India vs Bangladesh, 2nd Test Day 2 Updates: క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!!... టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆటకూ వరణుడు ఆటంకం కలిగించాడు. వర్షం కారణంగా శనివారం నాటి ఆట ఒక్క బంతి పడకుండానే ముగిసిపోయింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ‘ఎక్స్’ ద్వారా ఈ మేరకు అప్‌డేట్ అందించింది. వర్షం తగ్గుముఖం పట్టినా.. అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేశారు.
లంచ్‌బ్రేక్ సమయానికీ మొదలుకాని ఆట
వర్షం తగ్గినా మైదానంలో కప్పిన కవర్లు మాత్రం తీయలేదు. మరికాసేపు వేచి చూసి.. వాన రాకపోతే.. కవర్లు తీసే అవకాశం ఉందని తెలుస్తోంది
ఆట ఆలస్యం
కాగా మైదానం కవర్లతో కప్పబడి ఉండగా.. అంపైర్లు వెళ్లి పిచ్‌ను పరిశీలించారు. అయితే, ఇప్పట్లో ఆట మొదలయ్యే పరిస్థితి మాత్రం కనబడటం లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది.
తొలిరోజు కూడా అంతరాయమే
చెన్నైలో జరిగిన తొలి టెస్టులో బంగ్లాను 280 పరుగుల తేడాతో మట్టికరిపించిన రోహిత్ సేన.. కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో శుక్రవారం రెండో టెస్టు మొదలుపెట్టింది. అయితే, వర్షం కారణంగా అవుట్‌ఫీల్డ్ చిత్తడిగా మారటంతో తొలి రోజు ఆట కూడా ఆలస్యంగా ప్రారంభమైంది.
ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని.. నజ్ముల్ షాంటో బృందాన్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే, వాన కారణంగా తొలి రోజు ఆట 35 ఓవర్ల వద్దే ముగిసిపోయింది. అంపైర్లు ఆటను నిలిపివేసే సమయానికి బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.
మొదటి రోజు ఆకాశ్‌కు రెండు వికెట్లు
ఓపెనర్ జకీర్ హసన్(0)ను భారత పేసర్ ఆకాశ్ దీప్ డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ షాద్‌మన్ ఇస్లాం(24) వికెట్‌ను సైతం ఆకాశ్ తన ఖాతాలోనే వేసుకోగా.. కెప్టెన్ నజ్ముల్ షాంటో(31)ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి వన్‌డౌన్ బ్యాటర్ మొమినుల్ హక్ 40, ముష్ఫికర్ రహీం 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు తుదిజట్లు
టీమిండియా
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
బంగ్లాదేశ్
షాద్‌మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.
చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment