మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు
పదో తరగతితో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా పరీక్షకు హాజరవుతారన్నారు. 30 నిముషాలకంటే ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, విధిగా హాల్‌టిక్కెట్ తెచ్చుకోవాలన్నారు. పరీక్ష ప్రారంభమైన అయిదు నిముషాల తరువాత ఎట్టి పరిస్థితుల్లోను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించడం జరగదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షాకేంద్రంలోకి తీసుకురారాదన్నారు. ఓఎంఆర్ షీట్ తీసుకున్న వెంటనే తన వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో విద్యార్థి సరిచూసుకోవాలని, లేని పక్షంలో ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకువెళ్ళాలన్నారు. ఇన్విజిలేటర్లు సైతం తమ సెల్‌ఫోన్లను పరీక్షాకేంద్రంలోనికి తీసుకువెళ్ళరాదన్నారు. పెన్సిల్, రబ్బర్, ప్యాడ్ వంటివి విద్యార్థులు స్వయంగా ఎవరికి వారు తీసుకువెళ్లాలని, ఎవరైనా మాల్‌ప్రాక్టీస్ లేక కాíపీయింగ్‌కు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఈవో సుప్రకాష్ స్పష్టం చేశారు.