సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు రాంగోపాల్ వర్మ వచ్చారు. ఒంగోలు రూరల్ సర్కిల్ పరిధిలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో విచారణకు ఆయన హాజరయ్యారు. గతంలో చంద్రబాబు, పవన్‌పై పోస్టులు పెట్టారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆర్జీవీపై టీడీపీ కార్యకర్త రామలింగం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని ఇటీవల మూడోసారి వర్మకు నోటీసులు జారీ చేశారు. 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన వర్మ.. ఇవాళ విచారణకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment