Mehidy Hasan Miraz
-
బంగ్లా ఆల్‌రౌండర్ విశ్వరూపం.. సౌతాఫ్రికాకు షాకిచ్చేలా!
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ క్రికెటర్ మెహదీ హసన్ మిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో వికెట్లు(2) తీయడంతో పాటు బ్యాట్ ఝులిపిస్తూ సత్తా చాటుతున్నాడు ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. మిరాజ్ సూపర్ బ్యాటింగ్ కారణంగానే బంగ్లా ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుని మళ్లీ పోటీలోకి వచ్చే స్థితిలో నిలిచింది.106 పరుగులకే ఆలౌట్‌కాగా రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య సోమవారం ఢాకా వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ప్రొటిస్ బౌలర్ల ధాటికి నిలవలేక తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌట్ అయింది. 202 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికాసౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. డేన్ పీడ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 308 పరుగులు చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ కంటే 202 రన్స్ ఆధిక్యంలో నిలిచింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లోనూ బంగ్లాదేశ్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(1), వన్‌డౌన్ బ్యాటర్ మొమినుల్ హక్(0) పూర్తిగా విఫలమయ్యారు.ఈ దశలో మరో ఓపెనర్ మహ్మదుల్ హసన్ జాయ్ 40 పరుగులతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ షాంటో(23) అతడికి సహకరించాడు. సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం(33) స్థాయికి తగ్గట్లు ఆడలేక చతికిలపడగా.. వికెట్ కీపర్ లిటన్ దాస్ 7 పరుగులకే అవుటయ్యాడు.మిరాజ్ మిరాకిల్ఫలితంగా ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలయ్యే దుస్థితిలో బంగ్లాదేశ్ ఉన్న వేళ మెహదీ హసన్ మిరాజ్ ఆపద్భాందవుడిగా ఆదుకున్నాడు. ఏడోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు ఊహించని రీతిలో సౌతాఫ్రికా బౌలర్లకు షాకిచ్చాడు.తన బ్యాటింగ్ విశ్వరూపం ప్రదర్శిస్తూ.. అర్ధ శతకం పూర్తిచేసుకున్నాడు. బుధవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 171 బంతులు ఎదుర్కొని 87 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిరాజ్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ జాకిర్ అలీ సైతం హాఫ్ సెంచరీ(58)తో రాణించాడు.సరికొత్త రికార్డుఈ క్రమంలో వీరిద్దరు కలిసి సౌతాఫ్రికాపై సరికొత్త రికార్డు నెలకొల్పారు. 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక పార్ట్నర్షిప్ సాధించిన జోడీగా మెహదీ హసన్ మిరాజ్- జాకిర్ అలీ నిలిచారు. ఈ సందర్భంగా హబీబుల్ బషార్- జావేద్ ఒమర్(131 రన్స్) పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశారు.ఎట్టకేలకు లీడ్లోకిఇదిలా ఉంటే.. బుధవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి మిరాజ్ 87, నయీం హసన్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ 85 ఓవర్ల ఆటలో ఏడు వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసి.. 81 పరుగుల లీడ్‌లోకి వచ్చింది. ఇక బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో ప్రొటిస్ బౌలర్లలో కగిసో రబాడ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు. చదవండి: Ind vs NZ: అతడి ఆట తీరు బాగుంది.. అయినా..: గంభీర్ -
26 పరుగులకే 6 వికెట్లు.. బంగ్లా బ్యాటర్ల ప్రపంచ రికార్డు
రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ జట్టు పతనం అంచుల వరకు పోయి తిరిగి నిలదొక్కుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గౌరవప్రదమైన స్కోర్ దిశగా సాగుతుంది. లిటస్ దాస్ (86 నాటౌట్), మెహిది హసన్ మిరజ్ (78) ఏడో వికెట్‌కు 165 పరుగులు జోడించి బంగ్లాదేశ్ పతనాన్ని అడుకున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 30లోపు పరుగులకే 6 వికెట్లు కోల్పోయి అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా లిటన్-మిరజ్ జోడీ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 18 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా.. బొన్నర్-జాషువ డసిల్వ జోడీ ఏడో వికెట్‌కు 100 పరుగులు జోడించింది. లిటన్-మిరజ్ జోడీ 165 పరుగుల భాగస్వామ్యానికి ముందు ఇదే ప్రపంచ రికార్డుగా ఉండింది.మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు మూడో సెషన్ సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. లిటన్ దాస్ 88, హసన్ మహమూద్ ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు బంగ్లాదేశ్ ఇంకా 74 పరుగులు వెనుకపడి ఉంది. పాక్ పేసర్ ఖుర్రమ్ షెహజాద్ ఆరు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. మీర్ హమ్జా 2 వికెట్లు పడగొట్టాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్, మిరజ్‌తో పాటు షద్మాన్ ఇస్లాం (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. సైమ్ అయూబ్ (58), షాన్ మసూద్ (57), అఘా సల్మాన్ (54) అర్ద సెంచరీలతో రాణించారు. బ్యాట్‌తో రాణించిన మిరజ్ బంతితోనూ (5/61) చెలరేగాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3, నిహద్ రాణా, షకీబ్ అల్ హసన్ తలో వికెట్ పడగొట్టారు. -
CWC 2023: మెహిది హసన్ ఆల్‌రౌండ్ షో.. ఆఫ్ఘనిస్తాన్‌ను మట్టికరిపించిన బంగ్లాదేశ్
వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్ తొలి విజయం నమోదు చేసింది. ధర్మశాలలో ఇవాళ (అక్టోబర్ 7) జరిగిన మ్యాచ్‌లో బంగ్లా టైగర్లు ఆఫ్ఘనిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించారు. మెహిది హసన్ మీరజ్ ఆల్‌రౌండ్ షోతో (9-3-25-3, 57) అదరగొట్టి ఆఫ్ఘన్ల భరతం పట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. ఆఫ్ఘనిస్తాన్‌ను 156 పరుగులకే (37.2 ఓవర్లలో) మట్టికరిపించింది. మెహిది హసన్‌తో పాటు కెప్టెన్ షకీబ్ (8-0-30-3), షొరీఫుల్ ఇస్లాం (6.2-1-34-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముస్తాఫిజుర్ (7-1-28-1) కూడా పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ తీశాడు. తస్కిన్ అహ్మద్‌కు ఓ వికెట్ దక్కింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ గుర్బాజ్ అహ్మద్ (47)టాప్ స్కోరర్ కాగా.. ఇబ్రహీం జద్రాన్ (22), అజ్మతుల్లా (22), రెహ్మత్ షా (18), షాహీది (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. నజీబుల్లా (5), మొహమ్మద్ నబీ (6), రషీద్ ఖాన్ (9), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. 157 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆడుతూ పాడుతూ 34.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. బౌలింగ్‌లో అదరగొట్టిన మెహిది హసన్ బ్యాటింగ్‌లోనూ అర్ధసెంచరీ చేసి ఇరగదీశాడు. నజ్ముల్ హసన్ షాంటో (59 నాటౌట్) అజేయమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ తంజిద్ హసన్ (5), లిటన్ దాస్ (13), షకీబ్ అల్ హసన్ (14) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. షాంటో, ముష్ఫికర్ రహీం (2 నాటౌట్) బంగ్లాదేశ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హాక్, ఫజల్హక్ ఫారూకీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ తలో వికెట్ పడగొట్టగా.. తంజిద్ రనౌటయ్యాడు. -
Asia Cup 2023: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. హిట్‌మ్యాన్ డబుల్ సెంచరీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఆసియా కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 15) జరుగుతున్న మ్యాచ్‌లో మెహిది హసన్ మీరజ్ క్యాచ్ (వన్డేల్లో 91వ క్యాచ్) పట్టడం ద్వారా, హిట్‌మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లు) 200 క్యాచ్‌ల మార్కును అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్‌కు ముందు 34 మంది ఈ ఘనత సాధించారు. 449 మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్ 200 క్యాచ్‌లు ఆందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక క్యాచ్‌లు (వికెట్‌కీపర్ కాకుండా) అందుకున్న రికార్డు లంక దిగ్గజం మహేళ జయవర్ధనే పేరిట ఉంది. జయవర్ధనే 652 మ్యాచ్‌ల్లో మొత్తం 440 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్‌కు ముందు రాహుల్ ద్రవిడ్ (334), విరాట్ కోహ్లి (303), అజహారుద్దీన్ (261), టెండూల్కర్ (256) లాంటి భారత ఆటగాళ్లు ఉన్నారు. ఇదిలా ఉంటే, కొలొంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా పట్టుబిగించింది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి భారత్ ఆహ్వనం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్.. 34 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. షకీబ్ 80 పరుగులు చేసి బంగ్లాదేశ్‌ను ఆదుకున్నాడు. షకీబ్, తంజిద్ హసన్ (13), లిటన్ దాస్ (0), అనాముల్ హాక్ (4), మెహిది హసన్ (13) ఔట్ కాగా.. తౌహిద్ హ్రిదోయ్ (40), షమీమ్ హొస్సేన్ క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా.. షమీ, అక్షర్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
మొన్న మ్యాచ్‌లో సెంచరీ.. ఇప్పుడు తొలి బంతికే ఔట్! పాక్ బౌలర్లతో
ఆసియాకప్-2023లో భాగంగా సూపర్-4 దశ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్‌లో లాహోర్ వేదికగా పాకిస్తాన్-బంగ్లాదేశ్ తలపడతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు పాక్ పేసర్లు షాహీన్ అఫ్రిది, నసీం షా, హారీస్ రౌఫ్ చుక్కలు చూపుతున్నారు. బంగ్లాదేశ్ 44 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అఫ్రిది, నసీం షా, రౌఫ్ తలా వికెట్ సాధించారు. మొన్న సెంచరీ.. ఇప్పుడు తొలి బంతికే ఇక ఆఫ్గానిస్తాన్‌తో లీగ్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన బంగ్లా ఓపెనర్ మెహిదీ హసన్ మిరాజ్.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. తన ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డన్‌డక్‌గా వెనుదిరిగాడు. బంగ్లా ఇన్నింగ్స్ నసీం వేసిన రెండో ఓవర్లో.. మొదటి బంతిని మిడ్‌వికెట్ దిశగా ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ కనక్ట్ కాకపోవడంతో నేరుగా ఫఖర్ జమాన్ చేతికి వెళ్లింది. భారత మ్యాచ్ ఎప్పుడంటే? ఇక సూపర్-4లో భారత తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న కొలంబో వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహల్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. తొలుత ఆసియాకప్‌కు ప్రకటించిన జట్టులో రాహుల్ ఉన్నప్పటికీ.. పూర్తిఫిట్‌నెస్ సాధించకపోవడంతో భారత్‌లోనే ఉండిపోయాడు. అయితే ఇప్ప్పుడు తన ఫిట్నెస్ను నిరూపించుకోవడంతో శ్రీలంకలో ఉన్న జట్టుతో కలిశాడు. ఇక పాకిస్తాన్‌తో లీగ్ మ్యాచ్‌లో విఫలమైన టాపర్డర్.. కనీసం సూపర్-4లో నైనా దాయాది దేశంపై రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. చదవండి: రోహిత్, కోహ్లిలను తీసేయరు కదా! కాబట్టి.. తుది జట్టులో అతడే బెటర్: గంభీర్ -
భయపెట్టిన బంగ్లా బౌలర్‌ను ఉతికారేసిన అశ్విన్
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా మూడు వికెట్లు తేడాతో విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 70 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీనికి ప్రధాన కారణం బంగ్లా స్పిన్నర్ మెహదీ హసన్. టాపార్డర్‌ను కకావికలం చేసిన మెహదీ హసన్ ఐదు వికెట్లు తీసి టీమిండియాను భయపెట్టాడు. అతని ధాటికి ఒక దశలో టీమిండియా ఓడిపోయేలా కనిపించింది. కానీ భారత్‌ను గెలిపించే బాధ్యత తాము తీసుకున్నట్లుగా శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్‌లు ఆడారు. ఇక టీమిండియాను భయపెట్టిన మెహదీ హసన్ బౌలింగ్‌ను రవిచంద్రన్ అశ్విన్ ఉతికారేశాడు. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ అతని బంతులు ఎదుర్కోవడంలో విఫలమైతే.. అశ్విన్ మాత్రం మెహదీ హసన్‌ను ఊచకోత కోశాడు. టీమిండియా విజయానికి 16 పరుగులు అవసరమైన దశలో మెహదీ హసన్ మరోసారి బౌలింగ్‌కు వచ్చాడు. మెహదీ హసన్ వేసిన తొలి బంతినే ఒంటి చేత్తో భారీ సిక్సర్‌గా మలిచిన అశ్విన్ అతనికి గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. ఆ తర్వాత రెండు పరుగులు.. ఓవర్ ఐదు, ఆరు బంతులను ఫోర్లుగా మలిచి టీమిండియాను గెలిపించాడు. అలా టీమిండియాను భయపెట్టిన మెహదీ హసన్ బౌలింగ్‌లో 16 పరుగులు పిండుకొని బంగ్లా నుంచి విజయాన్ని లాక్కున్నాడు. 6,2,0,0,4,4 by Ashwin and won it for India, what an incredible batting by one of the great of Test cricket. pic.twitter.com/iQ6v8EKlXU — Johns. (@CricCrazyJohns) December 25, 2022 చదవండి: హమ్మయ్య గెలిచాం.. భారత్‌ను గెలిపించిన అయ్యర్, అశ్విన్ -
భారత్‌పై బంగ్లాదేశ్ బ్యాటర్ల సరి కొత్త చరిత్ర.. 17 ఏళ్ల రికార్డు బద్దలు
టీమిండియాతో రెండో వన్డేలో బంగ్లాదేశ్ బ్యాటర్లు మెహదీ హసన్ మిరాజ్, మహ్మదుల్లా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన బంగ్లా బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. సిరాజ్, వాషింగ్టన్ సందర్ బంతితో మ్యాజిక్ చేయడం వల్ల బంగ్లాదేశ్ కేవలం 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో బంగ్లాదేశ్‌ను మెహదీ హసన్ మిరాజ్, మహ్మదుల్లా అదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు ఏకంగా 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్ద్దరి అద్భుత ఇన్నింగ్స్‌ల ఫలితంగా బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో మెహిదీ హసన్ అజేయ శతకంతో మెరవగా.. మహ్మదుల్లా 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పిన వీరిద్దరూ పలు రికార్డులను బద్దలు కొట్టారు. మెహిదీ, మహ్మదుల్లా జోడీ సాధించిన రికార్డులు ఇవే ►భారత్‌తో వన్డేల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన బంగ్లాదేశ్ జోడీగా మెహదీ హసన్, మహ్మదుల్లా రికార్డులకెక్కారు. అంతకుముందు 2014 ఆసియాకప్‌లో అనముల్ హక్, ముష్ఫికర్ రహీమ్ 133 పరగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజా మ్యాచ్‌తో ఈ రికార్డును మెహిదీ,, మహ్మదుల్లా జోడీ బద్దలు కొట్టింది. ►భారత్‌పై వన్డేల్లో 7వ వికెట్‌కు అత్యధిక నెలకొల్పిన జోడిగా మెహదీ హసన్, మహ్మదుల్లా నిలిచారు. అంతకముందు 2005లో దంబుల్లా వేదికగా జరిగిన వన్డేలో శ్రీలంక బ్యాటర్లు మహేల జయవర్ధనే, ఉపుల్ చందనా ఏడో వికెట్‌కు 126 పరుగుల పార్టనర్షిప్ నమోదు చేశారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజమ్యాచ్లో ఈ 17 ఏళ్ల రికార్డును హసన్, మహ్మదుల్లా బ్రేక్ చేశారు. ►ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన మెహిదీ.. 8 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. అంతుకముందు 2021లో దక్షిణాఫ్రికాతో వన్డేలో ఐర్లాండ్ బ్యాటర్ సిమీ సింగ్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి శతకం బాదాడు. చదవండి: IND vs BAN: మొన్న విలన్.. ఈ రోజు హీరో.. రాహుల్ స్టన్నింగ్ క్యాచ్! వీడియో వైరల్ -
ఈజీగా గెలుస్తామనుకున్నాం.. కానీ సిరాజ్, శార్దూల్ వల్ల..
India tour of Bangladesh, 2022- Bangladesh vs India, 1st ODI: బంగ్లాదేశ్ లక్ష్యం 187 పరుగులు... ఒకదశలో 136/9... మరో వికెట్ తీస్తే తొలి వన్డే భారత్‌దే. కానీ మెహదీ హసన్, ముస్తఫిజుర్ టీమిండియాకు షాక్ ఇచ్చారు. 41 బంతుల్లోనే అభేద్యంగా 51 పరుగులు జోడించి తమ జట్టును గెలిపించారు. బౌలర్లు చివరి వికెట్ తీయలేకపోయినా... బ్యాటింగ్ వైఫల్యమే భారత్ పరాజయానికి కారణం. పేలవ ఆటతో పూర్తి ఓవర్లు కూడా ఆడలేక 186 పరుగులకు కుప్పకూలడంతో ఓటమికి బాట పడింది. కేఎల్ రాహుల్ మినహా ఏ ఒక్కరూ ప్రభావం చూపలేకపోగా, షకీబ్ 5 వికెట్లతో, ఇబాదత్ 4 వికెట్లతో భారత జట్టును పడగొట్టారు. తద్వారా ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ మాట్లాడుతూ.. భారత బౌలర్లపై ప్రశంసలు కురిపించడం విశేషం. లక్ష్య ఛేదన సులువు అనుకున్న తరుణంలో టీమిండియా బౌలర్లు మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ రాణించిన తీరును అమోఘమంటూ కొనియాడాడు. ‘‘ఈ మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నేను, షకీబ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సులభంగానే విజయం సాధిస్తామని భావించాను. అయితే, సిరాజ్, శార్దూల్ మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ను వాళ్లవైపు తిప్పేశారు. మేమిద్దరం అవుటైన తర్వాత గెలుపు కష్టమనిపించింది. భారత బౌలర్లు విజృంభించిన తీరు టెన్షన్‌కు గురిచేసింది. అయితే, మెహదీ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆఖర్లో 6-7 ఓవర్లలో అతడు బ్యాటింగ్ చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయా’’ అని లిటన్ దాస్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో సిరాజ్ 3, శార్దూల్ ఠాకూర్ ఒకటి, వాషింగ్టన్ సుందర్ 2, అరంగేట్ర బౌలర్ కుల్దీప్ సేన్ 2, దీపక్ చహర్ ఒక వికెట్ తీశారు. మ్యాచ్ సాగిందిలా... రాహుల్ మినహా... అటు స్పిన్‌కు, ఇటు బౌన్స్‌కు అనుకూలించిన పిచ్ పై బంగ్లా బౌలర్లు షకీబ్, ఇబాదత్ పండగ చేసుకున్నారు. ముస్తఫిజుర్ వేసిన ‘మెయిడిన్’తో భారత ఇన్నింగ్స్ మొదలు కాగా, శిఖర్ ధావన్ (7) వైఫల్యం కొనసాగింది. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ (31 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లేలో భారత్ స్కోరు 48 పరుగులకు చేరింది. అయితే షకీబ్ తన తొలి ఓవర్లోనే రోహిత్, కోహ్లి (9)లను అవుట్ చేసి భారత్‌ను దెబ్బ కొట్టాడు. ఈ దశలో జట్టును రాహుల్ ఆదుకున్నాడు. అయ్యర్ (39 బంతుల్లో 24; 2 ఫోర్లు), సుందర్ (19) కొద్దిసేపు అతనికి సహకరించారు. మిరాజ్ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదిన రాహుల్, ఇబాదత్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 49 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే వరుస ఓవర్లలో సుందర్, షహబాజ్ (0) వెనుదిరగ్గా, ఆ తర్వాత షకీబ్ మరోసారి ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇబాదత్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన అనంతరం 9వ వికెట్‌గా రాహుల్ అవుట్ కావడంతో భారత్ 200 పరుగుల మార్క్‌ను కూడా చేరలేకపోయింది. రాణించిన సిరాజ్... ఇన్నింగ్స్ తొలి బంతికే నజ్ముల్ (0)ను అవుట్ చేసి చహర్ శుభారంభమిచ్చాడు. అయితే తర్వాతి బ్యాటర్లు తలా ఓ చేయి వేయడంతో బంగ్లా సులువుగానే లక్ష్యం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. దాస్, షకీబ్ (38 బంతుల్లో 29; 3 ఫోర్లు) బాధ్యత గా ఆడారు. వీరిద్దరిని సుందర్ అవుట్ చేసినా... ఒకదశలో 128/4తో బంగ్లా సురక్షిత స్థితిలోనే ఉంది. చేతిలో 6 వికెట్లతో మరో 91 బంతుల్లో 59 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. అయితే ఈ దశలో సిరాజ్, శార్దుల్, కుల్దీప్ సేన్ ఒక్కసారిగా విజృంభించడంతో బంగ్లాదేశ్ 26 బంతుల వ్యవధిలో 8 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. అద్భుత భాగస్వామ్యం... బంగ్లా 9వ వికెట్ కోల్పోయాక గెలుపు సమీకరణం 63 బంతుల్లో 51 పరుగులుగా ఉంది. చివరి వికెట్ కాబట్టి భారత్ గెలుపు లాంఛనమే అనిపించింది. అయితే మెహదీ అపార పట్టుదలను కనబర్చాడు. కీలక సమయంలో ముస్తఫిజుర్ (11 బంతుల్లో 10 నాటౌట్; 2 ఫోర్లు) నుంచి అతనికి సరైన సహకారం లభించింది. సేన్ ఓవర్లో రెండు సిక్సర్లతో ఆశలు పెంచిన మెహదీ, చహర్ ఓవర్లోనూ 3 ఫోర్లు కొట్టి లక్ష్యానికి చేరువ చేశాడు. చహర్ తర్వాతి ఓవర్ చివరి బంతికి సింగిల్ రావడంతో బంగ్లా శిబిరం సంబరాల్లో మునిగిపోయింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం జరుగుతుంది. చదవండి: KL Rahul: అతడిని ఎందుకు తప్పించారో తెలీదు! పంత్ దరిద్రం నీకు పట్టుకున్నట్టుంది! బాగా ఆడినా.. ఇదేం పోయే కాలమో! Saina Nehwal: తన మొహం కూడా చూడనంటూ పెదవి విరుపులు! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా.. -
Ind Vs Ban: రాహుల్ తప్పేం లేదు! భారత్ ఓటమికి కారణం వాళ్లే: టీమిండియా దిగ్గజం
India tour of Bangladesh, 2022- Bangladesh vs India, 1st ODI: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు భారత మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ అండగా నిలిచాడు. రోహిత్ సేన ఓటమికి రాహుల్‌ను తప్పుపట్టడం సరికాదని అభిప్రాయపడ్డాడు. నిజానికి భారత్ తక్కువ స్కోరుకే పరిమితం కావడం ప్రభావం చూపిందని, ఈ విషయాన్ని అందరూ గమనించాలని పేర్కొన్నాడు. గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో.. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా మొదటి వన్డేలో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆదివారం నాటి లో స్కోరింగ్ మ్యాచ్‌లో భారత్ ఒక్క వికెట్ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. వాస్తవానికి... లక్ష్య ఛేదనలో భాగంగా బంగ్లా 9వ వికెట్ కోల్పోయాక గెలుపు సమీకరణం 63 బంతుల్లో 51 పరుగులుగా ఉన్న తరుణంలో.. చివరి వికెట్ కాబట్టి భారత్ గెలుపు లాంఛనమే అనిపించింది. అయితే బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ అపార పట్టుదల కనబర్చాడు. కీలక సమయంలో ముస్తఫిజుర్ (11 బంతుల్లో 10 నాటౌట్; 2 ఫోర్లు) రాణించడంతో టీమిండియాపై బంగ్లా పైచేయి సాధించగలిగింది. తద్వారా తొలి వన్డేలో గెలుపొంది సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. రాహుల్ క్యాచ్ పట్టి ఉంటే... ఇదిలా ఉంటే.. బంగ్లా మరో 32 పరుగులు చేయాల్సిన దశలో మెహదీ కొట్టిన షాట్ గాల్లోకి బాగా పైకి లేచింది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ వెనక్కి పరుగెడుతూ దాదాపు డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్‌లెగ్ వరకు వెళ్లినా... క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో రాహుల్ గనుక ఆ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం వేరేగా ఉండేందంటూ అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా అతడిని ట్రోల్ చేశారు టీమిండియా అభిమానులు. అదే విధంగా భారత బౌలర్ల తీరును విమర్శించారు. రాహుల్ తప్పేం లేదు.. తప్పంతా వాళ్లదే! ఈ నేపథ్యంలో బంగ్లా చేతిలో భారత జట్టు ఓటమిపై దిగ్గజ ఆటగాడు సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘మన బౌలర్లు అద్భుతంగా రాణించారు. 136 పరుగులకే 9 వికెట్లు కూల్చి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. అలాంటి సమయంలో మిరాజ్ ఇచ్చిన క్యాచ్ డ్రాప్ అయింది. అదృష్టం వల్ల అతడు తప్పించుకోగలిగాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నిజానికి భారత జట్టు మరో 70- 80 పరుగులు చేయాల్సింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి అదే ప్రధాన కారణం అనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. క్యాచ్ వదిలేసిన కారణంగా రాహుల్‌ను తప్పు పట్టాల్సిన పనిలేదని, అలాగే బౌలర్లు కూడా తమ వంతు ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చాడు. బ్యాటర్లు మెరుగ్గా రాణించి ఉంటే ఫలితం వేరేగా ఉండేదని సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో అందరికంటే మెరుగైన ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్(73 పరుగులు) కీపింగ్‌లో ఒక తప్పుతో విమర్శలపాలు కావడం గమనార్హం. చదవండి: మా ఓటమికి కారణం అదే.. కానీ వారు అద్భుతంగా పోరాడారు: రోహిత్ శర్మ Cristiano Ronaldo: మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన? We lost here..#KLRahul #INDvsBANpic.twitter.com/Qfr5Os4PbM — Tanay Vasu (@tanayvasu) December 4, 2022