితాల్లో ఎంత మార్పుతెచ్చామన్నంది కూడా ముఖ్యం అంటారు బెంగుళూరుకు చెందిన సోదరీమణులు సుహాసిని.ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అంటే ఏమి చేయాలి?ఎలా ఉండా? అనే ఆలోచన ఫలితంగా పుట్టిందే 'యోగా బార్'. బెంగళూరుకు చెందిన సుహాసిని సంపత్, తన సోదరి అనిందితా సంపత్తో కలిసి 2014లో దీన్ని ప్రారంభించారు. యుఎస్‌లో ఉద్యోగం చేస్తూ, చదువుకుంటున్నప్పుడు ఫిట్నెస్ స్పృహతో, శ్రద్ధగా యోగా తరగతులకు హాజరయ్యేవారు. కఠినమైన వ్యాయామ సెషన్ల తర్వాత, బాగా ఆకలి వేసింది. కానీ తమ కడుపుని సంతృప్తిపరిచే ఆరోగ్యకరమైన, పోషకమైన స్నాక్స్ తిందామంటే దొరికేదికాదు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి రూ.25 లక్షలతో స్ప్రౌట్ లైఫ్ ఫుడ్ అనే సంస్థను ప్రారంభించారు. అలా అంచెలంచెలుగా వివిధ ఉత్పత్తులతో తమ వ్యాపారాన్ని విస్తరించారు. వాటిల్లోయోగా బార్ కూడా ఒకటి.యోగా బార్ భారతీయ ఆహార, ఆరోగ్య ప్రమాణాలను సంతృప్తి పరచడమే కాకుండా, అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)చే ఆమోదాన్ని పొందారు. స్నాక్బార్తో మొదలుపెట్టి పీనట్ బటర్, ఓట్స్.. ఇలా రకరకాల ఉత్పత్తులతో నాణ్యతకు మారుపేరుగా నిలిచింది .కట్ చేస్తే గత ఏడాది ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ 30 శాతం వాటాను కొనుగోలు చేసింది. 2026 నాటికి 100 శాతం స్టార్టప్‌ను రూ. 500 కోట్లకు కొనుగోలు చేయాలని ఒప్పందం చేసుకుంది.తొలి సంవత్సరంలో 5 లక్షల రూపాయలు. ఇండియాకు తిరిగి వచ్చి 2015 ఆగస్టులో, తొలి ఉత్పత్తి మల్టీగ్రెయిన్ ఎనర్జీ బార్లను, 2018లో ప్రొటీన్ బార్‌ను లాంచ్ చేసింది కంపెనీ. దీని ఆదాయం 2019లో రూ. 12 కోట్ల నుండి 2021 నాటికి రూ. 45 కోట్లకు పెరిగింది. వేలాది ఔట్ లెట్లతో అమెరికా, యూకేలో రెండు లక్షలకు పైగా కస్టమర్లు, ఎగుమతులతో, యోగా బార్ భారతదేశంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ సంస్కృతికి నిదర్శనంగా నిలిచింది. దీంతో రూ.175 కోట్లతో సంస్థలో 39.4 శాతం వాటా కొనుగోలు చేసింది ఐటీసీ. సుహాసిని, అనిందిత, ఆర్తి ముగ్గురు అక్కాచెల్లెళ్లు. చిన్నప్పటి నుంచీ పోటీతత్వం, విజయాల పట్ల ఆసక్తి ఉన్న సోదరీమణులు ఇంటా బైటా రాణించారు. ప్రపంచంలోని అత్యుత్తమ కాలేజీల్లో చదువుకున్నారు. పెరుగుతున్నక్రమంలో రెస్టారెంట్ ఆహారం కంటే ఇంట్లో తయారు చేసిన ఆహారాన్నే ఇష్టపడేవారు. ముఖ్యంగా కూరగాయలు, తృణధాన్యాలు ,పండ్లతో పాటు, పిల్లలు ఇష్టమపడే జంక్ ఫుడ్ కోరికలను తీర్చడానికి, వారి తల్లి ఆరోగ్యకరమైన స్నాక్స్ స్వీట్ల తయారు చేసేవారట. అదే హెల్దీ యోగా బార్ సంస్థకు పునాది అంటారీ సోదరీ మణులు. కాగా లండన్ బిజినెస్ స్కూలు నుంచి ఎంబీఏ చేసిన సుహాసిని చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. రెండు ఇళ్లు ఉన్నప్పటికీ వాటికి అద్దెకిచ్చి బెంగళూరులో అద్దెకు నివసిస్తుండటం విశేషం. ఈమెకు రియల్ ఏస్టేట్ వ్యాపారంలో కూడా పట్టు ఉందిట. -
భారత్ అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర
పుణె: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా ఇన్ఫ్రా రంగానికి బ్యాంకులు దన్నుగా నిలవాలని, చిన్న–మధ్యతరహా సంస్థల అవసరాలకు తగ్గట్లుగా రుణ లభ్యత ఉండేలా చూడాలని ఆమె చెప్పారు. అలాగే, ఆర్థిక సేవలు అందుబాటులో లేని వర్గాలను బ్యాంకింగ్ పరిధిలోకి తేవాలని, బీమా విస్తృతిని మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 90వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. టెక్నాలజీతో కొత్త మార్పులు.. ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్‌ను సులభతరం చేసేందుకు ఉపయోగపడుతున్న టెక్నాలజీతో పరిశ్రమలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ ప్రాధాన్యం పెరుగుతోందని, ప్రస్తుతం భూటాన్, ఫ్రాన్స్ తదితర ఏడు దేశాల్లో ఈ విధానం అందుబాటులో ఉందని ఆమె తెలిపారు. అంతర్జాతీయంగా జరిగే రియల్–టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 45 శాతం వాటా భారత్‌దే ఉంటోందన్నారు.అయితే, టెక్నాలజీతో పాటు పెరుగుతున్న హ్యాకింగ్ రిస్కులను నివారించేందుకు, అలాంటి వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బ్యాంకుల్లో మొండిబాకీలు తగ్గుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ జూన్ ఆర్థిక స్థిరత్వ నివేదిక సూచిస్తోందని మంత్రి చెప్పారు. లాభదాయకతతో పాటు ఆదాయాలను పెంచుకునే దిశగా బ్యాంకులు తగు విధానాలను పాటించాలని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు సూచించారు. -
18 ఏళ్లకే పెళ్లి.. నేడు రూ.18566 కోట్ల కంపెనీకి బాస్: ఎవరీ దీపాలీ?
ఒక స్త్రీ సంపాదించగలిగినప్పుడు.. ఆమె అధికారం పొందుతుందని, తన బిడ్డలను పాఠశాలకు వెళ్లేలా చేస్తుందని గట్టిగా నమ్మే మహిళలలో ఒకరు వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'దీపాలీ గోయెంకా'. 18 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్న ఈమె అతి తక్కువ కాలంలోనే ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరుగా నిలిచారు.వ్యాపారవేత్త బాలక్రిషన్ గోయెంకాను 18 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్న దీపాలీ గోయెంకా.. వివాహం తరువాత 1987లో ముంబైకి వెళ్లారు. తనకంటూ ఓ గుర్తిపు తెచ్చుకోవాలనే కోరికతో భర్త చేసే టెక్ట్స్‌టైల్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. అతి తక్కువ కాలంలోనే తన కొత్త ఆలోచనలతో తనను తాను నిరూపించుకోగలిగింది.సైకాలజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన దీపాలీకి టెక్ట్స్‌టైల్ రంగంలో ఏ మాత్రం అనుభవం లేదు. ఈమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ వంటివి కూడా పూర్తి చేసింది. పెళ్ళైన తరువాత ఈ టెక్ట్స్‌టైల్ రంగంలోకి అడుగుపెట్టింది.పరిచయమే లేని ఓ రంగంలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే.. ఆ రంగంలో ఆరితేరిన దీపాలీ 2016లో ఫోర్బ్స్ ఆమెను ఆసియాలో 16వ అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తించింది. దీపాలీ వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా అనేక దాతృత్వ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటుంది. నేను ఆమె కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ. 18,566 కోట్లు కావడం గమనార్హం.ఇదీ చదవండి: నన్ను పిచ్చివాడిగా భావించారు.. అంతా అదృశ్యమైంది: అనుపమ్ మిట్టల్దీపాలీ ‘వెల్స్పన్’లోకి అడుగు పెట్టినప్పుడు కేవలం ఏడు శాతం మంది మహిళలే పనిచేస్తుండేవారు. కానీ ఆ సంఖ్య దినదినాభివృద్ధి చెందింది. నేడు ఆ సంస్థలో ఏకంగా 30 శాతం కంటే ఎక్కువ మహిళలు పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమె ఎదగడమే కాకుండా చుట్టూ ఉన్న మహిళలు కూడా ఎదగాలనే సంకల్పంతో మహిళలను దీపాలీ ప్రోత్సహిస్తోంది. -
జీతం ఇవ్వము.. ఉద్యోగంలో చేరండి!.. సీఈఓ పోస్ట్ వైరల్
ఉద్యోగంలో చేరాలంటే మంచి జీతం, వారాంతపు సెలవులు కావాలని ఎవరైనా కోరుకుంటారు. కొన్ని సార్లు జీతం తక్కువైనా తప్పకుండా సెలవుల విషయంలో రాజీపడే అవకాశమే లేదు. అయితే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఓ సంస్థ సీఈఓ ఓ జాబ్ ఆఫర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతలా వైరల్ అవ్వడానికి.. అంతలా అందులో ఏముందో ఇక్కడ చూసేద్దాం.అహ్మదాబాద్‌లోని 'బ్యాటరీ ఒకే టెక్నాలజీస్' వ్యవస్థాపకుడు, సీఈఓ శుభమ్ మిశ్రా ఉద్యోగుల కోసం లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. ఇందులో మా కోర్ టీమ్‌లో చేరడానికి అసాధారణమైన వ్యక్తుల కోసం చూస్తున్నాము. ఉద్యోగులకు ఎలాంటి జీతం ఉండదు, వారాంతపు సెలవులు, సెలవులు (నిజంగా అవసరమైతేనే సెలవు) లేదు. ఎలాంటి బహుమతులు కూడా ఉండవని స్పష్టం చేశారు.రెడ్డిట్, లింక్డ్ఇన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేసిన ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. దీని గురించి శుభమ్ మిశ్రా స్పందిస్తూ.. మేము దీర్ఘకాలికంగా కంపెనీని నిర్మిస్తున్నాము. మాతో పాటు ఎదగాలని అనుకుంటున్నా వ్యక్తుల కోసం మేము వెతుకుతున్నామని ఆయన అన్నారు. వినూత్న ఏఐ పరిష్కారాల ద్వారా పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే స్టార్టప్ లక్ష్యంగా ఈ విధమైన పోస్ట్ చేసినట్లు మిశ్రా స్పష్టం చేశారు. -
'ది స్కై క్వీన్': 34 ఏళ్లకే ఏకంగా 10 ప్రైవేట్ జెట్లు..!
చిన్నతనంలో కేన్సర్‌లాంటి మహమ్మారితో పోరాటం చేసి గెలిచింది. అక్కడి నుంచి మొదలైన గెలుపు ప్రస్థానం..వినూత్న స్టార్టప్‌తో అనితర సాధ్యమైన విజయాన్ని అందుకుంది. ఎవ్వరూ ఊహించిన విధంగా కోట్లకు పడగలెత్తింది. జస్ట్ 34 ఏళ్లకే ఏకంగా పది ప్రైవేట్ జెట్లు కలిగిన మహిళగా సంచలనం సృష్టించింది. ఇంతకీ ఎవరీమె అంటే..ఆమె పేరు కనికా టేక్రివాల్. మార్వాడీ కుటుంబానికి చెందిన యువ పారిశ్రామికవేత్త. 1990లో జన్మించిన కనికా 20 ప్రాయంలో ప్రాణాంతక కేన్సర్‌తో పోరాటం చేసి గెలిచింది. ఆమె విధ్యాభాసపరంగా.. ప్రఖ్యాత లారెన్స్ స్కూల్ నుంచి ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత లవ్‌డేల్ అండ్ జవహర్లాల్, భోపాల్‌లోని నెహ్రూ సీనియర్ సెకండరీ స్కూల్లో హైస్కూల్ విద్యను పూర్తి చేసింది. ఇక కోవెంట్రీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి అవ్వగానే వినుత్నాంగా విమానాయన స్టార్టప్ జెట్‌సెట్ గోని ప్రారంభించింది.అలా అంచలంచెలుగా ఎదుగుతూ 420 కోట్లు విలువ చేసే సామ్రాజ్యాన్ని స్థాపించింది. ప్రస్తుతం కనికా ఆ కంపెనీ సీఈవోగా శక్తిమంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా దూసుకుపోతోంది. అంతేగాదు ఏకంగా లక్ష మంది ప్రయాణికులును గమ్యస్థానాలకు చేర్చి శెభాష్ అని ప్రశంసలందుకుంది. ఇప్పటివరకు ఆమె కంపెనీ దాదాపు 6వేల విమానాలను విజయవంతంగా నడుపుతోంది. కేవలం 34 ఏళ్ల వయసుకే దాదాపు 10 ప్రైవేట్ జెట్లను కలిగిన అత్యంత ధనిక మహిళగా హురున్ రిచ్ లిస్ట్‌లో నిలిచింది. అంతేగాదు భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు, వరల్డ్ ఎకనామి ఫోరమ్ ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్ వంటి అవార్డులు అందుకుంది. చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లను నిర్వహించే స్టార్టప్ వెంచర్‌ను సమర్థవంతంగా నిర్వహించి లాభల దిశగా నడిపించిన కనికా ప్రతిభాపాటవాలను అందరూ కొనియాడుతుండటం విశేషం. అంతేగాదు విమానాల లీజింగ్ పరిశ్రమలో అగ్రగామిగా నిలిచి 'ది స్కై క్వీన్' పిలిపించుకుంది కనికా. ఇక ఆమె వ్యక్తిగత జీవితం వద్దకు వచ్చేటప్పటికీ కనికా హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఇక్కడ కనికా వినూత్న స్టార్టప్‌ని సమర్థవంతంగా నిర్వహించి మహిళలందరికీ స్ఫూర్తిగా నిలిచింది. పైగా మహిళలు ఎలాంటి వ్యాపారాన్నైనా సమర్థవంతంగా నిర్వహించగలరని ప్రూవ్ చేసింది. (చదవండి: శస్త్రచికిత్స చేస్తుండగా 25 నిమిషాల పాటు ఆగిన గుండె..కట్‌చేస్తే..!) -
చురుకైన ఈ ఎంటర్‌ప్రిన్యూర్ అనిల్ అంబానీ కోడలు
ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ల వివాహం ఈనెల 12న అత్యంత విలాసంగా జరిగింది. అబ్బురంగా జరిగిన ఈ వేడుకల విశేషాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ సోదరుడు, పెద్దగా వార్తల్లో లేని అనిల్ అంబానీ కోడలు ఎంటర్‌ప్రిన్యూర్ క్రిషా షా (Khrisha Shah) గురించి, ఆమె వ్యవస్థాపక స్ఫూర్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..అనిల్ అంబానీ, టీనా అంబానీల పెద్ద కుమారుడు జై అన్మోల్ అంబానీని క్రిషా షా వివాహం చేసుకున్నారు. క్రిషా నికుంజ్ ఎంటర్ప్రైజెస్ మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దివంగత నికుంజ్ షా, ఫ్యాషన్ డిజైనర్ నీలం షా కుమార్తె ఈ క్రిషా షా. ఈమెకు ఇద్దరు పెద్ద తోబుట్టువులు ఉన్నారు. సోదరుడు మిషాల్ షా వ్యాపారవేత్త కాగా సోదరి నృతి షా ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్.ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. క్రిషా షా, జై అన్మోల్ అంబానీలు వారి కుటుంబాల ద్వారా పరిచయం అయ్యారు. కొన్నేళ్లు డేటింగ్లో ఉన్న ఈ జంట 2021 డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. 2022 ఫిబ్రవరిలో వీరి వివాహం కూడా విలాసవంతంగానే జరిగింది.‘డిస్కో’ స్థాపనక్రిషా షా వృత్తిపరమైన ప్రయాణం యూకేలో యాక్సెంచర్ సంస్థలో ప్రారంభమైంది. అక్కడ ఆమె భారీ స్థాయి డిజిటల్ పబ్లిక్ సర్వీస్ ప్రాజెక్ట్‌లలో సాంకేతిక సలహాదారుగా పనిచేశారు. తర్వాత ఆమె భారీ సంపాదననిచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపార ఏర్పాటు కలల వైపు పయనించారు. అలా సోషల్ నెట్వర్క్ ప్లాట్‌ఫామ్ ‘డిస్కో’ను స్థాపించారు. ఇది ప్రొఫెషనల్స్ కోసం ఆన్లైన్ హైపర్ లోకల్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. ఫ్రీలాన్సర్లు, ఎంటర్‌ప్రిన్యూర్లు, ప్రొఫెనల్స్ ఇక్కడ కనెక్ట్ అవ్వొచ్చు. తమ విశేషాలను పంచుకోవచ్చు.ఎంటర్ప్రిన్యూర్గానే కాకుండా క్రిషా షా సామాజిక కార్యకర్త, మానసిక ఆరోగ్య న్యాయవాది కూడా. ప్రేమ, ఆశ, శాంతి, ఐక్యత విలువలను ప్రోత్సహించే సాంస్కృతిక, మానసిక ఆరోగ్య అవగాహన చొరవ అయిన #LOVEnotfear అనే ప్రచారాన్ని ఆమె ప్రారంభించారు. క్రిషా షా విద్యా నేపథ్యం విషయానికి వస్తే యూఎస్‌లోని యూసీ బర్కిలీ నుంచి పొలిటికల్ ఎకానమీలో బీఏ, ఇంగ్లండ్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి సోషల్ పాలసీ అండ్ డెవలప్మెంట్లో ఎంఎస్సీ పట్టా పొందారు.జై అన్మోల్ అంబానీ, క్రిషా షా దంపతులు ప్రస్తుతం అనిల్ అంబానీ, టీనా అంబానీలతో కలిసి ముంబైలోని పాలి హిల్‌లోని సంపన్న నివాస ప్రాంతంలో తమ 17-అంతస్తుల ఇల్లు, అబోడ్లో నివసిస్తున్నారు. వార్తా సంస్థ డీఎన్ఏ ఇండియా ప్రకారం దీని విలువ రూ. 5,000 కోట్లు. -
ఈ చిన్నారి ఇప్పుడు గ్లోబల్ స్టార్.. ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్.. వెల్లయన్ సుబ్బయ్య
ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ చైర్మన్ వెల్లయన్ సుబ్బయ్య ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును అందుకున్నారు.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల మంది వ్యాపారవేత్తల నుంచి సుబ్బయ్యను ఎంపిక చేశారు. మొనాకోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దశాబ్ద కాలంలో భారత్ సాధించిన మూడో విజయం ఈవై రీజియన్లలో ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా తన హోదాను సుస్థిరం చేసుకుంది.ఒకటిన్నర దశాబ్దం క్రితం వెల్లయన్ తన కుటుంబ వ్యాపారంలో నాయకత్వాన్ని చేపట్టి, కల్లోలమైన భాగస్వామ్యం, ప్రపంచ ఆర్థిక మాంద్యం ద్వారా చోళమండలానికి మార్గనిర్దేశం చేశారు. ఆయన చైర్మన్ గా ఉన్న కాలంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 60 రెట్లు పెరిగింది. 2018లో వ్యూహాత్మక పెట్టుబడుల పునర్విభజన, కొనుగోళ్ల ద్వారా 70 ఏళ్ల నాటి తయారీ సంస్థ టీఐఐకి నాయకత్వం వహించారు.నాల్గవ తరం కుటుంబ వ్యాపారంలో భాగంగా వ్యవస్థాపకత్వ స్ఫూర్తి తనలో లోతుగా ఉందని సుబ్బయ్య అన్నారు. సవాళ్లను అవకాశాలుగా స్వీకరించి, స్వీయ అభివృద్ధి పథంలో పయనించడం ద్వారా మనం సాధించేదానికి హద్దులు ఉండవని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు.ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (డబ్ల్యూఈఓవై) అవార్డు గ్రహీతలుగా డాక్టర్ కిరణ్ మజుందార్ షా (2020), ఉదయ్ కోటక్ (2014), నారాయణమూర్తి (2003) సరసన వెల్లయన్ చేరారు. ఈవై వరల్డ్ ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024ను వ్యవస్థాపక స్ఫూర్తి, ప్రయోజనం, వృద్ధి, ప్రభావం అనే నాలుగు ప్రధాన ప్రమాణాల ఆధారంగా స్వతంత్ర ప్యానెల్ ఎంపిక చేసింది. -
Kirloskar Group: సగౌరవంగా... గౌరీ విజయం
గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన గౌరీ కిర్లోస్కర్ తమ కుటుంబ వ్యాపార విజయాల వెలుగులో మాత్రమే కనిపించాలనుకోలేదు. ‘కొత్తగా నేను ఏమీ చేయకపోయినా జీవితం సాఫీగా సాగిపోతుంది’ అనుకోలేదు. ‘ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యంలో నేను ఎక్కడ?’ అని ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్నే ఆమెతో ఎన్నో ప్రయాణాలు చేయించింది. ప్రతి ప్రయాణంలో విలువైన పాఠాలు నేర్చుకునేలా చేసింది. తమ కుటుంబ వ్యాపార చరిత్రలో తనకంటూ కొన్ని పుటలు ఉండాలనుకుంది. ఆమె ప్రయత్నం, కష్టం ఫలించాయి. ఫిప్త్ జెనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రసిద్ధ వ్యాపార సామ్రాజ్యమైన ‘కిర్లోస్కర్’లోకి అడుగుపెట్టిన గౌరీ కిర్లోస్కర్ తనను తాను నిరూపించుకుంది. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది.కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టినంత మాత్రానా ఎంటర్‌ప్రెన్యూర్‌గా వారిది నల్లేరు మీద నడక అనుకోవడానికి లేదు. తమను తాము నిరూపించుకొని ఫ్యామిలీ బిజినెస్‌కు మరింత బలాన్ని ఇచ్చేవారితో పాటు నిరూపించుకోలేక వెనుతిరిగేవారు కూడా ఉంటారు. గౌరీ కిర్లోస్కర్ మొదటి కోవకు చెందిన మహిళ.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పోలిటికల్ సైన్స్(ఎల్ఎస్ఈ)లో చదువుకుంది. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో ఫైనాన్స్‌లో డిగ్రీ చేసింది.చదువు పూర్తి కాగానే తమ కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టి పెద్ద హోదాలో వెలిగిపోవచ్చు. అలా కాకుండా ఉద్యోగం చేయాలనుకుంది గౌరి.ఉద్యోగం చేయాలనుకోవడానికి కారణం... తనను తాను నిరూపించుకోవడం..ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ్రపారంభించింది. ఆ తరువాత ‘పియర్సన్ కార్పొరేట్ ఫైనాన్స్’లో స్ట్రాటజీ గ్రూప్‌లో చేరింది. ఉద్యోగజీవితంలో విలువైన అనుభవాలను సొంతం చేసుకుంది. ఈ అనుభవాలు ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన విజయాలకు బలమైన పునాదిగా నిలిచాయి.మన దేశానికి తిరిగివచ్చిన గౌరి కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇక అప్పటినుంచి ‘కిర్లోస్కర్ గ్రూప్’లో వ్యూహాత్మక విధానాలపై దృష్టి పెట్టింది. బోర్డ్ మెంబర్‌గా సమీక్ష సమావేశాల్లో చురుగ్గా పాల్గొనడం ఒక కోణం అయితే ఎనర్జీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను అన్వేషించడం మరో కోణం.‘ఆర్క్ ఫిన్ క్యాప్’కు సంబంధించి టీమ్ ఏర్పాటు, బిజినెస్ ΄్లానింగ్లో కీలకంగా వ్యవహరించింది.పుణెలో కంపెనీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రధాన బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహించింది. ఇంటర్నేషనల్ ్రపాపర్టీ కన్సల్టెంట్స్తో కలిసి పనిచేసింది. హెచ్ఆర్, బ్రాండింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్‌లో తనదైన ముద్ర వేసింది. పర్యావరణ కోణంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)పై ప్రత్యేక దృష్టి పెట్టింది.గౌరీ నాయకత్వంలో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ గణనీయమైన వృద్ధిని సాధించింది. ‘ఇది కుదరదు’ అనుకునే చోట ప్రత్యామ్నాయాలు అన్వేషించి విజయం సాధించే నైపుణ్యం గౌరీలోఉంది.‘మేము ఇంజిన్ మాన్యుఫాక్చరింగ్‌లోకి వచ్చినప్పుడు గ్లోబల్ కంపెనీలతో టై అప్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఉంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా ఇంజిన్లను స్థానికంగానే తయారు చేసుకునే పరిస్థితి ఉండేది. ఇలాంటి అవకాశం లేకపోవడంతో సొంతంగా మాన్యుఫాక్చరింగ్ మొదలుపెట్టాం. సొంతంగా ఏదైనా చేయడం మొదలుపెట్టినప్పుడు మనదైన ఇంటెలెక్చువల్ ్రపాపర్టీ వృద్ధి చెందుతుంది’ అంటుంది గౌరీ.గౌరీ కంపెనీ బీ2బీ, బీ2సి, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే మూడు ప్రధానమైన బిజినెస్ సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది. బీ2బీ బిజినెస్ ఇంటర్నల్ కంబాషన్ ఇంజిన్స్‌పై, బీ2సి బిజినెస్ వాటర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలపై దృష్టి పెడుతుంది. ఇక ‘అర్క’ గ్రూప్ అనేది ఫైనాన్షియల్ సర్వీసెస్ సెగ్మెంట్.స్థూలంగా చెప్పాలంటే...ఉన్నత విద్యాలయాల్లో చదువుకున్న చదువు, ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు, వ్యూహాత్మక దృక్పథం వ్యాపార ప్రపంచంలో గౌరీని ఉన్నత స్థానంలో నిలిపాయి. మూలాలకు తిరిగి రావడం అనేది గణనీయమైన వ్యాపార విజయానికి ఎలా దారితీస్తుందో చెప్పడానికి గౌరీ కిర్లోస్కర్ పేరును ప్రముఖంగా ప్రస్తావించవచ్చు.ఉత్సాహ బలంవ్యాపార ప్రపంచానికి అవతలి విషయానికి వస్తే... గౌరీ కిర్లోస్కర్‌కు యోగా చేయడం, స్క్వాష్, డైవింగ్ అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికురాలైన గౌరీకి తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్లడం అంటే ఇష్టం. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ల గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాపై కూడా ఆసక్తి ప్రదర్శిస్తుంది. ఒక పుస్తకం చదివినప్పుడో, ఉపన్యాసం విన్నప్పుడో తనకు నచ్చిన వాక్యాన్ని, మాటను నోట్ చేసుకోవడం గౌరీకి ఇష్టం. ‘ఏ పని చేసినా ఉత్సాహంతో చేయాలి. ఉత్సాహమే అనంతమైన శక్తి’ అంటుంది గౌరీ కిర్లోస్కర్. -
Fauzia Arshi: ఆకాశమే హద్దు
డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా బాలీవుడ్లో గుర్తింపు పొందిన ఫౌజియా ఆర్షి మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ పుస్తకాల రచయిత్రి, గిటారిస్ట్, సింగర్, మ్యూజిక్ కంపోజర్, డైలాగ్ రైటర్. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎంటర్ ప్రెన్యూర్‌గా కూడా విజయపథంలో దూసుకుపోతోంది. ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తాజాగా మరో సవాలును స్వీకరించనుంది.ఖాళీగా కూర్చోకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఫౌజియా ఆర్షి పెట్టింది పేరు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఫౌజియాకు టైమ్ అంటే కొత్త విషయం తెలుసుకోవడం. కొత్త కళలో అక్షరాలు దిద్దడం. కాలాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న ఆమె కృషి వృథా పోలేదు. ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ అని ప్రపంచం గుర్తించేలా చేసింది.‘హోగయా దిమాగ్ క దహీ’ బాలీవుడ్ సినిమాతో నవ్వులు పూయించింది. ఈ రోరింగ్ కామెడీ ఫిల్మ్‌లో ఓంపురి, రాజ్‌పాల్ యాదవ్‌లాంటి నటులు నటించారు. ఫస్ట్–జెనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా టీనేజ్లోనే తన వ్యాపారదక్షతను చాటుకుంది ఫౌజియా.‘ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్మెంట్’ పేరుతో ఆమె రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. మేనేజ్మెంట్ డిపొ్లమా కోర్సుల విద్యార్థులకు బాగా ఉపకరించే ఈ పుస్తకం ప్రపంచ మార్కెటింగ్‌కు సంబంధించిన ఆర్థిక, రాజకీయ, భౌగోళిక వాతావరణాన్ని కళ్లకు కడుతుంది. ‘ది సన్ రైజెస్ ఫ్రమ్ ది వెస్ట్’ అనేది దీనికి పూర్తిగా భిన్నమైన పుస్తకం. ‘ఏది వాస్తవం?’ అంటూ వాస్తవాన్ని గురించి లోతుగా విశ్లేషించే పుస్తకం. తాత్విక ఛాయలు కనిపించే ఈ పుస్తకం రకరకాల చుక్కలను కనెక్ట్ చేసి ఒక రూపాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది.ఎంత అలవోకగా పుస్తకం రాయగలదో అంతే అలవోకగా రాగం తీయగలదు. అప్పటికప్పుడు పదాలు అల్లుతూ పాట పుట్టించగలదు. కాన్వాస్‌పై కనువిందు చేసే చిత్రాన్ని సృష్టించగలదు. ఇక గిటారిస్ట్‌గా ఆమె నైపుణ్యం సరేసరి. మేనేజ్మెంట్ప్రొఫెషనల్గా ఎంత జటిలమైన విషయాలనైనా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించగలదు.ఫౌజియాకు చెందిన డైలీ మల్టీమీడియా లిమిటెడ్ (డిఎంఎల్)... సినిమాలు, టెలివిజన్ కంటెంట్, యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్, ఈవెంట్ ఆర్గనైజింగ్, పొలిటికల్ క్యాంపెయిన్‌కు సంబంధించిన కంపెనీ.సామాజిక సేవారంగంలో చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకొని ఫౌజియాను బ్రిటన్ పార్లమెంట్ సత్కరించింది. ఫౌజియాకు ఇంగ్లీష్ భాషలో ఇష్టమైన మాట ‘న్యూ ఛాలెంజ్’. ఎప్పటికప్పుడు కొత్త ఛాలెంజ్‌లను అధిగమిస్తూ తన సత్తా చాటుతోంది.తాజా విషయానికి వస్తే...ముంబైకి చెంది ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్ ్రపాంతీయ విమానయాన సంస్థ ‘ఫైబిగ్’ను కొనుగోలు చేసే ప్రక్రియ జరుగుతోంది. లావాదేవీలు పూర్తయిన తరువాత ‘ఫ్లైబిగ్’ను మరిన్ని విమానాలతో విస్తరించనున్నారు. ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్‌కు ఫౌజియా ఆర్షి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంది. ‘ఫ్లైబిగ్’ రూపంలో మరో సవాలు ఆర్షి ముందుకు రానుంది. ఈ సవాలును కూడా ఫౌజియా విజయవంతంగా అధిగమించగలరన్నది ఆమె గురించి తెలిసిన వారు కాస్త గట్టిగానే చెప్పేమాట. -
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
దేశాన్ని విడిచి వెళ్లాలా? అంటూ బెంగళూరు ఇన్ఫ్రా, వాతావారణంపై ఆంత్రప్రెన్యూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బెంగళూరు ఇప్పుడు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొటోంది. ఈ తరుణంలో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మోమో మీడియా కో-ఫౌండర్, క్రియేటీవ్ హెడ్ అనంత్ శర్మ బెంగళూరు నగరంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.బెంగళూరులో మౌలిక సదుపాయాలు, వాతావరణం, నీటి సమస్యపై ఎక్స్ వేదికపై అనంత్ శర్మ స్పందించారు. శర్మ తాను ముంబై లేదా పూణే షిఫ్ట్ అవ్వడం మంచిదా లేకా దేశం విడిచిపెట్టి వెళ్లడం మంచిదా అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. Bangalore looks like it's gonna go to the dogs in another 5 years with bad infra bad weather and bad water. Is Mumbai or Pune worth shifting to or should I just leave India?— Anant (@AnantNoFilter) May 3, 2024‘బాడ్ ఇన్ఫ్రా, బ్యాడ్ వెదర్, బ్యాడ్ వాటర్. నేను ముంబై లేదా పూణేకు షిఫ్ట్ అవ్వాలా? లేదా? దేశం విడిచి వెళ్లాలా? అంటూ నెటిజన్ల అభిప్రాయాల్ని కోరారు. అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఎక్కువ మంది నెటిజన్లు తన అభిప్రాయంతో ఏకీభవించారు. కొందరు మరో ప్రాంతానికి షిఫ్ట్ అవ్వండి అంటూ సలహా ఇస్తే.. మరికొందరు మాత్రం బెంగళూరులో సానుకూల అంశాలను చర్చించారు. మీకు ఆర్థిక స్థోమత ఉంటే వదిలేయండి అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. బెంగుళూరుతో ఉన్న వ్యవస్థాగత సమస్య ఏమిటంటే ప్రజలు దీనిని వలస నగరంగా భావించడం. ఓటు బ్యాంకుగా మారితే తప్ప నగరాన్ని మార్చాలని ఎవరూ కోరుకోరని నిట్టూర్చాడు. -
ఈ గ్రామంలో ప్రతి ఇల్లు పరిశ్రమే
-
ఆ విషాదమే ఆమె జీవితాన్ని ఓ మలుపు తిప్పింది..ఏకంగా ఏడాదికి..!
భర్త అకాల మరణం ఆమె జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. ఓ సక్సెస్ ఫుల్ ఆగ్రో ఎంట్రప్రెన్యూర్‌గా మార్చింది. నేడు ఏకంగా ఏడాదికి 30 లక్షలు దాక ఆర్జిస్తోంది. పైగా ఎలాంటి ఉన్నత చదువులు చదువుకోకపోయినా కొడుకులను ఉన్నత చదువులు చదివిస్తోంది. తాను నమ్ముకున్న భూమితల్లే తన విజయానికి కారణమని సగర్వంగా చెబుతోంది రాజ్‌బాల. ఎవరీ రాజ బాల? ఎలా అన్ని లక్షలు ఆర్జిస్తుందంటే.. రాజస్తాన్‌కి చెందిన 64 ఏళ్ల వృద్ధురాలు రాజ్‌బాల భర్త అకాల మరణంతో ఏం చేయాలేని అగాధంలోకి వెళ్లిపోయింది. ఓ పక్క ఇద్దరు పిల్లలు వాళ్లను ఎలా సాకాలో తెలియని సందిగ్ధ స్థితి. ఇక లాభం లేదు తానే ఏదో ఒకటి చేయాల్సిందే అనుకుంది. తాను నమ్ముకున్న భూమినే ఆశ్రయించింది. అందరి రైతుల్లా కాకుండా రాజ్‌బాల సేంద్రియ వ్యవసాయాన్ని చేయాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యిపోయింది. అనుకున్నదే తడువుగా సేంద్రీయ పద్ధతిలో ఇంటికి సరిపడ కాయగూరలు తదితర వాటిని పెంచుకునేది. ఆ తర్వాత క్రమేణ ఇలాంటి సేంద్రియ ఉత్పత్తులు మంచివని, కేన్యర్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా ఉండాలంటే రసాయనిక ఎరువులు వేయకుండా పండించే కూరగాయాలతోనే సాధ్యమని పలు అవగాహన కార్యక్రమల ద్వారా తెలుసుకుంది. మొదట్లో ఇంట్లోకి కావాల్సినంత మటికే సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు పండించిన ఆమె ఈ రోజు అందరి కోసం సేంద్రియ పద్ధతుల్లో చాలా కూరగాయాలు పండిచడం ప్రారంభించింది. ఇలా ఆమె తన పొలంలో బొప్పాయి, మామిడి, అల్లం, పసుపు, బీట్ రూట్, టమాటాలతో సహా వివిధ రకాల కూరగాయలను పండిస్తోంది. అక్కడితో రాజ్‌బాల ఆగిపోలేదు పప్పు ధన్యాలు, సుగంధాలు పండించడం నుంచి పశువులకు దాణ అందించడం వరకు అన్నింటిని పండించేది. ఇక్కడ సేంద్రియ వ్యవసాయానికి శ్రమనే అధికంగా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందని అన్నారు. ఆమె వ్యవసాయ నైపుణ్యం చూసి ఇతరులు కూడా ఈ సేంద్రియ వ్యవసాయమే చేయడం విశేషం. తాను తన భర్త మరణంతోనే సేంద్రియ వ్యవసాయంలోకి వచ్చానని, నేడు దీంతో ఏడాదికి రూ. 30 లక్షలు పైనే ఆర్జిస్తున్నానని సగర్వంగా చెబుతోంది. ఇంకా ఆమె తాను మంచి చదువులు చదువుకోకపోయిన పిల్లలను ఉన్నత చదువులు చదివించడమే గాకుండా ఒకరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫిసర్‌గా, మరోకరు లండన్‌లో న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారని చెప్పుకొచ్చారు. అంతేగాదు తన కోడళ్లు మద్దతుతో సోషల్ మీడియా ద్వారా సేంద్రియ వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలు గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అందులో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు, సలహాలు సూచనలు కూడా ఇస్తోంది రాజ్ బాల. (చదవండి: ఆత్మవిశ్వాసం గల పిల్లలుగా ఎదగాలంటే..ఆ తప్పులు చెయ్యొదంటున్న మిచెల్ ఒబామా!) -
Rahul Gandhi: అదానీ లబ్ధి కోసమే అగ్నివీర్: రాహుల్
న్యూఢిల్లీ/మొహానియా: పారిశ్రామికవేత్త అదానీకి ప్రయోజనం కలిగించేందుకే కేంద్రంలో మోదీ ప్రభుత్వం అగ్నివీర్ పథకం తెచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ సరిహద్దులను కాపాడే జవాన్లకు వేతనాలివ్వడం మోదీకి ఇష్టం లేదన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం బిహార్‌లోని కైమూర్ జిల్లా మొహానియాలో ర్యాలీలో మాట్లాడారు. ‘‘సాధారణ సైనికుడి మాదిరిగా అగ్నివీర్‌కు వేతనం, పింఛను ఉండవు. క్యాంటిన్ సౌకర్యముండదు. విధి నిర్వహణలో మరణిస్తే అమరవీరుడి గుర్తింపూ ఇవ్వరు. రక్షణ బడ్జెట్ నుంచి సైనికులకు వేతనాలు, వసతులు కల్పించడం మోదీ సర్కారుకు ఇష్టం లేదు. బడ్జెట్‌ను అదానీకి లబ్ధి కలిగిలా ఖర్చు చేయాలనుకుంటోంది’’ అని ఆరోపించారు. బిహార్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులు కూడా యాత్రలో పాల్గొన్నారు. ప్రియాంకా గాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో శుక్రవారం యాత్రలో పాల్గొనలేకపోయినట్టు పార్టీ ప్రకటించింది. -
మోదీ ప్రశంసలు అందుకున్న ఎంట్రప్రెన్యూర్ వర్ష..
‘‘ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వింటే మనకు తెలియని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీబాత్ కార్యక్రమంలో అనేక విషయాలను ప్రస్తావిస్తుంటారు. వాటిలో ఒకటి నన్ను ఏకంగా ఎంట్రప్రెన్యూర్‌గా మార్చింది. ఈరోజు నేను ఆర్గానిక్ ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగాను. అదే మన్‌కీ బాత్ కార్యక్రమంలో నన్ను ప్రశంసించడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని చెబుతూ తెగ మురిసిపోతోంది వర్ష. కర్ణాటకలోని చామరాజన్ నగర్ జిల్లా ఆలహళ్లీ గ్రామానికి చెందిన వర్ష ఎమ్‌టెక్ చదివింది. చదువు పూర్తి కాగానే అందరిలా ఉద్యోగం కోసం చూడకుండా సరికొత్తగా ఏదైనా చేయాలనుకుంది. ఈ క్రమంలోనే ఏం చేయాలా అని ఆలోచిస్తున్న వర్ష.. ఓ రోజు అనుకోకుండా మన్‌కీబాత్ వినింది. ఆ కార్యక్రమంలో అరటి ఆకులను ఉపయోగపడే వనరులుగా ఎలా మారుస్తున్నారో మోదీ ప్రస్తావించారు. ప్రకృతిని ఇష్టపడే వర్షకు ఇది బాగా నచ్చడంతో.. అరటి బోదె, ఆకులతో హ్యాండిక్రాఫ్ట్స్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. వీడియో చూసి... అరటి కాండాలను ఉపయోగపడే వస్తువులుగా ఎలా మార్చాలో వర్షకు తొలుత అర్థం కాలేదు. తరువాత యూట్యూబ్‌లో వెతికి ఒక వీడియో ద్వారా కొంత సమాచారం తెలుసుకుంది. కోయంబత్తూరు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లో అరటి వ్యర్థాలను అందమైన వస్తువులుగా ఎలా మారుస్తున్నారో వివరంగా తెలుసుకుంది. ఆ తరవాత వ్యాపారానికి కావాల్సిన యంత్రాలను కొనుగోలు చేసి ఉమ్మతూరు సమీపంలో ‘ఆకృతి ఇకోఫ్రెండ్లీ’ పేరిట ఎంటర్ప్రైజ్ను ఏర్పాటు చేసింది. అరటికాండాలు, ఆకులను సేకరించి యంత్రాలతో ప్రాసెస్ చేసి నారతీసి, ఫ్లోర్‌మ్యాట్స్, బ్యాగ్స్, పర్సులు, హ్యాండీ క్రాఫ్ట్స్, అరటి గుజ్జు నుంచి తీసిన రసంతో సహజసిద్ధమైన ఎరువులు తయారు చేసి విక్రయిస్తోంది. కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించడంతో ఆర్గానిక్ షాపులు, గూగుల్, ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ వంటి ఆన్లైన్ షాపుల్లో సైతం ఆకృతి వస్తువుల విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా అరటి వ్యర్థాలను అందమైన వస్తువులుగా మారుస్తూ కొంతమందికి ఉపాధి కల్పించడంతో పాటు.. రైతులకు ఆదాయం వచ్చేలా చేస్తోంది వర్ష. వర్ష తన భర్త శ్రీకాంత్ సాయంతో చేస్తున్న ఈ ఇకో–ఫ్రెండ్లీ బిజినెస్ గురించి తెలియడంతో కొన్ని కంపెనీల నుంచి భారీగా ఆర్డర్లు వçస్తున్నాయి. ‘‘భవిష్యత్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించి ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తాను’’ అని వర్ష చెబుతోంది. గ్రామాల్లోని మహిళలు సైతం వ్యాపారవేత్తలుగా మారేందుకు, ఉద్యోగం దొరకనివారు ఉపాధిని ఇలా సృష్టించుకోవచ్చని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తోంది వర్ష. నవంబర్ నెల మన్‌కీ బాత్ కార్యక్రమంలో వర్ష ఎంట్రప్రెన్యూర్ జర్నీ గురించి మోదీ ప్రస్తావించడం విశేషం. -
ఎంటర్ప్రెన్యూర్లుగా రాణిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు
‘ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించడం అంటే మాటలా?’ అన్నది ఒకప్పటి మాట. మాటల మాంత్రికులైన యువ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు కలర్‌ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కలలు కంటున్నారు. ‘వ్యాపారం అంటే మాట్లాడినంత తేలిక కాదు’ అనే విమర్శను దాటి ఇన్ఫ్లూయెన్సర్లుగా తమ అనుభవాన్ని ఉపయోగించి ఎంటర్ప్రెన్యూర్లుగా గెలుపు జెండా ఎగరేస్తున్నారు. బ్రాండ్స్ ద్వారా గుర్తింపు పొందిన యంగ్ ఇన్ఫ్లూయెన్సర్లు ఆ తరువాత తామే ఒక బ్రాండ్‌గా మారుతున్నారు. మాసివ్ ఆన్లైన్ ఫాలోయింగ్‌తో ఎంటర్ప్రెన్యూర్లుగా మారుతున్నారు. ఫ్యాషన్, బ్యూటీ అండ్ లైఫ్‌స్టైల్ యూ ట్యూబర్ జ్యోతీ సేథీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అడుగులు వేస్తోంది. కొన్ని నెలల క్రితం ‘అభారి’ పేరుతో శారీ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. వివిధ ప్రాంతాలలో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసింది. తక్కువ సమయంలోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా సక్సెస్ అయింది.‘సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం కంటే ముందు వివిధ ప్రాంతాలలో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేయడం వల్ల కస్టమర్ల పల్స్ తెలుసుకోగలిగాను. వారి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ నాకు ఎంతో ఉపయోగపడింది’ అంటుంది జ్యోతి సేథీ. ముంబైకి చెందిన సంజయ్ ఖీర్ ఆరో తరగతిలోనే వంట చేయడం నేర్చుకున్నాడు. హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్న సంజయ్ ఫుడ్‌కు సంబంధించి యూట్యూబ్ చానల్ ‘యువర్ ఫుడ్ ల్యాబ్’ ప్రారంభించాడు. 13 మిలియన్ల ఫాలోవర్లతో దూసుకు΄ోయాడు. మూడు నెలల క్రితం కిచెన్ అండ్ హోమ్ అప్లయెన్స్ బ్రాండ్ ‘వైఎఫ్ఎల్ హోమ్’ను స్టార్ట్ చేశాడు. ‘ఒక వీడియోను రూపొందించడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఒక బ్రాండ్‌ను నిర్మించడానికి మాత్రం నెలలు, సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఇది పెద్ద సవాలు. ఆ సవాలును ఓపికతో మాత్రమే స్వీకరించాలి. కంటెంట్ క్రియేటర్‌గా నాకు అడ్వాంటేజ్ ఉండొచ్చు. అయితే ప్రొడక్ట్ మాట్లాడాలి’ అంటున్నాడు సంజయ్ ఖీర్. ఇన్ఫ్లూయెన్సర్గా తనకు ఉన్న పది సంవత్సరాల అనుభవంతో రెండు సంవత్సరాల క్రితం ‘వియరీఫెడ్’ అనే బ్యూటీ బ్రాండ్‌ను స్టార్ట్ చేసి సక్సెస్ అయింది అనమ్ చష్మావాలా. తన స్కిన్ టోన్‌కు మ్యాచ్ అయ్యే లిప్‌స్టిక్ గురించి ఎంత వెదికినా ఎక్కడా కనిపించలేదు. ఈ నిరాశ నుంచే బ్రాండ్ ఆలోచన చేసింది. అయిదు సంవత్సరాల రీసెర్చ్ తరువాత తన బ్రాండ్‌ను పట్టాలకెక్కించింది. 26 సంవత్సరాల హిమాద్రి పటేల్ ఇన్ఫోసిస్‌లో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లూయెన్సర్గా మారింది. ఇన్ఫ్లూయెన్సర్గా సక్సెస్ అయిన తరువాత ఎత్నిక్ క్లాతింగ్ బ్రాండ్ ‘డ్రై బై హిమాద్రి’ స్టార్ట్ చేసింది. కంటెంట్ క్రియేటర్‌గా ప్రయాణం ప్రారంభించిన రణ్వీర్ అల్హబాదియా పాడ్‌కాస్ట్ షో ‘ది రణ్వీర్ షో’తో డిజిటల్ ప్రపంచంలో సుపరిచితుడయ్యాడు. కాలేజి ఫ్రెండ్ విరాజ్ సేథ్తో కలిసి ‘మాంక్ ఎంటర్టైన్మెంట్’ కంపెనీ ప్రారంభించి విజయం సాధించాడు. ఫ్యాషన్ సెన్స్, ఫన్–లవ్ కంటెంట్‌తో కంటెంట్ క్రియేటర్‌గా పేరు తెచ్చుకున్న దీక్షా ఖురానా ‘డీక్లాతింగ్’ పేరుతో క్లాతింగ్ బ్రాండ్‌ను స్టార్ట్ చేసి సక్సెస్ అయింది. ఇన్ఫ్లూయెన్సర్గా పేరు తెచ్చుకున్నవారికి ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిలదొక్కుకోవడం అంత తేలిక కాదు.‘సక్సెస్ఫుల్ బ్రాండ్లను క్రియేట్ చేయడానికి మౌలిక సదుపాయాల కొరత ఇన్ఫ్లూయెన్సర్లకు అడ్డంకిగా ఉంది’ అంటున్నాడు ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘వన్ ఇంప్రెషన్’ సీయీవో అపాక్ష్ గుప్తా అంతమాత్రాన ‘ఇది మన స్పేస్ కాదు’ అనుకోవడం లేదు, అధైర్యపడడం లేదు యువ ఇన్ఫ్లూయెన్సర్లు. ఒక్కో అడుగు వేసుకుంటూ నడకలో వేగం పెంచుతున్నారు. ఎంటర్ప్రెన్యూర్లుగా విజయం సాధిస్తున్నారు. కలా నిజమా అనుకున్నాను నా బ్రాండ్‌కు ఆర్డర్లు మొదలై, పెరుగుతూ పోతున్న క్రమంలో ‘ఇది కలా నిజమా?’ అనుకున్నాను. ఈ విజయం నాకు బాగా ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘ఇంకా ఏం చేయవచ్చు’ అని రక రకాలుగా ఆలోచించేలా చేసింది. ఇన్ఫ్లూయెన్సర్తో పోల్చితే ఎంటర్‌ప్రెన్యూర్‌గా బాగా కష్టపడాలి. – అనమ్ చష్మవాలా, బ్యూటీ బ్రాండ్ ‘వియరీఫెడ్’ ఫౌండర్ ఆ కష్టమే ఇక్కడ కూడా... వ్యాపారరంగంలోకి అడుగు పెట్టాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అయితే ముందుగా ఇన్ఫ్లూయెన్సర్, కంటెంట్ క్రియేటర్‌గా నాకంటూ పేరు తెచ్చుకోవాలనుకున్నాను. ఆ తరువాత వ్యాపారం వైపు అడుగులు వేశాను. యూట్యూబ్ ద్వారా ఒక కంపెనీ ఎలా మొదలు పెట్టాలి? జీఎస్టీ నంబర్ అంటే ఏమిటి... మొదలైన విషయాలను తెలుసుకున్నాను. మొదట్లో కొన్ని పొరపాట్లు జరిగాయి. అయితే వాటి నుంచి విలువైన విషయాలు నేర్చుకున్నాను. ఇన్ఫ్లూయెన్సర్గా పేరు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. అలాంటి కష్టమే వ్యాపారంలో పెడితే విజయం సాధిస్తాను అని నమ్మాను. ప్రజల నమ్మకాన్ని చూరగొనడం అనేది అది పెద్ద విజయం. – జ్యోతి సేథీ, క్లాత్ బ్రాండ్ ‘అభారీ’ ఫౌండర్ ట్రెండ్ సెట్ చేయాలి ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్‌కు సంబంధించి సుపరిచిత బ్రాండ్లతో కలిసి పనిచేయడం ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోగలిగాను. ఆ తరువాత సొంతంగా ‘డీక్లాతింగ్’ క్లాతింగ్ బ్రాండ్‌ను స్టార్ట్ చేశాను. బ్రాండ్ స్టార్ట్ చేయడానికి ముందు ‘నా బ్రాండ్ ట్రెండ్ సెట్ చేయాలి’ అనుకున్నాను. అందరిలో ఒకరిగా కాకుండా మనదైన ప్రత్యేకతను సృష్టించుకున్నప్పుడు మాత్రమే మార్కెట్లో నిలదొక్కుకోగలం. – దీక్షా ఖురానా, క్లాతింగ్ బ్రాండ్ ‘డీక్లాతింగ్’ ఫౌండర్ -
Nita Ambani Birthday: ‘సంపూర్ణ’ సంపన్నురాలు!
Nita Ambani Birthday: రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, వ్యాపారవేత్త నీతా అంబానీ నవంబర్ 1న 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. విద్యావేత్త, పరోపకారి, ఎంటర్‌ప్రిన్యూర్, కళలు, క్రీడల పోషకురాలైన నీతా అంబానీ రూ. 23 వేల కోట్ల నుంచి రూ. 24 వేల కోట్ల నెట్‌వర్త్ అంచనాతో పలు భారీ బిజినెస్ వెంచర్లకు నాయకత్వం వహిస్తున్నారు. నీతా అంబానీ ముంబైలోని గుజరాతీ కుటుంబంలో 1963 నవంబర్ 1న జన్మించారు. నీతా నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆమెకు భరతనాట్యంలోనూ ప్రవేశం ఉంది. ముఖేష్ అంబానీతో పరిచయానికి ముందు ఆమె టీచర్‌గా పనిచేసేవారు. ఆ తర్వాత 1985లో ముఖేష్ అంబానీని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ, ఒక కుమార్తె ఇషా అంబానీ ఉన్నారు. భారతీయ వ్యాపార రంగంలో మొదటి మహిళగా ప్రసిద్ధి చెదిన నీతా అంబానీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళ ఆమెనే. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ట్రస్టీల బోర్డులో చేరిన మొదటి భారతీయురాలు కూడా. జీవితంలో అనేక మైలురాళ్లను సాధించిన నీతా అంబానీ ఎంటర్ప్రిన్యూర్గానేకాక చురుగ్గా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక ప్రతిష్టాత్మక అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. నీతా ఘనతలు ఇవే.. క్రీడల్లో మెరుగుదలకు సంబంధించి నీతా అంబానీ చేపట్టిన కార్యక్రమాలకు, అప్పటి భారత రాష్ట్రపతి ఆమెను 'రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ అవార్డు 2017'తో సత్కరించారు. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా అందించే ఇండియన్ స్పోర్ట్స్ ఉత్తమ కార్పొరేట్ సపోర్టర్‌గానూ ఆమె అవార్డును అందుకున్నారు. ఇవి కాకుండా నీతా అంబానీ ఇటీవల యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ (USISPF) 2023 నుంచి గ్లోబల్ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు. దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యతకు చేసిన కృషికి గాను ఆమెకీ అవార్డ్ దక్కింది. బిజినెస్ వెంచర్స్ నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్. సమ్మిళిత భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో 2010లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక దేశంలో మహిళా సాధికారత కోసం పనిచేసే 'హర్ సర్కిల్' అనే ఇంటరాక్టివ్ డిజిటల్ ఉద్యమాన్ని కూడా స్థాపించారు నీతా అంబానీ. ఐపీఎల్లో అనేకసార్లు టోర్నమెంట్‌ను గెలుపొందిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఆమె సహ యజమాని. అలాగే ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్పర్సన్ కూడా. ఇది దేశ ఫుట్‌బాల్ చరిత్రలో విప్లవాత్మకమైన ఇండియన్ సూపర్ లీగ్‌ను ప్రారంభించింది. ముంబైలో 2003లో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను స్థాపించిన నీతా అంబానీ దానికి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే కళలు, సాంస్కృతిక వైభవాన్ని ప్రోత్సహించేందుకు ముంబైలో ఇటీవల నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ను నీతా ప్రారంభించారు. As a proud mother, Mrs. Nita Ambani cheered for her daughter Isha Ambani on the launch of a new retail space #JioWorldPlaza, the brand new neighbour of the #NitaMukeshAmbaniCulturalCentre in Mumbai. Mrs. Ambani’s attire takes inspiration from the traditional Indian saree drape. pic.twitter.com/8hHLQXVGm6 — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) October 31, 2023 -
Seshanka Binesh: పేదపిల్లల గుండెచప్పుడు
శశాంక బినేశ్... మంచి వక్త. సామాజిక కార్యకర్త... ఓ విజేత. ‘మీ తరఫున మేము మాట్లాడుతాం’ అంటోంది. ‘మీ ఆరోగ్యాన్ని మేము పట్టించుకుంటాం’ అంటోంది. ‘ఉద్యోగినులకు అండగా ఉంటాను’ అంటోంది. ‘సస్టెయినబుల్ ఫ్యాషన్ కోసం పని చేస్తాను’ ... అని ప్రకృతికి భరోసా ఇస్తోంది. శశాంక బినేశ్ సొంతూరు హైదరాబాద్, చందానగర్. బీఫార్మసీ తర్వాత యూకేకి వెళ్లి ‘లండన్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ’ నుంచి ఫార్మసీలో పీజీ చేశారామె. ఇండియాకి వచ్చి కొంతకాలం ఉద్యోగం చేసినప్పటికీ అది సంతృప్తినివ్వలేదు. ‘‘సొంతంగా ఏదో ఒకటి చేయాలి, నన్ను నేను నిరూపించుకోవాలనే ఆలోచన చాలా గట్టిగా ఉండేది. ఈ లోపు మరో ఉద్యోగంలో చేరాను. ఆ ఉద్యోగంలో డిజిటల్ మార్కెటింగ్ మీద మంచి పట్టు వచ్చింది. ఇక ఆలస్యం చేయలేదు. ఇంట్లోనే ఒక గదిలో సొంతకంపెనీ ‘వి హాంక్’ మొదలుపెట్టాను. ఇప్పుడు ప్రతి వ్యాపారమూ బ్రాండింగ్ మీదనే నడుస్తోంది. బ్రాండ్‌కి ప్రమోషన్ కల్పించే పని మేము చేస్తాం. సింపుల్‌గా చెప్పాలంటే... మీ గురించి, మీ వ్యాపారం గురించి మేము హారన్ మోగిస్తామన్నమాట’’ అంటూ తన సేవా ప్రయాణాన్ని వివరించే ముందు ఉపాధి కోసం తాను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన విషయాన్ని చెప్పారామె. ‘సామాజిక కార్యకర్తగా ఈ పనులు ఇప్పుడు కొత్తగా చేస్తున్నవి కావు, మా ఇల్లే నేర్పించింది’’ అన్నారు శశాంక బినేశ్. తాత... నాన్న... నేను! నా చిన్నప్పుడు చందానగర్ నగరంలో భాగం కాదు, గ్రామం. మా తాత మందగడ్డ రాములు గ్రామానికి ఉప సర్పంచ్, సర్పంచ్‌గా ఊరికి సరీ్వస్ చేశారు. పేదవాళ్లు నివసించే శాంతినగర్ కాలనీ వాళ్లకు ఇళ్లు, కరెంటు వంటి సౌకర్యాలు ఆయన హయాంలోనే వచ్చాయి. మా నాన్న విక్రమ్ కుమార్ ఇప్పటికీ శ్రామికుల ప్రయోజనాల కోసం పని చేస్తూనే ఉన్నారు. నా అడుగులు కూడా అటువైపే పడ్డాయి. యూకేలో చదువుకుంటున్నప్పుడు పార్ట్‌టైమ్ జాబ్... షెఫీల్డ్ నగరంలో ఒక వృద్ధాశ్రమంలో. పెద్దవాళ్లకు ఒళ్లు తుడవడం, దుస్తులు మార్చడం, వీల్‌చెయిర్‌లో తీసుకెళ్లడం వంటి పనులు చేశాను. ఆ ఉద్యోగం... జీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చేసింది. ఇండియాలో మా నాన్న తన స్నేహితులతో కలిíసి 2007లో నాదర్గుల్ దగ్గర ఒక ట్రస్ట్ హోమ్ స్థాపించారు. ఆ హోమ్ కోసం పని చేయడం మొదలుపెట్టాను. ఇక డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్న సమయంలో సినీనటి సమంత, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగాని తో పరిచయమైంది. అప్పటినుంచి ‘ప్రత్యూష సపోర్ట్’ స్వచ్ఛంద సంస్థతో పని చేస్తున్నాను. పేదపిల్లలకు వైద్యసహాయం అందించడం మీద ప్రధానంగా దృష్టి పెట్టాను. ఇప్పటివరకు 650కి పైగా సర్జరీలు చేయించగలిగాను. స్ఫూర్తి ఫౌండేషన్, డిజైర్ సొసైటీతో కలిసి హెచ్ఐవీ పిల్లలకు ‘విష్ ట్రూ కమ్’ ప్రోగ్రామ్, అనాథ పిల్లలకు ‘వింగ్స్ ఆఫ్ హోప్’ ద్వారా విమాన ప్రయాణాలు చేయించడం వంటి పనులతో సేవాకార్యక్రమాల్లో ఉండే సంతృప్తిని ఆస్వాదించాను. పేదరికం... అనారోగ్యం... రెండూ శాపాలే! నా సర్వీస్‌ని ముఖ్యంగా ఆర్థిక వెనుకబాటు తనం, అనారోగ్యాల నిర్మూలనల మీదనే కేంద్రీకరించడానికి బలమైన కారణమే ఉంది. పేదరికమే ఒక శాపమైతే, అనారోగ్యం మరొక విషాదం. ఈ రెండూ కలిస్తే ఆ వ్యక్తి వేదన వర్ణనాతీతం. పిల్లలకు వైద్యం చేయించలేక తల్లిదండ్రులు పడే గుండెకోతను చెప్పడానికి ఏ భాషలోనూ మాటలు దొరకవు. సమాజంలో ఇన్ని సమస్యలుంటే ఇవి చాలవన్నట్లు మనుషులు ఒకరినొకరు కులాల పరంగా దూరం చేసుకోవడం మరొక విషాదం. భారతీయ విద్యాభవన్‌లో చదువుకున్నన్ని రోజులూ నాకు కులాల గురించి తెలియదు. ఇంటర్‌కి మా వాళ్లు ర్యాంకుల ప్రకటనలతో హోరెత్తించే కాలేజ్‌లో చేర్చారు. బీసీ వర్గానికి చెందిన నేను అక్కడ వివక్షను చూశాను, ఎదుర్కొన్నాను కూడా. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిన ఈ తరంలో కూడా ఇలా ఉంటే మా నానమ్మ, ఇంకా ముందు తరాల వాళ్లు ఎంతటి వివక్షకు లోనయ్యారో కదా అనే ఆలోచన మెదలుతుండేది. మా ట్రస్ట్ హోమ్‌లో కులం లేని సమాజాన్ని సృష్టించగలిగాను. నేను లీగల్ గార్డియన్‌గా ‘జములమ్మ’ అనే అమ్మాయిని దత్తత చేసుకున్నాను. ఆ అమ్మాయి కులమేంటో చూడలేదు. వైద్యసహాయం అందిస్తున్న వారి కులాలూ చూడం. నేను రక్తదాతల సంఘం సభ్యురాలిని కూడా. రక్తం అవసరమైన పేషెంట్లు రక్తదాత కులాన్ని చూడరు. సమంత చూపిన బాట! మేము పేషెంట్‌కి వైద్యసహాయం కోసం ఎంపిక చేసుకునేటప్పుడు త్రీ పార్టీ ఫండింగ్ విధానాన్ని అవలంబిస్తుంటాం. మూడింట ఒకవంతు మేము సహాయం అందిస్తాం, ఒక వంతు పేషెంట్ కుటుంబీకులు, ఒక వంతు హాస్పిటల్ వైపు నుంచి బిల్లులో తగ్గింపు ఉండేటట్లు చూస్తాం. సరీ్వస్ విషయంలో సమంత ప్రభావం నా మీద ఎంతగా ఉందంటే... ఆమె చేనేతల ప్రమోషన్ కోసం పని చేస్తున్న సమయంలో నా వంతుగా ప్రకృతికి ఉపకరించే పని చేయాలని స్టూడియో బజిల్ హ్యాండ్లూమ్ క్లోతింగ్ బిజినెస్ పెట్టాను. ఇన్నేళ్ల నా సరీ్వస్‌లో లెక్కకు మించిన పురస్కారాలందుకున్నాను. కానీ వాల్మీకి ఫౌండేషన్ నుంచి ఈ ఏడాది అందుకున్న ‘సేవాగురు’ గుర్తింపు ఎక్కువ సంతోషాన్నిచ్చింది. మావారు బినేశ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ‘వి హాంక్’ కోసమే పూర్తి సమయం పని చేయడం కూడా నాకు అందివచి్చన అవకాశం అనే చెప్పాలి. నన్ను నేను మలచుకోవడంలో బినేశ్ నాకు పెద్ద సపోర్ట్’’ అన్నారు శశాంక బినేశ్. ‘పోష్’ చైతన్యం మహిళలు పని చేసే ప్రదేశాల్లో తప్పనిసరిగా ‘సెక్సువల్ హెరాస్మెంట్ రిడ్రెసల్ కమిటీ’ ఉండాలి. ధనలక్ష్మీ బ్యాంకు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీ సభ్యురాలిని. చాలా మంది మహిళలకు తమ పని ప్రదేశంలో అలాంటి కమిటీ ఉందనే సమాచారమే ఉండడం లేదు. ఇందుకోసం అవగాహన సదçస్సుల ద్వారా మహిళలను చైతన్యవంతం చేయడం నాకు చాలా సంతృప్తినిస్తోంది. సమస్య ఎదురైతే గళం విప్పాలనే తెగువ లేకపోవడం కంటే గళం విప్పవచ్చనే చైతన్యం కూడా లేకపోవడం శోచనీయం. నేను ధైర్యంగా ఇవన్నీ చేయడానికి మా నాన్న పెంపకమే కారణం. ‘ఆడవాళ్లు మానసికంగా శక్తిమంతులు. ఎన్ని అవాంతరాలెదురైనా అనుకున్న పనిని మధ్యలో వదలరు’ అని చెప్పేవారాయన. ‘మహిళ ఒకరి మీద ఆధారపడి, ఒకరి సహాయాన్ని అరి్థంచే స్థితిలో ఉండకూడదు. తన కాళ్లమీద తాను నిలబడి, మరొక మహిళకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉండాలి. సమాజం గురించి భయపడి వెనుకడుగు వేయవద్దు. జీవితం పట్ల నీ నిర్ణయం ప్రకారం ముందుకే వెళ్లాలి. నువ్వు విజయవంతమైతే సమాజమే నిన్ను అనుసరిస్తుంది’ అని చెప్పేవారు. నేను సాటి మహిళలకు చెప్పే మంచి మాట కూడా అదే. – శశాంక బినేశ్, సోషల్ యాక్టివిస్ట్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ -
పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు వ్యాపారం మొదలుపెట్టింది
‘ఇదేమీ జీవితం’ అనే మాట సంప్రీత్ కౌర్ నోటి నుంచి ఎన్నోసార్లు వచ్చేది. నరకాన్ని తలపించే ప్రదేశంలో ఆమె బందీగా లేదు. ఎప్పటిలాగే, అదే ఇంట్లో అదే కుటుంబ సభ్యుల మధ్య ఉంది. ‘ఇదేమీ జీవితం నుంచి ఎందుకీ జీవితం’ వరకు కౌర్ ఆలోచనలు వెళుతున్న చీకటి కాలంలో ఆమె ముందు ఒక వెలుగు కిరణం పడింది. దాని పేరు... మక్రామీ! స్కూల్ నుంచి కాలేజీ వరకు స్టార్ స్టూడెంట్‌గా పేరు తెచ్చుకుంది హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన సంప్రీత్కౌర్. ప్రెగ్నెన్సీ సమయంలో తొమ్మిదేళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. ఎన్నో ప్రసిద్ధ సంస్థల్లో క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన కౌర్‌కు ఖాళీగా కూర్చోవడం అంటే ఇష్టం ఉండదు. కాని అనివార్య పరిస్థితులలో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. డెలివరీ తర్వాత కౌర్ ప్రసూతి వైరాగ్యానికి అంటే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కు గురైంది. తాను తనలాగా ఉండలేకపోయేది.ఏవేవో ప్రతికూల ఆలోచనలు. ఎప్పుడూ సందడిగా ఉండే కౌర్‌కు ఎవరితో మాట్లాడాలనిపించే కాదు. ‘మనసుంటే మార్గం ఉంటుంది’ అంటారు. అయితే ఆమె మనసు చీకట్లో కొట్టుమిట్టాడుతోంది. అయినప్పటికీ ఆ మనసు ఒక మార్గాన్ని వెలుతురుగా ఇచ్చింది... అదే మక్రామీ ఆర్ట్. ఆ ఆర్ట్‌కు దగ్గరవుతున్నకొద్దీ తనలోని డిప్రెషన్ మూడ్స్ దూరంగా వెళ్లిపోయేవి. చివరికి అవి కనిపించకుండా పోయాయి. కౌర్ గతంలోలాగే చురుగ్గా ఉండడం మొదలుపెట్టింది.‘మక్రామీ’లో నేర్పు సాధించిన కౌర్ ఆ కళను గాలికి వదిలేయలేదు. తాను ఎంటర్ప్రెన్యూర్ కావడానికి దాన్ని ఒక దారిగా చేసుకుంది. ‘అబ్బాయి పుట్టిన తరువాత, తరచుగా డిప్రెసివ్ మూడ్స్ వచ్చేవి. నా కాలేజి చదువు కోసం తల్లిదండ్రులు ఎంతో ఖర్చు చేశారు. ఉద్యోగ జీవితాన్ని మిస్ అవుతున్నాననే బాధ ఉండేది. ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాను. ఇప్పుడు ఇలా ఖాళీగా ఉండడం ఏమిటీ అని ఆలోచించేదాన్ని. గుంపులో ఉన్నా ఒంటరిగానే ఫీలయ్యేదాన్ని. పిల్లాడితో ఆడుకుంటూ ఆనందించడం కంటే, పిల్లాడు ఎప్పుడు నిద్రపోతాడా అని ఎదురు చూసేదాన్ని. పిల్లాడు నిద్రపోగానే ఒంటరిగా కూర్చొని ఏవేవో ఆలోచించేదాన్ని. ‘పిల్లాడి మీద శ్రద్ధ పెట్టు. వృథాగా ఆలోచించకు’ అని అమ్మ మందలించేది. ఎప్పుడూ సరదాగా ఉండే నేను సీరియస్‌గా మారిపోవడం చూసి మా ఆయన అయోమయానికి గురయ్యేవారు. ఆయనకు ఏం అర్థమయ్యేది కాదు. ఒకరోజు యూట్యూబ్‌లో పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కు సంబంధించిన వీడియో చూశాను. తల్లి మూడ్‌స్వింగ్స్ పిల్లాడిపై ప్రభావం చూపుతాయనే విషయం విన్న తరువాత భయమేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నా సమస్యకు నేనే పరిష్కారాన్ని వెదుక్కున్నాను’ గతాన్ని గుర్తు చేసుకుంటుంది కౌర్.‘జస్ట్ ఏ హాబీ’గా పరిచయం అయిన మక్రామీ ఆర్ట్ కౌర్‌ను పూర్తిగా మార్చివేసింది. మునపటి చురుకుదనాన్ని, హాస్యచతురతను తెచ్చి ఇచ్చింది. ‘మక్రామీ ఆర్ట్ ద్వారా అర్థం లేని ఆలోచనకు అడ్డుకట్ట పడింది. మనసు చాలా తేలిక అయింది. కొన్ని ఫ్లవర్ పాట్ హోల్డర్స్‌ను తయారుచేసి వాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. ఒక ఫ్రెండ్ ఇది చూసి తనకు ఆరు పీస్‌లు కావాలని అడిగింది. ఆమె నా ఫస్ట్ కస్టమర్. నా హాబీ అనేది విజయవంతమైన వ్యాపారంగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడడం ఇష్టంలేని నాకు ఇది చాలా గర్వంగా అనిపించింది’ అంటుంది కౌర్. కౌర్ ఆర్ట్‌వర్క్‌కు ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. వారిలో ఒకరు... రెగ్యులర్ కస్టమర్ అయిన అర్చన. ‘కౌర్ ఆర్ట్‌వర్క్ అంటే నాకు ఎంతో ఇష్టం. అత్యంత కఠిన సమయంలో ఆర్ట్ ద్వారా ఎలా బయటపడిందో తెలుసుకున్నాక ఆమె మీద అభిమానం రెట్టింపు అయింది. గోరంత సమస్యనే కొండంత చేసుకొని బాధపడే వారికి కౌర్ గురించి చెబుతుంటాను. ఆమె ఆర్ట్ వర్క్‌లో క్వాలిటీ, చూడగానే ఆకట్టుకునే సృజన నాకు ఇష్టం’ అంటుంది అర్చన.బాలీవుడ్ నటి తాప్సీ పన్ను నుంచి కౌర్‌కు పెద్ద ఆర్డర్ వచ్చింది. విదేశాల నుంచి కూడా ఆర్డర్లు రావడం మొదలైంది. దేశ, విదేశాల నుంచి ప్రతి నెల పదిహేను వందలకు పైగా ఆర్డర్లు వస్తున్నాయి. ‘నాలాగే సమస్యలు ఎదుర్కొంటున్న తల్లుల దగ్గరకు వెళ్లి నేను పడిన ఆందోళన, దానినుంచి బయటపడడానికి చేసిన కృషి గురించి చెప్పి మామూలు స్థితికి తీసుకువచ్చేదాన్ని. ఎంటర్‌ప్రెన్యూర్‌గా సాధించిన విజయం కంటే వారిలో మార్పు తీసుకువచ్చాననే సంతృప్తి ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది’ అంటుంది సంప్రీత్ కౌర్. View this post on Instagram A post shared by Atinytwisted| MacrameIndia (@atinytwisted) -
టెక్ మిలియనీర్ యాంటీ ఏజింగ్ జర్నీ..షాకింగ్ విషయాలు
-
అరటి నారతో వస్తువులు.. హీరోయిన్ విద్యాబాలన్ కూడా మెచ్చుకుంది
అందరూ వెళ్లే దారిలో వెళ్లాలనిపించదు. కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుందనే ఆలోచన కుదురుగా ఉండనీయదు. జీవనం పరీక్షగా అనిపిస్తుంటుంది. ‘అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయా? మనమే అవకాశాలను అందిపుచ్చుకోవాలా?! ఈ విధమైన సంఘర్షణే అరటినార వైపుగా అడుగులు వేయించింది’ అంటారు బళ్లారి వాసి విశ్వనాథ్. అరటినారతో గృహోపకరణాలను తయారుచేస్తూ తమ గ్రామమైన కంప్లిలో 20 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఎకోఫ్రెండ్లీ వస్తువుల ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు చేసిన విశ్వనాథ్ తన ప్రయత్నం వెనక ఉన్న కృషిని వివరించారు. ‘‘ప్రయత్నం లేకుండా ఫలితాలను ఆశించలేం అని తెలుసు. కానీ, కొంతకాలం మైండ్‌లో ఏ పని మీద దృష్టి పెట్టాలో తెలియకుండా ఉంటుంది. నా విషయంలో అదే జరిగింది. బీటెక్ చదువును మధ్యలో వదిలేశాను. ఇంట్లో అమ్మానాన్నలకు ఏ సమాధానమూ చెప్పలేక బెంగళూరులో ఏదైనా పని చేసుకోవచ్చని కొన్ని రోజులు ప్రయత్నించాను. ఏ పనీ సంతృప్తిని ఇవ్వలేదు. కరోనాటైమ్‌లో ఇంటి వద్దే కాలక్షేపం. బోలెడంత సమయం ఖాళీ. చదువు పూర్తి చేయలేకపోయానని అమ్మానాన్నల ముందు గిల్టీగా అనిపించేది. అరటితోటల్లోకి.. మా ప్రాంతంలో అరటితోటలు ఎక్కువ. నా చిన్నతనంలో అరటి నుంచి తీసే నారతో అమ్మావాళ్లతో కలిసి తాళ్లు, ఏవో ఒకట్రెండు ఐటమ్స్ తయారు చేసిన జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ, ఎవరూ వాటి మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. కాలక్షేపానికి అరటి నారతో రాఖీలు, కీ చెయిన్లు తయారు చేయడం మొదలుపెట్టాను. మా ఊరైన కంప్లిలో మహిళలు ఊలు దారాలతో క్రొచెట్ అల్లికలు చేస్తుంటారు. ఆ క్రొచెట్ను అరటినారతో చేయిస్తే ఎలా ఉంటుంది..? అనే ఆలోచన వచ్చింది. ముందు నేను ప్రయత్నించాను. క్రోచెట్ అల్లికలను నేర్చుకున్నాను. బ్యాగులు, బుట్టలు చేయడం మొదలుపెట్టాను. ముందైతే జీరో వేస్ట్ ప్రోడక్ట్స్ అనే ఆలోచన ఏమీ లేదు. నచ్చింది చేసుకుంటూ వెళ్లడమే. అయితే, అరటినారను తీసి, బాగా క్లీన్ చేసి, ఎండబెట్టి, ప్రత్యేక పద్ధతిలో దీనిని తయారుచేస్తే ఎక్కువ కాలం మన్నుతాయి అనే రీసెర్చ్ సొంతంగా చేశాను. సిద్ధం చేసుకున్న అరటినారను క్రొచెట్ అల్లే మహిళలకు ఇచ్చి, నాకు కావల్సిన వస్తువులు తయారు చేయించడం మొదలుపెట్టాను. రాఖీతో మొదలు... నేను చేసే పనిని ఒక ప్లానింగ్‌గా రాసుకొని, బ్యాంకువాళ్లను సంప్రదిస్తే 50 వేల రూపాయలు రుణం మంజూరు చేశారు. ఆ మొత్తంతో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని, అరటి నార తీసి, ఎండబెట్టడం.. ప్రక్రియకు వాడటంతో పాటు మహిళలు వచ్చి అల్లికలు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాను. మూడేళ్ల క్రితం ఇదే టైమ్‌లో మార్కెట్‌కి వెళ్లినప్పుడు రాఖీలను చూశాను. అవన్నీ కాటన్, ప్లాస్టిక్ మెటీరియల్‌తో చేసినవి. అవి చూసి రాఖీలను అరటినార, మట్టి ఉండలు, గవ్వలు, సీడ్ బాల్స్, తాటి ఆకులతో తయారు చేశాను. తెలిసిన వారికి వాటిని ఇచ్చాను. ప్రతి ఉత్పత్తి జీరో వేస్ట్ మెటీరియల్‌తో రూపొందించడంలో శ్రద్ధ తీసుకున్నాను. ‘విష్నేచర్’ పేరుతో హస్తకళాకారుల ఫోరమ్ నుంచి ఐడీ కార్డ్ ఉంది. దీంతో ఎక్కడ ఎకో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్స్, స్టాల్స్‌కు అవకాశమున్నా నాకు ఇన్విటేషన్ ఉంటుంది. నా వీలును, ప్రొడక్ట్స్‌ను బట్టి స్టాల్ ఏర్పాటు చేస్తుంటాను. ఆన్లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్స్‌ను బట్టి ఇతర రాష్ట్రాలు, విదేశాలకూ మా అరటినార ఉత్పత్తులు వెళుతుంటాయి. వంద రకాలు.. ఊలు దారాలతో క్రొచెట్ చేసే మహిళలు ఇప్పుడు అరటినారతో గృహాలంకరణ వస్తువులను తయారు చేస్తున్నారు. హ్యాండ్‌బ్యాగ్స్, ఫోన్ బ్యాగ్స్, క్లచెస్, మిర్రర్, టేబుల్ మ్యాట్స్, ΄ప్లాంటేషన్ డెకార్, పెన్ హోల్డర్స్, తోరణాలు, బుట్టలు... దాదాపు 100 రకాల వస్తువులను తయారు చేస్తుంటాం. ఈ ఉత్పత్తులు ఐదేళ్లకు పైగా మన్నికగా ఉంటాయి. నీటిలో తడిసినా పాడవవు. అయితే, తడి ఉన్న ఉత్పత్తులను నీడన ఎక్కడో పడేస్తే మాత్రం ఫంగస్ చేరుతుంది. శుభ్రపరిచినా ఎండలో బాగా ఆరబెట్టి, తిరిగి వాడుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ముందే చెబుతుంటాను. ఇరవైమంది మహిళలు ఒక్కొక్కరు నెలకు పది నుంచి పదిహేను వేల రూపాయల దాకా ఆదాయం పొందుతున్నారు. గుర్తింపు, ఆదాయాన్ని పొందే మార్గాన్ని కనుక్కోవడంతో కొంతమంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ పనిని మరింత విస్తృతం చేయాలన్న ఆలోచనతో నేచరల్ ఫేస్ స్క్రబ్స్, ఇతర ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ఒక ప్యాకేజీగా ఇవ్వాలన్న తపనతో పని చేస్తున్నాను. నా పనిని మెచ్చుకున్నవారిలో బాలీవుడ్ నటి విద్యాబాలన్, కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ వంటి ప్రముఖులు ఉన్నారు. మూడేళ్లుగా చేస్తున్న ఈ ప్రయత్నం, నా పనితీరుతో అమ్మానాన్నలు సంతోషంగా ఉన్నారు’’ అని వివరించారు విశ్వనాథ్. – నిర్మలారెడ్డి