ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను టీమిండియా ఘన విజయంతో ముగించింది. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఇక ఈ విజయంతో టీమిండియా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
ఇప్పటివరకు 579 టెస్టులు ఆడిన భారత్.. 178 మ్యాచ్‌ల్లో గెలవగా, 178 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. 222 మ్యాచ్‌లు ‘డ్రా’ గా ముగిసి మరో టెస్టు ‘టై’ అయింది. అయితే భారత జట్టు టెస్టు చరిత్రలో విజయాలు, పరాజయాల సంఖ్య సమానంగా రావడం ఇదే తొలిసారి. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ గెలుపు ఓటముల నిష్పత్తి సమానం కాలేదు.
ఇప్పుడు ఈ అరుదైన రికార్డుకు ధర్మశాల వేదికైంది. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. జైశ్వాల్ ఈ సిరీస్ ఆసాంతం అద్బుతమైన కనబరిచాడు. 712 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: #Shreyas Iyer: ఏమైంది శ్రేయస్? మరోసారి ఫెయిల్! ఇక కష్టమే మరి
Comments
Please login to add a commentAdd a comment