ICC Test rankings
-
విరాట్ కోహ్లికి అవమానం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో దారుణంగా విఫలమై ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి మరో అవమానం ఎదురైంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో విరాట్ 27వ స్థానానికి పడిపోయాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విరాట్ టాప్-25 లోనుంచి బయటికి రావడం 12 ఏళ్ల తర్వాత ఇది మొదటిసారి. కెరీర్ ఆరంభంలో మాత్రమే విరాట్ టాప్-25 బ్యాటర్ల జాబితాలో లేడు. 2011లో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విరాట్.. 2012లో ఓసారి 36వ స్థానానికి పడిపోయాడు.బీజీటీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్‌లో విరాట్ కేవలం 23 పరుగులు (17, 6) మాత్రమే చేశాడు. ఈ ప్రదర్శన అనంతరం విరాట్ మూడు స్థానాలు కోల్పోయి ర్యాంకింగ్‌ను మరింత దిగజార్చుకున్నాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 614 రేటింగ్ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. బీజీటీ ఆధ్యాంతం దారుణంగా విఫలమైన విరాట్ ఈ సిరీస్ మొత్తంలో (9 ఇన్నింగ్స్‌ల్లో) 190 పరుగులు మాత్రమే చేశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్ తన సమకాలీకులైన జో రూట్ (నంబర్ వన్ ర్యాంక్), కేన్ విలియమ్సన్ (మూడో ర్యాంక్), స్టీవ్ స్మిత్ (ఎనిమిదో ర్యాంక్), బాబర్ ఆజమ్ (12వ ర్యాంక్) కంటే చాలా వెనుకపడ్డాడు.2018 ఆగస్ట్‌లో కెరీర్ అత్యధిక రేటింగ్ పాయింట్లు (937) సాధించి టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న విరాట్.. 2020 ఫిబ్రవరిలో తొలిసారి అగ్రస్థానాన్ని కోల్పోయాడు. కెరీర్ పీక్స్‌లో (2016-2020) ఉండగా మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగిన విరాట్ ప్రస్తుతం గుడ్డకాలం ఎదుర్కొంటున్నాడు.2024లో ఒకే ఒక టెస్ట్ సెంచరీ చేసిన విరాట్.. గతేడాది మూడు ఫార్మాట్లలో చెత్త ప్రదర్శనలు చేశాడు. 32 ఇన్నింగ్స్‌ల్లో 21.83 సగటున 655 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ కెరీర్ మొత్తంలో ఓ క్యాలెండర్ ఇయర్లో ఇంత దారుణమైన ప్రదర్శనలు ఎప్పుడూ లేవు.తాజా ర్యాంకింగ్స్‌లో విరాట్‌తో పాటు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, నితీశ్ కుమార్ రెడ్డి, కేఎల్ రాహుల్ కూడా పడిపోయారు. గిల్ మూడు స్థానాలు కోల్పోయి 23వ స్థానానికి పడిపోగా.. రోహిత్ శర్మ రెండు స్థానాలు కోల్పోయి 42వ ప్లేస్‌కు దిగజారాడు. ఆసీస్‌తో చివరి టెస్ట్‌లో కోహ్లి, రోహిత్‌తో పాటు విఫలమైన రాహుల్ 11 స్థానాలు కోల్పోయి 52వ స్థానానికి పడిపోయాడు. మెల్బోర్న్ టెస్ట్‌లో సూపర్ సెంచరీ చేసి రాత్రికిరాత్రి హీరో అయిపోయిన నితీశ్ కుమార్.. సిడ్నీ టెస్ట్‌లో పేలవ ప్రదర్శనలు చేసి 19 స్థానాలు కోల్పోయాడు. ఈ వారం ర్యాంకింగ్స్‌లో నితీశ్ 72వ స్థానానికి పడిపోయాడు.తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగా.. సిడ్నీ టెస్ట్‌లో మెరుపు అర్ద శతకం చేసిన రిషబ్ పంత్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. భారత్ తరఫున టాప్-10 బ్యాటర్లలో జైస్వాల్, పంత్ మాత్రమే ఉన్నారు.ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ మాజీ సారధి కేన్ విలియమ్సన్, ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ మూడు, ఐదు స్థానాల్లో నిలిచారు. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. లంక ప్లేయర్ కమిందు మెండిస్ ఓ స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరాడు. భారత్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో ఆశించినంతగా రాణించిన లేకపోయిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించి (908) అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. ఆస్ట్రేలియా సారధి కమిన్స్, సౌతాఫ్రికా పేసర్ రబాడ తలో స్థానం మెరుగుపర్చుకుని రెండు, మూడు స్థానాలకు చేరారు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా ఆటగాడు మార్కో జన్సెన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరాడు. -
టాప్-10లోకి రిషబ్ పంత్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) మూడు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. పంత్ 12వ స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన చివరి టెస్ట్‌లో పంత్ మెరుపు అర్ద శతకం బాదాడు. ఈ ప్రదర్శన కారణంగానే పంత్ ర్యాంకింగ్ మెరుగుపడింది. బ్యాటర్ల టాప్-10లో పంత్ ఒక్కడే వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ఉన్నాడు. భారత్ నుంచి పంత్‌తో పాటు యశస్వి జైస్వాల్ టాప్-10లో ఉన్నాడు. జైస్వాల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ మాజీ సారధి కేన్ విలియమ్సన్, ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్ మూడు, ఐదు స్థానాల్లో నిలిచాడు. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. లంక ప్లేయర్ కమిందు మెండిస్ ఓ స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరాడు. భారత్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో ఆశించినంతగా రాణించిన లేకపోయిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ స్థానం కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. తాజాగా సౌతాఫ్రికా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసిన పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 12వ ప్లేస్‌కు చేరగా.. జింబాబ్వే జరిగిన రెండో టెస్ట్‌లో సూపర్ సెంచరీ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మత్ షా 26 స్థానాలు మెరుగుపర్చుకుని 26వ స్థానానికి చేరాడు. జింబాబ్వే ఆటగాడు క్రెయిగ్ ఎర్విన్ 10 స్థానాలు మెరుగపర్చుకుని 37వ స్థానానికి చేరగా.. సౌతాఫ్రికాపై సెంచరీ చేసిన పాక్ కెప్టెన్ షాన్ మసూద్ 12 స్థానాలు మెరుగుపర్చుకుని 45వ ప్లేస్‌కు చేరాడు. పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భారీ డబుల్ సెంచరీతో విరుచుకుపడిన దక్షిణాఫ్రికా ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ఏకంగా 48 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ స్థానానికి చేరాడు. బ్యాటర్ల టాప్-100 ర్యాంకింగ్స్‌లో ఇవే చెప్పుకోదగ్గ మార్పులు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించి (908) అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా సారధి కమిన్స్, సౌతాఫ్రికా పేసర్ రబాడ తలో స్థానం మెరుగుపర్చుకుని రెండు, మూడు స్థానాలకు చేరారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో 10 వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ ఏకంగా 29 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ స్థానానికి చేరాడు. జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 11 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 54వ స్థానానికి ఎగబాకాడు. భారత్ నుంచి బుమ్రాతో పాటు రవీంద్ర జడేజా టాప్-10 బౌలర్ల జాబితాలో ఉన్నాడు. జడ్డూ తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో అద్భుతంగా రాణించిన భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణ 42 స్థానాలు మెరుగుపర్చుకుని 93వ స్థానానికి చేరాడు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా ఆటగాడు మార్కో జన్సెన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరాడు. -
టీమిండియాకు మరో పరాభవం
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో కోల్పోయిన టీమిండియాకు మరో పరాభవం ఎదురైంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానానికి పడిపోయింది. చాలాకాలం తర్వాత టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-2 నుంచి బయటకు వచ్చింది. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సౌతాఫ్రికా టీమిండియాను వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకింది. సౌతాఫ్రికా వరుసగా ఏడు టెస్ట్ మ్యాచ్‌ల్లో గెలిచి సెకెండ్ ప్లేస్‌కు చేరుకుంది. సౌతాఫ్రికా వరుసగా మూడు సిరీస్‌ల్లో 2-0 తేడాతో విజయాలు సాధించింది. మరోపక్క భారత్ గత ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరు పరాజయాలు మూటగట్టుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఓడిన భారత్.. బీజీటీలో ఒక్క మ్యాచ్ గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలను మూటగట్టుకుంది. స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ (న్యూజిలాండ్ చేతిలో ఓటమి) కోల్పోయిన భారత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని పదేళ్ల తర్వాత ఆసీస్‌కు వదిలేసింది. బీజీటీ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది. టీమిండియా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. బీజీటీలో చివరి టెస్ట్ విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించింది. పాక్‌పై తొలి టెస్ట్‌లో విజయంతోనే సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి.మరోవైపు బీజీటీలో భారత్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా రేటింగ్ పాయింట్లను గణనీయంగా పెంచుకుని అగ్రపీఠాన్ని (ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో) పటిష్టం చేసుకుంది. ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 126 రేటింగ్ పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా ఖాతాలో 112 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మూడో స్థానానికి పడిపోయిన భారత్ 109 రేటింగ్ పాయింట్లు కలిగి ఉంది. 106 పాయింట్లతో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉండగా.. 96 పాయింట్లతో న్యూజిలాండ్ ఐదో ప్లేస్‌లో ఉంది. 87 పాయింట్లతో శ్రీలంక ఆరో స్థానంలో ఉండగా.. 83 పాయింట్లతో పాకిస్తాన్ ఏడో స్థానంలో నిలిచింది. వెస్టిండీస్ (75), బంగ్లాదేశ్ (65), ఐర్లాండ్ (26), జింబాబ్వే (4), ఆఫ్ఘనిస్తాన్ (0) వరుసగా ఎనిమిది నుంచి 12 స్థానాల్లో ఉన్నాయి.ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా గెలిచిన ప్రొటీస్ 2-0 తేడాతో పాక్‌ను క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్ట్‌లో పాక్ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా వికెట్ కోల్పోకుండా ఛేదించి జయకేతనం ఎగురవేసింది. -
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా 907 రేటింగ్ పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బుమ్రాకు ముందు అత్యధిక రేటింగ్ పాయింట్లు కలిగిన భారత బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. యాష్ 2016లో 904 రేటింగ్ పాయింట్లు సాధించాడు. తాజాగా బుమ్రా అశ్విన్ రికార్డును బద్దలు కొట్టి భారత్ తరఫున ఆల్‌టైమ్ గ్రేట్ రికార్డును నెలకొల్పాడు.టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ సీమర్లు సిడ్నీ బార్న్స్ (932), జార్జ్ లోమన్ (931), పాక్ మాజీ పేసర్ ఇమ్రాన్ ఖాన్ (922), శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (920) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు. తాజాగా 907 రేటింగ్ పాయింట్లు సాధించిన బుమ్రా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ డెరిక్ అండర్వుడ్తో కలిసి సంయుక్తంగా 17వ స్థానంలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌ల్లో 30 వికెట్లు పడగొట్టిన బుమ్రా తన రేటింగ్ పాయింట్లను గణనీయంగా పెంచుకుని టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు.తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా తర్వాతి స్థానంలో జోష్ హాజిల్‌వుడ్ (843) ఉన్నాడు. బుమ్రాకు హాజిల్‌వుడ్‌కు మధ్య 64 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. బుమ్రా, హాజిల్‌వుడ్ తర్వాతి స్థానాల్లో కమిన్స్ (837), రబాడ (832), మార్కో జన్సెన్ (803), మ్యాట్ హెన్రీ (782), నాథన్ లియోన్ (772), ప్రభాత్ జయసూర్య (768), నౌమన్ అలీ (751), రవీంద్ర జడేజా (750) ఉన్నారు.బ్యాటింగ్‌లో విరాట్ టాప్ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లి చలామణి అవుతున్నాడు. విరాట్ కోహ్లి 2018లో 937 రేటింగ్ పాయింట్లు సాధించాడు. భారత్ తరఫున ఏ ఇతర బ్యాటర్ ఇన్ని రేటింగ్ పాయింట్లు సాధించలేదు.నాలుగో స్థానానికి ఎగబాకిన జైస్వాల్ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌లో రెండు భారీ అర్ద సెంచరీలు చేసిన జైస్వాల్ తన రేటింగ్ పాయింట్లను 854 పాయింట్లకు పెంచుకున్నాడు. ఇంగ్లండ్ స్టార్ జో రూట్ (895) నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. హ్యారీ బ్రూక్ (876), కేన్ విలియమ్సన్ (867), జైస్వాల్, ట్రవిస్ హెడ్ (780) టాప్-5 టెస్ట్ బ్యాటర్లుగా కొనసాగుతున్నారు. జైస్వాల్ టెస్ట్‌ల్లో నంబర్ వన్ స్థానానికి చేరుకునేందుకు మరో 41 పాయింట్ల దూరంలో ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున జైస్వాల్ ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. భారత స్టార్ బ్యాటర్లు రిషబ్ పంత్ 12, శుభ్‌మన్ గిల్ 20, విరాట్ కోహ్లి 24, రోహిత్ శర్మ 40 స్థానాల్లో నిలిచారు. -
అగ్రపీఠాన్ని అధిరోహించిన హ్యారీ బ్రూక్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ సత్తా చాటాడు. బ్రూక్.. వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ జో రూట్‌ను రెండో స్థానానికి నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో బ్రూక్ సెంచరీ (123), హాఫ్ సెంచరీ (55) చేశాడు. ఈ ప్రదర్శనల ఆధారంగానే బ్రూక్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం బ్రూక్ ఖాతాలో 898 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రూట్ రేటింగ్ పాయింట్స్‌కు (897) బ్రూక్ రేటింగ్ పాయింట్లకు మధ్య వ్యత్యాసం కేవలం ఒక్క పాయింట్ మాత్రమే.తాజా ర్యాంకింగ్స్‌లో ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్, సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కూడా సత్తా చాటారు. అడిలైడ్ టెస్ట్‌లో భారత్‌పై సూపర్ సెంచరీ చేసిన హెడ్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి ఎగబాకగా.. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు, సెంచరీ చేసిన బవుమా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు.20వ స్థానానికి పడిపోయిన కోహ్లిఆసీస్తో రెండో టెస్ట్‌లో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లి ఆరు స్థానాలు కిందకు దిగజారి 20వ స్థానానికి పడిపోయాడు. అదే టెస్ట్‌లో చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయిన రిషబ్ పంత్ సైతం మూడు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. యశస్వి జైస్వాల్ తన నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కేన్ విలియమ్సన్ మూడులో, కమిందు మెండిస్ ఆరో స్థానంలో, డారిల్ మిచెల్ ఎనిమిదో ప్లేస్‌లో సౌద్ షకీల్ పదో స్థానంలో ఉన్నారు.టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. బుమ్రా, రబాడ, హాజిల్‌వుడ్ టాప్-3లో కొనసాగుతుండగా.. కమిన్స్ ఓ స్థానం మెరుగపర్చుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. గత వారం నాలుగో స్థానంలో ఉన్న అశ్విన్ ఓ స్థానం కోల్పోయి ఐదో ప్లేస్‌కు పడిపోయాడు. రవీంద్ర జడేజా, నాథన్ లియోన్, ప్రభాత్ జయసూర్య, మ్యాట్ హెన్రీ నౌమన్ అలీ ఆరు నుంచి పది స్థానాల్లో ఉన్నారు. అడిలైడ్ టెస్ట్‌లో భారత్‌పై అద్భుత ప్రదర్శన చేసిన మిచెల్ స్టార్క్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి ఎగబాకాడు. -
జైస్వాల్‌ను వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకిన హ్యారీ బ్రూక్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ రెండో స్థానానికి ఎగబాకాడు. బ్రూక్.. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను వెనక్కు నెట్టి ఈ స్థానానికి చేరుకున్నాడు. గడిచిన వారంలో బ్రూక్, జైస్వాల్ ఇద్దరూ మంచి ప్రదర్శనలే చేసినప్పటికీ.. ర్యాంకింగ్స్‌లో మాత్రం బ్రూక్ ముందుకెళ్లాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో యశస్వి 161 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా.. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బ్రూక్ 171 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తాజా ర్యాంకింగ్స్‌లో యశస్వి ర్యాంక్ దిగజారినప్పటికీ అతని రేటింగ్ పాయింట్లు మాత్రం మెరుగుపడ్డాయి.మరోవైపు ఆస్ట్రేలియాతోనే జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సైతం సెంచరీ చేసినప్పటికీ ఓ ర్యాంక్ కోల్పోయి 14వ స్థానానికి పడిపోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ చేసిన సౌతాఫ్రికా ఆటగాడు టెంబా బవుమా ఏకంగా 14 స్థానాలు మెరుగపర్చుకుని 10వ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. లంక ఆటగాడు కమిందు మెండిస్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకోగా.. భారత్ తరఫున రిషబ్ పంత్ ఆరో నంబర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. రబాడ, హాజిల్‌వుడ్, అశ్విన్ టాప్-4లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్స్‌లో కమిన్స్, రవీంద్ర జడేజా, నాథన్ లయోన్ తలో స్థానం మెరుగుపర్చుకుని 5, 6, 7 స్థానాలకు చేరుకోగా.. దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జన్సెన్ ఏకంగా 19 స్థానాలు మెరుగుపర్చుకుని 9వ స్థానానికి ఎగబాకాడు. జన్సెన్ ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. టెస్ట్ ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. రవీంద్ర జడేజా టాప్‌లో కొనసాగుతుండగా.. జన్సెన్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. అశ్విన్ మూడో స్థానానికి పడిపోయాడు. -
బుమ్రా చేజారిన వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు.. అగ్రస్థానంలో అతడు
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు. అతడి అగ్ర స్థానాన్ని సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ ఆక్రమించాడు. ఇక బుమ్రా మూడోస్థానానికి పడిపోగా.. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్ రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) బుధవారం ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఈ మేర మార్పులు చోటుచేసుకున్నాయి.మూడు వందల టెస్టు వికెట్ల క్లబ్లోకాగా బంగ్లాదేశ్ పర్యటనలో రబాడ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మిర్పూర్ టెస్టులో తొమ్మిది వికెట్లతో సత్తా చాటి జట్టును గెలిపించాడు. అంతేకాదు.. ఈ టూర్ సందర్భంగా రబాడ మూడు వందల టెస్టు వికెట్ల క్లబ్లో చేరాడు. ఈ క్రమంలో రెండు ర్యాంకులు మెరుగుపరచుకున్న 29 ఏళ్ల రబాడ.. బుమ్రాను వెనక్కి నెట్టి వరల్డ్ నంబర్ వన్‌గా అవతరించాడు.మరోవైపు.. బుమ్రా స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో రాణించలేకపోతున్నాడు. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌పై వికెట్లు తీయడంలో వెనుకబడ్డాడు. దీంతో కివీస్‌తో తొలి రెండు రెండు టెస్టుల్లో మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ క్రమంలో నంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు.సత్తా చాటిన పాక్ స్పిన్నర్లుసొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ స్పిన్నర్లు నౌమన్ అలీ, సాజిద్ ఖాన్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో నౌమన్ కెరీర్ బెస్ట్ సాధించాడు. ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి.. తొమ్మిదో ర్యాంకుకు చేరుకున్నాడు.సాంట్నర్ ఏకంగా 30 స్థానాలు ఎగబాకిమరోవైపు.. సాజిద్ ఖాన్ సైతం 12 స్థానాలు మెరుగుపరచుకుని కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించాడు. ఇక టీమిండియాతో పుణె వేదికగా రెండో టెస్టులో సత్తా చాటిన న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ సైతం ముందుకు దూసుకువచ్చాడు. రెండో టెస్టులో 13 వికెట్లతో చెలరేగిన ఈ లెఫ్టార్మ్ బౌలర్ 30 స్థానాలు ఎగబాకి 44వ ర్యాంకుకు చేరుకున్నాడు.ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకులు టాప్-51. కగిసో రబాడ(సౌతాఫ్రికా)- 860 రేటింగ్ పాయింట్లు2. జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా)- 847 రేటింగ్ పాయింట్లు3. జస్ప్రీత్ బుమ్రా(ఇండియా)- 846 రేటింగ్ పాయింట్లు4. రవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 831 రేటింగ్ పాయింట్లు4. ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- 820 రేటింగ్ పాయింట్లు.జైస్వాల్‌కు మూడో ర్యాంకుఇదిలా ఉంటే.. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కేన్ విలియమ్సన్ రెండో ర్యాంకు నిలబెట్టుకున్నాడు. ఇక టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక ర్యాంకు మెరుగపరుచుకుని మూడో స్థానానికి చేరుకోగా.. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్ ఆ తర్వాతి ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
విరాట్ కోహ్లిని వెనక్కినెట్టిన రిషభ్ పంత్
టెస్టు క్రికెట్ పునరాగమనంలో అద్బుతంగా ఆడుతున్న టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. సహచర ఆటగాడు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టి.. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఆరోస్థానానికి చేరుకున్నాడు. ఇక ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ తన టాప్ ర్యాంకును కాపాడుకోగలిగాడు.కారు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ దాదాపు ఏడాదిన్నర తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్.. వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు సంపాదించాడు. ఆ మెగా టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.టెస్టు రీ ఎంట్రీలోనే శతకంఈ క్రమంలో స్వదేశంలో ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగా టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చిన పంత్.. శతకంతో దుమ్ములేపాడు. అంతేకాదు.. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ విలువైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. బెంగళూరులో కివీస్‌తో జరిగిన మొదటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సహచరులంతా విఫలమైనా ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్ 20 పరుగులు చేయగలిగాడు.ఇక రెండో ఇన్నింగ్స్‌కు ముందు మోకాలి గాయం తిరగబెట్టినా మైదానంలో దిగి.. 99 పరుగులతో తన బ్యాట్ పవర్ చూపించాడు. ఈ క్రమంలో ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. మరోవైపు.. టీమిండియా నుంచి యశస్వి జైస్వాల్ నాలుగు, విరాట్ కోహ్లి ఎనిమిదో స్థానాల్లో కొనసాగుతున్నారు.ఐసీసీ టెస్టు బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్ టాప్-51. జో రూట్- ఇంగ్లండ్- 917 రేటింగ్ పాయింట్లు2. కేన్ విలియమ్సన్- న్యూజిలాండ్- 821 రేటింగ్ పాయింట్లు3. హ్యారీ బ్రూక్- ఇంగ్లండ్- 803 రేటింగ్ పాయింట్లు4. యశస్వి జైస్వాల్- ఇండియా- 780 రేటింగ్ పాయింట్లు5. స్టీవెన్ స్మిత్- ఆస్ట్రేలియా- 757 రేటింగ్ పాయింట్లు.బుమ్రానే టాప్అదే విధంగా.. టెస్టు బౌలర్ల విభాగంలో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండు, ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హాజిల్‌వుడ్ నాలుగు, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, సౌతాఫ్రికా ఫాస్ట్‌బౌలర్ కగిసో రబాడ వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. టాప్-5లో ఎలాంటి మార్పు లేనప్పటికీ ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఒక స్థానం మెరుగుపరచుకుని ఆరోస్థానానికి చేరుకోగా.. టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా ఏడో స్థానంలో నిలిచాడు.చదవండి: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. 103 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లు -
రెండో స్థానానికి ఎగబాకిన బ్రూక్.. టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకున్న రూట్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్ల హవా కొనసాగింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్ తాజా ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇటీవల పాకిస్తాన్‌తో ముగిసిన తొలి టెస్ట్‌లో హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ, జో రూట్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనలతో రూట్ కెరీర్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు (932) సాధించి టాప్ ర్యాంక్‌ను సుస్థిరం చేసుకున్నాడు. బ్రూక్ ఏకంగా 11 స్థానాలు ఎగబాకి కేన్ విలియమ్సన్తో సహా రెండో స్థానాన్ని ఆక్రమించాడు. రూట్, బ్రూక్ దెబ్బకు భారత ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి చెరో స్థానం కోల్పోయి నాలుగు, ఏడు స్థానాలకు పడిపోయారు. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీలు చేసిన పాక్ ఆటగాళ్లు అఘా సల్మాన్, షాన్ మసూద్ 11, 12 స్థానాలు మెరుగపర్చుకుని 22, 51వ స్థానాలకు ఎగబాకారు.టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. బుమ్రా, అశ్విన్ టాప్-2లో కొనసాగుతుండగా.. రవీంద్ర జడేజా ఆరు, కుల్దీప్ 16 స్థానాల్లో ఉన్నారు. పాక్‌తో టెస్ట్ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన జాక్ లీచ్ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 28వ స్థానానికి ఎగబాకాడు. టెస్ట్ ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా, అశ్విన్ టాప్-2లో కొనసాగుతుండగా.. జో రూట్ ఓ స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరాడు. చదవండి: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో కొత్తగా ముగ్గురి పేర్లు -
అగ్రపీఠాన్ని అధిరోహించిన బుమ్రా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. బౌలింగ్ విభాగంలో పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకే చెందిన రవిచంద్రన్ అశ్విన్‌ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించగా.. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి ఎగబాకాడు.స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. రిషబ్ పంత్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ పలు పాయింట్లు కోల్పోయి 9, 15, 16 స్థానాలకు పడిపోయారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, మొహమ్మద్ రిజ్వాన్, లబూషేన్, డారిల్ మిచెల్ 2, 4, 5, 7, 8, 10 స్థానాల్లో ఉన్నారు.ఈ వారం ర్యాంకింగ్స్‌లో భారీగా లబ్ది పొందిన బ్యాటర్లలో దినేశ్ చండీమల్ (20వ స్థానం), ఏంజెలో మాథ్యూస్ (23వ స్థానం), మొమినుల్ హక్ (42వ స్థానం), కుసాల్ మెండిస్ (43వ స్థానం), కేఎల్ రాహుల్ (49వ స్థానం), షద్మాన్ ఇస్లాం (79), మిచెల్ సాంట్నర్ (88) టాప్-100లో ఉన్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత్ నుంచి బుమ్రా, అశ్విన్, రవీంద్ర జడేజా 1, 2, 6 స్థానాల్లో ఉండగా.. హాజిల్‌వుడ్, కమిన్స్, రబాడ, నాథన్ లియోన్, ప్రభాత్ జయసూర్య, కైల్ జేమీసన్, షాహీన్ అఫ్రిది టాప్-10లో ఉన్నారు. భారత పేసర్ ఆకాశ్‌దీప్ ఈ వారం ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు మెరుగపర్చుకుని 76వ స్థానానికి చేరాడు.ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ టాప్-2గా కొనసాగుతున్నారు. అక్షర్ పటేల్ ఓ స్థానం కోల్పోయి ఏడో ప్లేస్‌కు పడిపోయాడు. చదవండి: శతక్కొట్టిన సర్ఫరాజ్ ఖాన్ -
మెరుగుపడిన యశస్వి, గిల్ ర్యాంక్‌లు.. తలో ఐదు స్థానాలు కోల్పోయిన రోహిత్, విరాట్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో సెంచరీలతో చెలరేగిన శుభ్‌మన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్ భారీగా ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని 14, 72 స్థానాలకు చేరుకోగా.. పంత్ తన రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకుని ఆరో స్థానాన్ని కాపాడుకున్నాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ విరాట్ కోహ్లి ఈ వారం ర్యాంకింగ్స్‌లో తలో ఐదు స్థానాలు కోల్పోయి 10, 12 స్థానాలకు దిగజారారు. జో రూట్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, స్టీవ్ స్మిత్, యశస్వి జైస్వాల్ టాప్-5 బ్యాటర్లుగా కొనసాగుతున్నారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో తొమ్మిది వికెట్లు తీసిన లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య తొలిసారి టాప్-10లోకి వచ్చాడు. జయసూర్య ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరాడు. బంగ్లాతో తొలి టెస్ట్‌లో ఐదు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా ఓ స్థానం మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. అశ్విన్, బుమ్రా మొదటి రెండు స్థానాలను పదిలం చేసుకున్నారు. లంకతో టెస్ట్‌లో రాణించిన న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 25వ స్థానానికి చేరుకోగా.. అదే టెస్ట్‌లో రాణించిన కివీస్ పేసర్ విలియమ్ ఓరూర్కీ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 41వ ప్లేస్‌కు చేరాడు. టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ టాప్-2గా కొనసాగుతుండగా.. అక్షర్ పటేల్ ఆరో స్థానంలో నిలిచాడు.చదవండి: హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ.. ఆసీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ -
పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్.. 59 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్‌తో సిరీస్ పరాజయంతో టెస్టుల్లో పాకిస్తాన్ ర్యాంక్ మరింత దిగజారింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో పాక్ 8వ స్థానానికి పడిపోయింది. రావల్పిండి వేదికగా సొంతగడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పాకిస్తాన్ క్లీన్‌స్వీప్ అయింది. బంగ్లాదేశ్ చేతిలో సిరీస్‌ను కోల్పోవడం పాకిస్తాన్ జట్టుకు ఇదే తొలిసారి. ఒక్క టెస్టులోనూ పోరాటాన్ని కనబర్చలేకపోయిన పాక్ తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో... రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో కంగుతింది. ‘ఐసీసీ పురుషుల టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో పాక్ రెండు స్థానాలు దిగజారి 8వ ర్యాంక్‌కు పడిపోయింది’ అని ఐసీసీ వెబ్సైట్లో తెలిపింది. సిరీస్‌కు ముందు పాకిస్తాన్ ఆరో ర్యాంక్‌లో ఉంది. రెండు వరుస పరాజయాలతో వెస్టిండీస్ (7వ ర్యాంక్) కంటే దిగువ ర్యాంక్‌కు చేరింది. 1965 తర్వాత పాక్ ఇలా ర్యాంకింగ్స్‌లో దిగజారడం ఇదే తొలిసారి. అయితే పాక్‌ను వైట్‌వాష్ చేసినప్పటికీ బంగ్లాదేశ్ 9వ ర్యాంక్‌లో మార్పు లేదు. కానీ బంగ్లాదేశ్ జట్టు 13 రేటింగ్ పాయింట్లు మెరుగుపరుచుకుంది. త్వరలోనే బంగ్లాదేశ్... భారత్ పర్యటనలో రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది. ఈ నెల 19 నుంచి చెన్నైలో తొలి టెస్టు జరుగుతుంది. -
12వ స్థానానికి పడిపోయిన బాబర్ ఆజమ్.. టాప్-10లోనే టీమిండియా బ్యాటింగ్ త్రయం
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ 12వ స్థానానికి పడిపోయాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉండిన బాబర్ మూడు స్థానాలు కోల్పోయి చాలాకాలం తర్వాత టాప్-10 బయటికి వచ్చాడు. ఇదొక్కటి మినహా ఈ వారం టాప్-10లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. లార్డ్స్ టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన జో రూట్ గణనీయంగా రేటింగ్ పాయింట్లు పెంచుకుని అగ్రపీఠాన్ని పదిలం చేసుకోగా.. లంకతో రెండో టెస్ట్‌లో పెద్దగా రాణించని హ్యారీ బ్రూక్ ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోయాడు. టీమిండియా బ్యాటింగ్ త్రయం రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి 6, 7, 8 స్థానాలను కాపాడుకోగా.. కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, స్టీవ్ స్మిత్ 2, 3, 4 స్థానాల్లో నిలిచారు. ఈ వారం టాప్-10 అవతల మార్పుల విషయానికొస్తే.. తాజాగా పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో వీరోచిత శతకం బాదిన బంగ్లా ప్లేయర్ లిటన్ దాస్ ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకుని 15వ స్థానానికి ఎగబాకగా.. లంక ఆటగాడు కమిందు మెండిస్ 11 స్థానాలు మెరుగుపర్చుకుని 25వ స్థానానికి చేరాడు. పాక్‌తో రెండో టెస్ట్‌లో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ చేసిన మెహిది హసన్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 75వ స్థానానికి చేరగా.. లంకతో టెస్ట్‌లో సెంచరీ చేసిన గస్ అట్కిన్సన్ ఏకంగా 80 స్థానాలు మెరుగుపర్చుకుని 96వ స్థానానికి చేరాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో రాణించిన అశిత ఫెర్నాండో 9 స్థానాలు ఎగబాకి 8వ స్థానానికి చేరుకోగా.. టాప్-10 మిగతా బౌలర్లంతా యధాతథంగా కొనసాగుతున్నారు. అశ్విన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. హాజిల్‌వుడ్, బుమ్రా రెండో స్థానంలో.. కమిన్స్, రబాడ స్థానంలో కొనసాగుతున్నారు. నాథన్ లయోన్ ఆరు, రవీంద్ర జడేజా ఏడు, కైల్ జేమీసన్ తొమ్మిది, మ్యాట్ హెన్రీ పది స్థానాల్లో నిలిచారు. లార్డ్స్ టెస్ట్‌లో సెంచరీతో పాటు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అట్కిన్సన్ 14 స్థానాలు మెరుగుపర్చుకుని 28వ స్థానానికి ఎగబాకగా.. బంగ్లాతో టెస్ట్‌లో ఆరు వికెట్లు తీసిన ఖుర్రమ్ షెహజాద్ 35 స్థానాలు మెరుగుపర్చుకుని 60వ స్థానానికి చేరాడు. -
Rankings: దూసుకొచ్చిన బ్రూక్.. తొమ్మిదికి పడిపోయిన బాబర్
ఐసీసీ తాజా టెస్టు బ్యాటింగ్ ర్యాకింగ్స్లో ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ సత్తా చాటాడు. ఏకంగా మూడుస్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకు సంపాదించాడు. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బ్రూక్.. తొలి మ్యాచ్‌లో వరుసగా 56, 32 పరుగులు సాధించాడు.టాప్-10లోనే మనోళ్లుఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం స్థానాన్ని భర్తీ చేస్తూ టాప్-5లో నిలిచాడు. ఇక ఇంగ్లిష్ వెటరన్ స్టార్ జో రూట్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు.. టీమిండియా స్టార్లు కెప్టెన్ రోహిత్ శర్మ ఆరో ర్యాంకులో కొనసాగుతుండగా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక స్థానం(7), రన్‌మెషీన్ విరాట్ కోహ్లి(8) రెండు స్థానాలు మెరుగుపరచుకుని టాప్-10లో నిలిచారు.తొమ్మిదికి పడిపోయిన బాబర్కాగా గత కొన్నాళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శల పాలవుతున్న పాక్ బ్యాటర్ బాబర్ ఆజం ఏకంగా ఆరు స్థానాలు దిగజారి తొమ్మిదో ర్యాంకుకు పడిపోయాడు. అయితే, ఇటీవల బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో శతకం బాదిన పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. ఏడు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ పదవ ర్యాంకు అందుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్‌లో 191 పరుగులతో చెలరేగిన బంగ్లా వెటరన్ స్టార్ ముష్ఫికర్ రహీం సైతం కెరీర్ హై రేటింగ్ సాధించి 17వ ర్యాంకులో నిలిచాడు.ఐసీసీ తాజా టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-10👉జో రూట్(ఇంగ్లండ్)- 881 రేటింగ్ పాయింట్లు👉కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 859 రేటింగ్ పాయింట్లు👉డారిల్ మిచెల్(న్యూజిలాండ్)- 768 రేటింగ్ పాయింట్లు👉హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్)- 758 రేటింగ్ పాయింట్లు👉స్టీవెన్ స్మిత్(ఆస్ట్రేలియా)- 757 రేటింగ్ పాయింట్లు👉రోహిత్ శర్మ(ఇండియా)- 751 రేటింగ్ పాయింట్లు👉యశస్వి జైస్వాల్(ఇండియా)- 740 రేటింగ్ పాయింట్లు👉విరాట్ కోహ్లి(ఇండియా)- 737 రేటింగ్ పాయింట్లు👉బాబర్ ఆజం(పాకిస్తాన్)- 734 రేటింగ్ పాయింట్లు👉ఉస్మాన్ ఖవాజా(ఆస్ట్రేలియా)- 728 రేటింగ్ పాయింట్లుఇక టెస్టు బౌలర్ల ర్యాంకుల విషయానికొస్తే టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నంబర్ వన్‌గా కొనసాగుతుండగా.. జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా), జస్ప్రీత్ బుమ్రా(ఇండియా), ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా), కగిసో రబడ(సౌతాఫ్రికా) టాప్-5లో నిలకడగా ఉన్నారు.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ -
కేన్ విలియమ్సన్కు షాక్.. వరల్డ్ నంబర్ వన్‌గా రూట్
ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. కేన్ విలియమ్సన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన రూట్.. మరోసారి నంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్నాడు.సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తంగా 291 పరుగులతో రాణించిన రూట్.. ఇంగ్లండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో మొత్తంగా 872 రేటింగ్ పాయింట్లు సాధించి ప్రథమ స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో మరోసారి వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచాడు.కాగా ఈ 33 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్ తొలిసారిగా 2015 ఆగష్టులో అగ్రపీఠం కైవసం చేసుకున్నాడు. గతేడాది కూడా మొదటి ర్యాంకు సంపాదించాడు. ఇక తాజా టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజం, డారిల్ మిచెల్, స్టీవెన్ స్మిత్ టాప్-5లో కొనసాగుతున్నారు. భారత్ నుంచి రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపరచుకుని ఆరో ర్యాంకులో నిలిచాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు.ఐసీసీ మెన్స్ టెస్టు తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-5 ప్లేయర్లు1. జో రూట్(ఇంగ్లండ్)- 872 రేటింగ్ పాయింట్లు2. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 859 రేటింగ్ పాయింట్లు3. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 768 రేటింగ్ పాయింట్లు4. డారిల్ మిచెల్(న్యూజిలాండ్)- 768 రేటింగ్ పాయింట్లు5. స్టీవెన్ స్మిత్(ఆస్ట్రేలియా)- 757 రేటింగ్ పాయింట్లు. -
ICC: అగ్రపీఠానికి చేరువైన రూట్.. భారీ జంప్ కొట్టిన బ్రూక్
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు సత్తా చాటారు. వెటరన్ క్రికెటర్ జో రూట్ అగ్రస్థానానికి చేరువకాగా.. యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు. అదే విధంగా.. బెన్ డకెట్ ఆరు స్థానాలు మెరుగుపరచుకుని టాప్-20(16వ ర్యాంకు)లో అడుగుపెట్టగా.. ఓలీ పోప్ 8 స్థానాలు ఎగబాకి 21వ ర్యాంకులో నిలిచాడు.విండీస్‌ను చిత్తు చేసిమూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడే నిమిత్తం వెస్టిండీస్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగిస్తూ 241 పరుగుల తేడాతో మట్టికరిపించింది.ఈ విజయంలో జో రూట్ కీలక పాత్ర పోషించాడు. కెరీర్లో 32వ టెస్టు సెంచరీ(122 రన్స్) నమోదు చేశాడు. ఫలితంగా 12 రేటింగ్ పాయింట్లు మెరుగుపరచుకున్న జో రూట్.. టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు.అగ్రపీఠానికి చేరువైన రూట్నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ పీఠంపై కన్నేశాడు. మరో ఏడు రేటింగ్ పాయింట్లు సాధిస్తే రూట్ అగ్రస్థానానికి ఎగబాకుతాడు. విండీస్‌తో మిగిలి ఉన్న మూడో టెస్టులోనూ సత్తా చాటితే ఇదేమంత కష్టం కాదు.భారీ జంప్ కొట్టిన బ్రూక్ఇక 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ సైతం వెస్టిండీస్‌తో రెండో టెస్టులో సెంచరీ(109)తో కదంతొక్కాడు. ఈ క్రమంలో నాలుగు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకు అందుకున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, ఆస్ట్రేలియా వెటరన్ ప్లేయర్ స్టీవెన్ స్మిత్‌లను వెనక్కి నెట్టి టాప్-3లోకి దూసుకువచ్చాడు.కాగా ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ(7వ ర్యాంకు), అతడి ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్(8వ ర్యాంకు), విరాట్ కోహ్లి(10వ ర్యాంకు) టాప్-10లో కొనసాగుతున్నారు.ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే1. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 859 రేటింగ్ పాయింట్లు2. జో రూట్(ఇంగ్లండ్)- 852 రేటింగ్ పాయింట్లు3. హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్)- 771 రేటింగ్ పాయింట్లు4. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 768 రేటింగ్ పాయింట్లు5. డారిల్ మిచెల్(న్యూజిలాండ్)- 768 రేటింగ్ పాయింట్లు. -
టీమిండియా నంబర్ వన్
టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా మళ్లీ అగ్రస్ధానాన్ని కైవసం చేసుకుంది. స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. 122 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 ర్యాంక్ కైవసం చేసుకుంది. ఇక ఇప్పటివరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న ఆస్ట్రేలియా 117 రేటింగ్ పాయింట్స్‌తో రెండో స్థానానికి పడిపోయింది. ఇక భారత్ చేతితో ఘోర పరాభవం పొందిన ఇంగ్లండ్ 111 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. భారత్ ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ టాప్ ర్యాంక్‌లోనే నిలవడం గమనార్హం. అదే విధంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 పాయింట్ల పట్టికలోనూ భారత్ అగ్రస్ధానంలో ఉంది. 68.51 విజయ శాతంతో టీమిండియా తొలి స్ధానంలో ఉంది. భారత్ తర్వాత స్ధానంలో న్యూజిలాండ్(60.00 విజయ శాతం) ఉంది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియాకు ఇంకా కేవలం 5 టెస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్, న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ భారత్ ఆడనుంది. ఈ సిరీస్‌లలో భారత్ విజయం సాధిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దాదాపు ఖరారైనట్లే. -
టాప్-10లోకి దూసుకొచ్చిన జైస్వాల్.. 11వ స్థానంలో హిట్‌మ్యాన్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ సత్తా చాటారు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో ఓ మోస్తరు స్కోర్లు చేసిన ఈ ఇద్దరు (రోహిత్ 2&55, యశస్వి 73&37) తాజా ర్యాంకింగ్స్‌లో రెండ్రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 10, 11 స్థానాలకు ఎగబాకారు. ఇదివరకే టాప్-10లో ఉన్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా ఓ స్థానం మెరుగుపర్చుకుని తొమ్మిది నుంచి ఎనిమిదో స్థానానికి ఎగబాకగా.. భారత్‌తో నాలుగో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన జో రూట్.. మూడు నుంచి రెండో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానాన్ని పదిలంగా కాపాడుకోగా.. స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్, బాబర్ ఆజమ్, ఉస్మాన్ ఖ్వాజా, దిముత్ కరుణరత్నే వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో కొనసాగుతున్నారు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారీ శతకంతో విరుచుకుపడిన ఆసీస్ ఆటగాడు కెమరూన్ గ్రీన్ ఏకంగా 22 స్థానాలు మెరుగుపర్చుకుని 23వ స్థానానికి చేరాడు. ఇవి మినహా తాజా ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేవీ జరగలేదు. బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 10 వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన నాథన్ లయోన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. ఆసీస్‌తో టెస్ట్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటిన గ్లెన్ ఫిలిప్స్ 19 స్థానాలు మెరుగుపర్చుకుని 48వ స్థానానికి చేరాడు. టీమిండియా బౌలర్లు బుమ్రా, అశ్విన్ టాప్-2లో కొనసాగుతుండగా.. రబాడ, హాజిల్‌వుడ్, కమిన్స్ 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా ఓ స్థానం తగ్గి ఏడో ప్లేస్‌కు పడిపోగా.. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ ఆండర్సన్ ఓ స్థానం మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్స్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో టాప్-8 ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు లేవు. రవీంద్ర జడేజా, అశ్విన్, షకీబ్, రూట్, అక్షర్ పటేల్, జేసన్ హోల్డర్, స్టోక్స్, జన్సెన్ టాప్-8లో కొనసాగుతుండగా.. విండీస్ ఆటగాడు కైల్ మేయర్స్ ఓ స్థానం మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరాడు. న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ 12 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి ఎగబాకాడు. -
దూసుకొస్తున్న జైస్వాల్.. కెరీర్ బెస్ట్ సాధించిన జురెల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటారు. ఇంగ్లండ్‌తో ముగిసిన నాలుగో టెస్ట్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేసిన యశస్వి జైస్వాల్ (73, 37), శుభ్‌మన్ గిల్ (38, 52 నాటౌట్), దృవ్ జురెల్ (90, 39 నాటౌట్) ర్యాంకింగ్స్ భారీ జంప్ కొట్టి కెరీర్ అత్యుత్తమ స్థానాలకు చేరుకున్నారు. యశస్వి మూడు స్థానాలను మెరుగుపర్చుకుని టాప్ 10 దిశగా (12వ స్థానం) దూసుకువస్తుండగా.. గిల్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్థానానికి.. జురెల్ 31 స్థానాలు మెరుగుపర్చుకుని 69 స్థానానికి ఎగబాకారు. ఇదే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీతో కదంతొక్కిన ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరుకోగా.. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్ నుంచి టాప్-10లో విరాట్ కోహ్లి ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. అయితే విరాట్ ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌కు దూరంగా ఉండటంతో అతని ర్యాంక్ ఏడు నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోయింది. నాలుగో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేసినప్పటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్థానాన్ని కోల్పోయి 13వ ప్లేస్‌కు పడిపోయాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. భారత బౌలర్లు బుమ్రా, అశ్విన్, జడేజా ఒకటి, రెండు, ఆరు స్థానాల్లో కొనసాగుతుండగా.. రబాడ, కమిన్స్, హాజిల్‌వుడ్ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. మరో భారత స్పిన్నర్ కుల్దీప్ రాంచీ టెస్ట్‌లో మెరుగైన ప్రదర్శన కారణంగా 10 స్థానాలు మెరుగపర్చుకుని కెరీర్ అత్యుత్తమ 32వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్‌తో నాలుగో టెస్ట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఏకంగా 38 స్థానాలు మెరుగుపర్చుకుని 80వ ర్యాంక్‌కు ఎగబాకాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ పెద్దగా మార్పులేమీ జరగలేదు. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. ఇంగ్లండ్ జో రూట్ మాత్రం మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో ప్లేస్‌కే చేరాడు. -
ICC: ఎవరికీ అందనంత ఎత్తులో జడేజా.. నంబర్ వన్ గానే అశూ
ICC Test Bowling Rankings: ఐసీసీ తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ప్రదర్శన కారణంగా నంబర్ వన్ ర్యాంకును కాపాడుకోగలిగాడు. ఇక భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపరచుకుని నాలుగో స్థానంలో నిలిచాడు. అదే విధంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆరో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. ఇలా టాప్-10 బౌలర్లలో టీమిండియా నుంచి ముగ్గురికి స్థానం లభించింది. బ్యాటర్లలో పోప్ ఏకంగా... కాగా టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ ఆరు వికెట్లు తీశాడు. అదే విధంగా.. బుమ్రాకు కూడా ఆరు వికెట్లు లభించగా.. జడ్డూ ఐదు వికెట్లతో రాణించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ ఒలీ పోప్ అద్భుత సెంచరీ(196)తో జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 20 స్థానాలు ఎగబాకి సత్తా చాటాడు. MEN'S TEST ALL-ROUNDER RANKINGS: ఎవరికీ అందనంత ఎత్తులో జడేజా! మరోవైపు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో.. రవీంద్ర జడేజా 425 రేటింగ్ పాయింట్లతో ఫస్ట్ ర్యాంకు నిలబెట్టుకుని ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో వికెట్లు తీయడంతో పాటు జడ్డూ 89 పరుగులు చేశాడు. ఇక అశూ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియాతో మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన రూట్ స్టోక్స్‌ను దాటేశాడు. ఇక హైదరాబాద్‌లో 28 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో తలపడనుంది. ఈ టెస్టుకు విరాట్ కోహ్లి ఇప్పటికే దూరం కాగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, కీలక బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయాల కారణంగా అందుబాటులో ఉండటం లేదు. ఐసీసీ మెన్స్ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-5 1. రవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 853 పాయింట్లు 2. కగిసో రబడ(సౌతాఫ్రికా)- 851 పాయింట్లు 3. ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- 828 పాయింట్లు 4. జస్ప్రీత్ బుమ్రా(ఇండియా)- 825 పాయింట్లు 5. జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా)- 818 పాయింట్లు ఐసీసీ మెన్స్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ టాప్-5 1. రవీంద్ర జడేజా(ఇండియా)- 425 పాయింట్లు 2. రవిచంద్రన్ అశ్విన్(ఇండియా)- 328 పాయింట్లు 3. షకీబ్ అల్హసన్(బంగ్లాదేశ్)- 320 పాయింట్లు 4. జో రూట్(ఇంగ్లండ్)- 313 పాయింట్లు 5. బెన్ స్టోక్స్(ఇంగ్లండ్)- 307 పాయింట్లు. చదవండి: Mayank Agarwal: ఆ బాటిల్ తీసుకుని తాగగానే వాంతులు.. భయంకర పరిస్థితి -
టెస్టు ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన పోప్.. ఏకంగా! మరి రోహిత్?
ICC Mens Test Batting Rankings: ఐసీసీ మెన్స్ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ ఒలీ పోప్ సత్తా చాటాడు. టీమిండియాతో తొలి టెస్టులో అద్భుత శతకం సాధించిన అతడు.. ఏకంగా ఇరవై స్థానాలు ఎగబాకాడు. కెరీర్లో తొలిసారి అత్యుత్తమంగా 15వ ర్యాంకు సాధించాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఒలీ పోప్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పోప్ ఇన్నింగ్స్ కారణంగానే పోప్ ఇన్నింగ్స్ కారణంగానే సొంతగడ్డపై మరింత పటిష్టమైన టీమిండియాను ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో ఓడించగలిగింది. ఈ క్రమంలో బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఈ మేరకు కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడని ఐసీసీ పేర్కొంది. కోహ్లి, రోహిత్ ర్యాంకులు? ఇక ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కేన్ విలియమ్సన్ అగ్రస్థానం నిలబెట్టుకోగా.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఒక స్థానం మెరుగుపరచుకుని ఆరో ర్యాంకులో నిలిచాడు. భారత్ నుంచి కోహ్లి ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 12వ స్థానంలో నిలవగా.. దాదాపు ఏడాదిన్నరకాలంగా ఆటకు దూరమైన రిషభ్ పంత్ 13వ స్థానంలో నిలిచాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు కోహ్లి దూరం కాగా.. ఓపెనర్ రోహిత్ శర్మ హైదరాబాద్ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 63 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు మొదలుకానుంది. ఐసీసీ మెన్స్ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్) 2. జో రూట్(ఇంగ్లండ్) 3. స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా) 4. డారిల్ మిచెల్(న్యూజిలాండ్) 5. బాబర్ ఆజం(పాకిస్తాన్) చదవండి: Mayank Agarwal: ఆ బాటిల్ తీసుకుని తాగగానే వాంతులు.. భయంకర పరిస్థితి -
సత్తా చాటిన కోహ్లి, రోహిత్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సత్తా చాటారు. చాలాకాలం తర్వాత ఈ ఇద్దరూ టాప్-10లోకి వచ్చారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 172 పరుగులతో రాణించిన కోహ్లి 775 రేటింగ్ పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకగా.. అదే దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపించిన హిట్‌మ్యాన్ 748 రేటింగ్ పాయింట్లు సాధించి 14 నుంచి పదో స్థానానికి చేరాడు. Virat Kohli moves to number 6 in ICC Test batters ranking. - The GOAT is coming for the Top. 🐐 pic.twitter.com/m99Tii4eSW — Johns. (@CricCrazyJohns) January 9, 2024 తాజా ర్యాంకింగ్స్‌లో టాప్-3 బ్యాటర్స్‌లో (కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్) ఎలాంటి మార్పు లేకపోగా.. ఆసీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో దారుణంగా విఫలమైన పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ రెండు స్థానాలు కోల్పోయి ఎనిమిదో ప్లేస్‌కు పడిపోయాడు. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకగా.. అతని సహచరుడు ఉస్మాన్ ఖ్వాజా నాలుగు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. Rohit Sharma moves to number 10 in ICC Test batters ranking. - Hitman is back in the Top 10. ⭐ pic.twitter.com/T8evWfahYv — Johns. (@CricCrazyJohns) January 9, 2024 బౌలింగ్ విషయానికొస్తే.. కేప్‌టౌన్ టెస్ట్‌లో ఆరేసి ఇరగదీసిన టీమిండియా పేసర్లు సిరాజ్ (17), బుమ్రా (4) ర్యాంకింగ్స్‌ను భారీగా మెరుగుపర్చుకోగా.. సౌతాఫ్రికా సిరీస్‌లో సరైన అవకాశాలు రాని రవీంద్ర జడేజా ఓ స్థానం కోల్పోయి ఐదో ప్లేస్‌కు పడిపోయాడు. పాక్‌తో సిరీస్‌లో హ్యాట్రిక్ ఐదు వికెట్ల ప్రదర్శనలతో ఇరగదీసిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ రెండో స్థానానికి ఎగబాకగా.. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. -
టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ.. రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికాపై గెలిచినా..!
కేప్‌టౌన్ టెస్ట్‌లో సౌతాఫ్రికాపై గెలిచి జోష్ మీదున్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. చాలాకాలం తర్వాత భారత జట్టు టెస్ట్‌ల్లో నంబర్ వన్ ర్యాంక్‌ను కోల్పోయింది. పాకిస్తాన్‌పై సిరీస్ విజయంతో (2-0) ఆస్ట్రేలియా భారత్‌ను కిందకు దించి ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు ఎగబాకింది. కేప్‌టౌన్ టెస్ట్‌లో భారత్ గెలుపొందినా.. సిరీస్ డ్రా (1-1) కావడంతో రోహిత్ సేన నంబర్ వన్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికాపై గెలుపుతో అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్ స్థానంతో పాటు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలోనూ అగ్రస్థానానికి చేరిన భారత్‌కు ఇది ఊహించని ఎదురుదెబ్బ. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ పరాభవాన్నిమరువకముందే ఆసీస్ మరోసారి టీమిండియాను దెబ్బకొట్టింది. అయితే టెస్ట్‌ల్లో నంబర్ వన్ స్థానం ఆసీస్‌కు మూన్నాళ్ల ముచ్చటగానే మిగలవచ్చు. త్వరలో భారత్.. ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుండటంతో ర్యాంకింగ్స్‌లో మార్పులకు తప్పక ఆస్కారం ఉంటుంది. ఆసీస్, భారత్‌ల మధ్య పాయింట్ల వ్యత్యాసం కూడా చాలా తక్కువగా (1) ఉండటంతో ర్యాంకింగ్స్ తారుమారు కావడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆసీస్ 118 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. భారత్ 117 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్ల తర్వాత మూడో స్థానంలో ఇంగ్లండ్ (115), నాలుగో ప్లేస్‌లో సౌతాఫ్రికా (106), ఐదో స్థానంలో న్యూజిలాండ్ (95), ఆరో స్థానంలో పాకిస్తాన్ (92), ఏడో స్థానంలో శ్రీలంక (79), ఎనిమిదో స్థానంలో వెస్టిండీస్ (77), తొమ్మిదో ప్లేస్‌లో బంగ్లాదేశ్ (51), పదో స్థానంలో జింబాబ్వే (32) జట్లు ఉన్నాయి. -
తొమ్మిదో స్థానానికి ఎగబాకిన విరాట్.. టాప్ 10లో ఒకే ఒక్కడు
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో రన్ మెషీన్ విరాట్ కోహ్లి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. భారత్ నుంచి టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక బ్యాటర్ విరాటే కావడం విశేషం. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో ప్రదర్శన (38, 76) ఆధారంగా విరాట్ నాలుగు స్థానాలు (761 రేటింగ్ పాయింట్లు) మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరాడు. ఇదే టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ (101) సైతం భారీగా పాయింట్లు మెరుగుపర్చుకుని (508 పాయింట్లు) 51వ స్థానానికి చేరాడు. రాహుల్ తన శతక ప్రదర్శనతో ఏకంగా 11 స్థానాలు ఎగబాకాడు. మరోవైపు తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగు స్థానాలు దిగజారి 14వ స్థానానికి పడిపోగా.. యాక్సిడెంట్ కారణంగా ఏడాదికాలంగా జట్టుకు దూరంగా ఉన్న రిషబ్ పంత్ 12వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టీమిండియా ఆటగాళ్లు పుజారా 35, రవీంద్ర జడేజా 38, శ్రేయస్ అయ్యర్ 42, అజింక్య రహానే 44, అక్షర్ పటేల్ 50, శుభ్‌మన్ గిల్ 55, యశస్వి జైస్వాల్ 69, అశ్విన్ 79, శార్దూల్ ఠాకూర్ 99వ స్థానాల్లో నిలిచారు. తాజా ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. జో రూట్, స్టీవ్ స్మిత్ ఆతర్వాతి స్థానాలను కాపాడుకున్నారు. మరో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి చేరగా.. ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్ నాలుగు స్థానాలు కోల్పోయి 10వ స్థానానికి పడిపోయాడు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో అశ్విన్ అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. జడేజా, బుమ్రా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. షమీ రెండు స్థానాలు పడిపోయి 20వ స్థానానికి చేరగా.. సిరాజ్ 30, అక్షర్ పటేల్ 32 స్థానాల్లో నిలిచారు. భారత్‌తో తొలి టెస్ట్‌లో రెచ్చిపోయిన రబాడ రెండు స్థానాన్ని పదిలం చేసుకోగా.. పాకిస్తాన్‌తో రెండో టెస్ట్‌లో 10 వికెట్ల ప్రదర్శనతో ఇరగదీసిన కమిన్స్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో టీమిండియా టాప్‌లో కొనసాగుతుండగా.. ఆసీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాబ్వే టాప్ 10లో నిలిచాయి. -
అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టి.. రోహిత్, కోహ్లిలతో పాటు!
Pakistan And India stars reach new career highs after latest rankings update: పాకిస్తాన్ బ్యాటర్ సౌద్ షకీల్ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకు సాధించాడు. తద్వారా టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో కలిసి టాప్-15లో చోటు దక్కించుకున్నాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా పాకిస్తాన్ శ్రీలంకతో తమ తొలి సిరీస్ ఆడుతోంది. లంకతో మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీ ఈ క్రమంలో.. గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో సౌద్ షకీల్ అద్భుత అజేయ ద్విశతకం(208)తో మెరిశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఒక్కసారిగా పైకి దూసుకువచ్చాడు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ర్యాంకుల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. రోహిత్ పది, కోహ్లి 14 స్థానాల్లో కొనసాగుతుండగా.. యాక్సిడెంట్ కారణంగా జట్టుకు దూరంగా ఉన్న యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఒక స్థానం కోల్పోయి 12వ ర్యాంకుకు పడిపోయాడు. నంబర్ 1గా అతడే.. అశ్విన్ సైతం అగ్రస్థానంలోనే.. ఇక టాప్-10 ర్యాంకుల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. నంబర్ 1గా కేన్ విలియమ్సన్ కొనసాగుతుండగా.. లబుషేన్, జో రూట్, ట్రవిస్ హెడ్, బాబర్ ఆజం వరుసగా ఆ తర్వాతి స్థానాలు ఆక్రమించారు. మరోవైపు.. ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హవా కొనసాగుతోంది. విండీస్ టూర్లో 14 వికెట్లతో అదరగొట్టిన అతడు అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా ఒక స్థానం మెరుగుపరచుకుని ఆరో ర్యాంకు సాధించాడు. కాగా విండీస్‌తో రెండో టెస్టు డ్రా అయిన నేపథ్యంలో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోల్పోయింది. పాకిస్తాన్ ప్రస్తుతం టాప్‌లో ఉంది. చదవండి: 69 ఏళ్ల వయసులో ‘సూపర్‌స్టార్’ పెళ్లి! ఎవరీ బ్యూటీ? ఆమె పిల్లలు కూడా.. -
రోహిత్ తిరిగి వచ్చేశాడు! యశస్వి జైశ్వాల్ తొలిసారి.. కోహ్లి మాత్రం
Rohit sharma Enters Top 10 Yashasvi Roars: అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో అలరించిన టీమిండియా యువ సంచలనం యశస్వి జైశ్వాల్ తొలిసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించాడు. వెస్టిండీస్ గడ్డపై 171 పరుగులతో అదరగొట్టిన ఈ ముంబై బ్యాటర్.. తాజా ర్యాంకింగ్స్‌లో 73వ స్థానంలో నిలిచాడు. విండీస్‌తో డొమినికాలో ఓపెనర్‌గా బరిలోకి దిగి భారీ స్కోరు సాధించి అనేక రికార్డులు సాధించిన 21 ఏళ్ల యశస్వి తొట్టతొలి మ్యాచ్‌లోనే మెరుగైన ర్యాంకు సాధించాడు. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో విండీస్‌పై శతకంతో చెలరేగిన రోహిత్ శర్మ టాప్-10లోకి దూసుకువచ్చాడు. 221 బంతుల్లో 103 పరుగులు చేసిన ‘హిట్‌మ్యాన్’ మూడు స్థానాలు ఎగబాకి పదో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో 76 పరుగులు చేసిన రన్‌మెషీన్ విరాట్ కోహ్లి ర్యాంకులో మాత్రం ఎలాంటి మార్పూలేదు. అతడు పద్నాలుగో స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇక యాక్సిడెంట్ కారణంగా సుదీర్ఘకాలంగా జట్టుకు దూరమైన టీమిండియా యువ వికెట్ బ్యాటర్ రిషభ్ పంత్ చాన్నాళ్ల తర్వాత ఒక స్థానం కోల్పోయి పదకొండో ర్యాంకుకు చేరుకున్నాడు. మరోవైపు.. న్యూజిలాండ్ వెటరన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ట్రవిస్ హెడ్, బాబర్ ఆజం, మార్నస్ లబుషేన్ టాప్-5లోనే కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే.. టీమిండియా వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ఐసీసీ టెస్టు బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్: టాప్-5లో ఉన్నది వీళ్లే 1. కేన్ విలియమ్సన్- న్యూజిలాండ్- 883 పాయింట్లు 2. ట్రవిస్ హెడ్- ఆస్ట్రేలియా- 874 పాయింట్లు 3. బాబర్ ఆజం- పాకిస్తాన్- 862 పాయింట్లు 4. స్టీవ్ స్మిత్- ఆస్ట్రేలియా- 855 పాయింట్లు 5. మార్నస్ లబుషేన్- ఆస్ట్రేలియా- 849 పాయింట్లు. చదవండి: దీనస్థితిలో ధోని సొంత అన్న? బయోపిక్‌లో ఎందుకు లేడు? అయినా అతడితో.. -
టీమిండియా నుంచి ఒకే ఒక్కడు! రోహిత్ ఇంకొకటి! కోహ్లి మాత్రం...
ICC Test Ranikngs: ఆస్ట్రేలియా స్టార్ ట్రవిస్ హెడ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపాడు. ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో రాణిస్తున్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ నంబర్ 1 స్థానానికి గురిపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపరచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక న్యూజిలాండ్ వెటరన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. టాప్-10లో టీమిండియా నుంచి రిషభ్ పంత్ ఒక్కడే నిలకడగా కొనసాగుతున్నాడు. మరోవైపు.. టీమిండయా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారి 13వ ర్యాంకుకు పడిపోయాడు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్ల 14వ స్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ నంబర్ 1గానే.. జడ్డూ మాత్రం ఇదిలా ఉంటే.. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో టీమిండియా నుంచి పేసర్ జస్ప్రీత్ బుమ్రా(9), స్పిన్ బౌలర్ రవీంద్ర జడేజా(10) ఒక్కో స్థానం చేజార్చుకుని టాప్-10లో కొనసాగుతున్నారు. విండీస్‌తో సిరీస్‌లో బిజీ కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో ఘోర ఓటమి తర్వాత టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో భాగంగా రోహిత్ సేన విండీస్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. జూలై 12 నుంచి ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఐసీసీ టెస్టు బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్: టాప్-5లో ఉన్నది వీళ్లే 1. కేన్ విలియమ్సన్- న్యూజిలాండ్- 883 పాయింట్లు 2. ట్రవిస్ హెడ్- ఆస్ట్రేలియా- 874 పాయింట్లు 3. బాబర్ ఆజం- పాకిస్తాన్- 862 పాయింట్లు 4. స్టీవ్ స్మిత్- ఆస్ట్రేలియా- 855 పాయింట్లు 5. మార్నస్ లబుషేన్- ఆస్ట్రేలియా- 849 పాయింట్లు. చదవండి: జట్టు నుంచి తప్పించడం కంటే కూడా అదే ఎక్కువగా బాధిస్తోంది: టీమిండియా స్టార్ Ind Vs WI: ఛీ.. మరీ ఘోరంగా ఉంది.. నాకైతే! -
లబుషేన్‌కు ఊహించని షాక్.. ప్రపంచ నంబర్ 1 అతడే! వారెవ్వా పంత్..
ICC Test Batting Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సత్తా చాటాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లబుషేన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. దీంతో గత ఆరు నెలలుగా నంబర్ 1 హోదాలో కొనసాగుతున్న లబుషేన్ మూడో స్థానానికి పడిపోయాడు. ఇక న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రూట్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. అజేయ సెంచరీతో కాగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తొలి టెస్టులో రూట్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 46 పరుగులతో రాణించాడు. అదే సమయంలో లబుషేన్ వరుసగా 0, 13 పరుగులతో పూర్తిగా నిరాశపరిచాడు. వారెవ్వా పంత్ ఈ నేపథ్యంలో 887 రేటింగ్ పాయింట్లు సాధించిన జో రూట్‌కు అగ్రపీఠం దక్కింది. ఇక టీమిండియా నుంచి యువ వికెట్ బ్యాటర్ రిషభ్ పంత్ ఒక్కడే టాప్-10లో కొనసాగుతున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా ఈ ఏడాది ఆరంభం నుంచి ఆటకు దూరంగా ఉన్నప్పటికీ పంత్ ఈ మేరకు పదో ర్యాంకు(758 పాయింట్లు)లో కొనసాగడం విశేషం. ఒక స్థానం దిగజారిన కోహ్లి మరోవైపు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో నిరాశపరిచిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఒక స్థానం కోల్పోయి 14వ ర్యాంకుకు పడిపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ సారథి బాబర్ ఆజం ఐదో ర్యాంకును నిలుపుకొన్నాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం తాజా టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. జో రూట్- ఇంగ్లండ్- 887 పాయింట్లు 2. కేన్ విలియమ్సన్- న్యూజిలాండ్- 883 పాయింట్లు 3. మార్నస్ లబుషేన్- ఆస్ట్రేలియా- 877 పాయింట్లు 4. ట్రవిస్ హెడ్- ఆస్ట్రేలియా- 873 పాయింట్లు 5. బాబర్ ఆజం- పాకిస్తాన్- 862 పాయింట్లు. చదవండి: IND vs WI: కిషన్, భరత్‌కు నో ఛాన్స్.. భారత జట్టులోకి యువ వికెట్ కీపర్! -
టీమిండియాకు బిగ్ షాక్.. టెస్టుల్లో నెంబర్ వన్ జట్టుగా ఆస్ట్రేలియా!
టెస్టుల్లో ఆస్ట్రేలియా మళ్లీ నెంబర్ వన్ జట్టుగా అవతరించనుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ తొలి టెస్టులో విజయం సాధించిన ఆసీస్.. టీమిండియాను వెనుక్కి నెట్టి నెం1 ర్యాంక్‌ను కైవసం చేసుకోనుంది. టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత్ 121 పాయింట్లతో అగ్ర స్ధానంలో ఉండగా.. ఆసీస్ 116 పాయింట్లతో రెండో స్ధానంలో కొనసాగుతోంది. అయితే ఇంగ్లండ్‌పై విజయం సాధించడంతో ఆసీస్ ఖాతాలో అదనంగా పాయింట్లు వచ్చి చేరున్నాయి. ఈ క్రమంలో భారత్‌ను ఆస్ట్రేలియా అధిగమించే ఛాన్స్ ఉంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాత్రం ఇంకా టెస్టు ర్యాంకింగ్స్‌ను అప్డేట్ చేయలేదు. ఐసీసీ చివరగా మే3న టెస్టు ర్యాంకింగ్స్‌ను అప్డేట్ చేసింది. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో ఆస్ట్రేలియాదే తొలి విజయం. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో ఆసీస్ 12 పాయింట్లతో అగ్రస్ధానంలో ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. కీలక సమయంలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 44 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఉస్మాన్ ఖవాజా (65) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్డ్ 3, ఓలీ రాబిన్సన్ రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. శుబ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్! రుత్‌రాజ్ రీ ఎంట్రీ Good morning Australia, we've got some pretty good news for you 😉#Ashes pic.twitter.com/kRgNnusl38 — Cricket Australia (@CricketAus) June 20, 2023 -
టెస్టుల్లో నంబర్‌వన్‌గా టీమిండియా
ఐసీసీ ఇవాళ (మే 2) విడుదల చేసిన ఎంఆర్ఎఫ్ వార్షిక టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్‌వన్ స్థానానికి ఎగబాకింది. రెండో ప్లేస్‌లో ఉండిన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాను వెనక్కునెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించింది. 15 నెలలుగా అగ్రపీఠంపై కర్చీఫ్ వేసుకుని కూర్చున్న ఆసీస్.. టీమిండియా దెబ్బకు కొండ దిగాల్సి వచ్చింది. వచ్చే నెలలో (జూన్ 7) జరుగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు ముందు భారత్‌కు ఇది (టాప్ ర్యాంక్) మంచి బూస్టప్ ఇవ్వనుంది. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య టైటిల్ కోసం పోరు జరుగనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే స్వదేశంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆసీస్‌ను మట్టికరిపించి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది రోహిత్ సేన. ఇక ఇపుడు ఏకంగా నంబర్ 1గా అవతరించి మరోసారి అభిమానులను ఖుషీ చేసింది. ఇదిలా ఉంటే.. ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్ (121), ఆస్ట్రేలియా (116) తర్వాత ఇంగ్లండ్ (114), సౌతాఫ్రికా (104), న్యూజిలాండ్ (100), పాకిస్థాన్ (86), శ్రీలంక (84), వెస్టిండీస్ (76), బంగ్లాదేశ్ (45), జింబాబ్వే (32) వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి. 🚨 New World No.1 🚨 India dethrone Australia in the annual update of the @MRFWorldwide ICC Men's Test Rankings ahead of the #WTC23 Final 👀 — ICC (@ICC) May 2, 2023 కాగా, వార్షిక ర్యాంకింగ్‌లకు ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లతో పాటు 2020 మే- 2022 మే మధ్యలో జరిగిన సిరీస్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 20-22 మధ్యలో పూర్తైన సిరీస్‌లకు 50 శాతం, ఆతర్వాత జరిగిన సిరీస్‌లకు 100 శాతం పాయింట్లు కేటాయిస్తారు. 20-22 మధ్యలో ఆసీస్ గెలిచిన సిరీస్‌లకు తక్కువ వెయిటేజ్ ఉండటంతో ఆసీస్ 5 పాయింట్లు కోల్పోయి (121 నుంచి 116 పాయింట్ల) ఒకటి నుంచి రెండో స్థానానికి పడిపోయింది. ఫలితంగా టీమిండియాకు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం లభించింది. -
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారీ కుదుపు.. నంబర్ 1 స్థానం కోసం కొత్త ఛాలెంజర్
ఐసీసీ తాజాగా (మార్చి 22) విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారీ కుదుపు ఏర్పడింది. నంబర్ వన్ స్థానం కోసం కొత్త ఛాలెంజర్ రేసులోకి వచ్చాడు. శ్రీలంకతో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సెంచరీ (121 నాటౌట్), డబుల్ సెంచరీ (215) బాదిన న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఏకంగా 4 స్థానాలు ఎగబాకి సెకెండ్ ప్లేస్‌కు చేరుకున్నాడు. A worthy contender has broken into the top five of @MRFWorldwide ICC Men’s Test Player Rankings for batters 📈 More 👇https://t.co/xXuUqaiAWy — ICC (@ICC) March 22, 2023 ఈ సిరీస్‌లో హ్యాట్రిక్ అర్ధసెంచరీలతో (50, 89, 51) రాణించిన లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే 2 స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్-10లోకి (10వ ర్యాంక్) చేరాడు. విలియమ్సన్ ఒక్కసారిగా నాలుగు స్థానాలు ఎగబాకడంతో స్టీవ్ స్మిత్ (3వ ర్యాంక్), జో రూట్ (4), బాబర్ ఆజమ్ (5), ట్రవిస్ హెడ్ (6) తలో స్థానం కోల్పోయారు. ఈ జాబితాలో ఆసీస్ స్టార్ ఆటగాడు మార్నస్ లబూషేన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ 9వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో 2 స్థానాలు కోల్పోయి 12వ స్థానానికి పడిపోగా.. రన్‌మెషీన్ విరాట్ కోహ్లి 13వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శ్రీలంక ఆటగాడు దినేశ్ చండీమాల్, ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ తలో 2 స్థానాలు మెరుగుపర్చుకుని 17, 18 స్థానాలకు ఎగబాకగా.. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే 3 స్థానాలు మెరుగుపర్చుకుని 20వ స్థానానికి చేరుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కివీస్ మిడిలార్డర్ ఆటగాడు హెన్రీ నికోల్స్ అత్యధికంగా 20 స్థానాలు మెరుగుపర్చుకుని 27వ స్థానానికి చేరుకున్నాడు. లంకతో రెండో టెస్ట్‌లో విలియమ్సన్తో పాటు డబుల్ సెంచరీ (200 నాటౌట్) చేయడంతో నికోల్స్ ఒక్కసారిగా 20 స్థానాలు ఎగబాకాడు. -
నంబర్ 1, 2.. టీమిండియా ఆల్‌రౌండర్ల హవా! స్టోక్స్‌ను వెనక్కినెట్టిన అక్షర్
ICC Test All Rounders Rankings- Axar Patel: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌ల ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెటరన్ స్పిన్నర్ అశూ బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపిస్తే.. జడ్డూ ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఇక అక్షర్ పటేల్ వికెట్లు తీయలేకపోయినప్పటికీ బ్యాట్‌తో సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై ఈ ప్రతిష్టాత్మక నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో అశ్విన్ 25 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలవగా.. జడేజా 22 వికెట్లు తీయడంతో పాటు 135 పరుగులు సాధించాడు. ముఖ్యంగా మొదటి, రెండు టెస్టుల్లో టీమిండియా విజయాల్లో జడేజాదే ప్రధాన పాత్ర. ఈ క్రమంలో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న జడ్డూ ఓవరాల్‌గా అశ్విన్‌తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును పంచుకున్నాడు. మరోవైపు.. అక్షర్ పటేల్ ఈ ఆసీస్‌తో టెస్టు సిరీస్ తొలి మ్యాచ్‌లో విలువైన 84 పరుగులు సాధించాడు. ఒక వికెట్ తీయగలిగాడు. బ్యాట్ ఝులిపించిన అక్షర్ పటేల్ ఇక ఢిల్లీ టెస్టులో 74 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. వికెట్లేమీ పడగొట్టలేకపోయాడు. ఇండోర్ టెస్టులో 27 పరుగులతో అజేయంగా నిలిచిన అతడు.. నిర్ణయాత్మక అహ్మదాబాద్ టెస్టులో 79 పరుగులతో ఆకట్టుకున్నాడు. రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మండలి బుధవారం ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 44వ స్థానానికి చేరుకున్న అక్షర్.. ఆల్‌రౌండర్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇక ఇప్పటికే రవీంద్ర జడేజా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా అక్షర్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని ఇంగ్లండ్ సారథి బెన్‌స్టోక్స్‌ను వెనక్కినెట్టి నాలుగో ర్యాంకు సాధించాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లే ఉండటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ల సత్తా.. టాప్-5లో ఉన్నది వీళ్లే! 1. రవీంద్ర జడేజా- ఇండియా- 431 పాయింట్లు 2. రవిచంద్రన్ అశ్విన్- ఇండియా- 359 పాయింట్లు 3. షకీబ్ అల్ హసన్- బంగ్లాదేశ్- 329 పాయింట్లు 4. అక్షర్ పటేల్- ఇండియా- 316 పాయింట్లు 5. బెన్ స్టోక్స్- ఇంగ్లండ్- 307 పాయింట్లు. చదవండి: Rishabh Pant: వైరల్‌గా మారిన రిషబ్ పంత్ చర్య Ind Vs Aus ODIs: భారత్- ఆసీస్ వన్డే సిరీస్.. షెడ్యూల్, జట్లు.. పూర్తి వివరాలు -
ICC Test Rankings: టీమిండియా ఆటగాళ్ల సత్తా.. నంబర్1 అశూ! ఇక కోహ్లి ఏకంగా
ICC Test Rankings- Ravichandran Ashwin- Virat Kohli: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి నంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాకింగ్స్లో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. మరోవైపు.. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ర్యాంకింగ్స్‌లో ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకాడు. తద్వారా 13వ ర్యాంకు సాధించాడు. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ సైతం బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 44వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో సత్తా చాటి ఈ మేరకు టీమిండియా ఆటగాళ్లు ఆయా విభాగాల్లో ర్యాంకులు సాధించారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అశ్విన్ సొంతగడ్డపై ఆసీస్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అశ్విన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తంగా 25 వికెట్లు కూల్చి టీమిండియా ట్రోఫీ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. మొత్తంగా 25 వికెట్లు తీయడంతో పాటు 86 పరుగులు సాధించిన అశూ.. మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(22 వికెట్లు, 135 పరుగులు)తో కలిసి సంయుక్తంగా ఈ అవార్డు పంచుకున్నాడు. కాగా బీజీటీ-2023 నేపథ్యంలో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌ను వెనక్కి నెట్టి నంబర్1గా అవతరించిన అశ్విన్.. మధ్యలో పాయింట్లు కోల్పోయి అతడితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఆసీస్‌తో ఆఖరి టెస్టులో 7 వికెట్లు తీసి మళ్లీ నంబర్ 1 ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 1205 రోజుల నిరీక్షణకు తెరదించి కోహ్లి టీమిండియా స్టార్ బ్యాటర్, రన్‌మెషీన్ దాదాపు మూడున్నరేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టెస్టుల్లో సెంచరీ సాధించాడు. ఆసీస్‌తో ఆఖరిదైన అహ్మదాబాద్ మ్యాచ్‌లో అంతర్జాతీయ కెరీర్లో 75, టెస్టుల్లో 28వ శతకం సాధించాడు. దీంతో బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి చేరుకున్నాడు. కోహ్లి కంటే ముందు వరుసలో ఉన్న రిషభ్ పంత్ 9, రోహిత్ శర్మ 10వ ర్యాంకుతో టాప్-10లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్నాడు. చదవండి: Ban Vs Eng 3rd T20: ఏంటి.. అసలు ఈ మనిషి కనిపించడమే లేదు! ఏమైందబ్బా? కౌంటర్ అదుర్స్ WTC Final: కేఎస్ భరత్ స్థానానికి ఎసరు పెట్టిన టీమిండియా దిగ్గజం! అతడే సరైనోడు! అవునా.. నిజమా?! -
BGT 2023: నంబర్ 1 బౌలర్‌గా అశ్విన్.. ఒక స్థానం ఎగబాకిన బుమ్రా
ICC Test Bowling Rankings- Ravichandran Ashwin: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌ను వెనక్కినెట్టి మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. స్వదేశంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో అశూ అదరగొట్టిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో 8 వికెట్లు తీసిన ఈ వెటరన్ స్పిన్నర్.. ఢిల్లీ టెస్టులోనూ అద్భుతంగా రాణించాడు. అశ్విన్ రెండో టెస్టులో మూడే! తొలి ఇన్నింగ్స్‌లో మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ వంటి కీలక బ్యాటర్ల వికెట్లు కూల్చి ఆసీస్‌ను దెబ్బ కొట్టిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి ఆసీస్ నడ్డి విరిచాడు. మరోవైపు న్యూజిలాండ్ పర్యటనలో తొలి టెస్టులో రాణించిన ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ రెండో టెస్టులో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసి నంబర్ 1 ర్యాంకుకు చేరుకున్న ఆండర్సన్.. రెండో టెస్టులో మూడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అశ్విన్- జేమ్స్ ఆండర్సన్ టాప్-5లో మనోళ్లు ఇద్దరు ఈ నేపథ్యంలో జేమ్స్ ఆండర్సన్ ఎనిమిది రేటింగ్ పాయింట్లు కోల్పయి రెండో స్థానానికి పడిపోగా.. 864 పాయింట్లతో ఉన్న అశ్విన్ నంబర్ 1గా అవతరించాడు. టాప్-5లో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్, టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పాకిస్తాన్ ఫాస్ట్‌బౌలర్ షాహిన్ ఆఫ్రిది స్థానం సంపాదించారు. ఇంగ్లండ్ బౌలర్ ఓలీ రాబిన్సన్ రెండు ర్యాంకులే దిగజారడంతో బుమ్రా నాలుగోస్థానానికి చేరుకోగా.. ఆఫ్రిది టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. కాగా 2015లో అశ్విన్ తొలిసారి టెస్టు ర్యాంకింగ్స్‌లో మొదటి ర్యాంకు సాధించాడు. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైనప్పటికీ బుమ్రా టాప్-5లో కొనసాగడం విశేషం. ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. రవిచంద్రన్ అశ్విన్- ఇండియా- 864 పాయింట్లు 2. జేమ్స్ ఆండర్సన్- ఇంగ్లండ్- 859 పాయింట్లు 3. ప్యాట్ కమిన్స్- ఆస్ట్రేలియా- 858 పాయింట్లు 4. జస్ప్రీత్ బుమ్రా- ఇండియా- 795 పాయింట్లు 5. షాహిన్ ఆఫ్రిది- పాకిస్తాన్- 787 పాయింట్లు చదవండి: BGT 2023 IND VS AUS 3rd Test: జడ్డూ బౌలింగ్‌లో లబూషేన్ క్లీన్ బౌల్డ్.. తొలిసారి తప్పించుకున్నాడు, రెండోసారి..! IND Vs AUS: ఏం జరుగుతోంది.. రోహిత్ శర్మ తప్పు చేశాడా? -
భారీ జంప్ కొట్టిన అక్షర్ పటేల్, పడిపోయిన కేఎల్ రాహుల్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సత్తా చాటారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్ట్‌ల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన వీరు బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ల విభాగంలో ర్యాంకులను మెరుగుపర్చుకున్నారు. ఇదే సిరీస్‌లో తొలి టెస్ట్‌లో సెంచరీ చేసినప్పటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాంక్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. హిట్‌మ్యాన్ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. యాక్సిడెంట్ కారణంగా గత రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ రిషబ్ పంత్ 6వ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఈ విభాగంలో లబూషేన్ టాప్‌లో కొనసాగుతుండగా.. స్టీవ్ స్మిత్, బాబర్ ఆజమ్ రెండు, మూడు స్థానాలను పదిలం చేసుకున్నారు. ఈ సిరీస్‌లో రెండు అర్ధసెంచరీలతో(84, 74) చెలరేగిన అక్షర్ పటేల్.. ఏకంగా 18 స్థానాలు ఎగబాకి బ్యాటింగ్ విభాగంలో 61వ ప్లేస్‌కు చేరుకున్నాడు. కోహ్లి 16వ స్థానంలో, జడేజా 33వ స్థానంలో కొనసాగుతుండగా.. పుజారా ఓ స్థానం మెరుగుపర్చుకుని 25వ స్థానానికి, శ్రేయస్ అయ్యర్ 10 స్థానాలు కోల్పోయి 27కు, మయాంక్ అగర్వాల్ ఓ స్థానం కోల్పోయి 28కి, కేఎల్ రాహుల్ 7 స్థానాలు కోల్పోయి 58వ ప్లేస్‌కు పడిపోయారు. బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ (866).. పాట్ కమిన్స్‌ను వెనక్కునెట్టి అగ్రస్థానానికి చేరుకోగా.. అశ్విన్ (864) ఓ ప్లేస్ మెరుగుపర్చుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడనప్పటికీ బుమ్రా 5వ స్థానాన్ని కాపాడుకోగా.. జడేజా (763) 6 స్థానాలు మెరుగుపర్చుకుని 9వ స్థానానికి ఎగబాకాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో టీమిండియా ఆటగాళ్లు ఆల్‌టైమ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబర్చారు. 460 రేటింగ్ పాయింట్లతో జడ్డూ భాయ్, 376 పాయింట్లతో అశ్విన్ తొలి రెండు స్థానాలను నిలబెట్టుకోగా.. అక్షర్ పటేల్ 2 స్థానాలు మెరుపర్చుకుని 5వ స్థానానికి చేరాడు. -
ఆండర్సన్ ప్రపంచ రికార్డు! ఎవరికీ సాధ్యం కాదేమో! అశ్విన్‌తో పొంచి ఉన్న ప్రమాదమిదే!
ICC Men's Test Bowling Rankings: ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. న్యూజిలాండ్‌లో మౌంట్ మాంగనీయ్లో జరిగిన తొలి టెస్టులో ఏడు వికెట్లతో సత్తా చాటి.. అగ్రస్థానానికి ఎగబాకాడు. దాదాపు ఐదున్నరేళ్ల తర్వాత టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటి ర్యాంకుకు చేరుకున్నాడు. ఆండర్సన్ ఈ ఫీట్ నమోదు చేయడం ఇది ఆరోసారి. ఆస్ట్రేలియా కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్, టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానం ఆక్రమించాడు. ఈ క్రమంలో ఆండర్సన్ 87 ఏళ్ల నాటి రికార్డు బద్దలు కొట్టాడు. 87 ఏళ్ల రికార్డు బద్దలు అత్యధిక వయసులో టెస్టు నంబర్ 1 బౌలర్‌గా అవతరించిన క్రికెటర్‌గా నిలిచాడు. 40 ఏళ్ల 207 రోజుల వయసులో ఈ ఫీట్ నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం క్లారీ గ్రిమెట్ పేరిట ఉండేది. 1936లో 44 ఏళ్ల 2 నెలల వయసులో ఆయన ఈ ఘనత సాధించాడు. ఇక ప్రస్తుతం యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో 40 ఏళ్ల దాకా జట్టులో కొనసాగడం కాస్త కష్టమే. కాబట్టి ఇప్పటికైతే ఆండర్సన్ రికార్డుకు ఎసరు పెట్టేవాళ్లు లేరని చెప్పవచ్చు. మొదటి ర్యాంకుకు అశ్విన్‌తో పొంచి ఉన్న ప్రమాదం ఇక కివీస్‌తో సిరీస్‌లో సత్తా చాటిన ఆండర్సన్ ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అగ్రస్థానానికి ఎగబాకి మరో ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, టీమిండియా స్పిన్నర్ అశ్విన్‌తో ఆండర్సన్ మొదటి ర్యాంకుకు ప్రమాదం పొంచి ఉంది. ఇంగ్లండ్‌కు కివీస్‌తో ప్రస్తుతం మిగిలి ఉన్నది ఒకే ఒక టెస్టు. దీంతో ఆండర్సన్ న్యూజిలాండ్‌తో మిగిలిన మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడో వేచిచూడాల్సి ఉంది. అదే సమయంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్లో 14 వికెట్లు పడగొట్టాడు అశ్విన్. అశూకు నల్లేరు మీద నడకే ఆసీస్‌తో ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. స్వదేశంలో అదీ తనకు అచ్చొచ్చిన పిచ్‌లపై ఈ స్పిన్ బౌలర్ చెలరేగడం ఖాయం. కాబట్టి స్వల్పకాలంలోనే అశ్విన్,.. కేవలం తనకంటే రెండు పాయింట్లు మాత్రమే ఎక్కువగా కలిగి ఉన్న ఆండర్సన్‌ను వెనక్కినెట్టడం సులువే. ఆసీస్ కెప్టెన్ కమిన్స్‌తో పోటీ ఉందని భావించినా.. అతడు అత్యవసరంగా స్వదేశానికి తిరిగి వెళ్లడం.. మళ్లీ వస్తాడో లేదో తెలియకపోవడం ర్యాంకింగ్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి అశ్విన్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అగ్రస్థానానికి చేరుకోవడం 36 ఏళ్ల అశూకు నల్లేరు మీద నడకే! ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. జేమ్స్ ఆండర్సన్- ఇంగ్లండ్- 866 పాయింట్లు 2. రవిచంద్రన్ అశ్విన్- ఇండియా- 864 పాయింట్లు 3. ప్యాట్ కమిన్స్- ఆస్ట్రేలియా- 858 పాయింట్లు 4. ఓలీ రాబిన్సన్- ఇంగ్లండ్- 820 పాయింట్లు 5. జస్ప్రీత్ బుమ్రా- ఇండియా- 795 పాయింట్లు చదవండి: Bumrah: ‘అలసిపోయాను సర్.. శారీరకంగా, మానసికంగా కూడా! స్లోగా బౌలింగ్ చేయనా?’ Women T20 WC: కీపర్ తెలివితక్కువ పనికి మూల్యం చెల్లించుకున్న పాక్ -
కమిన్స్ జైత్రయాత్రకు చెక్.. నంబర్ 1 ఎవరంటే! సత్తా చాటిన జడ్డూ
ICC Men's Test Bowling Rankings: టీమిండియాతో తొలి రెండు టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒకస్థానం మెరుగుపరచుకుని రెండో ర్యాంకు సాధించాడు. జేమ్స్ ఆండర్సన్ చరిత్ర సృష్టించిన ఆండర్సన్ న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో అత్యద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ వీళ్లిద్దరినీ వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. 866 రేటింగ్ పాయింట్లతో మొదటి ర్యాంకు అందుకున్నాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ విడుదల చేయగా.. ఆండర్సన్ ప్రపంచ నంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. రవీంద్ర జడేజా సత్తా చాటిన జడ్డూ దాదాపు నాలుగేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న కమిన్స్‌కు చెక్ పెట్టాడు. అదే విధంగా.. అత్యధిక వయసులో నంబర్ 1 ఘనత సాధించిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో సత్తా చాటుతున్న టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా 6 స్థానాలు ఎగబాకి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 763 పాయింట్లతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు. త్వరలోనే నంబర్ 1 అశ్విన్ ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అశ్విన్ మిగతా రెండు టెస్టుల్లోనూ సత్తా చాటితే నంబర్1గా అవతరించడం ఖాయం. మరోవైపు.. కమిన్స్ మళ్లీ పూర్వవైభవం పొందాలంటే మాత్రం టీమిండియాతో సిరీస్‌లో తప్పక రాణించాలి. అయితే, అత్యవసరంగా స్వదేశానికి తిరిగి వెళ్లిపోయిన అతడు అసలు తిరిగి వస్తాడా లేదా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అశూ అగ్రస్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మొదటి రెండు టెస్టుల్లో పేసర్ కమిన్స్ మొత్తంగా మూడు వికెట్లు తీయగా.. అశ్విన్ 14 వికెట్లు పడగొట్టాడు. ఇక జడేజా పదిహేడు వికెట్లతో సత్తా చాటాడు. ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే 1. జేమ్స్ ఆండర్సన్- ఇంగ్లండ్- 866 పాయింట్లు 2. రవిచంద్రన్ అశ్విన్- ఇండియా- 864 పాయింట్లు 3. ప్యాట్ కమిన్స్- ఆస్ట్రేలియా- 858 పాయింట్లు 4. ఓలీ రాబిన్సన్- ఇంగ్లండ్- 820 పాయింట్లు 5. జస్ప్రీత్ బుమ్రా- ఇండియా- 795 పాయింట్లు బుమ్రా చదవండి: ChatGPT: రాహుల్‌ను తప్పించాలా? అదీ మరీ..! నీకున్న పాటి బుద్ధి వాళ్లకు లేదు! Bumrah: ‘అలసిపోయాను సర్.. శారీరకంగా, మానసికంగా కూడా! స్లోగా బౌలింగ్ చేయనా?’ -
టెస్టుల్లోనూ నెంబర్‌వన్.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొత్త చరిత్ర
సంప్రదాయ ఫార్మాట్.. టెస్టు క్రికెట్లో టీమిండియా నెంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించింది. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించడం ద్వారా నాలుగు పాయింట్లు పొంది అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 115 పాయింట్లు ఉన్నాయి. ఇప్పటికే వన్డే, టి20 క్రికెట్ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ స్థానంలో ఉన్న టీమిండియా తాజాగా టెస్టుల్లోనూ అగ్రస్థానం అందుకుంది. తద్వారా మూడు ఫార్మాట్లలోనూ నెంబర్‌వన్‌గా నిలిచిన ఘనతను టీమిండియా సొంతం చేసుకుంది. మరోవైపు భారత్‌తో తొలి టెస్టులో ఇన్నింగ్స్ పరాజయం చవిచూసిన ఆస్ట్రేలియా 111 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక ఇంగ్లండ్ 106 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 100 పాయింట్లతో నాలుగు, సౌతాఫ్రికా 85 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇక ఆసీస్‌తో తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు వికెట్ల వేటతో ఆసీస్ నడ్డి విరిచారు. ఏకకాలంలో మూడు ఫార్మాట్స్‌లోనూ టీమిండియా నెంబర్‌వన్‌గా అవతరించడం ఇదే తొలిసారి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ ఘనత అందుకోవడంతో హిట్‌మ్యాన్ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. టీమిండియాను అన్ని ఫార్మాట్లలోనూ నెంబర్‌వన్‌గా నిలిపిన కెప్టెన్‌గా రోహిత్ చరిత్రకెక్కాడు. ఇంతకముందు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను గెలవడం ద్వారా టీమిండియా వన్డేల్లో నెంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా టి20 ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా నెంబర్‌వన్‌గా అవతరించింది. అయితే ఈ సిరీస్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికి.. అధికారికంగా మాత్రం మూడు ఫార్మాట్లకు రోహిత్ శర్మనే ఇంకా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. చదవండి: వాలెంటైన్స్ డే ఎంత పని చేసింది.. శుభ్‌మన్, సారా రిలేషన్‌ను బయటపెట్టింది..! -
ఆస్ట్రేలియాకు షాక్.. నంబర్ వన్ స్థానానికి టీమిండియా
గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా రాణిస్తూ, వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఇవాళ (జనవరి 17) ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాను వెనక్కునెట్టి అగ్రస్థానానికి దూసుకొచ్చింది. గతేడాది శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై వరుస సిరీస్ విజయాలు సాధించిన భారత్.. 115 రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకుని అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంది. సుదీర్ఘ ఫార్మాట్లో గతేడాది ఆస్ట్రేలియా సైతం అద్భుత ప్రదర్శన కనబర్చినప్పటికీ.. ఏడాది చివర్లో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయలేకపోవడం, మరోవైపు భారత్.. బంగ్లాదేశ్‌ను క్లీన్ స్వీప్ చేయడంతో ఇరు జట్ల స్థానాలు తారుమారయ్యాయి. ప్రస్తుతం ఆసీస్ (రెండో స్థానం) ఖాతాలో 111 రేటింగ్ పాయింట్లు ఉండగా.. ఇంగ్లండ్ ఖాతాలో 106 (మూడు), న్యూజిలాండ్ ఖాతాలో 100 (నాలుగు), సౌతాఫ్రికా ఖాతాలో 85 (ఐదు) రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కాగా, ఫిబ్రవరి 9 నుంచి భారత్-ఆసీస్ జట్ల మధ్య 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనున్న నేపథ్యంలో ర్యాంకింగ్స్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకోవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తును (ఇదివరకే ఆసీస్ ఫైనల్‌కు చేరుకుంది) ఖరారు చేసుకోవాలంటే, టీమిండియా ఆసీస్‌తో సిరీస్‌ను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు టీ20 ర్యాంకింగ్స్‌లో ఇదివరకే టాప్ ప్లేస్‌లో ఉన్న భారత్.. రేపటి నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంటే, ఈ ఫార్మాట్లోనూ టాప్కు చేరుకుంటుంది. ఇదే జరిగితే భారత్.. తొలిసారి మూడు ఫార్మాట్లలో టాప్ ప్లేస్‌లో నిలుస్తుంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ 110 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ (117), ఇంగ్లండ్ (113), ఆస్ట్రేలియా (112) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. -
మొన్న గెలిపించారు.. ఇవాళ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపారు
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియాను గెలిపించిన రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్లు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో(డబ్ల్యూటీసీ) భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఐసీసీ ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. బంగ్లాతో రెండో టెస్టులో అశ్విన్ ఆరు వికెట్లు సహా బ్యాటింగ్‌లో 42 పరుగులు(నాలుగో ఇన్నింగ్స్) చేశాడు. 145 పరుగులను చేధించే క్రమంలో 70 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి అశ్విన్ 71 పరుగుల విలువైన భాగస్వామ్యం నిర్మించి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. బౌలింగ్ విభాగంలో అశ్విన్ 812 పాయింట్లతో మరో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక అక్షర్ పటేల్ ఒక స్థానం దిగజారి 19వ స్థానంలో నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో అశ్విన్ తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 343 పాయింట్లతో అశ్విన్ రెండో స్థానంలో ఉండగా.. తొలి స్థానాన్ని జడేజా కాపాడుకున్నాడు. 369 పాయింట్లతో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ దుమ్మురేపాడు. బంగ్లాతో టెస్టు సిరీస్‌లో మంచి బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచిన అయ్యర్ ముఖ్యంగా రెండో టెస్టులో అద్బుతంగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేసిన అయ్యర్.. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌కు మద్దతిస్తూ 29 పరుగులు నాటౌట్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో అయ్యర్ ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 666 పాయింట్లతో 16వ స్థానంలో నిలిచాడు. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో ఎలాంటి మార్పు లేదు. బంగ్లాతో రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 93 పరుగులు చేసిన పంత్ తన ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగా.. రోహిత్ శర్మ తొమ్మిదో స్థానంలో.. బంగ్లా సిరీస్‌లో విఫలమైన కోహ్లి రెండు స్థానాలు దిగజారి 14వ స్థానంలో ఉండగా.. బంగ్లాతో సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైన పుజారా కూడా మూడు స్థానాలు దిగజారి 19వ స్థానంలో నిలిచాడు. చదవండి: కోహ్లి తప్పుకున్నాడు సరే.. రోహిత్, రాహుల్ సంగతేంటి? సివిల్స్ క్లియర్ చేసిన టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా? -
Ind Vs Ban: అదరగొట్టిన అక్షర్ పటేల్... పుజారా, గిల్ సైతం..
ICC Test Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అక్షర్ 20 స్థానాలు పురోగతి సాధించి 18వ స్థానానికి చేరుకున్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన అక్షర్ ప్రస్తుతం 650 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. కుల్దీప్ సైతం మరోవైపు.. ఈ టెస్టులో రాణించిన మరో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 19 స్థానాలు ఎగబాకి 49వ స్థానంలో నిలిచాడు. బంగ్లాతో మ్యాచ్‌లో 8 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఈ చైనామన్ స్పిన్నర్ ఖాతాలో ప్రస్తుతం 455 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగో ర్యాంక్‌లో, అశ్విన్ ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. అదరగొట్టిన పుజారా, గిల్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో ఛతేశ్వర్ పుజారా, శుబ్‌మన్ గిల్ 10 స్థానాల చొప్పున ఎగబాకి వరుసగా 16వ, 54వ ర్యాంక్‌ల్లో నిలిచారు. బంగ్లాతో మొదటి టెస్టు సందర్భంగా గిల్ సెంచరీ చేయగా... పుజారా సైతం అజేయ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ జాబితాలో ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ టాపర్‌గా ఉన్నాడు. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా విఫలమైనా బ్యాటర్‌గా ఆకట్టుకున్న బాబర్ ఆజం కెరీర్ బెస్ట్ రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. చదవండి: ENG vs PAK: ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవం.. పాక్ హెడ్ కోచ్‌పై వేటు! బాబర్ కూడా.. Lionel Messi FIFA Winning Photo: తగ్గేదేలే.. మరో ‘ప్రపంచ రికార్డు’ బద్దలు కొట్టిన మెస్సీ! -
ICC Test Rankings: నెం1 ర్యాంక్‌కు చేరుకున్న ఆసీస్ ఆటగాడు
ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లాబుషేన్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగిన లాబుషేన్.. 935 పాయింట్లతో ఇంగ్లండ్ బ్యాటర్ జోరూట్ అధిగమించి తొలి స్థానంలో నిలిచాడు. ఇక ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్న జో రూట్ నాలుగో స్థానానికి పడిపోయాడు. అదే విధంగా వెస్టిండీస్‌పై డబుల్ సెంచరీ సాధించిన స్మిత్ రెండో ర్యాంక్‌కు, ఇంగ్లండ్‌పై సెంచరీతో రాణించిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మూడో ర్యాంక్‌కు చేరుకున్నారు. మరోవైపు వెస్టిండీస్ కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్ టాప్ 20లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బ్రాత్‌వైట్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 174 పరుగులు సాధించాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే.. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్లు పడగొట్టిన ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లయాన్ ఒక స్థానం ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. అదే విధంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఐదు వికెట్లు సాధించిన నసీం షా ఐదు స్థానాలు ఎగబాకి 54 వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. చదవండి: IND vs BAN: వారెవ్వా ఉమ్రాన్.. 151 కిమీ వేగంతో బౌలింగ్! బంగ్లా బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్ -
వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1.. ఇప్పుడు టెస్టు ఫార్మాట్లో!
ICC Latest Test Rankings- Babar Azam: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తన చిరకాల కల నెరవేర్చుకునే క్రమంలో మరో ముందడుగు వేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ బ్యాటర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో మొదటి టెస్టులో వరుసగా 119, 55 పరుగులు చేసిన బాబర్.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను వెనక్కి నెట్టి మూడో ర్యాంకు అందుకున్నాడు. ఇక స్వదేశంలో న్యూజిలాండ్, టీమిండియాతో మ్యాచ్‌లలో దంచి కొట్టిన ఇంగ్లండ్ మాజీ సారథి జో రూట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 923 పాయింట్లతో మొదటి ర్యాంకు కాపాడుకున్నాడు. ఇక ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 885 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి రిషభ్ పంత్(801 పాయింట్లు) ఐదో స్థానంలో ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ 746 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. అది నా కల.. ఇటీవల బాబర్ ఆజం మాట్లాడుతూ.. ‘‘అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్‌గా నిలవాలనేది ప్రతీ క్రికెటర్ కల. అందుకోసం మనం కఠిన శ్రమకోర్చి. ఆటపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉంటుంది. ఒకటీ రెండు కాదు మూడు ఫార్మాట్లలోనూ టాప్‌లో ఉండాలి. ఒకవేళ మనం ఆ ఫీట్ సాధిస్తే.. దానిని నిలబెట్టుకునేందుకు మరింత ఫిట్‌గా ఉండేందుకు, మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం’’అని పేర్కొన్నాడు. ఇక ఇప్పుడు ఆ కలను నెరవేర్చుకునే పనిలో పడ్డాడు. ఏకైక బ్యాటర్‌గా... కాగా బాబర్ ఆజం ఇప్పటికే ఐసీసీ వన్డే, టీ20 బ్యాట్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజా టెస్టు ర్యాంకింగ్స్ నేపథ్యంలోమూడు ఫార్మాట్లలోనూ టాప్-3లో ఉన్న ఏకైక బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇదే జోష్‌లో మూడు ఫార్మాట్లలో నంబర్ 1గా ఎదిగే దిశగా ముందుకు సాగుతున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే! 1.జోరూట్(ఇంగ్లండ్) 2.మార్నస్ లబుషేన్(ఆస్ట్రేలియా) 3.బాబర్ ఆజం(పాకిస్తాన్) 4.స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా) 5.రిషభ్ పంత్(ఇండియా) చదవండి: Ind Vs WI T20I Series: విండీస్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! సిరీస్ మొత్తానికి అతడు దూరం? T20 WC 2022: అతడి వల్ల టీమిండియాకు ఒరిగేదేమీ లేదు! ఒకవేళ టైటిల్ గెలిస్తే.. 🥇 in ODIs 🥇 in T20Is 🥉 in Tests@babarazam258 rises to third in the ICC Test Rankings to become the only batter to feature inside the top-three across all formats 🤩 pic.twitter.com/XTgYYTLGAG — Pakistan Cricket (@TheRealPCB) July 27, 2022 🗣️ Pakistan skipper @babarazam258 speaks on the much-needed break after the first Test and the morale of the squad before the second match against Sri Lanka 🏏#SLvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/p0hbKlHXRv — Pakistan Cricket (@TheRealPCB) July 23, 2022 -
Ind Vs Eng: రూట్, బెయిర్‌స్టోపై సచిన్ ప్రశంసలు.. మరీ ఇంత ఈజీగా!
India Vs England 5th Test: ఇంగ్లండ్ బ్యాటర్లు జో రూట్, జానీ బెయిర్‌స్టోపై టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ప్రశంసలు కురిపించాడు. బ్యాటింగ్ చేయడం ఇంత సులువా అనేలా అందరినీ ఆశ్చర్యపరిచారని కొనియాడాడు. కాగా టీమిండియాతో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో మాజీ కెప్టెన్ జో రూట్(142 పరుగులు- నాటౌట్), బెయిర్‌స్టో(114 పరుగులు- నాటౌట్) 269 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశారు. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భీకర బ్యాటింగ్‌తో చెలరేగారు. ఇరువురూ సెంచరీలతో అజేయంగా నిలిచారు. తద్వారా మూడో రోజు వరకు పర్యాటక జట్టు చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను.. అమాంతంగా లాక్కొని ఇంగ్లండ్‌ను ఏడు వికెట్ల తేడాతో గెలిపించారు. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 2-2తో సమమైంది. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా స్పందించిన సచిన్.. రూట్, బెయిర్‌స్టోలను అభినందించాడు. ‘‘ఇంగ్లండ్‌కు ఇది ఓ ప్రత్యేకమైన విజయం. సిరీస్ సమమైంది. జో రూట్, జానీ బెయిర్‌స్టో అద్భుత ఫామ్ కనబరిచారు. బ్యాటింగ్ చేయడం ఇంత ఈజీనా అనిపించారు’’ అంటూ ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌ను ట్యాగ్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన రూట్.. కివీస్ ఆటగాడు డారిల్ మిచెల్‌తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. టీమిండియాతో సిరీస్‌లోనూ తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి ఈ అవార్డును పంచుకున్నాడు. ఈ క్రమంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక ఐదో టెస్టులో బెయిర్ స్టో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అదే విధంగా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి పదో స్థానానికి చేరుకున్నాడు. చదవండి: Ind Vs WI 2022: విండీస్‌తో సిరీస్.. శిఖర్ ధావన్‌కు బంపరాఫర్.. వన్డే జట్టు కెప్టెన్‌గా.. బీసీసీఐ ప్రకటన Virat Kohli: ఆరేళ్లలో ఇదే తొలిసారి.. అయినా నీకే ఎందుకిలా? ఇప్పటికైనా కళ్లు తెరువు.. లేదంటే! Rock & Roll Test Cricket 🎸🤘 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/gneNM0rqy3 — England Cricket (@englandcricket) July 6, 2022 Special win by England to level the series. Joe Root & Jonny Bairstow have been in sublime form and made batting look very easy. Congratulations to England on a convincing victory. @Bazmccullum #ENGvIND pic.twitter.com/PKAdWVLGJo — Sachin Tendulkar (@sachin_rt) July 5, 2022 -
ఆరేళ్లలో ఇదే తొలిసారి.. నీకే ఎందుకిలా? ఇప్పటికైనా కళ్లు తెరువు.. లేదంటే!
ICC Test Rankings- Virat Kohli Rank: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్‌లోనూ మరోసారి విఫలమయ్యాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేసిన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులకు అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి ర్యాంకు నాలుగు స్థానాలు దిగజారింది. దీంతో అతడు టాప్-10లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలో కోహ్లి 714 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు. కాగా గత ఆరేళ్లలో కోహ్లి టాప్-10 ర్యాంకు కూడా సాధించలేకపోవడం ఇదే తొలిసారి. EDGBASTON GOES POTTY! 🎉 Scorecard/Videos: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/X5G3B2HsRU — England Cricket (@englandcricket) July 1, 2022 ఇలా ‘రన్‌మెషీన్’ స్థాయి రోజురోజుకూ పడిపోవడంపై అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఏంటిది కోహ్లి.. నీకే ఎందుకిలా జరుగుతోంది. ఇకనైనా బ్యాట్ ఝులిపించు ప్లీజ్’’ అని విజ్ఞప్తి చేస్తున్నారు. అదే విధంగా ఐదో టెస్టులో కోహ్లి- ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో మధ్య వాగ్వాదాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ప్రకృతి కూడా వీరిద్దరి వైరం కొనసాగాలని కోరుకుంటుందేమో! అందుకే ర్యాంకింగ్స్‌లో విరాట్ స్థానాన్ని బెయిర్‌స్టో ఆక్రమించాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అద్భుత శతకంతో జట్టును విజయ తీరాలకు చేర్చడంలో తోడ్పడ్డ బెయిర్‌స్టో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి పదో ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మరికొంత మంది నెటిజన్లు... ‘‘ఇప్పుడు కూడా కోహ్లి కళ్లు తెరవకపోతే.. ఎవరూ అతడికి సాయం చేయలేరు. నిర్లక్ష్యఫు షాట్లు మానుకోవాలి. లేదంటే తుది జట్టులో కూడా స్థానం కోల్పోతాడు. ఆరోజు దగ్గర్లోనే ఉందనిపిస్తోంది’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: Ind Vs WI 2022: విండీస్‌తో సిరీస్.. శిఖర్ ధావన్‌కు బంపరాఫర్.. వన్డే జట్టు కెప్టెన్‌గా.. బీసీసీఐ ప్రకటన Rock & Roll Test Cricket 🎸🤘 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/gneNM0rqy3 — England Cricket (@englandcricket) July 6, 2022 -
ICC Rankings: దుమ్ములేపిన పంత్.. దిగజారిన కోహ్లి ర్యాంకు.. బెయిర్‌స్టో హై జంప్!
ICC Test Rankings- India Vs England: ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్ అదరగొట్టాడు. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ అద్భుత ఆటతీరు కనబరిచిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ(146 పరుగులు), రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం(57 పరుగులు) సాధించాడు. ఈ క్రమంలో 801 పాయింట్లు తన ఖాతాలో వేసుకున్న పంత్... టాప్-5లోకి దూసుకువచ్చాడు. మరోవైపు టాప్-10లో భారత ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడికే స్థానం దక్కింది. కోవిడ్ బారిన పడి ఇంగ్లండ్‌తో టెస్టుకు దూరమైన అతడు ఒక స్థానం దిగజారి తొమ్మిదో ర్యాంకుకు పడిపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో విఫలమైన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి 13వ ర్యాంకుకు పడిపోయాడు. ఇదిలా ఉంటే ఎడ్జ్‌బాస్టన్‌లో దుమ్ము లేపిన ఇంగ్లండ్ టెస్టు జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ 923 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సెంచరీతో ఆకట్టుకున్న జానీ బెయిర్‌స్టో ఏకంగా 11 స్థానాలు ఎగబాకాడు. పదో ర్యాంకు సాధించాడు. కాగా టీమిండియాతో రీషెడ్యూల్డ్ టెస్టులో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 2-2తో సమమైంది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ టాప్-10లో ఉన్నది వీళ్లే 1. జో రూట్(ఇంగ్లండ్) 2.మార్నస్ లబుషేన్(ఆస్ట్రేలియా) 3.స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా) 4.బాబర్ ఆజం(పాకిస్తాన్) 5.రిషభ్ పంత్(ఇండియా) 6.కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్) 7.ఉస్మాన్ ఖవాజా(ఆస్ట్రేలియా) 8.దిముత్ కరుణరత్నె(శ్రీలంక) 9.రోహిత్ శర్మ(ఇండియా) 10.జానీ బెయిర్‌స్టో(ఇంగ్లండ్) చదవండి: రూత్‌లెస్ రూట్.. టీమిండియాపై పూనకం వచ్చినట్లు ఊగిపోతున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ Rock & Roll Test Cricket 🎸🤘 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/gneNM0rqy3 — England Cricket (@englandcricket) July 6, 2022 -
అదరగొట్టిన జడేజా.. టెస్టుల్లో మరోసారి నెంబర్‌వన్‌గా
ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి నెంబర్‌వన్‌గా నిలిచాడు. 385 పాయింట్లతో జడ్డూ తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్(357 పాయింట్లు) ఉన్నాడు. ఇటీవలే శ్రీలంకతో సిరీస్‌లో విశేషంగా రాణించిన జడేజా మార్చి 9న విడుదల చేసిన ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్స్ విభాగంలో నెంబర్‌వన్‌గా నిలిచాడు. దాదాపు వారం పాటు నెంబర్‌వన్‌గా ఉన్న జడేజా విండీస్ ఆల్‌రౌండర్ హోల్డర్‌కు మరోసారి కోల్పోయాడు. తాజాగా మరోసారి నెంబర్‌వన్‌గా నిలిచిన జడేజా, హోల్డర్‌కు మధ్య దాదాపు 28 పాయింట్ల వ్యత్యాసం ఉండడం విశేషం. మరో రెండు నెలల పాటు ఎలాంటి టెస్టు సిరీస్‌లు లేకపోవడంతో జడేజా కొన్నాళ్ల పాటు అగ్రస్థానంలో ఉండే అవకాశం ఉంది. ఇక మూడో స్థానంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(341 పాయింట్లు) ఉన్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అదరగొట్టాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో విశేషంగా రాణిస్తున్న బాబర్ మూడు స్థానాలు ఎగబాకి 799 పాయింట్లతో టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. మరో పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఆరు స్థానాలు ఎగబాకి వార్నర్‌తో కలిసి సంయుక్తంగా 11వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కరాచీ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 160.. రెండో ఇన్నింగ్స్‌లో 44 నాటౌట్‌తో ఆకట్టుకున్నాడు. ఇక ర్యాంకింగ్స్‌లో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. తొలి నాలుగు స్థానాల్లో ఉన్న లబుషేన్, రూట్, స్మిత్, విలియమ్సన్ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారి 754 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా.. కోహ్లి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల విభాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 885 పాయింట్లతో తొలి స్థానాన్ని నిలుపుకోగా.. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ 850 పాయింట్లతో రెండో స్థానం.. బుమ్రా 830 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. చదవండి: Babar Azam: నిబంధనను పాతరేసిన పాక్ కెప్టెన్.. యాక్షన్ తీసుకోవాల్సిందే! క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. 🔹 Babar Azam enters top five of batting list 🔹 Pat Cummins makes gains in all-rounders’ chart Both Pakistan and Australia skippers move up in the weekly update of the @MRFWorldwide ICC Men’s Test Player Rankings 📈 Details ➡ https://t.co/nLJOeoGJVr pic.twitter.com/WYBZhDyN3A — ICC (@ICC) March 23, 2022 -
ICC Test Rankings: దుమ్మురేపిన శ్రేయాస్ అయ్యర్, బుమ్రా
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్లు దుమ్మురేపారు. శ్రీలంకతో ముగిసిన పింక్‌బాల్ టెస్టులో బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లు తీసి అద్బుత ప్రదర్శన చేయగా.. అటు బ్యాటింగ్‌లో అయ్యర్ అర్థసెంచరీలతో మోతెక్కించాడు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్ ఏకంగా 40 స్థానాలు ఎగబాకి 37వ స్థానానికి చేరుకున్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా ఆరు స్థానాలు ఎగబాకి 830 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. షాహిన్ అఫ్రిది, కైల్ జేమిసన్, టిమ్ సౌథీ, జేమ్స్ అండర్సన్, నీల్ వాగ్నర్, జోష్ హాజిల్‌వుడ్‌లు వరుసగా ఐదు నుంచి 10 స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లంకపై టెస్టు సిరీస్‌లో సూపర్ ప్రదర్శనతో తన రెండో స్థానాన్ని(850 పాయింట్లు) నిలబెట్టుకున్నాడు. తొలి స్థానంలో పాట్ కమిన్స్(892 పాయింట్లు) ఉండగా.. మూడో స్థానంలో కగిసో రబాడ(835 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచాడు. ఇక బ్యాటింగ్‌లో ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. కోహ్లి స్థానం మరింత దిగజారింది. లంకతో టెస్టు సిరీస్‌లో తొలి టెస్టులో 45, రెండో టెస్టులో 23, 13 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచిన కోహ్లి.. 742 పాయింట్లతో 9వ స్థానానికి పడిపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 754 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో 936 పాయింట్లతో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్.. 872 పాయింట్లతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రెండో స్థానంలో.. 851 పాయింట్లతో స్టీవ్ స్మిత్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియాతో టెస్టు సిరీస్‌లో సెంచరీతో మెరిసిన లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే మూడు స్థానాలు ఎగబాకి 781 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. గతవారం ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విభాగంలో టాప్ స్థానంలో నిలిచిన రవీంద్ర జడేజా రెండో స్థానానికి పడిపోగా.. విండీస్ ఆటగాడు జాసన్ హోల్డర్ మళ్లీ తొలి స్థానంలో నిలిచాడు. ఇక మూడో స్థానంలో టీమిండియాకే చెందిన అశ్విన్ ఉన్నాడు. చదవండి: IPL 2022 - Hardik Pandya: 'నీ బౌలింగ్ వల్ల ఒరిగేదేం లేదు'.. హార్దిక్‌ను ఏకిపారేసిన క్రికెట్ ఫ్యాన్స్ 46 ఏళ్ల వయసులో సెంచరీ.. ముద్దుల్లో ముంచిన ఫేమస్ హీరోయిన్ 🔹 Jasprit Bumrah breaks into top 5 💪 🔹 Jason Holder reclaims top spot 🔝 🔹 Dimuth Karunaratne rises 📈 Some big movements in the latest @MRFWorldwide ICC Men's Test Player Rankings 🔢 Details 👉 https://t.co/MQENhZlPP8 pic.twitter.com/8OClbDeDtS — ICC (@ICC) March 16, 2022 -
ICC Test Rankings: కోహ్లి, పంత్ మెరిశారు.. పాపం రోహిత్ మాత్రం..
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ముగ్గురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి రెండు స్థానాలు మెరుగుపరచుకుని ఐదో ర్యాంకు(763 పాయింట్లు)కు చేరుకున్నాడు. ఇక ప్రస్తుత సారథి రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారి ఆరో స్థానాని(761 పాయింట్లు)కి పడిపోయాడు. ఇక యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(723 పాయింట్లు)ఒక స్థానం ఎగబాకి టాప్-10కు చేరుకున్నాడు. కాగా ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ ఈ జాబితాలో 936 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జోరూట్ 872, ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్ 851 పాయింట్లతో ఆ తర్వాతి స్థానాలు ఆక్రమించారు. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో కోహ్లి, రోహిత్ శర్మ, ట్రవిస్ హెడ్, దిముత్ కరుణరత్నే, బాబర్ ఆజం, రిషభ్ పంత్ ఉన్నారు. ఇక వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లి 45 పరుగులు చేయగా.. రోహిత్ 29, పంత్ 96 పరుగులు సాధించారు. ఆల్‌రౌండర్ జడేజా 175 పరుగులతో చెలరేగడంతో భారీ స్కోరు సాధించిన టీమిండియా ఈ మ్యాచ్‌లో లంకపై ఘన విజయం సాధించింది. బ్యాట్, బంతితో అద్బుతం చేసిన జడేజా తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. చదవండి: IPL 2022- CSK: సీఎస్కే అభిమానులకు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👏 👏@ImRo45 begins his Test captaincy stint with a win as #TeamIndia beat Sri Lanka by an innings & 2⃣2⃣2⃣ runs in the first @Paytm #INDvSL Test in Mohali. 👌 👌 Scorecard ▶️ https://t.co/XaUgOQVg3O pic.twitter.com/P8HkQSgym3 — BCCI (@BCCI) March 6, 2022 -
ICC Test Rankings: అదరగొట్టిన జడేజా.. వరల్డ్ నంబర్ 1గా..
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపాడు. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకుల్లో ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. రెండు స్థానాలు మెరుగుపరచుకుని 406 పాయింట్లతో మొదటి స్థానానికి చేరుకున్నాడు. ఇక వెస్టిండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్ ఒక స్థానం దిగజారి 382 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక టీమిండియా మరో ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఒక స్థానం కోల్పోయి 347 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్, ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్, ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్, కివీస్ ప్లేయర్లు కైలీ జెమీషన్, కొలిన్ డీ గ్రాండ్‌హోం, ఆసీస్ టెస్టు, ఇంగ్లండ్ ప్లేయర్ క్రిస్ వోక్స్ వరుసగా టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. కాగా ఇటీవల శ్రీలంకతో స్వదేశంలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో జడేజా అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. 175 పరుగులతో అజేయంగా నిలవడమే గాక, మ్యాచ్‌లో మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక అశ్విన్ విషయానికొస్తే 61 పరుగులు సాధించి, 6 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సారథ్యంలోని టీమిండియా ఇన్నింగ్స్ మీద 222 పరుగుల తేడాతో విజయం సాధించింది. చదవండి: Rohit Sharma: బహుశా రోహిత్ నోరు జారి ఉంటాడు.. అతడు ఆల్‌టైమ్ గ్రేట్ ఏంటి?: పాక్ మాజీ క్రికెటర్ Prithvi Shaw: నా బ్యాటింగ్ చూస్తే అసహ్యమేస్తోంది: పృథ్వీ షా 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👏 👏@ImRo45 begins his Test captaincy stint with a win as #TeamIndia beat Sri Lanka by an innings & 2⃣2⃣2⃣ runs in the first @Paytm #INDvSL Test in Mohali. 👌 👌 Scorecard ▶️ https://t.co/XaUgOQVg3O pic.twitter.com/P8HkQSgym3 — BCCI (@BCCI) March 6, 2022 A round of applause 👏👏 for @imjadeja for his Man of the Match performance 🔝 Victory for #TeamIndia indeed tastes sweet 🍰😉#INDvSL @Paytm pic.twitter.com/8RnNN7r38w — BCCI (@BCCI) March 6, 2022 -
స్థిరంగా రోహిత్.. దూసుకెళ్తున్న కోహ్లి
దుబాయ్: ఇటీవలే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విరాట్ కోహ్లి తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పూర్వ వైభవం దిశగా దూసుకెళ్తున్నాడు. తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా పరిమిత ఓవర్ల సారధి రోహిత్ శర్మ 8 రేటింగ్ పాయింట్లు కోల్పోయినప్పటికీ.. ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌లో అద్భుత శతకంతో చెలరేగిన రిషబ్ పంత్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 14వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. 🔹 Travis Head continues his rise 🔥 🔹 Big gains for Kagiso Rabada ↗️ 🔹 Virat Kohli soars 🏏 🔹 Andy McBrine shoots up ☘️ Some big movements in the @MRFWorldwide ICC Player Rankings for the week 📈 Details 👉 https://t.co/gIWAqcmxeT pic.twitter.com/sJqByzFZgM — ICC (@ICC) January 19, 2022 మరోవైపు యాషెస్‌లో వరుస సెంచరీలతో సత్తా చాటిన ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ 7 స్థానాలు ఎగబాకి రోహిత్‌తో పాటు సంయుక్తంగా ఐదో స్థానంలో నిలువగా, లబూషేన్ టాప్‌లో, రూట్, విలియమ్సన్, స్టీవ్ స్మిత్‌లు వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచారు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. అశ్విన్(839 రేటింగ్ పాయింట్లు) తన రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా, బుమ్రా 763 పాయింట్లు సాధించి టాప్-10లోకి చేరాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో పర్వాలేదనిపించిన బుమ్రా.. 3 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ జాబితాలో పాట్ కమిన్స్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇండియాతో సిరీస్‌లో రాణించిన రబాడ 2 స్థానాలు ఎగబాకి మూడో ప్లేస్‌కు చేరుకున్నాడు. చదవండి: అతనో చేత కాని బౌలర్.. నన్ను ఔట్ చేసుకోలేక ఏడ్చేవాడు..! -
ICC Test Rankings: దూసుకొచ్చిన ప్రొటిస్ కెప్టెన్.. టీమిండియా నుంచి అతడొక్కడే!
ICC Test Rankings: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా పలు టెస్టు సిరీస్‌లు జరుగుతున్న తరుణంలో ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ 924 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సైతం రెండో ర్యాంకును కాపాడుకోగా... న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఒక స్థానం దిగజారాడు. నాలుగో ర్యాంకుకు పడిపోయాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మూడో స్థానానికి ఎగబాకి విలియమ్సన్ స్థానాన్ని ఆక్రమించాడు. ఇదిలా టీమిండియా బ్యాటర్లలో పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ(781), టెస్టు సారథి విరాట్ కోహ్లి(740) మాత్రమే టాప్-10లో చోటు దక్కించుకున్నారు. వరుసగా 5, 8 స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియాతో సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని పదో ర్యాంకు సాధించాడు. బౌలింగ్ విభాగంలో... టీమిండియా నుంచి అశ్విన్ ఒక్కడే.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో ఆసీస కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 895 పాయింట్లతో మొదటి ర్యాంకును కాపాడుకోగా... టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 861 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా ఆడిన కివీస్ బౌలర్ కైలీ జెమీషన్ ఏకంగా 8 స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకు దక్కించుకున్నాడు. షాహిన్ ఆఫ్రిది, కగిసో రబడ, జేమ్స్ ఆండర్సన్, టిమ్ సౌథీ, జోష్ హాజిల్‌వుడ్, నీల్ వాగ్నర్, హసన్ అలీ మొదటి పది స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. భారత్ తరఫున అశ్విన్ మినహా ఒక్కరు కూడా టాప్-10లో లేకపోవడం గమనార్హం. చదవండి: IPL 2022: అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావాల్సిందే.. 🔼 Steve Smith overtakes Kane Williamson 🔼 Kyle Jamieson launches into third spot The latest @MRFWorldwide ICC Men’s Test Player Rankings 👇 Full list: https://t.co/0D6kbTluOW pic.twitter.com/vXD07fPoES — ICC (@ICC) January 12, 2022 -
ICC Test Rankings: టాప్-5కు దూసుకొచ్చిన అండర్సన్.. అశ్విన్ మాత్రం
ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అటు బౌలింగ్ విభాగంలో 883 పాయింట్లతో.. ఇటు ఆల్‌రౌండర్ విభాగంలో 360 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ విభాగంలో 346 పాయింట్లతో మూడోస్థానాన్ని కాపాడుకున్నాడు. బౌలింగ్ విభాగంలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 902 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది 822 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచాడు. యాషెస్ సిరీస్‌లో రాణించిన ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మూడు స్థానాలు ఎగబాకి 813 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో మార్నస్ లబుషేన్ 915 పాయింట్లతో తొలిస్థానం కాపాడుకోగా.. జో రూట్ 900 పాయింట్లతో రెండో స్థానంలో.. ఇక స్టీవ్ స్మిత్ తన మూడో స్థానాన్ని కేన్ విలియమ్సన్కు కోల్పోయాడు. టీమిండియా నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు 5,7 స్థానాలను నిలుపుకున్నారు. 🔹 James Anderson breaks into top 5 👊 🔹 Mitchell Starc rises 🔥 #Ashes stars make gains in the latest @MRFWorldwide ICC Men’s Test Player Rankings 📈 Details 👉 https://t.co/BRZCOy32hI pic.twitter.com/VTr86Y3riE — ICC (@ICC) December 29, 2021 -
R Ashwin: బౌలర్‌గా,ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన అశ్విన్.. నెం2..
R Ashwin moves up to the No.2 spot among allrounders: ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకిగ్స్‌లో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఏకంగా 30స్ధానాలు ఎగబాకి 11వ స్ధానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరగిన రెండో టెస్ట్‌లో మయాంక్ వరుసగా 150, 62 పరుగులు సాధించాడు. అదేవిధంగా మరో ఓపెనర్ శుభమాన్ గిల్ 21 స్ధానాలు ఎగబాకి 45వ స్ధానానికి చేరుకున్నాడు. ఇక తొలి స్థానంలో 903 పాయింట్లతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఉన్నాడు. ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో రెండో స్ధానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్(879), మార్నస్ లబుషేన్(878) మూడు, నాలుగో స్ధానంలో కొనసాగుతున్నారు. మార్నస్ లబుషేన్ రోహిత్ శర్మ(797 పాయింట్లు), విరాట్ కోహ్లి( 775 పాయింట్లు) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. ఇక బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. 908 పాయింట్లతో పాట్ కమ్మిన్స్ అగ్ర స్ధానంలో కొనసాగుతుండగా, 883 పాయింట్లతో రెండో స్ధానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ స్సిన్నర్ అజాజ్ పటేల్ 23 స్ధానాలు ఎగబాకి 38 వ స్ధానానికి చేరుకున్నాడు. భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి అజాజ్ పటేల్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఆల్‌రౌండర్ విభాగంలో 382 పాయింట్లతో జాసన్ హోల్డర్ తొలి స్ధానంలో ఉండగా, అశ్విన్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. చదవండి: ఐసీసీ అవార్డు రేసులో వార్నర్, సౌథీ.. టీమిండియా ఆటగాళ్లకు దక్కని చోటు R Ashwin moves up to the No.2 spot in the latest @MRFWorldwide ICC Men's Test Player Rankings for all-rounders. Full list: https://t.co/vrogyWdn0u pic.twitter.com/RwPzCXd57J — ICC (@ICC) December 8, 2021 -
ICC Test Rankings: అదరగొట్టిన కోహ్లి సేన.. నెంబర్ 1!
Ind Vs Nz: India Won By 372 Runs Regains Top Spot In ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా అదరగొట్టింది. న్యూజిలాండ్‌పై అద్భుత విజయంతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 124 పాయింట్లతో కివీస్‌ను వెనక్కి నెట్టి నంబర్ వన్‌గా నిలిచింది. ఇక రెండో టెస్టులో 372 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకున్న న్యూజిలాండ్ రెండో ర్యాంకుకు పడిపోయింది. ఇక ఇండియా, కివీస్(121) తర్వాత ఆస్ట్రేలియా(108), ఇంగ్లండ్(107), పాకిస్తాన్(92 పాయింట్లు) టాప్-5లో చోటు దక్కించుకున్నాయి. కాగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీమిండియా రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియగా... ముంబై టెస్టులో మాత్రం కోహ్లి సేన ఏకపక్ష విజయం సాధించింది. భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా డబ్ల్యూటీసీ ఫైనల్లో తమకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇక మొట్టమొదటి డబ్ల్యూటీసీ విజేత కివీస్‌కు తొలి సిరీస్‌లోనే ఇలా ఓటమి ఎదురవడం గమనార్హం. చదవండి: Ind Vs Nz 2nd Test: టీమిండియా అరుదైన రికార్డు.. న్యూజిలాండ్‌కు ఘోర పరాభవం! Virat Kohli- Ajinkya Rahane: రహానే ఫామ్.. నేను ఆ పని చేయలేను.. ఇంకెవరు కూడా.. కోహ్లి కౌంటర్! 🔝 India are back to the No.1 spot in the @MRFWorldwide ICC Men’s Test Team Rankings.#INDvNZ pic.twitter.com/TjI5W7eWmq — ICC (@ICC) December 6, 2021 CHAMPIONS 👏👏 This is #TeamIndia's 14th consecutive Test series win at home.#INDvNZ @Paytm pic.twitter.com/FtKIKVCzt8 — BCCI (@BCCI) December 6, 2021 -
టాప్-5లోకి దూసుకొచ్చిన షాహిన్.. దిగజారిన విలియమ్సన్
ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక స్థానం దిగజారాడు. టీమిండియాతో కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో 888 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోగా.. ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు. ఇక తొలి స్థానంలో 903 పాయింట్లతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ(805 పాయింట్లు), విరాట్ కోహ్లి( 775 పాయింట్లు) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో హాఫ్ సెంచరీలతో మెరిసిన లాథమ్ 726 పాయింట్లతో 5 స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలవగా.. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న లంక కెప్టెన్ కరుణరత్నే 4 స్థానాలు ఎగబాకి పాయింట్లతో ఏడో స్థానంలో నిలలిచాడు. చదవండి: రెండో టెస్టుకు సాహా దూరం.. కేఎస్ భరత్‌కు అవకాశం! ఇక బౌలింగ్ విభాగంలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది స్థానాలు ఎగబాకి పాయింట్లతో తొలిసారి టాప్ 5లోకి దూసుకొచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏడు వికెట్లు తీసిన షాహిన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఆకట్టుకున్న కైల్ జేమీసన్ 6 స్థానాలు ఎగబాకి 776 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. టీమిండియా నుంచి రవిచంద్రన్ అశ్విన్ 840 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. 763 పాయింట్లతో బుమ్రా ఒకస్థానం దిగజారి 10వ స్థానంలో నిలిచాడు. చదవండి: Test Cricket: ఇది ఆటంటే.. టెస్టు మజా ఏంటో చూపించింది Afridi, Jamieson, Latham and Karunaratne on the charge 👊 All the latest changes in the @MRFWorldwide Test player rankings 👉 https://t.co/sBZWT92hhH pic.twitter.com/4dHZoUV67z — ICC (@ICC) December 1, 2021 -
కోహ్లిని వెనక్కు నెట్టిన రోహిత్.. అగ్రస్థానానికి ఎగబాకిన రూట్
-
టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన సిరాజ్, కేఎల్ రాహుల్
దుబాయ్: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్, స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ దుమ్మురేపారు. తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చిన సిరాజ్.. 465 రేటింగ్ పాయింట్స్‌తో ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి దూసుకొచ్చాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత శతకంతో అదరగొట్టిన కేఎల్ రాహుల్ 19 స్థానాలు మెరుగుపరుచుకుని 37వ ర్యాంక్‌కు ఎగబాకాడు. ఇక వరుసగా రెండు టెస్ట్‌ల్లో విఫలమైనా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఐదో స్థానాన్ని నిలబెట్టుకోగా, తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీతో రాణించిన రోహిత్ శర్మ(6వ ర్యాంక్) ర్యాంక్ మెరుగుపరుచుకోకపోయినా కెరీర్ బెస్ట్ 773 రేటింగ్ పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ↗️ Joe Root rises to No.2 ↗️ Babar Azam moves up two spots The latest @MRFWorldwide ICC Men's Test Player Rankings for batting 👇 🔗 https://t.co/OMjjVx5Mgf pic.twitter.com/ERYzCGm9Pc — ICC (@ICC) August 18, 2021 ప్రస్తుతం రోహిత్ కంటే కోహ్లి కేవలం మూడు రేటింగ్ పాయింట్లు మాత్రమే ఎక్కువగా ఉన్నాడు. ఈ జాబితాలో రోహిత్ తర్వాతి స్థానంలో 736 పాయింట్లతో రిషబ్ పంత్ 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో టెస్ట్‌లో సూపర్ సెంచరీతో మెరిసిన ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ 893 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి దూసుకురాగా, కేన్ విలియమ్సన్(901) అగ్రస్థానంలో, స్టీవ్ స్మిత్(891) మూడో స్థానానికి, మార్నస్ లబుషేన్(878) నాలుగో ప్లేస్‌కు దిగజారారు. James Anderson and Jason Holder make significant gains in the latest @MRFWorldwide ICC Men's Test Player Rankings for bowling 📈 🔗 https://t.co/OMjjVx5Mgf pic.twitter.com/sTDH9Rr6In — ICC (@ICC) August 18, 2021 ఇక టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ జాబితాలో పాట్ కమిన్స్(908) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రవిచంద్రన్ అశ్విన్(848) సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. లార్డ్్స టెస్ట్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టిన ఆండర్సన్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని ఆరో స్థానానికి ఎగబాకగా, గాయంతో సిరీస్‌కు దూరమైన ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 8వ స్థానంలో, టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఒక ర్యాంక్ దిగజారి 10వ స్థానంలో నిలిచారు. ఇక, ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మూడు, నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. విండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్ టాప్‌లో కొనసాగుతున్నాడు. చదవండి: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఏంటంటే..? -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన రవీంద్ర జడేజా, షకీబ్
దుబాయ్: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టగా.. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ ఆల్ హసన్ టీ 20 ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. ముందుగా జడేజా విషయానికి వస్తే.. బుధవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్ విభాగంలో జడేజా(377 పాయింట్లు) రెండో స్థానానికి చేరుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న బెన్‌స్టోక్స్(370)ను ఏడు పాయింట్లతో అధిగమించాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన తొలి టెస్టులో జడేజా తొలి ఇన్నింగ్స్‌లో అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంలో కీలక పాత్ర పోషించిన జడేజా నెంబర్ వన్ స్థానానికి మరింత చేరువయ్యాడు. ఇక విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ 384 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌తో మరో నాలుగు టెస్టులు మిగిలి ఉండడంతో జడేజా మంచి ప్రదర్శన కనబరిస్తే త్వరలోనే నెంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఇక టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కేన్ విలియమ్సన్(901), స్టీవ్ స్మిత్(891), మార్నస్ లబుషేన్(878) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 846 పాయింట్లతో నాలుగో స్థానం.. 791 పాయింట్లతో కోహ్లి ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో పాట్ కమిన్స్(908) తొలిస్థానం, రవిచంద్రన్ అశ్విన్(856) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్‌లో షకీబ్ ఆల్ హసన్ దుమ్మురేపాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన షకీబ్ ఆసీస్‌తో జరిగిన చివరి టీ20లో నాలుగు వికెట్లతో కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. 286 పాయింట్లతో షకీబ్ టాప్‌లో ఉండగా.. ఒక పాయింట్ తేడాతో మహ్మద్ నబీ (285) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టీ 20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తబ్రెయిజ్ షంసీ 792 పాయింట్లతో తొలి స్థానం.. వహిందు హసరంగ 764 పాయింట్లతో రెండో స్థానం.. 719 పాయింట్లతో రషీద్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 841 పాయింట్లతో డేవిడ్ మలాన్ తొలి స్థానం.. 819 పాయింట్లతో బాబర్ అజమ్ రెండో స్థానంలో ఉన్నాడు. Sir JADEJA claimed one position in ICC men's test all-rounder ranking And now he's at no 2 🔥#ravindrajadeja @imjadeja #IndvsEng #ENGvIND pic.twitter.com/ZqoqKsZl5s — ⚔️Sir JADEJA FC ™ ⚔️ (@FCofSirJadeja) August 11, 2021 In the latest @MRFWorldwide ICC Men's T20I Player Rankings: 🥇 Shakib Al Hasan reclaims the No.1 all-rounder spot 📈 Fast bowler Mustafizur Rahman storms into the top 10 ↗️ Australia spinner Ashton Agar moves up to No.7 Full list: https://t.co/uR3Jx2jJ5V pic.twitter.com/sWFrtWDY5Z — ICC (@ICC) August 11, 2021 -
మళ్లీ టాప్‌లో కేన్ విలియమ్సన్; కెరీర్ బెస్ట్‌కు కైల్ జేమిసన్
దుబాయ్: ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరోసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. రెండువారాల క్రితం ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్‌కు కోల్పోయిన టాప్ ర్యాంకును తాజాగా మరోసారి చేజెక్కించుకున్నాడు. టీమిండియాతో జరిగిన ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో కేన్ 49, 52 నాటౌట్‌తో ఆకట్టుకున్నాడు. లో స్కోరింగ్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో మెప్పించిన కేన్ మొత్తంగా 900 పాయింట్లు సాధించి టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక 878 పాయింట్లతో మార్నస్ లబుషేన్ మూడో స్థానంలో ఉండగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 812 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఆరో స్థానంలో ఉండగా.. రిషబ్ పంత్ ఒకస్థానం దిగజారి ఏడో స్థానంలో నిలిచాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు,రెండో ఇన్నింగ్స్‌లో రెండు.. మొత్తంగా ఏడు వికెట్లు తీసిన కివీస్ బౌలర్ కైల్ జేమిసన్ కెరీర్ బెస్ట్ అందుకున్నాడు. బౌలింగ్ విభాగంలో జేమిసన్ 13వ స్థానంలో నిలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న కివీస్ ఓపెనర్ డెవన్ కాన్వే ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 42వ స్థానంలో నిలిచాడు. టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన కివీస్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ మూడు స్థానాలు ఎగబాకి 14వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఆసీస్ స్టార్ బౌలర్ పాట్ కమిన్స్(908 పాయింట్లు) అగ్రస్థానంలో నిలవగా.. టీమిండియా స్పిన్నర్ అశ్విన్(865 పాయింట్లు) రెండో స్థానంలో, కివీస్ బౌలర్ టిమ్ సౌథీ(824 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా తన టాప్ ర్యాంక్‌ను జాసన్ హోల్డర్(384 పాయింట్లు) కోల్పోయి స్టోక్స్‌తో కలిసి 377 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పంత్.. మాస్క్ లేదంటూ ప్రశ్నల వర్షం 🇳🇿 @BLACKCAPS captain Kane Williamson is back to the No.1 spot in the latest @MRFWorldwide ICC Men's Test Player Rankings for batting. Full list: https://t.co/OMjjVx5Mgf pic.twitter.com/1DWGBonmF2 — ICC (@ICC) June 30, 2021 -
ICC Rankings: టాప్ ర్యాంక్‌కు దూసుకెళ్లిన జడేజా
దుబాయ్: ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ల జాబితాలో నంబర్‌వన్ స్థానానికి దూసుకెళ్లాడు. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జేసన్ హోల్డర్(384 రేటింగ్ పాయింట్లు), ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(377)లను వెనక్కు నెట్టి అతను అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. జడేజా ఖాతాలో ప్రస్తుతం 386 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కాగా, 2017 ఆగస్ట్ తర్వాత ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా నంబర్ వన్ స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ జాబితాలో టీమిండియా ఆల్‌రౌండర్ అశ్విన్ 353 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. ఐసీసీ టాప్ 10 ప్లేయర్స్ జాబితాలో ముగ్గురు భారత ఆటగాళ్లు కొనసాగుతున్నారు. టీమిండియా సారధి విరాట్ కోహ్లీ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 814 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలువగా, రిషబ్ పంత్(747), రోహిత్ శర్మ(747) వరుసగా 6, 7 ర్యాంకుల్లో ఉన్నారు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్(891) టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, కేన్ విలియమ్సన్(886), మార్నస్ లబూషేన్(878) వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు. మరోవైపు, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ.. మూడు స్థానాలు మెరుగుపరచుకుని 3వ ర్యాంక్‌లోకి దూసుకురాగా, ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్(908) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్ 850 పాయింట్లతో రెండులో, ఆసీస్ సీమర్ జోష్ హేజిల్‌వుడ్ 816 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. ఇక జట్ల విభాగంలో 123 రేటింగ్ పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్(121), ఆస్ట్రేలియా(108), ఇంగ్లండ్(107)లు వరుసగా 2, 3, 4 ర్యాంక్‌ల్లో నిలిచాయి. చదవండి: నెటిజన్లకు దొరికిపోయిన బుమ్రా.. ఇలా ఐతే ఎలా? -
‘చాంపియన్’ టెస్టుకు రెడీ
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 2009లోనే తొలి సారి నంబర్‌వన్‌గా నిలిచింది. టెస్టు ల్లో అగ్రస్థానానికే ఇప్పటి వరకు ప్రపంచ కప్ విజేత తరహా హోదా కల్పిస్తూ ప్రతీ ఏటా ఐసీసీ గదను, నగదును ఇచ్చి విజేతను గుర్తిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ లెక్క వేరు... టెస్టు ప్రపంచ చాంపియన్ లెక్క వేరు. సాంప్రదాయ క్రికెట్లో జగజ్జేతగా గుర్తించాలంటే డబ్ల్యూటీసీ కిరీటం అందుకోవడమే సరైందని ఖాయమైన నేపథ్యంలో తొలి ఫైనల్‌కు టీమిండియా సిద్ధమైంది. మరో వైపు రెండేళ్ల క్రితం ఇంగ్లండ్ గడ్డపై వన్డే ప్రపంచకప్‌లో అనూహ్య ఫలితంతో గుండె పగిలిన న్యూజిలాండ్ అక్కడే మరో ఫార్మాట్లో విశ్వ విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో తటస్థ వేదికపై ఇరు జట్ల మధ్య హోరాహోరీ సమరానికి నేడు తెర లేవనుంది. సౌతాంప్టన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) తుది సమరానికి భారత్, న్యూజిలాండ్ సన్నద్ధమయ్యాయి. శుక్రవారం నుంచి జరిగే ఈ ఫైనల్లో గెలిచిన జట్టు తొలి డబ్ల్యూటీసీ చాంపియన్‌గా నిలుస్తుంది. 2019–21 మధ్య కాలంలో జరిగిన టెస్టు సిరీస్‌లలో సాధించిన పాయింట్లను బట్టి భారత్, కివీస్ ఫైనల్ చేరాయి. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు... మ్యాచ్‌కు ఒక రోజు ముందే టీమిండియా తమ తుది జట్టును ప్రకటించింది. ఐదుగురు రెగ్యులర్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్‌తో పాటు ముగ్గురు పేస్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లకు చోటు కల్పించింది. ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి ఓపెనింగ్ చేయనున్న రోహిత్ అక్కడి పరిస్థితుల్లో ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. మరో ఓపెనర్ గిల్ కూడా తొలిసారి ఇంగ్లండ్‌లో బరిలోకి దిగుతున్నాడు. వీరిద్దరు శుభారంభం అందిస్తే ఆ పునాదిపై జట్టు భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంది. తర్వాతి మూడు స్థానాల్లో సీనియర్లు పుజారా, కోహ్లి, రహానే బ్యాటింగ్ భారం మోస్తారు. టెస్టు క్రికెట్ వీరికి ఉన్న అనుభవం, అన్ని పరిస్థితుల్లోనూ ఆడగల నైపుణ్యం జట్టుకు కీలకం కానుంది. వికెట్ కీపర్ పంత్ కూడా తనదైన శైలిలో దూకుడును ప్రదర్శిస్తే భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లో తమ అత్యుత్తమ బలగాన్ని భారత్ బరిలోకి దించుతోంది. బుమ్రా, షమీల జోడి ప్రత్యర్థిని దెబ్బ కొట్టేందుకు మరోసారి జత కట్టింది. మూడో పేసర్‌గా సిరాజ్ పేరు ముందుకు వచ్చినా... 101 టెస్టుల ఇషాంత్ అనుభవాన్నే జట్టు నమ్ముకుంది. ఇక స్పిన్ ప్రభావం ఉండవచ్చని భావిస్తున్న నేపథ్యంలో అశ్విన్, జడేజాలిద్దరికీ టీమ్‌లో చోటు లభించింది. పైగా వీరిద్దర బ్యాటింగ్ జట్టుకు అదనపు బలం. ముఖ్యంగా గత కొంత కాలంగా జడేజా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఐదుగురు బౌలర్ల వ్యూహం కారణంగా ఆంధ్ర ఆటగాడు విహారిని కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది. పదునైన బౌలింగ్‌తో... 1999 తర్వాత ఇంగ్లండ్‌లో తొలి టెస్టు సిరీస్ విజయం సాధించిన న్యూజిలాండ్ అమితోత్సాహంతో ఉంది. పైగా భారత్‌తో పోలిస్తే ఇటీవలే రెండు టెస్టులు ఆడిన ఆ జట్టుకు ఇక్కడి వాతావరణ పరిస్థితులపై మంచి అవగాహన ఏర్పడింది. ఓపెనర్ కాన్వే అద్భుత ఫామ్‌లో ఉండగా, లాథమ్ కూడా మెరుగ్గా ఆడుతున్నాడు. ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే భారత్‌కు ఇబ్బందులు తప్పవు. టేలర్, నికోల్స్‌లతో పాటు కెరీర్లో చివరి మ్యాచ్ ఆడనున్న వాట్లింగ్‌తో జట్టు బ్యాటింగ్ బలం పెరిగింది. ముగ్గురు వైవిధ్యమైన పేసర్లు బౌల్ట్, వాగ్నర్, సౌతీలు తమకు అనుకూలమైన స్వింగ్ పరిస్థితుల్లో చెలరేగిపోతే వారిని ఎదుర్కోవడం భారత్‌కు సులువు కాదు. భారత్ ఇప్పటికే తుది జట్టును ప్రకటించిన నేపథ్యంలో కనీసం ఒక స్పిన్నర్‌నైనా కివీస్ ఆడిస్తే ఎజాజ్ పటేల్ ఎంపిక ఖాయం. పిచ్, వాతావరణం మ్యాచ్‌కు వర్షం గండం పొంచి ఉంది. గురువారం ట్రోఫీ ఆవిష్కరణ సమయంలోనే రోజ్ బౌల్ మైదానంలో వర్షం కురుస్తూ ఉంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం దాదాపు ప్రతీ రోజు వాన అంతరాయం కలిగించవచ్చు. ఐదు రోజుల తర్వాత ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా ఉంది. పేస్, బౌన్స్‌తో నిండిన పిచ్ ఆరంభంలో సీమర్లకు అనుకూలిస్తుంది. ఎండ కాస్తే మాత్రం స్పిన్ ప్రభావం చూపించవచ్చు. -
ఐసీసీ ర్యాంకింగ్స్: దుమ్మురేపిన పంత్.. దిగజారిన బాబర్ అజమ్
దుబాయ్: ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్ సత్తా చాటాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరిచి తొలిసారి టెస్టు ర్యాంకింగ్స్ టాప్ టెన్‌లో ప్రవేశించిన పంత్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ ఆకట్టుకున్నాడు. తాజాగా పంత్(747 పాయింట్లు, ఆరో స్థానం) ఒక స్థానం ఎగబాకి తన కెరీర్ బెస్ట్ సాధించాడు. ఇక కోహ్లి(814 పాయింట్లు) ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కాగా రిషబ్ పంత్ హెన్రీ నికోలస్, రోహిత్ శర్మతో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. ఇక న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ 919 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో రెండో స్థానంలో.. 878 పాయింట్లతో మార్నస్ లబుషేన్ మూడు, జో రూట్ 831 పాయింట్లతో నాలుగో స్థానంలోఉన్నాడు. ఇక పాక్ బ్యాట్స్‌మన్ బాబర్ అజమ్ మూడు స్థానాలు దిగజారి 736 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో బాబర్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. కాగా డేవిడ్ వార్నర్ 724 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్నాడు. చదవండి: ఆసీస్ మాజీ క్రికెటర్ కిడ్నాప్.. నలుగురు అరెస్ట్ Babar Azam has slipped from sixth to ninth in the ICC Test batting rankings following his golden duck against Zimbabwe.https://t.co/DlC6N5ZapA pic.twitter.com/gPVfB6J0yv — ESPNcricinfo (@ESPNcricinfo) May 5, 2021 -
దుమ్మురేపిన పుజారా.. కోహ్లి మాత్రం అక్కడే
దుబాయ్: ఐసీసీ శనివారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్10లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు చోటు సంపాదించారు. బ్యాటింగ్ విభాగానికి వస్తే.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 862 పాయింట్లతో నాలుగో స్థానానికి పరిమితం కాగా.. టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఒకస్థానం ఎగబాకి 760 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే 748 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. ఒక కివీస్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ 919 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్(891), మార్నస్ లబుషేన్(878) ఉన్నారు. జో రూట్ 823 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విషయానికి వస్తే.. ఆసీస్ స్టార్ పాట్ కమిన్స్ 908 పాయింట్లతో టాప్ స్థానాన్ని నిలబెట్టుకోగా.. స్టువర్ట్ బ్రాడ్(839), నీల్ వాగ్నర్(825), జోష్ హాజిల్‌వుడ్(816), టిమ్ సౌథీ(811) పాయింట్లతో వరుసగా 2,3,4,5 స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియా నుంచి అశ్విన్(760) పాయింట్లతో 8వస్థానం,పేసర్ జస్ప్రీత్ బుమ్రా (757) పాయింట్లతో 9వ స్థానంలో నిలిచారు. ఇక ఆల్‌రౌండ్ విభాగంలో ఎలాంటి మార్పులు లేవు. ఇంగ్లండ్ ఆటగాడు బెన్‌స్టోక్స్ అగ్రస్థానంలో ఉండగా.. విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ రెండు, టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.చదవండి: ఐపీఎల్లో ఆడేందుకు నేను సిద్ధం -
దుమ్మురేపిన విలియమ్సన్, రహానే
దుబాయ్ : ఐసీసీ గురువారం విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ సత్తా చాటాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులో సెంచరీతో మెరిసిన విలియమ్సన్ టెస్టుల్లో 890 పాయింట్లతో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. రెండు వారాల క్రితం విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో స్టీవ్ స్మిత్ మొదటి స్థానంలో ఉండగా.. కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా వెలువడిన ర్యాంకింగ్స్‌లో విలియమ్సన్ వీరిద్దరిని పక్కకు నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో ఉన్న విలియమ్సన్కు, రెండో స్థానంలో ఉన్న కోహ్లి మధ్య 11 పాయింట్ల వ్యత్యాసం ఉంది. (చదవండి : రహానేకు అరుదైన గౌరవం.. ఇది రెండోసారి) కాగా టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో దారుణ ప్రదర్శన కనబరుస్తున్న స్మిత్ 877 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోగా.. తొలి టెస్టు తర్వాత పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి వచ్చిన కోహ్లి 879 పాయింట్లతో రెండో స్థానాన్ని నిలుపుకున్నాడు. కాగా కోహ్లి గైర్హాజరీలో మెల్బోర్న్ టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అజింక్య రహానే సెంచరీతో రాణించి మ్యాచ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో రహానే ఏకంగా 5 స్థానాలు ఎగబాకి 784 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచాడు. పుజారా మాత్రం రెండు స్థానాలు దిగజారి 10వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. మరో ఆసీస్ బౌలర్ స్టార్క్ 5వ స్థానంలో నిలిచాడు. ఇక ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న అశ్విన్ రెండు స్థానాలు ఎగబాకి 793 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచాడు. భారత్ స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా 9వ స్థానంలో నిలిచాడు. -
రెండో స్థానంలోనే కోహ్లి
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు సారథి విరాట్ కోహ్లి తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బ్యాట్స్‌మన్ విభాగంలో కోహ్లి 886 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా... చతేశ్వర్ పుజారా (8), అజింక్యా రçహానే (10) తమ స్థానాలను కాపాడుకున్నారు. ఈ విభాగంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం దిగజారి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా మూడు, అశ్విన్ ఐదు ర్యాంకుల్లో ఉన్నారు. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో భారత్ 360 పాయింట్లతో ‘టాప్’ పొజిషన్‌ను కొనసాగిస్తోంది. ఆసీస్ (296)... ఇంగ్లండ్ (279) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
ఆసీస్‌కు నంబర్‌వన్ ర్యాంక్ ఎలా ఇచ్చారు?
న్యూఢిల్లీ: ఇటీవల ఆస్ట్రేలియా జట్టు టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్కు ఎగబాకిన సంగతి తెలిసిందే. టీమిండియాను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది ఆసీస్. ఐసీసీ సభ్యత్వం గల దేశాల ప్రదర్శన ఆధారంగా వార్షిక ర్యాంకింగ్స్‌లో ఆసీస్ టాప్‌ను దక్కించుకుంది. దాంతో 2016 అక్టోబర్ నుంచి టాప్‌లో కొనసాగుతున్న టీమిండియా తన ర్యాంకును కోల్పోయింది. అంతే కాకుండా మూడో స్థానానికి పరిమితమైంది. ఇక్కడ న్యూజిలాండ్ రెండో స్థానానికి చేరగా, భారత్ మూడో స్థానానికి పడిపోయింది. కాగా, దీనిపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు ఆస్ట్రేలియా ఆ సీజన్లో ఏం సాధించిందని టాప్కు చేరిందని ప్రశ్నించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌పై చాలా అనుమానాలున్నాయని గంభీర్ పేర్కొన్నాడు. ఉప ఖండంలో ఆసీస్ పరిస్థితి దయనీయంగా ఉంటే నంబర్ వన్ ర్యాంక్‌ను ఎలా కైవసం చేసుకుందంటూ నిలదీశాడు. (కోహ్లితో నా వైరం ఇప్పటిది కాదు!) చాలా కాలం నుంచి టీమిండియానే పోటీ క్రికెట్ ఆడుతూ అనేక విజయాలను సాధిస్తే, మరి ఆసీస్‌కు టాప్ ర్యాంక్‌ను ఎలా కట్టబెట్టారన్నాడు. ఏ ప్రాతిపదికన ఆసీస్ అగ్రస్థానానికి చేరిందో తనకు అర్ధం కావడం లేదన్నాడు. భారత్ జట్టు ఇక్కడ మూడో ర్యాంకు పడిపోవడంలో పెద్దగా ఆశ్చర్యం ఉండకపోవచ్చు ఎందుకంటే పాయింట్ల విధానం, ర్యాంకింగ్స్ విధానం సరిగా లేనప్పుడు ఇలానే జరుగుతుందన్నాడు. ఓవరాల్‌గా చూస్తే ఇప్పుడు కూడా టాప్‌లో ఉండాల్సింది భారత జట్టే కానీ ఆసీస్ కాదన్నాడు. ప్రధానంగా టెస్టు చాంపియన్‌షిప్ ప్రవేశపెట్టిన తర్వాత స్వదేశంలో మ్యాచ్ గెలిచినా, విదేశంలో మ్యాచ్ గెలిచినా ఒకే తరహా పాయింట్ల విధానం అనేది చాలా చెత్తగా ఉందని విమర్శించాడు. ఓవరాల్ పద్ధతిలో చూస్తే స్వదేశంలో, విదేశాల్లో భారత్ ప్రదర్శనే మెరుగ్గా ఉందని, ఇక్కడ టాప్‌లో నిలిచిన దేశాల పరిస్థితి అలా లేదన్నాడు. కచ్చితంగా ఇలా చూస్తే టీమిండియానే టాప్‌లో ఉండాలన్నాడు. తనకు ఆస్ట్రేలియా ఎలా నంబర్ వన్ స్థానానికి వెళ్లిందనే విషయంలో తీవ్రమైన అనుమానాలున్నాయన్నాడు. మే నెల తొలి వారంలో విడుదల చేసిన కొత్త లెక్కల ప్రకారం ఆస్ట్రేలియా (116 పాయింట్లు) టాప్ ర్యాంకుకు చేరగా... న్యూజిలాండ్ (115) రెండో స్థానానికి ఎగబాకింది. భారత్ (114) మూడో ర్యాంకుకు పడిపోయింది. అయితే 2003లో టెస్టు ర్యాంకుల్ని ప్రవేశపెట్టాక టాప్–3 జట్ల మధ్య మరీ ఇంత అత్యల్ప వ్యత్యాసం ఉండటం ఇదే మొదటిసారి. కోహ్లి సేన 2016–17 సీజన్ నుంచి చక్కని ప్రదర్శనతో వరుసబెట్టి ఒక్కో సిరీస్ గెలుస్తూ వచ్చింది. దీంతో ‘టాప్’ ర్యాంకును చేరుకోవడంతోపాటు ఇన్నాళ్లూ పదిలపరుచుకుంది. అలా ఒకటో నంబర్ జట్టుగా గదను సగర్వంగా అందుకుంది. అయితే వార్షిక లెక్కల ప్రకారం 2019 మే నుంచి ఫలితాల్ని పరిగణిస్తారు. దీని ప్రకారం ఆసీస్ టాప్‌ను దక్కించుకుంది. ఇక్కడ ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో మాత్రం భారతే ముందుంది. (మ్యాచ్ ఫిక్సింగ్ ఉచ్చులో మరో క్రికెటర్) -
మళ్లీ టాప్‌టెన్‌లోకి వచ్చాడు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు తన ‘టాప్’ స్థానాన్ని నిలబెట్టుకుంది. న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌ను 0–2తో వైట్‌వాష్ చేయించుకున్నా... 116 ర్యాంకింగ్ పాయింట్లతో భారత్ తొలి స్థానంలో కొనసాగుతోంది. 110 రేటింగ్ పాయింట్లతో న్యూజిలాండ్... 108 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో దారుణంగా విఫలమైన కోహ్లి గత వారం టాప్ నుంచి రెండో స్థానానికి పడిపోయాడు. నాలుగు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో అతను కేవలం 38 పరుగులే చేయడం గమనార్హం. ఈ విభాగంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా... స్మిత్ సహచరుడు మార్నస్ లబ్‌షేన్ మూడో స్థానంలో ఉన్నాడు. మయాంక్ అగర్వాల్ ఒక స్థానం పడిపోయి పదో ర్యాంక్‌లో నిలిచాడు. టెస్టుల్లో పునరాగమనం చేసిన భారత యువ ఓపెనర్ పృథ్వీ షా ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 76వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ ర్యాకింగ్స్లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టాప్‌టెన్‌లోకి అడుగుపెట్టాడు. నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని బుమ్రా ఏడో ర్యాంక్ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమిన్స్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా రెండు, రవిచంద్రన్ అశ్విన్ ఐదు స్థానాల్లో ఉన్నారు. (చదవండి: నంబర్ 1 బ్యాటర్‌గా షఫాలీ.. ఐసీసీ స్పెషల్ ట్వీట్!) -
కివీస్ టెస్ట్ ఓటమి; ‘టాప్’ ఝలక్
దుబాయ్: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి షాక్ తగిలింది. టెస్ట్ బ్యాట్సమన్ ర్యాంకింగ్స్‌లో టాప్ నుంచి రెండో స్థానానికి పడిపోయాడు. నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో 911 పాయింట్లతో స్మిత్ టాప్కు చేరాడు. 906 పాయింట్లతో కోహ్లి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఒక స్థానం మెరుగుపరుచుకుని మూడో ర్యాంక్‌కు ఎగబాకాడు. ఆసీస్ బ్యాటింగ్ సంచలనం మార్నస్ లబుషేన్ ఒక స్థానం పడిపోయి 4వ ర్యాంకు దక్కించుకున్నాడు. పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజామ్ ఐదో ర్యాంకులో ఉన్నాడు. కోహ్లితో సహా నలుగురు టీమిండియా ఆటగాళ్లు అజింక్య రహానే(8), చతేశ్వర్(9), మయాంక్ అగర్వాల్(10) టాప్-10లో ఉండటం విశేషం. డేవిడ్ వార్నర్ 6, జోయ్ రూట్ 7 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ పర్యటనలో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. కివీస్ జరిగిన తొలి టెస్ట్‌లో కేవలం 21 పరుగులు మాత్రమే సాధించి నిరాశపరిచాడు. (చదవండి: 19 ఇన్నింగ్స్‌ల్లో ‘జీరో’..!) టాప్‌టెన్ నుంచి బుమ్రా ఔట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమిన్స్ అగ్ర స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో మొదటి టెస్ట్‌లో ఘోరంగా విఫలమైన టీమిండియా ప్రధాన జస్ప్రీత్ బుమ్రా టాప్ -10 నుంచి కిందకు పడిపోయాడు. ఇండియా నుంచి రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడే టాప్‌టెన్‌లో ఉన్నాడు. అతడు 9వ ర్యాంకు దక్కించున్నాడు. (చదవండి: ఇలా ఆడితే ఎలా..!) -
‘టాప్’ ర్యాంక్‌లోనే విరాట్ కోహ్లి
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు తమ ర్యాంకులను నిలబెట్టుకున్నారు. బ్యాట్స్‌మెన్ విభాగంలో భారత కెప్టెన్ కోహ్లి 928 పాయింట్లతో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతుండగా.... 17 పాయింట్లు తేడాతో ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఇతర భారత బ్యాట్స్మెన్లలో చతేశ్వర్ పుజారా (6), అజింక్య రహనే (9) తమ స్థానాలను కాపాడుకున్నారు. మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మలు ఒక్కో స్థానాన్ని మెరుగుపర్చుకుని వరుసగా 12, 13వ స్థానాల్లో నిలిచారు. ఇక బౌలింగ్ విభాగంలో భారత ఏస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆరో స్థానంలో ఉండగా... స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిది, పేసర్ షమీ తొమ్మిదో స్థానాల్లో నిలిచారు. ఈ విభాగంలో ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. -
110 దగ్గర మొదలెట్టాడు.. 8కి చేరాడు
మార్నస్ లబుషేన్ క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లబుషేన్ గురించి రెండు మాటల్లో చెప్పాలంటే స్టీవ్ స్మిత్ వంటి బ్యాటింగ్ స్టైల్.. విరాట్ కోహ్లిలా పరుగుల ప్రవాహం. గతేడాది అక్టోబర్‌లో పాకిస్తాన్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు... ఈ ఏడాది చివర్లో అదే పాక్ సిరీస్ ముగిసే సరికి టాప్-10లో ఉన్నాడు. ఏడాది ముగిసే సరికే ఈ ఆసీస్ క్రికెటర్ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఇప్పటివరకు ఆడింది కేవలం 11 టెస్టులే. కానీ 53.53 సగటుతో 910 పరుగుల సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 5 అర్ధసెంచరీలు ఉండటం విశేషం. ముఖ్యంగా తాజాగా పాక్‌తో ముగిసిన సిరీస్‌లో డేవిడ్ వార్నర్‌తో పోటీ పడి మరీ పరుగుల సాధించాడు. దీంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి ఎగబాకాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌ల్లో 110వ స్థానంతో ఈ ఏడాది ఆటను ఆరంభించిన లబుషేన్.. ఏడాది ముగిసే సరికి టాప్ టెన్‌లో నిలిచాడు. ఈ విషయాన్ని ఐసీసీ ముఖ్యంగా ప్రస్తావిస్తూ ప్రత్యేక ట్వీట్ చేసింది. బాల్ ట్యాంపరింగ్ చేయడంతో డేవిడ్ వార్నర్, స్టీవ్స్మిత్పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది నిషేధం విధించింది. అప్పుడు జట్టులోకి అడుగుపెట్టాడు లబుషేన్. స్వతహాగా లెగ్ స్పిన్నరైన అతడు బ్యాటింగ్‌లోనూ సమర్థుడు. ఐతే 8 ఇన్నింగ్సుల్లో 26.25 సగటుతో 210 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. నిషేధం తర్వాత యాషెస్ సిరీస్‌లో స్మిత్ పునరాగమనంతో లబుషేన్ తుదిజట్టులో చోటు కోల్పోయాడు. అయితే లార్డ్స్ టెస్టులో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లబుషేన్ సత్తా చాటాడు. దీంతో అతడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ సిరీస్‌లో మూడు అర్దశతకాలు సాధించిన లబుషేన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా పాక్‌తో ముగిసిన సిరీస్‌లో బ్రిస్బేన్ టెస్టులో 185, అడిలైడ్‌లో 162 పరుగులు చేసి ఆసీస్ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు. లబుషేన్ ట్యాలెంట్‌ను పసిగట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా కీలకమైన మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపుతోంది. ఇక ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న లబుషేన్ తన అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇప్పటికే 910 పరుగులు సాధించిన లబుషేన్ 2019 క్యాలెండర్ ఇయర్ 1000 పరుగుల మైలురాయిని అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే డిసెంబర్ 12 నుంచి న్యూజిలాండ్‌తో ఆసీస్ మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. దీంతో ఈ సిరీస్‌లో రాణించి తిరిగి నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని స్టీవ్ స్మిత్ ఆరాటపడుతుండగా.. ఈ ఇయర్ క్యాలెండర్లో అత్యధిక పరుగుల సాధించాలని లబుషేన్ తెగ ఉత్సాహంగా ఉన్నాడు. Marnus Labuschagne's rankings in the @MRFWorldwide ICC Test Batting charts 👇 🔸 Start of 2019: 1⃣1⃣0⃣ 🔸 December 2019: 8⃣ pic.twitter.com/FiYrK5EqYt — ICC (@ICC) December 4, 2019 -
కింగ్ కోహ్లి ఈజ్ బ్యాక్..
దుబాయ్ : ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో రికార్డుల రారాజుగా వెలుగుతున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఖాతాలో మరో మణిహారం వచ్చి చేరింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి తిరిగి నంబర్ వన్ స్థానాన్ని అధిరోహించాడు. పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ ఘోరంగా విపలమయ్యాడు. దీంతో 15 పాయింట్లు కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. ఇదే క్రమంలో దక్షిణాప్రికాపై డబుల్ సెంచరీ, బంగ్లాదేశ్‌తో జరిగిన డేనైట్ టెస్టులో సెంచరీ చేసిన కోహ్లి 928 పాయింట్లతో ఆగ్రస్థానానికి ఎగబాకాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం అనంతరం నిషేదానికి గురై ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌తో పునరాగమనం చేసిన స్టీవ్ స్మిత్.. ఆ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నాలుగు టెస్టుల్లో ఏకంగా 774 పరుగులు రాబట్టి తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. అంతేకాకుండా అప్పటివరకు నంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్న కోహ్లిని పక్కకు నెట్టి తిరిగి నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తాజాగా పాక్ సిరీస్‌లో (4, 36) విఫలమైన స్మిత్ భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. అయితే డిసెంబర్ 12 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో స్మిత్ రాణించినట్లయితే కొత్త సంవత్సరంలో ఆగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక పాక్ టెస్టులో స్మిత్ విఫలమైనా డేవిడ్ వార్నర్, లబుషేన్‌లు రాణించడంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. ట్రిపుల్ సెంచరీ సాధించిన వార్నర్ 12 నుంచి 5వ స్థానానికి ఎగబాకాడు. వార్నర్‌కు పోటీ పడి పరుగులు సాధించిన మరో ఆసీస్ బ్యాట్స్‌మన్ లబుషేన్ కూడా ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో 110వ స్థానంలో ఉన్న లబుషేన్.. ఏడాది చివరికి టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషం. వార్నర్ ఐదో స్థానానికి చేరుకోవడంతో టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఆరో స్థానానికి పడిపోయాడు. ఇక కోహ్లి, రహానేలతో పాటు మరో టీమిండియా బ్యాట్స్‌మన్ పుజారా(4) టాప్ 10లో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. ఆసీస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ 900 పాయింట్లతో ఆగ్రస్థానంలో, దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడా 839 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక వరుసగా రెండు టెస్టు సిరీస్‌లకు దూరమైన టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 9వ స్థానాన్ని కపాడుకోగా.. మహ్మద్ షమీ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. కాగా, ఆల్‌రౌండర్ల జాబితాలో జాసన్ హోల్డర్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. పాక్ సిరీస్‌లో బంతితో పాటు బ్యాట్‌తో మెరిసిని మిచెల స్టార్క్ ఆరో స్థానానికి ఎగబాకాడు. ఇక వరుస టెస్టు సిరీస్ విజయాలతో టీమిండియా 120 పాయింట్లతో ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. Virat Kohli back to No.1! David Warner, Marnus Labuschagne and Joe Root make significant gains in the latest @MRFWorldwide ICC Test Rankings for batting. Full rankings: https://t.co/AIR0KN4yY5 pic.twitter.com/AXBx6UIQkL — ICC (@ICC) December 4, 2019 -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో షమీ..
దుబాయ్: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఏడు వికెట్లతో చెలరేగిన టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తన ర్యాంకింగ్స్‌లో కూడా దూసుకొచ్చాడు. తొలిసారి తన కెరీర్ బెస్ట్ ర్యాంకును నమోదు చేశాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన ఆటగాళ్ల టెస్టు ర్యాంకింగ్స్‌లో షమీ 7వ స్థానానికి ఎగబాకాడు. ఇది షమీకి టెస్టుల్లో అత్యుత్తమ ర్యాంక్. కాగా, టెస్టు ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకునే క్రమంలో షమీ 790 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఫలితంగా భారత్ తరఫున టెస్టు ఫార్మాట్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు నమోదు చేసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. షమీ కంటే ముందు కపిల్‌దేవ్(877), జస్ప్రీత్ బుమ్రా(832)లు ఉన్నారు. ఇక షమీ, రవిచంద్రన్ అశ్విన్, టాప్ 10 బౌలర్లలో స్థానం సంపాదించుకోగా ఇషాంత్ శర్మ టాప్ 20లో పాగా వేశాడు. కాగా ఇండోర్‌లో జరిగిన టెస్ట్ క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన సంగతి తెలిసిందే. భారత విజయంలో ఫాస్ట్ బౌలర్ షమీ కీలకంగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్ తర్వాత షమీకి అదనపు పాయింట్లు తోడయ్యాయి. ప్రస్తుతం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 790 పాయింట్లతో ఏకంగా పదిహేను స్థానాలు ఎగబాకి ఏడోస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరొకవైపు బ్యాటింగ్ విభాగంలో 691 పాయింట్లతో మయాంక్ అగర్వాల్ 11వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇది మాయంక్‌కు టెస్టుల్లో బెస్ట్ ర్యాంకు. భారత ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ 10 బౌలర్లలో చోటు దక్కించుకోగా ఆల్‌రౌండర్స్ కేటగిరీలో ఓ స్థానం దిగజార్చుకుని నాలుగో ర్యాంకుకు పరిమితమయ్యాడు.. కాగా వరుస విజయాలతో దూకుడుగా ఉన్న టీమిండియా.. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో 300 పాయింట్లతో ఆధిక్యాన్ని నిలబెట్టకుంది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ 120 పాయింట్లు సాధించగా, దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను సైతం వైట్‌వాష్ చేయడంతో 120 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత బంగ్లాతో తొలి టెస్టులో విజయం సాధించడం ద్వారా 60 పాయింట్లు నమోదు చేసింది. దాంతో 300 పాయింట్ల మార్కును చేరింది. ఆ తర్వాత స్థానంలో న్యూజిలాండ్, శ్రీలంకలు సంయుక్తంగా రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు తర్వాత స్థానాల్లో నిలిచాయి. -
టాప్ లేపిన రోహిత్ శర్మ
ముంబై: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ టాప్ లేపాడు. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. సఫారీతో జరిగిని చివరి టెస్టుకు ముందు 22వ స్థానంలో ఉన్న రోహిత్.. రాంచీ టెస్టులో డబుల్ సెంచరీ సాధించడంతో అతడి గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. 722 పాయింట్లతో పదో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఐసీసీ అన్ని ఫార్మట్లలో టాప్ 10లో నిలిచిన రెండో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ మరో రికార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు సారథి విరాట్ కోహ్లి మాత్రమే మూడు ఫార్మట్లలో టాప్-10 స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పుణే టెస్టులో డబుల్ సెంచరీ మినహా మరో భారీ స్కోర్ సాధించని విరాట్ కోహ్లి రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. అయితే ఆగ్రస్థానంలో కొనసాగుతున్న స్టీవ్ స్మిత్‌కు కోహ్లికి పాయింట్ల(11) వ్యత్యాసం పెరిగింది. ఇక రాంచీ టెస్టులో సెంచరీ సాధించిన వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఐదో స్థానానికి చేరుకున్నాడు. మరో టెస్టు బ్యాట్స్‌మన్ చటేశ్వర పుజారా నాలుగో స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇక ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మన్ టాప్-10లో నలుగురు ఉండటం విశేషం. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరమైన జస్ప్రిత్ బుమ్రా మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయాడు. బుమ్రా మినహా భారత బౌలర్లు ఎవరూ టాప్ 10లో చోటు దక్కించుకోలేదు. రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలు 14, 15 స్థానాలలో కొనసాగుతున్నారు. సఫారీ జట్టును వైట్‌వాష్ చేయడంతో టెస్టుల్లో టీమిండియా ఆగ్రస్తానానికి మరింత బలం చేకూరింది. 119 రేటింగ్ పాయింట్లతో ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. తరువాతి స్థానాలలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. టాప్-5 ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ బ్యాటింగ్: స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, పుజారా, రహానే బౌలింగ్: ప్యాట్ కమిన్స్, కగిసో రబాడ, హోల్డర్, బుమ్రా, జేమ్స్ అండర్సన్ ఆల్‌రౌండర్స్: హోల్డర్, రవీంద్ర జడేజా, షకీబుల్ హసన్, బెన్ స్టోక్స్, ఫిలాండర్ టీమ్: టీమిండియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా -
టెస్ట్ నెం1 ర్యాంకు మనదే.. మనోడిదే!
దుబాయ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మంగళవారం ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకుల్లో కోహ్లి 922 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 913 పాయింట్లతో న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమిండియా టెస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర పుజారా తన మూడో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. జట్ల పరంగా భారత్ తొలిస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు తరవాతి స్థానంలో నిలిచాయి. ఇక బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉండగా.. జేమ్స్ అండర్సన్(ఇంగ్లండ్), కగిసో రబడ(దక్షిణాఫ్రికా), ఫిలాండర్ట(దక్షిణాఫ్రికా) తరువాతి స్థానాల్లో నిలిచారు. భారత్ నుంచి రవీంద్ర జడేజా(6), రవిచంద్రన్ అశ్విన్(10) ఇద్దరే టాప్-10లో ఉన్నారు. ఆల్‌రౌండర్ జాబితాలో జాసన్ హోల్డర్(వెస్టిండీస్) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్), రవీంద్ర జడేజా(భారత్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
ఆడింది తొమ్మిదే.. కానీ ర్యాంకేమో
హైదరాబాద్ : ‘9 టెస్టులు.. 2 శతకాలు.. 2 అర్దశతకాలు.. 696 పరుగులు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 15వ స్థానం. రిషభ్ పంత్‌ను టెస్టులకు ఎంపిక చేయడానికి ఇంకేమైనా గణాంకాలు కావాలా?’. సెలక్టర్లకు పంత్ అభిమానులు సంధిస్తున్న ప్రశ్న. వెస్టిండీస్ పర్యటన కోసం ఆదివారం సెలక్టర్లు భారత జట్టును ప్రకటించనున్నారు. అయితే గాయం నుంచి కోలుకున్న వృద్దిమాన్ సాహాను తిరిగి టెస్టులకు ఎంపిక చేస్తారనే ఊహాగానాలు రావడంతో పంత్ అభిమానులు ఈ విధంగా స్పందిస్తున్నారు. ‘ఆడింది తొమ్మిది టెస్టులే కానీ ర్యాంక్ 15. పంత్ ట్యాలెంట్‌ను ఐసీసీ గుర్తించింది.. మరి సెలక్టర్లు గుర్తిస్తారా’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రిషభ్ పంత్ టీమిండియా తరుపున ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో తొలి శతకం సాధించి టీమిండియాను గెలిపించినంత పనిచేశాడు. అయితే దురదృష్టవశాత్తు చివర్లో అవుటవ్వడంతో కోహ్లి సేన ఓటమిపాలైంది. ఇక ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 350 పరుగులు చేసి టీమిండియా చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక వన్డేలు కూడా తొమ్మిది ఆడిన పంత్ అంతగా ఆకట్టుకోలేదు. విండీస్ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆదివారం సమావేశం కానుంది. -
కోహ్లి మళ్లీ సాధించాడోచ్!
నాటింగ్‌హామ్: ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలిస్తే ఆ కిక్కే వేరుంటుంది. ఇప్పుడా ఆ మధుర క్షణాల్ని, ఆనందాన్ని టీమిండియా సారథి విరాట్ కోహ్లి అనుభవిస్తున్నాడు. 2014లో ఇంగ్లండ్ గడ్డపై చేదు అనుభవాన్ని తుడిచి వేస్తూ ప్రస్తుత సిరీస్‌లో అదరగొడుతున్న కోహ్లి.. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ఆగ్రస్థానాన్ని ఆక్రమించాడు. 937 పాయింట్లతో టెస్టు నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 929 పాయింట్లతో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ రెండో స్థానానికి పడిపోయాడు . కోహ్లీ టెస్టు కెరీర్లోనే ఇన్ని రేటింగ్ పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి. అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం 11వ స్థానంలో నిలిచాడు. మరొక్క పాయింట్ సాధిస్తే ఆల్‌టైమ్ అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన టాప్ 10 ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదిస్తాడు. డాన్ బ్రాడ్‌మన్ (961), స్టీవ్ స్మిత్(947)లు ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు అనంతరం ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో కోహ్లీ మొదటిసారి టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో కోహ్లీ విఫలమవ్వడంతో మళ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. తాజాగా నాటింగ్‌హామ్‌లో చేసిన ప్రదర్శనకు గానూ కోహ్లీ తిరిగి నంబర్‌వన్ స్థానాన్ని సాధించాడు. మిగతా ఆటగాళ్లలో చటేశ్వర పుజారా ఆరవ స్థానంలో కొనసాగుతుండగా.. అజింక్యా రహానే 19వ, ధావన్ 22వ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో ఎనిమిది స్థానాలు ఎగబాకి 51 వ స్థానంలో నిలవగా, బౌలింగ్‌లో 23 స్థానాలు మెరుగుపర్చుకొని 51వ స్థానం ఆక్రమించాడు. ఆల్‌రౌండర్ జాబితాలో 17వ స్థానాన్ని పాండ్యా సాధించాడు. ఇక బౌలర్ల జాబితాలో రవీంద్ర జడేజా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్, షమీలు వరుసగా 7,22 స్థానాలలో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. -
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి నంబర్‌వన్
-
శిఖరాన విరాట్
దుబాయ్: భారత స్టార్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ విరాట్ కోహ్లి తన అద్భుత కెరీర్లో మరో గొప్ప ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి తొలిసారి నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో కోహ్లి చిరస్మరణీయ బ్యాటింగ్ తర్వాత కూడా భారత్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో 149, 51 పరుగుల ప్రదర్శన కోహ్లిని అగ్రస్థానానికి చేర్చింది. 934 రేటింగ్ పాయింట్లతో విరాట్ శిఖరాన నిలబడగా, 929 పాయింట్లతో స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) రెండో స్థానానికి పడిపోయాడు. 2015 డిసెంబర్ నుంచి నంబర్‌వన్‌గా ఉన్న స్మిత్... బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో నిషేధానికి గురి కావడంతో గత మార్చి నుంచి టెస్టు మ్యాచ్ బరిలోకి దిగలేదు. గతంలో భారత్ తరఫున సునీల్ గావస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచారు. 2011 జూన్‌లో సచిన్ చివరిసారిగా అగ్రస్థానం సాధించిన తర్వాత ఒక భారత బ్యాట్స్‌మన్ ఈ మైలురాయిని చేరడం ఇదే మొదటిసారి. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాను చూస్తే కోహ్లి (934) ప్రస్తుతం 14వ స్థానంలో ఉన్నాడు. ఇందులో డాన్ బ్రాడ్‌మన్ 1948లో సాధించిన 961 పాయింట్లు అత్యుత్తమం కాగా... స్మిత్ (947)ది రెండో స్థానం. కోహ్లి ఇప్పటికే వన్డేల్లో కూడా ఎవరికీ అందనంత ఎత్తులో 911 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. -
టీమిండియానే నెం.1
దుబాయ్ : అంతర్జాతీ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానం నిలబెట్టుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 125 రేటింగ్ పాయింట్లతో కోహ్లిసేన తొలి స్థానంలో నిలిచింది. 112 పాయింట్లతో దక్షిణాఫ్రికా జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. మే 1, 2018 నాటికి భారత్, దక్షిణాఫ్రికా మధ్య 13 పాయింట్ల వ్యత్యాసం ఉంది. టీమిండియాను చేరుకోవాలంటే మిగతా జట్లు అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంది. 2014-15 ఏడాది ఫలితాలను పక్కనబెట్టి 2015-16, 2016-17 సీజన్లలో జట్ల ఫలితాల్లో 50శాతాన్ని పరిగణనలోకి తీసుకొని ఐసీసీ ఈ వార్షిక ర్యాంకులను ప్రకటించింది. ఇంతకుముందు ద్వితీయ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా, టీమిండియాకు 4 పాయింట్లే తేడా ఉండగా.. తాజా ర్యాంకులతో ఆ వ్యత్యాసం 13 పాయింట్లకు పెరిగింది. సఫారీ జట్టు 5 పాయింట్లు కోల్పోయి 112 పాయింట్లకు పడిపోయింది. 106 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో 102 పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ బిజీలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు.. అనంతరం అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టు..తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. -
టెస్టు ర్యాంకింగ్స్‌లో రబడ నెం.1
సాక్షి, స్పోర్ట్స్ : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ బౌలింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడా మళ్లీ అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఏకంగా 11 వికెట్లు పడగొట్టిన రబడ దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో రబడ 902 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానంకు చేరగా రవింద్ర జడేజా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 902 పాయింట్లు సాధించిన రబడ ఈ మార్క్‌ను అందుకున్న 23వ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇక దక్షిణాఫ్రికా నుంచి నాలుగో బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఫిలాండర్(2013లో 912 ), షాన్ పొలాక్( 1999లో 909), స్టెయిన్(2014లో 909) పాయింట్లతో తనకన్నా ముందు వరుసలో ఉన్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో అంతగా మార్పులు చోటుచేసుకోలేదు. 943 పాయింట్లతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 912 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇటీవల అద్భుత సెంచరీతో మెరిసిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డివిలియర్స్ 5 స్థానాలు ఎగబాకి 778 పాయింట్లతో ఏడో ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఇక జట్ల ర్యాంకుల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. తొలి రెండు స్థానాల్లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా మూడో స్థానంలో ఆస్ట్రేలియా కొనసాగుతోంది. -
టాప్ లేపిన రబడ.. యథాస్థానాల్లో జడేజా, అశ్విన్
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా యువ సంచలనం కగిసో రబడ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ మంగళవారం తాజాగా ప్రకటించిన ర్యాకింగ్స్లో ఒక్క స్థానాన్ని మెరుగు పరుచుని టాప్ ర్యాంకు సాధించాడు. దీంతో ఇంగ్లండ్ స్టార పేసర్ జేమీ అండర్సన్ రెండో ర్యాంకుకు పడిపోయాడు. టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో 3/34, 2/41 తో రాణించిన సఫారీ పేసర్ రబడ జట్టు విజయంలో తోడ్పడటంతో పాటు 5 పాయింట్లు మెరుగు పరుచుకుని 888 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి టెస్టులో 1/56 తో ఏమాత్రం ఆకట్టుకోని అండర్సన్ ఐదు పాయింట్లు కోల్పోయి 887 పాయింట్లకు పడిపోయాడు. దీంతో అగ్రస్థానాన్ని రబడకు కోల్పోయాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజల్‌వుడ్ ఐదో ర్యాంకులో ఉన్నాడు. యథాస్థానాల్లో జడేజా, అశ్విన్ ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బౌలర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు తమ ర్యాంకులను నిలుపుకున్నారు. 861 పాయింట్లతో జడేజా, 830 పాయింట్లతో అశ్విన్‌లు వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్ 1. కగిసో రబడ 888 పాయింట్లు 2. జేమీ అండర్సన్ 887 3. రవీంద్ర జడేజా 861 4. రవిచంద్రన్ అశ్విన్ 830 5. జోష్ హజల్‌వుడ్ 814 6. ఫిలాండర్ 806 7. రంగన హెరాత్ 799 8. నీల్ వాగ్నర్ 784 9. మిచెల్ స్టార్క్ 769 9. నాథన్ లయన్ 769 -
దుమ్మురేపిన పూజారా.. చరిత్ర సృష్టించే దిశగా స్మిత్!
దుబాయ్: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన చటేశ్వర పుజారా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. తాజాగా వెలువడిన టెస్టు ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకాడు. ఇది పూజారా కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్. యాషెస్‌లో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 945 పాయింట్లతో మొదటి ర్యాంకులో కొనసాగుతున్నాడు. అతడు మరో 16 పాయింట్లు సాధిస్తే.. బ్యాటింగ్ దిగ్గజం బ్రాడ్‌మన్ ఆల్ టైమ్ రికార్డ్‌ను అందుకుంటాడు. ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తే అంత కష్టం కాకపోవచ్చు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 863పాయింట్లతో రెండో ర్యాంకు సాధించాడు. ఇక, టెస్టు బౌలర్లలో యాషెస్ సిరీస్‌లో ఫామ్‌ను కొనసాగిస్తున్న ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్, రబాడాను వెనక్కినెట్టి మొదటి స్థానాన్ని చేజిక్కించుకున్నాడు. భారత బౌలర్లలో స్పిన్ ద్వయం అశ్విన్, జడేజాలు మూడు, నాలుగు స్థానాలలో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా రెండో స్థానంలో, అశ్విన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. యాషెస్ సిరీస్‌లో ప్రధానంగా రాణిస్తున్న ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లోనూ మార్పులు జరిగాయి. -
జడేజాను వెనక్కు నెట్టి..
నంబర్‌వన్ బౌలర్‌గా జేమ్స్ అండర్సన్ ఐసీసీ టెస్టు ర్యాంకులు ప్రకటన దుబాయ్: టెస్టుల్లో నంబర్‌వన్ బౌలర్‌గా ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ బౌలర్ల విభాగంలో అతడు టాప్కు చేరుకున్నాడు. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వెనక్కు నెట్టి అతడు అగ్రస్థానం దక్కించుకున్నాడు. 896 పాయింట్లతో మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. 884 పాయింట్లతో జడేజా రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా స్పిన్నర్ 852 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అండర్సన్ అద్భుతంగా రాణించాడు. తన కెరీర్ ఉత్తమ బౌలింగ్ (7/42) గణాంకాలతో చెలరేగడంతో పాటు 500 వికెట్ల క్లబ్‌లోనూ చేరాడు. టెస్టు క్రికెట్లో 500 వికెట్లు పడగొట్టిన ఆరో ఆటగాడిగా నిలిచాడు. కాగా, టెస్టుల్లో నంబవర్ టీమ్‌గా భారత్ కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా(2), ఇంగ్లండ్(3), న్యూజిలాండ్(4), ఆస్ట్రేలియా(5), పాకిస్తాన్(6), శ్రీలంక(7) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బ్యాట్స్‌మెన్ విభాగంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. జో రూట్(2), విలియమన్స్(3), పుజారా(4), డేవిడ్ వార్నర్(5) తర్వాతి స్థానాల్లో నిలిచారు. -
విరాట్, పుజారా 'మారలేదు'
దుబాయ్: అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఐదో స్థానంలోనే కొనసాగుతున్నారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఆటగాళ్ల టెస్టు ర్యాంకింగ్స్ లో కోహ్లి ఐదో ర్యాంకును నిలబెట్టుకోగా, చతేశ్వర్ పుజారా కూడా తన గత నాల్గో ర్యాంకును పదిలంగా ఉంచుకున్నారు. కాగా, భారత మిడిల్ ఆర్డర్ ఆటగాడు కేఎల్ రాహుల్ పదోస్థానానికి పడిపోయారు. ప్రస్తుతం పుజారా 876 రేటింగ్ పాయింట్లతో నాల్గో స్థానంలో ఉండగా, కోహ్లి 806 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక రాహుల్ 761 రేటింగ్ పాయింట్లతో టాప్-10 లో నిలిచారు. తాజా ర్యాంకింగ్స్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(938 రేటింగ్ పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా, జో రూట్(902) రెండో స్థానంలో కొనసాగుతున్నారు. కేన్ విలియమ్సన్(880) మూడో స్థానంలో నిలిచాడు.ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా టాప్ ను నిలబెట్టుకోగా, అశ్విన్ మూడో స్థానాన్ని ఆక్రమించారు. -
‘టాప్’ను నిలబెట్టుకున్న భారత్
-
‘టాప్’ను నిలబెట్టుకున్న భారత్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ దుబాయ్: విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత టెస్టు క్రికెట్ జట్టు ప్రపంచ నెం. 1 ర్యాంకును నిలబెట్టుకుంది. తాజాగా ఐసీసీ ప్రకటించిన జాబితా ప్రకారం ప్రస్తుతం 123 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. గత కొంతకాలంగా టెస్టుల్లో అద్వితీయ విజయాలను సాధిస్తో న్న టీమిండియా టెస్టు నెంబర్ 1 జట్టుగా నిలిచి ఇటీవలే గదతో పాటు మిలియన్ డాలర్ల నగదు పురస్కారాన్ని కూడా అందుకుంది. అయితే 2014–16 మధ్యలో జట్ల ప్రదర్శన ఆధారంగా గురువారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకుల్లోనూ కోహ్లిసేన అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. తాజా జాబితా ప్రకారం భారత్ ఒక పాయింట్‌ను సాధించి 123 పాయింట్లకు చేరుకోగా... రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఆరు పాయింట్లు మెరుగుపరుచుకొని 117 పాయింట్లతో ఉంది. ఆస్ట్రేలియా (100), ఇంగ్లండ్ (99), న్యూజిలాండ్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత పాకిస్థాన్ (93), శ్రీలంక (91), వెస్టిండీస్ (75), బంగ్లాదేశ్ (69), జింబాబ్వే జట్లు ఉన్నాయి. -
కేఎల్ రాహుల్ మరో ఘనత
దుబాయ్: టీమిండియా ఓపెనర్ లోకేశ్ రాహుల్ టెస్టు ర్యాంకింగ్స్ లో లాంగ్ జంప్ చేశాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో 11వ స్థానంలో నిలిచాడు. అతడు ఏకంగా 46 స్థానాలు మెరుగుపరుచుకోవడం విశేషం. ఆస్ట్రేలియాతో టెస్టు సిరిస్ కు ముందు 57వ ర్యాంకులో ఉన్న అతడు 11వ స్థానానికి లాంగ్ జంప్ చేశాడు. ఆరు అర్ధసెంచరీలతో సత్తా చాటాడు. ఆసీస్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ లో 64, 10, 90, 51, 67, 60, 51 నాటౌట్ స్కోర్లతో అదరగొట్టాడు. తాజా టెస్టు ర్యాంకుల్లో మూడో అత్యుత్తమ భారత బ్యాట్స్ మన్ గా రాహుల్ నిలిచాడు. పుజారా(4), విరాట్ కోహ్లి(5) టాప్ టెన్ లో కొనసాగుతున్నారు. అజింక్య రహానే మూడు స్థానాలు ఎగబాకి 14వ ర్యాంకు దక్కించుకున్నాడు. మురళీ విజయ్ నాలుగు స్థానాలు పడిపోయి 34వ ర్యాంకులో ఉన్నాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ టాప్ లో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ 5 స్థానాలు మెరుగుపరుచుకుని 21వ ర్యాంకులో నిలిచాడు. -
ఆసీస్ కెప్టెన్ అరుదైన ఘనత
దుబాయ్: టీమిండియాతో తొలి టెస్టులో ఘనవిజయం సాధించడంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నెంబర్ వన్ ర్యాంక్‌ను పదిలం చేసుకున్నాడు. స్మిత్ తన కెరీర్లోనే అత్యుత్తమంగా 939 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. డాన్ బ్రాడ్‌మన్ (961), లెన్ హటన్ (945), జాక్ హబ్స్ (942), రికీ పాంటింగ్ (942), పీటర్ మే (941) తర్వాత స్మిత్ అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించాడు. బ్యాటింగ్ దిగ్గజాలు గ్యారీ సోబర్స్, వివ్ రిచర్డ్స్, సంగక్కర తమ కెరీర్లో అత్యుత్తమంగా 938 రేటింగ్ పాయింట్లు సాధించగా, స్మిత్ తాజాగా వీరిని అధిగమించాడు. ఆదివారం ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. స్మిత్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. పుణె మ్యాచ్‌లో గెలిచాక ఆసీస్ ఆటగాళ్ల ర్యాంకులు మెరుగుపడ్డాయి. రెన్షా ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 34వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. పుణె టెస్టులో 12 వికెట్లు తీసిన ఓకెఫీ బౌలర్ల జాబితాలో 33 స్థానాలు ముందుకెళ్లి 29 ర్యాంక్ దక్కించుకున్నాడు. టీమిండియా స్పిన్నర్లు అశ్విన్, జడేజా వరుసగా తొలి రెండు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ జాబితాలో భారత్ ఓపెనర్ లోకేష్ రాహుల్ 11 స్థానాలను మెరుగుపరుచుకుని 46వ ర్యాంక్ సాధించాడు. -
42 ఏళ్ల తర్వాత మనోళ్లు సాధించారు
ముంబై: భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు 2016 బాగా కలసి వచ్చింది. టెస్టు క్రికెట్లో అద్భుతంగా రాణించిన వీరిద్దరూ ఈ ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ జాబితాలో అశ్విన్, జడేజా వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి 2016కు గుడ్ బై చెప్పారు. 42 ఏళ్ల తర్వాత టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్లు తొలి రెండు స్థానాలను సాధించడమిదే తొలిసారి. 1974లో భారత బౌలర్లు బిషన్ సింగ్ బేడీ, భగవత్ చంద్రశేఖర్ తొలి రెండు ర్యాంకుల్లో నిలిచారని ఐసీసీ పేర్కొంది. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలోనూ అశ్విన్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. జడేజా మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్‌లతో జరిగిన టెస్టుల సిరీస్‌లలో ఈ జోడీ కీలక పాత్ర పోషించింది. అలాగే కీలక సమయాల్లో బ్యాటింగ్‌లో కూడా రాణించారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ 120 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 105 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. బ్యాట్స్‌మెన్ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. -
మూడో ర్యాంక్‌కు కోహ్లి
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మూడో స్థానానికి చేరాడు. తన కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. ఇంగ్లండ్‌తో సిరీస్ ఆరంభానికి ముందు 15వ స్థానంలో ఉన్న కోహ్లి... ఏకంగా 12 ర్యాంక్‌లు మెరుగుపరుచుకోవడం విశేషం. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), రూట్ (ఇంగ్లండ్) తొలి రెండు ర్యాంక్‌ల్లో ఉన్నారు. భారత్ నుంచి టాప్-10లో పుజారా (8వ ర్యాంక్) కూడా ఉన్నాడు. కోహ్లి ప్రస్తుతం టి20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో, వన్డేల్లో రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. బౌలింగ్, ఆల్‌రౌండర్ రెండు విభాగాల్లోనూ అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. జడేజా బౌలర్ల ర్యాంక్‌లో ఏడు, ఆల్‌రౌండర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. -
అశ్విన్ నంబర్ వన్‌లోనే...
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్ దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో అశ్విన్ జోరు కొనసాగుతోంది. జట్టు ర్యాంకుల్లో భారత్‌దే టాప్ ర్యాంకు కాగా... బౌలింగ్, ఆల్‌రౌండర్ ర్యాంకుల్లో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. 115 రేటింగ్ పారుుంట్లతో భారత్ టాప్ ర్యాంకులో ఉండగా, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (111), ఆస్ట్రేలియా (108) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారుు. ఇటీవల టెస్టు కెరీర్లో 200 వికెట్లు పడగొట్టిన అశ్విన్ 900 రేటింగ్ పారుుంట్లతో నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. స్టెరుున్ (దక్షిణాఫ్రికా, 878) రెండు, అండర్సన్ (ఇంగ్లండ్, 853) మూడో స్థానాల్లో ఉన్నారు. రవీంద్ర జడేజా (805) ఏడో ర్యాంకుతో టాప్-10లో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకుల్లోనూ అశ్విన్‌దే టాప్ ర్యాంకు. జడేజా ఐదో స్థానంలో ఉన్నాడు. -
టీమిండియానే నెంబర్ వన్
దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. బౌలర్ల జాబితాలో భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ వన్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. టెస్టు ర్యాంకింగ్స్ తాజా జాబితాను బుధవారం ఐసీసీ విడుదల చేసింది. భారత్ 115 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా, పాకిస్థాన్ (111), ఆస్ట్రేలియా (108) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత వరుసగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ ఉన్నాయి. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రాణించిన 200 వికెట్ల క్లబ్లో చేరిన అశ్విన్ నెంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్, ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఆల్ రౌండర్ల జాబితాలోనూ అశ్విన్ టాప్‌లో ఉండగా, మరో భారత స్పిన్నర్ జడేజా ఐదో స్థానంలో నిలిచాడు. ఇక బ్యాట్స్‌మెన్ జాబితాలో భారత ఆటగాడు అజింక్యా రహానె ఆరో ర్యాంక్ సాధించాడు. పుజారా, విరాట్ కోహ్లీ వరుసగా 15, 17 స్థానాల్లో ఉన్నారు. -
4-1తో గెలిస్తే మూడో స్థానం!
దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌సలో నంబర్‌వన్ గా నిలిచిన భారత్, ఇప్పుడు వన్డే ర్యాంక్‌నూ మెరుగు పర్చుకునే ప్రయత్నంలో ఉంది. న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌ను 4-1తో గెల్చుకుంటే భారత్ ముందంజ వేస్తుంది. ప్రస్తుతం నాలుగో ర్యాంక్ (110 పారుుంట్లు)లో ఉన్న జట్టు మూడో ర్యాంక్‌కు చేరుకుంటుంది. కివీస్ (113 పారుుంట్లు) మనకంటే ఒక స్థానం ముందుంది. -
మనోళ్లు పాక్ నుంచి లాగేసుకున్నారు
కోల్‌కతా: టీమిండియా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టింది. కోల్‌కతాలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ సేన 178 పరుగులతో ఘన విజయం సాధించి.. సిరీస్‌తో పాటు పాకిస్థాన్ వద్ద ఉన్న నెంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతేగాక ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న పాక్‌ను భారత్ వెనక్కునెట్టి మళ్లీ నెంబర్‌వన్‌గా నిలిచింది. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో టీమిండియా ఈ ఘనత సాధించడం అభిమానులకు సంతోషం కలిగిస్తోంది. పాక్ చరిత్రలో తొలిసారి నంబర్‌వన్ కాగానే ఆ దేశ అభిమానులు భారత్‌ను కవ్వించేలా సోషల్ మీడియా ద్వారా రకరకాల విమర్శలు చేశారు. ఇప్పుడు విరాట్ సేన న్యూజిలాండ్‌పై గెలిచి ఆ ర్యాంక్‌ను లాగేసుకుంది. -
పాక్ నుంచి లాగేసుకుందాం!
న్యూజిలాండ్‌తో సిరీస్ జరుగుతుంటే... పాక్ నుంచి లాక్కోవడం ఏమిటి? అనుకుంటున్నారా..! ఆశ్చర్యపోకండి. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో క్రికెట్లోనూ ఓ ఘనత సాధించడం ద్వారా భారతదేశాన్ని సంతోషంలో నింపే అవకాశం కోహ్లి సేనకు దక్కింది. న్యూజిలాండ్‌తో నేటి నుంచి జరిగే రెండో టెస్టులో గెలిస్తే భారత్ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ ర్యాంక్ పాకిస్తాన్ దగ్గర ఉంది. గత నెలలో వెస్టిండీస్ పర్యటనలో ఉన్నప్పుడు భారత్ నంబర్‌వన్‌గా అవతరించింది. అయితే కరీబియన్ పర్యటనలో ఆఖరి టెస్టు రద్దుకావడం... అటు పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌తో సిరీస్‌ను డ్రా చేసుకోవడంతో... హోదా వాళ్లకు వెళ్లి మిస్బా ‘గద’ అందుకున్నాడు. పాక్ చరిత్రలో తొలిసారి నంబర్‌వన్ కాగానే ఆ దేశ అభిమానులు భారత్‌ను కవ్వించేలా సోషల్ మీడియా ద్వారా రకరకాల విమర్శలు చేశారు. ఇప్పుడు న్యూజిలాండ్‌పై గెలిచి ఆ ర్యాంక్‌ను లాగేసుకుంటే ఓ పనైపోతుంది. తొలి టెస్టులో అద్భుత విజయం తర్వాత భారత్ ఆత్మవిశ్వాసం ఆకాశంలో ఉండగా... సిరీస్‌లో కోలుకునే ప్రయత్నంలో న్యూజిలాండ్ మరో పోరాటానికి సిద్ధమవుతోంది. భారత క్రికెట్ మక్కాగా ఖ్యాతిగాంచిన ఈడెన్ గార్డెన్స మైదానంలో జరిగే ఈ టెస్టు మన జట్టుకు మరో మైలురాయిగా చరిత్రలో నిలిచిపోనుంది. సొంతగడ్డపై మన జట్టుకు ఇది 250వ టెస్టు కావడం విశేషం. మరి ఈ మ్యాచ్‌లోనూ ‘టాప్’ లేపే ప్రదర్శనతో విజయ ‘గంట’ మోగిస్తుందా చూడాలి. నంబర్‌వన్‌పై భారత్ గురి నేటి నుంచి న్యూజిలాండ్‌తో రెండో టెస్టు గెలిస్తే అగ్రస్థానానికి కోహ్లిసేన రాహుల్ స్థానంలో ధావన్! కోల్‌కతా: భారత గడ్డపై తొలి టెస్టులో ఓడిన తర్వాత సిరీస్‌లో ప్రత్యర్థి జట్లు కోలుకోవడం చాలా అరుదు. స్వదేశంలో శుభారంభం చేస్తే ఆ పట్టును సిరీస్ మొత్తం నిలబెట్టుకోవడంలో మన జట్టుకు మంచి రికార్డు ఉంది. కాబట్టి ఈ సిరీస్‌లో కూడా కోహ్లి సేన అదే ఆశిస్తోంది. తొలి టెస్టు విజయానంతరం ఇప్పుడు అదే జోరులో రెండో మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. పనిలో పనిగా నంబర్‌వన్ ర్యాంక్ కూడా చెంతకు చేరుతుంది. ఈ నేపథ్యంలో నేటినుంచి ఇక్కడి ఈడెన్ గార్డెన్సలో న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టుకు భారత్ సన్నద్ధమైంది. మరో వైపు గత మ్యాచ్‌లో పోరాడిన స్ఫూర్తితో ఈ సారైనా ఓటమి నుంచి తప్పించుకోవాలని కివీస్ భావిస్తోంది. ధావన్‌కే అవకాశం! గాయపడిన రాహుల్ స్థానంలో గౌతమ్ గంభీర్‌ను ఎంపిక చేయడంతో అతని పునరాగమనంపై ఆసక్తి రేగింది. అరుుతే మ్యాచ్‌లో గంభీర్‌తో పోలిస్తే శిఖర్ ధావన్‌కే తుది జట్టులో చోటు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. మ్యాచ్‌కు ముందు రోజు గంభీర్‌తో పోలిస్తే ధావన్ సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశాడు. ఇటీవల ధావన్ ప్రదర్శనలో నిలకడ లేకపోయినా మరీ ఘోరంగా ఏమీ విఫలం కాలేదు కాబట్టి అతనిని పక్కన పెట్టకపోవచ్చు. అశ్విన్ వేలి గాయంతో బాధపడుతున్నా మ్యాచ్ సమయానికి ఫిట్ కాగలడని సమాచారం. అతను గురువారం ప్రాక్టీస్ చేయకపోయినా అది పెద్ద విషయం కాదని కోహ్లి కొట్టి పారేశాడు. కాన్పూర్ టెస్టుతో పోలిస్తే ఈ సారి ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని భారత్ భావిస్తోంది. అదే జరిగితే రోహిత్‌ను తప్పించి కొత్త బౌలర్ జయంత్ యాదవ్‌ను ఎంపిక చేస్తారు. కివీస్ జట్టులో ఎక్కువ మంది ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్ ఉండటంతో మరో ఆఫ్ స్పిన్నర్ అవసరాన్ని కెప్టెన్ గుర్తు చేశాడు. ఇతర ఆటగాళ్ల విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే స్వదేశంలో ఆడుతూ కూడా గత టెస్టు తొలి ఇన్నింగ్స మన జట్టు భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. సరిగ్గా చెప్పాలంటే మనోళ్లు కూడా స్పిన్‌ను తగిన విధంగా ఎదుర్కోలేకపోయారు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్ బలహీనతలపై దాడి చేసి భారీ స్కోరు సాధిస్తే ఈ టెస్టులోనూ జట్టుకు తిరుగుండదు. విలియమ్సన్కు అనారోగ్యం ఇప్పటికే గాయాల కారణంగా కీలక ఆటగాళ్లను కోల్పోయిన న్యూజిలాండ్‌కు రెండో టెస్టుకు ముందు మరో సమస్య వచ్చి పడింది. టీమ్ కెప్టెన్, టాప్ బ్యాట్స్‌మన్ విలియమ్సన్ గురువారం అనారోగ్యానికి గురయ్యాడు. అతను నిజంగా మ్యాచ్‌కు దూరమైతే కివీస్ కుప్పకూలిపోతుంది. అయితే తగిన విశ్రాంతితో కెప్టెన్ మ్యాచ్ సమయానికి కోలుకుంటాడని టీమ్ మేనేజ్మెంట్ విశ్వాసంతో ఉంది. విలియమ్సన్ ఆడకపోతే నికోల్స్‌కు అవకాశం లభిస్తుంది. తొలి టెస్టులో ఘోరంగా విఫలమైనా... ఇతర ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేకపోవడంతో గప్టిల్‌కు మరో అవకాశం లభించనుంది. క్రెయిగ్ స్థానంలో జట్టుతో చేరిన జీతన్ పటేల్ కూడా మూడేళ్ల తర్వాత మ్యాచ్ ఆడటం ఖాయమైంది. గత మ్యాచ్‌లో ఆ జట్టు కొంత పోరాట పటిమ కనబర్చింది. కానీ కీలక క్షణాల్లో ఆధిక్యాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఆ అనుభవంతో ఈ సారి స్పిన్‌ను మరింత సమర్థంగా ఎదుర్కోవాలని, మెరుగ్గా ఆడాలని జట్టు పట్టుదలగా ఉంది. సీనియర్ రాస్ టేలర్ కూడా రాణించడం ఎంతో అవసరం. మిషెల్ సాన్‌ట్నర్, రోంచీ గత ప్రదర్శనను ఇక్కడా కొనసాగించాలని భావిస్తున్నారు. కానీ భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం వారికి అంత సులువు కాదు. గతంలో ఈడెన్‌లో ఆడిన రెండు టెస్టులనూ కివీస్ డ్రాగా ముగించగలిగింది. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, విజయ్, పుజారా, రహానే, రోహిత్/జయంత్, అశ్విన్, సాహా, జడేజా, షమీ, ఉమేశ్. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్)/నికోల్స్, గప్టిల్, లాథమ్, టేలర్, సాన్‌ట్నర్, రోంచీ, వాట్లింగ్, జీతన్, వాగ్నర్, సోధి, బౌల్ట్ ఉ.గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స 1లో ప్రత్యక్ష ప్రసారం పిచ్, వాతావరణం ఈడెన్‌గార్డెన్‌సలో ఇటీవల తయారు చేసిన కొత్త పిచ్‌పై తొలిసారి జరుగుతున్న మ్యాచ్ ఇది. ఆరంభంలో బ్యాటింగ్‌కు అనుకూలించి మూడో రోజునుంచి స్పిన్‌కు సహకరించే అవకాశం ఉంది. టాస్‌తో పాటు తొలి ఇన్నింగ్సలో చేసే పరుగులు కీలకం కానున్నాయి. కోల్‌కతాలో సెప్టెంబర్ నెలలో టెస్టు మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. టెస్టుకు కూడా ఏదో ఒక దశలో వాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ‘నంబర్‌వన్, రికార్డుల గురించి నేను పట్టించుకోను. రెండేళ్ల క్రితంతో పోలిస్తే మేం ఎంత బాగా ఆడుతున్నామో చూస్తున్నారు. నాకు అదే ముఖ్యం. మేం అన్ని రకాలుగా సిద్ధమయ్యాం కాబట్టి పిచ్ గురించి అసలు ఆలోచనే లేదు. అయితే బ్యాటింగ్‌కు మాత్రం అనుకూలంగా కనిపిస్తోంది. భారీ స్కోరు చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడం ముఖ్యం. నా ఫామ్ గురించి ఎక్కువగా ఆందోళన చెందడం లేదు. ప్రతీ సారి పరుగులు చేయడం సాధ్యం కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. డీఆర్ఎస్ వాడకుండా అంపైర్లు తప్పులు చేస్తున్నారని విమర్శించడం సరి కాదు. భవిష్యత్తులో డీఆర్ఎస్ అవసరం ఉంటుందనే.. నా అభిప్రాయం. అయితే ఇప్పుడే దీనిపై నిర్ణయం తీసుకోలేం’. - విరాట్ కోహ్లి ‘మొదటి టెస్టులో కూడా మేం బాగా ఆడాం. ఒకట్రెండు సార్లు వెనుకబడి మ్యాచ్‌ను కోల్పోయాం. ఈ సారి ఆరంభం బాగుండటంతో పాటు సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో నిలవడమే ముఖ్యం. అప్పుడు మాకూ ఈ టెస్టులో మంచి అవకాశం ఉంటుంది. విలియమ్సన్కు కాస్త నలతగా ఉండి ప్రాక్టీస్ చేయలేదు. అంతే తప్ప పెద్ద సమస్య కాదు. విశ్రాంతి తర్వాత మ్యాచ్ కు సిద్ధంగా ఉంటాడు’. - టామ్ లాథమ్, కివీస్ బ్యాట్స్‌మన్ కోల్‌కతా కబుర్లు కివీస్‌కు గంగూలీ ‘క్లాస్’ ఈడెన్ గార్డెన్సలో ప్రాక్టీస్ సందర్భంగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ న్యూజిలాండ్ ఆటగాళ్లతో ముచ్చటించారు. కివీస్ బ్యాటింగ్ కోచ్ మెక్‌మిలన్, ఇతర సభ్యులకు ఈ సందర్భంగా ఆటకు సంబంధించి గంగూలీ పలు సూచనలు చేశారు. స్పిన్‌ను ఎదుర్కోవడం, ఇక్కడి పిచ్‌లపై బంతిని డ్రైవ్ చేయడం తదితర అంశాలపై బ్యాట్‌తో ఆడి చూపించి కొన్ని కిటుకులు చెప్పారు. న్యూజిలాండ్ ఆటగాళ్లంతా ఆయన సూచనలను శ్రద్ధగా విన్నారు. దాదా టిప్స్ కివీస్‌కు ఏమైనా ఉపయోగపడతాయా చూడాలి. మరో వైపు తన సొంత మైదానంలోనే ’క్యాబ్’ అధ్యక్షుడు గంగూలీకి చేదు అనుభవం ఎదురైంది. తన కార్యాలయానికి వెళ్లబోయి ఆయన లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. చివరకు దానిని తెరిచి స్టూల్ సహాయంతో గంగూలీని బయటికి తీసుకు రావాల్సి వచ్చింది. 2011లో స్టేడియంను ఆధునీకరించినా 29 ఏళ్లుగా ఉన్న ఈ లిఫ్ట్‌ను మాత్రం ఇప్పటి వరకు మార్చలేదు. చల్ మేరే భాయ్... దేశవాళీ క్రికెట్లో ఒకే జట్టుకు, భారత జట్టుకు, చివరకు ఉద్యోగం చేసే సంస్థ తరఫున కూడా కలిసి ఆడిన కోహ్లి, గంభీర్‌లకు చాలా కాలంగా పడదనే విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం ఐపీఎల్లో దాదాపు కొట్టుకున్నంత పని చేసిన తర్వాత మరో రెండు సార్లు కూడా వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు దానిని దూరంగా పెట్టాలని వారు భావించినట్లున్నారు. గంభీర్ కూడా ప్రస్తుత కెప్టెన్‌తో మంచి సంబంధాలు కొనసాగించాలని అనుకున్నట్లున్నాడు. గురువారం ప్రాక్టీస్ సందర్భంగా వీరిద్దరు సుదీర్ఘ సమయం పాటు ముచ్చటించుకున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకోవడం కూడా అందరినీ ఆకర్షించింది. గంట మోగిస్తారు... లార్డ్స్ మైదానంలో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు దిగ్గజ క్రికెటర్ ఒకరు అక్కడి పెద్ద గంటను మోగించడం ఆనవాయితీ. తాను కెప్టెన్‌గా ఉన్ననాటినుంచి ఇది సౌరవ్ గంగూలీని ఆకర్షించింది. అతను తొలి టెస్టు ఆడింది కూడా అక్కడే కావడం విశేషం. అప్పటినుంచి అతను ఆ మైదానంతో పాటు ఆ బెల్‌పై కూడా ఆకర్షణ పెంచుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ‘క్యాబ్’ అధ్యక్షుడిగా తమ స్టేడియంలో దానిని ఏర్పాటు చేయాలని గంగూలీ భావించాడు. ఫలితంగా ఇప్పుడు అదే తరహాలో పెద్ద గంట ఇక్కడ రెడీ అయింది. భారత్‌లో మరే మైదానంలోనూ ఇలాంటిది లేదు. చండీగఢ్‌లో తయారు చేసిన ఈ భారీ గంటకు వెండి తాపడం చేయించారు. మైదానంలోని బీసీ రాయ్ క్లబ్ హౌస్ ఎండ్ వైపు సైట్ స్క్రీన్ పైన ఉంచారు. శుక్రవారం రెండో టెస్టుకు ముందు భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ దీనిని మోగిస్తారు. -
అశ్విన్ మరోసారి అందుకుంటాడా?
దుబాయ్: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి అగ్రస్థానానికి చేరువలో నిలిచాడు. న్యూజిలాండ్ తో జరిగే రెండో టెస్టులోనూ రాణిస్తే అతడు టాప్ ర్యాంకు దక్కించుకునే అవకాశముంది. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ లో అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ను అధిగమించి సెకండ్ ర్యాంకు దక్కించుకున్నాడు. అగ్రస్థానానికి ఏడు పాయింట్ల దూరంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ 878 పాయింట్లతో టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. గతేడాది తొలిసారిగా అశ్విన్ ఫస్ట్ ర్యాంకు అందుకున్నాడు. బాక్సింగ్ డే టెస్టులో రాణించి అగ్రస్థానం దక్కించుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో అజింక్య రహానే టాప్-10 నుంచి పడిపోయి 11వ ర్యాంకులో నిలిచాడు. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి 4 స్థానాలు పడిపోయి 20వ ర్యాంకులో ఉన్నాడు. -
ఈడెన్‌లో నెగ్గితే టాప్ ర్యాంక్‌కు..
దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత క్రికెట్ జట్టు తిరిగి నంబర్‌వన్ స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో ఈడెన్ గార్డెన్లో జరిగే రెండో టెస్టులో భారత్ నెగ్గితే అగ్రస్థానానికి చేరుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ తమ చరిత్రలో తొలిసారిగా టాప్ ర్యాంకులో ఉంది. కేవలం ఒక్క పాయింట్ తక్కువతో భారత జట్టు తమ సిరీస్‌ను ప్రారంభించింది. ఇక బౌలర్ల జాబితాలో పది వికెట్లతో రాణించిన స్పిన్నర్ అశ్విన్ ఓ స్థానాన్ని మెరుగుపరుచుకుని రెండో ర్యాంకుకు చేరాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలోనే ఉన్నాడు. -
అశ్విన్ 1.. అశ్విన్ 3
దుబాయ్: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ స్థానం కోల్పోయి మూడో ర్యాంక్‌లో నిలిచాడు. బుధవారం విడుదల చేసిన బౌలర్ల ర్యాంకింగ్ జాబితాలో సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ డేల్ స్టెయిన్ మళ్లీ అగ్రస్థానం దక్కించుకోగా, ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ రెండోర్యాంక్తో సరిపెట్టుకున్నాడు. న్యూజిలాండ్‌తో సెంచూరియన్ టెస్టు మ్యాచ్‌లో స్టెయిన్ 8 వికెట్ల పడగొట్టడంతో ర్యాంక్ మెరుగుపడింది. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాండ్ నాలుగు, శ్రీలంక బౌలర్ రంగన హెరాత్ ఐదు స్థానాల్లో నిలిచారు. రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ ఆటగాడు షకీబల్ హసన్ రెండు, ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ మూడు స్థానాల్లో నిలిచారు. కాగా బ్యాట్స్‌మెన్ జాబితాలో పెద్దగా మార్పుల్లేవు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫస్ట్ ర్యాంక్ కాపాడుకోగా, జో రూట్, కేన్ విలియమ్సన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. భారత ఆటగాడు రహానె ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. -
టీమిండియా నంబర్ వన్
దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా మొదటి స్థానానికి చేరుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో కోహ్లి సేన టాప్ ర్యాంకులో నిలిచింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోవడంతో టీమిండియా మొదటి ర్యాంకు సొంతం చేసుకుంది. 3-0తో సిరీస్ ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేయడంతో మొదటి ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను 2-2తో డ్రాగా ముగిసించిన పాకిస్థాన్ రెండో ర్యాంకులో నిలిచింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్.. 4,5 స్థానాలు దక్కించుకున్నాయి. శ్రీలంక(6), దక్షిణాఫ్రికా(7), వెస్టిండీస్(8), బంగ్లాదేశ్(9), జింబాబ్వే(10) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
అశ్విన్ మరో ఘనత
* ఐసీసీ ఆల్‌రౌండర్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ * భారత్ నుంచి ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్ దుబాయ్: భారత క్రికెటర్ అశ్విన్ మరో అద్భుత ఘనత సాధించాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. గతంలో వినూ మన్కడ్, కపిల్‌దేవ్ మాత్రమే ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్లు. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో బౌలింగ్‌లో రాణించడంతో పాటు బ్యాటింగ్‌లో సెంచరీ సాధించిన అశ్విన్ ఖాతాలో ప్రస్తుతం 427 పాయింట్లు ఉన్నాయి. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లోనూ అశ్విన్ తిరిగి నంబర్‌వన్ స్థానానికి చేరాడు. గతేడాది చివర్లో నంబర్‌వన్‌గా ఉన్న అశ్విన్... ఆరు నెలల తర్వాత తిరిగి అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న అండర్సన్ (875పాయింట్లు) అశ్విన్‌కన్నా ఒక్క పాయింట్ తక్కువగా ఉన్నాడు. -
నంబర్ వన్ గానే అశ్విన్
ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ అశ్విన్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ రెండో స్థానంలో, జడేజా ఆరో ర్యాంక్‌లో ఉన్నారు. బ్యాట్స్‌మెన్ టాప్-10లో భారత్ నుంచి రహానే (పదో ర్యాంక్) మాత్రమే ఉన్నాడు. జట్టు ర్యాంకింగ్స్‌లో ఆగస్టు 2011 తర్వాత తొలిసారి భారత్ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. -
'టాప్'లోనే అశ్విన్
దుబాయ్: భారత ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ఆల్ రౌండర్ల విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో అశ్విన్ 31.68 బ్యాటింగ్ సగటుతో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ ను కంటే మెరుగ్గు ఉండటంతో ప్రథమ స్థానాన్నిపదిలంగా ఉంచుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో అశ్విన్ బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్ లో అశ్విన్ 31 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత టెస్టు బౌలింగ్ విభాగంలో అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇదిలా ఉండగా మరో భారత ఆటగాడు రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ల విభాగంలో ఐదో ర్యాంకులో కొనసాగుతుండగా, బౌలర్ల విభాగంలో ఒక ర్యాంకు మెరుగుపరుచుకుని ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తరువాత స్థానాల్లో జోరూట్(ఇంగ్లండ్), ఏబీ డివిలియర్స్(దక్షిణాఫ్రికా)లు కొనసాగుతున్నారు. టాప్ -10 లో ఏ ఒక్క భారత ఆటగాడికి స్థానం దక్కకపోవడం గమనార్హం. ఇక టెస్టు ర్యాంకింగ్స్ లో జట్ల విషయానికొస్తే దక్షిణాఫ్రికా 114 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, భారత్ 110 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తరువాత స్థానాల్లో ఆస్ట్రేలియా(109పాయింట్లు), పాకిస్తాన్(106 పాయింట్లు), ఇంగ్లండ్(99 పాయింట్లు) జట్లు ఉన్నాయి. -
అశ్విన్ 'బెస్ట్' ర్యాంక్
దుబాయ్:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో విశేషంగా రాణిస్తున్న టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్ లో అత్యుత్తమ ర్యాంక్ ను సాధించాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో మూడు స్థానాలు మెరుగుపరుచుకున్న అశ్విన్ రెండో ర్యాంక్ లో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో 12 వికెట్ల తీసి అశ్విన్(856 పాయింట్లు) కెరీర్ బెస్ట్ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా, బ్యాటింగ్ విభాగంలో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మూడో స్థానానికి పడిపోయాడు. భారత్ తో సిరీస్ కు ముందు అగ్రస్థానంలో నిలిచిన ఏబీ.. రెండు స్థానాలు దిగజారాడు. కాగా, భారత ఆటగాడు మురళీ విజయ్ 12వ ర్యాంక్ సాధించి కెరీర్ లో టాప్ ర్యాంక్ కు చేరగా, విరాట్ కోహ్లి ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 16వ స్థానంలో నిలిచాడు. టెస్టు జట్ల ర్యాంకింగ్స్ లో ఆసీస్ 109 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. అయితే ఆసీస్ కు భారత్ జట్టు నుంచి గట్టి పోటీ ఏర్పడింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్ విజయం సాధిస్తే 110 పాయింట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. -
టాప్-20లో ఇషాంత్, పూజారా
దుబాయ్: భారత బౌలర్ ఇషాంత్ శర్మ టెస్టు ర్యాంకుల్లో టాప్-20లో స్థానం దక్కించుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో ఇషాంత్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 18వ ర్యాంకు దక్కించుకున్నాడు. అశ్విన్ 50, అమిత్ మిశ్రా 59 ర్యాంకుల్లో ఉన్నారు. బ్యాట్స్ మన్ చతేశ్వర్ పూజారా కూడా టాప్-20లో చోటు సంపాదించాడు. నాలుగు స్థానాలు ఎగబాకి 20వ స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో టాప్-20లో ఉన్న రెండో బ్యాట్స్ మన్ పూజారా. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక ర్యాంకు పడిపోయి 11వ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ రెండు స్థానాలు మెరుగు పరుచుకుని 48వ ర్యాంకులో నిలిచాడు. -
ఐదో ర్యాంక్‌లో భారత్
కొలంబో : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఐదో ర్యాంక్‌లో నిలిచింది. లంకపై చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియా (100) కీలకమైన మూడు రేటింగ్ పాయింట్లను సాధించింది. దీంతో నాలుగో స్థానంలో ఉన్న పాకిస్తాన్ (101)కు మరింత చేరువలోకి వచ్చింది. దక్షిణాఫ్రికా (125) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా (106), ఇంగ్లండ్ (102) వరుసగా రెండు, మూ డో ర్యాంక్‌లో ఉన్నాయి. న్యూజిలాండ్ (99), శ్రీలంక (89) ఆరు, ఏడు స్థానాలను దక్కించుకున్నాయి. వెస్టిండీస్ (81), బంగ్లాదేశ్ (47), జింబాబ్వే (5) చివరి 3 స్థానాల్లో నిలిచాయి. -
టాప్ టెన్ నుంచి కోహ్లి అవుట్
దుబాయ్: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో టాప్ టెన్ నుంచి పడిపోయాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో 11వ స్థానం దక్కించుకున్నాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో విశేషంగా రాణించిన అశ్విన్ పైకి ఎగబాకాడు. బౌలింగ్ లో అశ్విన్ 8వ స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ విభాగంలో 2వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన కుమార సంగక్కర 7, మైఖేల్ క్లార్క్ 25 ర్యాంకుల్లో నిలిచారు. అజింక్య రహానే రెండు స్థానాలు ఎగబాకి 20వ స్థానం దక్కించుకున్నాడు. స్పిన్నర్ అమిత్ మిశ్రా అనూహ్యంగా 42 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంకులో నిలిచాడు. -
నాలుగో ర్యాంక్‌కు భారత్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ వార్షిక సవరణ జాబితాలో భారత జట్టు రెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. సోమవారం తాజాగా ప్రకటించిన ఈ జాబితా లో 2011-12లో జట్ల ఫలితాలను తొలగిం చారు. 2013-14లో భారత జట్టు సాధించిన విజయాలు ర్యాంకింగ్‌లో 50 శాతం ప్రభావం చూపాయి. ఆసీస్‌కన్నా ఆరు పాయింట్లు ముందున్న దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మూడో స్థానంలో కివీస్ ఉంది. -
టెస్టు కెరీర్ బెస్టు ర్యాంక్ లో రహానే
దుబాయ్: భారత ఆటగాళ్లు ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్ ర్యాంకుల్లో కిందకు జారారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో పూజారా రెండు స్థానాలు పడిపోయి పదో ర్యాంక్ లో నిలిచాడు. భారత్ తరపున అతడితే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. కోహ్లి 14 నుంచి 15 ర్యాంక్ కు వచ్చాడు. సౌంప్టన్ టెస్టులో భారత్ 266 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం టీమిండియా ఆటగాళ్ల ర్యాంకులపై ప్రభావం చూపింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో సెంచరీ సాధించడంతో పాటు సౌంప్టన్ టెస్టులోనూ అర్థసెంచరీలు కొట్టిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానే తన కెరీర్ బెస్టు ర్యాంక్ సాధించాడు. 9 స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్ లో నిలిచాడు. ఇక బౌలర్లలో రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్ తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. జడేజా 25, భువనేశ్వర్ కుమార్ 32వ ర్యాంక్ దక్కించుకున్నారు. -
మూడో స్థానంతో ముగింపు
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఈ ఏడాదిని మూడో ర్యాంకుతో ముగించింది. దీంతో 2 లక్షల 65 వేల డాలర్ల (రూ. కోటి 60 లక్షలు) చెక్‌ను అందుకుంది. ఈనెల 1 వరకు ఈ ర్యాంకులకు కటాఫ్ తేదీగా ఉంది. వరుసగా రెండో ఏడాది నంబర్‌వన్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు 4 లక్షల 75 వేల డాలర్లు (రూ. 2 కోట్ల 86 లక్షలు) అందాయి. రెండో స్థానం పొందిన ఆసీస్‌కు 3 లక్షల 70 వేల డాలర్లు (రూ. 2 కోట్ల 23 లక్షలు), నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌కు లక్షా 60 వేల డాలర్లు (రూ.96 లక్షల 36 వేలు) పొందాయి. ఆగస్టు 2012 నుంచి సఫారీ జట్టు తమ అద్భుత ప్రదర్శనతో నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. ‘ఐసీసీ టెస్ట్ ప్రైజ్‌మనీని తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆటగాళ్లు, టీమ్ మేనేజిమెంట్ తరఫునే కాకుండా మొత్తం దక్షిణాఫ్రికా ప్రజల తరఫున ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’ అని సీఎస్ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లోర్గాట్ తెలిపారు. -
పుజారా, కోహ్లి ర్యాంకులు కిందకు
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ దుబాయ్: భారత బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఒక్కో స్థానం కిందకు దిగజారారు. గురువారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో పుజారా 8వ, కోహ్లి 10వ ర్యాంకుకు పడిపోయారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ కెరీర్లో అత్యుత్తమంగా ఐదో ర్యాంకు సాధించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రాణించడం ద్వారా వార్నర్ ఐదు స్థానాలు ఎగబాకాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ల జాబితాలు మూడింట్లోనూ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వరుసగా డివిలియర్స్, స్టెయిన్, ఫిలాండర్ టాప్‌ర్యాంకుల్లో ఉండడం విశేషం. భారత ఆటగాడు అశ్విన్ ఆల్‌రౌండర్ జాబితాలో రెండో స్థానానికి పడిపోయాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో కోహ్లి
దుబాయ్: న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రాణించిన భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి... టెస్టుల్లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో 9వ ర్యాంక్‌లో నిలిచాడు. ఈ ఢిల్లీ ప్లేయర్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 214 పరుగులు చేశాడు. చతేశ్వర్ పుజారా 7వ ర్యాంక్‌కు పడిపోయాడు. అజింక్యా రహానే 46వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరోవైపు ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ 8 స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. వాట్లింగ్ 45వ ర్యాంక్‌కు ఎగబాకాడు. బౌలింగ్ విభాగంలో అశ్విన్ రెండు స్థానాలు దిగజారి 10వ ర్యాంక్‌తో సరిపెట్టుకోగా... హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా 12వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. -
విజయ్, రహానేలకు కెరీర్ బెస్ట్ ర్యాంకులు
దుబాయ్: భారత ఆటగాళ్లు ఛతేశ్వర్ పూజారా, అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ టెస్టు ర్యాంకుల్లో తమ స్థానాలు నిలుపుకున్నారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో బ్యాటింగ్ విభాగంలో పూజారా ఏడో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌లో అశ్విన్ కూడా ఏడో స్థానంలోనే కొనసాగుతున్నాడు. భారత్ తరపున వీరిద్దరివే అత్యుత్తమ ర్యాంకులు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రాణించిన మురళీ విజయ్, అజింక్య రహానే ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకారు. విజయ్ ఆరు స్థానాలు ముందుకు వచ్చి 38వ ర్యాంకులో నిలిచాడు. రహానే 65 నుంచి 63 స్థానానికి ప్రమోటయ్యాడు. వీరిద్దరికీ కెరీర్ బెస్ట్ ర్యాంకులు కావడం విశేషం. దక్షిణాఫ్రికా సీనియర్ ఆటగాడు 12వ ర్యాంకులో రిటైరయ్యాడు. -
కోహ్లికి కెరీర్ బెస్ట్ ర్యాంక్
టెస్టుల్లో నం.1 బౌలర్‌గా ఫిలాండర్ దుబాయ్: విరాట్ కోహ్లి టెస్టుల్లో కెరీర్ బెస్ట్ 11 ర్యాంకుకు ఎగబాకాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్ జాబితాలో అతను తొమ్మిది స్థానాల్ని మెరుగుపర్చుకొని 11వ ర్యాంకుకు చేరుకున్నాడు. పుజారా (7వ స్థానం) తర్వాత భారత్ తరఫున ఇదే మెరుగైన ర్యాంకు. బౌలర్ల విభాగంలో ఫిలాండర్ (దక్షిణాఫ్రికా) టాప్ ర్యాంకుకు చేరుకున్నాడు. సుమారు నాలుగున్నర ఏళ్ల పాటు అగ్రస్థానంలో కొనసాగిన స్టెయిన్ రెండో స్థానానికి పడిపోయాడు. 2009 జూలై నుంచి స్టెయిన్ టాప్ ర్యాంకులో ఉన్నాడు. -
కెరీర్ బెస్ట్ ర్యాంకుల్లో జింబాబ్వే ఆటగాళ్లు
దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే ఆటగాళ్లు కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్‌కు ఎగబాకారు. పటిష్టమైన పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో సంచలన విజయం సాధించడం ద్వారా జింబాబ్వే క్రికెటర్ల ర్యాంకులు మెరుగయ్యాయి. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ బ్రెండన్ టేలర్ ఏకంగా 15 స్థానాలు మెరుగుపర్చుకొని కెరీర్ బెస్టు 25వ స్థానానికి ఎగబాకాడు. హమిల్టన్ మసకద్జా 40 స్థానాలు మెరుగుపర్చుకొని 66వ ర్యాంకుకు చేరాడు. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ మిస్బా మూడు స్థానాలు ఎగబాకి 12వ, యూనిస్ ఖాన్ 6వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్‌లో జింబాబ్వే ఆటగాళ్లు చతారా 21 స్థానాలు మెరుగుపర్చుకొని కెరీర్ బెస్ట్ 55వ ర్యాంకుకు చేరాడు. -
ఆరో ర్యాంక్‌కు పాక్
దుబాయ్: రెండో టెస్టులో జింబాబ్వే చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్... ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దిగజారింది. శనివారం విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు కోల్పోయి ఆరో ర్యాంక్‌కు పడిపోయింది. ఎలాంటి ర్యాంక్ లేకుండా సిరీస్‌ను మొదలుపెట్టిన జింబాబ్వే 34 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానాన్ని దక్కించుకుంది. 2006లో టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగిన జింబాబ్వే 2011లో పునరాగమనం చేసింది. ఈ ఐదేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ విజయాలు లేకపోవడంతో రేటింగ్ పాయింట్లు లభించలేదు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. -
ఆరో ర్యాంక్‌లోనే పుజారా
దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో... భారత ఓపెనర్ చతేశ్వర్ పుజారా (777 ర్యాంకింగ్ పాయింట్లు) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్-20లో పుజారా మినహా భారత బాట్స్మెన్ ఎవ్వరికీ చోటు దక్కలేదు. హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా-903) అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 8వ ర్యాంక్‌లో నిలిచాడు. హైదరాబాద్ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా 10వ స్థానంలో ఉండగా... జహీర్ ఖాన్ 17వ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) నంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు.