Ind vs Ban: బంగ్లాపై భారత్‌ ఘన విజయం.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ | Ind vs Ban 2nd Test Kanpur Day 5: Highlights And Updates | Sakshi
Sakshi News home page

Ind vs Ban బంగ్లాపై భారత్‌ ఘన విజయం.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

Published Tue, Oct 1 2024 9:46 AM | Last Updated on Tue, Oct 1 2024 2:03 PM

Ind vs Ban 2nd Test Kanpur Day 5: Highlights And Updates

Ind vs Ban 2ndTest Day 5 Updates: బంగ్లాదేశ్‌తో రెండో  టెస్టులో టీమిండియా గెలుపొందింది.  కాన్పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్‌ విజయం సాధించింది.

టీమిండియా టార్గెట్‌ 95 రన్స్‌
రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
గిల్‌(6) రూపంలో భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. మెహదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో గిల్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. జైస్వాల్‌ 20 పరుగులతో ఆడుతున్నాడు. కోహ్లి క్రీజులోకి వచ్చాడు. భారత్‌ స్కోరు: 35/2 (5)

రోహిత్‌ శర్మ అవుట్‌
2.1: బంగ్లాదేశ్‌ విధించిన 95 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఆదిలోనే తొలి వికెట్‌ కోల్పోయింది. మెహదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ హసన్‌ మహమూద్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. కేవలం 8 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. శుబ్‌మన్‌ గిల్‌ క్రీజులోకి వచ్చాడు. 

రోహిత్‌ సేన టార్గెట్‌ ఎంతంటే
రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను టీమిండియా 146 పరుగులకు ఆలౌట్‌ చేసింది. భోజన విరామ సమయానికి బంగ్లా ఆట కట్టించి.. విజయానికి బాట వేసుకుంది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్‌, జడేజా చెరో మూడు వికెట్లు తీయగా.. ఆకాశ్‌ దీప్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే బంగ్లాదేశ్‌ కేవలం 94 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అంటే.. రోహిత్‌ సేన టార్గెట్‌ 95.

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
బుమ్రా బౌలింగ్‌లో తైజుల్‌ ఇస్లాం(0) తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. వికెట్ల ముందు అతడిని దొరకబుచ్చుకున్న బుమ్రా డకౌట్‌గా వెనక్కి పంపాడు. బంగ్లాదేశ్‌ స్కోరు: 130/9 (40.5). ఖలీద్‌ అహ్మద్‌ క్రీజులోకి వచ్చాడు. ముష్ఫికర్‌ 27 పరుగలతో ఆడుతున్నాడు.
ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
మెహదీ హసన్‌ మిరాజ్‌ రూపంలో బంగ్లాదేశ్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో మిరాజ్‌ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌చేరాడు. బంగ్లా స్కోరు:  118/8 (36.5) . తైజుల్‌ ఇస్లాం క్రీజులోకి వచ్చాడు. ముష్ఫికర్‌ రహీం 15 పరుగులతో ఆడుతున్నాడు.

ఏడో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
జడేజా బౌలింగ్‌లో షకీబ్‌ అల్‌ హసన్‌ ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. బంగ్లా స్కోరు: 94-7 (32 ఓవర్లు). 

ఆరో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
జడేజా బౌలింగ్‌ లిటన్‌ దాస్‌ కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కేవలం ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. బంగ్లా స్కోరు: 94-6(30)
ఐదో వికెట్‌ డౌన్‌
ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌లో హాఫ్‌ సెంచరీ వీరుడు షాద్‌మన్‌ ఇస్లాం(50) జైస్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో బంగ్లా ఐదో వికెట్‌ కోల్పోయింది. లిటన్‌ దాస్‌ క్రీజులోకి వచ్చాడు. ముష్ఫికర్‌ ఒక పరుగుతో ఆడుతున్నాడు. బంగ్లా స్కోరు: 94/5 (29).
నాలుగో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
జడేజా బౌలింగ్‌లో బంగ్లా కెప్టెన్‌ నజ్ముల్‌ షాంటో బౌల్డ్‌ అయ్యాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ముష్ఫికర్‌ రహీం క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్‌ షాద్‌మన్‌ ఇస్లాం 49 పరుగులతో ఆడుతున్నాడు. బంగ్లా స్కోరు: 92/4 (27.5).

నిలకడగా ఆడుతున్న షాద్‌మన్‌
25 ఓవర్లలో బంగ్లాదేశ్‌ స్కోరు 87-3. ఓపెనర్‌ షాద్‌మన్‌ ఇస్లాం 47 పరుగులతో నిలకడగా ఆడుతుండగా.. షాంటో 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 

మూడో వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌
తమ రెండో  ఇన్నింగ్స్‌లో 26/2(11) ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆఖరి రోజు ఆట మొదలుపెట్టిన బంగ్లాదేశ్‌ ఆదిలోనే మరో వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ బౌలింగ్‌లో మొమినుల్‌ హక్‌(2) కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్‌ నజ్ముల్‌ హొసేన్‌ షాంటో క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్‌ షాద్‌మన్‌ ఇస్లాం 15 పరుగులతో ఆడుతున్నాడు. బంగ్లాదేశ్‌ స్కోరు: 36-3(14 ఓవర్లలో). 

భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ రెండో టెస్టు
వేదిక:గ్రీన్‌ పార్క్‌  స్టేడియం, కా న్పూర్‌
టాస్‌: భారత్‌.. బౌలింగ్‌
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌  స్కోరు: 233
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌  స్కోరు: 285/9 డిక్లేర్డ్‌

టీమిండియా- బంగ్లాదేశ్‌ మధ్య కాన్పూర్‌ వేదికగా రెండో టెస్టు ఐదో రోజు ఆట మొదలైంది. కాగా సోమవారం నాటి ఆటలో రోహిత్‌ సేన మెరుపు వేగంతో పరుగులు సాధించి.. డ్రా అవుతుందేమోనన్న మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ముందడుగు వేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 34.4 ఓవర్లలో 9 వికెట్లకు 285 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. బంగ్లాదేశ్‌ ఆట కట్టించే క్రమంలో ఆఖరి రోజు వికెట్ల వేటను మొదలు పెట్టి శుభారంభం అందుకుంది.

తుదిజట్లు
భారత్‌
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్‌ పంత్(వికెట్ కీపర్‌), కేఎల్‌ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌ దీప్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ సిరాజ్

బంగ్లాదేశ్
షాద్‌మన్‌ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్‌), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్‌కీపర్‌), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement