బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్ అన్ని విధాల సన్నద్దమవుతోంది. రావల్పిండి వేదికగా ఆగస్టు 21 నుంచి జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టుకు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్, టాప్ ఆర్డర్ బ్యాటర్ కమ్రాన్ గులామ్‌లను జట్టు నుంచి పీసీబీ విడుదల చేసింది. వీరిద్దరూ బంగ్లాదేశ్ 'ఎ'తో ప్రారంభమయ్యే రెండవ నాలుగు రోజుల మ్యాచ్‌లో పాకిస్తాన్ షాహీన్స్ తరపున ఆడాలని పీసీబీ ఆదేశించింది.
అయితే ప్రధాన జట్టుకు ఎంపికైనప్పటకి తొలి టెస్టుకు ముందు గులామ్, ఆహ్మద్‌ను విడుదల చేయడాన్ని ఆ దేశ మాజీలు తప్పుబడుతున్నారు. ఈ జాబితాలో పాక్ మాజీ పేసర్ తన్వీర్ అహ్మద్ చేరాడు. పీసీబీ సలహాదారు వకార్ యూనిస్, పాక్ సెలక్షన్ కమిటీపై అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్తాన్ క్రికెట్‌లో ఏమి జరుగుతుందో మీరు చూస్తున్నారా? బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టుకు ముందు జట్టు నుంచి అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులామ్‌లను వకార్ యూనిస్ అండ్ సెలక్షన్ కమిటీ తప్పించింది.
వకార్ యూనిస్ పాక్ క్రికెట్‌ను నాశనం చేస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అబ్రార్, కమ్రాన్ గులామ్‌లను జట్టు నుండి తప్పించిన ఈ థర్డ్ క్లాస్ సెలక్షన్ కమిటీ సిగ్గుపడాలి.
అబ్రార్, కమ్రాన్ గులామ్‌లను జట్టు నుండి తొలగించిన ఈ థర్డ్ క్లాస్ సెలక్షన్ కమిటీ నిజంగా సిగ్గుపడాలి. తనను తాను పెద్ద లెజెండ్‌గా చెప్పుకుంటున్న వకార్ యూనిస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆ ఇద్దరు క్రికెటర్లను ఎందుకు జట్టు నుంచి రిలీజ్ చేశారని ఎక్స్‌లో వకార్ యూనిస్ మండిపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment