Najmul Hossain Shanto
-
విండీస్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లా జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా మెహిది హసన్
వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (డిసెంబర్ 2) ప్రకటించారు. రెగ్యులర్ కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ సిరీస్‌కు బంగ్లా కెప్టెన్‌గా మెహిది హసన్ మిరాజ్ వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్ జట్టును గాయాల సమస్య వేధిస్తుంది.సీనియర్ ఆటగాళ్లు ముష్ఫికర్ రహీం, తౌహిద్ హ్రిదోయ్ గాయాల కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. ఈ సిరీస్‌కు ముస్తాఫిజుర్ రహ్మాన్, జకీర్ హసన్‌ను ఎంపిక చేయలేదు. ముస్తాఫిజుర్ తన భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుండటంతో స్వదేశానికి వెళ్లనున్నాడు. ఫామ్ లేమి కారణంగా జకీర్ హసన్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఈ జట్టులో వికెట్‌కీపర్ బ్యాటర్ లిటన్ దాస్, పర్వేజ్ హొసేన్ ఎమోన్, అఫీఫ్ హొసేన్ ధృబో, హసన్ మహమూద్, తంజిమ్ హసన్ సకీబ్ చోటు దక్కించుకున్నారు. సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. విండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ డిసెంబర్ 8, 10, 12 తేదీల్లో సెయింట్స్ కిట్స్ వేదికగా జరుగనుంది.విండీస్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు..మెహిది హసన్ మిరాజ్ (కెప్టెన్), లిటన్ కుమార్ దాస్ (వికెట్‌కీపర్), తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, మహముదుల్లా, జాకర్ అలీ అనిక్, అఫీఫ్ హొస్సేన్ ధృబో, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, షొరీఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సకిబ్, నహిద్ రాణా -
మెరిసిన షాంటో.. అఫ్గాన్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్... రెండో మ్యాచ్‌లో సత్తా చాటింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం షార్జా వేదికగా జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ 68 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై గెలుపొందింది. ఫలితంగా సిరీస్ 1–1తో సమమైంది.టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిరీ్ణత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నజ్ముల్ షంటో (119 బంతుల్లో 76; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధసెంచరీ నమోదు చేయగా... సౌమ్య సర్కార్ (35), జాకీర్ అలీ (37 నాటౌట్; ఒక ఫోర్, 3 సిక్సర్లు), నసుమ్ అహ్మద్ (25; ఒక ఫోర్, రెండు సిక్సర్లు) రాణించారు. తన్జిద్ హసన్ (22), మెహది హసన్ మిరాజ్ (22) కూడా ఫర్వాలేదనిపించారు అఫ్గాన్ బౌలర్లలో నంగెయాలియా ఖరోటె 3, రషీద్ ఖాన్ ఘజన్ఫర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్తాన్ 43.3 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. రహమత్ షా (76 బంతుల్లో 52; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించగా... సెదిఖుల్లా అటల్ (39; 5 ఫోర్లు), గుల్బదిన్ నైబ్ (26; 4 ఫోర్లు, ఒక సిక్సర్) తలా కొన్ని పరుగులు చేశారు. గత మ్యాచ్‌లో స్ఫూర్తివంతమైన ప్రదర్శన కనబర్చిన అఫ్గాన్ బ్యాటర్లు ఈ సారి అదే జోష్ కొనసాగించలేకపోయారు. రహామనుల్లా గుర్బాజ్ (2), అజ్మతుల్లా (0), హష్మతుల్లా (17), మొహమ్మద్ నబీ (17), రషీద్ ఖాన్ (14) విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో నసుమ్ అహ్మద్ 3... ముస్తఫిజుర్ రహమాన్, మెహదీ హసన్ మిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే సోమవారం ఇక్కడే జరగనుంది. -
Ban vs Afg ODIs: బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా అతడే
అఫ్గనిస్తాన్‌తో వన్డేలకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో పాల్గొననున్న పదిహేను మంది సభ్యుల పేర్లను శనివారం వెల్లడించింది. ఈ క్రమంలో నజ్ముల్ హుసేన్ షాంటోనే కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు స్పష్టమైంది. కాగా ఇటీవల పాకిస్తాన్ గడ్డపై చారిత్రాత్మక టెస్టు సిరీస్ సాధించిన బంగ్లాదేశ్ సారథిగా రికార్డులకెక్కాడు షాంటో.టెస్టులకు, టీ20లకు వేరే కెప్టెన్లు!అయితే, ఆ తర్వాత భారత పర్యటనలో టెస్టుల్లో 2-0తో క్లీన్‌స్వీప్ సహా.. స్వదేశంలో సౌతాఫ్రికాలో చేతిలోనూ టెస్టు సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్‌కు గురైంది బంగ్లాదేశ్. ఈ నేపథ్యంలో షాంటో కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, బంగ్లా బోర్డు అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ షాంటో వన్డే సారథిగా కొనసాగేలా ఒప్పించినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడినే సారథిగా కొనసాగిస్తున్నట్లు తాజా ప్రకటనతో వెల్లడైంది. మరోవైపు.. టెస్టులకు మెహదీ హసన్ మిరాజ్, టీ20లకు టస్కిన్ అహ్మద్ లేదంటే తౌహీద్ హృదోయ్ సారథ్యం వహించనున్నట్లు తెలుస్తోంది.అఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ పర్యటనఇదిలా ఉంటే.. వన్డే సిరీస్ ఆడేందుకు అఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ పర్యటనకు రానుంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య షార్జా వేదికగా నవంబరు 6, నవంబరు 9, నవంబరు 11 తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత కాలమానం ప్రకారం బంగ్లా- అఫ్గన్ మ్యాచ్‌లు సాయంత్రం ఐదు గంటలకు ఆరంభం కానున్నాయి.ఇక.. అఫ్గన్‌తో వన్డే సిరీస్ ఆడే జట్టులో పేసర్ సషీద్ రాణా తొలిసారి చోటు దక్కించుకోగా.. లిటన్ దాస్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక తంజీమ్ అహ్మద్ సైతం భుజం నొప్పి వల్ల విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే, సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సెలక్షన్‌కు అందుబాటులో ఉండలేదని బంగ్లా బోర్డు అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ తెలిపాడు.అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుసౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, జకీర్ హసన్, నజ్ముల్ హుసేన్ షాంటో(కెప్టెన్), ముష్ఫికర్ రహీం, మహ్మదుల్లా రియాద్, తౌహీద్ హృదోయ్, జాకెర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్(వైస్ కెప్టెన్), రిషాద్ హొసేన్, నసూం అహ్మద్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, నషీద్ రాణా. -
బాధ్యతల నుంచి తప్పుకోనున్న బంగ్లాదేశ్ కెప్టెన్
బంగ్లాదేశ్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్ నజ్ముల్ హొసేన్ షాంటో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ అనంతరం షాంటో కెప్టెన్సీ నుంచి వైదొలుగుతాడని సమాచారం. ఈ విషయాన్ని షాంటో ఇదివరకే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తెలియజేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బీసీబీ అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ విదేశాల్లో ఉన్నందున ఈ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. షాంటోను ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా నియమించారు. షాంటో ఏడాది పాటు కెప్టెన్‌గా కొనసాగుతాడని అప్పట్లో బీసీబీ వెల్లడించింది. అయితే షాంటో ఏడాది కూడా పూర్తి కాకుండానే కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. షాంటో 2024 టీ20 వరల్డ్‌కప్ అనంతరమే కెప్టెన్సీ నుంచి వైదొలగాలని అనుకున్నాడు. అయితే అప్పట్లో అది కుదరలేదు. షాంటో కెప్టెన్సీ నుంచి వైదొలిగాక మెహిది హసన్ మిరాజ్ టెస్ట్, వన్డేలకు.. తౌహిద్ హ్రిదోయ్ టీ20లకు కెప్టెన్లుగా ఎంపిక కావచ్చు. షాంటో బంగ్లాదేశ్‌ను తొమ్మిది టెస్ట్‌ల్లో (మూడు విజయాలు, ఆరు పరాజయాలు), తొమ్మిది వన్డేల్లో (మూడు విజయాలు, ఆరు పరాజయాలు), 24 టీ20ల్లో (10 విజయాలు, 14 పరాజయాలు) ముందుండి నడిపించాడు. షాంటో సారథ్యంలో బంగ్లాదేశ్ ఇటీవల పాక్‌పై టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించింది. -
టీమిండియాతో టీ20 సిరీస్ విజయం మాదే: బంగ్లా కెప్టెన్
టీమిండియాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన బంగ్లాదేశ్.. ఇప్పుడు అదే జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్దమైంది. ఆక్టోబర్ 6న గ్వాలియర్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్వాలియర్‌కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.మొదటి టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు తమ వ్యూహాలను రచిస్తున్నాయి. కాగా తొలి టీ20కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ఈ సందర్భంగా భారత్‌పై టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంటామని శాంటో థీమా వ్యక్తం చేశాడు."భారత్‌తో టీ20 సిరీస్‌కు మేము అన్ని విధాల సన్నద్దమయ్యాం. ఈ సిరీస్‌ను గెలిచేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తాము. దూకుడుగా ఆడాలనుకుంటున్నాము. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరేందుకు మాకు మంచి అవకాశం లభించింది. కానీ దురదృష్టవశాత్తూ మేము సెమీస్‌కు చేరుకోలేకపోయాము.మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లందరూ భారత్‌పై సత్తాచాటుతారని భావిస్తున్నాను. మేము భారత్‌తో టెస్ట్‌లలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం. మేము ప్రస్తుతం ఆ విషయం గురించి ఆలోచించడం లేదు. టెస్టు క్రికెట్‌కు టీ20 పూర్తిగా భిన్నం. ఆ రోజున ఎవరూ మెరుగైన ప్రదర్శన చేస్తే వారిదే విజయమని" షాంటో పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2024: ఓపెనర్లే కొట్టేశారు.. వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా బోణీ -
Ind vs Ban: బంగ్లాపై భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్
Ind vs Ban 2ndTest Day 5 Updates: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా గెలుపొందింది. కాన్పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్ విజయం సాధించింది.టీమిండియా టార్గెట్ 95 రన్స్రెండో వికెట్ కోల్పోయిన టీమిండియాగిల్(6) రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో గిల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. జైస్వాల్ 20 పరుగులతో ఆడుతున్నాడు. కోహ్లి క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 35/2 (5)రోహిత్ శర్మ అవుట్2.1: బంగ్లాదేశ్ విధించిన 95 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ హసన్ మహమూద్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కేవలం 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శుబ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. రోహిత్ సేన టార్గెట్ ఎంతంటేరెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను టీమిండియా 146 పరుగులకు ఆలౌట్ చేసింది. భోజన విరామ సమయానికి బంగ్లా ఆట కట్టించి.. విజయానికి బాట వేసుకుంది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే బంగ్లాదేశ్ కేవలం 94 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అంటే.. రోహిత్ సేన టార్గెట్ 95.తొమ్మిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్బుమ్రా బౌలింగ్‌లో తైజుల్ ఇస్లాం(0) తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. వికెట్ల ముందు అతడిని దొరకబుచ్చుకున్న బుమ్రా డకౌట్‌గా వెనక్కి పంపాడు. బంగ్లాదేశ్ స్కోరు: 130/9 (40.5). ఖలీద్ అహ్మద్ క్రీజులోకి వచ్చాడు. ముష్ఫికర్ 27 పరుగలతో ఆడుతున్నాడు.ఎనిమిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్మెహదీ హసన్ మిరాజ్ రూపంలో బంగ్లాదేశ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో మిరాజ్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌చేరాడు. బంగ్లా స్కోరు: 118/8 (36.5) . తైజుల్ ఇస్లాం క్రీజులోకి వచ్చాడు. ముష్ఫికర్ రహీం 15 పరుగులతో ఆడుతున్నాడు.ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్జడేజా బౌలింగ్‌లో షకీబ్ అల్ హసన్ ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. బంగ్లా స్కోరు: 94-7 (32 ఓవర్లు). ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్జడేజా బౌలింగ్ లిటన్ దాస్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కేవలం ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. బంగ్లా స్కోరు: 94-6(30)ఐదో వికెట్ డౌన్ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో హాఫ్ సెంచరీ వీరుడు షాద్మన్ ఇస్లాం(50) జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో బంగ్లా ఐదో వికెట్ కోల్పోయింది. లిటన్ దాస్ క్రీజులోకి వచ్చాడు. ముష్ఫికర్ ఒక పరుగుతో ఆడుతున్నాడు. బంగ్లా స్కోరు: 94/5 (29).నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్జడేజా బౌలింగ్‌లో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ షాంటో బౌల్డ్ అయ్యాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ముష్ఫికర్ రహీం క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం 49 పరుగులతో ఆడుతున్నాడు. బంగ్లా స్కోరు: 92/4 (27.5).నిలకడగా ఆడుతున్న షాద్మన్25 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు 87-3. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం 47 పరుగులతో నిలకడగా ఆడుతుండగా.. షాంటో 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్తమ రెండో ఇన్నింగ్స్‌లో 26/2(11) ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట మొదలుపెట్టిన బంగ్లాదేశ్ ఆదిలోనే మరో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో మొమినుల్ హక్(2) కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ నజ్ముల్ హొసేన్ షాంటో క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం 15 పరుగులతో ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ స్కోరు: 36-3(14 ఓవర్లలో). భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టువేదిక:గ్రీన్ పార్క్ స్టేడియం, కా న్పూర్టాస్: భారత్.. బౌలింగ్బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 233భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 285/9 డిక్లేర్డ్టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా రెండో టెస్టు ఐదో రోజు ఆట మొదలైంది. కాగా సోమవారం నాటి ఆటలో రోహిత్ సేన మెరుపు వేగంతో పరుగులు సాధించి.. డ్రా అవుతుందేమోనన్న మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ముందడుగు వేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 34.4 ఓవర్లలో 9 వికెట్లకు 285 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ ఆట కట్టించే క్రమంలో ఆఖరి రోజు వికెట్ల వేటను మొదలు పెట్టి శుభారంభం అందుకుంది.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్బంగ్లాదేశ్షాద్మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్. -
Ind vs Ban 2nd Test: అభిమానులకు బ్యాడ్‌న్యూస్
India vs Bangladesh, 2nd Test Day 2 Updates: క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!!... టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆటకూ వరణుడు ఆటంకం కలిగించాడు. వర్షం కారణంగా శనివారం నాటి ఆట ఒక్క బంతి పడకుండానే ముగిసిపోయింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ‘ఎక్స్’ ద్వారా ఈ మేరకు అప్డేట్ అందించింది. వర్షం తగ్గుముఖం పట్టినా.. అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేశారు. లంచ్‌బ్రేక్ సమయానికీ మొదలుకాని ఆటవర్షం తగ్గినా మైదానంలో కప్పిన కవర్లు మాత్రం తీయలేదు. మరికాసేపు వేచి చూసి.. వాన రాకపోతే.. కవర్లు తీసే అవకాశం ఉందని తెలుస్తోందిఆట ఆలస్యంకాగా మైదానం కవర్లతో కప్పబడి ఉండగా.. అంపైర్లు వెళ్లి పిచ్‌ను పరిశీలించారు. అయితే, ఇప్పట్లో ఆట మొదలయ్యే పరిస్థితి మాత్రం కనబడటం లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. తొలిరోజు కూడా అంతరాయమేచెన్నైలో జరిగిన తొలి టెస్టులో బంగ్లాను 280 పరుగుల తేడాతో మట్టికరిపించిన రోహిత్ సేన.. కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో శుక్రవారం రెండో టెస్టు మొదలుపెట్టింది. అయితే, వర్షం కారణంగా అవుట్‌ఫీల్డ్ చిత్తడిగా మారటంతో తొలి రోజు ఆట కూడా ఆలస్యంగా ప్రారంభమైంది.ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని.. నజ్ముల్ షాంటో బృందాన్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే, వాన కారణంగా తొలి రోజు ఆట 35 ఓవర్ల వద్దే ముగిసిపోయింది. అంపైర్లు ఆటను నిలిపివేసే సమయానికి బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.మొదటి రోజు ఆకాశ్‌కు రెండు వికెట్లుఓపెనర్ జకీర్ హసన్(0)ను భారత పేసర్ ఆకాశ్ దీప్ డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(24) వికెట్‌ను సైతం ఆకాశ్ తన ఖాతాలోనే వేసుకోగా.. కెప్టెన్ నజ్ముల్ షాంటో(31)ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి వన్‌డౌన్ బ్యాటర్ మొమినుల్ హక్ 40, ముష్ఫికర్ రహీం 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు తుదిజట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్బంగ్లాదేశ్షాద్మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
Ind vs Ban: ముగిసిన మూడో రోజు ఆట.. బంగ్లా @158/4
India vs Bangladesh, 1st Test Chennai Day 3 Updates: వెలుతురులేమి కారణంగా శనివారం అరగంట ముందుగానే ఆటను ముగించారు. అప్పటికి 37.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. విజయానికి 357 పరుగుల దూరంలో ఉంది. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ షాంటో 51 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకు ఒకటి, రవిచంద్రన్ అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అంతకు ముందు 287/4 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా.. బంగ్లాకు 515 పరుగుల టార్గెట్ విధించింది. శుబ్‌మన్ గిల్(119 నాటౌట్), రిషభ్ పంత్(109) శతకాలతో అదరగొట్టారు.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు (సెప్టెంబరు 19- 23)టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 376బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 149టీమిండియా రెండో ఇన్నింగ్స్- 287/4 డిక్లేర్డ్బంగ్లాదేశ్ లక్ష్యం- 515 పరుగులు33.4:నాలుగో వికెట్ డౌన్ముష్ఫికర్ రహీం రూపంలో బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ముష్ఫికర్ పెవిలియన్‌చేరాడు. బంగ్లా స్కోరు: 146/4 (33.4) . లక్ష్యానికి ఇంకా 369 పరుగుల దూరంలో ఉంది.29.6: మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్అశ్విన్ బౌలింగ్‌లో మూడో వికెట్‌గా మొమినుల్ హక్(13) వెనుదిరిగాడు. క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ముష్ఫికర్ హీం క్రీజులోకి వచ్చాడు. షాంటో 36 పరుగులతో ఆడుతున్నాడు. రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్అశ్విన్ బౌలింగ్‌లో షాద్మన్ ఇస్లాం(35) గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొమినుల్ హక్ క్రీజులోకి వచ్చాడు. నజ్ముల్ షాంటో 14 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 86-2.16.2: తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్బుమ్రా బౌలింగ్‌లో జకీర్ హసన్ 33 పరుగుల వద్ద నిష్క్రమించాడు. షాద్మన్ ఇస్లాం 26 పరుగులతో ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ స్కోరు: 62/1 (16.2) బంగ్లా స్కోరు @ టీ బ్రేక్ 56/0(13)భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ టీ బ్రేక్ సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ఓపెనర్లు షాద్మాన్ ఇస్లాం 21, జకీర్ హసన్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు.బంగ్లాదేశ్ లక్ష్యం 515భారీ ఆధిక్యంలో ఉన్న టీమిండియా 287/4 స్కోరు వద్ద తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మొత్తంగా 514 పరుగుల లీడ్‌లో ఉన్న భారత్.. బంగ్లాదేశ్‌కు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది.భారత్‌కు 502 పరుగుల ఆధిక్యంగిల్, పంత్ సెంచరీల కారణంగా 63 ఓవర్లు ముగిసే సరికి భారత్ 506 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.గిల్ శతకం59.4: మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్న గిల్. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన గిల్.. ఇప్పుడిలా శతక్కొట్టడం విశేషం. రాహుల్ 10, గిల్ 100 పరుగులతో క్రీజులో ఉన్నారు. సెంచరీ పూర్తి చేసుకున్న పంత్.. వికెట్ డౌన్54.4: గిల్‌తో కలిసి బజ్‌బాల్ తరహాలో దూకుడు పెంచిన రిషభ్‌పంత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ విరామం తర్వాత.. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో రెండు రన్స్ తీసి వంద పరుగుల మార్కు అందుకున్నాడు.అయితే ఆమరుసటి ఓవర్ మూడో బంతికే మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో పంత్ బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 234-4(56). 461 పరుగుల ఆధిక్యం.లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 205/3 (51)శుబ్‌మన్ గిల్ 86, రిషభ్ పంత్ 82 పరుగులతో ఆడుతున్నారు. బంగ్లాదేశ్ కంటే టీమిండియా 432 పరుగుల ఆధిక్యం(తొలి ఇన్నింగ్స్ కలుపుకొని)లో ఉంది. సెంచరీకి చేరువైన గిల్శుబ్మన్ గిల్ శతకానికి చేరువయ్యాడు. 50 ఓవర్లు ముగిసే సరికి 136 బంతులు ఎదుర్కొన్న అతడు 85 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరోవైపు పంత్ 73 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా 422 పరుగుల ఆధిక్యంలో ఉంది.దంచి కొడుతున్న గిల్, పంత్గిల్ 75, పంత్ 72 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. 48 ఓవర్లలో టీమిండియా స్కోరు: 184/3.పంత్ హాఫ్ సెంచరీ43.3: మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి పంత్ యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. గిల్, పంత్ నిలకడగా ఆడుతుండటంతో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. 44 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 151-3. బంగ్లాదేశ్‌పై 378 పరుగుల ఆధిక్యం.గిల్ హాఫ్ సెంచరీ29.5వ ఓవర్: మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో సిక్సర్ బాది శుబ్‌మన్ గిల్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్లో రెండో బంతికి సైతం గిల్ సిక్స్ కొట్టడం విశేషం. టీమిండియా స్కోరు: 114-3(30).సెంచరీ పూర్తి చేసుకున్న టీమిండియా28.5వ ఓవర్: బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్‌లో పంత్ ఫోర్ బాదడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో వంద పరుగుల మార్కు అందుకుంది. 29 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 100-3. పంత్ 25, గిల్ 39 పరుగులతో ఆడుతున్నారు.టీమిండియా రెండో ఇన్నింగ్స్- ఓవర్ నైట్ స్కోరుశుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి భారత జట్టు 23.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. 308 పరుగుల ఆధిక్యం సంపాదించింది. కాగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 10, రోహిత్ శర్మ 5 పరుగులతో నిరాశపరచగా.. విరాట్ కోహ్లి సైతం 17 పరుగులకే నిష్క్రమించాడు. శుబ్‌మన్ గిల్ 34, రిషభ్ పంత్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు సెప్టెంబరు 19- 23వేదిక: చెపాక్ స్టేడియం, చెన్నైటాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 376బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 149తుదిజట్లు:టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.బంగ్లాదేశ్షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా. -
Ind vs Ban: ముగిసిన తొలి రోజు ఆట.. భారీ స్కోర్ దిశగా భారత్
India vs Bangladesh, 1st Test Chennai Day 1 Updates: టీమిండియాతో తొలి టెస్టులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ముగిసిన తొలి రోజు ఆట..చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారీ స్కోరు దిశగా భారత్ అడుగులు వేస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.క్రీజులో అశ్విన్(102), జడేజా(86) ఆజేయంగా ఉన్నారు. తొలి రోజు ఆటలో భారత టాపార్డర్ ప్లేయర్లు విఫలమైనప్పటకి వెటరన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అద్బుతమైన సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 4 వికెట్లు పడగొట్టగా.. నహిద్ రానా, మెహదీ హసన్ మీరజ్ తలా రెండు వికెట్లు సాధించారు.సెంచరీతో చెలరేగిన అశ్విన్.. చెపాక్ టెస్టులో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో చెలరేగాడు. 108 బంతుల్లో అశ్విన్ 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అశ్విన్‌కు ఇది ఆరో టెస్టు సెంచరీ. 80 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రీజులో అశ్విన్‌తో పాటు జడేజా 86 పరుగులతో ఉన్నాడు.రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ.. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆర్ధశతకం సాధించాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన జడేజా.. అశ్విన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అశ్విన్ దూకుడుగా ఆడితే, జడేజా కాస్త ఆచిచూచి తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 69 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. క్రీజులో జడేజాతో పాటు(51), అశ్విన్(78) పరుగులతో ఉన్నాడు.అశ్విన్ హాఫ్ సెంచరీ..సొంతమైదానంలో టీమిండియా వెటరన్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. 54 పరుగులతో అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజా(35) పరుగులతో క్రీజులో ఉన్నాడు.52 ఓవర్లకు టీమిండియా స్కోర్: 197/652 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ దూకుడుగా ఆడుతున్నాడు. 34 బంతుల్లో సరిగ్గా 34 పరుగులతో అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో పాటు రవీంద్ర జడేజా(15) పరుగులతో క్రీజులో ఉన్నాడు.టీ బ్రేక్‌కు భారత్ స్కోర్: 176/6టీ విరామానికి భారత్ 6 వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది. క్రీజులో రవిచంద్రన్ అశ్విన్(21), రవీంద్ర జడేజా(7) పరుగులతో ఉన్నారు.కేఎల్ రాహుల్ అవుట్42.2: మెహదీ హసన్ మిరాజ్బౌలింగ్లో జకీర్‌కు క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్(16) అవుటయ్యాడు. దీంతో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 145/6 (42.4) ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా41.4: హాఫ్ సెంచరీ వీరుడు జైస్వాల్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. నహీద్ రాణా బౌలింగ్‌లో షాద్మాన్ ఇస్లాంనకు క్యాచ్ ఇచ్చి జైస్వాల్ 56 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 144/5 (42). రాహుల్ 16 పరుగులతో ఆడుతున్నాడు.యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ34.2: మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి జైస్వాల్ 50 పరుగుల మార్కు అందుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ విలువైన అర్ధ శతకం బాది సత్తా చాటాడు. టీమిండియా స్కోరు: 132-4(35). రాహుల్ 10, జైస్వాల్ 50 పరుగులతో క్రీజులో ఉన్నారు.28వ ఓవర్: సెంచరీ కొట్టిన టీమిండియా.. స్కోరు 103-4.జైస్వాల్ 43, రాహుల్ ఒక పరుగుతో ఆడుతున్నారు.96 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన భారత్25.3: రిషభ్‌పంత్ (39) రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ ఖాతాలో నాలుగో వికెట్ జమైంది. కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. జైస్వాల్ 37 పరుగులతో ఆడుతున్నాడు. భోజన విరామ సమయానికి టీమిండియా స్కోరు: 88/3 (23)34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను జైస్వాల్, పంత్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. లంచ్ బ్రేక్ సమయానికి యశస్వి జైస్వాల్ 37, రిషభ్ పంత్ 33 పరుగులతో ఆడుతున్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 57-3జైస్వాల్ 26, పంత్ 13 పరుగులతో ఆడుతున్నారు.హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న టీమిండియాఓపెనర్ జైస్వాల్ నిలకడగా ఆడుతూ.. రిషభ్ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. 14వ ఓవర్ ముగిసే సరికి జైస్వాల్ 41 బంతుల్లో 24, పంత్ 11 బంతుల్లో 8 పరుగులు చేశారు. టీమిండియా స్కోరు: 50-3.9.2: కోహ్లి అవుట్బంగ్లా పేసర్ హసన్ మహ్మూద్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే రోహిత్, గిల్ వికెట్లు పడగొట్టిన అతడు.. కోహ్లి రూపంలో మరో కీలక బ్యాటర్‌ను అవుట్ చేశాడు.కాగా మూడు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా స్కోరు: 34/3 (9.3). రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. జైస్వాల్ 17 పరుగులతో ఆడుతున్నాడు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా7.3: హసన్ మహ్మూద్ మరోసారి టీమిండియాను దెబ్బకొట్టాడు. తొలుత రోహిత్ శర్మ రూపంలో కీలక వికెట్ దక్కించుకున్న అతడు.. గిల్‌ను పెవిలియన్‌కు పంపాడు. మొత్తంగా ఎనిమిది బంతులు ఎదుర్కొన్న ఈ వన్‌డౌన్ బ్యాటర్ డకౌట్‌గా వెనుదిరగగా.. భారత్ రెండో వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 29/2 (8). జైస్వాల్ 17 పరుగులతో ఆడుతున్నాడు. ఆరంభంలోనే బిగ్ వికెట్ డౌన్5.1: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాకెప్టెన్ రోహిత్ శర్మ(6) రూపంలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. బంగ్లా యువ పేసర్ హసన్ మహ్మూద్ బౌలింగ్‌లో షాంటోకు క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుదిరిగాడు. శుబ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. 6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 14/1. యశస్వి జైస్వాల్ 7, గిల్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.భారత స్టార్ స్పిన్నర్‌కు నో చాన్స్ కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది. భారత్ వేదికగా జరుగనున్న ఈ సిరీస్‌లో తొలి టెస్టుకు చెన్నై, రెండో టెస్టుకు కాన్పూర్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.టాస్ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తాము టాస్ గెలిస్తే కూడా మొదట బౌలింగ్ చేసే వాళ్లమని పేర్కొన్నాడు. ప్రతి టెస్టు మ్యాచ్ కీలకమేనని.. సవాళ్లను అధిగమించి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపాడు. ఇక తాము ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు.బంగ్లాదేశ్ సైతంకాగా స్పిన్ విభాగంలో సీనియర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాకు చోటు దక్కగా.. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు మొండిచేయి ఎదురైంది. ఇక సీమర్లలో పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ స్థానం సంపాదించారు. మరోవైపు.. బంగ్లాదేశ్ సైతం ముగ్గురు సీమర్లు.. ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లకు తుదిజట్టులో చోటిచ్చింది. చెపాక్‌లోని ఎర్రమట్టి పిచ్‌పై ఈ మ్యాచ్ జరుగనుండటంతో ఇరుజట్లు ఇలా ఫాస్ట్‌బౌలర్లకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.తుదిజట్లు:టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.బంగ్లాదేశ్షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా.చదవండి: వన్డే క్రికెట్లో పెను సంచలనం -
Ind vs Ban: టీమిండియాకు మాజీ క్రికెటర్ వార్నింగ్
బంగ్లాదేశ్ జట్టును తక్కువ అంచనా వేయొద్దని ఉందని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ టీమిండియాకు సూచించాడు. అనుభవం గడిస్తున్న కొద్దీ బంగ్లా ప్రమాదకర జట్టుగా మారుతోందని.. ముఖ్యంగా విదేశీ గడ్డపై గెలవడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నాడు. కాబట్టి ప్రత్యర్థిని పసికూనగా భావిస్తే మూల్యం చెల్లించే పరిస్థితి రావొచ్చని రోహిత్ సేనను హెచ్చరించాడు.రెండు మ్యాచ్‌ల సిరీస్‌కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనలిస్టులలో ఫేవరెట్‌గా ఉన్న భారత జట్టు.. గురువారం(సెప్టెంబరు 19) నుంచి బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. చెన్నై వేదికగా తొలి టెస్టు జరుగనుండగా.. టీమిండియా ఇప్పటికే అస్తశస్త్రాలతో సిద్ధమైంది. మరోవైపు.. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న రోహిత్ సేనను ఢీకొట్టేందుకు బంగ్లాదేశ్ కూడా సిద్ధంగానే ఉంది.ఒకప్పుడు సొంతగడ్డపై మాత్రమే.. కానీ ఇప్పుడుముఖ్యంగా పాకిస్తాన్‌ను వారి గడ్డపై టెస్టుల్లో తొలిసారి ఓడించడమే కాదు.. ఏకంగా క్లీన్‌స్వీప్ చేసిన జోష్‌లో ఉన్న నజ్ముల్ షాంటో బృందం.. భారత్‌లోనూ రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్ జట్టు అనుభవం గడిస్తున్న కొద్దీ మరింత మెరుగ్గా తయారవుతోంది. ఒకప్పుడు సొంతగడ్డపై మాత్రమే ఆడగలరని వారికి పేరు ఉండేది. అయితే, గత కొంతకాలంగా విదేశాల్లోనూ బంగ్లా రాణిస్తోంది.కివీస్ గడ్డపై గెలిచిన ఘనతన్యూజిలాండ్ను న్యూజిలాండ్‌లో(2022, మౌంట్ మౌంగనూయ్), పాకిస్తాన్‌ను పాకిస్తాన్లో ఓడించారు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఇప్పటికే ఇంటా బయటా తమను తాము నిరూపించుకున్నారు. జట్టులోని సీనియర్లు వారికి మార్గదర్శకులుగా ఉంటున్నారు. ముఖ్యంగా షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీం సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తూ.. యువకులకు స్ఫూర్తినిస్తున్నారు.నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లుగత కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన కోచ్‌ల ద్వారా కూడా బంగ్లాదేశ్ ఆట మెరుగుపడింది. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, నషీద్ రాణా, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్.. రాణిస్తున్నారు. బంగ్లాదేశ్ జట్టు నలుగురైదుగురు ఫాస్ట్ బౌలర్లు గంటకు 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తున్నారు’’ అని వసీం జాఫర్ హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు. టీమిండియా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరించాడు. చదవండి: సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ -
Pak vs Ban: పతనం దిశగా పాక్.. ఈ జట్టుకు ఏమైంది?
అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇంతకన్నా కిందికి దిగజారలేదు అనుకున్న ప్రతీసారి అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ అంతకుమించిన చెత్త ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. ఒకప్పుడు ఇమ్రాన్ ఖాన్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, ఆకీబ్ జావేద్, షోయబ్ అక్తర్ వంటి దిగ్గజ పేసర్లు... జహీర్ అబ్బాస్, జావేద్ మియాందాద్, ఇంజమాముల్ హక్, రమీజ్ రాజా, సయీద్ అన్వర్, యూనిస్ ఖాన్, మొహమ్మద్ యూసుఫ్, షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్ వంటి మేటి ఆటగాళ్లతో కళకళలాడిన ఆ జట్టు... ఇప్పుడు రెండున్నరేళ్లుగా స్వదేశంలో టెస్టు మ్యాచ్ గెలవలేక ఇబ్బంది పడుతోంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురవడం పాకిస్తాన్ జట్టు పతనావస్థను సూచిస్తోంది.రావల్పిండి: సమష్టి ప్రదర్శనతో కదంతొక్కిన బంగ్లాదేశ్ జట్టు... పాకిస్తాన్లో పాకిస్తాన్‌పై రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. గతంలో పాకిస్తాన్‌తో ఆడిన 13 మ్యాచ్‌ల్లో 12 టెస్టుల్లో ఓడిన బంగ్లాదేశ్... తాజా పర్యటనలో వరుసగా రెండు టెస్టులు నెగ్గి సొంతగడ్డపై పాకిస్తాన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా ఐదో టెస్టులో పరాజయంబంగ్లాదేశ్కు విదేశాల్లో ఇది మూడో టెస్టు సిరీస్ విజయం కాగా... వర్షం అంతరాయం మధ్య మూడున్నర రోజులే జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ స్ఫూర్తివంతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. రాజకీయ అనిశ్చితి కారణంగా దేశంలో అల్లర్లు, నిరసనలు కొనసాగుతున్న సమయంలో బంగ్లాదేశ్ జట్టు ఇలాంటి విజయం సాధించడం గమనార్హం. మరోవైపు గత కొంతకాలంగా స్వదేశంలోనూ నిలకడగా విజయాలు సాధించలేకపోతున్న పాకిస్తాన్ జట్టు... ఈ ఏడాది వరుసగా ఐదో టెస్టు మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఈ ఐదింట్లోనూ జట్టుకు సారథిగా వ్యవహరించిన షాన్ మసూద్... తొలి ఐదు టెస్టుల్లోనూ ఓటములు ఎదుర్కొన్న తొలి పాకిస్తాన్ కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.ఈ సిరీస్‌లో నమోదైన పలు ఆసక్తికర రికార్డులను పరిశీలిస్తే.. 👉బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు విదేశాల్లో ఇది మూడో టెస్టు సిరీస్ విజయం. ఇంతకుముందు 2009లో వెస్టిండీస్‌పై, 2021లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లు నెగ్గింది. 👉ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పేస్ బౌలర్లే తీయడం బంగ్లాదేశ్‌కు ఇది తొలిసారి. రెండో ఇన్నింగ్స్‌లో హసన్ మహమూద్, నహీద్ రాణా, తస్కీన్ అహ్మద్ కలిసి పాకిస్తాన్ పది వికెట్లు పడగొట్టారు. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి బంగ్లా పేసర్లు 14 వికెట్లు పడగొట్టారు. 👉ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ టాప్–6 ప్లేయర్లు 21 పరుగులకే పెవిలియన్ చేరారు. టెస్టు మ్యాచ్ నెగ్గిన సందర్భంలో తొలి ఇన్నింగ్స్‌లో మొదటి ఆరుగురు ఆటగాళ్లు చేసిన రెండో అత్యల్ప పరుగులివే. 1887లో ఆస్ట్రేలియా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఆ తర్వాత పుంజుకుని మ్యాచ్ నెగ్గింది. 👉సొంతగడ్డపై గత పది మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ జట్టు గెలుపు రుచి చూడలేదు. ఇంతకుముందు 1969–1975 మధ్య పాకిస్తాన్ జట్టు వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించలేకపోయింది. 👉షాన్ మసూద్ సారథ్యంలో ఆడిన ఐదు టెస్టుల్లోనూ పాకిస్తాన్ ఓటమి పాలైంది. గతంలో ఏడుగురు కెప్టెన్లకు తొలి ఐదు టెస్టుల్లో పరాజయాలు ఎదురయ్యాయి. ఆ జాబితాలో ఖాలెద్ మసూద్ (12 టెస్టులు; బంగ్లాదేశ్), ఖాలెద్ మహమూద్ (9 టెస్టులు; బంగ్లాదేశ్), మొహమ్మద్ అష్రఫుల్ (8 టెస్టులు; బంగ్లాదేశ్), నయీముర్ రహమాన్ (5 టెస్టులు; బంగ్లాదేశ్), గ్రేమ్ క్రీమర్ (6 టెస్టులు; జింబాబ్వే), కేన్ రూథర్‌ఫార్డ్ (5 టెస్టులు, న్యూజిలాండ్), బ్రాత్‌వైట్ (5 టెస్టులు; వెస్టిండీస్) ముందున్నారు. -
పాక్‌ను చిత్తు చేశాం.. భారత్‌తో సిరీస్‌కు సిద్ధం: బంగ్లా కెప్టెన్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్‌ను సొంతగడ్డపై ఓడించి తొలిసారి.. ఆ జట్టుపై టెస్టు సిరీస్ విజయం సాధించింది. స్వదేశంలో ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు పాక్ పర్యటన సాగుతుందా లేదోనన్న సందేహాల నడుమ.. అక్కడికి వెళ్లడమే కాదు ఏకంగా ట్రోఫీ గెలిచి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నజ్ముల్ షాంటో బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.ఆరు వికెట్ల తేడాతో ఓడించికాగా ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ 2023- 25 సీజన్లో భాగంగా పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో పది వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించిన బంగ్లాదేశ్.. మంగళవారం ముగిసిన రెండో మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది.మాటలు రావడం లేదుఈ క్రమంలో చారిత్మక విజయంపై స్పందించిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటో మాట్లాడుతూ.. ‘‘ఈ గెలుపు మాకెంతో కీలకమైనది. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. చాలా చాలా సంతోషంగా ఉంది. పాకిస్తాన్లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నాం. అందుకు తగ్గట్లుగానే జట్టులోని ప్రతి ఒక్కరు తమ పాత్రను చక్కగా పోషించి ఈ గెలుపునకు కారణమయ్యారు.మా జట్టు అద్బుతంగా ఆడింది. ముఖ్యంగా రెండో టెస్టులో మా పేసర్లు అత్యుత్తమంగా రాణించడం వల్లే అనుకున్న ఫలితం రాబట్టగలిగాం. గెలవాలన్న కసి, పట్టుదల మమ్మల్ని ఈస్థాయిలో నిలిపాయి. తదుపరి టీమిండియాతో తలపడబోతున్నాం. ఆ సిరీస్ కూడా ఎంతో ముఖ్యమైనది. టీమిండియాతో సిరీస్‌కు సిద్ధంఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో భారత్‌లో అడుగుపెడతాం. టీమిండియాతో సిరీస్‌లో ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్ అత్యంత కీలకం కానున్నారు. ఇక మిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అతడు ఐదు వికెట్లు పడగొట్టిన తీరు అద్భుతం. భారత్‌తో మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతం చేస్తాడని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. టీమిండియాతో సిరీస్‌కు ముందు పాక్‌ను క్లీన్‌స్వీప్ చేయడం తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని నజ్ముల్ షాంటో తెలిపాడు.కాగా సెప్టెంబరు 19 నుంచి రోహిత్ సేనతో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు స్కోర్లువేదిక: రావల్పిండిటాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 274 ఆలౌట్బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 262 ఆలౌట్పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 172 ఆలౌట్బంగ్లా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 185/4ఫలితం: ఆరు వికెట్ల తేడాతో పాక్‌పై బంగ్లా గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: లిటన్ దాస్ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: మెహదీ హసన్ మిరాజ్చదవండి: సొంతగడ్డపై పాకిస్తాన్‌కు ఘోర పరాభవం.. క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ -
T20: బంగ్లాదేశ్‌కు ఊహించని షాకిచ్చిన పసికూన.. సిరీస్ సొంతం
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పసికూన యూఎస్ఏ చేతిలో షాంటో బృందానికి ఘోర పరాభవం ఎదురైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-2తో ఆతిథ్య దేశానికి సమర్పించుకుంది బంగ్లాదేశ్.కాగా వెస్టిండీస్‌తో కలిసి అమెరికా ప్రపంచకప్-2024 నిర్వహణ హక్కులు దక్కించుకున్న విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్ సన్నాహకాల్లో భాగంగా యూఎస్ఏ- బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరుగుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం యూఎస్ఏ పర్యటనకు వెళ్లింది బంగ్లాదేశ్.మరో మ్యాచ్ మిగిలి ఉండగానేఈ క్రమంలో తొలి టీ20లో అనూహ్య రీతిలో బంగ్లాదేశ్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది యూఎస్ఏ జట్టు. ఇక తాజాగా రెండో టీ20లోనూ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.యూఎస్ఏ స్కోరు ఎంతంటే?హోస్టన్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన యూఎస్‌కే ఓపెనర్లు స్టీవెన్ టేలర్(31), కెప్టెన్ మొనాక్ పటేల్(42) శుభారంభం అందించారు.అయితే, వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ డకౌట్ కాగా.. నాలుగో నంబర్ బ్యాటర్ ఆరోన్ జోన్స్ 35 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లలో ఒక్కరు కూడా కనీసం ఇరవై పరుగుల మార్కు అందుకోలేకపోయారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో యూఎస్ఏ ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగుల నామమాత్రపు స్కోరు సాధించింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ సులువుగానే లక్ష్యాన్ని ఛేదిస్తుందని అంతా భావించారు.బంగ్లా బ్యాటర్లకు చుక్కలుకానీ యూఎస్ బౌలర్లు బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు 19.3 ఓవర్లలో కేవలం 138 పరుగులు మాత్రమే చేసి బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ షాంటో 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తౌహీద్ హృదయ్ 25, షకీబ్ అల్ హసన్ 30 పరుగులు చేశారు.ఇక లోయర్ ఆర్డర్లో మహ్మదుల్లా 3, జకీర్ అలీ 4, రషీద్ హొసేన్ 9, తాంజిమ్ హసన్ సకీబ్ 0, షోరిఫుల్ ఇస్లాం 1, ముస్తాఫిజుర్ రహ్మాన్ 1 పరుగు చేసి దారుణంగా విఫలమయ్యారు.అలీ ఖాన్ చెలరేగడంతోఇక యూఎస్ఏ బౌలర్లలో పాకిస్తాన్ మూలాలున్న 33 ఏళ్ల పేసర్ అలీ ఖాన్ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టగా.. సౌరభ్ నట్రావల్కర్ రెండు, షాడ్లే వాన్ రెండు, కోరే ఆండర్సన్, జస్దీప్ సింగ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన మొనాక్ పటేల్ బృందం సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. అలీ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.చరిత్ర సృష్టించిన యూఎస్ఏకాగా ఐసీసీ అసోసియేట్ దేశమైన యూఎస్ఏ.. టెస్టు హోదా ఉన్న దేశంపై టీ20 సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. తద్వారా యూఎస్ఏ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించగా.. బంగ్లాదేశ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఇరు జట్ల మధ్య మే 25న నామమాత్రపు మూడో టీ20 జరుగనుంది.చదవండి: IPL 2024 SRH Vs RR: ‘ఫైనల్’ వేటలో... -
వరల్డ్ కప్‌నకు బంగ్లా జట్టు ప్రకటన.. అనూహ్యంగా అతడికి చోటు!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి తమ జట్టును ప్రకటించింది. నజ్ముల్ హొసేన్ కెప్టెన్సీలో వరల్డ్ కప్‌లో ఆడబోయే 15 మంది సభ్యుల పేర్లను వెల్లడించింది. సీనియర్లు, ఇటీవల పునరాగమనం చేసిన ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.అయితే, గాయంతో బాధపడుతున్న మరో పేసర్ టస్కిన్ అహ్మద్ అనూహ్య రీతిలో జట్టులో చోటు సంపాదించడంతో పాటు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఫామ్‌లేమితో బాధపడుతున్న ఓపెనింగ్ బ్యాటర్ లిటన్ దాస్ సైతం చోటు దక్కించుకున్నాడు.కాగా 29 ఏళ్ల ఈ పేస్ బౌలర్ గతవారం జింబాబ్వేతో సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. అయితే, ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మాత్రం అదరగొట్టాడు. 4.56 ఎకానమీతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. షకీబ్ అల్ హసన్ 2007 నుంచి టీ20 ప్రపంచకప్ ఈవెంట్‌ను ఒక్కసారి కూడా మిస్ కాలేదు.ఇదిలా ఉంటే.. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ జూన్ 1 నుంచి ఆరంభం కానుంది. ఇందులో భాగంగా డల్లాస్‌లోని టెక్సాస్ వేదికగా జూన్ 7న బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. శ్రీలంకతో మ్యాచ్‌తో మెగా ఈవెంట్లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్- 2024కు బంగ్లాదేశ్ జట్టు:నజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), టస్కిన్ అహ్మద్ (వైస్ కెప్టెన్), లిటన్ కుమర్ దాస్, సౌమ్య సర్కార్, తన్జిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తవ్హిద్ హృదోయ్, మహమూద్ ఉల్లా రియాద్, జకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షేక్ మెహదీ హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజీమ్ హసన్ సకీబ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: అఫిఫ్ హుస్సేన్, హసన్ మహమూద్. -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ.. వీడియో వైరల్
చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్టు మొదటి రోజు ఆటలో శ్రీలంక పై చేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక 4 వికెట్లు నష్టానికి 314 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్(93), కరుణరత్నే(86), నిషాన్ మదుష్కా(57) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్ రెండు, షకీబ్ ఆల్ హసన్ తలా రెండు వికెట్లు సాధించారు. అయితే తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో తీసుకున్న ఓ రివ్యూ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. శ్రీలంక ఇన్నింగ్స్ 44 ఓవర్ వేసిన స్పిన్నర్ తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో మూడు బంతిని కుశాల్ మెండిస్ ఆఫ్ సైడ్ వైపు డిఫెన్స్ ఆడాడు. కానీ బౌలర్, స్లిప్‌లో ఉన్న బంగ్లా కెప్టెన్ షాంటో బంతి బ్యాట్‌కు కాకుండా ప్యాడ్‌కు తగిలిందని భావించి ఎల్బీకి అప్పీల్ చేశారు. అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తలఊపాడు. ఈ క్రమంలో షాంటో బౌలర్‌తో సంప్రదించి రివ్యూకు వెళ్లాడు. అయితే బంతి బ్యాట్‌కు స్పష్టంగా తాకుతున్నప్పటికి షాంటో రివ్యూకు వెళ్లడం అందరిని ఆశ్చర్యపరిచింది. రిప్లేలో కూడా బంతి బ్యాట్‌కు మధ్యలో తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త రివ్యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. What just happened? 👀 . .#BANvSL #FanCode #CricketTwitter pic.twitter.com/sJBR5jMSov — FanCode (@FanCode) March 30, 2024 -
శ్రీలంకకు ఊహించని షాకిచ్చిన బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్‌తో విజయంతో ఆరంభించింది. ఛటోగ్రామ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్లతో తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 44.4 ఓవర్లలో ఛేదించింది. బంగ్లా విజయంతో కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో కీలక పాత్ర పోషించాడు. నజ్ముల్ హుస్సేన్ ఆజేయ సెంచరీతో చెలరేగాడు. 129 బంతుల్లో శాంటో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 122 పరుగులు చేశాడు. అతడితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ముస్తిఫికర్ రహీమ్(73 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో మధుశంక రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రమోద్ మధుషాన్, కుమారా తలా వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లంక 48.5 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. లంక బ్యాటర్లలో లియాంగే(67) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కుశాల్ మెండిస్(59) పరుగులతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో టాస్కిన్ ఆహ్మద్, షోర్ఫుల్ ఇస్లాం, టాన్జిమ్ హసన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్లు మధ్య రెండో టీ20 ఛటోగ్రామ్ వేదికగా శుక్రవారం జరగనుంది. చదవండి: IPL 2024: ఢిల్లీ జట్టులోకి ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడు.. ఎవరంటే? -
శ్రీలంకకు షాకిచ్చిన బంగ్లాదేశ్
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 6) జరిగిన రెండో మ్యాచ్‌లో పర్యాటక శ్రీలంకకు ఆతిథ్య బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. అన్ని విభాగాల్లో తమకంటే మెరుగైన శ్రీలంకను బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ ఆడుతూ పాడుతూ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో అజేయ అర్దసెంచరీతో (53), తౌహిద్ హ్రిదోయ్ అజేయమైన 32 పరుగులతో బంగ్లాదేశ్‌ను విజయతీరాలకు చేర్చారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్ (36), సౌమ్య సర్కార్ (26) కూడా ఓ మోస్తరుగా రాణించారు. బంగ్లాదేశ్ కోల్పోయిన రెండు వికెట్లు మతీశ పతిరణ ఖాతాలోకి వెళ్లాయి. అంతకుముందు శ్రీలంక ఇన్నింగ్స్‌లో కనీసం ఒక్క భారీ స్కోర్ కూడా నమోదు కాలేదు. అవిష్క ఫెర్నాండో 0, కుశాల్ మెండిస్ 36, కమిందు మెండిస్ 37, సమరవిక్రమ 7, అసలంక 28, మాథ్యూస్ 32 నాటౌట్, షనక 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, మెహిది హసన్, ముస్తాఫిజుర్, సౌమ్య సర్కార్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో శ్రీలంక గెలుపొందింది. నిర్ణయాత్మక మూడో టీ20 మార్చి 9న జరుగనుంది. -
బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు.. ఎవరంటే?
బంగ్లాదేశ్ పురుషల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ఎంపికయ్యాడు. మూడు ఫార్మాట్లలో తమ జట్టు పగ్గాలను అప్పగిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా టెస్టు, టీ20ల్లో కెప్టెన్‌గా ఉన్న షకీబ్ అల్ హసన్ రాజకీయాలపై దృష్టి సారించడంతో.. అతడి రీ ఎంట్రీ అనిశ్చతి నెలకొంది. షకీబ్ ప్రస్తుతం కంటి సమస్యతో కూడా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న శ్రీలంకతో వైట్‌బాల్ సిరీస్‌కు షకీబ్ దూరమయ్యాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటకి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతాడన్నది అనుమానమే. కాగా వన్డే వరల్డ్‌కప్-2023కు ముందు బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్సీ నుంచి తమీమ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షకీబ్‌ను వన్డే కెప్టెన్‌గా బీసీబీ నియమించింది. అయితే వరల్డ్‌కప్ అనంతరం షకీబ్ కూడా బంగ్లా వన్డే, టీ20 జట్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగతానని షకీబ్ తెలిపాడు. అయితే షకీబ్ ఇప్పటిలో రీ ఎంట్రీ ఇచ్చేలా కన్పించడం లేదు. ఈ నేపథ్యంలోనే శాంటోను మూడు ఫార్మట్లలో ఏడాది పాటు కెప్టెన్‌గా బీసీబీ నియమించింది. కాగా శాంటోకు కెప్టెన్‌గా అనుభవం ఉంది. గతేడాది సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బంగ్లా జట్టుకు శాంటో సారథ్యం వహించాడు. అతడి నాయకత్వంలోని బంగ్లా జట్టు సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. అంతకుముందు వన్డే వరల్డ్‌కప్‌లోనూ షకీబ్ గైర్హజరీలో శాంటో జట్టు పగ్గాలను చేపట్టాడు. అతని సారథ్యంలో బంగ్లాదేశ్ 11 మ్యాచ్‌లు ఆడగా.. మూడింట గెలిచింది. సొంతగడ్డపై మార్చిలో శ్రీలంకతో బంగ్లాదేశ్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌తో బంగ్లా ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా శాంటో ప్రయాణం ప్రారంభం కానుంది. -
NZ Vs Ban: ఆకస్మిక వర్షంలో తడిసిముద్దైన ఆటగాళ్లు.. మ్యాచ్ రద్దు
New Zealand vs Bangladesh, 2nd T20I: న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వరణుడు అడ్డుతగిలాడు. మౌంట్ మౌంగనీయ్లో ఇరు జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన రెండో టీ20 వర్షం కారణంగా రద్దైపోయింది. ఈ క్రమంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లా 1-0తో ఆధిక్యం నిలబెట్టుకోగలిగింది. కాగా నజ్ముల్ హొసేన్ షాంటో కెప్టెన్సీలో బంగ్లాదేశ్ జట్టు కివీస్ పర్యటనకు వెళ్లింది. ఈ యువ బ్యాటర్ సారథ్యంలో మూడు వన్డేల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో అనూహ్య విజయం సాధించింది. తద్వారా క్లీన్‌స్వీప్ గండాన్ని తప్పించుకోవడమే గాకుండా.. న్యూజిలాండ్ గడ్డ మీద తొలి వన్డే గెలుపు నమోదు చేసి చరిత్ర సృష్టించింది. తొలి టీ20 గెలుపు ఇక మూడో వన్డేలో ఆతిథ్య కివీస్‌ను ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్.. ఊహించని రీతిలో టీ20 సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. నేపియర్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో శాంట్నర్ బృందంపై ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక కివీస్ గడ్డ మీద బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టీ20 గెలుపు కూడా కావడం విశేషం. ఆకస్మిక వర్షం.. తడిసిపోయిన ఆటగాళ్లు ఈ క్రమంలో రెండో టీ20లోనూ సత్తా చాటాలని భావించిన నజ్ముల్ షాంటో బృందం.. అందుకు తగ్గట్లుగానే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్ షోరిఫుల్ ఇస్లాం.. కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్(2)ను పెవిలియన్‌కు పంపి శుభారంభం అందించాడు. అయితే, 23 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టి ప్రమాదకరంగా మారుతున్న మరో ఓపెనర్ టిమ్ సిఫార్ట్ను తంజీం హసన్ సకీబ్ అవుట్ చేశాడు. వీరి స్థానాల్లో క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్ 18(24 బంతుల్లో), గ్లెన్ ఫిలిప్స్ 9(14 బంతుల్లో) పరుగులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. And that's that! Unfortunately, the 2nd @BLACKCAPS v Bangladesh T20I at Bay Oval in Tauranga has been officially called off due to the rain 😢☔ Blackcaps v Bangladesh: 3rd T20I | Sunday from 12.30pm on TVNZ 1 and TVNZ+ pic.twitter.com/TsZoLLfRJm — TVNZ+ (@TVNZ) December 29, 2023 మ్యాచ్ రద్దు అయితే, 11 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆకస్మికంగా వర్షం మొదలైంది. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు: 72/2. ఇక మధ్యాహ్నం రెండున్నర గంటలు దాటినా తెరిపినివ్వలేదు. ఆ తర్వాత వర్షం మరింత ఎక్కువ కావడంతో న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఇరు జట్ల మధ్య డిసెంబరు 31 (ఆదివారం) నిర్ణయాత్మక మూడో టీ20 జరుగనుంది. ఇందులో గనుక బంగ్లాదేశ్ గెలిస్తే కివీస్ గడ్డపై మరో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం!! Heavy rain still falling at Bay Oval. The latest time play can begin again is 10:28pm #BANvNZ pic.twitter.com/w85rLJjE7F — BLACKCAPS (@BLACKCAPS) December 29, 2023 -
NZ vs Ban: బంగ్లా సంచలన విజయం.. న్యూజిలాండ్ గడ్డపై సరికొత్త చరిత్ర
New Zealand vs Bangladesh, 3rd ODI: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు బంగ్లాదేశ్ గట్టి షాకిచ్చింది. మూడో వన్డేలో అనూహ్య రీతిలో ఘన విజయం సాధించింది. పటిష్ట కివీస్ జట్టును సొంతగడ్డపై 98 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొంది క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. సిరీస్ కివీస్‌దే కాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. కివీస్ బంగ్లాను 44 పరుగుల తేడాతో ఓడించింది. ఇక రెండో వన్డేలోనూ ఏడు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో వన్డేలోనూ జోరును కొనసాగిస్తూ వైట్‌వాష్ చేయాలని భావించిన న్యూజిలాండ్ ఆశలపై పర్యాటక బంగ్లా జట్టు నీళ్లు చల్లింది. నేపియర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. చెలరేగిన బంగ్లాదేశ్ పేసర్లు అయితే, ఆరంభం నుంచే దూకుడు పెంచిన బంగ్లా బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లను తిప్పలు పెట్టారు. పేసర్లు షోరిఫుల్ ఇస్లాం మూడు, తాంజిం హసన్ సకీబ్ మూడు, సౌమ్యా సర్కార్ మూడు వికెట్లతో చెలరేగగా.. ముస్తాఫిజుర్ ఒక వికెట్ పడగొట్టాడు. బంగ్లా ఫాస్ట్‌బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఓపెనర్ విల్ యంగ్ 26 పరుగులతో కివీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మరో ఓపెనర్, వరల్డ్‌కప్ సెంచరీల వీరుడు రచిన్ రవీంద్ర ఎనిమిది పరుగులకే పరిమితం అయ్యాడు. ఇక కెప్టెన్ టామ్ లాథం 21 పరుగులతో పర్వాలేదనిపించగా.. మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 31.4 ఓవర్లలో కేవలం 98 పరుగులు మాత్రమే చేసి న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. నజ్ముల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. న్యూజిలాండ్ గడ్డపై కొత్త చరిత్ర లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. బౌలింగ్‌తో ఆకట్టుకున్న బ్యాటర్ సౌమ్యా సర్కార్ 16 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ అనముల్ హక్ 37 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ నజ్ముల్ షాంటో అజేయ అర్ధ శతకం బాదాడు. మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా బంగ్లాదేశ్‌కు న్యూజిలాండ్ గడ్డమీద ఇదే తొలి వన్డే విజయం కావడం గమనార్హం. ఈ చారిత్రాత్మక విజయంతో బంగ్లా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. చదవండి: IPL 2024-Hardik Pandya: ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!.. కెప్టెన్ దూరం! -
BAN VS NZ 2nd Test: తొలి రోజు 15 వికెట్లు.. రెండో రోజు వర్షార్పణం
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మిర్పూర్లో జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆటలో ఏకంగా 15 వికెట్లు నేలకూలగా, రెండో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. గురువారం భారీ వర్షం వల్ల స్టేడియం చిత్తడిగా మారింది. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే రెండో రోజు ఆట రద్దైంది. కాగా, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ చెరో 3 వికెట్లు, అజాజ్ పటేల్ 2, కెప్టెన్ సౌథీ ఓ వికెట్ పడగొట్టి బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేశారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ రహాం (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి రోజే తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన న్యూజిలాండ్ కూడా తడబడింది. బంగ్లా స్పిన్నర్ల ధాటికి ఆ జట్టు 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మెహిది హసన్ మీరజ్ 3, తైజుల్ ఇస్లాం 2 వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ ఆటగాడు టామ్ లాథమ్ (4), డేవాన్ కాన్వే (11), కేన్ విలియమ్సన్ (13), హెన్రీ నికోల్స్ (1), టామ్ బ్లండెల్ (0) విఫలం కాగా.. డారిల్ మిచెల్ (12), గ్లెన్ ఫిలిప్స్ (5) క్రీజ్‌లో ఉన్నారు. -
న్యూజిలాండ్‌కు భారీ షాక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. భారీ విజయంతో..
Bangladesh vs New Zealand, 1st Test: పటిష్ట న్యూజిలాండ్ జట్టుకు బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగి కివీస్‌పై భారీ విజయం సాధించింది. తొలి టెస్టులో టిమ్ సౌథీ బృందాన్ని ఏకంగా 150 పరుగుల తేడాతో చిత్తు చేసి చరిత్ర సృష్టించింది. కాగా రెండు టెస్టులు ఆడే నిమిత్తం న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం(నవంబరు 28) ఇరు జట్ల మధ్య సిల్హెట్ వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. ఇందులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య బంగ్లా 310 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 317 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్‌ను బంగ్లాదేశ్ 338 పరుగుల వద్ద ముగించగా.. కివీస్ 181 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లాదేశ్ వెటరన్ స్పిన్నర్, తైజుల్ ఇస్లాం ఆరు వికెట్లతో చెలరేగి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ బ్లండెల్ రూపంలో కీలక వికెట్లు తీసిన తైజుల్.. కైలీ జెమీషన్, ఇష్ సోధి, టిమ్ సౌథీలను కూడా అవుట్ చేసి శనివారం నాటి ఐదోరోజు తొలి సెషన్లోనే మ్యాచ్‌ను ముగించాడు. టెస్టుల్లో షాంటో బృందం సరికొత్త చరిత్ర ఇలా బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టెస్టు గెలుపు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు తొలిసారి సారథిగా వ్యవహరించిన నజ్ముల్ షాంటో ఈ మేరకు చారిత్రాత్మక విజయం అందుకోవడం విశేషం. ఇక గత 18 టెస్టుల్లోనూ బంగ్లాదేశ్‌కు ఇదే రెండో విజయం కావడం గమనార్హం. నాలుగో రోజు ఆట ముగిసిందిలా కాగా.. 332 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. డరైల్ మిచెల్ (44 నాటౌట్) మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (4/24) నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 212/3తో శుక్రవారం ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్ రహీమ్ (67), మెహదీ హసన్ మిరాజ్ (50 నాటౌట్) అర్ధసెంచరీలు చేశారు. ఇక ఐదో రోజు ఆటలో భాగంగా విజయానికి కివీస్ మరో 219 పరుగులు చేయాల్సి ఉండగా.. స్పిన్నర్ నయీం హసన్ తొలి వికెట్ తీయగా.. తైజుల్ మరో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ ఓటమిని ఖరారు చేశాడు. చదవండి: అదొక్కటే కలిసి రాలేదు.. అతడిని ఒత్తిడిలోకి నెట్టడం ఇష్టం: సూర్య టీమిండియా హెడ్‌కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ కెప్టెన్.. విరాట్ కోహ్లి, స్మిత్ సరసన
సిల్హెట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శాంటో సెంచరీతో మెరిశాడు. 192 బంతుల్లో 10 ఫోర్లతో శాంటో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. క్రీజులో శాంటో(104), ముస్తిఫిజర్ రహీం(43) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన షాంటో ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో కెప్టెన్‌గా అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా షాంటో నిలిచాడు. ఓవరాల్‌గా టెస్టు కెప్టెన్సీ అరంగేట్రంలో సెంచరీ చేసిన 32వ క్రికెటర్‌గా షాంటో ఈ రికార్డులకెక్కాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్ వంటి దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. చదవండి: టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్, కోహ్లి ఆడుతారా? ఇంగ్లండ్ లెజెండ్ సమాధానమిదే -
బంగ్లాదేశ్‌తో ఆసీస్ మ్యాచ్.. అందుకే వాళ్లిద్దరికి రెస్ట్..
CWC 2023- Australia vs Bangladesh: వన్డే వరల్డ్‌కప్-2023 లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. పుణె వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా.. తాము రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు కంగారూ జట్టు సారథి ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు. అందుకే వాళ్లిద్దరికి రెస్ట్ ‘‘పొద్దు పొద్దున్నే బౌలింగ్ చేయడం మాకు అనుకూలిస్తుందనుకుంటున్నాం. బంతి బాగా స్వింగ్ అవుతుంది. కాబట్టి బౌలింగ్ ఎంచుకున్నాం. తుదిజట్టులో రెండు మార్పులు చేశాం. మాక్స్వెల్, స్టార్క్‌లకు విశ్రాంతినిచ్చాం. సెమీస్‌లో వారిద్దరి పాత్ర కీలకం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. స్మిత్, అబాట్ జట్టులోకివచ్చారు. అబాట్‌కు ఈ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. ఇప్పటి వరకు మేము మా అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేదు. ఈ మ్యాచ్‌లో పూర్తిస్థాయిలో రాణించాలనుకుంటున్నాం’’ అని కమిన్స్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అజేయ డబుల్ సెంచరీతో సెమీస్ చేర్చి అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అనూహ్య రీతిలో గ్లెన్ మాక్స్వెల్ అజేయ డబుల్ సెంచరీతో ఆసీస్‌ను గెలిపించి.. సెమీస్ చేర్చాడు. అంతకు ముందు తలకు తగిలిన గాయం కారణంగా జట్టుకు దూరమైన మాక్సీ.. క్రీజులో కదల్లేని స్థితిలో ఉన్నా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ వహ్వా అనిపించాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో అతడికి రెస్ట్ ఇచ్చింది యాజమాన్యం. ఇక అనారోగ్య సమస్యలతో అఫ్గన్‌తో మ్యాచ్‌కు దూరమైన స్టీవ్ స్మిత్ అతడి స్థానంలో తుదిజట్టులోకి వచ్చాడు. మరోవైపు.. ప్రపంచకప్-2023లో అన్నింటికంటే ముందే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన బంగ్లాదేశ్.. తమ ఆఖరి మ్యాచ్‌లో పటిష్ట ఆసీస్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా దూరం కాగా.. అతడి స్థానంలో నజ్ముల్ హుసేన్ షాంటో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. తుదిజట్లు: ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మార్కస్ స్టొయినిస్, సీన్ అబాట్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), ఆడం జంపా, జోష్ హాజిల్‌వుడ్. బంగ్లాదేశ్ తాంజిద్ హసన్, లిటన్ దాస్, నజ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్( వికెట్ కీపర్), తౌహిద్ హృదోయ్, మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, నసూమ్ అహ్మద్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్. చదవండి: CWC 2023- Semis: ఏమైనా జరగొచ్చు.. మేమింకా రేసులోనే ఉన్నాం.. ఆ ముగ్గురు కీలకం: బాబర్ ఆజం View this post on Instagram A post shared by ICC (@icc) -
అతను క్రీజ్‌లో ఉండివుంటే పరిస్థితులు వేరేలా ఉండేవి: బంగ్లాదేశ్ కెప్టెన్
టీమిండియాతో నిన్న (అక్టోబర్ 19) జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. భారత్ 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లి (97 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. మిడిలార్డర్ వైఫల్యం.. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు శుభారంభమే లభించినప్పటికీ, మిడిలార్డర్ విఫలం కావడంతో ఆ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. ఓపెనర్లు తంజిద్ హసన్ (51), లిటన్ దాస్ (66) అర్ధసెంచరీలతో రాణించగా.. మిడిలార్డర్ ఆటగాళ్లు షాంటో (8), మెహిది హసన్ (3), తౌహిద్ (16) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో ముష్ఫికర్ రహీం (38), మహ్మదుల్లా (46) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. మ్యాచ్ ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డ భారత బౌలర్లు ఆ తర్వాత పుంజుకుని బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు. బుమ్రా, సిరాజ్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ను బంగ్లాదేశ్ బౌలర్లు ఎలాంటి ఇబ్బంది పెట్టలేకపోయారు. గిల్ (53), రోహిత్ (48) మెరుపు ఇన్నింగ్స్‌లతో శుభారంభాన్ని అందించగా.. కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగి వన్డేల్లో 48వ శతకాన్ని నమోదు చేశాడు. శ్రేయస్ (19) తక్కువ స్కోర్‌కే ఔటైనా.. రాహుల్ (34 నాటౌట్) సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ 2, హసన్ మహమూద్ ఓ వికెట్ పడగొట్టారు. మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో స్పందిస్తూ.. టీమిండియాకు శుభాకాంక్షలు. ఎప్పటిలాగే వారు ఈ మ్యాచ్‌లోనూ మాపై అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. టీమిండియా సామర్థ్యం గురించి మాకు తెలుసు. వారు ఏంటో మరోసారి నిరూపించారు. ఇవాళ మేము అత్యుత్తమ క్రికెట్ ఆడలేకపోయాం. అందుకే ఓటమిపాలయ్యాం. లిటన్, తంజిద్ శుభారంభాన్ని అందించారు. మిడిలార్డర్ వైఫల్యమే మా కొంపముంచింది. మా బౌలర్లు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేశారు. అయితే చేయాల్సినన్ని పరుగులు చేయలేకపోవడంతో టీమిండియాను నిలువరించలేకపోయాం. లిటన్ కాసేపు క్రీజ్‌లో ఉండివుంటే పరిస్థితి వేరేలా ఉండేది. మొత్తంగా ఈ ఓటమికి మిడిలార్డర్ బ్యాటింగ్ వైఫల్యమే కారణమని చెప్పాలి. టోర్నీలో తదుపరి మ్యాచ్‌ల్లో మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం. షకీబ్ గాయంపై ఏమన్నాడంటే.. షకీబ్ బాగానే ఉన్నాడు. అతని గాయం అంత పెద్దదేమీ కాదు. అతను తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు.