చిన్నతనంలో కేన్సర్‌లాంటి మహమ్మారితో పోరాటం చేసి గెలిచింది. అక్కడి నుంచి మొదలైన గెలుపు ప్రస్థానం..వినూత్న స్టార్టప్‌తో అనితర సాధ్యమైన విజయాన్ని అందుకుంది. ఎవ్వరూ ఊహించిన విధంగా కోట్లకు పడగలెత్తింది. జస్ట్ 34 ఏళ్లకే ఏకంగా పది ప్రైవేట్ జెట్‌లు కలిగిన మహిళగా సంచలనం సృష్టించింది. ఇంతకీ ఎవరీమె అంటే..
ఆమె పేరు కనికా టేక్రివాల్. మార్వాడీ కుటుంబానికి చెందిన యువ పారిశ్రామికవేత్త. 1990లో జన్మించిన కనికా 20 ప్రాయంలో ప్రాణాంతక కేన్సర్‌తో పోరాటం చేసి గెలిచింది. ఆమె విధ్యాభాసపరంగా.. ప్రఖ్యాత లారెన్స్ స్కూల్ నుంచి ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత లవ్‌డేల్ అండ్ జవహర్‌లాల్, భోపాల్‌లోని నెహ్రూ సీనియర్ సెకండరీ స్కూల్‌లో హైస్కూల్ విద్యను పూర్తి చేసింది. ఇక కోవెంట్రీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి అవ్వగానే వినుత్నాంగా విమానాయన స్టార్టప్ జెట్‌సెట్ గోని ప్రారంభించింది.
అలా అంచలంచెలుగా ఎదుగుతూ 420 కోట్లు విలువ చేసే సామ్రాజ్యాన్ని స్థాపించింది. ప్రస్తుతం కనికా ఆ కంపెనీ సీఈవోగా శక్తిమంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా దూసుకుపోతోంది. అంతేగాదు ఏకంగా లక్ష మంది ప్రయాణికులును గమ్యస్థానాలకు చేర్చి శెభాష్ అని ప్రశంసలందుకుంది. ఇప్పటివరకు ఆమె కంపెనీ దాదాపు 6వేల విమానాలను విజయవంతంగా నడుపుతోంది. కేవలం 34 ఏళ్ల వయసుకే దాదాపు 10 ప్రైవేట్ జెట్‌లను కలిగిన అత్యంత ధనిక మహిళగా హురున్ రిచ్ లిస్ట్‌లో నిలిచింది.
అంతేగాదు భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డు, వరల్డ్ ఎకనామి ఫోరమ్ ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్ వంటి అవార్డులు అందుకుంది. చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్‌లను నిర్వహించే స్టార్టప్ వెంచర్‌ను సమర్థవంతంగా నిర్వహించి లాభల దిశగా నడిపించిన కనికా ప్రతిభాపాటవాలను అందరూ కొనియాడుతుండటం విశేషం.
అంతేగాదు విమానాల లీజింగ్ పరిశ్రమలో అగ్రగామిగా నిలిచి 'ది స్కై క్వీన్' పిలిపించుకుంది కనికా. ఇక ఆమె వ్యక్తిగత జీవితం వద్దకు వచ్చేటప్పటికీ కనికా హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఇక్కడ కనికా వినూత్న స్టార్టప్‌ని సమర్థవంతంగా నిర్వహించి మహిళలందరికీ స్ఫూర్తిగా నిలిచింది. పైగా మహిళలు ఎలాంటి వ్యాపారాన్నైనా సమర్థవంతంగా నిర్వహించగలరని ప్రూవ్ చేసింది.
(చదవండి: శస్త్రచికిత్స చేస్తుండగా 25 నిమిషాల పాటు ఆగిన గుండె..కట్‌చేస్తే..!)
Comments
Please login to add a commentAdd a comment