పిల్లలు ఏదైనా ఇష్టపడితే అందుకోసం కష్టపడే తల్లిదండ్రులుంటారు. కానీ ఆకాశ్ దీప్ స్టోరీ మాత్రం భిన్నమైంది. బీహార్‌లోని రోహ్తస్ జిల్లా బడ్డి గ్రామానికి చెందిన ఆకాశ్ క్రికెట్‌ను ఇష్టపడేవాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ఆకాశ్ తండ్రి రామ్‌జీ సింగ్ తన కుమారుడి ఇష్టాన్ని గట్టిగానే వ్యతిరేకించాడు. ఆకాశ్ తనకు క్రికెట్టే ప్రపంచమంటే... కన్నతండ్రి ఆ ప్రపంచం నుంచి బయటికి రమ్మన్నాడు. క్రికెటర్ కావడం తన కల అంటే... ఆ కల కనడం మానేయమన్నాడు. ఎ
లాగైనా ఆటగాడిని అవుతానంటే... వద్దే వద్దని ఖరాకండీగా చెప్పేశాడు. కానీ ఈ బిహారీ కుర్రాడు వినలేదు. తండ్రి మాటల్ని తలకెక్కించుకోలేదు. కల సాకారం కోసం... తన క్రికెట్ ప్రపంచం కోసం ఇంటి నుంచి బయటికొచ్చాడు. మొదట దుర్గాపూర్‌లో తెలిసినవారి సాయంతో అకాడమీలో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. తర్వాత కోల్‌కతా పయనమై తన పేస్‌కు పదును పెట్టాడు. కానీ విధి అతనికి మరో పరీక్ష పెట్టింది.
అనారోగ్యంతో 2015లో అతని తండ్రి... ఆరు నెలల్లోపే అన్న కూడా చనిపోవడంతో మధ్యలో మూడేళ్లు కుటుంబభారం మోశాడు. కానీ క్రికెట్ పట్టుమాత్రం వీడలేదు. ఎట్టకేలకు అతని కలకు బెంగాల్ తొలి రూపమిస్తే అతని పేస్ ప్రతాపం టీమిండియాలో చోటిచి్చంది. కట్ చేస్తే... ఆకాశ్ దీప్ ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో అరంగేట్రం చేశాడు. భారత 313 టెస్టు క్రికెటర్‌గా అతనికి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ క్యాప్ అందిచ్చాడు.
అతని ఇష్టం... పడ్డ కష్టం తెలుసుకున్న ద్రవిడ్ జట్టు సభ్యులందరి మధ్య అతని ప్రయాణాన్ని వివరించి స్ఫూర్తినింపాడు. ఓ బిహారి కుర్రాడు కోల్‌కతాలో అండర్–23 జట్టు సభ్యుడయ్యాడు. అనంతరం బెంగాల్ రంజీ ప్లేయర్‌గా దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటుకోవడంతో అటునుంచి టీమిండియాకు ఎంపికయ్యాడు. బుమ్రా విశ్రాంతితో రాంచీలో అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. తన మాతృమూర్తి, ఇద్దరు సోదరిల కళ్లముందు అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆకాశ్ దీప్ భావోగ్వేగానికి గురయ్యాడు.
చదవండి: ముంబై ఇండియన్స్ శుభారంభం
Comments
Please login to add a commentAdd a comment