Kanpur Test
-
రిస్క్ అని తెలిసినా తప్పలేదు.. అతడొక అద్భుతం: రోహిత్
కాన్పూర్ టెస్టులో ప్రణాళికలు పక్కాగా అమలు చేయడం వల్లే విజయం సాధ్యమైందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. నాలుగో రోజు ఆటలో రిస్క్ తీసుకున్న మాట వాస్తవమేనని.. అందుకు ప్రతిఫలంగా గెలుపు వరించిందని హర్షం వ్యక్తం చేశాడు. రెండున్నర రోజుల ఆట ఒక్క బంతి కూడా పడకుండానే ముగిసిపోయినా.. సమిష్టి కృషితో అనుకన్న ఫలితం రాబట్టగలిగామని పేర్కొన్నాడు.చివరి రెండు రోజుల్లో ఫలితం తేల్చిప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2022-25 సీజన్లో భాగంగా సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడింది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించిన రోహిత్ సేన.. తాజాగా రెండో టెస్టులోనూ గెలుపు జెండా ఎగురువేసింది. కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారినా.. చివరి రెండు రోజుల్లో టీమిండియా అద్భుత ప్రణాళికలతో విజయాన్ని సొంతం చేసుకుంది.రిస్క్ అని తెలిసినా తప్పలేదుతొలుత ప్రత్యర్థిని పడగొట్టి.. ఆ తర్వాత అనూహ్య రీతిలో పరుగులు రాబట్టి.. ఆఖరికి ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. బంగ్లాదేశ్‌పై 2-0తో క్లీన్‌స్వీప్ విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘రెండున్నర రోజుల ఆట రద్దైపోయింది. అలాంటి సమయంలో నాలుగోరోజు పూర్తి స్థాయిలో ఆడే అవకాశం దక్కినపుడు రిస్క్ తీసుకోవడానికి వెనకాడలేదు. ముందు వాళ్లను త్వరగా అవుట్ చేయాలి.అతడొక అద్భుతంఆ తర్వాత త్వరత్వరగా బ్యాటింగ్ చేయాలి. తొలి ఇన్నింగ్స్‌లో 100- 150 పరుగులకే మేము ఆలౌట్ అయినా ఫర్వాలేదని భావించాం. ఫలితం తేల్చడమే లక్ష్యంగా ముందుకు సాగి సఫలమయ్యాము’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక బంగ్లాపై విజయంలో తన వంతు పాత్ర పోషించిన పేసర్ ఆకాశ్ దీప్ అద్బుతం రోహిత్ శర్మ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు.నాణ్యమైన నైపుణ్యాలున్న బౌలర్‘‘అతడు బాగా బౌలింగ్ చేశాడు. దేశవాళీ క్రికెట్లో చాన్నాళ్ల పాటు ఆడిన అనుభవం అతడికి ఉంది. మేనేజ్మెంట్ అతడి నుంచి ఏం ఆశించిందో అందుకు తగ్గట్లుగా రాణించాడు. నాణ్యమైన నైపుణ్యాలున్న బౌలర్ అతడు. ఎక్కువ ఓవర్లపాటు బౌలింగ్ చేయగల ఫిట్నెస్ అతడి సొంతం’’ అని రోహిత్ శర్మ ఆకాశ్ ప్రతిభను కొనియాడాడు. ఇక గాయాల వల్ల ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యే పరిస్థితి ఉంది.. కాబట్టి బెంచ్ స్ట్రెంత్‌ను స్ట్రాంగ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఆకాశ్ దీప్ మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.చదవండి: WTC: ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా అశ్విన్ రికార్డు Captain @ImRo45 collects the @IDFCFIRSTBank Trophy from BCCI Vice President Mr. @ShuklaRajiv 👏👏#TeamIndia complete a 2⃣-0⃣ series victory in Kanpur 🙌Scorecard - https://t.co/JBVX2gyyPf#INDvBAN pic.twitter.com/Wrv3iNfVDz— BCCI (@BCCI) October 1, 2024 -
Ind vs Ban: అంచనాలు తలకిందులు చేసి.. ఫలితం తేల్చేశారు!
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై జయభేరి మోగించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.కాన్పూర్‌లో వెంటాడిన వరణుడు డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో భాగంగా రోహిత్ సేన స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడింది. చెన్నై మ్యాచ్‌లో 280 పరుగులతో బంగ్లాను మట్టికరిపించి శుభారంభం అందుకున్న టీమిండియాను.. కాన్పూర్‌లో వరణుడు వెంటాడాడు. వర్షం కారణంగా ఇక్కడి గ్రీన్ పార్క్ స్టేడియంలో తొలిరోజు కేవలం 35 ఓవర్ల ఆటే సాగగా.. రెండు, మూడో రోజు ఆట ఒక్క బంతి పడకుండానే రద్దైపోయింది.డ్రాగా ముగిసిపోతుందనే అభిప్రాయాలుఈ నేపథ్యంలో భారత్- బంగ్లా రెండో టెస్టు డ్రాగా ముగిసిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, టీమిండియా మాత్రం అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ‘బజ్‌బాల్’ క్రికెట్‌ను తలదన్నే ఫార్ములాతో అద్భుతం చేసింది. వర్షం లేకపోవడం.. మైదానం పొడిగా ఉండటంతో నాలుగో రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకుంది.భారత బౌలర్ల విజృంభణబంగ్లాదేశ్ సోమవారం... తమ తొలి ఇన్నింగ్స్ స్కోరు 107/3ను మొదలుపెట్టగా.. ఆది నుంచే భారత బౌలర్లు విజృంభించారు. బంగ్లాను 233 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత యువ పేసర్ ఆకాశ్ దీప్ బంగ్లా ఓపెనర్లను అవుట్ చేయగా.. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా 3, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు కూల్చారు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నారు.‘బజ్‌బాల్’ క్రికెట్‌కే వణుకుపుట్టించే వేగంతోఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన ఆకాశమే హద్దుగా బంగ్లా బౌలింగ్‌ను చితక్కొట్టింది. సమయం లేదు మిత్రమా అన్నట్లుగా.. ‘బజ్‌బాల్’ క్రికెట్‌కే వణుకుపుట్టించే వేగంతో 50, 100. 200 పరుగుల మైలురాళ్లను దాటింది. వచ్చిన ప్రతి బ్యాటరూ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఒత్తిడి పెంచి వీలైనన్ని పరుగులు పిండుకున్నారు.ఈ క్రమంలో 34.4 ఓవర్లలోనే తొమ్మిది వికెట్ల నష్టానికి టీమిండియా 285 పరుగులు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ మీద 52 పరుగుల ఆధిక్యం సంపాదించి. ఈ క్రమంలో బంగ్లా నాలుగో రోజే తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి సోమవారం నాటి ఆట పూర్తయ్యే సరికి రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది.ఆలస్యానికి తావిస్తే మొదటికే మోసంఇక ఆఖరి రోజు ఆలస్యానికి తావిస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన రోహిత్ సేన.. ఆది నుంచే వికెట్ల వేట మొదలుపెట్టింది. నైట్ వాచ్‌మన్ మొమినుల్ హక్(2) వికెట్ తీసి శుభారంభం అందించగా.. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(50)ను ఆకాశ్ దీప్ పెవిలియన్‌కు పంపాడు. ప్రమాదకారిగా మారే అవకాశం ఉన్న ముష్ఫికర్ రహీం(37)ను బుమ్రా అవుట్ చేశాడు.చకచకా పడగొట్టేశారుమొత్తంగా బుమ్రా, అశూ, జడ్డూ మూడేసి వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతా కలిసి రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 146 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ మీద బంగ్లాదేశ్ ఆధిక్యం 94 పరుగులు కాగా.. రోహిత్ సేన విజయ లక్ష్యంగా 95 పరుగులుగా మారింది.ఫోర్‌తో విజయం ఖరారు చేసిన పంత్ఇక త్వరగా మ్యాచ్ ముగించేయాలని భావించిన టీమిండియా దూకుడుగానే ఛేజింగ్ మొదలుపెట్టింది. దీంతో రోహిత్ శర్మ 8 పరుగులకే నిష్క్రమించగా.. యశస్వి జైస్వాల్(51) మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. శుబ్‌మన్ గిల్ 6 పరుగులకే పరిమితం కాగా.. కోహ్లి 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. రిషభ్ పంత్ ఫోర్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. డ్రా అవుతుందని ఊహించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా పక్కా ప్రణాళికతో గెలుపొందడం అభిమానులను ఖుషీ చేసింది. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టువేదిక: గ్రీన్ పార్క్ స్టేడియం, కాన్పూర్టాస్: టీమిండియా.. బౌలింగ్బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ : 233 పరుగులు ఆలౌట్టీమిండియా తొలి ఇన్నింగ్స్ : 285/9 డిక్లేర్డ్బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ : 146 పరుగుల ఆలౌట్టీమిండియా రెండో ఇన్నింగ్స్: 98/3ఫలితం: ఏడు వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయంచదవండి: సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన జైస్వాల్.. Rishabh Pant hits the winning runs 💥He finishes off in style as #TeamIndia complete a 7-wicket win in Kanpur 👏👏Scorecard - https://t.co/JBVX2gyyPf#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/Nl2EdZS9VF— BCCI (@BCCI) October 1, 2024 -
Ind vs Ban: బంగ్లాపై భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్
Ind vs Ban 2ndTest Day 5 Updates: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా గెలుపొందింది. కాన్పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్ విజయం సాధించింది.టీమిండియా టార్గెట్ 95 రన్స్రెండో వికెట్ కోల్పోయిన టీమిండియాగిల్(6) రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో గిల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. జైస్వాల్ 20 పరుగులతో ఆడుతున్నాడు. కోహ్లి క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 35/2 (5)రోహిత్ శర్మ అవుట్2.1: బంగ్లాదేశ్ విధించిన 95 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో రోహిత్ హసన్ మహమూద్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కేవలం 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శుబ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. రోహిత్ సేన టార్గెట్ ఎంతంటేరెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను టీమిండియా 146 పరుగులకు ఆలౌట్ చేసింది. భోజన విరామ సమయానికి బంగ్లా ఆట కట్టించి.. విజయానికి బాట వేసుకుంది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే బంగ్లాదేశ్ కేవలం 94 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అంటే.. రోహిత్ సేన టార్గెట్ 95.తొమ్మిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్బుమ్రా బౌలింగ్‌లో తైజుల్ ఇస్లాం(0) తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. వికెట్ల ముందు అతడిని దొరకబుచ్చుకున్న బుమ్రా డకౌట్‌గా వెనక్కి పంపాడు. బంగ్లాదేశ్ స్కోరు: 130/9 (40.5). ఖలీద్ అహ్మద్ క్రీజులోకి వచ్చాడు. ముష్ఫికర్ 27 పరుగలతో ఆడుతున్నాడు.ఎనిమిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్మెహదీ హసన్ మిరాజ్ రూపంలో బంగ్లాదేశ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో మిరాజ్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌చేరాడు. బంగ్లా స్కోరు: 118/8 (36.5) . తైజుల్ ఇస్లాం క్రీజులోకి వచ్చాడు. ముష్ఫికర్ రహీం 15 పరుగులతో ఆడుతున్నాడు.ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్జడేజా బౌలింగ్‌లో షకీబ్ అల్ హసన్ ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. బంగ్లా స్కోరు: 94-7 (32 ఓవర్లు). ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్జడేజా బౌలింగ్ లిటన్ దాస్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కేవలం ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. బంగ్లా స్కోరు: 94-6(30)ఐదో వికెట్ డౌన్ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో హాఫ్ సెంచరీ వీరుడు షాద్మన్ ఇస్లాం(50) జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో బంగ్లా ఐదో వికెట్ కోల్పోయింది. లిటన్ దాస్ క్రీజులోకి వచ్చాడు. ముష్ఫికర్ ఒక పరుగుతో ఆడుతున్నాడు. బంగ్లా స్కోరు: 94/5 (29).నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్జడేజా బౌలింగ్‌లో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ షాంటో బౌల్డ్ అయ్యాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ముష్ఫికర్ రహీం క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం 49 పరుగులతో ఆడుతున్నాడు. బంగ్లా స్కోరు: 92/4 (27.5).నిలకడగా ఆడుతున్న షాద్మన్25 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు 87-3. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం 47 పరుగులతో నిలకడగా ఆడుతుండగా.. షాంటో 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్తమ రెండో ఇన్నింగ్స్‌లో 26/2(11) ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట మొదలుపెట్టిన బంగ్లాదేశ్ ఆదిలోనే మరో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో మొమినుల్ హక్(2) కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ నజ్ముల్ హొసేన్ షాంటో క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం 15 పరుగులతో ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ స్కోరు: 36-3(14 ఓవర్లలో). భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టువేదిక:గ్రీన్ పార్క్ స్టేడియం, కా న్పూర్టాస్: భారత్.. బౌలింగ్బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 233భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 285/9 డిక్లేర్డ్టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా రెండో టెస్టు ఐదో రోజు ఆట మొదలైంది. కాగా సోమవారం నాటి ఆటలో రోహిత్ సేన మెరుపు వేగంతో పరుగులు సాధించి.. డ్రా అవుతుందేమోనన్న మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ముందడుగు వేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 34.4 ఓవర్లలో 9 వికెట్లకు 285 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ ఆట కట్టించే క్రమంలో ఆఖరి రోజు వికెట్ల వేటను మొదలు పెట్టి శుభారంభం అందుకుంది.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్బంగ్లాదేశ్షాద్మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్. -
బీసీసీఐ కొత్త కార్యదర్శి ఎవరో గానీ..: పాక్ క్రికెటర్ విమర్శలు
టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ టెస్టు మ్యాచ్‌కు వరుస అవాంతరాల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంకోసారి ఇలాంటి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించవద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి విజ్ఞప్తి చేశాడు. ఈ మ్యాచ్ టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు.డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో చెన్నై మ్యాచ్‌లో 280 పరుగుల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన.. రెండో టెస్టులోనూ జయభేరి మోగించి బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమనిపించింది. తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే అయితే, వర్షం, వెలుతురులేమి, మైదానం సిద్ధంగా లేకపోవడం వంటి కారణాల వల్ల అది సాధ్యపడేలా కనిపించడం లేదు. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్య పడగా... వరుసగా రెండు రోజులు తుడిచిపెట్టుకుపోయాయి. ఆదివారం వర్షం అంతరాయం కలిగించకపోయినా... క్రితం రోజు కురిసిన వానతో మైదానం చిత్తడిగా మారడం వల్ల ఆట సాధ్యపడలేదు.దీంతో వరుసగా రెండో రోజు ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లకే పరిమితమయ్యారు. పలుమార్లు సమీక్షలు నిర్వహించిన అంపైర్లు టీ విరామ సమయంలో మూడో రోజు ఆటను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్టేడియం నిర్వాహకులను ఉద్దేశించి బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘వాళ్లు అసలు మైదానాన్ని ఆరబెట్టనేలేదు. జై షా తర్వాత ఎవరైతే బీసీసీఐ కార్యదర్శిగా వస్తారోగత రాత్రి వర్షం లేకపోయినా.. సూపర్ సాపర్స్ ఉన్నా.. సోమవారం ఉదయానికి కూడా గ్రౌండ్ ఇంకా చిత్తడిగానే ఉంది. అంటే.. అక్కడి కవర్స్ సరిగ్గా లేవని అర్థం. జై షా తర్వాత ఎవరైతే బీసీసీఐ కార్యదర్శిగా వస్తారో.. వాళ్లు మాత్రం కాన్పూర్‌లో ఇంకోసారి టెస్టు మ్యాచ్ నిర్వహించకుండా నిషేధం విధించాలి’’ అని విజ్ఞప్తి చేశాడు. ఇక టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘కాన్పూర్ టెస్టు డ్రాగా ముగిస్తే.. డబ్ల్యటీసీ పాయింట్ల పట్టికలో భారత్ స్థానంపై ప్రభావం పడుతుంది. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో టీమిండియా గెలుస్తుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు.డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలోఅగ్రస్థానంలో టీమిండియా అయితే, అందులో ఒక్క మ్యాచ్ డ్రా అయినా.. రోహిత్ సేన చిక్కుల్లో పడుతుంది. ఏదేమైనా కాన్పూర్ స్టేడియానికి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చే అర్హత మాత్రం లేదు’’ అని బసిత్ అలీ ఘాటు విమర్శలు చేశాడు. కాగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన 10 మ్యాచ్‌లలో ఏడు గెలిచి.. రెండు ఓడిన భారత్.. ఒకటి డ్రా చేసుకుంది. మరోవైపు.. ఆస్ట్రేలియా పన్నెండు మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి రెండోస్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడనున్న రోహిత్ సేన.. ఆతర్వాత ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది.సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక... కాన్పూర్ స్టేడియం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మున్సిపల్ గ్రౌండ్ కాగా... ఇక్కడ మ్యాచ్ నిర్వహించిన ప్రతిసారి బీసీసీఐ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటుంది. దీంతో తాత్కాలిక ఏర్పాట్లే తప్ప పూర్తిస్థాయి ఏర్పాట్లపై బోర్డు కూడా దృష్టి పెట్టలేదు. మ్యాచ్‌కు ముందే స్టాండ్స్ నాణ్యత విషయంలో పెద్ద చర్చ జరగగా... ‘సి’ బ్లాకు నాణ్యత సరిగ్గా లేని కారణంగా అందులోకి ప్రేక్షకులను అనుమతించలేదు.అందుకే కాన్పూర్‌కు టెస్టు మ్యాచ్ కేటాయించారుదేశంలో ఎన్నో మైదానాలు ఉన్నప్పటికీ బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సొంత మైదానం కావడం వల్లే కాన్పూర్‌కు టెస్టు మ్యాచ్ కేటాయించారు. సౌకర్యాల విషయంలో ప్రధాన వేదికల దరిదాపుల్లో కూడా లేని కాన్పూర్‌లో... డ్రైనేజీ వ్యవస్థతో పాటు కనీస వసతులు లేకపోవడంతోనే ఆదివారం ఒక్క చుక్క వర్షం పడకపోయినా మ్యాచ్‌ను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక సోమవారం నాటి నాలుగో రోజు మాత్రం ఆట సజావుగా సాగింది. 107/3తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్.. 233 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 34.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.చదవండి: ఒంటిచేత్తో రోహిత్ సంచలన క్యాచ్.. షాక్‌లో సహచరులు! వీడియో -
Ind vs Ban 2nd Test: అభిమానులకు బ్యాడ్‌న్యూస్
India vs Bangladesh, 2nd Test Day 2 Updates: క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!!... టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆటకూ వరణుడు ఆటంకం కలిగించాడు. వర్షం కారణంగా శనివారం నాటి ఆట ఒక్క బంతి పడకుండానే ముగిసిపోయింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ‘ఎక్స్’ ద్వారా ఈ మేరకు అప్డేట్ అందించింది. వర్షం తగ్గుముఖం పట్టినా.. అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేశారు. లంచ్‌బ్రేక్ సమయానికీ మొదలుకాని ఆటవర్షం తగ్గినా మైదానంలో కప్పిన కవర్లు మాత్రం తీయలేదు. మరికాసేపు వేచి చూసి.. వాన రాకపోతే.. కవర్లు తీసే అవకాశం ఉందని తెలుస్తోందిఆట ఆలస్యంకాగా మైదానం కవర్లతో కప్పబడి ఉండగా.. అంపైర్లు వెళ్లి పిచ్‌ను పరిశీలించారు. అయితే, ఇప్పట్లో ఆట మొదలయ్యే పరిస్థితి మాత్రం కనబడటం లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. తొలిరోజు కూడా అంతరాయమేచెన్నైలో జరిగిన తొలి టెస్టులో బంగ్లాను 280 పరుగుల తేడాతో మట్టికరిపించిన రోహిత్ సేన.. కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో శుక్రవారం రెండో టెస్టు మొదలుపెట్టింది. అయితే, వర్షం కారణంగా అవుట్‌ఫీల్డ్ చిత్తడిగా మారటంతో తొలి రోజు ఆట కూడా ఆలస్యంగా ప్రారంభమైంది.ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని.. నజ్ముల్ షాంటో బృందాన్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే, వాన కారణంగా తొలి రోజు ఆట 35 ఓవర్ల వద్దే ముగిసిపోయింది. అంపైర్లు ఆటను నిలిపివేసే సమయానికి బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.మొదటి రోజు ఆకాశ్‌కు రెండు వికెట్లుఓపెనర్ జకీర్ హసన్(0)ను భారత పేసర్ ఆకాశ్ దీప్ డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(24) వికెట్‌ను సైతం ఆకాశ్ తన ఖాతాలోనే వేసుకోగా.. కెప్టెన్ నజ్ముల్ షాంటో(31)ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి వన్‌డౌన్ బ్యాటర్ మొమినుల్ హక్ 40, ముష్ఫికర్ రహీం 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు తుదిజట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్బంగ్లాదేశ్షాద్మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
Ind vs Ban: ‘టైగర్’కు అస్వస్థతే.. దాడి జరుగలేదు!
బంగ్లాదేశ్ వీరాభిమాని మాట మార్చాడు. అకస్మాత్తుగా తన ఆరోగ్యం పాడైందని.. అందుకే పోలీసులు ఆస్పత్రికి తరలించారని చెప్పాడు. తద్వారా తనపై దాడి జరగలేదని పరోక్షంగా స్పష్టతనిచ్చాడు. కాగా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడినా ఓ వ్యక్తి అక్కడ వాలిపోతాడు. ఒళ్లంతా పులిచారలతో పెయింటింగ్ వేసుకొని తమ జట్టును ఉత్సాహపరుస్తాడు. అతడి అసలు పేరు ‘రాబీ’. అయితే, తనను తాను ‘టైగర్’ అని చెప్పుకొంటాడు.ఆస్పత్రికి వెళ్లే ముందు దాడి జరిగిందని..తనపై దాడి జరిగిందనిఇదిలా ఉంటే... టీమిండియాతో బంగ్లాదేశ్ రెండో టెస్టు కాన్పూర్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం మొదలైన.. ఈ మ్యాచ్ భోజన విరామం సమయంలో రాబీ.. స్టేడియం గేటు వద్ద కాస్త స్పృహ తప్పినట్లు కనిపించాడు. దాంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే ప్రాథమిక చికిత్స అనంతరం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. తనపై దాడి జరిగిందని... కొందరు వ్యక్తులు తన వీపు, పక్కటెముకల్లో పిడిగుద్దులు కురిపించినట్లు రాబీ తనను ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో చెప్పాడు.డీహైడ్రేషన్‌కు లోనయ్యాను.. అంతేఇక హాస్పిటల్లో అతడికి తగిన చికిత్స అందించడంతో పాటు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ప్రమాదమేమీ లేదని తేల్చారు. అక్కడి నుంచి రాబీ తన వ్యాఖ్యను మార్చాడు. ‘నాకు ఆరోగ్యం ఒక్కసారిగా పాడైంది. డీహైడ్రేషన్‌కు లోనయ్యాను. పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు అంతా బాగుంది’ అని అతనే చెప్పాడు. దాడి వార్తను ఖండించిన పోలీసులుమరోవైపు పోలీసులు కూడా దాడి జరిగిందనే వార్తను ఖండించారు. అయితే రాబీ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం ‘సి’ బ్లాక్‌లో నిలబడి ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు వాదనకు దిగి అతని చేతుల్లోంచి జాతీయ పతాకాన్ని లాక్కున్నారని మాత్రం తేలింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాను ఈ టెస్టుకు వస్తే తనపై.. ఇక్కడ కొందరు దాడి చేయవచ్చని గురువారం రాబీ సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా పెట్టాడు. మరోవైపు.. బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో ఆడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం సమీపంలో కొందరు వ్యక్తులు నిరసన కూడా వ్యక్తం చేశారు. చదవండి: అలా జరిగితే గంభీర్ విశ్వరూపం చూస్తారు: బంగ్లాదేశ్ క్రికెటర్ -
Ind vs Ban: అక్కడ కొండముచ్చులే కాపలా!
‘‘ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కొండముచ్చుల(Langurs) ‘సాయం’ కోరింది. ప్రేక్షకులు, తమ కెమెరాల భద్రతకై కాపలాగా ఉండేందుకు వాటి యజమానులను ఒప్పించింది’’.. ఏంటీ విడ్డూరం అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే!.. అసలు విషయం ఏమిటంటే..!?కాన్పూర్‌లో రెండో టెస్టుటీమిండియాతో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య తొలుత చెన్నైలో టెస్టు జరుగగా.. రోహిత్ సేన 280 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అనంతరం రెండో టెస్టు కోసం ఇరుజట్లు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు వచ్చాయి.ఇక్కడి గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్- బంగ్లా మధ్య శుక్రవారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుని.. బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, వర్షం కారణంగా 35 ఓవర్లకే తొలి రోజు ఆట ముగిసిపోయింది. బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పేసర్ ఆకాశ్ దీప్ రెండు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.ఇదిలా ఉంటే.. టీమిండియా- బంగ్లా మధ్య రెండో టెస్టుకు వేదికైన గ్రీన్ పార్క్ స్టేడియం అంటే కోతులకు బాగా ఇష్టమట. గ్రౌండ్ ఖాళీగా ఉన్నపుడు గుంపులుగా అక్కడికి వచ్చి ఆటలాడుతాయని స్థానికులు అంటున్నారు. అంతేకాదు.. మ్యాచ్ సమయంలోనూ ప్రేక్షకుల వద్దకు వచ్చి తినుబండారాలు, వాటర్ బాటిల్స్ ఎత్తుకెళ్లిన సందర్భాలు ఉన్నాయట. అందుకే కొండముచ్చులను తీసుకువచ్చాంఈ నేపథ్యంలో భారత్ మ్యాచ్‌కు ముందు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కొండముచ్చులను హ్యాండిల్ చేసే వ్యక్తులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి గ్రీన్ పార్క్ స్టేడియం డైరెక్టర్ సంజయ్ కపూర్ మాట్లాడుతూ.. ‘‘కోతులు ఇక్కడ భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. అందుకే వాటిని కట్టడి చేసేందుకు, ఇక్కడికి వచ్చే వాళ్లకు భద్రత కల్పించేందుకు కొండముచ్చులను తీసుకువచ్చాం’’ అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నాడు. కాగా గ్రీన్ పార్క్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌లకు కొండముచ్చులు కాపలా కాయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో ముఖ్యంగా బ్రాడ్‌కాస్టింగ్ కెమెరా పర్సన్ దగ్గర కోతుల బెడదను నివారించేందుకు వీటిని అక్కడ మోహరించేవారు. అదీ సంగతి!!చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి: అందుకే కుల్దీప్‌నకు నో ఛాన్స్
బంగ్లాదేశ్‌ను వైట్‌వాష్ చేయడమే లక్ష్యంగా టీమిండియా రెండో టెస్టు బరిలో దిగింది. కాన్పూర్‌లో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇక తమ తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేవని.. చెన్నైలో తొలి టెస్టు ఆడిన టీమ్‌నే కొనసాగిస్తున్నట్లు తెలిపాడు.కుల్దీప్ యాదవ్‌కు మరోసారి మొండిచేయినిజానికి కాన్పూర్‌లో బ్లాక్ సాయిల్(నల్లమట్టి) పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. అయినప్పటికీ... టీమిండియా ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లనే ఆడించడం విశేషం. మ్యాచ్‌కు ముందు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించడం చూసి.. అతడు తుదిజట్టులోకి రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారిఅయితే, గ్రీన్ పార్క్ స్టేడియం వద్ద వాతావరణానికి అనుగుణంగా టీమిండియా తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా కాన్పూర్‌లో గురువారం రాత్రి కురిసిన భారీ వాన వల్ల గ్రీన్ ఫీల్డ్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై టెస్టు మ్యాచ్‌లో.. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి.ఇంతకు ముందు.. 2015లో బెంగళూరు వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి ఇదే తరహా నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి టెస్టు డ్రాగా ముగిసిపోయింది. ఇక.. కాన్పూర్‌లో సైతం భారత జట్టు 1964 తర్వాత.. దాదాపు 24 టెస్టుల అనంతరం ఇలా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తోంది.పిచ్ కాస్త సాప్ట్‌గా కనిపిస్తోందిఇక టాస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్ చేస్తాం. పిచ్ కాస్త సాప్ట్‌గా కనిపిస్తోంది. ఆరంభంలోనే వికెట్లు తీయాలి. కాబట్టి మా ముగ్గురు సీమర్ల సేవలను వినియోగించుకోవాలనుకుంటున్నాం.తొలి టెస్టులో ఆరంభంలో సరిగ్గా ఆడలేకపోయాం. అయితే, మా బౌలర్ల వల్ల విజయం సాధ్యమైంది. ఇక్కడ కూడా బంగ్లాదేశ్ గట్టి పోటీనిస్తుందనే భావిస్తున్నాం. అయితే, ఎలాంటి సవాలునైనా.. అనుభవంతో మేము అధిగమించగలం’’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. నహీద్ రాణా, టస్కిన్ అహ్మద్ స్థానాల్లో తైజుల్ ఇస్లాం, ఖలీద్‌ను తీసుకువచ్చింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతున్న భారత్.. 1-0తో ఆధిక్యంలో ఉంది.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్బంగ్లాదేశ్షాద్మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.చదవండి: మీ ఇంగితానికే వదిలేస్తున్నా: రిషభ్ పంత్ ఆగ్రహం 🚨 Toss Update 🚨Captain @ImRo45 wins the toss and #TeamIndia have elected to bowl in Kanpur.Live - https://t.co/JBVX2gyyPf#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/Hsl0HcoVTa— BCCI (@BCCI) September 27, 2024 -
Ind vs Ban: షకీబ్ అల్ హసన్ సంచలన ప్రకటన
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం ప్రకటించాడు. టీమిండియతో రెండో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ షకీబ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే టెస్టు సిరీస్ తన కెరీర్లో చివరిదని పేర్కొన్నాడు.ఈ మేరకు షకీబ్ కాన్పూర్‌లో మాట్లాడుతూ.. ‘‘టెస్టు ఫార్మాట్లో మిర్పూర్లో సౌతాఫ్రికాతో ఆడబోయే మ్యాచ్ నా కెరీర్లో ఆఖరిది. సొంతగడ్డపై నా అభిమానుల మధ్య టెస్టు కెరీర్ ముగించడం సంతోషకరంగా ఉంటుంది. బంగ్లాదేశ్ క్రికెట్ నాకెంతో చేసింది. పేరు, ప్రతిష్ట అన్నీ ఇచ్చింది. అందుకే నా ఆఖరి టెస్టు స్వదేశంలోనే ఆడాలని నిర్ణయించుకున్నా’’ అని పేర్కొన్నాడు.అక్కడకు వెళ్తే బయటకు రాకపోవచ్చుఇక బంగ్లాదేశ్‌లో తన పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలకు బదులిస్తూ.. ‘‘బంగ్లాదేశీ పౌరుడిగా.. ఇండియా నుంచి అక్కడికి వెళ్లేందుకు నాకు ఎలాంటి సమస్యా ఎదురుకాకపోవచ్చు. అయితే, ఒక్కసారి అక్కడకు వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు బంగ్లాదేశ్‌లోని పరిస్థితుల గురించి ఎప్పటికపుడు నాకు చెబుతూనే ఉన్నారు. నేను కూడా ప్రస్తుతం సందిగ్దావస్థలోనే ఉన్నాను’’ అని షకీబ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.ఎంపీ పదవి పోయిందికాగా బంగ్లాదేశ్‌లో కొంతకాలంగా చెలరేగిన అల్లర్లు రాజకీయ సంక్షోభానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన అవామీ లీగ్ హెడ్షేక్ హసీనా భారత్‌లో తలదాచుకున్నారు. ఆమె ప్రభుత్వం రద్దు కావడంతో.. ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందిన షకీబ్ పదవి కూడా ఊడిపోయింది.హత్య కేసు నమోదుఆ సమయంలో కెనడా లీగ్‌తో బిజీగా ఉన్న షకీబ్.. నేరుగా పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లాడు. అయితే, షకీబ్ బంగ్లాదేశ్‌లో లేని సమయంలో అతడిపై హత్య కేసు నమోదైంది. దేశంలో చెలరేగిన అల్లర్లలో తన కుమారుడు చనిపోవడానికి కారణం ప్రధాని షేక్ హసీనా, ఆమె పార్టీ సభ్యులు కారణమంటూ ఓ వ్యక్తి షకీబ్పైకూడా కేసు పెట్టాడు. దీంతో అతడిని అరెస్టు చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, బంగ్లా బోర్డు మాత్రం ఆటగాడిగా షకీబ్ దేశానికి ఎంతో సేవ చేశాడని.. అతడిని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే జట్టుతో కలిసి షకీబ్ పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చాడు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఆడాడు. బంగ్లా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ పేజీబంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో రాణించిన గొప్ప ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్. ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. బంగ్లా తరఫున 2007లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతడు.. ఇప్పటి వరకు 70 మ్యాచ్‌లు ఆడి 4600 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. అదే విధంగా.. టెస్టుల్లో 242 వికెట్లు పడగొట్టాడు.ఇక టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా తన చివరి అంతర్జాతీయ టీ2మ్యాచ్ ఆడిన షకీబ్ అల్ హసన్.. దేశం తరఫున 129 పొట్టి మ్యాచ్‌లలో 2551 రన్స్ చేయడంతో పాటు.. 149 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు 247 వన్డేల్లో 7570 పరుగుల సాధించి.. 317 వికెట్లు కూల్చాడు. చదవండి: IND Vs BAN: ఇలా అయితే కష్టం కోహ్లి!.. 15 బంతుల్లో నాలుగుసార్లు అవుట్! -
Ind vs Ban: ఆ స్టాండ్ బాలేదు.. యాభై మంది ఉన్నా ప్రమాదకరమే!
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు ఇప్పటికే కాన్పూర్‌కు చేరుకుంది. ప్రత్యర్థిని వైట్‌వాష్ చేయడమే లక్ష్యంగా ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా శ్రమిస్తోంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుందన్న అంచనాల నడుమ ఇరుజట్లు తమ ముగ్గురేసి స్పిన్ బౌలర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. కాన్పూర్ స్టేడియం గురించి ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(యూపీసీఏ) సీఈఓ అంకిత్ ఛటర్జీ చేసిన వ్యాఖ్యలు.. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకున్న అభిమానుల్లో అలజడి రేపుతున్నాయి. కాగా 2021 తర్వాత కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.శిథిలావస్థలో ఆ స్టాండ్అయితే, స్టేడియంలో ఓ స్టాండ్ శిథిలావస్థకు చేరినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. ఉత్తర ప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్(పీడబ్ల్యూడీ) అధికారులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపింది. ఈ విషయం గురించి అంకిత్ ఛటర్జీ ప్రస్తావిస్తూ.. ‘‘పీడబ్ల్యూడీ అధికారులు..గ్రీన్ పార్క్‌లోని బాల్కనీ ‘సీ’కి సంబంధించి టికెట్లు అమ్మవద్దని మాతో చెప్పారు. అక్కడి పరిస్థితి బాగాలేదన్నారు.ప్రస్తుతం ఆ బాల్కనీకి సంబంధించి ప్రస్తుతం రిపేర్లు జరుగుతున్నాయి. నిజానికి అక్కడ 4800 మంది ప్రేక్షకులు కూర్చోవచ్చు. కానీ.. పీడబ్ల్యూడీ అధికారుల సూచన మేరకు కేవలం 1700 టికెట్లే సేల్ చేశాం’’ అని పేర్కొన్నాడు. ఒకవేళ పంత్ సిక్సర్ కొట్టాడనుకోండిఇక పీడబ్ల్యూడీ ఇంజనీర్ ఒకరు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం.. బాల్కనీ సి కనీసం యాభై మంది ప్రేక్షకుల బరువును కూడా మోయలేదు. ఒకవేళ రిషభ్ పంత్ సిక్సర్ కొట్టాడనుకోండి. అభిమానులు లేచి గంతులేయడం మొదలుపెడతారు. అలా అయితే,స్టాండ్ ఓ పక్కకి ఒరిగిపోయినా ఆశ్చర్యం లేదు. అక్కడి పరిస్థితి అస్సలు బాగాలేదు’’ అని పేర్కొన్నారు. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇక చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా బంగ్లాను 280 పరుగుల తేడాతో మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ద్వారా టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్బ్యాటర్ రిషభ్ పంత్ శతకం(109)తో ఆకట్టుకున్నాడు.చదవండి: ఇలా అయితే కష్టం కోహ్లి!.. 15 బంతుల్లో నాలుగుసార్లు అవుట్! -
Ind vs Ban 2nd Test: భారత తుదిజట్టు నుంచి అతడు అవుట్!
బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా టీమిండియా రెండో టెస్టు బరిలో దిగనుంది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్ ఫైనల్ చేరే క్రమంలో మరో ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. కాగా రెండు టెస్టు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.తొలి టెస్టులో పేసర్లకే పెద్దపీటఈ క్రమంలో ఇరు జట్ల మధ్య చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ను 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కాగా చెపాక్‌లోని ఎర్రమట్టి పిచ్‌పై ఈ మ్యాచ్ జరగగా.. ఇరు జట్లు ఫాస్ట్ బౌలర్లకు ప్రాధాన్యం ఇచ్చాయి. టీమిండియా ముగ్గురు సీమర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లకు తుదిజట్టులో చోటిచ్చింది.అదే విధంగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను కూడా ఆడించింది. దీంతో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మొండిచేయి ఎదురైంది. అయితే, రెండో టెస్టులో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండబోతుందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాన్పూర్‌లోని నల్లమట్టి పిచ్‌పై మ్యాచ్ జరుగనుండటంతో కుల్దీప్ తుదిజట్టులో స్థానం దక్కించుకోవచ్చని అభిప్రాయపడ్డాడు.ఒక ఫాస్ట్ బౌలర్‌కు ఉద్వాసన‘‘నల్లమట్టి పిచ్‌పై గ్రాస్ వేసి.. కాస్త తేమగా ఉంచితే.. ఆట మొదటి రోజు, రెండో రోజు అరపూట వరకు బంతి బాగానే బౌన్స్ అవుతుంది. చెన్నై మాదిరే ఈ పిచ్ కూడా ఉంటే.. టీమిండియా మరోసారి ముగ్గురు ఫాస్ట్‌బౌలర్లతో రంగంలోకి దిగుతుంది. అలా కాకుండా ఇది పక్కాగా కాన్పూర్ పిచ్ అయితే మాత్రం.. రోజురోజుకీ వికెట్ బాగా నెమ్మదిస్తుంది.స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కుల్దీప్ యాదవ్ కచ్చితంగా తుదిజట్టులోకి వస్తాడు. అదే జరిగితే.. ఒక ఫాస్ట్ బౌలర్‌కు ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. పనిభారాన్ని తగ్గించేందుకు బుమ్రాకు విశ్రాంతినిస్తే.. ఆకాశ్ దీప్ జట్టులో ఉంటాడు. లేదంటే.. ఆకాశ్ స్థానాన్ని కుల్దీప్ భర్తీ చేస్తాడు. రెండో టెస్టులో ఆడబోయే టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇంతకంటే వేరే మార్పులేమీ ఉండకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా భారత తుదిజట్టు కూర్పు గురించి అభిప్రాయాలు పంచుకున్నాడు. శుక్రవారం నుంచి టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మొదలుకానుంది.బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు భారత తుది జట్టు అంచనారోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.చదవండి: ICC CT 2025: పాకిస్తాన్ కాదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: అఫ్గన్ కెప్టెన్📍 Kanpur#TeamIndia hit the ground running ahead of the 2nd #INDvBAN Test 🙌@IDFCFIRSTBank pic.twitter.com/EMPiOa8HII— BCCI (@BCCI) September 26, 2024 -
Ind Vs Nz 1st Test: ప్చ్.. మనకు నిరాశే.. డ్రాగా ముగిసిన కాన్పూర్ టెస్టు
Ind Vs Nz 2021 1st Test Day 5 Highlights Updates Telugu: 04:22 PM: ►గెలుపు ఖాయమనుకున్న తొలి టెస్టులో భారత్‌కు నిరాశ తప్పలేదు. చివరి వికెట్ తీయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ అడ్డుగోడగా నిలబడి విలియమ్సన్ బృందాన్ని ఓటమి బారి నుంచి తప్పించారు. ఫలితంగా మ్యాఛ్ డ్రాగా ముగిసింది. అరంగేట్ర హీరో శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక మ్యాచ్‌లో అయ్యర్ మొత్తంగా 170 పరుగులు చేశాడు. టీమిండియా : ►తొలి ఇన్నింగ్స్: 345-10 (111.1 ఓవర్లలో) ►రెండో ఇన్నింగ్స్: 234-7 డిక్లేర్డ్ (81 ఓవర్లు) న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 296-10 (142.3 ఓవర్లలో) రెండో ఇన్నింగ్స్: 165-9(98 ఓవర్లు). 3:55 PM ►విజయం దిశగా పయనిస్తున్న భారత్ ►ఐదో రోజు ఆటలో భాగంగా న్యూజిలాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో టిమ్ సౌథీ పెవిలియన్ చేరాడు. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర క్రీజులో ఉన్నారు. ఇక విజయానికి ఒక వికెట్ దూరంలో ఉన్న నేపథ్యంలో రహానే ఫీల్డింగ్‌ను మరింత కట్టుదిట్టం చేశాడు. 3: 44 PM: ►రెండు వికెట్లు పడగొడితే చాలు విజయం టీమిండియాదే. ►‘సర్’ రవీంద్ర జడేజా.. జేమీసన్ వికెట్ పడగొట్టడంతో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. కివీస్ ప్రస్తుత స్కోరు- 147/8 (86.2) 3:35 PM: ►విజయానికి మూడు వికెట్ల దూరంలో టీమిండియా ►కివీస్ స్కోరు: 143/7 ►న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. టామ్ బ్లండెల్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపి భారత్‌ను విజయానికి మరింత చేరువ చేశాడు. ప్రస్తుతం కివీస్ టీమిండియా కంటే 138 పరుగులు వెనుకబడి ఉంది. 3:14PM: ►టీమిండియా కంటే న్యూజిలాండ్ 146 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుత స్కోరు: 138/6 (77). ►రచిన్ రవీంద్ర(6), టామ్ బ్లండెల్(2) పరుగులతో క్రీజులో ఉన్నారు. 2:55PM: టీమిండియా విజయానికి మరింత చేరువైంది. విలియమ్సన్ రూపంలో న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను రవీంద్ర జడేజా ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. దీంతో న్యూజిలాండ్ ఆశలు ఆవిరయ్యాయి. కాగా టీమిండియా విజయానికి ఇంకా 4 వికెట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో టామ్ బ్లండెల్(2) ఉండగా, రచిన్ రవీంద్ర క్రీజులోకి వచ్చాడు న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. హెన్రీ నికోల్స్‌ను అక్షర్ పటేల్ ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. కాగా టీమిండియా విజయానికి ఇంకా 5 వికెట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్ 24 పరుగులతో ఉండగా, టామ్ బ్లండల్ క్రీజులోకి వచ్చాడు 2:14 PM: న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన రాస్ టేలర్‌ను రవీంద్ర జడేజా ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. కాగా టీమిండియా విజయానికి ఇంకా 6 వికెట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్ 24 పరుగులతో ఉండగా,హెన్రీ నికోల్స్ క్రీజులోకి వచ్చాడు. న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన టామ్ లాథమ్‌ను, రవిచంద్రన్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కాగా టీమిండియా విజయానికి ఇంకా 7 వికెట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్(7), రాస్ టేలర్(0) పరుగులతో ఉన్నారు. 12: 58 PM: కివీస్ స్కోర్: 99/2, భారత్ కంటే ఇంకా 185 పరుగులు వెనుకబడి ఉన్న కివీస్. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్(49),విలియమ్సన్(7) పరుగులతో ఉన్నారు. 12: 14PM: 79 పరుగుల వద్ద న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన విలియం సోమర్విల్లే, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో శుభమాన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్(32),విలియమ్సన్ ఉన్నారు. 11:30AM: ఐదో రోజు ఆట: లంచ్ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ స్కోరు(సెకండ్ ఇన్నింగ్స్): ఒక వికెట్ నష్టానికి 79 పరుగులు. భారత్ కంటే ఇంకా 205 పరుగులు వెనుకబడి ఉన్న కివీస్. 11:18 Am: న్యూజిలాండ్ స్కోర్: 70/1, ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్(32), విలియం సోమర్విల్లే(32) పరుగులతో ఉన్నారు. 10:10 Am: ఐదో రోజు ఆట ప్రారంభించిన కివీస్ నిలకడగా ఆడుతుంది. 14 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి న్యూజిలాండ్ 32 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్(10), విలియం సోమర్విల్లే(18) పరుగులతో ఉన్నారు. 9:30 Am: కాన్పూర్ వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అఖరి రోజు ఆట ప్రారంభమైంది. కాగా చివరి రోజు ఆట ఆసక్తికరంగా మారింది. ఇరు జట్లుకు విజయం ఊరిస్తోంది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ అటాక్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్, విలియం సోమర్విల్లే ఉన్నారు. కాగా భారత్.. విజయానికి ఇంకా 9 వికెట్ల దూరంలో నిలవగా, మరోవైపు న్యూజిలాండ్ 284 పరుగుల లక్ష్యాన్ని చేధించి గెలుపు రుచి చూడాలని భావిస్తోంది. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్ 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత జట్టు: శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(కెప్టెన్) శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్- వృద్ధిమాన్ సాహా స్థానంలో సబ్‌స్టిట్యూట్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్. న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జామీసన్, విలియం సోమర్విల్లే. చదవండి: BAN Vs PAK: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ బౌలర్.. ఏకంగా 7 వికెట్లు... -
IND Vs NZ 1st Test: విజయం ఊరిస్తోంది!
రికార్డులకెక్కే వ్యక్తిగత స్కోర్లు లేకున్నా... సమష్టిగా జట్లు భారీ స్కోర్లు నమోదు చేయకున్నా... ఏ ఒక్కడూ తన బౌలింగ్‌తో పడేయకున్నా... నాలుగు రోజుల క్రితం మొదలైన కాన్పూర్ టెస్టు సెషన్ సెషన్‌కు మలుపులు తిరుగుతూ రసకందాయంలో పడింది. ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టులో రెండు జట్లనూ విజయం ఊరిస్తోంది. ఆఖరి రోజు భారత్ నెగ్గాలంటే తొమ్మిది వికెట్లు తీయాలి. న్యూజిలాండ్ విజయం రుచి చూడాలంటే మరో 280 పరుగులు చేయాలి. కాన్పూర్: ఆట ఆఖరి మజిలీకి చేరింది. న్యూజిలాండ్‌ను లక్ష్యం ఊరిస్తోంది. భారత్‌ను గెలుపు పిలుస్తోంది. టెస్టు మలుపులు తీసుకుంటూ సాగిపోతోంది. నాలుగో రోజు తొలి సెషన్‌ను కివీస్ బౌలర్లు శాసించారు. మరో సెషన్లో మన కథ సమాప్తమన్నట్లుగా రెచ్చిపోయారు. కానీ శ్రేయస్ అయ్యర్ (125 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్) కొత్త వాడినే... కానీ సత్తా ఉన్న వాడినంటూ బ్యాట్‌తో మరోసారి చాటుకున్నాడు. కీపర్ వృద్ధిమాన్ సాహా (126 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) కూడా అజేయ అర్ధ శతకంతో అయ్యర్‌కు కలిసొచ్చాడు. నాలుగో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 81 ఓవర్లలో 7 వికెట్లకు 234 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. సౌతీ (3/75), జేమీసన్ (3/40) ఆకట్టుకున్నారు. 284 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. హడలెత్తించిన సౌతీ, జేమీసన్ స్పిన్ ట్రాక్‌పై న్యూజిలాండ్ సీమర్లు సౌతీ, జేమీసన్ బెంబేలెత్తించడంతో తొలి సెషన్లో భారత్ నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 14/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్‌ను కివీస్ పేసర్లు అంతలా దెబ్బతీశారు. పుజారా (33 బంతుల్లో 22; 3 ఫోర్లు), రహానే (4) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. కాసేపటికే సౌతీ ఒకే ఓవర్లో ఓపెనర్ మయాంక్ (17; 3 ఫోర్లు), రవీంద్ర జడేజా (0)ల ఆట కట్టించాడు. స్కోరు చూస్తే 51/5. అప్పటికీ భారత్ ఆధిక్యం 100 పరుగులు మాత్రమే. ఆదుకున్న అయ్యర్, సాహా ఇక లెక్కకు సగం వికెట్లు మిగిలున్నట్లు కనబడినా... స్పెషలిస్టు బ్యాటర్స్ అయితే ఇద్దరే! అయ్యర్, సాహా. కానీ సాహాకంటే ముందుగా క్రీజులోకి వచ్చిన అశ్విన్, అయ్యర్‌తో కలిసి తొలి సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో లంచ్ విరామనికి భారత్ 84/5 స్కోరు చేయగలిగింది. రెండో సెషన్లో జట్టు స్కోరు వంద పరుగులు దాటాక అశ్విన్ (32; 5 ఫోర్లు)ను జేమీసన్ బౌల్డ్ చేశాడు. తర్వాత సాహా రావడంతో రెండో సెషన్ సాఫీగా సాగిపోయింది. ఏడో వికెట్‌కు 64 పరుగులు జోడించాక టీ విరామానికి ముందు అయ్యర్‌ను సౌతీ ఔట్ చేశాడు. అదే స్కోరు 167/7 వద్ద టీబ్రేక్‌కు వెళ్లారు. మూడో సెషన్ పూర్తిగా భారత్ ఆధీనంలో నడిచింది. అక్షర్ పటేల్ (28 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో సాహా అదరగొట్టేశాడు. అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. కొన్ని ఓవర్లే మిగిలి ఉండటంతో ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలో పడేసేందుకు 234/7 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. ఆశించినట్లే అశ్విన్ కివీస్ ఓపెనర్ యంగ్ (2)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ► అరంగేట్రం టెస్టులో సెంచరీ, అర్ధ సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా శ్రేయస్ అయ్యర్ గుర్తింపు పొందాడు. ► భారత్‌లో భారత్‌పై 200 పరుగులకుపైగా లక్ష్యాన్ని ఇప్పటివరకు రెండు జట్లు మాత్రమే ఛేదించాయి. 1972లో ఢిల్లీ వేదికగా జరిగిన టెస్టులో ఇంగ్లండ్ 207 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. 1987లో ఢిల్లీలో జరిగిన టెస్టులో వెస్టిండీస్ 276 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ► భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హర్భజన్ సింగ్ (417 వికెట్లు) సరసన అశ్విన్ (417 వికెట్లు) చేరాడు. ప్రస్తుతం హర్భజన్‌తో కలిసి అశ్విన్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. అనిల్ కుంబ్లే (619 వికెట్లు) అగ్రస్థానంలో, కపిల్‌దేవ్ (437 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నారు. ► నాలుగేళ్ల విరామం తర్వాత టెస్టుల్లో భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అర్ధ సెంచరీ సాధించాడు. 2017లో చివరిసారి సాహా (67) కొలంబోలో శ్రీలంకపై అర్ధ సెంచరీ చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 345; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 296; భారత్ రెండో ఇన్నింగ్స్: మయాంక్ (సి) లాథమ్ (బి) సౌతీ 17; శుబ్‌మన్ గిల్ (బి) జేమీసన్ 1; పుజారా (సి) బ్లన్‌డెల్ (బి) జేమీసన్ 22; రహానే (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎజాజ్ 4; శ్రేయస్ (సి) బ్లన్‌డెల్ (బి) సౌతీ 65; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) సౌతీ 0; అశ్విన్ (బి) జేమీసన్ 32; సాహా (నాటౌట్) 61; అక్షర్ పటేల్ (నాటౌట్) 28; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (81 ఓవర్లలో 7 వికెట్లకు డిక్లేర్డ్) 234. వికెట్ల పతనం: 1–2, 2–32, 3–41, 4–51, 5–51, 6–103, 7–167. బౌలింగ్: సౌతీ 22–2–75–3, జేమీసన్ 17–6–40–3, ఎజాజ్ 17–3–60–1, రచిన్ 9–3–17–0, సొమర్విల్లే 16–2–38–0. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (బ్యాటింగ్) 2; విల్ యంగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 2; సోమర్విల్లే (బ్యాటింగ్) 0; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 4. వికెట్ల పతనం: 1–3. బౌలింగ్: అశ్విన్ 2–0–3–1, అక్షర్ పటేల్ 2–1–1–0. -
Ind Vs NZ 1st Test: ఏం ఆడుతున్నావయ్యా.. ఇకనైనా భరత్‌ను తీసుకుంటారా?
Twitter reacts after Wriddhiman Saha was dismissed against New Zealand: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. రెండో రోజు ఆటలో భాగంగా 50 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రవీంద్ర జడేజా నిష్క్రమించగా 88వ ఓవర్లో సాహా క్రీజులోకి వచ్చాడు. కివీస్ బౌలర్ సౌథీ బౌలింగ్‌లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డ.. అతడు 93వ ఓవర్లో ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. 12 బంతులు ఎదుర్కొని ఒక పరుగు సాధించి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో సాహా ఆట తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికైనా సాహాను జట్టు నుంచి తప్పించి అతడి స్థానంలో కేఎస్ భరత్‌ను ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ‘‘ఏం ఆడుతున్నావయ్యా! ఆటపై కాస్త దృష్టి పెట్టు! సాహాను ఇంకా జట్టులో కొనసాగించడం ఎందుకు? ఇప్పటికైనా అతడిని కాదని రిషభ్ పంత్‌ను ఎందుకు తీసుకుంటారో అర్థమవుతోందా! సాహా ఫామ్‌లో లేడు కదా! బైబై చెప్పేయండి! సాహాకు బదులు కేఎస్ భరత్‌ను జట్టులోకి తీసుకోండి!’’ అని ట్రోల్ చేస్తున్నారు. కాగా రిషభ్ పంత్‌కు విశ్రాంతినివ్వడంతో... తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్‌ను న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. చదవండి: IND Vs NZ: అరంగేట్ర మ్యాచ్‌లో రికార్డులు సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. Throw out that Saha from team and play with KS Bharat . — Sowmya (@SowmyaVirat18) November 26, 2021 Why is W saha still in the team ? #indvs — Name cannot be blank (@infinity9191) November 26, 2021 #saha pic.twitter.com/p9EEwBGAjX — Cricket 🏏 memes 😁 (@Lakshay48215862) November 26, 2021 Time for India to move away from Saha even as a backup keeper, he is the best "Wicket-keeper" but time to give that backup option to KS Bharat or someone to groom from the Sri Lanka Test series. — Johns. (@CricCrazyJohns) November 26, 2021 -
మొదటి రోజు దుమ్ములేపిన భారత బ్యాటర్లు.. తొలి మ్యాచ్‌లోనే అయ్యర్ అర్ధ సెంచరీ
టెస్టుల్లో సొంతగడ్డపై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ అంటే భారత్‌కు తిరుగులేదనేది వాస్తవం...అయితే గ్రీన్ పార్క్‌లో మందకొడిగా ఉన్న పిచ్, తక్కువ ఎత్తులో వస్తున్న బంతితో టీమిండియా కూడా స్వేచ్ఛగా ఆడలేకపోయింది... జేమీసన్ పదునైన బౌలింగ్‌తో ఒక దశలో బ్యాటింగ్‌లో కొంత తడబాటు కూడా కనిపించింది...అయితే మూడో సెషన్లో చక్కటి ఆటతో మొదటి రోజును భారత్ మెరుగైన స్థితిలో ముగించింది. గిల్, జడేజాలతో పాటు అరంగేట్రంలోనే అయ్యర్ సాధించిన అర్ధ సెంచరీతో న్యూజిలాండ్‌పై తొలి రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. కివీస్ ముగ్గురు స్పిన్నర్లు కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. కాన్పూర్: భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారం తొలి టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. భారత్ సాధించిన పరుగులు చూస్తే తక్కువగానే కనిపిస్తున్నా... పరిస్థితులను బట్టి చూస్తే దీనిని మొదటి రోజు సురక్షిత స్కోరుగానే పరిగణించవచ్చు. గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. కొత్త ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (136 బంతుల్లో 75 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (93 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (100 బంతుల్లో 50 బ్యాటింగ్; 6 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి సీమర్ కైల్ జేమీసన్ (3/47) భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. శుబ్‌మన్ అర్ధ శతకం భారత్ బ్యాటింగ్ మొదలయ్యాక ఎనిమిదో ఓవర్లోనే మయాంక్ అగర్వాల్ (13) అవుటయ్యాడు. జేమీసన్ నుంచి దూసుకొచ్చిన బంతి మయాంక్ బ్యాట్‌కు తాకీతాకనట్లుగా కీపర్ బ్లండెల్ చేతుల్లో పడింది. అనంతరం చతేశ్వర్ పుజారా (88 బంతుల్లో 26; 2 ఫోర్లు) క్రీజులోకి వచ్చాడు. ఇద్దరు క్రీజులో పాతుకుపోవడంతో మరో వికెట్ కోసం కివీస్ బౌలర్ల ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. పుజారా నెమ్మదిగా ఆడితే... గిల్ మాత్రం చూడచక్కని బౌండరీలతో స్కోరుబోర్డును నడిపించాడు. ఈ క్రమంలోనే అతను 81 బంతుల్లో (5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా 82/1 స్కోరు వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లారు. గిల్ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఎల్బీకి అవకాశం ఉన్నా... కివీస్ అప్పీల్ కూడా చేయలేదు. రీప్లేలో అది కచ్చితంగా అవుట్ అయ్యేదని తేలింది. బెదరగొట్టిన జేమీసన్ ఈ సెషన్లో ఆట రూటు మారింది. అప్పటి దాకా పరుగుల బాట పట్టగా... సీమర్ జేమీసన్ బౌలింగ్‌తో కీలకవికెట్లను కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. లంచ్ తర్వాత మొదలైన తొలి ఓవర్లోనే క్లీన్‌బౌల్డ్ చేసి గిల్ ఆటను జెమీసన్ ముగించాడు. జట్టు స్కోరు వంద పరుగులు దాటిన కాసేపటికే భారత్‌ను సౌతీ మరో దెబ్బ తీశాడు. క్రీజులో పాతుకుపోయిన పుజారాను కీపర్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో రహానేకు అయ్యర్ జతయ్యాడు. రహానే బౌండరీలతో అలరించినా, అతని ఆట ఎంతోసేపు సాగలేదు. జట్టు స్కోరు 145 పరుగుల వద్ద అతన్ని జేమీసన్ బౌల్డ్ చేశాడు. అలా నాలుగు ప్రధాన వికెట్లను కోల్పోయిన భారత్ ఆత్మరక్షణలో పడింది. 154/4 వద్ద టీ బ్రేక్ తీసుకున్నారు. ఆదుకున్న అయ్యర్, జడేజా శ్రేయస్, జడేజా ఇద్దరు ప్రత్యర్థి పేస్, స్పిన్ బౌలింగ్‌ను చక్కగా ఎదుర్కోవడంతో మూడో సెషన్ బ్యాటింగ్ వైపు మళ్లింది. శ్రేయస్ అయ్యర్ ఆదుకునే టెస్టు ఇన్నింగ్స్ ఆడాడు. నిలబడిన తీరు, ఎంచుకున్న ప్లేస్‌మెంట్స్, కచ్చితమైన షాట్లు అతన్ని, జట్టును నిలబెట్టాయి. ఈ క్రమంలోనే 94 బంతుల్లో (6 ఫోర్లు) అయ్యర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 68వ ఓవర్లో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. న్యూజిలాండ్ కొత్త బంతి తీసుకున్నా... క్రీజులో పాగా వేసిన ఈ జోడీని ఏమీ చేయలేకపోయింది. స్పిన్నర్లు ఎజాజ్ పటేల్, సొమర్విల్లే బౌలింగ్‌లో అయ్యర్ భారీ సిక్సర్లు బాదాడు. వేగం పెరగడంతో 82వ ఓవర్లో భారత్ స్కోరు 250కి చేరింది. మరోవైపు జడేజా కూడా 99 బంతుల్లో (6 ఫోర్లు) టెస్టుల్లో 17వ అర్ధసెంచరీ పూర్తిచేశాడు. ఇద్దరు కలిసి అబేధ్యమైన ఐదో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (సి) బ్లండెల్ (బి) జేమీసన్ 13; గిల్ (బి) జేమీసన్ 52; పుజారా (సి) బ్లండెల్ (బి) సౌతీ 26; రహానే (బి) జేమీసన్ 35; శ్రేయస్ (బ్యాటింగ్) 75; జడేజా (బ్యాటింగ్) 50; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (84 ఓవర్లలో 4 వికెట్లకు) 258. వికెట్ల పతనం: 1–21, 2–82, 3–106, 4–145. బౌలింగ్: సౌతీ 16.4–3–43–1, జేమీసన్ 15.2–6–47–3, ఎజాజ్ 21–6–78–0, సొమర్విల్లే 24–2–60–0, రచిన్ రవీంద్ర 7–1–28–0. శ్రేయస్ అయ్యర్ @ 303 భారత్ తరఫున 22 వన్డేలు, 32 టి20లు ఆడిన తర్వాత ముంబై బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌కు టెస్టు క్రికెట్ ఆడే అవకాశం దక్కింది. కాన్పూర్ టెస్టుతో అరంగేట్రం చేసిన అయ్యర్ ఈ ఫార్మాట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 303వ ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు 54 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 52.18 సగటుతో పాటు ఏకంగా 81.53 స్ట్రైక్‌రేట్‌తో 4592 పరుగులు చేసిన ఘనత శ్రేయస్ సొంతం. ప్రస్తుత క్రికెటర్లలో 50కు పైగా సగటుతో కనీసం 4 వేలకు పైగా పరుగులు సాధించినవారిలో 80కి పైగా స్ట్రైక్ రేట్ ఉన్న ఆటగాడు అయ్యర్ ఒక్కడే కావడం విశేషం. -
Ind Vs Nz Test Series:‘చాంపియన్’తో సమరానికి సై
ప్రపంచ టెస్టు చాంపియన్ న్యూజిలాండ్‌పై తమ సొంతగడ్డలో బదులు తీర్చుకునేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఇంగ్లండ్‌లో తమకు టైటిల్ అందకుండా చేసిన జట్టును కసితీరా ఓడించేందుకు టీమిండియా ఎప్పటిలాగే స్పిన్ అస్త్రాలతో సిద్ధమైంది. మరోవైపు కివీస్ కూడా టి20లో ఎదురైన క్లీన్‌స్వీప్ పరాభవాన్ని రూపుమాపేందుకు తొలి టెస్టులో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. కాన్పూర్: భారత్‌తో జరిగిన గత మూడు టెస్టుల్లో న్యూజిలాండ్‌దే విజయం. ఇందులో రెండు మ్యాచ్‌లో కివీస్ సొంతగడ్డపై ఆడగా...మరో మ్యాచ్ తటస్థ వేదికపై (డబ్ల్యూటీసీ ఫైనల్) జరిగింది. అయితే భారత్‌లో భారత్‌ను టెస్టుల్లో ఎదుర్కోవడం అంత సులభం కాదనే విషయం కివీస్‌కు బాగా తెలుసు. 2016 సిరీస్‌లో ఇక్కడ ఆడిన మూడు టెస్టుల్లోనూ ఆ జట్టు చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో గత మూడు పరాజయాలకు బదులు తీర్చుకోవాలనే లక్ష్యంతో భారత్ ఉంది. పైగా సొంతగడ్డపై ఆడే అనుకూలత కూడా టీమిండియాకు కలిసొస్తుంది. ఈ నేపథ్యంలో గురువారం ఇరుజట్ల మధ్య మొదలయ్యే తొలి టెస్టు ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగే అవకాశముంది. భారత జట్టులో రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి గైర్హాజరు కాగా... టి20ల నుంచి విశ్రాంతి తీసుకున్న కివీస్ సారథి కేన్ విలియమ్సన్ టెస్టు పరీక్షకు అందుబాటులో ఉండటం ప్రత్యర్థి జట్టుకు బలం. ఆత్మవిశ్వాసంతో టీమిండియా పొట్టి మ్యాచ్‌ల్లో క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంతో ఉన్న భారత్ టెస్టు సిరీస్‌నూ విజయవంతంగా ముగించాలనే లక్ష్యంతో ఉంది. మయాంక్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. టెస్టుల్లో స్పెషలిస్ట్ ఓపెనర్లయిన వీరిద్దరు శుభారంభం అందించగలరు కాబట్టి లోకేశ్ రాహుల్ లేని లోటైతే కనిపించదు. కోహ్లి విశ్రాంతి జట్టుకు ఇబ్బందికరమైనప్పటికీ నాలుగో స్థానంలో తాత్కాలిక సారథి రహానే ఫామ్‌లోకి వస్తే అంతా సర్దుకుంటుంది. వన్‌డౌన్‌లో చతేశ్వర్ పుజారా నిలబడితే ప్రత్యర్థి బౌలర్లు నీరసించక తప్పదు. శ్రేయస్ అయ్యర్ టెస్టు అరంగేట్రం చేస్తాడని ఒక రోజు ముందుగానే రహానే ప్రకటించాడు. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ బెంచ్‌కే పరిమితం! భారత్‌లో స్పిన్నే ప్రధాన ఆయుధం... ఈ నేపథ్యంలో వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌తో పాటు జడేజా, అక్షర్ పటేల్ తుది జట్టులో ఖాయంగా ఆడతారు. పేసర్లలో ఇషాంత్ శర్మతో హైదరాబాదీ సీమర్ సిరాజ్ లేదంటే ఉమేశ్ యాదవ్ బరిలోకి దిగే అవకాశముంది. కోహ్లి, రోహిత్, బుమ్రా, షమీ, పంత్‌లాంటి ప్లేయర్లు లేకపోయినా స్వదేశంలో తిరుగు లేని జట్టయిన భారత్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే టెస్టు విజయం కష్టం కాబోదు. విలియమ్సన్ అండతో... రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేని జట్టు మూడు టి20ల్లోనూ చిత్తుగా ఓడింది. కానీ టెస్టులకు కొండంత అండ కేన్ హాజరుతో లభించింది. అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ కూడా అందుబాటులోకి రావడం జట్టును పటిష్టంగా మార్చింది. అయితే భారత్‌లో న్యూజిలాండ్ రికార్డే అత్యంత పేలవంగా ఉంది. ఇప్పటివరకు 34 టెస్టులు ఆడితే కేవలం 2 టెస్టులే గెలవగలిగింది. అప్పుడెప్పుడో 1988లో చివరిసారిగా గెలిచిన తర్వాత ఇప్పటి వరకు మళ్లీ విజయానికి చేరువగా రాలేకపోయింది. అయితే ఇప్పుడు ప్రపంచ టెస్టు చాంపియన్ హోదాతో భారత్‌కు వచ్చింది. ప్రధాన బౌలర్లలో ఒకడైన ట్రెంట్ బౌల్ట్ విశ్రాంతితో స్వదేశం చేరాడు. ఈ నేపథ్యంలో పేస్ భారమంతా సీనియర్ సీమర్ సౌతీపైనే ఉంది. భారత్‌లోని స్పిన్ పిచ్‌ల దృష్ట్యా ఎజాజ్ పటేల్, సొమర్విల్లేలను తీసుకొచ్చినా... వీళ్లు ఏమాత్రం ప్రభావం చూపుతారో మైదానంలోనే చూడాలి. -
విజయం అంచున విరాట్ సేన
కాన్పూర్: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇక్కడ గ్రీన్ పార్క్ జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం అంచున నిలిచింది. ఇంకా భారత్ మూడు వికెట్లు సాధిస్తే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. 434 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కొనసాగించిన న్యూజిలాండ్ ఆదిలోనే చుక్కెదురైంది. 93/4 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన కివీస్ వరుసగా మూడు కీలక వికెట్లను కోల్పోయి ఎదురీదుతోంది. లూక్ రోంచీ(80), వాట్లింగ్(18), క్రెయిగ్(1)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరారు. వీటిలో ఒకటి జడేజాకు దక్కగా, రెండు వికెట్లను షమీ సాధించాడు. ఈ మ్యాచ్ లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ విజయాన్ని అడ్డుకోవడం అసాధ్యం. తొలి ఇన్నింగ్స్‌లలో భారత్ 318, న్యూజిలాండ్ 262 పరుగులు చేయగా, భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 377/5 వద్ద డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించగా, బౌలర్లలో స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా రాణించారు. అశ్విన్ ఏడు, జడేజా ఐదు వికెట్లు పడగొట్టారు. -
మురళీ విజయ్ అవుట్
కాన్పూర్: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 159/1 ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం భారత్ రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. ఆరంభంలో మురళీ విజయ్, పుజారా నిలకడగా ఆడారు. కాగా మురళీ విజయ్ (76).. శాన్‌ట్నర్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. కోహ్లీ బ్యాటింగ్‌కు దిగాడు. పుజారా (64) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 191/2. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 318 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 262 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ఓవరాల్‌గా 247 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. -
మనోళ్లు న్యూజిలాండ్‌ను తిప్పేస్తున్నారు..
కాన్పూర్: న్యూజిలాండ్‌తో తొలిటెస్టు మూడో రోజు శనివారం భారత స్పిన్నర్లు రాణిస్తున్నారు. ఆట ఆరంభమైన కాసేపటికే అశ్విన్, జడేజా వెంటవెంటనే మూడు వికెట్లు పడగొట్టి కివీస్‌కు షాకిచ్చారు. 152/1 ఓవర్‌నైట్ స్కోరుతో న్యూజిలాండ్ ఆటగాళ్లు లాథమ్, విలియమ్సన్ ఈ రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించారు. న్యూజిలాండ్ మరో 7 పరుగుల తర్వాత వికెట్ కోల్పోయింది. అశ్విన్ లాథమ్‌ను అవుట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లో జడేజా.. టేలర్‌ను డకౌట్ చేశాడు. వీరిద్దరూ ఎల్బీగా వెనుదిరిగారు. కాసేపటి తర్వాత అశ్విన్ విలియమ్సన్‌ను బౌల్డ్ చేశాడు. అనంతరం ల్యూక్ రోంచీ(33)ను ఎల్బీ డబ్యూగా జడేజా పెవిలియన్‌కు పంపాడు. దీంతో కివీస్ 219 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్:కాన్పూరు వన్డే
కాన్పూర్: టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఇక్కడ ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య ఇది మూడవ వన్డే. ఆస్ట్రేలియాలాంటి బలమైన జట్టు మీద సంచలనాత్మక స్కోర్లతో సిరీస్ గెలిచిన భారత జట్టు వెస్టిండీస్‌తో సిరీస్‌లో తడబడటం కాస్త ఆశ్చర్యకరమే. విశాఖపట్నం వన్డేలో అనూహ్యంగా పుంజుకున్న వెస్టిండీస్... సిరీస్‌లో 1-1తో ఆఖరి వన్డే కోసం కాన్పూర్ వచ్చింది. ఈ రోజు డే మ్యాచ్ అయినందున మంచు ప్రభావం పెద్దగా ఉండదు.