వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్ తొలి విజయం నమోదు చేసింది. ధర్మశాలలో ఇవాళ (అక్టోబర్ 7) జరిగిన మ్యాచ్‌లో బంగ్లా టైగర్లు ఆఫ్ఘనిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించారు. మెహిది హసన్ మీరజ్ ఆల్‌రౌండ్ షోతో (9-3-25-3, 57) అదరగొట్టి ఆఫ్ఘన్ల భరతం పట్టాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. ఆఫ్ఘనిస్తాన్‌ను 156 పరుగులకే (37.2 ఓవర్లలో) మట్టికరిపించింది. మెహిది హసన్‌తో పాటు కెప్టెన్ షకీబ్ (8-0-30-3), షొరీఫుల్ ఇస్లాం (6.2-1-34-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముస్తాఫిజుర్ (7-1-28-1) కూడా పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ తీశాడు. తస్కిన్ అహ్మద్‌కు ఓ వికెట్ దక్కింది.
ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ గుర్బాజ్ అహ్మద్ (47)టాప్ స్కోరర్ కాగా.. ఇబ్రహీం జద్రాన్ (22), అజ్మతుల్లా (22), రెహ్మత్ షా (18), షాహీది (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. నజీబుల్లా (5), మొహమ్మద్ నబీ (6), రషీద్ ఖాన్ (9), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
157 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆడుతూ పాడుతూ 34.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. బౌలింగ్‌లో అదరగొట్టిన మెహిది హసన్ బ్యాటింగ్‌లోనూ అర్ధసెంచరీ చేసి ఇరగదీశాడు. నజ్ముల్ హసన్ షాంటో (59 నాటౌట్) అజేయమైన హాఫ్ సెంచరీతో రాణించాడు.
బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ తంజిద్ హసన్ (5), లిటన్ దాస్ (13), షకీబ్ అల్ హసన్ (14) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. షాంటో, ముష్ఫికర్ రహీం (2 నాటౌట్) బంగ్లాదేశ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హాక్, ఫజల్‌హక్ ఫారూకీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ తలో వికెట్ పడగొట్టగా.. తంజిద్ రనౌటయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment