Pakistan vs Bangladesh
-
పాకిస్తాన్‌కి మళ్ళీ ఊపిరి పోసిన జింబాబ్వే.. ఇప్పుడిలా!
తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యమిచ్చే అవకాశం లభించడంతో పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్లో మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ పోటీలపై ఆశలు చిగురిస్తున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్ పోటీల్ని చూసే అవకాశం లభించడంతో వారంతా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ప్రధాన జట్టుగా వెలుగొందిన పాకిస్తాన్‌కి ఉగ్రవాద ముద్ర పడిన తర్వాత ప్రధాన క్రికెట్ జట్లన్నీ ఆ దేశంలో పర్యటించడానికి వెనుకాడాయి.ముఖ్యంగా 2009లో ఆ దేశానికీ పర్యటనకి వచ్చిన శ్రీలంక జట్టు ఆటగాళ్ల బస్సుపై ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుండి పాకిస్తాన్ దేశం లో దాదాపు అంతర్జాతీయ క్రికెట్ పర్యటనలు నిలిచిపోయాయి. విదేశీ జట్ల రాకపోకలు నిలిచిపోవడంతో భద్రతా కారణాల దృష్ట్యా కొంతకాలం క్రితం వరకు పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ని తమ స్వదేశీ వేదిక చేసుకొని క్రికెట్ మ్యాచ్ లు ఆడింది.పాకిస్తాన్‌కి మళ్ళీ ఊపిరి పోసిన జింబాబ్వే2015లో జింబాబ్వే తొలిసారిగా పాకిస్తాన్ లో పర్యటించింది. దీంతో మళ్ళీ ఆ దేశంలో క్రికెట్ పర్యటనలకు దారులు తెరుచుకున్నాయి. ఆ తర్వాత 2017లో వరల్డ్ XI జట్టు టి20 సిరీస్ ఆడింది. దీంతో అంతర్జాతీయ జట్ల పర్యటనలు మళ్ళీ మెల్ల మెల్లగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాల క్రికెట్ జట్లు పాకిస్తాన్ కి పర్యటనలకు వెళ్లడంతో మళ్ళీ ఆ దేశ క్రికెట్ అభిమానులకి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లను చూసే అవకాశం లభించింది. వివాదాల ఛాంపియన్స్ ట్రోఫీఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత పాకిస్తాన్ అభిమానులు ఒక అంతర్జాతీయ టోర్నమెంట్, అదీ ఛాంపియన్స్ ట్రోఫీ చూసేందుకు అవకాశం లభించడంతో వారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనేక వివాదాల అనంతరం పాకిస్తాన్ కి మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఆతిధ్యమిచ్చే అవకాశం లభించింది. 2017లో సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్‌ను తమ చిరకాల ప్రత్యర్థి భారత్‌పై ఫైనల్లో 180 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటి నుండి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.ఎందుకంటె భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)ల మధ్య ఈ టోర్నమెంట్ ఆడితిధ్యం హక్కులపై వివాదం నెలకొంది. ముఖ్యంగా బీసీసీఐ అధ్యక్షుడుగా వ్యవహరించిన రోజర్ బిన్నీ నేతృత్వంలోని బోర్డు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ గతంలో జట్టు ని పాకిస్తాన్‌కు పంపడానికి నిరాకరించింది. బీసీసీఐ హైబ్రిడ్ మోడల్ ని ప్రతిపాదించగా, పీసీబీ మాత్రం మొత్తం టోర్నమెంట్‌ను పాకిస్తాన్‌లోనే ఉంచాలని పట్టుదలకు పోయింది.పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కావడం, అంతే కాక 1996 ప్రపంచ కప్ తర్వాత తొలిసారి ఐసీసీ టోర్నమెంట్ ని నిర్వహించే అవకాశం రావడం ఇందుకు ప్రధాన కారణం. చివరికి పాకిస్తాన్ కొద్దిగా పట్టు సడలించింది. దీంతో పాకిస్తాన్ అభిమానుల కల నెరవేరే రోజు రానే వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్‌కి ఇది చాల ప్రత్యేకమైన రోజు!ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఎందుకు రద్దు చేసింది?ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారించిన ఐసీసీ 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు ప్రతిపాదించింది. ఐసీసీలో అసోసియేట్ దేశాలు గా గుర్తింపు పొందిన దేశాల జట్లు మాత్రమే ప్రతిష్టాత్మకమైన యాభై ఓవర్ల ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఐసీసీ అనుమతించింది.మొదటి రెండు టౌర్నమెంట్లకు ఇదే పద్ధతిని అనుసరించారు. కానీ త్వరలోనే పూర్తి సభ్య దేశాల జట్లు కూడా ఈ టోర్నమెంట్లో పాలొనడం ప్రారంభించడం తో ఇది వన్డే ప్రపంచ కప్ తర్వాత ఎలైట్ ఐసీసీ యాభై ఓవర్ల ఈవెంట్‌గా మారిపోయింది. 2006 వరకు ఛాంపియన్స్ ట్రోఫీని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు కానీ ఆ తర్వాత ఐసీసీ దీనిని వన్డే ప్రపంచ కప్ మాదిరిగానే దీన్ని నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం ప్రారంభించింది. అయితే యాభై ఓవర్ల ఫార్మాట్లో రెండు ప్రధాన టౌర్నమెంట్లను -- ప్రపంచ కప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ --- నిర్వహించడంపై దుమారం చెలరేగడంతో, ముఖ్యంగా ప్రపంచ కప్ స్థాయిలో రెండు వన్డే టౌర్నమెంట్లు నిర్వహించడం అర్ధరహితమని క్రికెట్ అభిమానులు వాదనలు వినిపించారు.మరోవైపు.. మూడు ఫార్మాట్లలోనూ మెగా టోర్నీ నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను ఐసీసీ ప్రవేశట్టింది. ఈ క్రమంలో 2017లో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను నిలిపివేసిన ఐసీసీ... 2021లో రీ ఎంట్రీపై అప్డేట్ ఇచ్చింది. 2025లో ఈ వన్డే ఫార్మాట్ టోర్నీని నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే ఈ టోర్నమెంట్ వేదిక కోసం పాకిస్తాన్ పట్టుబడటం, ఉగ్రవాద ముప్పు దృష్ట్యా ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో మళ్ళీ ఛాంపియన్ ట్రోఫీ ఆతిధ్యం పై వివాదం చెలరేగింది.తటస్థ వేదికైన యూఏఈలోఈ టోర్నమెంట్ నిర్వహణ పై అనుమానాలు కూడా తలెత్తాయి. ఈ టోర్నమెంట్ పాకిస్తాన్ నుంచి వేరే దేశానికీ మార్చాలని కూడా భావించారు. అయితే గత సంవత్సరం నవంబర్ లో బీసీసీఐ, పీసీబీ అధికారుల మధ్య ఐసీసీ ఒక సమావేశం నిర్వహించింది. భారత్ మ్యాచ్‌లను తటస్థ దేశమైన యూఏఈలో నిర్వహించేందుకు చివరికి అంగీకారం కుదరడంతో మళ్ళీ ఈ టోర్నమెంట్ నిర్వహణకు అడ్డంకులన్నీ తొలిగిపోయాయి.చదవండి: భారత తుదిజట్టులో బుమ్రా స్థానంలో అతడే సరైనోడు: రిక్కీ పాంటింగ్ -
ఏ జట్టునైనా ఓడిస్తాం.. చాంపియన్స్ ట్రోఫీ మాదే: బంగ్లాదేశ్ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో(Nazmul Hossain Shanto) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమదైన రోజున ఎంతటి పటిష్ట జట్టునైనా ఓడించగల సత్తా తమ జట్టుకు ఉందని పేర్కొన్నాడు. తమకు గతంలో నాణ్యమైన పేసర్లు, మణికట్టు స్పిన్నర్లు లేరని.. అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నాడు.తొలుత టీమిండియాతోఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల బౌలర్లు, బ్యాటర్లు జట్టులో పుష్కలంగా ఉన్నారని షాంటో సహచర ఆటగాళ్లను కొనియాడాడు. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్(Pakistan)- దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బంగ్లాదేశ్ ఫిబ్రవరి 20న దుబాయ్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో రంగంలోకి దిగనుంది.అనంతరం ఫిబ్రవరి 24న రావల్పిండిలో న్యూజిలాండ్‌తో, ఫిబ్రవరి 27న అదే వేదికపై పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో ఐసీసీతో మాట్లాడిన కెప్టెన్ నజ్ముల్ షాంటో తమ జట్టు ఈ టోర్నీలో విజేతగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.ఏ జట్టునైనా ఓడిస్తాం.. చాంపియన్స్ ట్రోఫీ మాదే‘‘చాంపియన్స్‌గా నిలిచేందుకే మేము టోర్నీ ఆడేందుకు వెళ్తున్నాం. ఇందులో పాల్గొంటున్న ఎనిమిది జట్లు కూడ ఇందుకు అర్హత కలిగినవే. ప్రతి జట్టులోనూ నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. ఇక మా జట్టు సామర్థ్యాల పట్ల నాకు నమ్మకం ఉంది.ఎవరూ ఒత్తిడిగా ఫీలవ్వడం లేదు. ముందుగా చెప్పినట్లు ఈ ఈవెంట్లో ఆడే ప్రతి జట్టు విజేతగా నిలవాలని భావించడం సహజం. అయితే, మా తలరాతలో ఏముందో తెలియదు. మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కఠినంగా శ్రమిస్తున్నాం.లక్ష్యాన్ని చేరుకుంటామనే నమ్మకం ఉంది. జట్టులోని పదిహేను మంది సభ్యుల పట్ల నాకు విశ్వాసం ఉంది. మ్యాచ్‌ను ఒంటి చేత్తో మలుపు తిప్పగల సత్తా వారిలో ఉంది. గత కొంతకాలంగా మా జట్టులో నాణ్యమైన పేస్ బౌలర్లు, మణికట్టు స్పిన్నర్లు లేరనే లోటు ఉండేది.అయితే, ఇప్పుడు మా పేస్ దళం పటిష్టంగా ఉంది. మంచి స్పిన్నర్లు కూడా ఉన్నారు. మాదొక సమతూకమైన జట్టు. జట్టులోని ప్రతి సభ్యుడు తమ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారనే నమ్మకం ఉంది. మాదైన రోజున ఎంతటి పటిష్ట జట్టునైనా మేము ఓడించగలం’’ అని నజ్ముల్ షాంటో విశ్వాసం వ్యక్తం చేశాడు. నాడు సెమీస్లోకాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించగా.. బంగ్లాదేశ్ సెమీ ఫైనల్ చేరింది. అయితే, సెమీస్‌లో టీమిండియా చేతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓడి నిష్క్రమించింది. ఇక వన్డే ఫార్మాట్ టోర్నీలో నాడు ఫైనల్లో టీమిండియాపై గెలిచి పాకిస్తాన్ టైటిల్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పోటీపడుతున్నాయి.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బంగ్లాదేశ్ జట్టునజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మహమూద్ ఉల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, పర్వేజ్ హుసేన్ ఎమాన్, నాసుమ్ అహ్మద్, తాంజిమ్ హసన్ సకీబ్, నహీద్ రాణా. చదవండి: క్రెడిట్ అతడికే ఇవ్వాలి.. నా స్థానంలో ఎవరున్నా జరిగేది అదే: రోహిత్ శర్మ -
పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్.. 59 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్‌తో సిరీస్ పరాజయంతో టెస్టుల్లో పాకిస్తాన్ ర్యాంక్ మరింత దిగజారింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో పాక్ 8వ స్థానానికి పడిపోయింది. రావల్పిండి వేదికగా సొంతగడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పాకిస్తాన్ క్లీన్‌స్వీప్ అయింది. బంగ్లాదేశ్ చేతిలో సిరీస్‌ను కోల్పోవడం పాకిస్తాన్ జట్టుకు ఇదే తొలిసారి. ఒక్క టెస్టులోనూ పోరాటాన్ని కనబర్చలేకపోయిన పాక్ తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో... రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో కంగుతింది. ‘ఐసీసీ పురుషుల టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో పాక్ రెండు స్థానాలు దిగజారి 8వ ర్యాంక్‌కు పడిపోయింది’ అని ఐసీసీ వెబ్సైట్లో తెలిపింది. సిరీస్‌కు ముందు పాకిస్తాన్ ఆరో ర్యాంక్‌లో ఉంది. రెండు వరుస పరాజయాలతో వెస్టిండీస్ (7వ ర్యాంక్) కంటే దిగువ ర్యాంక్‌కు చేరింది. 1965 తర్వాత పాక్ ఇలా ర్యాంకింగ్స్‌లో దిగజారడం ఇదే తొలిసారి. అయితే పాక్‌ను వైట్‌వాష్ చేసినప్పటికీ బంగ్లాదేశ్ 9వ ర్యాంక్‌లో మార్పు లేదు. కానీ బంగ్లాదేశ్ జట్టు 13 రేటింగ్ పాయింట్లు మెరుగుపరుచుకుంది. త్వరలోనే బంగ్లాదేశ్... భారత్ పర్యటనలో రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది. ఈ నెల 19 నుంచి చెన్నైలో తొలి టెస్టు జరుగుతుంది. -
మా ఓటమికి కారణం అదే.. అందుకు నాదే బాధ్యత: పాక్ కెప్టెన్
సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. చెత్త కెప్టెన్సీ, ఆటగాళ్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం వల్లే ఈ గతి పట్టిందంటూ ఆ దేశ మాజీ క్రికెటర్లు షాన్ మసూద్ బృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి టెస్టులో మొత్తంగా పేసర్లతో దిగడం, రెండో టెస్టులో ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది, నసీం షాలను పక్కన పెట్టడం వంటి నిర్ణయాలను తప్పుపడుతున్నారు.ఓటమికి బాధ్యత నాదేజట్టు ఆట తీరు చూస్తే సరైన ప్రణాళిక, వ్యూహాలు లేకుండానే బరిలోకి దిగినట్లు కనిపించిందని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురి కావడంపై కెప్టెన్ షాన్ మసూద్ స్పందిస్తూ.. ‘‘స్వదేశంలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరాం. కానీ తీవ్ర నిరాశే మిగిలింది. ఆస్ట్రేలియాలో ఎదురైన పరాభవం నుంచి పాఠాలు నేర్చుకోలేకపోయాం.ఓటమికి బాధ్యత వహిస్తూ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా. కానీ టెస్టు క్రికెట్‌ను మరింత పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది. సుదీర్ఘ ఫార్మాట్ కోసం సిద్ధంగా లేనట్లు అనిపించింది. ఆటగాళ్లు గెలవాలనే లక్ష్యంతోనే ఆడినా... ఫలితాలు అనుకూలంగా రాలేదు. ఆ అంశాలతో సంబంధం లేదుటెస్టు ఫార్మాట్ ఆడుతున్న బౌలర్లకు తరచూ అవకాశాలు ఇవ్వాలి. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోలేకపోయాం. ఇకపై మరింత క్రమశిక్షణతో ముందుకు సాగాలనుకుంటున్నాం. లోపాలను సవరించుకోవడంపై దృష్టి పెడతాం. జట్టు ఎంపిక, డ్రెస్సింగ్ రూమ్ వంటి అంశాలతో ఫలితాలకు సంబంధం లేదు. బంగ్లాదేశ్ జట్టు మా కంటే మెరుగైన ఆటతీరు కనబర్చింది. ఈ విజయానికి వారు అర్హులు’’అని పేర్కొన్నాడు.వాళ్లిద్దరిని తప్పించడం సరైందేఇక రెండో టెస్టు నుంచి షాహిన్ ఆఫ్రిది, నసీం షాలను తప్పించిన తమ నిర్ణయాన్ని షాన్ మసూద్ సమర్థించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ఫాస్ట్ బౌలర్లపై పనిభారం ఎక్కువగా మోపడం సరికాదని పేర్కొన్నాడు. అయినా ఎల్లప్పుడూ ఒకరిద్దరు ప్లేయర్లపైనే ఆధారపడకూడదని.. మిగతా వాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నాడు. తొలిసారి బంగ్లా గెలుపుకాగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాక్ పేస్ త్రయం మీర్ హమ్జా, మొహమ్మద్ అలీ, ఖుర్రం షెహజాద్ వికెట్లు పడగొట్టినా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బంగ్లా బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్ పాక్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. పాక్‌పై బంగ్లా టెస్టుల్లో గెలుపొందడం ఇదే తొలిసారి.చదవండి: ఆ దృశ్యాలు నా కుమారుల కంటపడకూడదనుకున్నా: ద్రవిడ్ -
Pak vs Ban: పతనం దిశగా పాక్.. ఈ జట్టుకు ఏమైంది?
అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇంతకన్నా కిందికి దిగజారలేదు అనుకున్న ప్రతీసారి అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ అంతకుమించిన చెత్త ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. ఒకప్పుడు ఇమ్రాన్ ఖాన్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, ఆకీబ్ జావేద్, షోయబ్ అక్తర్ వంటి దిగ్గజ పేసర్లు... జహీర్ అబ్బాస్, జావేద్ మియాందాద్, ఇంజమాముల్ హక్, రమీజ్ రాజా, సయీద్ అన్వర్, యూనిస్ ఖాన్, మొహమ్మద్ యూసుఫ్, షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్ వంటి మేటి ఆటగాళ్లతో కళకళలాడిన ఆ జట్టు... ఇప్పుడు రెండున్నరేళ్లుగా స్వదేశంలో టెస్టు మ్యాచ్ గెలవలేక ఇబ్బంది పడుతోంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురవడం పాకిస్తాన్ జట్టు పతనావస్థను సూచిస్తోంది.రావల్పిండి: సమష్టి ప్రదర్శనతో కదంతొక్కిన బంగ్లాదేశ్ జట్టు... పాకిస్తాన్లో పాకిస్తాన్‌పై రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. గతంలో పాకిస్తాన్‌తో ఆడిన 13 మ్యాచ్‌ల్లో 12 టెస్టుల్లో ఓడిన బంగ్లాదేశ్... తాజా పర్యటనలో వరుసగా రెండు టెస్టులు నెగ్గి సొంతగడ్డపై పాకిస్తాన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా ఐదో టెస్టులో పరాజయంబంగ్లాదేశ్కు విదేశాల్లో ఇది మూడో టెస్టు సిరీస్ విజయం కాగా... వర్షం అంతరాయం మధ్య మూడున్నర రోజులే జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ స్ఫూర్తివంతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. రాజకీయ అనిశ్చితి కారణంగా దేశంలో అల్లర్లు, నిరసనలు కొనసాగుతున్న సమయంలో బంగ్లాదేశ్ జట్టు ఇలాంటి విజయం సాధించడం గమనార్హం. మరోవైపు గత కొంతకాలంగా స్వదేశంలోనూ నిలకడగా విజయాలు సాధించలేకపోతున్న పాకిస్తాన్ జట్టు... ఈ ఏడాది వరుసగా ఐదో టెస్టు మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఈ ఐదింట్లోనూ జట్టుకు సారథిగా వ్యవహరించిన షాన్ మసూద్... తొలి ఐదు టెస్టుల్లోనూ ఓటములు ఎదుర్కొన్న తొలి పాకిస్తాన్ కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.ఈ సిరీస్‌లో నమోదైన పలు ఆసక్తికర రికార్డులను పరిశీలిస్తే.. 👉బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు విదేశాల్లో ఇది మూడో టెస్టు సిరీస్ విజయం. ఇంతకుముందు 2009లో వెస్టిండీస్‌పై, 2021లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లు నెగ్గింది. 👉ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పేస్ బౌలర్లే తీయడం బంగ్లాదేశ్‌కు ఇది తొలిసారి. రెండో ఇన్నింగ్స్‌లో హసన్ మహమూద్, నహీద్ రాణా, తస్కీన్ అహ్మద్ కలిసి పాకిస్తాన్ పది వికెట్లు పడగొట్టారు. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి బంగ్లా పేసర్లు 14 వికెట్లు పడగొట్టారు. 👉ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ టాప్–6 ప్లేయర్లు 21 పరుగులకే పెవిలియన్ చేరారు. టెస్టు మ్యాచ్ నెగ్గిన సందర్భంలో తొలి ఇన్నింగ్స్‌లో మొదటి ఆరుగురు ఆటగాళ్లు చేసిన రెండో అత్యల్ప పరుగులివే. 1887లో ఆస్ట్రేలియా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఆ తర్వాత పుంజుకుని మ్యాచ్ నెగ్గింది. 👉సొంతగడ్డపై గత పది మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ జట్టు గెలుపు రుచి చూడలేదు. ఇంతకుముందు 1969–1975 మధ్య పాకిస్తాన్ జట్టు వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించలేకపోయింది. 👉షాన్ మసూద్ సారథ్యంలో ఆడిన ఐదు టెస్టుల్లోనూ పాకిస్తాన్ ఓటమి పాలైంది. గతంలో ఏడుగురు కెప్టెన్లకు తొలి ఐదు టెస్టుల్లో పరాజయాలు ఎదురయ్యాయి. ఆ జాబితాలో ఖాలెద్ మసూద్ (12 టెస్టులు; బంగ్లాదేశ్), ఖాలెద్ మహమూద్ (9 టెస్టులు; బంగ్లాదేశ్), మొహమ్మద్ అష్రఫుల్ (8 టెస్టులు; బంగ్లాదేశ్), నయీముర్ రహమాన్ (5 టెస్టులు; బంగ్లాదేశ్), గ్రేమ్ క్రీమర్ (6 టెస్టులు; జింబాబ్వే), కేన్ రూథర్‌ఫార్డ్ (5 టెస్టులు, న్యూజిలాండ్), బ్రాత్‌వైట్ (5 టెస్టులు; వెస్టిండీస్) ముందున్నారు. -
పాక్‌ను చిత్తు చేశాం.. భారత్‌తో సిరీస్‌కు సిద్ధం: బంగ్లా కెప్టెన్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్‌ను సొంతగడ్డపై ఓడించి తొలిసారి.. ఆ జట్టుపై టెస్టు సిరీస్ విజయం సాధించింది. స్వదేశంలో ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు పాక్ పర్యటన సాగుతుందా లేదోనన్న సందేహాల నడుమ.. అక్కడికి వెళ్లడమే కాదు ఏకంగా ట్రోఫీ గెలిచి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నజ్ముల్ షాంటో బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.ఆరు వికెట్ల తేడాతో ఓడించికాగా ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ 2023- 25 సీజన్లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో పది వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించిన బంగ్లాదేశ్.. మంగళవారం ముగిసిన రెండో మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది.మాటలు రావడం లేదుఈ క్రమంలో చారిత్మక విజయంపై స్పందించిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటో మాట్లాడుతూ.. ‘‘ఈ గెలుపు మాకెంతో కీలకమైనది. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. చాలా చాలా సంతోషంగా ఉంది. పాకిస్తాన్లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నాం. అందుకు తగ్గట్లుగానే జట్టులోని ప్రతి ఒక్కరు తమ పాత్రను చక్కగా పోషించి ఈ గెలుపునకు కారణమయ్యారు.మా జట్టు అద్బుతంగా ఆడింది. ముఖ్యంగా రెండో టెస్టులో మా పేసర్లు అత్యుత్తమంగా రాణించడం వల్లే అనుకున్న ఫలితం రాబట్టగలిగాం. గెలవాలన్న కసి, పట్టుదల మమ్మల్ని ఈస్థాయిలో నిలిపాయి. తదుపరి టీమిండియాతో తలపడబోతున్నాం. ఆ సిరీస్ కూడా ఎంతో ముఖ్యమైనది. టీమిండియాతో సిరీస్‌కు సిద్ధంఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో భారత్‌లో అడుగుపెడతాం. టీమిండియాతో సిరీస్‌లో ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్ అత్యంత కీలకం కానున్నారు. ఇక మిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అతడు ఐదు వికెట్లు పడగొట్టిన తీరు అద్భుతం. భారత్‌తో మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతం చేస్తాడని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. టీమిండియాతో సిరీస్‌కు ముందు పాక్‌ను క్లీన్‌స్వీప్ చేయడం తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని నజ్ముల్ షాంటో తెలిపాడు.కాగా సెప్టెంబరు 19 నుంచి రోహిత్ సేనతో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు స్కోర్లువేదిక: రావల్పిండిటాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 274 ఆలౌట్బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 262 ఆలౌట్పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 172 ఆలౌట్బంగ్లా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 185/4ఫలితం: ఆరు వికెట్ల తేడాతో పాక్‌పై బంగ్లా గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: లిటన్ దాస్ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: మెహదీ హసన్ మిరాజ్చదవండి: సొంతగడ్డపై పాకిస్తాన్‌కు ఘోర పరాభవం.. క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ -
సొంతగడ్డపై పాకిస్తాన్‌కు ఘోర పరాభవం.. క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్
సొంతగడ్డపై పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన బంగ్లాదేశ్ చేతిలో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది. పాక్ క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి. ఇవాళ (సెప్టెంబర్ 3) ముగిసిన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఐదేసిన మిరజ్ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. సైమ్ అయూబ్ (58), షాన్ మసూద్ (57), అఘా సల్మాన్ (54) అర్ద సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మిరజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. లిటన్ దాస్ వీరోచిత శతకంఅనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 26 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. లిటన్ దాస్ వీరోచితంగా పోరాడి సెంచరీ చేశాడు. దాస్‌కు మెహిది హసన్ మిరజ్ (78) సహకారం అందించాడు. ఫలితంగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 6 వికెట్లు పడగొట్టాడు.172 పరుగులకే కుప్పకూలిన పాక్తదనంతరం బంగ్లా పేసర్లు హసన్ మహమూద్ (5/43), నహిద్ రాణా (4/44), తస్కిన్ అహ్మద్ (1/40) ధాటికి పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ (20), షాన్ మసూద్ (20), బాబర్ ఆజమ్ (11), మొహమ్మద్ రిజ్వాన్ (43), అఘా సల్మాన్ (47) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించిన బంగ్లాపాక్ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. నాలుగు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో జకీర్ హసన్ 40, షద్మన్ ఇస్లాం 24, షాంటో 38, మొమినుల్ హక్ 34 పరుగులు చేసి ఔట్ కాగా.. ముష్ఫికర్ రహీం 22, షకీబ్ అల్ హసన్ 21 పరుగులతో అజేయంగా నిలిచారు. పాక్ బౌలర్లలో మీర్ హమ్జా, ఖుర్రమ్ షెహజాద్, అబ్రార్ అహ్మద్, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు. -
Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. పాక్ క్రికెటర్ చర్య వైరల్
పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు సందర్భంగా ఆసక్తికర ఘటన చేటుచేసుకుంది. పాక్ టెయిలెండర్ అబ్రార్ అహ్మద్ మైదానంలోకి పరిగెత్తుకు వచ్చిన తీరు బంగ్లా శిబిరంలో నవ్వులు పూయించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ అబ్రార్ చర్యకు స్పందించిన తీరు హైలైట్‌గా నిలిచింది. అసలేం జరిగిందంటే..తొలి టెస్టులో ఘన విజయంరెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం పాకిస్తాన్ వెళ్లిన బంగ్లాదేశ్.. తొలి టెస్టులో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. పది వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి పాక్‌పై టెస్టుల్లో విజయం సాధించింది. ఇదే జోరులో రెండో మ్యాచ్‌ను మొదలుపెట్టిన పర్యాటక జట్టు.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసి.. ఆ దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు పాక్‌ను ఆలౌట్ చేసిన బంగ్లాదేశ్.. రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే పరిమితం చేసింది.రెండో మ్యాచ్‌లోనూ అదరగొడుతూసోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా పేసర్లు హసన్ మహమూద్ ఐదు, నషీద్ రాణా నాలుగు వికెట్లతో చెలరేగి.. పాక్ బ్యాటింగ్ ఆర్డర్ వెన్నువిరిచారు. ఈ క్రమంలో.. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే క్రమంలో స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వేగంగా పరిగెత్తుకు వచ్చాడు. ఆ హడావుడిలో అతడి చేతి గ్లౌజ్ కిందపడగా.. వెంటనే దానిని తీసుకుని మరింత వేగంగా క్రీజు వైపునకు పరిగుతీశాడు.ఆలస్యమైతే అవుటే.. షకీబ్ నవ్వులుఆ సమయంలో బౌలింగ్ చేస్తున్నది మరెవరో కాదు బంగ్లా మాజీ కెప్టెన్ షకీబల్ హసన్. అబ్రార్ హడావుడికి అదే కారణం. ఏమాత్రం ఆలస్యం చేసినా టైమ్డ్ అవుట్ కింద అవుట్ అయ్యే ప్రమాదం ఉందని పసిగట్టిన అబ్రార్.. అలా పరిగెత్తగానే.. షకీబల్ నవ్వడం గమనార్హం. కాగా వన్డే ప్రపంచకప్-2023 సందర్భంగా శ్రీలంకతో మ్యాచ్ సమయంలో షకీబ్.. టైమ్డ్ అవుట్ కింద అప్పీలు చేసి ఏంజెలో మాథ్యూస్‌ను పెవిలియన్‌కు పంపిన విషయం తెలిసిందే.నాడు లంక బ్యాటర్‌కు చేదు అనుభవంఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక బ్యాటర్ అవుటైనా.. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినా అతడి స్థానంలో వచ్చే ఆటగాడు.. మూడు నిమిషాల్లోపే క్రీజులోకి వచ్చి తొలి బంతిని ఎదుర్కోవాలి. లేదంటే.. టైమ్డ్ అవుట్ రూల్ కింద అవుటైనట్లుగా ప్రకటిస్తారు. నాడు మాథ్యూస్ షకీబ్ కారణంగా ఇలా అవుటై.. ఈ చెత్త రికార్డు మూటగట్టుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అది దృష్టిలో పెట్టుకునే అబ్రార్ కూడా షకీబ్‌కు భయపడి ఉంటాడంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చదవండి: 'పాకిస్తాన్ జట్టుకు క్యాన్సర్.. ఆ నలుగురు చాలా డేంజరస్'unreal fear of abrar ahmed being get timed out when Shakib is bowling 😂Everyone remembered what happened with sir angelo Mathews 😜#PAKvBAN pic.twitter.com/bXiijoNBKb— Afrid Mahmud Rifat 🇧🇩 (@rifat0015) September 2, 2024 -
'పాకిస్తాన్ జట్టుకు క్యాన్సర్.. ఆ నలుగురు చాలా డేంజరస్'
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అతడు టెస్టుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకుని 20 నెలలు దాటింది. కనీసం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లోనైనా బాబర్ తన రిథమ్‌ను పొందుతాడని అంతా ఆశించారు. కానీ బంగ్లా సిరీస్‌లో కూడా బాబర్ తీవ్ర నిరాశపరిచాడు. రెండు టెస్టుల్లోనూ ఆజం దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో బాబర్ ఇంటాబయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ సెలెక్టర్ మహ్మద్ వసీం ఆజంను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాబర్ చాలా మొండి పట్టుదలగలవాడని, అతడితో పనిచేయడం కష్టమని వసీం చెప్పుకొచ్చాడు. కాగా 2023 వన్డే ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం తర్వాత పాక్ జట్టు అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి ఆజం తప్పుకున్నాడు. అయితే టీ20 వరల్డ్‌కప్-2024 ముందు తిరిగి మళ్లీ పాక్ వైట్‌బాల్ కెప్టెన్సీ బాధ్యతలను బాబర్ చేపట్టాడు. కానీ అక్కడ కూడా తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఘోర ప్రదర్శనతో గ్రూపు స్టేజిలోనే పాక్ ఇంటిముఖం పట్టింది."బాబర్ ఆజం ఎవరి మాట వినడు. చాలా మొండి పట్టుదలతో ఉంటాడు. జట్టులో మార్పులకు అస్సలు అంగీకరించకపోయేవాడు. జట్టు సెలక్షన్ సమయంలో కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు నా పరిమితి దాటి మరి అతడిని ఒప్పించేవాడిని" అని ఓ లోకల్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీం పేర్కొన్నాడు.పాకిస్థాన్ జట్టుకు క్యాన్సర్కొంతమంది ఆటగాళ్లు పాక్ జట్టుకు క్యాన్సర్ గడ్డలా మారారు. నలుగురు కోచ్‌లతో సంప్రదింపులు జరిపిన తర్వాత జట్టుకు నష్టం కలిగించే ఆటగాళ్ల గ్రూపును నేను గుర్తించాను. వారి పేర్లు మాత్రం నేను చెప్పాలనుకోవడం లేదు. ఆ తర్వాత వారిని జట్టు నుంచి తప్పించిడానికి నేను ప్రయత్నించాను. కానీ టీమ్ మేనేజ్మెంట్ మళ్లీ వారిని రీకాల్ చేసిందని వసీం తెలిపాడు.ఓటమి అంచుల్లో పాక్..ఇక వన్డే ప్రపంచకప్-2023లో ఘోర వైఫల్యం తర్వాత పాకిస్తాన్‌కు ఏదీ కలిసిరావడం లేదు. న్యూజిలాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లలో ఓటమి చవిచూసిన పాక్.. టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఘోరపరాభావం పొందింది. ఇప్పుడు టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి సారి బంగ్లాదేశ్‌పై సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పాక్ పడింది. బంగ్లాతో తొలి టెస్టులో పరాజయం పాలైన మసూద్ సేన.. ఇప్పుడు రెండో టెస్టులో ఓటమి అంచున నిలిచింది. బంగ్లా విజయానికి ఇంకా 143 పరుగులు మాత్రమే అవసరం. -
PAKvBAN: క్లీన్‌స్వీప్ దిశగా బంగ్లాదేశ్
రావల్పిండి: పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేసే ప్రదర్శనను వాన చినుకులు ఆటంకపరిచాయి. ఇంకా ఆఖరి రోజు ఆట మిగిలుండగా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బంగ్లా ఓపెనర్లు జకీర్ హసన్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), షాద్మన్ ఇస్లామ్ (9 బ్యాటింగ్) చక్కని ఆరంభం ఇచ్చారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 9/2తో నాలుగో రోజు సోమవారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఆట మొదలైన కొద్దిసేపటి తర్వాత ఓపెనర్ అయూబ్ (20; 3 ఫోర్లు), కెప్టెన్ షాన్ మసూద్ (28; 4 ఫోర్లు), అనుభవజు్ఞడైన బాబర్ ఆజమ్ (11; 1 ఫోర్) స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. టస్కిన్ అహ్మద్ ఓవర్లో అయూబ్ ని్రష్కమించగా, యువ సీమర్ నహిద్ రాణా... మసూద్, బాబర్‌లతో పాటు సౌద్ షకీల్ (2)ల వికెట్లను పడగొట్టాడు. దీంతో 21వ ఓవర్లలో 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రిజ్వాన్ (73 బంతుల్లో 43; 5 ఫోర్లు), సల్మాన్ ఆగా (71 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఏడో వికెట్‌కు 55 పరుగులు జోడించాక రిజ్వాన్‌ను హసన్ మహ్ముద్ అవుట్ చేయడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. హసన్, నహిద్ టెయిలెండర్ల పనిపట్టడంతో పాక్ ఆలౌటయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. రెండో టెస్టు ఆడుతున్న 24 ఏళ్ల పేసర్ హసన్ మహ్ముద్ (5/43), మూడో టెస్టు ఆడుతున్న 21 ఏళ్ల సీమర్ నహిద్ రాణా (4/44) పాక్‌ను చావుదెబ్బ కొట్టారు. 12 పరుగుల తొలిఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని బంగ్లా ముందు 185 పరుగుల లక్ష్యం ఉండగా... వర్షంతో ఆట నిలిచే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 42 పరుగులు చేసింది. ఓపెనర్లు జకీర్ హసన్, ఇస్లామ్ అజేయంగా క్రీజులో ఉన్నారు. వర్షం వల్ల నాలుగో రోజు కేవలం 50 ఓవర్ల ఆటే సాధ్యమైంది. ఇదే వేదికపై జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. -
PAK VS BAN 2nd Test: చరిత్రలో తొలిసారి ఇలా..!
రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక బంగ్లాదేశ్ విజయం దిశగా సాగుతుంది. నాలుగో రోజు ఆటలో బంగ్లా పేసర్లు పూర్తి ఆధిపత్యం చలాయించి పాక్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. ముఖ్యంగా బంగ్లా పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పాక్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశారు. ఫలితంగా పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా పేసర్లు హసన్ మహమూద్ ఐదు, నహిద్ రాణా నాలుగు, తస్కిన్ అహ్మద్ ఓ వికెట్ తీసి పాక్ పతనాన్ని శాశించారు. బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో పేసర్లే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు నేలకూల్చడం ఇదే తొలిసారి.టార్గెట్ 185సెకెండ్ ఇన్నింగ్స్‌లో పాక్ 172 పరుగులకు ఆలౌటై బంగ్లాదేశ్ ముందు 185 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. వాతావరణం అనుకూలించకపోవడంతో బంగ్లా జట్టు ఛేదనను ధాటిగా ప్రారంభించింది. నాలుగో రోజు చివరి సెషన్లో వర్షం మొదలయ్యే సమయానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా గెలవాలంటే మరో 143 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. ఆట చివరి రోజు మిగిలి ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమి నుంచి తప్పించుకోలేదు. జకీర్ హసన్ (31), షద్మాన్ ఇస్లాం (9) క్రీజ్‌లో ఉన్నారు.172 పరుగులకే కుప్పకూలిన పాక్బంగ్లా పేసర్లు హసన్ మహమూద్ (5/43), నహిద్ రాణా (4/44), తస్కిన్ అహ్మద్ (1/40) ధాటికి పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ (20), షాన్ మసూద్ (20), బాబర్ ఆజమ్ (11), మొహమ్మద్ రిజ్వాన్ (43), అఘా సల్మాన్ (47) రెండంకెల స్కోర్లు చేశారు.అంతకుముందు లిటన్ దాస్ (138) వీరోచితంగా పోరాడి శతకం చేయడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసింది. దాస్‌కు మెహిది హసన్ మిరజ్ (78) సహకారం అందించాడు. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 6 వికెట్లు పడగొట్టాడు. దీనికి ముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. సైమ్ అయూబ్ (58), షాన్ మసూద్ (57), అఘా సల్మాన్ (54) అర్ద సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మిరజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. -
Pak Vs Ban: చెలరేగిన బంగ్లా పేసర్లు.. పాక్ 172 ఆలౌట్
టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి పాకిస్తాన్‌పై విజయం సాధించిన బంగ్లాదేశ్ జట్టు... అదే జోరులో సిరీస్ చేజిక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అద్వితీయ ఆట తీరుతో రెండో టెస్టులో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా పాకిస్తాన్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌట్ చేసింది.చెలరేగిన బంగ్లా పేసర్లుబంగ్లా రైటార్మ్ పేసర్లు హసన్ మహమూద్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నషీద్ రాణా 4 వికెట్లు కూల్చాడు. మరో కుడిచేతి వాటం పేసర్ టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పాక్ బ్యాటర్లలో ఎనిమిదో స్థానంలో వచ్చిన ఆఘా సల్మాన్ 47 పరుగులతో అజేయంగా ఉండటంతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ షాన్ మసూద్ 28, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 43 పరుగులతో రాణించారు. మిగతా వాళ్లంతా కనీసం ఇరవై పరుగుల మార్కు దాటలేక చతికిలపడ్డారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేసిన బంగ్లాదేశ్.. టీ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ విజయానికి 148 పరుగుల దూరంలో నిలిచింది.లిటన్ దాస్ వీరోచిత ఇన్నింగ్స్కాగా పాకిస్తాన్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 78.4 ఓవర్లలో 262 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఓవర్‌నైట్ స్కోరు 10/0తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్. పాకిస్తాన్ పేసర్ల ధాటికి 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్‌ను లిటన్ దాస్ ఆదుకున్నాడు. ఎదురుదాడితో వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. మెహదీ హసన్ మిరాజ్‌తో కలిసి చక్కటి భాగస్వామ్యం నమోదు చేసి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. లిటన్ దాస్ 228 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 138 పరుగులు చేసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ దాటిగా పరుగులు రాబట్టాడు. అతడికి ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ (124 బతుల్లో 78; 12 ఫోర్లు, ఒక సిక్సర్) చక్కటి సహకారం అందించాడు. ఖుర్రమ్ షెహజాద్‌కు 6 వికెట్లువీరిద్దరూ ఏడో వికెట్‌కు 165 పరుగులు జోడించడంతో బంగ్లాదేశ్ మెరుగైన స్కోరు చేయగలిగింది. కెప్టెన్ నజ్ముల్ షాంటో (4), మోమినుల్ హక్ (1), ముష్ఫికర్ రహీమ్ (3), షకీబ్ అల్ హసన్ (2), జాకీర్ హసన్ (1), షాద్మన్ ఇస్లామ్ (10) విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో ఖుర్రమ్ షెహజాద్ 6, మీర్ హమ్జా, సల్మాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 9 పరుగులు చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (3), నైట్ వాచ్‌మన్ ఖుర్రం షెహజాద్ (0) అవుటయ్యారు. గెలిస్తే సరికొత్త చరిత్రబంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 2 వికెట్లు పడగొట్టాడు. చేతిలో 8 వికెట్లు ఉన్న పాకిస్తాన్ ఓవరాల్‌గా 21 పరుగుల ఆధిక్యంలో సంపాదించింది. అయితే, సోమవారం నాటి ఆటలో భాగంగా బంగ్లాదేశ్.. ఆతిథ్య పాక్‌కు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవనీయలేదు. 172 పరుగులకే ఆలౌట్ చేసి మరోసారి షాకిచ్చింది.ఇక వర్షం కారణంగా పాక్-బంగ్లా తొలిరోజు(శుక్రవారం) ఆట తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా పాకిస్తాన్ సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో అనూహ్య రీతిలో తొలి టెస్టులో గెలుపొందిన బంగ్లాదేశ్.. రావల్పిండి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.కాగా పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులు స్కోరు చేసింది. -
'బాబర్ నీ పని అయిపోయింది.. వెళ్లి జింబాబ్వేలో ఆడుకో'
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పేలవ ఫామ్ కొనసాగుతోంది. రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బాబర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసిన ఆజం.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులో వచ్చిన బాబార్ మరోసారి నిరాశపరిచాడు. చెత్త షాట్ ఆడుతూ స్లిప్‌లో దొరికిపోయాడు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన పేసర్ నహిద్ రానా తొలి బంతిని బాబర్‌కు బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలవరీగా ఆఫ్ సైడ్ సంధించాడు. అయితే బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన ఆజం.. స్లిప్‌లో షాద్మాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.Babar Retirement when??#PAKvsBAN #BabarAzam𓃵 pic.twitter.com/4d7urxWNA2— 𝚃 𝚊 𝚋 𝚒 𝚜 𝚑 (@AaqibMushtaqBh4) August 31, 2024 కనీసం హాఫ్ సెంచరీ కూడా..కాగా బాబర్ టెస్టుల్లో హాఫ్ సెంచరీ మార్క్ దాటడానికి తెగ కష్టపడుతున్నాడు. ఆజం టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించి దాదాపు 20 నెలలు దాటింది. అతడు చివరగా డిసెంబర్ 2022లో న్యూజిలాండ్‌పై 161 పరుగులు చేశాడు. అప్పటి నుంచి హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోతున్నాడు. జనవరి 2023 నుంచి ఇప్పటివరకు 16 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన ఆజం.. 21.33 సగటుతో కేవలం 331 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో బాబర్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. వెళ్లి జింబాబ్వేలో ఆడుకో అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.पिछली 16 टेस्ट पारियों में एक भी अर्द्धशतक नहीं है। तुलना विराट कोहली से की जाती है। इस देश के साथ ही इस खिलाड़ी का बुरा दौर चल रहा...#PAKvsBAN#PakistanCricket #BabarAzam𓃵 #PAKvBAN pic.twitter.com/JxJjQufSsx— RITESH SINGH (@RITESHK61848792) September 2, 2024 -
బాబర్ ఆజం కథ ముగిసినట్టేనా.. 20 నెలల నుంచి నిరీక్షణ?
బాబర్ ఆజం.. పాకిస్తాన్‌కే కాదు వరల్డ్ క్రికెటలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరుగాంచాడు. కెప్టెన్సీతో పాటు తన క్లాసిక్ ఇన్నింగ్స్‌లతో పాక్‌కు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. బాబర్ క్రీజులో ఉన్నాడంటే పాక్ డగౌట్లో కొండంత బలం. టీ20ల్లో కాస్త స్లోగా ఆడుతాడని పేరు ఉన్నప్పటకి మిగితా రెండు ఫార్మాట్లలో తనకు తిరుగులేదని బాబర్ ఎప్పుడో నిరూపించుకున్నాడు. కానీ ఇదింతా ఒకప్పుడు. గత కొంత కాలంగా బాబర్ బ్యాట్ ముగిబోయింది.ఒకనొక దశలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో పోటీ పడిన ఈ పాకిస్తానీ క్రికెటర్‌కు ఇప్పుడు ఏమైంది. కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను కూడా అందుకోవడానికి తెగ కష్టపడతున్నాడు. ముఖ్యంగా తన ఫేవరేట్ టెస్టు క్రికెట్లో కూడా బాబర్ తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు.బాబర్‌కు ఏమైంది?స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో బాబర్ మరోసారి నిరాశపరిచాడు. తొలి టెస్టులో కేవలం 22 పరుగులు మాత్రమే చేసిన ఆజం.. ఇప్పుడు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా విఫలమయ్యాడు. కేవలం 31 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. స్పిన్నర్లకు అద్బుతంగా ఆడుతాడని పేరు గాంచిన బాబర్.. అదే స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నాడు. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. క్రీజులో ఉన్నంత సమయం తీవ్ర ఒత్తిడితో బ్యాటింగ్ చేశాడు. ఆఖరికి షకీబ్ బౌలింగ్‌లో బాబర్ ఇన్నింగ్స్ ముగిసింది.చివరి హాఫ్ సెంచరీ ఎప్పుడంటే?బాబర్ ఆజం టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించి దాదాపు 20 నెలలు దాటింది. అతడు చివరగా డిసెంబర్ 2022లో న్యూజిలాండ్‌పై 161 పరుగులు చేశాడు. అప్పటి నుంచి హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోతున్నాడు. గత 20 నెలలలో టెస్టుల్లో అతడు సాధించిన అత్యధిక స్కోర్ 41 పరుగులే కావడం గమనార్హం. జనవరి 2023 నుంచి ఇప్పటివరకు 15 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన ఆజం.. 21.33 సగటుతో కేవలం 320 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా బాబర్ తన మార్క్‌ను చూపిస్తాడో లేదో వేచి చూడాలి. -
PAK Vs BAN: రాణించిన బంగ్లా బౌలర్లు.. పాకిస్తాన్ 274 ఆలౌట్
టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి బంగ్లాదేశ్ చేతిలో ఓడిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు... రెండో టెస్టులోనూ భారీ స్కోరు చేయలేకపోయింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోగా.. శనివారం రెండో రోజు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 85.1 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ షాన్ మసూద్ (69 బంతుల్లో 57; 2 ఫోర్లు), అయూబ్ (110 బంతుల్లో 58; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆగా సల్మాన్ (95 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలతో రాణించగా... బాబర్ ఆజమ్ (31), మొహమ్మద్ రిజ్వాన్ (29) ఫర్వాలేదనిపించారు. బంగ్లాదేశ్ పేలవ ఫీల్డింగ్ కారణంగా అందివచ్చిన అవకాశాలను కూడా పాక్ ఉపయోగించుకోలేకపోయింది. బంగ్లా ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేయడం విశేషం. బంగ్లాదేశ్ బౌలర్లలో ఆఫ్‌స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ 5 వికెట్లతో అదరగొట్టగా.. తస్కీన్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్... ఆట ముగిసే సమయానికి రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. ఓపెనర్లు షాద్మన్ ఇస్లామ్ (6 బ్యాటింగ్), జాకీర్ హసన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.ఇన్నింగ్స్ తొలి బంతికే షాద్మన్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను స్లిప్‌లో షకీల్ వదిలేయడంతో బంగ్లాకు నష్టం జరగలేదు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రావల్పిండిలోనే జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్‌పై 10 వికెట్ల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ 1–0తో ఆధిక్యంలో ఉంది. -
Pak vs Ban: షాహిన్ ఆఫ్రిదిపై వేటు వేయడానికి కారణం అదే!
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాన పేసర్ షాహిన్ షా ఆఫ్రిదిపై వేటు పడటం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. కెప్టెన్ షాన్ మసూద్‌తో దురుసుగా ప్రవర్తించడం సహా డ్రెసింగ్‌రూంలో వాతావరణం దెబ్బతీసినందుకే అతడిని జట్టు నుంచి తప్పించారనే వదంతులు వస్తున్నాయి. కాగా తొలి టెస్టులో ఘోర ఓటమి అనంతరం.. షాన్ మసూద్- షాహిన్ ఆఫ్రిది మధ్య సఖ్యత లోపించినట్లుగా ఉన్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.కొట్టుకునే దాకావెళ్లిన ఆటగాళ్లుషాహిన్ భుజంపై మసూద్ చేయి వేయగా.. అతడు విసురుగా తీసివేసిన దృశ్యాలు అనుమానాలకు తావిచ్చాయి. అయితే, ఆ తర్వాత మసూద్‌తో షాహిన్ గొడవపడ్డాడని.. ఇద్దరూ కొట్టుకునే దాకావెళ్లగా.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మధ్యలోకి రాగా.. అతడి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల్లో భాగంగానే ఆఫ్రిదిపై వేటు వేసినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే, మరోవైపు ఫామ్‌లేమి కారణంగానే షాహిన్ ఆఫ్రిది జట్టు నుంచి తప్పించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఘోర పరాజయం నేపథ్యంలోకాగా సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులో నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు... టెస్టుల్లో తొలిసారి బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. టెస్టు చరిత్రలో తొలిసారిగా బంగ్లా చేతిలో ఓటమిని చవిచూసింది. ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తగా... లెఫ్టార్మ్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిదిని రెండో టెస్టు జట్టు నుంచి తప్పించింది. రావల్పిండి వేదికగా శుక్రవారం నుంచి ఆఖరి మ్యాచ్ ప్రారంభం కానుండగా... ఈసారి ఒక పేసర్‌ను తగ్గించుకొని అతడి స్థానంలో స్పిన్నర్‌తో బరిలోకి దిగాలని పాకిస్తాన్ జట్టు యాజమాన్యం నిర్ణయించింది. కోచ్ చెప్పిందిదేఈ నేపథ్యంలో పాకిస్తాన్ హెడ్ కోచ్ జేసన్ గిలెస్పీ మాట్లాడుతూ.. షాహీన్ షా భార్య ఇటీవల మగబిడ్డకు జన్మనివ్వగా... కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఈ విరామం అతడికి ఉపయోగ పడుతుందనిఅన్నాడు. ‘షాహిన్‌తో చర్చించాం. పరిస్థితి అర్థం చేసుకున్నాడు. అత్యుత్తమ కూర్పుతో బరిలోకి దిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని గెలెస్పీ పేర్కొన్నాడు. అయితే, సహచర ఆటగాళ్ల పట్ల షాహిన్ దుందుడుకు వైఖరే ఇందుకు కారణమని తెలుస్తోంది.చదవండి: లక్షల కోట్లకు వారసుడు.. అత్యంత సంపన్న భారత క్రికెటర్ ఇతడే! -
బంగ్లాతో రెండో టెస్టు.. షాహీన్ అఫ్రిది దూరం! అతడికి ఛాన్స్?
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. ఇప్పుడు రావల్పండి వేదికగా జరగనున్న రెండో టెస్టుకు సిద్దమవుతోంది. శుక్రవారం(ఆగస్టు 30) నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పాక్ భావిస్తోంది. ఈ క్రమంలో రెండో టెస్టుకు 12 మంది సభ్యులతో కూడా ప్రిలిమనరీ జట్టును పాకిస్తాన్ టీమ్ మెనెజ్‌మెంట్ ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది దూరమయ్యాడు. ఇటీవలే అఫ్రిది భార్య అన్షూ పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో అతడికి పాక్ జట్టు మెనెజ్‌మెంట్ పితృత్వ సెలవు మంజారు చేసింది. ఇక అతడి స్ధానంలో స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు. అతడితో పాటు ఈ 12 మంది సభ్యుల జట్టులో పేసర్ మీర్ హమ్జాకు కూడా చోటు దక్కింది. అయితే మీర్ హమ్జా బెంచ్‌కే పరిమిత మయ్యే అవకాశముంది. అర్బర్ ఆహ్మద్‌కు ప్లేయింగ్‌లో ఎలెవన్‌లో చోటు దక్కడం దాదాపు ఖాయమైనట్లే. ఎందుకంటే తొలి టెస్టులో చేసిన తప్పిదాన్ని ఇప్పుడు మళ్లీ పునరావృతం చేయకూడదని పాక్ భావిస్తోంది. మొదటి టెస్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే పాకిస్తాన్ బరిలోకి దిగింది. అందుకు ఆతిథ్య జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. దీంతో పాకిస్తాన్ హెడ్‌కోచ్ గిల్లెస్పీ మరోసారి అటువంటి ఘోర తప్పిదం చేయకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది."రావల్పిండి పిచ్ పరిస్థితులపై మా అంచనా ఆధారంగా 12 మంది సభ్యుల జట్టులో అబ్రార్ అహ్మద్‌కు చోటు ఇచ్చాము. అయితే మేము ఆడాల్సిన వికెట్‌ను ఇంకా పరిశీలించలేదని" గిల్లెస్పీ ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడ.బంగ్లాతో రెండో టెస్టుకు పాక్ జట్టు: అబ్దుల్లా షఫీక్, సైమ్ అయూబ్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, అబ్రార్ అహ్మద్, నసీమ్ షా, ఖుర్రం షాజాద్, మహమ్మద్ అలీ, మీర్ హమ్జా -
‘బీసీసీఐని కాపీ కొట్టండి.. మనమూ గెలుస్తాం’
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ బసిత్ అలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రెడ్‌బాల్ టోర్నీలపై దృష్టి పెట్టకుండా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. ఆటను ఎలా అభివృద్ధి చేయాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని చూసి పీసీబీ నేర్చుకోవాలని సూచించాడు. పాక్ క్రికెట్ సరైన గాడిలో పడాలంటే మూలాల నుంచి ప్రక్షాళన అవసరమని బసిత్ అలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా సొంతగడ్డపై పాకిస్తాన్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ చేతిలో తొలిసారిగా టెస్టు మ్యాచ్‌లో పాక్ ఓడిపోయింది. తొలిసారి బంగ్లా చేతిలో పాక్ ఓటమితొలి టెస్టులో ఒక్క రెగ్యులర్ స్పిన్నర్ లేకుండా ఏకంగా నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగి భారీ మూల్యం చెల్లించింది. మరోవైపు.. బంగ్లాదేశ్ ఇద్దరు ప్రధాన స్పిన్నర్లతో రంగంలోకి దిగింది. ఇక పాక్ అత్యుత్సాహంతో 6 వికెట్లకే తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా... ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బంగ్లాదేశ్ ఏకంగా 117 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. ఆట చివరి రోజు బంగ్లాదేశ్ సీనియర్ స్పిన్నర్లు షకీబ్, మెహదీ హసన్ మిరాజ్ చెలరేగిపోవడంతో పాక్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో షాన్ మసూద్ బృందం ఆట తీరు సహా పీసీబీ విధానాలపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘ఈ టెస్టు సిరీస్ తర్వాత చాంపియన్స్ కప్ అనే వన్డే టోర్నీని నిర్వహించబోతున్నారు. బీసీసీఐని చూసి కాస్త బుద్ధి తెచ్చుకోండిపీసీబీ.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులు ఏం చేసినా కాపీ కొట్టేది. మరి పొరుగు దేశం భారత్ వైపు ఒకసారి చూడవచ్చు కదా! దయచేసి వాళ్ల వ్యవస్థను కూడా కాపీ కొట్టండి. మార్పులు కూడా అవసరం లేదు. ఎందుకంటే.. కాపీ కొట్టడంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటారని తెలుసు. అందుకే వాళ్లేం చేస్తే యథాతథంగా మీరూ చేసేయండి. ఇండియాలో తదుపరి దులిప్ ట్రోఫీ మొదలుకాబోతోంది. అదేమీ టీ20 లేదా వన్డే టోర్నమెంట్ కాదు. నాలుగు రోజుల ఆట ఉండే రెడ్‌బాల్ టోర్నీ. మూలాల నుంచి క్రికెట్‌ను పటిష్టం చేయడంపై వాళ్లు దృష్టిసారించారు.అందుకే ఆ జట్టు విజయవంతమైనదిగా నిలుస్తోంది’’ అంటూ పీసీబీ యాజమాన్యాన్ని తూర్పారపడుతూనే హితవు పలికాడు. పాక్ జట్టు వరుస వైఫల్యాలుఇప్పటికైనా రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టి సారించకపోతే పాక్ జట్టు మరిన్ని పరాభవాలు చవిచూడక తప్పదని బసిత్ అలీ ఈ సందర్భంగా హెచ్చరించాడు. కాగా పాకిస్తాన్ జట్టు ఇటీవలి కాలంలో ఘోరంగా విఫలమవుతోంది. వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల్లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో... ఆటగాళ్ల ఫిట్నెస్ లేమి, సెలక్షన్ విషయంలో బంధుప్రీతి కారణంగానే ఇలా పరాజయాలు అంటూ మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. ఈ క్రమంలో పాక్ కొత్తగా మూడు దేశవాళీ టోర్నీలు ప్రవేశ్పెట్టి.. ప్రాథమిక దశ నుంచే క్రికెట్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపింది. కొత్తగా మూడు టోర్నీలుదేశవాళీ క్రికెట్ 2024- 2025లో భాగంగా చాంపియన్స్ వన్డే కప్, చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్‌క్లాస్ కప్ టోర్నీ నిర్వహిస్తామని పేర్కొంది. మరోవైపు.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు కూడా ఫిట్‌గా ఉంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలనే నిబంధన విధించిన విషయం తెలిసిందే.చదవండి: ‘రోహిత్ 59 శాతం.. విరాట్ 61 శాతం.. అయినా ఇంకెందుకు రెస్ట్?’ -
బంగ్లాతో రెండో టెస్టు.. పాక్ సంచలన స్పిన్నర్ ఎంట్రీ
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘోర ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రెండో మ్యాచ్‌కు ముందు యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కమ్రాన్ గులాంను వెనక్కి పిలిపించింది. వీళ్లిద్దరిని తిరిగి జట్టులో చేర్చింది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా పాకిస్తాన్ సొంతగడ్డపై బంగ్లాతో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా ఆగష్టు 21-25 మధ్య జరిగిన తొలి టెస్టులో అతి విశ్వాసంతో భారీ మూల్యం చెల్లించింది. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేక కేవలం పేసర్లకు ప్రాధాన్యం ఇచ్చి.. చేజేతులా ఓటమిని ఆహ్వానించింది. వారిద్దరు తిరిగి జట్టులోకి బంగ్లాదేశ్ స్పిన్ వలలో చిక్కి 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా బంగ్లా చేతిలో టెస్టు మ్యాచ్ ఓడిన పాక్ తొలి జట్టుగా షాన్ మసూద్ బృందం నిలిచింది. ఈ క్రమంలో రెండో టెస్టులో ఎలాగైనా విజయం సాధించి.. సిరీస్‌ను డ్రా చేసుకోవాలని పాక్ పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగా.. ముందుగా చెప్పినట్లుగా అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులాంను తిరిగి జట్టులోకి తీసుకుంది. వీరిలో అబ్రార్‌కు తుదిజట్టులో చోటు దాదాపుగా ఖాయం కాగా.. కమ్రాన్ విషయంలో సందిగ్దం నెలకొంది. నాలుగు వికెట్లతో మెరిసిన అబ్రార్ఇక వీరితో పాటు ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిదిని కూడా వెనక్కి పిలిపించింది పాక్ బోర్డు. ఈ మేరకు.. ‘‘ఆగష్టు 30 నుంచి సెప్టెంబరు 3 వరకు రావల్పిండి క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగనున్న రెండో టెస్టు కోసం అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులాం తిరిగి జట్టుతో చేరుతున్నారు’’ అని పీసీబీ ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా షాహిన్, ఆల్‌రౌండర్ ఆమీర్ జమాల్ కూడా జట్టుతోనే ఉండనున్నట్లు తెలిపింది.కాగా తొలి టెస్టుకు ముందు అబ్రార్‌తో పాటు కమ్రాన్‌ను విడుదల చేయగా.. బంగ్లాదేశ్-ఏ జట్టుతో పాక్ షాహిన్స్ జట్టు తరఫున అనధికారిక టెస్టు ఆడారు. ఈ మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ అబ్రార్ నాలుగు వికెట్లతో మెరవగా.. కమ్రాన్ 34 పరుగులు చేయడంతో పాటు.. ఆరు ఓవర్లపాటు బౌలింగ్ చేశాడు. కానీ వికెట్ తీయలేకపోయాడు. కాగా అబ్రార్ అహ్మద్ ఇప్పటి వరకు పాక్ తరఫున మొత్తంగా ఆడింది ఆరు టెస్టులే అయినా 38 వికెట్లు తీసి సత్తా చాటాడు.బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్ (ఫిట్నెస్ సాధిస్తేనే), అబ్రార్ అహ్మద్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, ఖుర్రం షెహజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), షాహిన్ షా ఆఫ్రిది.చదవండి: Test Rankings: దూసుకొచ్చిన బ్రూక్.. టాప్-10లో ముగ్గురు భారత స్టార్లు -
పాక్ క్రికెట్‌ను నాశనం చేశారు: పీసీబీ చీఫ్‌పై ఇమ్రాన్ ఖాన్ ఫైర్
బంగ్లాదేశ్ చేతిలో ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. టెస్టుల్లో తొలిసారి పాక్ బంగ్లాతో మ్యాచ్‌లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అది కూడా సొంతగడ్డపై ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా ఆ దేశ మాజీ క్రికెటర్ల నుంచి షాన్ మసూద్ బృందం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరాడు. అయితే, ఈ ఘోర పరాభవానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న విధానాలే కారణమంటూ చైర్మన్ మొహ్సిన్ నక్వీపై సంచలన ఆరోపణలు చేశాడు. అవినీతిలో కూరుకుపోయిన నక్వీ నేతృత్వంలోని బోర్డు పాక్ క్రికెట్‌ను భ్రష్టు పట్టిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.పాక్ క్రికెట్‌ను నాశనం చేశారు‘‘దేశ ప్రజలు టీవీలో ఆసక్తిగా చూసే ఏకైక క్రీడ క్రికెట్. కానీ ఇప్పుడు దానిని కూడా నాశనం చేస్తున్నారు. సమర్థత లేని, తమకు ప్రియమైన అధికారులను నియమించుకోవడం వల్లే పాక్ బోర్డుకు ఈ గతి పట్టింది. వాళ్ల హయాంలో తొలిసారి మన జట్టు వన్డే వరల్డ్‌కప్ టాప్-4కు చేరలేకపోయింది.టీ20 ప్రపంచకప్-2024 టాప్-8లోనూ నిలవలేకపోయింది. ఇప్పుడు ఏకంగా కనీవినీ ఎరుగని రీతిలో బంగ్లాదేశ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడి పూర్తిగా దిగజారిపోయింది. రెండున్నరేళ్ల క్రితం ఇదే జట్టు టీమిండియాను ఓడించింది కదా! మరి ఈ స్వల్ప కాలంలో అంతగా ఏం జరిగిందని.. ఇంతటి ఘోర పరాభవాలు. ఇందుకు ఎవరిని బాధ్యులను చేయాలి? దీనంతటికీ ఒకే వ్యవస్థ కారణం’’ అంటూ ఇమ్రాన్ ఖాన్ పాక్ బోర్డుపై నిప్పులు చెరిగాడు.పీసీబీ చీఫ్‌పై ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలుఅదే విధంగా.. నక్వీ దుబాయ్‌లో తన భార్య పేరు మీద ఐదు మిలియన్ డాలర్ల మేర ఆస్తులు కూడబెట్టాడని.. 2008లో అవినీతి ఆరోపణలపై విచారణ కూడా ఎదుర్కొన్నాడని ఇమ్రాన్ ఖాన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్‌కు ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించాడు. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అనే పార్టీని స్థాపించిన ఇమ్రాన్ ఖాన్.. ఎన్నికల్లో గెలిచి ప్రధాని అయ్యాడు. అయితే, అవినీతి ఆరోపణలపై అరెస్టైన ఈ మాజీ క్రికెటర్‌పై ఇతరత్రా కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం అతడు రావల్పిండి సెంట్రల్ జైలులోనే ఉన్నాడు. అక్కడి నుంచే సోషల్ మీడియా వేదికగా ఈమేరకు సందేశం పంపించాడు.పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు(ఆగష్టు 21- 25)వేదిక: రావల్పిండిటాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 448/6 డిక్లేర్డ్బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 565పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 146 ఆలౌట్బంగ్లా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 30/0ఫలితం: పాకిస్తాన్‌ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించిన బంగ్లాదేశ్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముష్ఫికర్ రహీం(191 పరుగులు).చదవండి: రిజ్వాన్ ముఖంపైకి బంతి విసిరిన షకీబ్.. ఐసీసీ చర్యలు -
WTC: పాకిస్తాన్‌కు భారీ షాకులిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో ఆరు పాయింట్లను కోల్పోయింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సోమవారం ప్రకటన విడుదల చేసింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున పాక్ జట్టుకు ఆరు పాయింట్ల మేర కోత విధిస్తున్నట్లు తెలిపింది.బంగ్లా చేతిలో పాకిస్తాన్ చిత్తుకాగా డబ్ల్యూటీసీలో భాగంగా పాకిస్తాన్ సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో అనూహ్య రీతిలో పర్యాటక జట్టు చేతిలో ఓటమిపాలైంది. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఓటమిని చేతులారా ఆహ్వానించింది. తద్వారా బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో ఓడిన తొలి పాక్ జట్టుగా షాన్ మసూద్ బృందం చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది.బంగ్లాకు సైతం ఎదురుదెబ్బఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా ఇలా బాంబు పేల్చడం గమనార్హం. బంగ్లాతో మొదటి టెస్టులో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ.. పాక్ జట్టు మ్యాచ్ ఫీజులో 30 శాతం కోతతో పాటు ఆరు పాయింట్లు కట్ చేసినట్లు ఐసీసీ పేర్కొంది. మరోవైపు.. బంగ్లాదేశ్‌కు కూడా స్లో ఓవర్ రేటు సెగ తగిలింది.ఫలితంగా నజ్ముల్ షాంటో బృందం మూడు డబ్ల్యూటీసీ పాయింట్లతో పాటు 15 శాతం మేర మ్యాచ్ ఫీజు కోల్పోయింది. అంతేగాక.. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు పనిష్మెంట్ ఇచ్చింది ఐసీసీ. పాక్ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌పైకి బంతిని విసిరినందుకు గానూ.. మ్యాచ్ ఫీజులో 10 శాతం కట్ చేసింది. అదే విధంగా.. ఐసీసీ ప్రవర్తనా నియామవళిలోని లెవల్ 1 ప్రకారం.. ఒక డిమెరిట్ పాయింట్( దురుసుగా ప్రవర్తించినందుకుగానూ) ఇచ్చింది.టాప్‌లోనే టీమిండియా.. బంగ్లా, పాక్ ఏ స్థానంలో?ఈ పరిణామాల అనంతరం డబ్ల్యూటీసీ పట్టికలో బంగ్లాదేశ్ ఏడు, పాకిస్తాన్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. మరోవైపు.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.PC: insidesportపాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు(ఆగష్టు 21- 25)టాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 448/6 డిక్లేర్డ్బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 565పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 146 ఆలౌట్బంగ్లా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 30/0ఫలితం: పాకిస్తాన్‌ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించిన బంగ్లాదేశ్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముష్ఫికర్ రహీం(191 పరుగులు).చదవండి: రిటైర్మెంట్ తర్వాత.. అభిమానులకు శుభవార్త చెప్పిన ధావన్ -
‘పాకిస్తాన్ నుంచి వెనక్కి రప్పించండి’.. బీసీబీకి నోటీసులు
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ ఆల్‌రౌండర్ జట్టు నుంచి తక్షణమే తొలగించాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కు ఓ లాయర్ లీగల్ నోటీసులు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న షకీబ్‌ను బంగ్లాదేశ్‌కు రప్పించి.. అతడిని విచారించాల్సిందిగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా షకీబ్‌పై హత్య కేసు నమోదైన విషయం తెలిసిందే.బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. గద్దె దిగిన షేక్ హసీనా ప్రభుత్వంలో 37 ఏళ్ల ఈ మాజీ కెప్టెన్ ఎంపీగా ఉన్నారు. షేక్ హసీనా ప్రభుత్వం రద్దు కావడంతో అతని ఎంపీ పదవి కూడా ఊడింది. అయితే మూక దాడులు, పేట్రేగిన ఆందోళనకారుల వల్ల అమాయకులెందరో ప్రాణాలొదిలారు.ఈ నేపథ్యంలో రఫీఖుల్ ఇస్లామ్ అనే వ్యక్తి మాజీ ప్రధాని, సహచర మంత్రులు, ఎంపీలపై కేసు పెట్టారు. ఈ నెల 7న జరిగిన హింసాత్మక ఘటనలో ఇస్లామ్ కుమారుడు రుబెల్ మృతి చెందాడు. దీంతో తన కుమారుడి మరణానికి గత ప్రభుత్వానిదే బాధ్యతని ఇస్లామ్ ఢాకాలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీన్ని స్వీకరించిన పోలీసులు ప్రధాని సహా పదుల సంఖ్యలో పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు.ఇందులో షకీబ్‌ను 28వ నిందితుడిగా చేర్చుతూ హత్య కేసు నమోదు చేశారు. నిజానికి ఈ ఆల్‌రౌండర్ ఆగస్టు 5కు ముందు, తర్వాత దేశంలో లేడు. గ్లోబల్ టీ20 లీగ్ ఆడేందుకు కెనడా వెళ్లాడు. జూలై 26 నుంచి ఆగస్టు 9 వరకు జరిగిన ఆ లీగ్‌లో ఆడి... అక్కడి నుంచి నేరుగా పాకిస్తాన్లో టెస్టు సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్ జట్టుతో జతకలిశాడు. ఆగష్టు 21న మొదలైన తొలి టెస్టులో ఆడుతున్న షకీబ్.. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కూడా పడగొట్టాడు.అయితే, తాజా సమాచారం ప్రకారం హత్య కేసులో నిందితుడిగా ఉన్న షకీబ్‌ను జాతీయ జట్టులో ఆడించవద్దని బంగ్లా సుప్రీం కోర్టు లాయర్ షాజీబ్ మహమూద్ ఆలం.. తన సహచర లాయర్ ఎండీ రఫినూర్ రహ్మాన్ తరఫున బీసీబీకి నోటీసులు పంపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.ఈ విషయం గురించి షాజీబ్ బంగ్లా మీడియాతో మాట్లాడుతూ.. ఐసీసీ నిబంధనల ప్రకారం షకీబ్‌కు జట్టులో ఉండే హక్కు లేదని నోటీసులో స్పష్టం చేసినట్లు తెలిపాడు. అయితే, అతడిని వెంటనే వెనక్కి తీసుకురావాల్సిందిగా తాము కోరలేదని.. బీసీబీ కొత్త టీమ్ ఇప్పుడే ఏర్పడిందని.. వారికి తగినంత సమయం ఇస్తామని పేర్కొన్నాడు.చదవండి: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడి రాజీనామా.. కొత్త చీఫ్‌గా మాజీ క్రికెటర్ -
పాక్‌పై సూపర్ సెంచరీ.. బంగ్లా తొలి బ్యాటర్‌గా రికార్డు
పాకిస్తాన్‌తో తొలి టెస్టులో బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం అద్భుత శతకం(191)తో అలరించాడు. ఆతిథ్య జట్టు బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి పట్టుదలగా క్రీజులో నిలబడి సెంచరీతో కదం తొక్కాడు. టెస్టుల్లో అతడికి ఇది పదకొండో సెంచరీ. అయితే, దురదృష్టవశాత్తూ డబుల్ సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.అయినప్పటికీ జట్టును మాత్రం పటిష్ట స్థితిలో నిలపగలిగాడు ముష్ఫికర్ రహీం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా బుధవారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన పర్యాటక బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పాక్ బ్యాటర్ల శతకాలుబంగ్లా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఆరు వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసిన అనంతరం ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ సయీమ్ అయూబ్(56) రాణించగా.. సౌద్ షకీల్(141), మహ్మద్ రిజ్వాన్(171 నాటౌట్) శతకాలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(93) శుభారంభం అందించాడు.అయితే, మరో ఓపెనర్ జాకిర్ హసన్(12), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ నజ్ముల్ షాంటో(16) పూర్తిగా నిరాశపరిచారు. వీరి తర్వాతి స్థానాల్లో వచ్చిన మొమినుల్ హక్(50) అర్ధ శతకం సాధించగా.. ముష్ఫికర్ రహీం విశ్వరూపం ప్రదర్శించాడు. మొత్తంగా 341 బంతులు ఎదుర్కొని 22 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 191 పరుగులు సాధించాడు.బంగ్లా తొలి బ్యాటర్‌గా రికార్డు ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో పదిహేను వేల పరుగుల మైలురాయిని దాటేశాడు ముష్ఫికర్ రహీం. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బంగ్లా బ్యాటర్‌గానూ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున 2005లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటి వరకు 80 టెస్టుల్లో 11 శతకాలు, 3 ద్విశతకాల సాయంతో 5867, 271 వన్డేల్లో 9 సెంచరీల సాయంతో 7792 రన్స్, 102 టీ20లలో 1500 పరుగులు సాధించాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. పాక్- బంగ్లా తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో భాగంగా.. ముష్ఫికర్‌తో పాటు లిటన్ దాస్(56), మెహదీ హసన్ మిరాజ్(71 బ్యాటింగ్) రాణించడంతో బంగ్లాదేశ్ పటిష్ట స్థితికి చేరుకుంది. 167.3 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 565 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల ఆధిక్యం సంపాదించింది.పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు తుదిజట్లుపాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఆఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, నసీం షా, ఖుర్రం షెహజాద్, మహ్మద్ అలీ.బంగ్లాదేశ్నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), షాద్మన్ ఇస్లాం, జాకిర్ హసన్, మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నహీద్ రాణా.Mushfiqur Rahim completes his 11th Test century, much to the delight of his teammates and fans 🇧🇩🏏#PAKvBAN | #TestOnHai pic.twitter.com/jWqAX7YVdR— Pakistan Cricket (@TheRealPCB) August 24, 2024 -
తండ్రైన స్టార్ క్రికెటర్.. టెస్టు సిరీస్ నుంచి ఔట్?
పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది తండ్రయ్యాడు. అతడి భార్య అన్షా శనివారం పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ బిడ్డకు అలీ యార్గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని అఫ్రిది కుటంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు అఫ్రిది దంపతులకు సోషల్ మీడియా వేదికగా విసెష్ చెబుతున్నారు. కాగా గతేడాది సెప్టెంబర్‌లో అన్షా అఫ్రిదిని షాహీన్ అఫ్రిది వివాహం చేసుకున్నాడు. అయితే అన్షా అఫ్రిది ఎవరో కాదు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం షాహీద్ అఫ్రిది కుమార్తే.రెండో టెస్టుకు దూరం..?కాగా షాహీన్ అఫ్రిది ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాక్ తరపున ఆడుతున్నాడు. అయితే తన భార్య బిడ్డకు జన్మనివ్వడంతో కరాచీ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు షాహీన్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. -
రావల్పిండి టెస్టు.. పాక్‌కు ధీటుగా బదులిస్తున్న బంగ్లాదేశ్
రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ గట్టి పోటీ ఇస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. 26 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాను ఆదిలోనే పేసర్ ఖుర్రం షాజాద్ దెబ్బకొట్టాడు. ఓపెనర్ జకీర్ హోస్సేన్, కెప్టెన్ శాంటోను ఔట్ చేసి బంగ్లాను బ్యాక్ ఫుట్‌లో ఉంచే ప్రయత్నం చేశాడు. కానీ షాద్మాన్ ఇస్లాం(93), మోమినుల్ హక్(50) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి పాక్ బౌలర్లకు ధీటుగా బదులిచ్చారు. షాద్మాన్, మోమినుల్ ఔటైన తర్వాత వారి బాధ్యతను లిట్టన్ దాస్, ముష్పికర్ రహీమ్ తీసుకున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా మూడో రోజు ఆటను ముగించారు. మొదటి ఇన్నింగ్స్‌లో పాక్ కంటే బంగ్లా ఇంకా 132 పరుగులు వెనకబడి ఉంది.ప్రస్తుతం క్రీజులో లిట్టన్ దాస్(52), ముష్పికర్ రహీమ్(55) పరుగులతో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఖుర్రం షాజాద్ రెండు వికెట్లు పడగొట్టగా.. నసీం షా, అయూబ్, మహ్మద్ అలీ తలా వికెట్ సాధించారు. కాగా పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 448/6 వద్ద డిక్లేర్ చేసింది. -
BAN vs PAK: పాకిస్తాన్ 448/5.. తొలి ఇన్నింగ్స్ డిక్లేర్
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ బ్యాటర్లు దుమ్ములేపారు. మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 6 వికెట్ల నష్టానికి 448 పరుగుల భారీ స్కోర్ సాధించింది.158/4 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజును ఆట ప్రారంభించిన పాక్ జట్టు అదనంగా మరో 290 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్, వైస్ కెప్టెన్ సౌద్ షకీల్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. రిజ్వాన్ 174 పరుగులతో ఆజేయంగా నిలవగా.. షకీల్ 141 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు అయూబ్(56) హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే టాపర్డర్ బ్యాటర్లు షఫీక్(2), షాన్ మసూద్(6), బాబర్ ఆజం(0) నిరాశ పరిచారు. ఇక బంగ్లా బౌలర్లలో షోర్ఫుల్ ఇస్లాం, హసన్ మహ్ముద్ తలా రెండు వికెట్లు సాధించగా.. షకీబ్, మెహదీ హసన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో షద్మాన్ ఇస్లాం(12), జాకిర్ హోస్సేన్(11) పరుగులతో ఉన్నారు. -
బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్.. సెంచరీతో కదంతొక్కిన మొహమ్మద్ రిజ్వాన్
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ వికెట్‌కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ సెంచరీతో కదంతొక్కాడు. రిజ్వాన్ తన సెంచరీ మార్కును 143 బంతుల్లో తాకాడు. రిజ్వాన్ కెరీర్లో ఇది మూడో టెస్ట్ శతకం. ప్రస్తుతం రిజ్వాన్ 147 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 75 ఓవర్లు ముగిసే సరికి పాక్ స్కోర్ 277/గా ఉంది. రిజ్వాన్‌కు జతగా క్రీజ్‌లో ఉన్న సౌద్ షకీల్ కూడా సెంచరీకి చేరువయ్యాడు. షకీల్ 182 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 92 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, పాక్ 158/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించింది. తొలి రోజు ఆటలో పాక్ అబ్దుల్లా షఫీక్ (2), సైమ్ అయూబ్ (56), షాన్ మసూద్ (6), బాబర్ ఆజమ్ (0) వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్లలో షోరీఫుల్ ఇస్తాం, హసన్ మహ్మూద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. రెండో రోజు బంగ్లాదేశ్ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో సౌద్ షకీల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. పాక్ తరఫున వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. షకీల్ 1000 పరుగుల మార్కును తాకేందుకు 20 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. 1959లో సయీద్ అహ్మద్ కూడా ఇన్నే ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగుల మైలురాయిని తాకాడు. -
PAK vs BAN 1st Test: రావల్పిండి టెస్టు.. తొలి రోజు బంగ్లాదే
రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు బంగ్లాదేశ్ పై చేయి సాధించింది. వర్షం కారణంగా మొదటి రోజు కేవలం 41 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది.తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య పాకిస్తాన్ 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు సాధించింది. క్రీజులో సౌద్ షకీల్(57), రిజ్వాన్(24) పరుగులతో ఉన్నారు. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు బంగ్లా బౌలర్లు షాకిచ్చారు.16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పాక్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో సైమ్ అయూబ్(56), సౌధ్ షకీల్ పాక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయూబ్ ఔటైన తర్వాత షకీల్, రిజ్వాన్ మరో వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్, షోర్ఫుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు పడగొట్టారు. -
అంపైర్‌పై పాక్ కెప్టెన్ సీరియస్.. ఇది ఔటా? నాటౌటా? వీడియో
రావల్పిండి వేదికగా బుధవారం (ఆగస్టు21) బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ శాంటో పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు.అయితే ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదస్పదమైంది. అంపైర్ తప్పుడు నిర్ణయానికి పాక్ కెప్టెన్ షాన్ మసూద్ బలైపోయాడని నెటిజన్లు అంపైర్‌పై మండిపడుతున్నారు.అసలేం జరిగిందంటే?టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు మంచి ఆరంభం దక్కలేదు. మూడో ఓవర్లోనే ఓపెనర్ అబ్దుల్ షఫీక్ పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్.. మరో ఓపెనర్ అయూబ్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాలని భావించాడు. కానీ మసూద్ అనుకున్నది జరగలేదు. బంగ్లా పేసర్ షోర్ఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో అనూహ్యంగా మసూద్ పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. పాక్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ వేసిన షోర్ఫుల్ ఐదో బంతిని బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అయితే మసూద్ మిడ్-ఆఫ్ వైపు డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం బ్యాట్‌కు దగ్గరగా మిస్స్ అయ్యి వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే వికెట్ కీపర్ లిట్టన్ దాస్ క్యాచ్ ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. ఈ క్రమంలో బంగ్లా కెప్టెన్ రివ్యూకు వెళ్లాడు. అయితే ఆల్ట్రాఎడ్జ్‌లో బంతి ప్యాడ్‌కు తాకిన సమయంలో స్పైక్ వచ్చినట్లు కన్పించింది. అదే సమయంలో బ్యాట్ కూడా బంతికి దగ్గరగా ఉందని భావించిన థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయాన్ని బిగ్ స్క్రీన్‌పై చూసిన మసూద్ షాక్‌కు గురయ్యాడు. అంపైర్‌పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తూ మసూద్ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎక్స్‌లో షేర్ చేసింది. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి మసూద్ ఔటయ్యాడు. Out or not out❓Shan Masood is dismissed by Shoriful Islam.#PAKvBAN | #TestOnHai pic.twitter.com/8OgkgQKHPa— Pakistan Cricket (@TheRealPCB) August 21, 2024 -
లిట్టన్ దాస్ సూపర్ క్యాచ్.. బాబర్ ఆజం సిల్వర్ డక్
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్, స్టార్ ఆటగాడు బాబర్ ఆజం తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 66 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలో తిరిగి అడుగుపెట్టిన బాబర్.. తన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు.రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజం డకౌట్‌గా వెనుదిరిగాడు. బంగ్లా పేసర్ షోరీఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో బాబర్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. రెండు బంతులు ఆడిన బాబర్ పరుగులేమి చేయకుండా సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. పాక్ ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన షోరిఫుల్ రెండో బంతిని లెగ్ స్టంప్ దిశగా బ్యాక్ లెంగ్త్ డెలివరీని ఆజంకు సంధించాడు. ఈ క్రమంలో ఆజం డౌన్ ది లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ దిశగా వెళ్లింది.ఈ క్రమంలో వికెట్ కీపర్ లిట్టన్ దాస్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. లిట్టన్ దాస్ క్యాచ్ చూసిన బాబర్ బిత్తర పోయాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లోనూ బాబర్ ఆజం దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఇప్పుడు టెస్టుల్లో కూడా అంతే. ఇక పాక్-బంగ్లా తొలి టెస్టు వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 21 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. Itna Time Intzar kiya or Babar 0 Par Out Ho gya 💔💔#BabarAzam𓃵 #PAKvsBAN pic.twitter.com/fiYsuDTH3Z— Moazam Chaudhary (@moazamch98) August 21, 2024 -
పేస్‌కు, స్పిన్‌కు మధ్య సమరం.. నేటి నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు
రావల్పిండి: పేసర్లతో పటిష్టంగా పాకిస్తాన్.. స్పిన్నర్లే ప్రధాన బలంగా బంగ్లాదేశ్.. టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య బుధవారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 13 టెస్టులు జరిగాయి. బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా టెస్టుల్లో పాక్‌ను ఓడించలేకపోయింది. ఈసారి మాత్రం గెలుపుతో చరిత్ర తిరగరాయాలని భావిస్తోంది. ఆ్రస్టేలియా చేతిలో వైట్‌వాష్‌కు గురైన పాకిస్తాన్ సొంతగడ్డపై సత్తా చాటేందుకు సిద్ధమైంది. మొదటి టెస్టు జరగనున్న రావల్పిండి పిచ్ పేస్‌తో పాటు బ్యాటింగ్‌కు సహకరించనుంది. ఇక్కడ జరిగిన గత నాలుగు టెస్టుల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. షాహీన్ షా అఫ్రీది, నసీమ్ షా, ఖుర్రం షహజాద్, మొహమ్మద్ అలీతో పాకిస్తాన్ పేస్ విభాగం దుర్బేధ్యంగా కనిపిస్తుంటే.. ప్రధాన స్పిన్నర్లు షకీబ్ అల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్‌నే బంగ్లాదేశ్ నమ్ముకుంటోంది. సుదీర్ఘ కాలంగా బంగ్లాదేశ్ జట్టులో ప్రధాన పాత్ర పోషిస్తున్న షకీబ్‌పై టీమ్ మేనేజ్మెంట్ భారీ ఆశలు పెట్టుకుంది. ‘అతడు చాన్నాళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రాజకీయ విషయాలు అతడి ఆటతీరుపై ప్రభావం చూపవు. ఈ సిరీస్‌లో అతడు ఏదైనా ప్రత్యేకంగా చేస్తాడనుకుంటున్నాం. పాకిస్తాన్ పేసర్లను ఎదుర్కోవడం అంత తేలిక కాదని తెలుసు. అయినా రాణించగలమనే నమ్మకం ఉంది’ అని బంగ్లాదేశ్ కెప్టెన్ నజు్మల్ షాంటో పేర్కొన్నాడు.ఆ్రస్టేలియా మాజీ పేసర్ జాసన్ గెలెస్పీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పాకిస్తాన్ ఆడుతున్న తొలి టెస్టు సిరీస్ ఇదే కాగా... బ్యాటింగ్‌లో బాబర్ ఆజమ్, అబ్దుల్లా షఫీఖ్, షాన్ మసూద్, సౌద్ షకీల్, మొహమ్మద్ రిజ్వాన్ కీలకం కానున్నారు. బంగ్లా తరఫున నజ్ముల్ షాంటో, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్, లిటన్ దాస్ సమష్టిగా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆట సాగే ఐదు రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. డబ్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ (36.66 పాయింట్లు) ఆరో స్థానంలో.. బంగ్లాదేశ్ (25.00 పాయింట్లు) ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. -
Pak vs Ban: పాక్ తుదిజట్టు ప్రకటన.. యువ పేసర్‌కు చోటు
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ తుదిజట్టును ప్రకటించింది. షాన్ మసూద్ సారథ్యంలోని ఈ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏకంగా నలుగురు పేసర్లకు చోటు దక్కింది. స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ సల్మాన్ అలీ ఆఘా ఒక్కడికే స్థానం ఇచ్చారు సెలక్టర్లు.కాగా ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పాక్ టెస్టు జట్టు కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టాడు షాన్ మసూద్. అయితే, ఆ టూర్ అతడికి చేదు అనుభవం మిగిల్చింది. అతడి కెప్టెన్సీలో ఆసీస్ చేతిలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. ఇక ఈ సిరీస్ తర్వాత మళ్లీ ఇప్పుడే సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడనుంది.బంగ్లాపై పైచేయి బంగ్లాతో ఇప్పటి వరకు 13 టెస్టుల్లో పన్నెండు గెలిచి ఘనమైన టెస్టు రికార్డు కలిగి ఉన్నా.. పాకిస్తాన్ ఈ సిరీస్‌లో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే బంగ్లాను క్లీన్‌స్వీప్ చేస్తే మరింత వేగంగా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ సిరీస్‌తోనే ఆస్ట్రేలియన్ జాసన్ గిల్లెస్పి పాక్ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టనున్నాడు.యువ సంచలనానికి చోటుఇక ఆగష్టు 21 నుంచి రావల్పిండి వేదికగా మొదలయ్యే తొలి టెస్టు కోసం పాకిస్తాన్ సోమవారమే తమ తుదిజట్టును ప్రకటించింది. ఓపెనర్లుగా అబ్దుల్ షఫీక్, సయీమ్ ఆయుబ్.. వన్‌డౌన్‌లో షాన్ మసూద్ ఆడనున్నారు. మాజీ కెప్టెన్ బాబర్ ఆజం నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన సౌద్ షకీల్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ ఆఘా ఆ తర్వాతి స్థానాల్లో ఆడనున్నారు.ఇక పేస్ విభాగంలో షాహిన్ ఆఫ్రిది, నసీం షా, యువ సంచలనం ఖుర్రం షెహజాద్, మొహ్మద్ అలీ బరిలోకి దిగనున్నారు. కాగా ఆసీస్‌తో సిరీస్ సందర్భంగా పాక్ తరఫున అరంగేట్రం చేసిన షెహజాద్ తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో మెరిశాడు. అయితే, ఇప్పుడే మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.ఇదిలా ఉంటే.. బంగ్లాతో రెండు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో తొలుత 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన పాక్ బోర్డు.. ఆ తర్వాత 14 మందికి తగ్గించింది. ఆమీర్ జమాల్ వెన్నునొప్పి కారణంగా దూరం కాగా.. లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులామ్‌లను బంగ్లాదేశ్-ఎ జట్టుతో బరిలోకి దించనుంది.బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ తుదిజట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, ఖుర్రం షెహజాద్, మొహ్మద్ అలీ, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, షాహీన్ షా ఆఫ్రిది.చదవండి: చాంపియన్స్ ట్రోఫీ వరకు ఇషాన్‌కు టీమిండియాలో నో ఛాన్స్! -
పాక్‌కు భారీ ఎదురు దెబ్బ.. స్టార్ ప్లేయర్ జట్టు నుంచి ఔట్
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్న స్టార్ ఆల్‌రౌండర్ అమీర్ జమీల్‌ను జట్టు నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది. బంగ్లాతో తొలి టెస్టు సమయానికి జమీల్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని భావించిన సెలక్టర్లు.. తొలుత అతడికి ప్రధాన జట్టులో చోటు కల్పించారు. కానీ అతడు ఇంకా ఫుల్ ఫిట్నెస్ సాధించకపోవడంతో పీసీబీ జట్టు నుంచి రిలీజ్ చేసింది. అతడిని లాహోర్‌లోని ఏన్సీఎలో రిపోర్ట్ చేయాలని పీసీబీ ఆదేశాలు జారీ చేసింది. “బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అమీర్ జమాల్‌ను టెస్ట్ జట్టు నుండి విడుదల చేశాము. అతడు తన ఫిట్నెస్ను తిరిగి పొందేందుకు లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా రావల్పిండి వేదికగా ఆగస్టు 21 నుంచి జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.బంగ్లాతో టెస్టులకు పాక్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, ఖుర్రం షాజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్-కీపర్), నసీమ్ షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్-కీపర్) మరియు షాహీన్ షా ఆఫ్రిది -
'అతడు పాక్ క్రికెట్‌ను నాశనం చేస్తాడు.. సెలెక్టర్లు సిగ్గుపడాలి'
బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్ అన్ని విధాల సన్నద్దమవుతోంది. రావల్పిండి వేదికగా ఆగస్టు 21 నుంచి జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టుకు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్, టాప్ ఆర్డర్ బ్యాటర్ కమ్రాన్ గులామ్‌లను జట్టు నుంచి పీసీబీ విడుదల చేసింది. వీరిద్దరూ బంగ్లాదేశ్ 'ఎ'తో ప్రారంభమయ్యే రెండవ నాలుగు రోజుల మ్యాచ్‌లో పాకిస్తాన్ షాహీన్స్ తరపున ఆడాలని పీసీబీ ఆదేశించింది. అయితే ప్రధాన జట్టుకు ఎంపికైనప్పటకి తొలి టెస్టుకు ముందు గులామ్, ఆహ్మద్‌ను విడుదల చేయడాన్ని ఆ దేశ మాజీలు తప్పుబడుతున్నారు. ఈ జాబితాలో పాక్ మాజీ పేసర్ తన్వీర్ అహ్మద్ చేరాడు. పీసీబీ సలహాదారు వకార్ యూనిస్, పాక్ సెలక్షన్ కమిటీపై అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.పాకిస్తాన్ క్రికెట్లో ఏమి జరుగుతుందో మీరు చూస్తున్నారా? బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టుకు ముందు జట్టు నుంచి అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులామ్‌లను వకార్ యూనిస్ అండ్ సెలక్షన్ కమిటీ తప్పించింది. వకార్ యూనిస్ పాక్ క్రికెట్‌ను నాశనం చేస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అబ్రార్, కమ్రాన్ గులామ్‌లను జట్టు నుండి తప్పించిన ఈ థర్డ్ క్లాస్ సెలక్షన్ కమిటీ సిగ్గుపడాలి. అబ్రార్, కమ్రాన్ గులామ్‌లను జట్టు నుండి తొలగించిన ఈ థర్డ్ క్లాస్ సెలక్షన్ కమిటీ నిజంగా సిగ్గుపడాలి. తనను తాను పెద్ద లెజెండ్‌గా చెప్పుకుంటున్న వకార్ యూనిస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆ ఇద్దరు క్రికెటర్లను ఎందుకు జట్టు నుంచి రిలీజ్ చేశారని ఎక్స్‌లో వకార్ యూనిస్ మండిపడ్డాడు. -
ఇది నిజంగా సిగ్గు చేటు.. దేశం పరువు పోతుంది: కమ్రాన్ ఆక్మల్
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్ సన్నద్దమవుతోంది. ఆగస్టు 21 నుంచి రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రెండు టెస్టు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు కరాచీలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.అయితే ఈ రెండో టెస్టుకు ప్రేక్షకులకు అనుమతించకూడదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. స్టేడియంలో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఖాళీ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో పీసీబీపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ ఆక్మల్ విమర్శల వర్షం కురిపించాడు. పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ పరువుపోతుందని ఆక్మల్ మండిపడ్డాడు."పాక్-బంగ్లాదేశ్ రెండు టెస్టు మ్యాచ్ కరాచీలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. కరాచీలో స్టేడియం నిర్మాణ పనులు జరుగుతున్నాయని మీకు ముందే తెలుసు కదా? అటువంటి అప్పుడు అక్కడ ఎందుకు షెడ్యూల్ చేశారు? ఛాంపియన్స్ ట్రోఫీ కోసం స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు.పాకిస్తాన్లో టెస్టు మ్యాచ్ ప్రేక్షకులు లేకుండా జరగడం మన దేశానికి అవమానకరం. మనకు కేవలం రెండు, మూడు స్టేడియంలు మాత్రమే లేవు. ఫైసలాబాద్ స్టేడియం కూడా ఉంది. అక్కడ కూడా మ్యాచ్‌ను నిర్వహించవచ్చు. అదొక టాప్ క్లాస్ స్టేడియం. ఇప్పటికే చాలా మ్యాచ్‌లు అక్కడ జరిగాయి. అదేవిధంగా ముల్తాన్‌లో కూడా స్టేడియం ఉంది.ముల్తాన్ స్టేడియం చాలా బాగుంటుంది. అక్కడ అన్నిరకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈ రెండు వేదికలో ఏదో ఒక స్టేడియంలో సెకెండ్ టెస్టును నిర్వహించాల్సింది. అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌ను నిర్వహించాలన్నది సరైన నిర్ణయం కాదు. ఇది నిజంగా మనకు సిగ్గు చేటు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ క్రికెట్‌కు చెడ్డ పేరును తీసుకువస్తుందని" తన యూట్యాబ్ ఛానల్లో పీసీబీపై అక్మల్ ఫైరయ్యాడు. -
బంగ్లాతో తొలి టెస్టు.. పాక్ జట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లను విడుదల చేసింది. బంగ్లాదేశ్-‘ఎ’ టీమ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడాల్సిందిగా ఆదేశించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా పాక్- బంగ్లా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనుంది.ఈ రెండు టెస్టులు ఎందుకు కీలకం?రావల్పిండి వేదికగా ఆగష్టు 21- 25, కరాచీ వేదికగా ఆగష్టు 30- సెప్టెంబరు 3 వరకు మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగుపరచుకోవాలంటే సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్ పాక్‌కు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది.ఈ నేపథ్యంలో తమ వ్యూహాల్లో భాగంగా బంగ్లాతో తొలి టెస్టులో కేవలం పేసర్లకు మాత్రమే తుదిజట్టులో చోటివ్వనుంది. ఈ క్రమంలో యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను జట్టు నుంచి రిలీజ్ చేసింది. పాకిస్తాన్ షాహిన్స్- బంగ్లాదేశ్-‘ఎ’ మధ్య ఆగష్టు 20న కరాచిలో మొదలుకానున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో ఆడాల్సిందిగా ఆదేశించింది.అందుకే అతడిని రిలీజ్ చేశాంతద్వారా అతడికి కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించనుంది. ప్రధాన సిరీస్ తొలి టెస్టులో బెంచ్‌కే పరిమితం చేసే బదులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పాక్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. అబ్రార్ అహ్మద్‌తో పాటు టాపార్డర్ బ్యాటర్ కమ్రాన్ గులాంను రిలీజ్ చేశామని.. అతడు కూడా పాకిస్తాన్ షాహిన్స్ జట్టుతో చేరనున్నట్లు తెలిపింది.అంతేకాదు.. అతడే పాకిస్తాన్ షాహిన్స్ కెప్టెన్‌గానూ వ్యవహరిస్తాడని పీసీబీ పేర్కొంది. అయితే, అబ్రార్, కమ్రాన్ బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్ ప్రధాన జట్టుతో చేరతారని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. మీర్ హంజా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, నసీం షా, సయీమ్ ఆయుబ్, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్ తదితరులు పాకిస్తాన్ షాహిన్స్(తొలి మ్యాచ్ తర్వాత)ను వీడి ఇప్పటికే బంగ్లాతో సిరీస్‌కు సన్నద్ధమవుతున్నారు.కాగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టీమిండియా టాప్‌లో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈ టేబుల్లో టాప్-2లో నిలిచిన జట్లే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే.బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సయీమ్ ఆయుబ్, మహ్మద్ హురైరా, బాబర్ ఆజమ్, అబ్దుల్లా షఫీక్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, ఆమెర్ జమాల్, మహ్మద్ రిజ్వాన్, సర్ఫరాజ్ అహ్మద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, నసీం షా, ఖుర్రమ్ షెహజాద్, షాహిన్ అఫ్రిది.బంగ్లాదేశ్- ‘ఎ’ జట్టు(రెండో మ్యాచ్)తో పోటీపడే పాకిస్తాన్ షాహిన్స్ టీమ్కమ్రాన్ గులాం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అలీ జర్యాబ్, గులాం ముదస్సర్, ఇమామ్ ఉల్ హక్, మెహ్రాన్ ముంతాజ్, మహ్మద్ అవైస్ అన్వర్, నియాజ్ ఖాన్, ఖాసిం అక్రమ్, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్), సాద్ బేగ్ (వికెట్ కీపర్), సాద్ ఖాన్, షరూన్ సిరాజ్, ఉమర్ అమీన్. -
Pak Vs Ban: పదవి పోయినా.. పాక్‌తో టెస్టు సిరీస్‌లో ఆల్‌రౌండర్!
రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు చేరుకుంది. బంగ్లాలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ ద్వైపాక్షిక సిరీస్‌పై సందిగ్దం నెలకొనగా.. తాత్కాలిక ప్రభుత్వం ఎట్టకేలకు ఇందుకు అనుమతినివ్వడంతో పాక్ గడ్డపై అడుగుపెట్టింది. అయితే, ఈ జట్టులో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) ఆ దేశ మాజీ ఎంపీ, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు కూడా చోటునివ్వడం విశేషం.అందుకే అతడికి అనుమతిఈ విషయం గురించి బీసీబీ డైరెక్టర్ ఇఫ్తికర్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘‘మా దేశ తాత్కాలిక క్రీడా శాఖ మంత్రితో మాట్లాడాము. షకీబ్‌ను జట్టులో చేర్చడానికి ఆయన ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. ప్రతిభ ఆధారంగానే జట్టు ఎంపిక ఉండాలని.. పక్షపాతం చూపకూడదని స్పష్టం చేశారు. అందుకే షకీబ్ కూడా పాక్‌తో సిరీస్ ఆడనున్న జట్టులో స్థానం సంపాదించగలిగాడు’’ అని తెలిపాడు.కాగా షేక్ హసీనా పాలనను నిరసిస్తూ బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. నిరసనకారుల భారీ ఆందోళనలకు తలొగ్గిన షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు. అయినప్పటికీ ఆందోళనకారుల ఆగ్రహ జ్వాలలు చల్లారలేదు. షేక్ హసీనాతో పాటు అవామీ లీగ్(పార్టీ)తో సంబంధం ఉన్న ప్రముఖుల ఇళ్లపైనా దాడులు చేశారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మష్రాఫే మొర్తజా ఇంటికి నిప్పు అంటించారు.అతడి అవసరం జట్టుకు ఉందిఅతడు అధికార అవామీ లీగ్ ఎంపీ( నరేల్-2 డిస్ట్రిక్ట్ పార్లమెంట్ నియోజకవర్గం) కావడమే ఇందుకు కారణం. ఈ ప్రభావం.. మరో ఎంపీ షకీబ్ అల్ హసన్‌పై కూడా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఈ ఆల్‌రౌండర్ కెరీర్ ఇక ముగిసిపోతుందని విశ్లేషకులు భావించారు. అయితే, తాత్కాలిక ప్రభుత్వంలో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న 26 ఏళ్ల ఆసిఫ్ మహమూద్ షకీబ్ ఎంపిక విషయంలో చొరవ చూపినట్లు తెలుస్తోంది.చట్ట సభ ప్రతినిధిగా అతడు ఏ పార్టీకి చెందినవాడైనా.. ఆటగాడిగా జట్టుకు అతడి అవసరం ఉంది గనుక పాక్ సిరీస్‌కు ఎంపిక చేసేందుకు అనుమతినిచ్చినట్లు బీసీబీ డైరెక్టర్ ఇఫ్తికర్ అహ్మద్ తాజాగా వెల్లడించాడు. కాగా షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్ పార్లమెంటు రద్దు నేపథ్యంలో మగురా ఎంపీగా ఉన్న షకీబ్ పదవి కోల్పోయాడు.ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అతడు లక్షా యాభై వేలకు పైగా మెజారిటీతో గెలుపొందాడు. ప్రతిపక్షం ఎన్నికలను బాయ్‌కాట్ చేసిన నేపథ్యంలో అతడికి ఏకపక్ష విజయం సాధ్యమైంది. ఇదిలా ఉంటే.. ఆగష్టు 21-25(రావల్పిండి), ఆగష్టు 30-సెప్టెంబరు 3(కరాచీ) మధ్య పాక్- బంగ్లా టెస్టు సిరీస్ జరుగనుంది.బంగ్లాదేశ్ జట్టు..నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, షద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ కుమార్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, నహిద్ రానా, షోరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, సయ్యద్ ఖలీద్ అహ్మద్పాకిస్తాన్ జట్టు..షాన్ మసూద్ (కెప్టెన్), సైమ్ అయూబ్, మహ్మద్ హురైరా, బాబర్ ఆజమ్, అబ్దుల్లా షఫీక్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, కమ్రాన్ గులామ్, ఆమెర్ జమాల్, మహ్మద్ రిజ్వాన్, సర్ఫరాజ్ అహ్మద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, నసీం షా, అబ్రార్ అహ్మద్, ఖుర్రమ్ షెహజాద్, షాహీన్ అఫ్రిది. -
పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్‌కు గోల్డెన్ బాయ్ నదీమ్..!?
ప్యారిస్ ఒలింపిక్స్ ముగిసి ఐదు రోజులు అవుతున్నప్పటకి స్వర్ణ పతక విజేత, పాకిస్తాన్ స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌పై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. 40 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌కు తొలి ఒలింపిక్ గోల్డ్‌మెడల్ అందించి ఓవర్‌నైట్ హీరోగా నదీమ్ మరిపోయాడు. అతడిని ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ సైతం ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా నదీమ్‌కు రెండో అత్యున్నత పురస్కారం.. హిలాల్ ఇంతియాజ్ అవార్డును ప్రదానం కూడా చేయనున్నారు.డ్రెస్సింగ్‌కు రూమ్ ఆహ్వానించిన గిల్లెస్పీ...ఈ క్రమంలో పాక్ టెస్టు జట్టు హెడ్ కోచ్ జాసన్ గిల్లెస్పీ గోల్డన్ బాయ్ నదీమ్‌ను తమ డ్రెస్సింగ్ రూమ్‌కు ఆహ్వానించాడు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి పాకిస్తానీ అథ్లెట్ కలవడం ద్వారా తమ క్రికెటర్లు స్ఫూర్తిని పొందుతారని గిల్లెస్పీ అభిప్రాయపడ్డాడు. కాగా పాక్ క్రికెట్ జట్టు తమ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఆగస్టు 21 నుంచి రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి టెస్టు సందర్భంగా పాక్ డ్రెస్సింగ్ రూమ్‌ను సందర్శించే అవకాశముంది."అర్షద్ నదీమ్‌ని మా డ్రెస్సింగ్ రూమ్‌కు ఆహ్వానించాం. ఒలింపిక్స్ సమయంలో మా క్రికెటర్ల అందరూ నదీమ్‌ని ఉత్సాహపరచడం నేను చూశాను. అతడు తన బంగారు పతకంతో మా డ్రెస్సింగ్ రూమ్‌ను సందర్శిస్తే ఆటగాళ్లలో మరింత పట్టుదల పెరుగుతుంది. మా క్రికెటర్లు అతడిని కచ్చితంగా ఆదర్శంగా తీసుకుంటారు" అని పీసీబీ పోడ్కాస్ట్లో గిల్లెస్పీ పేర్కొన్నాడు -
Pak vs Ban: పాక్ ఆస్ట్రేలియన్ మైండ్‌సెట్‌తో ఆడకూడదు!
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించడం ఖాయమని ఆ జట్టు మాజీ ఆటగాడు బసిత్ అలీ ధీమా వ్యక్తం చేశాడు. అన్ని విభాగాల్లోనూ బంగ్లా కంటే పాక్ ఎంతో మెరుగ్గా ఉందని.. ఒక్క వరణుడు తప్ప పర్యాటక జట్టును ఓటమిని నుంచి ఎవరూ తప్పించలేరని అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై తమకు ఎదురులేదని మరోసారి నిరూపించుకుంటామని పేర్కొన్నాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఆగష్టు 21న రావల్పిండి వేదికగా ఇరు జట్ల మద్య తొలి టెస్టు ఆరంభం కానుండగా.. ఆగష్టు 30 నుంచి రెండో టెస్టుకు కరాచీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు ఇప్పటికే పాకిస్తాన్లో అడుగుపెట్టింది.ఈ నేపథ్యంలో పాక్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్‌ను ఆ వరణుడే కాపాడాలి. వర్షం పడలేదంటే వారి ఓటమి ఖాయమే!... అసలు మా జట్టుకు వారితో అసలు పోటీ, పోలికే లేదు. బంగ్లాదేశ్ గడ్డపై ఆ జట్టును ఓడించిన ఉత్సాహంలో పాక్ జట్టు ఉంది’’ అంటూ పాక్ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశాడు.అదే విధంగా.. పాక్ టెస్టు జట్టు కొత్త కోచ్ జాసన్ గిల్లెస్పి గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆస్ట్రేలియాకు చెందిన జాసన్ గిల్లెస్పిని పాకిస్తాన్ రంగంలోకి దించింది. ఇప్పుడు మావాళ్లు ఆస్ట్రేలియన్ మైండ్‌సెట్‌తో ఆడతారో లేదో చూడాలి. ఒకవేళ గిల్లెస్పి ఇదే చేయాలని భావిస్తే మాత్రం అంతకంటే పెద్ద తప్పిదం మరొకటి ఉండదు’’ అని బసిత్ అలీ వ్యాఖ్యానించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌పై గెలిస్తే తన స్థానాన్ని మెరుగుపరచుకునే అవకాశం ఉంది. -
పాక్‌లోక్రికెట్ మ్యాచ్.. ఎంట్రీ టిక్కెట్ రూ. 15 మాత్రమే
టీ20 వరల్డ్‌కప్-2024లో ఘోర పరాభావం తర్వాత పాకిస్తాన్ తొలి సిరీస్ సిద్దమైంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాక్ తలపడనుంది. ఆగస్టు 21 నుంచి రావల్పిండి వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌ను వీక్షించేందుకు అభిమానులు స్టేడియం వస్తారో లేదన్న భయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు పట్టుకుంది. ఎందుకంటే ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. ఖాళీ స్టాండ్స్ మధ్య ఈ టీ20 లీగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. టిక్కెట్ల ధరను భారీగా తగ్గించింది. రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుకు టిక్కెట్ కనీస ధరగా పీకేఆర్ 200 (భారత కరెన్సీలో సుమారు రూ.60)గా నిర్ణయించిన పీసీసీ.. కరాచీ నేషనల్ స్టేడియంలో జరిగే రెండు టెస్టు ఎంట్రీ టిక్కెట్ పీకేఆర్ 50(భారత కరెన్సీలో రూ.15)గా ఫిక్స్ చేశారు.కాగా దశాబ్ద కాలంలో కరాచీ నేషనల్ స్టేడియంలో ఇంత తక్కువ ధరకు టిక్కెట్లను విక్రయించడం ఇదే మొదటి సారి. ఈ సిరీస్‌కు సంబంధించిన టిక్కెట్లు ఆగస్టు 13 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇక తొలి టెస్టుకు గరిష్ట టిక్కెట్ ధరగా 60,000 కాగా.. కరాచీ టెస్టు అత్యధిక టిక్కెట్ ధర 83,000గా ఉంది. ఈ టిక్కెట్లు కొనుగొలు చేసిన వారికి పీసీబీ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోంది. -
దేశంలో అల్లర్లు.. 5 రోజుల ముందే పాక్‌కు వెళ్లనున్న బంగ్లా క్రికెట్ టీమ్!
బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిస్థితులు ఇంకా చల్లారడం లేదు. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినప్పటకి అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్-పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.అయితే తాజాగా పాకిస్తాన్ క్రికెట్ వర్గాల నుంచి అభిమానులకు గుడ్‌న్యూస్ అందింది. ఇరు జట్ల మధ్య సిరీస్ యాధావిథిగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టెస్టుల సిరీస్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17న పాకిస్తాన్‌కు బంగ్లా జట్టు బయలుదేరాల్సింది. కానీ ఇప్పుడు ఐదు రోజుల ముందగానే బంగ్లా టీమ్ పాక్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఆగస్టు 12(మంగళవారం)న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు పాకిస్తాన్‌కు పయనం కానున్నట్లు ప్రముఖ క్రికెట్ బెబ్‌సైట్ క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. బంగ్లా ఆటగాళ్లకు అనుకున్నదానికంటే ఎక్కువ రోజులు ఆతిథ్యమివ్వడానికి పీసీబీ సిద్దంగా ఉన్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది. పర్యాటక జట్టు ప్రాక్టీస్ సెషన్స్ కోసం రావల్పిండిలో పీసీబీ అన్నిరకాల ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు రావల్పిండి వేదికగానే జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ పాకిస్తాన్‌కు చాలా కీలకం. ఈ క్రమంలోనే బంగ్లాతో టెస్టు సిరీస్‌పై పీసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్ మాత్రం ఇంకా తమ జట్టును ఎంపిక చేయలేదు. -
బంగ్లాతో సిరీస్‌కు పాక్ జట్టు ప్రకటన.. కెప్టెన్ అతడే
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. పదిహేడు మంది ఆటగాళ్లను ఈ సిరీస్‌కు ఎంపిక చేసినట్లు తెలిపింది. కెప్టెన్‌గా షాన్ మసూద్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సైకిల్లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరగాల్సి ఉంది.పాక్- బంగ్లా సిరీస్ నిర్వహణపై సందిగ్దంఇందుకోసం బంగ్లాదేశ్ పాక్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఆ దేశంలోని పరిస్థితుల దృష్ట్యా ఈ సిరీస్ సజావుగా సాగే అవకాశం కనిపించడం లేదు. బంగ్లాదేశ్‌లో పెను రాజకీయ సంక్షోభం నేపథ్యంలో చెలరేగిన అల్లర్లు విధ్వంసకాండకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ప్రధాని పదవికి రాజీనామా చేసి.. దేశం వీడారు షేక్ హసీనా.అయినప్పటికీ జనాగ్రహజ్వాలలు చల్లారలేదు. షేక్ హసీనాతో సత్సంబంధాలు ఉన్న ప్రముఖుల ఇళ్లకు నిప్పుపెట్టడం సహా మరికొంతమందిని కడతేర్చారు. అంతేకాదు.. ఈ అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు కూడా దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాక్- బంగ్లా సిరీస్ నిర్వహణపై సందిగ్దం నెలకొంది.ఈ క్రమంలో పాక్ బోర్డు తాము సురక్షితంగా బంగ్లా ఆటగాళ్లను తీసుకువెళ్తామని చెప్పినా.. బంగ్లా బోర్డు నుంచి స్పందన రాలేదని పీసీబీ వర్గాలు వెల్లడించాయి. అయితే, పాకిస్తాన్ మాత్రం బుధవారమే జట్టును ప్రకటించడం విశేషం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో మెరుగైన స్థానంలో నిలవాలంటే ఈ సిరీస్ తప్పనిసరికావడంతో పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది.కెప్టెన్ అతడేఇక వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత బాబర్ ఆజం కెప్టెన్సీకి రాజీనామా చేయగా.. టెస్టులకు షాన్ మసూద్ సారథిగా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు బాబర్ తిరిగి వన్డే, టీ20 పగ్గాలు చేపట్టడంతో టెస్టుల్లోనూ అతడినే పునర్నియమిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బోర్డు మాత్రం మసూద్‌నే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. సౌద్ షకీల్‌ను అతడికి డిప్యూటీగా నియమించింది.బంగ్లాతో సిరీస్ నేపథ్యంలో దాదాపు 13 నెలల విరామం తర్వాత యువ పేసర్ నసీం షా టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా పాక్- బంగ్లా జట్ల మధ్య రావల్పిండిలో తొలి టెస్టు ఆగష్టు 21- 25, కరాచీలో ఆగష్టు 30- సెప్టెంబరు 3 వరకు రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్ (ఫిట్నెస్ సాధిస్తేనే), అబ్దుల్లా షఫిక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, ఖుర్రం షెహజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), షాహీన్ షా అఫ్రిది. -
పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ డౌటే.. పీసీబీ ఆఫర్‌కు నో రిప్లై!
బంగ్లాదేశ్- పాకిస్తాన్ టెస్టు సిరీస్ నిర్వహణపై సందిగ్దం నెలకొంది. బంగ్లాలో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ జట్టు పాకిస్తాన్ పర్యటన ప్రశ్నార్థకంగా మారింది. కాగా ప్రధాని షేక్ హసీనా వెంటనే రాజీనామా చేయాలంటూ బంగ్లాదేశ్‌లో నిరసనకారుల ఆందోళనలు సోమవారం మిన్నంటాయి. దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు.ఈ క్రమంలో వారి డిమాండ్లకు తలొగ్గిన హసీనా.. తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచివెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు. అయినప్పటికీ ఇంకా పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 21 నుంచి బంగ్లా- పాక్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.రావల్పిండి వేదికగా తొలి టెస్టు ఆగష్టు 21- 25, కరాచీలో ఆగష్టు 30- సెప్టెంబరు 3 వరకు రెండో టెస్టు జరగాల్సి ఉంది. అయితే, బంగ్లాదేశ్ నుంచి విమాన ప్రయాణం అంత సురక్షితం కాదన్న వార్తల నేపథ్యంలో.. ఆటగాళ్లు పాక్ వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయం గురించి పాక్ క్రికెట్ బోర్డు వర్గాలు స్పందిస్తూ.. ‘‘బంగ్లాదేశ్ క్రికెటర్లను సురక్షితంగా ఇక్కడికి తీసుకురావడంతో పాటు.. అదనంగా మరికొన్ని రోజులు ఆతిథ్యం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పీసీబీ బంగ్లా బోర్డుకు చెప్పింది.రావల్పిండిలో వారి కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని కూడా ఆఫర్ చేసింది. కానీ ఇంత వరకు అటువైపు నుంచి స్పందన రాలేదు. బంగ్లా బోర్డు అధ్యక్షుడు కూడా దేశం విడిచి వెళ్లే పరిస్థితి ఉందని తెలిసింది. బోర్డు కార్యకలాపాలు కూడా సజావుగా సాగుతున్నట్లు కనిపించడం లేదు’’ అని పేర్కొన్నాయి. 2019-2020లో బంగ్లాదేశ్ జట్టు చివరిసారిగా పాకిస్తాన్లో పర్యటించింది.కాగా షేక్ హసీనాతో సత్సంబంధాలు కలిగి ఉన్న వారిపై కూడా నిరసనకారులు విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొర్తజా ఇంటికి ధ్వంసం చేసి.. నిప్పు అంటించారు. ఈ మాజీ పేసర్ కెరీర్ ఎదుగుదలలో హసీనా పాత్ర కూడా ఉందని సమాచారం.అదే విధంగా.. అధికార అవామీ లీగ్ పార్టీ నుంచి ఎంపీగా రెండుసార్లు(2019, 2024) గెలిచాడు కూడా! ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ వేదికగా అక్టోబరులో జరగాల్సిన మహిళా టీ20 ప్రపంచకప్-2024 నిర్వహణపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. -
పాకిస్తాన్ పర్యటనకు బంగ్లా క్రికెట్ జట్టు.. భద్రతపై బీసీబీ ఆందోళన
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టు 21 నుంచి రావాల్పండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ఆగస్టు 17న పాక్‌కు బంగ్లా క్రికెట్ జట్టు పయనం కానుంది. అయితే పాక్ టూర్ వెళ్లేముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ టూర్ కోసం ఓ భద్రతా సలహాదారుని నియమించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బీసీబీ అభ్యర్ధించింది."పాకిస్తాన్ పర్యటనకు వెళ్లే మా జట్టు భద్రతపై మేము కొద్దిపాటి ఆందోళన చెందుతున్నాము. అయితే భద్రతకు సంబంధించి పూర్తి స్థాయి భరోసా పీసీబీ నుంచి లభించడంతోనే మా జట్టు పాక్‌కు వెళ్లనుంది. ఏదమైనప్పటికి ఆటగాళ్లకు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వానిదే. ఆసియా కప్ కోసం అక్కడకు వెళ్లిన మా జట్టుకు రాష్ట్ర స్థాయి భద్రత లభించింది. పాక్‌లో పర్యటించిన ఇతర జట్లకు చేసిన భద్రతా ఏర్పాట్లపై కూడా మేము సంతృప్తిగా ఉన్నాము. అయితే భద్రతా సమస్యలకు సంబంధించి వారితో ఎల్లప్పుడూ చర్చించేందుకు ఒక సెక్యూరిటీ కన్సల్టెంట్‌ను నియమించమని పాక్ ప్రభుత్వాన్ని అభ్యర్థించామని" బీసీబీ క్రికెట్ ఆపరేషన్ చైర్మన్ జలాల్ యూనస్ పేర్కొన్నాడు. -
కోచ్‌తో గొడవ నిజమే!.. బంగ్లాతో సిరీస్‌కు షాహిన్ దూరం
పాకిస్తాన్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని టెస్టు జట్టు హెడ్ కోచ్ జేసన్ గిల్లెస్పి ధ్రువీకరించాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024కు ముందే పాక్ క్రికెట్ బోర్డు ఆఫ్రిదిని పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో బాబర్ ఆజం తిరిగి సారథిగా నియమితుడయ్యాడు.అయితే, ఈ ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. కనీసం సూపర్-8 చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ సమయంలో బాబర్‌తో పాటు కోచ్‌లతోనూ షాహిన్ ఆఫ్రిదికి గొడవలు తలెత్తాయనే వార్తలు వినిపించాయి.దీంతో పీసీబీ ఆఫ్రిదిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ పాకిస్తాన్ మీడియా కథనాలు ప్రచురించింది. బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసఫ్‌తో షాహిన్‌కు వాదన జరగడం నిజమేనని.. అయితే, ఆటలో ఇవన్నీ సహజమేనని పీసీబీ వర్గాలు పేర్కొన్నట్లు జియో న్యూస్ వెల్లడించింది.తనకు కొత్త పాఠాలు నేర్పవద్దని షాహిన్ యూసఫ్‌తో దురుసుగా ప్రవర్తించాడని.. అయితే, ఆ తర్వాత క్షమాపణలు చెప్పినట్లు తెలిపింది. ఈ వివాదం ఇంతటితో సమసిపోయిందని పేర్కొంది.అయితే, బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు షాహిన్ ఆఫ్రిది దూరం కానున్నాడన్న నేపథ్యంలో పీసీబీ చర్యలు తీసుకుంటోందని అంతా భావించారు. అయితే, కోచ్ గిల్లెస్పి ఈ వార్తలను కొట్టిపారేశాడు.షాహిన్ ఆఫ్రిది తండ్రి కాబోతున్నాడని, అందుకే ఆ సమయంలో భార్యకు దగ్గరగా ఉండాలని అతడు కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఈ కారణంగానే అతడు బంగ్లాతో సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశాడు.కాగా పాక్ దిగ్గజ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది కుమార్తె అన్షాను షాహిన్ ఆఫ్రిది గతేడాది పెళ్లాడాడు. ఈ జంట త్వరలోనే తమ తొలి సంతానానికి జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం పాకిస్తాన్‌కు వెళ్లనుంది. ఆగష్టు 21 నుంచి సెప్టెంబరు 3 వరకు ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. -
ఉత్కంఠ పోరులో విజయం.. సెమీ ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్
అండర్ 19 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బెనోని వేదికగా బంగ్లాదేశ్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో విజయం సాధించిన పాక్.. తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు 35.5 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. పాక్ విజయంలో పేసర్ ఉబైడ్ షా కీలక పాత్ర పోషించాడు. ఉబైడ్ షా 5 వికెట్లు పడగొట్టి పాక్‌ను సెమీస్‌కు చేర్చాడు. ఉబైడ్ షాతో పాటు అలీ రజా 3 వికెట్లు, జీషన్ ఒక్క వికెట్ సాధించాడు. బంగ్లా బ్యాటర్లలో మహ్మద్ షిహాబ్ జేమ్స్(26) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కూడా 40.4 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. ఆల్‌రౌండర్ అరాఫత్ మిన్హాస్(34) రాణించడంతో నామమాత్రపు స్కోరైనా పాక్ సాధించగల్గింది. బంగ్లా బౌలర్లలో షేక్ పావెజ్ జిబోన్, రోహనత్ డౌల్లా బోర్సన్ తలా 4 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మెగా టోర్నీ సెకెండ్ సెమీఫైనల్లో ఫిబ్రవరి 8న ఆస్ట్రేలియాతో పాక్ తలపడనుంది. అదే విధంగా తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, భారత్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. -
CWC 2023: పాక్ సెమీస్ చేరాలంటే ఇలా జరగాలి.. అయ్యే పనేనా..?
వన్డే ప్రపంచకప్-2023లో మినుకుమినుకుమంటూ ఉండిన పాక్ సెమీస్ ఆవకాశాలు బంగ్లాదేశ్‌పై గెలుపుతో కాస్త మెరుగయ్యాయి. బంగ్లాపై విజయానంతరం పాక్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 4 పరాజయాలతో 6 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం పాక్ సెమీస్ చేరాలంటే ఇలా జరగాలి.. ఆ జట్టు తదుపరి ఆడే రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాలి. తదుపరి మ్యాచ్‌ల్లో పాక్ ప్రత్యర్థులు న్యూజిలాండ్, ఇంగ్లండ్ కావడంతో ఇది జరిగే పనేనా అని జనాలు అనుకుంటున్నారు. పాక్.. కివీస్, ఇంగ్లండ్‌లపై భారీ విజయాలు సాధించడంతో పాటు మరిన్ని సమీకరణలు జరగాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల్లో ఏదో ఒక జట్టు ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించాల్సి ఉంటుంది. ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. సౌతాఫ్రికా, శ్రీలంకలు న్యూజిలాండ్‌ను ఓడించాల్సి ఉంటుంది. ఇది ఒకింత కష్టమే కావచ్చు. టీమిండియా.. శ్రీలంక,నెదర్లాండ్స్‌ను ఓడించాల్సి ఉంటుంది. ఇది పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. పై సమీకరణల ప్రకారం చూస్తే పాక్ సెమీస్‌కు చేరడం అంత సులువైన విషయం కాదనిపిస్తుంది. కింది మూడు జరిగినా, పాక్.. కివీస్, ఇంగ్లండ్‌లపై భారీ విజయాలు సాధించడమనేది సాధ్యపడకపోవచ్చు. కాబట్టి ప్రస్తుత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో పాక్ సెమీస్ అవకాశాలు దాదాపుగా గల్లంతే అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం భారత్, సౌతాఫ్రికాలు సెమీస్ రేసులో ముందున్న విషయం తెలిసిందే. భారత్ 6 మ్యాచ్‌ల్లో ఆరింటిలో గెలిచి టేబుల్ టాపర్‌గా ఉండగా.. సౌతాఫ్రికా 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి రెండో స్థానంలో కొనసాగుతుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు చెరి 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి. పాక్‌తో పోలిస్తే ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇంకాస్త మెరుగైన అవకాశాలు (సెమీస్) ఉన్నాయని చెప్పాలి. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించింది. సెమీస్ అవకాశాలు ఏ జట్టుకు ఎంత శాతం ఉన్నాయంటే.. భారత్ 99.9% సౌతాఫ్రికా 95% న్యూజిలాండ్ 75% ఆస్ట్రేలియా 74% ఆఫ్ఘనిస్తాన్ 31% పాకిస్తాన్ 13% శ్రీలంక 6% నెదర్లాండ్స్ 5.8% ఇంగ్లండ్ 0.3% బంగ్లాదేశ్ 0% -
అతడు అద్భుతం.. క్రెడిట్ మొత్తం వాళ్లకే.. ఆ రెండు మ్యాచ్‌లు గెలుస్తాం: బాబర్
WC 2023 Ban Vs Pak: Babar Azam Credits to the boys: ‘‘మా ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించారు. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్.. ఇలా మూడు విభాగాల్లోనూ అదరగొట్టారు. ఈ క్రెడిట్ మొత్తం వాళ్లకే దక్కుతుంది. ఫఖర్ జమాన్ గనుక 20-30 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు. తనదైన శైలిలో ఆటను మరో స్థాయికి తీసుకువెళ్లాడు. తనను ఇలా చూడటం సంతోషంగా ఉంది. తదుపరి రెండు మ్యాచ్‌లు కూడా గెలిచేందుకు మేము శాయశక్తులా కృషి చేస్తాం. అప్పుడు మేము ఎక్కడిదాకా చేరుకుంటామో చూద్దాం! ఈరోజు షాహిన్ మాకు అద్భుత ఆరంభం అందించాడు. నిజానికి బంగ్లా ఇన్నింగ్స్‌లో 15-20 ఓవర్ల మధ్యలో వాళ్లు మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఆ సమయంలో మా ప్రధాన బౌలర్లు వాళ్లను విడగొట్టడంలో సఫలమయ్యారు. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టగలిగారు’’ అంటూ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం హర్షం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌పై పాక్ విజయం ఈడెన్ గార్డెన్స్‌లో తమకు మద్దతుగా నిలిచినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా కోల్‌కతాలో మంగళవారం నాటి మ్యాచ్‌లో పాక్.. బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుని సెమీస్ రేసులో ఇంకా తాము ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది. మరోవైపు.. బాబర్ ఆజం బృందం చేతిలో ఓడిన బంగ్లాదేశ్ అధికారికంగా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. అతడు అద్భుతం ఈ నేపథ్యంలో వరుసగా నాలుగు ఓటముల తర్వాత దక్కిన విజయంపై స్పందించిన బాబర్ ఆజం సంతోషం వ్యక్తం చేశాడు. కోల్‌కతా ప్రేక్షకులు తమకు అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్‌పై బాబర్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా తమ పేసర్ షాహిన్ ఆఫ్రిది ఆరంభంలోనే బంగ్లాను దెబ్బకొట్టగా.. అంతా కలిసి సమిష్టిగా బంగ్లాదేశ్‌ను ఓడించగలిగామని తమ ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ఆరంభ మ్యాచ్‌లలో విఫలమైన ఫఖర్ జమాన్ బంగ్లాతో మ్యాచ్‌లో అద్భుత అర్ధ శతకంతో పాక్‌కు విజయాన్ని అందించడం విశేషం. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఈ టోర్నీలో పాక్ తదుపరి న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో తలపడనుంది. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు ►వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా ►టాస్: బంగ్లాదేశ్- బ్యాటింగ్ ►బంగ్లాదేశ్ స్కోరు: 204 (45.1) ►పాకిస్తాన్ స్కోరు: 205/3 (32.3) ►ఫలితం: బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో పాక్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఫఖర్ జమాన్(74 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 81 పరుగులు). చదవండి: Virat Kohli: అల్లుడు కాదు!.. కోహ్లినే నా ఫేవరెట్ అంటున్న బాలీవుడ్ స్టార్! ఎందుకంటే.. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఎట్టకేలకు పాకిస్తాన్ ఓటములకు బ్రేక్.. వరల్డ్‌కప్ రేసు నుంచి బంగ్లా అవుట్
ICC Cricket World Cup 2023 Ban Vs Pak: వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ పరాజయాల పరంపరకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడింది. కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆజం బృందం ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా వరుస ఓటములకు ముగింపు పలికి సెమీస్ రేసు నుంచి తాము పూర్తిగా నిష్క్రమించలేదని చాటిచెప్పింది. వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్ మరోవైపు.. పాక్ చేతిలో ఓటమితో బంగ్లాదేశ్ ప్రపంచకప్ ఈవెంట్ సెమీస్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్ పేసర్ల విజృంభణతో ఆది నుంచే ఎదురుదెబ్బలు తిన్న షకీబ్ అల్ హసన్ బృందం నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. View this post on Instagram A post shared by ICC (@icc) పాక్ పేసర్ల దెబ్బకు పెవిలియన్‌కు క్యూ బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ లిటన్ దాస్(45), కెప్టెన్ షకీబ్ అల్ హసన్(43), మెహదీ హసన్ మిరాజ్(25) పర్వాలేదనిపించగా.. మహ్మదుల్లా అర్ధ శతకం(56)తో ఆకట్టుకున్నాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది 3, హ్యారిస్ రవూఫ్ రెండు, మహ్మద్ వసీం జూనియర్‌కు మూడు వికెట్లు దక్కగా.. స్పిన్ బౌలర్లు ఇఫ్తికర్ అహ్మద్, ఉసామా మిర్ చెరో వికెట్ తీశారు. View this post on Instagram A post shared by ICC (@icc) అదరగొట్టిన పాక్ ఓపెనర్లు ఇక బంగ్లా విధించిన స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దూకుడు కనబరిచిన పాకిస్తాన్ 32.3 ఓవర్లనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు అబ్దుల్లా షషీక్(68), ఫఖర్ జమాన్(81) హాఫ్ సెంచరీలతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. బాబర్ నిరాశపరిచినా.. రిజ్వాన్ పూర్తి చేశాడు అయితే, కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్(26), ఇఫ్తికర్ అహ్మద్(17) ఆఖరి వరకు అజేయంగా నిలిచి పాకిస్తాన్‌ను విజయతీరాలకు చేర్చారు. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ మ్యాచ్‌లో 74 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసిన ఫఖర్ జమాన్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక బంగ్లాపై గెలుపుతో పాకిస్తాన్ ఈ మెగా టోర్నీలో మూడో విజయం నమోదు చేసింది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో మూడు గెలిచి ఆరు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: చరిత్ర సృష్టించిన షాహిన్ ఆఫ్రిది.. తొలి బౌలర్‌గా రికార్డు
ICC WC 2023- Ban Vs Pak: భారత్ వేదికగా వరల్డ్‌కప్-2023 సందర్భంగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో పాక్ తరఫున అరుదైన ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బాబర్ ఆజం బృందం మంగళవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్లోనే వికెట్ ఈ క్రమంలో బౌలింగ్ అటాక్ ఆరంభించిన పాక్ స్పీడ్‌స్టర్ షాహిన్ ఆఫ్రిది తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టాడు. మొదటి ఓవర్ ఐదో బంతికి బంగ్లాదేశ్ ఓపెనర్ తాంజిద్ హసన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో ఆఫ్రిది సంధించిన బంతి వికెట్లను హిట్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపించడంతో తాంజిద్ వెనుదిరగతప్పలేదు. సక్లెయిన్ ముస్తాన్ దీంతో పాకిస్తాన్‌కు తొలి వికెట్ దక్కగా.. షాహిన్ ఆఫ్రిది తన అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 100 వికెట్ల మైలురాయికి చేరుకున్నాడు. ఈ క్రమంలో పాక్ బౌలర్లలో ఇంత వరకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. తక్కువ మ్యాచ్‌లలోనే వంద వికెట్లు పడగొట్టిన పాక్ తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. అదే విధంగా ఓవరాల్‌గా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ వన్డేల్లో వేగవంతంగా(మ్యాచ్‌ల పరంగా) వంద వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్లు వీరే.. ►సందీప్ లమిచానే(నేపాల్)- 42 మ్యాచ్‌లలో ►రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్)- 44 మ్యాచ్‌లలో ►షాహిన్ ఆఫ్రిది(పాకిస్తాన్)- 51 మ్యాచ్‌లలో ►మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)- 52 మ్యాచ్‌లలో ►సక్లెయిన్ ముస్తాక్(పాకిస్తాన్)- 53 మ్యాచ్‌లలో. చదవండి: టీమిండియా ఇక చాలు! దిష్టి తగులుతుంది.. ఆ గండం గట్టెక్కితే! వరల్డ్ రికార్డు మనదే View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: పాక్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 31) పాకిస్తాన్-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం పాక్ మూడు మార్పులు చేయగా.. బంగ్లాదేశ్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. బంగ్లాదేశ్: తంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హోస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్ (వికెట్‌కీపర్), మహ్మదుల్లా, మెహిది హసన్ మిరాజ్, తౌమిద్ హ్రిదోయ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఫకర్ జమాన్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), సౌద్ షకీల్, అఘా సల్మాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఉసామా మిర్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, హారీస్ రౌఫ్ -
ప్రపంచకప్‌లో నేడు మరో ఆసక్తికర సమరం
వన్డే ప్రపంచకప్ 2023లో ఇవాళ (అక్టోబర్ 31) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత ఎడిషన్‌లో ఇరు జట్లకు సెమీస్ అవకాశాలు లేకపోవడంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ ఎడిషన్‌లో బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్ మినహా అన్ని జట్ల చేతుల్లో (ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఇండియా, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్) ఓడగా.. పాకిస్తాన్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్, శ్రీలంకలపై మాత్రమే గెలిచి భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా చేతుల్లో వరుస మ్యాచ్‌ల్లో పరాజయంపాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ఏడు, బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాయి. పాక్‌కు మరో షాక్ తగిలేనా..? పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పరాభవంతో పాటు నాలుగు వరుస పరాజయాలతో సెమీస్ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసుకున్న పాక్.. బంగ్లాదేశ్‌పై గెలిచి ఊరట పొందాలని భావిస్తుంది. అయితే పాక్ ఇది అంత ఈజీ కాకపోవచ్చు. పాక్ కంటే బంగ్లాదేశ్ బలహీనమైన జట్టే అయినప్పటికీ.. గతంలో (1999 వరల్డ్‌కప్‌లో) పాక్‌కు షాకిచ్చిన అనుభవం బంగ్లా ఉండటంతో క్రికెట్ అభిమానులు మరో సంచలనాన్ని ఆశిస్తున్నారు. ఓవరాల్‌గా పాక్‌దే పైచేయి.. ఓవరాల్‌గా చూస్తే వన్డేల్లో బంగ్లాదేశ్‌పై పాక్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 38 సందర్భాల్లో ఎదురెదురుపడగా.. పాక్ 33, బంగ్లాదేశ్ 5 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. -
నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి బంగ్లాదేశ్ గెలుపు! పాక్‌కు బిగ్ షాక్
ఆసియాక్రీడలు-2023 పురుషల క్రికెట్లో పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ జట్టు బిగ్ షాకిచ్చింది. శనివారం పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో జరిగిన కాంస్య పతకపోరులో పాకిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఓడించింది. దీంతో కాంస్య పతకాన్ని బంగ్లా టైగర్స్ కైవసం చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా జట్టు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచింది. 6 బంతుల్లో 20 పరుగులు.. ఆఖరి ఓవర్లో విజయానికి 20 పరుగులు కావల్సిన నేపథ్యంలో బంగ్లాదేశ్ అద్భుతం చేసింది. ముఖీమ్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతినే యాసిర్ అలీ సిక్సర్‌గా మలిచాడు. తర్వాతి బంతికి రెండు పరుగులు తీసిన యాసిర్ అలీ.. మూడో బంతిని స్టాండ్స్‌కు తరలించాడు. ఈ క్రమలో ఆఖరి మూడు బంతుల్లో బంగ్లాకు 6 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. నాలుగో బంతికి రెండు పరుగులు చేసిన అలీ.. ఐదో బంతికి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో బంగ్లా డగౌట్లో ఒక్కసారిగా నిరాశ నెలకొంది. అయితే ఆరో బంతికి రకీబుల్ హసన్ ఫోర్ బాది బంగ్లాదేశ్‌కు చిర్మసరణీయ విజయాన్ని అందించాడు. కాగా తొలుత వర్షం కారణంగా మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. అయితే పాకిస్తాన్ ఇన్నింగ్స్ 5 ఓవర్లలో 48/1 ఉండగా మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్‌ను 5 ఓవర్లలో 65 పరుగులుగా నిర్ణయించారు. బంగ్లా బ్యాటర్లలో యాసిర్ అలీ(16 బంతుల్లో 34), అఫిప్ హోస్సేన్(11 బంతుల్లో 20 పరుగులు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. -
Asia Cup: బాబర్ ఆజం సరికొత్త చరిత్ర.. కోహ్లి ప్రపంచ రికార్డు బద్దలు
Asia Cup, 2023 - Pakistan vs Bangladesh: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రాణించపోయినప్పటికీ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి చరిత్రకెక్కాడు. ఆసియా కప్-2023లో భాగంగా సూపర్-4 దశలో పాకిస్తాన్- బంగ్లాదేశ్ బుధవారం తలపడ్డాయి. పాక్ పేసర్ల ధాటికి బంగ్లా బ్యాటర్ల విలవిల లాహోర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్ పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ హ్యారిస్ రవూఫ్(4 వికెట్లు), నసీం షా(3), షాహిన్ ఆఫ్రిది(1) ధాటికి బంగ్లా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో 38.4 ఓవర్లలో కేవలం 193 పరుగులు చేసి టైగర్స్ జట్టు ఆలౌట్ అయింది. వాళ్లిద్దరూ అదరగొట్టారు ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ను ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(78), మహ్మద్ రిజ్వాన్(63- నాటౌట్) విజయతీరాలకు చేర్చారు. ఇక ఈ మ్యాచ్‌లో పాక్ వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ బాబర్ ఆజం 22 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ సాయంతో 17 పరుగులు సాధించాడు. కోహ్లి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 2000 పరుగుల మార్కును అందుకున్న కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. పాక్ తరఫున 31 ఇన్నింగ్స్‌లు ఆడి ఈ మైలురాయిని అందుకున్న బాబర్.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని అధిగమించాడు. కాగా వన్డేల్లో 2000 పరుగులు పూర్తి చేసేందుకు కోహ్లికి 36 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి. ఈ జాబితాలో వరుసగా 41, 47 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించిన బ్యాటర్లుగా సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిల్లియర్స్, వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. మరోసారి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కాగా సూపర్-4 దశను పాకిస్తాన్ విజయంతో ఆరంభించింది. బంగ్లాపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన బాబర్ ఆజం బృందం.. తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియాతో తలపడనుంది. శ్రీలంకలోని కొలంబో ఇందుకు వేదిక కానుంది. చదవండి: వరల్డ్‌కప్ తర్వాత ద్రవిడ్ బై.. బై! నాడు అతడు ‘బలిపశువు’.. కొత్త కోచ్‌గా అతడే? -
Asia cup 2023: చెలరేగిన పాకిస్తాన్ బౌలర్లు.. కుప్పకూలిన బంగ్లాదేశ్
ఆసియాకప్-2023లో పాకిస్తాన్ పేసర్లు మరోసారి నిప్పులు చేరిగారు. ఈ మెగా టోర్నీ సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ పేస్ త్రయం అఫ్రిది, హారీస్ రౌఫ్, నసీం షా చుక్కలు చూపించారు. వీరిముగ్గురు దాటికి బంగ్లాదేశ్ 38.4 ఓవర్లలో 193 పరగులకే కుప్పకూలింది. హారీస్ రౌఫ్, నసీం షా తలా మూడు వికెట్లతో బంగ్లాను దెబ్బతీయగా.. అఫ్రిది, ఇఫ్తికర్ అహ్మద్, అష్రఫ్ చెరో వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్(64) పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ షకీబ్ అల్హసన్(53) పరుగులతో రాణించాడు. కాగా అంతకుముందు ఈ పేస్ త్రయం భారత్‌తో మ్యాచ్‌లో కూడా అదరగొట్టిన సంగతి తెలిసిందే. చదవండి: WC 2023: జింబాబ్వేపై ఆడాడని వరల్డ్‌కప్‌కు సెలక్ట్ చేశారా? జట్టులో దండుగ అతడు -
మొన్న మ్యాచ్‌లో సెంచరీ.. ఇప్పుడు తొలి బంతికే ఔట్! పాక్ బౌలర్లతో
ఆసియాకప్-2023లో భాగంగా సూపర్-4 దశ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్‌లో లాహోర్ వేదికగా పాకిస్తాన్-బంగ్లాదేశ్ తలపడతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు పాక్ పేసర్లు షాహీన్ అఫ్రిది, నసీం షా, హారీస్ రౌఫ్ చుక్కలు చూపుతున్నారు. బంగ్లాదేశ్ 44 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అఫ్రిది, నసీం షా, రౌఫ్ తలా వికెట్ సాధించారు. మొన్న సెంచరీ.. ఇప్పుడు తొలి బంతికే ఇక ఆఫ్గానిస్తాన్‌తో లీగ్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన బంగ్లా ఓపెనర్ మెహిదీ హసన్ మిరాజ్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. తన ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డన్‌డక్‌గా వెనుదిరిగాడు. బంగ్లా ఇన్నింగ్స్ నసీం వేసిన రెండో ఓవర్లో.. మొదటి బంతిని మిడ్‌వికెట్ దిశగా ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ కనక్ట్ కాకపోవడంతో నేరుగా ఫఖర్ జమాన్ చేతికి వెళ్లింది. భారత మ్యాచ్ ఎప్పుడంటే? ఇక సూపర్-4లో భారత తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న కొలంబో వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహల్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. తొలుత ఆసియాకప్‌కు ప్రకటించిన జట్టులో రాహుల్ ఉన్నప్పటికీ.. పూర్తిఫిట్‌నెస్ సాధించకపోవడంతో భారత్‌లోనే ఉండిపోయాడు. అయితే ఇప్ప్పుడు తన ఫిట్నెస్ను నిరూపించుకోవడంతో శ్రీలంకలో ఉన్న జట్టుతో కలిశాడు. ఇక పాకిస్తాన్‌తో లీగ్ మ్యాచ్‌లో విఫలమైన టాపర్డర్.. కనీసం సూపర్-4లో నైనా దాయాది దేశంపై రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. చదవండి: రోహిత్, కోహ్లిలను తీసేయరు కదా! కాబట్టి.. తుది జట్టులో అతడే బెటర్: గంభీర్ -
థర్డ్ అంపైర్ నిర్ణయం.. బంగ్లా కెప్టెన్‌కు శాపం
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో ఒకపక్క వరుణుడు ఇబ్బంది పడుతుంటే.. మరోపక్క అంపైర్లు తప్పుడు నిర్ణయాలతో బ్యాటర్లు బలవుతున్నారు. తాజాగా ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలవ్వాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో నాలుగో బంతికి షకీబ్ ఎల్బీగా వెనుదిరిగాడు. స్పిన్నర్ షాదాబ్ వేసిన ఈ ఓవర్లో మొదట సౌమ్యా సర్కార్ ఔట్ అవగా తర్వాతి బంతికే షకీబ్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో పాక్ ఆటగాళ్లు అప్పీ్ల్‌కు వెళ్లగా ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఆలస్యం చేయకుండా షకీబ్ రివ్యూకు వెళ్లాడు. అయితే రివ్యూలో బంతికి ముందుగా బ్యాట్ ను తగిలినట్టు అల్ట్రా ఎడ్జ్‌లో స్పష్టంగా స్పైక్ కనిపించింది. ఆ తర్వాతే బంతి షకీబ్ ప్యాడ్లను తాకింది. కానీ, ఇన్ సైడ్ ఎడ్జ్ క్లియర్ గా ఉన్నప్పటికీ థర్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇచ్చాడు. బ్యాట్ నేలను తాకడం వల్లే అల్ట్రా ఎడ్జ్ లో స్పైక్ వచ్చినట్టు పేర్కొన్నాడు. కానీ, స్పైక్ వచ్చిన సమయంలో బ్యాట్ కు, నేలకు మధ్య ఖాళీ టీవీ రీప్లేల్లో కనిపించింది. అయినప్పటికీ థర్డ్ అంపైర్ ఎల్బీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే బంగ్లా కెప్టెన్ షకీబ్ షాకయ్యాడు. దీనిపై ఫీల్డ్ అంపైర్లతో మాట్లాడాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసి ఏం చేయలేక నిరాశతో మైదానం వీడాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ తడబడింది. దీంతో బంగ్లాదేశ్ పెద్దగా స్కోరు చేయలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 18.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో పాకిస్తా్న్ అనూహ్యంగా సెమీస్‌లో అడుగుపెట్టగా.. బంగ్లాదేశ్ ఓటమితో ఇంటిబాట పట్టింది. Shakib’s bat didn’t touch the ground at all. Just focus on bat’s shadow. There was a spike. It couldn’t have been anything else except the ball hitting the bat. Bangladesh at the receiving end of a poor umpiring decision. #PakvBan #T20WorldCup — Aakash Chopra (@cricketaakash) November 6, 2022 Big moment in the match. Looked like Shakib Al Hasan edged it. The umpiring in this tournament hasn't been great#T20WorldCup #PAKvBAN pic.twitter.com/4zoJcVVPkm — Saj Sadiq (@SajSadiqCricket) November 6, 2022 చదవండి: ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.. కానీ నేనైతే: బంగ్లాదేశ్ కెప్టెన్ -
ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.. కానీ నేనైతే: బంగ్లాదేశ్ కెప్టెన్
ICC Mens T20 World Cup 2022 - Pakistan vs Bangladesh: ‘‘ఒక వికెట్ నష్టానికి 70 పరుగులతో పటిష్టంగానే కనిపించాం. ఈ పిచ్‌పై 145- 150 వరకు స్కోరు చేయగలం అనుకున్నాం. రాను రాను పిచ్ ప్రతికూలంగా మారుతుందనిపించడంతో పట్టుదలగా నిలబడాలనుకున్నాం. కానీ త్వరత్వరగా వికెట్లు పడ్డాయి’’ అని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అన్నాడు. నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓటమి నేపథ్యంలో సెమీస్‌పై ఆశలు పెట్టుకున్న బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ చేతిలో పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. అడిలైడ్‌లో ఆదివారం నాటి ఈ కీలక మ్యాచ్‌లో పాక్ 5 వికెట్ల తేడాతో బంగ్లాపై గెలుపొంది సెమీస్ చేరగా.. షకీబ్ బృందం టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదే అత్యుత్తమం ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మాట్లాడుతూ.. మిగతా వరల్డ్‌కప్ టోర్నీలతో పోలిస్తే ఈ ఎడిషన్‌లో తాము అత్యుత్తమ ప్రదర్శన కనబరిచామన్నాడు. అయితే, ఇంకాస్త మెరుగ్గా ఆడితే సెమీస్‌కు చేరే వాళ్లమని, కానీ అలా జరుగలేదని విచారం వ్యక్తం చేశాడు. వ్యక్తిగతంగా తన ప్రదర్శన పట్ల ఏమాత్రం సంతోషంగా లేనన్న ఈ స్టార్ ఆల్‌రౌండర్.. ఫిట్‌గా ఉన్నంత కాలం క్రికెట్ ఆడుతూనే ఉంటానంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ షాంటో 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాలుగో స్థానంలో వచ్చిన షకీబ్ వివాదస్పద రీతిలో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక బౌలింగ్‌లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన అతడు.. 35 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. కాగా గ్రూప్-2 నుంచి భారత్- పాకిస్తాన్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టగా.. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ అర్హత సాధించాయి. చదవండి: Temba Bavuma: ఈ ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం! ప్రధాన కారణం అదే View this post on Instagram A post shared by ICC (@icc) -
బంగ్లాదేశ్‌పై ఘన విజయం.. సెమీస్‌లో పాకిస్తాన్ (ఫొటోలు)
-
ఒక్క మ్యాచ్‌తో అంతా తారుమారు: వారి దురదృష్టం పాక్‌కు అదృష్టం.. అంతా వాళ్ల వల్లే!
టీ20 వరల్డ్‌కప్-2022 సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచింది. టోర్నీ మొదటి మ్యాచ్‌తో (శ్రీలంకపై నమీబియా విజయం) మొదలైన సంచనాల పరంపర.. ఇవాల్టి (నవంబర్ 6) సౌతాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్ వరకు అప్రతిహతంగా కొనసాగింది. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో పసికూన నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. ఈ ఒక్క మ్యాచ్‌తో గ్రూప్-2 సెమీస్ బెర్త్‌లు ఒక్కసారిగా తారుమారయ్యాయి. సౌతాఫ్రికా ఓటమితో టీమిండియా.. జింబాబ్వేతో జరుగబోయే మ్యాచ్‌తో సంబంధం లేకుండా సెమీస్‌కు చేరుకోగా, రెండో బెర్తు కోసం జరిగిన పోటీలో పాక్.. బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు సెమీస్ బెర్త్‌పై ఆశలు దాదాపుగా వదులుకున్న పాక్.. నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓటమితో తిరిగి జీవం పోసుకుని బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో ఒకవేళ బంగ్లాదేశ్ గెలిచి ఉంటే.. భారత్‌తో పాటు ఆ జట్టే సెమీస్‌కు చేరేది. అయితే అనూహ్యంగా సెమీస్ రేసులోకి వచ్చిన బంగ్లాదేశ్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోపక్క ఈ మారిన సమీకరణలకు ముఖ్య కారణమైన సౌతాఫ్రికాపై క్రికెట్ అభిమానులు జాలి చూపిస్తుండగా.. పాక్ అభిమానులు మాత్రం తమ పాలిట అదృష్టంగా నిలిచిన ప్రొటీస్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు. పాక్ ఫ్యాన్స్.. తమ జట్టు సెమీస్ చేరంగానే వరల్డ్‌కప్ గెలిచినంత హడావుడి చేస్తున్నారు. సోషల్‌మీడియాలో పాక్ అభిమానులు చేస్తున్న హల్చల్కు భారత ఫ్యాన్స్ తగు రీతిలో రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడేముంది.. ముందుంది ముసళ్ల పండుగ అంటూ పాక్‌ను హెచ్చరిస్తున్నారు. ఒకవేళ నెదర్లాండ్స్‌పై సౌతాఫ్రికా గెలిచి ఉంటే, మీరు ఈపాటికి పెట్టా బేడా సర్దుకోవాల్సి వచ్చేదని సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఓపెనర్ షాంటో (54) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. షాహీన్ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టి బంగ్లాను దారుణంగా దెబ్బకొట్టాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. మహ్మద్ రిజ్వాన్ (32), బాబర్ ఆజమ్ (25), మహ్మద్ హరీస్ (31), షాన్ మసూద్ (24 నాటౌట్)లు ఓ మోస్తరుగా రాణించడంతో 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 5 వికెట్ల తేడాతో గెలుపొంది, సెమీస్‌కు అర్హత సాధించింది. -
Pak Vs Ban: బంగ్లాదేశ్ ఇంటికి.. సెమీస్‌లో టీమిండియా, పాకిస్తాన్
ICC Mens T20 World Cup 2022 - Pakistan vs Bangladesh: అనూహ్య పరిస్థితుల నడుమ పాకిస్తాన్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. వరల్డ్‌కప్-2022 సూపర్-12లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది. బంగ్లాపై 5 వికెట్ల తేడాతో గెలుపొంది.. చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో పాటు గ్రూప్-2 నుంచి సెమీస్‌కు అర్హత సాధించింది. ఒక్కడు మాత్రమే సెమీస్ రేసులో భాగంగా అడిలైడ్ వేదికగా ఆదివారం పాకిస్తాన్- బంగ్లాదేశ్ తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు ఓపెనర్ షాంటో శుభారంభం అందించాడు. 48 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేయగలిగాడు. కానీ మరో ఓపెనర్, భారత్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన లిటన్ దాస్ 10 పరుగులకే పరిమితమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సౌమ్య సర్కార్ 20 పరుగులు చేయగా.. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ వివాదస్పద రీతిలో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మిగతా బ్యాటర్లలో అఫిఫ్ హొసేన్ 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 127 పరుగులు మాత్రమే చేయగలిగింది బంగ్లాదేశ్. తప్పని ఓటమి పాక్ పేసర్ షాహిన్ ఆఫ్రిది 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ 32, బాబర్ ఆజం 25 పరుగులతో శుభారంభం అందించారు. మహ్మద్ హారిస్ 31 పరుగులు చేయగా.. షాన్ మసూద్ 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ధారాళంగా పరుగులు(35) సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించి సెమీస్ చేరుకుంది. షాహిన్ ఆఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. View this post on Instagram A post shared by ICC (@icc) కాగా నెదర్లాండ్స్ చేతిలో ఘోర ఓటమి నేపథ్యంలో సౌతాఫ్రికా ఇంటిబాట పట్టగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ టోర్నీలో ముందడుగు వేశాయి. మ్యాచ్ స్కోర్లు: టాస్: బంగ్లాదేశ్ బంగ్లాదేశ్: 127/8 (20) పాకిస్తాన్: 128/5 (18.1) చదవండి: WC 2022: పాపం.. సౌతాఫ్రికా టోర్నీ నుంచి అవుట్! ఇందుకు కారణం ఆ రెండే! ముఖ్యంగా యూఏఈ! View this post on Instagram A post shared by ICC (@icc) -
Pak Vs Ban: బంగ్లాదేశ్‌పై పాక్ ఘన విజయం.. సెమీస్‌లో అడుగు
ICC Mens T20 World Cup 2022 - Pakistan vs Bangladesh Updates In Telugu: బంగ్లాదేశ్‌పై గెలిచిన పాకిస్తాన్ గ్రూప్-2 నుంచి సెమీస్‌కు అర్హత సాధించింది. టీమిండియాతో పాటు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అడిలైడ్ వేదికగా ఆదివారం చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన బాబర్ ఆజం బృందం.. లక్ష్య ఛేదనలో భాగంగా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ స్కోర్లు: టాస్: బంగ్లాదేశ్ బంగ్లాదేశ్: 127/8 (20) పాకిస్తాన్: 128/5 (18.1) మహ్మద్ హారిస్ నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. స్కోరు: 121-4(17) 15 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు 94-3 నవాజ్ రనౌట్‌గా వెనుదిరగగా.. హారిస్, మసూద్ క్రీజులో ఉన్నారు. రిజ్వాన్ అవుట్ పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌ను ఇబాదత్ హొసేన్ పెవిలియన్‌కు పంపాడు. 12వ ఓవర్ రెండో బంతికి షాంటోకు క్యాచ్ ఇచ్చి అతడు 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. హారిస్, నవాజ్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 67/2 (11.5) తొలి వికెట్ కోల్పోయిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం(25) రూపంలో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. పదకొండో ఓవర్ మూడో బంతికి నాసూమ్ అహ్మద్ బాబర్‌ను అవుట్ చేశాడు. స్కోరు: 58/1 (10.3). రిజ్వాన్, నవాజ్ క్రీజులో ఉన్నారు. పవర్ ప్లే ముగిసే సరికి పాక్ స్కోరు: 35-0 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ బ్యాటింగ్ కొనసాగుతోంది. ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ క్రీజులో ఉన్నారు. సెమీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్.. బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగింది. షాహిన్ ఆఫ్రిది 4 వికెట్లతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లా 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఏడో వికెట్ డౌన్ టస్కిన్ అహ్మద్ రూపంలో బంగ్లా ఏడో వికెట్ కోల్పోయింది. 19 ఓవర్లలో స్కోరు : 116-7 ఒకే ఓవర్లో రెండు వికెట్లు 17వ ఓవర్లో బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆఫ్రిది బౌలింగ్‌లో మొసద్దెక్ హొసేన్(5), నూరుల్ హసన్(0) అవుటయ్యారు. స్కోరు: 107/6 (17). అఫిఫ్, టస్కిన్ అహ్మద్ క్రీజులో ఉన్నారు. బంగ్లాకు ఎదురుదెబ్బ అర్ధ శతకంతో జోరు మీదున్న షాంటో(54) అవుటయ్యాడు. 14వ ఓవర్ రెండో బంతికి ఇఫ్తికర్ అహ్మద్.. షాంటోను బౌల్డ్ చేశాడు. దీంతో బంగ్లా నాలుగో వికెట్ కోల్పోయింది. పద్నాలుగు ఓవర్లలో స్కోరు: 92-4 షకీబ్ డకౌట్ బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో బంగ్లా మూడో వికెట్ కోల్పోయింది. రెండో వికెట్ కోల్పోయిన బంగ్లా సౌమ్య సర్కార్(20) రూపంలో బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. షాదాబ్ బౌలింగ్‌లో మసూద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 73/2 (10.4) అర్ధ శతకానికి చేరువలో షాంటో ► 10 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు: 70/1. షాంటో 41, సౌమ్య సర్కార్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►7 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి బంగ్లా 49 పరుగులు చేసింది. షాంటో, సౌమ్య సర్కార్ క్రీజ్‌లో ఉన్నారు. పవర్‌ప్లేలో బంగ్లా స్కోరు: 40-1 తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్‌లో భారత్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన లిటన్ దాస్ 10 పరుగులు చేసి ఔటయ్యాడు. షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లొ మసూద్‌కు క్యాచ్ ఇచ్చి దాస్ ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ వికెట్ నష్టానికి 34 పరుగులు. షాంటో (18), సౌమ్య సర్కార్ (6) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. గెలిచిన వాళ్లు సెమీస్‌కు! ఓడినవాళ్లు ఇంటికి టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్- బంగ్లాదేశ్ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. గ్రూప్-2లో భాగమైన నెదర్లాండ్స్ ఆదివారం నాటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి.. ఇరు జట్లకు మార్గం సుగమం చేసింది. ఇక బంగ్లాపై గెలిస్తే బాబర్ ఆజం బృందం.. టీమిండియాతో పాటు సెమీస్‌కు చేరడం లాంఛనమే కానుంది. మరి ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పాక్‌ను నిలువరిస్తే దర్జాగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది. తుది జట్లు: పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్) బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ హారీస్, షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది. బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), అఫిఫ్ హొస్సేన్, నూరుల్ హసన్(వికెట్ కీపర్), మొసద్దెక్ హొస్సేన్, టస్కిన్ అహ్మద్, నసుమ్ అహ్మద్, ఇబాదత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్. చదవండి: టీ20 ప్రపంచ కప్‌లో పెను సంచలనం.. దక్షిణాఫ్రికాకు ఘోర పరాభవం టీ20 వరల్డ్‌కప్‌లో ఆ జట్టుకు షాక్.. అత్యాచారం కేసులో క్రికెటర్ అరెస్ట్ -
WC 2022: పాపం ప్రొటిస్.. నెదర్లాండ్స్ చేతిలో గనుక ఓడితే!
ICC Mens T20 World Cup 2022- Semi Final Scenario: టీ20 ప్రపంచకప్-2022లో సూపర్–12 ఆఖరి మజిలీ రసవత్తరం అవుతోంది. గ్రూప్–2లో దక్షిణాఫ్రికా ఓటమి పాకిస్తాన్‌కే కాదు... బంగ్లాదేశ్‌కూ ఊపిరిలూదింది. దీంతో గ్రూప్–1లాగే ‘2’లో కూడా ప్రధాన జట్లన్నీ సెమీఫైనల్ రేసులో ఉన్నాయి. మొత్తం మీద నాలుగు సెమీస్ బెర్తుల కోసం తొమ్మిది జట్లు పోటీలో ఉండటం విశేషం. ఆదివారం అసలు మ్యాచ్‌లు! గ్రూప్–1లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్... గ్రూప్–2లో భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు సై అంటే సై అంటున్నాయి. గ్రూప్–2 నుంచి సెమీఫైనల్ చేరే రెండు జట్లేవో ఆదివారం ఒకే రోజున జరిగే మూడు మ్యాచ్‌లు ముగిసిన తర్వాతే (దక్షిణాఫ్రికా–నెదర్లాండ్స్; పాకిస్తాన్–బంగ్లాదేశ్; భారత్–జింబాబ్వే) తేలనుంది. ఒకవేళ సౌతాఫ్రికా గనుక ఓడితే నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోతే మాత్రం ఆ జట్టు నిష్క్రమిస్తుంది. కాగా ఈ ఐసీసీ టోర్నీలో సఫారీలను దురదృష్టం వెంటాడుతున్న విషయం తెలిసిందే. తొలుత జింబాబ్వేతో మ్యాచ్‌లో గెలిచే అవకాశం ఉన్నా మ్యాచ్ వర్షార్పణమైంది. ఆ తర్వాత బంగ్లాదేశ్, టీమిండియాలపై విజయం సాధించినా.. పాక్‌తో మ్యాచ్‌లో పరాభవం తప్పలేదు. కాగా మెగా టోర్నీల్లో ఆఖరి వరకు పోరాడి అసలు సమయం వచ్చే సరికి చేతులెత్తే జట్టు(చోకర్స్)గా ప్రొటిస్‌కు అపవాదు ఉంది. ఇక బ్యాటర్‌గా కెప్టెన్ తెంబా బవుమా వైఫల్యం, కీలక ఆటగాడు కిల్లర్ మిల్లర్ గాయం బారిన పడటం సఫారీలను కలవరపెడుతున్నాయి. మరి డచ్ జట్టుతో మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూడాలి! పాక్ గెలుపొందినా మరోవైపు.. పాకిస్తాన్ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. పటిష్టమైన టీమిండియాతో పోరును ఆఖరి బంతి వరకు తీసుకువచ్చిన బంగ్లాదేశ్‌పై పాక్‌కు గెలుపు అంతతేలికేమీ కాదు. ఒకవేళ ఆ జట్టుపై పాకిస్తాన్ నెగ్గినా.. బాబర్ ఆజం బృందం సెమీఫైనల్ బెర్త్ మాత్రం భారత్–జింబాబ్వే మ్యాచ్ ముగిశాకే ఖరారవుతుంది. చేజేతులా పాక్.. ఒక్క విజయంతో.. భారత్‌తో గొప్పగా పోరాడి ఓడిన జట్టు పాకిస్తాన్. జింబాబ్వే చేతిలో చెత్తగా ఓడిన జట్టు పాకిస్తాన్. ముందుకెళ్లే అవకాశాల్ని అత్యంత క్లిష్టం చేసుకున్న జట్టు పాకిస్తానే! ఇంతటి ఒత్తిడిలో కూరుకుపోయిన ఆ జట్టు పటిష్టమైన దక్షిణాఫ్రికాపై ఏం గెలుస్తుందనే విమర్శలు ఇంటాబయట ఉక్కిరిబిక్కిరి చేశాయి. కానీ ‘ఆల్‌రౌండ్ షో’తో సఫారీని కంగుతినిపించిన పాక్... ఒక్క విజయంతో రేసులోకి దూసుకొచ్చింది. గ్రూప్–2 సెమీస్ ముఖచిత్రాన్నీ మార్చింది. టి20 ప్రపంచకప్‌లో గురువారం జరిగిన గ్రూప్–2 ‘సూపర్–12’ మ్యాచ్‌లో పాక్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 33 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించిన విషయం తెలిసిందే. మొదట పాక్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 185 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇఫ్తికార్ (35 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. నోర్జే 4 వికెట్లు తీశాడు. తర్వాత వర్షం వల్ల దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 142 పరుగులుగా సవరించారు. కానీ దక్షిణాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 108 పరుగులే చేసి ఓడింది. కెప్టెన్, ఓపెనర్ బవుమా (19 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. షాహిన్ అఫ్రిది (3/14) పేస్‌తో, షాదాబ్ ఖాన్ (2/16) స్పిన్‌తో జట్టును గెలిపించి రేసులో నిలబెట్టారు. ఆరంభంలో తడబడి... పాక్ బ్యాటింగ్‌కు దిగిన తొలి ఓవర్లోనే రిజ్వాన్ (4) అవుటయ్యాడు. పవర్ ప్లేలో కెప్టెన్ బాబర్ ఆజమ్ (6)తో పాటు జోరుమీదున్న హారిస్ (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వికెట్లను కోల్పోయింది. మరో 3 బంతుల వ్యవధిలో షాన్ మసూద్ (2) ఆట ముగిసింది. 43/4... ఇదీ పాక్ స్కోరు. ఇలాంటి దశలో 150 స్కోరే గగనం. కానీ ఇఫ్తికార్ అహ్మద్, నవాజ్ (22 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) పట్టుదల పాక్ దిశను మార్చితే... షాదాబ్ సిక్సర్ల ఉప్పెన దక్షిణాఫ్రికా పాలిట భారీలక్ష్యాన్ని నిర్దేశించేలా చేసింది. ఇఫ్తికార్, షాదాబ్ ఆరో వికెట్‌కు 5.5 ఓవర్లలోనే 82 పరుగులు జోడించం విశేషం. ఆఖరి 8 బంతుల్లో పాక్ 4 వికెట్లను కోల్పోయింది. లేదంటే 200 స్కోరు నమోదయ్యేది. సఫారీకి ఆది నుంచే... పెద్ద లక్ష్యం ఎదురైన సఫారీ జట్టు 16 పరుగులకే కీలకమైన డికాక్ (0), రోసో (7) వికెట్లను కోల్పోయింది. బవుమా, మార్క్రమ్ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు) ధాటిగా ఆడటంతో కోలుకున్నట్లే కనిపించిన సఫారీని స్పిన్‌తో షాదాబ్ చావుదెబ్బ తీశాడు. ఒకే ఓవర్లో ఇద్దరిని అవుట్ చేయడంతో 66 పరుగుల వద్ద 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత వర్షం పడటంతో లక్ష్యాన్ని మార్చగా, బ్యాటింగ్ కొనసాగించిన సఫారీ పాకిస్తాన్ బౌలర్ల పట్టుదలకు తలవంచింది. నసీమ్ షా (1/19), హారిస్ రవూఫ్ (1/44), మొహమ్మద్ వసీమ్ (1/13) తలా ఒక దెబ్బ కొట్టడంతో చిత్రంగా 9 పరుగుల వ్యవధిలో 5 వికెట్లను కోల్పోయింది. 94/4 నుంచి 103/9 స్కోరుకు పడిపోయి ఓటమిని ఆహ్వానించింది. చదవండి: SMAT 2022: శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్! ఫైనల్లో ముంబై T20 WC 2022: జింబాబ్వే చేతిలో ఓడిపోవద్దు.. కష్టాలు కొనితెచ్చుకోవద్దు -
జర్నలిస్ట్ తిక్క ప్రశ్న.. బాబర్ ఆజం దిమ్మతిరిగే కౌంటర్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఒక జర్నలిస్టు అడిగిన తిక్క ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. విషయంలోకి వెళితే.. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఇచ్చిన 173 పరగుల టార్గెట్‌ను 19.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది. మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజంలు అర్థసెంచరీలతో చెలరేగగా..మహ్మద్ నవాజ్ 45 పరుగులు నాటౌట్ జట్టును గెలిపించాడు. ఈ విషయం పక్కనబెడితే పాకిస్తాన్ జట్టుకు ఈ మధ్య కాలంలో ఫైనల్ మ్యాచ్‌లు పెద్దగా కలిసిరావడం లేదు. ముందుగా ఆసియా కప్ చూసుకుంటే శ్రీలంకతో జరిగిన ఫైనల్లో బోల్తా కొట్టిన పాక్ చివరికి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 4-3తో కోల్పోయింది. అయితే తాజాగా టి20 ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో జరుగుతున్న ట్రై సిరీస్‌లో పాకిస్తాన్ మరోమారు ఫైనల్‌కు చేరింది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం బాబర్ ఆజం ప్రెస్మీట్లో పాల్గొన్నాడు. ''మీరు ఒక కెప్టెన్‌గా అన్ని ఫైనల్స్ ఓడిపోతున్నారు.. మరి ఈసారి ఫైనల్ గెలుస్తారన్న నమ్మకం ఉందా'' అంటూ ఒక జర్నలిస్టు తిక్క ప్రశ్న వేశాడు. దీంతో మండిపోయిన బాబర్ ఆజం.. ''మీరు ఎవరు గురించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.. మ్యాచ్‌లో గెలుపోటములు సహజం.. ఫైనల్ మ్యాచ్ గెలుస్తామా లేదా అన్నది ముందే ఎలా చెప్పగలం. ఆట ఆడడం మా నైతిక ధర్మం.. అంతేకానీ విజయం అనేది మా చేతుల్లో రాసిపెట్టిలేదు. వంద శాతం గెలిచేందుకే ప్రయత్నిస్తాం.. ఓడిపోతే మేం ఏం చేయగలం.. ప్రతీదాన్ని భూతద్దంలో చూడకండి'' అంటూ బదులిచ్చాడు. ఇక ట్రై సిరీస్ అనంతరం ఆస్ట్రేలియాకు చేరుకోనున్న పాకిస్తాన్ జట్టు అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో టీమిండియాను పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన సంగతి తెలిసిందే. -
పాక్‌ను హడలెత్తించిన బంగ్లా.. కానీ!
-
ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. పాక్‌కు చెమటలు పట్టించిన బంగ్లా!
New Zealand T20I Tri-Series 2022 - Pakistan vs Bangladesh, 6th Match: న్యూజిలాండ్‌తో టీ20 ట్రై సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ఆఖరి బంతి వరకు రసవత్తరంగా సాగింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా గురువారం (అక్టోబరు 13) జరిగిన పోరులో చివరికి పాకిస్తాన్ పైచేయి సాధించింది. మరో బంతి మిగిలి ఉండగానే మహ్మద్ నవాజ్ ఫోర్ బాది పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ ఓటమితో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ట్రై సిరీస్ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. టీ20 వరల్డ్‌కప్-2022 సన్నాహకాల్లో భాగంగా జరిగిన సిరీస్‌లో చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం (అక్టోబరు 14) నాటి ట్రై సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్- న్యూజిలాండ్ తలపడనున్నాయి. మరోసారి విజృంభించిన కెప్టెన్.. కానీ.. పాక్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. ఓపెనర్లు షాంటో(12), సౌమ్య సర్కార్(4) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన లిటన్ దాస్, ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. లిటన్ దాస్ 42 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 69 పరుగులు చేయగా.. షకీబ్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 68 పరుగులు సాధించి మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మిగతా ఆటగాళ్లకు నామమాత్రపు స్కోరుకే పరిమితం కాగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 173 పరుగులు చేసింది. ఓపెనింగ్ జోడీ అర్ధ శతకాలు లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఓపెనింగ్ జోడీ మహ్మద్ రిజ్వాన్(56 బంతుల్లో 69 పరుగులు), బాబర్ ఆజం(40 బంతుల్లో 55 పరుగులు) అర్ధ శతకాలతో కదం తొక్కింది. హైదర్ అలీ విఫలం(0) కాగా.. మహ్మద్ నవాజ్ 45 పరుగులతో అజేయంగా నిలిచి పాక్‌ను విజేతగా నిలిపాడు. 19.5 ఓవర్లలో పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: T20 WC- Semi Finalists Prediction: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే: పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ BCCI Next Boss Roger Binny: అధ్యక్షుడిగా రోజర్ బిన్నీనే ఎందుకు?.. ఆసక్తికర విషయాలు -
ఎదురులేని రిజ్వాన్.. గెలుపుతో పాక్ బోణీ
క్రైస్ట్‌చర్చ్: టి20 ప్రపంచకప్‌కు జరుగుతున్న ముక్కోణపు టి20 టోర్నీలో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ రిజ్వాన్ (50 బంతుల్లో 78 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, షాన్ మసూద్ (22 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తస్కీన్ అహ్మద్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేయగలిగింది. యాసిర్ అలీ (21 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), లిటన్ దాస్ (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. వసీమ్ 3, నవాజ్ 2 వికెట్లు పడగొట్టారు. టోర్నీలో భాగంగా నేడు జరిగే మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో పాకిస్తాన్ తలపడుతుంది. -
ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు: పాక్ వికెట్‌కీపర్
ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో కొనసాగుతూ ప్రత్యర్ధి బౌలర్ల పాలిట కొరకరాని కొయ్యలా మారిన పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. తాజాగా తనపై, తన జట్టుపై వస్తున విమర్శలపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డాడు. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 7) బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ధశతకంతో చెలరేగిన అనంతరం రిజ్వాన్ మాట్లాడుతూ.. తన జట్టు ప్రదర్శనపై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఎక్కడో కూర్చొని తమపై విమర్శలు చేసే ప్రతోడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఘాటుగా స్పందించాడు. ఇటీవలి కాలంలో రిజ్వాన్ మినహా పాక్ జట్టు యావత్తు మూకుమ్మడిగా విఫలమవుతున్న నేపథ్యంలో ఆ దేశ మాజీలు పాక్ ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కెప్టెన్ బాబర్ ఆజమ్ సహా జట్టు మొత్తంపై పాక్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. గతేడాది ఫార్మాట్లకతీతంగా రాణించి.. ఈ ఏడాది ఆశించిన స్థాయి ఫలితాలు రాబట్టలేక చతికిలపడిన పాక్‌ను విశ్లేషకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన అనంతరం రిజ్వాన్ తమను విమర్శిస్తున్న వారికి గెలుపుతో సమాధానం చెప్పాడు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌కు ముందు జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో ఇవాళ బంగ్లాదేశ్-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాక్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. రిజ్వాన్ (50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 78) అజేయ అర్ధశతకంతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లోనూ రిజ్వాన్ మినహా పాక్ బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. -
Pak Vs Ban: చెలరేగిన రిజ్వాన్.. బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయం
New Zealand T20I Tri-Series 2022 - Bangladesh vs Pakistan 1st T20: న్యూజిలాండ్- బంగ్లాదేశ్- పాకిస్తాన్ ట్రై సిరీస్‌లో బాబర్ ఆజం బృందం శుభారంభం చేసింది. త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా మొదటి టీ20లో పాకిస్తాన్ 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ అజేయ అర్ధ శతకం(50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 78 పరుగులు)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. న్యూజిలాండ్ వేదికగా.. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో న్యూజిలాండ్ స్వదేశంలో ట్రై సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం పాకిస్తాన్- బంగ్లాదేశ్ జట్లు తొలి టీ20లో తలపడ్డాయి. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. చెలరేగిన రిజ్వాన్.. బంగ్లా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు రిజ్వాన్ శుభారంభం అందించాడు. 78 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్, కెప్టెన్ బాబర్ ఆజం 22 పరుగులు సాధించగా.. వన్‌డౌన్ బ్యాటర్ షాన్ మసూద్ 22 బంతుల్లో 31 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో బాబర్ ఆజం బృందం 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు మెహెదీ హసన్ మిరాజ్ 10, సబ్బీర్ రెహమాన్ 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. అలీ మెరుపు ఇన్నింగ్స్ వృథా ఇక వన్‌డౌన్‌లో వచ్చిన లిటన్ దాస్ 35 పరుగులు, నాలుగో స్థానంలో వచ్చిన అఫిఫ్ హొసేన్ 25 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన యాసిర్ అలీ (21 బంతుల్లో 42 పరుగులు, నాటౌట్) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం అందకపోవడంతో 146 పరుగులకే నూరుల్ హసన్ బృందం కథ ముగిసిపోయింది. పాక్ చేతిలో 21 పరుగులతో బంగ్లా ఓటమిని మూటగట్టుకుంది. ఇక మొదటి మ్యాచ్‌లో విజయంతో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకున్న పాకిస్తాన్.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పోటీపడనుంది. పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ స్కోర్లు పాకిస్తాన్- 167/5 (20) బంగ్లాదేశ్ 146/8 (20) చదవండి: T20 World Cup 2022: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం! IND Vs SA: 'దటీజ్ సంజూ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి' -
మెగా ఈవెంట్‌కు ముందు కావాల్సినంత ప్రాక్టీసు.. పాక్- కివీస్- బంగ్లా సిరీస్!
T20 WC 2022- Pakistan New Zealand Bangladesh Tri Series: టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా పాకిస్తాన్.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో ట్రై సిరీస్ ఆడనుంది. ఈ ఏడాది అక్టోబరులో ఈ మేరకు జరిగే సిరీస్‌కు న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ వేదిక కానుంది. కాగా విధంగా గతేడాది న్యూజిలాండ్ జట్టు అర్ధంతరంగా పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబరులో అక్కడికి వెళ్లేందుకు కివీస్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అక్టోబరు 16న టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఇందుకు సుమారు వారం రోజుల ముందు జరుగనున్న ఈ ట్రై సిరీస్‌తో పాక్, కివీస్, బంగ్లా జట్లకు కావాల్సినంత ప్రాక్టీసు దొరకనుంది. ఇక అక్టోబరు 8న న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక గతేడాది జరిగిన పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ఈవెంట్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన కనబరిచాయి. అయితే, సెమీస్‌లో పాక్ ఆస్ట్రేలియా చేతిలో ఓడగా.. ఫైనల్లో అదే ఆసీస్ జట్టు చేతిలో పరాజయం పాలై న్యూజిలాండ్ రన్నరప్‌గా నిలిచింది. పాకిస్తాన్- న్యూజిలాండ్- బంగ్లాదేశ్: ట్రై సిరీస్ షెడ్యూల్-హాగ్లే ఓవల్ మైదానం, క్రైస్ట్‌చర్చ్ ►అక్టోబరు 8: న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ ►అక్టోబరు 9: పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ ►అక్టోబరు 10: బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ►అక్టోబరు 11: న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ ►అక్టోబరు 12: బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ►అక్టోబరు 13: న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ ►అక్టోబరు 14: ఫైనల్ చదవండి: నాన్న రూమ్‌లో రెస్ట్ తీసుకుంటున్నాడు.. ఇంకా నెల రోజులు: రోహిత్ శర్మ కుమార్తె -
బంగ్లాపై గెలుపు.. రెండో స్థానంలో పాక్
Pakistan Stands Second In ICC WTC Points Table: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసిన పర్యాటక పాక్ జట్టు.. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ విజయంతో సిరీస్‌ను 2-0తేడాతో కైవసం చేసుకున్న బాబర్ సేన.. పాయింట్ల శాతాన్ని 66.66 నుంచి 75 శాతానికి పెంచుకుంది. ప్రస్తుత డబ్ల్యూటీసీ(2021-23)లో భాగంగా ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన పాక్.. 3 విజయాలు, ఓ పరాజయంతో 36 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. The ICC World Test Championship standings after Pakistan’s emphatic win in the Dhaka Test 📈#WTC23 | #BANvPAK pic.twitter.com/Xo2k02pnPE — ICC (@ICC) December 8, 2021 ఈ జాబితాలో శ్రీలంక ఒక్క పరాజయం కూడా నమోదు చేయకపోవడంతో 100 శాతం పాయింట్లను దక్కించుకుని అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఇటీవలే న్యూజిలాండ్‌పై 1-0తో సిరీస్ విజయాన్ని సాధించిన టీమిండియా 58.33 పాయింట్ల శాతంతో మూడో స్థానంలో నిలచింది. డబ్ల్యూటీసీలో భాగంగా భారత్ 3 విజయాలు, 2 డ్రాలు, ఓ పరాజయంతో 42 పాయింట్లు సాధించింది. ఇదిలా ఉంటే, వర్షం కారణంగా సుమారు రెండు రోజుల ఆట వర్షార్పణం అయిన బంగ్లా-పాక్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో.. పాక్ ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏకంగా 12 వికెట్లు పడగొట్టి బంగ్లా పతానాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 4 వికెట్లు నష్టానికి 300 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాను 87 పరుగులకే ఆలౌట్ చేసిన పాక్.. ప్రత్యర్ధిని ఫాలో ఆన్ ఆడించి రెండో ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన చేసిన సాజిద్ ఖాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. తొలి టెస్టులో సెంచరీతో పాటు రెండు టెస్టుల్లో నిలకడగా రాణించిన పాక్ ఓపెనర్ అబిద్ అలీకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. చదవండి: టీమిండియా 29 ఏళ్ల దాహం తీరేనా.. దక్షిణాఫ్రికాలో సిరీస్ విజయంపై ప్రోమో అదుర్స్ -
పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ కొత్త చరిత్ర.. బంగ్లాదేశ్ 87 ఆలౌట్
Sajid Khan Best Bowling Vs Ban 2nd Test.. పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ తన టెస్టు కెరీర్లో బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో సాజిద్ ఖాన్ 8 వికెట్లు తీశాడు. 15 ఓవర్లు వేసి 42 పరుగులిచ్చిన సాజిద్ ఈ ఫీట్ సాధించాడు. కాగా పాకిస్తాన్ టెస్టు చరిత్రలో సాజిద్‌ది నాలుగో అత్యుత్తమ ప్రదర్శనగా నమోదైంది. కాగా పాక్ బౌలర్ల దాటికి నలుగురు బంగ్లా బ్యాటర్స్ డకౌట్‌గా వెనుదిరగడం విశేషం. చదవండి: PAK Vs BAN: బ్యాటింగ్ అయిపోయింది.. ఇప్పుడు బౌలింగ్ చేస్తున్నావా బాబర్! షకీబ్ అల్ హసన్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఫాలోఆన్ ఆడుతున్న బంగ్లాదేశ్ ఐదోరోజు రెండో సెషన్లో 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే బంగ్లాదేశ్ మరో సెషన్ పాటు నిలదొక్కుకోవాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యమనే చెప్పొచ్చు. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 300 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బాబర్ అజమ్ 76, అజర్ అలీ 56 పరుగులు చేయగా.. పవాద్ అలమ్ 50 నాటౌట్, మహ్మద్ రిజ్వాన్ 53 నాటౌట్ రాణించారు. ఇక ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టును గెలుచుకున్న పాక్.. రెండో టెస్టులో విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. చదవండి: Queensland Police On England Players: ఇంగ్లండ్ చెత్త ఆట.. క్వీన్స్లాండ్ పోలీస్ విచారణ -
Babar Azam: డ్రెస్సింగ్‌రూంలో పాక్ ఆటగాళ్ల గొడవ.. బాబర్ ఆజం ప్రతీకారం!
Pakistan Players Babar Azam And Imam Clash In Dressing Room, Video Goes Viral: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన బాబర్ ఆజం బృందం.. తొలి టెస్టులో విజయం సాధించి జోష్‌లో ఉంది. అదే జోరును కొనసాగిస్తూ రెండో టెస్టు కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకొనేందుకు సిద్ధమైంది. ఇలా వరుస విజయాలు సాధించడం పట్ల పీసీబీ సంతోషంగా ఉంటే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు మాత్రం డ్రెస్సింగ్‌రూంలో ‘గొడవపడి’ గందరగోళం సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెండో టెస్టు మూడో రోజు ఆట వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో.. కెప్టెన్ బాబర్ ఆజం, ఇమామ్-ఉల్-హక్ డ్రెస్సింగ్ రూంలో క్రికెట్ ఆడారు. తొలుత బాబర్ బ్యాటింగ్ చేయగా.. ఇమామ్ అతడిని అవుట్ చేశాడు. ఇందుకు బాబర్ సైతం ధీటుగా బదులిచ్చాడు. ఇమామ్‌ను అవుట్ చేసి.. ప్రతీకారం తీర్చుకున్నాడు. అయితే, తాను అవుట్ కాలేదంటూ... ఇమామ్ వాదించాడు. ఈ క్రమంలో ఇద్దరూ సరదాగా వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆట కొనసాగింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. చదవండి: India Tour Of South Africa: టీమిండియాకు భారీ షాక్.. నలుగురు ఆటగాళ్లు దూరం! వాళ్లిద్దరికీ బంపర్ ఆఫర్! PAK Vs BAN: బ్యాటింగ్ అయిపోయింది.. ఇప్పుడు బౌలింగ్ చేస్తున్నావా బాబర్! Rain might have kept our boys off the field, but they had a gripping match of their own in the dressing room Babar Azam batted first, and had a cautious start pic.twitter.com/sDQkIojpWP — Pakistan Cricket (@TheRealPCB) December 5, 2021 Babar was on fire and according to him, he finished with a 10-for. He got Bilal Asif out thrice in slips (as Imam tells us) pic.twitter.com/DFTgat2yrt — Pakistan Cricket (@TheRealPCB) December 5, 2021 -
సాజిద్ ఖాన్ మాయాజాలం.. కష్టాల్లో బంగ్లాదేశ్
ఢాకా: పాక్ ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ (6/35) మాయాజాలంతో రెండో టెస్టులో బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. మంగళవారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 76 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 188/2తో బ్యాటింగ్ కొనసాగించిన పాకిస్తాన్ 98.3 ఓవర్లలో 4 వికెట్లకు 300 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బాబర్ ఆజమ్ (76; 9 ఫోర్లు, 1 సిక్స్), రిజ్వాన్ (53 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), ఆలమ్ (50 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. -
బాబర్ అజమ్ హాఫ్ సెంచరీ .. పాపం ప్రకృతి సహకరించడం లేదు
Fans Troll Babar Azam Getting Half Century Mark But Play Stops.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ అర్థశతకం సాధించాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. వాస్తవానికి టి20 ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన బాబర్ అజమ్ ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో బాబర్ అజమ్‌పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఇరు జట్ల మధ్య మొదలైన తొలి టెస్టు మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. దాదాపు రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోగా.. మూడోరోజు నుంచి ఆట కొనసాగింది. చదవండి: IND vs SA: రహానే, గిల్‌కు షాక్.. ఆకాశ్ చోప్రా ఫేవరెట్ జట్టులో దక్కనిచోటు కాగా మూడోరోజు ఆటలో పాకిస్తాన్ ఓపెనర్ బాబర్ అజమ్ అర్థసెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. అయితే అతను ఫిప్టీ మార్క్ చేరిన కాసేపటికే బ్యాడ్‌లైట్ పేరుతో ఆట ఆగిపోయింది. దీంతో బాబర్‌ను మరోసారి టార్గెట్ చేస్తూ నెటిజన్లు ఆడుకున్నారు. ''టి20 ప్రపంచకప్ తర్వాత బాబర్‌కు ఏది కలిసిరావడం లేదు.. ముందు టి20 సిరీస్‌లో పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో బాబర్ అజమ్ ఫిప్టీ సాధించినప్పటికి ప్రకృతి అతనికి సహకరించడం లేదు.'' అంటూ ట్రోల్స్ చేశారు. ఇక మ్యాచ్‌లో నాలుగోరోజు లంచ్ విరామం తర్వాత పాకిస్తాన్ 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. బాబర్ అజమ్ 76, అజర్ అలీ 56 పరుగులు చేసి ఔటవ్వగా.. ప్రస్తుతం పవాద్ అలమ్ 19, మహ్మద్ రిజ్వాన్ 26 పరుగులతో ఆడుతున్నారు. చదవండి: AUS vs ENG Ashes Series: ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ.. తొలి టెస్టుకు అండర్సన్ దూరం Raining.. Match stopped#PakvsBan pic.twitter.com/lGVV583wZg — Ali Hasan (@AaliHasan10) December 4, 2021 -
తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ ఘనవిజయం
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ను ఓపెనర్లు హబిద్ అలీ(91), అబ్దుల్లా షఫీక్(73)లు రాణించడంతో పాక్ సులువుగా విజయాన్ని సాధించింది. వీరిద్దరు ఔటైన తర్వాత అజర్ అలీ(24*), బాబర్ అజమ్(13*)లు మిగతాపనిని పూర్తి చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ.. రెండో ఇన్నింగ్స్‌లో అర్థసెంచరీతో రాణించిన హబీద్ అలీని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 39/4తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 56.2 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లు షాహీన్ అఫ్రిది (5/32), సాజిద్ (3/33) రాణించారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 330 పరుగులుకు ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 286 పరుగులకు ఆలౌట్ అయింది. -
అడ్డంగా బుక్కైన హసన్ అలీ.. అంపైర్ వార్నింగ్
Umpire Warns Hasan Ali Use Saliva To Shine Ball.. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీని అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. కరోనా దృష్యా ఐసీసీ నిబంధనల ప్రకారం బౌలర్లు బంతి పదును కోసం సలైవాను రుద్దడం నిషేధం. మార్చి 2020లో ఐసీసీ తీసుకొచ్చిన ఈ నిబంధనను బౌలర్లు తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే. అయితే హసన్ అలీ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో నిబంధనను అతిక్రమించి బంతి పదును కోసం సలైవా రుద్ది కెమెరాల్లో అడ్డంగా బుక్కయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. చదవండి: Ban Vs Pak 1st Test: 5 వికెట్లతో మెరిసిన హసన్ అలీ.. సెంచరీ దిశగా అబిద్ అలీ ఇది చూసిన ఫీల్డ్ అంపైర్.. హసన్ అలీ దగ్గరికి వచ్చి మాట్లాడాడు. ఇలా చేయడం మంచిది కాదని.. ఇంకోసారి రిపీట్ కావొద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ వెర్నన్ ఫిలాండర్ కూడా హసన్ అలీతో మాట్లాడడం వైరల్‌గా మారింది. కోచ్ చెబితేనే ఇలా చేశాడా.. లేక ఉద్దేశపూర్వకంగానే హసన్ అలీ బంతికి సలైవా రుద్దాడా అనేది తెలియదు. ఇక ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక బౌలర్ బంతి పదును కోసం సలైవాను రెండుసార్ల కంటే ఎక్కువ ఉపయోగిస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. కాగా హసన్ అలీ ఇప్పటికే రెండుసార్లు బంతికి సలైవా రుద్దాడు. ఇంకోసారి అదే తప్పు చేస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు అదనంగా ఇస్తారు. చదవండి: IND vs NZ: న్యూజిలాండ్ స్పిన్నర్ చెత్త రికార్డు.. 21 ఏళ్ల తర్వాత ఇక మ్యాచ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ ప్రస్తుతం 83 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ ఓపెనర్ హబీద్ అలీ (133 పరుగులు) సెంచరీతో మెరవగా.. షఫీఖ్ 52 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 7 వికెట్లతో దుమ్మురేపాడు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులుకు ఆలౌటైంది. -
Ban Vs Pak 1st Test: 5 వికెట్లతో మెరిసిన హసన్ అలీ.. సెంచరీ దిశగా అబిద్ అలీ
Ban Vs Pak 1st Test: Pakistan Abid Ali Half Century Strong Reply On Day 2: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ నిలకడగా ఆడుతోంది. రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 145 పరుగులు చేసింది. ఓపెనర్లు అబిద్ అలీ (93 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), అబ్దుల్లా షఫీక్ (52 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ మరో 185 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 253/4తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్... మరో 77 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 6 వికెట్లను కోల్పోయింది. ముష్ఫికర్ (91; 11 ఫోర్లు) సెంచరీని చేజార్చుకున్నాడు. హసన్ అలీ ఐదు వికెట్లతో మెరిశాడు. కాగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs Nz Test- Srikar Bharat: ఆ క్యాచ్ నిజంగా సూపర్.. ఒకవేళ భరత్ పట్టుబట్టకపోయి ఉంటేనా! .@AbidAli_Real and @imabd28 in conversation following their unbroken 145-run opening stand.#BANvPAK #HarHaalMainCricket pic.twitter.com/VtgcaQcso4 — Pakistan Cricket (@TheRealPCB) November 27, 2021 -
Babar Azam: నేను ప్రతిసారీ పరుగులు సాధించాలని ఎక్కడా రాసిలేదు!
Pakistan Skipper Babar Azam Opened Up on His Form Ahead of Bangladesh Test Series: టీ20 సిరీస్‌లో 3-0 తేడాతో బంగ్లాదేశ్‌ను వైట్‌వాష్ చేసిన పాకిస్తాన్ టెస్టు సిరీస్‌కు సన్నద్ధమైంది. నవంబరు 26(శుక్రవారం)న తొలి టెస్టు జరుగనున్న నేపథ్యంలో అందరి దృష్టి కెప్టెన్ బాబర్ ఆజమ్ మీదే ఉంది. టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో సారథిగా.. బ్యాటర్‌గా ఆకట్టుకున్న బాబర్.. బంగ్లాతో సిరీస్‌లో మాత్రం ఓపెనర్‌గా విఫలం కావడమే ఇందుకు కారణం. మూడు టీ20 మ్యాచ్‌లలో కలిపి అతడు కేవలం 27 పరుగులు(7,1,19) మాత్రమే చేశాడు. దీంతో బాబర్ ఆట తీరును ట్రోల్ చేస్తూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ క్రమంలో టెస్టు మ్యాచ్ ఆరంభానికి ముందు మీడియాతో వర్చువల్‌గా సమావేశమైన బాబర్ తన ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని వ్యాఖ్యానించాడు. ‘‘నేను ప్రతిసారీ భారీగా పరుగులు రాబట్టాలని ఎక్కడా రాసి పెట్టలేదు కదా.. టీ20 సిరీస్‌లో తమ వంతు బాధ్యతను నెరవేర్చేందుకు ఎంతో మంది ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం నా దృష్టి మొత్తం టెస్టు సిరీస్ మీదే ఉంది. కచ్చితంగా మెరుగ్గా రాణిస్తాననే నమ్మకం ఉంది’’ అని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో.. ‘‘ఇటీవలి కాలంలో ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడుతున్నాం. వెంటనే టెస్టు ఫార్మాట్‌కు సిద్ధం కావడం సవాలే. టీ20 సిరీస్ తర్వాత పూర్తి స్థాయిలో టెస్టు మ్యాచ్‌లకు సన్నద్ధమయ్యే సమయం దొరకలేదు. అయితే, మా జట్టులో చాలా మందికి దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. కచ్చితంగా డబ్ల్యూటీసీలో మాదైన ముద్ర వేస్తాం’’ అని బాబర్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక స్వదేశంలో సిరీస్ జరుగనుండటం బంగ్లాదేశ్‌కు అనుకూలిస్తుందన్న అతడు.. సొంతగడ్డపై వాళ్లను ఓడించడం అంత తేలికేమీ కాదని పేర్కొన్నాడు. గట్టి పోటీ ఖాయమని చెప్పుకొచ్చాడు. చదవండి: India vs New Zealand Test: టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించిన రచిన్ రవీంద్ర... Shreyas Gopal: ప్రేయసిని పెళ్లాడిన శ్రేయస్.. ఫొటోలు వైరల్ -
Ban Vs Pak: ఇప్పటికే వైట్‌వాష్.. బంగ్లాదేశ్‌కు వరుస షాకులు.. ఈసారి
Ban Vs Pak: Shakib Al Hasan To Miss 1st Test Tamim Iqbal Ruled Out Of NZ Series: పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీ సందర్భంగా గాయపడిన స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో అతడు మొదటి టెస్టుకు దూరం కానుండగా.. రెండో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే పాకిస్తాన్‌తో స్వదేశంలో 3-0 తేడాతో వైట్‌వాష్‌కు గురై టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్... పర్యాటక జట్టుకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక నవంబరు 26 నుంచి మొదలయ్యే టెస్టు సిరీస్‌లోనైనా సత్తా చాటాలని భావిస్తుండగా.. షకీబ్ వంటి స్టార్ ఆటగాడు దూరం కావడం లోటుగా పరిణమించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలక్టర్ మిన్హాజుల్ అబెదిన్ మాట్లాడుతూ... ‘‘తొలి టెస్టులో షకీబ్ ఆడటం లేదు. గాయం(తొడ కండరాల నొప్పి) నుంచి తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఫిజియోథెరపిస్ట్ రిపోర్టు ఇచ్చిన తర్వాతే... తను రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడా లేడా అన్న విషయంపై స్పష్టత ఇవ్వగలము’’ అని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. మరో సీనియర్ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్ సైతం బొటనవేలి గాయం కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఎవరెస్టు ప్రీమియర్ లీగ్(సెప్టెంబరు- అక్టోబరు) సందర్భంగా అతడు గాయపడ్డాడు. ఇక పాకిస్తాన్‌తో పాటు... న్యూజిలాండ్‌తో సిరీస్‌కు సైతం అతడు అందుబాటులో ఉండటం లేదు. ఇక ఇప్పుడు పాక్‌తో సిరీస్‌కు షకీబ్ దూరం కావడంతో వరుస షాకులు తగినట్లయింది. పాకిస్తాన్‌తో తొలి టెస్టుకు బంగ్లాదేశ్ ప్రకటించిన జట్టు ఇదే: మొమినుల్ హక్(కెప్టెన్). షాద్మన్ ఇస్లాం, సైఫ్ హసన, నజ్ముల్ హుసేన్ షాంటో, ముష్పికర్ రహీమ్, లిటన్ కుమార్ దాస్, నురుల్ హసన్ సొహాన్, మెహది హసన్ మిరాజ్, నయీం హసన్, తైజుల్ ఇస్లాం, ఇబాదత్ హుసేన్ చౌదరి, అబు జాయేద్ చౌదరి రహీ, యాసిర్ అలీ రబ్బీ, మహ్మదుల్ హసన్ జాయ్, రేజూర్ రహమాన రాజా. చదవండి: KL Rahul: కివీస్‌తో టెస్టుకు ముందు బిగ్‌షాక్.. గాయంతో కేఎల్ రాహుల్ ఔట్ Bangladesh all-rounder Shakib Al Hasan will not be available for the first Test against Pakistan, starting from November 26 at the Zahur Ahmed Chowdhury Stadium in Chattogram due to a hamstring strain #BANvPAK #Cricket — Saj Sadiq (@SajSadiqCricket) November 23, 2021