breaking news
india vs england
-
ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ చేసిన మరో టీమిండియా యువ సంచలనం
ప్రస్తుతం భారత క్రికెట్ మొత్తం ఇంగ్లండ్ చుట్టూ తిరుగుతుంది. పురుషులు, మహిళలు, దివ్యాంగులు.. ఇలా విభాగంతో సంబంధం లేకుండా భారత క్రికెటర్లంతా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నారు. భారత పురుషుల సీనియర్ జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుండగా.. భారత పురుషుల అండర్-19 జట్టు ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో ఐదు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్ ఆడుతుంది. భారత సీనియర్ మహిళల జట్టు కూడా ఇంగ్లండ్‌లోనే ఉంది. ఈ పర్యటనలో భారత జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. పురుషులు, మహిళల జట్లే కాక, భారత పురుషుల దివ్యాంగ జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ జట్టు ఇంగ్లండ్ దివ్యాంగ టీమ్‌తో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఇదే కాక చాలామంది భారత పురుష క్రికెటర్లు ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు. టీమిండియా యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, ఖలీల్ అహ్మద్ వేర్వేరు జట్ల తరఫున కౌంటీ ఛాంపియన్షిప్ ఆడుతున్నారు. వీరిలో తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ తమ కౌంటీ అరంగేట్రంలోనే సెంచరీలు చేసి అదరగొట్టగా.. మిగతా ఇద్దరు తమ తొలి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.పైన పేర్కొన్న జట్లు, ఆటగాళ్లే కాక ప్రస్తుతం మరో భారత స్థానిక జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ ఎమర్జింగ్ జట్టును ఇంగ్లండ్‌కు పంపింది. ఈ జట్టు ప్రస్తుతం నాట్స్ సెకెండ్ 11తో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ సెంచరీతో అదరగొట్టాడు. ముషీర్ 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ముషీర్ సెంచరీ చేసిన విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఓ అధికారి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.HUNDRED FOR MUSHEER KHAN 🇮🇳- Mumbai Cricket Association has sent the Emerging players to UK and they are currently playing against Notts 2nd 11, A great work by MCA for Developing the young stars. pic.twitter.com/lFkqecQ37n— Johns. (@CricCrazyJohns) June 30, 2025ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న అన్ని భారత క్రికెట్ జట్లలో ఒక్క భారత సీనియర్ పురుషుల జట్టు మినహా అన్ని జట్లు సక్సెస్ చూశాయి. భారత సీనియర్ పురుషుల జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఓటమిపాలు కాగా.. అండర్-19 జట్టు తొలి వన్డేలో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. మరోవైపు భారత సీనియర్ మహిళల జట్టు తొలి టీ20లో ఇంగ్లండ్‌ను చిత్తు చేయగా.. భారత పురుషుల దివ్యాంగుల జట్టు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌ను ఓడించింది.ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత ఆటగాళ్లలో చాలామంది శతకాలు చేశారు. సీనియర్ పురుషుల జట్టులో జైస్వాల్, గిల్, రాహుల్, పంత్ (2).. సీనియర్ మహిళల జట్టులో స్మృతి మంధన.. కౌంటీల్లో తిలక్ వర్మ, ఇషాన్ కిషన్.. తాజాగా ముషీర్ ఖాన్ శతకాలతో హోరెత్తించారు. ముషీర్ ఖాన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఈ సీజన్లో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. ముషీర్ దేశవాలీ సీజన్లో అన్న సర్ఫరాజ్ ఖాన్‌తో పోటీపడి పరుగులు సాధిస్తున్నాడు. అన్నదమ్ములిద్దరూ ముంబై జట్టుకే ఆడతారు. సర్ఫరాజ్ ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌పై తృటిలో సెంచరీ చేజార్చుకుప్పటికీ.. టీమిండియా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో మెరుపు సెంచరీ చేశాడు. అయినా అతనికి భారత జట్టు నుంచి పిలుపు రాలేదు. -
టీమిండియాతో రెండో టెస్ట్.. తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. స్టార్ ఆటగాడికి నో ఛాన్స్
జులై 2వ తేదీ నుంచి బర్మింగ్హమ్ వేదికగా టీమిండియాతో జరుగబోయే రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ (జూన్ 30) ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే యథాతథంగా కొనసాగించింది. రెండో టెస్ట్ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. తొలి టెస్ట్‌లో రాణించిక పోయినా ఇంగ్లండ్ మేనేజ్మెంట్ క్రిస్ వోక్స్‌పై నమ్మకం ఉంచింది. అతనితో పాటు జోష్ టంగ్, బ్రైడన్ కార్స్‌ను కొనసాగించింది. నాలుగో పేసర్‌గా కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యవహరించనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా షోయబ్ బషీర్ కొనసాగనున్నాడు. బ్యాటింగ్ విభాగంలో జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్,జో రూట్, హ్యారీ బ్రూక్ తమ యధా స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. వికెట్‌కీపర్‌గా జేమీ స్మిత్ వ్యవహరించనున్నాడు.రెండో టెస్ట్ జులై 2న భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక పరాజయంపాలైంది.ఛేదనలో బెన్ డకెట్ (149) సూపర్ సెంచరీ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. జాక్ క్రాలే (65), జో రూట్ (53 నాటౌట్), బెన్ స్టోక్స్ (33), జేమీ స్మిత్ (44 నాటౌట్) తలో చేయి వేశారు. భారత బౌలర్లు సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని పరుగులు చేశారు. ప్రసిద్ద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవీంద్ర జడేజాది కూడా అదే పరిస్థితి.ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్బుతంగా ఆడారు. అయినా సెకెండ్ ఇన్నింగ్స్‌లో బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదు శతకాలు నమోదైన ప్రయోజనం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134) సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు. ఇంగ్లండ్ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్ (106) సెంచరీ చేయగా.. హ్యారీ బ్రూక్ (99) తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన చేసినప్పటికీ ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది.టీమిండియాతో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్ -
నిరాశపరిచిన ఆయుశ్ మాత్రే.. మరోసారి విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
14 ఏళ్ల భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై మరోసారి రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ అండర్ 19 జట్టుతో ఇవాళ (జూన్ 30) జరుగుతున్న మ్యాచ్‌లో మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తొలి వన్డేలో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిస వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. వైభవ్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అర్హమైన హాఫ్ సెంచరీలను మిస్ చేసుకున్నాడు. మరోవైపు వైభవ్‌తో పాటు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మరో ఐపీఎల్ సంచలన ఆయుశ్ మాత్రే ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. మాత్రే తానెదుర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు (గోల్డెన్ డక్). మాత్రే వైభవ్ తరహాలో కాకపోయినా తొలి వన్డేలో పర్వాలేదనిపించాడు. ఆ మ్యాచ్‌లో అతను 30 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 21 పరుగులు చేశాడు.రెండో వన్డే విషయానికొస్తే.. ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అధికారికంగా తొలి బంతికే ఆయుశ్ మాత్రే (0) వికెట్ కోల్పోయిన భారత్.. ఆతర్వాత కుదురుకుంది. వైభవ్ సూర్యవంశీ (45), విహాన్ మల్హోత్రా (49), చవ్డా (22), అభిగ్యాన్ కుందు (32), రాహుల్ కుమార్ (47), కనిష్క్ చౌహాన్ (45) రాణించడంతో ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. అయితే చివరి వరుస ఆటగాళ్లు వెంటవెంటనే ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ 49 ఓవర్లలో 290 పరుగుల వద్ద ముగిసింది (ఆలౌట్). ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్ 4 వికెట్లు పడగొట్టగా.. జాక్ హోమ్, అలెక్స్ గ్రీన్ తలో 3 వికెట్లు తీశారు. కాగా, భారత అండర్-19 జట్టు 5 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. నాటింగ్హమ్ వేదికగా ప్రస్తుతం రెండో వన్డే జరుగుతుండగా.. హోవ్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ ఇంగ్లండ్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 42.2 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూలగా.. భారత్ కేవలం 24 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ పర్యటనలో భారత జట్టుకు ఆయుశ్ మాత్రే సారథ్యం వహిస్తున్నాడు. -
టీమిండియా చేతిలో దారుణ ఓటమి.. ఇంగ్లండ్ జట్టుకు మరో షాక్
నాటింగ్హమ్ వేదికగా నిన్న (జూన్ 28) జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్‌పై భారత మహిళల క్రికెట్ జట్టు 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధన విధ్వంసకర శతకం (62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు) సాధించి టీమిండియాను గెలిపించింది. ఈ సెంచరీతో మంధన మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. మంధన కేవలం 51 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకుంది. తద్వారా మహిళల టీ20ల్లో ఐదో ఫాస్టెస్ట్ సెంచరీని, భారత్ తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీని (హర్మన్-49 బంతుల్లో) నమోదు చేసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మంధన శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల ధాటికి కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కడప అమ్మాయి శ్రీచరణీ నాలుగు వికెట్లతో సత్తాచాటింది. ఆమెతో పాటు దీప్తీ శర్మ, రాధా యాదవ్ తలో రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ సీవర్ బ్రంట్(66) టాప్ స్కోరర్‌గా నిలిచింది.ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో షాక్ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్‌లో 10 శాతం జరిమానాగా విధించబడింది. నిర్ణీత సమయంలోగా ఇంగ్లండ్ రెండు ఓవర్లు వెనుకపడింది. ఓవర్‌కు 5 శాతం చొప్పున ఐసీసీ 10 శాతం మ్యాచ్ ఫీజ్‌ను జరిమానాగా విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఇది ఆర్టికల్ 2.22 నిబంధన ఉల్లంఘన కిందికి వస్తుంది. ఐసీసీ జరిమానాను ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ స్వీకరించింది. ఇంగ్లండ్ జట్టులోకి సభ్యులందరికీ ఈ జరిమానా వర్తిస్తుంది.కాగా, ఇంగ్లండ్ మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఓటమి. టీ20ల్లో ఇంగ్లండ్‌పై 200 ప్లస్ స్కోర్ చేసిన రెండో జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కింది. రెండో టీ20 బ్రిస్టల్ వేదికగా జులై 1న జరుగనుంది. -
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్! వీడియో వైరల్
భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జూలై 2 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాకు కాస్త ఊరట లభించింది. శనివారం జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పాల్గోన్నాడు.శుక్రవారం జరిగిన మొదటి ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. రెండో రోజు మాత్రం దాదాపు ఆరగంట పాటు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. రెండో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బుమ్రా తిరిగి మళ్లీ నెట్స్‌లో కన్పించడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అయితే రెండవ టెస్ట్‌లో బుమ్రా పాల్గొనడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో తమ రిపోర్ట్‌లో పేర్కొంది. కాగా ఈ సిరీస్‌కు ముందే బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే ఆడతాడని టీమిండియా మెనెజ్‌మెంట్ స్పష్టం చేసింది.కానీ ఏ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఒకవేళ రెండో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ యాజమాన్యం భావిస్తే.. వారి నిర్ణయాన్ని మార్చుకునే అవకాశముంది. ఎందుకంటే తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్‌కు.. బర్మింగ్‌హామ్ టెస్టు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ 1-1 సమమవుతోంది. అదే ఓడిపోతే 0-2తో టీమిండియా వెనకబడుతోంది. కాబట్టి రెండో టెస్టులో ఆడించి బుమ్రాకు మూడో టెస్టుకు విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు గంభీర్ అండ్ కో ఉన్నట్లు సమాచారం. బుమ్రా విషయంలో మరి ఏ నిర్ణయం తీసుకుంటారో మరో మూడు రోజులు వేచి చూడాలి.కాగా రెండో రోజు ప్రాక్టీస్‌కు టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాక్టీస్‌లో మాత్రం భారత జట్టు ఫీల్డింగ్, ఫిట్నెస్ డ్రిల్స్‌పై ఎక్కువగా దృష్టిసారించింది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి భారత ప్లేయర్‌గాBoom Time! 💣 pic.twitter.com/AhXEZg2ven— Sahil Malhotra (@Sahil_Malhotra1) June 28, 2025 -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి భారత ప్లేయర్‌గా
ఇంగ్లండ్ పర్యటనను భారత మహిళల జట్టు ఘనంగా ఆరంభించింది. శనివారం నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను 97 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఉమెన్ ఇన్ బ్లూ ఆధిక్యంలో దూసుకెళ్లింది.211 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అమ్మాయిలు చేధించలేకపోయారు. భారత బౌలర్ల దాటికి ఇంగ్లండ్ కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కడప అమ్మాయి శ్రీచరణీ నాలుగు వికెట్లతో సత్తాచాటింది. ఆమెతో పాటు దీప్తీ శర్మ, రాధా యాదవ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ స్కివర్ బ్రంట్(66) టాప్ స్కోరర్‌గా నిలిచింది.చరిత్ర సృష్టించిన మంధానఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. ఆది నుంచి దూకుడుగా ఆడిన మంధాన.. కేవలం 51 బంతుల్లోనే తన తొలి టీ20 సెంచరీ మార్క్‌ను అందుకుంది. స్మృతి మొత్తంగా 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసింది. ఈ క్రమంలో మంధాన పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా స్మృతి చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏ ఇండియా ఉమెన్ ప్లేయర్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.అదేవిధంగా ఇంగ్లండ్‌పై అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన మహిళ క్రికెటర్‌గా ఆసీస్ సూపర్ స్టార్ బెత్ మూనీ రికార్డును మంధాన సమం చేసింది. ఆల్ఫార్మాట్లో మంధాన ఇప్పటివరకు 8 సార్లు ఏభైకి పైగా పరుగులు చేయగా.. మూనీ కూడా సరిగ్గా 8 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్ సాధించింది.ఇంగ్లండ్‌పై అత్యధిక 50 ప్లస్ స్కోర్లు:స్మృతి మంధాన: 8బెత్ మూనీ: 8మెగ్ లానింగ్: 5డియాండ్రా డాటిన్: 3హేలీ మాథ్యూస్: 3డేన్ వాన్ నీక్: 3చదవండి: అరంగేట్రంలోనే సెంచరీ.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా టీనేజర్ -
స్మృతి సెంచరీ ధమాకా.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. టాప్ బ్యాటర్ స్మృతి మంధాన టి20ల్లో తొలి శతకంతో చెలరేగడంతో ఈ ఫార్మాట్లో రెండో అత్యధిక స్కోరు చేసిన టీమిండియా... అనంతరం బౌలింగ్‌లోనూ ఇంగ్లండ్‌ను కట్టిపడేసి సిరీస్ ఆరంభ పోరులో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ శ్రీచరణి అరంగేట్రం టి20లోనే నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. నాటింగ్‌హామ్: ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి పోరులో టీమిండియా 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఈ ఫార్మాట్లో టీమిండియాకు ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు సారథ్యం వహించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (62 బంతుల్లో 112; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో విజృంభించింది. టి20ల్లో స్మృతికి ఇదే తొలి శతకం కాగా... హర్లీన్ డియోల్ (23 బంతుల్లో 43; 7 ఫోర్లు) రాణించింది. చాన్నాళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచి్చన ఓపెనర్ షఫాలీ వర్మ (20) ఫర్వాలేదనిపించగా... రిచా ఘోష్ (12), జెమీమా రోడ్రిగ్స్ (0) విఫలమయ్యారు. తొలి వికెట్‌కు షఫాలీతో కలిసి 77 పరుగులు జోడించిన స్మృతి... రెండో వికెట్‌కు హర్లీన్‌తో 94 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో లౌరెన్ బెల్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 14.5 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1–0తో ఆధిక్యంలో నిలిచింది. మరోవైపు టి20ల్లో పరుగుల పరంగా ఇంగ్లండ్‌కు ఇదే అతిపెద్ద పరాజయం. నటాలియా సీవర్ బ్రంట్ (42 బంతుల్లో 66; 10 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా... టామీ బ్యూమౌంట్ (10), ఎమ్ అర్లాట్ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. డానీ వ్యాట్ (0), డాంక్లీ (7), అమీ జోన్స్ (1), కాప్సీ (5), ఎకెల్‌స్టోన్ (1) విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీ చరణి 4 వికెట్లతో అదరగొట్టింది. ఇప్పటికే జాతీయ జట్టు తరఫున 5 వన్డేలు ఆడిన శ్రీచరణి... అరంగేట్ర టి20లోనే తన స్పిన్‌తో ప్రత్యరి్థని ఉక్కిరిబిక్కిరి చేసింది. దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మంగళవారం బ్రిస్టల్ వేదికగా రెండో టి20 జరగనుంది. స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) ఎకిల్‌స్టోన్ (బి) అర్లాట్ 20; స్మృతి (సి) సీవర్ బ్రంట్ (బి) ఎకెల్‌స్టోన్ 112; హర్లీన్ (సి) అర్లాట్ (బి) బెల్ 43; రిచా (సి) డాంక్లీ (బి) బెల్ 12; జెమీమా (సి) సీవర్ బ్రంట్ (బి) బెల్ 0; అమన్‌జ్యోత్ (నాటౌట్) 3; దీప్తి శర్మ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–77, 2–171, 3–186, 4–190, 5–202. బౌలింగ్: లౌరెన్ బెల్ 4–0–27–3; అర్లాట్ 4–0–38–1; లౌరెన్ ఫిలెర్ 4–0–35–0; లిన్సీ స్మిత్ 3–0–41–0; సోఫీ ఎకెల్‌స్టోన్ 3–0–43–1; కాప్సీ 2–0–21–0. ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: డాంక్లీ (సి) రిచా (బి) అమన్‌జ్యోత్ 7; డానీ వ్యాట్ (సి) హర్లీన్ (బి) దీప్తి 0; నటాలియా సీవర్ బ్రంట్ (సి) రిచా (బి) శ్రీచరణి 66; బ్యూమౌంట్ (బి) దీప్తి 10; అమీ జోన్స్ (స్టంప్డ్) రిచా (బి) రాధ 1; కాప్సీ (సి) అరుంధతి (బి) శ్రీచరణి 5; అర్లాట్ (సి) స్మృతి (బి) రాధ 12; ఎకెల్‌స్టోన్ (సి) జెమీమా (బి) శ్రీచరణి 1; లౌరెన్ ఫిలెర్ (సి) రిచా (బి) అరుంధతి 2; లిన్సీ స్మిత్ (నాటౌట్) 0; లౌరెన్ బెల్ (సి) జెమీమా (బి) శ్రీచరణి 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (14.5 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–9, 2–9, 3–58, 4–62, 5–70, 6–88, 7–102, 8–111, 9–111, 10–113. బౌలింగ్: అమన్‌జ్యోత్ కౌర్ 2–0–22–1; దీప్తి శర్మ 3–0–32–2; శ్రీచరణి 3.5–0–12–4; అరుంధతి రెడ్డి 2–0–18–1; రాధా యాదవ్ 2–0–15–2; స్నేహ్ రాణా 2–0–13–0. 1 టి20ల్లో స్మృతి మంధానకు ఇదే తొలి సెంచరీ కాగా... మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా స్మృతి చరిత్ర సృష్టించింది.2 టి20 ఫార్మాట్లో టీమిండియాకు ఇది (210/5) రెండో అత్యధిక స్కోరు. గతేడాది వెస్టిండీస్‌పై 217/4 స్కోరు సాధించింది. -
ఇంగ్లండ్ గడ్డపై స్మృతి మంధాన విధ్వంసకర శతకం
ఇంగ్లండ్‌తో తొలి టీ20లో భారత మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) అద్భుత శతకంతో మెరిసింది. ఆది నుంచి నిలకడగా ఆడిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ యాభై ఒక్క బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుంది. కాగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో స్మృతికి ఇదే తొలి శతకం కావడం విశేషం. దీంతో ఆనందంలో మునిగిపోయిన స్మృతి హెల్మెట్ తీసి.. బ్యాట్ చూపిస్తూ నవ్వులు చిందిస్తూ సెలబ్రేట్ చేసుకుంది.ఇంగ్లండ్ పర్యటనలో..కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత మహిళా జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగనుండగా.. శనివారం నాటి తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షఫాలీ వర్మ (20) స్వల్ప స్కోరుకే వెనుదిరిగింది. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ స్మృతి మంధాన.. వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దింది.51 బంతుల్లో సెంచరీఈ క్రమంలో స్మృతి మంధాన 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. హర్లీన్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైంది. ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్ (8) త్వరగానే పెవిలియన్ చేరగా.. జెమీమా రోడ్రిగెస్ డకౌట్ అయింది. ఇక స్మృతి మొత్తంగా 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసి.. సోఫీ ఎక్లిస్టోన్ బౌలింగ్‌లో నాట్ సీవర్- బ్రంట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైంది.ఇంగ్లండ్‌క్ష్యం 211అమన్‌జోత్ కౌర్ 3, దీప్తి శర్మ ఏడు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇక స్మృతి అద్భుత శతకం ఫలితంగా.. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 210 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యం విధించింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టగా.. ఎమ్ ఆర్లోట్, సోఫీ ఎక్లిస్టోన్ ఒక్కో వికెట్ తీశారు. కాగా టీ20లలో భారత మహిళా జట్టుకు ఇది రెండో అత్యుత్తమ స్కోరు. ఇంతకు ముందు ముంబై వేదికగా వెస్టిండీస్‌పై భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.ఇంగ్లండ్ వుమెన్ వర్సెస్ ఇండియా వుమెన్ తుదిజట్లుఇండియాస్మృతి మంధాన (కెప్టెన్), షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగెస్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి.ఇంగ్లండ్సోఫియా డంక్లీ, డానియెల్ వ్యాట్-హాడ్జ్, నాట్ సీవర్-బ్రంట్ (కెప్టెన్), టామీ బౌమౌంట్, ఎమీ జోన్స్ (వికెట్ కీపర్), అలిస్ కాప్సీ, సోఫీ ఎక్లిస్టోన్, ఎమ్ ఆర్లోట్, లారెన్ ఫిలర్, లిన్సీ స్మిత్, లారెన్ బెల్.చదవండి: ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు! -
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. చరిత్రకు అడుగు దూరంలో జైశ్వాల్
భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జూలై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తిరిగి పుంజుకోవాలని భారత్ భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం తమ జోరును ఎడ్జ్‌బాస్టన్‌లో కూడా కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది.అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌కు అరుదైన రికార్డు ఊరిస్తోంది. రెండో టెస్టులో జైశ్వాల్ 97 పరుగులు చేస్తే, టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 2,000 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత క్రికెటర్‌గా రికార్డులెక్కుతాడు. జైశ్వాల్ ఇప్పటివరకు 20 టెస్టుల్లో 52.86 సగటుతో 1,903 పరుగులు చేశాడు.ప్రస్తుతం ఈ రికార్డు భారత లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. సునీల్ గవాస్కర్ ఈ ఫీట్‌ను తన 23వ టెస్ట్‌లో నమోదు చేశారు. 1976 ఏప్రిల్ 7 నుండి 12 వరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించారు. గవాస్కర్ తర్వాతి స్ధానంలో ప్రస్తుత భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నారు. గంభీర్ ఈ ఫీట్‌ను తన 24వ టెస్టు మ్యాచ్‌లో అందుకున్నాడుటెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన భారత ఆటగాళ్లు👉సునీల్ గవాస్కర్ - 23 మ్యాచ్‌లు👉గౌతమ్ గంభీర్ - 24👉రాహుల్ ద్రవిడ్ - 25👉వీరేంద్ర సెహ్వాగ్ - 25👉విజయ్ హజారే - 26👉చెతేశ్వర్ పుజారా – 26👉సౌరవ్ గంగూలీ - 27👉శిఖర్ ధావన్ - 28👉పటౌడీ - 28 -
గెలిచిన మ్యాచ్‌లు కంటే ఓడిందే ఎక్కువ.. గంభీర్‌పై తీవ్ర ఒత్తిడి: ఆకాష్
జూలై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. లీడ్స్‌లో టెస్టులో ఓటమితో గంభీర్‌పై ఒత్తిడి పెరిగిందని చోప్రా అభిప్రాయపడ్డాడు. హెడ్ కోచ్‌గా బాధ్యతలు చెపట్టిన తర్వాత భారత జట్టు బంగ్లాపై మినహా ఒక్క ప్రధాన టెస్టు సిరీస్‌లో కూడా విజయం సాధించలేకపోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-3తో ఓడిపోవడంతో గంభీర్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌ను కూడా ఓటమితో ఆరంభించడం గంభీర్‌పై ప్రశ్నల వర్షం కురుస్తోంది."గెలిచినప్పుడు ప్రశంసలు, ఓడిపోయినప్పుడు విమర్శలు గుప్పించడం భారత క్రికెట్ సూత్రం. మ్యాచ్‌లో గెలిచి అన్ని బాగా జరిగితే అందరికి ఆ క్రెడిట్ దక్కుతుంది. అదే ఓటమి పాలైతే ప్రతీ ఒక్కరూ విమర్శలు ఎదుర్కొక తప్పదు. లీడ్స్ టెస్టులో ఓటమికి కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను నేను బాధ్యుడిని చేయాలనుకోవడం లేదు.ఎందుకంటే అతడు ఇప్పుడే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. పరిస్థితులను ఆర్ధం చేసుకోవడానికి అతడికి కాస్త సమయం పడుతోంది. కానీ గౌతం గంభీర్‌పైన మాత్రం ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి ఉంటుంది. రెడ్ బాల్ క్రికెట్లో కోచ్‌గా తన మార్క్ చూపించలేకపోయాడు. అతడి పర్యవేక్షణలో భారత్ చాలా తక్కువ మ్యాచ్‌లను గెలిచింది. బంగ్లాదేశ్‌పై రెండు, ఆస్ట్రేలియాపై ఒక్క టెస్టు మ్యాచ్ మాత్రమే టీమిండియా విజయం సాధించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై చెరో మూడు మ్యాచ్‌లలో భారత్ ఓటమి పాలైంది. ఇప్పుడు ఇంగ్లండ్‌పై కూడా ఓ మ్యాచ్ భారత్ ఓడిపోయింది. అతడి నేతృత్వంతో భారత్ కేవలం ఓటముల తప్ప విజయాలు సాధించలేకపోతుంది. ఇంగ్లండ్ సిరీస్‌లో ఆశించింన ఫలితం రాకపోతే గంభీర్ స్ధానం ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఎందుకంటే గంభీర్ కోరిన ప్రతీది సెలెక్టర్లు, బీసీసీఐ చేసింది. ఎలాంటి ఆటగాళ్లు కావాలంటే అలాంటి ప్లేయర్లను సెలెక్టర్లు ఇచ్చారు. అయినప్పటికి విజయాలను అందించకపోతే సెలక్టర్ల నుంచి ప్రశ్నలు ఎదుర్కొక తప్పదు" తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు.చదవండి: MLC 2025: ఉత్కంఠ పోరు.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన హెట్‌మైర్ -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన టీమిండియా
ఇంగ్లండ్ పర్యటనను భారత అండర్-19 జట్టు ఘనంగా ఆరంభించింది. హోవ్ వేదికగా శుక్రవారం ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన తొలి యూత్ వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ జయభేరి మోగించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 42.2 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ఇసాక్ మొహమ్మద్ (28 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడగా... మిడిలార్డర్లో ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ (90 బంతుల్లో 56; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత యువ బౌలర్లలో కనిష్క్ చౌహన్ 3, హెనిల్ పటేల్, అంబ్రీశ్, మొహ్మద్ ఇనాన్ తలా 2 వికెట్లు తీశారు.వైభవ్ విధ్వంసం..అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ కేవలం 24 ఓవర్లలోనే 4 వికెట్లే కోల్పోయి 178 పరుగులు చేసి గెలిచింది. భారత ఓపెనర్, ఐపీఎల్ సరికొత్త సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 పరుగులు చేశాడు.కెప్టెన్ ఆయుశ్ మాత్రేతో కలిసి తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించాడు. స్వల్ప వ్యవధిలోనే వీళ్లిద్దరు అవుటైనప్పటికీ అభిజ్ఞాన్ కుండు (34 బంతుల్లో 45; 4 ఫోర్లు, 1 సిక్స్) కుదురుగా ఆడటంతో ఏ ఇబ్బంది లేకుండా యువభారత్ గెలిచింది. ప్రత్యర్థి బౌలర్లలో ఫ్రెంచ్ 2 వికెట్లు తీశాడు. ఇరు జట్ల మధ్య ఈ నెల 30న రెండో వన్డే నార్తాంప్టన్‌లో జరుగుతుంది.చదవండి: అది ఆసీస్‌కు రిటర్న్ గిఫ్ట్ -
ఇంగ్లండ్ గడ్డపై విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ 2025 ద్వారా పరిచయమై (రాజస్తాన్ రాయల్స్), 14 ఏళ్ల వయసులోనే క్యాష్ రిచ్ లీగ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో) బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ.. తన విధ్వంసాల పరంపరను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ సంచలన ప్రదర్శనల (7 మ్యాచ్‌ల్లో 206.56 స్ట్రయిక్‌రేట్‌తో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 252 పరుగులు) అనంతరం ఎన్సీఏలో జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో 90 బంతుల్లోనే 190 పరుగులు చేసిన వైభవ్.. ఇవాళ (జూన్ 27) ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో మరోసారి చెలరేగిపోయాడు. భారత్-ఏ తరఫున 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. VAIBHAV SURYAVANSHI MADNESS..!! 🥶🔥- Smashed 48 runs in just 19 balls.- With 3 fours and 5 sixes. pic.twitter.com/HOKgnYGd4m— Sports Culture (@SportsCulture24) June 27, 2025ఈ మ్యాచ్‌లో మరో ఐపీఎల్ చిచ్చరపిడుగు ఆయుశ్ మాత్రేతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వైభవ్.. ఇంగ్లండ్ యువ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వైభవ్ ధాటికి భారత్ 7 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ హాఫ్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. వైభవ్ క్రీజ్‌లో ఉన్నంత సేపు నిదానంగా ఆడిన ఆయుశ్ మాత్రే.. వైభవ్ ఔటయ్యాక వరుసగా రెండు బౌండరీలు బాది ఔటయ్యాడు. మాత్రే 30 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 21 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో యంగ్ ఇండియా ఇంగ్లండ్ నిర్దేశించిన 175 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదిస్తుంది. 13 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 104/3గా ఉంది. విహాన్ మల్హోత్రా (4), అభిగ్యాన్ కుందు (4) క్రీజ్‌లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్‌లో వైభవ్, మాత్రేతో పాటు మౌల్యరాజ్‌సింగ్ చవ్డా (16) కూడా ఔటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్ 2, రాల్ఫీ అల్బర్ట్ ఓ వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు 42.2 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూల్చారు. కనిష్క్ చౌహాన్ (10-1-20-3), మొహమ్మద్ ఎనాన్ (10-1-37-2) తమ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టగా.. పేసర్లు ఆర్ఎస్ అంబరీష్, హెనిన్ పటేల్ తలో రెండు వికెట్లు తీసి సత్తా చాటారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో రాకీ ఫ్లింటాఫ్ (ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు) అర్ద సెంచరీతో (90 బంతుల్లో 56; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా.. ఇస్సాక్ మొహమ్మద్ (28 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. మిగతా బ్యాటర్లలో బెన్ డాకిన్స్ (18), బెన్ మేయర్స్ (16), జేమ్స్ మింటో (10) రెండంకెల స్కోర్లు చేయగా.. కెప్టెన్ థామస్ ర్యూ (5), జోసఫ్ మూర్స్ (9), రాల్ఫీ ఆల్బర్ట్ (5), జాక్ హోమ్ (5), తజీమ్ చౌద్రీ అలీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కాగా, 5 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌ల కోసం భారత అండర్-19 జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. -
IND VS ENG: బుమ్రాపై వర్క్ లోడ్.. ఒక్కడు ఎంతని చేయగలడు..?
ఇటీవలికాలంలో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రస్తావన వచ్చే సరికి వర్క్ లోడ్ అన్న పదం వినిపిస్తుంది. చాలామందికి ఈ పదం చాలా సాధారణంగా అనిపించవచ్చు. క్రికెట్‌పై పెద్దగా అవగాహన లేని వారు.. ఈ ఇంత దానికే వర్క్ లోడ్ అంటే ఎలా అని అంటుంటారు. గతంలో చాలామంది పేసర్లు బుమ్రా కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడి, లెక్కలేనన్ని ఓవర్లు వేశారని గుర్తు చేస్తుంటారు.అయితే అప్పటి క్రికెట్‌కు, ఇప్పటి క్రికెట్‌కు పోల్చుకోలేని వ్యత్యాసం ఉందన్న విషయం వారికి అర్దం కాదు. అప్పట్లో పేసర్లు టెస్ట్ మ్యాచ్‌లు, అప్పుడప్పుడు వన్డేలు ఆడేవారు. అది కూడా ఏడాదిలో కొంతకాలం మాత్రమే. అయితే పొట్టి క్రికెట్ ఆగమనంతో పరిస్థితి చాలా మారింది. ఏడాది పొడవునా ఏదో ఒక ఫార్మాట్లో మ్యాచ్‌లు జరుగుతుంటాయి. మధ్యలో ప్రైవేట్ లీగ్‌లు, ఖాళీగా ఉంటే దేశవాలీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.ఇలాంటి పరిస్థితుల్లో పేస్ బౌలర్లపై సహజంగానే పని భారం ఉంటుంది. శరీరం పెద్దగా సహకరించదు. ఒకవేళ ధైర్యం చేసి బరిలోకి దిగినా గాయాలు తప్పవు. గాయాల బారిన పడితే కొన్ని సందర్భాల్లో అర్దంతరంగా కెరీర్లే ముగిసిపోతాయి. కెరీర్ ముగిస్తే సదరు బౌలర్ జీవితం కూడా ముగిసినట్లే. ఇవన్నీ చూసుకొనే పేసర్లు ఆచితూచి మ్యాచ్‌లు ఆడుతుంటారు. సంబంధిత క్రికెట్ బోర్డులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే వారిని ఎంపిక చేస్తుంటారు. బుమ్రా సహా ప్రపంచ క్రికెట్లో పేసర్లందరి విషయంలోనూ ఇదే జరుగుతుంది. అయితే, గత ఏడాదిన్నర కాలంగా మిగతా పేసర్లతో పోలిస్తే బుమ్రాపై అదనపు పని భారం పడుతుంది. టెస్ట్‌ల్లో ప్రపంచ ప్రఖ్యాత పేసర్లు మిచెల్ స్టార్క్ (362), కగిసో రబాడ (298) వంటి వారు 2024 నుంచి గరిష్టంగా 362 ఓవర్లు వేస్తే, బుమ్రా ఏకంగా 410 ఓవర్లు వేశాడు. ఈ గణాంకాలు చేస్తే చాలు బుమ్రాపై ఎంత పని భారం పడుతుందో చెప్పడానికి.టీమిండియా బుమ్రాపై అతిగా ఆధారపడుతూ, అతనిచే సామర్థ్యానికి మించి బౌలింగ్ చేయిస్తుంది. ఇదే కొనసాగితే బుమ్రా ఎక్కువ కాలం క్రికెట్ ఆడే అవకాశం ఉండదు. వర్క్ లోడ్ ఎక్కువై గాయాల బారిన పడి, బుమ్రా కెరీర్ అర్దంతరంగా ముగిసే ప్రమాదం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొనే భారత మేనేజ్మెంట్ బుమ్రాను పరిమితంగా వినియోగించుకుంటుంది. ఇంగ్లండ్ టూర్లో కేవలం మూడు మ్యాచ్‌లే ఆడించాలని నిర్ణయించుకుంది.బుమ్రా గురించి ఆలోచిస్తే ఇది ఓకే. మరి టీమిండియా ప్రదర్శన మాటేంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గత కొంతకాలంగా టెస్ట్‌ల్లో బుమ్రా లేకపోతే టీమిండియా సున్నా అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇది తెలిసి కూడా బీసీసీఐ బుమ్రాకు ప్రత్యామ్నాయాన్ని తయారు చేసుకోలేకపోతుంది. బుమ్రా ఒక్కడు ఎంత వరకు చేయగలడని మాజీలు చాలాకాలంగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. బుమ్రా రాణించకపోతే టీమిండియా పరిస్థితి ఏంటన్నది తాజాగా ముగిసిన లీడ్స్ టెస్ట్ సూచిస్తుంది. ఆ మ్యాచ్‌లో బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసినా, రెండో ఇన్నింగ్స్‌లో ప్రభావం చూపలేకపోవడంతో టీమిండియా ఓటమిపాలైంది. ఇకనైనా భారత్ బుమ్రాపై అతిగా ఆధారపడకుండా, ప్రత్యామ్నాయాలను చూసుకోవాలి. -
భారత జట్టులో కీలక మార్పులు.. అతడిపై వేటు! తెలుగోడికి చోటు?
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. జూలై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే రెండో టెస్టులో అమీతుమీ తెల్చుకోవడానికి భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని గిల్ సేన పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో రెండో టెస్టు కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.శార్ధూల్ ఠాకూర్‌పై వేటు..?తొలి టెస్టులో దారుణ ప్రదర్శన కనబరిచిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్(Shardul thakur)పై వేటు వేసేందుకు టీమిండియా మెనెజ్‌మెంట్ సిద్దమైంది. లీడ్స్ టెస్టులో శార్ధూల్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన ఠాకూర్.. బౌలింగ్‌లో కేవలం రెండు వికెట్లు పడగొట్టాడు.ఈ క్రమంలో శార్ధూల్ బదులుగా ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish kumar reddy)ని తీసుకోవాలని గంభీర్ అండ్ కో భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో నితీశ్ తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మెల్బోర్న్ టెస్టులో ఓ సెంచరీ కూడా సాధించాడు. దీంతో తిరిగి మళ్లీ అతడిని తుది జట్టులోకి తీసుకోవాలని టీమ్ మెనెజ్‌మెంట్ యోచిస్తుందంట. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలనుకుంటే శార్థూల్ స్ధానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.బుమ్రాకు విశ్రాంతి..?ఇక రెండో టెస్టుకు వర్క్‌లోడ్ కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్‌మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని ఈ సిరీస్‌కు ముందే భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు.దీంతో రెండో టెస్టుకు అతడికి విశ్రాంతి ఇచ్చి తిరిగి లార్డ్స్ టెస్టులో ఆడించాలని గంభీర్ అండ్ కో భావిస్తున్నరంట. తొలి టెస్టులో బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల హాల్‌తో బుమ్రా చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ పడగొట్టకపోయినప్పటికి దాదాపు 20 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఒకవేళ రెండో టెస్టుకు బుమ్రా దూరమైతే అతడి స్ధానంలో అర్ష్‌దీప్ సింగ్ అరంగేట్రం చేసే అవకాశముంది. లేదంటే పేసర్ ఆకాష్ దీప్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ -
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. టీమిండియాకు షాకింగ్ న్యూస్..!
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా రెండో టెస్ట్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడని వార్తలు వినిపిస్తున్నాయి. వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా జట్టు యాజమాన్యమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.బుమ్రా తాజాగా ముగిసిన లీడ్స్ టెస్ట్‌లో 44 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇది అతనిపై అదనపు భారం పడేలా చేసిందని మేనేజ్మెంట్ భావిస్తుంది. దీంతో అతనికి రెండో టెస్ట్‌లో విశ్రాంతినిచ్చి, తిరిగి మూడో టెస్ట్‌లో బరిలోకి దించే అవకాశం ఉంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడడని బీసీసీఐ పరోక్షంగా చెప్పింది. వర్క్ లోడ్ కారణంగా స్టార్ పేసర్ కేవలం మూడు మ్యాచ్‌లే ఆడతాడని బోర్డులోని కీలక సభ్యులంతా చెప్పారు.తొలి టెస్ట్‌కు, రెండో టెస్ట్‌కు మధ్య 8 రోజుల గ్యాప్ ఉండటంతో బుమ్రా రెండో టెస్ట్‌లో ఆడతాడని అంతా అనుకున్నారు. ఒకవేళ విశ్రాంతినిచ్చినా, చివరి మూడు టెస్ట్‌ల్లో ఉంటుందని అంచనా వేశారు. అయితే తొలి టెస్ట్‌లో పడిన అదనపు భారం కారణంగా బుమ్రా విషయంలో ప్రణాళికలు మారాయని తెలుస్తుంది. బుమ్రా విషయంలో బీసీసీఐ ఎలాంటి సాహసాలు చేసేందుకు సిద్దంగా ఉండదు. జులై 10 నుంచి లార్డ్స్‌లో జరిగే మూడో టెస్ట్‌కు బుమ్రా సిద్దంగా ఉండే అవకాశం ఉంది. 16 రోజుల గ్యాప్‌లో బుమ్రా పూర్తి సన్నద్దత సాధించవచ్చు.రెండో టెస్ట్‌లో బుమ్రా ఆడకపోతే సిరాజ్ భారత పేస్ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. ఇప్పటికే తొలి టెస్ట్ కోల్పోయి సిరీస్‌లో వెనుకపడిన టీమిండియాకు ఇది అంత శుభపరిణాయం కాదు. తొలి టెస్ట్‌లో బుమ్రా మినహా పేసర్లంతా తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా కూడా రెండో ఇన్నింగ్స్‌లో ప్రభావం చూపించలేకపోయాడు. రెండో టెస్ట్‌లో బుమ్రా ఆడినా, ఆడకపోయిన భారత బౌలింగ్ విభాగంలో భారీ మార్పులకు ఆస్కారం ఉంది.ఒకవేళ బుమ్రా ఆడకపోతే ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్‌లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది. బుమ్రా ఆడకుండా, తొలి టెస్ట్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిద్ద్ కృష్ణపై కూడా వేటు పడితే ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్ ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కుతుంది. తొలి టెస్ట్‌లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన శార్దూల్ ఠాకూర్‌పై కూడా వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. బ్యాటింగ్ విభాగంలో భారత్ ఎలాంటి సాహసాలు చేయకపోవచ్చు.పూర్తి లైనప్‌ను యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. తొలి టెస్ట్‌లో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ విఫలమైన వారికి మరో ఛాన్స్ తప్పక ఉంటుంది. టీమిండియా విషయాన్ని పక్కన పెడితే ఇంగ్లండ్ రెండో టెస్ట్ కోసం జట్టును ప్రకటించింది. ప్రమాదకర పేసర్ జోఫ్రా ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత టెస్ట్ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. -
టీమిండియాతో రెండో టెస్ట్.. ప్రమాదకర బౌలర్‌ను జట్టులోకి తీసుకున్న ఇంగ్లండ్
జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా టీమిండియాతో జరుగబోయే రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇవాళ (జూన్ 26) ప్రకటించారు. ఈ జట్టులో ప్రమాదకర ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చోటు దక్కించుకున్నాడు. 30 ఏళ్ల ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్ట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. Jofra Archer is back in Test cricket.#ENGvINDpic.twitter.com/vd4VVRQmM8— CricTracker (@Cricketracker) June 26, 2025ఆర్చర్ 2021 ఫిబ్రవరిలో చివరిసారి టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆర్చర్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను టీమిండియాతోనే ఆడాడు. ఆతర్వాత అతను వరుస గాయాల కారణంగా క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆర్చర్ గతేడాది మేలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోకి తిరిగి వచ్చాడు. తాజాగా అతను టెస్ట్ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. ఆర్చర్ ఇటీవల కౌంటీ ఛాంపియన్షిప్ చివరి రౌండ్ మ్యాచ్‌లో ససెక్స్‌కు ఆడుతూ డర్హమ్ను ఎదుర్కొన్నాడు. తాజాగా ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో ఆర్చర్ అదనంగా జోడించబడ్డాడు. తొలి టెస్ట్ కోసం ప్రకటించిన జట్టు యధాతథంగా కొనసాగింది. ఆర్చర్ తాజాగా ఆడిన కౌంటీ మ్యాచ్‌లో 18 ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో 34 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 31 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆర్చర్‌కు బ్యాటింగ్, బౌలింగ్ అవకాశం దక్కలేదు. రెండో టెస్ట్‌లో ఆర్చర్‌కు తుది జట్టులో కూడా చోటు దక్కే అవకాశం ఉంది. ఆర్చర్ చేరిక ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ విభాగానికి అదనపు బలం చేకూరుస్తుంది. ఇప్పటికే ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో గెలిచి భారత్‌పై ఆధిక్యంలో కొనసాగుతుంది. రెండో టెస్ట్‌లో ఆర్చర్ తుది జట్టులో చేరితే టీమిండియాకు కష్టాలు తప్పవు. ఆర్చర్ తుది జట్టులో చేరితే ఏ పేసర్‌పై వేటు వేస్తారో చూడాలి. తొలి టెస్ట్‌లో పేసర్లు బ్రైడన్ కార్స్ (4 వికెట్లు), జోష్ టంగ్ (7), స్టోక్స్ (5)అద్బుతంగా రాణించారు. వీరు ముగ్గురే 16 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్ నిరాశపరిచాడు. అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. దీంతో రెండో టెస్ట్‌లో వోక్స్‌ను పక్కన పెట్టి ఆర్చర్‌కు అవకాశం ఇవ్వొచ్చు. ఆర్చర్ తాజాగా ముగిసిన ఐపీఎల్లో, అంతకుముందు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పర్వాలేదనిపించాడు. ఈ అర్హతలతో అతను రెండో టెస్ట్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఆర్చర్ ఇంగ్లండ్ తరఫున 13 టెస్ట్‌ల్లో 3 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 42 వికెట్లు తీశాడు. కాగా, టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఆ మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదు సెంచరీలు నమోదైన ఓటమి తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 471, రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేసినా.. భారత బౌలర్లు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు.ఛేదనలో బుమ్రా సహా భారత బౌలర్లంతా తేలిపోయారు. మ్యాచ్ మొత్తంలో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు నేలపాలు చేసింది. జైస్వాల్ ఒక్కడే నాలుగు క్యాచ్‌లు జారవిడిచాడు. భారీ లక్ష్య ఛేదనలో బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. రెండో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్ -
అన్ లక్కీ పంత్.. ప్రతిసారి ఇంతే..!
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ క్రికెట్ చరిత్రలో మోస్ట్ అన్ లక్కీ బ్యాటర్‌గా మారిపోతున్నాడు. ఫార్మాట్ ఏదైనా ఇతగాడు సెంచరీ చేశాడంటే అతని జట్టు గెలవడం లేదు. తాజాగా భారత్, ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ ఇందుకు ఉదాహరణ. ఈ మ్యాచ్‌లో పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసినా ఇండియా గెలవలేదు. దీనికి ముందు ఐపీఎల్-2025లోనూ ఇలాగే జరిగింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంత్ అద్బుత సెంచరీ చేసినా, ఆ మ్యాచ్‌లోనూ అతని జట్టు (లక్నో) గెలవలేదు.టెస్ట్ క్రికెట్లో, ప్రత్యేకించి విదేశాల్లో పంత్ సెంచరీల బ్యాడ్ లక్ ఇప్పుడు మొదలైంది కాదు. 2018 నుంచి పంత్ విదేశాల్లో 6 టెస్ట్ సెంచరీలు చేయగా.. ఇందులో టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు. 2018లో పంత్ తన తొలి విదేశీ టెస్ట్ సెంచరీని (114) కెన్నింగ్స్టన్ ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌పై చేశాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా దారుణంగా ఓడింది. విదేశాల్లో పంత్ రెండో టెస్ట్ సెంచరీని (159 నాటౌట్) 2019లో సిడ్నీ గ్రౌండ్లో ఆస్ట్రేలియాపై చేశాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా అదృష్టవశాత్తు డ్రాతో గట్టెక్కింది.విదేశాల్లో పంత్ మూడో టెస్ట్ సెంచరీని (100 నాటౌట్) 2022లో న్యూలాండ్స్‌లో సౌతాఫ్రికాపై చేశాడు. ఆ మ్యాచ్‌లో కూడా టీమిండియాకు పరాజయమే ఎదురైంది. విదేశాల్లో పంత్ నాలుగో టెస్ట్ సెంచరీ (146) అదే ఏడాది ఇంగ్లండ్‌పై (ఎడ్జ్‌బాస్టన్) చేశాడు. ఆ మ్యాచ్‌లోనూ టీమిండియాకు పరాభవం తప్పలేదు. తాజాగా హెడింగ్లే టెస్ట్‌లో పంత్ ఇంగ్లండ్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు (134 & 118) చేసినా టీమిండియా గెలవలేకపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదు సెంచరీలు (పంత్-2, జైస్వాల్, గిల్, రాహుల్) నమోదైనా గెలుపు దక్కకపోవడం శోచనీయం.ఇదిలా ఉంటే, హెడింగ్లేలో నిన్న ముగిసిన తొలి టెస్ట్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 471, రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేసినా టీమిండియాకు పరాభవం తప్పలేదు. భారత బౌలర్లు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయారు. ఛేదనలో బుమ్రా సహా భారత బౌలర్లంతా తేలిపోయారు. ఈ మ్యాచ్‌లో క్యాచ్‌లు కూడా టీమిండియా కొంపముంచాయి. భారత జట్టు మ్యాచ్ మొత్తంలో ఏడు క్యాచ్‌లు నేలపాలు చేసింది. ఒక్క జైస్వాల్ ఒక్కడే నాలుగు క్యాచ్‌లు జారవిడిచాడు. భారీ లక్ష్య ఛేదనలో బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. రెండో టెస్ట్ జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా జరుగనుంది. -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. 'ఆ ఘనత' సాధించిన తొలి మొనగాడు
టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 800 రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత వికెట్‌కీపర్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ వికెట్‌కీపర్ బ్యాటర్ 800 రేటింగ్ పాయింట్లు సాధించలేదు. టీమిండియా దిగ్గజ వికెట్‌కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనికి కూడా ఇది సాధ్యపడలేదు.ఐసీసీ తాజాగా (జూన్ 25) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో పంత్ 800 రేటింగ్ పాయింట్ల మార్కును (801) తాకాడు. అలాగే ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం మెరుగపర్చుకొని ఏడో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతమున్న వికెట్‌కీపర్లలో పంత్‌దే అత్యుత్తమ ర్యాంకింగ్. ఇంగ్లండ్‌తో నిన్న (జూన్ 24) ముగిసిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేయడంతో పంత్ ఈ ఘనతలను సాధించాడు.తాజా ర్యాంకింగ్స్‌లో టాప్-10లో పంత్‌తో పాటు మరో భారత బ్యాటర్ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో (తొలి ఇన్నింగ్స్‌లో) సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో, టీమిండియా నయా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని 20వ స్థానానికి చేరాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్బుతమైన సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకొని 38వ స్థానానికి ఎగబాకాడు.ఈ వారం ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ గణనీయంగా లబ్ది పొందాడు. భారత్‌పై అద్భుతమైన సెంచరీ (149) చేసినందుకు గానూ ఐదు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జో రూట్, హ్యారీ బ్రూక్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. ఓలీ పోప్ 3 స్థానాలు మెరుగుపర్చుకొని 19వ స్థానానికి ఎగబాకాడు. కేన్ విలియమ్సన్ 3, స్టీవ్ స్మిత్ 5, టెంబా బవుమా 6, కమిందు మెండిస్ 9, సౌద్ షకీల్ 10 స్థానాల్లో ఉన్నారు.మిగతా బ్యాటర్ల విషయానికొస్తే.. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటో ఏకంగా 21 స్థానాలు మెరుగుపర్చుకొని 29వ స్థానానికి చేరగా.. అదే మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మరో బంగ్లాదేశీ ముష్ఫికర్ రహీం 11 స్థానాలు మెరుగుపర్చుకొని 28వ స్థానానికి ఎగబాకాడు. అదే మ్యాచ్‌లో భారీ సెంచరీ చేసిన శ్రీలంక ఆటగాడు పథుమ్ నిస్సంక కూడా 21 స్థానాలు మెరుగుపర్చుకొని 31వ స్థానానికి ఎగబాకాడు. ఈ వారం బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇవే చెప్పుకోదగ్గ మార్పులు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10 పెద్దగా మార్పులేమీ లేవు. బుమ్రా, రబాడ, కమిన్స్, నౌమన్ అలీ, హాజిల్‌వుడ్, నాథన్ లియోన్, జన్సెన్, మ్యాట్ హెన్రీ టాప్-8లో కొనసాగుతున్నారు. మిచెల్ స్టార్క్ ఓ స్థానం ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరాడు. భారత్‌తో తాజాగా జరిగిన టెస్ట్‌లో రాణించిన బ్రైడన్ కార్స్ 8 స్థానాలు, జోష్ టంగ్ 16 స్థానాలు మెరుగుపర్చుకొని 32, 64 స్థానాలకు ఎగబాకారు. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో పర్వాలేదనిపించిన భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణ 21 స్థానాలు మెరుగుపర్చుకొని 72వ ప్లేస్‌కు చేరాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా, మెహిది హసన్ మిరాజ్, జన్సెన్ టాప్-3లో కొనసాగుతున్నారు. -
ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.. లేదంటే గెలవడం కష్టమే: రవిశాస్త్రి
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత జట్టు ఓటమితో ఆరంభించింది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ తొలి నాలుగు రోజులు ఆతిథ్య జట్టుపై అధిపత్యం చెలాయించిన టీమిండియా.. కీలకమైన ఆఖరి రోజు మాత్రం తేలిపోయింది.371 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత బౌలర్లు డిఫెండ్ చేసుకుపోలేకపోయారు. శార్ధూల్ ఠాకూర్, ప్రసిద్ద్ కృష్ణ తలా రెండు వికెట్లు సాధించగా.. రవీంద్ర జడేజా ఒక్క వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు.అయితే సెకెండ్ ఇన్నింగ్స్‌లో బుమ్రా ఒక్క వికెట్ తీయకపోయినప్పటికి.. తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం బుమ్రా ఒంటరి పోరాటం చేశాడు. ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.బుమ్రాకు విశ్రాంతి..!కాగా బుమ్రా వర్క్ లోడ్‌ను దృష్టిలో పెట్టుకుని రెండో టెస్టుకు అతడికి విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తోంది. ఈ సిరీస్‌లో బుమ్రా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడుతాడని టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంభీర్ అండ్ కోకు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కీలక సూచనలు చేశాడు. "సెకెండ్ టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.ఎందుకంటే బుమ్రా లేకపోతే ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయే అవకాశం ఉంది. అప్పుడు 2-0 తేడాతో వెనకబడితే సిరీస్ విజయం సాధించడం కష్టతరమవుతుంది.లీడ్స్ టెస్టులో ఓటమిని భారత జట్టు జీర్ణించుకోలేదు. గెలిచేందుకు అవకాశమున్న మ్యాచ్‌లో వారు ఓడిపోయారు. ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలతో ఇంగ్లండ్‌కు గెలిచే అవకాశం కల్పించారు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి.అదేవిధంగా టెయిలాండర్ల నుంచి భారత్‌కు బ్యాటింగ్ సపోర్ట్ కావాలి" అని స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రి పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్- భారత్ మధ్య రెండో టెస్టు వచ్చే బుధవారం నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనుంది.చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్ -
'భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌ను నేనే'.. టీమిండియాపై మైఖేల్ వాన్ సెటైర్లు
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో టీమిండియా(Teamindia) ఓటమి పాలైంది. 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఆఖరి రోజు ఆటలో బౌలర్లు తేలిపోయారు. దీంతో ఈ భారీ టార్గెట్‌ను ఇంగ్లండ్ కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(149) భారీ సెంచరీతో చెలరేగాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఇంగ్లీష్ జట్టు దూసుకెళ్లింది. కాగా భారత్ ఓటమికి ప్రధానం కారణం ఫీల్డింగ్ వైఫల్యమే. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 6 క్యాచ్‌లను భారత ఫీల్డర్లు జారవిడిచారు.ఆఖరి రోజు ఆటలో సైతం టీమిండియా ఫీల్డింగ్ ఏ మాత్రం మెరుగుపడలేదు. ఆఖరి రోజు ఆటలో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ బెన్ డకెట్ క్యాచ్‌ను 97 పరుగుల వద్ద జైశ్వాల్ విడిచిపెట్టాడు. దీంతో అతడు ఏకంగా 149 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఈ క్రమంలో పేలవ ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన టీమిండియాను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్(Michael Vaughan) ట్రోలు చేశాడు. "ఈ భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌ను నేనే అని ప్రకటిస్తున్నాను. నా ఫీల్డింగ్ ఆకాడమీ ప్రస్తుతం బాగా రాణిస్తోంది" అని అని సెటైరికల్ ట్వీట్ చేశాడు. అతడికి భారత అభిమానులు గట్టిగా కౌంటిరిస్తున్నారు. గతంలో వాన్ క్యాచ్‌లు విడిచిపెట్టిన వీడియోలను ఎక్స్‌లో షేర్ చేస్తున్నారు. గతంలో వాన్ తన సొంత జట్టును కూడా విధంగానే ట్రోలు చేశాడు. ఇక ఇంగ్లండ్-భారత్ మధ్య రెండో టెస్టు వచ్చే బుధవారం నుంచి ప్రారంభం కానుంది.చదవండి: వారి వల్లే ఓడిపోయాము.. అందుకు ఇంకా సమయం ఉంది: గిల్The CV of the fielding coach: pic.twitter.com/1xkurSt9Qr— 𝐉𝐨𝐟𝐫𝐚 𝐒𝐭𝐨𝐜𝐤 𝐇𝐮𝐧𝐭𝐞𝐫 (@Niteish_14) June 24, 2025 -
వారి వల్లే ఓడిపోయాము.. అందుకు ఇంకా సమయం ఉంది: గిల్
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన ప్రయాణాన్ని ఓటమితో ఆరంభించాడు. టెండూల్కర్- అండర్సన్ ట్రోఫీ 2025లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో భారత జట్టు అద్భుతంగా రాణించినప్పటికి బౌలింగ్, ఫీల్డింగ్‌లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. మొదటి నాలుగు రోజుల ఆటలో ఇంగ్లండ్‌పై ఆధిపత్యం చెలాయించిన టీమిండియా.. ఆఖరి రోజు ఆటలో మాత్రం తేలిపోయింది. 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(149) భారీ సెంచరీతో కదం తొక్కగా.. జాక్ క్రాలీ(65), జో రూట్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు సాధించగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టాడు.ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ గిల్ స్పందించాడు. చెత్త ఫీల్డింగ్ కారణంగానే తాము ఓడిపోయామని గిల్ చెప్పుకొచ్చాడు."టెస్టు మ్యాచ్ అద్భుతంగా సాగింది. మాకూ మంచి అవకాశాలు వచ్చాయి. అయితే క్యాచ్‌లు వదిలేయడం, లోయర్ ఆర్డర్లో ఎక్కువ పరుగులు చేయలేకపోవడం ఓటమికి కారణాలు. నాలుగో రోజు కూడా కనీసం 430 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాలని అనుకున్నాం.అయితే 25 పరుగులకే చివర్లో వరుసగా వికెట్లు పడటంతో అది సాధ్యం కాలేదు. ఈ రోజు కూడా తొలి వికెట్ తీసిన తర్వాత మాకు మంచి అవకాశం ఉందనిపించింది. కానీ అది జరగలేదు. తొలి సెషన్లో మేం బాగానే బౌలింగ్ చేసి వారిని నియంత్రించగలిగినా ఒక్కసారి బంతి పాతబడిన తర్వాత ఏమీ చేయలేకపోయాం. అలాంటి స్థితిలోనూ వికెట్లు తీయడం అవసరం.జడేజా చాలా బాగా బౌలింగ్ చేసి మంచి అవకాశాలు సృష్టించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా కుప్పకూలడంపై ఇప్పటికే చర్చించాం. ఈ తప్పును మేం మున్ముందు సరిదిద్దుకోవాలి. ఇలాంటి పిచ్‌పై అవకాశాలు అంత సులువుగా రావు.వాటిని వృథా చేసుకోవద్దు. అయితే మాది యువ జట్టు. నేర్చుకునే దశలో ఉంది. మరింత మెరుగువుతాం. బుమ్రా మిగిలిన టెస్టుల్లో ఏవి ఆడతాడో ఇప్పుడే చెప్పలేం. దానికి తగినంత సమయం ఉంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: టీమిండియా అత్యంత చెత్త రికార్డు.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే -
IND Vs ENG: టీమిండియా అత్యంత చెత్త రికార్డు.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియాతో ఓటమితో ఆరంభించింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(149) భారీ శతకంతో చెలరేగగా.. జాక్ క్రాలీ(65), జో రూట్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బౌలర్లు తేలిపోయారు. ప్రసిద్ద్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా ఓ వికెట్ సాధించాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటిన జస్ప్రీత్ బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు.అంతకుతోడు చెత్త ఫీల్డింగ్ కూడా టీమిండియా కొంపముంచింది. రెండో ఇన్నింగ్స్‌లు కలపి ఏడు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు విడిచిపెట్టారు. అందులో నాలుగు క్యాచ్‌లు జైశ్వాల్ జారవిడిచినవే కావడం గమనార్హం. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.టెస్టు క్రికెట్ హిస్టరీలోనే..ఇక ఈ ఓటమితో భారత్ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఒక టెస్టులో ఐదు సెంచరీలు నమోదు చేసిన తర్వాత కూడా ఓటమి పాలైన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. 141 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఈ చెత్త ఫీట్‌ను నమోదు చేయలేదు.తాజా ఓటమితో టీమిండియా ఈ ఘోర ఆప్రతిష్టతను మూట కట్టుకుంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జూలై 2 నుంచి ఎడ్జ్ బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది.టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్- తొలి టెస్టు సంక్షిప్త సమాచారం🏏షెడ్యూల్: జూన్ 20- 24🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్🏏తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆరు పరుగుల ఆధిక్యం🏏టీమిండియా రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371🏏ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా 373 పరుగులు సాధించి లక్ష్యాన్ని ఛేదించిన స్టోక్స్ బృందం🏏ఫలితం: ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై ఇంగ్లండ్ విజయం -
రిషబ్ పంత్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ..
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఊహించని షాకిచ్చింది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అంపైర్‌తో వాగ్వదం దిగినందుకు గానూ పంత్‌కు ఓ డిమెరిట్ పాయింట్ ఐసీసీ విధించింది.ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8ని ఉల్లంఘించినందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత 24 నెలలలో ఇదే తొలి తప్పిదం అయినందున కేవలం ఒక డీమెరిట్ పాయింట్‌తో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సరిపెట్టింది.అసలేమి జరిగిందంటే?ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 61 ఓవర్లో బంతిని మార్చమని ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్పై పంత్ ఒత్తిడి తీసుకొచ్చాడు. బంతి కండీషన్ బాగోలేదని కొత్త బంతిని తీసుకురావాలని పంత్ సూచించాడు. కానీ ఫీల్డ్ అంపైర్లు బంతిని పరిశీలించి, మార్చాల్సిన అవసరంలేదంటూ అదే బాల్‌ను తిరిగి పంత్‌కు ఇచ్చాడు.ఈ క్రమంలో సహనం కోల్పోయిన పంత్.. బంతిని నేలకేసి బలంగా కొట్టాడు. దీంతో అంపైర్లు మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్కు ఫిర్యాదు చేశారు. పంత్ కూడా తన తప్పును అంగీకరించాడు. ఈ నేపథ్యంలోనే పంత్‌పై ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఈ చర్యలు తీసుకున్నారు.శతక్కొట్టిన పంత్..కాగా ఈ మ్యాచ్‌లో పంత్ సెంచరీలు మోత మోగించాడు. రెండో ఇన్నింగ్స్‌లలోనూ శతకాలు బాది సంచలనం సృష్టించాడు. ఓ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డులకెక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. కాగా తొలి టెస్టులో విజయంపై భారత్ కన్నేసింది.ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని గిల్ సేన ఉంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు ఆటలో ఎవరు మెరుగ్గా రాణిస్తే వారిదే విజయం.చదవండి: రింకూ సింగ్- ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి వాయిదా!.. కారణం ఇదే! -
రిషబ్ పంత్ సరికొత్త చరిత్ర.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ పంత్ సెంచరీలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు.తన అద్బుత సెంచరీలతో ఇంగ్లండ్‌కు 371 పరుగుల లక్ష్యాన్ని ఉంచడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో పంత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.పంత్ సాధించిన రికార్డులు ఇవే..ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా పంత్ చరిత్ర సృష్టించాడు. లీడ్స్ టెస్టులో పంత్ 252 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ బుద్ధి కుందరన్ పేరిట ఉండేది. కుందరన్ 1964లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు సెంచరీలు సాధించాడు. తాజా మ్యాచ్‌తో 61 ఏళ్ల కుందరన్ ఆల్‌టైమ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.ఒకే టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్లు వీరే..👉రిషబ్ పంత్ 252👉బుద్ధి కుందరన్ 230👉ఎంఎస్ ధోని 224👉రిషబ్ పంత్ 203👉ఫరోఖ్ ఇంజనీర్ 187👉అదేవిధంగా 148 టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఒకే మ్యాచ్‌లో 2 సెంచరీలు బాదిన రెండో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్ అగ్రస్ధానంలో ఉన్నారు. సౌతాఫ్రికాతో 2001లో జరిగిన టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 142 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులతో ఫ్లవర్ ఆజేయంగా నిలిచాడు.👉ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు చేసిన ఏకైక ఆసియాన్ వికెట్ కీపర్ కూడా పంత్ కావడం విశేషం.👉ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్,దిలీప్ వెంగ్‌సర్కార్ రికార్డును రిషబ్ సమం చేశాడు. వారిద్దరూ ఇంగ్లండ్‌లో నాలుగు టెస్టు సెంచరీలు సాధించారు. పంత్‌కు కూడా ఇంగ్లండ్ గడ్డపై నాలుగో టెస్టు సెంచరీ. ఈ రేర్ ఫీట్సాధించిన జాబితాలో రాహుల్ ద్రవిడ్ 6 సెంచరీలతో రాహుల్ ద్రవిడ్ అగ్రస్ధానంలో ఉన్నాడు.Cartwheeling into the record books literally! 🌀Rishabh Pant brings his love for gymnastics into every 100 celebration, and it’s just as fearless as his batting.Who needs quiet fist pumps when you can flip your way to history?#ENGvIND 1st Test Day 4 LIVE NOW Streaming on… pic.twitter.com/iOQ8fVgHJT— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఒకవేళ అదే జరిగితే?
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలిటెస్టు తుది అంకానికి చేరుకుంది. గత నాలుగు రోజుల నుంచి హోరా హోరీగా సాగుతున్న ఈ మ్యాచ్ ఫలితం మంగళవారం తేలిపోనుంది. తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన భారత బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా సత్తాచాటారు.దీంతో ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని గిల్ సేన ఉంచింది. లక్ష్య చేధనలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. దూకుడుగా ఆడి లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్టోక్స్ సేన భావిస్తుంటే.. భారత జట్టు మాత్రం ప్రత్యర్ధిని ఆలౌట్ చేయాలని పట్టుదలతో ఉంది.వర్షం ముప్పు..అయితే భారత్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లే అవకాశముంది. ఐదో రోజు ఆటకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆక్యూవెధర్, బీబీసీ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో లీడ్స్‌లో వర్షం పడటానికి 40 శాతం ఆస్కారం ఉంది. స్ధానిక కాలమానం ప్రకారం ఉదయం 11:00 గంటలకు ఆఖరి రోజు ఆట ఆరంభం కానుంది. ఒకవేళ రిపోర్ట్స్ ప్రకారం.. మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తే తొలి టెస్టు డ్రాగా ముగిసే ఛాన్స్ ఉంది.ఆక్యూ వెదర్ రిపోర్ట్..మధ్యాహ్నం 2:30 (స్దానిక కాలమానం ఉదయం 10 గంటలకు 55% వర్షం పడే అవకాశం)మధ్యాహ్నం 3:30 (స్దానిక కాలమానం ఉదయం 11 గంటలకు 40% వర్షం పడే అవకాశం)మధ్యాహ్నం 4:30 (స్దానిక కాలమానం ఉదయం 12 గంటలకు 43% వర్షం పడే అవకాశం)సాయంత్రం 6:30 (స్ధానిక కాలమనం మధ్యాహ్యం 2 గంటలకు 47 % వర్షం పడే అవకాశం)సాయంత్రం 7:30 (స్ధానిక కాలమనం మధ్యాహ్యం 3 గంటలకు 52 % వర్షం పడే అవకాశంరాత్రి 8:30-10:30( స్ధానిక కాలమనం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు 50 % వర్షం పడే అవకాశం)చదవండి: చరిత్ర సృష్టించిన కిరాన్ పొలార్డ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
'అతడిని ఎందుకు తీసుకున్నారు.. నితీశ్ రెడ్డి వంద రెట్లు బెటర్'
ఠాకూర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డి స్ధానంలో తుది జట్టులోకి వచ్చిన శార్ధూల్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసిన ఠాకూర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తీరును కనబరిచాడు. జోష్ టంగ్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఈ ముంబై క్రికెటర్ 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. బౌలింగ్‌లోనూ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 ఓవర్లు వేసి 38 పరుగులు సమర్పించుకున్నాడు.దీంతో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరో స్పెల్ బౌలింగ్ చేసే అవకాశమివ్వలేదు. అయితే ఈ మ్యాచ్‌లో శార్థూల్ ఠాకూర్‌పై టీమిండియా మెనెజ్‌మెంట్ భారీ అంచనాలు పెట్టుకుంది. లోయార్డర్‌లో శార్ధూల్ తన అనుభవంతో పరుగులు సాధిస్తాడని భావించింది. అందుకే ఆసీస్ గడ్డపై దుమ్ములేపిన తెలుగు తేజం తీష్ కుమార్ రెడ్డిని పక్కనపెట్టి మరీ శార్దూల్‌ను ఆడించారు.కానీ హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ గిల్ నమ్మకాన్ని శార్ధూల్ వమ్ము చేశాడు. ఈ క్రమంలో టీమ్‌మెనెజ్‌మెంట్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నాడు. శార్థూల్‌ను ఎందుకు అవకాశమిచ్చారు.. అతడి కంటే నితీశ్ రెడ్డి వంద రెట్లు బెటర్ అని పోస్ట్‌లు పెడుతున్నారు. మరోవైపు శార్దూల్‌కు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6 ఓవర్ల మాత్రమే బౌలింగ్ ఇవ్వడాన్ని పలువురు మాజీలు తప్పబడుతున్నారు. అతడిపై మీకు నమ్మకం లేనప్పుడు జట్టులోకి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక లీడ్స్ టెస్టు ముగింపునకు చేరుకుంది. ఇంగ్లండ్ ముందు టీమిండియా 371 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తమ రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఇంగ్లీష్ జట్టు విజయానికి ఇంకా 350 పరుగులు కావాలి. చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి -
వారెవ్వా రూట్.. ద్రవిడ్ వరల్డ్ రికార్డు సమం
ఇంగ్లండ్ స్టార్ బ్యా టర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా భారత మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ రికార్డును రూట్ సమం చేశాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు.నాలుగో రోజు ఆటలో శార్థూల్ ఠాకూర్ క్యాచ్‌ను అందుకున్న జో.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్, ద్రవిడ్ ఇద్దరూ సమానంగా చెరో 210 అవుట్‌ఫీల్డ్ క్యాచ్‌లను అందుకున్నారు. ద్రవిడ్ ఈ వరల్డ్ రికార్డును 164 టెస్టుల్లో సాధించగా.. రూట్ 154 మ్యాచ్‌లలోనే ఈ రేర్‌ఫీట్‌ను సమం చేశాడు.ఈ సిరీస్‌లో రూట్ మరో క్యాచ్‌ను అందుకుంటే ద్రవిడ్‌ను అధిగమిస్తాడు. ఈ రికార్డు సాధించిన జాబితాలో ద్రవిడ్, రూట్ తర్వాత స్ధానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే(205 అవుట్‌ఫీల్డ్ క్యాచ్‌లు) ఉన్నారు. అయితే టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా దక్షిణాఫ్రికా లెజెండ్ మార్క్ బౌచర్(532) అగ్రస్దానంలో ఉన్నాడు.గెలుపువరిదో?ఇక ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇంగ్లండ్ ముందు టీమిండియా 371 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తమ రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఇంగ్లీష్ జట్టు విజయానికి ఇంకా 350 పరుగులు కావాలి. భారత్ తమ విజయానికి పది వికెట్ల దూరంలో నిలిచింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 90/2 తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. 96 ఓవర్లలో 364 పరుగులకు ఆలౌటైంది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి -
బ్యాటింగ్‌కు అంత ఈజీగా లేదు.. విజయం మాదే: కేఎల్ రాహుల్
హెడింగ్లీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. 90/2తో నాలుగో రోజును ఆటను ప్రారంభించిన టీమిండియా.. అదనంగా 274 పరుగులు జోడించి తమ రెండో ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (137), రిషబ్ పంత్ (118) సెంచరీలతో చెలరేగారు.పంత్, రాహుల్ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 195 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వీరిద్దరూ ఔటయ్యాక టీమిండియా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 31 పరుగుల వ్యవధిలోనే భారత్ చివరి 6 వికెట్లు కోల్పోయింది.దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం జోడించి ఇంగ్లండ్ ముందు 371 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 21/0 స్కోరుతో నిలిచింది. ఇక ఈ మ్యాచ్ విజయంపై సెంచూరియాన్ కేఎల్ రాహుల్ థీమా వ్యక్తం చేశాడు.ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని రాహుల్ తెలిపాడు. మరోవైపు ఇంగ్లండ్ సైతం డ్రా కోసం కాకుండా గెలుపు కోసం ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ యువ సంచలనం జోష్ టంగ్ స్పష్టం చేశాడు."బ్లాక్‌బస్టర్ ముగింపు కోసం ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఫలితం తేలుతుంది. ఇంగ్లండ్ జట్టు కూడా డ్రా కోసం కాకుండా విజయం కోసం ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని వారు బహిరంగంగానే వెల్లడించారు. కాబట్టి వారు దూకుడుగా ఆడితే మాకు 10 వికెట్లు తీసేందుకు అవకాశం లభిస్తోంది. నాలుగో రోజు ఆటలో పిచ్ బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేదు. బంతి కాస్త ఆగి వచ్చింది. రేపు(మంగళవారం) పిచ్ మరింత ట్రిక్కీగా మారవచ్చు. దీంతో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి" అని నాలుగో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో రాహుల్ పేర్కొన్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తర ముగింపునకు చేరుకుంది. ఇంగ్లండ్ తమ విజయానికి 350 పరుగులు దూరంలో ఉండగా.. టీమిండియా 10 వికెట్ల దూరంలో నిలిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.క్రీజులో జాక్ క్రాలీ (12 బ్యాటింగ్), బెన్ డకెట్ (9 బ్యాటింగ్) ఉన్నారు. అంతకముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (247 బంతుల్లో 137; 18 ఫోర్లు), రిషభ్ పంత్ (140 బంతుల్లో 118; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతక్కొట్టారు.ఈ టెస్టులో పంత్‌కు ఇది రెండో సెంచరీ. ఇక తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 6 పరుగుల ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 371 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో మరోసారి బౌలర్లకు మరోసారి కఠిన సవాలు తప్పదు. బుమ్రాకు తోడుగా సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ రాణించాల్సిన అవసరముంది.93 ఏళ్ల చరిత్రలోనే..ఇక ఈ లీడ్స్ టెస్టులో భారత జట్టు చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. ఒక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తరపున ఐదు సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. 1932 నుంచి టెస్టు క్రికెట్ ఆడుతున్న భారత జట్టు.. 93 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఫీట్‌ను అందుకుంది.గతంలో భారత్ తరపున ఒక టెస్టు మ్యాచ్‌లో నాలుగు సెంచరీలు నమోదైన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఐదు సెంచరీలు రావడం మొదటి సారి. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ సెంచరీలు చేయగా...రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, పంత్ శతకాలు బాదారు.అదేవిధంగా 1955 తర్వాత విదేశీ గడ్డపై ఒకే టెస్టు మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేసిన పర్యాటక జట్టుగా భారత్ నిలిచింది. 70 ఏళ్ల కిందట వెస్టిండీస్ టూర్లో ఒకే టెస్టులో ఐదుగురు ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళు మూడు అంకెల స్కోర్‌ను అందుకున్నారు.చదవండి: గుండెపోటుతో భారత మాజీ క్రికెటర్ కన్నుమూత -
గుండెపోటుతో భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి (77) సోమవారం లండన్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. 32 ఏళ్ల వయసులో ఆయనకు తొలిసారి భారత్ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కింది. 1979–1983 మధ్య కాలంలో 33 టెస్టులు ఆడి 114 వికెట్లు పడగొట్టిన దిలీప్ దోషి...15 వన్డేల్లో 22 వికెట్లు తీశారు.1981లో మెల్బోర్న్లో జరిగిన టెస్టులో ఆ్రస్టేలియాపై భారత జట్టు చారిత్రాత్మక విజయంలో దిలీప్ 5 వికెట్లతో కీలక పాత్ర పోషించారు. దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర, బెంగాల్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆయన సుదీర్ఘ కాలం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో వార్విక్షైర్, నాటింగ్‌హామ్‌షైర్ జట్ల తరఫున ఆడారు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత లండన్‌లోనే శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు. కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నప్పుడు కూడా భారత్ జట్టులో బిషన్‌సింగ్ బేడి హవా నడుస్తుండటంతో దిలీప్‌కు ఎక్కువగా టెస్టులు ఆడే అవకాశం రాలేదు. ‘స్పిన్ పంచ్’ పేరుతో ఆయన ఆటోబయోగ్రఫీ వచ్చింది. దిలీప్ మృతి పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది.కాగా ఆయన కుమారుడు నయన్ జోషీ సైతం సర్రే, సౌరాష్ట్ర తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. దోషీ మృతికి సంతాపంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఐదు రోజు ఆటలో భారత్-ఇంగ్లండ్ ఆటగాళ్లు బ్లాక్ బ్యాండ్స్ భుజానికి కట్టుకుని బరిలోకి దిగనున్నారు. -
IND VS ENG 1st Test Day 4: టీమిండియాకు షాక్
భారత్-ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4), వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (30) ఔట్ కాగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (47), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. 6 పరుగుల ఆధిక్యం కలుపుకొని భారత్ 96 పరుగుల ఆధిక్యంలో ఉంది.నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే టీమిండియాకు షాక్ఓవర్నైట్ స్కోర్ 90/2 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికే (24.6వ ఓవర్) బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్‌కు జతగా రిషబ్ పంత్ క్రీజ్‌లోకి వచ్చాడు. గిల్ వికెట్ కోల్పోవడంతో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌పై ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇంగ్లండ్ ముందు టీమిండియా గౌరవప్రదమైన టార్గెట్ ఉంచాలంటే రాహుల్, పంత్ చాలా కీలకం కానున్నారు. వీరిద్దరు ఈ రోజంతా క్రీజ్‌లో ఉంటేనే భారత్ ఓ మోస్తరు స్కోర్ చేయగలుగుతుంది. -
అతడొక సూపర్ మ్యాన్.. 700 పరుగులు చేస్తాడు: సునీల్ గవాస్కర్
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. బ్యాటింగ్ పరంగా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాయి. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులు చేస్తే.. ఇంగ్లండ్ అందుకు సమాధానంగా 465 పరుగులు చేసింది. భారత్‌కు కేవలం 6 పరుగులు మాత్రమే ఆధిక్యం లభించింది.మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(47), శుబ్‌మన్ గిల్ ఉన్నారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నందున ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించక తప్పదు. అది జరగాలంటే భారత్ నాలుగో రోజు మొత్తం బ్యాటింగ్ చేయాలి.క్రీజులో పాతుకుపోయిన కేఎల్ రాహుల్ నుంచి భారీ ఇన్నింగ్స్‌ను భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్‌పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్‌లో అద్బుతమైన టాలెంట్ ఉందని అతడు కొనియాడాడు."కేఎల్ రాహుల్ టోటల్ టీమ్ మ్యాన్. జట్టుకు ఏ అవసరమున్న తను ముందుకు వస్తాడు. ఏ స్ధానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. ఓపెనర్‌గా, మిడిలార్డర్లో ఎక్కడైనా బ్యాటింగ్ చేసే సత్తా అతడికి ఉంది. అంతేకాకుండా వికెట్ కీపర్‌గా కూడా రాణించలగడు. పరిస్థితులకు తగ్గట్టు ఆడే టాలెంట్ అతడి వద్ద ఉంది.ఎటువంటి పరిస్థితులలోనైనా రాహుల్ చాలా ప్రశాంతంగా కన్పిస్తాడు. ప్రస్తుత తరంలో ఇటువంటి క్రికెటర్లు చాలా అరుదుగా ఉంటారు. అతడు ఏదైనా సాధించినప్పుడు సెలబ్రేషన్స్ కూడా పెద్దగా చేసుకోడు. నిజంగా అతడు చాలా గ్రేట్. రాహుల్‌లో అద్బుతమైన టాలెంట్ ఉంది.ఈ మ్యాచ్‌లో ఆఫ్‌సైడ్, లెగ్-సైడ్, ఫ్లిక్ వంటి మాస్టర్ క్లాస్ షాట్లు ఆడాడు. అతడి ఆట చూడటానికి చాలా అందంగా అనిపించింది. ఈ సిరీస్‌లో రాహుల్ బాగా రాణిస్తున్నాడన్న నమ్మకం నాకుంది. 5 టెస్టుల్లో కనీసం 700 పరుగులైనా చేస్తాడని" గవాస్కర్ జోస్యం చెప్పాడు.చదవండి: అతడిపై నమ్మకం లేనపుడు.. ఎందుకు ఎంపిక చేశారు?: భారత మాజీ క్రికెటర్ -
ఎప్పుడో నా కెరీర్ ముగిసిందన్నారు.. కానీ పదేళ్లు పూర్తి చేసుకున్నాను: బుమ్రా
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఫైవ్ వికెట్ల హాల్‌తో మెరిశాడు. రెండో రోజు ఆటలో మూడు వికెట్లు పడగొట్టిన బుమ్రా.. రెండో రోజు ఆటలో మరో రెండు వికెట్లను సాధించాడు.దీంతో విదేశీగడ్డపై టెస్టుల్లో అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన భారత బౌలర్‌గా కపిల్‌దేవ్ సరసన బుమ్రా(12) నిలిచాడు. అయితే మూడో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన బుమ్రా.. తన ఫిట్‌నెస్‌పై విమర్శలు చేసే వారికి గట్టి కౌంటరిచ్చాడు. తన శరీరం సహకరించేంతవరకు భారత్ తరపున క్రికెట్ ఆడాలని అనుకుంటున్నానని అతడు తెలిపాడు.కాగా గత క్యాలెండర్ ఈయర్‌లో భారత్ తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన బౌలర్‌గా నిలిచిన బుమ్రా.. ఆస్ట్రేలియాతో జరిగిన 5వ టెస్ట్ సందర్భంగా వెన్ను గాయం బారిన పడ్డాడు. ఈ గాయం కారణంగా బుమ్రా దాదాపు నాలుగు నెలలు ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ జస్ప్రీత్ భాగం కాలేదు. ఐపీఎల్-2025తో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్‌కు వచ్చినప్పటికి వర్క్‌లోడ్, ఫిట్నెస్ కారణంగా మొత్తం అన్ని మ్యాచ్‌లు ఆడుతాడన్న గ్యారెంటీ లేదు.రిపోర్టర్: గాయం బారిన ప్రతీసారీ మీపై వచ్చే విమర్శలకు బాధపడతారా?బమ్రా: "నా ఫిట్‌నెస్‌పై వచ్చే నెగిటివ్ కామెంట్లను పట్టించుకోను. అరంగేట్రం నుంచి నా ఫిట్‌నెస్‌పై ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. మొదటిలో కొంతమంది నేను ఎనిమిదినెలలు మాత్రమే ఆడగలనని అన్నారు. మరికొంతమంది 10 నెలల మాత్రమే అన్నారు. కానీ ఇప్పుడు నేను అంతర్జాతీయ క్రికెట్లో పదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నాను. 12-13 సంవత్సరాలపాటు ఐపీఎల్ ఆడాను.ప్రతీ గాయం తర్వాత నా కెరీర్ ముగిసిపోయిందని, అతడు మరి తిరిగి రాడని కామెంట్స్ చేస్తుంటారు. వారి అలానే అనుకోనివ్వండి. నా పని నేను చేసుకుపోతాను. ప్రతి నాలుగు నెలలకు ఇలాంటి మాటలు వింటూనే ఉంటాము. నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించను.దేవుడు రాసిపెట్టినంత కాలం భారత తరపున క్రికెట్ ఆడుతాను. అందుకు తగ్గట్టు నా శరీరాన్ని కూడా సిద్దం చేసుకుంటాను. నేను అలిసి పోయాను అనుకున్నప్పుడు క్రికెట్‌ను వదిలేస్తాను. భారత క్రికెట్ జట్టును మరింత ముందుకు తీసుకువెళ్లడమే నా లక్ష్యమంటూ" సమాధనమిచ్చాడు -
రెచ్చగొట్టిన మహ్మద్ సిరాజ్.. ఇచ్చిపడేసిన ఇంగ్లండ్ బ్యాటర్! వీడియో
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బౌలింగ్ చేసేటప్పుడు తన మాటలతో, చేష్టలతో ప్రత్యర్ధి బ్యాటర్లను రెచ్చగొడుతూ ఉంటాడు. తాజాగా సిరాజ్ మియా మరోసారి తన చర్యలతో వార్తల్లో నిలిచాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో సిరాజ్ తన సహనాన్ని కోల్పోయాడు. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌తో ఈ హైదరాబాదీ వాగ్వాదానికి దిగాడు. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ 84వ ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో బ్రూక్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. ఆ తర్వాతి బంతిని సిరాజ్ షర్ప్ ఇన్‌స్వింగర్‌గా సంధించాడు. ఆ బంతిని ఆడడానికి హ్యారీ ఇబ్బందిపడ్డాడు. ఈ క్రమంలో బ్రూక్ వైపు సిరాజ్ సీరియస్ లూక్ ఇచ్చాడు. అంతేకాకుండా అతడిని ఏదో మాట అన్నాడు.అందుకు బదులుగా బ్రూక్.. బౌలింగ్ వేసేందుకు రన్ ఆప్ మార్క్ చేసుకో అంటూ సమాధనమిచ్చాడు. బ్రూక్‌ను రెచ్చగొట్టి ఔట్ చేయాలన్న సిరాజ్ వ్యూహాం ఫలించలేదు. 86వ ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌ను బ్రూక్ ఓ ఆట ఆడేసికున్నాడు. ఆ ఓవర్లో సిరాజ్ ఏకంగా 18 పరుగులు సమర్పించుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ దురదృష్టవశాత్తూ 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. టీమిండియా ప్రస్తుతం 96 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.👀😯🗣️ Tensions rising in the middle!#MohammedSiraj and #HarryBrook in a fiery exchange as the heat is on at Headingley! 🔥#ENGvIND 1st Test Day 3 LIVE NOW Streaming on JioHotstar 👉 https://t.co/SIJ5ri9fiC pic.twitter.com/nKZTSeFZt1— Star Sports (@StarSportsIndia) June 22, 2025 -
స్టోక్స్ స్ధానంలో భారత సంతతి ఆటగాడు.. ఎవరీ యష్ వగాడియా?
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ సైతం తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసి టీమిండియాకు ధీటైన సమాధానం ఇచ్చింది.మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. గిల్ సేన ప్రస్తుతం 96 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ ఉంచాలంటే నాలుగో రోజు మొత్తం భారత్ బ్యాటింగ్ చేయాల్సిందే. క్రీజులో కేఎల్ రాహుల్(47), శుబ్‌మన్ గిల్(6) ఉన్నారు.స్టోక్స్ స్ధానంలో భారత సంతతి ఆటగాడు..ఇక నాలుగో రోజు ఆటలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భారత రెండో ఇన్నింగ్స్ సందర్బంగా ఇంగ్లండ్ స్క్వాడ్‌లో లేని ఓ ఆటగాడు ఫీల్డింగ్‌కు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సబ్‌స్ట్యూట్‌గా యార్క్‌షైర్ క్లబ్ ఆటగాడు యష్ వగాడియా మైదానంలో అడుగుపెట్టాడు.భారత సంతతికి చెందిన 21 ఏళ్ల వగాడియా రెండు ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాడు. అయితే జట్టులో లేని ఆటగాడు ఫీల్డింగ్‌కు రావడమేంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా లీడ్స్ టెస్టు కోసం వగాడియాతో పాటు జవాద్ అక్తర్, నోహ్ కెల్లీను 12వ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే అంపైర్ అనుమతి తీసుకుని వగాడియా సబ్‌స్ట్యూట్‌గా బరిలోకి దిగాడు.ఎవరీ వగాడియా?21 ఏళ్ల యష్ వగాడియా.. దేశవాళీ క్రికెట్లో యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. యష్‌కు బ్యాటింగ్‌తో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్ డర్హామ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. వగాడియా పదకొండేళ్ల వయసులోనే యార్క్‌షైర్ క్రికెట్ ఆకాడమీలో చేరాడు.అకాడమీ, అండర్-18 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. దీంతో తొలిసారి 2023 సంవత్సరంలో యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్ ప్రొఫెషనల్ కాంట్రాక్టును పొందాడు. వగాడియా 2024లో వార్విక్‌షైర్‌పై తన లిస్ట్-ఎ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో ఇప్పటివరకు రెండు లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన వగాడియా.. 22 పరుగులు చేశాడు.ఇంకా ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేయనప్పటికీ, అతను యార్క్‌షైర్ సెకండ్ ఎలెవన్ మ్యాచ్‌లలో క్రమం తప్పకుండా ఆడుతాడు. కాగా వగాడియాకు గుజరాతీ మూలాలు ఉన్నాయి. వగాడియా మాత్రం ఇంగ్లండ్‌లోని న్యూకాజిల్‌లో జన్మించాడు.చదవండి: IND vs ENG: జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్ -
జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్
టెస్టు క్రికెట్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన హవాను కొనసాగిస్తున్నాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో మూడు వికెట్లు పడగొట్టిన జస్ప్రీత్.. మూడో రోజు ఆటలో మరో రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రాకు ఇది 14వ ఫైవ్ వికెట్ హాల్ వికెట్ కావడం గమనార్హం. ఈ క్రమంలో బుమ్ బుమ్రా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కపిల్ దేవ్ రికార్డు బ్రేక్..👉టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక సార్లు అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన భారత బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్‌లో టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పుడు బుమ్రా ఐదు వికెట్ల ఘనత సాధించడం ఇది మూడోసారి.2018లో ఇంగ్లండ్ పర్యటనలో తొలిసారి ఐదు వికెట్ల హాల్ సాధించిన బుమ్రా.. 2021లో మళ్లీ ఇంగ్లండ్ గడ్డపై రెండో సారి ఐదు వికెట్ల హాల్‌ను నమోదు చేశాడు. ఇప్పుడు తాజా పర్యటనలో ముచ్చటగా మూడో సారి ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత దిగ్గజ క్రికెటర్లు లాలా అమర్ నాథ్, కపిల్ దేవ్, బి చంద్రశేఖర్, భువనేశ్వర్ కుమార్, వినూ మన్కడ్, చేతన్ శర్మ, ఇషాంత్ శర్మ, మహ్మద్ నిస్సార్ మరియు సురేంద్రనాథ్ల పేరిట ఉండేది.ఈ లెజెండరీ క్రికెటర్లు తమ కెరీర్లో రెండు సార్లు ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో ఫైవ్ వికెట్ హాల్ సాధించారు.లీడ్స్ టెస్ట్ కు ముందు బుమ్రా కూడా రెండు ఫైవ్ వికెట్ల హాల్‌తో ఈ జాబితాలో ఉండేవాడు. కానీ తాజా మ్యాచ్‌తో వీరిందని బుమ్రా అధిగమించాడు.👉అదేవిధంగా విదేశీ గడ్డపై అత్యధిక ఐదు వికెట్ల హాల్స్ సాధించిన భారత బౌలర్‌గా కపిల్ దేవ్ రికార్డును బుమ్రా సమం చేశాడు. ఈ ఇద్దరూ విదేశాల్లో చెరో 12 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నారు.👉సెనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 150 వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్‌గా నిలిచాడు. విదేశాల్లో అత్యధిక ఫైవ్ వికెట్స్ హాల్ సాధించిన ప్లేయర్లు.. 👉జస్ప్రీత్ బుమ్రా - 12👉కపిల్ దేవ్ - 12👉అనిల్ కుంబ్లే - 10👉ఇషాంత్ శర్మ - 9👉ఆర్ అశ్విన్ - 8సేనా దేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసియా బౌలర్లు👉జస్ప్రీత్ బుమ్రా - 31 మ్యాచ్‌ల్లో 150 👉వసీం అక్రమ్ - 32 మ్యాచ్‌ల్లో 146👉అనిల్ కుంబ్లే - 35 మ్యాచ్‌ల్లో 141👉ఇషాంత్ శర్మ - 40 మ్యాచ్‌ల్లో 127👉జహీర్ ఖాన్ - 30 మ్యాచ్‌ల్లో 119నువ్వా నేనా..భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(47), శుబ్‌మన్ గిల్(6) ఉన్నారు.అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌటైంది.చదవండి: రోహిత్... ‘ప్రేమ కథా చిత్రం’𝘼 𝙢𝙖𝙨𝙩𝙚𝙧 𝙖𝙩 𝙬𝙤𝙧𝙠 🙌@Jaspritbumrah93 crafts magic with the ball once again, taking a stunning 5/83,his 14th Test 5-fer.WATCH HIS BRILLIANT PERFORMANCE 👉🏻 https://t.co/kg96V4NpFH#ENGvIND | 1st Test, Day 4 | MON, 23rd JUNE, 2:30 PM on JioHotstar pic.twitter.com/y1QUUMAVuC— Star Sports (@StarSportsIndia) June 22, 2025 -
దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు
ఇంగ్లండ్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్, గ్లౌసెస్టర్షైర్ దిగ్గజం డేవిడ్ వాలెంటైన్ లారెన్స్(61) కన్నుమూశారు. గత కొంత కాలంగా మోటార్ న్యూరోన్ వ్యాధితో బాధపడుతున్న లారెన్స్.. ఆదివారం తుది శ్వాస విడిచారు.1988లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన లారెన్స్.. ఇంగ్లండ్ తరపున ఐదు టెస్టులు ఆడి 18 వికెట్లు సాధించారు. 1991లో ది ఓవల్‌లో వెస్టిండీస్‌పై అద్బుతమైన ఫైవ్ వికెట్ల హాల్ సాధించారు. ఆ సమయంలో విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్‌ను అవుట్ చేశారు.అయితే అద్బుతమైన టాలెంట్ ఉన్నప్పటికి మెకాలి గాయం కారణంగా 1992లో ఆయన్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడింది. పస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రం ఆయన ఎన్నో ఘనతలను అందుకున్నారు. 185 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన లారెన్స్..515 వికెట్లు పడగొట్టారు. లిస్ట్-ఎ క్రికెట్లో కూడా ఆయన పేరిట 155 వికెట్లు ఉన్నాయి.నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు..లారెన్స్ మృతి పట్ల భారత్-ఇంగ్లండ్ ఆటగాళ్లు సంతాపం వ్యక్తం చేశారు. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ఆరంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడుతూ ఆటగాళ్లు చప్పట్లు కొట్టారు. అదేవిధంగా ఇంగ్లండ్-భారత్ ప్లేయర్లు భుజానికి నల్ల బ్యాండ్లు కట్టుకుని బరిలోకి దిగారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా వెల్లడించింది.ఇంగ్లండ్ ఐదో వికెట్ డౌన్..మూడో రోజు ఆటలో భారత బౌలర్లు రాణిస్తున్నారు. 67 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. నాలుగో వికెట్‌గా సెంచూరియన్ ఓలీ పోప్(106) ఔట్ కాగా.. ఐదో వికెట్‌గా కెప్టెన్ బెన్ స్టోక్స్(20) పెవిలియన్‌కు చేరాడు.భారత బౌలర్లలో ఇప్పటివరకు బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ కృష్ణ తలా వికెట్ సాధించారు. ఇంగ్లండ్ ఇంకా టీమిండియా స్కోర్‌కు 189 పరుగులు వెనకంజలో ఉంది. క్రీజులో ఇంగ్లండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్(42), జేమీ స్మిత్(5) ఉన్నారు. -
IND Vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. వసీం అక్రమ్ రికార్డు బద్దలు
ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం తనను మించిన బౌలర్ లేడని టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మరోసారి నిరూపించుకున్నాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు రెండో రోజు ఆటలో బుమ్రా నిప్పలు చెరిగాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ వంటి సహచర పేసర్లు తేలిపోయిన చోట.. బుమ్రా తన బౌలింగ్ స్కిల్‌తో ఆకట్టుకున్నాడు.పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా అతడు ప్రతి బంతికి వికెట్ తీసేలా అత్యంత ప్రమాదకారిగా కనిపించాడు. భారత్ పడడొట్టిన మూడు వికెట్లు కూడా బుమ్రా తీసినవే కావడం గమనార్హం. జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్ వంటి కీలక వికెట్లు పడగొట్టి భారత్‌ను గేమ్‌లో ఉంచాడు. ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.వసీం అక్రమ్ రికార్డు బ్రేక్..సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసియా బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్‌ను ఔట్ చేసిన అనంతరం ఈ రికార్డును బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా ఇప్పటివరకు సేనా దేశాల్లో 148 వికెట్లు పడగొట్టాడు. ఈ రికార్డు గతంలో వసీం అక్రమ్(146) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో అక్రమ్ ఆల్‌టైమ్ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు.సెనా దేశాల్లో బుమ్రా రికార్డుఆస్ట్రేలియా- 12 మ్యాచ్‌లు- 64 వికెట్లుఇంగ్లాండ్ 10 మ్యాచ్‌లు- 39 వికెట్లున్యూజిలాండ్- 2 మ్యాచ్‌లు- 6 వికెట్లుదక్షిణాఫ్రికా- 8 మ్యాచ్‌లు- 38 వికెట్లుసెనా దేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లుజస్ప్రీత్ బుమ్రా 147వసీం అక్రమ్ 146అనిల్ కుంబ్లే 141ఇషాంత్ శర్మ 130 -
మెడల్స్ ఏమీ లేవు.. ఇంత చెత్త ఫీల్డింగ్ చేస్తారా! గవాస్కర్ ఫైర్
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఇంగ్లీష్ జట్టు ధీటైన జవాబు ఇస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్రీజులో ఓలీ పోప్(100), హ్యారీ బ్రూక్(0) ఉన్నారు. స్టోక్స్ సేన టీమిండియా స్కోరుకు ఇంకా 262 పరుగులు వెనుకబడి ఉంది.బుమ్రా ఒక్కడే భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టి ఒంటరి పోరాటం చేశాడు. సిరాజ్, జడేజా, ప్రసిద్ద్ కృష్ణ, శార్ధూల్ రెండో రోజు ఆటలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. తొలి ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేసిన బుమ్రా.. ఆ తర్వాత కూడా తన పేస్ బౌలింగ్‌తో నిప్పులు చెరిగాడు. అతడిని ఎదుర్కొవడానికి ఇంగ్లండ్ బ్యాటర్లు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కానీ మిగితా ముగ్గురు పేసర్లు వన్డేను తలపిస్తూ పరుగులు సమర్పించుకున్నారు.ఆ మూడు క్యాచ్‌లు పట్టుంటే..అయితే ఈమ్యాచ్‌లో బుమ్రాకు ఫీల్డర్ల నుంచి మద్దతు లభించి ఉంటే టీమిండియా కచ్చితంగా పైచేయి సాధించి ఉండేది. అతడి బౌలింగ్‌లో భారత ఫీల్డర్లు మొత్తం మూడు క్యాచ్‌లను జారవిడిచారు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ఐదో బంతికి డకెట్ ఇచ్చిన క్యాచ్‌ను గల్లీలో యశస్వి జారవిడవగా... భారత అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడైన జడేజా కూడా డకెట్ క్యాచ్ నేలపాలు చేశాడు.డకెట్ బ్యాక్వర్డ్ పాయింట్లో ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో జడ్డూ విఫలమయ్యాడు. బుమ్రా వేసిన 31వ ఓవర్లో పోప్ ఇచ్చిన క్యాచ్‌ను సైతం జైస్వాల్ నేలపాలు చేశాడు. దీంతో అతడు ఏకంగా సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలో గిల్ సేన చెత్త ఫీల్డింగ్‌పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు."గత కొంత కాలంగా అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి డ్రెస్సింగ్ రూమ్‌లో అవార్డు ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. కానీ ఈ రోజు మాత్రం ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ఎవరికి ఎటువంటి అవార్డు ఇవ్వడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భారత ఫీల్డర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు.యశస్వి జైస్వాల్ చాలా మంచి ఫీల్డర్, కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. రెండు క్యాచ్‌లను జారవిడిచాడు. నిజంగా ఇది నన్ను తీవ్ర నిరాశపరిచిందని" కామెంటరీ బాక్స్‌లో ఉన్న గవాస్కర్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్ -
చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్
ఇంగ్లండ్ సూపర్ స్టార్ జో రూట్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రూట్ నిలిచాడు. లీడ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు. రూట్ ఇప్పటివరకు ఇంగ్లండ్‌లో భారత్‌తో జరిగిన టెస్టుల్లో 1589 పరుగులు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఇంగ్లండ్ గడ్డపై సచిన్ 1575 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో సచిన్ ఆల్‌టైమ్ రికార్డును జో బ్రేక్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రూట్ తన మార్క్ చూపించలేకపోయాడు. కేవలం 28 పరుగులు మాత్రమే చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఇంగ్లండ్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు..👉జో రూట్ (ఇంగ్లాండ్) – 1579*👉సచిన్ టెండూల్కర్ (భారత్) – 1575👉రాహుల్ ద్రవిడ్ (భారత్) – 1376👉అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్) – 1196👉సునీల్ గవాస్కర్ (భారత్) – 1152👉గ్రహం గూచ్ (ఇంగ్లాండ్) – 1134ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్..తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఇంగ్లండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఒలీ పోప్ (131 బంతుల్లో 100 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... బెన్ డకెట్ (94 బంతుల్లో 62; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 359/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 113 ఓవర్లలో 471 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్,శుబ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్ సెంచరీలతో మెరిశారు.చదవండి: IND vs ENG: జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత.. ఫస్ట్ ఓవర్ కింగ్‌గా -
టీమిండియాతో తొలి టెస్టు.. రెండో రోజు ఇంగ్లండ్‌దే
లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియాపై ఇంగ్లండ్ పై చేయి సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్రీజులో వైస్ కెప్టెన్ ఓలీ పోప్(100), హ్యారీ బ్రూక్ (0) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌటైంది. 359/3 ఓవర్ నైట్‌స్కోర్‌తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్‌తో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), యశస్వి జైస్వాల్ (101, 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు. -
జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత.. ఫస్ట్ ఓవర్ కింగ్‌గా
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో 2021 నుంచి తొలి ఓవర్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఓవర్లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని ఔట్ చేసిన బుమ్రా.. ఈ రేర్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.2021 నుంచి బుమ్రా ఇప్పటివరకు తొలి ఓవర్లో 8 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికా స్పీడ్ స్టార్, ఆసీస్ ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరూ తొలి ఓవర్లో 7 వికెట్లు పడగొట్టారు. తాజా మ్యాచ్‌తో ఈ ఇద్దరి పేసర్లను బుమ్రా అధిగమించాడు.ఇంగ్లండ్ ఓపెనర్ మైండ్ బ్లాంక్..కాగా బుమ్రా తొలి ఓవర్లోనే క్రాలీని బోల్తా కొట్టించాడు. మొదటి ఓవర్లో ఐదో బంతిని బుమ్రా.. క్రాలీకి మిడిల్ స్టంప్‌పై అవుట్-స్వింగర్ వేశాడు. క్రాలీ ఆ బంతిని లెగ్‌సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్‌లో కరుణ్ నాయర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో 4 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఓపెనర్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు.ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్..ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులకు ఆలౌటైంది. 359/3 ఓవర్ నైట్‌స్కోర్‌తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్‌తో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), యశస్వి జైస్వాల్ (101, 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్‌స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో29 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది. రెండు వికెట్లు కూడా బుమ్రానే పడగొట్టాడు. -
అప్పుడు స్టుపిడ్.. స్టుపిడ్! ఇప్పుడు సూపర్బ్.. సూపర్బ్
స్టుపిడ్..స్టుపిడ్.. స్టుపిడ్.. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ కోల్పోవడంతో కామెంటేటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు అదే గవాస్కర్ రిషబ్ పంత్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.రెండో రోజు ఆటలో తన ఏడో టెస్టు సెంచరీ మార్క్‌ను రిషబ్ అందుకున్నాడు. ఈ ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ 99 పరుగుల వద్ద సిక్సర్ బాది మరి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న గవాస్కర్ సూపర్బ్.. సూపర్బ్.. సూపర్బ్ అంటూ కొనియాడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. విమర్శించిన నోళ్లతోనే పొగిడించుకోవడం చాలా గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓవరాల్‌గా 178 బంతులు ఎదుర్కొన్న పంత్.. 12 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 134 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సెంచరీతో టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా ధోని రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. పంత్‌కు ఇది ఏడో టెస్టు సెంచరీ.తొలి ఇన్నింగ్స్‌లో భారత స్కోరంతంటే?ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులకు ఆలౌటైంది. 359/3 ఓవర్ నైట్‌స్కోర్‌తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్‌తో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), యశస్వి జైస్వాల్ (101, 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్‌స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు.. -
గిల్, జైశ్వాల్, పంత్ సెంచరీలు.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు జూలు విదిల్చారు. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 471 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 359/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన గిల్ సేన. అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.రెండో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు మెరుగ్గా రాణించలేకపోయారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (134, 178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (101 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.సుదర్శన్, కరుణ్ నాయర్ అట్టర్ ప్లాప్.. ఇక ఈ మ్యాచ్‌లో భారత తరపున అరంగేట్రం చేసిన సాయిసుదర్శన్ తీవ్ర నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అతడితో పాటు తొమ్మిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ సైతం ఖాతా తెరవకుండా పెవిలియన్‌కు చేరాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్‌స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు.చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా.. -
ఎనిమిదేళ్ల తర్వాత ఛాన్స్.. కట్ చేస్తే! రీఎంట్రీ మ్యాచ్‌లో డకౌట్
టీమిండియా వెటరన్ ఆటగాడు కరుణ్ నాయర్ తన రీ ఎంట్రీలో తీవ్రనిరాశపరిచాడు. ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత భారత జట్టులోకి తిరిగొచ్చిన.. కరుణ్ నాయర్‌కు తన లభించిన అవకాశాన్నిసద్వినియోగం చేసుకోలేకపోయాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కరుణ్ డకౌటయ్యాడు.మొదటి ఇన్నింగ్స్‌లో ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నాయర్ నాలుగు బంతులు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఓలీ పోప్ సంచలన క్యాచ్ అందుకోవడంతో నాయర్ డకౌట్ అవ్వాల్సి వచ్చింది. అంతకుముందు అరంగేట్ర ఆటగాడు సాయిసుదర్శన్ కూడా తన ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.టీమిండియా@471ఇక మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 471 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 359/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన గిల్ సేన. అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (134, 178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (101 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్‌స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు.. -
రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు..
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అద్బుతమైన సెంచరీ సాధించాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.ఈ క్రమంలో పంత్ 146 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. పంత్‌కు ఇది ఏడో టెస్టు సెంచరీ కావడం విశేషం. రిషబ్ సెంచరీ సాధించగానే సంతోషంతో మరోసారి ఫ్లిప్ జంప్ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.106 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్(113)తో పాటు కెప్టెన్ రవీంద్ర జడేజా(1) ఉన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్..👉టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ చరిత్ర సృష్టించాడు. పంత్ ఇప్పటివరకు టెస్టుల్లో 7 సెంచరీలు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా లెజెండ్ ఎంఎస్ధోని పేరిట ఉండేది. ధోని తన కెరీర్లో 6 టెస్టు సెంచరీలు సాధించాడు. తాజా శతకంతో ధోనిని పంత్ అధిగమించాడు.👉సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక టెస్టు రన్స్ చేసిన పర్యాటక జట్టు వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. పంత్ ఇప్పటివరకు సేనా దేశాల్లో 49 ఇన్నింగ్స్‌లలో 1746 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డు కూడా ఎంఎస్ ధోని పేరిటే ఉండేది. ధోని తన కెరీర్లో సేనా దేశాల్లో 60 ఇన్నింగ్స్‌లు ఆడి 1731 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ధోని వరల్డ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.👉విదేశీ గడ్డపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన మూడో వికెట్ కీపర్‌గా ఇంగ్లండ్‌కు చెందిన లెస్ అమెస్ రికార్డును పంత్ సమం చేశాడు. అమీస్ విదేశాల్లో ఐదు టెస్టు సెంచరీలు చేయగా.. పంత్ కూడా సరిగ్గా ఐదు సెంచరీలు చేశాడు. ఈ పర్యటనలో మరో సెంచరీ చేస్తే అమీస్‌ను అధిగమిస్తున్నాడు. ఈ జాబితాలో ఆసీస్ లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్(10) అగ్రస్ధానంలో ఉన్నాడు. -
'శుబ్‌మన్ గిల్ ఒక అద్బుతం'.. యూటర్న్ తీసుకున్న భారత మాజీ క్రికెటర్
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన తొలి మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో గిల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి 127 పరుగులతో గిల్ అజేయంగా నిలిచాడు.ఇంగ్లండ్ గడ్డపై గిల్‌కు ఇదే మొదటి టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో కెప్టెన్‌గా అతడిని ఎంపిక చేయడాన్ని విమర్శించిన నోళ్లే ఇప్పుడు శెభాష్ అంటున్నాయి. తొలుత కెప్టెన్‌గా గిల్‌ను వ్యతిరేకించిన భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ అద్బుతమైన టెక్నిక్‌తో బ్యాటింగ్ చేశాడని మంజ్రేకర్ కొనియాడాడు."కొన్ని రోజుల కిందట భారత టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను ఎంపికచేయడాన్ని నేను వ్యతిరేకించాను. గిల్ కంటే జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా బెటర్ అని అభిప్రాయపడ్డాను. ఆ సమయంలో సెలక్టర్లు సరైన నిర్ణయం తీసుకోలేదని నేను చెప్పుకొచ్చాను. కానీ నేను ఎక్కడా కూడా గిల్ కెప్టెన్‌గా విఫలమవుతాడని మాత్రం చెప్పలేదు.కెప్టెన్సీ భారం తన బ్యాటింగ్‌కు పడకుండా గిల్ చూసుకుంటాడని నేను ముందే ఊహించాను. కానీ విదేశాల్లో మాత్రం అతడి ప్రదర్శన ఇంకా మెరుగు పడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో మాత్రం గిల్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు.శుబ్‌మన్ తన బ్యాటింగ్‌లో టెక్నికల్ లోపాలను సరిదిద్దుకున్నాడు. అందుకే విదేశీ గడ్డపై భారీ సెంచరీసాధించగలిగాడని" జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
టెస్టు క్రికెట్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మరోసారి తన సత్తా చాటాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ ఫియర్లెస్ ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైశ్వాల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రిషబ్.. తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేశాడు.మొదటి రోజు ఆటముగిసే సమయానికి పంత్ 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 6 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో పంత్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.హిట్‌మ్యాన్ రికార్డు బ్రేక్..వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ హిస్టరీలోనే అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా పంత్ రికార్డులెక్కాడు. పంత్ ఇప్పటివరకు డబ్ల్యూటీసీలో 35 మ్యాచ్‌లు ఆడి 58 సిక్సర్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ(56) పేరిట ఉండేది.తాజా మ్యాచ్‌తో రోహిత్‌ను రిషబ్ అధిగమించాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(83) అగ్రస్ధానంలో ఉండగా.. పంత్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శుబ్‌మన్ గిల్(127 నాటౌట్), యశస్వి జైశ్వాల్(101) సెంచరీలతో మెరిశారు.చదవండి: అలా అయితే అవుట్ అయిపోతావు! గిల్‌కు పంత్ వార్నింగ్.. వైరల్ -
గిల్, జైశ్వాల్ సెంచరీలు.. తొలి రోజు భారత్‌దే
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు సత్తాచాటారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్(127 నాటౌట్) సెంచరీలతో మెరిశారు. ప్రస్తుతం క్రీజులో గిల్‌తో పాటు రిషబ్ పంత్(65) ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. కార్స్ ఓ వికెట్ సాధించాడు. -
వారెవ్వా గిల్.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే అద్బుత సెంచరీ
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ తన కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో గిల్ సెంచరీతో మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్.. విరాట్ కోహ్లిని తలపించాడు. తొలుత దూకుడుగా ఆడిన శుబ్‌మన్, జైశ్వాల్ ఔటయ్యాక ఆచిచూచి తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో 140 బంతుల్లో గిల్ తన ఆరో టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 14 ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి. అతడి కంటే ముందు యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్బుత సెంచరీతో చెలరేగాడు. 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, 1 సిక్సర్‌తో 101 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్సీ డెబ్యూలో సెంచరీతో చెలరేగిన గిల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లఖించుకున్నాడు.భారత టెస్టు కెప్టెన్‌గా అరంగేట్ర ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన నాలుగో ప్లేయర్‌గా గిల్ నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం విజయ్ హజారే అగ్రస్ధానంలో ఉన్నారు. 1951లో కెప్టెన్‌గా తన అరంగేట్ర ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పైనే సెంచరీ చేశారు.భారత టెస్ట్ కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ప్లేయర్లు వీరే..164* విజయ్ హజారే వర్సెస్ ఇంగ్లండ్, ఢిల్లీ 1951116 సునీల్ గవాస్కర్ vs న్యూజిలాండ్ ఆక్లాండ్ 1976115 విరాట్ కోహ్లీ vs ఆస్ట్రేలియన్ అడిలైడ్ 2014102*శుబ్‌మన్ గిల్ vs ఇంగ్లాండ్ హెడింగ్లీ 2025భారీ స్కోర్ దిశగా భారత్..తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 78 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 మూడు వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(46), గిల్(112) ఉన్నారు. -
చరిత్ర సృష్టించిన యశస్వి జైశ్వాల్.. ఒకే ఒక్కడిగా రికార్డు
టెస్టు క్రికెట్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన అద్బుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జైశ్వాల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు.144 బంతుల్లోనే జైశ్వాల్ తన ఐదో టెస్టు సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఓవరాల్‌గా 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, 1 సిక్సర్‌తో 101 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో జైశ్వాల్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించాడు.ఆ తర్వాత కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 131 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 69 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఈ క్రమంలో జైశ్వాల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. జైశ్వాల్ సాధించిన రికార్డులు ఇవే..👉ఇంగ్లండ్‌లోని లీడ్స్ మైదానంలో సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా జైశ్వాల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ టీమిండియా ఓపెనర్ ఈ ఫీట్ సాధించలేకపోయాడు. 1967లో భారత క్రికెట్ దిగ్గజం ఫరూక్ ఇంజనీర్ చేసిన 87 పరుగులే.. టీమిండియా ఓపెనర్ లీడ్స్‌లో సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఇప్పుడు 58 ఏళ్ల ఫరూక్ ఇంజనీర్ రికార్డును జైశూ బ్రేక్ చేశాడు👉ఇంగ్లండ్, ఆస్ట్రేలియా రెండు దేశాల్లోనూ తన కెరీర్లో ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన ఏకైక భారత ఆటగాడిగా జైశ్వాల్నిలిచాడు. గతేడాది ఆఖరిలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో జైశ్వాల్ సెంచరీతో మెరిశాడు. ఆసీస్ గడ్డపై జైశ్వాల్‌కే అదే తొలిటెస్టు మ్యాచ్.👉ఇంగ్లండ్‌పై గడ్డపై ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా జైశ్వాల్ నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో భారత మాజీ ప్లేయర్ విజయ్ మంజ్రేకర్ ఉన్నారు. విజయ్ మంజ్రేకర్ 1952లో ఇంగ్లండ్‌లో ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.ఇంగ్లండ్‌లో తమ తొలి టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే133 విజయ్ మంజ్రేకర్- హెడింగ్లీ 1952131 సౌరవ్ గంగూలీ -లార్డ్స్ 1996129*సందీప్ పాటిల్ -ఓల్డ్ ట్రాఫోర్డ్ 1982146 మురళీ విజయ్ -ట్రెంట్ బ్రిడ్జ్ 2014100*యశస్వి జైస్వాల్ హెడింగ్లీ 2025చదవండి: ENG vs IND: ఇషాన్ కిషన్‌కు ఆ జట్టు నుంచి పిలుపు.. అక్కడ బాగా రాణిస్తే? -
ఇషాన్ కిషన్‌కు ఆ జట్టు నుంచి పిలుపు.. అక్కడ బాగా రాణిస్తే?
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆడనున్నాడు. డివిజన్–1 కౌంటీ చాంపియన్‌షిప్‌లో నాటింగ్‌హామ్‌షైర్ క్రికెట్ క్లబ్‌తో కిషన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాబోయో కౌంటీ సీజన్లో కిషన్ నాటింగ్‌హామ్‌షైర్ తరపున రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడు. సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కైల్ వెర్రెయిన్ స్థానంలో కిషన్‌ను నాటింగ్‌హామ్ తమ జట్టులోకి తీసుకుంది. ఈ సౌతాఫ్రికా వికెట్ కీపర్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు జింబాబ్వేకు వెళ్లనున్నాడు. వెర్రెయిన్ గైర్హజరీలో కిషన్ రెండు వారాల పాటు వికెట్ కీపింగ్ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. కిషన్ జూన్ 22 నుండి 26 వరకు ట్రెంట్ బ్రిడ్జ్‌లో యార్క్‌షైర్‌తో, జూన్ 29 నుండి జూలై 2 వరకు టౌంటన్‌లో సోమర్సెట్పై ఆడనున్నాడు.ఈ విషయాన్ని ఇషాన్ ధ్రువీకరించాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో తొలిసారి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాని కిషన్ తెలిపాడు. ఇక 10 రోజుల వ్యవధిలో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు ఒప్పందం కుదర్చుకున్న మూడో భారత ఆటగాడిగా ఈ జార్ఖండ్ ఆటగాడు నిలిచాడు.కిషన్ కంటే ముందు రుతురాజ్ గైక్వాడ్ ,తిలక్ వర్మ యార్క్‌షైర్, హాంప్షైర్లతో జతకట్టారు. కాగా ఇషాన్ కిషన్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది బీసీసీఐ నిబంధనలు ఉల్లఘించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన కిషన్.. తిరిగి ఈ ఏడాది తన కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నాడు. ఇప్పుడు కౌంటీల్లో మెరుగ్గా రాణిస్తే.. భారత జట్టులోకి తిరిగి పునరాగమనం చేసే అవకాశముంది. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు భారత జట్టు ఇంగ్లండ్‌లోనే ఉండనుంది. ఒకవేళ ఏ ఆటగాడు అయినా గాయపడితే ప్రత్యామ్నాయంగా కిషన్‌కు పిలుపు వచ్చే అవకాశముంది.చదవండి: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీ -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీ
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఘనంగా ఆరంభించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 144 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను జైశ్వాల్ అందుకున్నాడు. ఓవరాల్‌గా 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, 1 సిక్సర్‌తో 101 పరుగులు చేశాడు.కేఎల్ రాహుల్‌తో కలిసి మొదటి వికెట్‌కు 91 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన యశస్వి.. ఆ తర్వాత కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 131 పరుగుల పార్టనర్షిప్ నమోదు చేశాడు . జైశ్వాల్‌కు ఇది ఐదో టెస్టు సెంచరీ. తన సెంచరీ మార్క్‌ను అందుకోగానే గాల్లోకి జంప్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.ఐదో ఆటగాడిగా.కాగా జైశ్వాల్ తన కెరీర్లో ఇంగ్లండ్‌పై ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్‌లోనే సెంచరీ సాధించడం విశేషం. తద్వారా ఈ ఫీట్ సాధించిన ఐదో భారత ఆటగాడిగా జైశ్వాల్ నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో భారత మాజీ ప్లేయర్ విజయ్ మంజ్రేకర్ ఉన్నారు. విజయ్ మంజ్రేకర్ 1952లో ఇంగ్లండ్‌లో ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.ఇంగ్లండ్‌లో తమ తొలి టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే133 విజయ్ మంజ్రేకర్- హెడింగ్లీ 1952131 సౌరవ్ గంగూలీ -లార్డ్స్ 1996129*సందీప్ పాటిల్ -ఓల్డ్ ట్రాఫోర్డ్ 1982146 మురళీ విజయ్ -ట్రెంట్ బ్రిడ్జ్ 2014100*యశస్వి జైస్వాల్ హెడింగ్లీ 2025టీబ్రేక్‌కు భారత స్కోరంతంటే?ఇక తొలి రోజు టీ బ్రేక్ సమయానికి టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(100), గిల్(58) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఇప్పటివరకు బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్ తలా వికెట్ సాధించారు.చదవండి: దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?𝙔𝙚𝙝 𝙨𝙞𝙠𝙝𝙖𝙖𝙣𝙚 𝙖𝙖𝙮𝙚 𝙝𝙖𝙞𝙣! 🔥A young star rises in England with a knock full of class. @ybj_19's first century on English soil shines bright. 🤩Watch now 👉 https://t.co/PXeXAKeYoj #ENGvIND | 1st Test | LIVE NOW on JioHotstar pic.twitter.com/SizxLx76AB— Star Sports (@StarSportsIndia) June 20, 2025 -
మరీ ఇంత చీప్‌గా ఔట్ అవుతావా..? గంభీర్ రియాక్షన్ వైరల్
టీమిండియా యువ ఆటగాడు సాయిసుదర్శన్ తన టెస్టు కెరీర్‌ను పేలవంగా ఆరభించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అరంగేట్రం చేసిన సుదర్శన్ తీవ్ర నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 4 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.అయితే సుదర్శన్ క్రీజులో వచ్చినప్పటినుంచే ఇంగ్లీష్ బౌలర్లను ఎదుర్కొవడానికి తీవ్ర ఇబ్బంది పడ్డాడు. సుదర్శన్ తను ఎదుర్కొన్న తొలి బంతికే బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత తొలి రోజు లంచ్‌కు ముందు ఓవర్ వేసిన స్టోక్స్ బౌలింగ్‌లో జైశ్వాల్ సింగిల్ తీసి సుదర్శన్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. స్టోక్స్ రెండో బంతిని సుదర్శన్‌కు లెగ్ సైడ్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని సుదర్శన్ ఆడకుండా వదిలేశాడు. అనంతరం మూడో బంతిని కూడా అదేవిధంగా స్టోక్స్ సంధించాడు. అయితే ఈసారి మాత్రం సుదర్శన్ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. ఆ బంతిని సుదర్శన్ డౌన్‌ది లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. బ్యాట్‌కు తాకి డౌన్‌ది లెగ్ సైడ్ వెళ్తున్న బంతిని వికెట్ కీపర్ స్మిత్ డైవ్ చేసి క్యాచ్‌ను పూర్తి చేశాడు.దీంతో నిరాశతో సుదర్శన్ పెవిలియన్‌కు చేరాడు. సుదర్శన్ డకౌట్ కావడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అయితే ఐపీఎల్లో అదరగొట్టిన సుదర్శన్.. తన టెస్టు అరంగేట్రంలో ఈ తరహా ప్రదర్శన చేయడం అభిమానులు జీర్ణించుకులేకపోతున్నారు. మరి ఇంత చీప్‌గా ఔట్ అవుతావా అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. 34 ఓవర్లు ముగిసే సరికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.క్రీజులో జైశ్వాల్(49), శుబ్‌మన్ గిల్(31) ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో డకౌటైన సుదర్శన్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2000 సంవత్సరం తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో టాప్-7లో వచ్చి అరంగేట్రంలోనే డకౌట్ అయిన నాలుగో భారత ప్లేయర్‌గా సుదర్శన్ నిలిచాడు.అరంగేట్ర టెస్టులో డకౌటైన భారత ఆటగాళ్లు వీరే (2000 సంవత్సరం నుంచి)అజయ్ రాత్ర- 2002వృద్ధిమాన్ సాహా- 2010హనుమ విహారి- 2018సాయి సుదర్శన్- 2025*Highly irresponsible, pathetic shot by Sai Sudarshan, especially in a debut match. Does he deserve a place in the Test team?#INDvsENGTest #HeadingleyTest #SaiSudharsan pic.twitter.com/mGaUCLj3QL— Raj Singh (@Rajkumaarsingh) June 20, 2025 -
ఐపీఎల్లో ఆడితే చాలా? అతడికి మరోసారి అన్యాయం! నెటిజన్లు ఫైర్
అభిమాన్యు ఈశ్వరన్.. దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్నప్పటకి.. ఈ బెంగాల్ క్రికెటర్ ఇప్పటివరకు భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయలేకపోయాడు. అతడి కంటే ఎన్నో ఏళ్లు వెనుక కెరీర్ మొదలు పెట్టిన ఆటగాళ్లు టీమిండియాకు ప్రాతనిథ్యం వహిస్తుంటే.. ఈశ్వరన్ కేవలం రిజర్వ్ ప్లేయర్‌గానే మిగిలుపోతున్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన ఈశ్వరన్.. తొలి టెస్టులో అరంగేట్రం చేస్తాడని భావించారు.కానీ టీమ్ మెనెజ్‌మెంట్ మాత్రం మరోసారి అతడికి మొండి చేయి చూపించింది. అతడి స్ధానంలో తమిళనాడుకు చెందిన సాయిసుదర్శన్కు గంభీర్ అండ్ కెప్టెన్ గిల్ ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికి ఈశ్వరన్ మూడు సార్లు భారత జట్టుకు ఎంపికైనప్పటికి అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. అదే సాయి సుదర్శన్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. సుదర్శన్ భారత టెస్టు జట్టుకు ఎంపికైన తొలిసారే డెబ్యూ చేసే అవకాశం వచ్చింది.రంజీల్లో ఆడితే సరిపోదు..!తుది జట్టులో ఈశ్వరన్‌కు చోటుదక్కపోవడంతో భారత జట్టు మెనెజ్మెంట్పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కాదు, ఐపీఎల్లో బాగా రాణిస్తేనే టీమిండియా తరపున ఆడే అవకాశం లభిస్తుందని సెటైర్లు వేస్తున్నారు.అది మరోసారి రుజువైందని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. సాయిసుదర్శన్కు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సపోర్ట్ ఉందని, ఈశ్వరన్‌కు ఎవరి మద్దతు లేకపోవడంతో ఛాన్స్ లభించడం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు గిల్, సాయిసుదర్శన్ కలసి ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక అభిమన్యు ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 101 మ్యాచ్‌లు ఆడి 53.63 సగటుతో 7841 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో 27 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.అరంగేట్రంలో ఫెయిల్..ఇక అభిమాన్యు స్ధానంలో చోటు దక్కించుకున్న సాయిసుదర్శన్ తన అరంగేట్రంలో దారుణ ప్రదర్శన కనబరిచాడు. లీడ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 బంతులు ఆడి డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. స్టోక్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి సుదర్శన్ ఔటయ్యాడు.అయితే ఈ మ్యాచ్ పక్కన పెడితే.. అయితే సాయిసుదర్శన్ సైతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే జరిగిన ఐపీఎల్-2025లో అత్యధిక పరుగులు వీరుడిగా సుదర్శరన్ నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సుదర్శన్ మెరుగ్గా రాణిస్తున్నాడు.29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్.. 39.93 సగటుతో 1957 పరుగులు చేశాడు. అందులో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అనుభవం దృష్ట్యా ఈశ్వరన్‌కు ఛాన్స్ ఇవ్వాల్సందని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.తుది జట్లుభారత్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఇంగ్లండ్జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. ఈ శతాబ్దంలో ఒకే ఒక్కడు! -
IND vs ENG: పాపం నితీశ్ కుమార్.. అతడి కోసం పక్కన పెట్టేశారు?
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేస్ బౌలర్లకు పిచ్ అనుకూలించే అవకాశమున్నందన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌తో యువ ఆటగాడు సాయిసుదర్శన్ భారత జట్టు తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. అదేవిధంగా కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి మళ్లీ టీమిండియా తరపున ఆడుతున్నాడు.నితీశ్‌పై వేటు.. శార్ధూల్‌కు చోటుఅయితే ఈ మ్యాచ్ ఆడేందుకు భారత తుది జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అతడి స్దానంలో వెటరన్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్‌కు టీమ్‌మెనెజ్‌మెంట్ అవకాశమిచ్చింది. ఆస్ట్రేలియా వంటి కఠిన పరిస్థితుల్లో సెంచరీ చేసిన నితీశ్‌ను ఎందుకు పక్కన పెట్టారన్న ప్రశ్న అందరిలోనూ మెదలుతోంది.కాగా నితీశ్ రెడ్డి బదులుగా శార్దూల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకోవడానికి పలు కారణాలు ఉన్నాయి. శార్ధూల్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో కూడా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అంతేకాకుండా ఈ సిరీస్ ఆరంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా శార్ధూల్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు రవీంద్ర జడేజాకు ఏడో స్ధానంలో టీమ్‌మెనెజ్‌మెంట్ అవకాశమిచ్చింది. ఒకవేళ జట్టులో నితీశ్ ఉన్నా, అతడి బ్యాటింగ్ పొజిషన్ సెట్ చేయడం కాస్త కష్టమయ్యేది. అందుకే నితీష్‌కు బదులుగా శార్ధూల్ వైపు టీమిండియా మొగ్గు చూపింది. గతంలో ఇంగ్లండ్‌పై గడ్డపై ఆడిన అనుభవం కూడా ఈ ముంబై క్రికెటర్‌కు ఉంది. ఈ మ్యాచ్‌లో శార్ధూల్ రాణించకపోతే రెండో టెస్టుకు నితీష్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.తుది జట్లుభారత్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఇంగ్లండ్జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.చదవండి: అచ్చం నాన్నలాగే!.. కుమారుడితో రోహిత్- రితికా.. వీడియో వైరల్ -
కరుణ్‌తో కలిసి సుదీర్ఘ కాలం టీమిండియాకు ఆడాలి.. కేఎల్ రాహుల్ ఆశాభావం
భారత టెస్టు జట్టు సభ్యులైన కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి వివిధ వయో విభాగాల్లో ఈ కర్ణాటక మిత్రులు కలిసి ఆడారు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత రాహుల్, నాయర్లకు ఒకే టెస్టులో కలిసి ఆడే అవకాశం దక్కింది. టీమ్‌లో రాహుల్ రెగ్యులర్ మెంబర్ కాగా, ఎనిమిదేళ్ల తర్వాత నాయర్ పునరాగమనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమ స్నేహం చిరకాలం కొనసాగడంతో పాటు టీమిండియా తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు రాహుల్ చెప్పాడు.‘11 ఏళ్ల వయసులో ఇద్దరం ఒకేసారి క్రికెట్ ఆడటం ప్రారంభించాం. ఈ ప్రయాణం ఇప్పటికీ సాగుతోంది. ఇద్దరి కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. గత 2–3 ఏళ్లలో అద్భుతంగా ఆడి ఎన్నో ప్రతికూలతలను దాటి నాయర్ పునరాగమనం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్‌లో ఉండే పరిస్థితులు, సవాళ్ల గురించి మేము మాట్లాడుకున్నాం. మేమిద్దరం కలిసి భారత్ తరఫున సుదీర్ఘ కాలం ఆడాలని కోరుకుంటున్నా’ అని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రాహుల్, కరుణ్ సభ్యులుగా ఉన్నారు. ఈ ఇద్దరు ఇవాల్టి నుంచి (జూన్ 20) లీడ్స్ వేదికగా ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో ఆడటం దాదాపుగా ఖరారైంది. ఈ మ్యాచ్‌లో రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉండగా.. కరుణ్ మిడిలార్డర్లో ఐదు లేదా ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు రావచ్చు. విరాట్, రోహిత్‌ల టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత భారత బ్యాటింగ్ విభాగంలో రాహులే సీనియర్ సభ్యుడు. పైగా రాహుల్‌కు గత ఇంగ్లండ్ పర్యటనలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఓపెనర్‌గానే గత పర్యటనలో రాహుల్ సెంచరీ చేశాడు. ఇటీవలికాలంలో రాహుల్ పలు బ్యాటింగ్ స్థానాలు మారినా ఓపెనర్‌గా అయితే అతను పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. రాహుల్ ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ పర్వాలేదనిపించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్లో ఇరగదీశాడు.కరుణ్ విషయానికొస్తే.. గత రెండు దేశవాలీ సీజన్లలో పరుగుల వరద పారించిన ఇతగాడు.. తాజాగా ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించి మాంచి జోష్‌లో ఉన్నాడు. కరుణ్‌కు ఇంగ్లండ్ గడ్డపై ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. కౌంట్లీలో అతని పేరిట ఓ డబుల్ సెంచరీ, పలు సెంచరీలు ఉన్నాయి. కరుణ్ తనకు గుర్తింపు తెచ్చిన ట్రిపుల్ సెంచరీని ఇంగ్లండ్‌పైనే సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై, ఇంగ్లండ్‌పై ఘనమైన ట్రాక్ రికార్డు ఉండటంతో కరుణ్‌పై ఈ సిరీస్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. కరుణ్‌ను భారత క్రికెట్ అభిమానులు విరాట్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. దోస్తులు (రాహుల్, కరుణ్) నేటి నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఏమేరకు రాణిస్తారో చూడాలి. -
IND VS ENG 1st Test: టీమిండియా అంతా కలిసినా 'ఆ ఒక్కడితో' సమానం కాదు..!
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా ఇవాల్టి నుంచి (జూన్ 20) తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో (2025-27) ఇరు జట్లకు మొదటిది. భారతకాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి పోట్టి క్రికెట్‌కే అలవాటు పడిన ఫ్యాన్స్, ఈ మ్యాచ్ నుంచి సుదీర్ఘ ఫార్మాట్లోని అసలు సిసలైన మజాను ఎంజాయ్ చేస్తారు.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు కూడా సంసిద్దంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు బరిలోకి దిగి సత్తా చాటుదామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్టార్ త్రయం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా సరికొత్త శకంలోకి అడుగుపెట్టబోతుంది. మరోవైపు ఇంగ్లండ్ బెన్ స్టోక్స్ సారథ్యంలో యువకులు, అనుభవజ్ఞులతో ఉరకలేస్తుంది. ఇంగ్లీష్ జట్టు తమ బజ్‌బాల్ అటాకింగ్ గేమ్‌ను టీమిండియాపై ప్రయోగించాలని ఆరాట పడుతుంది.ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ఇదివరకే ప్రకటించగా.. భారత్ తమ కసరత్తును దాదాపుగా పూర్తి చేసింది. మ్యాచ్‌కు చాలా సమయం ముందుగానే జట్టును ప్రకటించి తమ ప్రణాళికలను బహిర్గతం చేయకూడదనే భారత మేనేజ్మెంట్ ఉద్దేశం.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర విషయం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటంటే.. టీమిండియా ఆటగాళ్ల మొత్తం టెస్ట్ సెంచరీల సంఖ్య కన్నా, ఒక్క ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ టెస్ట్ సెంచరీల సంఖ్యనే అధికంగా ఉండటం. రూట్ తన టెస్ట్ కెరీర్లో 36 సెంచరీలు బాదగా.. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు సభ్యులంతా కలిపి 29 సెంచరీలే చేశారు. వీరిలో కేఎల్ రాహుల్ అధికంగా 8 సెంచరీలు చేయగా.. వైస్ కెప్టెన్ పంత్ 6, కెప్టెన్ గిల్ 5, యశస్వి జైస్వాల్ 4, రవీంద్ర జడేజా 4, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి తలో సెంచరీ చేశారు. అంటే, రూట్ సెంచరీల కంటే టీమిండియా ఆటగాళ్లందరూ కలిపి చేసిన సెంచరీలు ఇంకా 7 తక్కువ అన్నమాట. రూట్ మరో 373 పరుగులు చేస్తే..భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రూట్ మరో 373 పరుగులు చేస్తే, టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి దూసుకొస్తాడు. ప్రస్తుతం 13006 పరుగులు ఖాతాలో కలిగి ఉన్న రూట్.. మరో 373 పరుగులు చేస్తే, రాహుల్ ద్రవిడ్ (13288), జాక్ కల్లిస్ (13289), రికీ పాంటింగ్‌ను (13378) అధిగమిస్తాడు. అప్పుడు సచిన్ టెండూల్కర్ ఒక్కడే (15921) రూట్ కంటే ముందుంటాడు.ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు భారత తుది జట్టు (అంచనా).. యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి/శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణ/అర్షదీప్ సింగ్టీమిండియాతో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్. -
ఇంగ్లండ్- భారత్ టెస్టు సిరీస్.. డేంజర్లో సచిన్, కోహ్లి రికార్డులు
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు రంగం సిద్దమైంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా జరగనున్న ఈ సిరీస్.. శుక్రవారం(జూన్ 20) నుంచి లీడ్స్ వేదికగా ప్రారంభం కానుంది. తొలి టెస్టులో అమీతుమీ తెల్చుకోవడానికి భారత్-ఇంగ్లండ్ జట్లు సిద్దమయ్యాయి.అయితే ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ ఇంగ్లండ్ గ్రేట్ బ్యాటర్.. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి ఆల్‌టైమ్ రికార్డులపై కన్నేశాడు.మరో మూడు హాఫ్ సెంచరీలు చేస్తే..భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లలో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన రికార్డు లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. గవాస్కర్ తన కెరీర్లో ఇంగ్లండ్‌పై 16 టెస్టు ఫిప్టీలు చేశారు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో సచిన్ టెండూల్కర్ 13 హాఫ్ సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నాడు.ఆ తర్వాత స్ధానంలో జూరూట్(11 హాఫ్ సెంచరీలు) ఉన్నాడు. ఈ క్రమంలో రూట్ మరో మూడు హాఫ్ సెంచరీలు చేస్తే.. సచిన్ అధిగమిస్తాడు. అదేవిధంగా ఆరు హాఫ్ సెంచరీలు చేస్తే సునీల్ గవాస్కర్ ఆల్‌టైమ్ రికార్డును కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.చరిత్రకు అడుగు దూరంలో..భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉంది. కోహ్లి ఇప్పటివరకు ఇంగ్లండ్‌పై మూడు ఫార్మాట్లలో 4036 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్ధానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్(3990) ఉన్నాడు. ఈ లిస్ట్‌లో మూడో స్ధానంలో జో రూట్(3858) ఉన్నాడు. ఇప్పుడు రూట్ 133 పరుగులు చేస్తే సచిన్‌ను, 179 పరుగులు సాధిస్తే విరాట్‌ను అధిగమించి అగ్రస్ధానానికి చేరుకుంటాడు.కాగా భారత్‌పై జో రూట్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు రూట్ టీమిండియాపై రూట్ 28 సార్లు (13 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు) ఏభైకి పైగా పరుగులు చేశాడు. రూట్ మరో ఐదు అర్ధ శతకాలు చేస్తే సచిన్, కోహ్లి(32)ను దాటేస్తాడు.చదవండి: Mohammed Siraj: బిజినెస్ రంగంలోకి సిరాజ్.. బంజారా హిల్స్‌లో లగ్జరీ రెస్టారెంట్ -
నాపై ఒత్తిడి లేదు.. బెస్ట్ బ్యాటర్‌గా ఉండాలనుకుంటున్నా: గిల్
లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు శుక్రవారం(జూన్ 20) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో శుభరంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో గురువారం(జూన్ 18) టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నాడు.ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు గిల్ సమాధనమిచ్చాడు. భారత కెప్టెన్‌గా తను ఎదుర్కొనున్న ఛాలెంజ్స్ కోసం గిల్ మాట్లాడాడు. అయితే కెప్టెన్సీ భారం తన బ్యాటింగ్‌పై పడకుండా చూసుకుంటాని అతడు చెప్పుకొచ్చాడు. "ఇప్పటివరకు ఏ విధంగా అయితే పూర్తి స్వేఛ్చతో బ్యాటింగ్ చేశానో, ఇకపై కూడా అదే కొనసాగిస్తున్నాను. కెప్టెన్సీ గురుంచి ఎక్కువగా ఆలోచించకుండా నా బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఈ సిరీస్‌లో బెస్ట్ బ్యాటర్‌గా ఉండాలని భావిస్తున్నా. విరాట్ కోహ్లి బ్యాటింగ్ స్ధానం కోసం ఇప్పటికే గంభీర్ భాయ్, నేను చర్చించుకున్నాము. మా దగ్గర రెండు వేర్వేరు కాంబినేషన్లు సిద్దంగా ఉన్నాయి. పిచ్‌ను పరిశీలించాక ఓ నిర్ణయం తీసుకుంటాము" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ పేర్కొన్నాడు.భయపెడుతున్న గిల్ రికార్డు..శుబ్‌మన్ గిల్ తన కెరీర్లో 32 టెస్టులు ఆడి 1893 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. కానీ సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అతడి రికార్డు మాత్రం టీమ్‌మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. సెనాదేశాల్లో గిల్ ఇప్పటివరకు 11 టెస్టులు ఆడి 514 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్‌లో అయితే అతడి ప్రదర్శన మరి దారుణంగా ఉంది. ఇంగ్లండ్ గడ్డపై మూడు టెస్టులు ఆడిన శుబ్‌మన్.. 14.66 సగటుతో కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: ‘కోహ్లి చెప్పింది నిజమే.. కానీ మాకూ కుటుంబం ఉంటుంది.. డబ్బు సంపాదించాలి’ -
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టులోకి మరో ఆటగాడు?
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం రెండు వారాల ముందే ఇంగ్లండ్ గడ్డపై అడగుపెట్టిన భారత జట్టు తీవ్రంగా శ్రమించింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని యంగ్ టీమిండియా ఎలా రాణిస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాను బ్యాకప్ ఆప్షన్‌గా భారత టెస్ట్ జట్టులో చేర్చినట్లు సమాచారం. కాగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసిన 18 మంది సభ్యుల భారత జట్టులో రాణాకు చోటు దక్కలేదు.కానీ ఇంగ్లండ్ లయన్స్‌తో అనధికారిక టెస్టులు ఆడేందుకు ఇండియా-ఎ జట్టుకు రాణాను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో ఉన్న రాణాను జట్టుతో పాటు ఉండమని సెలక్టర్లు సూచించినట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే అతడిని ఇంకా జట్టులో అధికారిక సభ్యుడిగా లెక్కించలేదని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది. కాగా గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్‌లో రాణా తన టెస్టు అరంగేట్రం చేశాడు. 2 మ్యాచ్‌ల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో సెలక్టర్లు అతడిని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు. కానీ ఇప్పుడు ఆటగాళ్ల గాయాల బెడద దృష్ట్యా అతడికి మరోసారి అవకాశం లభించింది.ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్థూల్ ఠాకూర్, ప్రసిద్ కృష్ణ, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్? -
కోహ్లి, రోహిత్ లేకపోయినా పర్వాలేదు.. గిల్ అంతా చూసుకుంటాడు: గూచ్
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తొలి సవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్దమయ్యాడు. అతడి సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్ కోసం గిల్ సేన తమ ఆస్త్రశాస్రాలను సిద్దం చేసుకుంది. అయితే ఈ సిరీస్‌లో స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేని యువ భారత జట్టు ఎలా రాణిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కమంలో ఇంగ్లండ్ మాజీ టెస్టు కెప్టెన్ కెప్టెన్ గ్రాహం గూచ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.కోహ్లి, రోహిత్ స్ధానాలను భర్తీ చేసే అద్బుత ఆటగాళ్లు ప్రస్తుత భారత జట్టులో ఉన్నారని గూచ్ అభిప్రాయపడ్డాడు. ఈ ఇద్దరి దిగ్గజాల స్ధానాలను భర్తీ చేసేందుకు సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ సిద్ధంగా ఉన్నారు. కానీ టీమ్ మెన్జ్మెంట్ ఎవరికి అవకాశమిస్తుందో వేచి చూడాలి."భారత క్రికెట్లో కొత్త యుగం మొదలైంది. నా వరకు అయితే.. ఒక దారి మూసుకుపోతే, మరో దారి తెరుచుకుంటుంది. ఈ పర్యటనలో భారత ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తారని నేను నమ్ముతున్నాను. భారత క్రికెట్ జట్టులో ప్రతిభకు కొదవలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వారసత్వాన్ని కొనసాగించేందుకు యువ ఆటగాళ్లు సిద్దంగా ఉన్నారు.అయితే బుమ్రా అన్ని మ్యాచ్‌లలో ఆడకపోవడం భారత్‌కు గట్టి ఎదురు దెబ్బే. బుమ్రా ఒక వరల్డ్ క్లాస్ బౌలర్. ఎటువంటి పరిస్థితులలోనైనా అతడిని ఎదుర్కొవడం అంత సులభం కాదు. ఈ పర్యటనలో భారత జట్టుపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది.కానీ కొంతమంది యువ ఆటగాళ్లు తమ ప్రదర్శలనతో ముందుకు రావాలి. ఇక భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం అరుదైన గౌరవంగా భావించాలి. శుబ్‌మన్ గిల్ జట్టును విజయ పథంలో నడిపిస్తాడన్న నమ్మకం నాకు ఉందని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గూచ్ పేర్కొన్నాడు.చదవండి: ICC Odi Rankings: వరల్డ్ నెం1 బ్యాటర్‌గా టీమిండియా స్టార్ ఓపెనర్ -
అండర్సన్–సచిన్ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా
లండన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సంబంధించి అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ (ఏటీటీ)ని ఈ నెల 14నే ఆవిష్కరించాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం నేపథ్యంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదంలో భారతీయులతో పాటు 50కి పైగా బ్రిటీష్ జాతీయులు కూడా మరణించారు. దాంతో ట్రోఫీ కార్యక్రమం నిర్వహించడం సరైంది కాదని వారు భావించారు. ఇదే విషయాన్ని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు నిర్ధారించారు. అయితే ఒకటి, రెండు రోజుల్లోనే ట్రోఫీని ఆవిష్కరిస్తారని ఆయన చెప్పారు. మరోవైపు ఇప్పటి వరకు భారత మాజీ కెపె్టన్ మన్సూర్ అలీఖాన్ పేరుతో ‘పటౌడీ ట్రోఫీ’గా ఉన్న పేరును ‘అండర్సన్–సచిన్ ట్రోఫీ’గా మార్చడంపై చాలా మందిలో అసంతృప్తి ఉంది. పటౌడీ గౌరవార్ధం దీనిని అదే పేరుతో కొనసాగించాలని స్వయంగా సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)ను కోరినట్లు సమాచారం. అయితే ట్రోఫీ పేరు విషయంలో కొత్త నిర్ణయానికే ఈసీబీ కట్టుబడి ఉంటే... ఈ సిరీస్‌లో పటౌడీ పేరుతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ లాంటి అవార్డును అందించైనా సరే మరో రూపంలో ఆయనను స్మరించుకునే విషయాన్ని పరిశీలించాలని బీసీసీఐ కోరింది. -
'అతడేమి తప్పు చేశాడని ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేయలేదు'
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన 18 మంది సభ్యుల భారత జట్టులో యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. అతడి స్ధానంలో కరుణ్ నాయర్‌కు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. అయితే ప్రధాన జట్టు నుంచి సర్ఫరాజ్‌ను తప్పించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. ఈ ముంబై ఆటగాడిని ఇండియా-ఎ జట్టులో భాగం చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండు అనాధికారిక టెస్టు సిరీస్‌లో సర్ఫరాజ్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అంతేకాకుండా టీమిండియాతో జరిగిన ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లో కూడా సెంచరీతో చెలరేగి తన సత్తాచాటుకున్నాడు. ఈ నేపథ్యంలో సెలక్టర్లపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశ్నల వర్షం కురిపించాడు. సర్ఫరాజ్ ఏమి తప్పుచేశాడని జట్టు నుంచి తప్పించారని చోప్రా మండిపడ్డాడు."సర్ఫరాజ్ ఖాన్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు అతడు ఎటువంటి తప్పిదం చేయలేదు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకున్నాడు. బహుశా అతడి బ్యాటింగ్ స్టైల్, టెక్నిక్‌పై నమ్మకం లేకపోవడంతో మీరు ఎంపిక చేసుండకపోవచ్చు. అటువంటి అప్పుడు ఇండియా-ఎ టీమ్‌కు ఎలా ఎంపిక చేశారు.ఇంగ్లండ్‌లో అతడు పరుగులు సాధించగలడనే ఉద్దేశ్యంతో ఏ టీమ్‌కు ఎంపిక చేసింటే, అటువంటి అప్పడు అతడికి ప్రధాన జట్టులో కూడా అవకాశమివ్వాలి. బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో సర్ఫరాజ్ అద్బుతమైన సెంచరీ సాధించాడు.ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. కానీ ఆ రెండు మ్యాచ్‌లో మిగితా ఆటగాళ్లు కూడా పరుగులు సాధించలేదు. ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లినప్పుడు కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా అతడికి ఆడే అవకాశం రాలేదు" అని తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు.ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శార్దూల్ సింగ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్ -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్
లీడ్స్ వేదికగా జూన్ 20న ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి వచ్చేసిన హెడ్ కోచ్ గౌతం గంభీర్.. తిరిగి మంగళవారం భారత జట్టుతో కలవనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏఎన్ఐ వర్గాల సమాచారం ప్రకారం.. గంభీర్ సోమవారం(జూన్ 16) లండన్‌కు బయలుదేరినట్లు తెలుస్తోంది. కాగా ఈ సిరీస్ కోసం గంభీర్ జూన్ 5న భారత జట్టుతో పాటు ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. అతడి నేతృత్వంలో భారత జట్టు నాలుగు రోజుల ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గోంది.అయితే తన తల్లి గుండెపోటుతో అస్పత్రిలో చేరడంతో గౌతీ ఉన్నపళంగా జూన్ 11న స్వదేశానికి వచ్చేశాడు. ఇప్పుడు అతడి తల్లి ఆరోగ్యం మెరుగుపడడంతో గంభీర్ తిరిగి ఇంగ్లండ్‌కు పయనమైనట్లు తెలుస్తోంది. ఇక గంభీర్ లేకపోవడంతో భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీయస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కొనసాగించింది.క్రిక్ బజ్రిపోర్ట్స్ ప్రకారం.. టీమిండియా సన్నాహాలను లక్ష్మణ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. లక్ష్మణ్ భారత జట్టుతో కాకుండా తన వ్యక్తిగత పనుల మీద ఇంగ్లండ్‌కు వెళ్లాడు. కానీ గంభీర్ ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లిపోవడంతో లక్ష్మణ్ లౌసాన్ నుండి లండన్‌కు వచ్చినట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.ఇక తొలి టెస్టుకు గిల్ సారథ్యంలోని భారత జట్టు అన్నివిధాల సిద్దమైంది. ఈ టెస్టుకు ముందు ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లో భారత సీనియర్, భారత-ఎ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాహుల్, గిల్, శార్ధూల్ ఠాకూర్ వంటి మెరుగ్గా రాణించారు. కాగా ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా జరగనుంది.ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శార్దూల్ సింగ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు ఇదే! యువ సంచలనానికి నో ఛాన్స్? -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు ఇదే! యువ సంచలనానికి నో ఛాన్స్?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో తొలి టెస్టు కోసం టీమిండియా భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా ఎంచుకున్నాడు.తన ప్లేయింగ్ ఎలెవన్‌లో దాస్‌గుప్తా ముగ్గురు ఫ్రంట్‌లైన్ పేసర్లు,ఇద్దరు స్పిన్నర్లకు ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌తో టెస్టు అరంగేట్రం చేసేందుకు సిద్దంగా ఉన్న యువ ఆటగాడు సాయిసుదర్శన్కు మాత్రం దాస్ గుప్తా తన ఎంచుకున్న జట్టులో చోటు ఇవ్వలేదు.అతడి స్ధానంలో వెటరన్ ఆటగాడు కరుణ్ నాయర్ వైపు ఈ మాజీ క్రికెటర్ మొగ్గు చూపాడు. సాయిసుదర్శన్ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికి, అనుభవాన్ని పరిగణలోకి తీసకుని కరుణ్‌కు అవకాశమివ్వాలని దీప్ దాస్ గుప్తా సూచించాడు. కాగా నాయర్ దేశవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచి ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.ఇక దీప్‌దాస్ గుప్తా ఎంపిక చేసిన జట్టులో స్పిన్నర్లగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కింది. అదేవిధంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా శార్ధూల్ ఠాకూర్ బదులుగా నితీష్ కుమార్ రెడ్డిని దాస్‌గుప్త ఎంచుకున్నాడు. పేస్ బౌలింగ్ విభాగంలో బుమ్రా, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణలకు అవకాశమిచ్చాడు.ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు దాస్ గుప్తా ఎంపిక చేసిన భారత ప్లేయింగ్ ఎలెవన్యశస్వీ జైశ్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుబ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణచదవండి: ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు సంచలన విషయాన్ని బయటపెట్టిన కరుణ్ నాయర్ -
టీమిండియాతో టీ20 సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ
భారత మహిళలతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు నాట్ స్కివర్ బ్రంట్ సారథ్యం వహించనుంది. ఇక క్రికెట్ నుంచి తత్కాలిక విరామం తీసుకున్న స్టార్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ తిరిగి జట్టులోకి పునరాగమనం చేసింది. గత నెలలో స్వదేశంలో వెస్టిండీస్‌తో మహిళలతో జరిగిన వైట్‌బాల్ సిరీస్‌లకు ఎక్లెస్టోన్ దూరంగా ఉంది. మానసిక ఒత్తడి కారణంగా కొన్ని రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలని సోఫీ నిర్ణయించుకుంది. కానీ ఇప్పుడు టీమిండియా సిరీస్ నేపథ్యంలో స్టార్ స్పిన్నర్ తన మనసును మార్చుకుంది. ఎక్లెస్టోన్ రాకతో మరో స్పిన్నర్ సారా గ్లెన్ జట్టులో చోటు కోల్పోయింది. అదేవిధంగా గత నెలలో వెస్టిండీస్ తో జరిగిన టీ20లో గాయపడిన మాజీ కెప్టెన్ హీథర్ నైట్ ఇంకా కోలుకోలేదు. దీంతో ఈ సిరీస్‌కు ఆమె దూరంగా ఉండనుంది.ఈ టీ20 సిరీస్ జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. కాగా టీ20 సిరీస్ తర్వాత భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. మరోవైస భారత పురుషల జట్టు కూడా ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. టీమిండియా ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది.భారత్‌తో టీ20లకు ఇంగ్లండ్ జట్టునాట్ స్కైవర్-బ్రంట్ (కెప్టెన్), ఎమ్ ఆర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, ఆలిస్ కాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్, పైజ్ స్కోల్ఫీల్డ్, లిన్సే స్మిత్, డాని వ్యాట్-హాడ్జ్, ఇస్సీ వాంగ్ఇంగ్లండ్తో టీ20లకు భారత జట్టు:హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్టికా భాటియా , హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, సరణ్య గఢావ్, క్రాంతి గఢ్వ్ రెడ్డిభారత వన్డే జట్టు:హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ , యాస్తికా భాటియా, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చారణి, అమంజోత్ కౌర్, అరుంధతి గద్యారెడ్, శ్రీ చరణి, అమంజోత్ కౌర్, అరుంధతి గద్యారే. -
భారత్‌తో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ జట్టులో ఫ్లింటాఫ్ తనయుడు
భారత అండర్-19 జట్టుతో జరగనున్న వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) ప్రకటించింది. ఇంగ్లీష్ అండర్-19 జట్టుకు థామస్ రెవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో ఇంగ్లండ్ దిగ్గజం ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ చోటు దక్కించుకున్నాడు.రాకీ ప్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకునేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటివరకు 5 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రాకీ.. 15.22 సగటుతో 137 పరుగులు చేశాడు. అదేవిధంగా 8 లిస్ట్-ఎ మ్యాచ్‌లలో అతడి పేరిట 167 పరుగులు ఉన్నాయి. అంతేకాకుండా యూత్ టెస్టులలో ఓ సెంచరీ కూడా ఈ జూనియర్ ప్లింటాప్ సాధించాడు. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు యూత్ వన్డేల సిరీస్ జూన్ 27 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండు మల్టీ-డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే భారత అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టుకు యువ సంచలనం అయూష్ మాత్రే సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీ వంటి చిచ్చరపిడుగులు ఉన్నారు.ఇంగ్లండ్ అండర్-19 టీమ్థామస్ రెవ్ (కెప్టెన్), రాల్ఫీ ఆల్బర్ట్, బెన్ డాకిన్స్, జేద్న్ డెన్లీ, రాకీ ఫ్లింటాఫ్, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, జాక్ హోమ్, జేమ్స్ ఇస్బెల్, బెన్ మేయెస్, జేమ్స్ మింటో, ఐజాక్ మొహమ్మద్, జోసెఫ్ మూర్స్, సెబ్ మోర్గాన్, అలెక్స్ వేడ్.భారత అండర్-19 జట్టుఆయుష్ మ్హత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు, హర్వాన్ష్ పంగాలియా, ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహా, ప్రణవ్ సింఘేత్ రాఘవేంద్ర, మొహమ్జేద్ ఎహమ్జెనా. -
ఫ్యామిలీ ఎమర్జెన్సీ.. భారత్‌కు తిరిగొచ్చిన గౌతం గంభీర్
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మరో వారం రోజులలో ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. ఇప్పటికే ఇంగ్లండ్‌పై అడుగుపెట్టిన భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. నేటి నుంచి భారత సీనియర్ టీమ్-ఇండియా 'ఎ' జట్ల మధ్య వార్మాప్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా తిరిగి భారత్‌కు వచ్చేసినట్లు తెలుస్తోంది. రెవ్‌స్పోర్ట్స్ రిపోర్ట్ ప్రకారం.. గంభీర్ తల్లికి గుండెపోటు వచ్చినట్లుగా సమాచారం.ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా సదరు రిపోర్ట్ పేర్కొంది. ఈ క్రమంలోనే గంభీర్ హుటాహుటిన స్వదేశానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే గంభీర్ తిరిగి ఎప్పుడు ఇంగ్లండ్‌కు వెళ్తాడన్నది ఇంకా క్లారిటీ లేదు. తొలి టెస్టుకు ప్రారంభానికి ముందే జట్టుతో గంభీర్ తిరిగి కలిసే అవకాశముంది. కాగా వైట్‌బాల్ సిరీస్‌లలో కోచ్‌గా విజయవంతమైన గౌతీ.. టెస్టుల్లో మాత్రం ఇప్పటివరకు ఇంకా తన మార్క్‌ను చూపించలేకపోయాడు. అతడి నేతృత్వంలో భారత జట్టు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోర పరాభావాలను మూటకట్టుకుంది. దీంతో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ గంభీర్‌కు చాలా కీలకం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్ ఆటగాళ్లు లేని యువ భారత జట్టు ఇంగ్లండ్ గడ్డపై ఎలా రాణిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత కొత్త టెస్టు జట్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ఎంపికైన సంగతి తెలిసిందే.చదవండి: న్యూజిలాండ్ ఓపెనర్ మహోగ్రరూపం.. 19 సిక్సర్లతో ఊచకోత -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. భారత తుది జట్టు ఇదే! జడేజాకు నో ఛాన్స్?
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభానికి కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలో తొలి టెస్టు కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఎంచుకున్నాడు. బంగర్ తన ఎంపిక చేసిన తుది జట్టులో ఓపెనర్లగా యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్‌కు అవకాశమిచ్చాడు.రోహిత్ శర్మ స్ధానంలో ఓపెనర్‌గా రాహుల్ సరైనోడని స్టార్ స్పోర్ట్స్ చర్చాకార్యక్రమంలో బంగర్ అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా ఫస్ట్ డౌన్లో ఆన్క్యాప్డ్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్‌కు అతడు ఛాన్స్ ఇచ్చాడు. ఇక నాలుగో స్ధానంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు రావాలని సంజయ్ సూచించాడు.ఇక ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్‌కు ఐదో స్ధానంలో ఈ భారత మాజీ క్రికెటర్ చోటు ఇచ్చాడు. ఈ జట్టులో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డిలకు స్ధానం దక్కింది. స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్.. ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, సిరాజ్‌ను బంగర్ ఎంపిక చేశాడు.అయితే ఈ మాజీ బ్యాటింగ్ కోచ్ ఎంపిక చేసిన జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కకపోవడం గమనార్హం. జడేజాతో పాటు యువ సంచలనం సాయిసుదర్శన్‌ను కూడా అతడు పరిగణలోకి తీసుకోలేదు.ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు బంగర్ ఎంచుకున్న భారత తుది జట్టుయశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్‌మన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్,జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, సిరాజ్చదవండి: Wtc Final 2025: నిలకడగా ఆడుతున్న బావుమా, బెడింగ్హామ్ -
భారత కెప్టెన్ ఒక సూపర్ స్టార్.. కానీ అతడిని మిస్ అవుతారు: ఓలీ పోప్
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఓలీ పోప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌లో మైదానంలో ఎంతో యాక్టివ్‌గా ఉండే విరాట్ కోహ్లి సేవలను భారత్ మిస్ అవుతుందని పోప్ అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా ప్రస్తుత భారత జట్టులో యంగ్ టాలెంటెడ్ ఆటగాళ్లు ఉన్నారని అతడు కొనియాడాడు.ఇంగ్లండ్ టూర్‌కు ముందు కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు వరకైనా కొనసాగాలని విరాట్‌ను సెలక్టర్లు కోరినప్పటికి అతడు మాత్రం తన మనసును మర్చుకోలేదు. అతడితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెడ్ బాల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి షాకిచ్చాడు. దీంతో టీమిండియా టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ నియమితుడయ్యాడు. అదేవిధంగా సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లు తొలిసారి భారత టెస్టు జట్టులోకి చోటు దక్కగా.. కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేశాడు. ఇప్పటికే ఇంగ్లండ్‌పై గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు.. ప్రాక్టీస్‌లో మునిగితేలుతోంది. ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలోని యంగ్ టీమిండియా ఎలా రాణిస్తుందో అందరూ ఆతృతగా ఎదురు చూస్తోంది.ఈ నేపథ్యంలో ఓలీ పోప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఇది యువ భారత జట్టు. కానీ ఈ జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. చాలా మందికి కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. అదేవిధంగా కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టాలెంట్ కోసం మనందరికీ తెలుసు.అతడొక సూపర్ స్టార్. అయితే స్లిప్‌లో నిలబడి ప్రత్యర్ధి బ్యాటర్లను ఏకగ్రాతను కోల్పోయేలా చేసే విరాట్ కోహ్లి సేవలను మాత్రం భారత్ కోల్పోతుంది. అయినప్పటికీ భారత జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. వారిని ఎదుర్కొనేందుకు మా ఆటగాళ్లు కూడా సిద్దంగా ఉన్నారు అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిరీస్‌లో తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs ENG: టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి 19 ఏళ్ల యువ సంచలనం -
టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి 19 ఏళ్ల యువ సంచలనం
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభానికి మరో ఎనిమిది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. అయితే తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.భారత్‌తో తొలి టెస్టు కోసం 19 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ ఎడ్జీ జాక్స్‌కు ఇంగ్లండ్ సెలక్టర్లు పిలుపునిచ్చారు. తొలి టెస్టుకు ఎంపికైన మరో యువ పేసర్ జోష్ టాంగ్ గాయపడడంతో ప్రత్యామ్నయంగా జాక్స్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇండియా-ఎతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనాధికారిక సిరీస్‌లో ఇంగ్లండ్ లయన్స్ తరపున జాక్స్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.నాలుగు ఇన్నింగ్స్‌లలో 4 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్‌ను జాక్స్ ఔట్ చేశాడు. కాగా జాక్స్ తన కెరీర్లో ఇప్పటివరకు కేవలం రెండు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అవికూడా ఇండియా-ఎపై ఆడినవే.వోక్స్పైనే భారం..కాగా తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా కన్పిస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా మార్క్‌వుడ్, ఓలీ స్టోన్ ఈ సిరీస్‌కు దూరం కాగా.. అటిన్కిసన్, ఆర్చర్ అందుబాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.ఇప్పుడు ఈ జాబితాలోకి టంగ్ కూడా చేరడం ఇంగ్లీష్ జట్టు మెనెజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంగ్లండ్ బౌలింగ్ భారాన్ని క్రిస్ వోక్స్ మోయనున్నాడు. వోక్స్, కార్స్, సామ్ కుక్ ఫ్రంట్‌లైన్ సీమర్లగా ఉన్నారు.భారత్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్, జాక్చదవండి: WTC Final: కోహ్లి ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన ట్రవిస్ హెడ్ -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. చరిత్రకు అడుగు దూరంలో బుమ్రా
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత క్రికెట్ జట్టు అన్నివిధాల సన్నదమవుతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా.. లార్డ్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకడంతో భారత జట్టు కొత్త టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ బాధ్యతలు చేపట్టాడు.అదేవిధంగా సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్‌లకు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కగా.. వెటరన్ కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సిరీస్‌తో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. మొదటి టెస్టుకు ముందు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను పలు అరుదైన రికార్డు ఊరిస్తోంది.అరుదైన రికార్డుకు చేరువలో బుమ్రా..ఈ మ్యాచ్‌లో బుమ్రా రెండు వికెట్లు పడగొడితే సెనా(దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ పేస్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ పేరిట ఉంది.సెనా దేశాల్లో అక్రమ్ 32 టెస్టులు ఆడి 146 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఇప్పటివరకు 31 టెస్టులు ఆడి 145 వికెట్లు సాధించాడు. కాగా ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్ కారణంగా మిగిలిన రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ వెల్లడించాడు.ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) -
'అతడొక సూపర్ స్టార్.. మరో విరాట్ కోహ్లి అవుతాడు'
భారత్ ఇంగ్లండ్ మధ్య టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ ఆరంభానికి మరో పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇంగ్లండ్‌పై అడుగుపెట్టిన భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.ఇక ఇది ఇలా ఉండగా.కాగా భారత టెస్టు క్రికెట్లో నాలుగో నంబర్ బ్యాటింగ్ స్దానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1970ల నుండి 1980ల వరకు దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆ స్ధానంలో బ్యాటింగ్ చేయగా.. ఆ తర్వాత గవాస్కర్ వారసుడిగా సచిన్ టెండూల్కర్ రెండు దశాబ్దాలకు పైగా నాలుగో నంబర్లో కొనసాగాడు. అనంతరం సచిన్ నుంచి 2013లో విరాట్ కోహ్లి ఆ బాధ్యతలను స్వీకరించాడు. ఇప్పుడు విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడంతో కీలకమైన నాలుగో స్ధానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న చర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో నడుస్తోంది. కొంతమంది సాయిసుదర్శన్ పేరును సూచిస్తుంటే.. మరి కొంతమంది కరుణ్ నాయర్‌ను పేరును చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ దిగ్గజ స్పిన్నర్ మాంటీ పనేసర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి స్ధానంలో సాయిసుదర్శన్ సరైనోడని పనేసర్ అభిప్రాయపడ్డాడు."ప్రస్తుత భారత జట్టులో అద్బుతమైన యువ ఆటగాళ్లు ఉన్నారు. అందులో ఒకరు సర్రే ఆటగాడు సాయిసుదర్శన్. అతడు చాలా దూకుడుగా, ఎటువంటి భయం లేకుండా ఆడుతాడు. అతడికి ఇంగ్లండ్ కండీషన్స్‌లో ఆడిన అనుభవం ఉంది. సర్రే క్రికెట్ క్లబ్ తరపున అద్బుతంగా రాణించాడు. అతడు భారత క్రికెట్లో మరో విరాట్ కోహ్లి అవుతాడు. కోహ్లి ఆడిన నాలుగో స్ధానాన్ని సుదర్శన్ సమర్ధవంతంగా భర్తీ చేస్తాడని నేను భావిస్తున్నాను. విరాట్ కోహ్లికి రెడ్ బాల్ క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. యువ భారత జట్టు కోహ్లి వారసత్వాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నా" అని ఇన్సైడ్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పనేసర్ పేర్కొన్నాడు. -
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ప్లేయర్‌కు గాయం
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఆదివారం జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో భారత జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడినట్లు తెలుస్తోంది. రెవ్‌స్పోర్ట్స్ ప్రకారం.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి అతడి ఎడమ చేతికి బలంగా తాకినట్లు సమాచారం. తీవ్రమైన నొప్పితో పంత్ విల్లవిల్లాడని, ఫిజియో మైదానంలోకి వచ్చి ఐస్ ప్యాక్ పెట్టి చికిత్స అందించాడని సదరు వెబ్సైట్ పేర్కొంది.ఆ తర్వాత ఫిజియో పంత్ తన చేతికి బ్యాండేజ్ వేసినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి పంత్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పంత్ గాయంపై బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా పంత్ గాయం తీవ్రమైనది అయితే భారత్‌కు నిజంగా గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. ఎందుకంటే భారత టెస్టు జట్టులో పంత్ కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు కొత్త వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఈ డైనమిక్ వికెట్ కీపర్ బ్యాటర్ చేపట్టాడు. ఇక ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది.అంతకంటే ముందు ఈ నెల 13న ఇండియా-ఎ జట్టుతో భారత సీనియర్ జట్టు ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్ ఆడనుంది. కాగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుబ్‌మన్ గిల్ సారథ్యంలో యువ భారత జట్టు ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది.ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) చదవండి: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో కీలక నియామకం -
IND vs ENG: టీమిండియా ప్రాక్టీస్ షురూ..
భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం మొదలైంది. విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మలు వంటి దిగ్గజాలు లేకుండా తొలి టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని యువ భారత జట్టుకు ఇంగ్లండ్ రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది.రోహిత్ వారసుడిగా బాధ్యతలు చేపట్టిన శుబ్‌మన్ గిల్.. జట్టును ఎలా నడిపిస్తాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్‌లను భారత్ కోల్పోవడంతో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పైన కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ క్రమంలో గిల్-గౌతీ కాంబనేషన్లో భారత జట్టు ఎలా రాణిస్తుందో మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.టీమిండియా ప్రాక్టీస్ షూరూ..ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆదివారం(జూన్ 8)తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ గిల్ రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్, సిరాజ్ కసరత్తలు చేస్తున్నట్లు కన్పించింది.కొత్త స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లె రౌక్స్ కూడా భారత జట్టులో చేరారు. రాజీనామా చేసిన సోహమ్ దేశాయ్ స్ధానంలో అడ్రియన్ బాధ్యతలు చేపట్టాడు. ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది.ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం..! వీడియో వైరల్𝗣𝗿𝗲𝗽 𝗕𝗲𝗴𝗶𝗻𝘀 ✅First sight of #TeamIndia getting into the groove in England 😎#ENGvIND pic.twitter.com/TZdhAil9wV— BCCI (@BCCI) June 8, 2025 -
వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం..! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో విధ్వంసం సృష్టించిన రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన దూకుడును కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న సూర్యవంశీ.. భారత అండర్-19 జట్టుతో కలిసి ఇంగ్లండ్ పర్యటనకు సన్నద్దమవుతున్నాడు.తాజాగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 14 ఏళ్ల చిచ్చరపిడుగు సిక్సర్ల వర్షం కురిపించాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. అద్బుతమైన షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టాడు. అతడి బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక తన ఐపీఎల్ అరంగేట్రంలో సూర్యవంశీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో తను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి ఔరా అన్పించాడు. ఇక గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసిన సూర్యవంశీ.. ఈ ఘనత అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా 7 మ్యాచ్‌లు ఆడిన సూర్యవంశీ.. 206.55 స్ట్రైక్‌రేట్‌తో 252 పరుగులు చేశాడు.ఇందులో ఓ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉంది. ఇక భారత అండర్-19 జట్టు ఈ నెల ఆఖరిలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ అండర్-19 టీమ్‌తో కలిసి ఐదు వన్డే, రెండు మల్టీ- డే మ్యాచ్‌లు ఆడనుంది. జూన్ 24 నుంచి భారత యువ జట్టు ఇంగ్లండ్ టూర్ ప్రారంభం కానుంది. ఈ జట్టుకు సీఎస్కే యువ ఆటగాడు ఆయూష్ మాత్రే సారథ్యం వహించనుండగా.. సూర్యవంశీ సభ్యునిగా చోటు దక్కించుకున్నాడు.ఇంగ్లండ్ పర్యటనకు భారత అండర్-19 పురుషుల జట్టుఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మొహ్మద్ ఇనాన్, ఆదిత్య రానా, అన్మోల్జీత్ సింగ్.స్టాండ్ బై ప్లేయర్లు: నమన్ పుష్కక్, డి. దీపేశ్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారి, అలంకృత్ రాపోలే (వికెట్ కీపర్).భారత్ అండర్-19 వర్సెస్ ఇంగ్లండ్ అండర్-19: 2025 షెడ్యూల్👉జూన్ 24- 50 ఓవర్ల వార్మప్ గేమ్- లోబోరో యూనివర్సిటీ👉జూన్ 27- తొలి వన్డే- హోవ్👉జూన్ 30- రెండో వన్డే- నార్తాంప్టన్👉జూలై 2- మూడో వన్డే- నార్తాంప్టన్👉జూలై 5- నాలుగో వన్డే- వోర్సెస్టర్👉జూలై 7- ఐదో వన్డే- వోర్సెస్టర్👉జూలై 12- తొలి మల్టీ డే మ్యాచ్- బెకింగ్‌హామ్👉జూలై 20- రెండో మల్టీ డే మ్యాచ్- చెమ్స్‌ఫోర్డ్.Vaibhav Suryavanshi is smashing bowler at U19 HP NCA camp.🔥He is high on confidence after successful IPL stint pic.twitter.com/ZyLkNJrVy9— Varun Giri (@Varungiri0) June 6, 2025 -
India A vs England Lions: భారత్-ఎ బౌలర్లు విఫలం..
నార్తంప్టన్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టు బౌలర్లు తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్ధి బ్యాటర్లను ఔట్ చేసేందుకు భారత-ఎ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ లయన్స్ 46 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.క్రీజులో జోర్డాన్ కాక్స్(31),జేమ్స్ రెవ్(0) ఉన్నారు. టాపర్డర్ బ్యాటర్లు టామ్ హైన్స్(54), ఎమిలియో గే(71) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే ఇంకా 127 పరుగులు వెనకబడి ఉంది. భారత బౌలర్లలో ఇప్పటివరకు కాంబోజ్, కోటియన్, దేశ్‌పాండే తలా వికెట్ సాధించారు.ఇక అంతకుముందు భారత్-ఎ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. 319/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు.. అదనంగా 29 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత్ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్(116) టాప్ స్కోరర్‌గా నిలవగా..ధ్రువ్ జురేల్ (87 బంతుల్లో 52; 7 ఫోర్లు), కరుణ్ నాయర్ (71 బంతుల్లో 40; 4 ఫోర్లు), ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (57 బంతుల్లో 34; 5 ఫోర్లు) రాణించారు.ఇక ఇంగ్లండ్ బౌలర్లలో సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్ మూడు వికెట్లు పడగొట్టగా..జోష్ టంగ్, జార్జ్ హిల్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అనాధికారిక టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.చదవండి: ఆర్సీబీలోకి బుమ్రా, సూర్యకుమార్, పంత్: విజయ్ మాల్యా డ్రీమ్ టీమ్ -
'అతడొక సూపర్ స్టార్.. గిల్ స్దానంలో బ్యాటింగ్‌కు పంపండి'
తమిళనాడు యువ సంచలనం సాయిసుదర్శన్ టీమిండియా తరపున టెస్టు అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టులో సుదర్శన్ డెబ్యూ చేయడం దాదాపు ఖాయమైంది. భారత జట్టుతో పాటు లండన్‌కు చేరుకున్న సుదర్శన్ తన ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. వన్డే, టీ20ల్లో తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకున్న సుదర్శన్.. ఇప్పుడు వైట్‌బాల్ జెర్సీలో భారత తరపున సత్తాచాటాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుదర్శన్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడొక అద్బుతమైన ఆటగాడని, మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు పంపాలని క్లార్క్ సూచించాడు.కాగా విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నాలుగో స్ధానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశముంది. దీంతో గిల్ స్ధానంలో సుదర్శన్ బ్యాటింగ్‌కు రావాలని క్లార్క్‌తో పాటు పలు మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు."సాయిసుదర్శన్ ఒక సూపర్ స్టార్. అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా షాట్లు ఆడగలడు. టెస్టు క్రికెట్లో అతడు నంబర్ త్రీ స్ధానానికి సరిగ్గా సరిపోతాడు. అదే వన్డే, టీ20ల్లో అయితే ఓపెనర్‌గా అతడు ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని భావిస్తున్నాను. సుదర్శన్ భారత టెస్టు సెటప్‌లో భాగంగా ఉన్నాడు. కాబట్టి అతడికి ఇంగ్లండ్‌పై గడ్డపై అరంగేట్రం చేసే అవకాశం లభిస్తుంది" అని క్లార్క్ బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో క్లార్క్ పేర్కొన్నాడు. -
అలా ఎలా ఔట్ ఇస్తావు.. అంపైర్‌పై జైశ్వాల్ ఫైర్! వీడియో వైరల్
నార్తంప్టన్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న రెండో అనాధికారిక భారత్-ఎ జట్టు స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 17పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి జైశ్వాల్ ప్యాడ్‌కు తాకింది. వెంటనే కీపర్‌తో పాటు బౌలర్ ఎల్బీకి అప్పీల్ చేయగా అంపైర్ వెంటనే ఔట్ అని వేలు పైకెత్తాడు. ఈ క్రమంలో అంపైర్ నిర్ణయం పట్ల జైశ్వాల్ తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. జైస్వాల్ కొన్ని సెకన్ల పాటు క్రీజులోనే నిలబడి అలా షాక్‌లో ఉండిపోయాడు. బంతి స్టంప్స్‌ను మిస్స్ అవుతుంది, ఎలా ఔట్ ఇస్తావు అన్నట్లు అంపైర్ వైపు చూస్తూ జైశ్వాల్ సైగ చేశాడు. అయితే ఈ అనధికారిక టెస్ట్‌లో డీఆర్ఎస్ అందుబాటులో లేకపోవడంతో, జైశ్వాల్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.శతక్కొట్టిన రాహుల్..ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు ముందు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సత్తా చాటాడు. ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’జట్టు తరఫున బరిలోకి దిగిన రాహుల్ (168 బంతుల్లో 116; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో విజృంభించాడు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకగా... జట్టులో అందరికంటే సీనియర్ రాహుల్‌కు ఈ మ్యాచ్ ద్వారా చక్కటి ప్రాక్టీస్ లభించింది. ఫలితంగా శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’జట్టు 83 ఓవర్లలో 7 వికెట్లకు 319 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రాహుల్‌తో పాటు వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ (87 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... గత మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన కరుణ్ నాయర్ (71 బంతుల్లో 40; 4 ఫోర్లు), ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (57 బంతుల్లో 34; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.చదవండి: రోహిత్ శర్మకు షాక్..! టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్?Won’t be the only time Woakes gets Jaiswal this summer.pic.twitter.com/UwT23WycGr— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 6, 2025 -
'అతడికి చాలా అనుభవం ఉంది.. ఇంగ్లండ్ టూర్లో కీలకం కానున్నాడు'
భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు పయనమైంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నేతృత్వంలో మొత్తం టీమ్ సభ్యులు శుక్రవారం ముంబై విమానశ్రాయం నుంచి లండన్‌కు బయలు దేరారు. అక్కడకి వెళ్లాక పది రోజుల పాటు ప్రాక్టీస్ క్యాంపులో టీమిండియా తీవ్రంగా శ్రమించనుంది. జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా ఈ రెడ్‌బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా లండన్ విమానం ఎక్కేముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, కొత్త టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నారు. ఈ సందర్భంగా ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన కరుణ్ నాయర్‌పై గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ పర్యటనలో కరుణ్ నాయర్ అనుభవం భారత జట్టుకు కీలకం కానుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు."కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించి తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. అది దేశవాళీ క్రికెట్‌కు ఉన్న ప్రాముఖ్యత. యువ ఆటగాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. డిమాస్టిక్ క్రికెట్లో మీరు అత్యున్నత ప్రదర్శన ఇస్తున్నన్ని రోజులు మీకోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈ పర్యటనలో కరుణ్ నాయర్ అనుభవం జట్టుకు ఎంతోగానే ఉపయోగపడనుంది. కౌంటీ క్రికెట్లో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా అతడికి ఉంది. కౌంటీల్లో కూడా పరుగులు సాధించాడు. అక్కడి పరిస్థితులు అతడికి బాగా తెలుసు. ఇప్పుడు ఇండియా-ఎ తరపున కూడా సెంచరీ చేశాడు. ఇటువంటి పర్యటనలకు మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉండడం చాలా ముఖ్యం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆటగాళ్లు ఫామ్‌ను ఒకటి లేదా రెండు టెస్ట్ మ్యాచ్‌ల ఆధారంగా అంచనా వేయాలనుకోవడం లేదు. ఎవరైతే నిలకడగా పరుగులుసాధిస్తారో, వారు అంతర్జాతీయ క్రికెట్లో కూడా రాణించగలరు అని ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో గంభీర్ పేర్కొన్నాడు. కాగా కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్లో పరుగులు వరద పారించాడు. రంజీ ట్రోఫీ 2024-25లో విదర్భ ఛాంపియన్‌గా నిలవడంలో కరుణ్‌ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్‌లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ కొనసాగుతున్నాడు. -
కోహ్లి, రోహిత్ ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటుంది: శుబ్‌మన్ గిల్
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తొలి సవాల్‌ను ఎదుర్కొనేందుకు శుబ్‌మన్ గిల్ సిద్దమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం గిల్ సారథ్యంలోని భారత జట్టు శుక్రవారం ఇంగ్లండ్‌కు పయనమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు లేని భారత జట్టును గిల్ ఎలా నడిపిస్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక ఇంగ్లండ్‌కు బయలుదేరే ముందు బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో శుబ్‌మన్ గిల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అదేవిధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్లపై కూడా గిల్ మాట్లాడాడు."సాధారణంగా ప్రతీ టూర్లోనూ ఒత్తిడి ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం మాకు నిజంగా గట్టి ఎదురుదెబ్చ అని చెప్పాలి. వారిద్దరూ చాలా అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు. భారత జట్టుకు ఎన్నో అద్బుతమైన విజయాలు అందించారు. వారి స్ధానాలను భర్తీ చేయడం చాలా కష్టం. అయితే రోహిత్, కోహ్లి ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. అందులో ఎటువంటి మార్పు ఉండదు. మా బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇంకా మేము ఖారారు చేయలేదు. అందుకు మాకు ఇంకా రెండు వారాల సమయం ఉంది. లండన్‌లో 10 రోజుల ప్రాక్టీస్ క్యాంపును నిర్వహిస్తాము. ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడతాము. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌ను నిర్ణయిస్తాము అని గిల్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌కు తెరలేవనుంది. ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్‌కు కొత్త పేరు ఖరారు -
IND Vs ENG: ఇంగ్లండ్‌కు బయలు దేరిన టీమిండియా.. 14 రోజుల ముందే
ఇంగ్లండ్-భారత మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి హెడ్డింగ్లీ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రెడ్ బాల్ సిరీస్ కోసం శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు శుక్రవారం ఇంగ్లండ్‌కు పయనమైంది.ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. జట్టు తో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు 14 రోజుల ముందే అక్కడకు గిల్ సేన చేరుకోనుంది. జూన్ 13 నుంచి 16 వరకు బెకెన్హామ్ వేదికగా ఇండియా-ఎతో సీనియర్ భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ప్రధాన సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇంగ్లండ్‌కు పయనమవ్వకముందు కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్, గౌతం గంభీర్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నారు.ఈ సందర్బంగా పలు ప్రశ్నలకు వీరిద్దరూ సమాధనమిచ్చారు. ఈ సిరీస్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు గంభీర్ స్పష్టం చేశాడు. అదేవిధంగా భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇంకా ఖారారు చేయలేదని, తమకు ఇంకా రెండు వారాల సమయం ఉందని గిల్ పేర్కొన్నాడు.కాగా ఈ సిరీస్‌కు ముందు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ క్రమంలో వీరిద్దరి స్ధానాలను ఎవరు భర్తీ చేస్తారో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విరాట్ కోహ్లి స్ధానంలో కరుణ్ నాయర్ బ్యాటింగ్‌కు వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న అనాధికారిక టెస్టు సిరీస్‌లో దుమ్ములేపుతున్నాడు.తొలి అనాధికారిక టెస్టులో నాయర్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్‌కు కొత్త పేరు ఖరారు
భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు ‘అండర్సన్–టెండూల్కర్’ ట్రోఫీగా నామకరణం చేశారు. ఆటకు వన్నె తెచ్చిన ఆటగాళ్ల పేర్లను సిరీస్‌లకు పెట్టడం పరిపాటి కాగా... ఇకపై టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరిగే సిరీస్‌ను ఈ పేరుతోనే కొనసాగించాలని బీసీసీఐ, ఈసీబీ సమష్టిగా నిర్ణయించాయి.ఈ నెల 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... దీంతోనే 2025–27 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్ మొదలవుతుంది. తొలి టెస్టు ప్రారంభానికి ముందు ఈ ఇద్దరు దిగ్గజాలు ట్రోఫీని ఆవిష్కరించనున్నట్లు సమాచారం.క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టీమిండియా తరఫున 200 టెస్టు మ్యాచ్‌లు ఆడి 15,921 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు (704) తీసిన పేస్ బౌలర్ అండర్సన్ 188 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ మధ్య ఇంగ్లండ్‌లో జరిగే సిరీస్‌ను పటౌడీ ట్రోఫీగా, భారత్‌లో జరిగే సిరీస్‌ను ఆంటోనీ డి మెల్లో ట్రోఫీగా అభివర్ణిస్తున్నారు. ఇక మీద ఇంటా బయట ఎక్కడ సిరీస్ జరిగినా దాన్ని ‘అండర్సన్–టెండూల్కర్’ ట్రోఫీగానే పిలవనున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లను ఇదే మాదిరిగా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’గా అభివర్ణిస్తున్న విషయం తెలిసిందే.ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
రాణించిన జైశ్వాల్, నితీష్.. ఇంగ్లండ్ లయన్స్‌తో టెస్టు డ్రా
కాంటర్బరీ వేదికగా భారత్ ‘ఎ’, ఇంగ్లండ్ లయన్స్ జట్ల మధ్య జరిగిన నాలుగు రోజుల తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. అయితే ఆఖరి రోజు భారత యువ బ్యాటర్లు చక్కగా ప్రాక్టీస్ చేసుకున్నారు. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (68; 8 ఫోర్లు), యశస్వి జైస్వాల్ (64; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహా టాప్–4 బ్యాటర్లు అర్ధసెంచరీలతో కదంతొక్కారు. ధ్రువ్ జురేల్ (53 నాటౌట్; 4 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధసెంచరీలు సాధించారు. తొలి వికెట్‌కు ఓపెనర్లు 123 పరుగులు జోడిస్తే... జురేల్, నితీశ్ అబేధ్యమైన మూడో వికెట్‌కు 91 పరుగులు జతచేశారు. అయితే ఫలితం వచ్చే అవకాశమే లేకపోవడంతో నిరీ్ణత సమయానికి గంటన్నర ముందే మ్యాచ్‌ను ఆపేశారు. లయన్స్‌కు ఆధిక్యం అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 527/7తో ఆఖరి నాలుగోరోజు ఆటను కొనసాగించిన లయన్స్ 145.5 ఓవర్లలో 587 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ జమాన్ అక్తర్ (41; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడగా, టెయిలెండర్లు ఎడీ జాక్ (25; 2 ఫోర్లు), అజిత్ సింగ్ (27 నాటౌట్; 5 ఫోర్లు) పోరాడారు.భారత బౌలర్లలో ముకేశ్ 3, శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 557 పరుగులు చేయగా... ఇంగ్లండ్ లయన్స్‌కు 30 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ నెల 6 నుంచి నార్తంప్టన్‌లో రెండో అనధికారిక టెస్టు జరుగుతుంది.చదవండి: IPL 2025: శ్రేయస్ అయ్యర్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ.. -
'కోహ్లిని ముందే హెచ్చరించారు.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడు'
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆకస్మిక టెస్టు రిటైర్మెంట్పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ మొత్తం ఆడేందుకు తనకు అవకాశమివ్వమని సెలక్టర్లు చెప్పడంతోనే కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించాడని పనేసర్ అభిప్రాయపడ్డాడు. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత కొత్త టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. టెస్టు జట్టులో యువ ఆటగాళ్లు సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్ తొలిసారి చోటు దక్కించుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్ ఆటగాళ్లు లేకుండా యువ భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో గిల్ సేన ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో ఎలా రాణిస్తుందో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు."ఇంగ్లండ్ పర్యటనకు విరాట్ కోహ్లి వస్తాడని నేను అనుకున్నాను. ఇంగ్లండ్ జట్టు సభ్యులు కూడా కోహ్లి ఆడుతాడని ఆశించారు. కానీ కోహ్లి సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇంగ్లండ్ వంటి కఠిన సిరీస్ నుంచి కోహ్లి కావాలనే బయటపడ్డాడని అన్పిస్తోంది.ఎందుకంటే గత కొన్నేళ్లగా వైడ్ ఆప్ స్టంప్ సమస్యను కోహ్లి అధిగమించలేకపోతున్నాడు. టెస్టు క్రికెట్లో పదేపదే అదే బంతులకు కోహ్లి ఔట్ అవుతున్నాడు. బహుశా ఇది అతడి మైండ్‌లో ఉండవచ్చు. అదేవిధంగా సెలక్టర్లు కూడా కోహ్లితో ఓ విషయం చర్చించి ఉంటారు అని అనుకుంటున్నాను. తొలి రెండు టెస్టుల్లో బాగా రాణించకపోతే, మిగిలిన మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వస్తుందని సెలక్టర్లు చెప్పి ఉండొచ్చు. ఇవన్నీ ఆలోంచాకే కోహ్లి తన నిర్ణయాన్ని ప్రకటించాడు" అని హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: బీసీసీఐ చైర్మెన్‌గా రాజీవ్ శుక్లా..? -
ఇంగ్లండ్ టూర్.. టీమిండియా మేనేజర్‌గా యుధ్వీర్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు మేనేజర్‌గా యుధ్వీర్ సింగ్ ఎంపికయ్యాడు. ఈ నెల 20 నుంచి టీమిండియా ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ టూర్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యు«ద్వీర్ను మేనేజర్‌గా ఎంపిక చేసింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం (యూపీసీఏ) కార్యదర్శిగా పనిచేస్తున్న యుధ్వీర్... గతంలో యూపీసీఏ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. క్రికెట్ వ్యవహారాల్లో అతడికి విశేష అనుభవం ఉందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ సిరీస్ కోసం సెలెక్షన్ కమిటీ ఇప్పటికే జట్టును ప్రకటించగా... యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో గిల్ సారథ్యంలోని యువ జట్టు ఈ సిరీస్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025–27 సీజన్‌ను భారత జట్టు ఇదే సిరీస్‌తో ప్రారంభించనుంది.చదవండి: పది మందికి రూ. 1 కోటికి పైగా... -
'శ్రేయస్ ఏమి తప్పు చేశాడు.. కావాలనే ఎంపిక చేయలేదు'
ఐపీఎల్-2025 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లీష్ జట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్ధానంలో శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. అదేవిధంగా టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ నియమితుడయ్యాడు. అయితే ఈ జట్టులో అద్బుతమైన ఫామ్‌లో ఉన్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.శ్రేయస్ అయ్యర్ స్థానంలో యువ ఆటగాడు సాయి సుదర్శన్‌కు సెలక్టర్లు చోటిచ్చారు. తాజాగా సెలక్టర్ల నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సుదర్శన్ బదులుగా అనుభవం ఉన్న అయ్యర్‌కు ఛాన్స్ ఇవ్వాల్సందని కైఫ్ అభిప్రాయపడ్డాడు."సాయి సుదర్శన్ ఒక అద్బుతమైన ఆటగాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఐపీఎల్ సీజన్లో బాగా రాణించడంతో అతడిని టెస్టు జట్టులోకి తీసుకున్నారు. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలోనూ అతడు నిలకడగా రాణిస్తున్నాడు. వన్డే ప్రపంచ కప్-2023, ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అయ్యర్ దాదాపు 550 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్లో కూడా అద్బుతంగా ఆడుతున్నాడు. కెప్టెన్‌గా అతడు విజయవంతమయ్యాడు. సుదర్శన్‌ను వైట్ క్రికెట్ ప్రదర్శన ఆధారంగా టెస్టు జట్టులోకి తీసుకున్నప్పుడు, మరి అయ్యర్ విషయంలో ఏమైందని" సెలక్టర్లపై కైఫ్ మండిపడ్డాడు.ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
నేను సెలక్టర్‌ను కాదు.. నన్ను ఎందుకు అడుగుతారు: గంభీర్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 18 సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టుకు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్, అతడి డిప్యూటీగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. సాయిసుదర్శన్, అర్షదీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.అదేవిధంగా కరుణ్ నాయర్, శార్ధూల్ ఠాకూర్ వంటి వెటరన్ ఆటగాళ్లకు సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు. అయితే ఈ జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. రంజీ ట్రోఫీ సహా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా చక్కటి రికార్డు ఉన్న అయ్యర్ పేరును సెలక్టర్లు పరిశీలించకపోవడం ఆశ్చర్యపర్చింది.క్రికెటేతర కారణాలతో అతడిని పక్కన పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే విషయంపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను ప్రశ్నించగా సూటిగా సమాధానం ఇవ్వలేదు. ‘నేను సెలక్టర్‌ను కాదు’ అంటూ ఒక్క ముక్కలో గంభీర్ స్పందించాడు.కానీ ఐపీఎల్ ఫైనల్‌కు త్రివిధ దళాల అధిపతులను ఆహ్వానించినందుకు బీసీసీఐని గంభీర్ ప్రశంసించాడు. అది నమ్మశక్యం కాని నిర్ణయమని అన్నాడు. దేశం మొత్తం మన సాయుధ దళాలకు సెల్యూట్ చేయాలని గంభీర్ పేర్కొన్నాడు. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్2025-27లో భాగంగా జరగనుంది.చదవండి: IPL 2025: రిషబ్ పంత్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ -
బీసీసీఐ కీలక నిర్ణయం.. దిలీప్‌కు మళ్లీ పిలుపు
భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా హైదరాబాద్‌కు చెందిన టి.దిలీప్ మళ్లీ ఎంపికయ్యాడు. ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దిలీప్‌ను మరో సారి ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. 2021 నుంచి ఈ ఏడాది ఆరంభం వరకు దిలీప్ టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించగా... ఆ్రస్టేలియాలో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో సహాయక కోచ్ అభిషేక్ నాయర్‌తో పాటు దిలీప్‌ను తొలగించింది.ఫీల్డింగ్ కోచ్‌గా విదేశీయుడిని నియమించాలని బోర్డు ప్రయత్నించనా... అది వీలు కాకపోవడంతో జట్టు సభ్యులతో మంచి అనుబంధం ఉన్న దిలీప్‌ను తిరిగి ఎంపిక చేసింది. "దిలీప్ చాలా మంచి కోచ్. నాలుగేళ్లుగా భారత జట్టుతో కలిసి పనిచేశాడు. ఆటగాళ్ల బలాబలాలు అతడికి బాగా తెలుసు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు అతడిని తిరిగి నియమించాం"అని బోర్డు అధికారి వెల్లడించారు. ఇక మరోవైపు భారత టెస్టు కొత్త కెపె్టన్ శుబ్‌మన్ గిల్, సుదర్శన్ జూన్ 6 నుంచి ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే వార్మప్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: జితేశ్ జితాదియా -
గిల్‌ను కాదు అతడిని కెప్టెన్‌గా సెలక్ట్ చేయాల్సింది: వీరేంద్ర సెహ్వాగ్
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపికైన సంగతి తెలిసిందే. అదేవిధంగా గిల్‌కు డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. పలు మీడియా రిపోర్ట్లు ప్రకారం.. కెప్టెన్సీ రేసులో నుంచి ఫిట్నెస్, వర్క్‌లోడ్ కారణంగా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తప్పుకోవడంతో గిల్‌కు జట్టు పగ్గాలను సెలక్టర్లు అప్పగించారు. కాగా భారత సెలక్టర్ల ముందు గిల్‌తో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ అప్షన్స్ కూడా ఉండేవి. కానీ జట్టు దీర్ఘకాలక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు బీసీసీఐ ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ టీమ్ సెలక్షన్ ప్రెస్మీట్లో తెలిపాడు. అయితే 25 ఏళ్ల గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్లు మనోజ్ తివారీ,వీరేంద్ర సెహ్వాగ్‌లు తమ మనసులోని మాటను బయటపెట్టారు. ఫిట్నెస్ సమస్యల కారణంగానే బుమ్రా కాదని గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించరాని తివారీ అన్నాడు."భారత టెస్టు కెప్టెన్సీకి శుబ్‌మన్ గిల్ సెకెండ్ బెస్ట్ ఆప్షన్. సెలక్టర్లకు తొలి ఎంపికగా బుమ్రా ఉండేవాడు. కానీ ఫిట్నెస్ సమస్యల వల్ల తుదిజట్టులో ఆడలేని వారికి సారథ్య బాధ్యతలు ఎలా అప్పగిస్తారు. అందుకే తమ సెకెండ్ అప్షన్ అయిన గిల్‌కు జట్టు పగ్గాలను కట్టబెట్టారు" అని క్రిక్‌బజ్ లైవ్ షోలో తివారీ పేర్కొన్నాడు. అయితే తివారీ వ్యాఖ్యలతో సెహ్వాగ్ విభేదించాడు. గిల్‌ను కాకుండా పంత్ కెప్టెన్‌గా ఎంపిక చేసి ఉంటే బాగుండేదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు."కేవలం ఒక్క సిరీస్ కోసం అయితే బుమ్రాను కెప్టెన్‌గా సెలక్ట్ చేయవచ్చు. అందులో ఎటువంటి సమస్య లేదు. కానీ దీర్ఘకాలనికి అయితే ఈ నిర్ణయం సరైంది కాదు. భారత్ ఒక ఏడాది 10 టెస్టులు ఆడితే, ఆ మ్యాచ్‌లన్నీ బుమ్రా ఆడగలడా అని ఆడగాలి? లేదా అతడు ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండగలడు అని ప్రశ్నించాలి. కెప్టెన్‌ను ఎంపిక చేయడంలో అది ఒక ప్రధాన అంశం.కానీ సెలక్టర్లు ఆ ఒత్తిడిని, వర్క్‌లోడ్‌ను బుమ్రాపై పెట్టాలనుకోలేదు. అందుకే అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేయలేదు. సెలక్టర్లు తీసుకుంది సరైన నిర్ణయం అని నేను కూడా భావిస్తున్నాను. అయితే కెప్టెన్సీకి గిల్ రెండవ బెస్ట్ ఆప్షన్ అని తివారీ అన్నారు. నా దృష్టిలో టీమిండియాకు సారథిగా రిషభ్ పంత్ సెకండ్ బెస్ట్ ఆప్షన్. టెస్ట్ క్రికెట్‌కు పంత్ చేసినంతగా, ఇతర మరే ఇతర ఆటగాడు చేయలేదు. విరాట్ కోహ్లి తర్వాత టెస్టు క్రికెట్ చూసేలా చేసిన ప్లేయర్ పంత్. కారు ప్రమాదం నుంచి కోలుకుని వచ్చిన తర్వాత పంత్ అంతగా ప్రభావం చూపలేకపోయాడు. దీన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. అతడు తిరిగి తన ఫామ్‌ను అందుకంటే, భవిష్యత్తులో అతన్ని కెప్టెన్‌గా చేసే నిర్ణయాన్ని సెలక్టర్లు తీసుకొవచ్చు.అందుకే వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే భారత టెస్టు సారథిగా చాలా కొద్ది మంది బౌలర్లరే వ్యవహరించారు.నేను క్రికెట్ ఆడిన కాలంలో కేవలం అనిల్‌కుంబ్లేనే ఈ ఫీట్ సాధించాడు. అదేవిధంగా అన్ని మ్యాచ్‌లకు కూడా అతడు అందుబాటులో ఉన్నాడని" సెహ్వాగ్ విశ్లేషించాడు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. -
టీమిండియా కొత్త కెప్టెన్‌కు గవాస్కర్ వార్నింగ్!?
భారత క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇటీవలే టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ స్దానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్ నుంచి భారత టెస్టు కెప్టెన్‌గా గిల్ ప్రయాణం ప్రారంభం కానుంది.గిల్‌కు తన మొదటి పరీక్షలోనే కఠిన సవాలు ఎదురుకానుంది. ఎందుకంటే వారి సొంతగడ్డపై ఇంగ్లీష్ జట్టును ఓడించడం అంతసులువు కాదు. అంతకుతోడు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో లేరు. ప్రస్తుతం భారత జట్టులో ముగ్గురు నలుగురికి మినహా ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం పెద్దగా లేదు. గిల్‌కు కూడా ఇంగ్లీష్ కండీషన్స్‌లో ఆడిన అనుభవం లేదు. దీంతో గిల్ కెప్టెన్‌గా తన మొదటి ఎసైన్మెంట్లో ఎలా రాణిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గిల్‌ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్‌పై ఇప్పుడు అదనపు ఒత్తిడి ఉంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు."భారత కెప్టెన్‌గా ఎంపికైన ఆటగాడిపై ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే జట్టు సభ్యుడిగా ఉండటానికి, కెప్టెన్‌గా వ్యవహరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే టీమ్ మెంబర్‌గా ఉన్నప్పుడు సాధారణంగా మీకు క్లోజ్‌గా ఉన్న ఆటగాళ్లతో ఎక్కువగా సంభాషిస్తారు. కానీ కెప్టెన్ అయినప్పుడు, జట్టులోని ఇతర ఆటగాళ్ళు మిమ్మల్ని గౌరవించే విధంగా మీరు ప్రవర్తించాలి. కెప్టెన్ ప్రవర్తన అతని ప్రదర్శన కంటే ముఖ్యమైనది" అంటూ స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.ఇంగ్లండ్‌తో టెస్టులకు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సిరాజ్చదవండి: IPL 2025: 'పంత్‌ను చూసి నేర్చుకోండి'.. రహానేపై సెహ్వాగ్ ఫైర్ -
ఇంగ్లండ్ టూర్.. కామాఖ్య ఆలయంలో గంభీర్ ప్రత్యేక పూజలు! వీడియో
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అస్సాంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య ఆలయాన్ని సందర్శించాడు. సోమవారం ఆలయానికి చేరుకున్న గంభీర్‌కు ఆర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.గంభీర్ కొన్ని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా కామాఖ్య ఆలయం దేశంలోని అత్యంత ప్రముఖ శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయాన్ని ప్రతీ రోజు వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.గంభీర్ ఇటీవల తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నాడు. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌కు భారత జట్టును బీసీసీ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. అదేవిధంగా సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్లు టెస్టులకు వీడ్కోలు పలకడంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది. కాగా ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా జరగనుంది. ఈ సిరీస్ భారత జట్టుకు చాలా కీలకం.ఇంగ్లండ్‌తో టెస్టులకు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సిరాజ్ 📍 Assam — Gautam Gambhir offered prayers at Maa Kamakhya Mandir.Jai Mata Di 🚩 pic.twitter.com/975Wfj67ko— Megh Updates 🚨™ (@MeghUpdates) May 26, 2025 -
గుడ్ న్యూస్.. జియో హాట్‌స్టార్‌లో భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌లు!
భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న ఇండియా- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియోహాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఈ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను జియోహాట్‌స్టార్ యాప్ అండ్ వెబ్ సైట్లో వీక్షించవచ్చు.కాగా వాస్తవానికి 2031 వరకు ఇంగ్లండ్‌లో జరిగే మ్యాచ్‌లను ప్రసారం చేసే అన్ని హక్కులను సోనీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ కలిగి ఉంది. అయితే క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. ఈ మార్క్యూ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్‌స్టార్‌కు సోనీ సబ్-లైసెన్స్ చేసినట్లు సమాచారం.ఈ ఒప్పందం రెండు కంపెనీల మధ్య దాదాపు నెల రోజుల చర్చల తర్వాత జరిగనట్లు సదరు క్రికెట్ వెబ్సైట్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. కాగా జియోహాట్‌స్టార్ ఇప్పటికే భారత్ హోమ్ సిరీస్‌లు, ఐసీసీ టోర్నమెంట్లు, ఐపీఎల్, ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రసార హక్కులను కలిగి ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంగ్లండ్-భారత్ మధ్య టెస్టు సిరీస్ డిజిటల్ హక్కులను కూడా దక్కించుకుంది. ఇక ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో ఇదే తొలి సిరీస్. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా ఇంగ్లండ్‌కు పయనం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్లు టెస్టులకు వీడ్కోలు పలకడంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది.చదవండి: IPL 2025: 'పంత్‌ను చూసి నేర్చుకోండి'.. రహానేపై సెహ్వాగ్ ఫైర్ -
రాహుల్, అభిమన్యు, సుదర్శన్.. టీమిండియా ఓపెనర్ ఎవరు?
భారత కొత్త టెస్టు కెప్టెన్ ఎవరన్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. టీమిండియా కెప్టెన్‌గా అంతా ఊహించినట్లే శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. అయితే ఇప్పుడు టీమిండియా ఓపెనర్ ఎవరన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత ఇన్నింగ్స్‌ను జైశ్వాల్‌తో కలిసి ఎవరు ఆరభిస్తారన్న చర్చ నడుస్తోంది. భారత ఓపెనర్ స్దానం కోసం ముగ్గురు పోటీలో ఉన్నారు. వారే స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, తమిళనాడు సంచలనం సాయిసుదర్శన్, బెంగాల్ మాజీ కెప్టెన్ అభిమాన్యు ఈశ్వరన్. కేఎల్ రాహుల్ వైపే మొగ్గు..?మిగితా ఇద్దరితో పోలిస్తే రాహుల్‌కే భారత ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహుల్ ఒక సెల్ప్లెస్ ఆటగాడు. 2014లో అరంగేట్రం చేసినప్పటి నుంచి రాహుల్ ఓపెనర్‌గాను, మిడిలార్డర్లోనూ తన సేవలను అందించాడు. ఆఖరికి ఆరో స్ధానంలో కూడా బ్యాటింగ్ చేసిన సందర్బాలు ఉన్నాయి. గతంలో టెస్టుల్లో భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అనుభవం రాహుల్‌కు ఉంది. టెస్టుల్లో అతడికి ఓపెనర్‌గా రెండు సెంచరీలు ఉన్నాయి. 2018-21 కాలంలో టెస్టుల్లో టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. 18 ఇన్నింగ్స్‌లలో 37.31 సగటుతో 597 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 83 ఇన్నింగ్స్‌లలో 35.03 సగటుతో 2803 పరుగులు చేశాడు. అదేవిధంగా ఇంగ్లండ్ వంటి బౌన్సీ కండిషన్స్‌లో నిలకడగా బ్యాటింగ్ చేసే సత్తా కూడా రాహుల్‌కు ఉంది. దీంతో రాహుల్-జైశ్వాల్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే సూచనలు కన్పిస్తున్నాయి.సాయిసుదర్శన్ మరో అప్షన్..!ఒక వేళ కేఎల్ రాహల్‌ను మిడిలార్డర్లో ఆడించాలని టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తే.. యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ను ఓపెనర్‌గా పంపే అవకాశముంటుంది. సాయి సుదర్శన్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున సంచలనాలు సృష్టించాడు. వైట్ బాల్ క్రికెట్లోనూ కాదు రెడ్ బాల్ క్రికెట్లో కూడా సుదర్శన్‌ను తనను తాను నిరూపించుకున్నాడు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతడికి మెరుగైన రికార్డు ఉంది. 2022-25 కాలంలో 49 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్.. 39.93 సగటుతో 1957 పరుగులు చేశాడు. అందులో 7 హాఫ్ సెంచరీలు, 5 శతకాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా అతడికి ఉంది. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సర్రే తరపున ఆడాడు. ఈ తమిళనాడు బ్యాటర్ కౌంటీల్లో 8 ఇన్నింగ్స్‌లలో 35.12 సగటుతో 281 పరుగులు చేశాడు.అభిమన్యు ఈశ్వరన్..భారత జట్టు మెనెజ్‌మెంట్‌కు ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్ రూపంలో మరో అప్షన్ ఉంది. దశాబ్ద కాలంగా దేశీయ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్న ఈశ్వరన్.. ఇప్పటివరకు భారత జట్టు తరపున అరంగేట్రం చేయలేదు. పలుమార్లు భారత జట్టు ఎంపికైనా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కలేదు. ఒకవేళ ఇంగ్లండ్ టూర్లో అతడు అరంగేట్రం చేస్తే.. కచ్చితంగా జైశ్వాల్ ఓపెనింగ్ పార్టనర్ అభిమన్యు అనే చెప్పాలి. ఎందుకంటే అతడికి అపారమైన అనభవం ఉంది. ఇప్పటివరకు 101 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఈశ్వరన్.. 48.87 సగటుతో 7674 పరుగులు చేశాడు. అతడి పేరిట 27 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా ప్రధాన సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో ఇండియా-ఎ టీమ్ కెప్టెన్‌గా అభిమన్యు వ్యవహరించనున్నాడు. ఈ అనాధికారిక సిరీస్‌లో అభిమన్యు రాణిస్తే.. ప్రధాన సిరీస్‌లో కూడా అడే అవకాశముంది.చదవండి: Shreyas Iyer: కెప్టెన్ అవుతాడన్నారు.. కట్ చేస్తే! ఇప్పుడు టీమ్‌లోనే నో ఛాన్స్ -
Shreyas Iyer: కెప్టెన్ అవుతాడన్నారు.. కట్ చేస్తే! ఇప్పుడు టీమ్‌లోనే నో ఛాన్స్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 18 సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. కొత్త టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. కరుణ్ నాయర్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్లను తిరిగి పిలుపునిచ్చింది. అయితే ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అండ్ కో ఎంపిక చేసిన ఈ జట్టుపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను పక్కన పెట్టడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఇటీవల కాలంలో అయ్యర్ దేశవాళీ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవడంలోనూ శ్రేయస్‌ది కీలక పాత్ర.అదేవిధంగా 2024-25 రంజీ ట్రోఫీ సీజన్లో శ్రేయస్ అయ్యర్ కేవలం ఏడు ఇన్నింగ్స్‌లలో 68.57 సగటుతో 480 పరుగులు చేశాడు. అయ్యర్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్ము లేపుతున్నాడు. ఐపీఎల్-2025లో కెప్టెన్‌గా, ఆటగాడిగా ఈ ముంబై బ్యాటర్ అదరగొడుతున్నాడు. అయితే గతేడాది మాత్రం అయ్యర్ టెస్టుల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.శ్రేయస్ గత 12 ఇన్నింగ్స్‌లలో 17 సగటుతో 187 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అందుకే సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టి ఫామ్‌లో ఉన్న కరుణ్ నాయర్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ఏదేమైనా ప్రస్తుత ఫామ్‌ను పరిగణలోకి తీసుకుని అయ్యర్‌ను ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసి ఉంటే బాగుండేంది అని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.అయ్యర్ జట్టులో ఉంటే మిడిలార్డర్ పటిష్టంగా ఉంటుందని మరి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ అభిమానులైతే ఒకడుగు ముందుకు వేసి సెలక్టర్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కెప్టెన్ కావాల్సిన ఆటగాడికి పూర్తిగా జట్టులోనే ఛాన్స్ ఇవ్వరా అంటూ మండిపడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు 14 టెస్టులు ఆడి 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 5 హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీ ఉంది.ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్.. అధికారిక ప్రకటన -
ఇది కదా సక్సెస్ అంటే.. 25 ఏళ్లకే టీమిండియా కెప్టెన్‌గా
భారత టెస్టు క్రికెట్ జట్టుకు కొత్త నాయకుడొచ్చాడు. రోహిత్ శర్మ వారసుడు ఎవరో తేలిపోయింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. అందరూ ఊహించినట్టే గిల్‌కే భారత జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం అధికారికంగా ప్రకటించింది.దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ పంజాబీ క్రికెటర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశామని ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్పేర్కొన్నాడు.ఇక అరంగేట్రం చేసిన ఐదేళ్లలోనే భారత జట్టు కెప్టెన్‌గా ఎదిగిన గిల్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది కదా సక్సెస్ అంటూ గిల్‌ను నెటిజన్లు కొనియాడుతున్నారు. గిల్ 2020లో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు.25 ఏళ్ల వయస్సులోనే?భారత టెస్టు జట్టుకు 17 ఏళ్ల తర్వాత యువ కెప్టెన్ వచ్చాడు. 2008లో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నుంచి భారత టెస్టు జట్టు పగ్గాలను ఎంఎస్ ధోని చేపట్టాడు. అప్పటికి ధోని వయస్సు 27 ఏళ్లు. ఆ తర్వాత 8 ఏళ్ల పాటు భారత జట్టును మిస్టర్ కూల్ నడిపించాడు. అనంతరం 2014 డిసెంబరులో ధోనీ నుంచి కోహ్లికి టెస్టు కెప్టెన్సీ దక్కింది. అప్పటికి విరాట్‌కు 27 ఏళ్లు. కోహ్లి సరిగ్గా ఏడేళ్ల పాటు రెడ్‌బాల్ ఫార్మాట్లో భారత జట్టుకు సారథ్యం వహించాడు. కోహ్లి నాయకత్వంలోనే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. 2021 ఆఖరిలో కోహ్లి టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో అతడి వారుసుడిగా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యేటప్పటికి అతడి వయస్సు 34 ఏళ్లు. ఇప్పుడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో శుబ్‌మన్ గిల్ 25 ఏళ్ల వయస్సులోనే కొత్త టెస్టు కెప్టెన్‌గా నియిమితుడయ్యాడు. దీంతో దిగ్గజ కెప్టెన్లు ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల కంటే అతి తక్కువ వయస్సులోనే టీమిండియా నాయకుడిగా ఎంపికై గిల్ చరిత్ర సష్టించాడు.ఓవరాల్‌గా భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ఎంపికైన ఐదవ అతి పిన్న వయస్కుడిగా గిల్ నిలిచాడు. గిల్ ప్రస్తుత వయస్సు 25 సంవత్సరాల 285 రోజులు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (21 సంవత్సరాల 77 రోజులు) అగ్రస్దానంలో ఉన్నాడు.👉గిల్ ఇప్పటివరకు 32 టెస్టులు ఆడి 35.06 సగటుతో 1893 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 7 హాఫ్ సెంచరీలు, ఐదు శతకాలు ఉన్నాయి.టెస్టుల్లో అతి పిన్న వయస్కులైన భారత కెప్టెన్లు వీరే..మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (21 సంవత్సరాల, 77 రోజులు)సచిన్ టెండూల్కర్ -(23 సంవత్సరాల, 169 రోజులు)కపిల్ దేవ్ (24 సంవత్సరాల, 48 రోజులు)రవి శాస్త్రి (25 సంవత్సరాల, 229 రోజులు)శుబ్మాన్ గిల్ (25 సంవత్సరాల, 285 రోజులు)చదవండి: ఇంగ్లండ్ టూర్.. అందుకే షమీని ఎంపిక చేయలేదు: అగార్కర్ క్లారిటీ -
ఇంగ్లండ్ టూర్.. అందుకే షమీని ఎంపిక చేయలేదు: అగార్కర్ క్లారిటీ
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 18 సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ నియమితుడయ్యాడు. సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లు తొలి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోగా.. కరుణ్ నాయర్, శార్థూల్ ఠాకూర్ వంటి వెటరన్ ప్లేయర్లు తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ షమీకి చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. టెస్టు క్రికెట్లో అపారమైన అనుభవం ఉన్న షమీని సెలక్టర్లు ఎందుకు పక్కన పెట్టరాన్న ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ టూర్‌కు షమీని ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు."షమీ గత వారం రోజులగా కాలి మడమ నొప్పితో బాధపడుతున్నాడు. కొన్ని ఎంఆర్ఐ స్కాన్లు కూడా చేయించుకున్నాడు. ఐదు టెస్టుల సిరీస్ మొత్తం ఆడే సామర్థ్యం అతనికి ఇంకా రాలేదు. సుదీర్ఘ స్పెల్స్ బౌలింగ్ చేస్తే షమీపై వర్క్ లోడ్ పడుతోంది. మా వైద్య బృందం సూచన మేరకు అతడిని ఈ సిరీస్‌కు పక్కన పెట్టాల్సి వచ్చింది. షమీ ఈ సిరీస్‌కు ఫిట్‌గా ఉంటాడని మేము కూడా ఆశించాము. కానీ దురదృష్టవశాత్తూ అతడి ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఫిట్నెస్ లేని ప్లేయర్ ఎంపిక చేయడం కంటే వేరే ఆటగాడికి అవకాశమివ్వడం ఉత్తమమని భావించాము. అందుకే షమీని ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేయలేదు" ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అగార్కర్ పేర్కొన్నాడు. షమీ తన చివరి టెస్టు మ్యాచ్.. డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో ఆస్ట్రేలియాపై ఆడాడు. 34 ఏళ్ల మహ్మద్ షమీ తన కెరీర్లో ఇప్పటివరకు 64 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి.. 229 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ 3.30 ఉంది. ఈ ఫార్మాట్లో అతను 6 సార్లు 5 వికెట్ల హాల్‌తో సత్తా చాటాడు. ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్.. అధికారిక ప్రకటన -
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్.. అధికారిక ప్రకటన
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ స్దానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. అదేవిధంగా శుబ్‌మన్ గిల్ డిప్యూటీగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను నియమించారు. ఇక ఐపీఎల్లో దుమ్ములేపుతున్న యువ సంచలనం సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్‌లకు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. మరోవైపు దేశవాళీ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్న మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి నాయర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. కరుణ్ నాయర్‌తో పాటు శార్ధూల్ ఠాకూర్ కూడా తిరిగి టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. ఈ జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కకపోవడం అందరి ఆశ్చర్యపరిచింది.అదేవిధంగా ఆసీస్ టూర్లో భాగమైన హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్‌కు సెలక్టర్లు ఈసారి మొండి చేయి చూపించారు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్Shubman Gill-led #TeamIndia are READY for an action-packed Test series 💪A look at the squad for India Men’s Tour of England 🙌#ENGvIND | @ShubmanGill pic.twitter.com/y2cnQoWIpq— BCCI (@BCCI) May 24, 2025 -
టీమిండియా సారథిగా శుబ్‌మన్ గిల్ ఫిక్స్!.. వైస్ కెప్టెన్ ఎవరంటే?
టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ ఎవరన్న ఉత్కంఠకు మరో 24 గంటల్లో తెరపడనుంది. బీసీసీఐ శనివారం ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టుతో పాటు కొత్త టెస్టు కెప్టెన్ పేరును కూడా వెల్లడించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ పేరును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.అదేవిధంగా గిల్‌కు డిప్యూటీగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను నియమించాలని అజిత్ అగార్కర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇంగ్లండ్ పర్యటనకు స్టార్ పేసర్ మహ్మద్ షమీని పక్కన పెట్టాలని సెలక్టర్లు డిసైడనట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. షమీ తన మడమ గాయం కారణంగా లాంగ్ స్పెల్స్ వేసేందుకు ఇంకా సిద్దంగా లేనట్లు బీసీసీఐ వైద్య బృందం ధ్రువీకరించనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సాయిసుదర్శన్, కరుణ్ నాయర్లకు భారత టెస్టు జట్టులో చోటు ఖాయమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. జూన్ 20 నుంచి 24 లీడ్స్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. కాగా ఈ కీలక సిరీస్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు(అంచనా): శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్, దృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హర్షి దేష్, ప్రశీద్, షర్షి దేష్, ప్రశిద్ కుల్దీప్ యాదవ్.చదవండి: రూ.25 లక్షలు మోసపోయిన దీప్తీ శర్మ..? సహచర క్రికెటర్‌పై కేసు నమోదు -
టీమిండియా బౌలర్లకు వార్నింగ్.. సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు జస్ప్రీత్ బుమ్రా అండ్ కోకు ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ బెన్ డకెట్ హెచ్చరికలు జారీ చేశాడు. నాటింగ్‌హామ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో డకెట్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో వన్డేను తలపిస్తూ తన ఐదో టెస్టు సెంచరీ మార్క్‌ను డకెట్ అందుకున్నాడు. 134 బంతులు ఎదుర్కొన్న డకెట్.. 20 ఫోర్లు, 2 సిక్స్‌లతో 140 పరుగులు చేసి ఔటయ్యాడు. జాక్ క్రాలీతో కలిసి తొలి వికెట్‌కు 235 పరుగుల భాగస్వామ్యాన్ని డకెట్ నెలకొల్పాడు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లలో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. స్టోక్స్ సేన తమ మొదటి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లకు వికెట్ నష్టానికి 359 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ(121), ఓలీ పోప్(79) ఉన్నారు. కాగా ఈ ఏకైక మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ జట్టు భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ కోసం ఇంకా ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించలేదు. భారత జట్టును మే 24న బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.జింబాబ్వేతో ఏకైక టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, ఓల్లీ పోప్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), గస్ అట్కిన్సన్, సామ్యూల్ జేమ్స్ కుక్, జోష్ టంగ్, షోయబ్ బషీర్చదవండి: IPL 2025: 'ఆ రెండు ఓవర్లే మా కొంపముంచాయి.. లేదంటే విజయం మాదే' -
'అతడొక అద్బుతం.. ఇంగ్లండ్ టూర్‌కు సెలక్ట్ చేయండి'
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభానికి ఇంకా నాలుగు వారాల సమయం మాత్రమే మిగిలింది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.అయితే ఇంగ్లండ్ టూర్‌కు ఇంకా భారత జట్టును బీసీసీఐ ఖారారు చేయలేదు. క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం.. మే 24న భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశముంది. అయితే ఈ సిరీస్‌కు టీమిండియాను ఎంపిక చేయడం సెలక్టర్లకు బిగ్ ఛాలెంజ్ వంటిదే అని చెప్పాలి. ఇందుకు ఈ కీలక పర్యటనకు ముందు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికారు. దీంతో వారిద్దరూ స్ధానాలను భర్తీ చేసే పనిలో సెలక్టర్లు ఉన్నారు. ఈ పర్యటనలో భారత టెస్టు జట్టులో కొన్ని కొత్త ముఖాలను చూసే అవకాశముంది. సాయిసుదర్శన్, అర్షదీప్ సింగ్‌లు టీమిండియా తరపున టెస్టు అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో భారత సెలక్టర్లకు హర్యానా స్పీడ్ స్టార్ అన్షుల్ కాంబోజ్‌ను ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేయాలని చెన్నైసూపర్ కింగ్స్ హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సూచించాడు. ఐపీఎల్-2025 సీజన్లో కాంబోజ్ సీఎస్కే తరపున ఆడుతున్నాడు."కాంబోజ్ అద్బుతమైన బౌలర్. అతడు గంటకు 138-139 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలడు. అతడు తన పేస్ బౌలింగ్‌తో బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు. కాంబోజ్ వేసే బంతులు ఎల్లప్పుడూ చేతి గ్లౌవ్స్ దగ్గరగా వెళ్తూ ఉంటాయి.దీంతో బ్యాటర్లు వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హైట్ ఎక్కువగా ఉండడంతో బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. ప్లాట్ వికెట్లపై కూడా అతడు అద్బుతంగా బౌలింగ్ చేయగలడు.ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఫ్లాట్ వికెట్లపై ఎలా రాణించాడో చూశాము. కొంచెం సీమ్, స్వింగ్ ఉన్న పరిస్థితుల్లో ఇంకా బాగా రాణిస్తాడు. కాబట్టి ఇంగ్లండ్‌కు వెళ్లే భారత జట్టులో అతడు ఉంటాడని ఆశిస్తున్నానని" ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. -
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టులోకి స్టార్ ప్లేయర్! ఎవరంటే?
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ త్వరలోనే టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు 26 ఏళ్ల అర్ష్‌దీప్ ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణంయిచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్దంగా ఉండాలని ఈ పంజాబ్ పేసర్‌కు సెలక్టర్లు సూచించినట్లు సమాచారం.అర్ష్‌దీప్ రాకతో భారత టెస్టు జట్టులో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేని లోటు తీరనుంది. కాగా వన్డే, టీ20ల్లో భారత తరపున అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్.. టెస్టుల్లో మాత్రం ఇంకా డెబ్యూ చేయలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రెగ్యూలర్‌గా ఆడుతున్నప్పటికి టీమిండియా తరపున టెస్టుల్లో ఆడే అవకాశం మాత్రం సింగ్‌కు రాలేదు. ఇంగ్లండ్ టూర్‌తో అతడు మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేయడం ఖాయమన్పిస్తోంది. అర్ష్‌దీప్‌కు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉంది. అక్కడి పరిస్థితులు అర్ష్‌దీప్‌కు బాగా తెలుసు. ఈ క్రమంలోనే అతడిని ఇంగ్లండ్‌కు పంపాలని అగర్కాకర్ అండ్ కో భావిస్తున్నట్లు వినికిడి.తన కెరీర్లో ఇప్పటివరకు 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్.. 66 వికెట్లు పడగొట్టాడు. గత రంజీ సీజన్లో అతను రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ మే 23న ప్రకటించే అవకాశముంది. కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు విడ్కోలు పలకడంతో కొత్త కెప్టెన్‌తో మెన్ ఇన్ బ్లూ ఇంగ్లండ్‌కు పయనం కానుంది. భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపిక దాదాపు ఖారరైనట్లు సమాచారం. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడి స్ధానాన్ని ఎవరి భర్తీ చేస్తారో వేచి చూడాలి. జూన్ 20 నుంచి భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భారత జట్టు(అంచనా)కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్,, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటు -
రోహిత్ శర్మకు ఘోర అవమానం!.. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాడా?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకస్మికంగా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే రోహిత్ శర్మ అనూహ్య రిటైర్మెంట్పై పలు ఊహాగానాలు వినిపించాయి. ఇంగ్లండ్‌తో టెస్టులకు ముందు భారత టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ తొలగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుందని, అందుకే అతడు రిటైర్మెంట్ ప్రకటించాడని ప్రచారం జరిగింది. తాజాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ప్రముఖ క్రీడా వెబ్సైట్ స్కై స్పోర్ట్స్ సంచలన రిపోర్ట్‌ను వెల్లడించింది. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు కెప్టెన్‌గా తనను ఎంపిక చేయాలని, టూర్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటిస్తానని బీసీసీఐకి హిట్‌మ్యాన్ తెలియజేసినట్లు తమ రిపోర్ట్‌లో పేర్కొంది. కానీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం రోహిత్‌ను కేవలం ఆటగాడిగా మాత్రమే ఎంపిక చేస్తామని, కెప్టెన్‌గా వేరే ప్లేయర్‌కు అవకాశమిస్తామని చెప్పినట్లు సదరు వెబ్సైట్ తమ నివేదికలో వెల్లడించింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తన రెడ్ బాల్ కెరీర్‌ను ముగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన వారం రోజులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు భారత జట్టుకు కొత్త టెస్టు కెప్టెన్ రానున్నాడు.కెప్టెన్సీ రేసులో శుబ్‌మన్ గిల్ ముందుంజలో ఉన్నాడు. ఇక రోహిత్ తన టెస్ట్ కెరీర్లో 67 మ్యాచ్‌లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాపై సాధించిన 212 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెప్టెన్‌గా 24 టెస్టులకు నాయకత్వం వహించి, 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రాలు నమోదు చేశాడు.చదవండి: ఐపీఎల్-2025 ఫ్లే ఆఫ్స్ వేదికలు ఖరారు.. ఫైనల్ ఎక్కడంటే? -
ఇంగ్లండ్ టూర్: వారినే ఎంపిక చేయమని బీసీసీఐ ఆదేశం!?
ఐపీఎల్-2025 (IPL 2025) ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ షెడ్యూల్‌తో బిజీకానున్నారు. ఇందులో భాగంగా భారత జట్టు తొలుత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTV) 2025-27 సీజన్ ఆరంభం కానుంది.తొలుత అనధికారిక టెస్టులుఅయితే, అంతకంటే ముందే భారత్-‘ఎ’- ఇంగ్లండ్ లయన్స్ (India A vs England Lions)తో తలపడనుంది. ఇరు జట్ల మధ్య రెండు అనధికారిక టెస్టులు జరుగుతాయి. మే 30 నుంచి తొలి మ్యాచ్, జూన్ 6 నుంచి రెండో మ్యాచ్ జరుగుతాయి. ఆ తర్వాత భారత సీనియర్ జట్టు, భారత ‘ఎ’ టీమ్ మధ్య కూడా జూన్ 13 నుంచి ఒక నాలుగు రోజుల మ్యాచ్ జరుగుతుంది.జైసూ, నితీశ్, గిల్, జురెల్ కూడాఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత్-‘ఎ’ జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్ గత సీజన్లో అద్భుతంగా చెలరేగిన బ్యాటర్ కరుణ్ నాయర్‌కు భారత టెస్టు టీమ్‌లో పునరాగమనం చేసేందుకు మరో అవకాశం లభించింది. ఇంగ్లండ్ ‘ఎ’ జట్టుతో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో తలపడేందుకు సెలక్టర్లు ఎంపిక చేసిన భారత ‘ఎ’ జట్టులో కరుణ్ నాయర్‌కు చోటు లభించింది. అదే విధంగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో సభ్యులైన యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్‌దీప్‌లను కూడా భారత ‘ఎ’ జట్టుకి సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌లో పరిస్థితులను అర్థం చేసుకునేందుకు యువ ఆటగాళ్లకు ఈ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు సరైన అవకాశంగా సెలక్టర్లు భావించారు.వారినే ఎంపిక చేయమని బీసీసీఐ ఆదేశం!?అయితే, ఈ జట్టు ఎంపిక సమయంలో బీసీసీఐ ఆచితూచి అడిగేసిందంటూ బోర్డు సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ IANSకు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ‘‘భారత్-‘ఎ’ జట్టు ఎంపిక విషయంలో ఒక విధమైన గందరగోళం నెలకొందనే చెప్పాలి. ఏ ఆటగాడిని తీసుకోవాలో అర్థం కాలేదు.అప్పుడు బీసీసీఐ సెలక్టర్లకు ఓ సలహా ఇచ్చింది. ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్‌నకు చేరని జట్ల నుంచి ఆటగాళ్లను ఎంపిక చేయమని చెప్పింది. వారికి ప్రాధాన్యం ఉండేలా చూసుకోమంది. ఎందుకంటే.. భారత్-‘ఎ’ జట్టు మే 25న ఇంగ్లండ్‌కు బయలుదేరాల్సి ఉంది’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థతో చెప్పుకొచ్చాయి.కాగా ఇంగ్లండ్‌కు వెళ్లే భారత్-‘ఎ’ జట్టులో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఓపెనర్ సాయి సుదర్శన్‌లు ఉన్నారు. వీరి టీమ్ ప్లే ఆఫ్స్ రేసులో ముందుంది. మిగతా ఆటగాళ్ల జట్లు రాజస్తాన్ రాయల్స్ (యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి), చెన్నై సూపర్ కింగ్స్ (రుతురాజ్ గైక్వాడ్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తదితరులు) ఇప్పటికే ప్లే ఆఫ్స్ పోటీ నుంచి నిష్క్రమించాయి.ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత్- ‘ఎ’ జట్టు అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), ధ్రువ్ జురేల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, మానవ్ సుతార్, తనుశ్ కొటియాన్, ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే, శుబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్.చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక! -
ఇంగ్లండ్ టూర్.. భారత-ఎ జట్టు హెడ్ కోచ్‌గా హృషికేష్?
ఈ ఏడాది జూన్‌లో భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్ 2025-27లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. జూన్ 20న లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య ఈ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ప్రధాన సిరీస్‌కు ముందు ఇండియా-ఎ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో మూడు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టెస్టు మే 30 నుంచి జూన్ 2 వరకు కాంటర్బరీ వేదికగా, రెండో టెస్టు నార్తాంప్టన్‌లో జూన్ 6 నుంచి 9 వరకు జరగనున్నాయి. ఈ సిరీస్క భారత-ఎ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా అభిమన్యు ఈశ్వరన్ ఎంపికయ్యాడు. అదేవిధంగా కరుణ్ నాయర్, ఇషాన్ కిషన్‌లకు చోటు దక్కింది.హెడ్ కోచ్‌గా కనిత్కర్..!ఇక ఇంగ్లండ్ టూర్లో భారత-ఎ జట్టు హెడ్‌కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ హృషికేష్ కనిత్కర్ వ్యవరించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. రెగ్యూలర్ హెడ్ కోచ్ గౌతం గంభీర్ జూన్ 6న ఇంగ్లండ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జట్టు కోచింగ్ బాధ్యతలు హృషికేష్‌కు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.కనిత్కర్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. 2022 ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచిన భారత మహిళా జట్టుకు హెడ్‌కోచ్‌గా హృషికేష్ కనిత్కర్ వ్యవహరించాడు. అతడు గోవా , తమిళనాడు రాష్ట్ర జట్టుకు కూడా కోచ్‌గా పనిచేశాడు.ఇంగ్లండ్ పర్యటనకు భారత్ ఎ జట్టు:అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే -
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
ఇంగ్లండ్ టూర్‌కు భారత-ఎ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా అభిమన్యు ఈశ్వరన్ నియమితుడయ్యాడు. ఈ టూర్లో ఈశ్వరన్ డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ వ్యవహరించనున్నాడు. కాగా ఇండియా-ఎ జట్టుకు చానాళ్ల తర్వాత వెటరన్ క్రికెటర్ కరుణ్ నాయర్ ఎంపికయ్యాడు. కరుణ్ 8 ఏళ్ల తర్వాత ఇండియా సీనియర్ టెస్టు జట్టులోకి సైతం రీ ఎంట్రీ ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. ఇక కరుణ్ నాయర్‌తో పాటు ఇషాన్ కిషన్‌కు కూడా భారత-ఎ జట్టులో చోటు దక్కింది. అయితే ఆశ్చర్యకరంగా శ్రేయాస్ అయ్యర్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. దీంతో అయ్యర్ ఇంగ్లండ్‌తో టెస్టులకు ప్రధాన భారత జట్టులో లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.ఈ 18 మంది సభ్యుల జట్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ కూడా ఉన్నారు. వారిని ప్రాక్టీస్ కోసం ముందుగా ఇంగ్లండ్‌కు బీసీసీఐ పంపింది. అదేవిదంగా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ తర్వాత శుబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్‌లు ఇండియా-ఎ జట్టుతో కలవనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. వికెట్ల వీరుడికు చోటుఈ ఏడాది రంజీ ట్రోఫీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ హర్ష్ దుబే కూడా భారత-ఎ జట్టులో భాగమయ్యాడు. ఈ విదర్భ స్పిన్నర్ 10 మ్యాచ్‌ల్లో 17 సగటుతో 69 వికెట్లు పడగొట్టాడు. మరో ఎడమచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా ప్రధాన సిరీస్‌కు ముందు ఇండియా-ఎ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు మే 30 నుండి జూన్ 9 వరకు జరగనున్నాయి.ఇంగ్లండ్ పర్యటనకు భారత్ ఎ జట్టు:అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. భారత తుది జట్టులో ఎవరూ ఊహించని ప్లేయర్!?
ఐపీఎల్-2025 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును మే 23న బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.అదేరోజున భారత కొత్త టెస్టు కెప్టెన్ పేరును కూడా బీసీసీఐ సెలక్షన్ కమిటీ వెల్లడించనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు రిటైర్మెంట్ ప్రకటించడంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. సాయిసుదర్శన్, దేవదత్ పడిక్కల్ వంటి యువ ఆటగాళ్లకు టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశముంది. జూన్ 20 నుంచి హెడింగ్లీ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27లో భారత్‌కు ఇదే తొలి సిరీస్. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మొదటి టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అంచనా వేశాడు.రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌కు చోప్రా అవకాశమిచ్చాడు. భారత ఇన్నింగ్స్‌ను యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ ప్రారంభించాలని అతడు అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా విరాట్ కోహ్లి స్ధానంలో సాయి సుదర్శన్ లేదా దేవ్‌దత్త్ పడిక్కల్‌కు అవకాశమివ్వాలని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇక కెప్టెన్సీ రేసులో ఉన్న శుబ్‌మన్ గిల్‌కు నాలుగో స్దానంలో అతడు చోటు కల్పించాడు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా రిషబ్ పంత్‌ను ఈ భారత మాజీ క్రికెటర్ ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజాలకు చోటిచ్చాడు.అయితే అనూహ్యంగా దీపక్ చాహర్‌ను ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేయాలని అతడు సెలక్టర్లను సూచించాడు. ఎనిమిదవ స్ధానంలో దీపక్ చాహర్ లేదా శార్ధూల్ ఠాకూర్‌కు ఛాన్స్ ఇవ్వాలని అతడు మెనెజ్‌మెంట్‌ను కోరాడు. కాగా దీపక్ చాహర్ ఇప్పటివరకు టెస్టుల్లో భారత తరపున అరంగేట్రం చేయలేదు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణలకు చోప్రా చోటిచ్చాడు.ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు చోప్రా ఎంపిక చేసిన ఇండియన్ ప్లేయింగ్ ఎలెవన్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్/దేవ్‌దత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ/ ప్రసిద్ద్ కృష్ణ -
'గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే బెటర్'
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియాకు కొత్త టెస్టు కెప్టెన్ ఎంపిక చేసే పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది. రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. పలు నివేదికల ప్రకారం టెస్టు కెప్టెన్సీ రేసులో స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా విన్పిస్తోంది. కానీ గిల్ తో పోలిస్తే బుమ్రాకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గాయాల బెడద, వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ను దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు జట్టు పగ్గాలు అప్పగించకూడదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనుభవం లేని గిల్ వైపు బీసీసీఐ సెలక్షన్ కమిటీ మొగ్గు చూపుతుండడం క్రికెట్ వర్గాల్లో అసంతృప్తికి దారితీసినట్లు తెలుస్తోంది.చాలా మంది మాజీలు భారత టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు గిల్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్‌గా బుమ్రా ఉండాలని, శుబ్‌మన్ గిల్‌ను అతడి డిప్యూటీగా ఎంపిక చేయాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు."భారత టెస్టు కెప్టెన్సీ రేసులో జస్ప్రీత్ బుమ్రా ముందంజలో ఉంటాడాని భావిస్తున్నాను. ఒకవేళ తనంతట తానుగా కెప్టెన్సీ ఆఫర్ తిరష్కరిస్తే తప్ప సెలక్టర్లు మరో ఆప్షన్‌ను పరిశీలించరు. అతడిని కెప్టెన్‌గా చేసి గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాలి. బుమ్రాకు విశ్రాంతి అవసరమైనప్పుడల్లా గిల్ జట్టును నడిపిస్తున్నాడు. దీంతో గిల్‌కు పూర్తి స్ధాయి కెప్టెన్‌గా ఎదిగేందుకు తగినంత సమయం లభిస్తోంది" అని జాఫర్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా గిల్‌కు కెప్టెన్‌గా అంతర్జాతీయ స్ధాయిలో పెద్దగా అనుభవం లేదు. జింబాబ్వే సిరీస్‌లో భారత జట్టు సారధిగా గిల్ వ్యవహరించాడు. ఆ తర్వాత ఎప్పుడూ భారత జట్టును నడిపించలేదు. ఐపీఎల్ మాత్రం కెప్టెన్‌గా అతడికి అనుభవం ఉంది. గుజరాత్ టైటాన్స్ సారథిగా గిల్ కొనసాగుతున్నాడు. ఇక ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టును మే 23న బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.చదవండి: BCCI - IND vs ENG: టీమిండియాలో అతడికి చోటు కష్టమే! -
శుబ్‌మన్ గిల్, పంత్ కాదు.. అతడి టెస్టు కెప్టెన్ చేయండి: అశ్విన్
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో భారత తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరన్న చర్చ మొదలైంది. టెస్టు కెప్టెన్సీ రేసులో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ముందుంజలో ఉన్నాడు. కెప్టెన్‌గా గిల్ ఎంపిక దాదాపు ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీమిండియా తదుపరి కెప్టెన్ గిల్ అన్న ఊహాగానాలపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కొంతమంది మాజీలు సంతృప్తి వ్యక్తం చేస్తూంటే.. మరి కొంత మంది సీనియర్ ఆటగాడిని కెప్టెన్‌గా చేయాలని బీసీసీఐని సూచిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను భారత కెప్టెన్‌గా ఎంపిక చేయాలని అశ్విన్ సూచించాడు.."ప్రస్తుత భారత జట్టులో రవీంద్ర జడేజా అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు. అతడిని కూడా కెప్టెన్సీ ఎంపికగా పరిగణించాలి. మీరు కొత్త ఆటగాడికి శిక్షణ ఇచ్చి తర్వాత కెప్టెన్‌గా చేయాలని భావిస్తుంటే.. సారథిగా మీకు జడేజా బెస్ట్ ఛాయిస్. జడేజా రెండేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించవచ్చు. జడ్డూకు డిప్యూటీగా మీరు ఎవరినైతే కెప్టెన్‌గా చేయాలనకుంటున్నారో వారిని నియమించండి. అప్పుడు అతడు మరింత రాటుదేలుతాడు. భారత జట్టుకు కెప్టెన్ కావడం ప్రతి ఆటగాడి కల. జడేజాకు అవకాశమిస్తే అతడు కచ్చితంగా స్వీకరిస్తాడని" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.అదేవిధంగా శుబ్‌మన్ గిల్‌పై కూడా అశూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. గిల్ అక్కడ జట్టును గెలిపిస్తే.. కెప్టెన్‌గా పరిపక్వత సాధించినట్లు అవుతోంది. అయితే టెస్టుల్లో కెప్టెన్సీ అంత సలువు కాదు. ఒక కెప్టెన్‌గా ఫస్ట్-క్లాస్ క్రికెట్లో కూడా ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అశ్విన్ అన్నాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. విధ్వంసకర ఓపెనర్ రీ ఎంట్రీ -
టీమిండియాతో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్ క్రికెట్ మాస్టర్ ప్లాన్
టీమిండియాతో వచ్చే నెలలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు అన్ని విధాల సిద్దమవుతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు 'స్పెషల్ స్కిల్స్ కన్సల్టంట్’ న్యూజిలాండ్ పేస్ దిగ్గజం టిమ్ సౌథీని ఇంగ్లండ్ క్రికెట్ నియమించింది. టిమ్ సౌథీ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన అపార అనుభవంతో ఇంగ్లండ్ క్రికెట్‌ను ముందుకు నడిపిస్తాడు అని ఈసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగాఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ జేమ్స్ ఆండర్సన్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఇప్పటివరకు జేమ్స్ ఆండర్సన్ ఇంగ్లండ్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. అయితే అతడు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో లంకాషైర్ తరపున ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే సౌథీతో ఈసీబీ ఒప్పందం కుదుర్చుకుంది. ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జింబాబ్వేతో జరగనున్న ఏకైక టెస్టుతో సౌథీ తన కొత్త ప్రయాణాన్ని ఆరంభించనున్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్ క్యాంపులో చేరిన సౌథీ.. దగ్గరుండి ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను పర్యవేక్షిస్తున్నాడు.కాగా గత డిసెంబర్లో అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికిన సౌథీ.. భారత్‌పై మెరుగైన రికార్డును కలిగి ఉన్నాడు. అదేవిధంగా ఇంగ్లండ్ గడ్డపై ఆడిన అనుభవం కూడా ఉంది. ఈ క్రమంలోనే బ్రెండన్ మెక్కల్లమ్తో కూడిన కోచింగ్ బృందంలో సౌథీని ఈసీబీ చేర్చింది. సౌథీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. వన్డేల్లో 221 వికెట్లు పడగొట్టిన సౌథీ..టెస్టుల్లో 391, టీ20ల్లో 164 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27లో సైకిల్లో భాగంగా జరగనుంది. జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.Our new Specialist Skills Consultant 😍We're delighted to announce that Tim Southee, New Zealand’s all-time leading wicket-taker, is joining us on a short-term basis. Read more 👇— England Cricket (@englandcricket) May 15, 2025చదవండి: IPL 2025: పంజాబ్ జట్టులోకి డేంజరస్ ప్లేయర్ ఎంట్రీ.. ఇక దబిడి దిబిడే? -
కోహ్లి స్ధానంలో అతడే సరైనోడు.. ఇంగ్లండ్‌కు పంపండి: కుంబ్లే
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరికి షాకిచ్చిన సంగతి తెలిసిందే. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించగా.. ఆ తర్వాత వారం రోజులకే విరాట్ కోహ్లి కూడా తన నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ వచ్చే వారం ప్రకటించింది. అయితే ఇన్నాళ్లు విరాట్ కోహ్లి ఆడిన నాలుగో స్ధానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ కెప్టెన్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ ఫార్మాట్లో విరాట్ కోహ్లి బ్యాటింగ్ స్థానాన్ని కరుణ్ నాయర్ భర్తీ చేయగలడని కుంబ్లే జోస్యం చెప్పాడు. కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు కరుణ్ నాయర్ ఎంపికయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించడంతో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉండడంతో నాయర్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నారంట."కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్లో చక్కటి ప్రదర్శన కనబరిచాడు. అతడు భారత జట్టులోకి తిరిగి రావడానికి అర్హుడు. అతడు నాలుగో స్ధానంలో ఆడొచ్చు. ఎందుకంటే భారత్‌కు ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం ఉన్న ఆటగాడు కావాలి. కరుణ్‌కు ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ అనుభవం ఉంది. అతడికి అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో బాగా తెలుసు. కరుణ్ వయస్సు పరగా 30 ఏళ్లు దాటిండొచ్చు. కానీ అతడు ఇంకా చాలా యంగ్ కన్పిస్తున్నాడు. ఇంకా చాలా కాలం పాటు క్రికెట్ ఆడే సత్తా ఉంది. కాబట్టి కోహ్లి స్ధానంలో అతడే సరైనోడు" అని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నారు.కాగా కరుణ్ నాయర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రంజీ ట్రోఫీ 2024-25లో విదర్భ ఛాంపియన్‌గా నిలవడంలో కరుణ్‌ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్‌లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ కొనసాగుతున్నాడు.ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భారత జట్టు(అంచనా)కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్. -
ఇండియా-ఎ టీమ్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. కిషన్, కరుణ్ నాయర్‌కు పిలుపు?
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా జరగనుంది. ఈ సిరీస్‌లో ఎలాగైనా గెలిచి డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో బోణీ కొట్టాలని టీమిండియా భావిస్తోంది. జూన్ 20 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత జట్టును బీసీసీఐ మే 23న ప్రకటించే అవకాశముంది. ఈ పర్యటనకు భారత జట్టు కొత్త కెప్టెన్‌తో వెళ్లనుంది.రోహిత్ శర్మ టెస్టులకు విడ్కోలు పలకడంతో టీమిండియాకు కొత్త టెస్టు కెప్టెన్ రానున్నాడు. కెప్టెన్సీ రేసులో శుబ్‌మన్ గిల్ ముందు వరుసలో ఉన్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టెస్టు సిరీస్‌కు ముందు భారత-ఎ జట్టు కూడా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇండియా-ఎ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో మూడు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లు మే 26 నుండి జూన్ 19 వరకు జరగనున్నాయి.ఈ అనాధికారిక సిరీస్ కోసం భారత-ఎ జట్టును బీసీసీఐ మే 13 న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ జట్టు కెప్టెన్‌గా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. అయ్యర్ ప్రస్తుతం ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఒకవేళ పంజాబ్ కింగ్స్ ఫైనల్‌కు చేరితే అయ్యర్ తొలి అనాధికారిక టెస్టుకు దూరమయ్యే అవకాశముంది.అయితే ప్రస్తుతం మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్ సీజన్ తిరిగి మే 15 నుంచి ప్రారంభమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఒకవేళ ఐపీఎల్ తిరిగి ప్రారంభమవ్వడం ఆలస్యమైతే భారత-ఎ జట్టుతో పాటే అయ్యర్ ఇంగ్లండ్‌కు వెళ్లనున్నాడు. శ్రేయస్‌తో పాటు కరుణ్ నాయర్, ఇషాన్ కిషన్‌లను కూడా భారత-ఎ జట్టుకు ఎంపిక చేయాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు సమాచారం.సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, తనుష్ కోటియన్‌లను కూడా ఇండియా-ఎ జట్టు తరపున ఇంగ్లండ్ పంపననున్నట్లు వినికిడి. ప్రధాన జట్టులో ఉండే చాలా మంది ఆటగాళ్లు ఇండియా-ఎ జట్టు తరపున ఆడనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. -
రోహిత్ శర్మ స్థానంలో యువ సంచలనం..? ఇక భారత్‌కు తిరుగులేదు?
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకివ్వగా.. హిట్‌మ్యాన్ బాటలోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి నడుస్తున్నట్లు తెలుస్తోంది. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని కోహ్లి నిర్ణయించుకున్నట్లు సమాచారం.విరాట్ తన నిర్ణయాన్ని ఇప్పటికే బీసీసీఐకి తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే ఇంగ్లండ్ సిరీస్ వరకు అయినా కొనసాగాలని కోహ్లిని ఒప్పించేందుకు బీసీసీఐ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. కోహ్లి టెస్టుల్లో కొనసాగుతాడా లేదా రోహిత్ బాటలోనే నడుస్తాడా? అన్నది మే 23న తేలిపోనుంది. ఆ రోజున ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టుతో పాటు కొత్త కెప్టెన్‌ను కూడా బీసీసీఐ ప్రకటించనుంది. కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపిక దాదాపు ఖాయం కాగా.. ప్లేయర్‌గా రోహిత్ శర్మ స్దానాన్నిమాత్రం తమిళనాడు యువ సంచలనం సాయిసుదర్శన్‌తో భర్తీ చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. సాయిసుదర్శన్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్ములేపుతున్నాడు. ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న సుదర్శన్ పరుగులు వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 5 హాఫ్ సెంచరీలతో 509 పరుగులు చేశాడు. అతడి ఆటను చూసి మాజీలు ఫిదా అయిపోయారు. రవిశాస్రి వంటి దిగ్గజ క్రికెటర్లు సుదర్శన్‌ను ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లను సూచించారు.దీంతో భారత తరపున వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన సుదర్శన్.. ఇప్పుడు టెస్టుల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. సుదర్శన్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. రంజీ ట్రోఫీ సీజన్లలో తమిళనాడు తరపున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 7 సెంచరీలతో 1957 పరుగులు చేశాడు. సుదర్శన్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 213గా ఉంది. భారత్ తరుపున ఆడిన 3 వన్డేలలో 2 అర్ధ సెంచరీలతో 127 పరుగులు చేశాడు. అదేవిధంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా అతడికి ఉంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ స్థాన్నాన్ని సుదర్శన్‌తో భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్ 20 నుంచి భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కానుంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్..! -
ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్..!
ఐపీఎల్-2025 సీజన్ మధ్యలో నిలిచిపోవడంతో ప్రస్తుతం అందరి దృష్టి భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌పై మళ్లింది. ఈ ఏడాది జూన్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ రెడ్ బాల్ క్రికెట్ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ సిరీస్‌కు భారత జట్టును మే 23న బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది.అదే రోజున భారత కొత్త టెస్టు కెప్టెన్ పేరును కూడా బీసీసీఐ వెల్లడించింది. రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ విడ్కోలు పలకడంతో కెప్టెన్ ఎంపిక ఇప్పుడు అనివార్యమైంది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఎంపిక దాదాపు ఖాయమైంది. గిల్ ఇప్పటికే హెడ్ కోచ్ గౌతం గంభీర్, ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో సమావేశమయ్యాడు.ఇక ఇది ఇలా ఉండగా.. ఇంగ్లండ్ సిరీస్‌కు భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. షమీ వైట్‌బాల్ క్రికెట్లో ఆడుతున్నప్పటికీ, సుదీర్ఘ ఫార్మాట్లో ఆడేంత ఫిట్నెస్ ఇంకా సాధించలేదని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వన్డే ప్రపంచకప్-2023 తర్వాత గాయం కారణంగా ఏడాది పాటు ఆటకు షమీ దూరంగా ఉన్నాడు.ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో పునరాగమనం చేశాడు. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీలో ఫర్వాలేదన్పించాడు. వికెట్లు పడగొట్టినప్పటికి అంత రిథమ్‌లో మాత్రం షమీ కన్పించలేదు. అదేవిధంగా ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న షమీ.. అక్కడ కూడా పూర్తిగా తేలిపోతున్నాడు. నెట్ ప్రాక్టీస్‌లో షమీ బాగా అలిసిపోతున్నాడని, తన రన్-అప్‌లను పూర్తి చేయడానికి ఇబ్బంది పడుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. అంతేకాకుండా చిన్న స్పెల్‌ల తర్వాత డగౌట్లకు తిరిగి వస్తున్నాడని, అందుకే ఇంగ్లండ్ టూర్‌కు అతడి ఎంపికయ్యేది అనుమానంగా మారిందని టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. షమీ స్దానంలో ప్రసిద్ద్ కృష్ణను సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశముంది.చదవండి: IPL 2025: ఆటగాళ్లను రప్పించండి.. ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఆదేశాలు? -
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. స్వింగ్ కింగ్‌కు పిలుపు? భారత జట్టు ఇదే?
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును మే 23న బీసీసీఐ ప్రకటించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు విడ్కోలు పలకడంతో కొత్త కెప్టెన్‌తో మెన్ ఇన్ బ్లూ ఇంగ్లండ్‌కు పయనం కానుంది.ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా జరగనుంది. దీంతో బలమైన టీమ్‌ను ఇంగ్లండ్‌కు పంపించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తోంది. ముఖ్యంగా పేస్ బౌలింగ్ విభాగంపై సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైట్ బాల్ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్‌కు పిలుపునివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. గత కొనేళ్ల నుంచి భారత టెస్టు జట్టులో ఎడమచేతి వాటం పేసర్ లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ఆ లోటు అర్ష్‌దీప్‌తో భర్తీ చేయాలని అగర్కాకర్ అండ్ కో యోచిస్తున్నట్లు వినికిడి. కాగా వన్డే, టీ20ల్లో భారత తరపున అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్.. టెస్టుల్లో మాత్రం ఇంకా డెబ్యూ చేయలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రెగ్యూలర్‌గా ఆడుతున్నప్పటికి టీమిండియా తరపున టెస్టుల్లో ఆడే అవకాశం మాత్రం సింగ్‌కు రాలేదు. తన కెరీర్లో ఇప్పటివరకు 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్.. 66 వికెట్లు పడగొట్టాడు. గత రంజీ సీజన్లో అతను రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. అదేవిధంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా 26 ఏళ్ల అర్ష్‌దీప్‌కు ఉంది. 2023లో కౌంటీ సీజన్లో కెంట్ తరపున సింగ్ ఆడాడు. ఒకవేళ అర్ష్‌దీప్ ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికైతే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లతో బంతిని పంచుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు ప్రసిద్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్ పేర్లను కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రోహిత్ శర్మ స్దానాన్ని తమిళనాడు బ్యాటర్ సాయిసుదర్శన్‌తో భర్తీ చేయనున్నట్లు సమాచారం.ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భారత జట్టు(అంచనా)కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: ప్లీజ్ కోహ్లి రిటైర్ అవ్వకు.. నీ అవసరం టీమిండియాకు ఉంది: రాయుడు -
ఇంగ్లండ్ టూర్‌కు ఆర్సీబీ కెప్టెన్.. కరుణ్, సాయి సుదర్శన్‌కు కూడా పిలుపు..?
ఐపీఎల్ 2025 ముగిశాక భారత క్రికెట్ జట్టు జూన్ మధ్యలో ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరుతుంది. ఈ పర్యటనలో టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ 35 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తుంది.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25, అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సెలెక్టర్లు మరో అవకాశం ఇస్తారని తెలుస్తుంది. ఇన్ ఫామ్ బ్యాటర్ కరుణ్ నాయర్, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ జట్టులో చోటు దక్కించుకోనున్నారని సమాచారం. ఐపీఎల్ 2025లో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్న గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్‌ను ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా ఎంపిక చేయనున్నారని తెలుస్తుంది. ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా సీఎస్కే యువ సంచలనం ఆయుశ్ మాత్రే పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.అశ్విన్ రిటైర్ కావడంతో అతని స్థానాన్ని కుల్దీప్ యాదవ్‌తో భర్తీ చేయనున్నారని సమాచారం. ఈ సిరీస్ కోసం అక్షర్ పటేల్ పేరు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. అలాగే మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పేరును కూడా సెలెక్టర్లు పక్కన పెట్టారని తెలుస్తుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సత్తా చాటుతున్న శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయాలా వద్దా అన్న అంశంపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ప్రధాన పేసర్లుగా బుమ్రా, షమీ ఎంపిక దాదాపుగా ఖరారైనప్పటికీ.. సేఫ్టీగా వీలైనంత ఎక్కువ మంది రిజర్వ్ పేసర్లను ఎంపిక చేయనున్నారని తెలుస్తుంది. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత సీనియర్ జట్టుతో పాటు భారత-ఏ జట్టును కూడా మే రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, భారత ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్ 2025లో బిజీగా ఉన్నారు. ఈ లీగ్‌లో ప్రదర్శనల ఆధారంగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికలు జరుగుతాయి. ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ఆటగాళ్లను భారత సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవచ్చు. ఫార్మాట్ వేరైనా ఆటగాళ్లలో కన్సిస్టెన్సీని గమనిస్తారు.ప్రస్తుతం ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగుతుంది. మొత్తం ఏడు జట్లు నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్‌ల కోసం ప్రధానంగా పోటీపడుతున్నాయి. ఏ జట్టుకు ఇప్పటివరకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కాలేదు. సీఎస్కే మినహా అన్ని జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో ఆర్సీబీ ముందుంది. ఆ జట్టు 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆతర్వాత ముంబై, గుజరాత్, ఢిల్లీ తలో 12 పాయింట్లతో వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ (11), లక్నో (10), కేకేఆర్ (9) ఆతర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రాజస్థాన్ (6), సన్‌రైజర్స్ (6), సీఎస్కే (4) 8, 9, 10 స్థానాల్లో ఉన్నాయి. -
బీసీసీఐ కీలక నిర్ణయం.. అభిషేక్ నాయర్, దిలీప్‌లపై వేటు!?
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాప్‌లో మార్పులు జరగనున్నాయా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ స్టాఫ్‌లో భాగమైన అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌పై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు దైనిక్ జాగరణ్ తమ కథనంలో పేర్కొంది.బ్యాటింగ్ కోచ్‌గా ఇప్పటికే సితాన్షు కోటక్ ఉండగా అభిషేక్ అవసరం లేదన్న భావనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 1-3 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో బ్యాటింగ్ యూనిట్ ఘోరంగా విఫలమైంది.ఈ క్రమంలోనే బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించిన నాయర్‌కు ఉద్వాసన పలకాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించకున్నట్లు దైనిక్ జాగరణ్ తెలిపింది. అదేవిధంగా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ స్దానంలో మరో సహాయక కోచ్ ర్యాన్ డస్కటే బాధ్యతలు నిర్వర్తించే అవకాశమున్నట్టు సమాచారం. అయితే బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ఎటవంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత గౌతమ్ గంభీర్ భారత కొత్త హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. కోచింగ్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్‌కు బీసీసీఐ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు తనతో కలిసి పనిచేసిన నాయర్, ర్యాన్ డస్కటే, మోర్నే మోర్కెల్‌లను సపోర్ట్ స్టాప్‌లోకి తీసుకువచ్చాడు. అయితే ఈ కోచింగ్ స్టాప్‌లో ఆధ్వర్యంలో భారత క్రికెట్ జట్టు వరుసగా ఘోర పరాభావాలు ఎదురయ్యాయి. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్, ఆస్ట్రేలియాతో బీజీటీని భారత్ కోల్పోయింది. దీంతో కోచింగ్ స్టాప్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవడంతో గంభీర్ అండ్ కో కాస్త ఉపశమనం పొందారు. కానీ బీసీసీఐ మాత్రం కోచింగ్ స్టాప్‌ను కుదించాలని పట్టుదలతో ఉంది.చదవండి: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?: షేన్ వాట్సన్ ఫైర్ -
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఈ ఏడాది జూన్ 20 నుంచి భారత జట్టు తమ ఇంగ్లండ్ టూర్‌ను ప్రారంభించనుంది.మొదటి టెస్ట్ మ్యాచ్ హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ మే మూడో వారంలో ప్రకటించనుంది. ఇక ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ టూర్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడని తొలుత వార్తలు వినిపించాయి.కానీ ఇప్పుడు రోహిత్ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా హిట్‌మ్యాన్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. రోహిత్ శర్మ ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ ఇంగ్లండ్ సిరీస్ గురించి మాట్లాడాడు."ఇంగ్లండ్ పర్యటనకు స్టార్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంద శాతం ఫిట్‌గా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మా ప్లేయర్లు అందరూ ఫిట్‌గా ఉంటే ఇంగ్లండ్‌లో కచ్చితంగా పై చేయి సాధిస్తాము. అయితే ఇంగ్లండ్ నుంచి కూడా మాకు గట్టి సవాలు ఎదురు కానుంది. సిరీస్ గెలిచేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాము" అని రోహిత్ పేర్కొన్నాడు. దీంతో ఇంగ్లండ్ సిరీస్‌లో రోహిత్ ఆడనున్నాడని అభిమానులు ఫిక్స్ అయిపోయారు -
టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ?
'డియర్ క్రికెట్.. నాకు ఒక్క చాన్స్ ఇవ్వు' మూడేళ్ల కిందట టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్ చేసిన ట్వీట్ ఇది. రంజీట్రోఫీకు కర్ణాటక జట్టులో తనకు చోటు దక్కకపోవడంతో భావోద్వేగానికి లోనైన కరణ్ మాటలవి. కోరుకున్నట్లే క్రికెట్ అతడికి మరో ఛాన్స్ ఇచ్చింది. కర్ణాటక నుంచి విదర్భకు మాకం మార్చిన కరణ్ నాయర్.. దేశీవాళీ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్నాడు. 2024-25 దేశవాళీ సీజన్లో అన్ని ఫార్మాట్లు కలిపి దాదాపు 2000 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఏకంగా 9 సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మూడేళ్ల తర్వాత ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున రీఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచానికి మరోసారి తన పేరును పరిచయం చేసుకున్నాడు.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్‌పై కేవలం 40 బంతుల్లోనే 89 పరుగులు చేసి ఔరా అన్పించాడు. వరల్డ్ క్లాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను సైతం నాయర్ ఊతికారేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికి తనలో ఏ మాత్రం జోరు తగ్గలేదని మరోసారి నాయర్ నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో కరుణ్ నాయర్ టీమిండియా రీఎంట్రీకి మార్గం సుగమైనట్లు తెలుస్తోంది.ఇంగ్లండ్ టూర్‌కు కరుణ్ నాయర్..ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు కరుణ్ నాయర్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌కు కంటే ముందు భారత-ఎ జట్టు అనాధికారిక టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. భారత-ఎ జట్టుకు నాయర్‌ను ఎంపిక చేసి ముందుగానే ఇంగ్లండ్‌కు పంపాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాడు. అక్కడ అతడి ప్రదర్శన ఆధారంగా సీనియర్ జట్టులో చోటు ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి."అర్హులైన ప్రతీ ప్లేయర్‌కు భారత జట్టులోకి తిరిగి వచ్చేందుకు తలుపులు తెరిచే ఉంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కరుణ్ నాయర్ విషయాన్ని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రస్తావించాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఇండియా ఎ టీమ్ అనాధికారిక టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లనుంది. ఇండియా ఎ జట్టులో నాయర్‌కు అవకాశం లభిస్తుంది. కరుణ్ అద్భుతమైన ఆటగాడనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత-ఎ జట్టు తరపున బాగా రాణిస్తే, సెలక్టర్లు ఖచ్చితంగా అతడి పేరును పరిగణలోకి తీసుకుంటారు" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో పేర్కొన్నారు.ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీకరుణ్ నాయర్ 2016 నవంబర్‌లో ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్ ఐదో టెస్టులో ఇంగ్లీష్ జట్టుపై నాయర్ అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ సాధించాడు. నాయర్ సూపర్ ఇన్నింగ్స్ ఫలితంగా భారత జట్టు 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ కొనసాగుతున్నాడు. -
టీమిండియాతో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్‌కు వరుస షాక్‌లు
టీమిండియాతో స్వదేశంలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ పేసర్ మార్క్ వుడ్ సేవలను కోల్పోయిన ఇంగ్లండ్.. తాజాగా మరో ఫాస్ట్ బౌలర్ ఈ జాబితాలో చేరాడు.ఓలీ స్టోన్ గాయం కారణంగా భారత్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ధ్రువీకరించింది. స్టోన్ ఇంగ్లండ్ తరపున ఇప్పటివరకు ఐదు టెస్టులు ఆడాడు. గత వేసవిలో ఇంగ్లండ్ జట్టులో రెగ్యూలర్‌గా స్టోన్ ఉన్నాడు. అయితే గత నెలలో అతడి కుడి మోకాలికి గాయమైంది.దీంతో రాబోయే 14 వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. ఈ ఏడాది ఆగస్టు నాటికి స్టోన్ కోలుకుంటాడని ఈసీబీ పేర్కొంది. కానీ భారత్-ఇంగ్లండ్ మధ్య సిరీస్ ఆగస్టు 4తో ముగియనుంది. మరోవైపు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫిట్నెస్ కూడా ఇంగ్లండ్ జట్టు మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. స్టోక్స్ ప్రస్తుతం తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. గతేడాది ఆఖరిలో తన గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఈ స్టార్ ఆల్ రౌండర్ వచ్చే నెలలో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఉండాల్సి ఉంది.కానీ తొలి రౌండ్ మ్యాచ్‌లకు స్టోక్స్ దూరం కానున్నాడని డర్హామ్ ప్రధాన కోచ్ ర్యాన్ కాంప్‌బెల్ వెల్లడించాడు. కనీసం భారత్‌తో సిరీస్ నాటికైనా అతడి ఫిట్నెస్ సాధించాలని ఇంగ్లండ్ అభిమానులు కోరుకుంటున్నారు.భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..తొలి టెస్టు – జూన్ 20 నుంచి జూన్ 24 వరకు – హెడింగ్లీరెండో టెస్టు – జూలై 2 నుంచి జూలై 6 వరకు – ఎడ్జ్బాస్టన్మూడో టెస్టు – జూలై 10 నుంచి జూలై 14 వరకు – లార్డ్స్నాలుగో టెస్టు – జూలై 24 నుంచి జూలై 27 వరకు – ఓల్డ్ ట్రాఫోర్డ్ఐదో టెస్టు – జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు – కెన్నింగ్టన్ ఓవల్చదవండి: అప్పట్లో పంజాబ్.. ఇప్పుడు సన్‌రైజర్స్: సెహ్వాగ్ ఘాటు విమర్శలు -
టీమిండియా కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్..!?
ఐపీఎల్-2025 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. పేలవ ఫామ్ కారణంగా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉండాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.రోహిత్ ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐ తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. అతడు ఇంకా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2025లో బుమ్రా ఆడేది అనుమానమే మారింది.బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరింత సమయం పట్టే అవకాశముంది. ఒకవేళ రోహిత్, బుమ్రా దూరమైతే.. ఇంగ్లండ్ పర్యటనలో భారత కెప్టెన్‌గా ఎవరు బాధ్యతలు చేపడాతరన్న ప్రశ్న అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న. ఈ క్రమంలో రోహిత్, బుమ్రా బ్యాకప్‌గా శుబ్‌మన్ గిల్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.కాగా గిల్ ప్రస్తుతం వన్డేల్లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అదేవిధంగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక భారత క్రికెట్ జట్టు ఏడాది జూన్ 20న ఇంగ్లాండ్ పర్యటనను ప్రారంభిస్తుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా జరుగనుంది.తదుపరి నాలుగు టెస్ట్‌లు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, కెన్నింగ్టన్ ఓవల్ వేదికలపై జరగనున్నాయి. అంతకంటే ముందు భారత-ఎ జట్టు రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఐపీఎల్-2025 చివరి వారంలో ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.చదవండి: సీఎస్కే బౌలర్ ‘ఓవరాక్షన్’.. ఇచ్చిపడేసిన కోహ్లి! నవ్వేసిన జడ్డూ -
రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఆ సిరీస్‌కు దూరం!
ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.రెడ్ బాల్ క్రికెట్లో పేలవ ఫామ్ కారణంగా ఈ సిరీస్‌కు దూరంగా ఉండాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రోహిత్ ఇప్పటికే బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం. అదేవిధంగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో విఫలమైన కోహ్లి మాత్రం ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడనున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌తో పాటు బీజీటీలోనూ దారుణ ప్రదర్శన కనబరిచాడు.ఆసీస్‌తో సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్ మ్యాన్.. తర్వాత రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చాడు. కానీ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. మూడు మ్యాచ్‌లలో అతను 6.20 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్‌గా కూడా రోహిత్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు నుంచి రోహిత్ శర్మ తనంతట తానే తప్పుకున్నాడు. ఆ మ్యాచ్ అనంతరం రోహిత్ టెస్టులకు విడ్కోలు పలకనున్నాడని ఊహగానాలు వినిపించాయి. కానీ రోహిత్ మాత్రం ఇప్పటిలో నకు రిటైరయ్యే ఉద్దేశ్యం లేదని పుకార్లకు చెక్ పెట్టాడు. కానీ ఇప్పుడు కొన్ని రోజుల పాటు టెస్టులకు దూరంగా ఉండాలని రోహిత్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ హిట్‌మ్యాన్ అందుబాటులేకపోతే జస్ప్రీత్ బుమ్రా జట్టు పగ్గాలను చేపట్టే అవకాశముంది. అయితే మరి కొన్ని రిపోర్ట్లు మాత్రం రోహిత్ ఇంగ్లండ్ సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నాడని పేర్కొంటున్నాయి. రోహిత్ ఆడుతాడా, తప్పుకుంటాడా అన్నది మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇక భారత క్రికెట్ జట్టు ఏడాది జూన్ 20న ఇంగ్లాండ్ పర్యటనను ప్రారంభిస్తుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా జరుగనుంది. తదుపరి నాలుగు టెస్ట్‌లు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, కెన్నింగ్టన్ ఓవల్ వేదికలపై జరగనున్నాయి. అంతకంటే ముందు భారత-ఎ జట్టు రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.చదవండి: IPL 2025: రియాన్ పరాగ్ చెత్త రికార్డు.. తొలి ప్లేయర్‌గా -
భారత్‌తో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్‌కు భారీ షాక్
స్వదేశంలో టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు గట్టిఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ గాయం కారణంగా భారత్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. వుడ్ ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వుడ్ ఎడమ మోకాలికి గాయమైంది. దీంతో మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి వుడ్ వైదొలిగాడు. అయితే అతడు కోలుకోవడానికి కనీసం నాలుగు నెలల సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే టీమిండియాతో సిరీస్‌కు వుడ్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సైతం ధ్రువీకరించాడు. అతడు త్వరలోనే తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. ఈ ఏడాది జూలై ఆఖరిలో తిరిగి అతడు జట్టులోకి వచ్చే అవకాశముంది.కాగా మార్క్ వుడ్ కూడా తన గాయంపై అప్డేట్ ఇచ్చాడు. "గత ఏడాది ఆరంభం నుంచి ఎటువంటి విరామం లేకుండా అన్నిఫార్మాట్లలో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాను. కానీ దురదృష్టవశాత్తూ మళ్లీ గాయ పడటం నిజంగా నాకు చాలా బాధగా ఉంది.అయితే వీలైనంత త్వరగా గాయం నుంచి కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను. నాకు మద్దతుగా నిలిచిన వైద్యులు, కోచింగ్ స్టాప్, ఇంగ్లండ్ క్రికెట్, నా సహచరులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని వుడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.ఇదేమి తొలిసారి కాదు..కాగా మార్క్ వుడ్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉండడం ఇదేమి తొలిసారి కాదు. అతడు తన కెరీర్ ఆరంభం నుంచి గాయాలతో సావాసం చేస్తున్నాడు. గతేడాది ఆరంభంలో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు కూడా వుడ్ గాయం కారణంగా దూరమయ్యాడు.2019లో కూడా అతడు తన మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడు అతడు గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో మరోసారి తన గాయానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఈ టెస్టు సిరీస్ జరగనుంది. జూన్‌లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: హార్దిక్ పాండ్యా కంటే అతడు ఎంతో బెటర్: పాక్ మాజీ కెప్టెన్ -
రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohitsharma) టెస్టు భవిష్యత్తు ప్రశ్నర్థకంగా మారింది. గతేడాదిగా టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాటింగ్ పరంగా రోహిత్ పూర్తిగా తేలిపోతున్నాడు. గతేడాది ఆఖరిలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు వైట్‌వాష్‌కు గురైంది.స్వదేశంలో ప్రత్యర్ధి చేతిలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ వైట్‌వాష్ కావడం ఇదే మొదటి సారి. ఆ తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ రోహిత్ తీరు మారలేదు. తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరమైన హిట్‌మ్యాన్.. ఆ తర్వాతి మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చాడు. తొలి టెస్టులో విజయం సాధించిన భారత్.. రోహిత్ వచ్చాక వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది.ఈ మూడు మ్యాచ్‌లలోనూ రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు. దీంతో ఆఖరి టెస్టుకు భారత కెప్టెన్ తనంతంట తనే జట్టు నుంచి తప్పుకున్నాడు. అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ పర్వాలేదన్పించాడు. తొలి వన్డేలో విఫలమైన ఈ ముంబైకర్.. ఆ తర్వాతి రెండో వన్డేలో మాత్రం విధ్వంసకర శతకంతో చెలరేగాడుఅయితే ఆ జోరును మూడో వన్డేలో కొనసాగించలేకపోయాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు రోహిత్ సిద్దమవుతున్నాడు. ఈ మెగా టోర్నీ తర్వాత శర్మ భవిష్యత్తుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. ఏదేమైనప్పటికి టెస్టుల్లో మాత్రం రోహిత్ కెరీర్ ముగిసినట్లేనని తాజా రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కెప్టెన్‌గా బుమ్రా..?ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు హిట్‌మ్యాన్‌ను ఎంపిక చేసే అవకాశం లేదని పిటిఐ తమ నివేదికలో పేర్కొంది. అతడి స్ధానంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprith Bumrah)కు జట్టు పగ్గాలను అప్పగించాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం.కాగా బుమ్రా ప్రస్తుతం గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం అతడు దూరమయ్యాడు. బుమ్రా తిరిగి ఐపీఎల్-2025తో తిరిగి మైదానంలో అడుగపెట్టే అవకాశముంది. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బుమ్రా రెండు పర్యాయాలు భారత జట్టుకు నాయకత్వం వహించాడు.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా సారథ్యంలోని భారత జట్టు 295 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. బుమ్రా మరోసారి సిడ్నీలో జరిగిన ఆఖరి టెస్టులో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఈ మ్యాచ్‌లో బుమ్రా గాయం కారణంగా మధ్యలోనే వైదొలగడంతో టీమిండియా ఓటమి చవిచూసింది.ఒకే ఒక హాఫ్ సెంచరీ..గత 15 టెస్టు ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 164 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. రోహిత్ గత 15 ఇన్నింగ్స్‌లో వరుసగా 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10 పరుగులు చేశాడు. చివరగా మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ ఏడాది 14 టెస్టులాడిన రోహిత్.. 26 ఇన్నింగ్స్‌లో 24.76 సగటుతో 619 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మరో రెండు హాఫ్ సెంచరీలున్నాయి.చదవండి: రోహిత్, కోహ్లితో పాటు అతడికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్ -
భారత్ ఆల్‌రౌండ్ షో.. మూడో వన్డేలో ఇంగ్లండ్ చిత్తు
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్(England)తో జరిగిన మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో భారత్(Teamindia) ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 355 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది.లక్ష్య చేధనలో ఓపెనర్లు ఫిల్ సాల్ట్(23), డకెట్(34) తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టామ్ బాంటన్(38) కూడా కాసేపు దూకుడగా ఆడాడు. కానీ సాల్ట్, బాంటన్ ఔటయ్యాక ఇంగ్లండ్ వికెట్ల పతనం మొదలైంది. వరుస క్రమంలో వికెట్ల కోల్పోయి ఇంగ్లీష్ జట్టు వైట్ వాష్‌కు గురైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సుందర్, కుల్దీప్ చెరో వికెట్ సాధించారు.శతక్కొట్టిన శుబ్‌మన్..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్ (102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 112) సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52), శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 78) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. మార్క్ వుడ్ రెండు, సకీబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, జో రూట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్, ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు రెండూ శుబ్‌మన్ గిల్‌కే దక్కాయి.ఛాంపియన్స్ ట్రోఫీకి సై..ఇక ఇంగ్లండ్‌ను స్వదేశంలో ఊడ్చేచిన భారత్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో కఠిన సవాలు ఎదురు కానుంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టు ఫిబ్రవరి 15న దుబాయ్‌కు పయనం కానుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్చదవండి: SA vs PAK: పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్.. సఫారీలు ఇచ్చిపడేశారుగా! వీడియో -
ఇంగ్లండ్‌కు ఊహించని షాక్.. అతడికి గాయం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ మెగా టోర్నీ ముంగిట ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్(Jos Butler) గాయపడ్డాడు. అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో బట్లర్ కుడి చేతి భుజానికి గాయమైంది.భారత ఇన్నింగ్స్ సందర్భంగా బంతిని ఆపే క్రమంలో జోస్ గాయపడ్డాడు. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు. అయితే నొప్పి తీవ్రంగా ఉండడంతో బట్లర్ మైదానాన్ని వీడాడు. అతడు తిరిగి మైదానంలోకి రాలేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టాండిన్ కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ వ్యవహరిస్తున్నాడు.అదేవిధంగా బట్లర్‌కు సబ్‌స్ట్యూట్‌గా రెహాన్ ఆహ్మద్ ఫీల్డ్‌లోకి వచ్చాడు. కాగా అద్బుతమైన ఫామ్‌లో ఉన్న బట్లర్ గాయపడటం నిజంగా ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే యువ ఆటగాడు జాకబ్ బెతల్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేది అనుమానంగా మారగా.. తాజాగా బట్లర్ గాయం ఇంగ్లండ్ టీమ్ మెనెజ్‌మెంట్‌ను ఆందోళన కలిగిస్తోంది.అయితే బట్లర్ గాయం తీవ్రతపై ఇంగ్లండ్ క్రికెట్ ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ సన్నహాకాల్లో భాగంగా భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ తలపడుతున్న సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో ఇంగ్లండ్ ఘోర పరాభావం చవిచూసింది.ఈ క్రమంలో ఆహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఇంగ్లీష్ జట్టు భావిస్తోంది. ఆఖరి మ్యాచ్‌లో కూడా భారత్ అదరగొడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.39 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 92 బంతుల్లో తన 7వ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 64 బంతులు ఎదుర్కొన్న గిల్.. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(78), విరాట్ కోహ్లి(52) హాఫ్ సెంచరీలతో రాణించారు.ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఇంగ్లండ్ జట్టు:జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బెన్ డకెట్, బ్రైడన్ కార్స్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, జో రూట్చదవండి: IND vs ENG: శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. తొలి భారత ప్లేయర్‌గా -
శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. తొలి భారత ప్లేయర్‌గా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మెగా టోర్నీ సన్నహాకాల్లో భాగంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో గిల్ దుమ్ములేపుతున్నాడు. తొలి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలతో సత్తాచాటిన గిల్.. ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో అద్బుతమైన శతకంతో మెరిశాడు.టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు గిల్ మరోసారి అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆదిలోనే ఔటైనప్పటికి గిల్ మాత్రం కోహ్లితో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో గిల్ 92 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో సాయంతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గిల్‌కు ఇది ఏడో వన్డే సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం 104 పరుగులతో గిల్ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన గిల్..వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 2,500 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత క్రికెటర్‌గా గిల్ నిలిచాడు. గిల్ కేవలం 50 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డును అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మిడిలార్డర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది.అయ్యర్ 59 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను సాధించాడు. తాజా మ్యాచ్‌తో అయ్యర్ అల్‌టైమ్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. అదే విధంగా 50వ వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. కాగా శుబ్‌మన్ గిల్ ఇప్పటివరకు 50 వన్డేలు ఆడి 60.83 సగటుతో 2535 పరుగులు చేశాడు. అతడి ఇననింగ్స్లలో 7 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ, 16 ఆర్ధశతకాలు ఉన్నాయి.- Look at Rohit Sharma's reaction - Look at the crowd's reaction "They all know how aesthetically pleasing Shubman Gill is..."🔥💯• The Most Talented Youngster Everpic.twitter.com/UUJS2Ot6Vw— Gillfied⁷ (@Was_gill) February 12, 2025వన్డేల్లో అత్యంతవేగంగా 2500 పరుగులు చేసిన భారత ప్లేయర్లు వీరే..శుబ్‌మన్ గిల్- 50 ఇన్నింగ్స్లుశ్రేయాస్ అయ్యర్- 59 ఇన్నింగ్స్లుశిఖర్ ధావన్ -59 ఇన్నింగ్స్లుకేఎల్ రాహుల్-63 ఇన్నింగ్స్లువిరాట్ కోహ్లీ/నవ్‌జోత్ సిద్ధూ- 64 ఇన్నింగ్స్లుచదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు -
IND vs ENG 3rd ODI: మూడో వన్డేలో భారత్ ఘన విజయం
IND vs ENG 3rd Odi Live Updates: భారత్ ఘన విజయం..అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయాన్ని అందుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు.. 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది.భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాచ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సుందర్, కుల్దీప్ చెరో వికెట్ సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో గాస్ అట్కినసన్(38), టామ్ బాంటన్(38) టాప్ స్కోరర్లగా నిలవగా.. డకెట్(34) మరోసారి దూకుడుగా ఆడాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది. శుబ్‌మన్ గిల్(112) శతక్కొట్టగా.. విరాట్ కోహ్లి(52), శ్రేయస్ అయ్యర్(78) అర్ధ శతకాలతో రాణించారు. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్‌రాహుల్ సైతం 29 బంతుల్లోనే 40 పరుగులతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్క్ వుడ్ రెండు, సకీబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, జో రూట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఓటమి దిశగా ఇంగ్లండ్..ఇంగ్లండ్ వరుస క్రమంలో మూడు వికెట్లను కోల్పోయింది. తొలుత హ్యారీ బ్రూక్‌ను హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆ తర్వాత లైమ్ లివింగ్ స్టోన్, అదిల్ రషీద్ పెవిలియన్‌కు చేరారు. 31 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 179/8ఇంగ్లండ్ ఐదో వికెట్ డౌన్..జోస్ బట్లర్ రూపంలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన బట్లర్.. హర్షిత్ రాణా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.ఇంగ్లండ్ నాలుగో వికెట్ డౌన్..జో రూట్ రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన రూట్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ జోస్ బట్లర్ వచ్చాడు. 22 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 137/4మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్టామ్ బాంటన్ రూపంలో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అతడు పెవిలియన్ చేరాడు. మొత్తం 41 బంతులు ఎదుర్కొని 38 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇంగ్లండ్ స్కోరు: 126/3 (18). రూట్ 20 పరుగులతో ఉండగా.. హ్యారీ బ్రూక్ క్రీజులోకి వచ్చాడు.నిలకడగా ఆడుతున్న రూట్, బాంటన్ఇంగ్లండ్ బ్యాటర్లు టామ్ బాంటన్(25), జో రూట్(9) నిలకడగా ఆడుతున్నారు. 14 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 102/2ఇంగ్లండ్ రెండో వికెట్ డౌన్.. సాల్ట్ ఔట్ఫిల్ సాల్ట్ రూపంలో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన సాల్ట్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి జో రూట్ వచ్చాడు. 10 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 84/2. ఇంగ్లండ్ తొలి వికెట్ డౌన్..60 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడిన బెన్ డకెట్(32).. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి టామ్ బాంటన్ వచ్చాడు.టీమిండియా భారీ స్కోరుఇంగ్లండ్తో మూడో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. శుబ్‌మన్ గిల్(112) శతక్కొట్టగా.. విరాట్ కోహ్లి(52), శ్రేయస్ అయ్యర్(78) అర్ధ శతకాలతో రాణించారు. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్‌రాహుల్ సైతం 29 బంతుల్లోనే 40 పరుగులతో మెరిశాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసి భారత్ ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్క్ వుడ్ రెండు, సకీబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, జో రూట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన హర్షిత్ రాణాటెయిలెండర్ హర్షిత్ రాణా రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అతడు పెవిలియన్ చేరాడు. 10 బంతుల్లో 13 పరుగులు చేసి నిష్క్రమించాడు. భారత్ స్కోరు: 353-8(49). అర్ష్‌దీప్ సింగ్ క్రీజులోకి వచ్చాడు.ఏడో వికెట్ డౌన్.. రాహుల్ నిష్క్రమణకేఎల్ రాహుల్ రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ పేసర్ సకీబ్ మహమూద్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్(ఎల్బీడబ్ల్యూ)గా రాహుల్.. 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. హర్షిత్ రాణా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 334-7(47).ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియాజో రూట్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టామ్ బాంటన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి రాగా.. కేఎల్ రాహుల్ 21 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 308-6(44). టీమిండియా ఐదో వికెట్ డౌన్.. పాండ్యా ఔట్టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన పాండ్యా.. అదిల్ రషీద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి అక్షర్ పటేల్ వచ్చాడు. 42 ఓవర్లకు భారత్ స్కోర్: 295/5అయ్యర్ ఔట్.. టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 78 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.క్రీజులోకి హార్దిక్ పాండ్యా వచ్చాడు. 40 ఓవర్లకు భారత్ స్కోర్: 275/4మూడో వికెట్ కోల్పోయిన టీమిండియాసెంచరీ వీరుడు శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో గిల్ బౌల్డ్ అయ్యాడు. 112 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. కేఎల్ రాహుల్ క్రీజులోకి రాగా.. శ్రేయస్ అయ్యర్ 52 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 227/3 (34.4) గిల్ సెంచరీ..అహ్మదాబాద్ వన్డేలో టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 92 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో సాయంతో గిల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గిల్‌కు ఇది ఏడో వన్డే సెంచరీ కావడం విశేషం. 31 ఓవర్లకు భారత్ స్కోర్: 213/2. క్రీజులో గిల్(104)తో పాటు శ్రేయస్ అయ్యర్(48) ఉన్నాడు.విరాట్ కోహ్లి ఔట్..విరాట్ కోహ్లి రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన కోహ్లి.. అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు.గిల్, కోహ్లి హాఫ్ సెంచరీలు..మూడో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి(51), గిల్(60) అదరగొడుతున్నారు. వీరిద్దరూ ఈ మ్యాచ్‌లో తమ హాఫ్ సెంచరీలను పూర్తి చేస్తున్నారు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 120/1నిలకడగా ఆడుతున్న కోహ్లి, గిల్..16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. కోహ్లి(41), గిల్(48) నిలకడగా ఆడుతున్నారు.10 ఓవర్లకు భారత్ స్కోర్: 52/110 ఓవర్లు ముగిసే టీమిండియా వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లి(17), శుబ్‌మన్ గిల్(28) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాకెప్టెన్ రోహిత్ శర్మ రూపంలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రెండో వన్డేల్లో విధ్వంసకర శతకం(119)తో చెలరేగిన రోహిత్.. తాజాగా ఒక్క పరుగుకే నిష్క్రమించాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కోహ్లి క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 8-1(2)అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డేలో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈమ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. జేమీ ఓవర్టన్ స్థానంలో టామ్ బాంటన్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు భారత్ మూడు మార్పులతో ఆడుతోంది. రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలకు విశ్రాంతి ఇవ్వగా.. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ ముగ్గురి స్థానంలో వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు.కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సూర్యకుమార్ సేన చేతిలో పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో 4-1తో ఓడిపోయిన బట్లర్ బృందం.. వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది.నాగ్‌పూర్, కటక్ వేదికలుగా జరిగిన తొలి రెండు వన్డేల్లో రోహిత్ సేన జయభేరి మోగించగా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 2-0తో ఓటమిపాలైంది. తాజాగా అహ్మదాబాద్ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. తుదిజట్లుటీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.ఇంగ్లండ్ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), టామ్ బాంటన్, లియామ్ లివింగ్‌స్టోన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సకీబ్ మహమూద్. -
ఇంగ్లండ్‌తో మూడో వన్డే.. భారీ రికార్డుకు చేరువలో రోహిత్
అహ్మదాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ (IND VS ENG 3rd ODI) మధ్య ఇవాళ (ఫిబ్రవరి 12) మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఓ భారీ మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. నేటి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో 13 పరుగులు చేస్తే, వన్డే క్రికెట్లో 11000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా.. నాలుగో భారతీయ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. వన్డే క్రికెట్లో ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ (18426), కుమార సంగక్కర (14232), విరాట్ కోహ్లి (13911), రికీ పాంటింగ్ (13704), సనత్ జయసూర్య (13430), మహేళ జయవర్దనే (12650), ఇంజమామ్ ఉల్ హక్ (11739), జాక్ కల్లిస్ (11579), సౌరవ్ గంగూలీ (11363) మాత్రమే 11000 పరుగుల మైలురాయిని దాటారు.విరాట్ తర్వాత అత్యంత వేగంగా..!నేటి మ్యాచ్‌లో రోహిత్ 11000 పరుగుల మైలురాయిని తాకితే.. విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం రోహిత్ 259 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 10987 పరుగులు చేశాడు. విరాట్.. 11000 పరుగుల మైలురాయిని తన 222వ ఇన్నింగ్స్‌లోనే అధిగమించాడు.సెంచరీ చేస్తే మరో రికార్డునేటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేస్తే సచిన్ టెండూల్కర్ (100), విరాట్ కోహ్లి (81) తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేసిన మూడో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 10వ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు సచిన్, విరాట్, పాంటింగ్ (71), సంగక్కర (63), కల్లిస్ (62), హాషిమ్ ఆమ్లా (55), జయవర్దనే (54), బ్రియాన్ లారా (53), జో రూట్ (52) మాత్రమే యాభై సెంచరీలు పూర్తి చేశారు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అంతకుముందు జరిగిన తొలి వన్డేలోనూ భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ కేవలం 76 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్‌కు వన్డేల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. -
కటక్ నుంచి అహ్మదాబాద్‌కు టీమిండియా క్రికెటర్ల పయనం (ఫొటోలు)
-
కోహ్లి ఫామ్‌లోకి వస్తే భారత్‌కు తిరుగులేదు..
ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్ట్ నుండి పేలవమైన ఫామ్ కారణంగా వైదొలిగిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ తర్వాత జరిగిన రంజీ ట్రోఫీ టోర్నమెంట్ లో కూడా ఆశించిన విధంగా రాణించలేక పోయాడు. ఈ నేపధ్యం లో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ముందు రోహిత్ మళ్ళీ ఫామ్ లోకి రావడం చాల ముఖ్యమైన విషయం.వరుసగా పది ఇన్నింగ్స్‌ల లో ( తొమ్మిది టెస్టులు, ఒక వన్డే) విఫలమైన రోహిత్ చివరికి ఆదివారం కటక్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో తన మునుపటి ఫామ్ ని ప్రదర్శించి సిక్సర్ల మోత మోగించాడు. రోహిత్ కటక్ ప్రేక్షకులను నిజంగా అలరించాడు, 12 ఫోర్లు మరియు 7 సిక్సర్లు తో వన్డేల్లో తన 32వ సెంచరీ సాధించి, భారత్ ఈ మూడు మ్యాచ్ ల సిరీస్ చేజిక్కించుకునేందుకు తన వంతు పాత్ర పోషించాడు. జట్టు రధ సారధి లాగా ముందుండి నడిపించాడు.ఈ సెంచరీతో, రోహిత్ 30 ఏళ్లు నిండిన క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన భారత క్రికెటర్ గా రికార్డ్ నమోదు చేసాడు. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ గతంలో 35 సెంచరీలు తో చేసిన రికార్డును రోహిత్ అధిగమించాడు. భారత్ తరపున ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన వారి లో రోహిత్ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్ అన్ని ఫార్మాట్లలో ఓపెనర్‌గా 15,404 పరుగులు సాధించాడు. గతంలో సచిన్ టెండూల్కర్ 15,335 పరుగులతో సాధించిన మరో రికార్డును కూడా రోహిత్ ఈ మ్యాచ్ తో అధిగమించాడు. వీరేంద్ర సెహ్వాగ్ 15,758 పరుగులతో ఈ జాబితా లో అగ్ర స్థానం లో ఉన్నాడు. "చాలా సంవత్సరాలుగా నేను క్రికెట్ ఆడుతున్నాను. నేను ఏమి చేయాలో నాకు తెల్సు. నా నుండి ఏమి అవసరమో నాకు అర్థమైంది. పిచ్ లోకి వెళ్లి నేను చేసింది అదే" అని రోహిత్ మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు.రోహిత్ మళ్ళీ ఫామ్ లోకి రావడంతో భారత్ జట్టు మానేజిమెంట్ కి పెద్ద తలనొప్పి తగ్గింది. ఇక మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా సెంచరి సాధించినట్టయితే ఛాంపియన్స్ ట్రోఫీ కి ముందు భారత్ బ్యాటింగ్ గాడి లో పడినట్టే. బ్యాటింగ్ స్థానం లో మార్పులుఅయితే భారత్ బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు పై పలువురు మాజీ ఆటగాళ్లు జట్టు మేనేజిమెంట్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ కంటే ముందుగా పంపడం పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. టాప్ ఆర్డర్ బ్యాటర్ అయిన రాహుల్ జట్టు అవసరాల అనుగుణంగా బ్యాటింగ్ స్థానాన్ని మార్చడం పై జట్టు మేనేజిమెంట్ పలు విమర్శలు ఎదుర్కొంటోంది."అక్షర్ పటేల్ మళ్ళీ కెఎల్ రాహుల్ కంటే ముందుగా బ్యాటింగ్ రావడమేమిటి? నాకు మాటలు కూడా రావడం లేదు. రాహుల్ లాంటి నైపుణ్యమైన బాట్స్మన్ ని ఆరో స్థానానికి నెట్టడం చాల దారుణం. అక్షర్‌ను రాహుల్ కన్నా ముందుగా బ్యాటింగ్ పంపడం. అదీ ఇలాంటి పిచ్ పై సరైన నిర్ణయం కాదు, అని భారత్ మాజీ ఆటగాడు దొడ్డ గణేష్ వ్యాఖ్యానించాడు. -
రో‘హిట్స్’... భారత్‌దే సిరీస్
చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత శిబిరానికి గొప్ప శుభవార్త! క్రికెట్‌ను శ్వాసించే అభిమానులకు కచ్చితంగా ఇది తీపి కబురు! ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్‌లోకి వచ్చాడు. అట్లాంటి... ఇట్లాంటి... ఆటతో కాదు. 300 పైచిలుకు పరుగుల వేటలో భారత్ ఉండగా... తనశైలి రో‘హిట్స్’తో అలరిస్తూ, లక్ష్యాన్ని కరిగిస్తూ, శతకంతో కదంతొక్కాడు. అతని జోరుకు మైదానం హోరెత్తింది. పెద్ద లక్ష్యమే అయినా చిన్నబోయింది. ఇంకో మ్యాచ్ ఉండగానే వన్డే సిరీస్ కూడా టీమిండియా వశమైంది.కటక్: భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వరుసగా రెండు, మూడు మ్యాచ్‌లు విఫలమైనా... తక్కువ స్కోరుకు అవుటైనా... విమర్శకులు ఈ మధ్య నెట్టింట తెగ విరుచుకుపడుతున్నారు. ఆదివారం ‘హిట్‌మ్యాన్’ విరుచుకుపడ్డాడు. నోటితో కాదు... బ్యాట్‌తో! నెట్లో కాదు... మైదానంలో! అద్భుతమైన సెంచరీతో కొండంత లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేదించేలా చేశాడు. దీంతో ఆఖరి పోరు మిగిలుండగానే వన్డే సిరీస్ కూడా భారత్ చేతికి చిక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (56 బంతుల్లో 65; 10 ఫోర్లు), జో రూట్ (72 బంతుల్లో 69; 6 ఫోర్లు), లివింగ్‌స్టోన్ (32 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. బ్యాట్ గర్జిస్తున్న వేళ భారత బౌలర్లంతా పరుగులు సమరి్పంచుకుంటే... రవీంద్ర జడేజా (10–1–35–3) మాత్రం పూర్తి కోటా వేసి వికెట్లు తీసి పరుగుల వేగాన్ని అడ్డుకున్నాడు. అనంతరం కఠినమైన లక్ష్యమే అయినా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ రోహిత్ (90 బంతుల్లో 119; 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) వీరోచిత శతకంతో భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (52 బంతుల్లో 60; 9 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇద్దరూ కెపె్టన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో దక్కించుకుంది. చివరిదైన మూడో వన్డే ఈనెల 12న అహ్మదాబాద్‌లో జరుగుతుంది. డకెట్, రూట్... ఫిఫ్టీ–ఫిఫ్టీ ఇంగ్లండ్ ఓపెనర్లు సాల్ట్ (26; 2 ఫోర్లు, 1 సిక్స్), డకెట్ దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించారు. డకెట్ 36 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. అతడు అవుటయ్యాక రూట్, హ్యారీ బ్రూక్ (31; 3 ఫోర్లు, 1సిక్స్) నింపాదిగా ఆడటంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆద్యంతం సాఫీగా సాగిపోయింది. రూట్ 60 బంతుల్లో తన వన్డే కెరీర్లో 56వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అనంతరం కెపె్టన్ బట్లర్ (34; 2 ఫోర్లు), లివింగ్‌స్టోన్ (32 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు సైతం పరుగులు సాధించడంతో ఇంగ్లండ్ 300 పైచిలుకు స్కోరు చేయగలిగింది. షమీ, రాణా, పాండ్యా, వరుణ్ తలా ఒక వికెట్ తీశారు. 76 బంతుల్లో శతకం ఎంతటి బ్యాటింగ్ పిచ్ అయినా... 305 పరుగుల లక్ష్యం వన్డేల్లో అంత ఈజీ కానేకాదు. చక్కని శుభారంభం... కడదాకా ఓర్పుగా, నేర్పుగా ఒక బ్యాటరైనా క్రీజులో నిలిస్తేనే గెలుపు ఆశలుంటాయి. సరిగ్గా నాయకుడు రోహిత్ కూడా ఇదే చేశాడు. ఓపెనింగ్‌లో గిల్‌తో జతగా మొదట లక్ష్యానికి అనువైన ఆరంభమిచ్చాడు. దీంతో 6.2 ఓవర్లలోనే భారత్ స్కోరు 50 దాటింది. భారీ షాట్లతో విరుచుకుపడిన ‘హిట్‌మ్యాన్’ 30 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, గిల్ 45బంతుల్లో పూర్తి చేశాడు. ఇద్దరి పట్టుదలతో 14వ ఓవర్లోనే జట్టు 100కు చేరుకుంది. తర్వాత గిల్ ని్రష్కమించినా, కోహ్లి (5) విఫలమైనా ... ఆ ప్రభావం ఇన్నింగ్స్‌పై పడకుండా అయ్యర్‌తో కలిసి ధాటిని కొనసాగిస్తూ టీమిండియాను లక్ష్యంవైపు నడిపించాడు. ఈ క్రమంలో 76 బంతుల్లో సెంచరీ సాధించాక భారీ షాట్‌కు యతి్నంచి అవుటయ్యాడు. అప్పుడు జట్టు స్కోరు 29.4 ఓవర్లలో 220/3. ఇక గెలిచేందుకు 125 బంతుల్లో 85 చేస్తే చాలు. ఈ పనిలో అక్షర్ పటేల్ (43 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు) అజేయంగా భాగమవడంతో 33 బంతులు మిగిలుండగానే భారత్ మ్యాచ్ నెగ్గింది.ఫ్లడ్‌లైట్లు మొరాయించడంతో... బారాబతి స్టేడియంలోని ఫ్లడ్‌లైట్లు మొరాయించడంతో ఆటకు అరగంటకు పైగానే అంతరాయం ఏర్పడింది. డేనైట్ వన్డేలు, టి20ల కోసం మైదానం చుట్టూరా... ఎనిమిది చోట్ల ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఒకదాంట్లో సమస్య వచ్చింది. భారీ లక్ష్యఛేదనకు దిగిన భారత్ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ధనాధన్ వేగంతో 48 పరుగులు చేసింది. ఈ సమయంలో క్లాక్ టవర్ వద్ద వున్న ఫ్లడ్‌లైట్లు ఆగిపోయాయి. దీంతో 35 నిమిషాల పాటు మ్యాచ్‌ను నిలిపేసి లైట్లు వెలిగాకే తిరిగి మ్యాచ్‌ను నిర్వహించారు.స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జడేజా (బి) వరుణ్ 26; డకెట్ (సి) పాండ్యా (బి) జడేజా 65; రూట్ (సి) కోహ్లి (బి) జడేజా 69; బ్రూక్ (సి) గిల్ (బి) రాణా 31; బట్లర్ (సి) గిల్ (బి) పాండ్యా 34; లివింగ్‌స్టోన్ (రనౌట్) 41; ఓవర్టన్ (సి) గిల్ (బి) జడేజా 6; అట్కిన్సన్ (సి) కోహ్లి (బి) షమీ 3; రషీద్ (రనౌట్) 14; మార్క్ వుడ్ (రనౌట్) 0; సఖిబ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 304. వికెట్ల పతనం: 1–81, 2–102, 3–168, 4–219, 5–248, 6–258, 7–272, 8–297, 9–304, 10–304. బౌలింగ్: షమీ 7.5–0–66–1, హర్షిత్ రాణా 9–0–62–1, పాండ్యా 7–0–53–1, వరుణ్ 10–0–54–1, జడేజా 10–1–35–3, అక్షర్ 6–0–32–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) లివింగ్‌స్టోన్ 119; గిల్ (బి) ఓవర్టన్ 60; కోహ్లి (సి) సాల్ట్ (బి) రషీద్ 5; అయ్యర్ (రనౌట్) 44; అక్షర్ పటేల్ (నాటౌట్) 41; కేఎల్ రాహుల్ (సి) సాల్ట్ (బి) ఓవర్టన్ 10; పాండ్యా (సి) ఓవర్టన్ (బి) అట్కిన్సన్ 10; జడేజా (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (44.3 ఓవర్లలో 6 వికెట్లకు) 308. వికెట్ల పతనం: 1–136, 2–150, 3–220, 4–258, 5–275, 6–286. బౌలింగ్: సఖిబ్ 6–0–36–0, అట్కిన్సన్ 7–0–65–1, మార్క్ వుడ్ 8–0–57–0, ఆదిల్ రషీద్ 10–0–78–1, ఓవర్టన్ 5–0– 27–2, లివింగ్‌స్టోన్ 7–0–29–1, రూట్ 1.3–0–15–0. -
IND Vs ENG: హిట్‌మ్యాన్ సూపర్ షో.. సిరీస్ టీమిండియా కైవసం
కటక్: ఇంగ్లండ్‌తో కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగి ఆడి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 44.3 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ వీరవిహారంతో టీమిండియా అవలీలగా విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌ను 2-0 తేడాతో ఇంకోమ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది టీమిండియా.హిట్‌మ్యాన్ సూపర్ షో..చాలాకాలం తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగిన రోహిత్.. సెంచరీతో మెరిశాడు. గత కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న హిట్ మ్యాన్.. తిరిగి సత్తా చాటాడు. తనపై వరుసగా వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాదానం చెప్పాడు రోహిత్. 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో తనదైన శైలిలో రెచ్చిపోయి శతకం పూర్తి చేసుకున్నాడు. సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశిషం. ఇది రోహిత్‌కు 18 నెలల తర్వాత వన్డేల్లో తొలి సెంచరీ. 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 పరుగులు చేశాడు రోహిత్. ఇది రోహిత్‌కు 32వ వన్డే శతకం.కోహ్లి విఫలం..శుభ్‌మన్ గిల్(60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి భారీ ాభాగస్వామ్యాన్ని నెలకొల్పాడు రోహిత్. ఈ జోడి తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత గిల్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి(5) మరోసారి విఫలమయ్యాడు. 8 బంతుల్లో ఒక ఫోర్ కొట్టిన అనంతరం కోహ్లి ెపెవిలియన్ బాట పట్టాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ాసాల్ట్ుకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు ివిరాట్.ఆకట్టుకున్న అయ్యర్కోహ్లి ఔటైన తర్వాత సెకండ్ డౌన్లోక్రీజ్లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. ఒకవైపు రోహిత్ దూకుడుగా ఆడుతుంటే అయ్యర్.. స్ట్రైక్‌రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడి 70 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ మూడో వికెట్‌గా ఔటయ్యాడు.లివింగ్ స్టోన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి రషీద్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో 220 పరుగుల వద్ద రోహిత్ రూపంలో టీమిండియా మూడో వికెట్ ను కోల్పోయింది. రోహిత్ ఔటైన స్వల్ప వ్యవధిలోనే అయ్యర్ సైతం పెవిలియన్ చేరాడు. 47 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 44 పరుగులు చేసిన అయ్యర్..రనౌట్ అయ్యాడు.నిరాశపరిచిన రాహుల్.. మెరిసిన అక్షర్ఫోర్త్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన కేఎల్ రాహుల్ మరోసారి నిరాశపరిచాడు. 14 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 10 పరుగులు చేసిన రాహుల్.. జెమీ ఓవర్టాన్ బౌలింగ్ లో సాల్ట్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ మాత్రం బ్యాటింగ్ లో మెరిశాడు. ఆడపా దడపా షాట్లుకొడుతూ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. 43 బంతుల్లో 4 ఫోర్లతో41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు అక్షర్.అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి ివికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపో నిలవలేదు. డకెట్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆఖరి ఓవర్ వరకూ లివింగ్‌స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసింది. ఇక నామమాత్రమైన మూడో వన్డే అహ్మదాబాద్‌లో బుధవారం జరుగనుంది. -
రెండో వన్డే: హిట్‌మ్యాన్ వీరవిహారం
కటక్: టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ వీరవిహారం చేశాడు. చాలాకాలం తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగిన రోహిత్.. సెంచరీతో మెరిశాడు. గత కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న హిట్ మ్యాన్.. తిరిగి సత్తా చాటాడు. తనపై వరుసగా వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాదానం చెప్పాడు రోహిత్. 76 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో తనదైన శైలిలో రెచ్చిపోయి శతకం పూర్తి చేసుకున్నాడు. సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశిషం. ఇది రోహిత్‌కు 18 నెలల తర్వాత వన్డేల్లో తొలిసారి సెంచరీ.కటక్‌లో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ నిర్దేశించిన 305 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఓపెనర్‌గా దిగిన రోహిత్,.. సొగసైన ఇన్నింగ్స్ ఆడాడు. శుభ్‌మన్ గిల్(60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత గిల్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి(5) మరోసారి విఫలమయ్యాడు. రోహిత్ సెంచరీ చేసే సమయానికి టీమిండియా ఇంకా 119 పరుగులు చేయాల్సింది ఉంది. రోహిత్‌కు జతగా శ్రేయస్ అయ్యార్ క్రీజ్‌లో ఉన్నాడు. ఇది రోహిత్‌కు 32వ వన్డే శతకం. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి ివికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపో ినిలవలేదు. డకెట్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆఖరి ఓవర్ వరకూ లివింగ్‌స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది. -
రెండో వన్డే: టీమిండియా టార్గెట్ 305
కటక్: బారాబతి స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపు నిలవలేదు. డకెట్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆపై ఆఖరి ఓవర్ వరకూ లివింగ్‌స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగుల గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.కాగా,తొలి వన్డేకు గాయం కారణంగా దూరమైన కోహ్లి.. పూర్తి ఫిట్నెస్ సాధించడంతో తిరిగి జట్టులోకి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌తో వరుణ్ చక్రవర్తి భారత తరపున వన్డే అరంగేట్రం చేశాడు. టీ20ల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో వరుణ్‌కు వన్డేల్లో కూడా అవకాశం దక్కింది. కోహ్లి, వరుణ్ రాకతో జైశ్వాల్,కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. మరోవైపు ఇంగ్లండ్ తమ జట్టులో మూడు మార్పులు చేసింది. గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. దీంతో జాకబ్ బెతల్, కార్స్, అర్చర్లకు ఇంగ్లండ్ మేనేెజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. -
ఇంగ్లండ్ రెండో వన్డే.. వరుణ్ చక్రవర్తి అరంగేట్రం! కోహ్లి వచ్చేశాడు
కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు రెండో వన్డేలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి చోటు దక్కింది.తొలి వన్డేకు గాయం కారణంగా దూరమైన కోహ్లి.. పూర్తి ఫిట్నెస్ సాధించడంతో తిరిగి జట్టులోకి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌తో వరుణ్ చక్రవర్తి భారత తరపున వన్డే అరంగేట్రం చేశాడు. టీ20ల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో వరుణ్‌కు వన్డేల్లో కూడా అవకాశం దక్కింది. కోహ్లి, వరుణ్ రాకతో జైశ్వాల్,కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.మరోవైపు ఇంగ్లండ్ తమ జట్టులో మూడు మార్పులు చేసింది. గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. దీంతో జాకబ్ బెతల్, కార్స్, అర్చర్లకు ఇంగ్లండ్ మెనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది.తుది జట్లుఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తిచదవండి: SL vs AUS: చరిత్ర సృష్టించిన స్మిత్.. ప్రపంచంలో తొలి ప్లేయర్‌గా -
ఇంగ్లండ్‌తో రెండో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు! కింగ్, సింగ్ ఎంట్రీ?
కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. తొలి వన్డేలో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. ఈ మ్యాచ్‌లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. కటక్ వన్డేలో ఎలాగైనా గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ వ్యూహాలు రచిస్తోంది.మరోవైపు ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని యోచిస్తోంది. 2006 నుంచి భారత గడ్డపై 31 సార్లు భారత్‌తో తలపడిన ఇంగ్లండ్ 5 మ్యాచ్‌లే గెలిచి మరో 25 మ్యాచ్‌ల్లో ఓటమిచవిచూసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.కింగ్ ఇన్.. జైశ్వాల్ ఔట్!మోకాలి గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli).. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతడు రెండో వన్డేలో ఆడనున్నాడు. ఈ విషయాన్ని భారత జట్టు వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సైతం ధ్రువీకరించాడు. ఈ క్రమంలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది.కటక్ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన జైశ్వాల్.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో అతడిని పక్కన పెట్టి యథావిధిగా గిల్‌ను ఓపెనర్‌గా పంపాలని జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. గిల్ స్దానంలో కోహ్లి బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది.మరోవైపు ఈ మ్యాచ్‌లో యువపేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్దం చేసేందుకు అర్ష్‌దీప్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించాలని మెనెజ్‌మెంట్ నిర్ణయించందంట. దీంతో మరో యువ పేసర్ హర్షిత్ రాణా బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.కటక్ వన్డేతో అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. కానీ పరుగులు మాత్రం భారీ సమర్పించుకున్నాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను ఆడించాలని గంభీర్ అండ్ కో భావిస్తే కేఎల్ రాహుల్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.రోహిత్ ఫామ్‌లోకి వస్తాడా?కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ అభిమానులను అందోళనకు గురిచేస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన రోహిత్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కూడా కూడా అదేతీరును కనబరుస్తున్నాడు. తొలి వన్డేలో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి హిట్‌మ్యాన్ ఔటయ్యాడు.ఈ క్రమంలో రోహిత్‌కు భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మద్దతుగా నిలిచాడు. రోహిత్ శర్మ అద్బుతమైన ఆటగాడని, అతడి ఫామ్‌పై మాకు ఎటువంటి ఆందోళన లేదని కోటక్ అన్నారు. అదేవిధంగా ఈ సిరీస్ కంటే ముందు శ్రీలంకపై వన్డేల్లో రోహిత్ మెరుగ్గా రాణించాడని, తిరిగి తన ఫామ్‌ను అందుకుంటాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ),శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్/ రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ),సాల్ట్, రూట్, బ్రూక్, బెన్ డకెట్, లివింగ్‌స్టోన్, బెతెల్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్.చదవండి: సిరీస్ విజయమే లక్ష్యంగా... -
శ్రేయాస్ జోరు మరి విరాట్ పరిస్థితి ఏమిటి?
ఇంగ్లండ్ తో గురువారం జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో నిజానికి భారత్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆడే పరిస్థితి లేదు. దానికి ముందు రోజు రాత్రి వరకు దీని పై స్పష్టత లేదు. శ్రేయాస్ అయ్యర్ ఏదో సినిమా చూస్తూ నిబ్బరముగా ఉన్నాడు. ఈ లోగా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఫోన్ వచ్చింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి గాయం కావడంతో అతను ఆడటం కష్టమని. అందువల్ల మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉండమని కోరాడు. దాంతో సినిమా ఆపేసి మ్యాచ్ కి ముందు విశ్రాంతి కోసం నిద్రకు ఉపక్రమించాడు శ్రేయాస్ అయ్యర్. "విరాట్ మోకాలి నొప్పి కారణంగా ఆడే అవకాశం లేనందున నువ్వు ఆడే అవసరం రావచ్చు అని కెప్టెన్ (రోహిత్ శర్మ) నుండి నాకు కాల్ వచ్చింది" అని అయ్యర్ స్వయంగా వెల్లడించాడు."నేను నా గదికి తిరిగి వెళ్లి వెంటనే నిద్ర పోయాను." గురువారం మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి అడుగు పెట్టే సమయానికి భారత్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో ఉంది. ఇంగ్లాండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్ మరియు సాకిబ్ మహమూద్ నిలకడగా బౌలింగ్ చేస్తూ భారత్ ని పరుగులు కొట్టకుండా నిల్వరిస్తున్నారు.ఆ దశలో రంగ ప్రవేశం చేసిన అయ్యర్ ఇంగ్లాండ్ బౌలర్ల సవాలును ఎదుర్కొన్నాడు. అయ్యర్ రెండు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో 36 బంతుల్లో 59 పరుగులు చేశాడు. తన అద్భుతమైన ఎదురుదాడి ఇన్నింగ్స్‌తో మ్యాచ్ ని మలుపు తిప్పాడు. ఫలితంగా భారత్ తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించగా, శ్రేయాస్ అయ్యర్ తన 19వ అర్ధ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్ లో మరో విషయం వెల్లడైంది. యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా వస్తే శుభ్‌మాన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ కి వస్తాడు. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉంటాడు. ఎడమచేతి వాటం అక్షర్ తదుపరి బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది, ఆట స్థితిని బట్టి కే ఎల్ రాహుల్ లేదా హార్దిక్ పాండ్యా తర్వాత బ్యాటింగ్ చేస్తారు. అయితే కోహ్లీ గాయం లేకపోతే అయ్యర్ కి స్తానం లేదా అన్నది ఇక్కడ ప్రధానాంశం. "కోహ్లీ ఫిట్ గా ఉంటే అయ్యర్ ఆడటం సాధ్యం కాదన్న విషయం గురుంచే నేను తదేకంగా ఆలోచిస్తున్నాను. 2023 ప్రపంచ కప్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 500 కి పైగా పరుగులు చేసిన తొలి భారత్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్.అటువంటి నైపుణ్యం ఉన్న బ్యాట్స్‌మన్ ని మీరెలా బెంచ్ మీద కూర్చో బెట్ట గలరు? అని భారత్ మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా జట్టు మేనేజ్మెంట్ పై విరుచుకు పడ్డాడు. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శ్రేయాస్ అయ్యర్ ని సమర్ధించాడు."శ్రేయస్ తన నైపుణ్యాన్ని ఇప్పటికే నిరూపించుకున్నాడు. అతను ప్రపంచ కప్‌లో పరుగుల ప్రవాహం సృష్టించాడు. ఒక ఆటగాడు ఇన్ని పరుగులు చేసినప్పుడు, అతనికి అవకాశాలు లభిస్తాయని భావించడంలో తప్పేం ఉంది. అతను అతని దృష్టిలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్. అందుకే దేవుడు కూడా అలాగే భావించాడు. అతను చేసిన 50 పరుగులు, మ్యాచ్ రూపురేఖలను మార్చాయి," అని హర్భజన్ అయ్యర్ పై ప్రశంసలు కురిపించాడు. -
రోహిత్ ప్రాక్టీస్ ఆపేయ్.. ఫస్ట్ ఆ పనిచేయు: భారత మాజీ క్రికెటర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ ఆటతీరు పేలవంగా మారిపోయింది. టెస్టులు, వన్డేల్లో హిట్‌మ్యాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో దారుణంగా విఫలమైన రోహిత్.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అదే తీరును కనబరుస్తున్నాడు.నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకప్పుడు షార్ట్ పిచ్ బంతులను అలోవకగా సిక్సర్లగా మలిచిన రోహిత్.. ఇప్పుడు అదే బంతులకు ఔట్ అవుతుండడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ తన ఫామ్‌ను అందుకోవాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు. ఈ క్రమంలో రోహిత్‌కు భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కీలక సూచనలు చేశాడు. రోహిత్ శర్మ తన రిథమ్‌ను తిరిగి పొందడానికి గతంలో తను ఆడిన వీడియోలు చూడాలని బంగర్ అభిప్రాయపడ్డాడు."రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. తన కెరీర్లో పరుగులు చేయని దశను అనుభవిస్తున్నాడు. అయితే అతడు తన ఫామ్‌ను తిరిగి అందుకోవడానికి ఎక్కువగా నెట్స్‌లో శ్రమిస్తున్నాడు. కానీ కొన్నిసార్లు ఎక్కువగా సాధన చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. అతడు ఒంటరిగా ఉండి బ్యాటర్‌గా తన గత విజయాలను గుర్తు చేసుకోవాలి. గతంలో తన బ్యాటింగ్ చేసిన వీడియోలను చూడాలి. ప్రస్తుతం ఎక్కడ తప్పు జరుగుతుందో గుర్తించి సరిదిద్దుకోవాలి. కొన్ని సార్లు ఇలా చేయడం ఫలితాన్ని ఇస్తోంది. ఒక్కసారి రిథమ్‌ను అందుకొంటే చాలు. అంతేకానీ ఎక్కువగా ఆలోచించి నిరాశలో కూరుకుపోకూడదు" అని బంగర్ పేర్కొన్నాడు. కాగా కటక్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా రోహిత్ తన బ్యాట్‌కు పనిచేబుతాడో లేదో చూడాలి. కాగా ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అందుబాటులో ఉండనున్నాడు. గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన కోహ్లి.. ఇప్పుడు తన ఫిట్నెస్ను తిరిగిపొందాడు . ఈ విషయాన్ని భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ధ్రువీకరించాడు. కింగ్ ఎంట్రీతో యశస్వి జైశ్వాల్‌పై వేటు పడే ఛాన్స్ ఉంది. రెండో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్చదవండి: SL vs AUS: సూపర్ మేన్ స్మిత్.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్! వీడియో వైరల్ -
పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు! వీడియో వైరల్
కటక్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఆదివారం(ఫిబ్రవరి 9) మధ్యహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి వన్డేలో పర్యాటక ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే కటక్‌కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో నిలబడాలని ఇంగ్లండ్ భావిస్తోంది.జగన్నాథుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు..ఈ క్రమంలో భారత క్రికెటర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ పూరి జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. పోలీసులు భారీ భద్రత మధ్య భారత క్రికెటర్లను ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన వీరికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.రోహిత్ ఫామ్‌ను అందుకుంటాడా?ఇక ఇది ఇలా ఉండగా.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబరిచిన రోహిత్.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కూడా అదే తీరును కనబరిచాడు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో హిట్‌మ్యాన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకప్పుడు షార్ట్ పిచ్ బంతులను అలోవకగా సిక్సర్లగా మలిచిన రోహిత్.. ఇప్పుడు అదే బంతులకు తన వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. కనీసం రెండో వన్డేతోనైనా రోహిత్ తన ఫామ్‌లను అందుకోవాలని భావిస్తున్నారు.విరాట్ కోహ్లి ఇన్..!ఇక తొలి వన్డేకు గాయం కారంణంగా దూరమైన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తిరిగి తన ఫిట్నెస్ను సాధించాడు. దీంతో అతడు రెండో వన్డేలో జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నాడు. కింగ్ కోహ్లి జట్టులోకి వస్తే.. ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌పై వేటు పడే అవకాశముంది.నాగ్‌పూర్ వన్డేతో అరంగేట్రం చేసిన జైశ్వాల్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండో వన్డేలో భారత ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ డౌన్లో కోహ్లి బ్యాటింగ్‌కు రానున్నాడు.చదవండి: నాయకుడే ఇలా ఉంటే ఎలా?: రోహిత్‌పై కపిల్ దేవ్ వ్యాఖ్యలు Odisha: Indian cricket team players visited the Jagannath Temple in Puri to seek blessings pic.twitter.com/fXtNjbJSuP— IANS (@ians_india) February 8, 2025 -
శుబ్‌మన్ గిల్ కాదు.. ఫ్యూచర్ టీమిండియా కెప్టెన్ అతడే?!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం భారత క్రికెట్ జట్టు తమ సన్నాహాకాలను ప్రారంభించింది. ఈ మెగా టోర్నీ ప్రిపేరేషన్‌లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడుతోంది. ఇప్పటికే తొలి వన్డేలో పర్యాటక ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. మిగిలిన రెండు వన్డేలకు సిద్దమవుతోంది.ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఫిబ్రవరి 15న రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని భారత జట్టు దుబాయ్ పయనం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీమిండియా.. యూఏఈ లేదా బంగ్లాదేశ్‌తో వామాప్ మ్యాచ్ ఆడనుంది. కాగా ఈ మెగా ఈవెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన పటిష్టమైన జట్టును అజిత్ అగర్కార్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే వెన్ను గాయంతో బాధపడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటుపై మాత్రం ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.కెప్టెన్‌గా హార్దిక్..!ఇక ఇది ఇలా ఉండగా.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంలో భారత్ విఫలమైతే రోహిత్ శర్మ స్ధానంలో వన్డే కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ శర్మ డిప్యూటీగా స్టార్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) ఉన్నాడు. అయితే గిల్‌ను వైస్ కెప్టెన్‌గానే కొనసాగించి జట్టు పగ్గాలను మాత్రం హార్దిక్‌కు అప్పగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా గతేడాది వరకు టీ20ల్లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా కొనసాగాడు.రోహిత్ శర్మ గైర్హజారీలో చాలా మ్యాచ్‌ల్లో భారత కెప్టెన్‌గా పాండ్యా వ్యవహరించాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో కూడా రోహిత్ శర్మ డిప్యూటీగా ఈ బరోడా ఆల్‌రౌండర్ ఉన్నాడు. కానీ రోహిత్ శర్మ రిటైరయ్యాక భారత టీ20 కెప్టెన్‌గా హార్దిక్‌ను కాదని సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసి సెలక్షన్ కమిటీ అందరికి షాకిచ్చింది. అయితే సూర్య కెప్టెన్‌గా రాణిస్తున్నప్పటికి వ్యక్తిగత ప్రదర్శన పరంగా మాత్రం విఫలమవుతున్నాడు.రోహిత్ రిటైర్మెంట్..!కాగా ఈ మెగా టోర్నీ అనంతరం రోహిత్ శర్మ కూడా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తలపై రోహిత్ శర్మ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. "నా ప్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడటానికి ఇది సందర్భం కాదు. ప్రస్తుతం నా దృష్టి అంతా ఇంగ్లండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ పైనే ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం" అంటూ హిట్‌మ్యాన్ బదులిచ్చాడు. దీంతో రిటైర్మెంట్ పై క్లారిటీ ఇవ్వకుండా దాటవేసేలా రోహిత్ మాట్లాడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. రోహిత్ భవితవ్యం తేలాలంటే మరో నెల రోజులు అగాల్సిందే.చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు.. -
'శుబ్‌మన్ గిల్ కూడా అలాంటివాడే.. అతడికి తిరుగు లేదు'
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్(England)తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 249 పరుగుల లక్ష్య చేధనలో గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో మూడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన గిల్ తొలుత ఆచితూచి ఆడాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లను ఊతికారేశాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 96 బంతుల్లో 87 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్‌పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ ఒక అద్బుతమైన ఆటగాడని, చాలా కాలం పాటు భారత క్రికెట్ జట్టులో కొనసాగుతాడని మంజ్రేకర్ కొనియాడాడు."భారత క్రికెట్లో ఎక్కువ కాలం కొనసాగగల క్రికెటర్లకు మేము ఓ పదాన్ని ఉపయోగిస్తాం. ‘లంబీ రేస్ కా ఘోడా’(సుదీర్ఘ దూరం పరిగెత్తగల గుర్రం). శుబ్‌మన్ గిల్ కూడా అలాంటివాడే! అంటూ ఎక్స్‌లో మంజ్రేకర్ రాసుకొచ్చాడు.ఓపెనింగ్ స్లాట్ త్యాగం..కాగా ఈ మ్యాచ్‌లో అరంగేట్ర ఆటగాడు యశస్వి జైశ్వాల్ కోసం గిల్ తన ఓపెనింగ్ స్ధానాన్ని త్యాగం చేశాడు. విరాట్ కోహ్లి జట్టులో లేకపోవడంతో మూడో స్ధానంలో గిల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. తన బ్యాటింగ్ పొజిషేన్ అది కానప్పటికి గిల్ మాత్రం ప్రశాంతంగా ఉండి క్రీజులో ఇన్నింగ్స్‌ను ముందుకు నడ్పించాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఒకవేళ రెండో వన్డేకు విరాట్ కోహ్లి అందుబాటులోకి వస్తే.. గిల్ మళ్లీ ఓపెనర్‌గానే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.ఇక ఈ మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్‌పై గిల్ స్పందించాడు. "వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక నాపై ఎటువంటి ఒత్తిడి లేదు. నా బ్యాటింగ్‌లో కూడా ఎటువంటి మార్పు రాదు. కానీ మైదానంలో నా ఆలోచనలను రోహిత్ భాయ్‌కు షేర్ చేస్తాను. అదే విధంగా రోహిత్ ప్రణాళకలను కూడా నేను అడిగి తెలుసుకుంటాను.నా వ్యూహాలను కూడా అతడితో పంచుకుంటున్నాను. మ్యాచ్ గురించి ఏదైనా సలహా ఇవ్వాలనకుంటే, సంకోచించకుండా తనతో చెప్పమని రోహిత్ నాతో అన్నాడని" పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: కింగ్ వచ్చేస్తున్నాడు.. పాపం అతడు! ఒక్క మ్యాచ్‌కే వేటు -
కింగ్ వచ్చేస్తున్నాడు.. పాపం అతడు! ఒక్క మ్యాచ్‌కే వేటు
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్(England)తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli).. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. తొలి వన్డేకు ముందు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కోహ్లి కూడి కాలి మోకాలికి గాయమైంది.దీంతో నాగ్‌పూర్ వన్డేకు అతడు దూరంగా ఉన్నాడు. అయితే కోహ్లి ఇప్పుడు గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు సమాచారం. దీంతో ఫిబ్రవరి 8న కటక్ వేదికగా జరగనున్న రెండో వన్డేకు అందుబాటులో ఉండనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. "బుధవారం ప్రాక్టీస్ సందర్భంగా విరాట్ కోహ్లి కుడి కాలి మోకాలికి బంతి తాకింది. అయినప్పటికి అతడు తన ప్రాక్టీస్‌ను కొనసాగించాడు. ప్రాక్టీస్ సమయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. కానీ శిక్షణ తర్వాత హూటల్‌కు వెళ్లాక అతడి మోకాలిలో వాపు కన్పించింది. దీంతో ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతిని ఇచ్చాము. విరాట్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. అతడు కటక్ వన్డేలో ఆడే అవకాశం ఉందని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.అదేవిధంగా కోహ్లి గాయంపై టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సైతం అప్డేట్ ఇచ్చాడు. "విరాట్ భాయ్ గాయంపై ఎటువంటి ఆందోళన అవసరం లేదు. మా తర్వాతి గేమ్‌కు అతడు కచ్చితంగా అందుబాటులో ఉంటాడని" తొలి వన్డే అనంతరం గిల్ పేర్కొన్నాడు.జైశ్వాల్‌పై వేటు..ఇక విరాట్ కోహ్లి రెండో వన్డేకు అందుబాటులోకి వస్తే యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్‌పై వేటు పడే అవకాశముంది. నాగ్‌పూర్ వన్డేతో అరంగేట్రం చేసిన జైశూ.. కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో అతడిని పక్కన పెట్టి శుబ్‌మన్ గిల్‌ను యథావిధిగా ఓపెనర్‌గా పంపాలని టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా మూడు, నాలుగు స్ధానాల్లో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది.సచిన్ రికార్డుకు చేరువలో కోహ్లి..ఇక ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లికి ఓ ప్రపంచరికార్డు ఊరిస్తోంది. కటక్ వన్డేలో కోహ్లి మరో 96 రన్స్ చేస్తే.. అత్యంతవేగంగా వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 350వ వన్డే ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌పై ఈ ఫీట్‌ను అందుకున్నాడు. కోహ్లి విషయానికి వస్తే.. 283 వన్డే ఇన్నింగ్స్‌లలో 58.18 సగటుతో 13906 పరుగులు చేశాడు.చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు.. -
శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు..
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సత్తాచాటాడు. ఆరు నెలల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన అయ్యర్.. తన మెరుపు హాఫ్ సెంచరీతో అందరిని ఆకట్టుకున్నాడు. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే యశస్వి జైశ్వాల్(15), రోహిత్ శర్మ(2) వికెట్లను కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అయ్యర్ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శుబ్‌మన్ గిల్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో అయ్యర్ 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 36 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్.. 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59 పరుగులు చేసి ఔటయ్యాడు.అయ్యర్ అరుదైన ఫీట్..కాగా ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే క్రికెట్లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి 50 కంటే ఎక్కువ సగటు, 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో వెయ్యికి పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా అయ్యర్ రికార్డులకెక్కాడు.ఇప్పటివరకు వరల్డ్ క్రికెట్లో నాలుగో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఎవరూ ఈ ఫీట్ సాధించలేదు. కానీ వేరే పొజిషేన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి మాత్రం ఈ రికార్డును పలువురు సాధించారు. దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ క్వింటన్ డికాక్ ఓపెనర్‌గా, శుబ్‌మన్ గిల్(రెండో స్ధానం), ఏబీ డివిలియర్స్(ఐదో స్ధానం) ఈ ఘనతను సాధించారు.ఇంగ్లండ్ చిత్తు..ఇక ఈ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను భారత్ చిత్తు చేసింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 6 వికెట్లు కోల్పోయి కేవలం 38.4 ఓవర్లలోనే అందుకుంది. భారత బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్(87), శ్రేయస్ అయ్యర్(59), అక్షర్ పటేల్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహుమూద్, అదిల్ రషీద్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు), జాకబ్ బెతెల్ (64 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా...ఫిల్ సాల్ట్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డకెట్(32) దాటిగా ఆడారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా తలా మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే కటక్ వేదికగా ఫిబ్రవరి 9న జరగనుంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. తొలి భారత ప్లేయర్‌గా -
చాలా సంతోషంగా ఉంది.. వారి వల్లే గెలిచాము: రోహిత్ శర్మ
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా(Teamindia) అద్భుతమైన విజయంతో ఆరంభించింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్(England)ను భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 4 ఫోర్లతో 52), జాకోబ్ బెతెల్(64 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ సాధించారు.గిల్, అయ్యర్ మెరుపులు..అనంతరం 249 పరుగుల లక్ష్యాన్ని భారత్ 6 వికెట్లు కోల్పోయి కేవలం 38.4 ఓవర్లలోనే అందుకుంది. భారత బ్యాటర్లలో భ్‌మన్ గిల్(96 బంతుల్లో 14 ఫోర్లతో 87 ), అక్షర్ పటేల్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52 ) శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు.ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ(2),యశస్వి జైస్వాల్(15) వికెట్లను భారత్ కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్.. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. గిల్ ఓవైపు ఆచితూచి ఆడినప్పటికి.. అయ్యర్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శ్రేయస్ ఔటైన తర్వాత గిల్ కూడా తన బ్యాట్‌కు పనిచెప్పాడు. అతడితో పాటు బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన అక్షర్ పటేల్ సైతం దూకుడుగా ఆడాడు. ఆఖరిలో రవీంద్ర జడేజా(12),హార్దిక్ పాండ్యా(9) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) స్పందించాడు. ఈ మ్యాచ్‌లో తమ కుర్రాళ్ల ప్రదర్శనపై హిట్‌మ్యాన్ సంతోషం వ్యక్తం చేశాడు."తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మేము ఈ ఫార్మాట్లో ఆడాము. వీలైనంత త్వరగా తిరిగి రీగ్రూప్ అయ్యి విజయం కోసం ఏమి చేయాలన్నదానిపై దృష్టి పెట్టాలనుకున్నాము. మా అంచనాలకు తగ్గట్టుగానే ఈ మ్యాచ్‌లో మేము రాణించాము. అయితే ఇంగ్లండ్ ఓపెనర్లు ఆరంభంలో దూకుడుగా ఆడి మాపై ఒత్తిడి పెంచారు. కానీ మా బౌలర్లు అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఇది సుదీర్ఘమైన ఫార్మాట్. ఈ ఫార్మాట్లో తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతీ మ్యాచ్‌లోనూ మలుపులు ఉంటాయి. అంతేతప్ప మ్యాచ్ మన చేతి నుంచి చేజారిపోయిందని కాదు. తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చే స్కిల్స్ మన వద్ద ఉండాలి. ఈ క్రెడిట్ మొత్తం మా బౌలర్లకే దక్కుతుంది. నిజంగా వారి వల్లే తిరిగి గేమ్‌లోకి వచ్చాము. మిడిలార్డర్లో లెఫ్ట్ హ్యాండర్ ఉండాలని భావించాము. అందుకే అక్షర్ పటేల్‌కు తుది జట్టులో ఛాన్స్ ఇచ్చాము.అక్షర్ పటేల్ బ్యాట్‌తో ఏమి చేయగలడో మనందరికి తెలిసిందే. అతడు తానెంటో మరోసారి నిరూపించాడు. శ్రేయస్ అయ్యర్ సైతం అద్భుతంగా ఆడాడు. గిల్, అయ్యర్ నెలకొల్పిన భాగస్వామ్యం చాలా కీలకంగా మారింది. ఛాపింయన్స్ ట్రోఫీ ముందు మాకు ఎటువంటి ప్రత్యేక ప్రణాళికలు లేవు. అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించి ముందుకు వెళ్లాలి అనుకుంటున్నామని" పోస్ట్ మ్యాచ్ప్రెజెంటేషన్లో రోహిత్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. తొలి భారత ప్లేయర్‌గా -
చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. తొలి భారత ప్లేయర్‌గా
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 6 వికెట్లు కోల్పోయి కేవలం 38.4 ఓవర్లలోనే అందుకుంది. భారత బ్యాటర్లలో భ్‌మన్ గిల్(96 బంతుల్లో 14 ఫోర్లతో 87 ), అక్షర్ పటేల్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52 ) శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్, రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. బెతల్, అర్చర్ చెరో వికెట్‌ను సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది.కెప్టెన్ జోస్ బట్లర్ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు), జాకబ్ బెతెల్ (64 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా...ఫిల్ సాల్ట్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డకెట్(32) దూకుడగా ఆడారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరితో పాటు షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు.చరిత్ర సృష్టించిన రాణా..ఇక ఈ మ్యాచ్‌తో భారత తరపున వన్డే అరంగేట్రం చేసిన యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana) పర్వాలేదన్పించాడు. అయితే తన మొదటి మూడు ఓవర్లలో మాత్రం రాణా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రాణాను ఇంగ్లీష్ జట్టు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ ఊతికారేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఐదువ ఓవర్ వేసిన రాణా.. ఏకంగా 26 పరుగులు ఇచ్చాడు.కానీ ఆ తర్వాత మాత్రం ఈ కేకేఆర్ స్పీడ్ స్టార్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు బెన్ డకెట్, హ్యారీ బ్రూక్‌లను ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపి తిరిగి భారత్‌ను గేమ్‌లోకి తీసుకొచ్చాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన రాణా.. 53 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో రాణా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో అరంగేట్రంలోనే మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన తొలి భారత ప్లేయర్‌గా రాణా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాలేదు. కాగా రాణా తన టీ20 అరంగేట్రం కూడా ఇంగ్లండ్‌పైనే చేశాడు. పుణే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో రాణా మూడు వికెట్లతో సత్తాచాటాడు. అంతకుముందు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రాణా 48 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రాణా ఓ చెత్త రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే అరంగేట్రంలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి భారత బౌలర్‌గా రాణా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రాణా ఒకే ఓవర్లో ఏకంగా 26 పరుగులిచ్చాడు.చదవండి: శుబ్‌మన్, శ్రేయస్ సత్తా చాటగా... -
IND VS ENG 1st ODI: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
టీమిండియా (Team India) లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అంతర్జాతీయ క్రికెట్లో ఓ అరుదైన మైలురాయిని తాకాడు. నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో (England) జరుగుతున్న తొలి వన్డేలో మూడు వికెట్లు తీసిన జడేజా.. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. జడ్డూకు ముందు అనిల్ కుంబ్లే (953), రవిచంద్రన్ అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) మాత్రమే 600 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టారు. భారత్ తరఫున 600 వికెట్లు పడగొట్టిన తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జడేజానే.ఏకైక భారత స్పిన్నర్ఈ ఘనత సాధించిన అనంతరం జడేజా మరో భారీ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. తాజా ప్రదర్శనతో జడ్డూ.. ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక వికెట్లు (43) సాధించిన బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ పేరిట ఉండేది. ఆండర్సన్ భారత్‌తో జరిగిన వన్డేల్లో 40 వికెట్లు తీశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు (198 మ్యాచ్‌ల్లో 223 వికెట్లు) తీసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల జాబితాలో జడ్డూ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో లంక దిగ్గజం సనత్ జయసూర్య (445 మ్యాచ్‌ల్లో 323 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ (247 మ్యాచ్‌ల్లో 317), డేనియల్ వెటోరీ (295 మ్యాచ్‌ల్లో 305) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 248 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టారు. షమీ, అక్షర్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (52), జేకబ్ బేతెల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్లు బెన్ డకెట్ (32), ఫిలిప్ సాల్ట్ (43) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రూట్ 19, బ్రూక్ 0, లివింగ్‌స్టోన్ 5, కార్స్ 10, ఆదిల్ రషీద్ 8, సాకిబ్ మహమూద్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. -
జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్.. ఇంగ్లండ్ బ్యాటర్‌కు మైండ్ బ్లాంక్! వీడియో
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా అరంగేట్ర ఆటగాడు యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) సంచలన క్యాచ్‌తో మెరిశాడు. జైశూ అద్బుతమైన క్యాచ్‌తో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన హర్షిత్ రాణా.. మూడో బంతిని బెన్ డకెట్‌కు షార్ట్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. డకెట్ పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.కానీ షాట్ మిస్టైమ్ కావడంతో బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని షార్ట్ మిడ్ వికెట్ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో మిడ్ వికెట్లో ఉన్న జైశ్వాల్ పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇక జైశ్వాల్ క్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరూ బిత్తర పోయారు.వెంటనే సహచర ఆటగాళ్లు అతడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. సూపర్ క్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. జైశ్వాల్‌తో పాటు హర్షిత్ రాణా వన్డేల్లో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి కూడి మోకాలికి గాయమైంది.తుది జట్లు..ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్‌కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్చదవండి: IND vs ENG1st Odi: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. భారత్‌కు భారీ షాక్YASHASVI JAISWAL TAKES A BLINDER ON DEBUT. 🤯- Harshit Rana has 2 early wickets. pic.twitter.com/GxnVvxDOta— Mufaddal Vohra (@mufaddal_vohra) February 6, 2025 -
ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. భారత్‌కు భారీ షాక్
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్(England)తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli) మెకాలి గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో కోహ్లికి గాయమైనట్లు టాస్ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.నిజంగా భారత్‌కు ఇది గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఛాంపియన్స్ ట్రోఫీ సన్నహాకాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌తో కోహ్లి తన ఫామ్‌ను అందుకుంటాడని అంతా భావించారు. కానీ గాయం కారణంగా విరాట్‌కే బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.అతడి స్దానంలో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ వన్డేల్లో భారత తరపున అరంగేట్రం చేశాడు. జైశ్వాల్‌తో పాటు యువ పేసర్ హర్షిత్ రాణా వన్డేల్లోకి అడుగుపెట్టాడు. మహ్మద్ షమీతో పాటు కొత్త బంతిని రాణా పంచుకోనున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.సచిన్ రికార్డుపై కన్ను..కాగా విరాట్ కోహ్లి.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ వరల్డ్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. కోహ్లి మరో 96 రన్స్ చేస్తే.. అత్యంతవేగంగా వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 350వ వన్డే ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌పై ఈ ఫీట్‌ను అందుకున్నాడు. కోహ్లి విషయానికి వస్తే.. 283 వన్డే ఇన్నింగ్స్‌లలో 58.18 సగటుతో 13906 పరుగులు చేశాడు. ఒకవేళ నాగ్‌పూర్ వన్డేలో కోహ్లి ఆడి ఉంటే సచిన్ రికార్డు బద్దులయ్యే అవకాశముండేంది.తుది జట్లు..ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్‌కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్చదవండి: Ind vs Eng 1st ODI: కోహ్లి దూరం.. జైస్వాల్‌తో పాటు అతడి అరంగేట్రం