‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’గా సిరాజ్‌ | Mohammed Siraj bags ICC Player of the Month | Sakshi
Sakshi News home page

‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’గా సిరాజ్‌

Sep 15 2025 2:24 PM | Updated on Sep 16 2025 5:16 AM

Mohammed Siraj bags ICC Player of the Month

ఇంగ్లండ్‌తో గత నెలలో ఓవల్‌లో జరిగిన ఐదో టెస్టులో విశేషంగా రాణించిన భారత పేస్‌ బౌలర్, హైదరాబాద్‌ క్రికెటర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌... అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’గా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్‌తో ఆగస్టులో జరిగిన చివరి టెస్టులో సిరాజ్‌ తొమ్మిది వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఆఖరి టెస్టులో గెలిచిన భారత్‌ ఐదు టెస్టుల సిరీస్‌ను 2–2తో సమంగా ముగించింది. ‘ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా ఎంపిక కావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. అండర్సన్‌–టెండూల్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌ నా కెరీర్‌లో చిరస్మరణీయమైనది. 

హోరాహోరీగా జరిగిన ఆ సిరీస్‌లో నేనూ భాగస్వామి కావడం ఆనందంగా ఉంది’ అని సిరాజ్‌ వ్యాఖ్యానించాడు. 2021లో ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’ అవార్డులను ప్రారంభించింది. ఇప్పటి వరకు భారత్‌ నుంచి రిషభ్‌ పంత్‌ (2021–జనవరి), రవిచంద్రన్‌ అశి్వన్‌ (2021–ఫిబ్రవరి), భువనేశ్వర్‌ కుమార్‌ (2021–మార్చి), శ్రేయస్‌ అయ్యర్‌ (2022–ఫిబ్రవరి; 2025–మార్చి), విరాట్‌ కోహ్లి (2022–అక్టోబర్‌), శుబ్‌మన్‌ గిల్‌ (2023–జనవరి;2023–సెపె్టంబర్‌; 2025–ఫిబ్రవరి, 2025–జూలై), యశస్వి జైస్వాల్‌ (2024–ఫిబ్రవరి), జస్‌ప్రీత్‌ బుమ్రా (2024–జూన్‌; 2024–డిసెంబర్‌) ఈ అవార్డులు గెల్చుకున్నారు.   
చదవండి: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement