కలకలం రేపిన బాలికల కిడ్నాప్ | kidnapped girls at siddipet | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన బాలికల కిడ్నాప్

Published Tue, Sep 2 2014 2:34 AM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM

కలకలం రేపిన బాలికల కిడ్నాప్ - Sakshi

కలకలం రేపిన బాలికల కిడ్నాప్

రెండు గంటల్లోనే సుఖాంతం
సిద్దిపేట టౌన్ : పట్టణంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన బాలికల కిడ్నాప్ కలకలం రేపింది. అయితే రెండు గంటల లోపే కథ సుఖాంతమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతంలోని శారద స్కూల్లో మానస (10), అమూల్య (10)లు  5వ తరగతి చదువుతున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు స్కూల్ నుంచి సమీపంలోని ఇంటికి భోజనానికి వెళ్లారు. భోజనానంతరం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరారు. అయితే ఇంటి సమీపంలోని మూల మలుపు వద్ద ఉన్న కిరాణ దుకాణంలో అమూల్య పెన్సిల్ కొనేందుకు వెళుతుండగా..  ఇంతలోనే ముఖాలకు మాస్క్‌లు వేసుకుని ఇద్దరు బైక్‌పై అక్కడి చేరుకున్నారు.

మానస, అమూల్యల ముఖాల వద్ద మత్తు చల్లిని కర్చీఫ్‌లను ఉంచి వారిని బైక్‌పై ఎత్తుకెళ్లారు. అయితే సుమారు గంట గంట తర్వాత బాలికలు స్పృహ నుంచి బయటకి వచ్చే సరికి పట్టణంలోని ఎల్లమ్మ గుడి సమీపంలో గల సిరిసిల్ల రోడ్డు వద్ద ఉన్నారు. చుట్టు చూసే సరికి ఎవరూ లేక పోవడంతో వారు రోడ్డు పై నడుస్తూ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని వెలుమ గార్డెన్ వరకు వచ్చారు. అక్క డ ఉన్న వృద్ధురాలికి విషయాన్ని చెప్పారు. ఆమె సమీపంలోని నిర్మాణ పనులను చేస్తున్న ఇద్దరిని పిలిచి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేయించింది. బాధిత తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement