Jonny Bairstow
-
వేలంలో ఎవరూ పట్టించుకోలేదు.. ఆ కసి అక్కడ చూపించేశాడు!
అబుదాబి టీ20 లీగ్-2024లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జానీ బెయిస్టో విధ్వంసం సృష్టించాడు. ఈ ధానాధన్ లీగ్‌లో టీమ్ అబుదాబికి ప్రాతినిథ్యం వహిస్తున్న బెయిర్ స్టో.. శుక్రవారం మోరిస్విల్లే సాంప్ ఆర్మీతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ప్రత్యర్ధి బౌలర్లను ఈ ఇంగ్లీష్ క్రికెటర్ ఊచకోత కోశాడు. కేవలం 30 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అయితే దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో టీమ్ అబుదాబి కేవలం మూడు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆఖరి ఓవర్లో తమ విజయానికి 12 పరుగులు అవసరమవ్వగా.. అబుదాబి కేవలం 8 పరుగులు మాత్రమే చేసింది. చివరి నాలుగు బంతుల్లో జానీ నాన్‌స్ట్రైక్‌లో ఉండకపోవడంతో అబుదాబి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ అబుదాబి .. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 106 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన మోరిస్విల్లే సాంప్ ఆర్మీ 9.4 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది.వేలంలో అమ్ముడుపోని జానీ..ఇక మ్యాచ్‌లో దుమ్ము లేపిన జానీ బెయిర్ స్టో.. ఐపీఎల్-2025 వేలంలో మాత్రం అమ్ముడుపోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్‌లకు బెయిర్‌స్టో ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? -
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్‌కు పంజాబ్ కింగ్స్ ఊహించని షాకిచ్చింది. చెపాక్ వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో పంజాబ్ బౌలర్లలో హార్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్, రబాడ తలా వికెట్ సాధించారు.బెయిర్ స్టో, రోసౌ విధ్వంసం..163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ జానీ బెయిర్ స్టో, ఫస్ట్ డౌన్ ఆటగాడు రుసౌ విధ్వంసం సృష్టించారు. బెయిర్ స్టో 46 పరుగులు చేయగా.. రుసౌ 43 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు కెప్టెన్ సామ్ కుర్రాన్(27), శశాంక్ సింగ్(25) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. సీఎస్కే బౌలర్లలో శివమ్ దూబే,శార్ధూల్ ఠాకూర్, గ్లీసన్ తలా వికెట్ సాధించారు. -
KKR vs PBKS: టీ20లలో సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఇదే తొలిసారి
ఈడెన్ గార్డెన్స్‌లో శుక్రవారం పరుగుల వరద పారింది. కోల్‌కతా నైట్ రైడర్స్- పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు బౌలర్లపై కనికరం లేకుండా విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతూ కురిపించిన ఫోర్లు, సిక్సర్ల వర్షంలో మైదానం తడిసి ముద్దైంది.ఇరు జట్లు పోటాపోటీగా హిట్టింగ్ చేస్తూ 37 ఫోర్లు.. 42 సిక్సర్లు బాదడంతో ఏకంగా 523 పరుగుల స్కోరు నమోదైంది. అయితే, ఈ పరుగుల యుద్ధంలో పంజాబ్ కింగ్స్ పైచేయి జయకేతనం ఎగురువేసింది. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది.ఐపీఎల్-2024లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(37 బంతుల్లో 75)- సునిల్ నరైన్(32 బంతుల్లో 71) దుమ్ములేపగా.. వన్‌డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్(39) రాణించాడు.వీరితో పాటు రసెల్(12 బంతుల్లో 24), శ్రేయస్ అయ్యర్(10 బంతుల్లో 28) ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, 17 సిక్స్‌లు నమోదయ్యాయి.ఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 18.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 54), జానీ బెయిర్ స్టో (48 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో 108(నాటౌట్)), రీలీ రోసో(16 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్స్‌ల సాయంతో 26), శశాంక్ సింగ్(28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 68 నాటౌట్) దుమ్ములేపారు.ఈ నేపథ్యంలో పంజాబ్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 24 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ క్రమంలో పంజాబ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డు బ్రేక్ చేసింది. ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా.. రైజర్స్ పేరు చెరిపేసి ఆ ఘనతను తన పేరిట లిఖించుకుంది. ఇటీవల రైజర్స్ ఆర్సీబీ మీద 22 సి👉క్స్లు బాదింది.ఇక సిక్సర్ల విషయంలో పంజాబ్ ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో రెండోస్థానంలో నిలిచింది. ఆసియా క్రీడలు-2023లో భాగంగా నేపాల్ జట్టు మంగోలియా మీద 26 సిక్స్‌లు కొట్టింది.ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక సిక్స్‌లు, సాధించిన జట్లు👉24- పంజాబ్ కింగ్స్- కేకేఆర్ మీద- కోల్‌కతాలో- 2024👉22- సన్‌రైజర్స్- ఆర్సీబీ మీద- బెంగళూరులో- 2024👉22- సన్‌రైజర్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మీద- ఢిల్లీలో- 2024👉21- ఆర్సీబీ- పుణె వారియర్స్ మీద- బెంగళూరు- 2013 .పురుషుల టీ20లలో అత్యధిక సిక్సర్లు నమోదైన టాప్-3 మ్యాచ్‌లు👉42- కేకేఆర్- పంజాబ్- కోల్‌కతా- 2024👉38- సన్‌రైజర్స్- ముంబై ఇండియన్స్- హైదరాబాద్- 2024👉38- ఆర్సీబీ- సన్‌రైజర్స్- బెంగళూరు- 2024🎥 Ruthless Hitting 💥Will #PBKS get this over the line? 🤔83 runs required from 42 deliveries‼️Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvPBKS pic.twitter.com/MvCvQQxmoe— IndianPremierLeague (@IPL) April 26, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
టీ20 క్రికెట్లో పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ వరల్డ్ రికార్డు సాధించింది. ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 262 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించిన పంజాబ్.. ఈ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.262 పరుగుల భారీ టార్గెట్‌ను పంజాబ్ కింగ్స్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది. గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 259 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. తాజా మ్యాచ్‌తో సౌతాఫ్రికా రికార్డును పంజాబ్ కింగ్స్ బ్రేక్ చేసింది. కాగా ఐపీఎల్లో కూడా ఇదే అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. ఇప్పటివరకు ఈ రికార్డు రాజస్తాన్ రాయల్స్ పేరిట ఉండేది. 2020 ఐపీఎల్ సీజన్లో పంజాబ్‌పై 224 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది.ఇక ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ జానీ బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 48 బంతులు ఎదుర్కొన్న బెయిర్ స్టో.. 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు శశాంక్ సింగ్ (28 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 పరుగులు), ప్రభుసిమ్రాన్ సింగ్(54) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోర్ సాధించింది.కేకేఆర్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(75), సునీల్ నరైన్(71) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. వెంకటేశ్ అయ్యర్(39), శ్రేయస్ అయ్యర్(28) పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు, రాహుల్ చాహర్, సామ్ కుర్రాన్ తలా వికెట్ పడగొట్టారు. -
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
ఐపీఎల్-2024లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 262 పరుగుల భారీ లక్ష్య చేధనలో బెయిర్ స్టో.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేకేఆర్ బౌలర్లను ఊచకోత కోశాడు.ఈ క్రమంలో బెయిర్ స్టో.. కేవలం 45 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున ఫాస్టెస్ సెంచరీ చేసి బెయిర్ స్టోకు ఇది రెండో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న బెయిర్ స్టో.. 8 ఫోర్లు, 9 సిక్స్‌లతో 108 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.కాగా అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా పంజాబ్ 262 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. పంజాబ్ బ్యాటర్లలో బెయిర్‌స్టోతో పాటు శశాంక్ సింగ్ (28 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 68 పరుగులు), ప్రభుసిమ్రాన్ సింగ్(54) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. -
కోహ్లి, రోహిత్ కాదు.. వారిద్దరే టాప్ 2 టీ20 బ్యాటర్లు?
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన బెయిర్ స్టో.. 16.00 సగటుతో కేవలం 96 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో గురువారం(ఏప్రిల్ 18) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెయిర్ స్టోకు ఆడే అవకాశం దక్కలేదు. అతడిని పంజాబ్ మెనెజ్‌మెంట్ పక్కన పెట్టి రిలీ రూసోను జట్టులోకి తీసుకువచ్చారు. కానీ రూసో కూడా నిరాశపరిచాడు. అయితే తాజాగా బెయిర్ స్టో ప్రముఖ క్రీడా వెబ్సైట్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫోకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో ప్రస్తుత వరల్డ్ క్రికెట్లో టాప్ 3 టీ20 బ్యాటర్లు ఎవరన్న ప్రశ్న బెయిర్‌స్టోకు ఎదురైంది. బెయిర్ స్టో వెంటనే తన తొలి రెండు ఎంపికలగా దక్షిణాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్, భారత విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌లను ఎంచుకున్నాడు. మూడో ప్లేయర్‌ను ఎంచుకోవడానికి జానీ కాస్త సమయం తీసుకున్నాడు. కాస్త ఆలోచించి తన సహచర ఆటగాడు, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్‌ను తన మూడో ఛాయిస్ గా ఎంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఈఎస్పీఎన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ప్రస్తుత ఐపీఎల్లో అదరగొడుతున్న టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి,రోహిత్ శర్మలను బెయిరో స్టో ఎంచుకోపోవడం గమనార్హం. Can you argue with this? 🤔 #25Questions with Jonny Bairstow 👉 https://t.co/u7aCIY24E4 pic.twitter.com/jIg4WSd7YQ — ESPNcricinfo (@ESPNcricinfo) April 19, 2024 -
LSG Vs PBKS: బెయిర్ స్టో స్టన్నింగ్ క్యాచ్.. రాహుల్‌కు మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెగ్యూలర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో అద్భుతమైన క్యాచ్‌తో రాహుల్‌ను పెవిలియన్‌కు పంపాడు. లక్నో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ ఐదో బంతిని ఆఫ్ స్టంప్ వెలుపల లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని రాహుల్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పాయింట్లో ఉన్న బెయిర్ స్టో ఎడమవైపు డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన రాహుల్ ఒక్కసారిగా బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్‌గా నికోలస్ పూరన్ వ్యవహరిస్తున్నాడు. pic.twitter.com/DJwLV8utsO — Sitaraman (@Sitaraman112971) March 30, 2024 -
IND VS ENG 5th Test: జానీ బెయిర్‌స్టోకు వింత అనుభవం
ఇంగ్లండ్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టోకు వింత అనుభవం ఎదురైంది. ఇవాళ (మార్చి 7) ధర్మశాల వేదికగా భారత్‌తో తన వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బెయిర్‌స్టో.. యాదృచ్చికంగా ఇదే వేదికపై తన వందో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడాడు. ఇలా తన కెరీర్లో వందో వన్డే, వందో టెస్ట్ మ్యాచ్ ఒకే వేదికపై ఆడటంతో బెయిర్‌స్టోకు ధర్మశాల మైదానం చిరస్మరణీయంగా మారింది. కెరీర్లో అరుదైన వంద మ్యాచ్‌ల మైలురాయిని రెండు ఫార్మాట్లలో ఒకే వేదికపై అందుకోవడంతో ఈ మైదానం బెయిర్‌స్టోకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ వేదికపై జరిగిన తన వందో వన్డేలో హాఫ్ సెంచరీ (వన్డే వరల్డ్‌కప్ 2023లో బంగ్లాదేశ్‌పై 52 పరుగులు) సాధించిన బెయిర్‌స్టో.. తన వందో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం 29 పరుగులకే పరిమితమయ్యాడు. Dharamsala has been a memorable ground for Jonny Bairstow🏟️❤️ pic.twitter.com/1grLKRQy3o — CricTracker (@Cricketracker) March 7, 2024 ఈ ఇన్నింగ్స్‌లో 18 బంతులు ఎదుర్కొన్న అతను 2 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి మాంచి దూకుడుగా కనిపించాడు. అయితే కుల్దీప్ అతని జోరుకు కళ్లెం వేశాడు. కుల్దీప్ బౌలింగ్‌లో దృవ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి బెయిర్‌స్టో వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో మరో ఇన్నింగ్స్ మిగిలుంది కాబట్టి, ఆ ఇన్నింగ్స్‌లోనైనా సెంచరీనో, హాఫ్ సెంచరీలో చేసి ఈ మ్యాచ్‌ను ప్రత్యేకంగా మార్చుకోవాలని బెయిర్‌స్టో భావిస్తుంటాడు. ఇదిలా ఉంటే, ధర్మశాల టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (57) మెరుపు అర్దశతకం చేసి ఔట్ కాగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. రోహిత్‌కు జతగా శుభ్‌మన్ గిల్ (26) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కేవలం 83 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
అయ్యో పాపం.. స్పిన్ వలలో చిక్కి క్లీన్‌బౌల్డ్! ఐదేసిన కుల్దీప్
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ చైనామన్ స్పిన్నర్ దెబ్బకు ఇంగ్లిష్ జట్టు టాపార్డర్ కుదేలైంది. కాగా ధర్మశాల వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య తాజా సిరీస్‌లో ఆఖరిదైన మ్యాచ్ గురువారం మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో 18వ ఓవర్ ఆఖరి బంతికి ఓపెనర్ బెన్ డకెట్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతడు ఇచ్చిన క్యాచ్‌ను శుబ్‌మన్ గిల్ అద్భుత రీతిలో ఒడిసిపట్టాడు. దీంతో 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డకెట్ వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ జాక్ క్రాలే మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. కానీ అతడికి జతైన వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(11)ను మాత్రం కుల్దీప్ త్వరగానే పెవిలియన్‌కు పంపగలిగాడు. 25.3వ ఓవర్లో పోప్ స్టంపౌట్ కావడంతో కుల్దీప్‌నకు రెండో వికెట్ దక్కింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఆ తర్వాత జో రూట్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న క్రాలే అర్థ శతకం పూర్తి చేసుకుని జోరు కనబరిచాడు. అయితే, కుల్దీప్ మరోసారి తన స్పిన్ మాయాజాలంతో దెబ్బకొట్టి క్రాలే(79)ను బౌల్డ్ చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఇలా టాపార్డర్‌లో మూడు వికెట్లను తానే దక్కించుకున్న కుల్దీప్ యాదవ్.. ఇంగ్లండ్ వందో టెస్టు వీరుడు జానీ బెయిర్ స్టో(29) వికెట్‌ను కూడా తన ఖాతాలోనే వేసుకున్నాడు. అనంతరం బెన్ స్టోక్స్(0) రూపంలో ఐదో వికెట్‌ను కూడా దక్కించుకున్నాడు. కుల్దీప్ స్పిన్ మ్యాజిక్కు ఇంగ్లండ్ బ్యాటర్లు అవుటైన తీరుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. -
రోజు వ్యవధిలో సెంచరీలు కొట్టనున్న నలుగురు స్టార్ క్రికెటర్లు
అంతర్జాతీయ క్రికెట్లో ఒక్క రోజు వ్యవధిలో నలుగురు స్టార్ క్రికెటర్లు సెంచరీలు కొట్టబోతున్నారు. మార్చి 7, 8 తేదీల్లో టీమిండియాకు చెందిన రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్‌కు చెందిన జానీ బెయిర్‌స్టో, న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలు తమ కెరీర్లలో వందో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. రోజు వ్యవధిలో నలుగురు స్టార్ క్రికెటర్లు వందో టెస్ట్ మ్యాచ్ ఆడటం క్రికెట్ చరిత్రలో బహుశా జరిగి ఉండకపోవచ్చు. ఈ రికార్డుకు సంబంధించిన సరైన సమాచారం లేదు కానీ, ఇలాంటి సందర్భం రావడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మరో విశేషమేమిటంటే.. పై పేర్కొన్న తేదీల కంటే కొద్ది రోజుల ముందు (ఫిబ్రవరి 15న) ఇంగ్లండ్‌కే చెందిన మరో ఆటగాడు వంద టెస్ట్ సెంచరీల మార్కును తాకాడు. ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌తో వంద సెంచరీల అరుదైన మైలురాయిని తాకాడు. ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మార్చి 7న మొదలయ్యే ఐదో టెస్ట్ మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్‌స్టోలకు వందో టెస్ట్ మ్యాచ్ కానుండగా.. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న మొదలయ్యే రెండో టెస్ట్ మ్యాచ్ కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలకు సెంచరీ మ్యాచ్ అవుతుంది. జానీ బెయిర్‌స్టో- 99 టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 5974 పరుగులు రవింద్రన్ అశ్విన్- 99 టెస్ట్‌ల్లో 5 సెంచరీలు, 3309 పరుగులు, 507 వికెట్లు కేన్ విలియమ్సన్- 99 టెస్ట్‌ల్లో 32 సెంచరీలు, 8675 పరుగులు, 30 వికెట్లు టిమ్ సౌథీ-99 టెస్ట్‌ల్లో 6 హాఫ్ సెంచరీలు, 2072 పరుగులు, 378 వికెట్లు టెస్ట్‌ల్లో ఇప్పటివరకు 75 మంది 100 టెస్ట్‌ల మార్కును తాకారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తరఫున 15 మంది, భారత్ తరఫున 13, వెస్టిండీస్ నుంచి 9, సౌతాఫ్రికా 8, శ్రీలంక 6, పాకిస్తాన్ 5, న్యూజిలాండ్ తరఫున నలుగురు 100 టెస్ట్‌ల మార్కును తాకారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం
టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘట్టానికి భారత్-ఇంగ్లండ్ మధ్య ధర్మశాల వేదికగా జరుగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ వేదిక కానుంది. ఈ మ్యాచ్ ఇద్దరు ఆటగాళ్లకు 100వ టెస్ట్ మ్యాచ్ కానుంది. టీమిండియాకు చెందిన రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ జానీ బెయిర్‌స్టో తమ కెరీర్లలో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌తో ఇద్దరు ఆటగాళ్లు (వేర్వేరు జట్లకు చెందిన వారు) 100 టెస్ట్‌ల మార్కును తాకడం ఇది మూడోసారి మాత్రమే. అశ్విన్, బెయిర్‌స్టోలకు చిరకాలం గుర్తుండిపోయే ఈ మ్యాచ్ కోసం వారితో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కాగా, కెరీర్లో అత్యంత ముఖ్యమైన మైలురాయిని (100వ టెస్ట్) చేరుకునే ముందు ఇంగ్లండ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను ఫామ్ లేమి సమస్య తెగ కలవరపెడుతుంది. భారత్‌తో సిరీస్‌లో అతను ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ALERT 🚨. In the next match, both Ravi Ashwin and Jonny Bairstow will play their 100th Test match. This will be only the 3rd time in 147 years of Test history that players from two different teams will play their 100th Test in the same match. pic.twitter.com/nYq4ytbhHm — Vishal. (@SPORTYVISHAL) February 29, 2024 తొలి టెస్ట్‌లో 47 పరుగులు (37, 10) చేసిన బెయిర్‌స్టో.. రెండో టెస్ట్‌లో 51 (25, 26), మూడో టెప్ట్లో 4 (0, 4), నాలుగో టెస్ట్‌లో 68 పరుగులు (30, 38) మాత్రమే చేసి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. బెయిర్‌స్టో వందో మ్యాచ్‌లోనైనా రాణిస్తాడో లేదో వేచి చూడాలి. బెయిర్‌స్టో ఇప్పటివరకు ఆడిన 99 టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీల సాయంతో 36.43 సగటున 5974 పరుగులు చేశాడు. అశ్విన్ విషయానికొస్తే.. యాష్ ఇదే సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో 500 వికెట్ల మార్కును తాకి చరిత్రపుటల్లోకెక్కాడు. ప్రస్తుతం అతను ఓ మోస్తరు ఫామ్‌తో పర్వాలేదనిపిస్తున్నాడు. ఈ సిరీస్‌లో యాశ్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి, సిరీస్ లీడింగ్ వికెట్‌టేకర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు 99 టెస్ట్‌లు ఆడిన అశ్విన్.. 507 వికెట్లు, 3309 పరుగులు చేశాడు. ఇందులో 35 ఐదు వికెట్ల ఘనతలు, 5 సెంచరీలు ఉన్నాయి. కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. మార్చి 7 నుంచి ఐదో టెస్ట్ ప్రారంభంకానుంది. -
అశ్విన్ అన్నతో ఆటలా.. దిమ్మతిరిగిపోయిందిగా! వీడియో వైరల్
టీమిండియాతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో తన పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. తొలి మూడు టెస్టుల్లో విఫలమైన బెయిర్ స్టో.. ఇప్పుడు రాంఛీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులోనూ అదే తీరును కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసి బెయిర్ స్టో ఔటయ్యాడు. ఇంగ్లండ్ 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో.. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌ను ఎటాక్‌లోకి తీసుకుచ్చాడు. అయితే అశ్విన్‌ను తన తొలి ఓవర్ నుంచే ఎటాక్ చేయడానికి బెయిర్ స్టో ప్రయత్నించాడు. ఈ క్రమంలో 20 ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన బెయిర్ స్టో.. తనదే పై చేయి అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ 22 ఓవర్ బౌలింగ్ చేయడానికి అశూ వచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతినే బౌండరీగా మలిచిన జానీ.. రెండో బంతిని సైతం ఫోర్ కొట్టడానికి ప్రయత్నించాడు. అశ్విన్ వేసిన క్యారమ్ బాల్‌కు రివర్స్ స్వీప్ ఆడటానికి బెయిర్ స్టో ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి అతడి ప్యాడ్‌కు తాకింది. వెంటనే బౌలర్‌తో పాటు వికెట్ కీపర్ ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపాడు. వెంటనే రోహిత్ శర్మ డీఆర్ఎస్కు వెళ్లాడు. రీప్లేలో బంతికి మిడిల్ స్టంప్‌ను హిట్ చేస్తున్నట్లు తేలింది. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఔట్‌గా ప్రకటించాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు అశ్విన్ అన్నతో ఆటలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అంతకముందు రెండో టెస్టు సమయంలోనూ వీరిద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకున్నసంగతి తెలిసిందే. pic.twitter.com/apGSs6wnjS — Muskaan Bhatt (@MuskaanBhatt11) February 23, 2024 -
ఇంగ్లండ్‌పై ‘సెంచరీ’ కొట్టిన అశ్విన్.. వీడియో వైరల్
India vs England, 4th Test : టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్లో అత్యుత్తమ దశను ఆస్వాదిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ టెస్టు సిరీస్ సందర్భంగా 500 వికెట్ల క్లబ్లో చేరిన ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్.. రాంచి మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు ఫార్మాట్లో ఒకే ప్రత్యర్థిపై 1000 పరుగులు చేయడం సహా 100 వికెట్లు తీసిన క్రికెటర్‌గా 37 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ చరిత్ర సృష్టించాడు. టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుకెక్కాడు. అశ్విన్ కంటే ముందు వాళ్లు ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా జానీ బెయిర్‌స్టోను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ ఘనత సాధించాడు. అశ్విన్ కంటే ముందు జార్జ్ జిఫెన్(ఇంగ్లండ్ మీద), మోనీ నోబుల్(ఇంగ్లండ్ మీద), విల్ఫ్రెడ్ రోడ్స్(ఆస్ట్రేలియా మీద), గ్యారీఫీల్డ్ సోబర్స్(ఇంగ్లండ్ మీద), ఇయాన్ బోతం(ఆస్ట్రేలియా మీద), స్టువర్ట్ బ్రాడ్(ఆస్ట్రేలియా మీద) టెస్టుల్లో ఈ ఫీట్ నమోదు చేశారు. కాగా రాంచి వేదికగా టీమిండియాతో నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. భోజన విరామ సమయానికి 24.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 112 పరుగులు స్కోరు చేసింది. టీమిండియా బౌలర్లలో అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ టాపార్డర్‌ను కుప్పకూల్చి మూడు వికెట్లు వికెట్లు తీయగా.. అశ్విన్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. చదవండి: IND vs ENG: కల నేరవేరింది.. ఎట్టకేలకు అరంగేట్రం! ఎవరీ ఆకాష్ దీప్? Ash gets a century against England... of wickets!#IDFCFirstBankTestSeries #BazBowled #JioCinemaSports pic.twitter.com/X2wxTkk7xL — JioCinema (@JioCinema) February 23, 2024 -
అయ్యో బెయిర్ స్టో.. ! టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
టీమిండియాతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ జానీ బెయిర్ స్టో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన బెయిర్ స్టో.. తాజాగా రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో సైతం అదే తీరును కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో బెయిర్ స్టో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో జానీ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో బెయిర్ స్టో డకౌట్‌గా వెనుదిరిగాడు. తద్వారా అత్యంత చెత్త రికార్డును బెయిర్ స్టో తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో భారత్‌పై అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా బెయిర్ స్టో నిలిచాడు. ఈ ఇంగ్లీష్ బ్యాటర్ ఇప్పటివరకు టెస్టుల్లో భారత్‌పై 8 సార్లు డకౌటయ్యాడు. కాగా అంతకుముందు ఈ చెత్త రికార్డు పాకిస్తాన్ మాజీ ఆటగాడు డనేష్ కనేరియా పేరిట ఉండేది. కనేరియా 7 సార్లు భారత్‌పై డకౌటయ్యాడు. ఇక తాజా మ్యాచ్‌తో కనేరియాను బెయిర్ స్టో అధిగమించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది. 207/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. అదనంగా 112 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(153) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో సిరాజ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 126 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్ నష్టానికి 30 ఓవర్లలో 116 పరుగులు చేసింది. Jonny Bairstow has a habit of getting out early vs India in Tests ☹️#INDvENG pic.twitter.com/G0QkGteI5q — ESPNcricinfo (@ESPNcricinfo) February 17, 2024 -
మార్చి 7, 8 తేదీల్లో సెంచరీలు కొట్టనున్న నలుగురు క్రికెటర్లు..!
మార్చి 7, 8 తేదీల్లో నలుగురు అంతర్జాతీయ క్రికెటర్లు సెంచరీలు కొట్టనున్నారు. ఇదేంటని అనుకుంటున్నారా..? అయితే ఇది చూడండి. పై పేర్కొన్న తేదీల్లో ఓ భారత ఆటగాడు, ఓ ఇంగ్లండ్ ఆటగాడు, ఇద్దరు న్యూజిలాండ్ ఆటగాళ్లు టెస్ట్‌ల్లో వందో మ్యాచ్ ఆడనున్నారు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మార్చి 7న మొదలయ్యే ఐదో టెస్ట్ మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్‌స్టోలకు వందో టెస్ట్ మ్యాచ్ కానుండగా.. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న మొదలయ్యే రెండో టెస్ట్ మ్యాచ్ కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలకు సెంచరీ మ్యాచ్ అవుతుంది. ఈ తేదీల కంటే ముందు ఫిబ్రవరి 15న మరో ఆటగాడు కూడా సెంచరీ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్‌కు వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. రోజుల వ్యవధిలో ఐదుగురు ఆటగాళ్లు వంద టెస్ట్‌ల మార్కును తాకడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ ఆటగాళ్లతో పాటు మరికొందరు శతాధిక టెస్ట్ ప్లేయర్లు ఒకేసారి రిటైరైతే టెస్ట్ క్రికెట్లో ఓ శకం ముగిసినట్లవుతుంది. నేటి వరకు (ఫిబ్రవరి 13) పై పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్ల గణాంకాలు ఇలా ఉన్నాయి. బెన్ స్టోక్స్- 99 టెస్ట్‌ల్లో 13 సెంచరీలు, 6251 పరుగులు, 197 వికెట్లు జానీ బెయిర్‌స్టో- 97 టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 5902 పరుగులు రవింద్రన్ అశ్విన్- 97 టెస్ట్‌ల్లో 5 సెంచరీలు, 3271 పరుగులు, 499 వికెట్లు కేన్ విలియమ్సన్- 98 టెస్ట్‌ల్లో 31 సెంచరీలు, 8490 పరుగులు, 30 వికెట్లు టిమ్ సౌథీ-98 టెస్ట్‌ల్లో 6 హాఫ్ సెంచరీలు, 2059 పరుగులు, 375 వికెట్లు టెస్ట్‌ల్లో ఇప్పటివరకు 75 మంది 100 టెస్ట్‌ల మార్కును తాకారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తరఫున 15 మంది, భారత్ తరఫున 13, వెస్టిండీస్ నుంచి 9, సౌతాఫ్రికా 8, శ్రీలంక 6, పాకిస్తాన్ 5, న్యూజిలాండ్ తరఫున నలుగురు 100 టెస్ట్‌ల మార్కును తాకారు. -
అక్షర్ పటేల్ సూపర్ డెలివరీ.. దెబ్బకు బెయిర్ స్టో ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ సంచలన బంతితో మెరిశాడు. అద్భుతమైన బంతితో ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ జానీ బెయిర్ స్టోను అక్షర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 32 ఓవర్లో అక్షర్ వేసిన 92.9 కి.మీ వేగంతో వేసిన బంతిని బెయిర్ స్టో డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి అనూహ్యంగా టర్న్ అయ్యి అఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఇది చూసిన బెయిర్ స్టో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో బెయిర్ స్టో(37) పరుగులు చేసి ఔటయ్యాడు. అక్షర్ ఈ వికెట్‌తో రూట్-బెయిర్ స్టో భాగస్వామ్యానికి తెర దించాడు. 𝗧𝗵𝗮𝘁. 𝗪𝗮𝘀. 𝗔. 𝗕𝗲𝗮𝘂𝘁! ⚡️ ⚡️@akshar2026 with his first wicket of the match 👏 👏 Follow the match ▶️ https://t.co/HGTxXf8b1E#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/liBwODtcrM — BCCI (@BCCI) January 25, 2024 -
స్పిన్ పిచ్లే సిద్ధం చేస్తే...
ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టు అన్నీ స్పిన్ పిచ్లే తయారు చేస్తుందని భావించడం లేదని ఆ జట్టు సీనియర్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో అభిప్రాయ పడ్డాడు. ప్రస్తుతం భారత పేస్ బౌలింగ్ దళం చాలా పటిష్టంగా ఉందని, అన్నీ స్పిన్ పిచ్లే ఉంటే వారి ప్రభావం తగ్గిపోతుందని అతను అన్నాడు. భారత్‌లో జరిగిన గత సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో బెయిర్‌స్టో మూడు సార్లు డకౌటయ్యాడు. ‘సిరీస్‌లో మాకు వేర్వేరు తరహాలో పిచ్‌లు ఎదురవడం ఖాయం. అయితే అన్నీ టర్న్ కాకపోవచ్చు. వారి పేస్ బౌలింగ్ ఇటీవల ఎలా ఉందో మేం చూస్తున్నాం. ఇప్పుడు పేస్ కూడా వారి బలం కాబట్టి తొలి రోజునుంచే టర్న్ అయ్యే పిచ్‌లు తయారు చేయకపోవచ్చు. అయితే ఎలా ఉన్నా పరిస్థితులకు తగినట్లుగా మా బ్యాటింగ్‌ను మార్చుకునేందుకు మేం సిద్ధంగా ఉండాలి. అశ్విన్, జడేజా, అక్షర్... ఇలా బౌలర్ ఎవరైనా కావచ్చు. మేం అతిగా ఆలోచించడం లేదు. గత సిరీస్‌లో చెన్నైలో మేం కూడా టెస్టు మ్యాచ్ గెలిచామనే సంగతి మరచిపోవద్దు’ అని బెయిర్‌స్టో చెప్పాడు. 2021లో జరిగిన సిరీస్‌ను భారత్ 3–1తో సొంతం చేసుకుంది. -
CWC 2023: చరిత్ర సృష్టించిన బెయిర్‌స్టో.. వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి..!
భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా ప్రారంభమైందని బాధపడుతున్న క్రికెట్ అభిమానులకు ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో అదిరిపోయే కిక్ ఇచ్చాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 5) ప్రారంభమైన టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ రెండో బంతికే సిక్సర్ బాదిన బెయిర్‌స్టో, మెగా టోర్నీకి ఓపెనింగ్ సెర్మనీ జరగకపోయినా అంతకుమించిన మజాను అందించాడు. First runs of the #icccricketworldcup2023 & that too with a SIX 6⃣ ... England started the Bazball way 🔥🔥#ENGvsNZ #ICCCricketWorldCup #Ahmedabad #NarendraModiStadium pic.twitter.com/ddyNAfYHyL — SRKxVIJAY (@Srkxvijay) October 5, 2023 ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్‌లో రెండో బంతినే సిక్సర్‌కు తరలించడం ద్వారా బెయిర్‌స్టోతో పాటు ఇంగ్లండ్ జట్టు రికార్డుపుటల్లోకెక్కింది. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. టోర్నీలో తొలి పరుగులు సిక్సర్ రూపంలో రావడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఈ షాట్‌తో బెయిర్‌స్టోతో పాటు ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ చరిత్రపుటల్లోకెక్కింది. తొలి ఓవర్లో బెయిర్‌స్టో సిక్సర్‌తో పాటు మరో బౌండరీ కూడా బాదాడు. తద్వారా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో 12 పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ 23 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (33), డేవిడ్ మలాన్ (14), హ్యారీ బ్రూక్ (25), మొయిన్ అలీ (11) ఔట్ కాగా.. జో రూట్ (35), జోస్ బట్లర్ (4) క్రీజ్‌లో ఉన్నారు. మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టారు. -
ఇంగ్లండ్ జట్టుకు చేదు అనుభవం.. 38 గంటలు విమానంలోనే!
వన్డే ప్రపంచకప్-2023 వార్మప్ మ్యాచ్‌లలో భాగంగా శనివారం గౌహతి వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు గౌహతికి చేరుకున్నాయి. అయితే ఢిఫెండింగ్ చాంపియన్స్ ఇంగ్లండ్ జట్టుకు మాత్రం తమ ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లీష్ జట్టు తమ విమాన ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. దాదాపు 38 గంటల పాటు ఆ జట్టు ఆటగాళ్లు ఎకానమీ క్లాస్‌లో విమానంలో ప్రయాణించారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇంగ్లండ్ నుంచి గువహతి వరకు ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణించడంపై బెయిర్‌స్టో అసహనం వ్యక్తం చేశాడు. వారు విమానంలో ప్రయాణిస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. "అంతా గందరగోళంగా ఉంది. విమానంలోకి అడుగు పెట్టిన తర్వాత దాదాపు 38 గంటలకుపైగా ప్రయాణం సాగింది'' అంటూ నవ్వుతున్న ఎమోజిని క్యాప్షన్‌గా బెయిర్ స్టో పెట్టాడు.ఆ ఫోటోలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ ఉన్నారు. వారిద్దరూ బాగా ఆలసిపోయినట్లు కన్పించారు. అదే విధంగా వారి చూట్టూ తోటి ప్రయాణికులు భారీగా గుమిగూడి ఉన్నారు. కాగా సాధరణంగా ఆటగాళ్లు ఎక్కువగా బిజినెస్ క్లాస్‌లోనే ప్రయాణిస్తారు. కానీ ఇంగ్లండ్ జట్టు విషయంలో ఎందుకు ఇలా జరిగిందో కారణం తెలియలేదు. ఇక ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గాస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హారీ బ్రూక్, సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, అదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్} చదవండి: పరుగుల జోరులో కివీస్‌దే పైచేయి Jonny Bairstow's Instagram story. England team reached Guwahati in an economy class of a flight. pic.twitter.com/r3Uf3Klchz — Mufaddal Vohra (@mufaddal_vohra) September 29, 2023 -
WC: కోహ్లి, బట్లర్, బాబర్ కాదు! ఈసారి వరల్డ్‌కప్‌లో టాప్ రన్ స్కోరర్ అతడే!
ICC ODI WC 2023 Top Scorer Prediction: వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్టు జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక పరుగులు చేసే బ్యాటర్ ఇతడేనంటూ ఎవరూ ఊహించని పేరును చెప్పాడు. టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. వంటి స్టార్లందరినీ కాదని సహచర ఆటగాడికే ఓటువేశాడు. స్టోక్స్ అద్బుత ఇన్నింగ్స్ కారణంగా 2019లో సొంతగడ్డపై తొలిసారిగా విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టులో జో రూట్ సభ్యుడన్న విషయం తెలిసిందే. నాటి ఈ మెగా ఈవెంట్లో ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి మోర్గాన్ బృందం జగజ్జేతగా అవతరించింది. ఆనాటి మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ 84 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను రేసులో నిలిపి విజయం అందించాడు. ఈ క్రమంలో వరల్డ్‌కప్-2019లో ఇంగ్లండ్ హీరోగా నీరాజనాలు అందుకున్న స్టోక్స్.. మళ్లీ బరిలోకి దిగేందుకు వీలుగా వన్డేల రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు మెగా టోర్నీలో ఆడేందుకు అంగీకరించాడు. ఆ ‘హీరో’ పేరు చెప్పలేదు! అయితే, ప్రపంచకప్-2023లో టాప్ రన్‌స్కోరర్‌గా రూట్.. స్టోక్స్ పేరు చెప్పాడనుకుంటున్నారా? కానే కాదు... ఆశ్చర్యకరంగా ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను ఎంచుకున్నాడు. ‘‘తనను తాను నిరూపించుకోవడంలో జానీ ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్బుతమైన ఆటగాడు. టాపార్డర్‌లో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. జేసన్రాయ్తో కలిసి గొప్ప భాగస్వామ్యాలు నమోదు చేసిన ఘనత అతడిది. పవర్‌ప్లేలో విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడగలడు. ఈసారి ప్రపంచకప్‌లో మరింత గొప్పగా రాణిస్తాడనుకుంటున్నా. నా ఛాయిస్ జానీ బెర్‌స్టో’’ అని ఐసీసీతో రూట్ వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన నెట్టింట చక్కర్లు కొడుతోంది. బెయిర్‌స్టో గణాంకాలు ఇలా కాగా 33 ఏళ్ల జానీ బెయిర్‌స్టో ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు 95 వన్డేలు ఆడాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ సాధించిన పరుగులు 3634. కాగా అక్టోబరు 5న భారత్ వేదికగా ఇంగ్లండ్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రపంచకప్-2023 ఈవెంట్‌కు తెరలేవనుంది. చదవండి: వరల్డ్‌కప్ తర్వాత ద్రవిడ్ బై.. బై! నాడు అతడు ‘బలిపశువు’.. కొత్త కోచ్‌గా అతడే? సిగ్గుపడు రోహిత్! నువ్వసలు కెప్టెన్వేనా?.. వాళ్లకు ఉన్నపాటి బుద్ధి నీకు లేదు! View this post on Instagram A post shared by ICC (@icc) -
ఔటని వెళ్లిపోయిన స్మిత్.. ఇంగ్లండ్ కొంపముంచిన బెయిర్ స్టో తప్పిదం!
యాషెస్ సిరీస్ 2023లో మరో వివాదం తలెత్తింది. లండన్ వేదికగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ చాకచాక్యంగా వ్యవహరించడంతో.. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తృటిలో రనౌటయ్యే అవకాశాన్ని తప్పించుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే? ఆసీస్ ఇన్నింగ్స్ 78 ఓవర్ వేసిన క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో మూడో బంతికి స్మిత్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. దీంతో స్మిత్ సింగిల్ పూర్తి చేసుకుని రెండో రన్ కోసం వికెట్ కీపర్ ఎండ్‌కు పరిగెత్తాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జార్జ్ ఎల్హామ్ మెరుపు వేగంతో బంతిని అందుకుని వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో వైపు త్రోచేశాడు. బంతిని అందుకున్న బెయిర్ స్టో వెంటనే బెయిల్స్ పడగొట్టాడు. స్మిత్ కూడా తన వికెట్‌ను కాపాడుకోవడానికి అద్భుతంగా డైవ్ చేశాడు. అయితే ఇంగ్లండ్ ఆటగాళ్లు ఔట్ అని సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ విల్సన్ థర్డ్ అంపైర్‌కు రీఫర్ చేశాడు. అయితే తొలుత రీప్లేలో బంతి వికెట్లకు తాకే సమయానికి స్మిత్ క్రీజులోకి రాలేదు. దాంతో అందరూ రనౌటని భావించారు. స్మిత్ కూడా తను ఔటని భావించి పెవిలియన్ వైపు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లాడు. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్ చేటు చేసుకుంది. థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం పలుకోణాల్లో చాలాసేపు పరిశీలించి.. బెయిర్ స్టో బంతిని అందుకోక ముందే తన గ్లోవ్తో ఒక బెయిల్‌ను పడగొట్టినట్లు తేల్చాడు. అయితే మరో రెండు బెయిల్స్ కింద పడినప్పటికీ స్మిత్ క్రీజులోకి వచ్చేశాడు. దీంతో నితిన్ మీనన్ తన నిర్ణయాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు. అది చూసిన ఇంగ్లండ్ ఆటగాళ్లు షాకయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇంగ్లండ్ అభిమానులు మాత్రం అది ఔటే అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. స్మిత్ 75 పరుగులతో రాణించాడు. చదవండి: Zim Afro T10: యూసుఫ్ పఠాన్ ఊచకోత.. కేవలం 26 బంతుల్లోనే! వీడియో వైరల్ George Ealham 🤝 Gary Pratt An incredible piece of fielding but not to be... 😔 #EnglandCricket | #Ashes pic.twitter.com/yWcdV6ZAdH — England Cricket (@englandcricket) July 28, 2023 -
దురదృష్టవంతుల లిస్ట్‌లో బెయిర్ స్టో.. ఏడో క్రికెటర్‌గా
ఇంగ్లండ్ వికెట్‌కీపర్ జానీ బెయిర్ స్టో బ్యాడ్‌లక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్ స్టో ఔట్ ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓవర్ పూర్తయిందని భావించిన బెయిర్ స్టో క్రీజు బయటకు రాగా.. ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీ బంతిని నేరుగా వికెట్ల మీదకు విసిరాడు. బంతి ఇంకా డెడ్ కాలేదని.. రూల్ ప్రకారం బెయిర్ స్టో ఔట్ అని అంపైర్ ప్రకటించాడు. దీంతో చేసేదేం లేక బెయిర్ స్టో పెవిలియన్ చేరాడు. అయితే ఈ ఔట్‌పై ఆ తర్వాత చాలా పెద్ద చర్చే జరిగింది. సహచర బ్యాటర్ రూపంలో వెంటాడిన దురదృష్టం.. తాజాగా బెయిర్ స్టోను మరోసారి దురదృష్టం వెంటాడింది. అయితే ఈసారి ఔట్ రూపంలో కాదు.. సెంచరీ రూపంలో. సెంచరీ చేసే అవకాశమున్నా ఆ అదృష్టానికి నోచుకోలేకపోయాడు. కేవలం ఒక్క పరుగు దూరంలో సెంచరీకి దూరమయ్యాడు. మరి ఔట్ అయ్యాడా అంటే అదీ లేదు. తన సహచర బ్యాటర్ చివరి వికెట్‌గా వెనుదిరగడంతో బెయిర్ స్టో 99 పరుగులు నాటౌట్‌గా నిలవాల్సి వచ్చింది. దీన్నిబట్టి చూస్తే గాయంతో ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైన బెయిర్ స్టో రీఎంట్రీ దగ్గరి నుంచి బ్యాడ్‌లక్ వెంటాడుతన్నట్లుగా అనిపిస్తోంది. ఒక్క పరుగుతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికి బెయిర్ స్టో తన ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌తో 592 పరుగులకి ఆలౌట్ అయిన ఇంగ్లండ్ ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. జాక్ క్రాలీ 189, మొయిన్ ఆలీ 54, జో రూట్ 84, హారీ బ్రూక్ 61, బెన్ స్టోక్స్ 51 పరుగులు చేసి ఔటయ్యారు. క్రిస్ వోక్స్,బ్రాడ్, అండర్సన్‌లతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. జానీ బెయిర్ స్టో సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్న సమయంలో జేమ్స్ అండర్సన్‌ని కామెరూన్ గ్రీన్ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 99 వద్ద నాటౌట్‌గా మిగిలిన ఏడో బ్యాటర్‌గా.. టెస్టు క్రికెట్ చరిత్రలో 99 పరుగుల వద్ద నాటౌట్‌గా మిగిలిన ఏడో క్రికెటర్‌గా జానీ బెయిర్‌స్టో నిలిచాడు. ఇంతకుముందు జోఫ్రె బాయ్‌కాట్, స్టీవ్ వా, అలెక్స్ టూడర్, షాన్ పోలాక్, ఆండ్రూ హాల్, మిస్బా వుల్ హక్‌లు 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 317 పరుగులకు ఆలౌట్ అయ్యింది.మార్నస్ లబుషేన్ 51, మిచెల్ మార్ష్ 51, ట్రావిస్ హెడ్ 48, స్టీవ్ స్మిత్ 41, మిచెల్ స్టార్క్ 36, డేవిడ్ వార్నర్ 32, అలెక్స్ క్యారీ 20 పరుగులు చేసి సంయుక్తంగా రాణించారు. క్రిస్ వోక్స్ 5 వికెట్లు తీశాడు. 273 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా మూడోరోజు ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసిది. క్రీజులో మార్నస్ లబుషేన్(44 బ్యాటింగ్), మిచెల్ మార్ష్ ఒక్క పరుగుతో ఉన్నారు. ఆసీస్ ఇంకా 162 పరుగులు వెనుకబడి ఉంది. View this post on Instagram A post shared by We Are England Cricket (@englandcricket) చదవండి: #Jadeja: ఔటయ్యింది ఒక బంతికి.. చూపించింది వేరే బంతిని -
'అనుకున్నంత గొప్ప క్యాచ్ ఏమి కాదులే..'
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మొదలైన సంగతి తెలిసిందే. తొలిరోజు ఇరుజట్లు సమాన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. అయితే ఆట ముగిసే సమయంలో మాత్రం ఇంగ్లండ్‌దే కాస్త పైచేయిగా అనిపించింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (51), లబుషేన్ (51) అర్ధ సెంచరీలు సాధించగా, హెడ్ (48), స్టీవ్ స్మిత్ (41) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ (4/52) ప్రత్యర్థిని దెబ్బ తీయగా, బ్రాడ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్‌లో ఇంగ్లండ్ కీపర్ జానీ బెయిర్ స్టో సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 63వ ఓవర్ క్రిస్ వోక్స్ వేశాడు. ఆ ఓవర్లో ఐదో బంతిని వోక్స్ వైడ్ లైన్ స్టంప్ మీదుగా వేశాడు. మార్ష్ పొజిషన్ మార్చి షాట్ ఆడాడు. బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకి స్లిప్స్ కార్డన్ దిశగా వెళ్లింది. అయితే బంతి కాస్త లో యాంగిల్లో వెళ్లడంతో క్యాచ్ కష్టతరమనిపించింది. కానీ కీపర్ బెయిర్ స్టో డైవ్ చేస్తూ తన గ్లోవ్స్‌ను దూరంగా పెట్టడం.. బంతి సేఫ్‌గా అతని చేతుల్లో పడింది. దీంతో షాక్ తిన్న మార్ష్ నిరాశతో పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు బెయిర్ స్టో క్యాచ్‌పై విభిన్న రీతిలో స్పందించారు. ''ఇదేమంత గొప్ప క్యాచ్‌గా అనిపించడం లేదు.. మాములుగానే ఉంది'' అంటూ కామెంట్ చేశారు. STOP THAT JONNY BAIRSTOW! 🤯 #EnglandCricket | #Ashes pic.twitter.com/aZ7wKcncRW — England Cricket (@englandcricket) July 19, 2023 చదవండి: ICC ODI WC 2023: 'కింగ్' ఖాన్ చేతిలో వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీ.. ఫ్యాన్స్ రచ్చ Virat Kohli: '500వ మ్యాచ్.. నిబద్ధతకు సెల్యూట్ కొట్టాల్సిందే' -
Ashes 2023: కీలకమైన టెస్టుకు మళ్లీ అదే జట్టు! మొండిగా వ్యవహరిస్తే..
The Ashes, 2023- England vs Australia: యాషెస్ సిరీస్ నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. లీడ్స్‌లో మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్‌నే మాంచెస్టర్ టెస్టులోనూ కొనసాగించనుంది. ఈ మేరకు సోమవారం ప్రకటన చేసింది మేనేజ్మెంట్. కాగా గత మ్యాచ్‌లో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోకు మరో అవకాశం ఇవ్వడం విశేషం. బొక్కబోర్లా పడి ఈ నేపథ్యంలో బెన్ ఫోక్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో స్టోక్స్ బృందం ఓటమి పాలైన విషయం తెలిసిందే. బజ్‌బాల్ విధానంతో సొంతగడ్డపై బొక్కబోర్లా పడి పర్యాటక జట్టు చేతిలో ఓడి 0-2తో వెనుకబడింది. అయితే, అనూహ్య రీతిలో పుంజుకుని మూడో టెస్టులో గెలుపొంది బోణీ కొట్టింది. గెలుపు జోష్‌లో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని తగ్గించగలిగింది. హెడ్డింగ్లీ మైదానంలో హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇంగ్లండ్ బౌలర్ మార్క్‌వుడ్ 8 బంతుల్లో 16 పరుగులతో అజేయంగా నిలిచి తమ జట్టుకు విజయం అందించాడు. ఇదే జోష్‌లో మాంచెస్టర్ టెస్టుకు సిద్ధమవుతోంది ఇంగ్లండ్. కాగా జూలై 19- జూలై 23 వరకు నాలుగో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే ఐదో టెస్టు నిర్ణయాత్మకంగా మారుతుంది. లేదంటే ఆసీస్ ఎంచక్కా టైటిల్ ఎగరేసుకుపోతుంది. కాగా బెయిర్‌స్టోకు వరుస అవకాశాలు ఇవ్వడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెయిర్‌స్టోను తప్పించకుండా మొండిగా వ్యవహరించినందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్, జొనాథన్ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, డాన్ లారెన్స్, ఓలీ రాబిన్సన్, జో రూట్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్, మార్క్‌వుడ్. చదవండి: అమ్మ నమ్మట్లే! ఈ బుడ్డోడు టీమిండియాలో అత్యంత కీలక వ్యక్తి.. గుర్తుపట్టారా? Ind Vs WI: ఛీ.. మరీ ఘోరంగా ఉంది.. నాకైతే! -
హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా మారింది. రెండో రోజు ఆటలో ఆసీస్ బౌలర్ల దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు నిలవలేకపోతున్నారు. ముఖ్యంగా కమిన్స్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతూ ఇంగ్లండ్ భరతం పట్టాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో సెషన్లో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులతో ఆడుతుంది. స్టోక్స్ 60 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తుండగా.. కమిన్స్ ఆరు వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 51 పరుగులు వెనుకబడి ఉంది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔట్ వివాదాన్ని ఇంగ్లండ్ అభిమానులు అంత తొందరగా మరిచిపోయేలా కనిపించడం లేదు. తాజాగా మూడో టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి ఇంగ్లండ్ అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న లీడ్స్.. జానీ బెయిర్ స్టోకు హోమ్ గ్రౌండ్. కాగా బెయిర్ స్టో ఇలాకాలో ఇంగ్లండ్ అభిమానులు హద్దుమీరి ప్రవర్తించారు. ఆసీస్ ఆటగాడు అలెక్స్ కేరీని ఉద్దేశించి ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. అలెక్స్ కేరీ ఔటయ్యి పెవిలియన్ వెళ్తున్న సమయంలో ఇంగ్లండ్ అభిమానులు అతన్ని గేలి చేశారు.. ''గుడ్ బై.. ఇక మైదానంలోకి రాకు.. వస్తే ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది'' అంటూ చప్పట్లు కొట్టారు. మరి కొంతమంది అభిమానులు తన షూస్ విప్పి చేతిలో పట్టుకొని కేరీ వైపు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.అయితే ఆసీస్ అభిమానులు కూడా కాస్త దీటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు చివరి రోజు తొలిసెషన్ ఆటలో ఇంగ్లాండ్ 193/5గా ఉన్న సమయంలో.. గ్రీన్ బౌన్సర్‌ను తప్పించుకునేందుకు బెయిర్‌స్టో కిందకు వంగాడు. బంతి వికెట్ కీపర్ కేరీ చేతుల్లోకి వెళ్లింది. ఇంతలో ఓవర్ పూర్తయిందనే ఉద్దేశంతో బెయిర్‌స్టో క్రీజు దాటాడు. వెంటనే వికెట్ కీపర్ అలెక్స్ కేరీ బంతిని కింద నుంచి విసిరి స్టంప్స్ పడగొట్టాడు. బంతి డెడ్ కాలేదని భావించిన థర్డ్ అంపైర్.. బెయిర్‌స్టోను స్టంపౌట్‌గా ప్రకటించాడు. ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆసీస్ ‘క్రీడా స్ఫూర్తి’ ప్రదర్శించలేదని ఇంగ్లాండ్ అభిమానులు విమర్శలు గుప్పించారు. తాము ఐసీసీ నిబంధనల ప్రకారమే ఔట్ చేసినట్లు ఆసీస్ ఆటగాళ్లు, అభిమానులు కౌంటర్ ఇచ్చారు. The Western Terrace is alive as Alex Carey departs 👋#Ashes pic.twitter.com/t6bWvcQRpF — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) July 6, 2023 “Welcome” Alex Carey pic.twitter.com/tCNv1bKEsY — Justin it for the Cloutinho (@JUSTIN_AVFC_) July 6, 2023 -
'బెయిర్ స్టో అమాయక చక్రవర్తి.. బ్రాడ్ కపట సూత్రధారి'
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ముగిసి రెండు రోజులు కావొస్తుంది. మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించినప్పటికి బెయిర్ స్టో ఔట్ వివాదం ఎక్కువగా హైలెట్ అయింది. ఈ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. బెయిర్ స్టో ఔట్ విషయంలో కీలకపాత్ర పోషించిన అలెక్స్ కేరీ తాజాగా ఒక బ్రాడ్‌తో జరిగిన సంభాషణను రివీల్ చేశాడు. బ్రాడ్ అన్న ఒకే ఒక్క మాటను అలెక్స్ కేరీ పంచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం బ్రాడ్.. అలెక్స్ కేరీ వద్దకు వచ్చి ''క్రీడాస్పూర్తిని దిగజార్చారు.. మీరంతా ఎప్పటికీ గుర్తుండి పోతారు'' అని పేర్కొన్నాడు. దీనిపై అలెక్స్ కేరీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ''బెయిర్‌స్టో ఒక అమాయక చక్రవర్తి. బ్రాడ్ పెద్ద కపటనాటక సూత్రధారి. స్టువర్ట్ బ్రాడ్ నుంచి క్రీడా స్ఫూర్తి వంటి పదాలు వింటుంటే వింతగా ఉంది. వారి వికెట్ల కోసం అంపైర్లకు అప్పీల్ చేయాల్సిన అవసరం లేదని భావించే ఆటగాళ్లు ఇప్పుడు ఇలా చెప్పడం హాస్యాస్పదం. ఇంగ్లండ్ ఆటగాళ్లకు తమకొచ్చేసరికి రూల్స్ వేరేగా ఉంటాయి. అదే ప్రత్యర్థి విషయంలో మాత్రం క్రీడాస్ఫూర్తి గుర్తుకొస్తుంది'' అంటూ కామెంట్ చేశాడు. ఇక అభిమానులు మాత్రం ఈ సంఘటనను అంత త్వరగా మరిచిపోలేరనుకుంటా. గతంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ల సందర్భంగా జరిగిన సంఘటనలను గుర్తుకు తెస్తూ పలు వీడియోలను రిలీజ్ చేశారు. అందులో భాగంగా 2013 యాషెస్ సిరీస్‌లో బ్రాడ్ క్యాచ్ ఔట్ అని స్పష్టంగా తెలిసినా మైదానం వీడేందుకు మొగ్గు చూపలేదు. అంపైర్స్ కాల్ కోసం వేచి చూశాడు. ఇప్పుడు ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చదవండి: 'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి' మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఇంగ్లండ్‌కు భారీ షాక్.. సిరీస్ మొత్తానికి కీలక ప్లేయర్ దూరం -
Ashes: ‘బజ్‌బాల్’తో బొక్కబోర్లా.. ఇంగ్లండ్‌కు భారీ షాక్.. సిరీస్ మొత్తానికి..
Ashes Series 2023: ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా చేతిలో రెండు మ్యాచ్‌లలో స్టోక్స్ బృందం చిత్తైన విషయం తెలిసిందే. తద్వారా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుబడింది. బజ్‌బాల్ అంటూ దూకుడు ప్రదర్శించి స్వదేశంలో తొలి రెండు మ్యాచ్‌లలో బోల్తా పడిన ఇంగ్లండ్‌కు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఆ జట్టు కీలక ఆటగాడు గాయపడ్డాడు. ఓలీ పోప్ దీంతో మిగిలిన మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడు మరెవరో కాదు.. ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఓలీ పోప్. కుడి భుజం నొప్పి కారణంగా అతడు జట్టుకు దూరమైనట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఆసీస్‌తో రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ అతడు మిగిలిన మ్యాచ్‌లలో అందుబాటులో ఉండడని పేర్కొంది. ఈ మేరకు.. ‘‘లండన్‌లో స్కానింగ్ చేయించగా.. అతడి గాయం మరింత తీవ్రతరమైందని తేలింది. సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. కాబట్టి మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నాడు’’ అని ఈసీబీ తన ప్రకటనలో పేర్కొంది. తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఓలీ పోప్ చికిత్స పొందుతాడని వెల్లడించింది. కాగా ఆసీస్‌తో తొలి రెండు మ్యాచ్‌లలో ఓలీ పోప్.. ఓ మోస్తరుగా రాణించాడు. మొదటి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 31, 14 పరుగులు చేసిన వన్‌డౌన్ బ్యాటర్.. రెండో టెస్టులో 42, 3 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. రెండో టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో అవుటైన తీరు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాల ప్రధానులు సైతం పరస్పర విమర్శలతో తమ జట్లకు అండగా నిలవడం విశేషం. చదవండి: 'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి' -
'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి'
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్ స్టో ఔటైన తీరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆసీస్ జట్టు వ్యవహరించిన తీరుపై పలువురు మాజీలు సహా చాలా మంది విమర్శలు గుప్పించారు. ''ఆస్ట్రేలియా జట్టుది కపట బుద్ది అని.. గెలుపు కోసం ఎంతకైనా తెగిస్తారంటూ'' ఇంగ్లండ్ అభిమానులు ట్విటర్లో పేర్కొన్నారు. దీనిపై 'ద వెస్ట్ ఆస్ట్రేలియన్' అనే పత్రిక బెన్ స్టోక్స్ ఫోటోను మార్ఫింగ్ చేసి 'క్రైబేబీస్' అనే శీర్షికతో ఓ కథనాన్ని ప్రచురించింది. క్రీడాస్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆసీస్‌పై మండిపడుతున్నారు. కానీ ఆస్ట్రేలియా కంటే ముందే ఇంగ్లండ్ కపటత్వం అంటే ఏంటో చూపించిందని కొంతమంది ఆసీస్ అభిమానులు పాత వీడియోలను షేర్ చేశారు. 2022లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ చూపిన కపట బుద్ధిని బయటపెట్టింది. క్రీడాస్పూర్తికి ఉప్పుపాతరేశారు. ఒక అభిమాని షేర్ చేసిన వీడియోలో అప్పటి ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ వేసిన బంతిని హెన్రీ నికోల్స్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. అయితే దురదృష్టవశాత్తూ బంతి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న డారిల్ మిచెల్ బ్యాట్‌ను తాకి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు. చేసేదేం లేక హెన్రీ నికోల్స్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే ఇక్కడ ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్‌ను వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నప్పటికి వాళ్లు గెలవడానికే మొగ్గు చూపారు. అభిమాని షేర్ చేసిన వీడియోపై ఆకాశ్ చోప్రా స్పందించాడు. ''క్రీడాస్పూర్తి అనే పదాన్ని భుజాలపై ఎత్తుకొని వాదిస్తున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ వీడియోపై స్పందించండి. ఇప్పుడు ఆసీస్ చీటింగ్ చేసిందని అంటున్నారు.. న్యాయంగా మీరు ఆరోజు చేసింది కూడా చీటింగ్ కిందే వస్తుంది. మీ కపటత్వాన్ని చాటిచెప్పే పలు వీడియోలు ఇక్కడ ఉన్నాయి.అందులో ప్రస్తుత ఆటగాళ్లలో కొందరు భాగస్వాములుగా ఉన్నారు. ఇంగ్లీష్ క్రికెట్ కపటత్వం, అర్హత యొక్క భావం నా దృష్టిలో వేరే విషయం.'' అని చెప్పుకొచ్చాడు. Ouch. You can even see the torchbearer of ‘The Spirit of the Game’ shrugging his shoulders instead of initiating the process to withdraw the appeal. After all, you wouldn’t want to be remembered for things like these 🤣🫣🤪 Also, there are multiple videos circulating calling out… https://t.co/yR8Nq2UeVd — Aakash Chopra (@cricketaakash) July 4, 2023 చదవండి: #Chahal: 'మిస్టరీ గర్ల్'తో యజ్వేంద్ర చహల్.. ధనశ్రీ చూస్తే అంతే! ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్‌కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ చురకలు -
Ashes 2023: రిషి సునాక్‌కు స్ట్రాంగ్ కౌంటర్! మాములుగా లేదు..
Bairstow Controversial Dismissal: ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లిష్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో అవుటైన తీరుపై వివాదం కొనసాగుతూనే ఉంది. బంతి వికెట్‌కీపర్ చేతిలో ఉండగానే.. బెయిర్‌స్టో నిర్లక్ష్యంగా వ్యవహరించి వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సమయస్ఫూర్తితో బెయిర్‌స్టోను స్టంపౌట్ చేసిన ఆసీస్ వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీ సహా ఇతర ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ అభిమానులు, కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆస్ట్రేలియా తీరుపై విమర్శలు సంధిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిన నేపథ్యంలో.. తామైతే ఇలా ఆసీస్ తరహాలో గెలుపొందాలని కోరుకోమని వ్యాఖ్యానించాడు. ఇక బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సైతం స్టోక్స్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. రిషి సునాక్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇందుకు ప్రతిస్పందనగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ సైతం రంగంలోకి దిగారు. తమ జట్టుకు పూర్తి మద్దతు ప్రకటించారు. యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా మహిళా, పురుష క్రికెట్ జట్లను చూసి తాను గర్వపడుతున్నానన్నారు. ‘‘అదే ఆసీస్.. పూర్వవైభవాన్ని గుర్తు చేస్తూ.. ఎల్లప్పుడూ విజయాలు సాధిస్తూనే ఉంటుంది. వాళ్లు విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నా.. విజేతలైన మా ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాము’’ అని ఆంథనీ అల్బనీస్ పేర్కొన్నారు. పరస్పరం విమర్శలు కాగా యాషెస్ సిరీస్ రెండో టెస్టు ఆఖరి రోజు ఆట సందర్భంగా.. ఓవర్ పూర్తైందని భావించిన బెయిర్‌స్టో క్రీజు దాటి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బంతిని వికెట్లకు గిరాటేసి.. రనౌట్‌కు అప్పీలు చేశాడు. అయితే, బెయిర్‌స్టో కీపర్ లేదంటే అంపైర్‌కి సిగ్నల్ ఇవ్వకుండా క్రీజు దాటడంతో థర్డ్ అంపైర్ అతడిని అవుట్‌గా ప్రకటించాడు. దీంతో ఆసీస్ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిందంటూ ఇంగ్లండ్ అభిమానులు, మీడియా ప్రత్యర్థి జట్టుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆసీస్ మీడియా కూడా తగ్గేదేలే అన్నట్లు స్టోక్స్ ఫొటోలతో ఇంగ్లండ్ విమర్శలను తిప్పి కొట్టింది. తాజాగా ఇరు దేశాల ప్రధానులు సైతం తమ తమ ఆటగాళ్లకు అండగా నిలుస్తూ కౌంటర్ అటాక్ చేసుకోవడం విశేషం. చదవండి: BCCI: అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాతే ఆ కీలక ప్రకటన! ఇక కోహ్లి, రోహిత్.. నెదర్లాండ్స్ ఆశలు సజీవం BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 -
Ashes 2023: బెయిర్‌స్టో స్టంపౌట్ ఉదంతం.. ప్రధాని సైతం స్పందించారు..!
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై క్రికెట్‌ను ఎంతగానో ఇష్టపడే బ్రిటన్ ప్రధాని రిషి సునక్ స్పందించారు. బెయిర్‌స్టో విషయంలో ఆస్ట్రేలియా క్రికెట్ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు. ఈ వివాదంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందనతో ఏకీభవించారు. ఆస్ట్రేలియా తరహాలో గేమ్ గెలవాలని తాను కోరుకోనని అన్నారు. ఆసీస్ వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాలను రిషి సునక్ ప్రతినిధి వెల్లడించారు. కాగా, యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ ఆఖరి రోజు ఆటలో బెయిర్‌స్టో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఔటైన విషయం తెలిసిందే. బంతి వికెట్‌కీపర్ చేతిలో ఉండగానే బెయిర్‌స్టో ఓవర్ పూర్తయ్యిందనుకుని క్రీజ్ దాటి వెళ్లాడు. ఇది గమనించిన వికెట్‌కీపర్ వికెట్లను గిరాటు వేశాడు. సుదీర్ఘ పరిశీలన అనంతరం ధర్డ్ అంపైర్ బెయిర్‌స్టోను స్టంపౌట్‌గా ప్రకటించాడు. దీంతో వివాదం రాజుకుంది. నిబంధనల ప్రకారం ఇది ఔటే అయినా.. ఆసీస్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసీస్ క్రీడాస్పూర్తికి వ్యతిరేకంగా ప్రవర్తించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ కెప్టెన్ అయితే తాము ఆసీస్ తరహాలో మ్యాచ్ గెలవాలని ఎప్పటికీ కోరుకోమని వ్యాఖ్యానించాడు. ఇదే విషయాన్ని తాజాగా బ్రిటన్ ప్రధాని కూడా వెల్లబుచ్చారు. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌లో బెయిర్‌స్టో కీలక సమయంలో ఔట్ కావడంతో ఇంగ్లండ్ 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ఆసీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్, ఆసీస్ మధ్య మూడో టెస్ట్ జులై 6 నుంచి హెడింగ్లీలో ప్రారంభమవుతుంది. -
బెయిర్‌స్టో స్టంపౌట్ వివాదం.. వాళ్లు మనుషులైతే బహిరంగా క్షమాపణ చెప్పాలి..!
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు సర్ జెఫ్రీ బాయ్‌కాట్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆసీస్ ఆటగాళ్లు నిజంగా మనుషులైతే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆసీస్, ఇంగ్లండ్ జట్లు అద్భుతమైన క్రికెట్ ఆడాయి.. ఇలాంటి ఘటనలు ఆట స్ఫూర్తికి మంచిది కాదని అన్నారు. అందరం తప్పులు చేస్తాం.. బెయిర్‌స్టో విషయంలో ఆసీస్ కూడా తప్పు చేసింది.. ఈ విషయంలో వారు తమ తప్పును అంగీకరించాలని కోరారు. ఏ పద్దతిలోనైనా గెలవాలనుకునే వారికి క్రికెట్ సరైన ఆట కాదని, ఇలాంటి (బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్) ఘటనలు జెంటిల్మెన్ గేమ్ ప్రతిష్టను మసకబారుస్తాయని తెలిపాడు. గెలవడం కోసం కష్టపడటం మంచిదే, కానీ క్రీడా స్పూర్తిని మరిచి గెలవాలనుకోవడం మాత్రం సరైంది కాదని హితవు పలికాడు. ఓ ఆటగాడు ఉద్దేశపూర్వకంగా తప్పు చేయనప్పుడు దానికి క్రికెట్ చట్టాలను ఆపాదించడం కరెక్ట్ కాదని, ఇలాంటి సందర్భాల్లో ప్రత్యర్ధి జట్లు ఇంగితజ్ఞానం ఉపయోగిస్తే మంచిదని అభిప్రాయపడ్డాడు. కాగా, రెండో టెస్ట్ ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో బెయిర్‌స్టో చేసిన అనాలోచిత పని (బంతి వికెట్ కీపర్ చేతిలో ఉండగానే క్రీజ్ వదిలి బయటికి రావడం) ఇంత వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. బెయిర్‌స్టో నిర్లక్ష్యం కారణంగా ఇంగ్లండ్ మ్యాచ్‌ను కోల్పోవడంతో పాటు ఈ విషయాన్ని పెద్దది చేసినందుకు నవ్వులపాలైంది. బెన్ స్టోక్స్ వీరోచిత ఇన్నింగ్స్ వృధా అయ్యింది. ఫలితంగా ఆసీస్ 43 పరుగుల తేడాతో విజయం సాధించి, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్‌కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ చురకలు
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔట్ వివాదంతో 'క్రీడాస్పూర్తి' అనే పదం మరోసారి తెరపైకి వచ్చింది. క్రీడాస్పూర్తి ప్రకారం చూస్తే అలెక్స్ క్యారీ చేసింది తప్పని చెప్పొచ్చు.. కానీ న్యాయంగా చూస్తే బెయిర్ స్టో అవుట్ కిందే లెక్క. బంతి ఇంకా డెడ్ కాకముందే బెయిర్ స్టో క్రీజు దాటడం తప్పు. ఇదే అదనుగా భావించిన అలెక్స్ క్యారీ అతన్ని రనౌట్ చేశాడు. రూల్స్ ప్రకారం ఒక బంతి డెడ్ కావడానికి ముందే బ్యాటర్ క్రీజు దాటిన సమయంలో కీపర్ వికెట్లను గిరాటేస్తే అది ఔట్ కిందే లెక్కిస్తారు. అయితే అప్పీల్‌ను వెనక్కి తీసుకునే అవకాశం కెప్టెన్‌కు ఉంటుంది. కానీ పాట్ కమిన్స్ అందుకు సిద్ధపడలేదు. జట్టు గెలుపు దిశలో ఉన్నప్పుడు క్రీడాస్పూర్తి ప్రదర్శించడానికి కమిన్స్ వెనకాడాడు. కానీ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మాత్రం క్రీడాస్పూర్తికి విలువనిచ్చాడు. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ఔటైన ఇయాన్ బెల్‌ను మళ్లీ వెనక్కి పిలిచి ధోని క్రీడాస్పూర్తి చాటుకున్నాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 319 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఓడినా ధోని మాత్రం తన చర్యతో ఇంగ్లండ్ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. క్రీడాస్పూర్తి అనే అంశం మరోసారి తెరమీదకు రావడంతో ధోని ప్రదర్శించిన క్రీడాస్పూర్తిని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. 2011లో టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించింది. నాటింగ్హమ్ వేదికగా ఇరుజట్లు టెస్టు మ్యాచ్ ఆడాయి. టీ విరామానికి ముందు ఇషాంత్ శర్మ ఆఖరి ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో ఇషాంత్ వేసిన ఒక బంతిని ఇయాన్ మోర్గాన్ లెగ్‌సైడ్ దిశగా ఆడాడు. నేరుగా బౌండరీ లైన్ వద్ద ఉన్న ప్రవీణ్ కుమార్ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మిస్ అయి బౌండరీ పక్కన పడింది. అయితే అది బౌండరీనా కాదా అని సందేహం ఉన్న సమయంలోనే ప్రవీణ్‌కుమార్ బంతిని తీసుకొని ధోనికి అందించాడు. ధోని కూడా కామన్‌గా బంతి అందుకొని బెయిల్స్‌ను ఎగురగొట్టాడు. కానీ ఇయాన్ బెల్ అప్పటికే క్రీజు బయట ఉన్నాడు. ఇది గమనించిన అంపైర్ బంతి ఇంకా డెడ్ కాలేదని.. థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి ఇంకా డెడ్ కాకముందే ఇయాన్ బెల్ క్రీజు బయటకు వెళ్లడంతో రనౌట్ అని బిగ్స్క్రీన్పై వచ్చింది. అప్పటికే పెవిలియన్ దగ్గర వేచి ఉన్న ఇయాన్ మోర్గాన్, ఇయాన్ బెల్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. మిగతా ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా బాల్కనీ నుంచి అసలేం ఏం జరుగుతుందో అర్థంకాక నిలబడిపోయారు. అంతలో టీ విరామం రావడంతో మైదానంలోని ప్రేక్షకులు ధోని చేసిన పనికి చివాట్లు, శాపనార్థాలు పెట్టారు. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమని.. ధోని లాంటి కెప్టెన్ ఇలా చేస్తాడా అంటూ సూటిపోటి మాటలు అన్నారు. కానీ టీ విరామం అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సమయానికి ఇయాన్ మోర్గాన్‌తో పాటు ఇయాన్ బెల్ కూడా వచ్చాడు. దీంతో షాక్ తిన్న అభిమానులు ఒక్కసారిగా మాట మార్చారు. ధోని నిర్ణయాన్ని స్వాగతిస్తూ టీమిండియాను చప్పట్లతో అభినందించారు. అయితే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాకా అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌తో ధోని సంప్రదింపులు జరిపి అప్పీల్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. ఈ విషయాన్ని అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్‌కు చెప్పగానే అతను కృతజ్ఞతగా ధోనిని హగ్ చేసుకోవడం అందరిని ఆకట్టుకుంది. అనంతరం మైదానంలో కూల్‌గా కనిపించిన ధోనిని చూస్తూ అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఈ వీడియోనూ ఇంగ్లండ్ అభిమానులు రీట్వీట్ చేస్తూ ''కమిన్స్.. క్రీడాస్పూర్తి అంటే ఏంటో తెలియకపోతే ధోనిని చూసి నేర్చుకో.. ఇలా చీటింగ్ చేసి గెలవడం కరెక్ట్ కాదు'' అంటూ హితబోద చేశారు. Jonny Bairstow Runout reminds me of "When MS Dhoni called back Ian Bell after Run out even though he was out" (Full Story in Thread) pic.twitter.com/TQuHne7HD4 — 🏆×3 (@thegoat_msd_) July 2, 2023 BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 చదవండి: బెయిర్ స్టో ఔట్ వివాదం.. మొదలుపెట్టింది ఇంగ్లండే కదా! Ashes Series 2023: గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు భారీ షాక్.. ఇకపై కష్టమే..! -
బెయిర్ స్టో ఔట్ వివాదం.. మొదలుపెట్టింది ఇంగ్లండే కదా!
లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే విజయం కన్నా బెయిర్ స్టో ఔట్ వివాదాస్పదంగా మారింది. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేసిన పని క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. ఐదోరోజు ఆటలో లంచ్ విరామానికి ముందు గ్రీన్ వేసిన బంతిని ఆడకుండా కిందకు వంగిన బెయిర్‌స్టో ఆ తర్వాత సహచరుడు స్టోక్స్‌తో మాట్లాడేందుకు ముందుకు వెళ్లాడు. అదే సమయంలో బంతిని అందుకున్న కీపర్ క్యారీ అండర్‌ఆర్మ్ త్రోతో ముందుకు విసరగా అది స్టంప్స్‌ను తాకింది. ఆ సమయంలో బెయిర్‌స్టో క్రీజ్‌కు చాలా దూరం ఉండడంతో థర్డ్ అంపైర్ బెయిర్‌స్టోన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దాంతో ఇంగ్లండ్ బృందం ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యింది. ఆసీస్ తమ అప్పీల్‌ను కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయకపోవడంతో బెయిర్‌స్టో మైదానం వీడాడు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లపై స్టేడియంలోని ప్రేక్షకులు చీటర్స్ అంటూ దూషణల పర్వం మొదలుపెట్టారు. అయితే బెయిర్ స్టో ఇదే లార్డ్స్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో మార్నస్ లబుషేన్‌ను ఇలాగే ఔట్ చేసే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. బంతి మిస్సయ్యి కీపర్ బెయిర్ స్టో చేతుల్లోకి వెళ్లినా లబుషేన్ క్రీజులోనే ఉన్నాడు. త్రో వేయాలన్న ఉద్దేశంతో బెయిర్ స్టో నేరుగా వికెట్ల వైపు విసిరాడు. అయితే లబుషేన్ క్రీజులోనే ఉండడంతో అది ఔట్‌గా పరిగణించలేదు. ఒకవేళ లబుషేన్ క్రీజు దాటి బయట ఉంటే అప్పుడు బెయిర్ స్టో అప్పీల్‌కు వెళ్లేవాడా లేక క్రీడాస్పూర్తి ప్రదర్శించేవాడా అంటే చెప్పలేని పరిస్థితి. అంటే ఈ లెక్కన చూస్తే ఇంగ్లండ్ కీపర్ బెయిర్ స్టోనే తొలుత ఇది మొదలుపెట్టాడనిపిస్తుంది. ఆ సమయంలో అలెక్స్ క్యారీ గమనించాడేమో తెలియదు కానీ.. తనకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం క్రీడాస్పూర్తిని పక్కకుబెట్టి బెయిర్ స్టోను ఔట్ చేశాడు. గెలుపు కోసం ప్రయత్నిస్తున్న ఏ జట్టైనా అలాగే చేస్తుందని.. ఆసీస్‌ను చీటర్స్ అని పిలుస్తున్నారు కానీ అదే స్థానంలో ఇంగ్లండ్ ఉండుంటే కూడా బహుశా అదే జరిగేదేమో అని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. England’s hypocrisy exposed as Bairstow tries to stump Labuschagne on Day 3… but of course Stokes would’ve called Marnus back (coughs… BS) #Ashes #ashes2023 #ashes23 pic.twitter.com/MwF0T42dWX — Paul Kneeshaw (@Stick_Beetle) July 3, 2023 చదవండి: Ashes 2023: నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.. వాళ్లు ఛీటర్స్! ఆస్ట్రేలియాకు ఇది అలవాటే బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై బెన్ స్టోక్స్.. అలాంటి గెలుపు మాకొద్దు..! -
బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై బెన్ స్టోక్స్.. అలాంటి గెలుపు మాకొద్దు..!
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ వికెట్‌కీపర్/బ్యాటర్ జానీ బెయిర్‌స్టో స్టంపౌట్ అంశం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆసీస్ ఆటగాళ్లు క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించి బెయిర్‌స్టోను ఔట్ చేశారని కొందరంటుంటే.. రూల్స్ ప్రకారం అది కచ్చితంగా ఔటేనని మరికొందరు వాదిస్తున్నారు. మ్యాచ్ అనంతరం ఇదే అంశంపై ఇరు జట్ల కెప్టెన్లు కూడా స్పందించారు. BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 బెయిర్‌స్టో స్టంపౌట్‌ను ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ సమర్ధించుకుంటుంటే.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం ఆసీస్ ఆటగాళ్ల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఓ పక్క రూల్స్ ప్రకారం బెయిర్‌స్టో ఔటేనని చెప్పుకొచ్చిన స్టోక్స్.. ఓ ఆటగాడిని ఆ పద్దతిలో ఔట్ చేసి వచ్చే గెలుపు తమకొద్దని వ్యాఖ్యానించాడు. ఒకవేళ కీలక సమయంలో ఓ ఆటగాడిని అలా ఔట్ చేసే అవకాశం తమకు వచ్చినా తాము వదిలేస్తామని, ఆ పద్ధతిలో గేమ్ గెలవడం తమకు ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. ఇలాంటి సందర్భంలో తాము అప్పీల్ చేసినా వెనక్కు తీసుకునే వాళ్లమని తెలిపాడు. ఆసీస్‌కు అది మ్యాచ్ విన్నింగ్ మూమెంట్ కాబట్టి అలా చేశారని అన్నాడు. కాగా, ఆఖరి రోజు ఆటలో బెయిర్‌స్టో ఔట్ కావడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. స్టోక్స్ వీరోచిత పోరాటం (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) చేసినా ఇంగ్లండ్ మ్యాచ్ గెలవలేకపోయింది. భారీ లక్ష్యఛేదనలో స్టోక్స్‌కు సహకరించే వారు లేకపోవడంతో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. ఒకవేళ బెయిర్‌స్టో విషయంలో ఆసీస్ తమ అప్పీల్‌ను వెనక్కు తీసుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఏది ఏమైనప్పటికీ ఆసీస్ 43 పరుగుల తేడాతో గెలుపొంది, 5 మ్యాచ్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. -
బెయిర్‌స్టో స్టంపౌట్ వివాదం.. ఆసీస్ ఆటగాడిపై దూషణ పర్వం.. తప్పేమీ లేదన్న అశ్విన్
లార్డ్స్ టెస్టు చివరి రోజు ఆటలో బెయిర్‌స్టోను స్టంపౌట్ చేసిన తీరు వివాదాన్ని రేపి తీవ్ర చర్చకు దారి తీసింది. లంచ్ ముందు ఈ ఘటన జరిగింది. గ్రీన్ వేసిన బంతిని ఆడకుండా కిందకు వంగిన బెయిర్‌స్టో ఆ తర్వాత సహచరుడు స్టోక్స్‌తో మాట్లాడేందుకు ముందుకు వెళ్లాడు. అదే సమయంలో బంతిని అందుకున్న కీపర్ క్యారీ అండర్‌ఆర్మ్ త్రోతో ముందుకు విసరగా అది స్టంప్స్‌ను తాకింది. BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 ఆ సమయంలో బెయిర్‌స్టో క్రీజ్‌కు చాలా దూరం ఉండటంతో థర్డ్ అంపైర్ బెయిర్‌స్టోన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దాంతో ఇంగ్లండ్ బృందం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఆసీస్ తమ అప్పీల్‌ను కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయకపోవడంతో బెయిర్‌స్టో మైదానం వీడాడు. ఆ సమయంలో స్టేడియం మొత్తం ‘పాత ఆ్రస్టేలియా...ఎప్పటిలాగే మోసగాళ్లు’ అంటూ ప్రేక్షకులంతా గేలి చేశారు. Usman Khawaja was pulled back by security after speaking to one the members inside the long room 😳 🗣️ "I've NEVER seen scenes like that!" pic.twitter.com/2RnjiNssfw — Sky Sports Cricket (@SkyCricket) July 2, 2023 లంచ్ సమయంలో పరిస్థితి మరింత ముదిరింది. లార్డ్స్ మైదానంలో ప్రతిష్టాత్మక లాంగ్ రూమ్‌లో ఆసీస్ ఆటగాళ్లు నడుస్తుండగా కొందరు మాటలతో ఖ్వాజాను దూషించారు. సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. దీనిపై ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు ఆగ్రహంతో ఎంసీసీకి ఫిర్యాదు చేయగా...వారు చివరకు ఘటనపై క్షమాపణ చెప్పారు. నిబంధనల ప్రకారం చూస్తే బెయిర్‌స్టో అవుట్లో తప్పు లేదు. బంతి ఇంకా ‘డెడ్’ కాకముందే అతను క్రీజ్ వీడాడు. బయటకు వెళ్లే ముందు అతను తన కాలితో క్రీజ్ లోపల నేలను గీకడం కూడా కనిపించినా బంతి కీపర్ చేతుల్లోనే ఉంది. అప్రమత్తంగా ఉన్న క్యారీ స్టంప్ చేశాడు. దాంతో మరోసారి క్రీడా స్ఫూర్తి చర్చ ముందుకు వచ్చింది. కామెంటేటర్లంతా వాదనకు చెరో వైపు నిలిచారు. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో స్పష్టంగా ఉండే భారత స్పిన్నర్ అశ్విన్ మాత్రం ఇందులో తప్పేమి లేదని, అది అవుట్ అని స్పష్టం చేశాడు. ‘ఒకటి మాత్రం నిజం. వెనక అంత దూరం నిలబడిన కీపర్ స్టంప్స్‌పైకి బంతి విసిరాడంటే అప్పటికే బెయిర్‌స్టో ఇలాంటి ప్రయత్నం చేసి ఉండటం అతను చూసి ఉంటాడు’ అని అశ్విన్ విశ్లేషించాడు. -
బెన్ స్టోక్స్ వీరోచిత పోరాటం.. ప్రత్యర్ధి సైతం దాసోహం..!
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వీరోచిత పోరాటం చేశాడు. భారీ శతకంతో చెలరేగాడు. పట్టుసడలని పోరాటంతో ప్రత్యర్ధిని గడగడలాడించాడు. అదే ప్రత్యర్ధి చేతనే శభాష్ అనిపించుకున్నాడు. 2019లో హెడింగ్లీ మైదానంలో జరిగిన మ్యాచ్ తరహాలో ఒంటి చేత్తో జట్టును గెలిపించేలా కనిపించాడు. అయితే గెలుపుకు మరో 70 పరుగులు చేయాల్సిన తరుణంలో హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటై, నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఆతర్వాత ఇంగ్లండ్ 26 పరుగుల వ్యవధిలో మిగిలిన 3 వికెట్లు కోల్పోవడంతో ఓటమిపాలైంది. స్టోక్స్ వీరోచిత పోరాటానికి ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ కెప్టెన్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ వృధా అయ్యింది. ఏ స్థితిలోనైనా ‘బజ్‌బాల్’ను కొనసాగిస్తానంటూ పట్టుదలగా నిలిచి సిక్సర్లతో చెలరేగిన స్టోక్స్, చివరకు జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఫలితంగా ఆసీస్ లార్డ్స్‌లో గెలుపు జెండా ఎగరేసి 5 టెస్ట్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. లండన్: ఆ్రస్టేలియా జట్టు యాషెస్ సిరీస్‌పై తమ ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది. లార్డ్స్ మైదానంలో ఆదివారం ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ 43 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. 371 పరుగులను ఛేదించే ప్రయత్నంలో ఓవర్‌నైట్ స్కోరు 114/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) చెలరేగగా... బెన్ డకెట్ (112 బంతుల్లో 83; 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్ తలా 3 వికెట్లు పడగొట్టారు. గాయంతో ఉన్న స్పిన్నర్ లయన్ బౌలింగ్ చేయకుండానే ఆసీస్ ఈ విజయాన్ని అందుకోగలిగింది. స్టీవ్ స్మిత్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా, మూడో టెస్టు గురువారంనుంచి లీడ్స్‌లో జరుగుతుంది. విజయం కోసం చివరి రోజు చేతిలో 6 వికెట్లతో 257 పరుగులు సాధించాల్సిన స్థితిలో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. డకెట్, స్టోక్స్ భారీ భాగస్వామ్యంతో జట్టును ముందుకు నడిపించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 132 పరుగులు జోడించారు. డకెట్‌తో పాటు బెయిర్‌స్టో (10) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. విజయం కోసం మరో 178 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో స్టోక్స్ బాధ్యత తీసుకొని భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. గ్రీన్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన అతను...గ్రీన్ తర్వాతి ఓవర్లో ఒక ఫోర్ కొట్టి 82 పరుగులకు చేరుకున్నాడు. అదే ఓవర్లో వరుస బంతుల్లో 6, 6, 6 బాది అతను సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. హాజల్‌వుడ్ ఓవర్లోనూ మరో 2 సిక్సర్లు బాదిన స్టోక్స్... స్టార్క్ ఓవర్లోనూ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి 150కు చేరుకున్నాడు. ఏడో వికెట్‌కు బ్రాడ్ (11)తో కలిసి స్టోక్స్ 20.2 ఓవర్లలోనే 108 పరుగులు జోడించాడు. ఆసీస్ మూడు క్యాచ్‌లు వదిలేయడం కూడా స్టోక్స్‌కు కలిసొచ్చింది. ఇంగ్లండ్ గెలుపు దిశగా వెళుతున్నట్లు అనిపించింది. అయితే హాజల్‌వుడ్ బౌలింగ్‌లో స్టోక్స్ మరో భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అంచనా తప్పడంతో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేవగా బ్యాక్వర్డ్ పాయింట్ వరకు పరుగెత్తుతూ వెళ్లి కీపర్ క్యారీ అందుకోవడంతో అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత మిగిలిన 3 వికెట్లు తీసేందుకు ఆసీస్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. -
నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.. వాళ్లు ఛీటర్స్! ఆస్ట్రేలియాకు ఇది అలవాటే
లార్డ్స్ వేదికగా జరుగుతున్న యాషెస్ రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. 371 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ పోరాడతోంది. 114/4 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లడ్ జట్టు.. లంచ్ బ్రేక్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 128 పరుగులు కావాలి. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(108) పరుగులతో అద్భుతమైన పోరాట పటిమ కనబరుస్తున్నాడు. అయితే సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో విచిత్రకర రీతిలో రనౌటయ్యాడు. ఏం జరిగిదంటే? ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 52 ఓవర్ వేసిన కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో ఆఖరి బంతిని బెయిర్ స్టో వెనుక్కి విడిచిపెట్టాడు. ఈ క్రమంలో బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఓవర్ ముగిసిందని భావించిన జానీ బెయిర్‌స్టో.. క్రీజును వదిలి ముందుకు వచ్చాడు. దీన్ని గమనించిన వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బంతిని స్టంప్స్‌కు త్రో చేసి రనౌట్‌కి అప్పీల్ చేశాడు. అయితే బెయిర్‌స్టో కనీసం కీపర్‌కి కానీ, అంపైర్‌కీ కానీ సిగ్నల్ ఇవ్వకుండా క్రీజు దాటడంతో థర్డ్ అంపైర్ రనౌట్‌గా ప్రకటించాడు. సాధారణంగా ఒక ఆటగాడు ఓవర్ పూర్తి అయిన వెంటనే క్రీజు నుండి బయటకు వచ్చే ముందు కీపర్ లేదా అంపైర్‌కు సిగ్నల్ ఇవ్వాలి. అప్పుడే డెడ్‌బాల్(ఓవర్ పూర్తి అయినట్లు)గా పరిగణిస్తారు. ఈ సందర్భంలో బెయిర్‌స్టో అలా చేయనందున అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయాన్ని చూసిన బెయిర్ స్టో ఆశ్యర్యపోయాడు. కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన బెయిర్‌స్టో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇక బెయిర్‌స్టో రనౌట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. ఆసీస్ ఛీటర్స్.. ఇంగ్లండ్ ఫ్యాన్స్, జానీ బెయిర్‌స్టో రనౌట్‌ని క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా అభివర్ణిస్తున్నారు. ఆస్ట్రేలియా రనౌట్ అప్పీల్‌ను ఉపసంహరించుకోకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఓవర్ అయిపోయిందనే ఉద్దేశంతో క్రీజు దాటిన వ్యక్తిని రనౌట్ చేయడం సరికాదని ఆసీస్ జట్టుపై విమర్శల గుప్పిస్తున్నారు. మరి కొంత మంది ఆసీస్‌కు ఇది అలవాటే అని, ఛీటర్స్ అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అదే విధంగా స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఛీటర్స్ అంటూ గట్టిగా అరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. చదవండి: Ind vs WI: వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. ఫోటో వైరల్ BAIRSTOW IS RUN-OUT. WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3 — Johns. (@CricCrazyJohns) July 2, 2023 -
అరుదైన మైలురాయిని దాటిన స్టీవ్ స్మిత్.. ఇతని కంటే కోహ్లి ఒక్కడే బెటర్
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా నిన్న (జూన్ 28) మొదలైన యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఇందులో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ సాధించింది ప్రధానమైనది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 పరుగులతో అజేయంగా నిలిచిన స్మిత్.. అంతర్జాతీయ క్రికెట్లో 15000 పరుగుల మైలురాయిని దాటాడు. టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు 41 మంది మాత్రమే ఈ మైల్‌స్టోన్‌ను చేరుకున్నారు. వీరిలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (53.44) ఒక్కడే స్మిత్ (49.67) కంటే మెరుగైన యావరేజ్ కలిగి ఉన్నాడు. ఇదే మ్యాచ్‌లో స్మిత్ టెస్ట్‌ల్లో 9000 పరుగుల మార్కును కూడా అధిగమించాడు. 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మిత్ ఈ ఫీట్‌ను సాధించాడు. 2000 పరుగులు, 20 వికెట్లు.. ఇక ఈ మ్యాచ్‌లో మరో రెండు సాధారణమైన రికార్డులు కూడా నమోదయ్యాయి. తొలి రోజు 2 వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్.. యాషెస్ సిరీస్‌లో 2000 పరుగులు, 20 వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అతనికి ముందు వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (2172, 74), వాలీ హామ్మండ్ (2852, 36) ఈ ఘనత సాధించారు. ఆరో ఇంగ్లండ్ వికెట్‌కీపర్.. తొలి రోజు ఆటలో ట్రవిస్ హెడ్‌ను స్టంపౌట్ చేయడం ద్వారా జానీ బెయిర్‌స్టో ఓ రికార్డు నెలకొల్పాడు. యాషెస్ సిరీస్‌లో 50 డిస్మిసల్స్ చేసిన ఆరో ఇంగ్లండ్ వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బెయిర్‌స్టోకు (50) ముందు అలెన్ నాట్ (101), డిక్ లిల్లీ (84), అలెక్ స్టివర్ట్ (78), గార్ఫ్రే ఈవాన్స్ (76), మ్యాట్ ప్రయర్ (63) ఈ ఘనత సాధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆటలో ఆసీస్ ఆధిపత్యం చలాయించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (66), ట్రవిస్ హెడ్ (77), స్టీవ్ స్మిత్ (85 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. లబూషేన్ (47) పర్వాలేదనిపించాడు. తొలి టెస్ట్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖ్వాజా (17), కెమారూన్ గ్రీన్ (0) నిరాశపరిచారు. స్మిత్‌తో పాటు అలెక్స్ క్యారీ (11) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, జో రూట్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఓలీ రాబిన్సన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
పిచ్ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్ స్టో
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్ వేదికగా రెండో టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్ బజ్‌బాల్ దూకుడుకు ముకుతాడు వేస్తూ ఆసీస్ అద్బుత విజయాన్ని మూటగట్టుకుంది. అయితే కేవలం ఒక్క టెస్టు ఓడినంత మాత్రానా బజ్‌బాల్ ఆటను ఆపే ప్రసక్తే లేదని స్టోక్స్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ మీదకు దూసుకొచ్చిన ఆందోళనకారులు కాగా మ్యాచ్ ప్రారంభం అయిన కాసేపటికే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కొందరు ఆందోళనకారులు స్టేడియంలోని పిచ్‌పైకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్టేడియం నాలుగు వైపుల నుంచి ఒక్కసారిగా ఆందోళనకారులు దూసుకురావడంతో ఒక్క నిమిషం అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏం అర్థం కాలేదు. ఇంతలో గ్రౌండ్‌స్టాఫ్ వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దశలో బౌలింగ్ ఎండ్‌లో ఇద్దరు ఆందోళనకారులు సిబ్బందిని అడ్డుకుంటూ కిందపడేశారు. కాగా ఈ ఆందోళనకారులు ఎవరంటే.. 'జస్ట్ స్టాప్ ఆయిల్' అనే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవలీ కాలంలో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా ఈ ఆందోళనకారులు అక్కడికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లండ్‌లో ఆయిల్ టర్మినెల్స్ను కాపాడాలంటూ జస్ట్ స్టాప్ ఆయిల్ పేరుతో ఒక సోషల్ యాక్టివిస్ట్ సంస్థ 2022 నుంచి తమ ఉద్యమం కొనసాగిస్తుంది. ఏమిటీ ‘జస్ట్ స్టాప్ ఆయిల్’? పర్యావరణానికి హాని కలిగించే చమురు ఉత్పాదన కోసం కొత్త లైసెన్సులను నిలిపివేయాలని కొందరు నిరసనకారులు ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ పేరిట ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది బ్రిటన్‌లో పలు క్రీడల ఈవెంట్లను ఈ పర్యావరణ కార్యకర్తలు ఆటంకపరుస్తూ తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇంగ్లండ్, ఐర్లాండ్ క్రికెట్ మ్యాచ్, ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు, ప్రీమియర్‌షిప్ రగ్బీ ఫైనల్‌కు, ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లలోనూ తమ నిరసన గళం వినిపించారు. ఆశ్చర్యపరిచిన బెయిర్ స్టో చర్య.. ఇదంతా సీరియస్‌గా జరుగుతున్న సమయంలోనే ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో చేసిన పని అభిమానులను ఆశ్చర్యపరిచింది. తమ వైపుగా దూసుకొచ్చిన ఒక ఆందోళనకారుడిని బెయిర్ స్టో తన చేతుల్లోకి ఎత్తుకొని బౌండరీ లైన్ వద్ద ఎత్తిపడేశాడు. ''మీరు ఉద్యమం చేయడం తప్పు కాదు.. కానీ ఇలా మ్యాచ్‌కు ఆటంకం కలిగించడం మంచి పద్దతి కాదు'' అంటూ బెయిర్ స్టో అతనికి సర్ది చెప్పాడు. కాగా బెయిర్ స్టో చర్యకు అభిమానులు షాక్ తిన్నప్పటికి.. అతను చేసింది సరైన చర్యే అవడంతో చప్పట్లతో అభినందించారు. ఇక బెయిర్ స్టో తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టేటప్పుడు ఆసీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లు బెయిర్ స్టోకు అభినందనలు తెలపడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Bairstow picking up a pitch invader#Ashes pic.twitter.com/vCWCkXb3IA — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 28, 2023 Good start to the 2nd test. Bairstow has done some heavy lifting already😂😂 #Ashes2023 pic.twitter.com/f0JcZnCvEr — Ashwin 🇮🇳 (@ashwinravi99) June 28, 2023 చదవండి: విండీస్‌కు చివరి చాన్స్; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం! ‘పాకిస్తాన్ జట్టు భద్రతకై ప్రత్యేక ఏర్పాట్లు.. వాళ్లకు భయం వద్దు! నాకు నమ్మకం ఉంది’ -
ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ఇదే! స్టార్ క్రికెటర్ వచ్చేశాడు
లార్డ్స్ వేదికగా జూన్1నుంచి ఐర్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టు కోసం ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ టెస్టుకు ఆ జట్టు స్టార్ పేసర్లు క్రిస్‌వోక్స్,, మార్క్ వుడ్, ఓలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్ ఫిట్నెస్ కారణంగా దూరమయారు. ఈ క్రమంలో పేసర్ జోష్ టంగ్ ఇంగ్లండ్ తరపున టెస్టు అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. కాగా ఈ టెస్టుకు తొలుత 15 మంది సభ్యులతో కూడిన ప్రకటించిన జట్టులో జోష్ టంగ్ చోటుదక్కలేదు. కానీ ఈ నలుగురు పేసర్లు ఈ టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో.. ఆఖరి నిమిషంలో జోష్ టంగ్‌కు చోటుదక్కింది. కౌంటీల్లో వోర్సెస్టర్షైర్ తరపున అద్భుతంగా రాణించడంతో టంగ్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 82 ఇన్నింగ్స్‌లలో 162 వికెట్లు పడగొట్టాడు ఈ వోర్సెస్టర్షైర్ పేసర్. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టెస్టుతో వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో పనరాగమనం చేయనున్నాడు. కాలి గాయం కారణంగా దాదాపు ఏడాది నుంచి బెయిర్‌స్టో జట్టుకు దూరంగా ఉన్నసంగతి తెలిసిందే. ఐర్లాండ్‌తో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్, జాక్ లీచ్ చదవండి: WTC final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు గుడ్‌న్యూస్! -
'కెరీర్‌ను తలకిందులు చేసింది.. మళ్లీ నడుస్తాననుకోలేదు'
ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో గతేడాది ఆగస్టులో ప్రమాదవశాత్తూ గాయపడిన సంగతి తెలిసిందే. గోల్ఫ్ ఆడే క్రమంలో స్టిక్ కాలికి బలంగా తగలడంతో బెయిర్ స్టోకు తీవ్ర గాయాలయ్యాయి. కాలికి సర్జరీ అనంతరం ఎనిమిది నెలల పాటు విశ్రాంతి తీసుకొని కోలుకున్నాడు. ఈ కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్ మినీ వేలంలో బెయిర్ స్టోను రూ. 6.75 కోట్లకు దక్కించుకుంది. తాజాగా గాయం నుంచి కోలుకున్న బెయిర్ స్టోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) వచ్చే నెలలో ఐర్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు ఎంపికచేసింది. నిజానికి బెయిర్ స్టో గాయపడే సమయానికి కెరీర్లో పీక్ ఫామ్‌లో ఉన్నాడు. తనను మళ్లీ జట్టులోకి ఎంపిక చేయడంపై బెయిర్ స్టో స్పందించాడు. ఏదో కాలక్షేపం కోసం ఆడిన గోల్ఫ్ తన కెరీర్‌ను తలకిందులు చేసిందని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపాడు. '' నిజానికి మళ్లీ నడుస్తాననుకోలేదు.. ఎందుకంటే కాలికి గోల్ఫ్ స్టిక్ బలంగా తగిలింది. ఇక జీవితంలో జాగ్ చేయడం, నడవడం, పరిగెత్తడం చేయలేకపోవచ్చనుకున్నా. ఈ దెబ్బతో క్రికెట్‌కు దూరమైనట్లేనని భావించా. గాయం నుంచి కోలుకునే సమయంలో నా మైండ్‌లో అన్ని ఇవే ఆలోచనలు. కానీ మన ఆలోచనలే సగం భయాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైతే పాజిటివ్‌గా ఆలోచిస్తావో నీలోని ఆందోళన మొత్తం తొలిగిపోతుంది అని డాక్టర్లు నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు. వారి సూచనలను సీరియస్‌గా తీసుకొని వర్కౌట్స్ చేశా. వంద శాతం ఫలితం వచ్చింది. కానీ ఇంతకముందులా మైదానంలో పరుగులు తీయగలనా.. ఫీల్డింగ్ చేయగలనా అనే సందేహం ఉండేది. కానీ ఫిట్నెస్ పరంగా తీసుకున్న జాగ్రత్త చర్యలు నాలోని భయాన్ని మొత్తం పోగొట్టాయి.'' అంటూ తెలిపాడు. చదవండి: #RileeRossouw: అచ్చొచ్చిన స్థానం.. మించినోడు లేడు -
ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! విధ్వంసకర వీరుడు వచ్చేశాడు
ఐర్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జూన్ 1న లండన్ వేదికగా ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా దూరమయ్యాడు. అదే విధంగా కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడుతూ గాయపడ్డ ఆ జట్టు వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఫూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతడికి ఐర్లాండ్‌తో టెస్టు జట్టులో చోటు దక్కింది. మరోవైపు కాలి గాయం కారణంగా దాదాపు ఏడాది నుంచి జట్టుకు దూరంగా ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో కూడా ఈ టెస్టుతో మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. టెస్టుల్లో ఇంగ్లండ్ వైస్ కెప్టెన్‌గా ఆలీ పోప్‌ను సెలక్షన్ కమిటీ నియమించింది. ఐర్లాండ్‌తో ఏకైక టెస్టుకు ఇంగ్లండ్ జట్టు బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జొనాథన్ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఆలీ పోప్, మాథ్యూ పాట్స్, ఆలీ రాబిన్సన్, జో రూట్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ చదవండి: నేను బౌలింగ్ చేసి ఉంటే రాజస్తాన్ 40 పరుగులకే ఆలౌటయ్యేది: కోహ్లి -
సూర్య, హర్మన్‌ల ఖాతాలో ప్రతిష్టాత్మక అవార్డు
టీమిండియా టి20 స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రతిష్టాత్మక విజ్డెన్ క్రికెటర్ అవార్డును గెలుచుకున్నారు. గతేడాది టి20 క్రికెట్లో సూపర్ ప్రదర్శనతో అదగొట్టినందుకు గాను సూర్యకుమార్ విజ్డన్ అల్మానిక్ లీడింగ్ టి20 క్రికెటర్ ఇన్ వరల్డ్ అవార్డు గెలుచుకోగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. తద్వారా విజ్డన్ అవార్డు గెలిచిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. 2022 ఏడాదిలో సూర్యకుమార్ టి20 క్రికెట్లో అద్బుత ప్రదర్శన కనబరిచాడు. 2022 ఏడాదిలో 187.43 స్ట్రైక్‌రేట్‌తో సూర్య 1164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉండగా.. 68 సిక్సర్లు బాదాడు. సూర్య బ్యాటింగ్ మాయాజాలంతో టీమిండియా 40 మ్యాచ్‌ల్లో 28 మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఇక నాటింగ్హమ్ వేదికగా జరిగిన టి20 మ్యాచ్‌లో 55 బంతుల్లోనే 117 పరుగులు చేసిన సూర్యకు టి20ల్లో తొలి శతకం. ఇక హర్మన్‌ప్రీత్ గతేడాది కెప్టెన్‌గానే గాక బ్యాటర్‌గానూ అదరగొట్టింది. వన్డేల్లో 754 పరుగులు, టి20ల్లో 524 పరుగులు సాధించింది. ఇంగ్లండ్‌పై వన్డే మ్యాచ్‌లో 143 పరుగులు నాటౌట్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో కెరీర్ బెస్ట్ నమోదు చేసింది. ఇక కెప్టెన్‌గా కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఇక మరిన్ని అవార్డుల విషయానికి వస్తే.. గతేడాది టెస్టుల్లో టాప్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో ఔట్‌స్టాండింగ్ టెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకోగా.. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వరుసగా మూడోసారి లీడింగ్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. గతేడాది బెన్ స్టోక్స్ నాయకత్వంలో 10 టెస్టుల్లో తొమ్మిదింటిలో గెలవడం విశేషం. అలాగే 2022 టి20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. ఇక ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ వరల్డ్ టాప్ వుమెన్స్ క్రికెటర్ అవార్డును రెండోసారి కొల్లగొట్టింది. -
Punjab Kings: బెయిర్‌స్టో స్థానాన్ని భర్తీ చేయనున్న ఆసీస్ విధ్వంసకర బ్యాటర్
పంజాబ్ కింగ్స్.. గాయపడిన తమ డాషింగ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో స్థానాన్ని ఆస్ట్రేలియా విధ్వంసకర ప్లేయర్‌తో భర్తీ చేసింది. గత బిగ్‌బాష్ లీగ్ సీజన్లో ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు గెలుచుకున్న అడిలైడ్ స్ట్రయికర్స్ ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్‌ను పంజాబ్ కింగ్స్ బెయిర్‌స్టో రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఇవాళ (మార్చి 25) అధికారికంగా వెల్లడించింది. గోల్ఫ్ ఆడుతూ కిందపడిన బెయిర్‌స్టో.. పాత గాయం తిరగబెట్టడంతో కొద్ది రోజులుగా రిహాబ్‌లో ఉన్నాడు. గాయం ఎంతకీ మానకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పంజాబ్ అతన్ని తప్పించి షార్ట్‌ను ఎంపిక చేసింది. పంజాబ్ కింగ్స్.. 2022 మెగా వేలంలో బెయిర్‌స్టోను రూ. 9.75 భారీ ధర వెచ్చింది సొంతం చేసుకుంది. తనకు చెల్లించిన డబ్బుకు న్యాయం చేస్తూ.. బెయిర్‌స్టో గత సీజన్లో మెరుగ్గా రాణించాడు. Matthew Short 👀pic.twitter.com/Bh7hOtNivO — CricTracker (@Cricketracker) March 25, 2023 2022 ఐపీఎల్లో 11 ఇన్నింగ్స్‌లు ఆడిన బెయిర్‌స్టో 144.57 స్ట్రయిక్ రేట్‌తో 253 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక, మాథ్యూ షార్ట్ విషయానికొస్తే.. ఈ అడిలైడ్ బ్యాటర్ గత బీబీఎల్ సీజన్లో 14 ఇన్నింగ్స్‌ల్లో 144 స్ట్రయిక్ రేట్‌తో 458 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. 𝐓𝐫𝐢𝐩𝐥𝐞 the swag, 𝐓𝐫𝐢𝐩𝐥𝐞 the Jazba! 🤩 The King of Kings, D𝐇𝐇𝐇awan has arrived! 𝐀𝐫𝐞 𝐲𝐨𝐮 𝐫𝐞𝐚𝐝𝐲 to 𝐛𝐫𝐞𝐚𝐤 𝐢𝐭 𝐝𝐨𝐰𝐧? 👑#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings @SDhawan25 pic.twitter.com/A36DgrmhFY — Punjab Kings (@PunjabKingsIPL) March 25, 2023 -
ఐపీఎల్-2023కు దూరం కానున్న స్టార్ ఆటగాళ్లు వీరే..!
మార్చి 31 నుంచి 2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌ను ఫోర్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఐకానిక్ స్టేడియంలో రాత్రి 7:30 గంటకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. కాగా, ప్రతి సీజన్లో దేశ, విదేశీ స్టార్లతో కలకలలాడే క్రికెట్ పండుగ ఈసారి కాస్త కలావిహానంగా మారనుంది. గాయాల కారణంగా చాలామంది స్టార్లు సీజన్ మొత్తానికే దూరం కానున్నారు. కొందరేమో లీగ్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. గాయాల కారణంగా ఐపీఎల్ 16వ ఎడిషన్ మొత్తానికే దూరం కానున్న స్టార్ ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది... జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్) రిషబ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్) కైల్ జేమీసన్ (చెన్నై సూపర్ కింగ్స్) విల్ జాక్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) జై రిచర్డ్సన్ (ముంబై ఇండియన్స్) అన్రిచ్ నోర్జే (ఢిల్లీ క్యాపిటల్స్) ప్రిసిద్ధ్ కృష్ణ (రాజస్తాన్ రాయల్స్) జానీ బెయిర్‌స్టో (పంజాబ్ కింగ్స్) సర్ఫరాజ్ ఖాన్ (ఢిల్లీ క్యాపిటల్స్), ముకేశ్ చౌదరీ (చెన్నై సూపర్ కింగ్స్), మొహిసిన్ ఖాన్ (లక్నో సూపర్ జెయింట్స్), శ్రేయస్ అయ్యర్ (కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్), జోష్ హాజిల్‌వుడ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), రజత్ పాటిదార్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఐపీఎల్-2023లో పాల్గొనేది లేనిది తెలియాల్సి ఉంది. -
పంజాబ్ కింగ్స్‌కు ఏకకాలంలో గుడ్‌న్యూస్.. బ్యాడ్‌న్యూస్
మరో వారం రోజుల్లో(మార్చి 31న) ఐపీఎల్ 16వ సీజన్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్‌కు ఏకకాలంలో గుడ్‌న్యూస్.. బ్యాడ్‌న్యూస్ వచ్చాయి. గుడ్‌న్యూస్ ఏంటంటే విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఐపీఎల్లో ఆడేందుకు ఎన్వోసీ క్లియరెన్స్ ఇచ్చింది. అదే సమయంలో మరో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టోకు మాత్రం ఇంకా ఎన్వోసీ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో బెయిర్ స్టో ఐపీఎల్ 16వ సీజన్ ఆడేది అనుమానమే. ఇంగ్లండ్‌కే చెందిన మరో స్టార్ క్రికెటర్ సామ్ కరన్ మాత్రం పంజాబ్ కింగ్స్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డులకెక్కిన సామ్ కరన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18.25 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా అక్టోబర్‌లో మ్యాచ్ సందర్భంగా కాలు విరగడంతో బెయిర్ స్టో ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకొని కోలుకున్నాడు. ప్రస్తుతం ఈసీబీ పర్యవేక్షణలో ఉన్న బెయిర్ స్టో ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌కు ఎన్వోసీ ఇవ్వడానికి ఈసీబీ నిరాకరించింది. దీంతో అతను ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న యాషెస్ సిరీస్ వరకు బెయిర్ స్టో అందుబాటులోకి వస్తాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక డిసెంబర్ 2022లో జరిగిన మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ బెయిర్ స్టోను రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక గతేడాది పాకిస్తాన్‌తో రావల్పిండి టెస్టు అనంతరం మోకాలి గాయంతో ఆటకు దూరమైన లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. పంజాబ్ కింగ్స్ ఇతన్ని రూ. 11.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత లంకాషైర్ తరపున కౌంటీ క్రికెట్ ఆడాడు. ఈసీబీ ఎన్వోసీ క్లియరెన్స్ ఇచ్చినప్పటికి లివింగ్‌స్టోన్ ఎప్పుడు వస్తాడనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు సామ్ కరన్ మాత్రం ఐపీఎల్ 2023 సీజన్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అతనితో పాటు జోఫ్రా ఆర్చర్(ముంబై ఇండియన్స్), బెన్ స్టోక్స్(సీఎస్కే), మార్క్‌వుడ్(లక్నో సూపర్ జెయింట్స్) తదితరులు ఐపీఎల్ 16వ సీజన్లో పాల్గొననున్నారు. IPL 2023లో ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కరన్ (పంజాబ్ కింగ్స్), బెన్ స్టోక్స్ (చెన్నై సూపర్ కింగ్స్), హ్యారీ బ్రూక్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), ఫిల్ సాల్ట్ (ఢిల్లీ క్యాపిటల్స్), రీస్ టాప్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), ఆదిల్ రషీద్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), జో రూట్ (రాజస్థాన్ రాయల్స్) , లియామ్ లివింగ్‌స్టోన్ (పంజాబ్ కింగ్స్), జానీ బెయిర్‌స్టో (పంజాబ్ కింగ్స్), మొయిన్ అలీ (చెన్నై సూపర్ కింగ్స్), జోఫ్రా ఆర్చర్ (ముంబై ఇండియన్స్), జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), డేవిడ్ విల్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) మరియు మార్క్ వుడ్ (లక్నో సూపర్ జెయింట్స్) View this post on Instagram A post shared by S A M C U R R A N (@samcurran58) #SherSquad, we need your undying love and support this year more than ever. We are in this together! ♥️#SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/CnS9DNlcqJ — Punjab Kings (@PunjabKingsIPL) March 21, 2023 చదవండి: క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడిన టెన్నిస్ దిగ్గజం మ్యాచ్ ఓడిపోయినా రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. -
పంజాబ్ కింగ్స్‌కు ఊహించని షాక్.. విధ్వంసకర వీరుడు దూరం!
ఐపీఎల్-2023 సీజన్‌కు ఆరంభానికి ముందు పంజాబ్ కింగ్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా గతడాది అక్టోబరు నుంచి కాలి గాయం కారణంగా బెయిర్‌స్టో క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే అతడు ప్రస్తుతం పూర్తి స్ధాయి ఫిటెనెస్ సాధించాడు. బెయిర్‌స్టో ప్రస్తుతం నెట్స్‌లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ ఈ ఏడాది జరగనున్న యాషెష్ సిరీస్ సమయానికి అతడు మరింత ఫిట్‌గా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఐపీఎల్ 16వ సీజన్ మొత్తానికి దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. "రాబోయే యాషెస్ కోసం జానీ బెయిర్‌స్టో యార్క్‌షైర్‌లో ప్రాక్టీస్ చేయనున్నాడు. దాంతో జానీ ఐపీఎల్-2023కు దూరం కానున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని పంజాబ్ ప్రాంఛైజీకు అతడు తెలియజేశాడు" అని ది గార్డియన్ తమ నివేదికలో పేర్కొంది. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు 39 మ్యాచ్‌లాడిన జానీ బెయిర్‌స్టో.. 142.65 స్ట్రైక్‌రేట్‌తో 1291 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కానుంది. పంజాబ్ తన తొలి మ్యాచ్‌లో ఏప్రిల్ 1న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పంజాబ్ కింగ్స్ ఢీకొట్టనుంది. చదవండి: WTC 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు దూరం! -
శతక్కొట్టుడులో బాబర్ ఆజమే టాప్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరో రికార్డు సాధించాడు. రావల్పిండి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సెంచరీ సాధించిన ఆజమ్ (168 బంతుల్లో 136; 19 ఫోర్లు, సిక్స్).. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు (7) చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ వికెట్‌కీపర్ జానీ బెయిర్‌స్టో (6) అధిగమించిన బాబర్.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్లో 259 ఇన్నింగ్స్‌ల్లో (మూడు ఫార్మాట్లు కలిపి) 27 శతకాలు సాధించిన బాబర్.. ఈ ఒక్క ఏడాదే 7 సెంచరీలు సాధించడం విశేషం. ఇంగ్లండ్‌పై ఇవాళ (డిసెంబర్ 3) చేసిన సెంచరీ బాబర్ టెస్ట్ కెరీర్లో 8వ శతకం. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిధ్య పాక్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన భారీ స్కోర్‌కు ధీటుగా జవాభిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నలుగురు బ్యాటర్లు సెంచరీలతో (బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు), ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్)) చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 657 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. తామేమీ తక్కువ కాదు అన్నట్లు రెచ్చిపోయి ఆడింది. ఆ జట్టు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (203 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇమామ్ ఉల్ హాక్ (207 బంతుల్లో 121; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సహా కెప్టెన్ బాబర్ ఆజమ్ శతకాలతో విరుచుకుపడ్డారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో తొలి ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధిస్తే.. పాక్ టాప్-4 బ్యాటర్లలో ముగ్గురు శతకొట్టారు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 499 పరుగులు చేసింది. అఘా సల్మాన్ (10), జహీద్ మహమూద్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి పాక్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 158 పరుగులు వెనుకపడి ఉంది. -
జట్టును ప్రకటించి 24 గంటలు కాలేదు.. టి20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ స్టార్ దూరం
అక్టోబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) శుక్రవారం 15 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. కాగా జట్టును ప్రకటించి 24 గంటలు గడవకముందే ఇంగ్లండ్‌కు బిగ్‌షాక్ తగిలింది. విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్ స్టో అనూహ్య రీతిలో టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ''బెయిర్ స్టో దూరమవడం మా దురదృష్టం. శుక్రవారం లీడ్స్‌లో గోల్ఫ్ ఆడుతున్న సమయంలో కాలి కింది భాగంలో తీవ్ర గాయమైంది.దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. బెయిర్ స్టోను పరిశీలించిన వైద్యులు సర్జరీ అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌తో పాటు టి20 ప్రపంచకప్‌కు దూరం కానున్నాడు'' అని ఈసీబీ పేర్కొంది. కాగా ఓవల్ వేదికగా సౌతాఫ్రికాతో జరగనున్న మూడో టెస్టుకు బెయిర్ స్టో స్థానంలో బెన్ డకెట్‌ను ఎంపిక చేశారు. అయితే టి20 ప్రపంచకప్‌కు మాత్రం బెయిర్ స్టో స్థానంలో ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు. కాగా బెయిర్ స్టో తన గాయంపై స్పందించాడు. ''ఇవాళ ఉదయం గోల్ఫ్ కోర్సులో గేమ్ ఆడుతుండగా జారి పడ్డాను. దీంతో కాలి కింది భాగంలో గాయం కావడంతో వైద్యులు సర్జరీ అవసరమన్నారు. ఆస్ట్రేలియాలో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు దూరం కావడం బాధిస్తోంది. నేను ఆడకపోయినప్పటికి మా కుర్రాళ్లకు ఆల్ ది బెస్ట్'' అని చెప్పుకొచ్చాడు. ఇక టి20 ప్రపంచకప్‌కు ఈసీబీ ప్రకటించిన జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు చాలా రోజుల తర్వాత పరిమిత ఓవర్ల జట్టుకు పిలుపు రాగా.. జేసన్ రాయ్‌కు మొండిచేయి ఎదురైంది. తాజాగా గాయంతో బెయిర్ స్టో కూడా దూరమయ్యాడు. కాగా రాయ్ ఈ ఏడాది ఇంగ్లండ్ తరఫున ఆడిన 11 టీ20 మ్యాచ్‌లలో మొత్తంగా 206 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు అక్టోబరు 22న అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌తో మెగా ఈవెంట్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. కాగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ జరుగనుంది. టీ20 ప్రపంచకప్-2022కు ఈసీబీ ప్రకటించిన ఇంగ్లండ్ జట్టు : జోస్ బట్లర్(కెప్టెన్), మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. చదవండి: Babar Azam: 'నువ్వే సరిగ్గా ఆడడం లేదు.. ఇంకెందుకు సలహాలు!' KL Rahul: 'మరో రెండు మ్యాచ్‌లు చూస్తారు.. తర్వాత తీసేయడమే' -
నిప్పులు చెరిగిన సఫారీ పేసర్లు.. పేక మేడలా కూలిన ఇంగ్లీష్ బ్యాటర్లు
లండన్: దక్షిణాఫ్రికాతో బుధవారం (ఆగస్ట్ 17) మొదలైన తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు తడబడింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు 32 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు సాధించింది. ఒలీ పోప్ (61; 4 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించి ఇంగ్లండ్ పాలిట ఆపద్భాందవుడయ్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో పోప్‌తో పాటు కెప్టెన్ స్టోక్స్ (20) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. ఆట ముగిసే సమయానికి పోప్‌కు జతగా బ్రాడ్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. నిప్పులు చెరిగిన పేసర్లు.. పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని అంచనా వేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్.. టాస్ గెలిచాక ఏమాత్రం సంకోచించకుండా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. సఫారీ పేసర్లు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ.. ఆట ఆరంభం నుంచే చెలరేగిపోయారు. 3వ ఓవర్లోనే ఓపెనర్ అలెక్స్ లీస్ (5)ను, ఆ తర్వాత 9వ ఓవర్లో మరో ఓపెనర్ జాక్ క్రాలే (9) రబాడ పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత మరింత రెచ్చిపోయిన పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లపై విరుచుకుపడ్డారు. జో రూట్ (8)ను మార్కో జన్సెన్.. బెయిర్‌స్టో (0), బెన్ ఫోక్స్ (6), స్టోక్స్ (20)లను నోర్జే అద్భుతమైన బంతులతో పెవిలియన్‌కు సాగనంపారు. ముఖ్యంగా భీకరమైన ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టోను నోర్జే క్లీన్ బౌల్డ్ చేసిన వైనం తొలి రోజు మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. Anrich Arno Nortje -
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. మరోసారి నిరూపితం
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక దశలో అనుకూలంగా కనిపించేదంతా రివర్స్ అయిపోతుంటుంది. తాజాగా ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్ స్టో విషయంలో ఇదే జరిగింది. ఈ మధ్యకాలంలో బెయిర్ స్టో టెస్టులను కూడా టి20 స్టైల్లో ఆడుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్, భారత్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో ఇదే దూకుడు కనబరిచిన బెయిర్ స్టో మ్యాచ్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా లక్ష్య ఛేదనలో చెలరేగిపోతున్న బెయిర్ స్టో సెంచరీలతో కథం తొక్కాడు. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అని మరోసారి నిరూపితం అయింది. తాజాగా లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో బెయిర్ స్టో డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రొటిస్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే వేసిన బంతి బెయిర్ స్టోను క్లీన్‌బౌల్డ్ చేసింది. గుడ్‌లెంగ్త్‌తో వచ్చిన బంతి మిడిల్ స్టంప్‌ను గిరాటేయగా.. వికెట్ మొత్తం బయటటికి వచ్చింది. నోర్ట్జే ఎంత వేగంతో బంతిని వేశాడనేది దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సౌతాఫ్రికాతో తొలి టెస్టును ఇంగ్లండ్ ఫేలవంగా ఆరంభించింది. తొలి సెషన్లోనే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా అందుకు తగ్గ ఫలితం సాధించింది. పేసర్లు నోర్ట్జే, రబాడలు పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకొని వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌ను ముప్పతిప్పలు పెట్టారు. వర్షం అంతరాయంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఓలీ పోప్(61 బ్యాటింగ్).. ఒక్కడే ప్రొటిస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా స్టువర్ట్ బ్రాడ్(0) క్రీజులో ఉన్నాడు. Anrich Arno Nortje -
కేకేఆర్ ఫ్యామిలీలోకి ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ యూఈఏ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20లో అబుదాబి నైట్‌రైడర్స్ జట్టును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 14 మందితో కూడిన అబుదాబి నైట్‌రైడర్స్(ఏడీకేఆర్)జట్టును కేకేఆర్ యాజమాన్యం మంగళవారం తమ ట్విటర్లో ప్రకటించింది. ప్రస్తుతం ఐపీఎల్లో కేకేఆర్‌కు ఆడుతున్న ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్‌లు యూఏఈ టి20లీగ్‌లోనూ అబుదాబి నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరితో పాటు ఇంగ్లండ్ స్టార్ జానీ బెయిర్ స్టో, ఐర్లాండ్ విధ్వంసకర ఆటగాడు పాల్ స్టిర్లింగ్, లంక క్రికెటర్లు చరిత్ అసలంక, లాహిరు కుమారాలు ఉన్నారు.. కొలిన్ ఇంగ్రామ్, అకిల్ హొసేన్లు కూడా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. ''క్రికెట్లో ప్రపంచవ్యాప్తంగా మా అడుగులు పడడం గొప్ప అచీవ్మెంట్ అన్ని చెప్పొచ్చు. ఐపీఎల్లో కేకేఆర్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో టీకేఆర్.. తాజాగా ఐఎల్టి20లో ఏడీకేఆర్. కేకేఆర్ జట్టులో ఉన్న ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్‌లు ఏడీకేఆర్లో ఉండడం మాకు సానుకూలాంశం. ఇక కేకేఆర్ ఫ్యామిలీలోకి బెయిర్ స్టోకు స్వాగతం. ఐఎల్టి20లో ఏడీకేఆర్ తరపున బెయిర్ స్టో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాలని కోరుకుంటున్నాం. అలాగే లంక క్రికెటర్లు చరిత్ అసలంక, లాహిరు కుమారా.. ఐర్లాండ్ స్టార్ పాల్ స్టిర్లింగ్లకు కూడా గ్రాండ్ వెల్కమ్. కొలిన్ ఇంగ్రామ్, అకిల్ హొసేన్, రవి రాంపాల్ సహా ఇతర క్రికెటర్లకు కూడా స్వాగతం. ఐఎల్టి20 ద్వారా మేం గ్లోబల్ క్రికెట్లో విజయవంతమయ్యే ప్రయత్నంలో ఉన్నాం. ఆల్ ది బెస్ట్ అబుదాబి నైట్‌రైడర్స్ టీం(ఏడీకేఆర్)'' అంటూ ముగించాడు. యూఏఈ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టి20(ఐఎల్టీ20) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరకు జరగనుంది. ఐఎల్టి 20 కోసం అబుదాబి నైట్ రైడర్స్ జట్టు: సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, జానీ బెయిర్‌స్టో, పాల్ స్టిర్లింగ్, లహిరు కుమార, చరిత్ అసలంక, కోలిన్ ఇంగ్రామ్, అకేల్ హోసేన్,రేమాన్ రీఫర్, ఎస్ ప్రసన్న, రవి రాంపాల్, కెన్నార్ లూయిస్,అలీ ఖాన్, బ్రాండన్ గ్లోవర్ Welcome to the family, Knights 💜 https://t.co/mFNyF7a94T — KolkataKnightRiders (@KKRiders) August 16, 2022 చదవండి: MI Emirates: 'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్‌పై కన్నేశారు -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ ఎవరంటే..?
2022 జులై నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ జాబితాను ఐసీసీ బుధవారం (ఆగస్ట్ 3) ప్రకటించింది. పురుషుల క్రికెట్‌కు సంబంధించి ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్‌స్టో, శ్రీలంక సంచలన స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య, ఫ్రాన్స్ యువ చిచ్చరపిడుగు గుస్తావ్ మెక్కియోన్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మహిళల కేటగిరీలో టీమిండియా యువ బౌలర్ రేణుకా సింగ్, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు ఎమ్మా లాంబ్, నతాలీ సీవర్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో నిలిచారు. జూన్ నెల మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచిన బెయిర్‌స్టో తన కెరీర్ బెస్ట్ ఫామ్‌ను కొనసాగిస్తూ.. జులై నెల నామినీస్ జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. భారత్‌తో జరిగిన రీషెడ్యూల్ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు (106, 114*) బాదిన బెయిర్‌స్టో.. ఆ ప్రదర్శన ఆధారంగానే ఈ జాబితాలో చోటు దక్కించకున్నాడు. అనంతరం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 63 పరుగులు చేసిన అతను.. ఆతర్వాత జరిగిన తొలి టీ20లో 53 బంతుల్లో 90 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. ఇక లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య విషయానికొస్తే.. ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ జులై నెలలో తానాడినడిన 3 టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు నేలకూల్చి ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో నిలిచాడు. ఆసీస్‌పై 6/118, 6/59.. ఆతర్వాత పాక్‌పై తొలి టెస్ట్‌లో 5/82, 4/135, రెండో టెస్ట్‌లో 3/80, 5/117 అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. గుస్తావ్ మెక్కియోన్ విషయానికొస్తే.. ఈ ఫ్రెంచ్ యువ బ్యాటర్ టీ20ల్లో వరుసగా రెండు విధ్వంసకర సెంచరీలతో (109, 101) ప్లేయర్ ఆఫ్ ద మంత్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మహిళల కేటగిరీలో రేణుకా సింగ్ ఐదు మ్యాచ్‌ల్లో 12 వికెట్ల ప్రదర్శనతో.. లాంబ్ 3 మ్యాచ్‌ల్లో 102, 67, 65 అదిరిపోయే ప్రదర్శనతో.. సీవర్ వరుస హాఫ్ సెంచరీలతో ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో నిలిచారు. చదవండి: భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. హైదరాబాద్‌లో మ్యాచ్ ఎప్పుడంటే..? -
దేశం కోసం ఆడేందుకు కీలక లీగ్ నుంచి తప్పుకున్న బెయిర్‌స్టో
డబ్బులొచ్చే టోర్నీల కన్నా దేశం కోసం ఆడటమే ముఖ్యమని నిరూపించాడు ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు జానీ బెయిర్‌స్టో. ఇటీవలి కాలంలో ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్న బెయిర్‌స్టో.. త్వరలో దక్షిణాఫ్రికాతో జరుగబోయే టెస్ట్ సిరీస్ కోసం స్వదేశంలో జరిగే 'హండ్రెడ్ లీగ్'లో ఆడే అవకాశాన్ని వదులుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో బిజీ షెడ్యూల్ కారణంగా అలసిపోయానని, మున్ముందు కూడా చాలా హెవీ షెడ్యూల్ ఉన్నందున రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నానని, అందుకే హండ్రెడ్ లీగ్‌కి దూరంగా ఉండాలని అనుకుంటున్నానని బెయిర్‌స్టో వెల్లడించాడు. బెయిర్‌స్టో.. ఇవాల్టి (ఆగస్ట్ 3) నుంచి ప్రారంభం కానున్న హండ్రెడ్ లీగ్ రెండో ఎడిషన్‌లో కార్డిఫ్ ఫ్రాంచైజీ అయిన వెల్ష్ ఫైర్‌కు ఆడాల్సి ఉండింది. వెల్ష్ ఫైర్ ఇవాల్టి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ బ్రేవ్‌ను ఢీకొట్టాల్సి ఉంది. హండ్రెడ్ లీగ్‌లో మొత్తం ఎనిమిది జట్లు (ట్రెంట్ రాకెట్స్, నార్తర్న్ సూపర్‌చార్జర్స్, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్, సౌత్ బ్రేవ్, వెల్ష్ ఫైర్, ఓవల్ ఇన్విన్సిబుల్స్, మాంచెస్టర్ ఒరిజినల్, లండన్ స్పిరిట్) ఒకదానితో ఒకటి తలపడతాయి. ఒక్కో ఇన్నింగ్స్‌లో 100 బాల్స్ చొప్పున సాగే ఈ టోర్నీ.. టీ20 తరహాలో ప్రజాధరణ పొందలేకపోయింది. ఇదిలా ఉంటే, ఆగస్ట్ 17 నుంచి దక్షిణాఫ్రికాతో జరుగనున్న మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం (తొలి రెండు టెస్ట్‌లకు) ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిన్న (ఆగస్ట్ 2) జట్టును ప్రకటించింది. 14 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో బెయిర్‌స్టో సహా బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలీ, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్టన్, మాథ్యూ పాట్స్, ఆలీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్ ఉన్నారు. చదవండి: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్! -
మెయిన్ అలీ, బెయిర్ స్టోల విధ్వంసం.. తొలి టి20లో ఇంగ్లండ్ ఘన విజయం
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. బుధవారం బ్రిస్టల్ వేదికగా జరిగిన తొలి టి20లో ఇంగ్లండ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. జానీ బెయిర్ స్టో 53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 90 పరుగులు విధ్వంసం సృష్టించగా.. మెయిన్ అలీ 18 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 52 పరుగులతో ప్రొటీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. అంతకముందు డేవిడ్ మలాన్ కూడా 23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేయగలిగింది. ట్రిస్టన్ స్టబ్స్ 28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 72 పరుగులు, రీజా హెండ్రిక్స్ 33 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 57 పరుగులు చేసినప్పటికి మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రిచర్డ్ గ్లెసన్ 3, రీస్ టోప్లీ, ఆదిల్ రషీద్ రెండు వికెట్లు తీయగా.. మొయిన్ అలీ ఒక వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ.. బౌలింగ్‌లో ఒక వికెట్ తీసిన మొయిన్ అలీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య రెండో టి20 గురువారం(జూలై 28న) జరగనుంది. చదవండి: రోహిత్ శర్మ రికార్డు బద్దలు.. కివీస్ తరపున తొలి ఆటగాడిగా -
కెరీర్లో సవాళ్లు సహజం.. నేను ఇప్పుడే అలాంటి నిర్ణయం తీసుకోను!
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో బిజీ షెడ్యూల్ ఆటగాళ్ల మానసిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వకుండా వరుస సిరీస్‌లు నిర్వహించడంపై ఐసీసీతో పాటు ఆయా దేశాల క్రికెట్ బోర్డులపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో స్పందించిన విధానం ఆసక్తికరంగా మారింది. ‘‘సహజంగానే కెరీర్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అయితే, నేను మాత్రం వీలైనంత ఎక్కువ కాలం అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు ప్రయత్నిస్తాను. కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. నా వరకైతే సమీప భవిష్యత్తులో నేను అలాంటి నిర్ణయమేదీ తీసుకోబోను. వీలైనంత కాలం ఆడుతూనే ఉంటాను’’ అని బెయిర్‌స్టో చెప్పుకొచ్చాడు. మూడు ఫార్మాట్ల జట్లలోనూ భాగం కావడం తనకిష్టమని, తద్వారా ఆటలో కొత్తదనం ఆస్వాదించే అవకాశం దొరుకుతుందని వ్యాఖ్యానించాడు. కాగా స్వదేశంలో న్యూజిలాండ్ టెస్టు సిరీస్, టీమిండియాతో రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్‌లో అద్భుత సెంచరీలతో ఆకట్టుకున్నాడు బెయిర్‌స్టో. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టీమిండియాతో టీ20, వన్డే సిరీస్ ముగిసిన అనంతరం బెయిర్‌స్టో ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగమయ్యాడు. ఇందులో భాగంగా శుక్రవారం నాటి రెండో వన్డేలో 27 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. ఇక వర్షం కారణంగా 29 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 118 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. చదవండి: Shikhar Dhawan- Nicholas Pooran: సెంచరీ చేజారినందుకు బాధగా ఉంది! అసలైన గెలుపు మాదే! Sanju Samson: సంజూ ఆ బంతిని ఆపకపోయి ఉంటే.. టీమిండియా ఓడిపోయేదే! నువ్వు సూపర్! -
ICC POTM June: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతలు వీరే!
ICC Player Of The Month June 2022 Winners: స్వదేశంలో న్యూజిలాండ్, టీమిండియాతో టెస్టు మ్యాచ్‌లలో అదరగొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. జూన్ నెలకు గానూ అతడు ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. సహచర ఆటగాడు జో రూట్‌ను అధిగమించి ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి సోమవారం ప్రకటించింది. అదే విధంగా మహిళల విభాగంలో దక్షిణాఫ్రికా స్టార్ మారిజాన్ కాప్ ఈ అవార్డు అందుకున్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన నేపథ్యంలో ఈ ఆల్‌రౌండర్‌ను పురస్కారం వరించింది. జానీ బెయిర్‌స్టో అద్భుత ఇన్నింగ్స్ న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా జో రూట్, బెయిర్‌స్టో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. జట్టుకు అవసరమైన సమయంలో రాణించి సిరీస్ గెలవడంలో తమ వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా రెండో టెస్టులో ఆఖరి రోజు ఆటలో భాగంగా బెయిర్‌స్టో 136 పరుగులతో రాణించడం విశేషం. దీంతో 5 వికెట్ల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్ గెలిచింది. బెయిర్‌స్టో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. Rock & Roll Test Cricket 🎸🤘 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/gneNM0rqy3 — England Cricket (@englandcricket) July 6, 2022 ఇక మూడో టెస్టులో వరుసగా 162, 71 (నాటౌట్) పరుగులు సాధించాడు. అదే విధంగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టులో 106, 114 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో బెయిర్‌స్టో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలవడం విశేషం. కాప్ అదరగొట్టే ప్రదర్శన.. ఇంగ్లండ్ మహిళా జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు సాధించిన ఆమె.. రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులతో అజేయంగా నిలిచారు. Record-breaker Marizanne Kapp sums up Day 1 as the #MomentumProteas get ready for Day 2 🔊 📺 SuperSport Grandstand 201 #ENGvSA #AlwaysRising #BePartOfIt pic.twitter.com/0e4THeOSPq — Cricket South Africa (@OfficialCSA) June 28, 2022 చదవండి: Surya Kumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్యకుమార్ యాదవ్! మాక్సీ రికార్డు బద్దలు.. మరెన్నో! -
'టెస్టుల్లో అతడికి సచిన్ రికార్డు బ్రేక్ చేసే సత్తా ఉంది'
టెస్టుల్లో అదరగొడుతున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌పై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడని జాఫర్ అభిప్రాయపడ్డాడు. మరో ఐదు ఆరేళ్ల పాటు ప్రస్తుత స్థాయిలో ఆడితే ఈ అరుదైన మైలురాయిని చేరుకోగలడని జాఫర్ తెలిపాడు. కాగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదు టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు జో రూట్,జానీ బెయిర్ స్టో కీలక పాత్ర పోషించారు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 31పరుగులు సాధించన రూట్.. రెండో ఇన్నింగ్స్‌లో 144 పరుగులతో చెలరేగాడు. ఇక ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 737 పరుగులతో జో రూట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా రూట్ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో రూట్ 396 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు, ఒక అర్ధసెంచరీ ఉన్నాయి. "రూట్‌కు ప్రస్తుతం కేవలం 31 ఏళ్లు మాత్రమే. కానీ ఇంగ్లండ్, ఆసీస్ క్రికెటర్లు త్వరగా తమ కెరీర్లను ముగిస్తూ ఉంటారు. అయితే అతడు మరో 5-6 ఏళ్లు క్రికెట్ ఆడితే సచిన్ రికార్డు బ్రేక్ చేయగలడు" అని జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: IND vs ENG 1stT20: ఇంగ్లండ్‌తో తొలి టీ20.. భారత్ గెలవడం కష్టమే..! -
Ind Vs Eng: రూట్, బెయిర్‌స్టోపై సచిన్ ప్రశంసలు.. మరీ ఇంత ఈజీగా!
India Vs England 5th Test: ఇంగ్లండ్ బ్యాటర్లు జో రూట్, జానీ బెయిర్‌స్టోపై టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ప్రశంసలు కురిపించాడు. బ్యాటింగ్ చేయడం ఇంత సులువా అనేలా అందరినీ ఆశ్చర్యపరిచారని కొనియాడాడు. కాగా టీమిండియాతో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో మాజీ కెప్టెన్ జో రూట్(142 పరుగులు- నాటౌట్), బెయిర్‌స్టో(114 పరుగులు- నాటౌట్) 269 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశారు. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భీకర బ్యాటింగ్‌తో చెలరేగారు. ఇరువురూ సెంచరీలతో అజేయంగా నిలిచారు. తద్వారా మూడో రోజు వరకు పర్యాటక జట్టు చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను.. అమాంతంగా లాక్కొని ఇంగ్లండ్‌ను ఏడు వికెట్ల తేడాతో గెలిపించారు. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 2-2తో సమమైంది. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా స్పందించిన సచిన్.. రూట్, బెయిర్‌స్టోలను అభినందించాడు. ‘‘ఇంగ్లండ్‌కు ఇది ఓ ప్రత్యేకమైన విజయం. సిరీస్ సమమైంది. జో రూట్, జానీ బెయిర్‌స్టో అద్భుత ఫామ్ కనబరిచారు. బ్యాటింగ్ చేయడం ఇంత ఈజీనా అనిపించారు’’ అంటూ ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌ను ట్యాగ్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన రూట్.. కివీస్ ఆటగాడు డారిల్ మిచెల్‌తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. టీమిండియాతో సిరీస్‌లోనూ తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి ఈ అవార్డును పంచుకున్నాడు. ఈ క్రమంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక ఐదో టెస్టులో బెయిర్ స్టో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అదే విధంగా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి పదో స్థానానికి చేరుకున్నాడు. చదవండి: Ind Vs WI 2022: విండీస్‌తో సిరీస్.. శిఖర్ ధావన్‌కు బంపరాఫర్.. వన్డే జట్టు కెప్టెన్‌గా.. బీసీసీఐ ప్రకటన Virat Kohli: ఆరేళ్లలో ఇదే తొలిసారి.. అయినా నీకే ఎందుకిలా? ఇప్పటికైనా కళ్లు తెరువు.. లేదంటే! Rock & Roll Test Cricket 🎸🤘 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/gneNM0rqy3 — England Cricket (@englandcricket) July 6, 2022 Special win by England to level the series. Joe Root & Jonny Bairstow have been in sublime form and made batting look very easy. Congratulations to England on a convincing victory. @Bazmccullum #ENGvIND pic.twitter.com/PKAdWVLGJo — Sachin Tendulkar (@sachin_rt) July 5, 2022 -
ICC Rankings: దుమ్ములేపిన పంత్.. దిగజారిన కోహ్లి ర్యాంకు.. బెయిర్‌స్టో హై జంప్!
ICC Test Rankings- India Vs England: ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్ అదరగొట్టాడు. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ అద్భుత ఆటతీరు కనబరిచిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ(146 పరుగులు), రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం(57 పరుగులు) సాధించాడు. ఈ క్రమంలో 801 పాయింట్లు తన ఖాతాలో వేసుకున్న పంత్... టాప్-5లోకి దూసుకువచ్చాడు. మరోవైపు టాప్-10లో భారత ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడికే స్థానం దక్కింది. కోవిడ్ బారిన పడి ఇంగ్లండ్‌తో టెస్టుకు దూరమైన అతడు ఒక స్థానం దిగజారి తొమ్మిదో ర్యాంకుకు పడిపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో విఫలమైన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి 13వ ర్యాంకుకు పడిపోయాడు. ఇదిలా ఉంటే ఎడ్జ్‌బాస్టన్‌లో దుమ్ము లేపిన ఇంగ్లండ్ టెస్టు జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ 923 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సెంచరీతో ఆకట్టుకున్న జానీ బెయిర్‌స్టో ఏకంగా 11 స్థానాలు ఎగబాకాడు. పదో ర్యాంకు సాధించాడు. కాగా టీమిండియాతో రీషెడ్యూల్డ్ టెస్టులో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 2-2తో సమమైంది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ టాప్-10లో ఉన్నది వీళ్లే 1. జో రూట్(ఇంగ్లండ్) 2.మార్నస్ లబుషేన్(ఆస్ట్రేలియా) 3.స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా) 4.బాబర్ ఆజం(పాకిస్తాన్) 5.రిషభ్ పంత్(ఇండియా) 6.కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్) 7.ఉస్మాన్ ఖవాజా(ఆస్ట్రేలియా) 8.దిముత్ కరుణరత్నె(శ్రీలంక) 9.రోహిత్ శర్మ(ఇండియా) 10.జానీ బెయిర్‌స్టో(ఇంగ్లండ్) చదవండి: రూత్‌లెస్ రూట్.. టీమిండియాపై పూనకం వచ్చినట్లు ఊగిపోతున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ Rock & Roll Test Cricket 🎸🤘 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/gneNM0rqy3 — England Cricket (@englandcricket) July 6, 2022 -
భారత్‌పై ఇంగ్లండ్ సూపర్ విక్టరీ.. సిరీస్ సమం (ఫొటోలు)
-
ఎంత పని చేశావు విహారి.. ఆ ఒక్క క్యాచ్ పట్టి ఉంటే..!
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2లో సమమైంది. కాగా 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ విజయంలో బెయిర్ స్టో(114), రూట్(142) పరుగులతో కీలక పాత్ర పోషించారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ భారత్ తీవ్రంగా నిరాశ పరిచింది. ఇంగ్లండ్ విజయంలో హీరోగా నిలిచిన జానీ బెయిర్ స్టో ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను.. సెకెండ్ స్లిప్‌లో హనుమా విహారి జారవిడిచాడు. ఈ తప్పిదానికి భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బతికిపోయిన బెయిర్ స్టో.. ఏకంగా సెంచరీతో చెలరేగాడు. ఇక సులభమైన క్యాచ్ విడిచి పెట్టిన విహారిపై భారత అభిమానులు మండిపడుతున్నారు. ట్విటర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. "ఎంత పనిచేశావు విహారి.. క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్ వివరాలు.. టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 378/3 ఫలితం: భారత్‌పై ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం చదవండి: IND Vs ENG 5th Test: భారత్‌పై ఇంగ్లండ్ సూపర్ విక్టరీ.. సిరీస్ సమం Hanuma vihari dropped catch of Jonny bairstow. #hanumavihari #Vihari dropped catch of #JonnyBairstow #INDvsENG #INDvENG pic.twitter.com/YVp40t0zNs — Shribabu Gupta (@ShribabuG) July 5, 2022 -
భారత్‌పై ఇంగ్లండ్ సూపర్ విక్టరీ.. సిరీస్ సమం
ఎడ్డ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ 2-2తో సమం చేసింది. గతేడాది జరిగిన నాలుగు టెస్టుల్లో భారత్ రెండు, ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించగా.. మరో మ్యాచ్ డ్రా ముగిసింది. ఇక 378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ బ్యాటరల్లో జానీ బెయిర్‌స్టో(114), జో రూట్ (142) సెంచరీలతో చెలరేగారు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ బెయిర్‌స్టో సెంచరీలు సాధించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా తెలిపోయారు. కెప్టెన్ బుమ్రా తప్ప మిగితా బౌలర్లు ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 416 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో పంత్(146), జడేజా అద్భుతమైన సెంచరీలు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెయిర్ స్టో(106) తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు, బుమ్రా మూడు, షమీ రెండు వికెట్లు సాధించారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 132 పరుగల అధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ 245 పరుగులకే ఆలౌటైంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో పుజారా(66),పంత్(57) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ స్టోక్స్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. బ్రాడ్, పాట్స్ తలా రెండు, అండర్సన్,జాక్ లీచ్ చెరో వికెట్ సాధించారు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్ వివరాలు.. టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ టీమిండియా రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 378/3 ఫలితం: భారత్‌పై ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం This team. This way of playing. Simply irresistible ❤️ Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/Phl1BNkGol — England Cricket (@englandcricket) July 5, 2022 -
Ind Vs Eng: కావాలని రెచ్చగొడితే ఇలాగే ఉంటది మరి.. నీకిది అవసరమా?
ఉద్దేశపూర్వకంగా ఎదుటి వ్యక్తులను రెచ్చగొడితే ఒక్కోసారి మనమే చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుందని టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్ అన్నాడు. స్లెడ్జింగ్ ఒక్కోసారి బ్యాక్‌ఫైర్ అవుతుందంటూ భారత క్రికెటర్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. కాగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో కోహ్లి, ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్పటివరకు ఆచితూచి ఆడిన బెయిర్ స్టో కోహ్లి తన నవ్వు, మాటలతో కవ్వించడంతో దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో 140 బంతుల్లోనే 106 పరుగులు పూర్తి చేశాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో రాణించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ కోహ్లిపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. ‘‘నిజంగానే కోహ్లి స్లెడ్జింగ్ బెయిర్ స్టో దూకుడుకు కారణమైందా? అంటే అవుననే చెప్పొచ్చు. అంతవరకు జాగ్రత్తగా నెమ్మదిగా ఆడిన బెయిర్ స్టో ఒక్కసారిగా రెచ్చిపోయాడు. నిజానికి ఒకరిని కావాలని రెచ్చగొడితే ఒక్కోసారి మనకే బ్యాక్‌ఫైర్ అవుతుంది. ఏమో స్లెడ్జింగ్‌కు బదులిచ్చే క్రమంలో బెయిర్ స్టో మరింత దూకుడు ప్రదర్శించాడేమో?’’ అని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే.. భారత బౌలింగ్ విభాగంపై జాఫర్ ప్రశంసలు కురిపించాడు. ‘‘ఇరు జట్ల బ్యాటర్లు మెరుగ్గానే రాణించారు. అయితే, భారత బౌలర్లు విజృంభించడం టీమిండియాకు కలిసొచ్చింది. సిరాజ్, బుమ్రా, షమీ అద్భుతంగా ఆడారు. ఇంగ్లండ్‌ను 284 పరుగులకే కట్టడి చేశారు’’ అని కితాబిచ్చాడు. కాగా బుమ్రా 3, షమీ 2, సిరాజ్ 4, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్‌తో రాణించడంతో 284 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. చదవండి: Mohammed Siraj: విసిగిస్తాడు.. అతడికి బౌలింగ్ చేయడం కష్టం.. నిజానికి తనో యోధుడు! ఇక బుమ్రా.. It's tense out there between Virat Kohli and Jonny Bairstow 😳#ENGvIND pic.twitter.com/3lIZjERvDW — Sky Sports Cricket (@SkyCricket) July 3, 2022 -
కోహ్లి, బెయిర్ స్టో మధ్య మాటల యుద్దం.. వీడియో వైరల్..!
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతోన్న ఐదో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. అయితే మూడో రోజు ఆట ప్రారంభంలోనే భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ క్రికెటర్ జానీ బెయిర్ స్టో మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. ఈ ఘటన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ షమీ వేసిన 32 ఓవర్లో జరిగింది. షమీ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఆడటానికి ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఈ క్రమంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి బెయిర్‌స్టోను చూసి నవ్వుకున్నాడు. ‘సౌథీ కంటే షమీ వేగంగా బంతులు వేస్తున్నాడు కదా" అని కోహ్లి కామెంట్ చేశాడు. అంతే కాకుండా "నీకు బాల్ తప్ప అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి" అంటూ కోహ్లి సెడ్జింగ్ చేశాడు. అది విన్న బెయిర్‌స్టో కూడా తిరిగి స్పందించి కోహ్లిని ఎదో అన్నాడు. దీంతో వీరిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అయితే ఫీల్డ్ అంపైర్‌తో పాటు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ కలగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ENG vs IND: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు గుడ్ న్యూస్..! It's tense out there between Virat Kohli and Jonny Bairstow 😳#ENGvIND pic.twitter.com/3lIZjERvDW — Sky Sports Cricket (@SkyCricket) July 3, 2022 -
టెస్ట్ క్రికెట్ రూపు రేఖలను మార్చేస్తున్న ఇంగ్లండ్.. టీ20ల తరహాలో విధ్వంసం
బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ప్రస్తుత ఇంగ్లండ్ జట్టు టెస్ట్ క్రికెట్ రూపు రేఖలను మార్చేస్తుంది. ఇంగ్లండ్‌లోనే పురుడు పోసుకున్న సుదీర్ఘ ఫార్మాట్‌ను స్టోక్స్ సేన కొత్త పుంతలు తొక్కిస్తుంది. స్టోక్స్ టీమ్ టీ20ల తరహాలో ప్రత్యర్ధిపై విరుచుకుపడుతూ టెస్ట్ క్రికెట్లో వేగాన్ని మరింత పెంచేస్తుంది. ఇందుకు ఉదాహరణే తాజాగా న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్. 3 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో కొత్త కెప్టెన్ (స్టోక్స్), కొత్త కోచ్ (బ్రెండన్ మెక్కల్లమ్) ఆధ్వర్యంలో ఇంగ్లండ్ జట్టు ఊహలకందని విధంగా రెచ్చిపోయింది. మూడు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లను అలవోకగా ఛేదించి ప్రత్యర్ధిని ప్రేక్షక పాత్రకు పరిమితం చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్ల విధ్వంసం ధాటికి న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ అత్యుత్తమ ప్రదర్శన (3 మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ శతకాలతో 53 పరుగులు) మరుగున పడింది. ఇంగ్లీష్ ఆటగాళ్లలో ముఖ్యంగా జానీ బెయిర్‌స్టో విధ్వంసం గురించి మాట్లాడుకోవాలి. 32 ఏళ్ల ఈ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ ప్రస్థానం న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు తర్వాత అని చెప్పుకోవాలి. ఈ సిరీస్‌లో బెయిర్‌స్టో విధ్వంసం ఆ రేంజ్లో సాగింది. 3 మ్యాచ్‌ల్లో అతను 120కి పైగా స్ట్రయిక్ రేట్‌తో (394 పరుగులు) 2 శతకాలు, ఓ హాఫ్ సెంచరీ బాదాడు. తొలి టెస్ట్‌లో విఫలమైన బెయిర్‌స్టో రెండో టెస్ట్‌లో (ఛేదనలో) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీ20 తరహాలో విధ్వంసం (92 బంతుల్లో 136; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) సృష్టించి తన జట్టును గెలిపించాడు. తాజాగా ముగిసిన మూడో టెస్ట్‌లో బెయిర్‌స్టో విధ్వంస పర్వం కొనసాగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం (157 బంతుల్లో 162; 24 ఫోర్లు) బాదిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో (296 పరుగుల ఛేదనలో) 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ప్రపంచ ఛాంపియన్‌ను క్లీన్‌స్వీప్ చేయడంలో ముఖ్యభూమిక పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో (44 బంతుల్లో 71; 9 ఫోర్లు, సిక్సర్లు) అజేయమై అర్ధశతకం సాధించి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. బెయిర్‌స్టో తర్వాత బెన్ స్టోక్స్ ఈ సిరీస్ ఆ స్థాయి విధ్వంసం సృష్టించాడు. స్టోక్స్ 5 ఇన్నింగ్స్‌ల్లో 82.55 స్ట్రయిక్ రేట్‌తో 2 హాఫ్ సెంచరీల సాయంతో 194 పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో స్టోక్స్ సాధించింది తక్కువ పరుగులే అయినా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వేగంగా పరుగులు సాధించాడు. కివీస్‌ను వైట్‌వాష్ చేయడంలో జో రూట్ కాంట్రిబ్యూషన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రూట్ 6 ఇన్నింగ్స్‌ల్లో 99 సగటున 74 స్ట్రయిక్ రేట్‌తో 396 పరుగులు సాధించి సిరీస్‌లో టాప్ 2 రన్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: మరోసారి రెచ్చిపోయిన బెయిర్‌స్టో.. కివీస్‌ను ఊడ్చేసిన ఇంగ్లండ్ -
మరోసారి రెచ్చిపోయిన బెయిర్‌స్టో.. కివీస్‌ను ఊడ్చేసిన ఇంగ్లండ్
లీడ్స్: న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆతిధ్య ఇంగ్లండ్ 3–0తో క్లీన్ స్వీప్ చేసింది. హెడింగ్లే వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. న్యూజిలాండ్ నిర్ధేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 183/3 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. ఓలీ పోప్ (82) వికెట్‌ను కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జో రూట్ (86 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగా, బెయిర్‌స్టో (44 బంతుల్లో 71 నాటౌట్; 9 ఫోర్లు, సిక్సర్లు) మరోసారి చెలరేగి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ విధ్వంసకర శతకం (157 బంతుల్లో 162; 24 ఫోర్లు) బాదిన బెయిర్‌స్టో రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్‌కు అపురూప విజయాన్ని అందించాడు. అంతకుముందు రెండో టెస్ట్‌లోనూ బెయిర్‌స్టో ఇదే తరహాలో రెచ్చిపోయాడు. 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీ20 తరహాలో విధ్వంసం (92 బంతుల్లో 136; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) సృష్టించి తన జట్టును గెలిపించాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 2 ధనాధన్ శతకాలు, ఓ హాఫ్ సెంచరీ బాదిన బెయిర్‌స్టో ఇంగ్లండ్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ సైతం రెచ్చిపోయాడు. తొలి టెస్ట్‌లో అజేయమైన శతకంతో (115) జట్టును గెలిపించిన రూట్.. రెండో టెస్ట్‌లో (176) భారీ శతకం నమోదు చేశాడు. తాజాగా మూడో టెస్ట్‌లోనూ రూట్ చివరిదాకా క్రీజ్‌లో నిలబడి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్ట్ స్కోర్ వివరాలు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 329 (డారిల్ మిచెల్ 109) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 360 (బెయిర్‌స్టో 162) న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 326 (టామ్ బ్లండెల్ 88) ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 296/3 (54.2 ఓవర్లలో) చదవండి: ENG vs NZ: వారెవ్వా రూట్! రివర్స్ స్కూప్ షాట్! వీడియో వైరల్! -
సెంచరీతో చెలరేగిన బెయిర్‌స్టో.. ఇంగ్లండ్ స్కోర్: 264/6
లీడ్స్: న్యూజిలాండ్‌తో మూడో టెస్టు... తొలి ఇన్నింగ్స్‌లో ఒకదశలో ఇంగ్లండ్ 55/6... ఇక ఆలౌట్ కావడమే ఖాయం అనుకుంటున్న తరుణంలో బెయిర్‌స్టో అద్భుతం చేశాడు. గత టెస్టులో 77 బంతుల్లో మెరుపు శతకంతో చెలరేగిన అతను ఈసారి క్లిష్ట పరిస్థితుల్లో అదే తరహాలో ఎదురుదాడితో చెలరేగి జట్టును ఆదుకున్నాడు. కివీస్ బౌలర్లపై చెలరేగి 95 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. బెయిర్‌స్టో (126 బంతుల్లో 130 బ్యాటింగ్; 21 ఫోర్లు)కు తోడు అరంగేట్ర టెస్టు ఆడుతున్న జేమీ ఓవర్టన్ (106 బంతుల్లో 89 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్లకు 264 పరుగులు చేసింది. బెయిర్‌స్టో, ఓవర్టన్ ఏడో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 209 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ మరో 65 పరుగులే వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 225/5తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. డరైల్ మిచెల్ (109; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సిరీస్‌లో వరుసగా మూడో టెస్టులోనూ సెంచరీ చేయడం విశేషం. చదవండి: Ranji Trophy2022 Final: రంజీ ఫైనల్.. దుమ్మురేపిన యష్ దూబే, శుభమ్ శర్మ -
16 ఓవర్లలో 160 పరుగులు.. విధ్వంసానికి పరాకాష్ట
72 ఓవర్లలో టార్గెట్ 299 పరుగులు.. ఓవర్‌కు నాలుగు పరుగుల చొప్పున చేసినా ఈజీగా కొట్టేయొచ్చు. అయితే ఇది టెస్టు మ్యాచ్.. ప్రత్యర్థి జట్టులోనూ స్టార్ బౌలర్స్ ఉన్నారు. ఏ మాత్రం తేడా జరిగినా మొదటికే మోసం వస్తుంది. తొలి టెస్టు గెలవడంతో.. ఈ టెస్టును డ్రా చేసుకున్నా సరిపోతుంది. ఇలాంటి సందర్బాల్లో ఏ జట్టైనా డ్రాకే మొగ్గుచూపుతుంది. కానీ ఇంగ్లండ్ మరోలా ఆలోచించింది. ఫాస్ట్‌గా ఆడితే గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. 299 పరుగుల లక్ష్యంతో నాలుగో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 56 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో ఇక డ్రా ఖామమనుకున్నారంతా. కానీ క్రీజులోకి వచ్చిన జానీ బెయిర్ట్ స్టో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడుతాడని బహుశా అప్పుడు ఎవరు ఊహించి ఉండరు. చూస్తుండగానే ఫిఫ్టీ.. ఆపై సెంచరీ.. ఓవరాల్‌గా 92 బంతుల్లోనే 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 136 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. గాలికి అగ్ని తోడయినట్లు.. కెప్టెన్ స్టోక్స్ 70 బంతుల్లో 75 నాటౌట్.. రెచ్చిపోవడంతో ఇంగ్లండ్ సంచలన విజయం సాధించింది. 70 ఓవర్లు జరగాల్సిన మ్యాచ్ వీరిద్దరి విధ్వంసానికి 50 ఓవర్లలోనే ముగిసిపోయింది. ►టెస్టు క్రికెట్లో చేజింగ్‌కు కొత్త అర్థం చెప్పిన జానీ బెయిర్ స్టో పనిలో పనిగా ఒక కొత్త రికార్డును తన పేరిట లిఖించకున్నాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యంత వేగంగా సెంచరీ అందుకున్న రెండో ఆటగాడిగా బెయిర్ స్టో నిలిచాడు. బెయిర్ స్టో సెంచరీకి 77 బంతులు తీసుకున్నాడు. ఇక 1902లో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ గిల్బర్ట్ జెస్సోప్ నాలుగో ఇన్నింగ్స్‌లో 76 బంతుల్లోనే సెంచరీ అందుకొని తొలి స్థానంలో నిలిచాడు. ►ఇక ఆటలో ఐదోరోజున ఆఖరి సెషన్లో16 ఓవర్లలో 160 పరుగులు.. ఓవర్‌కు పది చొప్పున పరుగులు సాధించిన ఇంగ్లండ్ జట్టు మరొక కొత్త రికార్డును నమోదు చేసింది. ఒక టెస్టులో ఆఖరి సెషన్లో ఆడిన ఓవర్లలో.. ఓవర్‌కు 10 చొప్పున పరుగులు సాధించిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ►ఈ మ్యాచ్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి 250 బౌండరీలు నమోదయ్యాయి. 24 సిక్సర్లు కూడా ఉన్నాయి. ఒక టెస్టు మ్యాచ్‌లో ఇన్ని బౌండరీలు నమోదు కావడం ఇదే తొలిసారి -
IPL 2022: పంజాబ్ బల్లే బల్లే...
ముంబై: ‘ప్లే ఆఫ్స్’ చేరే అవకాశాలు దాదాపు అసాధ్యంగా కనిపిస్తున్న దశలో పంజాబ్ కింగ్స్ కీలక విజయంతో మళ్లీ రేసులోకి వచ్చింది. ఏకపక్ష పోరులో బెంగళూరును చిత్తు చేసి ఆశలు నిలబెట్టుకుంది. మరోవైపు ముందంజ వేసేందుకు చేరువైన స్థితిలో ఈ భారీ పరాజయం ఆర్సీబీకి నష్టం కలిగించనుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 54 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ (42 బంతుల్లో 70; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), బెయిర్‌స్టో (29 బంతుల్లో 66; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా, హర్షల్ పటేల్ (4/34) రాణించాడు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (22 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా... రబడ (3/21) రాణించాడు. మెరుపు బ్యాటింగ్... 71 బంతుల్లో 136 పరుగులు... పంజాబ్ ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్ పాత్ర ఇది! మిగతా బ్యాటర్లంతా విఫలమైనా... ఈ ఇద్దరి దూకుడైన బ్యాటింగ్ కారణంగానే కింగ్స్ భారీ స్కోరు నమోదు చేయగలిగింది. ఆరంభంలో బెయిర్‌స్టో చెలరేగగా, ఆ తర్వాత లివింగ్‌స్టోన్ బాధ్యత తీసుకున్నాడు. హాజల్‌వుడ్ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టిన బెయిర్‌స్టో, సిరాజ్ ఓవర్లో 3 భారీ సిక్స్‌లు, ఒక ఫోర్‌తో దూసుకుపోయాడు. 21 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తి కాగా, 8.5 ఓవర్లలోనే స్కోరు 100 పరుగులకు చేరింది. శిఖర్ ధావన్ (21), రాజపక్స (1), మయాంక్ (19), జితేశ్ (9) విఫలమైనా లివింగ్‌స్టోన్ జోరు కొనసాగించాడు. షహబాజ్ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 కొట్టిన అతను హాజల్‌వుడ్ వేసిన 19వ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో పండగ చేసుకున్నాడు. 35 బంతుల్లో అతను హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. హాజల్‌వుడ్ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు తరఫున అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలు (0/64) నమోదు చేశాడు. సమష్టి వైఫల్యం... ఛేదనలో బెంగళూరు పూర్తిగా తడబడింది. ఆరంభంలో కొన్ని చక్కటి షాట్లు ఆడిన కోహ్లి (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్), డుప్లెసిస్ (10) ఒక పరుగు తేడాతో వెనుదిరగడంతో జట్టు పతనం మొదలైంది. లోమ్రోర్ (6) విఫలం కాగా, పటిదార్ (21 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొద్దిసేపు పట్టుదల కనబర్చాడు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ ఉన్నంత వరకు ఆర్సీబీ గెలుపుపై కాస్త ఆశలు పెట్టుకుంది. అయితే అతనితో పాటు దినేశ్ కార్తీక్ (11) కూడా తక్కువ వ్యవధిలో అవుట్ కావడంతో జట్టు వేగంగా ఓటమి దిశగా పయనించింది. ఐపీఎల్లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ X కోల్‌కతా నైట్‌రైడర్స్ వేదిక: పుణే, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
బౌండరీ దగ్గర నుంచి డైరెక్ట్ త్రో.. పాపం దీపక్ హుడా.. వీడియో వైరల్..!
ఐపీఎల్-2022లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో అద్భుతమైన రనౌట్‌తో మెరిశాడు. లక్నో ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన ఆర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా డీప్ స్క్వేర్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో తొలి రన్ పూర్తి చేసుకున్న కృనాల్ పాండ్యా, దీపక్ హుడా రెండో పరుగు కోసం ప్రయత్నించారు. అయితే డీప్ స్క్వేర్ లెగ్ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న బెయిర్‌స్టో వేగంగా బంతిని అందుకుని నాన్‌స్టైకర్ ఎండ్ వైపు డైరక్ట్ త్రో చేశాడు. నాన్‌స్టైకర్ ఎండ్ వైపు పరిగెత్తిన దీపక్ హుడా క్రీజులోకి రాకముందే బంతి వికెట్లను గిరాటేయడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 20 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. చదవండి: PBKS Vs LSG: చెత్తగా ఆడారు.. టీమ్‌ను అమ్మిపారేయండి.. అప్పుడే! pic.twitter.com/1dJvQrYNrW — Vaishnavi Sawant (@VaishnaviS45) April 29, 2022 -
'ఉన్నవి నాలుగే సీట్లు.. ఐదుగురు ఎలా కూర్చుంటారు!'
టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఫన్నీ ట్వీట్స్ చేయడంలో ఎప్పుడు ముందు ఉంటాడు. ఐపీఎల్ 2022 జరుగుతుండడంతో ప్రస్తుతం వసీం జాఫర్ క్రికెట్ అనలిస్ట్‌గా బిజీ అయిపోయాడు. మ్యాచ్‌కు ముందు ఎవరు ఫెవరెట్ అనేది వివరిస్తున్న జాఫర్ తాజాగా ఒక ఫన్నీ ట్వీట్ చేశాడు. విషయంలోకి వెళితే.. శుక్రవారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు పంజాబ్ కింగ్స్‌కు విదేశీ ఆటగాళ్ల సెలక్షన్ పెద్ద తలనొప్పిగా మారింది. కొత్తగా జానీ బెయిర్ స్టో రావడం.. తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది. కగిసో రబాడ, లియామ్ లివింగ్‌స్టోన్, బానుక రాజపక్స, ఓడియన్ స్మిత్, జాని బెయిర్ స్టో రూపంలో ఐదుగురు ఉన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వసీం జాఫర్ హెరాపెరీ సినిమాలోని పాపులర్ సన్నివేశంతో పంజాబ్ జట్టును పోల్చాడు. ఆ సన్నివేశంలో ఒక కారులో వెనుక సీటులో నలుగురికి మాత్రమే అవకాశం ఉంది.. కానీ అందులో ఐదుగురు కూర్చోవాలని ప్రయత్నిస్తారు. దీంతో అందులో ఒక వ్యక్తి ప్రతీసారి కారు నుంచి కింద పడుతుంటాడు. అచ్చం పంజాబ్ కింగ్స్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ''ఉన్నవి నాలుగే సీట్లు.. ఐదుగురు ఎలా కూర్చుంటారు'' అంటూ సెటైర్ వేశారు. జాఫర్ షేర్ చేసిన ట్వీట్ నవ్వులు పూయిస్తుంది. చదవండి: Virat Kohli: ఎంత అందంగా గీశాడో.. కోహ్లి, అనుష్కల మతి పోవాల్సిందే! IPL 2022: బీసీసీఐ కొత్త నిబంధన.. తీవ్ర నిరాశలో అభిమానులు PBKS trying to fit Bairstow, Rabada, Livingstone, Rajapaksa and Odean Smith into the XI 😄 #PBKSvGT #IPL2022 pic.twitter.com/k0PQkYNhJ6 — Wasim Jaffer (@WasimJaffer14) April 8, 2022 -
పంజాబ్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ ఢీ.. బెయిర్‌స్టో ఎంట్రీ!
ఐపీఎల్-2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమయ్యాయి. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ శుక్రవారం సాయంత్రం7: 30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్‌లో కూడా విజయ ఢాంకా మోగించాలని భావిస్తోంది. మరో వైపు చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. ఇక జట్టు బలాబలాలు గురించి మాట్లాడుకుంటే.. ఇరు జట్లు బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోన్నాయి. గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే.. ఓపెనర్ శుభమాన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అదే విధంగా మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ కూడా తనదైన రోజున బ్యాట్ ఝుళిపించగలడు. అదే విధంగా మిడిలార్డర్లో హార్ధిక్ పాండ్యా, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లతో గుజరాత్ దృఢంగా ఉంది. ఇక బౌలింగ్‌లో కూడా రషీద్ ఖాన్, లూకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ వంటి స్టార్ బౌలర్లతో గుజరాత్ బలంగా ఉంది. పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో ఆడే అవకాశం ఉంది. ఒక వేళ అతడికి తుది జట్టులో చోటు దక్కితే.. రాజపక్స బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఇక శిఖర్ ధావన్, లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లతో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కన్పిస్తోంది. ఇక సీఎస్కేపై ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన లివింగ్‌స్టోన్ మరోసారి తన మార్క్‌ను చూపించాలని పంజాబ్ ఆశిస్తోంది. ఇక బౌలింగ్ విభాగంలో కూడా కగిసో రబాడ,రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్ లాంటి బౌలర్లతో పంజాబ్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. తుది జట్లు (అంచనా) పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), షారూక్ ఖాన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), కగిసో రబాడ, ఓడెన్ స్మిత్, వైభవ్ అరోరా, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్ గుజరాత్ టైటాన్స్: మాథ్యూ వెడ్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, అభినవ్ మనోహర్, వరుణ్ అరోన్, లూకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ -
పంజాబ్ కింగ్స్‌కు గుడ్‌న్యూస్.. సిక్సర్ల వీరుడు వచ్చేశాడు!
ఐపీఎల్-2022 సీజన్లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న పంజాబ్ కింగ్స్‌కు మరో గుడ్ న్యూస్ అందింది. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమైన పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్, ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో జట్టుతో చేరాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంజాబ్ కింగ్స్ వెల్లడించింది. కాగా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కారణంగా తొలి మ్యాచ్‌కు బెయిర్‌స్టో దూరమయ్యాడు. టెస్టు సిరీస్ అనంతరం భారత్‌కు చేరుకున్న అతడు మూడు రోజులు పాటు క్వారంటైన్లో ఉండనున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగనున్న పంజాబ్ కింగ్స్ తదుపరి మ్యాచ్‌కు బెయిర్‌స్టో దూరం కానున్నాడు. అయితే పంజాబ్ కింగ్స్ ఆడబోయే మూడో మ్యాచ్‌కు అతడు కచ్చితంగా అందుబాటులో ఉండనున్నాడు. ఐపీఎల్-2022లో మెగా వేలంలో భాగంగా అతడిని రూ.6.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. కాగా గత మూడు సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు బెయిర్‌స్టో ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు 28 మ్యాచ్‌లు ఆడిన బెయిర్‌స్టో 1038 పరుగులు సాధించాడు. ఇక ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: Dwayne Bravo: చరిత్ర సృష్టించేందుకు వికెట్ దూరంలో.. -
సగం సీజన్ ఆడడం ఎందుకు... అక్కడే ఉండండి
ఐపీఎల్ 2022 సీజన్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు మధ్యలోనే వైదొలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొలి అంచె పోటీలకు అందుబాటులో ఉండనున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు రెండో అంచె పోటీలకు మాత్రం దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఐపీఎల్ 15వ సీజన్‌ను మార్చి 27 నుంచి మే చివరివారం వరకు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా అంతకముందు ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఐపీఎల్ మెగావేలం నిర్వహించనున్నారు. ఈసారి మెగావేలంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు చాలా మందే తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ టెస్టు జట్టులో సభ్యులైన జానీ బెయిర్ స్టో, మార్క్‌వుడ్, డేవిడ్ మలన్, ఓలీ పోప్, క్రెయిగ్ ఓవర్టన్, సామ్ బిల్లింగ్స్, డాన్ లారెన్స్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా యాషెస్ సిరీస్‌లో పాల్గొన్నారు. ఇక రాజస్తాన్ రాయల్స్ రిటైన్ చేసుకున్న జాస్ బట్లర్ కూడా టెస్టు జట్టులో సభ్యుడే. చదవండి: మెగా వేలంలో నాకోసం లక్నో బడ్జెట్ ఎంత? బేస్ ప్రైస్ ఇక జూన్ 2 నుంచి లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ లెక్కన చూసుకుంటే.. టెస్టు జట్టులోని ఆటగాళ్లు కనీసం 15 రోజుల ముందు నుంచే అందుబాటులో ఉండేలా ఈసీబీ ప్లాన్ చేసుకుంటుంది. అందుకోసం ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లను సీజన్ మధ్యలోనే వెనక్కి పిలిపించే అవకాశాలు ఉన్నాయి. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ కీలకం కావడంతో ఈసీబీ ఆటగాళ్లను రప్పించేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. దీంతో ఐపీఎల్ సీజన్లో కీలకమైన రెండో దశ పోటీలు జరగనున్న సమయంలోనే వాళ్లు వెనక్కి రావాల్సి ఉంటుంది. అసలే ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను 4-0తో దారుణ పరాభవం చూసిన ఇంగ్లండ్.. మళ్లీ టెస్టుల్లో పునర్వైభవం తెచ్చుకోవాలని భావిస్తోంది. అయితే ఈసీబీ తీరుపై ఐపీఎల్ అభిమానులు మాత్రం మండిపడ్డారు. వేలంలో కోట్టు కుమ్మరించి ఆటగాళ్లను తీసుకుంటారు. సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండాలని ఆయా ఫ్రాంచైజీలు కోరుకుంటాయి. ఇలా సగం సీజన్ ఆడి.. మిగతా మ్యాచ్‌లు ఆడకుండా వెళ్లిపోవడం బాగుండదు. సగం సీజన్ ఆడే బదులు అక్కడే ఉండిపోండి.. మీకు ఖర్చులు దండగా అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Australian Open 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన నాదల్.. కన్నీటిపర్యంతం -
ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన బెయిర్‌స్టో.. తొలి సెంచరీ నమోదు
సిడ్నీ వేదికగా జరుగుతన్న యాషెస్ నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో సెంచరీతో చెలరేగాడు. 140 బంతుల్లో 8 ఫోర్లు, 3సిక్స్‌లతో 103 పరుగులు సాధించి ఆజేయంగా ఉన్నాడు. కాగా ఈ ఏడాది యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ తరుపున బెయిర్‌స్టో తొలి సెంచరీ సాధించాడు. 13-0 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఇంగ్లండ్.. ఆదిలోనే ఓపెనర్ హమీద్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత 36 పరుగులకే 4వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో స్టోక్స్‌తో కలిసి బెయిర్‌స్టో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెయిర్‌స్టో (103), లీచ్(4) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, బోలాండ్ రెండు వికెట్లు పడగొట్టగా, స్టార్క్, గ్రీన్, లియాన్ చెరో వికెట్ సాధించారు. చదవండి: IND vs WI: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్... ఇక ఆ సిరీస్ కూడా కష్టమే! ఆట సాగిందిలా... సిడ్నీ: ‘సున్నా’ పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు... ఒకదశలో స్కోరు 36/4... వరుసగా 70 బంతుల పాటు సింగిల్ కూడా రాలేదు... ‘యాషెస్’లో ఈ స్థితి చూస్తే ఆస్ట్రేలియా చేతిలో మరో ఘోర పరాజయానికి ఇంగ్లండ్ బాటలు వేసుకున్నట్లు అనిపించింది. అయితే అద్భుత సెంచరీతో జానీ బెయిర్‌స్టో (140 బంతుల్లో 103 బ్యాటింగ్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), అతనికి తోడుగా బెన్ స్టోక్స్ (91 బంతుల్లో 66; 9 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా మూడేళ్ల తర్వాత సాధించిన శతకంతో బెయిర్‌స్టో ఇంగ్లండ్‌ను రక్షించడంతో పాటు జట్టులో తన స్థానాన్ని కూడా కాపాడుకున్నా డు. వర్షం కారణంగా మ్యాచ్ మూడో రోజు 65 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నిం గ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. బెయిర్‌స్టోతో పాటు లీచ్ (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉండగా ప్రస్తుతం ఆ జట్టు 158 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 13/0తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ అదే తడబాటును ప్రదర్శించింది. హమీద్ (6)ను స్టార్క్ వెనక్కి పంపగా... 36 పరుగుల స్కోరు వద్దే క్రాలీ (18), రూట్ (0), మలాన్ (0) అవుటయ్యారు. ఈ దశలో స్టోక్స్, బెయిర్‌స్టో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 9 పరుగుల వద్ద స్టోక్స్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను కమిన్స్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత 16 పరుగుల వద్ద స్టోక్స్‌కు మళ్లీ అదృష్టం కలిసొచ్చింది. గ్రీన్ బౌలింగ్‌లో బంతి స్టంప్స్‌ను తాకుతూ వెళ్లినా బెయిల్స్ పడలేదు! ముందు ఎల్బీ కోసం ఆసీస్ అప్పీల్ చేయగా అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. అయితే రివ్యూలో ప్యాడ్‌కు బంతి తగల్లేదని, స్టంప్స్ పైభాగంలో తగిలి వెళ్లిందని తేలడంతో స్టోక్స్ బతికిపోయాడు. ఆ తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో దూసుకుపోయారు. ఎట్టకేలకు 128 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యం తర్వాత స్టోక్స్‌ను లయన్ అవుట్ చేయగా, బట్లర్ (0) విఫలమయ్యాడు. అనంతరం వుడ్ (39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లండ్ ఫాలోఆన్‌ను కూడా తప్పించుకుంది. ఆ తర్వాత 138 బంతుల్లో బెయిర్ స్టో తన కెరీర్లో ఏడో సెంచరీని అందుకున్నాడు. -
బెయిర్‌స్టో వచ్చేశాడు.. ఇంగ్లండ్ ఈ సారైనా గెలిచేనా!
యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్(బాక్సింగ్‌డే టెస్ట్) డిసెంబరు 26న ప్రారంభం కానుంది. కాగా బాక్సింగ్‌డే టెస్ట్ ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా నాలుగు మార్పులతో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ స్ధానంలో జాక్ క్రాలీకి చోటు దక్కింది. ఈ సిరీస్‌లో రెండు టెస్ట్‌లు ఆడిన బర్న్స్ కేవలం 51 పరుగులు మాత్రమే సాధించాడు. ఆదే విధంగా హసీబ్ హమీద్‌కి మరో అవకాశం ఇచ్చారు. ఓలీ పోప్ స్ధానంలో సీనియర్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో జట్టులోకి వచ్చాడు. ఆదే విధంగా క్రిస్ వోక్స్, స్టువర్ట్ బ్రాడ్ కూడా దూరమయ్యారు. వీరి స్ధానంలో మార్క్ వుడ్, జాక్ లీచ్ జట్టులోకి వచ్చారు. కాగా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడి ఘోర పరాభవం మూటకట్టకుంది. కాగా బాక్సింగ్ డే టెస్ట్‌లో విజయం సాధించి తిరిగి పుంజుకోవాలి అని భావిస్తోంది. ఇక ఆస్ట్రేలియా మాత్రం ఇదే జోరు కొనసాగించి సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ సిరీస్‌లో 2-0తో ఆస్ట్రేలియా అధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ జట్టు: హసీబ్ హమీద్, జాక్ క్రాలీ, డేవిడ్ మలన్, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్(వికెట్ కీపర్), మార్క్ వుడ్, ఆలీ రాబిన్సన్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్. చదవండి: SA vs IND: ఓపెనర్లుగా మయాంక్, రాహుల్.. హనుమ విహారికు నో ఛాన్స్! -
వార్నర్‌తో పాటు అతడిని కూడా.. మీకు మీ ఫ్రాంచైజీకు ఓ దండం రా బాబు..
David Warner Confirms SRH Has No Intentions Of Keeping Him Ahead Of Retention Day: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు రీటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించడానికి సమయం ఆసన్నమైంది. ఏ ఆటగాడిని ఏ జట్టు ఉంచుకుంటుందో మంగళవారం (నవంబర్ 30) రాత్రి 9:30 గంటలకు తేలిపోనుంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. ముందు నుంచి అనుకున్నట్టుగానే డేవిడ్ వార్నర్‌ను విడిచి పెట్టేందుకు సన్‌రైజర్స్ సిద్దంగా ఉన్నట్లు సమాచారం. అయితే సన్‌రైజర్స్ నుంచి అధికారిక ప్రకటనకు ముందే డేవిడ్ వార్నర్ ఈ విషయాన్ని ధృవీకరించాడు. వచ్చే సీజన్‌కుగాను ఫ్రాంచైజీ తనని నిలుపుకోదని వార్నర్ సృష్టం చేశాడు. కాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ అభిమాని .. 'మిమ్మల్ని సన్‌రైజర్స్ రీటైన్ చేసుకుంటే, మీరు ఆడుతారా'..? అని ప్రశ్నించగా.. దానికి బదులుగా "వాళ్లు నన్ను రీటైన్ చేయరు, నేను దాని గురించి ఆలోచించడం లేదు" అంటూ వార్నర్ రాసుకొచ్చాడు. ఇక డేవిడ్ భాయ్‌తో పాటు ఎన్నో మ్యాచ్‌ల్లో ఆ జట్టును ఒంటి చేత్తో గెలిపించిన జానీ బెయిర్‌స్టోను కూడా సన్‌రైజర్స్ రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం.. కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్‌లను నిలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా రషీద్ ఖాన్‌తో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి సన్‌రైజర్స్.. విలియమ్సన్ , అబ్దుల్ సమద్ ,ఉమ్రాన్ మాలిక్ రిటైన్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తాజాగా ఆటగాళ్లతో కలిసి ఉన్న ఓ ఫోటోను ఇనస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు 'తమ ప్రయాణంలో భాగమైనందుకు అందరికీ ధన్యవాదాలు' అంటూ క్యాప్షన్ పెట్టింది. చదవండి: IPL 2022 Auction: ఏయే జట్లు ఎవరిని రిటైన్ చేసుకుంటున్నాయి? ఎంత మొత్తం ఖర్చు చేయాలి? పూర్తి వివరాలు! -
ఐపీఎల్ 2021: బెయిర్ స్టో స్థానంలో విండీస్ స్టార్ ఆటగాడు
దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్ రెండో అంచె పోటీలకు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు దూరమవుతున్న సంగతి తెలిసిందే. జానీ బెయిర్ స్టో, క్రిస్ వోక్స్, డేవిడ్ మలాన్‌లు ఐపీఎల్ 14వ సీజన్‌కు దూరంగా ఉండనున్నారు. రానున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బెయిర్ స్టో స్థానంలో వెస్టిండీస్ వికెట్ కీపర్ షెర్పెన్ రూథర్‌ఫోర్డ్‌ను తీసుకున్నట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్విటర్ ద్వారా తెలిపింది. ఈ మేరకు ప్రస్తుతం సీపీఎల్‌లో ఆడుతున్న రూథర్‌ఫోర్ట్ త్వరలోనే దుబాయ్‌కు చేరుకోనున్నాడు. జానీ బెయిర్ స్టో స్థానంలో కరీబియన్ రైసర్ వస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ టూ షెర్పెన్ రూథర్‌ఫోర్ట్ అంటూ కామెంట్ చేసింది. చదవండి: Viral Video: రనౌట్ అవకాశం; ఊహించని ట్విస్ట్.. ఫీల్డర్ల పరుగులు ఇక 2018లో వెస్టిండీస్ తరపున అరంగేట్రం చేసిన రూథర్‌ఫోర్ట్ 6 టీ20 మ్యాచ్‌లాడి 43 పరగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 43 టీ20 మ్యాచ్‌లాడి 624 పరుగులు చేశాడు. కాగా ఇంతకముందు రూథర్‌ఫోర్డ్ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరాశజనక ప్రదర్శన కనబరిచింది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. కరోనాతో లీగ్ వాయిదా పడడానికి ముందు డేవిడ్ వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్కు బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. చదవండి: IPL 2021: కళ తప్పనున్న మలిదశ ఐపీఎల్.. ముగ్గురు స్టార్ ఆటగాళ్లు దూరం -
బుమ్రా యార్కర్.. బెయిర్ స్టో డకౌట్; ప్రశంసల వెల్లువ
లండన్: టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా యార్కర్ల కింగ్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌కు ఎన్నోసార్లు ముచ్చెమటలు పట్టించాడు. తాజాగా బుమ్రా ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టోను ఔట్ చేసిన విధానం వైరల్‌గా మారింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 67వ ఓవర్లో ఇది చోటు చేసుకుంది. 67వ ఓవర్ మూడో బంతిని గుడ్‌లెంగ్త్‌తో యార్కర్ వేశాడు. బెయిర్ స్టో తేరుకునేలోపే బంతి కాళ్ల సందులో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. ఇది అసలు ఊహించని బెయిర్ స్టో నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ క్యాలండర్ ఇయర్లో బెయిర్ స్టోకు ఇది నాలుగో డకౌట్ కావడం విశేషం. చదవండి: కోహ్లి విషయంలో మొయిన్ అలీ చరిత్ర; డకౌట్లలో రహానే చెత్త రికార్డు కాగా బుమ్రా యార్కర్‌పై ప్రశంసల వెల్లువ కురిసింది. బుమ్రా వేసిన డెలివరీ ''One Of The Best Ball In Test Cricket'' అని గార్డియన్ పత్రిక రాసుకొచ్చింది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ అయితే బుమ్రాను పొగడ్తలతో ముంచెత్తాడు. నా దృష్టిలో బుమ్రాది క్లాస్ డెలివరీ. బెయిర్ స్టోను ఔట్ చేసిన విధానం సూపర్. అతని యార్కర్ డెలివరీని నేనుకళ్లారా చూశాను. కొన్నిసార్లు బౌలింగ్ అనేది రియలిస్ట్‌గా కనిపిస్తుంది. బుమ్రా విషయంలో అదే జరిగింది. నిజంగా బుమ్రా సూపర్ అంటూ చెప్పుకొచ్చాడు. బుమ్రా యార్కర్ డెలివరికి సంబంధించిన వీడియో ట్రెండింగ్‌గా మారింది. ఇక నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 157 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది. 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ టీమిండియా పేస్, స్పిన్ దాటికి 210 పరుగులకు చాప చుట్టేసింది. చివరిసారి 1971లో ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌పై టెస్టులో గెలిచిన భారత్ ఆ తర్వాత ఈ మైదానంలో ఎనిమిది టెస్టులు ఆడి ఐదింటిని ‘డ్రా’ చేసుకొని, మూడింటిలో ఓడింది. ఎట్టకేలకు 50 ఏళ్ల తర్వాత ఈ మైదానంలో భారత్ మళ్లీ విజయం రుచి చూసింది. ఇక తాజా విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈనెల 10 నుంచి మాంచెస్టర్‌లో చివరిదైన ఐదో టెస్టు జరుగుతుంది. చదవండి: Jasprit Bumrah: బుమ్రా తొలి వికెట్.. వందో వికెట్ ఒకేలా.. 🇮🇳 on top! Bumrah yorks Bairstow and Jaddu gets Moeen at short leg! Tune into Sony Six (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/AwcwLCPFGm ) now! 📺#ENGvINDOnlyOnSonyTen #BackOurBoys #Bumrah #Jadeja #Bairstow #Moeen pic.twitter.com/gFomdgUqo6 — Sony Sports (@SonySportsIndia) September 6, 2021