టీమిండియా స్టార్ ప్లేయర్, కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ డౌన్ టు ఎర్త్ క్రికెటర్లలో ఒకడు. పేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ సింగ్.. తనకు ఇష్టమైన ఆటకోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒకొనొక దశలో స్వీపర్‌గా పనిచేసిన రింకూ.. ఇప్పుడు భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
అయితే రింకూ సింగ్ విజయం వెనక అతడి తండ్రిది ఖన్‌చంద్ర సింగ్ కీలక పాత్ర. ఖన్‌చంద్ర సిలిండర్ల మోస్తే వచ్చే డబ్బుతో రింకూ క్రికెట్ ఆడేవాడు. అతడి సంపాదనతో కుటుంబం మొత్తం గడిచేది. అయితే తాజాగా రింకూ సింగ్ తన తండ్రిపై ప్రేమను చాటుకున్నాడు. తన తండ్రికి రింకూ ఖరీదైన నింజా స్పోర్ట్స్ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు.
ఆ బైక్ ఖరీదు రూ. 3.19 లక్షలగా ఉన్నట్లు తెలుస్తోంది. నింజా స్పోర్ట్స్ బైక్‌తో రింకూ తండ్రి అలీఘడ్‌లో చక్కర్లు కొడుతున్నాడు. ఆ సిటీలోని చిన్న చిన్న వీధుల్లో అతను కవాసాకి నింజా బైక్‌ను రైడ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కాగా తన తనయుడు స్టార్ క్రికెటర్ అయినప్పటికి.. ఖన్‌చంద్ర ఇంకా వంటగ్యాస్ సిలిండర్లను సరఫరా చేసే పనని వదలకపోవడం విశేషం. మరోవైపు రింకూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించారు. త్వరలోనే ఎంగేజ్మెంట్ జరిగే అవకాశముంది. కాగా రింకూ సింగ్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్దమవుతున్నాడు. బుధవారం జరగనున్న తొలి టీ20లో రింకూ ఆడనున్నాడు.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే! అతడికి నో ఛాన్స్?
Comments
Please login to add a commentAdd a comment