డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్‌కు ఆస్ట్రేలియా.. మరి భారత్‌? | Australia overtakes India, after beating Pakistan at Sydeny | Sakshi
Sakshi News home page

WTC 2023- 2025: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్‌కు ఆస్ట్రేలియా.. మరి భారత్‌?

Published Sat, Jan 6 2024 1:10 PM | Last Updated on Sat, Jan 6 2024 1:53 PM

Australia overtakes India, after beating Pakistan at Sydeny - Sakshi

సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో ఆసీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది.  అంతేకాకుండా వరల్డ్‌ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) 2023-2025 పాయింట్ల ప‌ట్టిక‌లో ఆసీస్‌ అగ్ర‌స్థానానికి దూసుకెళ్లింది. 

56.25 శాతం పాయింట్లతో కంగారూ జట్టు..  నాలుగో స్ధానం నుంచి టాప్‌ ప్లేస్‌కు ఎగబాకింది. డ‌బ్ల్యూటీసీ కొత్త సైకిల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 8 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా.. ఐదింట విజయం, ఓ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. కాగా ఇప్పటివరకు టాప్‌ ప్లేస్‌లో ఉన్న భారత్‌(  54.16 శాతంతో) రెండో స్ధానానికి పడిపోయింది.

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో ఘన విజయం సాధించిన భారత జట్టు తొలి స్ధానానికి చేరుకుంది. అయితే భారత్‌  టాప్‌ ప్లేస్‌ను 24 గంటల వ్యవధిలోనే కోల్పోయింది. ఇక భారత్‌ తర్వాతి స్ధానాల్లో బాకింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌(50.0), బంగ్లాదేశ్‌(50.0) పాకిస్తాన్‌(45.83) కొనసాగుతున్నాయి.
చదవండిPAK vs AUS: కెరీర్‌లో చివరి మ్యాచ్‌.. కన్నీరు పెట్టుకున్న డేవిడ్‌ వార్నర్‌! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement