WTC Points Table
-
ఆసీస్‌ను వెనక్కు నెట్టి టాప్ ప్లేస్‌కు చేరిన సౌతాఫ్రికా
శ్రీలంకపై రెండో టెస్ట్‌లో విజయం అనంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా అగ్రస్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఆస్ట్రేలియా టాప్ ప్లేస్‌లో ఉండింది. తాజా విజయంతో సౌతాఫ్రికా ఆసీస్‌ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరేందుకు సౌతాఫ్రికా మరో గెలుపు దూరంలో ఉంది. సౌతాఫ్రికా తమ తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే పాకిస్తాన్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు.ప్రస్తుతం సౌతాఫ్రికా విజయాల శాతం 63.33గా ఉంది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో సౌతాఫ్రికా ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 60.71 విజయాల శాతం కలిగి ఉంది. ఆసీస్ చేతిలో రెండో టెస్ట్‌లో ఓటమి అనంతరం టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్ విజయాల శాతం 57.29గా ఉంది. ప్రస్తుత సైకిల్లో టీమిండియా 16 మ్యాచ్‌లు ఆడి తొమ్మిదింట విజయాలు సాధించింది. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయిన శ్రీలంక నాలుగో స్థానంలో ఉంది. ఆ జట్టు విజయాల శాతం 45.45గా ఉంది. న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై వరుసగా రెండు టెస్ట్‌ల్లో మట్టికరిపించిన ఇంగ్లండ్ ఐదో స్థానంలో ఉంది. స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న న్యూజిలాండ్ ఆరో స్థానంలో.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ వరుసగా 7, 8, 9 స్థానాల్లో ఉన్నాయి.టీమిండియా విషయానికొస్తే.. భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే ఆసీస్‌తో తదుపరి జరుగబోయే మూడు టెస్ట్‌ల్లో విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఆసీస్‌ను వారి సొంతగడ్డపై 4-1 తేడాతో ఓడిస్తే భారత విజయాల శాతం 63.15కు చేరి టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. ఇలా జరిగితే భారత్ ఇతర జట్ల జయాపజాలపై ఆధారపడకుండా నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఆసీస్‌తో తదుపరి జరుగబోయే మూడు టెస్ట్‌ల్లో భారత్ ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది. -
WTC Points Table: రెండో స్థానానికి పడిపోయిన టీమిండియా
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌లో ఓటమి అనంతరం ఇది జరిగింది. భారత్ రెండో స్థానానికి పడిపోవడంతో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్‌కు చేరుకుంది. భారత్ పాయింట్స్ పర్సంటేజ్ 58.33 కాగా.. ఆస్ట్రేలియాది 62.50గా ఉంది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, భారత్ తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఉన్నాయి.కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడింది. న్యూజిలాండ్ స్పిన్నర్లు తమ మాయాజాలంతో స్వల్ప స్కోర్‌ను డిఫెండ్ చేసుకున్నారు. అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్ ధాటికి భారత్ కేవలం 121 పరుగులకే కుప్పకూలింది. అజాజ్ పటేల్ 6 వికెట్లు పడగొట్టగా.. ఫిలిప్స్ 3 వికెట్లతో తీశాడు. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(64) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్ (71), డారిల్ మిచెల్ (82) రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు, ఆకాశ్‌దీప్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన భారత్.. 263 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (90), రిషబ్ పంత్ (60) అర్ద సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టాడు.28 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 174 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్ మూడు, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్ తలో వికెట్ పడగొట్టారు. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 121 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. -
టీమిండియా ఇంకొక్కటి ఓడినా ఖేల్ ఖతమే?!
సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ విజయాలకు న్యూజిలాండ్ బ్రేక్‌లు వేసింది. పుణే వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సమర్పించుకుంది. ఈ ఓటమితో 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్వదేశంలో భారత్ కోల్పోయింది.ఈ మ్యాచ్‌లో 359 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 245 పరుగులకు ఆలౌటైంది. ఇక పుణే టెస్టులో ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పాయింట్ల పరంగా టీమిండియా(90) అగ్రస్ధానంలో ఉన్నప్పటకి.. విన్నింగ్ పర్సంటేజీలో తగ్గుదల కనిపించింది.భారత జట్టు 68.62 శాతం నుంచి 68.06 శాతానికి పడిపోయింది. మరోవైపు పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్(60) నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. ఈ విజయంతో కివీస్ విన్నింగ్ పర్సంటేజీలో భారీగా పెరుగుదల కన్పిచింంది. బ్లాక్ క్యాప్స్ 44.40 శాతం నుంచి 50.00 శాతానికి పెరిగింది. ఇక పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత స్ధానాల్లో ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) ఉన్నాయి.టీమిండియా ఫైనల్ చేరాలంటే?ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్ధానంలో ఉన్నప్పటికి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుత సైకిల్లో ఇప్పటి వరకు ఆడిన 13 టెస్టుల్లో 8 విజయాలు సాధించిన భారత్ నాలుగింటిలో ఓడి ఒక దానిని డ్రా చేసుకుంది. ఈ సైకిల్లో భారత్ ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో ఒక మ్యాచ్, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. కాగా భారత్ ఫైనల్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే కనీసం నాలుగింటిలోనైనా విజయం సాధించాలి. అప్పుడే టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి పాయింట్ల కోత లేకుండా చూసుకోవాలి.అయితే, న్యూజిలాండ్‌తో మిగిలిన ఇంకొక్క మ్యాచ్ ఓడినా టీమిండియాకు కష్టమే. ఎందుకంటే.. సొంతగడ్డపై ఈ మ్యాచ్ గనుక రోహిత్ సేన ఓడితే.. ఆసీస్ పర్యటనలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టలేదు. కాబట్టి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. -
చివరి స్థానానికి పడిపోయిన పాకిస్తాన్
ముల్తాన్ టెస్ట్‌లో ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి అనంతరం పాకిస్తాన్ జట్టు వరల్డ్ టెస్ట్ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో (2023-25) పాక్ ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం 16.67 విజయాల శాతం కలిగి ఉంది. మరోవైపు పాక్‌పై ఘన విజయం సాధించిన ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆడిన 17 మ్యాచ్‌ల్లో 45.59 విజయాల శాతం కలిగి ఉంది.పాయింట్ల పట్టికలో భారత్ (11 మ్యాచ్‌ల్లో 74.24 విజయాల శాతం) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా (12 మ్యాచ్‌ల్లో 62.50 విజయాలు శాతం) రెండు.. శ్రీలంక (9 మ్యాచ్‌ల్లో 55.56 విజయాల శాతం) మూడు స్థానాల్లో ఉన్నాయి. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ వరుసగా ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. డబ్ల్యూటీసీ సైకిల్ ముగిసిన అనంతరం టాప్-2లో ఉండే జట్లు ఛాంపియన్షిప్ కోసం పోటీపడతాయి.ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌తో ఇవాళ ముగిసిన ముల్తాన్ టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది.267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 4, అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో 2, క్రిస్ వోక్స్ ఓ వికెట్ పడగొట్టారు.పాక్ చెత్త రికార్డులు..2022 నుంచి పాక్ స్వదేశంలో ఒక్క టెస్ట్ మ్యాచ్‌లో కూడా గెలువలేదు.గత రెండేళ్లలో 11 మ్యాచ్‌లు ఆడిన పాక్ ఏడింట ఓడిపోయి, నాలుగు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది.తొలి ఇన్నింగ్స్‌లో 500 ప్లస్ స్కోర్ చేసి ఇన్నింగ్స్ తేడాతో ఓడిన తొలి జట్టుగా పాక్ చెత్త రికార్డు మూటగట్టుకుంది.పాక్ స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ గెలిచి 1331 రోజులవుతుంది.పాక్ కెప్టెన్‌గా తొలి ఆరు మ్యాచ్‌లు ఓడిన షాన్ మసూద్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదో చెత్త రికార్డు.చదవండి: పాకిస్తాన్ చెత్త రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి -
మూడో స్థానానికి ఎగబాకిన శ్రీలంక.. టాప్‌లోనే భారత్
న్యూజిలాండ్‌పై రెండో టెస్ట్‌లో విజయానంతరం శ్రీలంక జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ (2023-25)లో శ్రీలంక తొమ్మిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు నమోదు చేసి నాలుగింట ఓడింది. న్యూజిలాండ్‌పై తాజా విక్టరీతో శ్రీలంక పాయింట్ల పర్సంటేజీ 55.56 శాతంగా ఉంది. మరోవైపు శ్రీలంక చేతిలో ఓడిన న్యూజిలాండ్ మూడో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో ఎనిమది మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి, ఐదింట పరాజయాలు ఎదుర్కొంది. ఆ జట్టు పాయింట్ల పర్సంటేజీ 37.50 శాతంగా ఉంది.టాప్‌లోనే భారత్స్వదేశంలో బంగ్లాదేశ్‌ను తొలి టెస్ట్‌లో చిత్తుగా ఓడించిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సొంతం చేసుకుని, 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్ పాయింట్ల పర్సంటేజీ 71.67 శాతంగా ఉంది. బంగ్లాదేశ్ విషయానికొస్తే.. భారత్ చేతిలో తొలి టెస్ట్‌లో ఓటమి అనంతరం ఈ జట్టు ఐదో స్థానానికి పడిపోయింది. బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి, నాలుగింట ఓడింది.భారత్ వెనకాలే ఆస్ట్రేలియాడబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా భారత్ వెనకాలే ఉంది. ఆ జట్టు 12 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట గెలిచి మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సైకిల్లో ఆడిన 16 మ్యాచ్‌ల్లో ఎనిమిది గెలిచి, ఏడింట ఓడింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది.మిగతా జట్ల విషయానికొస్తే..తాజా స్టాండింగ్స్‌లో సౌతాఫ్రికా ఆరో స్థానంలో.. పాకిస్తాన్ ఎనిమిదో స్థానంలో.. వెస్టిండీస్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. సౌతాఫ్రికా ఆరు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు (3 పరాజయాలు, ఓ డ్రా), పాకిస్తాన్ ఏడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు (5 పరాజయాలు), వెస్టిండీస్ తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక్క విజయం (6 పరాజయాలు, 2 డ్రాలు) సాధించాయి.చదవండి: NZ Vs SL 2nd Test: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. -
టాప్‌లో టీమిండియా.. ఆరో స్థానానికి పడిపోయిన బంగ్లాదేశ్
చెన్నై టెస్ట్‌లో భారత్ బంగ్లాదేశ్‌పై 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఈ గెలుపుతో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్ట పరుచుకుంది. తాజా గెలుపుతో భారత్ డబ్ల్యూటీసీ 2023-25లో గెలుపు శాతాన్ని 71.67కి చేర్చుకుని వరుసగా మూడో ఎడిషన్ ఫైనల్ దిశగా దూసుకెళ్తుంది.ఈ గెలుపు తర్వాత భారత్.. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మధ్య 9.17 గెలుపు శాతం వ్యత్యాసంగా ఉంది. ప్రస్తుతం ఆసీస్ గెలుపు శాతం 62.50గా ఉంది. భారత్ ముందున్న టెస్ట్ సీజన్లో (9 మ్యాచ్‌ల్లో) మరో నాలుగు విజయాలు సాధిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. భారత్.. తదుపరి బంగ్లాదేశ్‌తో ఒకటి.. ఆతర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.బంగ్లాదేశ్ విషయానికొస్తే.. పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై 2-0 తేడాతో ఓడించిన బంగ్లాదేశ్, ఆతర్వాత గణనీయంగా పాయింట్లు పెంచుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. అయితే భారత్ చేతిలో తాజా ఓటమితో బంగ్లా 6.54 గెలుపు శాతాన్ని కోల్పోయి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ విజయాల శాతం 39.29గా ఉంది. తాజా స్టాండింగ్స్‌లో భారత్, ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్ ఉన్నాయి.కాగా, భారత్ సెప్టెంబర్ 27 నుంచి బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో తలపడుతుంది. కాన్పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్ అనంతరం అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది.చదవండి: క్లీన్ స్వీప్ పరాభవం తప్పించుకున్న సౌతాఫ్రికా -
నాలుగో స్థానానికి ఎగబాకిన బంగ్లాదేశ్.. టాప్‌లో టీమిండియా
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారీగా పాయింట్ల శాతాన్ని మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకింది. తాజాగా ఓటమితో పాక్ పాయింట్ల శాతాన్ని మరింత దిగజార్చుకుని ఎనిమిదో స్థానానికి పడిపోయింది. తాజాగా విడుదల చేసిన పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.ఇటీవలే శ్రీలంకపై రెండో టెస్ట్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ ఐదో స్థానానికి ఎగబాకగా.. సౌతాఫ్రికా ఆరులో, శ్రీలంక ఏడో స్థానంలో నిలిచాయి. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో కేవలం ఒకే ఒక విజయం సాధించిన వెస్టిండీస్ చిట్టచివరి స్థానమైన తొమ్మిదో స్థానంలో నిలిచింది. INDIA AT THE TOP IN WTC 🇮🇳- Pakistan 8th in the table.....!!!! pic.twitter.com/O4WQAIuuzg— Johns. (@CricCrazyJohns) September 3, 2024కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ ఫైనల్ తేదీ మరియు వేదికను ఐసీసీ ఇవాళే ప్రకటించింది. ఈ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11-15 మధ్యలో లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డేను (జూన్ 16) కూడా ప్రకటించారు నిర్వహకులు. లార్డ్స్‌లో మొట్టమొదటిసారిగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది.ఇదిలా ఉంటే, రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అన్ని విభాగాల్లో సత్తా చాటి పాక్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది. బంగ్లాదేశ్‌కు పాక్‌లో ఇది తొలి సిరీస్ విజయం. -
బంగ్లాదేశ్ చేతిలో ఘెర పరాజయం.. ఎనిమిదో స్థానానికి పడిపోయిన పాకిస్తాన్
తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఘెర పరాజయం అనంతరం పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. పాక్‌పై సంచలన విజయం అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ ఆరో స్థానానికి ఎగబాకింది. ఈ రెండు మార్పులు మినహా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పులు జరగలేదు. 68.52 విజయాల శాతంతో భారత్ టాప్‌లో కొనసాగుతుండగా.. 62.50 విజయాల శాతంతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో.. 50 శాతం విజయాలతో న్యూజిలాండ్ మూడులో.. 41.07 విజయాల శాతంతో ఇంగ్లండ్ నాలుగో స్థానంలో.. 40 శాతం విజయాలతో శ్రీలంక ఐదో స్థానంలో ఉన్నాయి. 38.89 విజయాల శాతంతో సౌతాఫ్రికా ఏడులో.. 18.52 విజయాల శాతంతో వెస్టిండీస్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.కాగా, రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్ట్ విజయం. పాక్‌ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో మట్టికరపించిన తొలి జట్టు కూడా బంగ్లాదేశే కావడం విశేషం. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 30న ఇదే వేదికగా జరుగనుంది.స్కోర్ వివరాలు..పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 (సౌద్ షకీల్ 141, మొహమ్మద్ రిజ్వాన్ 171 నాటౌట్, హసన్ మహమూద్ 2/70)బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 (ముష్ఫికర్ అహ్మద్ 191, షడ్మాన్ ఇస్లాం 93, నసీం షా 3/93)పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 146 (మొహమ్మద్ రిజ్వాన్ 51, మెహిది హసన్ 4/21)బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 30/0 (జకీర్ హసన్ 15 నాటౌట్) -
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక ఇలా..!
వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక ఇలా ఉంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పులేమీ జరగలేదు. వెస్టిండీస్ తొమ్మిదో స్థానంలో.. సౌతాఫ్రికా ఏడో స్థానంలో కొనసాగుతున్నాయి. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించిన భారత్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.Here’s the updated World Test Championship (WTC) points table following the draw in the first Test between the West Indies and South Africa in Port of Spain. pic.twitter.com/tpVGXbhAZd— CricTracker (@Cricketracker) August 12, 2024ఇదిలా ఉంటే, వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ పిచ్, వాతావరణం కారణంగా డ్రాగా ముగిసింది. చివరి రోజు 298 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ మ్యాచ్ ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అలిక్ అథనాజ్ (92) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి విండీస్‌ను ఓటమి బారి నుంచి తప్పించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 357 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 173 పరుగులు చేసింది. అనంతరం విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 233, రెండో ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేసింది. చివరి రోజు విండీస్ బ్యాటర్లు సంయమనంతో బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
టాలెంట్‌కు కొదవ లేదు.. పాక్‌ను నెం1 జట్టుగా నిలుపుతా: జాసన్ గిల్లెస్పీ
ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిల్లెస్పీ పాకిస్తాన్ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌గా ఆదివారం బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో లహోర్‌లోని హైఫెర్మమెన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియాలో సమవేశంలో గిల్లెస్పీ పాల్గోనున్నాడు.ఈ సందర్భంగా గిల్లెస్సీ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ను రెడ్‌బాల్ క్రికెట్లో నెం1 జట్టుగా తీర్చేందుకు ప్రయత్నిస్తాని చెప్పుకొచ్చాడు. వచ్చే నెలలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌తోనే పాక్ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌గా గిల్లెస్పీ ప్రయాణం మొదలు కానుంది. ఆ తర్వాత పాక్ స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో కూడా టెస్టు సిరీస్ ఆడనుంది."పాకిస్తాన్ జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. నిజంగా ఈ జట్టు చాలా టాలెంటడ్. కానీ జట్టు ప్రదర్శనలో నిలకడలేదు. ఒక మ్యాచ్ బాగా ఆడితే మరో మ్యాచ్‌లో డీలా పడడం పరిపాటిగా మారింది. వారిని తిరిగి గాడిలో పెట్టడమే నా పని. అందుకు తగ్గట్టుగానే నేను పనిచేస్తాను. ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో పాకిస్థాన్ ఐదవ స్దానంలో ఉంది. రాబోయో సిరీస్‌లలో విజయం సాధించి మా ర్యాంక్‌ను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తాము. మేము మా తదుపరి సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో ఆడనున్నాం. ప్రస్తుతం నా దృష్టి అంతా ఈ సిరీస్‌పైనే ఉంది. ఫ్యూచర్ కోసం ఇప్పటినుంచి నేను ఆలోచించను. ముఖ్యంగా పాక్ జట్టులో కొన్ని విషయాలను గమనించాను. పాక్ తొలుత అద్భుతంగా రాణించి ఆఖరిలో బోల్తా పడటం చాలా మ్యాచ్‌ల్లో చూశాను. బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత ఇంగ్లండ్‌తో ఆడనున్నాం. కచ్చితంగా ఇంగ్లండ్ నుంచి మాకు తీవ్ర పోటీ ఎదురుకానుంది. నిజంగా మాకు అదొక ఛాలెంజ్. అందుకు తగ్గట్టు మేము కూడా సిద్దంగా ఉన్నాము. ఆఖరిగా పాక్‌ను నెం1 జట్టుగా నిలపడమే నా లక్ష్యమని" గిల్లెస్పీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. -
WTC 2023-25: ఆసీస్‌కు 4.. టీమిండియాకు 5
ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ రెండో టెస్ట్ అనంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్స్‌కు చేరే జట్లపై క్లారిటీ వచ్చింది. డబ్యూటీసీ ఫైనల్స్ రేసులో మొత్తం తొమ్మిది జట్లు ఉండగా.. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌కు చేరడం దాదాపుగా ఖరారైపోయింది. Australia jumps to the second spot in the World Test Championship 2023-25 points table after their victory against New Zealand in the second Test. pic.twitter.com/9xN3aCeAb9 — CricTracker (@Cricketracker) March 11, 2024 ప్రస్తుత సైకిల్లో ఆస్ట్రేలియా ఏడులో నాలుగు, భారత్ పదిలో ఐదు మ్యాచ్‌లు గెలిస్తే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మిగతా జట్లలో సౌతాఫ్రికా ఎనిమిదిలో ఏడు.. న్యూజిలాండ్ ఎనిమిదిలో ఆరు.. పాకిస్తాన్ తొమ్మిదిలో ఏడు.. వెస్టిండీస్ తొమ్మిదిలో ఏడు.. ఇంగ్లండ్ 12కు 12.. బంగ్లాదేశ్ పదిలో ఏడు... శ్రీలంక 11లో ఎనిమిది మ్యాచ్‌లు గెలిస్తే డబ్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది. మిగతా జట్లతో పోలిస్తే.. భారత్, ఆసీస్‌లకు ఫైనల్‌కు చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆసీస్ తాము ఆడాల్సిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు భారత్‌తో (స్వదేశంలో).. రెండు శ్రీలంకతో షెడ్యూలై ఉన్నాయి. Current cutoff for wtc final Probably india and austrailia will play final #WTC25 pic.twitter.com/vqRGjIUHxp — ICT FAN💙💙(MODI'S FAMILY) (@SAHURAGHAV26) March 11, 2024 భారత్.. రెండు బంగ్లాదేశ్‌తో (స్వదేశంలో).. మూడు న్యూజిలాండ్‌తో (స్వదేశంలో).. ఐదు ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. వీటిలో టీమిండియా సగం మ్యాచ్‌లు గెలిచినా టీమిండియా సునాయాసంగా ఫైనల్‌కు చేరుకుంటుంది. సౌతాఫ్రికా విషయానికొస్తే.. వెస్టిండీస్‌తో రెండు, బంగ్లాదేశ్‌తో రెండు, శ్రీలంకతో రెండు (స్వదేశంలో), పాకిస్తాన్‌తో రెండు (స్వదేశంలో) మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్.. శ్రీలంకతో రెండు, భారత్‌తో మూడు, ఇంగ్లండ్‌తో మూడు (స్వదేశంలో) పాకిస్తాన్.. బంగ్లాదేశ్‌తో రెండు (స్వదేశంలో), ఇంగ్లండ్‌తో మూడు (స్వదేశంలో), సౌతాఫ్రికాతో రెండు, వెస్టిండీస్‌తో రెండు వెస్టిండీస్.. ఇంగ్లండ్‌తో రెండు, సౌతాఫ్రికాతో రెండు (స్వదేశంలో), బంగ్లాదేశ్‌తో రెండు (స్వదేశంలో), పాకిస్తాన్‌తో రెండు ఇంగ్లండ్.. వెస్టిండీస్‌తో మూడు (స్వదేశంలో), శ్రీలంకతో మూడు (స్వదేశంలో), పాకిస్తాన్‌తో మూడు, న్యూజిలాండ్‌తో మూడు బంగ్లాదేశ్.. శ్రీలంకతో రెండు (స్వదేశంలో), పాకిస్తాన్‌తో రెండు, భారత్‌తో రెండు, సౌతాఫ్రికాతో రెండు (స్వదేశంలో), వెస్టిండీస్‌తో రెండు శ్రీలంక.. బంగ్లాదేశ్‌తో రెండు, ఇంగ్లండ్‌తో రెండు, న్యూజిలాండ్‌తో రెండు (స్వదేశంలో), సౌతాఫ్రికాతో రెండు, ఆస్ట్రేలియాతో రెండు (స్వదేశంలో) -
న్యూజిలాండ్‌పై సూపర్ విక్టరీ.. రెండో స్థానానికి ఎగబాకిన ఆస్ట్రేలియా
క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ గెలుపుతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. డబ్యూటీసీలో ప్రస్తుతం ఆసీస్ విజయాల శాతం 62.51గా ఉంది. ప్రస్తుత డబ్యూటీసీ సైకిల్లో ఆసీస్ 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 90 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఆసీస్ చేతిలో ఓడిన న్యూజిలాండ్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారింది. ఆ జట్టు ప్రస్తుత డబ్లూటీసీ సైకిల్లో 50 శాతం విజయాలతో 36 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై విజయంతో టీమిండియా తమ విజయాల శాతాన్ని మరింత మెరుగుపర్చుకుని టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుంది. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తర్వాత బంగ్లాదేశ్ (50 శాతం విజయాలు), పాకిస్తాన్ (36.66), వెస్టిండీస్ (33.33), సౌతాఫ్రికా (25), ఇంగ్లండ్ (17.5) వరుస స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే, మిచెల్ మార్ష్ (80), అలెక్స్ క్యారీ (98 నాటౌట్), పాట్ కమిన్స్ (32 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ను 3 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 279 పరుగుల లక్ష్య ఛేదనలో 80 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి కొరల్లో చిక్కుకున్న ఆసీస్‌ను ఈ ముగ్గురు కలిసి విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 162, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 372 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులకు ఆలౌటైన ఆసీస్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసి, 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
మరింత మెరుగుపడిన టీమిండియా.. దారుణంగా మారిన ఇంగ్లండ్ పరిస్థితి
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో భారత క్రికెట్ జట్టు పరిస్థితి మరింత మెరుగుపడింది. రాంచీ టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై విక్టరీతో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని పదిలం చేసుకుని, ఫైనల్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఈ గెలుపుతో టీమిండియా విజయాల శాతం 64.58కు చేరింది. 75 శాతం విజయాలతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. మరోవైపు భారత్ చేతిలో ఓటమితో ఇంగ్లండ్ పరిస్థితి మరింత దిగజారింది. ఆ జట్టు విజయాల శాతం 19.44 శాతానికి పడిపోయి చివరి నుంచి రెండో స్థానానికి పరిమితమైంది. అసలే ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా ఆ జట్టు అదనంగా 19 పాయింట్లను కోల్పోయింది. డబ్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్, భారత్‌ల తర్వాత ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, శ్రీలంక జట్లు వరుసగా ఉన్నాయి. ప్రస్తుత సైకిల్ ముగిసే లోపు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు టెస్ట్ ఛాంపియప్షిప్ టైటిల్ కోసం తలపడతాయి. ఇదిలా ఉంటే, రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి గెలుపొందింది. స్వల్ప లక్ష్య ఛేదనలో (192) భారత జట్టు తొలుత తడబాటుకు లోనైనప్పటికీ ఆతర్వాత కుదురుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులతో మెరిసిన దృవ్ జురెల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ రాణించి (39 నాటౌట్) జట్టు విజయంలో ప్రధాన ప్రాత పోషించాడు. జురెల్‌కు జతగా శుభ్‌మన్ గిల్ (52 నాటౌట్) సైతం బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయమైన 72 పరుగులు జోడించి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. స్కోర్ వివరాలు.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 353 (రూట్ 122 నాటౌట్, జడేజా 4/67) భారత్ తొలి ఇన్నింగ్స్ 307 (దృవ్ జురెల్ 90, షోయబ్ బషీర్ 5/119) ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 145 (జాక్ క్రాలే 60, అశ్విన్ 5/51) భారత్ రెండో ఇన్నింగ్స్ 192/5 (రోహిత్ శర్మ 55, షోయబ్ బషీర్ 3/79) 5 వికెట్ల తేడాతో భారత్ విజయం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: దృవ్ జురెల్ -
రెండో స్థానానికి ఎగబాకిన టీమిండియా
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానానికి ఎగబాకింది. వైజాగ్ టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై విజయంతో డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ పూర్వస్థితికి చేరింది. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా రెండో స్థానంలోనే ఉండింది. అయితే ఆ మ్యాచ్‌లో ఓటమితో రోహిత్ సేన రెండో స్థానం నుంచి ఐదో ప్లేస్‌కు పడిపోయింది. తాజా విజయంతో భారత్ తిరిగి రెండో స్థానానికి ఎగబాకింది. పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ డబ్ల్యూటీసీ ఛాంపియన్ ఆస్ట్రేలియా (55 శాతం విజయాలు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ (52.77) , సౌతాఫ్రికా (50), న్యూజిలాండ్ (50), బంగ్లాదేశ్ (50), పాకిస్తాన్ (36.66), వెస్టిండీస్ (33.33), ఇంగ్లండ్ (25), శ్రీలంక వరుసగా రెండు నుంచి తొమ్మిది స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే, వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమానంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా (9/91), యశస్వి జైస్వాల్ (209), శుభ్‌మన్ గిల్ (104) అద్భుత ప్రదర్శనలతో టీమిండియాకు అపురూప విజయాన్ని అందించారు. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌పై తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లండ్ ఓటమికి ప్రధాన కారణమైన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించిన విషయం తెలిసిందే. మూడో టెస్ట్ మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతుంది. రెండో టెస్ట్ స్కోర్ వివరాలు.. భారత్: 396 & 255 ఇంగ్లండ్: 253 & 292 -
ఇంగ్లండ్ చేతిలో పరాభవం.. టీమిండియాకు మరో ఎదురుదెబ్బ
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై ఘోర పరాభవాన్ని ఎదుర్కొని బాధలో ఉన్న టీమిండియాకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం విడుదల చేసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి ఒక డ్రా, రెండు పరాజయాలు, రెండు విజయాలు నమోదు చేసింది. ఈ సైకిల్లో టీమిండియా విజయాల శాతం 43.33 శాతంగా ఉంది. మరోవైపు ఇంగ్లండ్ ఆరు మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు, రెండింట్లో అపజయాలు, ఓ మ్యాచ్ డ్రా చేసుకుని 29.16 విజయాల శాతంతో ఎనిమిదో స్థానంలో ఉంది. కాగా, టెస్ట్ క్రికెట్లో నిన్న రెండు ఊహించని ఫలితాలు వచ్చాయి. తొలి ఇన్నింగ్స్ లీడ్ కలిగి కూడా టీమిండియా ఇంగ్లండ్ చేతిలో చిత్తు కాగా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సొంతగడ్డపై చిన్న జట్టైన వెస్టిండీస్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొంది. ఆసీస్ విండీస్ చేతిలో ఓడినా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. సంచలన విజయంతో ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో బోణీ కొట్టిన విండీస్ ఏడో స్థానానికి ఎగబాకింది. ఆసీస్ తర్వాత రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆరో ప్లేస్‌లో పాకిస్తాన్, తొమ్మిదో స్థానంలో శ్రీలంక జట్లు ఉన్నాయి. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తొలి టెస్ట్ స్కోర్ వివరాలు.. ఇంగ్లండ్: 246 & 420 భారత్: 436 & 202 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం -
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్కు ఆస్ట్రేలియా.. మరి భారత్?
సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 పాయింట్ల పట్టికలో ఆసీస్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 56.25 శాతం పాయింట్లతో కంగారూ జట్టు.. నాలుగో స్ధానం నుంచి టాప్ ప్లేస్‌కు ఎగబాకింది. డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో ఇప్పటి వరకు 8 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా.. ఐదింట విజయం, ఓ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. కాగా ఇప్పటివరకు టాప్ ప్లేస్‌లో ఉన్న భారత్( 54.16 శాతంతో) రెండో స్ధానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో ఘన విజయం సాధించిన భారత జట్టు తొలి స్ధానానికి చేరుకుంది. అయితే భారత్ టాప్ ప్లేస్‌ను 24 గంటల వ్యవధిలోనే కోల్పోయింది. ఇక భారత్ తర్వాతి స్ధానాల్లో బాకింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్(50.0), బంగ్లాదేశ్(50.0) పాకిస్తాన్(45.83) కొనసాగుతున్నాయి. చదవండి: PAK vs AUS: కెరీర్లో చివరి మ్యాచ్.. కన్నీరు పెట్టుకున్న డేవిడ్ వార్నర్! వీడియో వైరల్ -
సంచలన విజయం.. డబ్ల్యూటీసీలో అగ్రస్థానానికి చేరిన టీమిండియా
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ చారిత్రత్మక విజయంతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 54.16 శాతం పాయింట్లతో భారత జట్టు.. ఐదో స్ధానం నుంచి టాప్ ప్లేస్‌కు ఎగబాకింది. అదే విధంగా ఈ మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసిన సౌతాఫ్రికా 50 శాతం పాయింట్లతో రెండో స్ధానానికి పడిపోయింది. ఇక సౌతాఫ్రికా తర్వాతి స్ధానాల్లో న్యూజిలాండ్(50.0), ఆస్ట్రేలియా(50.0),బంగ్లాదేశ్(50.0) పాకిస్తాన్(45.83) కొనసాగుతున్నాయి. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మూడో టెస్టు అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ మార్పులు చోటు చేసుకోన్నాయి. ఒకవేళ ఆసీస్ విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరే ఛాన్స్ ఉంది. చదవండి: ఏం జరిగిందో చూశారు కదా.. నోరుపారేసుకోవడం ఆపితే మంచిది: రోహిత్ -
సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. టీమిండియాకు మరో ఎదురుదెబ్బ
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న భారత్‌కు ఈ బాధ మర్చిపోకముందే మరో ఎదురదెబ్బ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా భారత జట్టుకు 10 శాతం జరిమానా (మ్యాచ్ ఫీజ్‌లో) విధించబడింది. అలాగే రెండు ముఖ్యమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లను సైతం టీమిండియా కోల్పోయింది. కనీస ఓవర్ రేట్‌ను మెయింటైన్ చేయడంలో విఫలం కావడంతో టీమిండియాపై ఈ చర్యలకు ఉపక్రమించినట్లు ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ చర్యల ప్రభావం టీమిండియా డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌పై భారీ ప్రభావం చూపింది. పెనాల్టీకి ముందు భారత్ 16 పాయింట్లు మరియు 44.44 పాయింట్ల శాతంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. తాజాగా భారత్ ర్యాంక్ ఆరో స్థానానికి (38.89) పడిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు 66.67 పాయింట్ల శాతంతో తొలిస్దానంలో ఉండిన టీమిండియా ఒక్కసారిగా భారీగా పాయింట్లు కోల్పోయి ఆరో స్థానానికి దిగజారింది. మరోవైపు భారత్‌పై అద్బుత విజయం సాధించిన దక్షిణాఫ్రికా 100 పాయింట్ల శాతంతో (12 పాయింట్లు) డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకోగా.. రెండో టెస్ట్‌లోనూ పాక్‌ను మట్టికరిపించడంతో ఆస్ట్రేలియా మూడో స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ (50.00) రెండో స్థానంలో.. బంగ్లాదేశ్ (50), పాకిస్తాన్ (45.83) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే, కేవలం మూడు రోజుల్లో ముగిసిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తూ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైన భారత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింత దారణంగా విఫలమై 131 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (101) అద్భుతమైన సెంచరీతో పోరాడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (76) ఒంటరిపారాటం చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విరాట్‌తో పాటు కేవలం శుభ్‌మన్ గిల్ (26) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో రబాడ (5/59), నండ్రే బర్గర్ (3/50).. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బర్గర్ (4/33), జన్సెన్ (3/36) కుప్పకూల్చారు. సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఓపెనర్ డీన్ ఎల్గర్ (185) భారీ శతకంతో కదంతొక్కడంతో పాటు బెడింగ్హమ్ (56), మార్కో జన్సెన్ (84 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటైంది. ఈ స్కోర్‌ను భారత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కూడా అధిగమించలేక ఇన్నింగ్స్ తేడాతో ఓడింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లతో పర్వాలేదనిపించగా.. సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ద్ కృష్ణ, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. -
దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి.. భారత్‌కు బిగ్ షాక్! టాప్ ప్లేస్ అవుట్
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్ధానాన్ని కోల్పోయింది. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసిన భారత్.. పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి దిగజారిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు 66.67 పాయింట్ల శాతంతో టీమిండియా తొలిస్దానంలో ఉండేది. కానీ ఈ ఓటమితో ఇప్పుడు భారత్ పాయింట్ల శాతం ఏకంగా 44.44కు పడిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత విజయం సాధించిన దక్షిణాఫ్రికా 100 పాయింట్ల శాతంతో టాప్కు చేరుకుంది. సౌతాఫ్రికా తర్వాతి స్ధానాల్లో వరుసగా పాకిస్తాన్(61.11),న్యూజిలాండ్(50.0) జట్లు కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా 41.67 పాయింట్ల శాతంతో ఆరో స్ధానంలో ఉంది. కాగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరే ఛాన్స్ ఉంది. అదే విధంగా కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టులో భారత్ విజయం సాధిస్తే.. తమ స్ధానాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. చదవండి: IND Vs SA 2nd Test: గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. -
ఆసీస్ చేతిలో చిత్తైన పాక్.. అగ్రస్థానానికి టీమిండియా
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా మరోసారి అగ్రస్థానానికి చేరింది. తాజాగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఘోరంగా ఓడటంతో ఇప్పటివరకు టాప్‌లో ఉండిన పాక్ రెండో స్థానానికి పడిపోయింది. పాక్‌పై భారీ విజయంతో ఆసీస్ 2023-25 సైకిల్లో బోణీ కొట్టింది. ఈ సైకిల్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్ కేవలం ఒకే మ్యాచ్‌లో గెలిచి, 41.67 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో నిలిచింది. భారత్.. ఈ సైకిల్లో ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్‌లో విజయం సాధించి, 66.67 పాయింట్ల శాతంతో 16 పాయింట్లు కలిగి టాప్‌లో నిలిచింది. ఆసీస్ చేతిలో ఓటమితో రెండో స్థానానికి పడిపోయిన పాక్ 2 మ్యాచ్‌ల్లో ఓ విజయంతో 66.67 పాయింట్ల శాతం కలిగి ఉంది. ఈ జాబితాలో భారత్, పాక్‌ల తర్వాత న్యూజిలాండ్ (50 పాయింట్ల శాతం), బంగ్లాదేశ్ (50), ఆస్ట్రేలియా (41.67), వెస్టిండీస్ (16.67), ఇంగ్లండ్ (15) వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ 360 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 233/5 చేయగా.. పాక్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 271, 89 పరుగులు చేసి చిత్తుగా ఓడింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ 164, మిచెల్ మార్ష్ 90 పరుగులతో చెలరేగగా.. పాక్ అరంగేట్రం బౌలర్ ఆమిర్ జమాల్ 6 వికెట్లతో సత్తా చాటాడు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హాక్ (62) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (90), మిచెల్ మార్ష్ (63 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. పాక్ బౌలర్లలో ఖుర్రమ్ 3 వికెట్లతో పర్వాలేదనిపించాడు. అనంతరం పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ (24), బాబర్ ఆజమ్ (14), ఇమామ్ ఉల్ హాక్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. స్టార్క్, హాజిల్‌వుడ్ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమవుతుంది. -
WTC: టీమిండియాను ‘వెనక్కి’నెట్టిన బంగ్లాదేశ్! టాప్‌లో పాకిస్తాన్..
ICC World Test Championship 2023 - 2025: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ టాప్-2లోకి దూసుకువచ్చింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 150 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ టీమిండియాను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించింది. కాగా బంగ్లాదేశ్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా శనివారం ముగిసిన మొదటి మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్.. న్యూజిలాండ్‌పై విజయం సాధించడం ఇదే మొదటిసారి. చారిత్మక విజయంతో బంగ్లాదేశ్ ఇక బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్‌గా నజ్ముల్ షాంటో తొలి ప్రయత్నంలోనే చారిత్రాత్మక విజయం అందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023- 25 సీజన్ నడుస్తోంది. అగ్రస్థానం ఇంకా పాకిస్తాన్‌దే తాజా సైకిల్లో భాగంగా పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్‌లలో రెండూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టును ఓడించి 24 పాయింట్లతో టాప్‌లో ఉంది. మరోవైపు.. జూలైలో వెస్టిండీస్‌లో పర్యటించిన టీమిండియా రెండింట ఒక మ్యాచ్ గెలిచి.. మరొకటి డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో 16 పాయింట్లతో రెండో స్థానం(66.67 శాతం)లో ఉండేది. అయితే, తాజాగా న్యూజిలాండ్‌పై గెలుపుతో విజయశాతం(100 శాతం) విషయంలో మెరుగ్గా ఉన్న బంగ్లా ఇప్పుడు టీమిండియాను వెనక్కినెట్టింది. PC: ICC మూడో స్థానానికి పడిపోయిన టీమిండియా ఈక్రమంలో రోహిత్ సేన ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా 18 పాయింట్లు(విజయశాతం 30)తో నాలుగు, వెస్టిండీస్ 4 పాయింట్లు(16.67 శాతం)తో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ కేవలం 9 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉండగా.. శ్రీలంక, న్యూజిలాండ్, సౌతాఫ్రికా తదితర జట్టు ఇంకా తాజా సైకిల్లో పాయింట్ల ఖాతా తెరవనే లేదు. రెండుసార్లు చేదు అనుభవమే కాగా డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ గెలిస్తే 12, డ్రా చేసుకుంటే 4 పాయింట్లు వస్తాయి. ఇక సీజన్ ముగిసే నాటికి పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ ట్రోఫీని తొలుత న్యూజిలాండ్, తర్వాత ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఈ రెండు పర్యాయాలు ఫైనల్ వరకు చేరిన టీమిండియాకు ఆఖరి పోరులో ఓటమి తప్పలేదు. చదవండి: టీమిండియా హెడ్‌కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
స్లో ఓవర్ రేట్ దెబ్బ.. ఇంగ్లండ్, ఆసీస్‌లకు భారీ షాక్
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. తొలి రెండు టెస్టులు ఆసీస్ నెగ్గితే.. మూడు, ఐదో టెస్టు ఇంగ్లండ్ నెగ్గింది. ఇక నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఐదోటెస్టు గెలిచిన ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పట్టికలో పాయింట్ల పరంగా ఆస్ట్రేలియాతో సమానంగా నిలిచింది. ఇరుజట్లు ఐదు టెస్టుల్లో రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో నిలిచాయి. ఈ లెక్కన ఇరుజట్లు 26 పాయింట్లు(43.33 పర్సంటేజీ పాయింట్స్)తో పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లండ్‌కు ఈ మురిపెం ఒక్కరోజుకే పరిమితమైంది. తాజాగా బుధవారం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకు ఐసీసీ షాక్ ఇచ్చింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఐదుటెస్టుల్లో స్లో ఓవర్ రేట్ నమోదైన కారణంగా ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో జరిమానా విధించడంతో పాటు ఇరుజట్లకు డబ్ల్యూటీసీ పాయింట్లలోనూ భారీ కోత పడింది. ఆస్ట్రేలియా ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. టెస్టుల్లో ఒకరోజుకు ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లు వేయాల్సి ఉంటుంది(ఇరుజట్లు లేదా ఒకే జట్టు). అయితే ఆసీస్ నాలుగో టెస్టులో నిర్ణీత సమయంలోగా 10 ఓవర్లు తక్కువగా వేసినందుకు గానూ ఒక్క షార్ట్ ఓవర్ కింద ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఓవర్‌కు 5శాతం చొప్పున జరిమానాతో పాటు ఒక డబ్ల్యూటీసీ పాయింట్ కోత విధిస్తారు. ఈ లెక్కన ఆసీస్ 10 ఓవర్లు చొప్పున 10 డబ్ల్యూటీసీ పాయింట్లను కోల్పోయింది. ఇక మ్యాచ్‌లో ఆటగాళ్లకు 50శాతం జరిమానా విధించారు. ఇక ఇంగ్లండ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. యాషెస్‌లో జరిగిన ఐదు టెస్టుల్లో ఏకంగా నాలుగు టెస్టుల్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన ఇంగ్లండ్‌కు గట్టి దెబ్బపడింది. తొలి టెస్టుల్లో రెండు ఓవర్లు, రెండో టెస్టులో తొమ్మిది ఓవర్లు, నాలుగో టెస్టులో మూడు ఓవర్లు, ఇక చివరి టెస్టులో ఐదు ఓవర్లు.. మొత్తంగా 19 ఓవర్లు తక్కువ వేసింది. దీంతో ఒక ఓవర్ చొప్పున ఇంగ్లండ్‌కు 19 ఓవర్లకు 19 డబ్ల్యూటీసీ పాయింట్లు కోత పడ్డాయి. దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులోనూ జరిమానా పడింది. తొలి టెస్టులో 10 శాతం, రెండో టెస్టులో 45 శాతం, నాలుగో టెస్టులో 15శాతం, చివరి టెస్టులో 25శాతం జరిమానా విధించారు. దీంతో ఒక్కరోజు వ్యవధిలోనే డబ్ల్యూటీసీ పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకోవడం విశేషం. 19 పాయింట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ప్రస్తుతం 13 పాయింట్లు(15 పర్సంటేజీ పాయింట్స్)తో ఐదో స్థానానికి పడిపోయింది. ఇక 10 పాయింట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 30 పర్సంటేజీ పాయింట్స్‌తో మూడో స్థానంలో ఉన్నప్పటికి భారీగా పాయింట్లు కోల్పోవడం ఆ జట్టుకు దెబ్బ అని చెప్పొచ్చు. ఇక టీమిండియాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఓటమి పాలైన విండీస్ 16.67 పర్సంటేజీ పాయింట్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. The latest points table of WTC 2023-25: 1. Pakistan - 100% 2. India - 66.67% 3. Australia - 30% 4. West Indies - 16.67% 5. England - 15% pic.twitter.com/gaoojRbIUi — CricketMAN2 (@ImTanujSingh) August 2, 2023 🚨 Points Deduction 🚨 Due to slow over-rates during the Ashes series, England lost 19 points and Australia lost 10 points in the WTC points table. 🏴🇦🇺#WTC #Ashes #ENGvAUS pic.twitter.com/wdFXbSgDhu — Sportskeeda (@Sportskeeda) August 2, 2023 చదవండి: R Ashwin: 'టీమిండియా బజ్‌బాల్ ఆడితే జట్టులో ఎవరు మిగలరండి' -
చివరి టెస్టులో విజయం.. ఆసీస్‌తో సమానంగా ఇంగ్లండ్
యాషెస్ సిరీస్‌లో భాగంగా చివరి టెస్టును గెలిచిన ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే మూడో స్థానంలో ఉన్న డిపెండింగ్ చాంపియన్స్ ఆస్ట్రేలియాకు, ఇంగ్లండ్‌కు సమాన పాయింట్లు ఉండడం విశేషం. ఈ రెండు జట్లు 43.33 పర్సంటేజీ పాయింట్స్(PTC)తో 26 పాయింట్లు(ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రా) కలిగి ఉన్నాయి. పెనాల్టీ కింద ఇరుజట్లకు రెండు పాయింట్లు కోత పడడంతో వారి పాయింట్స్‌లో వ్యత్యాసం లేకుండా పోయింది. ఇక తొలి రెండు స్థానాల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇటీవలే లంకపై టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్తాన్ 100 పర్సంటైల్‌తో 24 పాయింట్లతో(రెండు మ్యాచ్‌ల్లో రెండు గెలుపు) తొలి స్థానంలో ఉండగా.. టీమిండియా 66.67 పర్సంటైల్‌తో 16 పాయింట్లతో(రెండు మ్యాచ్‌ల్లో ఒక గెలుపు, ఒక డ్రా) రెండో స్థానాన్ని నిలుపుకుంది. ఇక వన్డే వరల్డ్‌కప్ ముగిసే వరకు ఏ జట్లకు టెస్టు సిరీస్‌లు లేవు. వరల్డ్‌కప్ ముగిశాకా టీమిండియా డిసెంబర్లో సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ ఆడనుంది. అటు పాకిస్తాన్ ఆస్ట్రేలియా గడ్డపై డిసెంబర్-జనవరిలో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ టెస్టు సిరీస్‌ల ఫలితాల అనంతరం పాయింట్స్ టేబుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. చదవండి: WI Vs IND 3rd ODI: టాస్ గెలిచిన విండీస్.. ప్రయోగాలు వదలని టీమిండియా, సిరీస్ గెలిచేనా? Ben Stokes: 'తప్పుడు వార్తలు.. ఆసీస్ ఆటగాళ్లతో కలిసి మందు కొట్టలేదు' -
ఏడు వికెట్లతో చెలరేగిన 36 ఏళ్ల పాక్ బౌలర్.. సిరీస్ క్లీన్‌స్వీప్
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 188 పరుగులకు కుప్పకూలింది. ఏంజెలో మాథ్యూస్ 63 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. దిముత్ కరుణరత్నే 41 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో స్పిన్నర్ నొమన్ అలీ ఏడు వికెట్లతో చెలరేగగా.. చివర్లో నసీమ్ షా మూడు వికెట్లు తీశాడు. సొంతగడ్డపై లంకకు ఇదే అతిపెద్ద పరాజయం కాగా.. పాకిస్తాన్‌కు లంక గడ్డపై అతిపెద్ద ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం. ఈ క్రమంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను పాకిస్తాన్ 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌ను 576 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (201 పరుగులు) డబుల్ సెంచరీతో మెరవగా.. అగా సల్మాన్ (132 నాటౌట్) అజేయ సెంచరీతో మెరిశాడు. సాద్ షకీల్ 57, షాన్ మసూద్ 51, మహ్మద్ రిజ్వాన్ 50 పరుగులు చేశారు. అంతకముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు ఆలౌట్ అయింది. 36 ఏళ్ల వయసులో సంచలనం ఇక నొమన్ అలీ 36 ఏళ్ల వయసులో తన స్పిన్ బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఒక దశలో లంక ఇన్నింగ్స్‌లో తొలి ఏడు వికెట్లు నొమన్ అలీనే పడగొట్టడంతో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్ల హాల్ నమోదు చేస్తాడనిపించింది. జిమ్ లేకర్(1956), అనిల్ కుంబ్లే(1999), ఎజాజ్ పటేల్(2021)లో టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన బౌలర్లుగా చరిత్ర సృష్టించారు. అయితే ఆఖర్లో టెయిలెండర్ల వికెట్లను నసీమ్ షా రెండు ఓవర్ల వ్యవధిలో తీయడంతో నొమన్ అలీ తృటిలో ఆ ఫీట్‌ను చేజార్చుకున్నాడు. Noman Ali's brilliant spell rips through Sri Lanka's batting lineup.🎯 His Best Bowling Figures in a Test Innings!🔝#NomanAli #Pakistan #SLvPAK pic.twitter.com/OMYnkbp85R — Sportskeeda (@Sportskeeda) July 27, 2023 డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో పాకిస్తాన్ లంకతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్తాన్ డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ అగ్రస్థానంలో నిలిచింది. లంకతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా 24 పాయింట్లను(100 పర్సంటైల్) పాక్ ఖాతాలో వేసుకుంది. మరోవైపు టీమిండియా విండీస్‌తో సిరీస్‌ను గెలిచినప్పటికి ఒక మ్యాచ్ డ్రా కావడంతో 16 పాయింట్లతో(66.67 పర్సంటైల్) రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో ఆస్ట్రేలియా 26 పాయింట్లు(54.17 పర్సంటైల్) ఉండగా.. ఇంగ్లండ్ 14 పాయింట్లు(29.17 పర్సంటైల్)తో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. Pakistan reigns supreme 🔥 With a clean sweep in this series, they sit proudly at the top of the World Test Championship 2023-2025 leaderboard#WTC25 #PAKvSL pic.twitter.com/IDi6PyW37f — Cricket Pakistan (@cricketpakcompk) July 27, 2023 చదవండి: ENG Vs AUS 5th Test: మొదలైన ఐదో టెస్టు.. ఇంగ్లండ్ గెలిచినా యాషెస్ కంగారులదే -
విండీస్‌తో రెండో టెస్టు డ్రా.. టీమిండియాకు బిగ్ షాక్! టాప్‌లో పాకిస్తాన్
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయంపై వరుణుడు నీళ్లు జల్లాడు. వర్షం కారణంగా రెండో టెస్టు పలితం తేలకుండా పోయింది. పలుమార్లు వాన రావడం, తగ్గడం, మళ్లీ రావడం జరిగాయి. ఆట ఆరంభమవుతుందని అనిపించడం, పిచ్‌ను సిద్ధం చేసే ప్రయత్నం చేయడం, అంతలోనే చినుకులతో పరిస్థితి మారిపోవడం తరచుగా జరిగింది. చివరకు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 2:50కు అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో టీమిండియా 1-0 తేడాతో టెస్టు సిరీస్‌ని సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి సత్తా చాటిన సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్టు లభించింది. అనంతరం జూలై 25 నుంచి ఇరు జట్లు మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. రెండో స్ధానానికి పడిపోయిన టీమిండియా ఇక రెండో టెస్టు డ్రా ముగియడం.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో టీమిండియాపై తీవ్ర ప్రభావం పడింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత జట్టు రెండో స్ధానానికి పడిపోయింది. రెండో టెస్టు డ్రాగా ముగియడంతో టీమిండియాకి 33.33 శాతం పాయింట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీమిండియా విన్నింగ్ శాతం 66.66కి పడిపోయింది. అంతకుముందు తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన టీమిండియా 100 గెలుపు శాతంతో తొలి స్ధానాన్ని కైవసం చేసుకుంది. ఒక వేళ ఈమ్యాచ్‌లో విజయం సాధించివుంటే 100 శాతం విన్నింగ్ పర్సెంటేజ్‌తో తన తొలి స్ధానాన్ని కాపాడుకుండేది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ అగ్రస్ధానంలో ఉంది. శ్రీలంకపై తొలి టెస్టులో విజయం సాధించిన పాక్ 100 శాతం విన్నింగ్ పర్సెంటేజ్ టాప్కు చేరుకుంది. చదవండి: #Rohit Sharma: మా దురదృష్టం.. అతడి లాంటి ఆటగాళ్లు జట్టుకు కావాలి! కొంచెం కూడా భయపడలేదు 𝗨𝗣𝗗𝗔𝗧𝗘 The rain plays spoilsport as the Play is Called Off on Day 5 in the second #WIvIND Test! #TeamIndia win the series 1-0! 👏 👏 pic.twitter.com/VKevmxetgF — BCCI (@BCCI) July 24, 2023 -
వెస్టిండీస్‌పై ఘన విజయం.. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన టీమిండియా
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 మూడో ఎడిషన్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. ఈ సైకిల్ భాగంగా డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ అద్భుత విజయం ఫలితంగా డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్ధానానికి చేరుకుంది. వెస్టిండీస్‌పై విజయంతో భారత్ 12 పాయింట్లు సేకరించి, 100 విజయ శాతం కొత్త పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. అంతకుముందు ఆస్ట్రేలియా 22 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. కానీ యాషెస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి పాలవ్వడంతో కంగారూల విజయ శాతం 61.11గా ఉంది. దీంతో రెండో స్ధానానికి ఆసీస్ దిగజారింది. అదే విధంగా యాషెస్ తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లకు వారి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 2 పాయింట్లను ఐసీసీ కోత విధించింది. ఇది కూడా ఆసీస్ రెండో స్ధానానికి పడిపోవడంలో ప్రభావం చూపింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ టాప్‌లో ఉండగా.. ఆసీస్, ఇంగ్లండ్ వరుసగా రెండు మూడు స్ధానాల్లో కొనసాగుతున్నాయి. చదవండి: Ind Vs Wi: వెస్టిండీస్ వెన్నులో వణుకు పుట్టించాడు.. దిగ్గజ బౌలర్ సరసన చేరిన అశ్విన్! -
ఆసీస్‌పై రెండో టెస్ట్‌లో విక్టరీ.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా
BGT 2023 IND VS AUS 2nd Test: న్యూఢిల్లీ టెస్ట్‌లో ఆసీస్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించిన అనంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ బెర్తులు ఒకింత సంక్లిష్టంగా మారాయి. ఈ విజయంతో భారత్ విన్నింగ్ పర్సంటేజ్‌ను 61.67 నుంచి 64.06కు పెంచుకుని, డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకోగా.. రెండో బెర్తు కోసం ఆసీస్-శ్రీలంక జట్ల మధ్య పోటీ నెలకొంది. తాజా ఓటమితో ఆసీస్ విన్నింగ్ పర్సంటేజ్ 70.83 నుంచి 66.67 శాతానికి పడిపోవడంతో శ్రీలంక (53.33) ఆశలు సజీవంగా మారాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఆసీస్ ముందువరుసలో ఉన్నప్పటికీ.. ఆ జట్టుకు ఇప్పటివరకు అధికారికంగా ఫైనల్ బెర్త్ ఖరారు కాలేదు. ఒకవేళ BGT-2023లో కంగారూలు క్లీన్ స్వీప్ (0-4) అయ్యి, ఆ తర్వాత జరిగే సిరీస్‌లో శ్రీలంక.. న్యూజిలాండ్‌ను 2-0 తేడాతో చిత్తు చేస్తే, ఆసీస్ ఇంటిబాట పడుతుంది. అప్పుడు భారత్‌తో పాటు శ్రీలంక ఫైనల్‌కు చేరుతుంది. అయితే ఇది అంతా ఈజీగా జరిగే పనికాదు. ఒకవేళ భారత్.. ఆసీస్‌ను ఊడ్చేసినా, న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై ఓడించడం శ్రీలంకకు అంత సులువు కాదు. కివీస్-శ్రీలంక సిరీస్ మార్చి 9 నుంచి మొదలవుతుంది. ఇదిలా ఉంటే, న్యూఢిల్లీ టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించడంతో 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. జడేజా (3/68, 7/42), అశ్విన్ (3/57, 3/59) పట్టపగ్గాలు లేకుండా విజృంభించి ఆసీస్ వెన్నువిరిచారు. ముఖ్యంగా జడేజా రెండో ఇన్నింగ్స్‌లో విశ్వరూపం ప్రదర్శించి, ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన జడ్డూ.. టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు. జడేజా ధాటికి ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. 115 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా రోహిత్ (31), కేఎల్ రాహుల్ (1), కోహ్లి (20), శ్రేయస్ అయ్యర్ (12) వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. -
WTC 2021-23: ఫైనల్ ఆడేందుకు మరింత చేరువగా..
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసీస్‌పై భారీ విజయంతో టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్(WTC 2021-23) ఫైనల్ ఆడేందుకు మరింత చేరువైంది. ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన భారత్ తన పర్సంటేజీ పాయింట్స్‌ను మరింత మెరుగుపరుచుకుంది. తొలి టెస్టుకు ముందు టీమిండియా ఖాతాలో 58.93 పర్సంటేజీ పాయింట్లు ఉన్నాయి. విజయం తర్వాత ఆ సంఖ్యను 61.67కు పెంచుకున్న టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మరింత దగ్గరైంది. అయితే ఇప్పటికే ఫైనల్ బెర్తు దక్కించుకున్న ఆస్ట్రేలియా మాత్రం పర్సంటేజీ పాయింట్లను కోల్పోయింది. ఆసీస్ పర్సంటేజ్.. 75.56 నుంచి 70.83 పాయింట్లకు పడిపోయింది. ఇక టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలంటే ఆసీస్‌తో మిగిలిన మూడు టెస్టుల్లో రెండు గెలిచి ఒకటి డ్రా చేసుకుంటే చాలు. అయితే శ్రీలంక(53.33 పాయింట్లు), సౌతాఫ్రికా(48.72 పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నప్పటికి వారికి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశాలు అంతంతే. ప్రస్తుతం శ్రీలంక మార్చిలో న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు ఆడనుండగా.. అటు దక్షిణాఫ్రికా.. ఫిబ్రవరి 28 నుంచి వెస్టిండీస్‌తో రెండు టెస్టులు ఆడనుంది. రెండో స్థానంలో ఉన్న టీమిండియాకు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న లంక, ప్రొటిస్ల మధ్య పాయింట్ల వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ టీమిండియా మిగతా మూడు టెస్టుల్లో మూడు ఓడిపోతే అప్పుడు లంక, సౌతాఫ్రికాలో ఎవరో ఒకరు ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది. అలా కాకుండా టీమిండియా మిగిలిన మూడు టెస్టుల్లో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు గెలిస్తే మాత్రం లంక, సౌతాఫ్రికాల ఫైనల్ కథ ముగిసినట్లే. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 132 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన టెస్టులో టీమిండియా స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లు విజృంభించడంతో ఆసీస్ విలవిల్లాడిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌటైన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే కుప్పకూలింది. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌తో 400 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ సెంచరీతో ఆకట్టుకోగా.. జడేజా, అక్షర్ పటేల్‌లు అర్థశతకాలతో రాణించారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు జరగనుంది. 𝗩𝗶𝗰𝘁𝗼𝗿𝘆 𝗶𝗻 𝗡𝗮𝗴𝗽𝘂𝗿! #TeamIndia 🇮🇳 win by an innings & 1️⃣3️⃣2️⃣ runs and take a 1️⃣-0️⃣ lead in the series 👏🏻👏🏻 What a start to the Border-Gavaskar Trophy 2023 👌🏻 Scorecard ▶️ https://t.co/SwTGoyHfZx…#INDvAUS | @mastercardindia pic.twitter.com/jCVDsoJ3i6 — BCCI (@BCCI) February 11, 2023 చదవండి: T20 World Cup: పాక్‌తో కీలకపోరు.. భారత స్టార్ ఓపెనర్ దూరం ముందే భయపడ్డారు; పిచ్‌పై ఉన్న శ్రద్ద ఆటపై పెడితే బాగుండు -
WTC: పోతే పోయింది.. మనకు మాత్రం మేలు చేసింది
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టును ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఈ దెబ్బతో ఆస్ట్రేలియా మూడు టెస్టుల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఆఖరి టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ విజయంతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే విషయంలో మరింత పటిష్ట స్థానానికి చేరుకుంది. ఇప్పటికే సౌతాఫ్రికాను వరుసగా రెండు టెస్టుల్లో చిత్తు చేసి 78.57 పర్సంటేజీ పాయింట్స్‌తో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచింది. ఇక మూడో టెస్టులోనూ గెలిస్తే ఆసీస్ పాయింట్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైతే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా దాదాపు చేరుకున్నట్లే. ఇక వరుసగా రెండో టెస్టులోనూ ఓటమితో సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం 50 పర్సంటేజీ పాయింట్లతో దక్షిణాఫ్రికా నాలుగో స్థానానికి పడిపోయింది. నాలుగో స్థానంలో ఉన్న శ్రీలంక 53.3 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో ఉన్న టీమిండియాకు వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా 58.93 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో కనీసం మూడు మ్యాచ్‌లు గెలిస్తూ ఎలాంటి అడ్డంకులు లేకుండా టీమిండియా నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. సౌతాఫ్రికా పోతూ పోతూ మనకు మాత్రం మేలు చేసిందని చెప్పొచ్చు. వచ్చే ఏడాది జూన్- జూలైలో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. ఇక ఇంగ్లండ్(46.97 పాయింట్లు) ఐదో స్థానంలో ఉంది. ఇటీవలే ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్ అయిన పాకిస్తాన్ 38.89 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 25.93 పర్సంటేజీ పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. టీమిండియా చేతిలో క్లీన్‌స్వీప్ అయిన బంగ్లాదేశ్ 11.11 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. చదవండి: Bavuma-Marco Jansen: 'వీడేంటి ఇంత పొడుగున్నాడు' Aus Vs SA 2nd Test: ఎదురులేని ఆసీస్.. దక్షిణాఫ్రికా చిత్తు! డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఇక.. -
WTC: సిరీస్ క్లీన్‌స్వీప్.. రెండో స్థానానికి దూసుకొచ్చిన టీమిండియా
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకొచ్చింది. వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ను వరుసగా రెండోసారి ఆడేందుకు టీమిండియాకు మరోసారి అవకాశం వచ్చింది. బంగ్లాతో టెస్టు సిరీస్ ద్వారా 8 విజయాలు ఖాతాలో వేసుకున్న భారత్ 58.93 పర్సంటేజీ పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 13 విజయాలతో ఉన్న ఆస్ట్రేలియా 76.92 పర్సంటేజీ పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో 54.55 పర్సంటేజీ పాయింట్లతో దక్షిణాఫ్రికా ఉంది. డిసెంబర్ 26 నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మొదలుకానున్న బాక్సింగ్ డే టెస్టులో వచ్చే ఫలితం ఆధారంగా స్థానాలు మారే అవకాశం ఉంది. ఆ తర్వాత శ్రీలంక(53.33), ఇంగ్లండ్(46.97 పాయింట్లు)తో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇటీవలే ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్ అయిన పాకిస్తాన్ 38.89 పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 25.93 పర్సంటేజీ పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. టీమిండియా చేతిలో క్లీన్‌స్వీప్ అయిన బంగ్లాదేశ్ 11.11 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. A series sweep against Bangladesh has put India in a strong position to make it to the #WTC23 final 🔥 Here's how your team can qualify 👇 https://t.co/Y7vRhKPWYW — ICC (@ICC) December 25, 2022 చదవండి: అయ్యర్, అశ్విన్‌ల ఖాతాలో ప్రపంచ రికార్డు భయపెట్టిన బంగ్లా బౌలర్‌ను ఉతికారేసిన అశ్విన్ -
శ్రీలంక కష్టమే! ఆసీస్ ముందంజలో! అదే జరిగితే ఫైనల్లో భారత్- పాకిస్తాన్!
World Test Championship 2021 23 Final - Teams Qualification Scenario After England Vs South Africa Series: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తొలిసారిగా ప్రవేశపెట్టిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో అరంగేట్రంలోనే ఫైనల్ చేరింది టీమిండియా. కానీ.. విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు తుదిపోరులో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. తద్వారా డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచిన తొలి జట్టుగా చరిత్రలో నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. అసలైన మ్యాచ్‌లో భారత్‌పై నెగ్గి కేన్ విలియమ్సన్ బృందం ఈ ఘనతను తమ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం డబ్యూటీసీ 2021-23 సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో టీమిండియా.. ఆరు గెలిచి నాలుగింట ఓడింది. రెండు డ్రా చేసుకుంది. ఈ నేపథ్యంలో 75 పాయింట్ల(52.08 శాతం)తో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. టాప్‌లో ఆసీస్.. కాగా ఆస్ట్రేలియా ఆడిన 10 మ్యాచ్‌లలో ఆరింట గెలిచి.. 3 డ్రా చేసుకుంది. కేవలం ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయింది. దీంతో 84 పాయింట్ల(70 శాతం)తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు.. శ్రీలంక 10 మ్యాచ్‌లలో ఐదు గెలిచి.. నాలుగు ఓడి.. ఒక టెస్టు డ్రా చేసుకుని 64 పాయింట్ల(53.33 శాతం)తో మూడో స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా తాజాగా ఇంగ్లండ్‌తో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి టెస్టు సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. దీంతో.. ప్రొటిస్ జట్టు పరాజయాల సంఖ్య నాలుగుకు చేరింది. సాధించిన విజయాలు 6. మొత్తంగా పదింటికి ఆరు గెలిచి 72 పాయింట్ల(60 శాతం)తో ప్రస్తుతం తన స్థానాన్ని కాపాడుకుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ బెర్తు కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, టీమిండియా మధ్య గట్టి పోటీ నెలకొంది. వీటితో పాటు పాకిస్తాన్, వెస్టిండీస్ సైతం రేసులో ఉన్నాయి. మరి ఏ జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయి? రేసులో ముందుంది ఎవరు? భారత జట్టు మరోసారి ఫైనల్ చేరుకోవాలంటే అవసరమైన సమీకరణాలు ఎలా ఉన్నాయి? ఓసారి గమనిద్దాం. ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ 2021-23 సీజన్లో ఆస్ట్రేలియా ఇంకా ఆడాల్సిన మ్యాచ్‌లు తొమ్మిది. కంగారూలు స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు, దక్షిణాఫ్రికాతో మూడు.. ఇండియా పర్యటనలో నాలుగు టెస్టులు ఆడాల్సి ఉంది. వీటిలో రోహిత్ సేనతో తాము ఆడే సిరీస్ ఆస్ట్రేలియాకు కీలకం. టీమిండియాతో సిరీస్‌లో మంచి ఫలితాలు సాధిస్తే గనుక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు తొలిసారి అర్హత సాధించే అవకాశాన్ని ఆసీస్ సొంతం చేసుకుంటుంది. దక్షిణాఫ్రికా ప్రొటిస్ జట్టు ఆస్ట్రేలియా గడ్డ మీద మూడు, వెస్టిండీస్‌తో స్వదేశంలో రెండు టెస్టు ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్‌కు తాజాగా 1-2తో సిరీస్ కోల్పోవడంతో దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరే అవకాశం చేజార్చుకున్నట్లయింది. అయినప్పటికీ రెండో స్థానంలో కొనసాగుతుండటం ప్రొటిస్‌కు సానుకూలాంశం. అయితే ఆసీస్ గడ్డ మీద గనుక సౌతాఫ్రికా తడబడితే రెండో ర్యాంకు కూడా కోల్పోవడం ఖాయం. శ్రీలంక తాజా డబ్ల్యూటీసీ సైకిల్లో శ్రీలంకకు మిలిగి ఉన్న టెస్టులు రెండు మాత్రమే. అది కూడా న్యూజిలాండ్ పర్యటనలో కివీస్‌తో రెండు మ్యాచ్‌లు. కానీ కివీస్ గడ్డపై లంక రికార్డు చెత్తగా ఉంది. అక్కడ వాళ్లు 19 మ్యాచ్‌లు ఆడితే కేవలం రెండు గెలిచారు. ఒకవేళ అక్కడ గనుక మరోసారి చేదు ఫలితమే ఎదురైతే లంక టాప్-2కు చేరడం దాదాపు అసాధ్యం. ఇండియా రోహిత్ శర్మ సేన ఈ డబ్ల్యూటీసీ సీజన్లో ఇంకా ఆరు టెస్టులు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ పర్యటనలో రెండు.. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక స్వదేశంలో ఆసీస్‌పై ఇండియాకు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంగారూలకు కంగారు పుట్టించి పలు సిరీస్‌లు సొంతం చేసుకుంది భారత జట్టు. బంగ్లాదేశ్‌పై కూడా భారత్‌కు మంచి రికార్డే ఉంది. ఈ సానుకూల అంశాల నేపథ్యంలో టీమిండియా ఆరింటికి ఆరు గెలిస్తే శ్రీలంక, దక్షిణాఫ్రికాలను వెనక్కి నెట్టి టాప్-2కు చేరుకోవడం ఏమంత కష్టం కాదు. వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరే సువర్ణ అవకాశం ప్రస్తుతం టీమిండియాకు ఉంది. పాకిస్తాన్ సైతం పాకిస్తాన్ డబ్ల్యుటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో నాలుగు గెలిచి.. రెండు డ్రా చేసుకుంది. మూడింట ఓడింది. దీంతో 56 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. అయితే, మిగిలి ఉన్న మ్యాచ్‌లన్నీ సొంతగడ్డ మీద ఆడబోతోండటం పాకిస్తాన్‌కు కలిసి వచ్చే అంశం. స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు, న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు ఆడనుంది బాబర్ ఆజం బృందం. ఈ ఐదు మ్యాచ్‌లలో గనుక పాకిస్తాన్ గెలిస్తే ఆ జట్టు విజయశాతం 51.85 నుంచి ఏకంగా 69.05 శాతానికి చేరుకుంటుంది. అదే జరిగితే పాక్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవడం లాంఛనమే. ఒకవేళ టీమిండియా కూడా బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను మట్టికరిపించి.. ఫైనల్ చేరితే.. దాయాదుల పోరు ఈ టోర్నీని మరింత రసవత్తరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వెస్టిండీస్ వెస్టిండీస్ ఆస్ట్రేలియాలో రెండు టెస్టులు.. దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఒకవేళ ఈ నాలుగు మ్యాచ్‌లలో గనుక విండీస్ విజయం సాధిస్తే(65.38 శాతం) డబ్ల్యూటీసీ23 ఫైనల్‌కు చేరడం కష్టమేమీ కాదు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో విజయం.. బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేయడం వంటి సానుకూల అంశాలు వెస్టిండీస్ జట్టులో ఉత్తేజాన్ని నింపుతాయి. అదే విధంగా ఆ జట్టు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ సైతం ఫామ్‌లో ఉండటం వారికి కలిసి వచ్చే అంశం. కాగా ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో విండీస్.. నాలుగు గెలిచి.. రెండు డ్రా చేసుకుని 54 పాయింట్లు(50 శాతం)తో ఆరో స్థానంలో కొనసాగుతోంది. Photo source : ICC చదవండి: తిరుగులేని కోహ్లి.. సరికొత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత! తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు.. వీడియో వైరల్ -
అగ్రస్థానాన్ని కోల్పోయిన సౌతాఫ్రికా.. టీమిండియా ఎన్నో ప్లేస్‌లో ఉందంటే..!
ICC World Test Championship 2021-23 Updated Table: ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌లో ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో పరాజయంపాలైన సౌతాఫ్రికా, డబ్ల్యూటీసీ 2021-23 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి (66.67 శాతం విజయాలు) పడిపోయింది. సఫారీలపై విజయంతో ఇంగ్లండ్ ప్లేస్‌లో (35.19 శాతం విజయాలతో 7వ స్థానం) ఎలాంటి మార్పు లేనప్పటికీ.. చాలాకాలం రెండో ప్లేస్‌లో కొనసాగిన ఆసీస్‌కు మాత్రం ఈ విజయం కలిసొచ్చింది. ఆసీస్ 70 శాతం విజయాలతో తిరిగి అగ్రస్థానానికి చేరుకోగా.. శ్రీలంక (53.33 శాతం విజయాలతో) 3వ స్థానంలో, టీమిండియా (52.08 శాతం విజయాలతో) 4వ స్థానంలో, పాకిస్థాన్ (51.85 శాతం విజయాలతో) ఐదులో, వెస్టిండీస్ (50 శాతం విజయాలతో) ఆరులో యధాతథంగా కొనసాగుతున్నాయి. ఆతర్వాత 25.93 శాతం విజయాలతో న్యూజిలాండ్ ఎనిమిదో స్థానంలో, 13.33 శాతం విజయాలతో బంగ్లాదేశ్ తొమ్మిదో ప్లేస్‌లో ఉన్నాయి. South Africa lose top spot in the World Test Championship table #WTC pic.twitter.com/4jQUiiUjdq — ESPNcricinfo (@ESPNcricinfo) August 27, 2022 తాజా స్టాండింగ్స్ ప్రకారం చూస్తే ప్రస్తుత డబ్ల్యూటీసీ సీజన్లో టీమిండియా ఫైనల్‌కు చేరే అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ సీజన్లో భారత్ మరో రెండో సిరీస్‌లు (స్వదేశంలో ఆస్ట్రేలియాతో 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, బంగ్లాదేశ్‌లో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్) మాత్రమే ఆడాల్సి ఉండటం, అందులో ఒకటి పటిష్టమైన ఆస్ట్రేలియాతో కావడం భారత్‌కు ప్రతికూలంగా మారింది. భారత్ తదుపరి జరిగే 6 మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ఫైనల్స్ రేసులో నిలిచే అవకాశం ఉంది. దీంతో పాటు టీమిండియా పాయింట్ల కోతకు గురికాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఈ సమీకరణలన్నీ కుదిరితేనే భారత్ డబ్ల్యూటీసీ 2021-23 సీజన్లో ఫైనల్‌కు చేరే ఛాన్స్ ఉంటుంది. ఇదిలా ఉంటే, సఫారీలతో రెండో టెస్ట్‌లో బౌలింగ్‌లో జేమ్స్ ఆండర్సన్ (6/62), ఓలీ రాబిన్సన్ (5/91), స్టువర్ట్ బ్రాడ్ (4/61), బెన్ స్టోక్స్ (4/47).. బ్యాటింగ్‌లో బెన్ స్టోక్స్ (103), బెన్ ఫోక్స్ (113 నాటౌట్) చెలరేగడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చదవండి: ఆండర్సన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. పేసర్లలో మొనగాడిగా..! -
'డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ఆస్ట్రేలియా చేరాలంటే భారత్ సిరీస్ కీలకం'
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (2021-23)లో భాగంగా వచ్చే ఏడాది భారత పర్యటనకు ఆస్ట్రేలియా రానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియాతో ఆసీస్ నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఇక ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మార్చి 3న న్యూఢిల్లీ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ఆస్ట్రేలియా, భారత్ జట్లు అర్హత సాధించే అవకాశాలు ఈ సిరీస్‌పై ఆధారపడి ఉంటాయని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయిట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా, పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇక బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్ తలపడనుంది. అదే విధంగా భారత పర్యటనను ముగించుకున్న తర్వాత ఆస్ట్రేలియ స్వదేశంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లతో ఆడనుంది. "డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియా, భారత్ జట్లకు చాలా కీలకం. ఈ సిరీస్ కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారత్-ఆసీస్ మధ్య పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది. అది ఆస్ట్రేలియాలో జరిగినా, భారత్‌లో జరిగినా పోటీ మాత్రం తప్పదు. రెండు జట్ల మధ్య పోటీ ప్రతీ ఏటా మరింత పెరుగుతోంది" అని పాంటింగ్ పేర్కొన్నాడు. అదే విదంగా ఆసీస్ ఆటగాళ్లు మార్నస్ లాబుషేన్, స్టీవ్ స్మిత్‌లపై పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. "లాబుషేన్, స్టీవ్ స్మిత్ ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. శ్రీలంకపై వీరిద్దరూ సెంచరీలతో చెలరేగారు. భారత పర్యటనలో కూడా ఆసీస్ జట్టుకు వీరిద్దరూ కీలకం కానున్నారు" అని పాంటింగ్ తెలిపాడు. చదవండి: Updated WTC Points Table: పాకిస్తాన్‌కు శ్రీలంక షాక్.. టీమిండియా తర్వాతి స్థానంలో బాబర్ ఆజం బృందం! -
Sri Lanka: ఆసీస్ అగ్రపీఠాన్ని కదిలించి.. టీమిండియాకు షాకిచ్చి..!
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23లో భాగంగా తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో శ్రీలంక ఇన్నింగ్స్ 39 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో శ్రీలంక రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదు నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. అలాగే ఆసీస్ అగ్రపీఠాన్ని సైతం కదిలించి రెండో స్థానానికి పడదోసింది. ఈ సీజన్లో మొదటి ఓటమిని ఎదుర్కొన్న ఆసీస్.. 70 శాతం విన్నింగ్ పర్సంటేజీతో రెండో స్థానానికి దిగజారగా.. 71.43 విజయాల శాతం కలిగిన సౌతాఫ్రికా అగ్రస్థానానికి ఎగబాకింది. 54.17 శాతం విన్నింగ్ పర్సంటేజీ కలిగిన శ్రీలంక మూడో స్థానంలో, 52.38 విజయాల శాతంతో పాకిస్థాన్ నాలుగో స్థానంలో నిలిచాయి. ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్‌లో ఓటమిపాలై 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సిరీస్‌ను సమం చేసుకున్న టీమిండియా ఈ జాబితాలో ఐదో స్థానంలో (52.08) నిలువగా.. వెస్టిండీస్ (50), ఇంగ్లండ్ (33.33), న్యూజిలాండ్ (25.93), బంగ్లాదేశ్ (13.33) వరుసగా ఆరు నుంచి తొమ్మిది స్థానాల్లో ఉన్నాయి. టీమిండియాను సైతం పడదోసిన శ్రీలంక.. ఆసీస్‌పై విక్టరీతో శ్రీలంక తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవడంతో పాటు టీమిండియాకు కూడా షాకిచ్చింది. ఈ మ్యాచ్‌కు ముందు మూడో స్థానంలో భారత జట్టు ఏకంగా రెండు స్థానాలు కోల్పోయి ఐదో స్థానానికి దిగజారింది. చదవండి: ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న బట్లర్.. మరో సిరీస్ లక్ష్యంగా హిట్‌మ్యాన్ -
IND VS ENG 5th Test: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో భారీ షాక్
అసలే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు పుండు మీద కారం చల్లే పరిణామం! ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్‌పై ఐసీసీ చర్య తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానాతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల నుంచి 2 పాయింట్లు కోత విధించింది. దాంతో డబ్ల్యూటీసీ పాయింట్ల జాబితాలో మన జట్టు నాలుగో స్థానానికి పడిపోయింది. ఇదే సిరీస్ తొలి టెస్టులో, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ టెస్టులో కూడా ఇదే తరహాలో స్లో ఓవర్ రేట్ శిక్షకు గురైన టీమిండియా మొత్తంగా ఈ ఏడాది డబ్ల్యూటీసీలో ఐదు పాయింట్లు ఇలాగే కోల్పోయింది. కాగా, బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రీ షెడ్యూల్డ్ టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్లు తేడాతో దారుణ ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పరాభవంతో పటౌడీ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. స్కోరు వివరాలు.. భారత్ తొలి ఇన్నింగ్స్: 416; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284; భారత్ రెండో ఇన్నింగ్స్: 245; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: లీస్ (రనౌట్) 56; క్రాలీ (బి) బుమ్రా 46; పోప్ (సి) పంత్ (బి) బుమ్రా 0; రూట్ (నాటౌట్) 142; బెయిర్‌స్టో (నాటౌట్) 114; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (76.4 ఓవర్లలో 3 వికెట్లకు) 378. వికెట్ల పతనం: 1–107, 2–107, 3–109. బౌలింగ్: బుమ్రా 17–1–74–2, షమీ 15–2–64–0, జడేజా 18.4–3–62–0, సిరాజ్ 15–0–98–0, శార్దుల్ 11–0–65–0.