Akash Deep
-
ఇలాంటి కెప్టెన్‌ను చూడలేదు: రోహిత్‌పై టీమిండియా స్టార్ కామెంట్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై భారత పేస్ బౌలర్ ఆకాశ్ దీప్(Akash Deep) ప్రశంసలు కురిపించాడు. తన కెరీర్లో ఇలాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదన్నాడు. అతడి సారథ్యంలో అరంగేట్రం చేయడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియాలో తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేనన్న ఆకాశ్ దీప్.. నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించినట్లు తెలిపాడు.ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రంబిహార్కు చెందిన ఆకాశ్ దీప్ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్. దేశవాళీ క్రికెట్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆకాశ్.. గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇంగ్లిష్ జట్టుతో నాలుగో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 28 ఏళ్ల ఈ పేస్ బౌలర్.. మూడు వికెట్లు తీశాడు.అనంతరం న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ ఆకాశ్ దీప్ పాల్గొన్నాడు. ఆఖరి రెండు టెస్టులాడి రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడే జట్టుకు ఆకాశ్ దీప్ ఎంపికయ్యాడు. పెర్త్, అడిలైడ్‌లో జరిగిన తొలి రెండు టెస్టుల్లో అతడికి ఆడే అవకాశం రాలేదు.బ్యాట్‌తోనూ రాణించిఅయితే, బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టులో మాత్రం మేనేజ్మెంట్ ఆకాశ్ దీప్‌నకు పిలుపునిచ్చింది. ఈ మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు తీయడంతో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. పదకొండో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 31 పరుగులు చేసి.. ఫాలో ఆన్ గండం నుంచి టీమిండియాను తప్పించాడు.ఇక మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో ఆకాశ్ దీప్.. రెండు వికెట్లతో సరిపెట్టుకున్నాడు. అనంతరం గాయం కారణంగా సిడ్నీలో జరిగిన ఐదో టెస్టుకు దూరమయ్యాడు. కాగా ఈ సిరీస్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో 3-1తో ఓడిపోయి.. ట్రోఫీని చేజార్చుకున్న విషయం తెలిసిందే.ఇందుకు ప్రధాన కారణం బ్యాటర్‌గా విఫలం కావడంతో పాటు కెప్టెన్‌గానూ సరైన వ్యూహాలు అమలుచేయలేకపోవడమే అంటూ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే అతడు సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగి.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ దీప్ రోహిత్ శర్మ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇలాంటి కెప్టెన్‌ను చూడలేదు‘‘రోహిత్ శర్మ సారథ్యంలో ఆడే అవకాశం రావడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. అతడి నాయకత్వ లక్షణాలు అద్భుతం. ప్రతి విషయాన్ని సరళతరం చేస్తాడు. ఇప్పటి వరకు నేను ఇలాంటి కెప్టెన్‌ను చూడలేదు’’ అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు. ఇక హెడ్‌కోచ్ గౌతం గంభీర్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘గంభీర్ సర్ కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తూనే.. ఆటగాళ్లను మోటివేట్ చేస్తారు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా చేస్తారు’’ అని ఆకాశ్ దీప్ చెప్పుకొచ్చాడు.సంతృప్తిగా లేనుఅదే విధంగా.. ఆస్ట్రేలియా పర్యటన గురించి మాట్లాడుతూ.. ‘‘నేను అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇండియాలో టెస్టు క్రికెట్ ఆడటం వేరు. ఇక్కడ పేసర్ల పాత్ర అంత ఎక్కువగా ఏమీ ఉండదు. కానీ.. ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలర్‌గా మానసికంగా, శారీరకంగా మనం బలంగా ఉంటేనే రాణించగలం. అక్కడ ఎక్కువ ఓవర్ల పాటు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ టూర్లో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేను. నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవడంపైనే ప్రస్తుతం నా దృష్టి ఉంది’’ అని ఆకాశ్ దీప్ పేర్కొన్నాడు.చదవండి: IND Vs IRE 3rd ODI: వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్ -
‘గంభీర్ నా కుటుంబాన్ని అసభ్యంగా తిట్టాడు.. గంగూలీని కూడా..’
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి(Manoj Tiwary) సంచలన ఆరోపణలు చేశాడు. గంభీర్‌కు నోటి దురుసు ఎక్కువని.. తన కుటుంబంతో పాటు ఓ టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ను కూడా అసభ్యకరంగా తిట్టాడని ఆరోపించాడు. తనకు నచ్చిన వాళ్లకు పెద్దపీట వేయడం గంభీర్‌కు అలవాటని.. అందుకే ఆస్ట్రేలియా పర్యటనలో ఆకాశ్ దీప్(Akash Deep)ను బలిచేశాడని మండిపడ్డాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు గంభీర్- మనోజ్ తివారి కలిసి ఆడారు. గతంలో దేశవాళీ క్రికెట్లోనూ ఢిల్లీ తరఫున గంభీర్- బెంగాల్ జట్టు తరఫున తివారి ప్రత్యర్థులుగా పోటీపడ్డారు. ఇదిలా ఉంటే.. టీమిండియా హెడ్‌కోచ్‌గా ఎంపికైన గౌతం గంభీర్‌కు వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్న విషయం తెలిసిందే.గంభీర్ హయాంలో చేదు అనుభవాలుతొలుత స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ ఓడిపోయింది. కంగారూ గడ్డపై 3-1తో ఓడి పదేళ్ల తర్వాత ట్రోఫీని ఆసీస్‌కు చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఎంపిక, గంభీర్ వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో మనోజ్ తివారి సైతం తన అభిప్రాయాలను పంచుకుంటూ.. గంభీర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అతడొక మోసగాడు అని.. గౌతీ చెత్త నిర్ణయాల వల్లే టీమిండియాకు ఈ దుస్థితి వచ్చిందని విమర్శించాడు. అయితే, నితీశ్ రాణా, హర్షిత్ రాణా వంటి యువ ప్లేయర్లు ఈ విషయంలో మనోజ్ తివారిని తప్పుబడుతూ.. గంభీర్‌కు మద్దతుగా కామెంట్లు చేసినట్లు వార్తలు వచ్చాయి.హర్షిత్ రాణాను ఎందుకు ఆడించారు?ఈ విషయాలపై మనోజ్ తివారి తాజాగా స్పందించాడు. అర్హత లేకున్నా.. కేవలం గంభీర్ చెప్పడం వల్ల అవకాశాలు పొందిన వారు ఇలాగే మాట్లాడతారని నితీశ్, హర్షిత్‌లను ఉద్దేశించి కౌంటర్లు వేశాడు. ‘‘నితీశ్ రాణా, హర్షిత్ రాణా వంటి వాళ్లు గౌతం గంభీర్‌కు ఎందుకు సపోర్టు చేయరు? తప్పకుండా చేస్తారు.ఎందుకంటే పెర్త్ టెస్టులో ఆకాశ్ దీప్‌ను కాదని హర్షిత్ రాణాను ఆడించింది ఎవరో మనకు తెలియదా? అయినా.. ఆకాశ్ ఏం తప్పు చేశాడని అతడిని మొదటి టెస్టుకు పక్కనపెట్టారు? బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టుల్లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు.ఒక ఫాస్ట్ బౌలర్‌గా తనకు సహకరించే పిచ్‌లపై వీలైనంత ఎక్కువగా బౌలింగ్ చేయాలని అతడు కోరుకోవడం సహజం. కానీ కారణం లేకుండా అతడిని జట్టు నుంచి తప్పించారు. హర్షిత్ కోసం ఆకాశ్‌పై తొలి టెస్టులో వేటు వేశారు. హర్షిత్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ గణాంకాలు కూడా అంతంతమాత్రమే. ఆకాశ్ దీప్ మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు.నా కుటుంబాన్ని అసభ్యంగా తిట్టాడు.. గంగూలీని కూడా..అయినా.. సరే అతడిని పక్కనపెట్టారంటే.. సెలక్షన్లో ఎంతటి వివక్ష ఉందో అర్థం కావడం లేదా?.. అందుకే గంభీర్‌కు ఇలాంటి వాళ్లు మద్దతు ఇస్తారు. అయినా నేనేమీ ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. ఉన్న విషయాల్నే నిర్భయంగా చెప్పాను.రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీతో మ్యాచ్ జరిగినపుడు గౌతం గంభీర్ నోటి నుంచి ఎలాంటి మాటలు వచ్చాయో.. అప్పుడు అక్కడ ఉన్నవాళ్లంతా విన్నారు. సౌరవ్ గంగూలీ గురించి అతడు అన్న మాటలు.. నా కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు అందరూ విన్నారు. అయినా.. వారిలో కొంతమంది అప్పుడు అతడికే సపోర్టు చేశారు. జనాలు ఇలాగే ఉంటారు.అతడిని తొక్కేయాలని చూశారుహర్షిత్ కంటే ఆకాశ్ దీప్ బెటర్ అని మేనేజ్మెంట్ త్వరగానే గ్రహించింది. అందుకే రెండో టెస్టు నుంచి అతడిని పిలిపించారు. ఇక్కడ కొంతమంది స్వార్థం వల్ల జట్టుకు చెడు జరిగే అవకాశం ఉంది. పాపం ఆకాశ్ దీప్ తన సెలక్షన్ గురించి నోరు విప్పలేడు. అందుకే అతడిని తొక్కేయాలని చూశారు’’ అని మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యలు చేశాడు.చదవండి: నవశకం.. కొత్త కెప్టెన్ అతడే!.. ఆర్సీబీ హెడ్‌కోచ్ వ్యాఖ్యలు వైరల్ -
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మరో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. సిడ్నీ వేదికగా శుక్రవారం(జనవరి 3) నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న ఐదో టెస్టులో భారత్ అమీ తుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది.అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. సిడ్నీ టెస్టుకు యువ పేసర్ ఆకాష్ దీప్ గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ఆకాష్ దీప్ వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఆకాష్ కేవలం 43 ఓవర్ల బౌలింగ్ మాత్రమే చేశాడు. దీంతో అతడికి ఆఖరి టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించిందంట.ఆకాష్ స్ధానంలో కర్ణాటక స్పీడ్ స్టార్ ప్రసిద్ద్ కృష్ణ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా-ఎతో జరిగిన అనాధికరిక టెస్టుల్లో కృష్ణ అద్భుతంగా రాణించాడు.ఈ క్రమంలోనే తొలి రెండు టెస్టులు ఆడిన హర్షిత్ రానాను కాదని ప్రసిద్ద్‌కు చాన్స్ ఇవ్వాలని గంభీర్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గత రెండు మ్యాచ్‌ల్లో బుమ్రా తర్వాత అత్యుత్తమ బౌలర్‌గా నిలిచిన ఆకాష్ దీప్.. సిడ్నీ టెస్టుకు దూరమైతే భారత్‌కు నిజంగా గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.బ్రిస్బేన్ టెస్టు డ్రా ముగియడంలో దీప్ది కీలక పాత్ర. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైతే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది.చదవండి: బుమ్రా లేకుంటే బీజీటీ ఏకపక్షమే: గ్లెన్ మెక్‌గ్రాత్ -
టీమిండియా ప్లేయర్లు అబద్దాల కోరులు: భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సురీందర్ ఖన్నా(Surinder Khanna) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ సేనను ‘అబద్దాల కోరు’గా అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేశాడు. సరిగ్గా ఆడటం చేతగాకే సాకులు వెదుక్కొంటూ.. వివాదాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.శుభారంభం చేసినా..భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులో ఆడుతోంది. అయితే, పెర్త్‌లో 295 పరుగుల తేడాతో గెలిచి.. శుభారంభం చేసినా.. తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది.అడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో ఓడిపోయిన టీమిండియా.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకుంది. మెల్బోర్న్ వేదికగా ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. కాస్త కష్టపడినా కనీసం డ్రా చేసుకోగలిగే మ్యాచ్‌లో 184 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.జైస్వాల్ అవుటైన తీరుపై వివాదంఇక ఈ మ్యాచ్‌లో చక్కటి ఇన్నింగ్స్ ఆడుతూ జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేసిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుట్((Yashasvi Jaiswal’s controversial dismissal) జరిగిందంటూ) కావడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో జైసూ.. లెగ్‌సైడ్ దిశగా షాట్ ఆడేందుకు యత్నించాడు. అయితే, బంతి వెళ్లి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది.ఈ నేపథ్యంలో ఆసీస్ అప్పీలు చేయగా ఫీల్డ్ అంపైర్ స్పందించలేదు. దీంతో కంగారూలు రివ్యూకు వెళ్లగా.. చాలాసార్లు రీప్లేలో చూసినా స్పష్టత రాలేదు. స్నీకో మీటర్లోనూ బంతి బ్యాట్‌ను లేదంటే గ్లౌవ్‌ను తాకినట్లుగా శబ్దం రాలేదు. అయినప్పటికీ విజువల్ ఎవిడెన్స్ కారణంగా.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ తారుమారు చేస్తూ.. జైస్వాల్‌ను అవుట్‌గా ప్రకటించారు.కీలక సమయంలో కీలక వికెట్ కోల్పోయిఫలితంగా కీలక సమయంలో కీలక వికెట్ కోల్పోయిన టీమిండియా ఓటమికి బాటలు పడ్డాయి. అయితే, తాను అవుట్ కాలేదని టెక్నాలజీ(స్నీకో) చెబుతున్నా అవుట్‌గా ప్రకటించడం పట్ల జైస్వాల్ అంపైర్ల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయినప్పటికీ వాళ్లు అతడిని మైదానం వీడాల్సిందిగా కోరగా.. ఈ విషయమై వివాదం చెలరరేగింది.మండిపడ్డ సన్నీఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్‌తో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. జైస్వాల్ స్పష్టంగా నాటౌట్ అని తెలుస్తున్నా.. ఆసీస్‌కు అనుకూలంగా ఎలా వ్యవహరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, సురీందర్ ఖన్నా మాత్రం ఈ విషయంలో భిన్నంగా స్పందించాడు. నిజాయితీ ఆడటం నేర్చుకోండి‘‘ఇందులో వివాదం సృష్టించడానికి తావులేదు. నాలుగు కోణాల్లో పరిశీలించిన తర్వాత బంతి బ్యాటర్ గ్లౌవ్‌ను తాకి.. అలెక్స్ క్యారీ చేతుల్లో పడినట్లు తేలింది. ఆకాశ్ దీప్ కూడా ఇలాగే.. తాను క్యాచ్ అవుట్ అయినా.. మైదానం వీడకుండా ఫిర్యాదులు చేస్తూ ఉండిపోయాడు.వీళ్లంతా అబద్దాల కోరులు. ముందు నిజాయితీ ఆడటం నేర్చుకోండి. అప్పుడే మీరు గెలుస్తారు. అయినా, బ్యాట్ మన చేతుల్లోనే ఉన్నపుడు.. అది బంతిని లేదంటే గ్లౌవ్‌ను తాకిందా లేదా స్పష్టంగా తెలుస్తుంది కదా!అందుకే ఓడిపోయాంమనం చెత్తగా ఆడాం కాబట్టే ఓడిపోయాం. ఇంత చెత్తగా ఎవరైనా బ్యాటింగ్ చేస్తారా? రండి వచ్చి ఐపీఎల్లో పరుగులు సాధించండి. మరీ దూకుడుగా ఆడితే ఫలితాలు ఇలాగే ఉంటాయి. సానుకూల దృక్పథంతో ఆడండి.కనీసం కొత్త సంవత్సరంలో అయినా టీమిండియాను అదృష్టం వరిస్తుందో చూడాలి’’ అంటూ సురీందర్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేశాడు. వార్తా సంస్థ IANSతో మాట్లాడుతూ ఈ మేర వ్యాఖ్యానించాడు. కాగా ఢిల్లీకి చెందిన సురీందర్ ఖన్నా 1979- 84 మధ్య టీమిండియా తరఫున 10 వన్డేలు ఆడి.. 176 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్- టీమిండియా మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు సిడ్నీలో జరుగనుంది. జనవరి 3-7 మధ్య ఈ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: అతడి కోసం పట్టుబట్టిన గంభీర్.. లెక్కచేయని సెలక్టర్లు? త్వరలోనే వేటు? -
వర్షం ఎఫెక్ట్.. ఆస్ట్రేలియా- భారత్ మూడో టెస్టు హైలెట్స్ (ఫొటోలు)
-
Kohli- Gambhir: మ్యాచ్ గెలిచినంత సంబరం.. రోహిత్ సైతం..
గబ్బా టెస్టులో నాలుగో రోజు టీమిండియాకు అనుకూలించింది. ఓవర్ నైట్ స్కోరు 51/4తో మంగళవారం నాటి ఆట మొదలుపెట్టిన భారత్‌ను ఓపెనర్ కేఎల్ రాహుల్ తన ఆటతో ఆదుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(10) విఫలమైనా.. వికెట్ పడకుండా జాగ్రత్త పడిన ఈ కర్ణాటక బ్యాటర్.. విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 139 బంతులు ఎదుర్కొని 84 పరుగులతో రాణించాడు.రాహుల్, జడేజా విలువైన అర్ధ శతకాలుఇక కేఎల్ రాహుల్‌తో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా అదరగొట్టాడు. ఏడో స్థానంలో వచ్చిన జడ్డూ 123 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. వీరిద్దరు హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ టీమిండియాకు కష్టాలు తప్పలేదు. ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే.. జడ్డూ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగే సమయానికి భారత్ ఇంకా ముప్పై మూడు పరుగులు చేయాల్సి ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్ ఆకాశ్ దీప్ బ్యాట్‌తో అదరగొట్టాడు.గట్టెక్కించిన పేసర్లుమరో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా ఫాలో ఆన్ ముప్పు నుంచి తప్పించుకుంది. దీంతో భారత శిబిరంలో ఒక్కసారిగా సంబరాలు మొదలయ్యాయి.మ్యాచ్ గెలిచినంత సంబరంహెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సంతోషం పట్టలేకపోయారు. గంభీర్ అయితే ఒక్కసారిగా తన సీట్లో నుంచి లేచి కోహ్లికి హై ఫైవ్ ఇచ్చాడు. ఇక కోహ్లి కూడా మ్యాచ్ గెలిచామన్నంత రీతిలో ఆనందంతో పొంగిపోయాడు. రోహిత్‌ను చీర్ చేస్తూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. రోహిత్ కూడా చిరునవ్వులు చిందించాడు. అవును మరి.. టెస్టుల్లో ఇలాంటి మూమెంట్లే సిరీస్ ఫలితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. గబ్బా టెస్టును కనీసం డ్రాగా ముగించిన భారత్‌కు సానుకూలాంశమే. ఇదిలా ఉంటే.. నాలుగో రోజు ఆట ముగిసే సరికి బుమ్రా 10(27 బంతుల్లో ఒక సిక్స్), ఆకాశ్ దీప్27 (31 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్)తో క్రీజులో ఉన్నారు. వీరిద్దరు చెరో సిక్సర్ బాదడం ఆఖర్లో హైలైట్‌గా నిలిచింది.గబ్బాలో కనీసం డ్రా కోసంకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆసీస్ గెలిచాయి. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.ఈ క్రమంలో బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం మూడో టెస్టు మొదలైంది. ఇందులో టాస్ గెలిచిన రోహిత్ సేన తొలుత బౌలింగ్ చేయగా.. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మంగళవారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి తొమ్మిది వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఇక గబ్బా టెస్టుకు ఆరంభం నుంచే వర్షం అంతరాయం కలిగించడం టీమిండియాకు కాస్త అనుకూలించిందని చెప్పవచ్చు.చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం Moment hai bhai, moment hai ft. #ViratKohli! 😂#AUSvINDOnStar 👉 3rd Test, Day 5 | 18th DEC, WED, 5:15 AM! #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/3s0EOlDacC— Star Sports (@StarSportsIndia) December 17, 2024Read the lips of Gambhir and Kohli, follow-on bach gaya bc 😂 pic.twitter.com/ibIRSQTwEK— Prayag (@theprayagtiwari) December 17, 2024THE MOMENT AKASH DEEP & BUMRAH SAVED FOLLOW ON..!!!! 🇮🇳- The celebrations and Happiness of Virat Kohli, Rohit Sharma & Gautam Gambhir was priceless. ❤️ pic.twitter.com/i0w0zRyNPa— Tanuj Singh (@ImTanujSingh) December 17, 2024 -
శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం
టీమిండియా టెయిలెండర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్‌లపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ‘స్టార్’ బ్యాటర్ల కంటే.. ‘‘మీరే నయం’’ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే.శతకాలతో చెలరేగిన ఆసీస్ బ్యాటర్లుబ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఆరంభంలో కాస్త తడబడినా అనూహ్య రీతిలో పుంజుకుంది. టీమిండియా పేసర్ల ధాటికి 75 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడ్డవేళ.. ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఆసీస్‌ను ఆదుకున్నారు. హెడ్(152) భారీ శతకం బాదగా.. స్టీవ్ స్మిత్(101) కూడా సెంచరీతో చెలరేగాడు.ఫలితంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌర్లలో పేసర్లు జస్ప్రీత్ బుమ్రా ఆరు, మహ్మద్ సిరాజ్ రెండు, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు మొదలుపెట్టిన టీమిండియాకు ఆరంభంలోనే షాకులు తగిలాయి.ఆరంభంలోనే ఇబ్బందుల్లో పడ్డ టీమిండియాటాపార్డర్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్(4), వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్(1) ఘోరంగా విఫలమయ్యారు. మిడిలార్డర్లో వచ్చిన విరాట్ కోహ్లి(3), రిషభ్ పంత్(9), కెప్టెన్ రోహిత్ శర్మ(10) సైతం పూర్తిగా నిరాశపరిచారు. ఆదుకున్న రాహుల్, జడేజాఈ క్రమంలో ఓపెనర్ కేఎల్ రాహుల్(84) అద్భుత అర్థ శతకంతో రాణించి భారత ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. అతడికి తోడుగా నితీశ్ రెడ్డి(61 బంతుల్లో 16) పట్టుదలగా నిలబడ్డాడు.ఇక సిరాజ్(11 బంతుల్లో 1) కూడా కాసేపు క్రీజులో నిలబడేందుకు ప్రయత్నించాడు. కాగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడ్డూ మొత్తంగా 123 బంతులు ఎదుర్కొని 77 పరుగులు సాధించాడు. అయితే జడేజా అవుటయ్యే సమయానికి టీమిండియా ఇంకా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కలేదు. అలాంటి సమయంలో జడ్డూ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరగడంతో టీమిండియా పని అయిపోయిందని కంగారూలు సంబరాలు చేసుకున్నారు. ఇక ఫాలో ఆన్ ఆడించడమే తరువాయి అని భావించారు.బ్యాట్ ఝులిపించిన బుమ్రా, ఆకాశ్అయితే, పది, పదకొండో స్థానాల్లో బ్యాటింగ్ చేసిన బుమ్రా, ఆకాశ్ దీప్.. ఊహించని రీతిలో బ్యాట్ ఝులిపించారు. ఆచితూచి ఆడుతూనే వికెట్ పడకుండా బుమ్రా జాగ్రత్త పడగా.. మరో ఎండ్ నుంచి సహకారం అందించిన ఆకాశ్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.Jasprit Bumrah just smashes Pat Cummins for six! #AUSvIND pic.twitter.com/vOwqRwBaZD— cricket.com.au (@cricketcomau) December 17, 2024 ఫాలో ఆన్ గండం తప్పిందివీరిద్దరి చక్కటి సమన్వయం, బ్యాటింగ్ కారణంగా 246 పరుగులు పూర్తి చేసుకున్న టీమిండియా.. ఫాలో ఆన్ గండం నుంచి బయటపడింది. ఇక వెలుతురులేమి కారణంగా మంగళవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి బుమ్రా, ఆకాశ్ క్రీజులోనే ఉన్నారు. బుమ్రా 27 బంతుల్లో ఒక సిక్స్ సాయంతో 10, ఆకాశ్ దీప్ 27 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 27 పరుగులు చేశాడు. అయితే, ఫాలో ఆన్ గండం నుంచి జట్టును గట్టెక్కించిన తర్వాత ఆకాశ్ కొట్టిన సిక్సర్‌తో భారత శిబిరంలో ఉత్సాహం రెట్టింపు అయింది. Akash Deep makes sure India avoid the follow-on and then smashes Pat Cummins into the second level!#AUSvIND pic.twitter.com/HIu86M7BNW— cricket.com.au (@cricketcomau) December 17, 2024 హెడ్‌కోచ్ గౌతం గంభీర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ నవ్వులు చిందిస్తూ తమ టెయిలెండర్లను ప్రశంసించారు. ఇక మంగళవారం ఆట పూర్తయ్యేసరికి టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 252 పరుగులు సాధించింది. ఆసీస్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 193 పరుగులు వెనుకబడి ఉంది. కాగా తొలి రోజు నుంచే ఈ మ్యాచ్‌కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది.ఫాలో ఆన్ అంటే ఏమిటి?టెస్టు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు.. సెకండ్ బ్యాటింగ్ చేస్తున్న జట్టు కంటే తొలి ఇన్నింగ్స్‌లో 200 లేదా అంతకంటే ఎక్కువ ఆధిక్యంలో ఉంటే.. ఫాలో ఆన్ ఆడిస్తుంది. అంటే.. సెకండ్ బ్యాటింగ్ టీమ్ ఆలౌట్ అయిన వెంటనే మళ్లీ బ్యాటింగ్ చేయమని అడుగుతుంది. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ)లోని 14.1.1 నిబంధన ప్రకారం ఆధిక్యంలో ఉన్న జట్టుకు ఈ హక్కు లభిస్తుంది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టు(డిసెంబరు 14- 18)వేదిక: ది గబ్బా, బ్రిస్బేన్టాస్: భారత్.. తొలుత బౌలింగ్ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్నాలుగోరోజు(డిసెంబరు 17) ఆట పూర్తయ్యేసరికి భారత్ స్కోరు: 252/9చదవండి: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ -
‘నీకసలు మెదడు ఉందా?’.. భారత పేసర్‌పై రోహిత్ ఫైర్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. యువ పేసర్ ఆకాశ్ దీప్ బౌలింగ్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘నీకసలు బుర్ర(మెదడు) ఉందా?’’ అంటూ ఆకాశ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మూడో టెస్టులో పటిష్ట స్థితిలో ఆసీస్బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో ఇరుజట్లు ఇప్పటికే చెరో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో భారత్- ఆసీస్ మధ్య శనివారం మొదలైన మూడో టెస్టులో ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలో కొనసాగుతోంది.గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రోహిత్ సేనకు చేదు అనుభవం ఎదురైంది. తొలి రోజు నుంచే మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా... రెండోరోజు ఆట పూర్తయ్యేసరికి ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది.మొదటి ఇన్నింగ్స్‌లో 445ఈ క్రమంలో 405/7(101 ఓవర్లు) ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టి.. మరో 40 పరుగులు జతచేసింది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మొత్తంగా 445 పరుగుల భారీ స్కోరు సాధించింది.ఇక ఆసీస్ ఇన్నింగ్స్‌లో సోమవారం 114వ ఓవర్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆకాశ్ దీప్ చేతికి బంతినిచ్చాడు. అయితే, 28 ఏళ్ల ఈ పేసర్.. ఆసీస్ కీపర్ అలెక్స్ క్యారీ క్రీజులో ఉన్న సమయంలో వైడ్ బాల్ వేశాడు.సర్ మే కుచ్ హై?వేగంగా వచ్చిన ఈ బంతిని ఆపేందుకు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేసిన ప్రయత్నం వృథాగా పోయింది ఫలితంగా ఆసీస్ ఖాతాలో అదనపు పరుగులు(2) చేరగా.. సహనం కోల్పోయిన రోహిత్ శర్మ.. ఆకాశ్‌ను ఉద్దేశించి..‘‘అబ్బే సర్ మే కుచ్ హై?(బుర్రలో ఏమైనా ఉందా?)’’ అంటూ కామెంట్స్ చేయగా.. స్టంప్ మైకులో రికార్డయ్యాయి.ఇక మూడో రోజు ఆటలో భాగంగా బుమ్రా మరో వికెట్ తీయగా.. ఆకాశ్ దీప్(క్యారీ వికెట్), మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. మొత్తంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రాకు ఆరు, సిరాజ్‌కు రెండు, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డిలకు ఒక్కో వికెట్ దక్కింది. వర్షం వల్ల మూడో రోజు ఆటకు అంతరాయంకాగా ఆకాశ్‌కు విదేశీ గడ్డపై ఇదే తొలి మ్యాచ్. అడిలైడ్‌లో ఆడిన హర్షిత్ రాణాపై వేటు పడగా.. అతడి స్థానాన్ని బ్రిస్బేన్‌లో ఆకాశ్ భర్తీ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. వర్షం వల్ల మూడో రోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. అప్పటికి భారత్ 17 ఓవర్లు ఆడి నాలుగు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఆసీస్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 394 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’Rohit Sharma & Stump-mic Gold - the story continues... 😅#AUSvINDOnStar 👉 3rd Test, Day 3 LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/vCW0rURX5q— Star Sports (@StarSportsIndia) December 16, 2024 -
Mohammed Siraj: సిరాజ్‌కు అసలేమైంది? ఫామ్‌పై ఆందోళన!
న్యూఢిల్లీ: భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ చాలా కాలంగా టెస్టు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. షమీ కూడా లేకపోవడంతో బుమ్రాకు జతగా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే పేస్‌కు అనుకూలించే విదేశీ మైదానాలతో పోలిస్తే సొంతగడ్డపై అతని ప్రదర్శన పేలవంగా ఉంది. 17 విదేశీ టెస్టుల్లో సిరాజ్ 61 వికెట్లు పడగొట్టాడు. భారత గడ్డపై మాత్రం 13 టెస్టుల్లో 192.2 ఓవర్లు బౌలింగ్ చేసి 36.15 సగటుతో 19 వికెట్లే తీయగలిగాడు! ఇందులో కొన్ని సార్లు స్పిన్‌కు బాగా అనుకూలమైన పిచ్‌లపై దాదాపుగా బౌలింగ్ చేసే అవకాశమే రాకపోవడం కూడా ఒక కారణం. అయితే పిచ్‌తో సంబంధం లేకుండా స్వదేశంలో కూడా ప్రత్యరి్థపై చెలరేగే బుమ్రా, షమీలతో పోలిస్తే సిరాజ్ విఫలమవుతున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో బుమ్రా తరహాలో వికెట్లు అందించలేకపోతున్నాడు. ముఖ్యంగా గత ఏడు టెస్టుల్లో అతను 12 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి న్యూజిలాండ్‌తో పుణేలో జరిగే రెండో టెస్టులో అతని స్థానంపై సందేహాలు రేకెత్తుతున్నాయి. సిరాజ్ స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పేరును మేనేజ్మెంట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సిరాజ్ బౌలింగ్‌లో స్వల్ప సాంకేతిక లోపాలే భారత్‌లో వైఫల్యాన్ని కారణమని మాజీ కోచ్ ఒకరు విశ్లేíÙంచారు. ‘టెస్టుల్లో సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శనలన్నీ కేప్‌టౌన్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, బ్రిస్బేన్వంటి బౌన్సీ పిచ్‌లపైనే వచ్చాయి. బంతి పిచ్ అయిన తర్వాత బ్యాటర్ వరకు చేరే క్రమంలో అక్కడి లెంగ్త్‌కు ఇక్కడి లెంగ్త్‌కు చాలా తేడా ఉంటుంది. దీనిని అతను గుర్తించకుండా విదేశీ బౌన్సీ వికెట్ల తరహా లెంగ్త్‌లో ఇక్కడా బౌలింగ్ చేస్తున్నాడు. దీనికి అనుగుణంగా తన లెంగ్త్‌ను మార్చుకోకపోవడంతో ఫలితం ప్రతికూలంగా వస్తోంది. ఈ లోపాన్ని అతను సరిదిద్దుకోవాల్సి ఉంది. వన్డే, టి20ల్లో అయితే లెంగ్త్ ఎలా ఉన్నా కొన్ని సార్లు వికెట్లు లభిస్తాయి. కానీ టెస్టుల్లో అలా కుదరదు. బ్యాటర్ తగిన విధంగా సన్నద్ధమై ఉంటాడు. అయితే నా అభిప్రాయం ప్రకారం ఆ్రస్టేలియాకు వెళితే సిరాజ్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు’ అని ఆయన వివరించారు. -
జై శ్రీరాం.. ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను: ఆకాశ్ దీప్ (ఫొటోలు)
-
రిస్క్ అని తెలిసినా తప్పలేదు.. అతడొక అద్భుతం: రోహిత్
కాన్పూర్ టెస్టులో ప్రణాళికలు పక్కాగా అమలు చేయడం వల్లే విజయం సాధ్యమైందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. నాలుగో రోజు ఆటలో రిస్క్ తీసుకున్న మాట వాస్తవమేనని.. అందుకు ప్రతిఫలంగా గెలుపు వరించిందని హర్షం వ్యక్తం చేశాడు. రెండున్నర రోజుల ఆట ఒక్క బంతి కూడా పడకుండానే ముగిసిపోయినా.. సమిష్టి కృషితో అనుకన్న ఫలితం రాబట్టగలిగామని పేర్కొన్నాడు.చివరి రెండు రోజుల్లో ఫలితం తేల్చిప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2022-25 సీజన్లో భాగంగా సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడింది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించిన రోహిత్ సేన.. తాజాగా రెండో టెస్టులోనూ గెలుపు జెండా ఎగురువేసింది. కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారినా.. చివరి రెండు రోజుల్లో టీమిండియా అద్భుత ప్రణాళికలతో విజయాన్ని సొంతం చేసుకుంది.రిస్క్ అని తెలిసినా తప్పలేదుతొలుత ప్రత్యర్థిని పడగొట్టి.. ఆ తర్వాత అనూహ్య రీతిలో పరుగులు రాబట్టి.. ఆఖరికి ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. బంగ్లాదేశ్‌పై 2-0తో క్లీన్‌స్వీప్ విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘రెండున్నర రోజుల ఆట రద్దైపోయింది. అలాంటి సమయంలో నాలుగోరోజు పూర్తి స్థాయిలో ఆడే అవకాశం దక్కినపుడు రిస్క్ తీసుకోవడానికి వెనకాడలేదు. ముందు వాళ్లను త్వరగా అవుట్ చేయాలి.అతడొక అద్భుతంఆ తర్వాత త్వరత్వరగా బ్యాటింగ్ చేయాలి. తొలి ఇన్నింగ్స్‌లో 100- 150 పరుగులకే మేము ఆలౌట్ అయినా ఫర్వాలేదని భావించాం. ఫలితం తేల్చడమే లక్ష్యంగా ముందుకు సాగి సఫలమయ్యాము’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక బంగ్లాపై విజయంలో తన వంతు పాత్ర పోషించిన పేసర్ ఆకాశ్ దీప్ అద్బుతం రోహిత్ శర్మ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు.నాణ్యమైన నైపుణ్యాలున్న బౌలర్‘‘అతడు బాగా బౌలింగ్ చేశాడు. దేశవాళీ క్రికెట్లో చాన్నాళ్ల పాటు ఆడిన అనుభవం అతడికి ఉంది. మేనేజ్మెంట్ అతడి నుంచి ఏం ఆశించిందో అందుకు తగ్గట్లుగా రాణించాడు. నాణ్యమైన నైపుణ్యాలున్న బౌలర్ అతడు. ఎక్కువ ఓవర్లపాటు బౌలింగ్ చేయగల ఫిట్నెస్ అతడి సొంతం’’ అని రోహిత్ శర్మ ఆకాశ్ ప్రతిభను కొనియాడాడు. ఇక గాయాల వల్ల ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యే పరిస్థితి ఉంది.. కాబట్టి బెంచ్ స్ట్రెంత్‌ను స్ట్రాంగ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఆకాశ్ దీప్ మొత్తంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.చదవండి: WTC: ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా అశ్విన్ రికార్డు Captain @ImRo45 collects the @IDFCFIRSTBank Trophy from BCCI Vice President Mr. @ShuklaRajiv 👏👏#TeamIndia complete a 2⃣-0⃣ series victory in Kanpur 🙌Scorecard - https://t.co/JBVX2gyyPf#INDvBAN pic.twitter.com/Wrv3iNfVDz— BCCI (@BCCI) October 1, 2024 -
Ind vs Ban 2nd Test: అభిమానులకు బ్యాడ్‌న్యూస్
India vs Bangladesh, 2nd Test Day 2 Updates: క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!!... టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆటకూ వరణుడు ఆటంకం కలిగించాడు. వర్షం కారణంగా శనివారం నాటి ఆట ఒక్క బంతి పడకుండానే ముగిసిపోయింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ‘ఎక్స్’ ద్వారా ఈ మేరకు అప్డేట్ అందించింది. వర్షం తగ్గుముఖం పట్టినా.. అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేశారు. లంచ్‌బ్రేక్ సమయానికీ మొదలుకాని ఆటవర్షం తగ్గినా మైదానంలో కప్పిన కవర్లు మాత్రం తీయలేదు. మరికాసేపు వేచి చూసి.. వాన రాకపోతే.. కవర్లు తీసే అవకాశం ఉందని తెలుస్తోందిఆట ఆలస్యంకాగా మైదానం కవర్లతో కప్పబడి ఉండగా.. అంపైర్లు వెళ్లి పిచ్‌ను పరిశీలించారు. అయితే, ఇప్పట్లో ఆట మొదలయ్యే పరిస్థితి మాత్రం కనబడటం లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. తొలిరోజు కూడా అంతరాయమేచెన్నైలో జరిగిన తొలి టెస్టులో బంగ్లాను 280 పరుగుల తేడాతో మట్టికరిపించిన రోహిత్ సేన.. కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో శుక్రవారం రెండో టెస్టు మొదలుపెట్టింది. అయితే, వర్షం కారణంగా అవుట్‌ఫీల్డ్ చిత్తడిగా మారటంతో తొలి రోజు ఆట కూడా ఆలస్యంగా ప్రారంభమైంది.ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని.. నజ్ముల్ షాంటో బృందాన్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే, వాన కారణంగా తొలి రోజు ఆట 35 ఓవర్ల వద్దే ముగిసిపోయింది. అంపైర్లు ఆటను నిలిపివేసే సమయానికి బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.మొదటి రోజు ఆకాశ్‌కు రెండు వికెట్లుఓపెనర్ జకీర్ హసన్(0)ను భారత పేసర్ ఆకాశ్ దీప్ డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(24) వికెట్‌ను సైతం ఆకాశ్ తన ఖాతాలోనే వేసుకోగా.. కెప్టెన్ నజ్ముల్ షాంటో(31)ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి వన్‌డౌన్ బ్యాటర్ మొమినుల్ హక్ 40, ముష్ఫికర్ రహీం 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు తుదిజట్లుటీమిండియాయశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్బంగ్లాదేశ్షాద్మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
ఆకాష్ మాస్టర్ మైండ్.. రోహిత్ శర్మ షాకింగ్ రియాక్షన్ (వీడియో)
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేసర్ ఆకాష్ దీప్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో బంగ్లా ఓపెనర్లకు చుక్కలు చూపించాడు.తొలి సెషన్లో బంగ్లాదేశ్ ఓపెనర్లు జకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాం ఇద్దరినీ ఆకాష్ పెవిలియన్‌కు పంపాడు. తొలుత జకీర్ హసన్‌ను ఔట్ చేసిన దీప్.. ఆ తర్వాత షాద్మాన్ను ఎల్బీ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆకాష్ దీప్ చాకచక్యానికి రోహిత్ పిధా అయిపోయాడు.అసలేం జరిగిందంటే?బంగ్లా ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన ఆకాష్.. తొలి బంతిని షాద్మన్ ఇస్లామ్‌కు లెంగ్త్ బాల్‌గా సంధించాడు. అయితే దానిని లెగ్ సైడ్ ఫ్లిక్ చేయడానికి బంగ్లా బ్యాటర్ ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌కు మిస్స్ అయ్యి అతడి బ్యాక్పాడ్కు తాకింది. వెంటనే ఎల్బీకి ఆకాష్ గట్టిగా అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తలఊపాడు. రోహిత్ రివ్యూకు వెళ్లాళా వద్ద అన్న సందిగ్ధంలో పడ్డాడు. కానీ దీప్ మాత్రం రివ్యూకు వెళ్లాలని పట్టుబట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మను ఒప్పించి డీఆర్ఎస్కు వెళ్లేలా చేశాడు. బాల్ ట్రాకింగ్‌లో బంతి లెగ్ స్టంప్‌ను క్లిప్ చేసినట్లు తేలింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. అయితే రిప్లే చూసిన రోహిత్ వావ్ అన్నట్లుగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. మిగితా సహాచర ఆటగాళ్లు ఆకాష్ వద్దకు వచ్చి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. 😮 When the giant screen showed three Reds ⭕⭕⭕Akash Deep gets his second courtesy of a successful DRS! Live - https://t.co/JBVX2gyyPf#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/ZyGJfgBdjW— BCCI (@BCCI) September 27, 2024 -
Ind vs Aus: వర్తమానంలో జీవిస్తా.. ఆ ఆశ లేదు: టీమిండియా బౌలర్
దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని టీమిండియాలో అడుగుపెట్టిన ఆకాశ్ దీప్.. పేస్ దళంలో స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. అయితే, కెరీర్ ప్లాన్ చేసుకునే విషయంలో తానేమీ తొందరపడటం లేదని.. మెరుగ్గా రాణిస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయని పేర్కొన్నాడు. ఇప్పుడే పెద్ద పెద్ద సిరీస్‌లు ఆడాలనే కోరిక కూడా తనకు లేదన్నాడు.అరంగేట్రంలోనే రాణించిబిహార్లో జన్మించిన ఆకాశ్ దీప్.. డొమెస్టిక్ క్రికెట్లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో సత్తా చాటిన ఈ రైటార్మ్ మీడియం పేసర్‌కు ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాంచిలో ఇంగ్లిష్ జట్టుతో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా అతడు అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లతో సత్తా చాటాడు.ఇక తాజాగా సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపికైన ఆకాశ్ దీప్.. చెన్నై మ్యాచ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో కలిసి పేస్ దళంలో భాగమైన ఆకాశ్.. రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో కాన్పూర్‌లో జరిగే రెండో టెస్టు జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు.వర్తమానంలో బతకడం నాకిష్టం.. ఆ ఆశ లేదుఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆకాశ్ దీప్‌నకు ఆస్ట్రేలియా జరుగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆడే జట్టులో చోటు గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం నేను కెరీర్ ప్లానింగ్ విషయంలో కన్ఫ్యూజ్ కాకూడదు. రంజీలతో పోలిస్తే.. ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కాబట్టి నేను ఆస్ట్రేలియాకు వెళ్లాలి. ఇంకెక్కడికో ప్రయాణించాలని నా మీద ఒత్తిడి పెట్టుకోలేను.ప్రస్తుతం నా దృష్టి ఆట మీదేవర్తమానంలో బతకడం నాకిష్టం. తర్వాత ఏం జరుగుతుందో చూసుకోవచ్చు. గత రెండేళ్లలో నేను చాలా క్రికెట్ ఆడాను. మాకు కేవలం 2-3 నెలలపాటే షెడ్యూల్ ఉండదు. రంజీ.. తర్వాత దులిప్ ట్రోఫీ.. ఆ తర్వాత ఇరానీ కప్.. ఇలా ఎప్పుడూ ఏదో ఒక టోర్నీ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడునైపుణ్యాలు మెరుగుపరచుకోవడంపైనే ప్రస్తుతం నా దృష్టి ఉంది’’ అని 27 ఏళ్ల ఆకాశ్ దీప్ తన మనసులోని మాట వెల్లడించాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా నవంబరులో అక్కడికి వెళ్లనుంది. అప్పటికి భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. ఆకాశ్ దీప్‌నకు ఛాన్స్ రాకపోవచ్చు.చదవండి: బంగ్లాతో టీ20 సిరీస్: టీమిండియా మెరుపు సెంచరీ వీరుడి ఎంట్రీ! -
5 వికెట్లతో చెలరేగిన ఆకాష్.. ఇండియా ఎ లక్ష్యం 275 రన్స్
దులీప్ ట్రోఫీలో భాగంగా బెంగళూరు వేదికగా భారత్-ఎ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా బి జట్టు రెండో ఇన్నింగ్‌లో 184 పరుగులకు ఆలౌటైంది. 150/6తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన బి జట్టు అదనంగా కేవలం 34 పరుగులు మాత్రమే చేయగల్గింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో లభించిని ఆధిక్యాన్ని కలపునకుని ఇండియా ఎ-జట్టు ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బి జట్టు రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్(61) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సర్ఫరాజ్ ఖాన్(46) పరుగులతో రాణించాడు.ఎ జట్టు బౌలర్లలో ఆకాష్ దీప్ 5 వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ ఆహ్మద్ 3, అవేష్, కొటియన్ తలా వికెట్ సాధించారు. కాగా ఇండియా బి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులు చేయగా.. బారత బి జట్టు 231 పరుగులకు ఆలౌటైంది.చదవండి: AUS vs SCO: గ్రీన్ విధ్వంసం.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్ -
IND vs BAN: బుమ్రా, షమీ దూరం! ఆ ఇద్దరికీ లక్కీ ఛాన్స్?
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం రెస్ట్‌లో ఉంది. అనంతరం సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. అయితే బంగ్లాతో టెస్టు సిరీస్‌కు బారత జట్టు ఎంపిక బీసీసీఐ సెలక్షన్ కమిటీకి పెద్ద తలనొప్పిగా మారింది.ముఖ్యంగా పేస్ బౌలర్లను ఎంపిక చేయడంలో భారత సెలక్టర్లు మల్లుగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సిరీస్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల దృష్ట్యా దూరంగా ఉండనున్నాడు. మరోవైపు ప్రీమియర్ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమీ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో ఈ సిరీస్‌కు కూడా దూరం కానున్నాడు. ఈ క్రమంలో బంగ్లాతో టెస్టుల్లో భారత పేస్ ఎటాక్‌ను హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ లీడ్ చేయనున్నాడు. అయితే సిరాజ్‌తో కలిసి ఎవరు బంతిని పంచుకుంటారన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్‌కు బంగ్లాతో సిరీస్ సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశముంది. చివరగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా భారత జట్టులో ముఖేష్ భాగంగా ఉన్నాడు. ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన అతడు 7 వికెట్లు పడగొట్టి పర్వాలేదన్పించాడు.ఆకాష్ దీప్‌కు ఛాన్స్...?అదే విధంగా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు మరో బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్‌కు కూడా ఛాన్స్ దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో జార్ఖండ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టుతో అరంగేట్రం చేసిన ఆకాష్.. తన తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. మూడు వికెట్లు పడగొట్టి తన అగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. అయితే ఆ తర్వాత మ్యాచ్‌కు బుమ్రా తిరిగి రావడంతో దీప్ జట్టులో చోటు కోల్పోయాడు. కానీ తన అద్భుత బౌలింగ్‌తో సెలక్టర్ల దృష్టిని మాత్రం ఆకాష్ ఆకర్షించాడు. ఇప్పుడు బుమ్రా పూర్తిగా సిరీస్‌కు దూరం కానుండడంతో ఆకాష్‌కు మరోసారి చోటు దక్కే అవకాశముంది.అర్ష్‌దీప్ అరంగేట్రం?మరోవైపు ఇటీవల కాలంలో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ టెస్టుల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. అతడికి వైట్‌బాల్ ఫార్మాట్లో కూడా భారత సెలక్టర్లు భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. -
టీమిండియా నయా సంచలనాలు...
India vs England Test Series 2024: ఒకరు ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొడితే.. మరొకరు నిలకడగా ఆడుతూ ‘హీరో’ అయ్యారు.. ఇంకొకరు వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తే.. ఆఖరిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ఎంపిక సరైందే అని నిరూపించుకున్న ఆటగాడు మరొకరు. అవును... మీరు ఊహించిన పేర్లు నిజమే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సందర్భంగా తళుక్కున మెరిసిన భారత నయా క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, దేవ్‌దత్ పడిక్కల్ గురించే ఈ పరిచయ వాక్యాలు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో తాజా సిరీస్ సందర్భంగా రెండో టెస్టులో మధ్యప్రదేశ్ రజత్ పాటిదార్(టెస్టుల్లో), మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్.. ఐదో టెస్టులో దేవ్‌దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో 30 ఏళ్ల రజత్ పాటిదార్ మినహా మిగతా నలుగురు సత్తా చాటి.. టీమిండియాకు దొరికిన ఆణిముత్యాలంటూ కితాబులు అందుకున్నారు. మరి ఈ సిరీస్‌లో వీరి ప్రదర్శన ఎలా ఉందో గమనిద్దాం! సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan).. సంచలనం రంజీల్లో పరుగుల వరద పారించి.. త్రిశతక వీరుడిగా పేరొందిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రాజ్‌కోట్ టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు. తండ్రి నౌషద్ ఖాన్, భార్య రొమానా జహూర్ సమక్షంలో.. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్నాడు. తన తొలి మ్యాచ్‌లోనే మెరుపు అర్ధ శతకం(62) సాధించాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న సర్ఫరాజ్ ఖాన్.. దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే, అదే మ్యాచ్‌లో మరోసారి అర్ధ శతకం(68)తో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. తదుపరి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన(14,0) సర్ఫరాజ్ ఖాన్ ఐదో టెస్టులో మరోసారి ఫిఫ్టీ(56)అదరగొట్టాడు. ఇప్పటి వరకు మూడు టెస్టుల్లో కలిపి 200 పరుగులు సాధించాడు. ఇందులో 24 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం విశేషం. 𝙎𝙖𝙧𝙛𝙖𝙧𝙖𝙯 - Apna time a̶y̶e̶g̶a̶ aa gaya! 🗣️ He brings up a 48-balls half century on Test debut 💪🔥#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/kyJYhVkGFv — JioCinema (@JioCinema) February 15, 2024 ధ్రువ్ జురెల్(Dhruv Jurel).. మెరుపులు రాజ్‌కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన మరో ఆటగాడు ధ్రువ్ జురెల్. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకోవడంతో పాటు.. 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, రాంచిలో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జురెల్ విశ్వరూపం ప్రదర్శించాడు ఈ 23 ఏళ్ల బ్యాటర్. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ మొదటి ఇన్నింగ్స్‌లో అత్యంత విలువైన 90 పరుగులు సాధించాడు. అంతేకాదు.. రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 మరో టెస్టు మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఖరిదైన ఐదో టెస్టులో మాత్రం 15 పరుగులకే పరిమితమైనా.. వికెట్ కీపర్‌గా తన వంతు బాధ్యతను నెరవేర్చాడు. ఆకాశ్ దీప్(Akash Deep).. ఆకాశమే హద్దుగా రాంచిలో జరిగిన నాలుగో టెస్టు ద్వారా బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. 27 ఏళ్ల వయసులో హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే.. అదీ ఒకే ఓవర్లో.. ఇంగ్లండ్ స్టార్లు బెన్ డకెట్, ఒలీ పోప్ రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత జాక్ క్రాలేను కూడా అవుట్ చేసి ఇంగ్లండ్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. తద్వారా జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. Drama on debut for Akash Deep! 🤯😓 A wicket denied by the dreaded No-ball hooter🚨#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/uQ3jVnTQgW — JioCinema (@JioCinema) February 23, 2024 The Moment Devdutt Padikkal completed his Maiden Test Fifty with a SIX. - Devdutt, The future! ⭐ pic.twitter.com/btIMOnG5Eq — CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024 దేవ్‌దత్ పడిక్కల్(Devdutt Padikkal).. జోరుగా హుషారుగా ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు కర్ణాటక బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్. కేరళలో జన్మించిన 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అరంగేట్రంలో 65 పరుగులతో దుమ్ములేపాడు. ఇక వీరికంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్.. ఈ సిరీస్‌లో వరుస డబుల్ సెంచరీలతో విరుచుకుపడ్డ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్‌లో మొత్తంగా తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 712 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన యశస్వి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్‌గా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఉపఖండ పిచ్‌లపై తాము సైతం అంటూ.. ఈ టీమిండియా యువ సంచలనాలతో పాటు ఈ సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు టామ్ హార్లే, షోయబ్ బషీర్ కూడా తమదైన ముద్ర వేయగలిగారు. షోయబ్ బషీర్ ఆడిన మూడు టెస్టుల్లో కలిపి 17 వికెట్లు తీయగా.. టామ్ హార్లే 22 వికెట్లతో సత్తా చాటాడు. -
తండ్రి వద్దన్నా... తనయుడు వినలేదు! అరంగేట్రంలోనే అదుర్స్
పిల్లలు ఏదైనా ఇష్టపడితే అందుకోసం కష్టపడే తల్లిదండ్రులుంటారు. కానీ ఆకాశ్ దీప్ స్టోరీ మాత్రం భిన్నమైంది. బీహార్‌లోని రోహ్తస్ జిల్లా బడ్డి గ్రామానికి చెందిన ఆకాశ్ క్రికెట్‌ను ఇష్టపడేవాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ఆకాశ్ తండ్రి రామ్‌జీ సింగ్ తన కుమారుడి ఇష్టాన్ని గట్టిగానే వ్యతిరేకించాడు. ఆకాశ్ తనకు క్రికెట్టే ప్రపంచమంటే... కన్నతండ్రి ఆ ప్రపంచం నుంచి బయటికి రమ్మన్నాడు. క్రికెటర్ కావడం తన కల అంటే... ఆ కల కనడం మానేయమన్నాడు. ఎ లాగైనా ఆటగాడిని అవుతానంటే... వద్దే వద్దని ఖరాకండీగా చెప్పేశాడు. కానీ ఈ బిహారీ కుర్రాడు వినలేదు. తండ్రి మాటల్ని తలకెక్కించుకోలేదు. కల సాకారం కోసం... తన క్రికెట్ ప్రపంచం కోసం ఇంటి నుంచి బయటికొచ్చాడు. మొదట దుర్గాపూర్‌లో తెలిసినవారి సాయంతో అకాడమీలో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. తర్వాత కోల్‌కతా పయనమై తన పేస్‌కు పదును పెట్టాడు. కానీ విధి అతనికి మరో పరీక్ష పెట్టింది. అనారోగ్యంతో 2015లో అతని తండ్రి... ఆరు నెలల్లోపే అన్న కూడా చనిపోవడంతో మధ్యలో మూడేళ్లు కుటుంబభారం మోశాడు. కానీ క్రికెట్ పట్టుమాత్రం వీడలేదు. ఎట్టకేలకు అతని కలకు బెంగాల్ తొలి రూపమిస్తే అతని పేస్ ప్రతాపం టీమిండియాలో చోటిచి్చంది. కట్ చేస్తే... ఆకాశ్ దీప్ ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో అరంగేట్రం చేశాడు. భారత 313 టెస్టు క్రికెటర్‌గా అతనికి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ క్యాప్ అందిచ్చాడు. అతని ఇష్టం... పడ్డ కష్టం తెలుసుకున్న ద్రవిడ్ జట్టు సభ్యులందరి మధ్య అతని ప్రయాణాన్ని వివరించి స్ఫూర్తినింపాడు. ఓ బిహారి కుర్రాడు కోల్‌కతాలో అండర్–23 జట్టు సభ్యుడయ్యాడు. అనంతరం బెంగాల్ రంజీ ప్లేయర్‌గా దేశవాళీ క్రికెట్లో సత్తాచాటుకోవడంతో అటునుంచి టీమిండియాకు ఎంపికయ్యాడు. బుమ్రా విశ్రాంతితో రాంచీలో అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. తన మాతృమూర్తి, ఇద్దరు సోదరిల కళ్లముందు అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆకాశ్ దీప్ భావోగ్వేగానికి గురయ్యాడు. చదవండి: ముంబై ఇండియన్స్ శుభారంభం -
మీ నాన్న ఇక్కడ లేరు.. అయితేనేం!.. ద్రవిడ్ వ్యాఖ్యలు వైరల్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున నలుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. రెండో టెస్టులో మధ్యప్రదేశ్ రజత్ పాటిదార్, మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ క్రికెట్లో అడగుపెట్టారు. తాజాగా శుక్రవారం మొదలైన నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ ఎంట్రీ ఇచ్చాడు. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్నాడు. 27 ఏళ్ల వయసులో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. నిజానికి ఆకాశ్ దీప్ ఈ స్థాయికి చేరడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. తండ్రి, సోదరుడిని కోల్పోయిన విషాదం నుంచి కోలుకుని.. ఆటపై దృష్టి సారించాడు. స్వస్థలమైన బిహార్‌లో అవకాశాలు లేకపోవడంతో పశ్చిమ బెంగాల్‌కు మకాం మార్చి అక్కడే తన నైపుణ్యాలకు పదును పెట్టి దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ విషయం గురించి హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘రాంచికి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాడి నుంచి నీ ప్రయాణం మొదలుపెట్టావు. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని.. ఎత్తుపళ్లాలు చూసి ఇక్కడి దాకా వచ్చావు. నీ కాళ్లపై నీవు నిలబడి.. బాడి నుంచి ఢిల్లీ దాకా చేరుకున్నావు. 2007 టీ20 ప్రపంచకప్ విజయం చూసి ఆటపట్ల ఆకర్షితుడవై.. ఢిల్లీలోనే నీ ప్రయాణం మొదలుపెట్టాలని భావించావు. ఆ తర్వాత కోల్‌కతాకు వెళ్లి.. అక్కడ డొమెస్టిక్ క్రికెట్లో అడుగుపెట్టి అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నావు. ఆ జర్నీ నిన్ను ఇప్పుడు ఇక్కడ రాంచి దాకా తీసుకువచ్చింది. నీ గ్రామానికి 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణంలో నువ్వు ఇండియా క్యాప్ అందుకున్నావు. అది కూడా నీ కుటుంబ సభ్యుల సమక్షంలో! ముఖ్యంగా మీ అమ్మగారి ముందు.. ఈ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో నేను ఊహించగలను. కానీ దురదృష్టవశాత్తూ మీ నాన్నగారు, మీ అన్నయ్య ఇక్కడ లేరు. అయితే, వాళ్ల ఆశీర్వాదాలు మాత్రం నీతోనే ఉంటాయి. జట్టు మొత్తం నీకు అండగా ఉంది. శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఈ క్షణాన్ని నువ్వు పూర్తిగా ఆస్వాదించు. నీ కల నిజమైంది. ఇదిగో అందుకో టీమిండియా టెస్టు క్యాప్ నంబర్ 313’’ అంటూ ఆకాశ్ దీప్‌ను ఉద్దేశించి ఉద్వేగపూరిత, స్ఫూర్తిదాయక ప్రసంగం చేశాడు. ఇక క్యాప్ అందుకున్న అనంతరం ఆకాశ్ దీప్ తన తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక టీమిండియా జెర్సీతో బరిలోకి దిగి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఒకే ఓవర్లో.. బెన్ డకెట్, ఒలీ పోప్ రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత జాక్ క్రాలేను కూడా పెవిలియన్‌కు పంపి ఇంగ్లండ్ టాపార్డర్‌ను కుప్పకూల్చి తొలి రోజు మొత్తంగా మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా ఆకాశ్ దీప్‌ను ఉద్దేశించి ద్రవిడ్ ప్రసంగం, అతడు తన తల్లి పాదాలకు నమస్కరించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Words that inspire 🗣️ ft. Rahul Dravid Dreams that come true 🥹 A debut vision like never seen before 🎥 Akash Deep - What a story 📝#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vSOSmgECfC — BCCI (@BCCI) February 23, 2024 A wonderful moment after Akash Deep was handed his test cap. You are never too old or big to seek your mother's blessings. pic.twitter.com/cauAM3JX7b — Zucker Doctor (@DoctorLFC) February 23, 2024 Drama on debut for Akash Deep! 🤯😓 A wicket denied by the dreaded No-ball hooter🚨#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/uQ3jVnTQgW — JioCinema (@JioCinema) February 23, 2024 -
Ind vs Eng: వారెవ్వా.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. టాపార్డర్ కకావికలం
Ind vs Eng 4th Test- Akash Deep shows levels to Bazball: టీమిండియా బౌలర్ ఆకాశ్ దీప్ అరంగేట్రంలోనే అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ బెంగాల్ పేసర్.. శుభారంభం అందుకున్నాడు. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. రెండో ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ .. ఆకాశ్ దీప్‌నకు బంతినిచ్చాడు. తన తొలి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఈ రైటార్మ్ పేసర్.. కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. ఈ క్రమంలో నాలుగో ఓవర్లో మరోసారి బాల్ అందుకున్న ఆకాశ్.. జాక్ క్రాలే క్లీన్‌బౌల్డ్ చేశాడు. అయితే, అది నోబాల్‌గా తేలడంతో ఆకాశ్ దీప్‌నకు నిరాశ తప్పలేదు. అయితే, అతడు మరింత పట్టుదలగా నిలబడి తన పేస్ పవర్ ఏంటో ఇంగ్లండ్ బ్యాటర్లకు రుచిచూపించాడు. Drama on debut for Akash Deep! 🤯😓 A wicket denied by the dreaded No-ball hooter🚨#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/uQ3jVnTQgW — JioCinema (@JioCinema) February 23, 2024 ఒకే ఓవర్లో రెండు వికెట్లు పదో ఓవర్లో ఏకంగా రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. రెండో బంతికి ఓపెనర్ బెన్ డకెట్(11)ను అవుట్ చేసిన ఆకాశ్ దీప్.. నాలుగో బంతికి వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్(0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ మరుసటి రెండో ఓవర్లోనే జాక్ క్రాలే(42)ను అద్భుతరీతిలో బౌల్డ్ చేశాడు. ఆకాశ్ నో బాల్ తప్పిదంతో లైఫ్ పొందిన క్రాలే మళ్లీ అతడి చేతికే చిక్కడం విశేషం. ఇలా అరంగేట్రంలోనే బజ్‌బాల్‌కు కళ్లెం వేస్తూ ఇంగ్లండ్ టాపార్డర్‌ను కుప్పకూల్చిన ఆకాశ్ దీప్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో అతడి పేరు నెట్టింట వైరల్‌గా మారింది. ఇక లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 24.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. తొలి సెషన్లో ఆకాశ్ దీప్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: Ind vs Eng: ఐదో టెస్టుకు కీలక స్పిన్నర్ దూరం.. ప్రకటించిన ఇంగ్లండ్! కారణం ఇదే WWW 🤝 Akash Deep! Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/YANSwuNsG0 — BCCI (@BCCI) February 23, 2024 -
దురదృష్టమంటే నీదే భయ్యా.. క్లీన్ బౌల్డ్ చేసి! వీడియో వైరల్
రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరగుతున్న నాలుగో టెస్టులో భారత అరంగేట్ర పేసర్ ఆకాష్ దీప్ అద్బుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ ఓపెనర్లను ముప్పుతిప్పులు పెడుతున్నాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే ఆకాష్ దీప్‌ను దురదృష్టం వెంటాడింది. తృటిలో తన తొలి అంతర్జాతీయ వికెట్‌ను సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. ఏం జరిగిందంటే? ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన ఆకాష్ ఐదో బంతిని క్రాలేకు అద్బుతమైన ఇన్ స్వింగర్‌గా సంధించాడు. ఆకాష్ వేసిన బంతికి క్రాలే దగ్గర సమాధానమే లేకుండా పోయింది. బంతిని క్రాలే అడ్డుకునే లేపే ఆఫ్ స్టంప్స్‌ను గిరాటేసింది. వెంటనే బౌలర్ ఆకాష్ సంబరాల్లో మునిగి తేలిపోయాడు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. బంతిని వేసే క్రమంలో ఆకాష్ ఫ్రంట్ లైన్‌ను దాటేశాడు. దీంతో ఆన్ ఫీల్డ్ అంపైర్ రాడ్ టక్కర్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా ఆకాష్ నిరాశకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దురదృష్టమంటే నీదే భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. What a no ball Akash deep 😫 pic.twitter.com/rObjmSFkJn — Rishi (@EpicVirat) February 23, 2024 -
IND vs ENG: కల నేరవేరింది.. ఎట్టకేలకు అరంగేట్రం! ఎవరీ ఆకాష్ దీప్?
టీమిండియా తరపున అరంగేట్రం చేయాలన్న బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్ కల ఎట్టకేలకు నేరవేరింది. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టుతో ఆకాష్ దీప్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. నాలుగో టెస్టుకు స్టార్ పేసర్ బుమ్రా దూరం కావడంతో ఆకాష్ దీప్‌కు తుది జట్టులో చోటు దక్కింది. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదగా ఆకాష్ తన తొలి టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు. టీమిండియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 313వ ఆటగాడిగా ఆకాష్ నిలిచాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో ఆకాష్ దీప్‌కు చోటు దక్కలేదు. అయితే దేశీవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు సెలక్టర్లు అతడికి పిలుపునిచ్చారు. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఆకాష్ ఇప్పుడు ఏకంగా భారత జెర్సీలో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. ఆకాష్ ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనాధికార టెస్టు సిరీస్‌లో కూడా ఆకాష్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన దీప్ 13 వికెట్లు పడగొట్టి.. భారత్-ఏ జట్టు తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఎవరీ ఆకాష్ దీప్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఎవరీ ఆకాష్ దీప్..? 27 ఏళ్ల ఆకాష్ ఆకాష్ దీప్ బీహార్‌లోని ససారం అనే గ్రామంలో జన్మించాడు. ఆకాష్‌ది మధ్యతరగతి కుటంబం. అతడు తన చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. క్రికెట్ వైపు అడుగులు వేస్తున్న సమయంలో దీప్ జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. అతడి తండ్రి మరణించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతడి సోదురుడు కూడా తుదిశ్వాస విడిచాడు. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆకాష్ మాత్రం దృడ సంకల్పంతో తన కెరీర్ వైపు అడుగులు వేశాడు. తన సొంత రాష్ట్రం బిహార్‌లో అవకాశాలు తక్కువగా ఉండటంతో వెస్ట్‌బెంగాల్‌కు తన మకాం మార్చాడు. అక్కడకు వెళ్లాక అసన్సోల్లోని ఓ క్రికెట్ ఆకాడమీలో దీప్ చేరాడు. ఆ తర్వాత అసన్సోల్లోని ఖేప్ క్రికెట్' టెన్నిస్ బాల్ టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడంతో దుబాయ్ వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ కూడా ఆకాష్ దుమ్మురేపాడు. ఆ తర్వాత బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ డివిజన్ మ్యాచ్‌ల్లో ఆడే ఛాన్స్ లభించింది. ఓ సారి కోల్‌కతాలోని రేంజర్స్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు అప్పటి బెంగాల్ సీనియర్ టీమ్ డైరెక్టర్ జోయ్‌దీప్ ముఖర్జీ దృష్టిలో ఆకాష్ దీప్ పడ్డాడు. ఆకాష్ దీప్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కీపర్ స్టంప్‌ల వెనుక 10 గజాల దూరంలో నిల్చోడం చూసి జోయ్‌దీప్ ముఖర్జీ ఆశ్చర్యపోయారు. వెంటనే అండర్-23 కోచ్ సౌరాశిష్‌ను పిలిపించి ఆకాష్ దీప్ గురించి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అప్పటి బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ విజన్ 2020 పోగ్రాంకు దీప్‌ను ముఖర్జీ రిఫర్ చేశాడు. ఇదే అతడి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. సౌరవ్ గంగూలీ విజన్ 2020 పోగ్రాంకు షార్ట్‌లిస్ట్ చేసిన జాబితాలో ఆకాష్‌కు చోటు దక్కింది. దీంతో బెంగాల్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు నిర్వహించిన ట్రయల్స్‌లో ఆకాష్ పాల్గొనున్నాడు. ఆ తర్వాత 2019లో బెంగాల్ తరపున ఆకాష్ దీప్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది ఫస్ట్‌క్లాస్ క్రికెట్, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. Say hello to #TeamIndia newest Test debutant - Akash Deep 👋 A moment to cherish for him as he receives his Test cap from Head Coach Rahul Dravid 👏 👏 Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/P8A0L5RpPM — BCCI (@BCCI) February 23, 2024 ఓవరాల్‌గా క్రికెట్లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు ఆడిన ఆకాష్ 103 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ. కనీస ధరకు అతడిని ఆర్సీబీ కొనుగోలు చేసింది. -
IND vs ENG 4th Test: ముగిసిన తొలి రోజు ఆట.. హైలైట్స్ ఇవే
India vs England, 4th Test Ranchi Day 1 Updates: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. రాంచి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్ సందర్భంగా భారత్ తరఫున బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అరంగేట్రం చేశాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆదిలోనే చుక్కలు చూపించాడు. ఓపెనర్లు జాక్ క్రాలే(42), బెన్ డకెట్(11), ఒలీ పోప్(0)లను పెవిలియన్‌కు పంపి టాపార్డర్‌ను కుదేలు చేశాడు. ఆకాశ్ దెబ్బకు 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను జో రూట్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో గట్టెక్కించాడు. వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి అజేయ సెంచరీతో మెరిశాడు. మిగతా వాళ్లలో జానీ బెయిర్‌స్టో(38), బెన్ ఫోక్స్(47) మాత్రమే రాణించారు. తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జో రూ రూట్ 106(226 బంతుల్లో), ఓలీ రాబిన్సన్ 31(60 బంతుల్లో) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ మూడు, మహ్మద్ సిరాజ్ రెండు, అశ్విన్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. మొత్తానికి.. టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆరంభంలో తడబడ్డా రూట్ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ తిరిగి పుంజుకుంది. 83.6: సెంచరీ కొట్టిన జో రూట్ బజ్‌బాల్ అంటూ దూకుడుగా ఆడకుండా తనదైన సహజ శైలిలో ఆడిన జో రూట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ఫోర్ బాది వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్‌ను గట్టెక్కించే బాధ్యతను తీసుకున్న రూట్.. ఆచితూచి నిలకడగా ఆడుతూ 219 బంతుల్లో 103 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 279-7(84) ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 245 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. టామ్ హార్ట్లీని (13) సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రూట్‌తో (82) పాటు రాబిన్సన్ క్రీజ్‌లో ఉన్నాడు. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 225 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి బెన్ ఫోక్స్ (47) ఔటయ్యాడు. జో రూట్ (75), టామ్ హార్ట్లీ క్రీజ్‌లో ఉన్నారు. 62.2: 200 పరుగులు పూర్తి చేసిన ఇంగ్లండ్ టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 198/5 (61) జో రూట్ 67, ఫోక్స్ 28 పరుగులతో ఆచితూచి ఆడుతున్నారు. ఇంగ్లండ్ స్కోరు: 184/5 (54) ఎట్టకేలకు రూట్ ఫిఫ్టీ 48.5: టీమిండియాతో తాజా టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ ఎట్టకేలకు అర్ధ శతకం సాధించాడు. నిలకడగా రూట్ ఇన్నింగ్స్ రూట్ 86 బంతుల్లో 40, ఫోక్స్ 56 బంతుల్లో 14 పరుగులతో ఆచితూచి ఆడుతున్నారు. ఇంగ్లండ్ స్కోరు: 150-5(41) ఇంగ్లండ్ స్కోరు: 137/5 (36) రూట్ 32, ఫోక్స్ 9 పరుగులతో ఆడుతున్నారు. లంచ్ తర్వాత ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. స్కోరు: 129-5. రూట్ 27, ఫోక్స్ ఆరు పరుగులతో ఆడుతున్నారు. కష్టాల్లో ఇంగ్లండ్.. లంచ్ విరామానికి స్కోర్: 112/5 ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ రూపంలో ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో వికెట్ డౌన్.. జానీ బెయిర్ స్టో రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో.. అశ్విన్ బౌలింగ్‌లలో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులో కెప్టెన్ బెన్ స్టోక్స్ వచ్చాడు. 23 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 111/4 19 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 89/3 తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో జానీ బెయిర్ స్టో(23), జో రూట్(11) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ డౌన్ 11.5: అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రెండు వికెట్లు తీసిన ఈ బెంగాల్ బౌలర్.. జాక్ క్రాలే(42) రూపంలో మూడో వికెట్ దక్కించుకున్నాడు. తొలుత నో బాల్ కారణంగా మిస్సయిన క్రాలేను ఈసారి బౌల్డ్ చేయడంలో ఆకాశ్ ఎలాంటి పొరపాటు చేయలేదు. ఇంగ్లండ్ స్కోరు: 57-3. బెయిర్ స్టో, జో రూట్ క్రీజులో ఉన్నారు. ఒకే ఓవర్లో ఆకాశ్ దీప్‌నకు రెండు వికెట్లు 9.4: రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ డకౌట్ అయ్యాడు. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. జో రూట్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 47/2 (9.4) తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 9.2: అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(11) వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఒలీ పోప్ క్రీజులోకి వచ్చాడు. ఇంగ్లండ్ స్కోరు: 47/1 (9.2). జాక్ క్రాలే 35 పరుగులతో ఆడుతున్నాడు. 7 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 31/0 7 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. క్రీజులో క్రాలే(32), బెన్ డకెట్(4) పరుగులతో ఉన్నారు. 4 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 9/0 4 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ రాంచి వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో పేసర్ ఆకాష్ దీప్ భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా స్ధానంలో ఆకాష్ దీప్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఇంగ్లండ్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. మార్క్ వుడ్ స్ధానంలో పేసర్ ఓలీ రాబిన్సన్ తుది జట్టులోకి రాగా.. రెహాన్ ఆహ్మద్ స్ధానంలో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. తుది జట్లు భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్ -
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్.. టీమిండియా తరఫున కొత్త బౌలర్ ఎంట్రీ..?
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగబోయే నాలుగో టెస్ట్‌లో టీమిండియా తరఫున కొత్త బౌలర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న ప్రచారం ఊపందుకుంది. సిరాజ్‌కు జతగా బుమ్రా స్థానంలో ఆకాశ్ దీప్ తుది జట్టులో ఉంటాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, బుమ్రాకు ప్రత్యామ్నాయంగా ముకేశ్ కుమార్ కంటే ఆకాశ్‌దీపే బెటర్ అని భారత క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఐపీఎల్, దేశవాలీ క్రికెట్లో ఆకాశ్ దీప్ మెరుగైన ప్రదర్శన చేయడమే అభిమానుల ఛాయిస్‌కు కారణంగా తెలుస్తుంది. ఆకాశ్ దీప్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున, దేశవాలీ క్రికెట్లో బెంగాల్ తరఫున అద్భుతంగా రాణించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆకాశ్‌దీప్‌కు అదిరిపోయే రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో ఆకాశ్ ఆడిన 30 మ్యాచ్‌ల్లోనే 100కు పైగా వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత రంజీ సీజన్లోనూ ఆకాశ్ అదరగొట్టాడు. ఇటీవల బీహార్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఆకాశ్ 10 వికెట్ల ప్రదర్శనతో విజృంభించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించాడు. దీనికి ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్‌లోనూ ఆకాశ్ సత్తా చాటాడు. ఆ సిరీస్‌లో ఆకాశ్ 16.75 సగటున 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనలకు తోడు ముకేశ్‌తో పోలిస్తే ఆకాశ్ వేగవంతమైన బౌలర్ కావడంతో అతనికే అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ సైతం భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ముకేశ్ కుమార్ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక నాలుగో టెస్ట్ రేసులో వెనుకపడ్డాడు. ముకేశ్ విశాఖ టెస్ట్‌లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టడంతో మేనేజ్మెంట్కు సెకెండ్ ఛాయిస్‌గా మారాడు. పై పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఆకాశ్ దీప్ టెస్ట్ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖయమనే అనిపిస్తుంది. ఆకాశ్ టీమిండియాకు ఎంపిక కావడం ఇది తొలిసారి కాదు. తాజా దక్షిణాఫ్రికా పర్యటనలో అతను భారత జట్టుకు ఎంపికయ్యాడు. అయితే ఆ సిరీస్‌లో అతనికి తుది జట్టులో ఆడే అవకాశం లభించలేదు. కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సీనియర్లు విరాట్ కోహ్లి, మొహమ్మద్ షమీ లేకపోయినా టీమిండియా అద్భుతంగా రాణిస్తూ ముందుకెళ్తుంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపొందగా.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్, రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్ట్‌ల్లో టీమిండియా విజయాలు సాధించింది. రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభంకానుండగా.. ఐదో టెస్ట్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్ మార్చి 7 నుంచి ప్రారంభమవుతుంది. -
Ind vs Eng: బుమ్రాను రిలీజ్ చేసిన బీసీసీఐ.. అతడికి గ్రీన్ సిగ్నల్!
Ind vs Eng Test Series 2024- 4th debutant in 4th match?: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఇప్పటికే ఇద్దరు యువ క్రికెటర్లు టీమిండియా తరఫున అరంగేట్రం చేశారు. మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్, ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో రజత్‌కు జహీర్ ఖాన్, రాజ్‌కోట్ మ్యాచ్‌లో సర్ఫరాజ్‌కు అనిల్ కుంబ్లే, జురెల్‌కు దినేశ్ కార్తిక్ టీమిండియా క్యాప్‌లు అందించారు. తాజాగా నాలుగో టెస్టు సందర్భంగా మరో ఆటగాడి అరంగేట్రానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నాలుగో టెస్టులో.. ‘నాలుగో ఆటగాడి’ అరంగేట్రం? బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్‌నకు తుదిజట్టులో చోటు ఇచ్చేందుకు మేనేజ్మెంట్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఇంగ్లండ్‌తో తొలి మూడు టెస్టుల్లో అదరగొట్టిన టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫాస్ట్‌బౌలర్‌కు పనిభారం తగ్గించే దృష్ట్యా నాలుగో టెస్టు జట్టు నుంచి అతడిని రిలీజ్ చేస్తున్నట్లు బోర్డు తెలిపింది. అదే విధంగా.. అతడి స్థానంలో ముకేశ్ కుమార్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. అతడి వైపే మొగ్గు అయితే, తుదిజట్టులో మాత్రం ముకేశ్‌ను కాకుండా ఆకాశ్ దీప్‌ను ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఈ ఇద్దరు బెంగాల్ పేసర్లలో ఆకాశ్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. బుమ్రా గైర్హాజరీలో మహ్మద్ సిరాజ్ ప్రధాన పేసర్‌గా వ్యవహరించనుండగా.. అతడికి డిప్యూటీగా ఆకాశ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున మూడు టెస్టులు ఆడిన ముకేశ్ కుమార్ ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. తండ్రి ప్రోత్సాహం కరువైనా ఇక దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన రైటార్మ్ పేసర్ ఆకాశ్ దీప్.. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్(ఇంగ్లండ్-ఏ)తో ముగిసిన అనధికారిక టెస్టు సిరీస్‌లో అదరగొట్టాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని మొత్తంగా 13 వికెట్లు పడగొట్టాడు. కాగా బిహార్‌లోని దెహ్రీలో 1996లో జన్మించిన ఆకాశ్ దీప్ క్రికెటర్‌గా ఎదిగేందుకు బెంగాల్‌కు మకాం మార్చాడు. తండ్రి నుంచి ప్రోత్సాహం కరువైనప్పటికీ అంచెలంచెలుగా ఎదిగి టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు. బెంగాల్ తరఫున 2019లో అరంగేట్రం చేసిన అతడు.. 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో కలిపి 104 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత జట్టు(అప్డేటెడ్): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్. చదవండి: SRH: చిక్కుల్లో సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ.. ఆమె ఆత్మహత్య కేసులో..