కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 మరి కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశస్రాలను సిద్దం చేసుకునున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదతో ఉన్నాయి. ఇప్పటికే తొలి టీ20 కోసం ఇంగ్లండ్ క్రికెట్ తమ తుది జట్టును ప్రకటించింది. జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, లివింగ్‌స్టోన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కన్పిస్తోంది.
బౌలింగ్ విభాగంలో కూడా మార్క్ వుడ్, ఆర్చర్, అదిల్ రషీద్ వంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. దీంతో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో తొలి టీ20 కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Aswin) ఎంపిక చేశాడు. అశ్విన్ తన ఎంచుకున్న జట్టులో ఓపెనర్లగా ఎడమచేతి వాటం బ్యాటర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌లకు అవకాశమిచ్చాడు.
అదే విధంగా వరుసగా మూడు నాలుగు స్ధానాల్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలకు చోటు దక్కింది. అయితే పరిస్థితుల బట్టి వీరిద్దరి బ్యాటింగ్ ఆర్డర్ మారే ఛాన్స్ ఉందని అశూ అభిప్రాయపడ్డాడు. ఫినిషర్లగా టాలిస్మానిక్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, డైనమిక్ బ్యాటర్ రింకు సింగ్‌లకు అశ్విన్ ఛాన్స్ ఇచ్చాడు. అదేవిధంగా ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్‌తో పాటు వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్,నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్ దక్కింది.
అయితే తుది జట్టులో చోటు కోసం నితీశ్, వాషింగ్టన్ సుందర్ మధ్య పోటీ నెలకొందని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. ఫాస్ట్ బౌలర్లగా మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేసిన అశ్విన్.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తిని పరిగణలోకి తీసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌తో టీ20 అరంగేట్రం చేస్తుడనుకుంటున్న యువ పేసర్ హర్షిత్ రాణా(harshit rana)కు అశ్విన్ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ మ్యాచ్ సాయంత్రం 7: 00 గంటలకు ప్రారంభం కానుంది.
అశ్విన్ ఎంపిక చేసిన భారత ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి/వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్ మరియు మహమ్మద్ షమీ
ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టతెన్), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్‌టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
చదవండి: జైస్వాల్‌కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు
Comments
Please login to add a commentAdd a comment