ICC Player Of The Month
-
పాకిస్తాన్ క్రికెటర్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు..
పాకిస్తాన్ స్టార్ స్పిన్నర్ నోమన్ ఆలీకి తొలిసారి ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది. ఈ ఏడాది ఆక్టోబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను నోమన్ అలీకి ఈ అవార్డు దక్కింది. దాదాపు ఏడాది తర్వాత పాక్ టెస్టు జట్టులోకి తిరిగి వచ్చిన నోమన్.. గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. 2 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టి పాక్ జట్టుకు అద్బుతమైన సిరీస్ విజయాన్ని అందించాడు. బ్యాట్‌తో కూడా 78 పరుగులు చేశాడు.రబడాను వెనక్కి నెట్టి..కాగా ఈ అవార్డు కోసం నోమన్ అలీతో పాటు ప్రోటీస్ స్టార్ పేసర్ నోమన్ కగిసో, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్లు పోటీ పడ్డారు. . బంగ్లాదేశ్‌తో జరిగిన 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో రబాడ 14 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రబాడ నిలిచాడు. మరోవైపు భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సాంట్నర్ కూడా అదరగొట్టాడు. 92 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా భారత్‌ను కివీస్ వైట్‌వాష్ చేయడంలో సాంట్నర్ కీలక పాత్ర పోషించాడు. అయితే వీరిద్దిరికంటే నోమాన్ వ్యక్తిగత ప్రదర్శన పరంగా ముందుండడంతో ఈ ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు.చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్‌పై వేటు! అతడికి ఛాన్స్? -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..!
అక్టోబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (నవంబర్ 5) వెల్లడించింది. పురుషుల విభాగంలో పాక్ బౌలర్ నౌమన్ అలీ, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్, సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ ఈ అవార్డుకు నామినేట్ కాగా.. మహిళల విభాగంలో టీ20 వరల్డ్‌కప్ టాప్ పెర్ఫార్మర్లు అమేలియా కెర్ (న్యూజిలాండ్), డియాండ్రా డొట్టిన్ (వెస్టిండీస్), లారా వోల్వార్డ్ట్ (సౌతాఫ్రికా) నామినేట్ అయ్యారు.నౌమన్ అలీ: ఈ పాక్ వెటరన్ స్పిన్నర్ అక్టోబర్ నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నౌమన్ ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి 13.85 సగటున 20 వికెట్లు పడగొట్టాడు.కగిసో రబాడ: ఈ సౌతాఫ్రికన్ సీమర్ గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌లో వీర లెవెల్లో విజృంభించాడు. ఈ సిరీస్‌లో రబాడ టెస్ట్‌ల్లో 300 వికెట్ల మార్కును తాకాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రబాడ 14 వికెట్లు పడగొట్టి, ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకాడు. మిచెల్ సాంట్నర్: ఈ న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్టోబర్ నెలలో భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో శివాలెత్తిపోయాడు. పూణే టెస్ట్‌లో సాంట్నర్ పూనకం వచ్చినట్లు ఊగిపోయి ఏకంగా 13 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.డియాండ్రా డొట్టిన్: ఈ విండీస్ ఆల్‌రౌండర్ గత నెలలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఈ మెగా టోర్నీలో డొట్టిన్ స్కాట్లాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌పై విజయాల్లో కీలకపాత్ర పోషించింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో డొట్టిన్ నాలుగు వికెట్ల ప్రదర్శనతో పాటు కీలకమైన ఇన్నింగ్స్ (33 పరుగులు) ఆడినప్పటికీ.. విండీస్ ఓటమిపాలైంది.అమేలియా కెర్: ఈ న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గత నెలలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో కెర్ ముఖ్యపాత్ర పోషించింది. ఈ టోర్నీలో కెర్ 135 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది.లారా వోల్వార్డ్ట్: గత నెలలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాను ఫైనల్‌కు చేర్చడంలో లారా కీలకపాత్ర పోషించింది. ఈ మెగా టోర్నీలో లారా లీడింగ్ రన్ స్కోరర్‌గా (44.60 సగటున 223 పరుగులు) నిలిచింది. వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో లారా కీలక ఇన్నింగ్స్‌లు ఆడింది. -
చరిత్రపుటల్లోకెక్కిన కమిందు మెండిస్
శ్రీలంక రైజింగ్ స్టార్ కమిందు మెండిస్ చరిత్రపుటల్లోకెక్కాడు. సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు అందుకున్న కమిందు.. ఒకే క్యాలెండర్ ఇయర్లో రెండుసార్లు ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కమిందు ఈ ఏడాది మార్చిలో తొలిసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు అందుకున్నాడు.మహిళల విభాగానికి వస్తే సెప్టెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇంగ్లండ్‌కు చెందిన ట్యామీ బేమౌంట్ దక్కించుకుంది. బేమౌంట్‌కు కూడా ఇది రెండో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు. 2021 ఫిబ్రవరి ఆమె తొలిసారి ఈ అవార్డు దక్కించుకుంది. సెప్టెంబర్ నెలలో కమిందు టెస్ట్‌ల్లో సత్తా చాటగా.. బేమౌంట్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇరగదీసింది.కమిందు ఈ అవార్డు కోసం సహచరుడు ప్రభాత్ జయసూర్య, ఆసీస్ విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్ నుంచి పోటీ ఎదుర్కొనగా.. బేమౌంట్.. ఐర్లాండ్‌కు చెందిన ఏమీ మగూర్, యూఏఈకి చెందిన ఎషా ఓజా నుంచి పోటీ ఎదుర్కొంది. కమిందు సెప్టెంబర్ నెలలో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లపై నాలుగు టెస్ట్‌లు ఆడి 90.20 సగటున 451 పరుగులు చేయగా.. బేమౌంట్ ఐర్లాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో 279 పరుగులు చేసింది. ఇందులో ఓ భారీ సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. చదవండి: పాక్‌తో రెండో టెస్ట్.. ఇంగ్లండ్ కెప్టెన్ రీఎంట్రీ -
ఐసీసీ అవార్డులలో సత్తాచాటిన శ్రీలంక ప్లేయర్స్..
అంతర్జాతీయ క్రికెట్లో ప్రతీ నెలా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పురుష, మహిళ క్రికెటర్లకు 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్' అవార్డులను ఇస్తుంది. తాజాగా ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. ఈ అవార్డులలో శ్రీలంక ప్లేయర్స్ సత్తాచాటారు.పురుషుల, మహిళల విభాగాల్లో రెండు అవార్డులు కూడా శ్రీలంకకే దక్కడం గమనార్హం. మెన్స్ కేటగిరీలో లంక యువ స్పిన్ సంచలనం దునీత్ వెల్లలాగే, మహిళల క్రికెట్ విభాగంలో శ్రీలంక స్టార్ బ్యాటర్ హర్షిత సమరవిక్రమ ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు.అదరగొట్టిన దునీత్..గత నెలలో స్వదేశంలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వెల్లలాగే కీలక పాత్ర పోషించాడు. లంక సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో వెల్లలాగే కీలక పాత్ర పోషించాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వెల్లలాగే 133 పరుగులతో పాటు 7 వికెట్లు పడగొట్టాడు. అందులో ఓ ఫైవ్ వికెట్ హాల్ కూడా ఉంది. ఈ క్రమంలోనే అతడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. తద్వారా ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు అందుకున్న ఐదో లంక ఆటగాడిగా దునీత్ నిలిచాడు. ఈ జాబితాలో ఏంజెలో మాథ్యూస్ (మే 2022), ప్రబాత్ జయసూర్య (జూలై 2022), వనిందు హసరంగా (జూన్ 2023), కమిందు మెండిస్ (మార్చి 2024) ఉన్నారు. మరోవైపు లంక మహిళా క్రికెటర్ హర్షిత సమరవిక్రమ ఐర్లాండ్ పర్యటనలో అదరగొట్టింది.చదవండి: కోహ్లిని చూసి నేర్చుకో బాబర్.. లేకుంటే కష్టమే: యూనిస్ ఖాన్ -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..!
ఆగస్ట్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 5) ప్రకటించింది. పురుషుల విభాగంలో సౌతాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్, శ్రీలంక ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలగే అవార్డు రేసులో ఉండగా.. మహిళల విభాగంలో శ్రీలంకకు చెందిన హర్షిత సమరవిక్రమ, ఐర్లాండ్ ఆల్‌రౌండర్ ఓర్లా ప్రెండర్‌గాస్ట్, ఐర్లాండ్ ఓపెనర్ గాబీ లూయిస్ పోటీలో ఉన్నారు.కేశవ్ మహారాజ్: ఈ దక్షిణాఫ్రికా స్పిన్నర్ గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలో విశేషంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. మహారాజ్ ఈ రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.జేడెన్ సీల్స్: ఈ విండీస్ ఫాస్ట్ బౌలర్ గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 12 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్‌లో సీల్స్ ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. తద్వారా అతను ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి ఎగబాకాడు.దునిత్ వెల్లలగే: ఈ లంక ఆల్‌రౌండర్ గత నెలలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. వెల్లలగే తొలి వన్డేలో 67 నాటౌట్, రెండో వన్డేలో 39 మరియు రెండు వికెట్లు, మూడో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. -
సుందర్‌కు నిరాశ.. ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా అట్కిన్సన్
జులై నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 12) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్, మహిళల విభాగంలో శ్రీలంక బ్యాటర్ చమారీ ఆటపట్టు ఈ అవార్డులను గెలుచుకున్నారు. పరుషుల విభాగంలో అవార్డు కోసం అట్కిన్సన్కు టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. అంతిమంగా అవార్డు అట్కిన్సన్నే వరించింది. ఈ అవార్డు కోసం అట్కిన్సన్, సుందర్‌తో పాటు స్కాట్లాండ్ బౌలర్ చార్లీ కాస్సెల్ పోటీపడ్డాడు. మహిళల విభాగంలో చమారీతో పాటు టీమిండియా ప్లేయర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ అవార్డు రేసులో నిలిచారు. జులై నెలలో వివిధ ఫార్మాట్లలో ప్రదర్శన ఆధారంగా విజేతలను ఓటింగ్ ద్వారా నిర్ణయించారు.గస్ అట్కిన్సన్: 26 ఏళ్ల అట్కిన్సన్ జులై నెలలో స్వదేశంలో విండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అట్కిన్సన్ ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు.చార్లీ కాస్సెల్: 25 ఏళ్ల కాస్సెల్ స్కాట్లాండ్ తరఫున వన్డే అరంగేట్రంలో రికార్డు గణాంకాలు నమోదు చేశాడు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కాస్సెల్ 5.4 ఓవర్లలో 21 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. వన్డే అరంగేట్రంలో ఇవే అత్యుత్తమ గణాంకాలు.వాషింగ్టన్ సుందర్: జులైలో జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సుందర్ ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్ మూడో టీ20లో సుందర్ సూపర్ ఓవర్లో కేవలం రెండు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.చమారీ అటపట్టు: చమారీ జులైలో జరిగిన ఆసియా కప్‌లో 101.33 సగటున 204 పరుగులు చేసింది. ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంక భారత్‌పై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది.స్మృతి మంధన: మంధన జులైలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 149 పరుగులు చేసింది. ఆతర్వాత సౌతాఫ్రికాతోనే జరిగిన టీ20 సిరీస్‌లోనూ (47, 54 నాటౌట్) రాణించింది. ఆసియా కప్‌లోనూ స్మృతి రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటింది.షఫాలీ వర్మ: షఫాలీ జులై నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగింది. అనంతరం ఆసియా కప్‌లోనూ సత్తా చాటింది. షఫాలీ నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో 81 పరుగులు చేసింది. -
ఐసీసీ అవార్డుకు నామినేట్ అయిన టీమిండియా ప్లేయర్
టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. జులై నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మరో ఇద్దరితో కలిసి సుందర్ ఈ అవార్డు రేసులో నిలిచాడు. సుందర్‌తో పాటు ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్, స్కాట్లాండ్ బౌలర్ చార్లీ కాస్సెల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. మహిళల విభాగంలో శ్రీలంక కెప్టెన్ చమారీ ఆటపట్టు, టీమిండియా ప్లేయర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో నిలిచారు. వీరందరు జులై నెలలో వివిధ ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు.Presenting the nominees for the Men's and Women's ICC Player of the Month for July 2024.Whom would you cast your vote for? pic.twitter.com/nAqqtwOBok— CricTracker (@Cricketracker) August 5, 2024గస్ అట్కిన్సన్: 26 ఏళ్ల అట్కిన్సన్ జులై నెలలో స్వదేశంలో విండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అట్కిన్సన్ ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు.చార్లీ కాస్సెల్: 25 ఏళ్ల కాస్సెల్ స్కాట్లాండ్ తరఫున వన్డే అరంగేట్రంలో రికార్డు గణాంకాలు నమోదు చేశాడు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కాస్సెల్ 5.4 ఓవర్లలో 21 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. వన్డే అరంగేట్రంలో ఇవే అత్యుత్తమ గణాంకాలు.వాషింగ్టన్ సుందర్: జులైలో జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సుందర్ ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్ మూడో టీ20లో సుందర్ సూపర్ ఓవర్లో కేవలం రెండు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.చమారీ అటపట్టు: చమారీ జులైలో జరిగిన ఆసియా కప్‌లో 101.33 సగటున 204 పరుగులు చేసింది. ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంక భారత్‌పై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది.స్మృతి మంధన: మంధన జులైలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 149 పరుగులు చేసింది. ఆతర్వాత సౌతాఫ్రికాతోనే జరిగిన టీ20 సిరీస్‌లోనూ (47, 54 నాటౌట్) రాణించింది. ఆసియా కప్‌లోనూ స్మృతి రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటింది.షఫాలీ వర్మ: షఫాలీ జులై నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగింది. అనంతరం ఆసియా కప్‌లోనూ సత్తా చాటింది. షఫాలీ నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో 81 పరుగులు చేసింది. -
ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న విండీస్ స్పిన్నర్
విండీస్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అందుకున్నాడు. 2024 మే నెలకు గానూ మోటీని ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు కోసం మోటీతో పాటు పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ అఫ్రిది, ఐర్లాండ్ వికెట్‌కీపర్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్ పోటీపడ్డారు. ముగ్గురిలో మోటీకే అత్యధిక ఓట్లు రావడంతో ఐసీసీ అతన్ని ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ప్రకటించింది. మోటీ గడిచిన నెలలో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో మోటీ మూడు మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాను క్లీన్ స్వీప్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మరోవైపు షాహిన్ అఫ్రిది గడిచిన నెలలో జరిగిన ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో 14.5 సగటున 10 వికెట్లు (టీ20ల్లో) పడగొట్టాడు. లోర్కాన్ టక్కర్ విషయానికొస్తే.. ఈ ఐరిష్ బ్యాటర్ మే నెలలలో ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో 37.83 సగటున 227 పరుగులు చేశాడు. ఇందులో ఓ ఫిఫ్టి, నాలుగు 40 ప్లస్ స్కోర్లు ఉన్నాయి.మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ (మే) విషయానికొస్తే.. ఈ అవార్డు కోసం శ్రీలంక స్టార్ బ్యాటర్ చమారీ ఆటపట్టు, ఇంగ్లండ్ సోఫీ ఎక్లెస్టోన్, స్కాట్లాండ్ బౌలర్ కేథరీన్ బ్రైస్ పోటీపడగా.. మే నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గానూ చమారీనే ఈ అవార్డు వరించింది. చమారీ మే నెలలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 37.75 సగటున 151 పరుగులు చేసి బౌలింగ్‌లో ఆరు వికెట్లు పడగొట్టింది. -
ఐసీసీ అవార్డు గెలుచుకున్న శ్రీలంక సంచలన బ్యాటర్
2024, మార్చి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుల వివరాలను ఐసీసీ ఇవాళ (ఏప్రిల్ 8) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డును శ్రీలంక సంచలన బ్యాటర్ కమిందు మెండిస్ గెలుచుకోగా.. మహిళల విభాగంలో ఈ అవార్డు ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ మైయా బౌచియర్కు దక్కింది. పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం ఐర్లాండ్ పేసర్ మార్క్ అదైర్, న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ పోటీపడగా.. మెజార్టీ మద్దతు శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్‌కు లభించింది. Kamindu Mendis and Maia Bouchier have won the ICC Player of the Month awards for March 2024. 🌟 pic.twitter.com/h2QClz51SA — CricTracker (@Cricketracker) April 8, 2024 మహిళల విషయానికివస్తే.. ఈ విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్నర్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ పోటీ పడగా.. మైయా బౌచియర్ను అవార్డు వరించింది. మెండిస్ మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20, టెస్ట్ సిరీస్‌లో విశేషంగా రాణించాడు. టీ20ల్లో పర్వాలేదనిపించిన కమిందు.. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. కమిందు తన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 328 పరుగుల తేడాతో విజయం సాధించింది. మైయా బౌచియర్ మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో విశేషంగా రాణించింది. ఈ సిరీస్‌లో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచిన ఆమె 55.75 సగటున 223 పరుగులు చేసింది. నాలుగో టీ20లో బౌచియర్ చేసిన స్కోర్ (91) ఆమె కెరీర్లో అత్యుత్తమ స్కోర్‌గా నమోదైంది. ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ 4-1 తేడాతో గెలుచుకుంది. -
మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..!
2024, మార్చి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (ఏప్రిల్ 4) ప్రకటించింది. పురుషుల క్రికెట్లో ఈ అవార్డు కోసం ఐర్లాండ్ పేసర్ మార్క్ అదైర్, న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ, శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ పోటీపడనున్నారు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్నర్, ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ మైయా బౌచియర్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ ఈ అవార్డు రేసులో ఉన్నారు. మార్క్ అదైర్: మార్చి నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఆల్ ఫార్మాట్ సిరీస్‌లలో అదైర్ అద్భుతంగా రాణించాడు. తొలుత జరిగిన ఏకైక టెస్ట్‌లో 8 వికెట్లతో అదరగొట్టిన అదైర్.. ఆతర్వాత వన్డే సిరీస్‌లో 3 వికెట్లు, టీ20 సిరీస్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. కమిందు మెండిస్: ఈ శ్రీలంక ఆల్‌రౌండర్ మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20, టెస్ట్ సిరీస్‌లో విశేషంగా రాణించాడు. టీ20ల్లో పర్వాలేదనిపించిన కమిందు.. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. కమిందు తన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 328 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాట్ హెన్రీ: మార్చిలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో హెన్రీ ఆద్భుతంగా రాణించాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను న్యూజిలాండ్ 0-2 తేడాతో కోల్పోయినప్పటికీ హెన్రీ 17 వికెట్లతో సత్తా చాటాడు. ఈ సిరీస్‌లో బ్యాట్‌తోనూ పర్వాలేదనిపించిన హెన్రీ 25.25 సగటున 101 పరుగులు చేశాడు. ఆష్లే గార్డ్నర్: మార్చి నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గార్డ్నర్ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించింది. ఈ సిరీస్‌లో ఆమె 52 పరుగులు సహా ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును సైతం గెలుచుకుంది. ఈ సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. గార్డ్నర్ రికార్డు స్థాయిలో నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు గెలుచుకుంది. మైయా బౌచియర్: బౌచియర్ మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో విశేషంగా రాణించింది. ఈ సిరీస్‌లో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచిన ఆమె 55.75 సగటున 223 పరుగులు చేసింది. నాలుగో టీ20లో బౌచియర్ చేసిన స్కోర్ (91) ఆమె కెరీర్లో అత్యుత్తమ స్కోర్‌గా నమోదైంది. ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ 4-1 తేడాతో గెలుచుకుంది. అమేలియా కెర్: మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కెర్ ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో కెర్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 114 పరుగులు చేసి ఆరు వికెట్లు పడగొట్టింది. -
ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..
2024 ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (మార్చి 4) వెల్లడించింది. టీమిండియా యంగ్ గన్ యశస్వి జైస్వాల్, న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక గత నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌గా ఎంపికయ్యారు. ఫిబ్రవరి నెలలో వీరి ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుని ఐసీసీ వీరి పేర్లను ప్రకటించింది. యశస్వి గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ల్లో 112 సగటున 560 పరుగులు చేశాడు. ఇందులో వరుస డబుల్ సెంచరీలు ఉన్నాయి. కేన్ మామ ఫిబ్రవరిలో ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో (సౌతాఫ్రికాతో) వరుస సెంచరీల సాయంతో 403 పరుగులు చేశాడు. నిస్సంక విషయానికొస్తే.. ఈ లంక ఓపెనర్ గత నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడిన 3 వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ, ఓ సెంచరీ సాయంతో 350కిపైగా పరుగులు చేశాడు. మహిళల విభాగంలో యూఏఈకి చెందిన కవిష ఎగోడగే, ఈషా ఓజా, ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్‌ల్యాండ్ ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్‌గా ఎంపికయ్యారు. ఈ ముగ్గురు ఆల్‌రౌండర్లు గత నెలలో జరిగిన మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించారు. స్వతంత్ర ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఓటింగ్ పద్దతిన విజేతలను నిర్ణయిస్తారు. విజేతల పేర్లను వచ్చే వారం ప్రకటిస్తారు. icc-cricket.com/awardsలో పేర్లు నమోదు చేసుకున్న అభిమానులు శనివారం వరకు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. -
ఐసీసీ అవార్డు రేసులో పేస్ బౌలింగ్ సంచలనం
2024 జనవరి మాసం ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు నామినీస్ వివరాలను ఐసీసీ ప్రకటించింది. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల పేర్లను ఐసీసీ వెల్లడించింది. పురుషుల క్రికెట్‌కు సంబంధించి ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్, ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్, విండీస్ సంచలన బౌలర్ షమార్ జోసఫ్ రేసులో ఉండగా.. మహిళల క్రికెట్లో అమీ హంటర్(ఐర్లాండ్), బెత్ మూనీ(ఆస్ట్రేలియా), అలీసా హేలీ(ఆస్ట్రేలియా) నామినేషన్ దక్కించుకున్నారు. ఓటింగ్ పద్దతిన విజేతను నిర్ణయిస్తారు. ఈ ప్రదర్శనల కారణంగానే నామినేషన్ దక్కింది.. షమార్ జోసఫ్: జనవరి నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విండీస్ యువ పేసర్ షమార్, తన తొలి పర్యటనలోనే సంచలన ప్రదర్శనలు నమోదు చేసి అవార్డు రేసులో నిలిచాడు. ఈ పర్యటనలో ఆసీస్ బ్యాటర్లను గడగడలాడించిన షమార్ రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. గబ్బా టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో షమార్ విశ్వరూపం (7-68) ప్రదర్శించడంతో పర్యాటక విండీస్ 30 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. జోష్ హాజిల్‌వుడ్: జనవరి నెలలో విండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో హాజిల్‌వుడ్ సైతం విజృంభించాడు. ఈ సిరీస్‌లో అతను రెండు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. ఈ ప్రదర్శనలతో పాటు హాజిల్‌వుడ్ జనవరిలో మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు. ఓలీ పోప్: ఈ ఇంగ్లీష్ బ్యాటర్ జనవరిలో ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కారణంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. గత నెలలో టీమిండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో (హైదరాబాద్ టెస్ట్) పోప్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 196 పరుగులు చేసి ఇంగ్లండ్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. -
2023లో సాధించాల్సినవన్నీ సాధించిన పాట్ కమిన్స్.. తాజాగా..!
ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ గతేడాది (2023) క్రికెట్లో సాధించాల్సిన ఘనతలన్నీ సాధించాడు. ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా నిలబెట్టిన కమిన్స్.. ఆతర్వాత ఇంగ్లండ్‌పై యాషెస్ సిరీస్ విజయం, వన్డే వరల్డ్‌కప్ విక్టరీ, ఐపీఎల్ 2024 వేలంలో 20.25 కోట్ల రికార్డు ధర, బాక్సింగ్ డే టెస్ట్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, టెస్ట్‌ల్లో హ్యాట్రిక్ ఐదు వికెట్ల ఘనత.. ఇలా ఫార్మాట్లకతీతంగా గతేడాది అన్ని ఘనతలను సాధించాడు. తాజాగా కమిన్స్ 2023 డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా దక్కించుకుని గతేడాది అత్యధిక సక్సెస్ సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. డిసెంబర్ నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం బంగ్లాదేశ్ ఆటగాడు తైజుల్ ఇస్లాం, కివీస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ పోటీ పడినప్పటికీ అంతిమంగా అవార్డు కమిన్స్‌నే వరించింది. కమిన్స్ డిసెంబర్లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నిప్పులు చెరిగాడు. మెల్బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అతను ఏకంగా 10 వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు తైజుల్ ఇస్లాం, గ్లెన్ ఫిలిప్స్ సైతం గత నెలలో అద్భుతంగా రాణించారు. తైజుల్ న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 6 వికెట్ల ప్రదర్శనతో రాణించి, బంగ్లాకు చారిత్రక విజయాన్ని అందించాడు. ఇదే సిరీస్‌లో కివీస్ మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ సైతం అద్భుతంగా ఆడాడు. బౌలింగ్‌లో 5 వికెట్ల ఘనతతో పాటు బ్యాటింగ్‌లో 87 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మహిళల విభాగంలో దీప్తి శర్మ.. మహిళల విషయానికొస్తే డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను వరించింది. ఈ అవార్డు కోసం మరో టీమిండియా ప్లేయర్ జెమీమా రోడ్రిగెజ్, జింబాబ్వే బౌలర్ ప్రీసియస్ మరంగే పోటీపడ్డారు. -
ICC: ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో ఆసీస్ కెప్టెన్..
డిసెంబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ లిస్ట్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్, బంగ్లాదేశ్ పేసర్ తైజుల్ ఇస్లాం ఉన్నారు. వీరిముగ్గురూ డిసెంబర్ నెలలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. ప్యాట్ కమ్మిన్స్ విషయానికి వస్తే.. స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కమ్మిన్స్ నిప్పులు చేరిగాడు. మెల్బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఏకంగా 10 వికెట్లతో కమ్మిన్స్ సత్తాచాటాడు. అదేవిధంగా న్యూజిలాండ్‌తో డిసెంబర్లో జరిగిన టెస్టు సిరీస్‌లో బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం నిప్పులు చేరిగాడు. తొలి టెస్టులో 6 వికెట్లు తీసి బంగ్లాకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. అదే సిరీస్‌లో కివీస్ మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్‌లో 5 వికెట్లతో సత్తాచాటిన అనంతరం బ్యాటింగ్‌లో కూడా 87 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ముగ్గురిలో అవార్డు ఎవరికి వరిస్తుందో వేచి చూడాలి. ఇక మహిళల విభాగంలో భారత భారత క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ నిలిచారు. వీరిద్దరితో పాటు జింబాబ్వే బౌలర్ ప్రీసియస్ మరంగే తొలిసారి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు బరిలో నిలిచింది. చదవండి: AUS vs PAK: 'అతడు ఓపెనర్‌గా వస్తే.. లారా 400 పరుగుల రికార్డు బద్దలవ్వాల్సిందే' -
CWC 2023: డికాక్, బుమ్రాలను కాదని రచిన్‌కే దక్కింది..!
2023 అక్టోబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును న్యూజిలాండ్ రైజింగ్ స్టార్ రచిన్ రవీంద్ర దక్కించుకున్నాడు. ఈ అవార్డు కోసం క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా), జస్ప్రీత్ బుమ్రా (భారత్) పోటీపడినప్పటికీ చివరికి రచిన్‌నే వరించింది. అక్టోబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను రచిన్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రచిన్ బ్యాట్‌తో పాటు బంతిలోనూ చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీల సాయంతో 565 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అలాగే 7 వికెట్లు కూడా పడగొట్టాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసిన రచిన్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ వరల్డ్‌కప్ రికార్డును బద్దలు కొట్టాడు. వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో 25 ఏళ్ల వయసులోపు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రచిన్ (565).. సచిన్ రికార్డును (523) తుడిచిపెట్టాడు. లంకతో జరిగిన మ్యాచ్‌లో రచిన్ రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. మొత్తానికి ఈ వరల్డ్‌కప్ రచిన్‌కు కలగా మిగిలిపోనుంది. కాగా, శ్రీలంకపై విజయంతో న్యూజిలాండ్ సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఏదో ఊహించని అద్భుతం జరిగితే తప్ప కివీస్ సెమీస్ చేరుకుండా ఉండదు. ఈ నెల 15న ముంబైలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరిగే అవకాశం ఉంది. 16న కోల్‌కతాలో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ ఖరారైపోయింది. -
శుభ్‌మన్ గిల్‌కు ఐసీసీ అవార్డు.. తొలి భారత ఆటగాడిగా రికార్డు
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. 2023 సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను గిల్‌కు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు గెలవడం ద్వారా గిల్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రెండు సార్లు దక్కించుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఏడాది జనవరిలో గిల్ తొలిసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ అవార్డును గిల్ ఒకే ఏడాది రెండుసార్లు సాధించడం విశేషం. కాగా, ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అత్యధిక సార్లు దక్కించుకున్న ఘనత పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు దక్కుతుంది. బాబర్ ఇప్పటివరకు ఈ అవార్డును మూడుసార్లు గెలుచుకున్నాడు. బాబర్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు రెండ్రెండు సార్లు ఈ అవార్డును దక్కించుకున్నారు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 2021 జులైలొ తొలిసారి, ఈ ఏడాది మార్చిలో రెండోసారి ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ 2022 డిసెంబర్లో తొలిసారి, 2023 ఫిబ్రవరిలో రెండోసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. భారత్ నుంచి ఈ అవార్డును రిషబ్ పంత్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి ఒక్కోసారి గెలుచుకున్నారు. 2021 జనవరి నుంచి ఐసీసీ ఈ అవార్డులను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ అవార్డులను తొలి మూడు నెలలు (పంత్, అశ్విన్, భువీ) భారత ఆటగాళ్లే దక్కించుకోవడం విశేషం. ఇదిలా ఉంటే, ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీమ్ ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా హవా కొనసాగింది. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ విజయాల నేపథ్యంలో భారత్ వన్డే ర్యాంకింగ్స్‌లో మెరుగైన రేటింగ్ పాయింట్లు సాధించింది. -
ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డుకు నామినేట్ అయిన టీమిండియా స్టార్లు
2023 సెప్టెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు, ఓ ఇంగ్లండ్ ప్లేయర్ నామినేట్ అయ్యారు. సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన శుభ్‌మన్ గిల్, మొహమ్మద్ సిరాజ్, డేవిడ్ మలాన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు బరిలో నిలిచారు. గత నెలలో సూపర్ ఫామ్‌లో ఉండిన గిల్ 80 సగటున 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీల సాయంతో 480 పరుగులు చేశాడు. ఆసియా కప్‌లో 2 హాఫ్ సెంచరీలు, బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన గిల్ టీమిండియా ఆసియా కప్ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. అనంతరం అదే ఫామ్‌ను ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు కూడా కొనసాగించిన గిల్.. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 74, రెండో వన్డేలో 104 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. సిరాజ్ విషయానికొస్తే.. ఈ హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ కూడా గత నెలలో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై నిప్పులు చెరిగిన సిరాజ్ ఏకంగా 6 వికెట్లు సాధించి, వన్డే ర్యాంకింగ్స్‌లో సైతం ఒక్కసారిగా భారీ జంప్ కొట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ప్రదర్శనతో పాటు సెప్టెంబర్ మొత్తంలో అద్భుతంగా రాణించిన సిరాజ్ 17.27 సగటున 11 వికెట్లు పడగొట్టాడు. మలాన్ విషయానికొస్తే.. ఓపెనర్‌గా కొత్త అవతారమెత్తిన మలాన్ ఈ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి పరుగుల వరద పారిస్తున్నారు. గత నెల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో వరుసగా 54, 96, 127 పరుగులు చేసిన మలాన్ 105.72 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించి, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. -
చెన్నై సూపర్ కింగ్స్‌కు దెబ్బ మీద దెబ్బ.. మరో స్టార్ ప్లేయర్ ఔట్
ఐపీఎల్ 2023 సీజన్లో ఫోర్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాల కారణంగా ఇప్పటికే దీపక్ చాహర్, సిమ్రన్‌జీత్ సింగ్, బెన్ స్టోక్స్, ముకేశ్ చౌదరీ సేవలు కోల్పోయిన (తాత్కాలికంగా) ఆ జట్టుకు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. నిన్న (ఏప్రిల్ 12) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టార్ పేసర్, సఫారీ భారీ కాయుడు సిసండ మగాలా ఫీల్డింగ్ చేస్తూ కుడి చేతి వేలికి దెబ్బ తగిలించుకున్నాడు. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో అతను మరో రెండు వారాలు లీగ్‌కు దూరంగా ఉంటాడని జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు. అసలే అంతంత మాత్రంగా ఉన్న సీఎస్కే పేస్ విభాగం.. మగాలా సేవలు కూడా కోల్పోవడంతో దిక్కుతోచని స్థితికి చేరింది. ఆ జట్టుకు పేస్ విభాగంలో మరో ఆప్షన్ కూడా లేదు. దేశీయ పేసర్లు, అంతగా అనుభవం లేని హంగార్గేకర్, తుషార్ దేశ్ పాండే, ఆకాశ్సింగ్లతో తదుపరి మ్యాచ్‌ల్లో నెట్టుకురావాల్సి ఉంటుంది. డ్వేన్ ప్రిటోరియస్, మతీష పతిరణ లాంటి విదేశీ పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నా జట్టు సమీకరణల దృష్ట్యా వీరికి తుది జట్టులో అవకాశం లభించడం కష్టం. తదుపరి మ్యాచ్ సమయానికంతా బెన్ స్టోక్స్ కోలుకున్నా అతను బౌలింగ్ చేయలేని పరిస్థితి. ఐపీఎల్‌కు ముందే తాను బౌలింగ్ చేయలేనని, కేవలం బ్యాటర్‌గా అందుబాటులో ఉంటానని స్టోక్స్ చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో, కేవలం బ్యాటింగ్ వనరుల సాయంతో సీఎస్కే నెగ్గుకురావడం దాదాపుగా అసాధ్యం. గాయాల బారిన పడిన పేసర్లు మరో రెండు వారాల్లో అందుబాటులోకి వచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతే చేసేదేమీ ఉండదు. పేస్ బౌలింగ్ విభాగం విషయంలో సీఎస్కే ఆల్టర్నేట్ ఆప్షన్స్ చూసుకోకపోతే చాలా కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ధోని మోకాలి గాయం ఆ జట్టును మరింత కలవరపెడుతుంది. గాయం పెద్దదేమీ కాదని కోచ్ చెప్తున్నప్పటికీ లోలోపల ఆ జట్టు ఆందోళన చెందుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాగా, రాజస్థాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 3 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు సాధించగా.. ఛేదనలో చెన్నై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఆఖర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ధోని (17 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్స్‌లు) చెన్నైను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరంటే..?
ICC Player Of The Month: 2023, మార్చి నెల పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఐసీసీ ఇవాళ (ఏప్రిల్ 12) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గెలుచుకున్నాడు. మార్చి నెలలో వివిధ ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శనకు గాను షకీబ్‌ను ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు కోసం న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, యూఏఈ క్రికెటర్ ఆసిఫ్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ ఉండినప్పటికీ, అంతిమంగా జ్యూరీ షకీబ్వైపే మొగ్గుచూపింది. మార్చిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన షకీబ్.. తన జట్టు 1-2 తేడాతో సిరీస్ కోల్పోయినప్పటికీ తాను మాత్రం ఆ సిరీస్‌లో టాప్ రన్ స్కోరర్‌గా (బంగ్లా తరఫున), హూయ్యెస్ట్ వికెట్‌టేకర్‌గా నిలిచాడు. ఇదే ఫామ్‌ను టీ20 సిరీస్‌లోనూ కొనసాగించిన షకీబ్.. బంగ్లాదేశ్ జగజ్జేత ఇంగ్లండ్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఆతర్వాత ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన షకీబ్.. మొత్తంగా మార్చి నెలలో 12 మ్యాచ్‌లు ఆడి 353 పరుగులు తీసి 15 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు గెలవడం ఇది రెండోసారి. 2021 జులైలో షకీబ్ ఈ అవార్డును తొలిసారి గెలుచుకున్నాడు. -
ఫిబ్రవరి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరంటే..?
ICC Player Of The Month: 2023, ఫిబ్రవరి నెల పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఐసీసీ ఇవాళ (మార్చి 13) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఇంగ్లండ్ అప్‌కమింగ్ స్టార్ హ్యారీ బ్రూక్ గెలుచుకున్నాడు. 3 నెలల వ్యవధిలో బ్రూక్ ఈ అవార్డును సొంతం చేసుకోవడం ఇది రెండోసారి. 2022 డిసెంబర్‌లోనూ బ్రూక్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును రెండుసార్లు గెలుచుకున్న ఏకైక ఆటగాడు బ్రూక్ మాత్రమే కావడం విశేషం. బాబర్ 2021 ఏప్రిల్‌లో, 2022 మార్చిలో ఈ అవార్డును దక్కించుకున్నాడు. 2023, ఫిబ్రవరిలో బ్రూక్‌కు పోటీగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, విండీస్ యువ స్పిన్నర్ గుడకేశ్ మోటీ పోటీపడినప్పటికీ, అంతిమంగా అవార్డు బ్రూక్‌నే వరించింది. బ్రూక్.. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లో 2 హాఫ్ సెంచరీలు, ఓ భారీ సెంచరీ బాదగా.. జడేజా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్ట్‌ల్లో రెండు ఫైఫర్లతో పాటు అతి విలువైన ఓ హాఫ్ సెంచరీ చేశాడు. విండీస్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ విషయానికొస్తే.. ఇండియన్ ఆరిజిన్ కలిగిన ఈ స్పిన్ బౌలర్ ఫిబ్రవరిలో జింబాబ్వేతో జరిగిన రెండు టెస్ట్‌ల్లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. జడ్డూ, మోటీలతో పోలిస్తే, బ్రూక్‌కు ఓటింగ్ శాతం అధికంగా రావడంతో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ఫిబ్రవరి మంత్ అవార్డుకు అతన్నే ఎంపిక చేసింది. ఇక మహిళల ప్లేయర్ ఆఫ్ ఫిబ్రవరి మంత్ అవార్డు విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే గార్డ్నర్ ఈ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డు కోసం దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్ట్, ఇంగ్లండ్ నాట్ సీవర్ బ్రంట్ పోటీపడినప్పటికీ, గార్డ్నర్నే అవార్డు వరించింది. బ్రూక్, బాబర్ తరహాలోనే గార్డ్నర్ కూడా ప్లేయర్ అఫ్ ద మంత్ అవార్డును రెండుసార్లు గెలుచుకుంది. 2022 డిసెంబర్లో తొలిసారి ఈ అవార్డుకు ఎంపికైన గార్డ్నర్, 2023 ఫిబ్రవరిలో రెండో సారి ఐసీసీ అవార్డను గెలుచుకుంది. -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్.. రేసులో బ్రూక్‌తో పాటు ఎవరున్నారంటే..?
ఫిబ్రవరి నెలకు గానూ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు నామినీస్ జాబితాను ఐసీసీ ఇవాళ (మార్చి 7) ప్రకటించింది. ఫిబ్రవరి మాసంలో న్యూజిలాండ్‌తో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్ రైజింగ్ స్టార్ హ్యారీ బ్రూక్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 తొలి రెండు టెస్ట్‌ల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా, జింబాబ్వే పర్యటనలో జరిగిన రెండు టెస్ట్‌ల్లో అదరగొట్టిన విండీస్ యువ స్పిన్నర్ గుడకేశ్ మోటీ ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఫిబ్రవరి మంత్ అవార్డు రేసులో ఉన్నారు. బ్రూక్.. న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లో 2 హాఫ్ సెంచరీలు, ఓ భారీ సెంచరీ బాదగా.. జడేజా తొలి రెండు టెస్ట్‌ల్లో రెండు ఫైఫర్లతో పాటు అతి విలువైన ఓ హాఫ్ సెంచరీ చేశాడు. విండీస్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ విషయానికొస్తే.. ఇండియన్ ఆరిజిన్ కలిగిన ఈ స్పిన్ బౌలర్ జింబాబ్వేతో జరిగిన రెండు టెస్ట్‌ల్లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. -
ఐపీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. రేసులో గిల్, సిరాజ్
జనవరి నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు పోటీ పడుతున్న క్రికెటర్ల జాబితాను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. పురుషుల విభాగంలో ఈ అవార్డుకు టీమిండియా నుంచి ఇద్దరు క్రికెటర్లు రేసులో ఉన్నారు. ఆ ఇద్దరే శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్. వీరిద్దరితో పాటు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డెవన్ కాన్వే కూడా పోటీ పడుతున్నాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియాకు లభించిన ఆణిముత్యం శుబ్‌మన్ గిల్. కొన్నాళ్లుగా టెస్టులు మాత్రమే ఆడిన గిల్ తాజాగా వన్డేలు,టి20ల్లో తన హవా కొనసాగిస్తున్నాడు. మొదట శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో అతడు 70, 21, 116 రన్స్ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ తో హైదరాబాద్ లో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీ బాది తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. కేవలం 149 బాల్స్ లోనే 208 రన్స్ చేయడం విశేషం. అదే సిరీస్ లో తర్వాతి రెండు వన్డేల్లో 40, 112 స్కోర్లు చేశాడు.ఇక న్యూజిలాండ్ తో టి20 సిరీస్‌లోనూ రెచ్చిపోయాడు. టి20 ఫార్మాట్ కు పనికి రాడన్న విమర్శలకు చెక్ పెడుతూ చివరి మ్యాచ్ లో మెరుపు సెంచరీ సాధించాడు. An outrageous double hundred from Shubman Gill in Hyderabad 💥 A few incredible stats from the knock 👉 https://t.co/JgdSiZfaij#INDvNZ pic.twitter.com/ynfJezRaPX — ICC (@ICC) January 18, 2023 మరోవైపు హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ టీమిండియాలో క్రమంగా ప్రధాన బౌలర్‌గా ఎదుగుతున్నాడు. బుమ్రా లేని లోటును తీరుస్తున్నాడు. వన్డేల్లో ఇప్పటికే నంబర్ వన్ ర్యాంకు కూడా అందుకున్నాడు.శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ లో అతడు మొత్తం 9 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత తన హోమ్ గ్రౌండ్ హైదరాబాద్ లో న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్లు తీసుకున్నాడు. రెండో వన్డేలో ఆరు ఓవర్లు వేసి కేవలం 10 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక కొత్త ఏడాదిని డెవన్ కాన్వే అద్భుతంగా ఆరంభించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి జనవరిలో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు బాదిన కాన్వే తన సూపర్‌ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. Devon Conway's match-winning knock earned him the Player of the Match award against Pakistan in Karachi 🏅#NZvPAK pic.twitter.com/zk7sDmUwSw — ICC (@ICC) January 11, 2023 -
డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరంటే..?
డిసెంబర్ నెల 2022 పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఐసీసీ ఇవాళ (జనవరి 10) ప్రకటించింది. భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ మిడిలార్డర్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. 23 ఏళ్ల ఈ ఇంగ్లీష్ యువ బ్యాటర్ ఇటీవల ముగిసిన పాకిస్థాన్ టూర్లో విశేషంగా రాణించి 3 టెస్ట్‌లో ఏకంగా 468 పరుగులు స్కోర్ చేశాడు. ఫలితంగానే అతన్ని ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు వరించింది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు కోసం బ్రూక్.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఆసీస్ ఆల్‌రౌండర్ ట్రవిస్ హెడ్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొన్నప్పటికీ, ఐసీసీ అతడివైపే మొగ్గుచూపింది. డిసెంబర్లో బ్రూక్ ఆడిన 3 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేసి, పాక్‌ను వారి సొంతగడ్డపై 17 ఏళ్ల తర్వాత మట్టికరిపించడంలో కీలకంగా వ్యవహరించాడు. పాక్‌తో టెస్ట్ సిరీస్‌లో బ్రూక్ సహా మిగతా ఇంగ్లీష్ ప్లేయర్లంతా మూకుమ్మడిగా రాణించడంతో ఇంగ్లండ్ 3-0 తేడాతో పాక్‌ను ఊడ్చేసింది. ఇక మహిళల ప్లేయర్ ఆప్ ద మంత్ అవార్డు విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే గార్డ్నర్ ఈ అవార్డును గెలుచుకుంది. డిసెంబర్ నెలలో భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆష్లే.. ఈ సిరీస్‌లో 166.66 స్టయిక్ రేట్‌తో 115 పరుగులు చేసి 18.28 సగటున 7 వికెట్లు పడగొట్టింది. ఈ అవార్డు కోసం ఆష్లే.. న్యూజిలాండ్ సూజీ బేట్స్, ఇంగ్లండ్ చార్లీ డీన్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంది. కాగా, పురుషుల ప్లేయర్ ఆఫ్ డిసెంబర్ మంత్ అవార్డు గెలుచుకున్న హ్యారీ బ్రూక్‌ను ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (నవంబర్) ఎవరంటే..?
Jos Buttler: నవంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ ఎగరేసుకుపోయాడు. ఈ అవార్డు కోసం సహచరుడు ఆదిల్ రషీద్, పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిదిల నుంచి పోటీ ఎదుర్కొన్న జోస్.. అత్యధిక శాతం ఓటింగ్‌తో ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగిన టీ20 వరల్డ్‌కప్-2022లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఇంగ్లండ్‌ను జగజ్జేతగా నిలిపిన బట్లర్.. తొలిసారి ఈ ఐసీసీ అవార్డును అందుకున్నాడు. వరల్డ్‌కప్ సెమీస్‌లో టీమిండియాపై ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ను (49 బంతుల్లో 80 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) పరిగణలోకి తీసుకున్న ఐసీసీ ఈ అవార్డుకు జోస్‌ను ఎంపిక చేసింది. తనకు ఈ అవార్డు లభించడంపై బట్లర్ స్పందించాడు. తనకు ఓటు వేసి గెలిపించిన వారందరికీ అతను ధన్యవాదాలు తెలిపాడు. మరోవైపు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫిమేల్ అవార్డును పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ సిద్రా అమీన్ గెలుచుకుంది. అమీన్.. నవంబర్‌లో ఐర్లాండ్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో విశేషంగా రాణించి ఈ అవార్డుకు ఎంపికైంది. కాగా, ఈ అవార్డుకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా పాకిస్తాన్ ఆటగాళ్లు ఎంపిక కావడం విశేషం. సెప్టెంబర్‌లో పాక్ ఓపెనింగ్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఈ అవార్డును గెలుచుకోగా, అక్టోబర్‌లో పాక్ మహిళా క్రికెటర్ నిదా దార్ ఈ అవార్డును దక్కించుకుంది. -
POTM: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఇండియా, పాకిస్తాన్ క్రికెటర్లు
ICC Player Of The Month Winners: రికార్డుల రారాజు, టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి మరో ఘనత అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న ఈ స్టార్ బ్యాటర్.. అక్టోబరు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి సోమవారం వెల్లడించింది. పురుషుల క్రికెట్ విభాగంలో డేవిడ్ మిల్లర్, సికందర్ రజాలను వెనక్కి నెట్టి అత్యధిక ఓట్లతో కోహ్లి విజేతగా నిలిచినట్లు తెలిపింది. పాక్ ఆల్‌రౌండర్ నిదా ఇక మహిళల విభాగంలో వెటరన్ ఆల్‌రౌండర్ నిదా దర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కించుకుంది. కాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్-2022లో కోహ్లి హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్టోబరు నెల ముగిసే సరికి 205 పరుగులతో నిలిచాడు కోహ్లి. పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లలో అద్భుత అర్ధ శతకాలతో మెరిశాడు. ఇక మహిళల ఆసియా కప్-2022 టోర్నీలో రాణించిన నిదా దర్ అక్టోబరు నెలలో 145 పరుగులు సాధించడం సహా ఎనిమిది వికెట్లు పడగొట్టి సత్తా చాటింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు- అక్టోబరు 2022 విరాట్ కోహ్లి- ఇండియా నిదా దర్- పాకిస్తాన్ చదవండి: ఆసీస్‌కు అవమానం! టాప్ రన్ స్కోరర్లు, అత్యధిక వికెట్ల వీరులు! కోహ్లి తర్వాత సూర్య మాత్రం కాదు! WC 2022: ఒక్క క్యాచ్‌తో తారుమారు: సౌతాఫ్రికాలో పుట్టి ఆ జట్టునే దెబ్బకొట్టిన ప్లేయర్లు.. జట్టులో తెలుగు కుర్రాడు కూడా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });