class 10 exams
-
విద్యార్థి 35 శాతం మార్కులకే సంబరాల్లో కుటుంబం..వీడియో వైరల్
మహారాష్ట్ర: పరీక్షల్లో తప్పితే జీవితంలో తప్పినట్లు భావిస్తుంటారు కొందరు పిల్లలు. ఫలితాలను విడుదల చేసిన మరుసటి రోజు.. పేపర్లలో ఫెయిలైన విద్యార్థుల ఆత్మహత్య వార్తలను సాధారణంగా చూస్తుంటాం. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ విధానం కొనసాగుతూ వస్తోంది. అయితే.. ఇందుకు భిన్నంగా 35 శాతం మార్కులతో పాస్ అయిన ఓ విద్యార్థికి తన తల్లిదండ్రులు వేడుక చేశారు. ఈ స్ఫూర్తిదాయక సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. ఇటీవల మహారాష్ట్రలో విద్యాశాఖ పదో తరగతి విద్యార్థుల ఫలితాలను విడుదల చేసింది. ఇందులో ఓ ఆటోడ్రైవర్ కుమారుడు అన్ని సబ్జెక్టుల్లో 35 శాతం మార్కులతో పాస్ అయ్యాడు. తక్కువ మార్కులు సాధించినందుకు తిట్టకుండా తమ కుమారునికి ఆ కుటుంబం సంబరాలు చేసింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవినీష్ శరణ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాను కామెంట్ చేశారు. కింది స్థాయిల్లో తక్కువ మార్కులు సాధించినప్పటికీ జీవితంలో తాము సాధించిన గొప్ప విజయాలను పంచుకున్నారు. मुंबई के रहने वाले 10वीं के एक छात्र ने परीक्षा में 35% मार्क्स हासिल किए. लेकिन उसके माता-पिता ने दुखी या नाराज होने की बजाय उसकी सफलता को सेलिब्रेट किया. pic.twitter.com/fAa6szayiF — Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) June 8, 2023 ఇదీ చదవండి:ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లనిపించేది ఇలాంటి సందర్భాల్లోనే కావొచ్చు..! -
ఏపీ 10 ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు హవా
-
ఏపీ: మాల్ ప్రాక్టీసింగ్ టీచర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: ఏపీ టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీసింగ్ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మాల్ ప్రాక్టీసింగ్‌కు పాల్పడిన టీచర్లపై చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం. ఈ క్రమంలో 30 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 44 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే అక్రమాలకు పాల్పడిన టీచర్లపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. -
10th Class MLA: పదో తరగతి పరీక్షలు రాసిన ఎమ్మెల్యే
దేశంలో పెద్దగా చదువుకోని రాజకీయ నేతలు ఉన్నారు. అయినా రాజకీయాలకు క్వాలిఫికేషన్లు అవసరమా? అనుకుంటారు చాలామంది. కానీ, జ్ఞానం పెంచుకోవడానికి ఏ వయసు అయితే ఏంటని అంటున్నారు ఓ ఎమ్మెల్యే. 58 ఏళ్ల వయసులో పదో తరగతి హాజరైన ఆ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఒడిశా పుల్బానీ నియోజకవర్గ బీజేడీ ఎమ్మెల్యే అంగద కన్హార్.. శుక్రవారం మొదలైన పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. రుజంగీ హైస్కూల్ సెంటర్‌కు వెళ్లిన ఆయన.. ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ పరీక్ష రాశాడు. 1978లో పదో తరగతి దాకా వెళ్లిన ఆయన.. కుటుంబ సమస్యలతో పరీక్షకు హాజరు కాలేకపోయాడట. అయితే వయసు పైబడిన వాళ్లెందరో.. బిడియాన్ని పక్కనపెట్టి పరీక్షలకు హాజరవుతుండడం తాను గమనించానని, అందుకే తాను తన విద్యను పూర్తి చేయాలనుకుంటున్నానని అంగద చెప్తున్నారు. పైగా చదువుకుంటే పెరిగేది జ్ఞానమే కదా.. సిగ్గుపడాల్సిన అవసరం ఎందుకు? అంటున్నాడు. అయితే పరీక్ష ఆయన ఒక్కడే రాశాడు అనుకోకండి. తోడుగా ఆయన పాత స్నేహితులు ఇద్దరు కూడా పరీక్షలకు హాజరుకాగా, అందులో ఓ పెదదాయన ఒక ఊరికి సర్పంచ్ కూడా. ఇక.. ఆ స్కూల్ ఎగ్జామ్ సెంటర్లో మధ్యలో చదువు ఆపేసిన వాళ్లు చాలామందే ఎగ్జామ్ రాశారట. అందులో అత్యధిక వయస్కుడు అంగదనే కావడం గమనార్హం. ఒడిశాలో శుక్రవారం నుంచి మొదలైన బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామ్స్‌కు 5.8 లక్షల మంది హాజరయ్యారు. మే 10వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. Odisha | Biju Janata Dal (BJD) MLA from Phulbani, Angada Kanhar appeared for his Class 10th examinations. He was among the 5.8 lakh students appearing for the Class 10 state board examination in Odisha that commenced on Friday. pic.twitter.com/hFWNJjXZ5l — ANI (@ANI) April 29, 2022 -
పదో తరగతి పరీక్షలు రద్దు: పంజాబ్ ప్రకటన
ఛండీగర్ : పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు రద్దు చేస్తూ పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిగతా తరగతుల మాదిరిగానే పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తామని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. ప్రీ బోర్డ్ పరీక్షల ఫలితాల ఆధారంగా వారిని పై తరగతులకు పంపిస్తామని వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. (ఇకపై మద్యం హోం డెలివరీ..ఇవిగో టైమింగ్స్ ) ప్రతి ఏడాది దాదాపు 4 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. అయితే కరోనా కారణంగా పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఎగ్జామ్స్‌ని రద్దు చేస్తూ పై తరగతులకు పంపాలని నిర్ణయించారు. ఇప్పటికే 5 నుంచి 8 సహా వివిధ తరగతుల విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఇటీవల ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. దేశంలోనే మొదటిసారి విద్యార్థులకు వేసవి సెలవులను ప్రకటించిన మొదటి రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. కాగా ఇప్పటివరకు పంజాబ్‌లో 1,731 కరోనా కేసులు నమోదవగా, 29 మంది మరణించారు. -
ఏపీలో రెండు వారాలపాటు పది పరీక్షలు వాయిదా
-
ఒక నిమిషం నిబంధన ఉండదు
-
ఒక్కరోజు బడికెళ్లకుండానే పది పరీక్షలకు అర్హత
కోల్‌కతా : ఒక్కరోజు కూడా బడికెళ్లకుండా 12 ఏళ్ల వయసులోని 10 పరీక్షలకు సిద్దమైంది ఓ బెంగాల్ అమ్మాయి. నిజానికి పదో క్లాస్ బోర్డ్ పరీక్షలు రాయాలంటే కనీసం 14 ఏళ్ల వయసు ఉండాలి. కానీ ఆ బెంగాల్ అమ్మాయి వెస్ట్ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్లు నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. దీంతో ఆ అమ్మాయికి బోర్డ్ పరీక్షలు రాయడానికి అధికారులు అనుమతినిచ్చారు. అంతేకాకుండా ఆ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో 52 శాతం మార్కులు తెచ్చుకోవడం చర్చనీయాంశమైంది. కనీసం ఒక్క రోజు కూడా స్కూల్‌కెళ్లకుండా ఎలిజిబిలిటీ ఎగ్జామ్ అర్హత సాధించడం అధికారులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటారా పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాకు చెందిన సైఫా ఖాటున్. గతేడాది హైదరాబాద్‌కు చెందిన 11 ఏళ్ల అగస్త్య జైస్వాల్ 12 వ క్లాస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి రికార్డుకెక్కాడు. అగస్త్య అక్క నైనా జైస్వాల్ 15 ఏళ్లకే పీజీ పూర్తి చేసి రికార్డు సృష్టించారు. -
ఈ ప్రశ్నకు జవాబు లేదు..!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులకు జవాబు లేని ప్రశ్న ఎదురైంది. సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ ప్రశ్నాపత్రంలో 'ఏ పార్టీ భాగస్వామ్యంతో అధికార పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది' అనే ప్రశ్న ఉంది. ఈ మల్టీపుల్ చాయిస్ ప్రశ్న కింద (బిట్) నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఈ నాలుగింటిలో ఒక్కటీ జవాబు (బీజేపీ) లేదు. దీంతో విద్యా శాఖ అధికారులు చేసిన నిర్వాకం వల్ల జవాబు ఏం రాయాలో తెలియక విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. జమ్ము కశ్మీర్లో బీజేపీతో కలసి పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ఆ ప్రశ్నకు బీజేపీ అన్నది సమాధానం. అయితే ఆ ప్రశ్న కింద కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఎం, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అనే నాలుగు సమాధానాలు ఇచ్చారు. వీటిలో బీజేపీ పేరు లేకపోవడంతో విద్యార్థులు ఆ ప్రశ్నను విడిచిపెట్టారు. ఆ రాష్ట్ర విద్యా శాఖ అధికారులు స్పందిస్తూ ఈ విషయంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఈ తాతయ్య దీక్షకు ఫుల్ మార్క్స్!
ఇది రాజస్థాన్‌కు చెందిన ఓ తాత ఫెయిల్యూర్ స్టోరీ. అల్వార్ జిల్లాకు చెందిన శివచరణ్ యాదవ్ అనే 81 ఏళ్ల తాత 46వ సారి పదోతరగతి పరీక్షలు రాసి ఫెయిలయ్యాడు. ఎన్నిసార్లు పరీక్షల్లో పరాజయం ఎదురైనా నిరాశ, నిస్పృహలకు గురికాకుండా ఏనాటికైనా విజయం సాధించి తీరుతాననే తాత నమ్మకాన్ని చూస్తే ముచ్చటేస్తోంది. రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బుధవారం విడుదల చేసిన ఫలితాలను చూశాక తాత విశ్వాసం మరింత ఇనుమడించింది. ఎందుకంటే 45 సార్లు పదో తరగతి పరీక్షలు రాసి ఒక్క సబ్జెక్టులోనూ పాస్ కాని తాత ఈసారి ఒకే ఒక్క సబ్జెక్టులో పాసయ్యాడు. గత ఏడాది పరీక్షల్లో సోషల్ సైన్స్ సబ్జెక్టులో తాతకు జీరో మార్కులు రాగా, ఈసారి అందులో 34 మార్కులు వచ్చాయి. పట్టువదలని విక్రమార్కునిలా ఇన్నిసార్లు తాత పరీక్షలు రాయడం వెనక ఓ ఆసక్తికరమైన అంశమూ ఉంది. 'నేను పదో తరగతి పాస్ కాకుండా పెళ్లి చేసుకోనని నా యవ్వనంలో శపథం చేశాను. ఆందుకే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.వృద్ధాప్యం కారణంగా ఇప్పుడు పెళ్లి చేసుకునే అవకాశం ఎటూ లేదు. కనీసం ఈ వయసులో పదవ తరగతి పాసయ్యానన్న ప్రపంచ రికార్డు నెలకొల్పుదామన్న సంకల్పంతో పరీక్షలు రాస్తున్నాను. ఈసారి పరీక్షలకు ఎంతో కష్టపడి చదివాను. కళ్లు సరిగ్గా కనిపించకపోవడం, ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా వణికే చేతులతో వేగంగా రాయలేక పోవడం వల్ల ఫెయిలయ్యాను. వచ్చే ఏడాది పరీక్షలకు మరింత కఠోరంగా శ్రమిస్తా' అని ఎంతో ఆత్వవిశ్వాసంతో మీడియాకు తెలిపారు. -
పదో తరగతి పరీక్షల్లో కాపీయింగ్
-
50 ఏళ్ల వయసులో.. పదోతరగతి పాస్
చదువుకు వయసు అడ్డం కాదని ఆ పెద్దాయన నిరూపించారు. తమిళనాడు జాతీయ రహదారుల శాఖలో పనిచేస్తున్న గుణశేఖరన్ (50) తన కొడుకుతో కలిసి పదోతరగతి పరీక్ష రాసి.. పాసయ్యారు కూడా!! రోడ్లు వేసే పని చేస్తున్న గుణశేఖరన్, పోలవకలి పాళ్యంలోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతన్న ఆయన కొడుకు తమీజ్ ఇద్దరూ కలిసి పదోతరగతి పరీక్షలు రాశారు. ఆ పరీక్షల ఫలితాలు శుక్రవారమే వెల్లడయ్యాయి. తండ్రికి 500కు గాను 234 మార్కులు రాగా, కొడుకు ఏకంగా 459 మార్కులు సాధించినట్లు అధికారులు తెలిపారు. హైస్కూలు వరకు రాకుండానే చదువు వదిలేసిన గుణశేఖరన్ కొన్నేళ్ల క్రితం ప్రైవేటుగా ఎనిమిదో తరగతి పరీక్ష రాసి పాసయ్యారు. రెండేళ్ల తర్వాత తన కొడుకుతో కలిసి ఇంటర్మీడియట్ కూడా రాస్తానని, దాంతో తనకు పదోన్నతి అవకాశాలు కూడా వస్తాయని గుణశేఖరన్ ఆనందంగా చెబుతున్నారు. -
పదోతరగతి పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్
నిన్న మొన్నటి వరకు కేవలం వైద్యవిద్యా కోర్సుల్లో మాత్రమే హైటెక్ కాపీయింగ్ జరిగేది. గురివిరెడ్డి గ్యాంగు పలు సందర్భాల్లో ఇలాంటి కాపీయింగ్ రాకెట్‌ను నడిపిస్తూ పట్టుబడింది. సరిగ్గా ఇలాంటి కోవలోనే పదోతరగతి పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్ చేస్తున్న గ్యాంగు ఒకదాన్ని 'సాక్షి' బట్టబయలు చేసింది. వరంగల్ నగరంలో ఒక ప్రైవేటు పాఠశాల ఆధ్వర్యంలో ఈ హైటెక్ కాపీ రాకెట్ నడిచింది. ఈ విషయమై కొందరు విద్యార్థుల నుంచి సమాచారం అందుకున్న 'సాక్షి' ఆ సమాచారాన్ని పోలీసులకు కూడా అందించి, రహస్య కెమెరాలతో రంగంలోకి దిగడంతో మొత్తం వ్యవహారం బట్టబయలైంది. పరీక్ష హాలు వెలుపల ఒక కారులో కొంతమంది కూర్చుని ఉండటం, లోపల పరీక్ష రాసేవాళ్లు బ్లూటూత్ సాయంతో ప్రశ్నపత్రంలో ఏముందో వీళ్లకు చెప్పడం ద్వారా ఈ మొత్తం కాపీ వ్యవహారం నడిపించారు. బయట కారులో ఉన్నవాళ్లు పాఠ్యపుస్తకాలు, గైడ్లలో ఉన్న సమాధానాలను లోపల ఉన్నవాళ్లకు చెబుతున్న వైనం మొత్తం 'సాక్షి' నిఘాలో బయటపడింది.