బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు ఇప్పటికే కాన్పూర్‌కు చేరుకుంది. ప్రత్యర్థిని వైట్‌వాష్ చేయడమే లక్ష్యంగా ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుందన్న అంచనాల నడుమ ఇరుజట్లు తమ ముగ్గురేసి స్పిన్ బౌలర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. కాన్పూర్ స్టేడియం గురించి ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(యూపీసీఏ) సీఈఓ అంకిత్ ఛటర్జీ చేసిన వ్యాఖ్యలు.. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకున్న అభిమానుల్లో అలజడి రేపుతున్నాయి. కాగా 2021 తర్వాత కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.
శిథిలావస్థలో ఆ స్టాండ్
అయితే, స్టేడియంలో ఓ స్టాండ్ శిథిలావస్థకు చేరినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. ఉత్తర ప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్(పీడబ్ల్యూడీ) అధికారులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపింది. ఈ విషయం గురించి అంకిత్ ఛటర్జీ ప్రస్తావిస్తూ.. ‘‘పీడబ్ల్యూడీ అధికారులు..గ్రీన్ పార్క్‌లోని బాల్కనీ ‘సీ’కి సంబంధించి టికెట్లు అమ్మవద్దని మాతో చెప్పారు. అక్కడి పరిస్థితి బాగాలేదన్నారు.
ప్రస్తుతం ఆ బాల్కనీకి సంబంధించి ప్రస్తుతం రిపేర్లు జరుగుతున్నాయి. నిజానికి అక్కడ 4800 మంది ప్రేక్షకులు కూర్చోవచ్చు. కానీ.. పీడబ్ల్యూడీ అధికారుల సూచన మేరకు కేవలం 1700 టికెట్లే సేల్ చేశాం’’ అని పేర్కొన్నాడు.
ఒకవేళ పంత్ సిక్సర్ కొట్టాడనుకోండి
ఇక పీడబ్ల్యూడీ ఇంజనీర్ ఒకరు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం.. బాల్కనీ సి కనీసం యాభై మంది ప్రేక్షకుల బరువును కూడా మోయలేదు. ఒకవేళ రిషభ్ పంత్ సిక్సర్ కొట్టాడనుకోండి. అభిమానులు లేచి గంతులేయడం మొదలుపెడతారు. అలా అయితే,స్టాండ్ ఓ పక్కకి ఒరిగిపోయినా ఆశ్చర్యం లేదు. అక్కడి పరిస్థితి అస్సలు బాగాలేదు’’ అని పేర్కొన్నారు.
కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇక చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా బంగ్లాను 280 పరుగుల తేడాతో మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ద్వారా టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్‌బ్యాటర్ రిషభ్ పంత్ శతకం(109)తో ఆకట్టుకున్నాడు.
చదవండి: ఇలా అయితే కష్టం కోహ్లి!.. 15 బంతుల్లో నాలుగుసార్లు అవుట్!
Comments
Please login to add a commentAdd a comment