విరాట్ కోహ్లి- రిషభ్ పంత్, జానీ బెయిర్‌స్టో(PC: ICC)
ICC Test Rankings- India Vs England: ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్ అదరగొట్టాడు. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ అద్భుత ఆటతీరు కనబరిచిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ(146 పరుగులు), రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం(57 పరుగులు) సాధించాడు.
ఈ క్రమంలో 801 పాయింట్లు తన ఖాతాలో వేసుకున్న పంత్... టాప్-5లోకి దూసుకువచ్చాడు. మరోవైపు టాప్-10లో భారత ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడికే స్థానం దక్కింది. కోవిడ్ బారిన పడి ఇంగ్లండ్‌తో టెస్టుకు దూరమైన అతడు ఒక స్థానం దిగజారి తొమ్మిదో ర్యాంకుకు పడిపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో విఫలమైన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి 13వ ర్యాంకుకు పడిపోయాడు.
ఇదిలా ఉంటే ఎడ్జ్‌బాస్టన్‌లో దుమ్ము లేపిన ఇంగ్లండ్ టెస్టు జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ 923 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సెంచరీతో ఆకట్టుకున్న జానీ బెయిర్‌స్టో ఏకంగా 11 స్థానాలు ఎగబాకాడు. పదో ర్యాంకు సాధించాడు. కాగా టీమిండియాతో రీషెడ్యూల్డ్ టెస్టులో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 2-2తో సమమైంది.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ టాప్-10లో ఉన్నది వీళ్లే
1. జో రూట్(ఇంగ్లండ్)
2.మార్నస్ లబుషేన్(ఆస్ట్రేలియా)
3.స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా)
4.బాబర్ ఆజం(పాకిస్తాన్)
5.రిషభ్ పంత్(ఇండియా)
6.కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)
7.ఉస్మాన్ ఖవాజా(ఆస్ట్రేలియా)
8.దిముత్ కరుణరత్నె(శ్రీలంక)
9.రోహిత్ శర్మ(ఇండియా)
10.జానీ బెయిర్‌స్టో(ఇంగ్లండ్)
చదవండి: రూత్‌లెస్ రూట్.. టీమిండియాపై పూనకం వచ్చినట్లు ఊగిపోతున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
Rock & Roll Test Cricket 🎸🤘
— England Cricket (@englandcricket) July 6, 2022
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/gneNM0rqy3
Comments
Please login to add a commentAdd a comment