Big Blow for Punjab Kings, Jonny Bairstow ruled out of IPL 2023 - Sakshi
Sakshi News home page

IPL 2023: పంజాబ్‌ కింగ్స్‌కు ఊహించని షాక్‌.. విధ్వంసకర వీరుడు దూరం!

Published Wed, Mar 22 2023 1:27 PM | Last Updated on Wed, Mar 22 2023 2:40 PM

IPL 2023: BIG BLOW for PBKS, Jonny Bairstow RULED OUT - Sakshi

ఐపీఎల్‌-2023 సీజన్‌కు ఆరంభానికి ముందు పంజాబ్‌ కింగ్స్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జానీ బెయిర్‌స్టో ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా గతడాది అక్టోబరు నుంచి  కాలి గాయం కారణంగా బెయిర్‌స్టో  క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే అతడు ప్రస్తుతం పూర్తి స్ధాయి ఫిటెనెస్‌ సాధించాడు.

బెయిర్‌స్టో ప్రస్తుతం నెట్స్‌లో కూడా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. కానీ ఈ ఏడాది జరగనున్న యాషెష్ సిరీస్‌ సమయానికి అతడు మరింత ఫిట్‌గా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఐపీఎల్‌ 16వ సీజన్‌ మొత్తానికి దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. "రాబోయే యాషెస్ కోసం జానీ బెయిర్‌స్టో యార్క్‌షైర్‌లో ప్రాక్టీస్‌ చేయనున్నాడు. దాంతో జానీ ఐపీఎల్‌-2023కు దూరం కానున్నాడు.

ఇప్పటికే ఈ విషయాన్ని పంజాబ్‌ ప్రాంఛైజీకు అతడు తెలియజేశాడు" అని ది గార్డియన్ తమ నివేదికలో పేర్కొంది. ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 39 మ్యాచ్‌లాడిన జానీ బెయిర్‌స్టో.. 142.65 స్ట్రైక్‌రేట్‌తో 1291 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా  మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్‌ ప్రారంభం కానుంది. పంజాబ్‌ తన తొలి మ్యాచ్‌లో ఏప్రిల్ 1న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పంజాబ్ కింగ్స్ ఢీకొట్టనుంది.
చదవండిWTC 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ఆటగాడు దూరం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement