Girls kidnapped
-
ధవళేశ్వరంలో కిడ్నాపైన ఇద్దరు బాలికలు
-
ముగ్గురు హాస్టల్ బాలికల కిడ్నాప్
జయపురం: గత ఏడాది అక్టోబర్‌లో కొరాపుట్ జిల్లా కుందులి సమీప సొరిసిపొదర్ ఆదివాసీ సంక్షేమ పాఠశాలలో ఓ బాలికను నలుగురు అపహరించి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారన్న ఆరోపణల అనంతరం బాలిక అత్మహత్యకు పాల్పడిన సంఘటన నేటికీ కొరాపుట్ జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలను కలవరపరుస్తోంది. తాజాగా కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సమితి పొరజబొడిపొదర్ గ్రామంలోగల ఆదివాసీ సంక్షేమ పాఠశాల హాస్టల్ ఉంటున్న ముగ్గురు ఆదివాసీ విద్యార్థినులను సోమవారం ఉదయం ఎవరో అపహరించారన్న వార్త వెలుగులోకి వచ్చింది. మరోసారి కలకలం రేగింది. కిడ్నాప్‌కు గురైన ముగ్గురిలో ఇద్దరు 6వ తరగతి విద్యార్థినులు కాగా మరో బాలిక 9వ తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం 7గురు విద్యార్థినులు మూత్ర విసర్జనకు హాస్టల్నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో బొలెరో వాహనంలో కొందరు వచ్చి వారి ముఖాలపై టార్చిలైట్ వేయడంతో భయంతో నలుగురు విద్యార్థినులు స్పృహ తప్పి పడిపోయారని, మిగతా ముగ్గురు విద్యార్థినులు కిడ్నాప్‌కు గురయ్యారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న బాధిత బాలికల తల్లిదండ్రులు వెంటనే పొరజబెడిపొదర్ గ్రామానికి వచ్చి అందరినీ అడిగిన తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలికల తరఫున ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కలకలం రేపిన బాలికల కిడ్నాప్
రెండు గంటల్లోనే సుఖాంతం సిద్దిపేట టౌన్ : పట్టణంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన బాలికల కిడ్నాప్ కలకలం రేపింది. అయితే రెండు గంటల లోపే కథ సుఖాంతమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతంలోని శారద స్కూల్లో మానస (10), అమూల్య (10)లు 5వ తరగతి చదువుతున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు స్కూల్ నుంచి సమీపంలోని ఇంటికి భోజనానికి వెళ్లారు. భోజనానంతరం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరారు. అయితే ఇంటి సమీపంలోని మూల మలుపు వద్ద ఉన్న కిరాణ దుకాణంలో అమూల్య పెన్సిల్ కొనేందుకు వెళుతుండగా.. ఇంతలోనే ముఖాలకు మాస్క్‌లు వేసుకుని ఇద్దరు బైక్‌పై అక్కడి చేరుకున్నారు. మానస, అమూల్యల ముఖాల వద్ద మత్తు చల్లిని కర్చీఫ్‌లను ఉంచి వారిని బైక్‌పై ఎత్తుకెళ్లారు. అయితే సుమారు గంట గంట తర్వాత బాలికలు స్పృహ నుంచి బయటకి వచ్చే సరికి పట్టణంలోని ఎల్లమ్మ గుడి సమీపంలో గల సిరిసిల్ల రోడ్డు వద్ద ఉన్నారు. చుట్టు చూసే సరికి ఎవరూ లేక పోవడంతో వారు రోడ్డు పై నడుస్తూ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని వెలుమ గార్డెన్ వరకు వచ్చారు. అక్క డ ఉన్న వృద్ధురాలికి విషయాన్ని చెప్పారు. ఆమె సమీపంలోని నిర్మాణ పనులను చేస్తున్న ఇద్దరిని పిలిచి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేయించింది. బాధిత తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు.