మహారాష్ట్ర: పరీక్షల్లో తప్పితే జీవితంలో తప్పినట్లు భావిస్తుంటారు కొందరు పిల్లలు. ఫలితాలను విడుదల చేసిన మరుసటి రోజు.. పేపర్లలో ఫెయిలైన విద్యార్థుల ఆత్మహత్య వార్తలను సాధారణంగా చూస్తుంటాం. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ విధానం కొనసాగుతూ వస్తోంది. అయితే.. ఇందుకు భిన్నంగా 35 శాతం మార్కులతో పాస్ అయిన ఓ విద్యార్థికి తన తల్లిదండ్రులు వేడుక చేశారు. ఈ స్ఫూర్తిదాయక సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది.
ఇటీవల మహారాష్ట్రలో విద్యాశాఖ పదో తరగతి విద్యార్థుల ఫలితాలను విడుదల చేసింది. ఇందులో ఓ ఆటోడ్రైవర్ కుమారుడు అన్ని సబ్జెక్టుల్లో 35 శాతం మార్కులతో పాస్ అయ్యాడు. తక్కువ మార్కులు సాధించినందుకు తిట్టకుండా తమ కుమారునికి ఆ కుటుంబం సంబరాలు చేసింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవినీష్ శరణ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాను కామెంట్ చేశారు. కింది స్థాయిల్లో తక్కువ మార్కులు సాధించినప్పటికీ జీవితంలో తాము సాధించిన గొప్ప విజయాలను పంచుకున్నారు.
मुंबई के रहने वाले 10वीं के एक छात्र ने परीक्षा में 35% मार्क्स हासिल किए.
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) June 8, 2023
लेकिन उसके माता-पिता ने दुखी या नाराज होने की बजाय उसकी सफलता को सेलिब्रेट किया. pic.twitter.com/fAa6szayiF
ఇదీ చదవండి:ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లనిపించేది ఇలాంటి సందర్భాల్లోనే కావొచ్చు..!
Comments
Please login to add a commentAdd a comment