
సాక్షి, అమరావతి: ఏపీ టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీసింగ్ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మాల్ ప్రాక్టీసింగ్‌కు పాల్పడిన టీచర్లపై చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం. ఈ క్రమంలో 30 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసింది ప్రభుత్వం.
ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 44 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే అక్రమాలకు పాల్పడిన టీచర్లపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.
Comments
Please login to add a commentAdd a comment