![Mehidy Hasan To Lead In West Indies ODIs In Najmul Absence](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/2/k_3.jpg.webp?itok=bj_D-xV8)
వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (డిసెంబర్ 2) ప్రకటించారు. రెగ్యులర్ కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ సిరీస్‌కు బంగ్లా కెప్టెన్‌గా మెహిది హసన్ మిరాజ్ వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్ జట్టును గాయాల సమస్య వేధిస్తుంది.
సీనియర్ ఆటగాళ్లు ముష్ఫికర్ రహీం, తౌహిద్ హ్రిదోయ్ గాయాల కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. ఈ సిరీస్‌కు ముస్తాఫిజుర్ రహ్మాన్, జకీర్ హసన్‌ను ఎంపిక చేయలేదు. ముస్తాఫిజుర్ తన భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుండటంతో స్వదేశానికి వెళ్లనున్నాడు.
ఫామ్ లేమి కారణంగా జకీర్ హసన్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఈ జట్టులో వికెట్‌కీపర్ బ్యాటర్ లిటన్ దాస్, పర్వేజ్ హొసేన్ ఎమోన్, అఫీఫ్ హొసేన్ ధృబో, హసన్ మహమూద్, తంజిమ్ హసన్ సకీబ్ చోటు దక్కించుకున్నారు. సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. విండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ డిసెంబర్ 8, 10, 12 తేదీల్లో సెయింట్స్ కిట్స్ వేదికగా జరుగనుంది.
విండీస్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు..
మెహిది హసన్ మిరాజ్ (కెప్టెన్), లిటన్ కుమార్ దాస్ (వికెట్‌కీపర్), తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, మహముదుల్లా, జాకర్ అలీ అనిక్, అఫీఫ్ హొస్సేన్ ధృబో, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, షొరీఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సకిబ్, నహిద్ రాణా
Comments
Please login to add a commentAdd a comment