
పర్యాటక ప్రేమికులకు సుపరిచితమైన పేరు... లాహౌల్ స్పితి. చుట్టూ హిమాలయ పర్వతాలతో మంత్రముగ్ధులను చేసే ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఈ జిల్లా హిమాచల్‌ప్రదేశ్‌లో ఎక్కువ మంది సందర్శించేప్రాంతం. దేశంలోనే అతి తక్కువ జనాభా ఉన్న జిల్లాల్లో ఒకటి.
ఉపాధికోసం పురుషులు ఎక్కువగా వలస పోవడంతో ఈప్రాంతంలో మహిళల జనాభా ఎక్కువ. 2024 ఉపఎన్నికల్లో అనురాధ రాణా శాసనసభ్యురాలిగా ఎన్నికైంది. జిల్లాలో ఆమె రెండో మహిళా శాసనసభ్యురాలు. రాజకీయాల్లో పెరిగిన మహిళలప్రాతినిధ్యానికి ఆమె విజయం అద్దం పడుతుంది.
ఇక జిల్లా పాలనా యంత్రాంగం విషయానికి వస్తే... జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్... ఇల్మా ఆఫ్రోజ్, ఐఏఎస్ ఆఫీసర్ కిరణ్ బదన జిల్లా కలెక్టర్, ఆకాంక్ష శర్మ ‘సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్’గా కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తున్నారు... ఇలా ఎంతోమంది మహిళలు జిల్లా పాలన యంత్రాంగంలో కీలకమైన స్థానాల్లో ఉన్నారు.
కఠినమైన వాతావరణం, సుదూరప్రాంతం కారణంగా పోస్టింగ్‌కు ఎక్కువమంది ఇష్టపడని జిల్లాగా ఒకప్పుడు లాహౌల్ స్పితికి పేరుండేది. అయితే ఆ తరువాత
సంప్రదాయ ఇమేజ్ చెరిగిపోవడం మొదలైంది. దీనికి కారణం... మహిళా అధికారులు. వృత్తిపరమైన సంతృప్తి,ప్రత్యేకమైన సవాళ్లను ఇష్టపడే మహిళా అధికారులు ఎక్కువగా ఇష్టపడే జిల్లాగా ‘లాహౌల్ స్పితి’ గుర్తింపు పొందింది.