mall practice
-
ఏపీ: మాల్ ప్రాక్టీసింగ్ టీచర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: ఏపీ టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీసింగ్ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మాల్ ప్రాక్టీసింగ్‌కు పాల్పడిన టీచర్లపై చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం. ఈ క్రమంలో 30 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 44 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే అక్రమాలకు పాల్పడిన టీచర్లపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. -
ప్రాక్టికల్స్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు
నెల్లూరు (టౌన్): ఇంటర్ ప్రాక్టికల్స్ జరుగుతున్న కేంద్రాల్లో పలువురు అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన మాల్ ప్రాక్టీస్ కథనంపై అధికారులు స్పందించారు. ప్రాక్టికల్స్ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో జరుగుతున్న ప్రాక్టికల్స్‌ను ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ సభ్యుడు నారాయణరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి జరుగుతున్న ప్రాక్టికల్స్‌ను పరిశీలించారు. ఏ కళాశాల నుంచి వచ్చారో అడిగి తెలుసుకున్నారు. ప్రాక్టికల్స్ అంటే ఏమిటి.. ఏడాదికి మొత్తం ఎన్ని ప్రాక్టికల్స్ ఉంటాయని పలువురు విద్యార్థులను ప్రశ్నించారు. అయితే ఎవరూ సరైన సమాధానం చెప్పకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాక్టికల్స్ జరుగుతున్న కేంద్రాలకు ప్రైవేట్ కళాశాలలకు చెందిన వ్యక్తులు ఎందుకొస్తున్నారని ఆర్ఐఓ శ్రీనివాసులును ప్రశ్నించారు. ప్రాక్టికల్స్‌లో స్కిల్ పర్సన్ల పాత్ర ఏమిటని అడిగి తెలుసుకున్నారు. వారు పరీక్షలు జరుగుతున్న గదికి ఎందుకొస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రాక్టికల్స్‌లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మాల్ ప్రాక్టీస్‌కు సహకరించారని రుజువైతే అధ్యాపకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలోని అన్ని కళాశాలలను తనిఖీ చేస్తామన్నారు. జేసీ – 2 కమలకుమారి తనిఖీలు నగరంలోని కేఏసీ, డీకేడబ్ల్యూ కళాశాలలను కలెక్టర్ ఆదేశాల మేరకు జేసీ – 2 కమలకుమారి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాక్టికల్స్ జరుగుతున్న అన్ని గదులను పరిశీలించారు. అవకతవకలు జరిగితే కఠిన చర్యలు నెల్లూరు (టౌన్): ఇంటర్ ప్రాక్టికల్స్‌లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ సభ్యుడు నారాయణరెడ్డి హెచ్చరించారు. స్టోన్‌హౌస్‌పేటలోని ఆర్ఐఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించేందుకు కొన్ని కళాశాలలు డబ్బులు వసూలు చేసినట్లు తనకు ఫిర్యాదు అందిందని చెప్పారు. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే కళాశాల గుర్తింపును రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నామని హెచ్చరించారు. జంబ్లింగ్ విధానంలో జరుగుతున్న ప్రాక్టికల్స్‌లో పారదర్శకతకు పెద్దపీట వేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్ బోర్డు కార్యదర్శి అన్ని విషయాలను సమగ్రంగా సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న పాఠశాలలు, కళాశాలలపై ఫీజుల నియంత్రణకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజుల నియంత్రణ అమలు బాధ్యతను కమిషన్‌కు అప్పజెప్పిందన్నారు. వచ్చే నెల నుంచి కళాశాలలను తనిఖీ చేసి లోటుపాట్లు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్ఐఓ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆగ్రహం ప్రాక్టికల్స్‌లో మాల్‌ప్రాక్టీస్‌పై కలెక్టర్ శేషగిరిబాబు సీరియస్ అయ్యారని తెలిసింది. పసిగట్టిన ఇంటర్ బోర్డు అధికారులు అన్ని కేంద్రాల్లో గేట్లు మూయించారు. బయటి వ్యక్తులు లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని కేంద్రాల వద్ద పోలీసుల పహారా కనిపించింది. -
ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మాల్ ప్రాక్టీస్
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరిగిపోతోంది. ‘సాక్షి’ కథనం అక్షరాల నిజమవుతోంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.. పకడ్బందీగా పరీక్షలను నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నా సెంటర్లలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రాక్టికల్స్ జరిగే కేంద్రాల చుట్టూ కార్పొరేట్ కళాశాలలకుచెందిన అధ్యాపకులు, సిబ్బంది హల్చల్ చేస్తున్నారు. సెంటర్లలోకి బయట వ్యక్తులకు అనుమతి లేకున్నా ప్రైవేట్ కళాశాలకు చెందిన వారు హడావుడి చేస్తున్నారు. సోమవారం నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో ప్రైవేట్ కళాశాలలకు చెందిన వ్యక్తులు విద్యార్థులతో నేరుగా ప్రాక్టికల్స్ హాల్ వైపు వెళ్లిన వైనం బయటపడింది. ర్యాంక్‌లే లక్ష్యంగా ప్రాక్టికల్స్‌లో మార్కులు వేయించుకునేందుకు కార్పొరేట్ కళాశాలలు అక్రమాలకు తెగబడుతున్నాయి. చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లతో ఏ రోజుకారోజు సెల్ఫోన్లలో మంతనాలుజరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు(టౌన్): జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ నెల 1వ తేదీన ప్రారంభం అయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు 4 విడతల్లో పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో 38 ప్రభుత్వ, 163 ప్రైవేట్ కళాశాలల నుంచి 26,716 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో ఎంపీసీ 19,802 మంది, బైపీసీ 4,696 మంది, ఒకేషనల్ 2,218 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 48 సెంటర్లలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఇంటర్లో మార్కులు ప్రవేశ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఒక్కో సబ్జెక్టులో 30 మార్కులుంటాయి. ఈ నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలు ర్యాంక్ సాధించే విద్యార్థికి ఫుల్ మార్కులు, సాధారణ విద్యార్థికి ఒక్కో సబ్జెక్ట్‌లో 23 నుంచి 26 మార్కులు వేసే విధంగా చీఫ్ సూపరింటెండెంట్లు, ఎగ్జామినర్లతో ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ఇందుకు ప్రతిగా వారికి రూ.300 నుంచి రూ.500 (ఒక్కో విద్యార్థికి) ముట్టజెబుతున్నట్టు సమాచారం. అయితే ప్రాక్టికల్స్ ఫిక్స్ అయ్యాయని గత నెల 30న ‘సాక్షి’లో ‘మార్కుల వేట’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఏమి జరుగుతోందంటే.. ప్రాక్టికల్స్ సెంటర్లలో సీసీ కెమెరాలు బిగించినా అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు పని చేయని పరిస్థితి ఉందని అధ్యాపకులే చెబుతున్నారు. తొలిసారిగా ప్రాక్టికల్స్ లైవ్‌లో జరుగుతున్నాయని ఇంటర్ అధికారులు చెబుతున్నా ప్రైవేట్ వ్యక్తులు కళాశాలల్లోనే హల్చల్ చేస్తున్నారంటే పరీక్షలు ఎంత పకడ్బందీగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సీసీ కెమెరాలు ఏ మాత్రంపని చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేట్ యాజమాన్యాలు మైక్రో జెరాక్స్‌లు చేయించి విద్యార్థులకు అందజేస్తున్నట్టు విశ్వశనీయ సమాచారం. కొన్ని సెంటర్లలో అయితే ఇన్విజిలేటర్లే చెబుతున్న పరిస్థితి ఉంది. స్క్వాడ్ బృందాలు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప అక్కడ జరుగుతున్న తంతు బయటపడే అవకాశం ఉందని కొందరు అధ్యాపకులే బహిరంగంగా చెబుతున్నారు. ఈ విషయంపై వివరణ కోరేందుకు ఆర్ఐఓ శ్రీనివాసరావును ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. ప్రాక్టికల్స్‌కు 134 మంది గైర్హాజరు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌కు సోమవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 134 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్స్‌కు 2,832 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 2,749 మంది హాజరయ్యారు. -
12 మంది డిగ్రీ విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు
కర్నూలు(ఆర్యూ): రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో శనివారం జరిగిన మూడో సంవత్సరం డిగ్రీ పరీక్షలో జిల్లా వ్యాప్తంగా 12 మంది విద్యార్థులపై ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెంకటేశ్వర్లు తెలిపారు. తుగ్గలి ఏఎస్ డిగ్రీ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు, పత్తికొండ రాఘవేంద్ర కళాశాలకు చెందిన ఇద్దరు, ఆలూరు రాఘవేంద్ర కళాశాలకు చెందిన నలుగురు, ఆలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి, బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. -
3 నుంచి పది మూల్యాంకనం
- సెల్ఫోన్లు తేవొద్దు - పేపర్ లీక్ కాలేదు.. అది మాల్‌ప్రాక్టీస్ - యాజమాన్యం పాత్ర ఉందని తేలితే స్కూల్‌ను బ్లాక్‌లిస్టులో పెడతాం - డీఈఓ రామలింగం నెల్లూరు(టౌన్) : పదో జవాబుపత్రాల మూల్యాం కనం వచ్చే నెల 3 నుంచి 18వ తేదీ వరకు జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం తెలిపారు. నెల్లూరులోని పొదలకూరురోడ్డులోని సెయింట్ జోసఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సెయింట్ జోసెఫ్ స్కూల్లో మూల్యాంకనం చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాకు సుమారు 5 లక్షలకు పైగా జవాబుపత్రాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం డీకోడ్ జరుగుతోందన్నారు. మూల్యాంకనంలో 3,700 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొననున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సెల్ఫోన్లు అనుమతించమని చెప్పారు. కుటుంబసభ్యులతో మాట్లాడాలనుకుంటే డీఈఓ సెల్‌ఫోన్ నుంచి చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంగా ఉండటంతో.. పది పరీక్షలు జరిగే సమయంలో సెల్‌ఫోన్ అనుమతించలేదన్నారు. నారాయణ స్కూల్లో వాటర్ బాయ్ ప్రశ్నపత్రాన్ని సెల్‌ఫోన్ ద్వారా పంపించడం మాల్‌ప్రాక్టీస్ కిందకు వస్తుందన్నారు. ఆ గదిలో విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇన్విజిలేటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించబట్టే సెల్‌ఫోన్‌తో ఫొటో తీశారని చెప్పారు. ప్రాథమిక విచారణ అనంతరం అనుమానంతో ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. విచారణలో టీచర్ పాత్ర ఉందని తేలితే సర్వీసు నుంచి తొలగిస్తామన్నారు. ఈ వ్యవహారంలో స్కూల్ యాజమాన్యం హస్తం ఉన్నట్లు విచారణలో తేలితే ఆస్కూల్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టనున్నుట్లు తెలిపారు. -
డిగ్రీ పరీక్షల్లో 32 మందిపై మాల్ ప్రాక్టీసు కేసులు
కర్నూలు(ఆర్యూ) : రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో 32 మంది విద్యార్థులపై ఫ్లయింగ్ స్క్వాడ్ కేసులు నమోదు చేసింది. గురువారం.. కోడుమూరు సాయిరాం డిగ్రీ కళాశాలలో 18 మంది విద్యార్థులు, వివేకానంద డిగ్రీ కళాశాలలో 11 మంది విద్యార్థులు, గూడూరు సాయిరాం డిగ్రీ కళాశాలలలో ముగ్గురు విద్యార్థులపై పరీక్షల తనిఖీ అధికారులు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్లు రాయలసీమ యూనివర్సిటీ పరీక్షల విభాగాధిపతి వెంకటేశ్వర్లు తెలిపారు. -
పేపక్ లీక్ కాదు.. మాల్ ప్రాక్టీస్
ఖమ్మం: ఖమ్మంలో జరిగింది టెన్త్ ఇంగ్లీష్ పేపర్ లీక్ కాదని కలెక్టర్ లోకేష్‌కుమార్ ప్రకటించారు. అక్కడ జరిగింది మాల్ ప్రాక్టీసు మాత్రమే కాబట్టి పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపారు. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కోరారు. పరీక్షల సందర్భంగా ఎటువంటి ఇబ్బంది జరుగకుండా చూస్తామన్నారు. ఏడాదంతా కష్టపడి చదువుకున్న విద్యార్థులకు ఇబ్బంది కలుగ కుండా మీడియా వ్యవహరించాలని కలెక్టర్ కోరారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడి, పేపర్ లీకేజి అంటూ పుకార్లు పుట్టించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని పోలీస్ కమిషనర్ షానవాజ్ కాసీం తెలిపారు. -
మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు
– డీఈఓ సుప్రకాష్ హెచ్చరిక ఒంగోలు : ఏపీ ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి డీవీ సుప్రకాష్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయన్నారు. పదో తరగతితో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా పరీక్షకు హాజరవుతారన్నారు. 30 నిముషాలకంటే ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, విధిగా హాల్‌టిక్కెట్ తెచ్చుకోవాలన్నారు. పరీక్ష ప్రారంభమైన అయిదు నిముషాల తరువాత ఎట్టి పరిస్థితుల్లోను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించడం జరగదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షాకేంద్రంలోకి తీసుకురారాదన్నారు. ఓఎంఆర్ షీట్ తీసుకున్న వెంటనే తన వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో విద్యార్థి సరిచూసుకోవాలని, లేని పక్షంలో ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకువెళ్ళాలన్నారు. ఇన్విజిలేటర్లు సైతం తమ సెల్ఫోన్లను పరీక్షాకేంద్రంలోనికి తీసుకువెళ్ళరాదన్నారు. పెన్సిల్, రబ్బర్, ప్యాడ్ వంటివి విద్యార్థులు స్వయంగా ఎవరికి వారు తీసుకువెళ్లాలని, ఎవరైనా మాల్‌ప్రాక్టీస్ లేక కాíపీయింగ్‌కు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఈవో సుప్రకాష్ స్పష్టం చేశారు. -
‘టెక్నాలజీ’ పూర్తిగా వాడేశాడు...!
పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థి అరెస్టు సహకరించిన స్నేహితుడూ రిమాండ్ పంజగుట్ట: అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడిన విద్యార్థితో పాటు అతడికి సహకరించిన మరో విద్యార్థిని ఎస్సార్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... మాదాపూర్ నవ్భారత్నగర్ నివాసి షేక్ ఎజాజ్ (19) 2014లో ఎస్సార్‌నగర్‌లోని న్యూవిజన్ జూని యర్ కాలేజీలో ఇంటర్ చదివాడు. ఆరు సబ్జెక్ట్‌లు ఫెయిల్ కావడంతో ప్రస్తుతం ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు సెల్‌ఫోన్ సంస్థలో పని చేసిన ఇతను ఫోన్ టెక్నాలజీ-పని తీరును పూర్తిగా అవగాహన చేసుకున్నాడు. ఈ టెక్నాలజీతో కాపీయింగ్‌కు పాల్పడి ఎలాగైనా ఇంటర్మీడియట్ పాస్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఆన్ లైన్ ద్వారా ఇందుకు అవసరమైన బ్లూటూత్, వైర్లెస్ మైక్రోఫోన్, చెవిలో ఇమిడిపోయే అతి చిన్న ఇయర్‌ఫోన్ తెప్పించుకున్నాడు. ఎస్సార్‌నగర్‌లోని రాయల్ జూనియర్ కాలేజీలో పరీక్ష సంటర్ పడింది. ఇంజినీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న తన స్నేహితుడు మహ్మద్ సమీయుల్లా (19) సాయంతో సివిక్స్ -1, సివిక్స్ -2 పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో ఈనెల 12న ఎకనామిక్స్ పరీక్ష రాసేందుకు వెళ్లగా... చీఫ్ ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్ శంకర్‌రెడ్డి ఎజాజ్ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు గుర్తించాడు. వెంటనే ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎజా జ్, సమీయుల్లాలను అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. -
ఇంటర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్?
♦ పరస్పర అవగాహనతో అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేటు కాలేజీలు ♦ సూర్యాపేటలో గణితం పేపర్ లీకయిందంటూ ప్రచారం... అదేం లేదన్న బోర్డు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో కొన్ని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు పరస్పర అవగాహనతో ఉమ్మడిగా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు తమ విద్యార్థుల కోసం ఈ తరహా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు పరీక్షల విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లే పేర్కొంటున్నారు. ఆ తరహాలోనే బుధవారం గణితం పేపర్-2ఏ పరీక్ష సందర్భంగా సూర్యాపేటలో పేపర్ లీకజీ గందరగోళం చోటుచేసుకుందని చెబుతున్నారు. బుధవారం సూర్యాపేటలో గణితం పేపర్ లీక్ అయిందం టూ ప్రచారం జరిగింది. పలు టీవీ చానెళ్లు స్క్రోలింగ్‌లు కూడా వేశాయి. అయితే ఈ ఘటనపై నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ, రీజ నల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ విచారణ జరిపినట్లు... అక్కడ ఎలాంటి పేపర్ లీకేజీ జరగలేదని తేల్చినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆ వదంతులు మినహా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొంది. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం, ఇంటర్ బోర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ లీకేజీ ప్రచారాన్ని ఖండించింది. కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాల కుట్రలో భాగంగానే దీన్ని పరిగణించాలని పేర్కొంది. కానీ సూర్యాపేటతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోని పలు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఉమ్మడిగా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నాయని జూనియర్ లెక్చరర్లు ఆరోపిస్తున్నారు. పక్కా ప్రణాళిక, కాలేజీల మధ్య ఒప్పందాల మేరకు పరీక్ష ప్రారంభమయ్యాక సెల్‌ఫోన్ ద్వారా ప్రశ్నపత్రాన్ని బయటకు లీక్ చేస్తున్నారని... జవాబులను తిరిగి సెల్‌ఫోన్ ద్వారానే పరీక్ష కేంద్రాల్లోకి చేరవేస్తున్నారని పేర్కొంటున్నారు. ఆ తరహాలోనే సూర్యాపేటలో బుధవారం పరీక్ష సందర్భంగా గందరగోళం చోటు చేసుకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, మాల్ ప్రాక్టీస్‌ను అరికట్టాలని తెలంగాణ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇంటర్ పరీక్షలకు 94.38 శాతం హాజరు బుధవారం జరిగిన ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్, బోటనీ, సివిక్స్ పరీక్షలకు 94.38 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు బోర్డు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ మొత్తం 57 మంది విద్యార్థులు అధికారులకు పట్టుబడ్డారు. వీరిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. -
ఎండలే అసలు పరీక్ష
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు * 74,756 మంది విద్యార్థుల హాజరు * ఉదయం 9 నుంచే సూర్యప్రతాపం * ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎండల భయం పట్టుకుంది. ఉదయం 9 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండడం ఇందుకు కారణం. దీనికితోడు గాలి, వెలుతురు రాని గదులను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేయడం, అందులో ఫ్యాన్లు, లైట్లు, మంచినీరు, ఇతర సౌకర్యాలు సరిగా లేకపోవడంపై కూడా విద్యార్థిలోకంలో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షలను ఎదుర్కోవడం విద్యార్థులకు అగ్ని పరీక్షగా మారింది. నాలుగు డిగ్రీల సెల్షియస్ ఎక్సెస్.. గత ఏడాది ఇంటర్ పరీక్షల సమయంలో భానుడి ప్రతాపం 36 డిగ్రీల సెల్షియస్‌కు పరిమితం కాగా ఈ ఏడాది ఆ తీవ్రత 39-40 డిగ్రీల మధ్య ఉంది. ఈ కారణంగా ఉదయం 9 గంటలకే జనాలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఉదయం 9నుంచి 12 గంటల మధ్య ఇంటర్ పరీక్షల నిర్వహణ సమయంలో ఇటు ఉక్కపోత, అటు ఎండ వేడిమితో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి నెలకొంది. 101 కేంద్రాలు, 74,576 మంది విద్యార్థులు మర్చి 2 నుంచి 19 వరకు మొదటి సంవత్సరం, 3 నుంచి 21 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. 74,576 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 36,094 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 38,662 మంది ఉన్నారు. వీరికోసం జిల్లావ్యాప్తంగా 101 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వ/ఎయిడెడ్ కాలేజీల పరిస్థితి పర్వలేదనిపిస్తుండగా ప్రయివేట్ జూనియర్ కళాశాలల కేంద్రాల్లో మాత్రం వసతులు సరిగా లేనట్లు తెలుస్తోంది. గాలి, వెలుతురు సక్రమంగా రానివి, ఫ్యాన్లు, లైట్లు లేని గదులున్నట్లు సమాచారం. మరికొ న్ని కేంద్రాల్లో బెంచీలు లేని కారణంగా నేలబారు రాతలు తప్పని పరిస్థితి నెలకొంది. 13 స్క్వాడ్ బృందాలతో పర్యవేక్షణ పరీక్షల నిర్వహణను 13 స్క్వాడ్ బృందాలు పర్యవేక్షించనున్నాయి. ఇందులో నాలుగు ఫ్లైయింగ్ స్వ్కాడ్స్, హైపవర్ కమిటీ, ఆర్ఐఓ, డీవీఈఓ, డీఈసీ, ఐదు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు విరివిగా పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌ను నివారించేందుకు కృషి చేస్తాయి. సమస్యాత్మకంగా గుర్తించిన ఆలూరు, కౌతాళం, హొళగుంద కేంద్రాల్లో పర్యవేక్షణ అధికంగా ఉంటుంది. ఇక ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులుంటారు. మూడు సెట్ల ప్రశ్న పత్రాలు.. ప్రతి పరీక్షకు మూడు సెట్ల ప్రశ్న పత్రాలను కేంద్రాల సమీపంలోని పోలీసు స్టేషన్లలో ఉంచారు. ఉదయం 8.30 గంటలకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుంచి కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల సెల్ఫోన్లకు వచ్చే మెసేజ్ ఆధారంగా ఎంపిక చేసిన సెట్ ప్రశ్నపత్రాలను తీసుకెళ్తారు. అన్ని పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కంట్రోల్ రూం ఏర్పాటు.. పరీక్షలకు సంబంధించిన ఫిర్యాదులు, సూచనలు అందజేయడానికి ఆర్ఐఓ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇక్కడ సీనియర్ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో సభ్యులు.. సందేహాలను నివృత్తి చేస్తారు. ఇందుకోసం 040-24603317,0866-2974130, 08518-222407 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఏర్పాట్లు పూర్తి ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవు. - పరమేశ్వరెడ్డి, ఆర్ఐఓ -
ఎంసెట్‌పై విజిలెన్స్
సెంట్రల్ విజిలెన్స్, సెంట్రల్ పరిశీలకుల డేగ కన్ను హాజరుకానున్న 17,405 మంది విద్యార్థులు మెడిసిన్, వ్యవసాయ పరీక్షలపై ప్రత్యేక నిఘా ఆర్టీసీ సమ్మె విరమణతో తప్పనున్న రవాణా కష్టాలు నల్లగొండ/కోదాడ అర్బన్ : నిఘా నీడన ఎంసెట్-2015 నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రవేశ పరీక్షలో ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ సంఘటనలుచోటుచేసుకోకుండా ఉండేందుకు జేఎన్టీయూ, మిట్స్ నుంచి ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగనున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి జరిగే మెడిసిన్, వ్యవసాయ రాత పరీక్ష పై సెంట్రల్ బృందాలు డేగ కన్ను వేయనున్నాయి. బుధవారం జరిగే ఎంసెట్‌కు జిల్లాలో నల్లగొండ, కోదాడ రెండు రీజియన్లుగా మొత్తం 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో నల్లగొండలో ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఇంజినీరింగ్ పరీక్షకు 15 సెంటర్లు ఏర్పాటు చేయగా 7,200 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగే మెడిసిన్, వ్యవసాయ రాత పరీక్షకు 9 సెంటర్లు ఏర్పాటు చేయగా 4,790 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. కోదాడలో ఇంజినీరింగ్ విభాగానికి ఏర్పాటు చేసిన 7 పరీక్షా కేంద్రాల్లో 3,134 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం జరిగే మెడిసిన్, వ్యవసాయ కోర్సులకు ఏర్పాటు చేసిన 6 పరీక్షా కేంద్రాల్లో 2,281 మంది విద్యార్థులు కలిపి జిల్లా మొత్తం 17,405 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షా సమయానికి నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించేది లేదని రీజినల్ కోఆర్డినేటర్లు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. నల్లగొండలోని పరీక్షా కేంద్రాలు... ఇంజినీరింగ్.. నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఎన్జీ కాలేజీ)1,2 ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల, రామగిరి కాకతీయ డిగ్రీ కళాశాల హైదరాబాద్ రోడ్డు (వీటీకాలనీ) ది నల్లగొండ డిగ్రీ కాలేజీ ఆర్ట్స్ అండ్ సైన్స్, తులసీ నగర్, హనుమాన్ టెంపుల్ వెనకబాగం నీలగిరి డిగ్రీ పీజీ కళాశాల, రామగిరి } చైతన్య డిగ్రీ కళాశాల,అన్సారీ కాలనీ (బస్టాండ్ దగ్గర) నిట్స్ సెంటర్-1,సెంటర్-2 చర్లపల్లి,హైదరాబాద్ రోడ్డు డీవీఎం కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, చర్లపల్లి కాకతీయ పీజీ కళాశాల, హైదరాబాద్ రోడ్డు, చర్లపల్లి. సెయింట్ ఆల్ఫానెన్స్ హైస్కూల్, దేవరకొండరోడ్డు లిటిల్ ఫ్లవర్ విజ్ఞాన్ మందిర్ హై స్కూల్, శాంతినగర్ } సాయి భారతి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ (ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వెనకభాగం) సిద్ధార్ధ డిగ్రీ కాలేజీ, నటరాజ్ థియేటర్ దగ్గర మెడిసిన్.... నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఎన్జీ కాలేజీ)1,2 {పభుత్వ డిగ్రీ మహిళా కళాశాల, రామగిరి కాకతీయ డిగ్రీ కళాశాల హైదరాబాద్ రోడ్డు (వీటీకాలనీ) ది నల్లగొండ డిగ్రీ కాలేజీ ఆర్ట్స్ అండ్ సైన్స్, తులసీ నగర్, హనుమాన్ టెంపుల్ వెనకబాగం సిద్ధార్ధ డిగ్రీ కాలేజీ, నటరాజ్ థియేటర్ దగ్గర నలంద డిగ్రీ కళాశాల, గడియారం సెంటర్ దగ్గర } చైతన్య డిగ్రీ కళాశాల, బస్టాండ్ దగ్గర ప్రత్యేక బృందాలు... నల్లగొండ రీజియన్ సెంటర్ కో ఆర్డినేటర్‌గా ఎన్జీ కాలేజీ ప్రిన్సిపల్ రావుల నాగేందర్‌రెడ్డి, కోదాడ సెంటర్ కోఆర్డినేటర్‌గా కేఆర్ఆర్ డిగ్రీ కాలేజీ ఎఫ్ఏసీ ప్రిన్సిపల్ ఎ.శంకర్ వ్య వ హరించనున్నారు. నల్లగొండలోని 24 రీజియన్ సెంటర్లలో 24మంది పరిశీలకులను నియమించారు. వీరుగాకుండా రెండు సెంటర్లకు కలిపి ఒకరిని ఫ్లైయింగ్ స్క్వాడ్‌గా నియమించారు. మెడిసిన్, వ్యవసాయ రాతపరీక్షపై నిఘా ఉంచేం దుకు ప్రత్యేకంగా 8 మంది సభ్యులతో సెంట్రల్ విజిలెన్స్ సభ్యులుగా నియమించారు. జిల్లా ప్రత్యేక పరీశీలకులుగా డా.బి.ధర్మానాయక్ వ్యవహరిస్తారు. వీరితోపాటు కలె క్టర్, రె వెన్యూ, పోలీస్ అధికారులు సెంటర్లు విజిట్ చేస్తారు. రవాణా సౌకర్యాలు... కార్మికులు సమ్మె విరమించడంతో బుధవారం అర్ధరాత్రి అన్ని గ్రామాలకు బస్సులు పంపినట్లు ఆర్ఎం బి.రవీందర్ తెలిపారు. ఎంసెట్ పరీక్షా దృష్ట్యా ప్రత్యేక 115 బస్సులు నడపనున్నారు. ప్రధానంగా మిర్యాలగూడ-కోదాడ, మిర్యాలగూడ-నల్లగొండ, నల్లగొండ-భువనగిరి, నల్లగొండ-దేవరకొండ, నల్లగొండ-హాలియా, నల్లగొండ-హైదరాబాద్, సూర్యాపేట-నల్లగొండ మార్గాల్లో ఎక్కువ బస్సులు నడపనున్నారు. మిర్యాలగూడ-నల్లగొండ మార్గంలో 12, హుజూ ర్‌నగర్-కోదాడ మార్గంలో 16 బస్సులు అదనంగా నడపనున్నారు. ఉదయం 6 గంటలకు అన్ని గ్రామాల నుంచి బస్సులు బయల్దేరి వెళ్తాయి. మండల కేంద్రాల మీదుగా ఉదయం 9 గంటల వరకు కోదాడ, నల్లగొండకు బస్సులు చేరుకుంటాయి. ఇక్కడినుంచి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను తీసుకెళ్లేందుకు రవాణా శాఖ ప్రైవేటు బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కోదాడలో 9, నల్లగొండలో 15 బస్సులు బస్టాండ్ నుంచి పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులను తరలిస్తాయి. ఎంసెట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాలి - ఉపముఖ్యమంత్రి కడియం ఎంసెట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్లకు సూచించారు. బుధవారం వరంగల్ జిల్లా నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, సంబంధిత అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేం దుకు అన్ని రూట్లలో బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మాట్లాడుతూ...పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ...విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ మాట్లాడుతూ...ఎంసెట్ నిర్వహణకు సెక్టార్ వైజ్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశంలో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా నుంచి జేసీ సత్యనారాయణ, ఇన్చార్జి ఏజేసీ నిరంజన్, డీఆర్వో రవినాయక్, ఆర్ఎం రవీందర్ పాల్గొన్నారు. తొలిసారిగా కోదాడలో.. కోదాడ కేంద్రంగా జరుగుతున్న ఎంసెట్‌కు కొన్ని సెంటర్లు పట్టణానికి 10 నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందుకోసం ఆయా ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడి పరీక్ష రోజు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల చిలుకూరు మండలంలో ఉంది. కోదాడ నుంచి హూజూర్‌నగర్ వెళ్లే దారిలో కోదాడకు 13 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకునేందుకు విద్యార్థులు ముందుగానే కోదాడకు రావాలి. అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాల కోదాడకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. గేట్ కళాశాల-1, సాయిఎడ్యుకేషనల్ సొసైటీ(గెట్కళాశాల-2) ఈ రెండు సెంటర్లు కోదాడకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కట్టకొమ్ముగూడెంలో ఉన్నాయి. ఈ సెంటర్ల విద్యార్ధులు ముందుగా బస్టాండ్ వద్దకు చేరుకుంటే ఆయా కళాశాలలు ఏర్పాటు చేసే ఉచిత బస్సులలో సులువుగా సెంటర్లకు చేరుకోవచ్చు. -
మాల్ ప్రాక్టీస్ వాస్తవమే
శ్రీకాకుళం :జిల్లాలో సోమవారం జరిగిన డీఎస్సీ పరీక్షలో స్కూల్ అసిస్టెంట్(తెలుగు) పోస్టుకు రాసిన వి.రజితాసంపతిరావు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడడం వాస్తవమేనని ఏజెసీ పి.రజనీకాంతారావు, విద్యాశాఖ ఆర్జేడీ ప్రసన్నకుమార్ ప్రాథమికంగా నిర్థారించారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ఆ అభ్యర్థిపై పోలీసులు కేసు పెట్టిన విషయం పాఠకులకు తెలిసిందే. ఇదే విషయంపై మంగళవారం సాక్షిలో ‘డీఎస్సీ పేపర్ లీక్’ పేరిట ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర అధికారులు స్పందించి ఆర్జేడీని ప్రాథమికంగా విచారణ జరపాలని ఆదేశించారు. జిల్లా నుంచి కూడా ఓ అధికారిని పంపాలని కలెక్టర్‌కు సూచించడంతో ఆయన ఏజెసీని విచారణాధికారిగా నియమించారు. మంగళవారం వీరిద్దరూ తొలుత ఏజెసీ చాంబర్లో సమావేశమై అటు తరువాత డీఈవో కార్యాలయంలో పలువురి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ మాల్‌ప్రాక్టీస్ జరిగిన విషయం వాస్తవమేనని జవాబులు పరీక్ష గదిలోకి ఎలా వచ్చాయన్న దానిపైనా, ఇందులో ఎవరి ప్రమేయం ఉందన్న దానిపైనా లోతుగా విచారించాల్సి ఉందన్నారు. ప్రాథమిక నివేదికను రాష్ట్ర అధికారులకు బుధవారం నివేదిస్తామని తెలిపారు. ఇదే అభ్యర్థి తెలుగు పండిట్ పోస్టుకు కూడా పరీక్ష రాశారని అందులో ఉత్తీర్ణత సాధిస్తే పోస్టింగ్ ఇస్తారా, అక్కడ కూడా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడినట్టు భావిస్తారా అని కొందరు విలేకరులు ప్రశ్నించగా ఈ విషయం కూడా తమ దృష్టికి వచ్చిందని వారు పేర్కొన్నారు. దీనిని నివేదికలో పొందుపరుస్తామని నిర్ణయం రాష్ట్రస్థాయిలో జరుగుతుందన్నారు. మాల్‌ప్రాక్టీసుకు పాల్పడ్డ అభ్యర్ధి నుంచి వివరాల సేకరణ మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన రజితా సంపతిరావు నుంచి అధికారులు పలు వివరాలు సేకరించారు. ఆమె నుంచి ఆ వివరాలను లిఖితపూర్వకంగా తీసుకున్నారు. విచారణాధికారుల వద్దకు న్యాయవాదితో కలసి వచ్చినప్పటికీ విచారణాధికారులు న్యాయవాదిని విచారణ గదిలోకి అనుమతించలేదు. అటు తరువాత ఆమెను ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారడిగిన వివరాలు ఇవ్వాలని అధికారులు సూచించారు. పోలీసులు కూడా ఆమె నుంచి వివరాలను సేకరించారు. తోటి అభ్యర్థుల నుంచి సమాచార సేకరణ సోమవారం జరిగిన సంఘటనకు సంబంధించి అదే గదిలో పరీక్ష రాస్తున్న ఇతర అభ్యర్థుల నుంచి లిఖితపూర్వకంగా సమాచారం తీసుకున్నారు. వీరంతా ఆమె మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడడం వాస్తవమేనని, రెండుసార్లు బాత్రూమ్కు వెళ్లి వచ్చారని చెప్పడంతో పాటు సంఘటనకు సంబంధించి అన్ని వివరాలను అధికారులకు తెలిపారు. ఇచ్ఛాపురం, శ్రీకాకుళం ఎంఈవోలనుంచీ పలు విషయాలు ఆరా మాల్‌ప్రాక్టీస్‌కు సంబంధించి ఇచ్ఛాపురం ఎంఈవో లక్ష్మీనారాయణ, శ్రీకాకుళం ఎంఈవో విజయలక్ష్మిలను కూడా విచారణాధికారులు పలు విషయాలపై ఆరా తీశారు. ఇచ్ఛాపురం ఎంఈవో లక్ష్మీనారాయణ పరీక్ష ప్రారంభానికి గంట ముందు వచ్చి బాత్రూమ్లు ఎక్కడ ఉన్నాయని శ్రీకాకుళం ఎంఈవోను ప్రశ్నించడం, తన కోడలిగా రజితా సంపతిరావును ఇచ్ఛాపురం ఎంఈవో శ్రీకాకుళం ఎంఈవోకు పరిచయం చేయడం వంటి విషయాలు విచారణాధికారులకు తెలియడంతో ఆ విషయాలపై లిఖిత పూర్వకంగా వివరాలు తీసుకున్నారు. అన్ని ప్రాంతాలు పరిశీలన పరీక్ష జరిగిన గదితో పాటు బాత్రూమ్లు, పాఠశాల ఆవరణను విచారణాధికారులు పరిశీలించారు. బయట నుంచి ఏ విధంగా స్లిప్పు లోనికి వచ్చే సాధ్యాసాధ్యాలను అక్కడ ఉన్నవారి నుంచి సేకరించారు. పరీక్ష రద్దుకు పలువురు డిమాండ్: డీఎస్సీ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పలువురు విచారణాధికారులను డిమాండ్ చేశారు. బాలికోన్నత పాఠశాలలో ఓపెన్‌స్కూల్ పేపర్ల మూల్యాంకనం జరుగుతోంది. అందులో హాజరైనా కొందరు ఉపాధ్యాయులు ప్రస్తుత డీఎస్సీ కూడా రాయడంతో వారు విచారణాధికారుల ముందుకు వచ్చి పలు సమాచారాన్ని అందించారు. తమకు అన్యాయం చేయవద్దని తామెంతో కష్టపడ్డామని చెప్పారు. సెల్‌ఫోన్ వినియోగించారా? అభ్యర్థికి వచ్చిన ప్రశ్నపత్రం కోడ్ బయటకు వెళితేనే జవాబులు లోపలకు వచ్చే అవకాశం ఉందని భావించిన విచారణాధికారులు అభ్యర్థి సెల్‌ఫోన్ వినియోగించారా అనే కోణంలో కూడా విచారణ జరిపారు. ఇది నిర్థారణ కాకపోయినప్పటికీ కచ్చితంగా సెల్‌ఫోన్ వినియోగించి ఉండవచ్చని భావించారు. ప్రశ్నపత్రం బయటకు వెళ్లిందా అనే విషయంపైన కూడా దృష్టి సారించి దర్యాప్తు జరిపారు. -
మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్ఓ), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) పరీక్షల్లో అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని జేసీ లక్ష్మీకాంతం హెచ్చరించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శనివారం ఆయన వీఆర్ఓ, వీఆర్ఏ అభ్యర్థులతో ఫోన్ ఇన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో ఆదివారం జరిగే వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలకు 37,960 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నెల్లూరు, గూడూరు, కావలి డివిజన్లలో 94 కేంద్రాలలో పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉదయం 10 నుంచి 12గంటల వరకు వీఆర్ఓ, మధ్యాహ్నం 3 నుంచి 5గంటల వరకు వీఆర్ఏ పరీక్షలు జరుగుతాయన్నారు. నిర్ణీత సమయం దాటి ఒక్క నిమిషం ఆలస్యమైనాలోనికి అనుమతించేది లేదని చెప్పారు. నిర్ణయించిన గడువుకు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలన్నారు. మాస్ కాపీ అరికట్టేందుకు అభ్యర్థుల నుంచి వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుందన్నారు. హాల్ టికెట్లో ఫొటో లేకపోతే.. అభ్యర్థులు హాల్ టికెట్లో ఫొటో లేక పోతే గెజిటెట్ ఆఫీసర్ చేత ధ్రువీకరణపత్రం కచ్చితంగా తేవాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్నులను మాత్రమే వినియోగించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, క్యాలిక్లేటర్, వైట్నర్లు అనుమతించడం జరగదని చెప్పారు. రాంగ్ కోడింగ్ చేస్తే పేపర్ నాట్ వాల్యూడ్ ప్రశ్నపత్రాల్లో రాంగ్ కోడింగ్, కోడింగ్ చేయకపోయినా పేపర్ నాట్ వాల్యూడ్ కింద పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని జేసీ తెలిపారు. ప్రతి అభ్యర్థినీ వీడియో ద్వారా చిత్రీకరించనున్నట్లు చెప్పారు. మహిళా అభ్యర్థులను అంగన్వాడీ కార్యకర్తల ద్వారా పరిశీలించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందని అభ్యర్థులకు సంబంధించిన వారు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ రామిరెడ్డి, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, ఏపీపీఎస్‌ఈ సెక్షన్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
ఏఎన్ఎం రాతపరీక్షల్లో మాల్ ప్రాక్టీస్?
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్:హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ (ఏఎన్ఎం)ల వార్షిక పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఉన్న ఐదు ప్రైవేటు నర్సింగ్ కళాశాలల్లో చదువుతున్న 190 మంది ఏఎన్ఎం అభ్యర్థులకు మంగళవారం స్థానిక మహిళ ప్రాంగణంలో నిర్వహించారు. 190 మందికి గాను 11 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అభ్యర్థులు ఏకంగా గైడులు, స్లిప్పులు తెచ్చుకుని దర్జాగా పరీక్షలు రాస్తున్నారని తెలిసింది. దీనికి ఇన్విజిలేటర్లు సైతం సహకరించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. పరీక్ష కేంద్రానికి పాత్రికేయులు వస్తున్నారనే సమాచారం తెలియడంతో ఇన్విజిలేటర్లు అభ్యర్థుల నుంచి గైడులు, స్లిప్పులు తీసుకుని టేబుల్ కింద దాచేశారు. మరో కేంద్రంలో కుర్చీలు కింద దాచేశారు. వాటిని ఎందుకు ఉంచారనే విషయం కూడా ఇన్విజిలేటర్లు చెప్పడం లేదు.ఇదే విషయాన్ని పరీక్ష కేంద్రం పర్యవేక్షకులు వైద్య ఆరోగ్యశాఖ డిస్ట్రిక్ ట్రైనింగ్ టీమ్ పి.ఓ ప్రభాకరరావు వద్ద ప్రస్తావించగా టేబుల్, కుర్చీ కింద గైడులు, స్లిప్పులు దాచిని విషయం తెలియదని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.