బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా టీమిండియా రెండో టెస్టు బరిలో దిగనుంది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్ ఫైనల్ చేరే క్రమంలో మరో ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. కాగా రెండు టెస్టు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.
తొలి టెస్టులో పేసర్లకే పెద్దపీట
ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ను 280 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కాగా చెపాక్‌లోని ఎర్రమట్టి పిచ్‌పై ఈ మ్యాచ్ జరగగా.. ఇరు జట్లు ఫాస్ట్ బౌలర్లకు ప్రాధాన్యం ఇచ్చాయి. టీమిండియా ముగ్గురు సీమర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లకు తుదిజట్టులో చోటిచ్చింది.
అదే విధంగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను కూడా ఆడించింది. దీంతో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మొండిచేయి ఎదురైంది. అయితే, రెండో టెస్టులో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండబోతుందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాన్పూర్‌లోని నల్లమట్టి పిచ్‌పై మ్యాచ్ జరుగనుండటంతో కుల్దీప్ తుదిజట్టులో స్థానం దక్కించుకోవచ్చని అభిప్రాయపడ్డాడు.
ఒక ఫాస్ట్ బౌలర్‌కు ఉద్వాసన
‘‘నల్లమట్టి పిచ్‌పై గ్రాస్ వేసి.. కాస్త తేమగా ఉంచితే.. ఆట మొదటి రోజు, రెండో రోజు అరపూట వరకు బంతి బాగానే బౌన్స్ అవుతుంది. చెన్నై మాదిరే ఈ పిచ్ కూడా ఉంటే.. టీమిండియా మరోసారి ముగ్గురు ఫాస్ట్‌బౌలర్లతో రంగంలోకి దిగుతుంది. అలా కాకుండా ఇది పక్కాగా కాన్పూర్ పిచ్ అయితే మాత్రం.. రోజురోజుకీ వికెట్ బాగా నెమ్మదిస్తుంది.
స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కుల్దీప్ యాదవ్ కచ్చితంగా తుదిజట్టులోకి వస్తాడు. అదే జరిగితే.. ఒక ఫాస్ట్ బౌలర్‌కు ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. పనిభారాన్ని తగ్గించేందుకు బుమ్రాకు విశ్రాంతినిస్తే.. ఆకాశ్ దీప్ జట్టులో ఉంటాడు. లేదంటే.. ఆకాశ్ స్థానాన్ని కుల్దీప్ భర్తీ చేస్తాడు.
రెండో టెస్టులో ఆడబోయే టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇంతకంటే వేరే మార్పులేమీ ఉండకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా భారత తుదిజట్టు కూర్పు గురించి అభిప్రాయాలు పంచుకున్నాడు. శుక్రవారం నుంచి టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మొదలుకానుంది.
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు భారత తుది జట్టు అంచనా
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.
చదవండి: ICC CT 2025: పాకిస్తాన్ కాదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: అఫ్గన్ కెప్టెన్
📍 Kanpur#TeamIndia hit the ground running ahead of the 2nd #INDvBAN Test 🙌@IDFCFIRSTBank pic.twitter.com/EMPiOa8HII
— BCCI (@BCCI) September 26, 2024
Comments
Please login to add a commentAdd a comment