ఆసియాకప్-2023లో భాగంగా సూపర్-4 దశ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్‌లో లాహోర్ వేదికగా పాకిస్తాన్-బంగ్లాదేశ్ తలపడతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు పాక్ పేసర్లు షాహీన్ అఫ్రిది, నసీం షా, హారీస్ రౌఫ్ చుక్కలు చూపుతున్నారు. బంగ్లాదేశ్ 44 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అఫ్రిది, నసీం షా, రౌఫ్ తలా వికెట్ సాధించారు.
మొన్న సెంచరీ.. ఇప్పుడు తొలి బంతికే
ఇక ఆఫ్గానిస్తాన్‌తో లీగ్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన బంగ్లా ఓపెనర్ మెహిదీ హసన్ మిరాజ్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. తన ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డన్‌డక్‌గా వెనుదిరిగాడు. బంగ్లా ఇన్నింగ్స్ నసీం వేసిన రెండో ఓవర్‌లో.. మొదటి బంతిని మిడ్‌వికెట్ దిశగా ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ కనక్ట్ కాకపోవడంతో నేరుగా ఫఖర్ జమాన్ చేతికి వెళ్లింది.
భారత మ్యాచ్ ఎప్పుడంటే?
ఇక సూపర్-4లో భారత తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న కొలంబో వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహల్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. తొలుత ఆసియాకప్‌కు ప్రకటించిన జట్టులో రాహుల్ ఉన్నప్పటికీ.. పూర్తిఫిట్‌నెస్ సాధించకపోవడంతో భారత్‌లోనే ఉండిపోయాడు.
అయితే ఇప్ప్పుడు తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడంతో శ్రీలంకలో ఉన్న జట్టుతో కలిశాడు. ఇక పాకిస్తాన్‌తో లీగ్ మ్యాచ్‌లో విఫలమైన టాపర్డర్.. కనీసం సూపర్-4లో నైనా దాయాది దేశంపై రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
చదవండి: రోహిత్, కోహ్లిలను తీసేయరు కదా! కాబట్టి.. తుది జట్టులో అతడే బెటర్: గంభీర్
Comments
Please login to add a commentAdd a comment