పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్‌తో సిరీస్ పరాజయంతో టెస్టుల్లో పాకిస్తాన్ ర్యాంక్ మరింత దిగజారింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో పాక్ 8వ స్థానానికి పడిపోయింది. రావల్పిండి వేదికగా సొంతగడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పాకిస్తాన్ క్లీన్‌స్వీప్ అయింది.
బంగ్లాదేశ్ చేతిలో సిరీస్‌ను కోల్పోవడం పాకిస్తాన్ జట్టుకు ఇదే తొలిసారి. ఒక్క టెస్టులోనూ పోరాటాన్ని కనబర్చలేకపోయిన పాక్ తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో... రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో కంగుతింది. ‘ఐసీసీ పురుషుల టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో పాక్ రెండు స్థానాలు దిగజారి 8వ ర్యాంక్‌కు పడిపోయింది’ అని ఐసీసీ వెబ్‌సైట్‌లో తెలిపింది.
సిరీస్‌కు ముందు పాకిస్తాన్ ఆరో ర్యాంక్‌లో ఉంది. రెండు వరుస పరాజయాలతో వెస్టిండీస్ (7వ ర్యాంక్) కంటే దిగువ ర్యాంక్‌కు చేరింది. 1965 తర్వాత పాక్ ఇలా ర్యాంకింగ్స్‌లో దిగజారడం ఇదే తొలిసారి. అయితే పాక్‌ను వైట్‌వాష్ చేసినప్పటికీ బంగ్లాదేశ్ 9వ ర్యాంక్‌లో మార్పు లేదు.
కానీ బంగ్లాదేశ్ జట్టు 13 రేటింగ్ పాయింట్లు మెరుగుపరుచుకుంది. త్వరలోనే బంగ్లాదేశ్... భారత్ పర్యటనలో రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది. ఈ నెల 19 నుంచి చెన్నైలో తొలి టెస్టు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment