Nominees For ICC Player Of The Month For Men And Women For July 2022 Announced, Check Details - Sakshi
Sakshi News home page

ICC Player Of The Month 2022: జులై నెల నామినీస్‌ ఎవరంటే..?

Published Thu, Aug 4 2022 5:35 PM | Last Updated on Thu, Aug 4 2022 6:06 PM

Nominees For ICC Player Of The Month For Men And Women For July 2022 Announced - Sakshi

2022 జులై నెలకు గాను ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ జాబితాను ఐసీసీ బుధవారం (ఆగస్ట్‌ 3) ప్రకటించింది. పురుషుల క్రికెట్‌కు సంబంధించి ఇంగ్లండ్‌ విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్‌స్టో, శ్రీలంక సంచలన స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య, ఫ్రాన్స్‌ యువ చిచ్చరపిడుగు గుస్తావ్‌ మెక్‌కియోన్‌ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మహిళల కేటగిరీలో టీమిండియా యువ బౌలర్‌ రేణుకా సింగ్‌, ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్లు ఎమ్మా లాంబ్‌, నతాలీ సీవర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ రేసులో నిలిచారు.  

జూన్ నెల మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచిన బెయిర్‌స్టో తన కెరీర్‌ బెస్ట్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ.. జులై నెల నామినీస్‌ జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. భారత్‌తో జరిగిన రీషెడ్యూల్ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు (106, 114*) బాదిన బెయిర్‌స్టో.. ఆ ప్రదర్శన ఆధారంగానే ఈ జాబితాలో చోటు దక్కించకున్నాడు. అనంతరం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 63 పరుగులు చేసిన అతను.. ఆతర్వాత జరిగిన తొలి టీ20లో 53 బంతుల్లో 90 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు.

ఇక లం‍క స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య విషయానికొస్తే.. ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలర్‌ జులై నెలలో తానాడినడిన 3 టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు నేలకూల్చి ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ రేసులో నిలిచాడు. ఆసీస్‌పై 6/118, 6/59.. ఆతర్వాత పాక్‌పై తొలి టెస్ట్‌లో 5/82, 4/135, రెండో టెస్ట్‌లో 3/80, 5/117 అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. 

గుస్తావ్ మెక్‌కియోన్‌ విషయానికొస్తే.. ఈ ఫ్రెంచ్ యువ బ్యాటర్ టీ20ల్లో వరుసగా రెండు విధ్వంసకర సెంచరీలతో (109, 101) ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 

మహిళల కేటగిరీలో రేణుకా సింగ్ ఐదు మ్యాచ్‌ల్లో 12 వికెట్ల ప్రదర్శనతో.. లాంబ్‌ 3 మ్యాచ్‌ల్లో 102, 67, 65 అదిరిపోయే ప్రదర్శనతో.. సీవర్‌ వరుస హాఫ్‌ సెంచరీలతో ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ రేసులో నిలిచారు. 
చదవండి: భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. హైదరాబాద్‌లో మ్యాచ్‌ ఎప్పుడంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement