IAS officer
-
ఇంటింటా లక్ష్మీకళ
ఆడపిల్ల పుడితే ‘అయ్యో’ అంటూ సానుభూతి చూపేవాళ్లు మన దేశంలో ఎన్నోచోట్ల కనిపిస్తారు.మధ్యప్రదేశ్‌లో ఈ ధోరణి మరీ ఎక్కువ. ఆడిపిల్ల పుడితే ఆర్థికభారంగా భావించి పురిట్లోనే ప్రాణం తీసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తేవడానికి మన తెలుగు బిడ్డ, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ‘లాడ్లీ లక్ష్మీ యోజన’తో నడుం బిగించారు. ప్రతిష్ఠాత్మకమైన ‘బేటీ బచావో బేటీ పడావో’ కు స్ఫూర్తిగా నిలిచిన ఈ సంక్షేమ పథకాన్ని పదిహేను రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం...కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆడపిల్ల పుడితే భారంగా భావించడం నుంచి భ్రూణహత్యల వరకు ఎన్నో విషయాలపై మాట్లాడారు. ఆయన మాటల్లో ఎంతో ఆవేదన కనిపించింది. ‘ఈ పరిస్థితుల్లో మనం మార్పు తేవాలి’ అనే పట్టుదల కనిపించింది.ఇదీ చదవండి: Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలి‘మనం మాత్రం ఏం చేయగలం సర్, ప్రజలు అలా ఆలోచిస్తున్నారు!’ అని ఆ అధికారులు చేతులెత్తేస్తే కథ కంచికి వెళ్లినట్లే. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. అక్కడినుంచే మొదలైంది. ముఖ్యమంత్రితో సమావేశం అయిన వారిలో ఐఏయస్ అధికారి నరహరి కూడా ఉన్నారు. ఒక సమస్యకు పది రకాల పరిష్కార మార్గాలు ఆలోచించడం ఆయన సొంతం.‘మనం ఏం చేయలేమా!’... సీఎం ఆవేదనపూరిత మాటలు నరహరి మనసులో సుడులు తిరిగాయి.‘కచ్చితంగా చేయాల్సిందే. చేయగలం కూడా’ అని ఒకటికి పదిసార్లు అనుకున్నారు. పేదింటి బిడ్డ అయిన నరహరికి పేదోళ్ల కష్టాలు తెలియనివేమీ కాదు. ఆడపిల్ల అంటే పనిగట్టుకొని వ్యతిరేకత లేకపోయినా పేదరికం వల్ల మాత్రమే ‘ఆడబిడ్డ వద్దు’ అనుకునే వాళ్లను ఎంతోమందిని చూశారు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి హరియాణ, పంజాబ్... మొదలైన రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాలు తిరిగారు. ఎన్నో కోణాలలో ఎన్నో ప్రశ్నలు వేశారు.‘మేం బతకడమే కష్టంగా ఉంది. ఇక ఆడబిడ్డను ఎలా బతికించుకోవాలి సారు’ అనే మాటలను ఎన్నో ప్రాంతాలలో విన్నారు. వారికి ఆర్థిక భరోసా ఇస్తే సమస్యకు పరిష్కారం దొరికినట్లే కదా! అలా మొదలైందే లాడ్లీ లక్ష్మీ యోజన(గారాల కూతురు). ఇది సంక్షేమ పథకం మాత్రమే కాదు... సామాజిక మార్పు తెచ్చిన శక్తి. ఆడపిల్ల భారం అనే భావన తొలగించేందుకు వారికి ముందు ఆర్థిక భరోసా కల్పించాలి. అదే సమయంలో అమ్మాయిలను విద్యావంతులను చేయాలి... ఈ కోణంలో పథకానికి రూపకల్పన చేశారు. (అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు)‘పుట్టగానే అమ్మాయిని లక్షాధికారి చేస్తాం’ అని ప్రకటించారు. అయితే ఆ డబ్బు చేతికందడానికి షరతులు విధించారు. అమ్మాయి ఇంటర్ పూర్తి చేయాలి. 5వ తరగతి పూర్తి చేస్తే రూ.2000, 8వ తరగతి పూర్తి చేస్తే రూ.4000 చొప్పున ప్రతి తరగతికి బోనస్ చెల్లింపులు చేశారు. అమ్మాయికి పద్దెనిమిది ఏళ్లు వచ్చాక మాత్రమే ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ కు సంబంధించిన డబ్బులు చెల్లించేవారు. అలా పథకం వందశాతం విజయవంతమైంది.ఆడపిల్ల పుడితే రైఫిల్ లైసెన్స్!మధ్యప్రదేశ్‌లోని చంబల్లోయప్రాంతాల్లో కొన్ని కులాల ప్రజలు రైఫిల్‌ను సామాజిక హోదాగా భావిస్తారు. మగవారు సైకిల్ మీద తిరిగినా భుజాన తుపాకీ ఉండాల్సిందే! ఆడపిల్లలను పురిట్లోనే చంపేసేవారు కూడా ఆప్రాంతాల్లో ఎక్కువే. ఆప్రాంతాలలో ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ అంతగా ఫలితం ఇవ్వలేదు. దీంతో ప్రతి 1000 మంది బాలురకు 400 మంది బాలికలే మిగిలారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆయా కులాల వారితో సమావేశం నిర్వహించారు. ‘ఆడపిల్లలను మీరు వద్దనుకుంటూ పోతే వారే కాదు చివరికి మీ కులాలు త్వరలోనే అంతరించి పోవడం ఖాయం’ అని కులపెద్దలకు చెప్పారు. దీంతో వారిలో మార్పు వచ్చింది. అయితే తమకు తుపాకీ లైసెన్స్ లేకుండా ఉండలేమన్నారు. దీంతో ఆడపిల్ల పుడితే రైఫిల్ లైసెన్స్ అని నిబంధన విధించారు!2007 నుంచి 50 లక్షల మంది ఆడపిల్లలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. బాలికల లింగ నిష్పత్తి 400 నుంచి 950కి పెరిగింది. ‘లాడ్లీ లక్ష్మీ యోజన’ ద్వారా సామాజిక ఫలాలు అందుతున్న తీరును అధ్యయనం చేసి ఎంతోమంది పీహెచ్డీ చేశారు.లింగ వివక్షకు తావు లేని సమాజాన్ని కల కంటున్నారు నరహరి. అది చారిత్రక అవసరం. తక్షణ అవసరం.భ్రూణహత్యల నివారణకు...‘లాడ్లీ లక్ష్మీ యోజన’ పథకం విజయవంతంగా అమలు చేస్తూనే మరోవైపు భ్రూణహత్యలపై దృష్టి సారించారు. ఇందుకోసం ఆశావర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, నర్సులు, కిందిస్థాయి సిబ్బందితో విస్తృతమైన విజిలెన్స్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. తప్పుదారి పట్టిన వైద్యులపై కేసులు నమోదు చేశారు. దీంతో చట్టాన్ని ఉల్లంఘించిన వైద్యులు దారికొచ్చారు.పేదింటి బిడ్డఎంతోమంది ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపిన నరహరిది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్. నిరుపేదింట జన్మించిన నరహరి కష్టపడి చదివి ఐఏఎస్ అయ్యారు. ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నారు. జన్మభూమికి ఏదైనా చేయాలనే ఆశయంతో ‘ఆలయ ఫౌండేషన్ ’ స్థాపించి స్థానికంగా విద్య, వైద్య, ఆరోగ్య సంబంధమైన సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు.– భాషబోయిన అనిల్‌కుమార్, సాక్షి ప్రతినిధి కరీంనగర్ -
ఏసీబీ విచారణకు హాజరైన IAS అధికారి అరవింద్
-
సన్యాసిలా జీవించిన ఆమె ఇవాళ ఐఏఎస్ అధికారిణి..ఏకంగా మాజీ సీఎం..!
రాజస్థాన్(Rajasthan)కి చెందిన బిష్ణోయ్ తెగ(Bishnoi community) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారంతా పర్యావరణ యోధులు. వారి జీవన విధానమే పచ్చదనంతో మమేకమై ఉంటుంది. వన్యప్రాణులకు హాని కలిగించిన జీవన విధానం వారి సొంతం. అలాంటి కమ్యూనిలో తొలి ఐఎస్ అధికారిణిగా ఓ మహిళ నిలిచింది. తొలుత సన్యాసిలా జీవించిన అమ్మాయి కాస్త అందరికి పెద్ద షాకిచ్చేలా ఘనంగా పెళ్లి చేసుకుంది. ఎవరామె..? ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..రాజస్థాన్‌లోని అజ్మీర్‌కి చెందిన పరి విష్ణోయ్ బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన తొలి ఐఏస్ అధికారిణిగా నిలిచింది. కేవలం 23 ఏళ్ల వయసుల్లోనే ఈ ఘనత సాధించింది. అయితే ఆమె విజయ తీరాలను అంత సులభంగా చేరుకోలేదు. ఫిబ్రవరి 26, 1996న బికనీర్‌లోని కక్రా గ్రామంలో జన్మించిన పరి బిష్ణోయ్ సంప్రదాయంలోనే పెరిగారు. ఆమె తండ్రి మణిరామ్ బిష్ణోయ్ న్యాయవాది కాగా, తల్లి సుశీలా బిష్ణోయ్ పోలీసు అధికారి. ఆమె ఇంటర్ నుంచి ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రారంభించింది. దీంతోపాటు అజ్మీర్‌లోని ఎండీఎస్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్-గ్రాడ్యుయేషన్ కూడా చేస్తుండేది. అలా ఆ ఒక్క యూపీఎస్సీ తోపాటు సంబంధిత పోటీ పరీక్షలన్నీ రాసింది. అలా పరి యూజీసీ నెట్ జెఆర్ఎఫ్ పరీక్షలో కూడా మంచి ఉత్తీర్ణత సాధించింది. అయితే సివిల్స్ ఎగ్జామ్ తొలి రెండు ప్రయత్నాలలో పరి ఘోరంగా విఫలమైంది. మూడో ప్రయత్నంలో తన కలను సాకారం చేసుకుంది. ఇక పరి తన జీవన శైలి అచ్చం సన్యాసిని పోలి ఉంటుందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. అంతేగాదు ఆమె చూడటానికి కూడా చాలా వైరాగ్యంగా ఉన్నట్లుగా ఆహార్యం ఉండేది. అయితే అందరికీ షాక్ ఇస్తూ..2023లో పరి విష్ణోయ్ మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌ని వివాహం చేసుకున్నారు. ఇక ఆమె భర్త భవ్య హర్యానాలోని అడంపూర్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. భవ్య బిష్ణోయ్ తండ్రి, కుల్దీప్ బిష్ణోయ్ హర్యానా జనహిత్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు. ఈ దంపతులకు పిల్లలు లేరు. ఇరువురు తమ కెరీర్లలో ఉన్నత శిఖరాలను చేరుకునేలా శ్రమిస్తున్నారు. తొలుత 2022లో సహజవాయువు మంత్రిత్వశాఖ(Ministry of Natural Gas)లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసింది. ఆ తర్వాత గ్యాంగ్‌టక్(Gangtok)లో ఎస్డీఎంగా పనిచేసింది. ప్రస్తుతం హార్యానాలో సేవలందిస్తోంది. View this post on Instagram A post shared by Pari Bishnoi (@pari.bishnoii) (చదవండి: చలికాలం తప్పక తీసుకోవాల్సిన సూప్ ..!) -
చంద్రబాబు పాత కేసులు..
-
చంద్రబాబు పాత కేసులు..ఐఏఎస్‌లపై ఒత్తిళ్లు..?
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు పాత కేసుల్లో సాక్షులైన ఐఏఎస్ అధికారులను ఒత్తిళ్లకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. బాబు అవినీతి కేసుల్లో ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారులను మళ్లీ స్టేట్మెంట్ ఇవ్వాలని సీఐడీ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.స్కిల్ డెవలప్మెంట్,ఫైబర్ నెట్,అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ కేసుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్,సిహెచ్ శ్రీధర్ గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే తాజాగా వీరిని ఫైబర్ నెట్ స్కామ్,అమరావతి అసైన్డ్ భూముల కేసుల్లో మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఐఏఎస్‌లపై సీఐడీ ఒత్తిడి చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. సీఆర్పీసీ 164 సెక్షన్ కింద స్టేట్మెంట్ రికార్డ్ చెయ్యడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం.ఇదీ చదవండి: సూపర్‌సిక్స్‌కు ఎగనామం -
సీఎస్‌గా విజయానంద్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా విజయానంద్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన్ని సీఎస్‌గా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరబ్‌కుమార్ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన సీఎస్‌గా నవంబర్ 30 వరకు కొనసాగనున్నారు. -
డెంటిస్ట్ కాస్త ఐఏఎస్ అధికారిగా..! కానీ ఏడేళ్ల తర్వాత..
డెంటిస్ట్‌గా సాగిన ప్రయాణం అనూహ్యంగా ఐఏఎస్ లక్ష్య సాధన వైపుకి మారింది. పట్టుదలతో ఐఏస్ సాధించి.. తన కలను సాకారం చేసుకుంది. అంతలోనే ఇది కాదు నా గమ్యం అంటూ ఆ అత్యున్నత పదవికి రాజీనామా చేసేసింది. కేవలం టీచింగ్‌పై ఉన్న అభిరుచితో ఆమె తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయానికి అందరూ విస్తుపోయారు. ఇదేంటి అని అంతా నోరెళ్లబెట్టారు..కానీ ఆమె మాత్రం మనసుకు నచ్చింది చేయడంలో కలిగే అనుభూతి వేరేలెవెల్ అంటోంది. ఇంతకీ ఎవరామె..? అంతటి అత్యున్నత హోదాను ఎందుకు తృణప్రాయంగా వదిలేసిందంటే..?ఢిల్లీలోని సదర్ ప్రాంతానికి చెందిన తనూ జైన్ సాహసమే ఊపిరి అన్నట్లుగా ఊహకందని నిర్ణయాలతో అందర్నీ విస్తుపోయేలా చేస్తుంటారామె. ఆమె ప్రతి ఆలోచన వెనుక ఎంతో పెద్ద లక్ష్యం, కృతనిశ్చయాలు ఉంటాయి. అవి ఆలోచింపచేసేలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇక జైన్ పాఠశాల విద్యని కేంబ్రిడ్జ్ స్కూల్లోనే పూర్తి చేసింది. ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీని చదువుతూనే సివిల్స్‌పై దృష్టిసారించింది. తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్‌లో విజయం సాధించినప్పటికీ మెయిన్స్‌లో చాలాసార్లు వైఫల్యాలను ఎదుర్కొంది. అయినా.. పట్టుదలతో 2014లో మూడో ప్రయత్నంలో ఆల్ ఇండియా ర్యాంక్ 648ని సాధించి.. తన కలను సాకారం చేసుకుంది. ఆ తర్వాత జైన్ సివిల్ సర్వీస్‌కి సంబంధించి.. వివిధ హోదాల్లో ఏడేళ్ల పాటు సేవలందించారు. అయితే ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న మక్కువతో అంతటి అత్యున్నత హోదాని వదులుకోవాలనే అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కూడా తనూ తనలా యూపీఎస్సీ సన్నద్ధమయ్యేవాళ్లు ఎదుర్కొనే సవాళ్లలో.. అండగా నిలబడాలనే దృక్పథంతో ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. "సివిల్ సర్వీస్‌లో ఉద్యోగం సాధించాలన్న తన కల నెరవేరిపోయింది. అలాగే తనలా ఇతరులు కూడా తమ డ్రీమ్‌ని నెరవేర్చుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చింది." జైన్. ఆ నేపథ్యంలోనే ఆమె 'ఐసీఎస్ తథాస్తు' అనే సివిల్స్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించింది. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవారికి మార్గదర్శకం చేయడమే గాక ప్రేరణాత్మక ప్రసంగాలు, ఆచరణాత్మక సలహాలతో ఆకట్టుకుంటారామె. ఆ వైవిధ్యభరితమైన బోధనాపద్ధతుల కారణంగా ఆమెకు సోషల్‌మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేగాదు ఇన్‌స్టాలో ఏకంగా ఎనిమిది లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్నారు జైన్. మాక్ ఇంటర్వ్యూలు, ప్రిపరేషన్ స్టాటజీలను మెరుగుపరుచుకోవడంపై మంచి మంచి సలహలిస్తుంటారు జైన్. తనలా ఇతరులు కూడా సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షించే వ్యక్తులు దొరకడం అత్యంత అరుదు కదూ..!.(చదవండి: వివాహాల గూఢచారి...భావనా పాలివాల్) -
20 ఏళ్లకే డాక్టర్, 22 ఏళ్లకు ఐఏఎస్ ఆఫీసర్..ఇవాళ ఏకంగా..!
ఒక విజయాన్ని అందుకోగానే హమ్మయ్యా..! అనుకుంటాం. ఏదో చాలా సాధించేశాం అన్నంతగా ఫోజులు కొడతాం. కానీ కొందరూ మాత్రం మహర్షి మూవీలో హీరో మహేష్ బాబు చెప్పినట్టుగా "సక్సెస్ అనేది గమ్యం కాదు, అదొక ప్రయాణం" అన్నట్లుగా విజయపరంపరతో దూసుకుపోతుంటారు. అబ్బా.. ! ఎన్ని విజయాలు అందుకున్నాడు..హీరో అంటే అలాంటి వాళ్లేనేమో అనే ఫీల్ కలుగుతుంటుంది మనకి. అలా వరుస విజయాలతో విస్మయానికి గురి చేస్తూ..ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు రాజస్థాన్‌కి చెందిన రోమన్ సైనీ. అతడి సక్సెస్ జర్నీ చూస్తే.. సాధించేయాలన్న పౌరుషం, కసి తన్నుకు రావాల్సిందే అన్నట్లుగా ఉంటుంది.రాజస్థాన్‌లో కోట్పుట్లీలోని రైకరన్పురా గ్రామానికి చెందిన రోమన్ సైనీ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. తల్లి గృహిణి, తండ్రి ఇంజనీర్. మన రోమన్ సక్సెస్ జర్నీ 16 ఏళ్ల వయసులో ఎయిమ్స్‌లో అర్హత సాధించడంతో ప్రారంభమయ్యింది. అలా రోమన్ 21 ఏళ్లకి ఎంబీబీఎస్ పూర్తిచేసి, డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయినా ఏదో తెలియని వెలితి వెన్నాడుతూ ఉండేది. అప్పుడే ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్‌కి ప్రిపేరయ్యాడు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. తొలి పోస్టింగ్ మధ్యప్రదేశ్ రావడంతో అక్కడ జిల్లా కలెక్టర్‌గా పనిచేయడం ప్రారంభించారు. అయినా రోమన్ తన లక్ష్యాన్ని సాధించిన అనుభూతి కలగలేదు. ఇంకా ఏదో తెలియని అసంతృప్తి మెదులుతూనే ఉంది. ఇక లాభం లేదనుకుని ఐఏఎస్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి 2015లో గౌరవ్ ముంజాల్, హేమేష్ సింగ్‌లతో కలిసి సొంతంగా అన్ అకాడమీ అనే కోచింగ్ సెంటర్‌ని ప్రారంభించాడు.ప్రారంభంలో ఇదొక యూట్యూబ్ ఛానెల్. క్రమంగా ఇది ఒక ఎడ్టెక్గా మారి.. సివిల్స్ స్టడీ మెటీరియల్‌కి ప్రసిద్ధిగాంచింది. అలా ఇది కాస్త అన్ అకాడమీ సార్టింగ్ హ్యాట్ టెక్నాలజీస్ కంపెనీగా మారింది. ప్రస్తుతం దీని విలు రూ. 2600 కోట్లు. యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి సరసమైన ధరల్లో నాణ్యమైన కోచింగ్‌ని అందించే స్టడీ సెంటర్‌గా పేరుతెచ్చుకుంది. ఈ అకాడమీ నుంచి ఏటా వేలాది మంది విద్యార్థులు కోచింగ్ పొందుతున్నారు. రోమన్ అచంచలమైన కృషికి నిదర్శనంగా చాలా తక్కువ వ్యవధిలోనే మంచి కోచింగ్ సెంటర్‌గా పేరుతెచ్చుకుంది. అంతేగాదు ఈ అకాడమీతో రోమన్ ఆర్జించే జీతం తెలిస్తే విస్తుపోతారు. దగ్గర రూ. 88 లక్షల పైమాటే..!. ఇది కదా సక్సెస్‌కి సరైన నిర్వచనం..!.(చదవండి: వామ్మో ఇదేం సంస్కృతి..! ‘డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్’ అంటున్న యువత..) -
సార్‌ను కలవాలంటే సవాలే!
సాక్షి, హైదరాబాద్: అది జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం. కమిషనర్‌ను కలిసేందుకు వెళ్లాలనుకుంటున్నవారికి కార్యాలయ ద్వారం ఎదుటే ఉన్న పోలీసులు అడ్డుకుంటారు. మీకు ఏం పని? అని అడుగుతారు. కమిషనర్ సార్‌ను కలవాలి. సర్కిల్, జోన్లో పరిష్కారం కానందున ఇక్కడికి వచ్చాం అంటే.. మీ సమస్య ఏమిటో అక్కడ చెప్పండి.. అంటూ దగ్గర్లోనే ఉన్న కంప్యూటర్ ఆపరేటర్‌ను చూపుతారు. అక్కడ తమ సమస్య చెప్పడానికి క్యూకట్టి చెబితే, నమోదు చేసుకొని ఇక వెళ్లమన్నట్లు సూచిస్తారు. సార్ అనుమతిస్తే కార్యాలయ సిబ్బంది మీకు ఫోన్ చేస్తారు. అప్పుడు వచ్చి కలవండి అని చెప్పి పంపిస్తారు. .. ఇదీ రెగ్యులర్ కమిషనర్‌గా ప్రభుత్వం బాధ్యతలప్పగించాక, ఝార్ఖండ్ ఎన్నికల విధుల నుంచి తిరిగి వచ్చాక జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలవాలంటే సందర్శకులకు ఎదురవుతున్న అనుభవం. ఝార్ఖండ్ నుంచే వర్చువల్‌గా ఆదేశాలు జారీ చేస్తూ చురుగ్గా పనులు చేసిన కమిషనర్ శైలిని చూసిన నగర ప్రజలు అప్పుడు అహో అనుకున్నారు. ఇప్పుడు సార్‌ను కలవాలనుకుంటున్న ఫిర్యాదుదారులు అయ్యో ఇదేంటి? అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఎస్పీఎఫ్తో భద్రత.. బహుశా జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కమిషనర్ పేషీలో విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఎస్ఐ, మహిళా పోలీసులు కూడా వీరిలో ఉన్నారు. కమిషనర్‌ను కలిసేందుకు వస్తున్నవారిలో కొందరు అక్కడున్న పోలీసులను చూసి వెనకడుగు వేస్తున్నారు. వెళ్లేందుకు ముందుకొచ్చేవారిని ఏం పని కోసం వచ్చారో తెలుసుకొని కమిషనర్ పేషీలోని అధికారుల వద్దకు పంపిస్తున్నారు. వారు విషయాన్ని బట్టి అపాయింట్మెంట్ కోసం వివరాల నమోదుకు కంప్యూటర్ ఆపరేటర్ వద్దకు పంపిస్తున్నారు. అపాయింట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే విషయాన్ని బట్టి ఒక రోజు నుంచి వారం వరకు పట్టవచ్చు. లేదా అసలు రాకపోవచ్చని చెబుతున్నారని కమిషనర్‌ను కలిసేందుకు వచ్చిన వారిలో శ్రీనివాస్ అనే అతను చెప్పాడు. తాను అక్రమ నిర్మాణాల గురించి ఫిర్యాదు చేసేందుకు ఎల్బీనగర్ నుంచి వచ్చానని తెలిపాడు. మరో వ్యక్తి తాను కొన్ని రోజుల క్రితం వచ్చి వివరాలు ఇచ్చి వెళ్లానని, ఇంకా కాల్ రాకపోవడంతో కనుక్కునేందుకు వచి్చనట్లు చెప్పాడు. మంత్రులు ప్రజలను కలుస్తున్నా.. ఓవైపు తాము అధికారంలోకి వచ్చాక ప్రజలు సీఎం దాకా ఎవరినైనా కలిసే అవకాశం లభించిందని, ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చామని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు.. మంత్రులు సైతం గాందీభవన్ వేదికగానూ ప్రజా సమస్యలు స్వీకరిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు, ఇబ్బందులు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణిలో సమస్యలు పరిష్కారమవుతున్నాయని, ఎన్ని ఇబ్బందులెదురైనా ఆపబోమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం పేర్కొన్నారు. కోటిమంది సమస్యలు తీర్చే బాధ్యతల్లో ఉన్న జీహెచ్ఎంసీ కమిషనర్ మాత్రం ప్రజలు తనను కలిసేందుకు సుముఖంగా లేరు. సార్ బిజీగా ఇతర పనుల్లో ఉన్నారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. దీన్ని చూసి ప్రజాపాలన అంటే ఇదేనా? అని విస్తుపోతున్న వారూ ఉన్నారు. గతంలో బల్దియా కమిషనర్లుగా పనిచేసిన వారెవరూ ఇలా వ్యవహరించలేదు. మరి ప్రజాపాలన అంటున్న ప్రభుత్వంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఇలంబర్తికి స్ఫూర్తి ఎవరో ఆయనకే తెలియాలి. రాజకీయ అండ? జీహెచ్ఎంసీకి రాకముందు ఇలంబర్తి రవాణా శాఖలో పని చేశారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్నారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన వ్యవహారాల్లోనూ మంత్రిగా ఆయనే సమీక్షలు చేస్తున్నారు. కమిషనర్‌కు మంత్రి అండదండలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ప్రజలను కలవని వ్యవహార శైలితో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఆయన అలా.. ఈయన ఇలా ప్రస్తుతం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న దానకిశోర్.. తాను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పని చేసిన కాలంలో తనను కలిసేందుకు వస్తున్న వారందరికీ కూర్చునేందుకు సరిపడా కుర్చీలు లేకపోవడం గుర్తించి.. వృద్ధులు తదితరులు ఎక్కువసేపు నిలబడి ఉండటం చూడలేక సందర్శకుందరికీ కూర్చునే సదుపాయం ఉండేలా ప్రత్యేక గది, కుర్చీలు ఏర్పాటు చేయించారు. ఇలంబర్తి మాత్రం సందర్శకులనే పేషీలోకి రానీయడం లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. -
సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబుని టార్గెట్ చేసిన చింతకాయల విజయ్
-
దేశంలోనే రిచెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్.. జీతం రూపాయి!
దేశంలో ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వారి నేపథ్యం, వ్యక్తిగత విషయాలపైనా చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో పలువురు ఐఏఎస్ అధికారులు వార్తల్లో నిలుస్తుంటారు. వారిలో హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అమిత్ కటారియా ఒకరు. ఇటీవల ఆయన వార్తల్లోకి వచ్చారు.ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్న అమిత్ కటారియా దేశంలోనే అత్యంత సంపన్న ఐఏఎస్ అధికారులలో ఒకరిగా వెలుగులోకి వచ్చారు. ఈ ప్రత్యేకత గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. అంత సంపన్నుడైన ఆయన సర్వీస్‌లో చేరిన కొత్తలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకున్నారు. దీంతో ప్రజాసేవ పట్ల తనకున్న అంకితభావాన్ని ప్రదర్శించారు.అమిత్ కటారియా విద్యా నేపథ్యం కూడా అద్భుతంగా ఉంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. కటారియా తన పాఠశాల విద్యను ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యారు. 2003లో యూపీఎస్ఈ పరీక్షలో 18వ ర్యాంక్ సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చోటు సంపాదించారు.ఉన్నత వ్యాపార కుటుంబంఅమిత్ కటారియా రియల్ ఎస్టేట్‌లో స్థిరపడిన వ్యాపార కుటుంబం నుండి వచ్చారు. వీరికి ఢిల్లీ, సమీప ప్రాంతాలలో మంచి లాభాలు ఇస్తున్న వెంచర్లు ఉన్నాయి. సంపన్నుడైనప్పటికీ కటారియా తన కెరీర్ ప్రారంభంలో సర్వీస్‌లో చేరిన తర్వాత కేవలం రూపాయి వేతనం తీసుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు.అయితే కొన్ని సందర్భాలలో తన చర్యలతో వివాదాస్పదమూ అయ్యారు. 2015లో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా స్వాగతం పలుకుతూ సన్ గ్లాసెస్ ధరించడం వివాదాస్పదం అయ్యింది. దీన్ని ప్రోటోకాల్ ఉల్లంఘనగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది.ఇక వ్యక్తిగత విషయానికి వస్తే అమిత్ కటారియా కమర్షియల్ పైలట్ అయిన అశ్మిత హండాను వివాహం చేసుకున్నారు. ఈ జంట తరచుగా తమ వ్యక్తిగత విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కాగా అమిత్ కటారియా నెట్‌వర్త్ సుమారు రూ.8.90 కోట్లని అంచనా. -
తెలంగాణ ఐఏఎస్ అధికారులపై ప్రభుత్వం వరుస ఆంక్షలు
-
సోషల్ మీడియాకు దూరం.. సివిల్స్‌కు దగ్గర.. ఐఏఎస్ అధికారి నేహా సక్సెస్ స్టొరీ
ఈ ఆధునికయుగంలో మొబైల్ ఫోన్, సోషల్ మీడియా.. ఈ రెండూలేని మన రోజువారీ జీవితాన్ని ఊహించలేం. అయితే సాంకేతిక పరిజ్ఞానం సృష్టిస్తున్న అద్భుతాలు మన దృష్టిని లక్ష్యాల నుంచి పక్కకు మళ్లీస్తున్నాయి. దీంతో చాలామంది తమ కెరియర్, జీవిత లక్ష్యాల సాధనలో వెనుకబడుతున్నారు. దీనిని గుర్తించిన నేహా బయద్వాల్ తన కెరియర్ ఉన్నతి కోసం కఠిన నిర్ణయం తీసుకున్నారు.యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ)లో తన మొదటి ప్రయత్నం విఫలమైనప్పుడు నేహా బయద్వాల్ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దేశంలోని అత్యంత కష్టతరమైన పరీక్షల్లో ఒకటైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో విజయం సాధించేందుకు మూడేళ్ల పాటు మొబైల్‌ఫోన్‌కు దూరంగా ఉంటూ, ప్రిపరేషన్ కొనసాగించాలని ఆమె నిశ్చయించుకున్నారు.రాజస్థాన్‌లోని జైపూర్‌లో జన్మించిన నేహా.. జైపూర్‌లో తన పాఠశాల విద్యను, భోపాల్‌లో హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం కారణంగా నేహా తరచుగా పాఠశాలలు మారవలసి వచ్చేది. నేహా తండ్రి, శ్రవణ్ కుమార్ సీనియర్ ఆదాయపు పన్నుశాఖ అధికారి. ఆయనే నేహా ఐఏఎస్ అధికారి కావడానికి ప్రేరణగా నిలిచారు. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన ఆమె యూపీఎస్సీ సీఎస్ఈ కోసం ప్రిపరేషన్ ప్రారంభించారు. తన మొదటి మూడు ప్రయత్నాలలో నేహా పరీక్షను క్లియర్ చేయడంలో విఫలమయ్యారు.ఈ నేపధ్యంలో సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ వినియోగం తన దృష్టిని మరలుస్తున్నాయని గ్రహించిన ఆమె వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మూడేళ్ల పాటు యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం వాటికి దూరంగా ఉన్నానని నేహా మీడియాకు తెలిపారు. తన ప్రిపరేషన్ సమయంలో నేహా స్నేహితులు, బంధువులకు కూడా దూరంగా ఉన్నారు. ఇలా అనేక ఒడిదుడుకులతో పోరాడి, తన సామాజిక జీవితాన్ని కూడా త్యాగం చేసిన నేహా.. 2021లో తన నాల్గవ ప్రయత్నంలో యూపీఎస్సీ సీఎస్ఈని ఛేదించి, 569 ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్) సాధించి, తన కలను సాకారం చేసుకున్నారు. నేహా ఐఎస్ అధికారిగా ఎంపికైనప్పుడు ఆమె వయసు 24 మాత్రమే. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలో నేహా ఇంటర్వ్యూలో 151 మార్కులతో కలిపి మొత్తం 960 మార్కులు సాధించారు. ఈ విజయం తరువాత నేహా బయద్వాల్ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 28 వేల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.ఇది కూడా చదవండి: ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన సిక్కోలు తేజం.. ఇదో సువర్ణావకాశం -
కాగ్ అధిపతిగా తెలుగు అధికారి సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నూతన అధిపతిగా కొండ్రు సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంజయ్ మూర్తి చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులు హాజరయ్యారు.ఇక ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్‌మూర్తి అరుదైన ఘనత సాధించారు. ఇప్పటి వరకు కాగ్ అధిపతిగా ఉన్న గిరీశ్ చంద్ర ముర్ము పదవీ కాలం ఈ నెల 20తో ముగిసింది. దీంతో తదుపరి కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తిని రాష్ట్రపతి ఈనెల 18న నియమించారు.కాగా అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు సంజయ్‌మూర్తి. కేఎస్ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరఫున అమలాపురం నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలందించారు.ఇక 1964 డిసెంబరు 24న జన్మించిన ఆయన.. మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివారు. మూర్తి 1989లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు ఎంపికయయారు. ఆయన ప్రస్తుతం కేంద్రంలో ఉన్నత విద్యా మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం అమలులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఐఏఎస్ అధికారిగా ఆయన వచ్చే నెలలోనే ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ స్థానంలో నియమితులైనవారు గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి వీలుంది. -
ఆయన జీవితం స్ఫూర్తిమంతం
ఈ దేశంలో నిజమైన పోరాట యోధుల చరిత్ర వెలుగులోకి రాకమునుపే, నకిలీ విజేతలు వెలిగిపోయారు. ఇప్పుడు ఆ మూసను బద్ధలుకొట్టడమే ఈ తరం చేయాల్సిన పని. ‘నా అన్వేషణలో కత్తి చంద్రయ్య’ అనే జీవితగాథ రాసిన కత్తి కళ్యాణ్ చేసింది ఇదే! ఈ పుస్తకాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్తే ఒక మహామనిషితో కరచాలనం చేస్తాం. తెలుగు నేల నుంచి ఆవిర్భవించిన తొలి దళిత కలెక్టర్ ‘పేదల కలెక్టర్’గా ఎట్లా ఎదిగి వచ్చాడో తెలుసుకుంటాం. ఆయన చేసిన సేవలకు ఆయనే గనుక ఉన్నతవర్గంలో పుట్టి ఉంటే ఈ పాటికి ఆయన పేరు నలుదిశలా మార్మోగేది.1924లో నిరుపేద రైతుకూలీ కుటుంబంలో జన్మించిన కత్తి చంద్రయ్య చదువే లోకంగా ఎదిగి వచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీతో పాటు మద్రాసులో సైతం ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రకాశం జిల్లా ఏర్పడిన తరువాత మొదటి కలెక్టర్‌గా ఆయన పనిచేశారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సైతం ఆయన కలెక్టర్‌గా సేవలందించారు. ఏ జిల్లాలో ఉద్యోగం చేసినా తనదైన మార్క్ ఉండేది. సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించాలన్నా, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడి, పేదలకు పంచాలన్నా కత్తి చంద్రయ్యకే సాధ్యం అనేలా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు.ఆయనలో ఒక గొప్ప మేధావి ఉన్నాడు. పురాతన చరిత్రను తెలుసు కోవడం, పత్రికలకు, మ్యాగజైన్లకు వ్యాసాలరూపంలో రాసి ప్రచారం చేయడం అభిరుచిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా మంచి పాఠకుడిగా ఆయన అనేక పుస్తకాలు అధ్యయనం చేశారు. అలాగే తన పరిశోధనలో తెలుసుకున్న విషయాలను ఈ సమాజం ముందు పెట్టడానికి విలువైన రచనలు చేశారు. ‘దళిత్ ఎకానమీ’ అనే రచన అందులో ఒకటి. తెలుగు సాహిత్యంపై ఉన్న మక్కువతో వేమన వంటి ప్రజా కవులను గురించి కూడా వ్యాసాలు రాశారు.చదవండి: కలలూ కన్నీళ్ళ కలబోతలో పూలూ ముళ్ళూ!ఈ పుస్తకంలో చంద్రయ్య కాలం నాటి దినపత్రికల కట్టింగ్లను పొందు పరిచాడు రచయిత. అది చాలా శ్రమతో కూడుకున్న పని. ఇవాళ పరాజిత జాతుల చరిత్రలన్నీ వెలికితీసే పని మరింతగా జరగాలి. నిజం చెప్పులేసు కునేలోపే, అబద్ధాలు ప్రపంచమంతా తిరిగి వస్తున్న యుగంలో మనం జీవి స్తున్నాం. నిజాలకు పట్టం కట్టాలి, నిజమైన ఆదర్శనీయుల చరిత్రను ఈ సమాజానికి అందించాలి. ఈ పుస్తకం విరివిగా ప్రజల్లోకి వెళ్లాలి. ముఖ్యంగా విద్యార్థులు చదవాలి. చంద్రయ్య పేరు మీద ఉత్తమ అధికారులకూ, పరిశోధ కులకూ, చరిత్ర రచయితలకూ అవార్డులివ్వాలి. ఇందుకోసం ప్రజలు, ప్రభు త్వాలు పూనుకోవాలి. ఆ దిశలో వ్యవహరించడానికి అవసరమైన చైతన్యం కలిగించడానికి ఈ పుస్తకం ఒక దారి చూపుతుంది.– డాక్టర్ పసునూరి రవీందర్, కేంద్ర సాహిత్య అకాడెమియువ పురస్కార గ్రహీత -
‘కలెక్టర్ బ్రో’ సహా ఇద్దరు ఐఏఎస్‌ల సస్పెన్షన్
తిరువనంతపురం: కేరళలో ఇద్దరు ఐఏఎస్ అధికారులపై వేటుపండింది. క్రమశిక్షణ ఉల్లంఘన కారణంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం సోమవారం ఇద్దరు ఐఏఎస్ అధికారులు కె గోపాలకృష్ణన్, ఎన్ ప్రశాంత్‌లను సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మత ఆధారిత ప్రభుత్వ అధికారుల వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసినందుకు ఐఏఎస్ గోపాలకృష్ణను సస్పెండ్ చేయగా, సోషల్ మీడియాలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని విమర్శించినందుకు ఐఏఎస్ ప్రశాంత్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌కు ‘‘కలెక్టర్ బ్రో’’గా సోషల్ మీడియాలో పాపులారిటీ ఉంది. అయితే.. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. తన మొబైల్ ఫోన్‌ను గుర్తుతెలియని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని ఐఏఎస్ అధికారి కె. గోపాల్‌కృష్ణన్ అన్నారు. తన అనుమతి లేకుండా మతపరమైన వాట్సాప్ గ్రూపులను సృష్టించారని ఐఏఎస్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఐఏఎస్ అధికారి వాదనలను పోలీసు దర్యాప్తు అధికారి తోసిపుచ్చారు. ఆయన ఫోన్ హ్యాక్ చేయబడిందని తమకు ఎటువంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ పరీక్ష కోసం పరికరాన్ని సమర్పించే ముందు గోపాలకృష్ణన్ మొబైల్ ఫోన్‌ను చాలాసార్లు రీసెట్ చేసినట్లు పోలీసులు వెల్లడించినట్లు తెలిపారు. -
GHMC commissioner: వర్క్ ఫ్రమ్ ఝార్ఖండ్
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కె.ఇలంబర్తి దాదాపు గత పది రోజులుగా నగరంలో లేరు. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో ఎన్నికలు జరగనున్న ఝార్ఖండ్ రాష్ట్రంలో ఆయనను ఎన్నికల పరిశీలకుడిగా నియమించడంతో అక్కడే ఉన్నారు. అయినా.. ఆయన అక్కడి నుంచే ప్రతిరోజూ జీహెచ్ఎంసీ కార్యక్రమాలు చక్కపెడుతున్నారు. ప్రతిరోజూ అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్‌లు, సందర్భాన్ని బట్టి వెబినార్లు నిర్వహిస్తున్నారు. కుటుంబ సర్వేపైనా ఆరా.. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి కూడా ఇలంబర్తి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, కంటోన్మెంట్ అధికారులతోనూ చర్చిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు తగిన సూచనలు ఇస్తున్నారు. ఇంటింటికి స్టిక్కరింగ్ కార్యక్రమం ఎంతవరకు వచ్చిందో తెలుసుకుంటూ, పని త్వరితగతిన జరిగేందుకు అధికారులను పురమాయిస్తున్నారు. ఇన్చార్జ్ ఆఫీసర్లు ఈ నేపథ్యంలోనే గ్రేటర్‌లోని 30 సర్కిళ్లు, కంటోన్మెంట్ బోర్డు ప్రాంతానికి వెరసి.. 12 మంది ఉన్నతాధికారులను ప్రత్యేకంగా ఇన్చార్జులుగా నియమించారు. అడిషనల్ కమిషనర్లు ఎస్.సరోజ, ఎన్. యాదగిరిరావు, ఎస్.పంకజ, ఎన్. సామ్రాట్ అశోక్, గీతారాధిక, కె.సత్యనారాయణ, చంద్రకాంత్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సీఎన్.రఘుప్రసాద్, నళినీ పద్మావతి, ఎస్టేట్ ఆఫీసర్ వై.శ్రీనివాస్‌రెడ్డి, ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్‌చంద్రలకు ఆయా సర్కిళ్ల బాధ్యతలు అప్పగించారు. ఫైళ్ల క్లియరెన్స్ సైతం.. జీహెచ్ఎంసీకి సంబంధించి రోజూ పత్రికల్లో వస్తున్న వార్తలపైనా ఇలంబర్తి స్పందిస్తున్నారు. ముఖ్యంగా, ప్రతికూల వార్తలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ పనుల గురించి తెలుసుకుంటున్నారు. బిల్లుల చెల్లింపులపైనా ఆదేశిస్తున్నారు. జీహెచ్ఎంసీ వాహనాల పెట్రోల్, డీజిల్‌ల చెల్లింపులకు సంబంధించిన ఫైళ్ల పరిశీలన సందర్భంగా ప్రైవేటు బంకుల నుంచి కొనాల్సిన అవసరమేముందంటూ ప్రశ్నించినట్లు సమాచారం. డ్యూయల్ రోల్.. సాధారణంగా జీహెచ్ఎంసీ కమిషనర్ సెలవుపై వెళ్లినా, ఇతరత్రా సందర్భాల్లోనూ విధుల్లో లేకుంటే మరో ఉన్నతాధికారిని జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. ఇలంబర్తి అదనపు బాధ్యతలతోనే కమిషనర్‌గా ఉన్నందున, వేరెవరినీ ఇన్చార్జిగా నియమించలేదని సమాచారం. -
నాగారం ల్యాండ్ కేసు.. మాజీ ఆర్డీవోకు ఈడీ సమన్లు..
-
దేవుడిచ్చిన కూతురు తల్లై ఎదురొచ్చింది!
డాక్టర్ జె. రాధాకృష్ణన్‌కు అవి ఉద్విగ్న భరితమైన క్షణాలు! కిందటి శనివారం ఆయన నాగపట్నంలోని సంరక్షణాలయంలోకి అడుగు పెట్టినప్పుడు చేతుల్లో బిడ్డతో సౌమ్య ఆయనకు ఎదురొచ్చింది. ఆ బిడ్డను మురిపెంగా తన చేతుల్లోకి తీసుకున్నారు ఆయన. సౌమ్య తనకు దేవుడిచ్చిన కూతురైతే, ఆ కూతురి కన్నబిడ్డ ఆయన చేతుల్లోని పసికందు. సౌమ్య తల్లయిందని తెలిసి ఆమెను చూడ్డం కోసం ఆ హోమ్‌కి వచ్చారు రాధాకృష్ణన్, ఆయన భార్య కృతిక. తన బిడ్డకు వారి ఆశీర్వాదం కోసం తను పెరిగిన హోమ్‌కే తీసుకు వచ్చింది సౌమ్య. సౌమ్యను ఇరవై ఏళ్లు కంటికి రెప్పలా చూసుకున్న హోమ్ అది. ఈ ఇరవై ఏళ్లుగా హోమ్‌లో సౌమ్య బాగోగులను చూసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ రాధాకృష్ణన్. ఎందుకు ఆయనకు సౌమ్య అంటే అంత మమకారం?! ఈ ప్రశ్నకు సమాధానం వెలాంకిణి మాతకు తెలుసు. ఆ మాతే కదా.. సునామీలో సౌమ్య తల్లిదండ్రులు కొట్టుకుపోవటం చూసింది! ఆ మాతే కదా అనాథగా నాగపట్నం తీరంలో వెక్కి వెక్కి ఏడుస్తున్న నాలుగేళ్ల సౌమ్యను నన్స్ చేత చేరదీయించి, వారు చేర్పించిన సంరక్షణాలయంలో రాధాకృష్ణన్ కంట పడేలా చేసింది! 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రం విప్పిన సునామీ పడగ ఉప్పెన తమిళనాడు తీరప్రాంతం నాగపట్నాన్ని కూడా ముంచెత్తింది. వేలాదిగా మరణాలు. కొట్టుకుపోయిన ఇళ్లు... చెల్లాచెదురైన కుటుంబాలు. వారి పునరావాసం కోసం ప్రభుత్వం తంజావూరు జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్‌ను అక్కడికి పంపింది. ఆ కొద్దిరోజులకే ఆయనకు నాగపట్నం జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చింది.వెలాంకిణి ఆలయ నన్స్ అనాథ పిల్లల్ని చేర్పించిన అన్నై సాథియ గవర్నమెంట్ చిల్డ్రన్స్ హోమ్‌ను సందర్శించినప్పుడే రాధాకృష్ణన్ మొదటిసారిగా సౌమ్యను చూశారు. ఆ చిన్నారి కళ్ళలోని విషాదం ఆయన మనసును కలచివేసింది. దగ్గరకు తీసుకుని ఓదార్చారు. కూతుళ్ళు లేకపోవటం వల్ల కావచ్చు సౌమ్యను చూడగానే దేవుడిచ్చిన కూతురు అనే భావన ఆయనలో కలిగింది. కుదిరినప్పుడల్లా వెళ్లి ఆ కూతుర్ని మనసు నిండుగా చూసుకుని వచ్చేవారు. కాలం గడిచింది. 2018 లో ఒకసారి ఆయన సౌమ్యను చూడానికి వెళ్ళినప్పుడు సౌమ్య, ఆమె స్నేహితురాలు మీనా కనిపించారు. ‘మిగతా పిల్లలంతా దత్తతకు వెళ్లిపోయారని, అప్పటి పిల్లల్లో వీళ్ళిద్దరే మిగిలారని‘ హోమ్ వాళ్ళు చెప్పారు. మళ్లీ వెళ్ళినప్పుడు... మణివణ్నన్ అనే సముద్ర ఉత్పత్తుల వ్యాపారి, ఆయన భార్య మలర్విళి సౌమ్యను దత్తత తీసుకున్నారని తెలిసింది. 2022లో సుబ్బయ్య అనే టెక్నీషియన్‌తో సౌమ్య పెళ్లి జరిగింది. రాధాకృష్ణన్ దంపతులే వారి పెళ్లి జరిపించారు. ఈ అక్టోబర్ 22న పాపను ప్రసవించింది సౌమ్య. ఆ పాపకు సారా అని పేరు పెట్టుకుంది. పాపను చూడాలని ఉందంటే హోమ్ వాళ్లే ఈ ‘తండ్రీ కూతుళ్లు‘ కలిసే ఏర్పాట్లు చేశారు.ఎకనామిక్స్‌లో బి.ఏ. చేసిన సౌమ్య ప్రస్తుతం నర్సింగ్ కోర్స్ చేస్తోంది. అందుకు రాధాకృష్ణన్ సహకారం ఉంది. ఆయన ఇప్పుడు అడిషనల్ చీఫ్ సెక్రటరీ. కో ఆపరేషన్, ఫుడ్, కన్సూ్యమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్కి ఇంఛార్జి. ‘సునామీని తట్టుకుని నాగపట్నం నిలబడినట్లే... సౌమ్య, మీనా, ఇంకా అటువంటి అనాథ పిల్లలు జీవితాన్ని ఎదుర్కొన్న తీరు ఆదర్శనీయం‘ అంటారు రాధాకృష్ణన్. -
TG: అమోయ్‌కుమార్‌పై ఈడీకి ఫిర్యాదుల వెల్లువ
సాక్షి,హైదరాబాద్:ఐఏఎస్ అధికారి, మాజీ రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ బాధితులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయానికి క్యూ కడుతున్నారు. రంగారెడ్డి జిల్లా తట్టిఅన్నారం లోని మధురానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధితులు అమోయ్‌కుమార్‌పై ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తాజాగా శనివారం(అక్టోబర్ 26) వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మరో ఫిర్యాదు చేశారు.ధరణిని అడ్డం పెట్టుకొని అమోయ్‌కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని, 200ఎకరాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఫ్లాట్లను ఎకరాల్లోకి మార్చి అడ్డగోలు రిజిస్ట్రేషన్లు చేశారని ఈడీ దృష్టికి తీసుకువచ్చారు. 40 ఏళ్లుగా పొజిషన్లో ఉన్నా మందీ మార్బలంతో వచ్చి వెళ్లగొట్టే యత్నం చేశారన్నారు. తమ భూములపై హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా పట్టించుకోలేదన్నారు. ఉదయం ఏడు గంటలకే రిజిస్ట్రేషన్ కానిచ్చి రాత్రికి రాత్రే పత్రాలు సృష్టించారన్నారు.సర్వేనెంబర్ 111 నుంచి 179 వరకు ఉన్న 460 ఎకరాల భూమిని కాజేసి సమారు 30 వేల కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఈడీకి ఫిర్యాదు చేశామని శంకర్‌హిల్స్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐఏఎస్ అమోయ్ కుమార్‌తో పాటు ఇతర అధికారులు,పెద్దల పాత్రపై దర్యాప్తు జరపాలని బాధితులు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: పదేళ్లలో అక్రమార్జన రూ.1000 కోట్లు -
TG: ఐఏఎస్ అధికారికి ‘ఈడీ’ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులిచ్చింది. ఈ నెల 23లేదా24 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో కోరింది.అమోయ్‌కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేశారు.రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో చేసిన భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అమోయ్‌కుమార్‌ను ఈడీ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: కలెక్టర్.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు -
ఐఏఎస్ లకు హై కోర్టు షాక్..
-
ఆమ్రపాలి.. ఆంధ్రాకే!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా ఎవరికి కేటాయించిన రాష్ట్రాలకు వారు వెళ్లాల్సిందేనని ఇటీవల డీవోపీటీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ మరికొందరు ఐఏఎస్ అధికారులతోపాటు ఆమ్రపాలి కూడా క్యాట్‌ను ఆశ్రయించగా, బుధవారంలోగా ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఆమె ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.క్యాట్ ఈ నిర్ణయంతో ఏపీకి వెళ్లాల్సిన వారు బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. డీవోపీటీ ఆదేశాల కనుగుణంగా యథావిధిగా ఏపీలో రిపోర్టు చేయాలని క్యాట్ ఆదేశించడంతో, హైకోర్డు ఎలాంటి ఆదేశాలిస్తుందో తెలియనందున ముందైతే ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల వరకు వేచి చూడనున్నారు. ఏపీకి వెళ్లినా, రెండు రాష్ట్రాల పరస్పర అవసరాలు, ఒప్పందాలతో తిరిగి తెలంగాణకు రప్పించే అవకాశాలూ ఉంటాయనే ప్రచారం మొదలైంది. బల్దియా బాస్ ఎవరో.. మరోవైపు, ఆమ్రపాలి స్థానంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఎవరిని నియమించనున్నారనేది జీహెచ్ఎంసీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సీనియర్ ఐఏఎస్‌ను నియమిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ గురించి, నగర నైసర్గిక స్వరూపం గురించి పూర్తిస్థాయి అవగాహన ఉన్నవారిని నియమించగలరనే ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతమున్న జీహెచ్ఎంసీని మూడు లేదా నాలుగు కార్పొరేషన్లుగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, ఆ ప్రక్రియ జరిగేంతదాకా సీనియర్ ఐఏఎస్ అధికారి అవసరమని అర్బన్‌ప్లానింగ్ నిపుణులు అంటున్నారు.ఎక్కువ కార్పొరేషన్లుగా విభజన జరిగాక ఎవరున్నప్పటికీ, కొత్త కార్పొరేషన్లు ఏర్పాటయ్యేంత వరకు తగిన అనుభవమున్న సీనియర్ ఉండాలంటున్నారు. 2025 చివర్లో, లేదా 2026 ఆరంభంలో జీహెచ్ఎంసీ పాలకమండలి ఎన్నికలోగా కొత్త కార్పొరేషన్లు ఏర్పాటయ్యే అవకాశమున్నందున, అప్పటివరకు సీనియర్ అధికారి అవసరమంటున్నారు. ప్రస్తుతానికి.. కొంత కాలం వరకు ఎవరైనా సీనియర్ అధికారికి జీహెచ్ఎంసీ ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలప్పగించవచ్చుననే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా చదవండి: ఆ ఐదుగురు ఐఏఎస్‌లకు బిగ్ షాక్ -
క్యాట్ పిటిషన్ కహానీ
-
క్యాట్‌లో ఐఏఎస్‌లకు చుక్కెదురు.. ఏపీకి వెళ్లాల్సిందేనంటూ ఉత్తర్వులు
సాక్షి,హైదరాబాద్: తాము పని చేస్తున్న రాష్ట్రంలో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని, అదే సమయంలో డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కోరుతూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్‌రాస్, సృజనలకు బిగ్ షాక్ తగిలింది. డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఏ రాష్ట్రంలో రిపోర్ట్ చేయాల్సిన వారు అక్కడే రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. డీఓపీటీ ఆదేశాలను పాటించాల్సిందేనని క్యాట్ వెల్లడించింది. 5:12pmక్యాట్ తీర్పులో ముఖ్యాంశాలు..సుపరిపాలన కోసం అధికారులను బ్యాలెన్స్ చేసేందుకు కేంద్రానికి ఎప్పుడైనా సరే నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందిఒక రాష్ట్రంలో ఎక్సెస్‌గా అధికారులు ఉన్నప్పుడు పక్క రాష్ట్రానికి కేటాయింపులు జరిపే అధికారం డీవోపీటీకి ఉంటుందిఐదుగురు ఐఏఎస్‌ల కేటాయింపుల్లో ఒక్కొక్కరికి ఒక్కొ కారణం ఉన్నప్పటికీ డీవోపీటీదే తుది నిర్ణయంహైకోర్టు గత ఆదేశాలలో వన్ మాన్ కమిటీని ఏర్పాటు చేయమని చెప్పకపోయినా, కమిటీని నియమించే అధికారం డీవోపీటీకి ఉంటుందిడీవోపీటీ ఆర్డర్స్ ప్రకారం రిపోర్ట్ చేయాలి. ఎక్కడి వాళ్లు అక్కడే రిపోర్ట్ చేయాలంటూ క్యాట్ ఆదేశాలు జారీచేసింది. రేపు యథావిధిగా రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది 5:02pmఐదుగురు ఐఏఎస్‌లకు బిగ్ షాక్క్యాట్లో ఐఏఎస్ అధికారులకు చుక్కెదురుడీవోపీటీ ఆర్డర్స్ ప్రకారం రిపోర్ట్ చేయాల్సిందేనవంబర్ మొదటి వారంలో డీవోపీటీ కౌంటర్ వేయాలి4:48pmఐఏఎస్ పిటిషన్‌పై ముగిసిన వాదనలుతీర్పు చదువుతున్న క్యాట్ ధర్మాసనం 4:32pmముగిసిన అయిదుగురు ఐఏఎస్‌ల తరపు న్యాయవాదుల వాదనలుడీవోపీటీ తరుపున వాదనలు ప్రారంభం 4:25pmక్యాట్ ఐఏఎస్‌ల స్థిర నివాసాల పైనే కౌన్సిల్ వాదనలుస్థిర నివాసాల ఆధారంగా జరగాల్సిన కేటాయింపులు సక్రమంగా జరగలేదని కౌన్సిల్ వాదనలుఐఏఎస్ స్థిర నివాసాల (Domicile) ఐదు రకాలుగా పరిగణలోకి తీసుకోవాలి(first posting, place of birth, address of metriculation, home town , 371(d)ఐఏఎస్ వాకాటి కరుణ, వాణి ప్రసాద్, శ్రీజన విషయంలో స్థిరనివాసం ఆధారంగా కేటాయింపులు చేయాలని ప్రత్యూష్ సిన్హా అడ్వైజరీ కమిటీ సిఫార్స్ చేసినా డీవోపీటీ పరిగణలోకి తీసుకోలేదు.ఐఏఎస్ ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్ విషయంలో స్వాపింగ్ ద్వారా మ్యుచువల్గా కేటాయింపులు కోరారుకానీ డీవోపీటీ వాటిని పరిగణలోకి తీసుకోలేదు 3:58pmఅమ్రపాలి తరుపున కౌన్సిల్ స్థానికత విశాఖపట్నం ఉన్నపటికీ స్వాపింగ్ ద్వారా తెలంగాణలో ఉన్నారుస్వాపింగ్ చేసుకోవచ్చని గైడ్ లైన్స్‌లో ఉందా - క్యాట్1986 బ్యాచ్ అధికారితో స్వాపింగ్ ఎలా చేసుకుంటారు - క్యాట్గైడ్ లైన్స్‌లో సీనియర్,జూనియర్‌తో సంబంధం లేకుండా స్వాపింగ్ చేసుకోవచ్చు - ఆమ్రపాలి కౌన్సిల్ 3:41pmముగిసిన ఐదుగురు ఐఏఎస్‌ల తరపు న్యాయ వాదుల వాదనలుడీవోపీటీ తరపున వాదనలు ప్రారంభం. 3:41pmక్యాట్ ఏపీలోని విజయవాడ ప్రాంతాల్లో వరదలతో ప్రజలు ఇబ్బంది పడటం చూశాంఅలాంటి ప్రాంతాలకు వెళ్లి ప్రజాలకు సేవ చేయాలని లేదా - క్యాట్బోర్డర్లో సమస్యలు వస్తే వెళ్ళారాఇంట్లో కూర్చొని సేవ చేస్తాం అంటే ఎలా ?? - క్యాట్అమ్రపాలి తరుపున కౌన్సిల్స్థానికత విశాఖపట్నం ఉన్నపటికీ స్వాపింగ్ ద్వారా తెలంగాణలో ఉన్నారుస్వాపింగ్ చేసుకోవచ్చని గైడ్ లైన్స్‌లో ఉందా - క్యాట్1986 బ్యాచ్ అధికారితో స్వాపింగ్ ఎలా చేసుకుంటారు - క్యాట్గైడ్ లైన్స్‌లో సీనియర్,జూనియర్‌తో సంబంధం లేకుండా స్వాపింగ్ చేసుకోవచ్చు - ఆమ్రపాలి కౌన్సిల్ 3:30pmవాకాటి కరుణ కౌన్సిల్ వన్ మ్యాన్ కమిటీ డీవోపీటీకి ఇచ్చిన నివేదికను మాకు ఇవ్వలేదు - వాకాటి కరుణ కౌన్సిల్వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ మాకు ఇవ్వకుండానే డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసిందిఐదుగురు ఐఏఎస్‌లకు వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్‌ను చూపలేదుDomicile (స్థిర నివాసం)ఆధారంగా ఐఏఎస్ వాకాటి కరుణ హైదరాబాద్ చెందిన వారని ఏపీ రాష్ట్ర విభజన సందర్భంగా ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారుల కేటాయింపునకు ఏర్పాటుచేసిన ప్రత్యూష్ సిన్హా అడ్వైజరీ కమిటీ చెప్పింది - వాకాటి కరుణ కౌన్సిల్కానీ కమిటీ చేసిన సిఫార్సులను డీవోపీటీ పట్టించుకోలేదుఅసలు స్థిర నివాసానికి సరైన అర్థం ఏమిటో చెప్పాలని క్యాట్ ప్రశ్నడీవోపీటీ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతున్నాంముగిసిన వాకాటి కరుణ కౌన్సిల్ వాదనలు 3:23pmవాకాటి కరుణ కౌన్సిల్ హై కోర్టు గత ఆదేశాల ప్రకారం ఐఏఎస్‌ల అభ్యర్థనను డీవోపీటీ పరిగణలోకి తీసుకోవాలికానీ డీవోపీటీ నేరుగా నిర్ణయం తీసుకోకుండా వన్ మ్యాన్ కమిటీని నియమించిందివన్ మ్యాన్ కమిటీని నియమించి నిర్ణయం తీసుకోమని హై కోర్ట్ ఆదేశించలేదుఐఏఎస్ల కేటాయింపుపై డీవోపీటీకే నిర్ణయం తీసుకునే అధికారం ఉంది కానీ వన్ మ్యాన్ కమిటీ సిఫార్సును డీవోపీటీ ఎలా అమలు చేస్తుందిక్యాట్ ప్రశ్నవన్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడే ఎందుకు హై కోర్టుకు వెళ్ళలేదు వన్ కమిటీనీ ఎప్పుడు ఏర్పాటు చేశారు మార్చ్ 21, 2024న వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేశారు 3:00pmఐదుగురు ఐఏఎస్‌ల తరఫున హాజరైన ఐదుగురు న్యాయవాదులుఒక్కొ పిటిషన్‌పై వేర్వేరుగా వాదనలు వింటున్న క్యాట్ ధర్మాసనంఐఏఎస్ వాకాటి కరుణ పిటిషన్‌పై వాదనలు ప్రారంభంవాకాటి కరుణ తరుపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది లక్ష్మి నరసింహ2.40PMఐఏఎస్ అధికారుల పిటిషన్‌పై మధ్యాహ్నం గం. 2.35ని.లకు విచారణ తిరిగి ప్రారంభంఐఏఎస్ అధికారుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. 12.10PM మధ్యాహ్నానికి విచారణ వాయిదాక్యాట్ను ఆశ్రయించిన ఐదుగురు ఐఏఎస్లుమధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ వేర్వేరు పిటిషన్లు దాఖలు11.20AMహైదరాబాద్: కాసేపట్లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(CAT)లో ఐదుగురు ఐఏఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. కేంద్ర పరిపాలన ట్రిబ్యూనల్‌ను ఐదుగురు ఐఏఎస్‌లు ఆశ్రయించిన విషయం తెలిసిందే. డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్‌లు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్ పిటిషన్లలో విజ్ఞప్తి చేశారు. ఏపీలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని తన పిటిషన్లో ఐఏఎస్ సృజన గుమ్మాల కోరారు. ఐఏఎస్‌లు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.