కాన్పూర్ టెస్టులో ప్రణాళికలు పక్కాగా అమలు చేయడం వల్లే విజయం సాధ్యమైందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. నాలుగో రోజు ఆటలో రిస్క్ తీసుకున్న మాట వాస్తవమేనని.. అందుకు ప్రతిఫలంగా గెలుపు వరించిందని హర్షం వ్యక్తం చేశాడు. రెండున్నర రోజుల ఆట ఒక్క బంతి కూడా పడకుండానే ముగిసిపోయినా.. సమిష్టి కృషితో అనుకన్న ఫలితం రాబట్టగలిగామని పేర్కొన్నాడు.
చివరి రెండు రోజుల్లో ఫలితం తేల్చి
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2022-25 సీజన్‌లో భాగంగా సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడింది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించిన రోహిత్ సేన.. తాజాగా రెండో టెస్టులోనూ గెలుపు జెండా ఎగురువేసింది. కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారినా.. చివరి రెండు రోజుల్లో టీమిండియా అద్భుత ప్రణాళికలతో విజయాన్ని సొంతం చేసుకుంది.
రిస్క్ అని తెలిసినా తప్పలేదు
తొలుత ప్రత్యర్థిని పడగొట్టి.. ఆ తర్వాత అనూహ్య రీతిలో పరుగులు రాబట్టి.. ఆఖరికి ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. బంగ్లాదేశ్‌పై 2-0తో క్లీన్‌స్వీప్ విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘రెండున్నర రోజుల ఆట రద్దైపోయింది. అలాంటి సమయంలో నాలుగోరోజు పూర్తి స్థాయిలో ఆడే అవకాశం దక్కినపుడు రిస్క్ తీసుకోవడానికి వెనకాడలేదు. ముందు వాళ్లను త్వరగా అవుట్ చేయాలి.
అతడొక అద్భుతం
ఆ తర్వాత త్వరత్వరగా బ్యాటింగ్ చేయాలి. తొలి ఇన్నింగ్స్‌లో 100- 150 పరుగులకే మేము ఆలౌట్ అయినా ఫర్వాలేదని భావించాం. ఫలితం తేల్చడమే లక్ష్యంగా ముందుకు సాగి సఫలమయ్యాము’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక బంగ్లాపై విజయంలో తన వంతు పాత్ర పోషించిన పేసర్ ఆకాశ్ దీప్ అద్బుతం రోహిత్ శర్మ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు.
నాణ్యమైన నైపుణ్యాలున్న బౌలర్
‘‘అతడు బాగా బౌలింగ్ చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో చాన్నాళ్ల పాటు ఆడిన అనుభవం అతడికి ఉంది. మేనేజ్‌మెంట్ అతడి నుంచి ఏం ఆశించిందో అందుకు తగ్గట్లుగా రాణించాడు. నాణ్యమైన నైపుణ్యాలున్న బౌలర్ అతడు. ఎక్కువ ఓవర్లపాటు బౌలింగ్ చేయగల ఫిట్‌నెస్ అతడి సొంతం’’ అని రోహిత్ శర్మ ఆకాశ్ ప్రతిభను కొనియాడాడు.
ఇక గాయాల వల్ల ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యే పరిస్థితి ఉంది.. కాబట్టి బెంచ్ స్ట్రెంత్‌ను స్ట్రాంగ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఆకాశ్ దీప్ మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: WTC: ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా అశ్విన్ రికార్డు
Captain @ImRo45 collects the @IDFCFIRSTBank Trophy from BCCI Vice President Mr. @ShuklaRajiv 👏👏#TeamIndia complete a 2⃣-0⃣ series victory in Kanpur 🙌
Scorecard - https://t.co/JBVX2gyyPf#INDvBAN pic.twitter.com/Wrv3iNfVDz— BCCI (@BCCI) October 1, 2024
Comments
Please login to add a commentAdd a comment