rural police station
-
నారా లోకేశ్ టీమ్‌పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
సాక్షి, మంగళగిరి: టీడీపీ నేత నారా లోకేశ్‌కు బిగ్ షాక్ తగిలింది. లోకేశ్‌పై మంగళగిరి మండల టీడీపీ మాజీ అధ్యక్షురాలు కృష్ణవేణి తీవ్ర విమర్శలు చేశారు. ట్విటర్లో మార్ఫింగ్‌తో తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్, అతని ఐటీ టీంపై చర్యలు తీసుకోవాలని ఆమె.. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
లోకేశ్‌పై మంగళగిరి మండల టీడీపీ మాజీ అధ్యక్షురాలు కృష్ణవేణి తీవ్ర విమర్శలు
-
అసభ్యకర ప్రవర్తన: యాదగిరిగుట్ట రూరల్ సీఐ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో మరొక పోలీస్ అధికారిపై వేటు పడింది. ఈనెల 21న అవినీతి ఆరోపణలపై సరూర్‌నగర్ సబ్ ఇన్స్పెక్టర్ సైదులును సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా.. భువనగిరి డివిజన్ పరిధిలోని యాదగిరిగుట్ట రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) జీ నర్సయ్య సస్పెండ్ అయ్యారు. స్టేషన్‌లోని ఓ మహిళా పోలీస్తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: తనిఖీల వీడియో వైరల్: క్లారిటీ ఇచ్చిన సీపీ అంజనీ కుమార్ నర్సయ్య ప్రవర్తనపై సదరు మహిళ పోలీస్ పైఅధికారుల దృష్టికి తీసుకు వచ్చిందని తెలిసింది. దీంతో విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నర్సయ్య స్థానంలో ఎల్బీనగర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అటాచ్గా ఉన్న ఇన్స్పెక్టర్ బీ నవీన్ రెడ్డిని యాదగిరిగుట్ట రూరల్ సీఐగా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: ఇదేమి చోద్యం? మూతికి ఉండాల్సిన మాస్క్ నంబర్ ప్లేటుకు .. -
‘మంగళగిరి’లో లాకప్‌డెత్?
► గుండెపోటుతో మృతి చెందినట్లుగా సెటిల్మెంట్ ► పోస్ట్‌మార్టం నిర్వహించకుండానే మృతదేహం తరలింపు మంగళగిరి: మంగళగిరి పట్టణంలోని రూరల్ స్టేషన్లో శుక్రవారం తెల్లవారుజామున ఒక యువకుడు అనుమానాద స్థితిలో మృతి చెందడం, పోలీసులు కొట్టడం కారణంగానే మృతి చెందినట్లు ఆరోపణలు రావడం, లాకప్‌డెత్ అంటూ జరిగిన ప్రచారం కలకలం సృష్టించింది. మంగళగిరి మండలంలోని కురగల్లు గ్రామానికి చెందిన నల్లిబోయిన వెంకటేశ్వరరావు(36)కు గంగమ్మతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. పొలం పనులు చేసుకునే వెంకటేశ్వరరావుకు గంగమ్మకు ఈ నెల ఐదో తేదీ రాత్రి గొడవ జరిగింది. ఆవేశంలో వెంకటేశ్వరరావు భార్యపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. దీంతో గంగమ్మ గాయాలపాలై ప్రాణాలతో బయటపడగా ఆమె సోదరుడు ఈ నెల 6వ తేదీ ఉదయం మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు 6వ తేదీ ఉదయం 11 గంటలకు వెంకటేశ్వరరావుని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అదే రోజు రాత్రి స్టేషన్లో ఏం జరిగిందో తెలియదు కాని వెంకటేశ్వరరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని చినకాకాని గ్రామంలోని ప్రైవేటు ఆసుపత్రి మార్చురీకి తరలించి కురగల్లు గ్రామ సర్పంచ్‌కు ఫోన్ చేసి వెంకటేశ్వరరావు గుండెపోటుతో రాత్రి మృతి చెందడంతో ఆసుపత్రికి తరలించామని సమాచారమిచ్చారు. సర్పంచ్ వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులకు చెప్పడంతో వారంతా ఆసుపత్రికి చేరుకున్నారు. వెంకటేశ్వరరావు మృతి చెందిన సమాచారం గ్రామంలో అందరికి తెలియడంతో శుక్రవారం గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకు ఉపక్రమించారు. మృతుడు తల్లి మంగమ్మతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో ఆసుపత్రి ఆవరణ మిన్నంటింది. దీంతో ఆందోళన చెందిన పోలీసులు కొందరు టీడీపీ పెద్దలను రంగంలోకి దించి సెటెల్మెంట్ చేసి మృతుడు గుండెపోటుతో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులను, గ్రామస్తులను ఒప్పించి మృతదేహానికి పంచనామా కూడా లేకుండా తప్పించుకున్నారని సమాచారం. దీనిపై సీఐ రావూరి సురేష్‌బాబును వివరణ కోరగా గురువారం అరెస్ట్ చేశామని ఆరోగ్యం బాగాలేదని చెబితే ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందాడన్నారు. -
తోడికోడళ్ల మృతిపై వీడని మిస్టరీ..!
రాజంపేట: మండలంలోని సిద్దులపల్లె కొత్తరాచపల్లెలో శుక్రవారం మృతి చెందిన తోడికోడళ్ల కేసుకు సంబంధించి మిస్టరీ ముడివీడలేదు. పోలీసుల విచారణలో దివ్య, జ్యోష్న మృతులపై అనేక అనుమానాలు పుట్టుకొచ్చాయి. మృతుల సంబంధీకుల్లో పలు అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా మృతదేహాలకు శుక్రవారం రాజంపేట ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం గది వద్దకు మృతిరాలి సంబంధీకులు, గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. తమ బిడ్డల మృతికి అత్తింటివారే కారణమని దివ్య, జ్యోష్న తల్లిదండ్రులు విలపించారు. తమ బిడ్డలు అత్తగారింట్లో పడుతున్న కష్టాలు వివరించేవారని, ఎప్పటికప్పుడు సర్ది చెబుతూ వచ్చామని వారు తెలిపారు. కాగా జ్యోష్న తల్లి అత్తింటిలోనే శవాన్ని పూడ్చిపెట్టాలని, మృతికి కారణమైన వారిని ఊరితీయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం నుంచే మృతుల సంబంధీకులు పెద్దఎత్తున రాజంపేట రూరల్ పోలీసుస్టేషన్ వద్దకు తరలివచ్చారు. తోడికోడళ్ల సంబంధీకుల నుంచి ఫిర్యాదు తీసుకొని రూరల్ సీఐ హేమసుందరరావు పూర్తి స్ధాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ’సాక్షి’తో మాట్లాడుతూ మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశామన్నారు. మృతదేహాలను సంబంధీకులకు అప్పగించామని తెలిపారు. అదుపులో దివ్య భర్త.. తోడికోడళ్ల మృతిలో దివ్య భర్త వెంకటేశ్వరరాజు వ్యవహరించిన తీరు పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దివ్య భర్త కువైట్‌లో ఉంటున్నాడు. మృతి చెందిన సమాచారంతో కువైట్ నుంచి హుటాహుటిన రాజంపేటకు శుక్రవారం చేరుకున్నారు. స్ధానిక ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకున్న వెంకటేశ్వరరాజు వైఖరిని మృతుల సంబంధీకులు జీర్ణించుకోలేకపోయారు. వారిలో ఆగ్రహావేశం కట్టలు తెంచుకుంది దీంతో అక్కడే ఉన్న పోలీసులు వెంకటేశ్వరరాజును అదుపులోకి తీసుకొని రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. కువైట్ నుంచి వచ్చిన వెంకటేశ్వరరాజును తోడికోడళ్ల కేసుకు సంబంధించి ముద్దాయిగా అదుపులోకి తీసుకున్నామని రాజంపేటరూరల్ ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
కలకలం రేపిన బాలికల కిడ్నాప్
రెండు గంటల్లోనే సుఖాంతం సిద్దిపేట టౌన్ : పట్టణంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన బాలికల కిడ్నాప్ కలకలం రేపింది. అయితే రెండు గంటల లోపే కథ సుఖాంతమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతంలోని శారద స్కూల్లో మానస (10), అమూల్య (10)లు 5వ తరగతి చదువుతున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు స్కూల్ నుంచి సమీపంలోని ఇంటికి భోజనానికి వెళ్లారు. భోజనానంతరం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరారు. అయితే ఇంటి సమీపంలోని మూల మలుపు వద్ద ఉన్న కిరాణ దుకాణంలో అమూల్య పెన్సిల్ కొనేందుకు వెళుతుండగా.. ఇంతలోనే ముఖాలకు మాస్క్‌లు వేసుకుని ఇద్దరు బైక్‌పై అక్కడి చేరుకున్నారు. మానస, అమూల్యల ముఖాల వద్ద మత్తు చల్లిని కర్చీఫ్‌లను ఉంచి వారిని బైక్‌పై ఎత్తుకెళ్లారు. అయితే సుమారు గంట గంట తర్వాత బాలికలు స్పృహ నుంచి బయటకి వచ్చే సరికి పట్టణంలోని ఎల్లమ్మ గుడి సమీపంలో గల సిరిసిల్ల రోడ్డు వద్ద ఉన్నారు. చుట్టు చూసే సరికి ఎవరూ లేక పోవడంతో వారు రోడ్డు పై నడుస్తూ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని వెలుమ గార్డెన్ వరకు వచ్చారు. అక్క డ ఉన్న వృద్ధురాలికి విషయాన్ని చెప్పారు. ఆమె సమీపంలోని నిర్మాణ పనులను చేస్తున్న ఇద్దరిని పిలిచి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేయించింది. బాధిత తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. -
లాస్ట్ ఛాన్స్
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇదే చివరి అవకాశం.. మంజూరైన గృహాల్లో వారం రోజుల్లోపు చేరక పోతే సీజ్ చేసి మరొకరికి కేటాయిస్తామని హౌసింగ్ పీడీ సాయినాథ్‌శర్మ నోటీసులు జారీ చేశారు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఫేజ్-1, 2, 3 కింద అర్బన్, రూరల్ పరిధిలో దాదాపు 10 వేల గృహాలను మంజూరు చేశారు. అయితే ఫేజ్-1లోని అర్బన్, రూరల్ పరిధిలో రూ. 40 వేలతో ప్రభుత్వమే గృహాలు నిర్మించి ఇచ్చింది. ఇందులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఫేజ్-2 పరిధిలో మంజూరయిన గృహాలను లబ్ధిదారుడే నిర్మించుకోవాలన్న ఆదేశాలు వచ్చాయి. ఈ సమయంలోనే ఐహెచ్ఎస్డీపీ కింద మరో 350కి పైగా గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో రూ.60లక్షల మేర హౌసింగ్ ఏఈలు, వర్క్ఇన్స్పెక్టర్లు అవినీతికి పాల్పడ్డారంటూ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో వారిని అరెస్టు కూడా చేశారు. ఇందిరమ్మ గృహాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో హౌసింగ్ స్పెషల్ అధికారి సుధాకర్‌రెడ్డితో కలెక్టర్ విచారణ చేయించారు. అధికారుల తప్పిదాలపై సుధాకర్‌రెడ్డి లిఖిత పూర్వక విచారణ నివేదికను కలెక్టర్‌కు అందించారు. దీంతో హౌసింగ్ పీడీతోపాటు డీఈలు, ఏఈలతో కలిపి మొత్తం 13 మంది దాకా సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ లబ్దిదారులకు మంజూరయిన గృహాలను 2013 నవంబర్ నెలలో కొందరు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. వారంలోపు చేరాలంటూ నోటీసులు... ఇందిరమ్మ కాలనీలోని గృహాలను 2013 నవంబర్ 28వ తేదీన హౌసింగ్ పీడీ, డీఈ, ఈఈ, ఏఈలు పరిశీలించారు. గృహాలకు తాళాలు వేసిన వాటిని, ఇంకా నిర్మించు కోకుండా అసంపూర్తిగాా ఉన్న వాటిని, లబ్ధిదారులు కాకుండా మరొకరు నివాసం ఉంటున్న వాటిని గుర్తించి రెండు వారాల గడువు ఇచ్చారు. అయినా లబ్ధిదారులు గృహాల్లో చేరటానికి ముందుకు రాలేదు. మొత్తం 653 లబ్ధిదారుల వివరాలను హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు సేకరించారు. ఈ మేరకు నివేదిక అందడంతో వారంలోపు గృహాల్లో చేరాలని, ఇది చివరి అవకాశంగా పేర్కొంటూ శుక్రవారం రాత్రి హౌసింగ్ పీడీ నోటీసులు జారీ చేశారు. వీటిని శనివారం గృహాలకు అంటించారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వం.. వారంలోపు గృహాల్లో చేరక పోతే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే సీజ్ చేస్తాం. అలాంటి గృహాలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో లబ్ధిదారునికి కేటాయిస్తాం.. -
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. పదిమందికి గాయాలు
అవంతీపురం(మిర్యాలగూడ క్రైం), న్యూస్‌లైన్: రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన మిర్యాలగూడ మండలం అవంతీపురంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రయా ణికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ వైపు వస్తుండగా మణుగూరు డిపోనకు చెందిన బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మణుగూరు బస్సులో ఉన్న మండలంలోని ఏడు కోట్ల తండాకు చెందిన రంగమ్మ, శాంతి, శ్రీనివాస్‌నగర్‌కు చెందిన మాధవి, విజయలక్ష్మి, హైదలాపురానికి చెందిన యామినిలతో పాటు మరో ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీస్‌స్టేషన్ సిబ్బంది తెలిపారు. ఆటోబోల్తా.. ముగ్గురికి.. తోపుచర్ల (మిర్యాలగూడ): ఆటోబోల్తా పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన వేములపల్లి మండలం తోపుచర్ల గ్రామ పంచాయతీ పరిధి గండ్రవానిగూడెంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..తోపుచర్ల గ్రామ పంచాయతీ పరిధి సీత్యాతండాకు చెందిన భానావత్ రమేష్ ఆటోలో ఐదుగురు వ్యక్తులు ఇటీవల మహబుబ్‌నగర్ జిల్లా మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లారు.తిరుగు ప్రయాణంలో ఆటో గండ్రవానిగూడెం గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సీత్యాతండాకు చెందిన డ్రైవర్ రమేష్, వాంకుడోతు గోపాల్, ధనావత్ హరిలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పోలీసు కుటుంబాలకు పరిహారం పంపిణీ
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు రూరల్ ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ శనివారం తన కార్యాలయంలో పరిహారం పంపిణీ చేశారు. చీడికాడ పోలీస్ స్టేషన్లో పనిచేసి మృతి చెందిన హెచ్‌సీ కె.అప్పన్న భార్య కోడా వెంకటలక్ష్మికి, హుకుంపేట పీఎస్ ఏఎస్ఐ ఎన్.సోమయ్య భార్య విజయకుమారికి, మంప పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్ సోబా రాంబాబు భార్య సర్వలక్ష్మిలకు తలో రూ.50 వేలు పంపిణి చేశారు. అదే విధంగా 2011-12,2012-14 విద్యా సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన సిబ్బంది పిల్లలకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. అనంతరం కంట్రోల్ రూం ఎస్ఐ సిహెచ్.రాంబాబు, అనకాపల్లి సీసీఎస్ ఎల్.తాతబ్బాయి, అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన చోటా సాహెబ్‌లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డి.ఎన్.కిశోర్, నర్సీపట్నం ఏఆర్ డీఎస్పీ దామోదర్, ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ సిహెచ్.వివేకానంద, జిల్లా అధ్యక్షుడు జె.వి.ఆర్.సుబ్బరాజు, సిబ్బంది పాల్గొన్నారు.