అబుదాబి టీ20 లీగ్-2024లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జానీ బెయిస్టో విధ్వంసం సృష్టించాడు. ఈ ధానాధన్ లీగ్‌లో టీమ్ అబుదాబికి ప్రాతినిథ్యం వహిస్తున్న బెయిర్ స్టో.. శుక్రవారం మోరిస్విల్లే సాంప్ ఆర్మీతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ప్రత్యర్ధి బౌలర్లను ఈ ఇంగ్లీష్ క్రికెటర్ ఊచకోత కోశాడు. కేవలం 30 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అయితే దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో టీమ్ అబుదాబి కేవలం మూడు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
ఆఖరి ఓవర్‌లో తమ విజయానికి 12 పరుగులు అవసరమవ్వగా.. అబుదాబి కేవలం 8 పరుగులు మాత్రమే చేసింది. చివరి నాలుగు బంతుల్లో జానీ నాన్‌స్ట్రైక్‌లో ఉండకపోవడంతో అబుదాబి ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ అబుదాబి .. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 106 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన మోరిస్విల్లే సాంప్ ఆర్మీ 9.4 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది.
వేలంలో అమ్ముడుపోని జానీ..
ఇక మ్యాచ్‌లో దుమ్ము లేపిన జానీ బెయిర్ స్టో.. ఐపీఎల్-2025 వేలంలో మాత్రం అమ్ముడుపోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్‌లకు బెయిర్‌స్టో ప్రాతినిథ్యం వహించాడు.
చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment