బంగ్లాదేశ్ వీరాభిమాని మాట మార్చాడు. అకస్మాత్తుగా తన ఆరోగ్యం పాడైందని.. అందుకే పోలీసులు ఆస్పత్రికి తరలించారని చెప్పాడు. తద్వారా తనపై దాడి జరగలేదని పరోక్షంగా స్పష్టతనిచ్చాడు. కాగా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడినా ఓ వ్యక్తి అక్కడ వాలిపోతాడు. ఒళ్లంతా పులిచారలతో పెయింటింగ్ వేసుకొని తమ జట్టును ఉత్సాహపరుస్తాడు. అతడి అసలు పేరు ‘రాబీ’. అయితే, తనను తాను ‘టైగర్’ అని చెప్పుకొంటాడు.
ఆస్పత్రికి వెళ్లే ముందు దాడి జరిగిందని..
తనపై దాడి జరిగిందనిఇదిలా ఉంటే... టీమిండియాతో బంగ్లాదేశ్ రెండో టెస్టు కాన్పూర్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం మొదలైన.. ఈ మ్యాచ్ భోజన విరామం సమయంలో రాబీ.. స్టేడియం గేటు వద్ద కాస్త స్పృహ తప్పినట్లు కనిపించాడు. దాంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే ప్రాథమిక చికిత్స అనంతరం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. తనపై దాడి జరిగిందని... కొందరు వ్యక్తులు తన వీపు, పక్కటెముకల్లో పిడిగుద్దులు కురిపించినట్లు రాబీ తనను ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో చెప్పాడు.
డీహైడ్రేషన్‌కు లోనయ్యాను.. అంతే
ఇక హాస్పిటల్‌లో అతడికి తగిన చికిత్స అందించడంతో పాటు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ప్రమాదమేమీ లేదని తేల్చారు. అక్కడి నుంచి రాబీ తన వ్యాఖ్యను మార్చాడు. ‘నాకు ఆరోగ్యం ఒక్కసారిగా పాడైంది. డీహైడ్రేషన్‌కు లోనయ్యాను. పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు అంతా బాగుంది’ అని అతనే చెప్పాడు.
దాడి వార్తను ఖండించిన పోలీసులు
మరోవైపు పోలీసులు కూడా దాడి జరిగిందనే వార్తను ఖండించారు. అయితే రాబీ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం ‘సి’ బ్లాక్‌లో నిలబడి ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు వాదనకు దిగి అతని చేతుల్లోంచి జాతీయ పతాకాన్ని లాక్కున్నారని మాత్రం తేలింది.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాను ఈ టెస్టుకు వస్తే తనపై.. ఇక్కడ కొందరు దాడి చేయవచ్చని గురువారం రాబీ సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా పెట్టాడు. మరోవైపు.. బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో ఆడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం సమీపంలో కొందరు వ్యక్తులు నిరసన కూడా వ్యక్తం చేశారు.
చదవండి: అలా జరిగితే గంభీర్ విశ్వరూపం చూస్తారు: బంగ్లాదేశ్ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment