సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ విజయాలకు న్యూజిలాండ్ బ్రేక్‌లు వేసింది. పుణే వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సమర్పించుకుంది. ఈ ఓటమితో 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్వదేశంలో భారత్ కోల్పోయింది.
ఈ మ్యాచ్‌లో 359 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 245 పరుగులకు ఆలౌటైంది. ఇక పుణే టెస్టులో ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సీజన్ పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పాయింట్ల పరంగా టీమిండియా(90) అగ్రస్ధానంలో ఉన్నప్పటకి.. విన్నింగ్ పర్సంటేజీలో తగ్గుదల కనిపించింది.
భారత జట్టు 68.62 శాతం నుంచి 68.06 శాతానికి పడిపోయింది. మరోవైపు పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్(60) నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. ఈ విజయంతో కివీస్ విన్నింగ్ పర్సంటేజీలో భారీగా పెరుగుదల కన్పిచింంది. బ్లాక్ క్యాప్స్ 44.40 శాతం నుంచి 50.00 శాతానికి పెరిగింది. ఇక పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత స్ధానాల్లో ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) ఉన్నాయి.
టీమిండియా ఫైనల్ చేరాలంటే?
ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్ధానంలో ఉన్నప్పటికి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుత సైకిల్‌లో ఇప్పటి వరకు ఆడిన 13 టెస్టుల్లో 8 విజయాలు సాధించిన భారత్ నాలుగింటిలో ఓడి ఒక దానిని డ్రా చేసుకుంది.
ఈ సైకిల్‌లో భారత్ ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో ఒక మ్యాచ్, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. కాగా భారత్ ఫైనల్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే కనీసం నాలుగింటిలోనైనా విజయం సాధించాలి. అప్పుడే టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి పాయింట్ల కోత లేకుండా చూసుకోవాలి.
అయితే, న్యూజిలాండ్‌తో మిగిలిన ఇంకొక్క మ్యాచ్ ఓడినా టీమిండియాకు కష్టమే. ఎందుకంటే.. సొంతగడ్డపై ఈ మ్యాచ్ గనుక రోహిత్ సేన ఓడితే.. ఆసీస్ పర్యటనలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టలేదు. కాబట్టి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్..
Comments
Please login to add a commentAdd a comment